itali
-
సినెర్... కొత్త నంబర్‌వన్
పారిస్: ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇటలీ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినెర్ తన కెరీర్లో గొప్ప ఘనత సాధించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సినెర్ ఒక స్థానం మెరుగుపర్చుకొని 9,525 పాయింట్లతో నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాడు. టెన్నిస్‌లో కంప్యూటర్ ఆధారిత ర్యాంకింగ్స్ (1973 నుంచి) మొదలయ్యాక వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్న తొలి ఇటలీ ప్లేయర్‌గా 22 ఏళ్ల సినెర్ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది సినెర్ 33 మ్యాచ్‌ల్లో గెలిచి, 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తోపాటు మయామి మాస్టర్స్ సిరీస్, రోటర్‌డామ్ ఓపెన్‌లో అతను విజేతగా నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్లో ఓడిపోయాడు. గతవారం వరకు టాప్ ర్యాంక్‌లో ఉన్న సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ రెండు స్థానాలు పడిపోయి మూడో ర్యాంక్‌లో నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన కార్లోస్ అల్కరాజ్ ఒక స్థానం పురోగతి సాధించి రెండో ర్యాంక్‌లో నిలిచాడు. కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో నగాల్ భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ కెరీర్ బెస్ట్ 77వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆదివారం జర్మనీలో జరిగిన నెకర్ కప్ టోరీ్నలో విజేతగా నిలిచిన సుమిత్ 18 స్థానాలు పురోగతి సాధించాడు. తాజా ర్యాంక్ కారణంగా సుమిత్ వచ్చే నెలలో జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో సింగిల్స్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం ఖాయమైంది. -
ఇటలీ ప్రధాని, భారత ప్రధాని స్నేహితులైతే..
దుబాయ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వివిధ దేశాల అధినేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని కూడా కలిశారు. మెలోని కూడా ప్రధాని మోదీతో సెల్ఫీ దిగి, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘మేం మంచి స్నేహితులం’ అని రాశారు. అలాగే ‘#మెలోడి’ అని రాసి.. అందులో మెల్ అంటే మెలోనీ అని.. ఓడి అంటే మోదీ అని రాశారు. వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఒకరోజు పర్యటన నిమిత్తం యూఏఈ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వివిధ దేశాధినేతలతో చర్చలు జరిపారు. మెలోనితో పాటు, ప్రధాని నరేంద్ర మోదీ.. బ్రిటన్ ప్రధాని రిషి సునక్, బ్రెజిల్ ప్రధాని లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా, బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌లను కూడా కలిశారు. ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సదస్సులో నాలుగు సెషన్లలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ ఇతర నేతలు కలిసి గ్రూప్ ఫొటో కూడా దిగారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తోనూ ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వాతావరణ లక్ష్యాలను సాధించడంలో భారతదేశం చేపట్టే కార్యక్రమాలు, పురోగతిని ప్రధాని మోదీ వివరించారు. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించడానికి గ్రీన్ క్రెడిట్స్ ఇనిషియేటివ్‌లో చేరాలని ప్రపంచ నాయకులను ప్రధాని మోదీ కోరారు. కాప్-28 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కూడా కలిశారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కాప్-28 శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడంపై ప్రధాన మంత్రి మోదీ వారిని అభినందించారు. వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌కు యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను ప్రధాని ఆహ్వానించారు. ఇది కూడా చదవండి: మానవాళి స్వార్థంతో ప్రపంచానికి పెను చీకట్లే -
ఇటలీలో పిల్లలు ఎందుకు పుట్టడం లేదు? మూడు నెలల్లో ఒక్క డెలివరీ కూడా లేదా?
ప్రపంచంలో వృద్ధుల సంఖ్య మరింతగా పెరిగిపోతోంది. చైనా, జపాన్ లాంటి దేశాలు దీనికి పెద్ద ఉదాహరణగా నిలిచాయి. ఇప్పుడు ఇటలీ కూడా ఈ జాబితాలో చేరింది. దీనికి కారణం అక్కడ పిల్లలు పుట్టకపోవడమే. పలు రిపోర్టులలో వెల్లడైన వివరాల ప్రకారం గత మూడు నెలలుగా ఇటలీలో ఏ ఒక్క శిశు జననం కూడా జరగలేదు. ఇది జాతీయ సమస్యగా పరిణమించింది.ఈ నేపధ్యంలో ఇటలీ ప్రధాని దీనిని జాతీయ అత్యవసర పరిస్థితిగా చూడాలన్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇటలీ ఇటీవల వినూత్న ప్రపంచ రికార్డును సృష్టించింది. అయితే ఈ ప్రపంచ రికార్డులో సంతోషించాల్సిన విషయమేమీ లేదు. దేశం శరవేగంగా వృద్ధాప్య దశకు చేరుతోంది. ఈ నివేదిక ప్రకారం గత మూడు నెలల్లో ఇటలీలో ఒక్క శిశువు కూడా జన్మించలేదు. రాయిటర్స్ పేర్కొన్న వివరాల ప్రకారం నేషనల్ స్టాటిస్టిక్స్ బ్యూరో ఐఎస్‌టీఏటీ గణాంకాలను పరిశీలిస్తే.. జనవరి 2023 నుండి జూన్ 2023 వరకు ఇటలీలో జన్మించిన పిల్లల సంఖ్య జనవరి 2022- జూన్ 2022 మధ్య జన్మించిన వారి కంటే 3500 తక్కువ. దేశంలో 15 నుంచి 49 ఏళ్లలోపు మహిళల సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని ఈ నివేదిక ద్వారా వెల్లడైంది. అంటే ఇటలీలో పునరుత్పత్తి వయసు గల మహిళల కొరత తీవ్రంగా ఉంది. ఈ వయసు కలిగిన మహిళల సంఖ్య 2021తో పోలిస్తే 2023లో చాలా వరకూ తగ్గింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ దీనిని జాతీయ ఎమర్జెన్సీగా భావిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఆమె ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని చాలా గట్టిగానే ప్రస్తావించారు. ఇటలీలో రోజుకు ఏడుగురు పిల్లలు పుడుతుండగా, అదే సమయంలో దేశంలో 12 మరణాలు నమోదువున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే అక్కడి జనాభా వేగంగా తగ్గిపోతుందనడంలో సందేహం లేదు. ఇది కూడా చదవండి: హమాస్‌ను మట్టికరిపించిన 13 మంది మహిళలు -
ఆ దేశంలో ప్రతి ఆరు నెలలకూ ఎన్నికలు!
మనదేశంలో ఏడాది పొడవునా ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ దేశంలో మాత్రం ఎన్నికలు ఆరునెలలకు ఒకసారి! ఏమిటా దేశం? ఎక్కడుంది? పనిలో పనిగా మొదటిసారి అక్కడ ఎన్నికలు ఎప్పుడు జరిగాయో కూడా తెలుసుకుందామా? ప్రతి ఆరునెలలకు ఎన్నికలు జరిగే దేశం యూరప్ ఖండంలో ఉంది. పేరు శాన్ మారినో. ప్రపంచంలోని చిన్న దేశాలలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశం. జనాభా దాదాపు 34 వేలు. ఏడాదిలో రెండుసార్లు ఎన్నికలు జరగడం.. ఫలితాలు వెలువడిన తరువాత అధ్యక్షుడు మారడం ఇక్కడ సర్వసాధారణం. ఎన్నికైన దేశాధినేతను ఆ దేశ ప్రజలు కెప్టెన్-రీజెంట్ అని పిలుస్తారు. గ్రేట్, జనరల్ కౌన్సిల్‌లోని 60 మంది సభ్యులు కెప్టెన్ రీజెంట్‌ను ఎన్నుకుంటారు. ఇక్కడి పార్లమెంటును ఆరంగో అంటారు. శాన్ మారినోలో మొట్టమొదటి ఎన్నికలు క్రీస్తు శకం 1243లో జరిగాయి. ఈ దేశ రాజ్యాంగం 1600 నుంచి అమల్లోకి వచ్చింది. దేశం మొత్తం విస్తీర్ణం కేవలం 61 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇది ఇటలీ పొరుగు దేశం. ఇటలీ సంస్కృతి, భాష ఇక్కడ కనిపిస్తుంది. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌కు ధర్మశాలతో సంబంధం ఏమిటి? -
అమ్మ మృతదేహంతో ఆరు నెలలు
ఒక వ్యక్తి గడచిన ఆరు నెలలుగా తల్లి మృతదేహంతో పాటు ఉంటున్నాడు. ఇరుగుపొరుగువారికి తన తల్లి విదేశాల్లో ఉంటున్నదని ఇన్నాళ్లూ అబద్ధం చెబుతూ వచ్చాడు. అయితే అతని వ్యవహారం ఎట్టకేలకు పోలీసుల చొరవతో బహిర్గతమయ్యింది. ఆ వ్యక్తి గత ఆరేళ్లుగా తల్లి మృతదేహాన్ని ఎందుకు అలానే ఉంచాడో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. పెన్షన్ అందుకునేందుకే తాను తన తల్లి మృతదేహాన్ని ఉంచానని తెలిపాడు. అతను తన తల్లి రిటైర్మెంట్ ఫండ్ సొమ్మును ప్రతినెలా అందుకుంటున్నాడు. నిందితుని వయసు 60 ఏళ్లు. అతని పేరు వెల్లడికాలేదు. డైలీ స్టార్ తెలిపిన వివరాల ప్రకారం నిందితుని తల్లి పేరు హెల్గా మారియా హ్యాంబర్త్. ఈ ఉదంతం ఇటలీలో చోటుచేసుకుంది. అతను తన ఇరుగుపొరుగువారితో తన తల్లి హెల్గా తమ దేశమైన జర్మనీకి తిరిగి వెళ్లిపోయిందని చెబుతూ వస్తున్నాడు. తల్లి మృతదేహంతో పాటు ఉంటూ నిందితుడు ఇప్పటివరకూ 156,000 పౌండ్లు (సుమారు రూ. 1.59 కోట్లు) అందుకున్నాడు. పోలీసులు ఇటీవలే ఇతని గుట్టును రట్టు చేశారు. మే 25న పోలీసులు ఎమర్జెన్సీ సర్వీస్ కోసం అతను ఉంటున్న బిల్డింగ్‌లోకి ప్రవేశించారు. ఆ సమయంలో నిందితుడు తన తల్లి హెల్గా మృతదేహాన్ని ఒక బ్యాగులో దాచి, బెడ్‌పైన ఉంచాడు. అతను ఇంటిలో లేడు. హెల్గా కరోనా వైరస్‌కు సంబంధించి తన హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డు కోసం అప్పటివరకూ దరఖాస్తు చేయలేదు. ఈ నేపధ్యంలోనే పోలీసులు ఆమెను సంప్రదించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు అనుమానంతో ఇంటిలో తనిఖీలు చేశారు. అప్పుడు వారికి హెల్గా మృతదేహం లభ్యమయ్యింది. వెంటనే వారు హెల్గా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మరణించిన తల్లి పెన్షన్‌ను నిందితుడు ఎలా తీసుకుంటున్నాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చదవండి: బతికుండగానే కుమార్తెకు సంతాప సభ.. ఆమె చేసిన పని ఇదే.. -
అక్కడ సెల్ఫీలు తీస్తే జరిమానా..కానీ క్లిక్ మనిపించకుండా ఉండలేం!
ఇటీవల కాలంలో సెల్ఫీ మోజు మూములగా లేదు. అందుకోసం ప్రాణాలు పోగొట్టుకున్నా వారు ఉన్నారు. అయినా సెల్ఫీ క్రేజ్ తగ్గలేదు. ఐతే ఇలా అన్ని చోట్ల సాధ్యం కాదు. కొన్నిప్రదేశాల్లో తీస్తే పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తారు. ఎవ్వరూ ఫోటోలు తీయకుండా స్ట్రిట్ రూల్స్ ఫాలవుతారట అక్కడి ప్రజలు. వివరాల్లోకెళ్తే..ఇటాలిలోని రివేరాలో రంగురంగుల పట్టణమైన పోర్టోఫినో అత్యంత సుందరమైన పర్యాటక ప్రాంతం. అక్కడకు వచ్చిన ఎవ్వరికైన తమ కెమరాను క్లిక్ మనిపించకుండా ఉండలేరు. ఎందుకంటే అంతా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఆ ప్రదేశం. అందువల్ల అక్కడ పర్యాటకుల తాకిడి ఎక్కువే. చిత్రాకారుల సైతం ఆ అందాలను చిత్రీకరించకుండా ఉండలేనంతగా కట్టిపడేస్తోంది ఆ నగరం. ఐతే ఈ సెల్ఫీల కారణంగానే వీధులన్ని కిక్కిరిసిపోయి గందరగోళానికి దారితీసిందని, అక్కడ సెల్ఫీలు గానీ, ఫోటోలు తీయడం గానీ చేయకూడదంటూ నిషేధించారు. ఈ మేరకు అక్కడకు వచ్చిన పర్యాటకులెవరు ఉదయం 10.30 నుంచి 6 గంటల వరకు ఈ ప్రదేశాల్లో సెల్ఫీలు గానీ ఫోటోలు తీయడం గానీ చేయకూడదు. అక్టోబర్ వరకు ఇలానే నిషేధం అమలవుతుందట. ఇలాంటి నిబంధనలే అమెరికా, ఫ్రాన్స్, యూకేలతో సహా కొన్ని దేశాల్లో ఉన్నాయి. (చదవండి: గాల్లో ఉండగానే పెద్ద శబ్దాలతో ఇంజన్లో మంటలు..ఆ తర్వాత విమానం..) -
ఇటలీ కేఫ్‌లో కాల్పులు.. ప్రధాని మెలోనీ స్నేహితురాలు మృతి
రోమ్: ఇటలీ రాజధాని రోమ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో దేశ ప్రధాని స్నేహితురాలు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. రోమ్‌లోని ఫిడెన్ జిల్లాలోని ఓ కేఫ్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం జరగాల్సిన తమ అపార్ట్మెంట్ కమిటీ రెసిడెంట్స్ కమిటీ సమావేశంపై చర్చించేందుకు కొందరు సభ్యులు ఓ కేఫ్‌లో సమావేశమయ్యారు. ఇంతలోనే తుపాకీతో అక్కడికి చేరుకున్న ఓ వ్యక్తి అందరినీ చంపేస్తానని అరుస్తూ ఒక్కసారిగా వారిపైకి కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళలు చనిపోగా మరో నలుగురు గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు దుండగుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నికొలెట్టా గొలిసానో(50) తన స్నేహితురాలేనంటూ ప్రధాని జార్జియా మెలోనీ గతంలో ఆమెతో దిగిన సెల్ఫీని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పారీ్టకి చెందిన మెలోనీ దేశ తొలిæ మహిళా ప్రధానిగా అక్టోబర్‌లో బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. -
ఇటలీ ప్రధాని రాజీనామా
రోమ్: ఇటలీ ప్రధాని మారియో ద్రాఘి పదవి నుంచి వైదొలిగారు. గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ను సంకీర్ణ ప్రభుత్వంలోని ప్రధాన భాగస్వామ్య పక్షం 5–స్టార్స్ మరో రెండు పార్టీలు బహిష్కరించాయి. దీంతో ద్రాఘి తన రాజీనామా లేఖను అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లాకు అందజేశారు. ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు 5–స్టార్స్ పార్టీ ప్రకటించడంతో గత వారమే ఆయన రాజీనామా చేసినా అధ్యక్షుడు ఆమోదించలేదు. తాజా పరిణామాలతో మరో సారి అందజేసిన రాజీనామా లేఖను మట్టరెల్లా ఆమోదించారు. తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగాలని ద్రాఘిని కోరారు. దీంతో, అక్టోబర్‌లో ముందస్తు ఎన్నికలు జరిగేందుకు అవకాశముందని భావిస్తున్నారు. -
ఇటలీ విమానంపై కాల్పులు
రోమ్: కాబూల్ ఎయిర్‌పోర్టు నుంచి అఫ్గాన్ పౌరులతో బయలుదేరిన ఇటలీ విమానంపై కాల్పులు జరిగినట్లు ఇటలీ రక్షణ శాఖ తెలిపింది. ఈ ఘటనతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. ఇటలీ సైనిక రవాణా విమానం ఒకటి గురువారం ఉదయం సుమారు 100 మంది అఫ్గాన్ పౌరులతో కాబూల్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దానిపైకి కాల్పులు జరిగినట్లు అందులో ప్రయాణిస్తున్న ఇటాలియన్ జర్నలిస్ట్ ఒకరు తెలిపారని మీడియా వెల్లడించింది. పైలట్ అప్రమత్తతతో విమానం ప్రమాదం నుంచి బయటపడిందనీ, ఈ పరిణామంతో కొద్దిసేపు ప్రయాణికులంతా భయభ్రాంతులకు లోనైనట్లు ఆ జర్నలిస్ట్ తెలిపారని పేర్కొంది. తమ సీ–130 రకం రవాణా విమానంపై కాబూల్‌లో కాల్పులు జరిగాయని అంతకుముందు ఇటలీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ ఘటనపై ఇటలీ ప్రభుత్వం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అఫ్గాన్‌లో పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న వేలాది మంది విదేశీయులతోపాటు, అఫ్గాన్ పౌరులను ఖాళీ చేస్తున్న దేశాల్లో ఇటలీ కూడా ఒకటి. -
చరిత్రకు చేరువగా...
లండన్: పచ్చిక కోర్టులపై తన ప్రతాపం చూపిస్తూ ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఏడోసారి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఐదుసార్లు చాంపియన్ జొకోవిచ్ 2 గంటల 44 నిమిషాల్లో 7–6 (7/3), 7–5, 7–5తో పదో సీడ్ షపోవలోవ్ (కెనడా)పై గెలిచాడు. జొకోవిచ్ కెరీర్లో ఇది 30వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కానుండటం విశేషం. అత్యధికసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఫైనల్‌కు చేరుకున్న క్రీడాకారుల జాబితాలో ఫెడరర్ (31 సార్లు) తర్వాత జొకోవిచ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ఇటలీ ప్లేయర్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ బెరెటినితో జొకోవిచ్ తలపడతాడు. షపోవలోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్‌కు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. అయితే కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడిన షపోవలోవ్ కీలకదశలో తడబడి పాయి ంట్లు కోల్పోయాడు. మరోవైపు కెరీర్లో 50వ గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ ఆడిన జొకోవిచ్ కీలకదశలో పైచేయి సాధించాడు. ఏడు ఏస్‌లు సంధించిన ఈ సెర్బియా స్టార్ మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. షపోవలోవ్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు, 36 అనవసర తప్పిదాలు చేశాడు. జొకోవిచ్ సర్వీస్‌ను 11సార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా అతను ఒక్కసారి మాత్రమే సఫలమయ్యాడు. ఇప్పటికే 19 గ్రాండ్‌స్లామ్ టైటి ల్స్ గెలిచిన జొకోవిచ్ ఆదివారం విజేతగా నిలిస్తే ... అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారులుగా ప్రస్తుతం సంయుక్తంగా అగ్ర స్థానంలో ఉన్న ఫెడరర్, నాదల్ (20 చొప్పున) సరసన ఈ సెర్బియా స్టార్ కూడా చేరుతాడు. 1976 తర్వాత... తొలి సెమీఫైనల్లో ఏడో సీడ్ మాటియో బెరెటిని (ఇటలీ) 6–3, 6–0, 6–7 (3/7), 6–4తో 14వ సీడ్ హుబర్ట్ హుర్కాజ్ (పోలాండ్)పై విజయం సాధించాడు. తద్వారా అడ్రియానో పనట్టా (1976–ఫ్రెంచ్ ఓపెన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన ఇటలీ ప్లేయర్‌గా, వింబుల్డన్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఇటలీ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. క్వార్టర్ ఫైనల్లో ఎనిమిది సార్లు చాంపియన్ ఫెడరర్‌ను వరుస సెట్లలో ఓడించిన హుబర్ట్ సెమీఫైనల్లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. బెరెటిని కచ్చితమైన సర్వీస్‌లు, బ్యాక్‌హ్యాండ్, ఫోర్‌హ్యాండ్ షాట్లతో చెలరేగి హుబర్ట్ ఆట కట్టించాడు. 2 గంటల 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో బెరెటిని 22 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. నెట్‌వద్దకు 25సార్లు దూసుకొచ్చి 16సార్లు పాయింట్లు గెలిచాడు. కేవలం ఐదు ఏస్‌లు సంధించిన హుబర్ట్ 26 అనవసర తప్పిదాలు చేశాడు. -
నేటి నుంచి ‘యూరో’
రోమ్: స్టార్ ఆటగాళ్లంతా పాల్గొనే ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ టోర్నీ ‘యూరో కప్’కు రంగం సిద్ధమైంది. కరోనాతో గతేడాది వాయిదా పడిన ఈ మెగా ఈవెంట్‌ను ఈ సంవత్సరం నిర్వహిస్తున్నారు. నేడు అర్ధరాత్రి 12.30 నుంచి జరిగే తొలి మ్యాచ్‌లో ఇటలీతో టర్కీ తలపడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క ఆతిథ్య దేశం కాకుండా 11 దేశాల్లో ఈ సారి యూరో కప్ నిర్వహిస్తుండటం విశేషం. రోమ్ (ఇటలీ)లో మొదలయ్యే ఈ టోర్నీ రష్యా, అజర్బైజాన్, జర్మనీ, రుమేనియా, స్పెయిన్, నెదర్లాండ్స్, హంగేరి, డెన్మార్క్, స్కాట్లాండ్లలో లీగ్ మ్యాచ్‌లు జరుపుకొని ఇంగ్లండ్‌లో జూలై 12న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. రెండు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు కూడా లండన్‌లోనే జరుగనున్నాయి. మొత్తం 24 జట్లు ఆరు గ్రూపులుగా తలపడనున్నాయి. మ్యాచ్‌ల్ని స్టేడియంలో ప్రత్యక్షంగా తిలకించే అవకాశముంది. కరోనా ప్రొటోకాల్‌ను అనుసరించి తీవ్రత తక్కువ ఉన్న దేశాల్లో అధిక సీట్ల సామర్థ్యంతో, వైరస్ తీవ్రంగా ఉన్న దేశాల్లో స్వల్ప సంఖ్యలోనైనా ప్రేక్షకుల్ని అనుమతిస్తున్నారు. టీవీలో ఈ మెగా టోర్నీని ‘సోనీ నెట్వర్క్’ ప్రసారం చేస్తోంది. తెలుగు ఫుట్‌బాల్ అభిమానుల కోసం ఇటీవలే కొత్తగా ప్రారంభించిన ‘సోనీ టెన్ 4’ చానల్లో తెలుగులో వ్యాఖ్యానంతో తొలిసారి యూరో కప్‌ను ప్రసారం చేస్తున్నారు. ఎవరు ఏ గ్రూపులో... టర్కీ, ఇటలీ, వేల్స్, స్విట్జర్లాండ్ (ఎ), డెన్మార్క్, ఫిన్లాండ్, బెల్జియం, రష్యా (బి), నెదర్లాండ్స్, ఉక్రెయిన్, ఆస్ట్రియా, నార్త్ మెక్డోనియా(సి), ఇంగ్లండ్, క్రొయేషియా, స్కాట్లాండ్, చెక్ రిపబ్లిక్ (డి), స్పెయిన్, స్వీడెన్, పొలండ్, స్లోవేకియా (ఇ), హంగేరి, పోర్చుగల్, ఫ్రాన్స్, జర్మనీ (ఎఫ్). -
తెలివైన ఆట
ఇక్కడున్న ఫొటో చూశారు కదా.. రవితేజ, డింపుల్ హయతి ఏదో చర్చించుకుంటున్నారు. ‘ఖిలాడి’ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ ఫొటో ఇది. రవితేజ హీరోగా మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ఇది. ‘ప్లే స్మార్ట్’ అనేది ట్యాగ్‌లైన్ . రమేష్ వర్మ దర్శకత్వంలో డా. జయంతీలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌తో కలిసి పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. సత్యనారాయణ కోనేరు నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. ఈ షూట్‌కి సంబంధించి ఒక ఫొటోను విడుదల చేశారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ఇది. యాక్షన్ లవర్స్‌కు మంచి ట్రీట్ అవుతుంది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మే 28న ‘ఖిలాడి’ని రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి. ∙రవితేజ, డింపుల్ హయతి -
పరస్పర సహకారంతోనే విపత్తులపై విజయం
న్యూఢిల్లీ/లండన్: విపత్తులను ఎదుర్కొనే విషయంలో ప్రపంచ దేశాల మధ్య పరస్పర సహకారం కచ్చితంగా అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షిప్పింగ్ లైన్లు, వైమానిక నెట్వర్క్స్ వంటివి ప్రపంచమంతటా విస్తరించి ఉంటాయని వెల్లడించారు. ఎక్కడైనా విపత్తు సంభవిస్తే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వెంటనే కనిపిస్తుందన్నారు. విపత్తుల కారణంగా దెబ్బతిన్న మౌలిక వసతులను పునరుద్ధరించడానికి, పూర్వ స్థితికి తీసుకురావడానికి అన్ని దేశాలు కలిసి పని చేయాలని సూచించారు. డిజాస్టర్ రిసైలియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే అంశంపై బుధవారం జరిగిన అంతర్జాతీయ సదస్సు (ఐసీడీఆర్ఐ–2021) ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భారత్‌లాంటి దేశాలు మౌలిక వసతుల రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. విపత్తుల నుంచి కోలుకోవడానికి కూడా నిధుల కేటాయింపులు అవసరమన్నారు. కరోనా నేర్పిన పాఠాలు మరవొద్దు కోవిడ్–19 మహమ్మారి ఒక ఊహించని విపత్తు అని నరేంద్ర మోదీ అభివర్ణించారు. వందేళ్లకు ఒకసారి సంభవించే ఇలాంటి విపత్తుకు మనం సాక్షీభూతంగా నిలిచామన్నారు. ఈ మహమ్మారి వల్ల పేద–ధనిక, తూర్పు–పడమర, ఉత్తరం–దక్షిణం అనే తేడా లేకుండా ప్రపంచంలోని అన్ని దేశాలూ నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకచోట మొదలైన విపత్తు ప్రపంచాన్ని ఎంతో వేగంగా ప్రభావితం చేస్తుందన్న పాఠాన్ని కరోనా వైరస్ మనకు నేర్పిందన్నారు. ఉమ్మడి శత్రువును ఎదిరించడానికి ప్రపంచమంతా ఒక్కతాటిపైకి ఎలా రావాలో తెలియజేసిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలు ప్రపంచంలో ఎక్కడైనా పురుడు పోసుకోవచ్చని వివరించారు. 2021లో కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం వేగంగా కోలుకుంటుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా నేర్పిన పాఠాలను మర్చిపోవద్దని సూచించారు. ఈ పాఠాలను ప్రజారోగ్య విపత్తులకే కాకుండా ఇతర విపత్తులకు కూడా అన్వయించుకోవాలని పిలుపునిచ్చారు. ఆధునిక ప్రపంచం పాలిట పెనుభూతంగా మారిన వాతావరణ మార్పుల నుంచి గట్టెక్కడానికి ఉమ్మడి కృషి కావాలని ప్రధానమంత్రి మోదీ సూచించారు. ఈ సదస్సులో ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘీ, యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తదితరులతోపాటు పలు అంతర్జాతీయ సంస్థల, విద్యా సంస్థల ప్రతినిధులు, పలువురు నిపుణులు పాల్గొన్నారు. మోదీ పాత్ర ప్రశంసనీయం వాతావరణ మార్పులపై జరుగుతున్న అంతర్జాతీయ పోరాటంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారని యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రశంసించారు. ఆయన నాయకత్వం విస్మరించలేనిదని అన్నారు. తాను వచ్చే నెలలో భారత్‌లో పర్యటించబోతున్నానని, వాతావరణ మార్పులతోపాటు ఇతర కీలక అంశాలపై తన మిత్రుడు మోదీతో చర్చిస్తానని చెప్పారు. ఐసీడీఆర్ఐ సదస్సులో బోరిస్ జాన్సన్ మాట్లాడారు. ఈ సదస్సును నిర్వహించిన నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. -
కోటికి చేరుకున్న కరోనా కేసులు
కంటికి కనిపించని సూక్ష్మ క్రిమి చైనాలో వూహాన్లో పుట్టి యూరప్ దేశాల మీదుగా విస్తరించి అమెరికాలో ఉగ్రరూపం దాల్చి భారత్‌ని కూడా భయపెడుతోంది. 6 నెలలు, 213 దేశాలు.. కోటి కేసులు, దాదాపు 5 లక్షల మృతులు.. ఇదీ కోవిడ్19 సృష్టిస్తున్న అల్లకల్లోలం. వాషింగ్టన్/న్యూఢిల్లీ: ఒక వైరస్ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఒక వైరస్ అందరికీ కొత్త పాఠాలు నేర్పిస్తోంది. ప్రపంచానికి తాళం వేసి ఆర్థికంగా అతలాకుతలం చేస్తోంది. 2019 డిసెంబర్ 31న సార్స్ తరహా వైరస్ కేసులు చైనాలోని వూహాన్లో వెలుగులోకి వస్తున్నాయని అందరికీ తెలిసినప్పుడు ఇదేదో మామూలు వైరస్ అనుకున్నారు. అంతకంతకూ ఆ వైరస్ శరవేగంగా విస్తరించింది. అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికింది. తొలి రెండు, మూడు నెలలు చైనాలోని వూహాన్‌తో పాటుగా అమెరికా, ఇటలీ, స్పెయిన్, యూకే దేశాలు అల్లాడిపోయాయి. ఆ తర్వాత యూరప్‌లో కొన్ని దేశాలు కోలుకున్నప్పటికీ అమెరికాను కేసుల భయం వెంటాడుతూనే ఉంది. శనివారం రాత్రికి ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,00,418కు, బాధితుల మరణాల సంఖ్య 4,98,952కు చేరాయి. కరోనాతో వణుకుతున్న దేశాలు అగ్రరాజ్యం అమెరికాని కరోనా అసాధారణ రీతిలో కాటేసింది. 25 లక్షలకు పైగా కేసులు లక్షా 25 వేలకు పైగా మృతులతో ఆ దేశం అగ్రభాగంలో ఉంది. ఇప్పటికీ అమెరికాలో రోజుకి సగటున 40 వేల మందికి కోవిడ్ –19 సోకుతోంది. బ్రెజిల్, రష్యా, భారత్, ఇరాన్, మెక్సికో, చిలీ, పెరూ, పాకిస్తాన్, బంగ్లాదేశ్ , ఇండోనేసియా దేశాల్లోనూ కరోనా కేసులు అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. న్యూజిలాండ్ సహా 15 దేశాలు ఇప్పటివరకు కరోనాని జయించామని చెప్పుకుంటున్నప్పటికీ మళ్లీ ఆయా దేశాల్లో రాదని చెప్పలేని పరిస్థితి. చైనాని కూడా కరోనా సెకండ్ వేవ్ భయపెడుతోంది. ప్రాణాపాయం లేదు కరోనా వైరస్ విస్తరణ దడ పుట్టించేలా ఉన్నప్పటికీ, వేరే ఇతర వ్యాధులు ఉన్నవారికే ఇది అత్యంత ప్రమాదకరం. మిగిలిన వారికి కేవలం ఇదొక ఫ్లూ లాంటి జ్వరం మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. కొన్ని ముందు జాగ్రత్త చర్యలతో ఈ వైరస్‌ను అరికట్టవచ్చునని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డబ్ల్యూహెచ్ఓ అంచనాల ప్రకారం మొత్తం కేసుల్లో ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండానే వ్యాధి అదుపులోకి వచ్చే కేసులు 80% వరకు ఉన్నాయి. ఆస్పత్రిలో చేరినా కోలుకున్న కేసులు 15 శాతం ఉంటే, వాటిలో విషమంగా మారిన కేసులు 5శాతం. ఆ 5శాతం కేసుల్లోనూ సగం మందికే ప్రాణాలకు ముప్పు ఉంటోంది. -
ఏ దేశం ఎలా ఖర్చు చేసింది?
ఇదొక సంక్షోభ సమయం. కంటికి కనిపించని శత్రువుతో పోరాడే సందర్భం. ప్రపంచ దేశాలన్నీ ఆరోగ్యంగా, ఆర్థికంగా ఛిన్నాభిన్నమైన విషాదం. వందల కోట్ల మంది పనులు మానేసి ఇంటి పట్టున కూర్చుంటే ఏ దేశం కూడా మనుగడ సాగించే పరిస్థితి లేదు. అందుకే దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి అన్ని దేశాలు సహాయ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. భారత్ స్వావలంబనే ప్రధానంగా కోవిడ్ సహాయ ప్యాకేజీని ప్రకటిస్తే ఒక్కో దేశానిది ఒక్కో దారి. కోవిడ్–19తో కుదేలైన ఆర్థిక రంగానికి ఊతమివ్వడానికి కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రకటించిన భారీ ప్యాకేజీ స్థూల జాతీయోత్పత్తిలో అత్యధికంగా ఖర్చు పెట్టిన జీ–20 దేశాల్లో అయిదో స్థానంలో నిలిచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా సాయంలో చూసుకుంటే హాంకాంగ్‌తో కలిసి భారత్ 19వ స్థానాన్ని పంచుకుంది. 2008 ఆర్థిక మాంద్యం కంటే అధికంగా ప్రపంచదేశాలన్నీ అతలాకుతలమైపోవడంతో సహాయ ప్యాకేజీలే భవిష్యత్‌కి బాటలు వేసేలా రూపొందించాయి. హాంకాంగ్, కోస్తారికా, కెనడా వంటి దేశాలు ఉద్యోగాలు కోల్పోయిన వారికి నగదు రూపంలో సాయం చేశాయి. నెదర్లాండ్స్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగస్తుల 90 శాతం వరకు వేతనాలను ప్రభుత్వమే పరిస్థితి చక్కబడే వరకు చెల్లించేలా ప్యాకేజీ రూపొందిస్తే, ఫ్రాన్స్ ఉద్యోగుల గ్రాస్ వేతనంలో 84% చెల్లిస్తోంది. అమెరికా కరోనాతో దెబ్బతిన్న అమెరికా దేశ చరిత్రలోనే అతి పెద్ద ప్యాకేజీని ప్రకటించింది. రెండున్నర లక్షల కోట్లకుపైగా డాలర్లతో ఆర్థిక వ్యవస్థకి ఊపిరిలూదడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మూడు దశల్లో ఖర్చు పెట్టిన అమెరికా నాలుగో దశ విడుదలపై కసరత్తు చేస్తోంది. కరోనా ఎయిర్ రిలీఫ్ అండ్ ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజీ (కేర్స్) పేరుతో దీనికి అమెరికా సెనేట్ అంగీకరించింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కోవిడ్ సంక్షోభంతో ఉద్యోగాలు కోల్పోయిన వారు, విద్యార్థుల ఉన్నత విద్యా రుణాలు మాఫీ, ఫుడ్ బ్యాంకులు, కోవిడ్‌పై పరిశోధనలు, వ్యాక్సిన్ అభివృద్ధి వంటి వాటిపై అమెరికా భారీగా నిధుల్ని భారీగా వెచ్చించింది. యూకే బ్రిటన్ స్వయం ఉపాధికే తన రిలీఫ్ ప్యాకేజీలో పెద్ద పీట వేసింది. సొంతంగా వ్యాపారాలు చేసే వారికి ఎక్కువ నిధులు కేటాయించి ఆదుకుంది. కోవిడ్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి స్వయం ఉపాధి కల్పించే పథకాలు ప్రవేశపెట్టింది. వ్యాపారాలు చేసే వారికి రుణాలు మంజూరు చేసింది. కోవిడ్ మళ్లీ విజృంభించే సంకేతాలు ఉండడంతో భవిష్య నిధికి కొంత కేటాయింపులు జరిపింది. ఇటలీ ఇటలీ తన ప్యాకేజీలో ఆరోగ్య రంగ ఉత్తేజంపైనే దృష్టి పెట్టింది. కంపెనీల్లో శుభ్రత, శానిటైజేషన్, ఉద్యోగులకు మాస్క్‌లు వంటివి కల్పించడం కోసం 50శాతం పన్నుల్లో మినహాయింపునిచ్చింది. చిన్నారుల సంక్షేమం, ప్రజలు కట్టాల్సిన పన్నుల మినహాయింపు వంటి చర్యలు తీసుకుంది. కెనడా కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్న కెనడా సహాయ ప్యాకేజీ కేటాయింపుల్లో ప్రశంసలందుకుంది. చిన్న తరహా పరిశ్రమలు నడిపే వారికి 75% అద్దె తగ్గింపు, చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు, విద్యార్థులు, సేవా రంగంలో ఉండేవారిని ఎక్కువగా ఆదుకుంది. అంతే కాకుండా స్వదేశీ ఉత్పత్తులకు ఊతమిచ్చేలా ప్యాకేజీని రూపొందించింది. ఇక ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఆ దేశం నెలకి 2 వేల కెనడా డాలర్ల చొప్పున నాలుగు నెలలు నిరుద్యోగ భృతి కింద ఇస్తోంది. -
కోవిడ్ మృతులు 2 లక్షలు
వాషింగ్టన్: ప్రపంచ దేశాల్లో కోవిడ్–19 మరణమృదంగం ఇంకా కొనసాగుతూనే ఉంది. వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 2 లక్షలు దాటేసింది. అందులో నాలుగో వంతు కంటే ఎక్కువ మంది అమెరికాలో మరణించగా మూడో వంతు కేసులు అక్కడే నమోదయ్యాయి. అమెరికాలో కేసులు 9 లక్షలు దాటితే, మృతుల సంఖ్య 52 వేలు దాటేసింది. ఇక యూరప్ లక్షా 20 వేలకు పైగా మరణాలతో మొదటి స్థానంలో ఉంది. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లో ఎక్కువగా మరణాలు నమోదయ్యాయి. అమెరికాలో ఆంక్షల సడలింపు ఆరోగ్యం, ఆర్థికం ఈ రెండింటి మధ్య సమతుల్యం పాటిస్తూ ప్రపంచ దేశాలు లాక్డౌన్ ఆంక్షల్ని సడలిస్తున్నాయి. కోవిడ్‌తో అతలాకుతలమైన అమెరికా నెమ్మది నెమ్మదిగా ఆంక్షల్ని ఎత్తివేయడానికి సన్నాహాలు చేస్తోంది. జార్జియా, ఒక్లహోమా, అలాస్కా రాష్ట్రాల్లో ఆంక్షల్ని సడలించారు. అగ్రరాజ్యంలో కోవిడ్ స్వైరవిహారం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఆంక్షల్ని ఎత్తివేయడం సరికాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలంటే వీలైనంత త్వరగా అందరూ పనుల్లోకి రావాలని ట్రంప్ సర్కార్ అంటోంది. జార్జియా, ఒక్లహోమా సెలూన్లు, స్పాలకి అనుమతులిస్తే, అలాస్కా రాష్ట్రం రెస్టారెంట్లు, రిటైల్ షాపులు తెరవడానికి అనుమతించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రువారం వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని, భౌతిక దూరాన్ని పాటించాలని స్పష్టం చేశారు. 18 రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని అన్నారు. కనిపించని రంజాన్ శోభ రంజాన్ మాసం మొదలైనా ఎక్కడా సందడి కనిపించడం లేదు. కోవిడ్ భయాందోళనల నేపథ్యంలో ముస్లిం దేశాలన్నీ రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులపై నిషేధం విధించాయి. ఎవరింట్లో వారే ప్రార్థనలు చేసుకోవాలని సూచించాయి. లక్షలాది మంది ముస్లిం సోదరులతో నిండిపోయే సౌదీ అరేబియాలో మక్కా మసీదు ఎవరూ లేక బోసిపోతోంది. పవిత్రమైన మక్కాలో జన సందోహం లేకుండా చూస్తే చెప్పలేని బాధ కలుగుతోందని మతాధికారి అలీముల్లా వ్యాఖ్యానించారు. ► స్పెయిన్ ప్రజలకి ఆదివారం నుంచి సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తోంది. కోవిడ్ నియంత్రణలోకి రావడంతో పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఎత్తేస్తోంది. చిన్నారుల్ని స్కూళ్లకి పంపడంపై తల్లిదండ్రుల ఇష్టానికే విడిచిపెట్టింది. ► డెన్మార్క్ కళాశాలలను మాత్రమే తెరిచింది. ► ఫ్రాన్స్ మే 11 నుంచి లాక్డౌన్ సంపూర్ణంగా ఎత్తేయాలని నిర్ణయించింది. ► బెల్జియం మే 3 నుంచి రిటైల్ దుకాణాల్ని ప్రారంభించడానికి అనుమతినిచ్చింది ► బ్రిటన్ మాత్రం ఆంక్షల్ని కొనసాగిస్తోంది. ► శ్రీలంక సోమవారం నుంచి లాక్‌డౌన్‌ను ఎత్తివేయనుంది. -
నేడు వైజాగ్‌కు ఇటలీ తెలుగు విద్యార్థులు
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: ఇటలీలోని తెలుగు విద్యార్థులు సోమవారం విశాఖ చేరుకోనున్నారు. ఇటలీ నుంచి మార్చి 15, 21 తేదీల్లో ఢిల్లీ వచ్చి ప్రభుత్వ ఐటీబీపీ క్యాంపస్‌లోని క్వారంటైన్ కేంద్రాల్లో ఏపీ విద్యార్థులు 33 మంది ఉన్నారు. వీరికి రెండు సార్లు కోవిడ్ పరీక్షలు జరపగా నెగిటివ్‌గా తేలింది. క్వారంటైన్ పూర్తయ్యాక ఐటీబీపీ క్యాంపస్ అధికారుల అనుమతి తీసుకుని ప్రైవేటు బస్సులో ఏప్రిల్ 10న బయలుదేరారు. ఛత్తీస్‌గఢ్ అధికారులు వీరిని ఆపేశారు. అన్ని పత్రాలు ఉన్నాయని చూపినా వారు కదలనివ్వలేదు. స్థానికంగా ఆదివాసీ బాలికా విహార్‌లో వసతి కల్పించారు. ఇందులో కొందరు విద్యార్థినులు కూడా ఉన్నారు. విషయాన్ని విద్యార్థులు ఏపీ ప్రభుత్వం, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీ జీవీఎల్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్, ఐఏఎస్ అధికారి కృష్ణబాబు చొరవ తీసుకొని విద్యార్థులు విశాఖకు చేరే విధంగా ఏర్పాట్లు చేశారు. కాశీ నుంచి తెలుగు రాష్ట్రాలకు యాత్రికుల తరలింపు: జీవీఎల్ లాక్‌డౌన్‌కు ముందు కాశీ యాత్రకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన వెయ్యి మంది తెలుగు యాత్రికులను సొంత ప్రాంతాలకు తరలించినట్టు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ప్రధాని కార్యాలయ అనుమతితో వారందరినీ స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారన్నారు. కాగా, ఏపీలో చిక్కుకుపోయిన జపాన్ దేశీయులను వారి దేశానికి తరలించడానికి విశాఖ నుంచి బెంగళూరుకు నేడు ప్రత్యేక విమానం నడపనున్నారు. -
లక్ష దాటిన కోవిడ్ మరణాలు
జెనీవా/వాషింగ్టన్/రోమ్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కరాళ నృత్యం చేస్తోంది. ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య శుక్రవారం 1,01,485కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 16లక్షల 75వేల మందికిపైగా కరోనా వైరస్ బారినపడ్డారు. ఈస్టర్ సంబరాల వేళ ప్రపంచ జనాభాలో సగం మంది ఇంటి పట్టునే ఉండడంతో ఎక్కడా సందడి కనిపించడం లేదు. సామాజిక, ఆర్థిక ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొనడంతో మార్కెట్లన్నీ కళావిహీనంగా మారిపోయాయి. కోవిడ్ బారిన పడి విలవిలలాడుతున్న దేశాల్లో అమెరికాయే ముందు వరసలో ఉంది. 24 గంటల్లో 1,700 మంది మృతి చెందారు. వైరస్ దెబ్బకి అగ్రరాజ్యంలో ప్రతీ 10 మందిలో ఒకరు ఉద్యోగం కోల్పోతే, తమ సభ్యదేశాల్లో సహాయ కార్యక్రమాల కోసం 50 వేల కోట్ల యూరోలతో ప్రత్యేక ప్యాకేజీని అందించడానికి ఈయూ ఆర్థిక మంత్రులు అంగీకరించారు. ప్రపంచ శాంతికి భంగకరం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో శాంతి భద్రతల్ని భగ్నం చేస్తుందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియా గ్యుటెరాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొండి వ్యాధిపై కొన్ని తరాల వారు పోరాడాల్సి ఉంటుందని ఆయన అంచనా వేశారు. త్వరలోనే ప్రపంచ దేశాల్లో సామాజిక అస్థిరత, హింసాత్మక పరిస్థితులు వస్తాయని భద్రతా మండలిని హెచ్చరించారు. కోలుకుంటున్న జాన్సన్ బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కోవిడ్ నుంచి కోలుకుంటున్నారు. ఆయనను ఐసీయూ నుంచి వార్డుకి మార్చారు. జాన్సన్ ఆరోగ్యాన్ని రేయింబవళ్లు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. జాన్సన్‌తో ఆయన తండ్రి స్టాన్లీ జాన్సన్ మాట్లాడారు. ఇటలీలో మాఫియా కదలికలు కోవిడ్‌తో అతలాకుతలమైన ఇటలీపై పట్టు బిగించడానికి మాఫియా పన్నాగాలు పన్నుతోంది. వివిధ నేరగాళ్ల ముఠాలు పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను కొనుగోలు చేసి, ఆకలితో అలమటిస్తున్న వారికి పంపిణీ చేస్తున్నాయి. నిరుపేదల్ని ఆదుకొని వారందరినీ తమ నియంత్రణలోకి తీసుకోవాలని కుట్రలు పన్నుతున్నాయని రచయిత రోబెర్టో సావియానో అనుమానం వ్యక్తం చేశారు. యెమన్‌లో తొలి కరోనా కేసు యుద్ధంతో అతలాకుతలమవుతున్న యెమన్‌లో మొట్టమొదటి కరోనా వైరస్ నమోదైంది. తీవ్రస్థాయిలో మానవ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న యెమన్‌లో కోవిడ్ జాడలు ఎలాంటి విధ్వంసానికి దారితీస్తుందోనని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. క్లినికల్ ట్రయల్స్ దశలో ప్లాస్మా థెరపీ న్యూఢిల్లీ: కరోనా చికిత్సకు కొత్తగా అందుబాటులోకి వచ్చిన కొన్వాలెసెంట్ ప్లాస్మా థెరపీ విధానం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. కరోనా బారిన పడి కోలుకున్న వారి రక్తం నుంచి సేకరించిన యాంటీ బాడీస్‌ను కరోనా వైరస్‌తో తీవ్రంగా బాధపడుతున్న వారికి ఎక్కించడమే ప్లాస్మా థెరపీ. ఈ విధానాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా కేరళలోని శ్రీచిత్ర పెరుమాళ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలోని రోగులపై ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇచ్చినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. అయితే, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) కూడా ట్రయల్స్‌కు అంగీకారం తెలపాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇటీవల కొన్ని దేశాల్లో కరోనా సోకి విషమంగా ఉన్న రోగులకు, వెంటిలేటర్‌పై ఉన్న వారికి ఈ విధానాన్ని పరిమిత సంఖ్యలో ప్రయోగాత్మకంగా పరిశీలించగా మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొంది. -
యూరప్‌లో 30 వేల మంది మృతి
పారిస్: కరోనా వైరస్ కారణంగా యూరప్ లో మరణించిన వారి సంఖ్య బుధవారానికి 30 వేలకు చేరుకుంది. అందులో ఇటలీ, స్పెయిన్ లోనే అధికంగా మరణాలు నమోదయ్యాయి. మొత్తం 4,58,601 కేసులకు గానూ 30,063 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఒక్క ఇటలీలోనే 12,428 మంది మరణించగా, స్పెయిన్ 8,189 మంది, ఫ్రాన్స్ లో 3,523 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా 40 వేల మంది మరణించారు. ఆయా దేశాల్లో.. స్పెయిన్ ఇప్పటికే ఆస్పత్రుల్లోని బెడ్లను 20 శాతం పెంచింది. పదుల సంఖ్యలో హోటళ్లను రికవరీ గదులుగా మార్చింది. క్రీడా కేంద్రాలు, లైబ్రరీలు, ఎగ్జిబిషన్ సెంటర్లను కూడా ఆస్పత్రులుగా మలచేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా తగినన్ని ఐసీయూ యూనిట్లు లేకపోవడంతో పరిస్థితిని అదుపు చేయడం కష్టమవుతోంది. ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు తమ దేశాల్లోని మెడికల్ విద్యార్థులను, రిటైర్డ్ వైద్యులను, చివరకు విమానాల్లోని మెడికల్ సిబ్బందిని కూడా కరోనా రోగుల కోసం రావాల్సిందిగా పిలుపునిస్తున్నారు. ఇప్పటికే ఇటలీలో 10 వేల మంది వైద్య సిబ్బందికి, 60 మంది వైద్యులకు కూడా కరోనా సోకింది. మరోవైపు పారిస్ గత వారమే తమ ఆస్పత్రులలోని ఐసీయూ బలాన్ని రెండింతలు చేసింది. అవన్నీ కూడా రోగులతో నిండిపోయాయి. -
కోవిడ్ కేసులు 107
న్యూఢిల్లీ: కోవిడ్ (కరోనా వైరస్) భారత్‌లో స్థానికంగానే వ్యాపిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 107కి పెరిగింది. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 12 కేసులు ఆ రాష్ట్రంలోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కేసుల సంఖ్య పెరిగినా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవరం లేదని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని సూచించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శనివారం అర్ధరాత్రి నుంచి అన్ని దేశాల సరిహద్దుల్ని మూసివేసిన కేంద్రం తాజాగా కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా మార్గం వెంబడి కూడా రాకపోకలపై నిషేధం విధించింది. ఆ మార్గం ద్వారా సిక్కు భక్తులు పాక్‌కు వెళ్లడానికి తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. కరోనా నేపథ్యంలో ఢిల్లీ–జమ్మూ రాజధాని ఎక్స్‌ప్రెస్ బోగీని శుభ్రం చేస్తున్న కార్మికుడు స్థానికంగా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం కరోనా వ్యాప్తి మన దేశంలో స్థానికంగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే దశలోనే ఉంది. దీనిని రెండో దశ అంటారు. ఇక మూడో దశలో జన సమూహాలకు సోకి వివిధ ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఆ దశ రాకుండానే కేంద్రం, అన్ని రాష్ట్రాలు కరోనాపై యుద్ధం ప్రకటించాయి. పకడ్బందీ చర్యలు చేపట్టడంతో హెల్ట్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం ఇంకా రాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జన సందోహాలు గుమికూడకుండా పర్యవేక్షణ, కోవిడ్–19 సోకిందని అనుమానాలున్న వారిని విడిగా ఉంచడం, వైరస్ నుంచి వ్యక్తిగత రక్షణ కోసం మాస్క్‌లు, శానిటైజర్ల వంటివి అందుబాటులో ఉంచడం , సుశిక్షితులైన మానవ వనరులు, చురుగ్గా స్పందించే బృందాలను బలోపేతం చేయడం వంటివి చేస్తున్నామని అన్నారు. 80,50,000 ఎన్95 మాస్కుల కోసం ఆర్డర్ ఇచ్చామని, హెల్త్‌కేర్ వర్కర్స్‌కి అందిస్తామని తెలిపారు. మహారాష్ట్రలో మరణించిన వ్యక్తికి కరోనా లేదు మహారాష్ట్రలో బుల్దానాలో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన 71 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకలేదని నిర్ధారణ అయినట్టుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన ఆయన మరణించడానికి ముందు సేకరించిన నమూనాలను పరీక్షించి చూస్తే కరోనా సోకలేదని తేలింది. తొలుత ఆ వృద్ధుడు కరోనాతో మరణించాడన్న అనుమానాలు తలెత్తాయి. ఇరాన్, ఇటలీ నుంచి భారతీయులు వెనక్కి ఇరాన్ నుంచి మూడో విడత 236 మంది భారతీయుల్ని వెనక్కి తీసుకువచ్చారు. వారందరినీ జైసల్మీర్‌లో ఆర్మీ ఏర్పాటు చేసిన కేంద్రానికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. చైనా తర్వాత అత్యధికంగా కరోనా దాడి చేసిన ఇటలీ నుంచి 218 మంది భారతీయుల్ని ఆదివారం వెనక్కి తెచ్చారు. వారిలో 211 మంది విద్యార్థులే ఉన్నారు. వీరిని వాయవ్య ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. దుబాయ్ నుంచి కేరళకు వచ్చిన 20 మంది ప్రయాణికుల్లో బ్రిటన్‌కు చెందిన వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో అతడిని కొచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో స్వదేశీ, విదేశీ టూర్లపై కూడా ముంబై సీపీ నిషేధం విధించారు. తాజాగా తమిళనాడు, అస్సాం, ఉత్తరాఖండ్‌లో పాఠశాలలు, షాపింగ్ మాల్స్ రెండు వారాల పాటు బంద్ చేశారు. -
భారత్‌లో 30 కోవిడ్ కేసులు
న్యూఢిల్లీ: ప్రపంచం నలుమూలలకీ అత్యంత వేగంగా విస్తరిస్తోన్న కోవిడ్ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. వైరస్ విజృంభణతో ప్రపంచ ప్రజల దైనందిన జీవితంలోనూ పెనుమార్పులు సంభవిస్తున్నాయి. విదేశీయుల రాకపోకలపై ఆంక్షలు పెరిగాయి. పాఠశాలలు, ప్రార్థనాలయాలు మూతపడ్డాయి. చైనాలో వైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతోంటే, ఇటలీ, ఇరాన్ లాంటి ఇతర దేశాల్లో తీవ్రతరమౌతోంది. కరోనా కలకలం అంతర్జాతీయంగా దాదాపు 30 కోట్ల మంది విద్యార్థులను వారంపాటు విద్యాలయాలకు దూరం చేసింది. భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 30కి చేరడంతో ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం మూసివేసింది. ఇటలీ, దక్షిణ కొరియాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. విదేశీయులను కోవిడ్ సోకలేదని వైద్యుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని భారత్ కోరుతోంది. భారత్‌లో 30 కోవిడ్ కేసులు ఇటలీకి చెందిన పర్యాటకులతో సహా మార్చి 4వ నాటికి భారత్‌లో 29 కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ పార్లమెంట్లో ప్రకటించారు. 28,529 మందిని వైద్యపరిశీలనలో ఉంచినట్టు వెల్లడించారు. ఇటీవలే ఇరాన్లో పర్యటించి వచ్చిన ఘజియాబాద్‌కు చెందిన వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 30కి చేరింది. వైరస్‌ను గుర్తించేందుకు జిల్లా, గ్రామస్థాయిల్లో బృందాలను ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. (చదవండి: కోవిడ్‌ను జయించిన కేరళ విద్యార్థిని) మొత్తం 95 వేల మంది.. ప్రపంచవ్యాప్తంగా 95,000 మంది ప్రజలకు వైరస్ సోకగా, 3,200 మంది మరణించారు. ఇప్పటి వరకు 80 దేశాలకు కోవిడ్–19 వ్యాపించింది. చైనాలో తగ్గుముఖం పట్టిన వైరస్ వ్యాప్తి, చైనాలో కన్నా ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరిస్తోంది. గురువారం 31 మంది మృతిచెందగా ఇప్పటి వరకు మరణాల సంఖ్య 3,012కి చేరింది. 80,400 మందికి వైరస్ సోకినట్టు తేలింది. అమెరికాలో కోవిడ్ మృతుల సంఖ్య 11కు చేరడంతో కరోనాపై పోరాడేందుకు 8 బిలియన్ డాలర్లను వెచ్చించాలని అమెరికన్ కాంగ్రెస్ తీర్మానించింది. ఇరాన్లో మృతుల సంఖ్య 107కి చేరింది. 3,515 మందికి వైరస్ సోకినట్టు చేరింది. ఇటలీలోనూ కరోనా మృతుల సంఖ్య 107, బాధితులు 3000 మంది. దక్షిణ కొరియాలో బాధితుల సంఖ్య 6,000కు చేరింది. జీసస్ జన్మస్థలమైన పాలస్తీనాలోని బెత్లెహాం చర్చ్‌ని తాత్కాలికంగా మూసివేశారు. జపాన్, ఫ్రాన్స్‌లలో పాఠశాలలు మూసివేశారు. ఢిల్లీలోని మొగల్ గార్డెన్‌లోకి ప్రజల సందర్శనలను నిలిపి వేస్తున్నట్టు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. ఫ్లూతో బాధపడే ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే అవకాశం ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 16 ఏళ్ల భారతీయ బాలికకు కోవిడ్ సోకినట్టు తేలింది. చాలా దేశాలు ఏమీ చేయడం లేదు.. ప్రపంచంలోని చాలా దేశాలు కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు తగు చర్యలు తీసుకోవడం లేదని, ఇది సరైన విధానం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ముప్పునకు తగ్గ చర్యలు తీసుకోవడంలో పట్టుదల చూపడం లేదని తెలిపింది. మోదీ బెల్జియం పర్యటన వాయిదా యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య ఒప్పందాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరగాల్సిన సదస్సు వాయిదా పడినట్లు భారత్ తెలిపింది. ఈ నెల 13న ఈ సమావేశం కోవిడ్ కారణంగా ఈ పర్యటన వాయిదా పడింది. ఇరు వర్గాలకూ కుదిరే మరో సమయంలో భేటీ జరుగనుంది. ఆక్టెమ్రాతో కోవిడ్‌కు చెక్? ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడు దొరికిందా? అవును అంటోంది స్విట్జర్లాండ్ ఫార్మా కంపెనీ రోష్! ఆర్థరైటిస్ రోగుల్లో మంట/వాపులను తగ్గించేందుకు ఉపయోగించే అక్టెమ్రా అనే మందు కరోనా వైరస్ కట్టడికీ ఉపయోగపడవచ్చునని రోష్ చెబుతోంది. వ్యాధికి కేంద్రబిందువైన చైనాలో అక్టెమ్‌రాను వాడేందుకు ఇప్పటికే చైనా ప్రభుత్వ అనుమతి పొందిన రోష్ సుమారు 20 లక్షల డాలర్ల విలువైన మందులను చైనా ప్రభుత్వానికి ఉచితంగా అందజేసింది. అక్టెమ్‌రాను వైద్య పరిభాషలో టోసిలిజుమాబ్ అని పిలుస్తారు. 2010 నుంచి దీనిని అమెరికాలో ఆర్థరైటిస్ చికిత్సలో వాడుతున్నారు. దీంట్లో అత్యధిక మోతాదులో తెల్ల రక్తకణాలు విడుదల చేసే ప్రొటీన్లు ఉంటాయి. చైనా ప్రచురించిన మార్గదర్శకాల ప్రకారం కరోనా కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతిన్న వారికి అక్టెమ్‌రాను వాడవచ్చు. -
పది వేల అడుగుల ఎత్తులో...
‘ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ చిత్రం తర్వాత రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రెడ్’. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాలోని రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించారు. ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘ఈ నెల 12 నుంచి 18 వరకూ ఇటలీలోని అందమైన ప్రదేశాల్లో రామ్, మాళవికా శర్మలపై రెండు పాటలు చిత్రీకరించాం. శోభి మాస్టర్ నృత్యాలు సమకూర్చారు. ఇటలీలోని టుస్కాన్, ఫ్లారె¯Œ ్స, డోలమైట్స్ ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. సముద్ర తీరానికి 10 వేల అడుగుల ఎత్తులోని డోలమైట్స్‌లో మైనస్ ఐదు డిగ్రీల వాతావరణంలో ఒక పాటను చిత్రీకరించాం. డోలమైట్స్‌లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం మాదే. ఇటలీలో ప్రతి ఏటా జరిగే వెనీడియా కార్నివాల్లో పాటలో కొంత భాగాన్ని చిత్రీకరించాం. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ నెలాఖరున హైదరాబాద్‌లో ఆ పాట చిత్రీకరిస్తాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రం క్లాస్, మాస్‌ని ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ 9న సినిమాని విడుదల చేయబోతున్నాం’’ అన్నారు చిత్ర సమర్పకుడు కృష్ణ పోతినేని. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సమీర్ రెడ్డి. -
కరోనా ఎఫెక్ట్
చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ ఎఫెక్ట్ చెన్నైలో షూటింగ్ చేసుకుంటున్న ‘ఇండియన్ 2’పై పడింది. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘ఇండియన్ 2’. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ఇది సీక్వెల్. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ భారీ షెడ్యూల్‌ను చైనాలో షూట్ చేయాలనుకున్నారు. కరోనా వైరస్ ఇబ్బంది ఉండటంతో లొకేషన్‌ను మార్చుకోవాలనుకుంటున్నారట. ఈ షెడ్యూల్‌ను ఇటలీలో చేయనున్నారని తాజా సమాచారం. -
కొత్త సంవత్సరమంటే కొన్ని నమ్మకాలు..
ఎన్నో కలలతో మరెన్నో ఆకాంక్షలతో కొత్త దశాబ్దంలోకి అడుగు పెట్టబోతున్నాం. గ్రాండ్‌గా న్యూ ఇయర్‌కి వెల్కమ్ చెప్పబోతున్నాం. కొత్త ఏడాదంటేనే కొత్త ఉత్సాహం, కొత్త ఉల్లాసం, కొత్త ఉత్తేజం. అంత జోష్‌లోనూ కొత్త సంవత్సరమంటే కొన్ని నమ్మకాలు ఉన్నాయి. వివిధ దేశాల ప్రజలు పాటించే ఆ సంప్రదాయాలు ఆసక్తిని రేపుతున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం. స్పెయిన్ డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు మేల్కొని గడియారం ముల్లు సరిగ్గా 12 మీదకి రాగానే స్పెయిన్ దేశస్తులు 12 ద్రాక్షపళ్లు తింటారు. అలా తింటే అదృష్టం కలిసొస్తుందని వారి నమ్మకం. ఈక్వెడార్ ఈక్వెడార్‌లో డిసెంబర్ 31 రాత్రి ఎవరూ ఇళ్లల్లో ఉండరు. అందరూ రోడ్లపైనే గడుపుతారు. ప్రధాన కూడళ్లలో మంటలు రాజేసి రాజకీయ నాయకుల దిష్టి బొమ్మలను తగుల బెడతారు. ఈ చర్యతో గత ఏడాది కాలంలో జరిగిన చెడు అంతా పోయినట్టుగా భావిస్తారు. ఈ సంప్రదాయం 1895 నుంచి వస్తోంది. గ్రీస్ గ్రీస్‌లో జనవరి 1న చర్చికి వెళ్లి వచ్చిన వాళ్లందరికీ అక్కడ ఉల్లిపాయలు పంచుతారు. వాటిని తీసుకువచ్చి దండలా తయారు చేసి ఇంటి గుమ్మానికి వేళ్లాడతీస్తారు. ఉల్లిపాయలు అంటే ఆరోగ్యానికి, సంతానం వృద్ధికి, ఆయుఃప్రమాణాలు పెంచడానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే కొత్త సంవత్సరం ఉల్లిపాయల దండ గుమ్మానికి వేళ్లాడదీయడం శుభ పరిణామంగా విశ్వసిస్తారు. చెక్ రిపబ్లిక్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా చెక్ రిపబ్లిక్లో యాపిల్ కట్ చేస్తారు. అదీ కొత్త ఏడాది తమ అదృష్టం ఎంతో తెలుసుకోవడం కోసం. యాపిల్‌ను మధ్యకి కోస్తారు. యాపిల్ మధ్య భాగంలో విత్తనాలు ఉన్న చోట స్టార్ వస్తే కొత్త ఏడాదంతా మంచే జరుగుతుందని, అదే క్రాస్ వస్తే చెడు జరుగుతుందని వారి నమ్మకం. జపాన్ జపాన్‌లో కొత్త సంవత్సరం అంటే అర్ధరాత్రి గంటల్ని గణగణమని మోగిస్తారు. రాత్రి 12 అవగానే 108 సార్లు గంటలు మోగుతాయి. అలా చేస్తేనే తమ జీవితం ఆనందంగా సాగుతుందని అంటారు. ఇటలీ ఇటలీలో కొత్త సంవత్సరం కాస్త వినూత్నంగా ఉంటుంది. చెత్త సామాను వదిలించుకోవడానికి ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఇంట్లో ఉన్న చెత్త సామానంతటినీ బయట పడేస్తారు. అంటే మనసుల్లో ఉన్న చెడు జ్ఞాపకాల్ని వదిలించుకోవడం అన్నమాట. దక్షిణాఫ్రికావంటి దేశాలూ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. చిలీ కొత్త ఏడాది ఉత్సవాల్ని వివిధ దేశాల ప్రజలు చర్చిల్లో జరుపుకుంటే చిలీ వాసులు తమ రూటే సెపరేటు అంటున్నారు. తమకు అత్యంత ప్రియమైన వారి సమాధుల వద్ద ఈ సంబరాలు నిర్వహిస్తారు. సమాధుల్ని పూల తో అలంకరించి, దీపాలు ఉంచుతారు. ఈ లోకంలో లేకపోయినా సరే కొత్త సంవత్సరం ప్రియమైన వారిని తలచుకోవడం కంటే మించినదేదీ ఉండదని చిలీ వాసులు 1995 నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. డెన్మార్క్ డెన్మార్క్‌లో రకరకాల పింగాణి పాత్రలు (క్రాకరీ)ని బద్దలు కొడతారు. ప్లేట్లు, కప్పులు, స్పూన్లు లాంటివన్నీ డిసెంబర్ 31 అర్ధరాత్రే విరగ్గొట్టేస్తారు. అప్పుడే అదృష్టం తమకి కలిసివస్తుందని వారి నమ్మకం. -
నాడు 170 మంది ఉగ్రవాదులు హతం
న్యూఢిల్లీ: బాలాకోట్‌లోని జైషే ఉగ్రస్థావరంపై భారత వాయుసేన(ఐఏఎఫ్) చేసిన దాడిలో ఎవ్వరూ చనిపోలేదని బుకాయిస్తున్న పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న తెల్లవారుజామున ఐఏఎఫ్ చేపట్టిన వైమానికదాడిలో 130 నుంచి 170 జైషే ఉగ్రవాదులు చనిపోయారని ఇటాలియన్ జర్నలిస్ట్ ఫ్రాన్సెక్సా మారినో తెలిపారు. ఐఏఎఫ్ దాడిలో ఘటనాస్థలిలోనే భారీ సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోగా, మరికొందరు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారని వెల్లడించారు. ఈ దాడిలో గాయపడ్డ ఉగ్రమూకలకు పాక్ మిలటరీ డాక్టర్లు వైద్యం చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ మారినో రాసిన కథనాన్ని ‘స్ట్రింగర్ ఆసియా’ అనే వెబ్సైట్ ప్రచురించింది. మృతుల కుటుంబాలకు పరిహారం.. ఫిబ్రవరి 26 తెల్లవారుజామున ఐఏఎఫ్ యుద్ధవిమానాలు బాలాకోట్‌లోని ఉగ్రస్థావరంపై బాంబుల వర్షం కురిపించాయని మారినో తెలిపారు. ‘ఈ దాడిలో 11 మంది శిక్షకులు సహా 170 మంది వరకూ చనిపోయారు. దాడి జరిగిన కొద్దిసేపటికే అక్కడకు చేరుకున్న పాక్ ఆర్మీ క్షతగాత్రులను షింకియారీ ప్రాంతంలో ఉన్న హర్కతుల్ ముజాహిదీన్ క్యాంప్‌కు తరలించింది. స్థానికుల సమాచారం ప్రకారం ఇంకా 45 మంది ఉగ్రవాదులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. కోలుకున్నవారిని ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ఈ మొత్తం విషయం బయటకు పొక్కకుండా జైషే నేతలు మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించారు. ఇప్పుడు జైషే క్యాంపును తాలిమున్ ఖురాన్(మదర్సా)గా మార్చేశారు. ప్రస్తుతం స్థానిక పోలీసులకు కూడా ఇక్కడ అనుమతి లేదు’ అని చెప్పారు. అవసరమైతే బాలాకోట్‌లో భారత జర్నలిస్టులను అనుమతిస్తామని పాక్ ప్రకటించిన నేపథ్యంలో మారినో ఈ కథనం రాయడం గమనార్హం.