సెల్ఫీ స్పాట్.. ట్యాంక్‌బండ్..!
సెల్ఫీ స్పాట్.. ట్యాంక్‌బండ్..!
Published Sat, Nov 26 2016 2:28 AM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM
► ఇక్కడికి వచ్చే వారు ఒకటో రెండో సెల్ఫీలు తీసుకోకుండా వెళ్లరు
► ‘లవ్ హైదరాబాద్’ టైపో స్కల్ప్చర్ ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘లవ్ హైదరాబాద్ టైపో స్కల్ప్చర్(లవ్ హైదరాబాద్ అక్షరా లతో కూడిన శిల్పం)’తో నగరంలోని ట్యాంక్‌బండ్ సెల్ఫీ స్పాట్‌గా మారనుం దని.. ఇక్కడికొచ్చే ప్రతి ఒక్కరూ ఒకటో, రెండో సెల్ఫీలు తీసుకోకుండా వెళ్లరని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. ‘స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్’ ముగింపును పురస్కరించుకుని ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’, ‘కృష్ణకృతి ఫౌండేషన్’ సంస్థలు జీహెచ్‌ఎంసీ సహకారంతో ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ‘లవ్ హైదరాబాద్’ టైపో స్కల్ప్చర్‌ను శుక్రవారం సాయంత్రం మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లవ్ హైదరాబాద్ టైపో స్కల్ప్చర్ నగరానికి అదనపు ఆకర్షణ కానుందన్నారు.
హైదరాబాద్ ప్రజలకు ఆహ్లాదం, ఉల్లాసం కలిగించేలా, పర్యాటక ప్రాంతంగా ట్యాంక్‌బండ్‌ను మరింత సుందరంగా తీర్కిదిద్దాల్సిన బాధ్యత తమపై ఉంద న్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, పర్యాటక శాఖల సమన్వయంతో సాధ్యమైనంత త్వరగా ట్యాంక్‌బండ్‌ను, హైదరాబాద్‌ను అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్‌లో భాగంగా ముంబై, ఢిల్లీ తరహాలో నెక్లెస్‌రోడ్‌లో పీపుల్స్ ప్లాజా ఎదుట ఎంఎస్ మక్తాలోని భవనాలు, గోడలకు స్థానిక కళాకారులతోపాటు జాతీయ, అంతర్జాతీయ కళాకారులు సృజనాత్మకం గా వేసిన చిత్రాలను మంత్రి సందర్శించా రు.
మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. నాలుగు వందల ఏళ్లకు పైబడిన ఘన చరిత్ర కలిగిన హైదరా బాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థారుులో మరింతగా అభివృద్ధి పరిచేందుకు ప్రయత్నిస్తున్నామని, తద్వారా పర్యాట కంగానూ నగరం మరింత అభివృద్ధి చెందగలదని అన్నారు. ప్రభుత్వ సలహా దారు బీవీ పాపారావు మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజల్లో కళాత్మకత, సౌందర్య దృష్టి పెరుగుతాయ న్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, టూరిజం సెక్రటరీ బి.వెంకటేశం, ట్రాఫిక్ ఏసీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement