ఇటీవల కాలంలో సెల్ఫీ మోజు మూములగా లేదు. అందుకోసం ప్రాణాలు పోగొట్టుకున్నా వారు ఉన్నారు. అయినా సెల్ఫీ క్రేజ్ తగ్గలేదు. ఐతే ఇలా అన్ని చోట్ల సాధ్యం కాదు. కొన్నిప్రదేశాల్లో తీస్తే పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తారు. ఎవ్వరూ ఫోటోలు తీయకుండా స్ట్రిట్ రూల్స్ ఫాలవుతారట అక్కడి ప్రజలు. వివరాల్లోకెళ్తే..ఇటాలిలోని రివేరాలో రంగురంగుల పట్టణమైన పోర్టోఫినో అత్యంత సుందరమైన పర్యాటక ప్రాంతం.
అక్కడకు వచ్చిన ఎవ్వరికైన తమ కెమరాను క్లిక్ మనిపించకుండా ఉండలేరు. ఎందుకంటే అంతా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఆ ప్రదేశం. అందువల్ల అక్కడ పర్యాటకుల తాకిడి ఎక్కువే. చిత్రాకారుల సైతం ఆ అందాలను చిత్రీకరించకుండా ఉండలేనంతగా కట్టిపడేస్తోంది ఆ నగరం. ఐతే ఈ సెల్ఫీల కారణంగానే వీధులన్ని కిక్కిరిసిపోయి గందరగోళానికి దారితీసిందని, అక్కడ సెల్ఫీలు గానీ, ఫోటోలు తీయడం గానీ చేయకూడదంటూ నిషేధించారు.
ఈ మేరకు అక్కడకు వచ్చిన పర్యాటకులెవరు ఉదయం 10.30 నుంచి 6 గంటల వరకు ఈ ప్రదేశాల్లో సెల్ఫీలు గానీ ఫోటోలు తీయడం గానీ చేయకూడదు. అక్టోబర్ వరకు ఇలానే నిషేధం అమలవుతుందట. ఇలాంటి నిబంధనలే అమెరికా, ఫ్రాన్స్, యూకేలతో సహా కొన్ని దేశాల్లో ఉన్నాయి.
(చదవండి: గాల్లో ఉండగానే పెద్ద శబ్దాలతో ఇంజన్‌లో మంటలు..ఆ తర్వాత విమానం..)
Comments
Please login to add a commentAdd a comment