టాంపా (అమెరికా): అంగారకుడిపై తొలిసారి నీటి సరస్సు బయటపడింది. మంచు పొర కింద ఉన్న ఈ సరస్సు సుమారు 20 కి.మీ మేర విస్తరించి ఉన్నట్లు ఇటలీ పరిశోధకులు గుర్తించారు. అంగారకుడిపై నీటి జాడలు ఉన్నట్లు ఇది వరకే పలు పరిశోధనల్లో తేలినా, ఇంత పెద్ద సరస్సును కనుగొనడం ఇదే తొలిసారి. దీంతో అరుణ గ్రహంపై జీవం ఉండేందుకు అవకాశాలున్నాయన్న వాదనలకు బలం చేకూరింది. అయితే ఈ సరస్సు నీరు తాగడానికి అనుకూలం కాదని, అది మంచు పొరకింద సుమారు 1.5 కి.మీ. లోతులో ఉందని అధ్యయనకారుల బృందం వెల్లడించింది. ఈ నీటిలో జీవం ఉందా అన్నదానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment