Scientists
-
ఢిల్లీ భూకంపంలో భయపెట్టే శబ్దాలు..!కారణమిదే..
న్యూఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం(ఫిబ్రవరి17) తెల్లవారుజామున వచ్చిన భూకంపానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.0 పాయింట్లుగా నమోదైంది. ఇది తక్కువ తీవ్రత కలిగిన భూకంపమే అయినప్పటికీ ఢిల్లీ వాసుల కాళ్ల కింద భూమి కదిలిపోయేలా చేసింది.అరుదైన శబ్దాలతో వారిని భయభ్రాంతులకు గురి చేసింది. వారిని ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీసేలా చేసింది. తక్కువ తీవ్రత కలిగిన భూకంపం ఇంత ప్రభావం చూపడానికి శాస్త్రవేత్తలు వెల్లడించార. భూకంప కేంద్రం భూ ఉపరితం నుంచి అతి తక్కువగా కేవలం 5 కిలోమీటర్ల లోతులో ఉండడమే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు.సాధారణంగా తక్కువ లోతులో సంభవించే భూకంపాలు ఎక్కువలోతులో వచ్చేవాటికంటే తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. భూ ప్రకంపనలు వేగంగా భూఉపరితలాన్ని చేరుకోవడమే ఇందుకు కారణం.భయంకర శబ్దాలు ఎందుకు వస్తాయి..తక్కువ లోతులో సంభవించే భూకంపాలు వింత,భయంకర శబ్దాలకు కారణమవుతాయని జియాలజిస్టులు వివరిస్తున్నారు. ఈ భూకంపాల వల్ల కలిగే ప్రకంపనలు భూమిపైకి వేగంగా చేరుకుని గాలిలో కలిసినపుడు శబ్దాలు ఉద్భవిస్తాయి. భూకంపాల నుంచి వెలువడే తొలి తరంగాలను ‘పీ’ వేవ్స్‌గా పిలుస్తారు. ఇవి వాతావరణంలో కలిసినపుడు శబ్దాలు వస్తాయి. భూఉపరితలం ధృడంగా ఉండి ఈ తరంగాలను గట్టిగా అడ్డుకున్నప్పుడు శబ్దాలు మరింత ఎక్కువగా వినిపిస్తాయి. ఢిల్లీలో జరిగింది కూడా ఇదే కావచ్చనే వాదన వినిపిస్తోంది. -
భయాన్ని మెదడు ఎలా అధిగమిస్తుందంటే..
ప్రయోగం వివరాలను సెయిన్స్‌బరీ వెల్కమ్ సెంటర్లోని హాఫర్ ల్యాబ్‌లో పరిశోధకులు డాక్టర్ సారా మెడిరోస్, ప్రొఫెసర్ సోంజా హాఫర్ వివరించారు. ‘‘మనిషికి పుట్టుకతోనే కొన్ని భయాలుంటాయి. పెద్ద శబ్దాలు, హఠాత్తుగా తమ వైపు దూసుకొచ్చే వస్తువులను చూసి భయపడతాడు. అయితే కొన్నాళ్లకు కొన్ని భయాలు పోతాయి. చిన్నప్పుడు టపాసుల పేలుళ్లు భయపడిన వ్యక్తే ఆ తర్వాత తెగ టపాసులు కాలుస్తాడు. ఇదే తరహాలో ఎలుకలపైకి పక్షుల లాంటి వస్తువులు దూసుకొస్తున్నట్లు ప్రయోగం చేశాం. ఎగిరొచ్చే వాటి నీడ పెద్దదయ్యే కొద్దీ ఎలుకలు భయపడ్డాయి. ప్రాణభయంతో పారిపోయాయి. అయితే నీడను ఇలా పదే పదే పెద్దగా చేశాక కేవలం నీడ పరిమాణం మాత్రమే పెరగడం ఎలుకలు గమనించి, ఆ తర్వాత భయపడటం మానేశాయి. పారిపోకుండా అలాగే చూశాయి. ఇలాంటి దృగ్విషయంలో ఎలుక మెదడులోని వెంట్రో లేటరల్ జెనిక్యూలేట్ న్యూక్లియస్(వీఎల్జీఎన్) అనే ప్రాంతం క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. మెదడులోని సెరిబ్రల్ కార్టెక్స్ ప్రాంతంలో నిక్షిప్తమయ్యే దృశ్యసంబంధ సమాచారం అత్యధికంగా వీఎల్జీఎన్కు భటా్వడా అవుతోంది. ఈ సమాచారాన్ని పదేపదే విశ్లేషించాక ఫలానా అంశంలో భయపడాల్సిన పనిలేదని వీఎల్జీఎన్ నిర్ధారిస్తోందని మేం ఓ అంచనాకొచ్చాం. దృశ్యసంబంధ కార్టెక్స్ అనేది ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునేందుకు దోహపడుతోంది. ఇలాంటి అభ్యసన జ్ఞాపకాలు వీఎల్జీఎన్లో నిక్షిప్తమవుతున్నాయి. నేర్చుకోవడం, గుర్తుంచుకోవడం, ప్రవర్తనకు సంబంధించిన అంశాల్లో సెరబ్రల్ కార్టెక్స్దే కీలకపాత్ర అని ఇన్నాళ్లూ భావించాం. కానీ అది తప్పు అని తేలింది. ఈ జ్ఞాపకాలన్నింటినీ వీఎల్జీఎన్ మాత్రమే భద్రపరుస్తోంది. దీంతో శ్వాస, గుండెలయ, స్పృహ, నిద్ర వంటి జ్ఞప్తియేతర విధులకు, అభ్యసన, ఆలోచన వంటి జ్ఞాపకశక్తి సంబంధ అంశాలకు మధ్య సంబంధం తెల్సుకునేందుకు అవకాశం చిక్కింది. వీఎల్జీఎన్ సర్క్యూట్లలో మార్పులు చేయడం ద్వారా రోగిని భయపడకుండా చేయొచ్చు. ఇందుకు సంబంధించి ఇంకా విస్తృతమైన పరిశోధనలు చేయాల్సి ఉంది’’అని శాస్త్రవేత్తలు చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అసమానతల అంతు చూస్తారా?
విశ్వంలో ఇప్పటికీ ఎన్నో రహస్యాలు. శతాబ్దాల కాలంలో భిన్న దేశాల విభిన్న రంగాల దిగ్గజ శాస్త్రవేత్తలు ఇప్పటికి ఎన్నో సిద్ధాంతాలను రూపొందించారు. న్యూటన్ సిద్ధాంతాలు, ఐన్‌స్టీన్ సిద్ధాంతాలు ఇలా భౌతిక, రసాయన శా్రస్తాలు, గతిశక్తి, స్థితిశక్తి ఇలా ఎన్నో రకాల అంశాలకు సంబంధించి ఎన్నో పరిశోధనలు నేటి ఆధునిక ప్రపంచ అవసరాలను తీరుస్తున్నాయి. అయితే ఇప్పటికీ భౌతిక, రసాయన, ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలకు కొరుకుడుపడని టర్బులెన్స్ దృగ్విషయం అన్ని రంగాలకు పెద్ద సమస్యగా మారింది. ద్రవ ప్రవాహాల్లో హఠాత్తుగా సంభవించే అసాధారణ హెచ్చుతగ్గులు, సముద్రజలాల కదలికల్లో అనూహ్య మార్పులు, రసాయనాల్లో ఊహించని ప్రతిచర్యలు, రక్తప్రవాహాల్లో హెచ్చుతగ్గులు వంటివి ఎందుకు సంభవిస్తాయో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. టర్బులెన్స్ సమస్య చాలా రంగాలకు పెద్ద గుదిబండగా తయారైంది. గాల్లో ఎగిరే విమానాలు ఒక్కసారిగా టర్బులెన్స్‌కు గురై హఠాత్తుగా కిందకు పడిపోవడమో ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పడమో జరుగుతున్నాయి. వెదర్ శాటిలైట్లతో ఖచ్చితత్వంతో వాతావరణ పరిస్థితులపై ప్రభుత్వాలను వాతావరణ కేంద్రాలు హెచ్చరిస్తున్నా ఇప్పటికీ కొన్ని చోట్ల ఊహంచని తుపాన్లు అప్పటికప్పుడు ఏర్పడి భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయి. సువిశాల విశ్వంలో నక్షత్రాల్లోని అయనీకరణ చెందిన అత్యంత వేడి వాయువుల్లో హఠాత్తుగా ఎందుకు మార్పులు జరుగుతున్నాయో ఖగోళ శాస్త్రవేత్తలు కూడా చెప్పలేకపోతున్నారు. మానవ కణంలో అణువుల మధ్య బంధంలోనూ హఠాత్తుగా మార్పులను చూస్తున్నాం. చివరకు కృత్రిమ గుండె పనితీరును రక్తప్రవాహంలోని టర్బులెన్స్ ప్రభావితం చేస్తూ అత్యంత సమర్థవంతమైన ఆర్టిఫీషియల్ హార్ట్ ఆవిష్కరణ అవసరమని గుర్తుచేస్తోంది. ఇలాంటి దృగ్విషయాలకు ఏకైక కారణమైన టర్బులెన్స్పై మరింత అవగాహనే లక్ష్యంగా శాస్త్రవేత్తలు నడుం బిగించారు. ఈ టర్బులెన్స్పై స్పష్టమైన అవగాహన ఉంటే సైన్స్, ఇంజనీరింగ్ పరిశ్రమల్లో మరింత మెరుగైన డిజైన్‌తో విమానాలు, కార్లు, ప్రొపెలర్లు, కృత్రిమ గుండెలు తయారుచేయడానికి, అత్యంత ఖచ్చితత్వంతో వర్షాలు, వాతావరణం, పర్యావరణ సంబంధ హెచ్చరికలు చేయడానికి వీలు చిక్కుతుంది. వేగంగా చర్యలు జరిపి.. ప్రపంచంలో ఎక్కడ ఏ ద్రవాల్లో ఈ టర్బులెన్స్ తలెత్తుతుందో తెల్సుకోవాలంటే ఆ ద్రవాల పనితీరు, కదలికలపై నిరంతర నిఘా అవసరం. వాటి చర్యను వేగవంతం చేస్తేనే టర్బులెన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందో గుర్తించగలం. అందుకోసం ద్రవాల్లో రెండు సార్లు టర్బులెన్స్ సంభవిస్తే ఈ రెండు టర్బులెన్స్ మధ్య కాలంలో జరిగే మార్పులను అత్యంత ఖచ్చితత్వంతో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఇంతకాలం సంప్రదాయక పద్ధతిలో మాత్రమే డేటాను రికార్డ్చేసేవాళ్లు. ఇకపై తొలిసారిగా అత్యంత అధునాతన క్వాంటమ్ కంప్యూటర్స్ విధానంలో అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లలో ఈ డేటాను నమోదుచేసి విశ్లేషించనున్నారు. దీంతో సెకన్ కంటే కొన్ని కోట్ల రెట్లు తక్కువ కాలంలోనూ జరిగే మార్పులను నమోదు చేసి విశ్లేషించడం సాధ్యమవుతుంది. సంబంధిత పరిశోధన వివరాలు జనవరి 29వ తేదీన ప్రఖ్యాత సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్, ఫిజికల్ రివ్యూ రీసెర్చ్ జర్నల్లలో ప్రచురితమయ్యాయి. ‘‘సంప్రదాయక విధానాల్లో ప్రయోగాలు చేస్తే ఎప్పుడూ ఒక్కటే ఫలితం వస్తోంది. ఈసారి సంభావ్యత సిద్ధాంతాన్ని ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అల్గారిథమ్‌ను వాడి మరింత మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు ప్రయతి్నస్తున్నాం. రెండు విభిన్న రసాయన మిశ్రమాలను సిములేట్ చేసి వాటిల్లో సంభవించే టర్బులెన్స్‌లను నమోదుచేయదలిచాం. సాధారణ కంప్యూటర్స్‌లో 0, 1 అనే బిట్స్ మాత్రమే వాడతారు. క్వాంటమ్ కంప్యూటింగ్‌లో క్వాంటమ్ బిట్(క్వాబిట్స్) వాడతాం. దీంతో ఒకేసారి ఒకేసమయంలో వేర్వేరు చోట్ల జరిగే మార్పులను క్వాబిట్స్ నమోదుచేస్తాయి’’అని ఆక్స్‌ఫర్ట్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రవేత్త నిక్ గోరియనోవ్ చెప్పారు. కొత్త విధానంతో కంప్యూటేషన్ అత్యంత వేగవంతంగా జరుగుతుంది. ఇది మా పరిశోధనకు ఎంతో దోహదపడుతుంది’’అని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టోరల్ పరిశోధకుడు జేమ్స్ బీటెల్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మీ కాఫీ మరీ చేదుగా ఉందా? దీనికి కారణం తెలుసా? ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
ఉదయాన్నే కమ్మని ఫిల్టర్ కాఫీ తాగితే మనసంతా ఎంతో ఉల్లాసంగా ఉంటుంది మనలో చాలామందికి. ఘుమఘుమలాడే కాఫీ వాసన ముక్కు పుటాలకు తగలగానే అదొక మధురానుభూతి కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రతిరోజూ కాఫీ తాగుతున్నారు. అయితే మరికొంతమందికి అబ్బా..ఆ చేదు ఎలా తాగుతార్రా బాబూ! అనిపిస్తుంది కదా. అసలు కాఫీ ఎందుకు చేదుగా ఉంటుందో ఎపుడైనా ఆలోచించారా? కాఫీలోని కెఫిన్ ఉండటం వల్లే చేదుగా ఉంటుంది అనుకుంటున్నారా? కానీ కెఫిన్ లేని కాఫీ కూడా చేదుగా ఉంటుందట. అదేంటి అనుకుంటున్నారా? ఇదిగో ఈ వివరాలు మీకోసం.మ్యూనిచ్‌లోని టెక్నికల్ యూనివర్సిటీలోని లీబ్నిజ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫుడ్ సిస్టమ్స్ బయాలజీ పరిశోధకులు ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించారు. రోస్ట్ చేసిన అరబిక్ కాఫీలో చేదు సమ్మేళనాల కొత్త సమూహాన్ని గుర్తించారు. చేదును అవి ఎలా ప్రభావితం చేస్తాయో పరిశోధించారు. అలాగే ఈ వేయించే పదార్థాలు ఎంత చేదుగా ఉంటాయో నిర్ణయించడంలో వ్యక్తిగత జన్యు సిద్ధత కూడా పాత్ర పోషిస్తుందని వారు మొదటిసారి ప్రదర్శించారు. అరబికా బీన్స్‌లో ఉండే ‘మోజాంబియోసైడ్‘ అసలైన కారణమట. ఇది కెఫిన్ కంటే పది రెట్లు ఎక్కువ చేదుగా ఉంటుంది. మానవ శరీరంలో కనిపించే సుమారు 25 చేదు రుచి గ్రాహక రకాల్లో రెండు, అవి TAS2R43, TAS2R46 గ్రాహకాలు. వీటిని ఇది బాగా యాక్టివేట్ చేస్తుంది. ‘కోఫియా అరబికా’ మొక్కకు చెందిన గింజలను కూడా కాల్చి పొడి చేస్తారు. అయితే ఈ గింజలను రోస్ట్ చేసే ఉష్ణోగ్రత, సమయాన్ని బట్టి అవి ఏడు రకాలుగా మారతాయి. ఈ ఏడు దశల్లోని కాఫీ రుచి గ్రాహకాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా ఒక్కో దశలో ఒక్కో రుచి వస్తుందని పరిశోధకుడు లాంగ్ చెప్పారు. రుచి, దాని సున్నితత్వం అనేవి జన్యు సిద్ధతపై ఆధారపడి ఉంటుందని ఒక జన్యు పరీక్షలో వెల్లడైంది.చదవండి: హీరోయిన్ల బాటలో 32 ఏళ్ల వయసులో సీఈవో కరిష్మా కీలక నిర్ణయంమోజాంబియోసైడ్ పదార్థం ఉన్న కాఫీ గింజలతో తయారు చేసిన కాఫీ తాగిన పదకొండు మందిలో ఎనిమిది మందికి ఎక్కువ చేదుగా రుచిని గ్రహించడానికి మోజాంబియోసైడ్ దారితీసిందని ఒక పరీక్షలో తేలింది. వారిలో ఒక గ్రాహక జన్యువు లోపభూయిష్టంగా ఉండటమే అందుకు ప్రధాన కారణం. రెండు జన్యువులు చెక్కు చెదరకుండా ఉన్న ఇద్దరికి మాత్రం కాఫీ చేదుగా అనిపించలేదు. అయితే తమ కొత్త పరిశోధనలు కాఫీ రుచిని వేయించే ప్రక్రియ ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై మన అవగాహనను పెంచుతాయని మరింత సమన్వయంతో కూడిన కొత్త కాఫీ రకాల అభివృద్ధికి దోహదపడతాయని పరిశోధకులు తెలిపారు. చేదు పదార్థాలు ,వాటి గ్రాహకాలు శరీరంలోని ఇతర అంశాలను బట్టి ఉంటుందనీ, వీటిలో చాలా వరకు ఇప్పటికీ తెలియని పరిశోధకులు తెలిపింది. దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని లాంగ్ తెలిపారు. -
శతప్రయోగ విజయసీమ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని చేరుకుంది. బుధవారం ఉదయం జరిపిన నూరవ రాకెట్ ప్రయోగంతో చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్)లో రెండో లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి ఎగసిన భూ సమకాలిక ఉపగ్రహ ప్రయోగవాహక నౌక (జీఎస్ఎల్వీ–ఎఫ్15) ఎన్వీఎస్–02 ఉపగ్రహాన్ని విజయ వంతంగా నిర్ణీత కక్ష్య అయిన జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ – జీటీఓలోకి చేర్చింది. ఈ కొత్త ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం నిర్విఘ్నంగా సాగడం శాస్త్రవేత్తల్లో ఆనందం పెంచింది. రోదసిలో చేరిన ఈ తాజా శాటిలైట్‌తో మన ‘నావిక్’ (నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్)లో విధులు నిర్వహిస్తున్న ఉపగ్రహాల సంఖ్య 4 నుంచి 5కు పెరిగింది. దీని వల్ల మన దేశంతో పాటు మన పొరుగు దేశాలకూ మొబైల్ ఫోన్లలో జీపీఎస్ సహా అనేక సేవల్లో కచ్చితత్వం పెరగనుంది. ఇతర దేశాలన్నీ అమెరికా తాలూకు జీపీఎస్‌పై ఆధారపడితే, భారత్ ఉపగ్రహ ఆధారిత నావిగేషన్‌లో సొంత కాళ్ళపై నిలబడేందుకు చేస్తున్న ఈ కృషి సగటు భారతీయుడి ఛాతీ ఉప్పొంగే క్షణం. సైకిళ్ళు, ఎడ్లబండ్లపై రాకెట్ విడిభాగాలను తరలించిన కాలం నుంచి ఇటీవలే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానించే (డాకింగ్ చేసే) స్థాయికి ఇస్రో చేరడం చిరకాలం చెప్పుకోవా ల్సిన స్ఫూర్తిగాథ. విక్రమ్ సారాభాయ్, సతీశ్ ధవన్ లాంటి దిగ్గజాల తొలి అడుగులతో ఆరంభించి, ఆపైన కలామ్ లాంటి వారి మేధను వినియోగించుకొని అయిదు దశాబ్దాల పైగా సాగించిన ప్రస్థానం చిరస్మరణీయం. 1962లో అణుశక్తి విభాగం కింద ఏర్పాటైన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రిసెర్చ్ ద్వారా ఇస్రోకు బీజం పడింది. చంద్రుడి మీదకు అమెరికా మానవుణ్ణి పంపిన 1969లోనే ఇప్పుడు మనం చూస్తున్న ఇస్రో స్థాపన జరిగింది. 1972లో ప్రత్యేకంగా అంతరిక్ష శాఖ ఏర్పాటైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మన అంతరిక్ష పరిశోధనా సంస్థ అనేక రాకెట్లకు పురుడు పోయడమే కాక, ఇతర దేశాల ఉపగ్రహ ప్రయోగాలలోనూ విశ్వసనీయ భాగస్వామిగా ఎదిగింది. మన ఇస్రో 1979 ఆగస్ట్ 10న తొలిసారిగా ఉపగ్రహ ప్రయోగ నౌక (ఎస్ఎల్వీ–3 ఈ10) ద్వారా ప్రయోగాత్మకంగా రోహిణీ టెక్నాలజీ పేలోడ్‌ను నింగిలోకి పంపిన క్షణాలు ఆ తరంలో చాలామందికి ఇప్పటికీ గుర్తే. అప్పట్లో ఇస్రోతో పనిచేస్తున్న అబ్దుల్ కలామే ఆ ప్రయోగానికి డైరెక్టర్. సదరు ప్రయోగం పాక్షికంగానే విజయం సాధించింది కానీ, ఆ తర్వాత కాలగతిలో అంతరిక్ష ప్రయోగాల్లో మనం అగ్రరాజ్యాలకు దీటుగా ఆరితేరాం. అంకెల్లో చెప్పాలంటే, ఇప్పటి వరకు ఇస్రో 548 ఉప గ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దాదాపు 120 టన్నుల పేలోడ్‌ను నింగిలోకి పంపింది. అందులో 433 విదేశీ ఉపగ్రహాలకు చెందిన 23 టన్నులూ ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో షార్ కేంద్రం ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలకు వేదికైంది. మూడు చంద్రయాన్‌లు, ఒక మార్స్ ఆర్బిటర్ ప్రయోగం, ఆదిత్య ఎల్1 ప్రయోగం లాంటివి గణనీయమైనవి. కక్ష్యలో పరిభ్రమించే వ్యోమనౌకను భూవాతావరణంలోకి ప్రవేశింపజేసి... భూమి పైకి క్షేమంగా తెచ్చి రికవరీ చేసే ‘స్పేస్ క్యాప్సూల్ రికవరీ ప్రయోగం’ (ఎస్ఆర్ఈ), అలాగే ఒకే రాకెట్‌తో 104 శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం వగైరా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. ఇస్రో ప్రయోగించినవాటిల్లో కమ్యూనికేషన్ శాటిలైట్లు, భూ పరిశీలన ఉపగ్రహాలు, మార్గనిర్దేశక (నావిగేషనల్), ప్రయోగాత్మక శాటిలైట్లు అనేకం. ఆ వివరాలు సగర్వంగా తోస్తాయి. రానున్న రోజుల్లోనూ మరిన్ని చారిత్రక ఘట్టాలకు ఇస్రో చోదకశక్తి కానుంది. గగన్‌యాన్‌లో భాగంగా మానవరహిత జి1 ప్రయోగం తొలిసారి చేయనున్నారు. అలాగే, నెక్స్›్ట జనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్జీఎల్వీ), చంద్రయాన్, శుక్రయాన్ జరగనున్నాయి. ప్రైవేట్ ఉపగ్రహ ప్రయోగాలకు సైతం వేదికగా నిలిచి, అంతరిక్ష వాణిజ్యంలో తగిన వాటా కోసం ప్రయత్నిస్తున్న ఇస్రో మరో రెండేళ్ళలో శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్‌ను నిర్మించనుండడం విశేషం. అలాగే, తమిళనాడులోని కులశేఖరపట్నంలో రెండో ఉపగ్రహ ప్రయోగ కాంప్లెక్స్ సైతం సిద్ధమవుతోంది. భారీ పేలోడ్ లను రోదసిలోకి తీసుకెళ్ళగలిగే ఎన్జీఎల్వీల రూపకల్పనకూ, మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికీ దాదాపు రూ. 4 వేల కోట్లు ఖర్చవుతుంది. అంత మొత్తం వెచ్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం విశేషం. భారత అంతరిక్ష పరిశోధన, ప్రయోగ రంగానికి ఇది పెద్ద ఊతం. ఇవన్నీ ప్రైవేట్ రంగ రోదసీ ప్రయోగాల్లో ఇస్రో సింహభాగం దక్కించుకోవడానికి ఉపకరిస్తాయి. ఒకప్పుడు అగ్రరాజ్యాలు సాంకేతిక విజ్ఞానాన్ని అందించడానికి నిరాకరించినప్పుడు స్వశక్తితో దేశీయంగా బుడిబుడి అడుగులతో మొదలుపెట్టిన భారత్ దాదాపు అయిదు పదుల ఏళ్ళలో శత రోదసీ ప్రయోగాలు సాగించింది. రానున్న అయిదేళ్ళలోనే రెండో శతం పూర్తి చేసి, మొత్తం 200 ప్రయోగాల మైలురాయికి చేరుకోవడానికి ఉరకలు వేస్తోంది. ఇన్నేళ్ళుగా మన అంతరిక్ష పరిశోధ కులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చూపుతున్న అచంచలమైన నిబద్ధత, అంకితభావానికి మచ్చుతునక ఈ ఇస్రో విజయగీతిక. విశ్వవేదికపై అగ్రరాజ్యాల సరసన అంతరిక్షంలో భారత్ సూపర్ పవర్‌గా ఎదిగిందనడానికీ ఇది ప్రతీక. అనేక ఆర్థిక, సాంకేతిక పరిమితులు ఉన్నప్పటికీ సృజనాత్మకంగా ఆలోచించి, పరిస్థితులకు తగ్గట్లు మనల్ని మనం మలుచుకొంటే గణనీయ విజయాలు సాధ్యమే అనడానికి ఇదే తిరుగులేని రుజువు. 1975లో తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం నుంచి ఆ మధ్య మంగళ్యాన్ వరకు ప్రతిసారీ తక్కువ ఖర్చుతో, అంచనాలకు అందని విజయాలు సాధించిన మన శాస్త్రవేత్తల ఘనతకు భవిష్యత్తులోనూ ఆకాశమే హద్దు. -
ఇంగితం సంగతేంటి?
ఇంగితజ్ఞానం ఇంగితజ్ఞానమే, చదువులు చదువులే! చదువు పరమావధి జ్ఞానమే అయినా, చదువుకున్న వారందరూ జ్ఞానులు కాలేరు. అత్యంత దురదృష్టకరమైన విషయమేమిటంటే, చదువు కున్న వారిలో కొందరు కనీసం ఇంగితజ్ఞానులు కూడా కాలేరు. విపరీతంగా చదువుకుని, బహు పట్టభద్రులై, పాఠాలు బోధించే స్థాయిలో ఉన్నా, ఇలాంటివారు ఎప్పటికప్పుడు తమ ఇంగితజ్ఞాన రాహిత్యాన్ని బయటపెట్టుకుంటూ జనాలను విభ్రాంతికి గురిచేస్తుంటారు. ‘విద్యలేనివాడు వింత పశువు’ అంటూ నిరక్షరాస్యులను ఎద్దేవా చేసే పెద్దలు – అతి విద్యావంతులైన ఇంగితజ్ఞాన రహితులను ఏమంటారో!‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్/ బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/ పొదవెడు నుప్పు లేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!’ అని శతకకారుడు వాపోయాడు. రసజ్ఞత లేని చదువును ఉప్పులేని కూరతో పోల్చాడు. బహుశా, ఎంత చదువు చదువుకున్నా, కాస్తంతైనా ఇంగితజ్ఞానం లేనివారు ఆయనకు తారసపడి ఉండరు. అలాంటి అతి చదువరులే తారసడితే ఆయన ఇంకెంతలా వాపోయేవాడో! ఈ రోజుల్లో చదువుకున్న వాళ్లలో రసజ్ఞత సంగతి దేవుడెరుగు, ఇంగితజ్ఞానం కూడా కొరవడు తోందంటే, మన చదువులు ఎలా అఘోరిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అసలు మన చదువులు ఇలా ఎందుకు అఘోరిస్తున్నాయో, అందుకు గల కారణాలను అన్వేషించే వాళ్లు బహు అరుదు. ‘చాలామందికి, పిల్లల్ని చదువంటే బెదరగొట్టడం చాతనయినంత బాగా వాళ్లకి చదువు మీద ఇష్టం కలిగించడం చాతకాదు’ అంటారు కొడవటిగంటి కుటుంబరావు. ‘చదువు’ నవలలో ఆయన వెలి బుచ్చిన అభిప్రాయం ఇది. బెదరగొట్టి మరీ పిల్లలకు చదువు చెప్పే బడిపంతుళ్ల ధోరణి కూడా చదువుకున్న వాళ్లలో ఇంగితజ్ఞాన లోపానికి ఒక కీలక కారణం. బెదరగొట్టి పిల్లలకు చదువు చెప్పే దండోపాయ నిపుణులు పురాణకాలం నుంచే ఉన్నారు. ప్రహ్లాదుడికి చదువు చెప్పిన చండా మార్కుల వారసత్వాన్ని కొందరు నేటికీ కొనసాగిస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో చండా మార్కుల వారసులకే గిరాకీ ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి గురువులు పిల్లల బుర్రల్లోకి పాఠాల నైతే ఎక్కించగలరేమో గాని, చిటికెడు ఇంగితజ్ఞానాన్ని మాత్రం అలవరచలేరు. ‘ఇంగితజ్ఞానం మరీ అంత సర్వసాధారణమైనది కాదు’ అంటాడు ఫ్రెంచ్ తత్త్వవేత్త వోల్టేర్. ఇంగితజ్ఞానాన్ని ఇంగ్లిష్‌లో ‘కామన్సెన్స్’ అంటారు. అలాగని, ఇది మనుషులందరికీ ఉండే లక్షణ మని అనుకుంటే పొరపాటే! ‘మనుషులందరిలోనూ ఇంగితజ్ఞానం ఉందనే నమ్మకంతో కొన్నిసార్లు మనం ప్రమాదంలో పడుతుంటాం’ అన్నాడు ఐరిష్ సంగీతకారుడు హోజీర్.ఒకప్పుడు సమాజంలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు అక్షరాస్యులు బాగా పెరిగారు. అక్షరాస్యత పెరిగితే, జనాల్లో బుద్ధి జ్ఞానాలు, తెలివితేటలు పెరగడం సర్వసహజ పరిణా మమనేది ఒక అమాయకపు అంచనా. సమాజంలో అక్షరాస్యత పెరిగింది, నిజమే! తత్ఫలితంగా మూర్ఖత్వం తగ్గిందనుకుంటే పారపాటే! ‘చదవేస్తే ఉన్న మతి పోయింద’నే నానుడి ఉంది. ఇప్పటి చదువులను చూస్తే, పరిస్థితి అలాగే ఉందనిపిస్తుంది. ఈ చదువులతో కొందరిలో ఇంగితజ్ఞానం లోపిస్తుంటే, ఇంకొందరిలో చావుతెలివి పెచ్చుమీరుతోంది. బొటాబొటి చదువుల సైబర్ నేరగాళ్ల చేతిలో ఉన్నత విద్యావంతులు సైతం బోల్తాపడుతున్న ఉదంతాలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒకవైపు శాస్త్రవేత్తలు కృత్రిమ మేధతో కుస్తీలు పడుతున్న రోజులు వచ్చిపడ్డాయి గాని, మనుషుల్లో ఇంగితాన్ని పెంచే చదువులే కరవవుతున్నాయి. ‘నడవడికను చక్కబరచడానికి ఉత్త పాఠ్య పుస్తకాల చదువు చాలదు’ అని గాంధీజీ చెప్పిన మాటలను నేటి కార్పొరేట్ విద్యావ్యవస్థ పట్టించు కుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. గాంధీజీ ‘హింద్ స్వరాజ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘పాఠ్యపుస్తకాల విద్య మానవుల నైతికోన్నతికి ఇంచుకైనా సహకరించదని; చదువు వేరు, సద్గుణం వేరని స్వానుభవంతో తెలుసుకున్నాను’ అన్నారు. ఆయన దేశానికి స్వాతంత్య్రం రాకముందు చెప్పిన మాటలివి. ఇప్పటికీ మన చదువులు పూర్తిస్థాయిలో చక్కబడకపోవడం విచారకరం.చదువులు చెప్పడానికి ఎన్నో బడులు ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయి, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రత్యేక నైపుణ్యాలకు సంబంధించిన ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఉన్నాయి. పుట్టల నుంచి చీమలు పుట్టుకొచ్చినట్లు వీటి నుంచి ఏటా పట్టభద్రులు పుట్టుకొస్తున్నారు. వాళ్లలో చాలామంది సమాజంలో మేధావులుగా చలామణీ అవుతున్నారు. అంతమాత్రాన, వాళ్లంతా ఇంగితజ్ఞాన సంపన్నులనుకోవడానికి ఆస్కారం లేదు. ‘మీ డిగ్రీ ఒక కాగితం ముక్క మాత్రమే. మీ చదువేమిటో మీ ప్రవర్తనలోను, ఆలోచనా ధోరణిలోను, సౌశీల్యంలోను ప్రతిఫలిస్తుంది’ అన్నాడు అమెరికా మూడో అధ్యక్షుడు థామస్ జెఫర్సన్. ప్రవర్తనను, ఆలోచనా ధోరణిని మార్చలేని డిగ్రీలు ఉత్త కాగితం ముక్కలు మాత్రమే! ‘కొన్ని ఆలోచనలు చాలా మూర్ఖంగా ఉంటాయి. వాటిని మేధా వులు మాత్రమే నమ్ముతారు’ అని ఇంగ్లిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ అన్నాడు. గోమూత్రపానంతో జ్వరాలు తగ్గుతాయని ఇటీవల ఐఐటీ–మద్రాసు డైరెక్టర్ మహాశయుడు సెలవిచ్చారు. ఆయనను బహుశా మేధావులే నమ్ముతారు కాబోలు! -
ఆల్చిప్పలే దివ్యౌషధాలు!
సాక్షి, హైదరాబాద్: వివిధ అనారోగ్యాలను తగ్గించడంలో యాంటీబయోటిక్ మందులు కీలకపాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే యాంటీబయోటిక్‌లకు సైతం చావని కొన్ని సూక్ష్మక్రిములను అంతం చేయగల శక్తి ఓ సముద్రజీవికి ఉందని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఆల్చిప్పల (oyster) రక్తంలోని యాంటీమైక్రోబియల్ ప్రొటీన్లు, పెప్టిన్లు సూపర్ బగ్స్‌ను (Super Bugs) సమర్థంగా చంపగలవని తేల్చారు. ‘ప్లోస్ వన్’లో ప్రచురితమైన తాజా పరిశోధనల ప్రకారం ఆల్చిప్పల్లోని హీమోలింఫ్ (ఆల్చిప్పల రక్తంగా దీన్ని చెప్పొచ్చు)లో సూక్ష్మక్రిములను చంపే మాంసకృత్తులు ఉన్నాయి. అనేక ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్న సూక్ష్మక్రిములను సమర్థంగా అరికట్టే శక్తి హీమోలింఫ్ ప్రొటీన్లకు ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నేపథ్యంలో మొండి బ్యాక్టీరియా జాతుల (సూపర్ బగ్స్) పీచమణిచేలా యాంటీబయాటిక్స్ ఔషధాలను శక్తివంతం చేయడంలో ఆల్చిప్పల ప్రొటీన్లు ఉపయోగపడతాయని అంటున్నారు.ఏమిటీ సూపర్ బగ్స్?స్ట్రెప్టోకాక్కస్ న్యూమోనియే అనే సూక్ష్మక్రిమి వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఐదేళ్లలోపు పిల్లల మరణాలకు ఇదే ముఖ్యకారణం. వృద్ధులు తరచూ ఆసుపత్రులపాలవ్వడానికి కారణం కూడా ఇదే. టాన్సిలైటిస్ లాంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ సాధారణంగా చాలా మంది చిన్నారుల్లో కనిపిస్తుంటుంది. స్ట్రెప్టోకాక్కస్ ప్యోజెనెస్ సూక్ష్మక్రిమి చర్మంపై, గొంతులో ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. ఇది నొప్పులతో రుమాటిక్ జ్వరం, రుమాటిక్ గుండె జబ్బుకు కూడా దారితీయొచ్చు. ఇటువంటి ఇన్ఫెక్షన్లకు యాంటీబయోటిక్స్ మందులు తరచూ వాడాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే సూక్ష్మక్రిములు ఈ మందులకు నిరోధకత పెంచుకొని డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాగా మారుతాయి. ఈ సూపర్ బగ్స్ కారణంగా వ్యాధులకు చికిత్స చేయడం కష్టతరంగా మారుతోంది.బయోఫిల్మ్‌ల రక్షణ వలయంలో..సూపర్ బగ్స్ తమ చుట్టూతా బయోఫిల్మ్‌లు (Bio Film) అనే రక్షణ కవచాలను రూపొందించుకొని యాంటీబయాటిక్ ఔషధాల నుంచి రక్షించుకుంటూ ఉంటాయి. ఇన్ఫెక్షన్లను కలిగించే అన్ని రకాల బ్యాక్టీరియాలు బయోఫిల్మ్‌ల రక్షణలోనే ఉంటాయి. ఈ రక్షణ వలయాన్ని ఛేదించగలగటంపైనే యాంటీబయోటిక్‌ల విజయం ఆధారపడి ఉంటుంది. 32 రెట్లు మెరుగుపడ్డ ఫలితాలు ఇప్పటికే వాడుకలో ఉన్న యాంటీబయోటిక్స్‌కు ఆస్ట్రేలియా రాతి ఆల్చిప్పల ప్రొటీన్లను జోడించగా వాటి ప్రభావశీలత 3 నుంచి 32 రెట్లు మెరుగైనట్లు ప్రయోగాల్లో తేలిందని పరిశోధకులు ప్రకటించారు. చర్మవ్యాధులు, రక్త సంబంధిత ఇన్ఫెక్షన్లు, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి సమస్యలు కలిగించే డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాలను ఆల్చిప్పల రక్తంలోని ప్రొటీన్లు సమర్థంగా అరికట్టాయని పరిశోధకులు వివరించారు. మనుషుల కణాలపై ఎటువంటి విషపూరిత ప్రభావం లేదని స్పష్టం చేశారు. అయితే సూపర్ బగ్స్‌ను అరికట్టే ఆల్చిప్పల ప్రొటీన్లపై జంతువులు, మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ఇంకా జరగాల్సి ఉంది. సిడ్నీ రాతి ఆల్చిప్పల్లో ఔషధ గుణాలు.. సముద్ర జలాల వల్ల కలిగే ఎన్నో ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించుకోవడానికి అవసరమైన యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రొటీన్లు, పెప్టయిడ్లను ఆల్చిప్పలు తమ రక్తంలో ఉత్పత్తి చేసుకుంటున్నట్లు దశాబ్దాల క్రితమే శాస్త్రవేత్తలు గుర్తించారు. శ్వాసకోశ, ఇన్ఫ్లమేషన్ సమస్యలకు చైనా, ఆస్ట్రేలియా సంప్రదాయ వైద్యులు ఆల్చిప్పల ఔషధాలను అనాదిగా వాడుతున్నారు. చదవండి: నెలలో 1,000 విస్ఫోటాలుఈ దిశగా పరిశోధించిన శాస్త్రవేత్తలు.. సిడ్నీ రాక్ ఆయిస్టర్ల రక్తంలోని ప్రొటీన్లు, పెప్టయిడ్లలో స్ట్రెప్టోకాకస్ ఎస్పీపీ జాతి బ్యాక్టీరియాను చంపే ఔషధగుణాలు ఉన్నట్లు గుర్తించారు. సూక్ష్మక్రిముల చుట్టూ ఉండే రక్షణ కవచాన్ని ఛేదించటమే కాకుండా అది ఏర్పడకుండా చూసే శక్తి కూడా ఈ ప్రొటీన్లు, పెప్టయిడ్లకు ఉందని తేల్చారు. -
మన జీనోమ్ డేటా రెడీ
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు వైద్యుడి వద్దకు వెళ్తే మణికట్టు పట్టుకొని నాడీ కొట్టుకునే తీరును చూసి మన శరీరంలో అనారోగ్య సమస్య ఏమిటో చెప్పేవారు. ఇప్పుడు కాలం మారింది. కొత్త వ్యాధులు మనుషులపై దండెత్తుతున్నాయి. వాటికి విరుగుడుగా కొత్త మందులనూ శాస్త్రవేత్తలు కనిపెడుతూనే ఉన్నారు. మనకు భవిష్యత్తులో రాబోయే వ్యాధులేమిటో కూడా ముందుగానే చెప్పేసే టెక్నాలజీ వచ్చింది. అందుకు పునాది జీనోమ్ సీక్వెన్స్. జన్యు క్రమాన్ని విశ్లేషించటం ద్వారా మని షిలో రాబోయే దీర్ఘకాలిక అనారోగ్యాల గురించి తెలుసుకోవచ్చు. అందుకే జన్యు క్రమ విశ్లేషణ ప్రపంచవ్యాప్తంగా ప్రాధా న్యత పెరిగింది. అనేక దేశాలు తమ పౌరుల జన్యుక్రమాలను విశ్లేషించి డేటాను భద్రపరుస్తున్నాయి. అదే కోవలో భారత ప్రభుత్వం కూడా మనదేశంలోని జనాభా సమూహాల (పాపులేషన్ గ్రూప్స్) జన్యు క్రమాలను విశ్లేషించేందుకు ‘జీనోమ్ ఇండియా’ ప్రాజెక్టును చేపట్టింది. మొదటి దశలో భాగంగా 83 జనాభా సమూహాల జన్యువుల వివరాలు సేకరించి, ఆ డేటా ను హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఉన్న ‘ఇండియన్ బయలాజికల్ డేటా సెంటర్’లో భద్రపరిచారు. మనదేశంలో దాదాపు 4,600 జనాభా సమూహాలున్నాయి. వీటిల్లో 83 అంటే 2% గ్రూపుల జన్యు వివరాల సేకరణ పూర్తయింది. ఈ డేటాను భారతీయ శాస్త్రవేత్తలతోపాటు ప్రపంచంలో ఏ పరిశోధకులైనా తమ పరిశోధన కోసం వాడుకొనేందుకు అందుబాటులో ఉంచారు. వ్యాధుల చికిత్సలో భారతీయులకు సరిపడే మందుల తయారీకి, కొత్త చికిత్సల రూపకల్పనకు ఈ డేటాబేస్ ఉపయోగపడుతుంది.భిన్నమైన జన్యు వేరియెంట్లుకేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ పరిధిలోని బయోటెక్నాలజీ విభాగం మద్దతుతో చేపట్టిన జీనోమ్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా పరిశోధకులు 10 వేల మానవ జన్యువులను క్రోడీకరించారు. వీటిలో 2.7 కోట్ల అత్యంత అరుదైన వేరియెంట్స్‌ను గుర్తించి వివరాలు రికార్డు చేశారు. పైగా వాటిల్లోనూ 70 లక్షల వేరియెంట్స్ వివరాలు ప్రపంచంలో మరెక్కడా లేనివి. తాజా డేటాను విశ్లేషించి జన్యుపరంగా భారతీయులకే ప్రత్యేకంగా ఉన్న కొన్ని మొండి వ్యాధుల మూలాలను తెలుసుకోవచ్చు. అలాగే జన్యు ప్రత్యేకతల కారణంగా ఒక్కొక్కరిలో ఒక్కోలా వ్యక్తమయ్యే వ్యాధులకు చికిత్స కోసం ప్రత్యేక వ్యక్తిగత మందులను తయారుచేయవచ్చు. ‘ఈ జ్ఞానసంపద కేవలం వైజ్ఞానిక పరిశోధనలకే కాకుండా, ఇతరత్రా రంగాల్లో అత్యున్నత పరిశోధనలకూ, ప్రజలందరి ఆరోగ్య సంరక్షణకూ ఉపయోగపడుతుంది’ అని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్రసింగ్ పేర్కొన్నారు. నంబరింగ్‌తో రికార్డుమనదేశంలో భిన్న జాతులు, వర్గాలు, కులాల జనాభా జీవిస్తున్నారు. ఇది చాలా సున్నితమైన సామాజిక నిర్మాణం. అందుకే ఈ ప్రాజెక్టులో డేటాను జాతులు, కులాల పేర్లతో కాకుండా కొన్ని సాంకేతిక పదజాలాలు, అంకెలతో సూచించేలా ఏర్పాట్లు చేశారు. విస్తారంగా ఉన్న జనాభాలో ఇప్పటికి ఈ డేటాబేస్ కొద్ది గ్రూపుల తాలూకు వివరాలకే పరిమితమైనప్పటికీ, భవిష్యత్తులో సేకరించాల్సిన అనేక గ్రూపుల వివరాలకోసం ఓ ముందడుగు పడినట్లు అయ్యిందని నిపుణులు అంటున్నారు. దీన్ని జీనోమ్ డేటాబేస్ సేకరణలో మొదటి దశగా చెప్పవచ్చని, తర్వాత దేశం రెండో దశలో అడుగుపెట్టినట్లుగా భావించాలని పేర్కొంటున్నారు. గ్లోబల్ జీనోమ్ డేటాబేస్‌లో భారతీయుల వివరాలు అరకొరగానే ఉండటంతోకొత్తగా సేకరించిన ఈ వివరాలు మనకు చాలా కీలకంగా మారనున్నాయి. అందరూ వాడుకోవచ్చు జీనోమ్ ఇండియా ప్రాజెక్టు ‘డేటాబేస్’ను అందరికీ అందుబాటులో ఉంచారు. దీనిని ఉపయోగించుకోవాలని భావించే శాస్త్రవేత్తలు తమ పరిశోధన వివరాలను తెలుపుతూ ప్రతిపాదనలను పంపించాల్సి ఉంటుంది. ఆ దర ఖాస్తులను పరిశీలించేందు కు ఒక నిపుణుల పానెల్‌ను ఏర్పాటుచేశారు. ఆ ప్యానెల్ దరఖాస్తులను పరిశీలించి డేటాను వాడుకొనేందుకు అనుమతి ఇస్తుంది.ఇది మన బయోటెక్ సంపద.. జీనోమ్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా సేకరించిన డేటా మన బయోటెక్ సంపద. ఇలాంటి డేటాబేస్ ఏర్పాటు చేసుకోవడం ఓ చారిత్రక పరిణామం. బయోటెక్నాలజీ ఆధారంగా రూపొందించే అనేక నూతన సాంకేతిక ఉపకరణాల తయారీకి, ఉత్పత్తులకు ఇది తోడ్పడుతుంది. – నరేంద్రమోదీ, ప్రధానమంత్రి.సుదీర్ఘ ప్రక్రియ..‘జీనోమ్ ఇండియా’ ప్రాజెక్టుకు అవసరమైన వనరులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చింది. ఈ ప్రాజెక్టు మొదటి దశను 2020లో ప్రారంభించారు. మొదటి దశ పూర్తి కావడంతో, ఇక ప్రాజెక్టు రెండో దశను మొదలుపెట్టాల్సి ఉంది. మొదటి దశలో పది వేల మంది వివరాలు సేకరించారు. రెండో దశలో పది లక్షల మంది జన్యువులను సేకరిస్తారు. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం వ్యాధులకు మెరుగైన ఔషధాలు తయారుచేయటమేనని అధికారులు తెలిపారు. రెండో దశ వివరాల సహాయంతో ప్రమాదకర క్యాన్సర్లకు చికిత్సలను కనిపెట్టడం, నాడీ సంబంధ వ్యాధులకు పరిష్కారాలు వెదకటం, అత్యంత అరుదుగా వచ్చే వ్యాధులకు చికిత్స వంటి అనేక అంశాలను చేపడుతారని సమాచారం. -
ఏఐ నామ సంవత్సరం
2024లో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కొన్ని ముందడుగులు వడివడిగా పడ్డాయి. కృత్రిమ మేధ, అంతరిక్ష పరిజ్ఞాన రంగాల్లో ప్రగతి మిగిలిన వాటికంటే ప్రస్ఫుటంగా కనిపించింది. అత్యాధునిక జనరేటివ్ ఏఐ టెక్నాలజీలు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలోకి కూడా చేరిపోయాయి. అంతరిక్ష ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించేలా స్పేస్ఎక్స్ సంస్థ నేల వాలుతున్న రాకెట్‌ను భారీ టవర్ సాయంతో ఒడిసిపట్టుకోవడం ఈ ఏడాది హైలైట్స్‌లో ఒకటి. ఇస్రో కూడా పునర్వినియోగ లాంచ్ వెహికల్ ‘పుష్పక్’ను పరీక్షించింది. ఇక, నికోబార్ ద్వీపంలో నివసిస్తున్నవారు లావోస్‌లోని వారికి జన్యుపరంగా దగ్గరి బంధువులని తేలడం 2024లో మరో విశేషం.గూగుల్ డీప్‌మైండ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో డెమిస్ హసాబిస్కు 2024 రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు దక్కడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.కృత్రిమ మేధను వేర్వేరు శాస్త్ర రంగాల్లో సమర్థంగా ఉపయోగించే అవకాశం ఉందనేందుకు ఈ అవార్డు ఒక గుర్తింపు అనుకోవాలి. హసాబిస్ కృత్రిమ మేధ మోడల్ ద్వారా కొత్త ప్రొటీన్లను సృష్టించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. కొత్త మందులు, టీకాల తయారీకి ఈ ఆవిష్కరణ దారులు తెరిచింది. స్మార్ట్ ఫోన్లే సూపర్ కంప్యూటర్లుభారత దేశంలోనూ ఏఐ టెక్నాలజీలు వేగం అందుకుంటు న్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏఐ కేంద్రంగా ఒక పథకాన్ని ఆవిష్కరించింది కూడా. బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ)కి చెందిన సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజినీరింగ్ సెప్టెంబరులో ఏఐ, కంప్యూటింగ్ రంగాలను తీవ్రంగా ప్రభావితం చేయగల గొప్ప ఆవిష్కరణ ఒకదాని గురించి ప్రకటించింది. ప్రస్తుతం మనం వాడుతున్న కంప్యూటర్లలో కేవలం రెండే ‘కండక్టన్స్ దశ’ల ద్వారా కంప్యూటింగ్, స్టోరేజీలు జరుగుతూంటే... ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు 16,500 కండక్టన్స్ దశల్లో కంప్యూటింగ్, స్టోరేజీ చేయగల సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశారు. అంటే, అత్యంత సంక్లిష్ట మైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వంటి ఏఐ టెక్నాలజీలను కూడా సూపర్ కంప్యూటర్లు లేకుండానే వాడుకునే అవకాశం వస్తుంది.స్మార్ట్‌ఫోన్ , ల్యాప్‌టాప్‌ల ద్వారానే భవిష్యత్తులో సూపర్ కంప్యూటర్ల స్థాయి లెక్కలు చేసేయవచ్చు. శ్రీతోష్ గోస్వామి నేతృత్వం లోని బృందం దీన్ని సుసాధ్యం చేసింది. న్యూరో మార్ఫిక్ కంప్యూటింగ్ అని పిలుస్తున్న ఈ ప్లాట్‌ఫామ్ మన మెదడు పనితీరును అనుకరిస్తుంది.ఏఐ వినియోగం వివిధ రంగాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నైతిక, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన కొన్ని అంశాలు తలెత్తుతున్నాయి. భారత్ ఈ అంశాల విషయంలో చిన్న ముందడుగు వేసింది. కొన్ని ఏఐ టెక్నాలజీల వాడకానికి ముందు కంపెనీలు ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని సూచించింది. తద్వారా డీప్‌ఫేక్‌లు వ్యాప్తి చెందకుండా, అల్గారిథమ్ ద్వారా వివక్ష జరక్కుండా జాగ్రత్త పడవచ్చునన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఈ చర్య సృజనాత్మకతను దెబ్బతీస్తుందన్న కంపెనీల అభ్యంతరంతో ప్రస్తుతానికి ఈ అంశాన్ని పక్కనపెట్టింది ప్రభుత్వం. ఇంకోవైపు యూరోపియన్ యూనియన్ ఏఐ విషయంలో ఆగస్టులోనే ఒక చట్టం చేసింది. ఏఐ సేవలందించే వారు హాని చేయకుండా కట్టడి చేయడం దీని ఉద్దేశం.పునర్వినియోగ రాకెట్అంతరిక్ష రంగం విషయానికి వస్తే భారత్ పునర్వినియోగ రాకెట్ విషయంలో కీలకమైన ప్రగతి సాధించింది. రెండు నెలల క్రితం స్పేస్ఎక్స్ సంస్థ 70 మీటర్ల పొడవైన రాకెట్ సాయంతో ‘తన స్టార్‌షిప్’ అంతరిక్ష నౌకను ప్రయోగించడం ఈ ఏడాది హైలైట్స్‌లో ఒకటి. సూపర్ వేగంతో నేల వాలుతున్న రాకెట్‌ను ‘మెకాజిల్లా’ పేరుతో నిర్మించిన భారీ టవర్ సాయంతో ఒడిసిపట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతరిక్ష నౌకలు, ఉపగ్రహాలను ప్రయోగించేందుకు రాకెట్లను మళ్లీ మళ్లీ వాడవచ్చు అన్నది స్టార్‌షిప్ ప్రయోగంతో రుజువైంది. భవిష్యత్తులో ఈ సూపర్హెవీ అంతరిక్ష రాకెట్... విమానం మాదిరి అరగంటలో పైకెగరి ఇంధనం నింపి తిరిగి వచ్చేలా చేయాలని స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ ప్రయ త్నిస్తున్నారు. భారతీయ అంతరిక్ష సంస్థ ఇస్రో కూడా పునర్వినియోగ లాంచ్ వెహికల్ ఒకదాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉంది. తన పుష్పక్ రెక్కల విమానం ద్వారా జూన్ నెలలో నిట్టనిలువుగా ల్యాండ్ అవడం పరీక్షించింది కూడా. గత ఏడాది అమృత్ కాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2035 నాటికల్లా భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటుందనీ, 2040 నాటికి జాబిల్లి పైకి వ్యోమగామిని పంపుతామనీ సంకల్పం చెప్పుకుంది. 2024లో ఆ దిశగా అధికారిక అనుమతులు జారీ అయ్యాయి. 2028 నాటికి అంతరిక్ష కేంద్రపు తొలి భాగాన్ని ప్రయో గించనున్నారు. 2035 నాటికి అంతరిక్ష కేంద్రం తుదిరూపు సంతరించుకుంటుంది. మానవ సహిత అంతరిక్ష యానం కూడా దీంతో సమాంతరంగా నడుస్తుంది. 2026 లోగా నాలుగు గగన్‌యాన్ ప్రయోగాలు జరగనున్నాయి. చైనాతో పోలిస్తే ఇంకా వెనుకే...శాస్త్ర రంగంలో భారత్ కొన్ని విజయాలు సాధించినప్పటికీ, చైనా కంటే వెనుకబడి ఉండటం కఠోర సత్యం. చంద్రుడిపై ప్రయోగాలను చైనా ఇప్పటికే ముమ్మరం చేసింది. జూన్ లో చంద్రుడిపై రాతి నమూ నాలను సేకరించే విషయంలో విజయం సాధించింది. జాబిల్లికి అటువైపున ల్యాండ్ అయిన ఛాంగ్–ఈ అంతరిక్ష నౌక రోబోటిక్ డ్రిల్ ద్వారా 1.9 కిలోల బరువైన రాతి నమూనాలు సేకరించింది. అసెండింగ్ మాడ్యూల్ ద్వారా పైకెగిరి ఆర్బిటర్‌తో అనుసంధానమైంది. భూమికి తిరిగి వచ్చింది. దాదాపు ఇలాంటి ప్రయోగాన్నే 2027లో నిర్వహించేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. ఏఐ, అంతరిక్ష రంగాల్లో మానవ ప్రగతి ఇలా ఉంటే... భారతీయ జన్యు వైవిధ్యతను అంచనా కట్టేందుకు జ్ఞానేశ్వర్ చౌబే (బనారస్ హిందూ యూనివర్సిటీ), హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) సీనియర్ శాస్త్రవేత్త కె.తంగరాజ్ జరిపిన అధ్యయనం ప్రకారం... ప్రస్తుతం నికోబార్ ద్వీపంలో నివసిస్తున్నవారు లావోస్ దేశంలోని మోన్ ఖ్మేర్ భాష మాట్లాడేవారికి జన్యుపరంగా దగ్గరి బంధువులని తేలింది. సుమారు ఐదు వేల ఏళ్ల క్రితం వీరు నికోబార్ ద్వీపానికి వచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అండమాన్ , ఓంగి జనాభా ఎప్పుడో 70 వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి వలసవచ్చిన వారని భారతీయ శాస్త్రవేత్తలు ఇప్పటికే రుజువు చేసిన సంగతి చెప్పుకోవాల్సిన అంశం. భారతీయుల మూలాలను నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం హరప్పా, మొహెంజొదారోల్లో లభ్యమైన ఎముకల అవశేషాల నుంచి డీఎన్ఏ వెలికి తీయాలని ఆంత్రోపాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాను కోరింది. సైన్స్ పరిశోధనలను మానవ కల్యాణం కోసం ఎలా ఉపయోగించవచ్చు అనేందుకు ఒక ఉదాహరణ ప్రవీణ్ వేముల ప్రయోగాలు అని చెప్పాలి. బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టెమ్‌సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ కు చెందిన ఈ శాస్త్రవేత్త రైతులను హాని కారక క్రిమి, కీటక నాశినుల నుంచి రక్షించేందుకు ఓ వినూత్నమైన పదార్థాన్ని సిద్ధం చేశారు. చర్మంపై పూసుకోగల ఈ పదార్థం కీటక నాశినుల్లోని ప్రమాదకరమైన రసాయనాల నుంచి రక్షణ కల్పిస్తుంది. రెయిన్ కోట్లా కుట్టుకోగల కీటకనాశిని నిరోధక వస్త్రాన్ని కూడా అభివృద్ధి చేశాడీ శాస్త్రవేత్త. ఈ వస్త్రానికి అంటుకుంటే చాలు,ఎలాంటి హానికారక రసాయనమైనా నిర్వీర్యమైపోతుంది. నవంబరు నెలలోనే ప్రవీణ్ వేముల ఈ ‘కిసాన్ కవచ్’ కోటును తన స్టార్టప్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేశారు. వచ్చే ఏడాది ఇలాంటి ప్రజోప యోగ ఆవిష్కరణలు మరిన్ని జరుగుతాయని ఆశిద్దాం.దినేశ్ సి.శర్మ వ్యాసకర్త జర్నలిస్ట్, సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మస్తిష్కం మనం అనుకున్నంత ఫాస్ట్ కాదు!
పంచేంద్రియాల నుంచి నిరంతరాయంగా వచ్చే సమాచారాన్ని రెప్పపాటు వ్యవధిలో ప్రాసెస్ చేసి అందుకు అనుగుణంగా మానవ మెదడు ఆయా అవయవాలకు ఆదేశాలుగా తిరిగి పంపిస్తుందని ఇన్నాళ్లూ చదువుకున్నాం. అయితే గత అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ శాస్త్రవేత్తలు కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. తనకు అందిన సమాచారాన్ని మెదడు ఎంతవేగంగా విశ్లేíÙస్తుందనే అంశంపై శాస్త్రవేత్తలు తొలిసారిగా దృష్టిసారించారు. ఈ పరిశోధనలో వెల్లడైన ఫలితాలు మెదడుపై ఇన్నాళ్లూ ఉన్న అభిప్రాయాలను మార్చుకునే పరిస్థితుల్ని కల్పిస్తున్నాయి.కళ్లు, చెవులు, చర్మం, ముక్కు ఇలా ఇంద్రియాలు, అవయవాల నుంచి ఒక్క సెకన్ కూడా ఆపకుండా వచ్చే సమాచారాన్ని మెదడు కేవలం సెకన్‌కు 10 బైట్ల వేగంతో మాత్రమే ప్రాసెస్ చేస్తోందని పరిశోధనలో పాల్గొన్న అధ్యయనకారులు తేల్చిచెప్పారు. కంప్యూటర్ పరిభాషలో సమాచారాన్ని ప్రాథమికంగా ఒక బైట్‌లో కొలుస్తారు. ఈ లెక్కన ఒక వై–ఫై కనెక్షన్ గుండా ఒక సెకన్లో 5 కోట్ల బైట్ల సమాచారం ప్రాసెస్ అవుతోంది. అలాంటిది చదవడం, రాయడం, వీడియో గేమ్ ఆడటం, రూబిక్ క్యూబ్ గళ్లను పరిష్కరించడం వంటి పనులు చేసేటపుడు మనిషి మెదడు కేవలం 10 బైట్ల వేగంతోనే సమాచారాన్ని ప్రాసెస్ చేయగల్గుతోంది. ఇది నిజంగా అత్యంత తక్కువ వేగం’’అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.కాలిఫోరి్నయా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని అధ్యయనకారుల పరిశోధన వివరాలు ‘న్యూరాన్’జర్నల్‌లో గతవారం ప్రచురితమయ్యాయి. ‘‘ప్రధాన అంగాల నుంచేకాకుండా అంతర్గతంగా కోటానుకోట్ల కణాల నుంచి నాడీ వ్యవస్థ ద్వారా కోట్లాదిగా పోటెత్తుతున్న సమాచారంలో కేవలం ఈ పదిని మాత్రం తీసుకుంటూ మన మెదడు తన చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచంపై ఒక అవగాహనకు వస్తోంది. ఆ అవగాహనతోనే నిర్ణయాలు తీసుకుంటోంది. ఇది నిజంగా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. అసలు మన మెదడు సెకన్‌కు కేవలం 10 బైట్ల స్థాయిలోనే పనిచేయడానికి కారణాలేంటో తెలియాల్సి ఉంది.వేగంగా ఆలోచించాల్సిన అవసరం లేదని ఒక నిర్ధారణకు వచి్చందా? లేదంటే ఇంతవరకు అతివేగంగా ప్రాసెస్ చేయాల్సిన అవసరమే రాలేదా? అనే కొత్త ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. మానవ పరిణామ క్రమంలో మనిషి అడవులను దాటి మైదాన ప్రాంతాలకు విస్తరించినా జంతువుల నుంచి రక్షణ, ఆహారాన్వేషణ, మైథునం వంటి బహుకొద్ది అంశాలకు మాత్రమే ఆదిమమానవుడు తన ఆలోచనలను పరిమితం చేశాడు. అలా ఎప్పుడూ స్వల్ప స్థాయిల్లో కొనసాగిన ఆలోచనల వేగం నేటి యుగంలోనూ పుంజుకోకపోయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.ఏకకాలంలో కేవలం కొన్ని ఆలోచనలు, సమాచారాన్ని మాత్రమే ఎందుకు ప్రాసెస్ చేయగల్గుతోంది? ఎక్కువ డేటాను ఎందుకు విశ్లేíÙంచలేకపోతోంది? సమాచార సముద్రంలోంచి కేవలం గుక్కెడు నీటినే ఎందుకు ఒడిసి పట్టుకోగల్గుతోంది? అనే విషయాలపై మరింత లోతైన అధ్యయనం చేపట్టాల్సి ఉంది. మానవ మెదడులో ఏకంగా 8,500 కోట్ల న్యూరాన్లు ఉన్నాయి. వీటిల్లో మూడింట ఒక వంతు మెదడు వల్కలంలోనే పోగుబడి ఉన్నాయి. అత్యున్నత స్థాయి ఆలోచనలు ఈ వల్కలంలోనే ఉద్భవిస్తాయి. ఇంతటి సామర్థ్యం ఉండి కూడా మెరుపువేగంతో దూసుకెళ్లాల్సిన మెదడు ఎందుకిలా మొండికేస్తుందో తెలియాల్సి ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మోడర్న్ ఆల్కెమీ.. లాబ్‌లో బంగారం
పసుపు రంగులో ధగధగలాడే బంగారం అంటే ప్రపంచవ్యాప్తంగా జనాల్లో అంతులేని మోజు. బంగారం అరుదుగా దొరుకుతుంది. బంగారు గనులు అతి పరిమితంగా ఉంటాయి. అందుకే బంగారానికి అంత విలువ. ఇబ్బడి ముబ్బడిగా దొరికే తక్కువ విలువ చేసే లోహాలతో బంగారం తయారీకి మధ్య యుగాల్లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. శతాబ్దాల ప్రయత్నాల తర్వాత శాస్త్రవేత్తలు లాబొరేటరీల్లో విజయవంతంగా బంగారాన్ని తయారు చేయగలిగారు. లాబొరేటరీల్లో బంగారాన్ని తయారు చేసే ప్రక్రియలనే ‘మోడర్న్ ఆల్కెమీ’గా అభివర్ణిస్తున్నారు. మోడర్న్ ఆల్కెమీ కథా కమామిషూ తెలుసుకుందాం.బంగారం విలువ ఎక్కువ కాబట్టి దానికి అంత గిరాకీ. పురాతన కాలంలో నగలకే కాదు, నాణేలకూ బంగారమే వినియోగించేవారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలకు కూడా బంగారమే కీలకం. అరుదుగా ఉండే గనులను అన్వేషించి, వాటిని తవ్వి, ముడి ఖనిజాన్ని శుద్ధి చేయాలంటే రకరకాల దశల్లో రకరకాలుగా మనుషులు శ్రమించాల్సి ఉంటుంది. అంత శ్రమ లేకుండా, తక్కువ విలువైన లోహాలతో బంగారం తయారీ చేస్తే బాగుంటుందనే ఆలోచన మనుషులకు పురాతన కాలం నుంచే ఉండేది. తక్కువ విలువైన లోహాలతో బంగారం తయారీ ఎలా చేయాలనే దానిపై నానా రకాల ప్రక్రియలను ఊహించారు. వాటిపై రకరకాలుగా ప్రయోగాలు చేశారు. క్రమంగా ఈ ప్రక్రియలకు సంబంధించిన ‘శాస్త్రం’ ఒకటి రూపుదిద్దుకుంది. మనవాళ్లు దీనిని ‘పరుసవేది’ అని, ‘రసవిద్య’ అని అన్నారు. పాశ్చాత్యులు ‘ఆల్కెమీ’ అన్నారు. ‘అల్–కిమియా’ అనే అరబిక్ పదం నుంచి ‘ఆల్కెమీ’ అనే మాట వచ్చింది. దాదాపు నాలుగువేల ఏళ్ల కిందట ఆల్కెమీ ఆసియా, యూరోప్, ఆఫ్రికా ఖండాల్లోని వివిధ రాజ్యాల్లో విస్తృత ప్రాచుర్యంలో ఉండేది. పురాతన గ్రీకు, రోమన్ రాజ్యాల కాలంలో పాశ్చాత్య ప్రపంచంలో విపరీతమైన వేలంవెర్రి ఉండేది. అప్పట్లో ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరం ఆల్కెమీ పరిశోధనలకు కేంద్రంగా ఉండేది. అదేకాలంలో, ప్రాచ్య ప్రపంచంలో భారత ఉపఖండం, చైనా ఆల్కెమీ ప్రయోగాలకు ఆలవాలంగా ఉండేవి. ఆనాటి కాలంలో వేర్వేరు దేశాల్లోని రసవేత్తలు సీసం వంటి తృణలోహాలతో బంగారం తయారు చేసే ప్రక్రియ సహా కృత్రిమ పద్ధతుల్లో విలువైన రత్నాలను తయారు చేయడం, నకిలీ బంగారం, నకిలీ వెండి వంటి లోహాలను తయారు చేయడం వంటి ప్రక్రియలను వివరిస్తూ గ్రంథాలు రాశారు. క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటికి రసవిద్య ఒక మార్మికశాస్త్రం స్థాయికి చేరుకుంది. ఆల్కెమీ పేరుతో ఆనాటి సమాజంలో రకరకాల మోసాలు కూడా జరిగేవి. ఈ పరిస్థితిని భరించలేక ఇంగ్లండ్‌లో కింగ్ హెన్రీ–ఐV ఆల్కెమీని నిషేధించాడు.అప్పట్లో దగ్గరగానే ఊహించారుమిగిలిన లోహాలతో పోల్చుకుంటే, పాదరసంతో బంగారం తయారీ కొంత సులువు. పాదరసం ఎక్కడ? బంగారం ఎక్కడ? ఈ రెండింటికీ పోలిక ఏమిటి? పాదరసంతో బంగారం తయారీ ఏమిటి? అని కొట్టి పారేయకండి. రసాయనిక శాస్త్రంతో కనీస పరిచయం ఉంటే, రెండింటికీ సంబంధం ఏమిటో సులువుగానే అర్థమవుతుంది. ఆవర్తన పట్టికలో పక్కపక్కనే ఉండే మూలకాలు బంగారం, పాదరసం. వీటిలో బంగారం పరమాణు సంఖ్య 79, పాదరసం పరమాణు సంఖ్య 80. సాంకేతికంగా అర్థం చేసుకోవాలంటే, పాదరసం పరమాణువులోని 80వ ప్రోటాన్‌ను తొలగించగలిగితే, అది బంగారం పరమాణువుగా మారుతుంది. ఆధునిక కాలంలో కృత్రిమంగా బంగారాన్ని తయారు చేయడానికి శాస్త్రవేత్తలు పాదరసాన్నే ఎంపిక చేసుకున్నారు. కొందరు శాస్త్రవేత్తలు 1941లో ప్రయోగాత్మకంగా పాదరసం పరమాణువుల్లోని 80వ ప్రోటాన్‌ను తొలగించి, బంగారాన్ని సృష్టించగలిగారు. దీనికోసం వారు కాంతివేగంతో న్యూట్రాన్ కిరణాలను పంపి, పాదరసం పరమాణువుల్లోని 80వ ప్రోటాన్‌ను తొలగించారు. ఈ ప్రక్రియను ‘న్యూట్రాన్ బాంబార్డ్మెంట్’ అంటారు. ఈ ప్రయోగంలో తయారైన బంగారం పరమాణువులు అణుధార్మికతతో ఉండటమే కాకుండా, బాహ్య వాతావరణానికి బహిర్గతమైనప్పుడు రసాయనిక చర్యలకు లోనై, నశించిపోయాయి. ప్రయోగశాలలో బంగారాన్ని సృష్టించే ప్రక్రియల్లో ఇది తొలి పాక్షిక విజయం. అంతకంటే ముందు పురాతన రసవేత్తలెవరూ తక్కువ విలువైన లోహాలతో బంగారాన్ని తయారు చేసిన దాఖలాల్లేవు.ఆవర్తన పట్టిక అంటే ఏమిటో తెలియని కాలంలో, మూలకాల పరమాణు సంఖ్యలపై ఏమాత్రం అవగాహన లేని కాలంలో మన భారతీయ రసవేత్తలు పాదరసం నుంచి బంగారాన్ని తయారు చేయడం సాధ్యమేనని ఊహించారు. క్రీస్తుశకం పదో శతాబ్దికి చెందిన బౌద్ధ గురువులు సిద్ధ నాగార్జునుడు, సిద్ధ నిత్యానందుడు పాదరసం నుంచి బంగారం తయారీ సాధ్యమేనని ప్రగాఢంగా విశ్వసించారు. నాగార్జునుడు తన ‘రసేంద్ర మంగళం’, నిత్యానందుడు తన ‘రసరత్నాకరం’ గ్రంథాల్లో పాదరసం నుంచి బంగారాన్ని తయారు చేయడం గురించి విపులంగా రాశారు. బంగారానికి, పాదరసానికి గల దగ్గరి సంబంధం వాళ్లకు ఎలా తెలిసిందనేది ఇప్పటికీ అంతుచిక్కని విషయమే! బంగారం బాదరబందీలుప్రయోగశాలల్లో బంగారాన్ని తయారు చేయడం సాధ్యమేనని ఇప్పటికే శాస్త్రవేత్తలు స్థూలంగా రుజువు చేయగలిగారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న పద్ధతుల్లో ప్రయోగశాలల్లో బంగారం తయారీ చాలా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో గనుల్లో దొరికే బంగారానికి ప్రత్యామ్నాయంగా ప్రయోగశాలల్లో తయారైన బంగారాన్ని పరిగణించడం సాధ్యమయ్యే పరిస్థితులు లేవు. ఇప్పటి పద్ధతుల్లో బంగారాన్ని ప్రయోగశాలల్లో భారీ స్థాయిలో తయారు చేయడం వీలయ్యే పరిస్థితులు కూడా లేవు. గనుల్లో దొరికే బంగారం కంటే చౌకగా ప్రయోగశాలల్లో బంగారాన్ని తయారు చేయగల పద్ధతులు అభివృద్ధి చెందితే తప్ప జనాలకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇప్పటి వరకు ఇన్ని ఫలితాలను సాధించిన శాస్త్రవేత్తలు కొన్నాళ్లకు ప్రయోగశాలల్లో తక్కువ ఖర్చుతోనే ఎక్కువ పరిమాణంలో బంగారాన్ని తయారు చేయగల పద్ధతులను రూపొందించ గలుగుతారనే ఆశాభావం కూడా ఉంది. ఒకవేళ శాస్త్రవేత్తలు ఆ ప్రయత్నాల్లో విజయం సాధించినా, ప్రయోగశాలల్లో తయారైన బంగారానికి మార్కెట్లో అంత త్వరగా ఆమోదం లభించకపోవచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి. సంప్రదాయ పద్ధతులకు అలవాటు పడిన జనాలు గనుల్లో దొరికిన బంగారానికే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో కృత్రిమ వజ్రాలను విజయవంతంగా తయారు చేస్తున్నారు. వీటిని ఆభరణాల్లో కూడా విరివిగా వాడుతున్నారు. గనుల్లో దొరికిన వజ్రాలతో పోల్చుకుంటే, కృత్రిమ వజ్రాలకు గిరాకీ తక్కువగా ఉంటోంది. ఆ అనుభవంతోనే ప్రయోగశాలల్లో తయారైన కృత్రిమ బంగారానికి కూడా ఆశించిన గిరాకీ ఉండకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. గనుల్లో దొరికే బంగారానికి, ప్రయోగశాలల్లో తయారు చేసిన కృత్రిమ బంగారానికి స్వచ్ఛతలో, నాణ్యతలో ఎలాంటి తేడా లేకపోయినా, కృత్రిమ బంగారానికి జనాదరణ ఏమేరకు ఉంటుందనేదే అనుమానం.కృత్రిమ బంగారంతో లాభాలుగనుల్లోంచి తవ్వి తీసిన బంగారంతో పోల్చుకుంటే, ప్రయోగశాలల్లో తయారు చేసిన కృత్రిమ బంగారంతో చాలా లాభాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గనుల్లోంచి తవ్వి తీసిన బంగారం కంటే చౌకగా ప్రయోగశాలల్లో బంగారాన్ని తయారు చేయగలిగితే, గనుల తవ్వకం వల్ల పర్యావరణానికి కలిగే చేటును పూర్తిగా అరికట్టవచ్చని చెబుతున్నారు. గనుల్లోంచి బంగారాన్ని తీయడం వల్ల అడవుల నాశనం విపరీతంగా జరుగుతోంది. ముడి ఖనిజం నుంచి బంగారాన్ని వేరు చేయడానికి సైనైడ్ వంటి అత్యంత ప్రమాదకరమైన విషపదార్థాలను ఉపయోగించాల్సి వస్తోంది. గనుల్లో కార్మికుల శ్రమదోపిడీ విపరీతంగా జరుగుతోంది. బంగారు గనుల్లో పనిచేసే కార్మికులు తరచుగా ప్రమాదాల బారినపడటం, ప్రమాదకర రసాయనాలతో పనిచేయడం వల్ల వ్యాధిగ్రస్థులు కావడం జరుగుతోంది. ప్రయోగశాలల్లో చౌకగా బంగారాన్ని తయారు చేయగలిగితే, గనుల్లోని బంగారానికి ప్రత్యామ్నాయంగా జనాలు కృత్రిమ బంగారాన్ని ఆమోదించగలిగితే, ఇప్పటి వరకు గనుల వల్ల జరుగుతున్న అన్ని అనర్థాలనూ అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.బిస్మత్ నుంచి బంగారంపాదరసం నుంచి బంగారాన్ని సృష్టించడం సాధ్యమైనా, ఆ ప్రయోగం పాక్షికంగా మాత్రమే విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు మరింత మెరుగైన ఫలితాలను సాధించే దిశగా ప్రయోగాలను ప్రారంభించారు. అమెరికన్ రసాయనిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత గ్లెన్ సీబోర్గ్ 1980లో బిస్మత్ నుంచి బంగారాన్ని విజయవంతంగా తయారు చేయగలిగాడు. బిస్మత్ పరమాణు సంఖ్య 83. బిస్మత్ పరమాణువుల్లోని అదనపు ప్రోటాన్లను ‘న్యూట్రాన్ బాంబార్డ్మెంట్’ కాకుండా వేరే ప్రక్రియలో విజయవంతంగా తొలగించగలిగాడు. పార్టికల్ యాక్సిలరేటర్ ద్వారా సీబోర్గ్ అదనపు ప్రోటాన్లను తొలగించి, బిస్మత్ను బంగారంగా మార్చగలిగాడు. ఈ ప్రయోగాన్ని సీబోర్గ్ తన బృందంతో కలసి లారెన్స్ బర్కిలీ నేషనల్ లాబొరేటరీలో విజయవంతంగా జరిపాడు. ఈ ప్రక్రియ బాగా ఖర్చుతో కూడుకున్నది కావడంతో దీనికి ఆదరణ లభించలేదు. ఈ పద్ధతిలో తయారు చేసిన బంగారం, గనుల్లోంచి తీసిన బంగారం కంటే ఎక్కువ ఖరీదు కావడంతో ప్రయోగం విజయవంతమైనా, జనాలకు ఉపయోగం లేకుండా పోయింది. పాదరసం నుంచి, బిస్మత్ నుంచి బంగారాన్ని తయారు చేసే ప్రక్రియల్లో మూలకాల పరమాణు నిర్మాణాన్ని మార్చడమే కీలకం. తక్కువ విలువ గల మూలకాల్లోని అదనపు ప్రోటాన్లను తొలగించడం ద్వారా వాటిని బంగారం పరమాణువులుగా మార్చడం సాధ్యమేనని శాస్త్రవేత్తలు రుజువు చేయగలిగారు.మరిన్ని పద్ధతుల్లోనూ ప్రయోగాలుప్రయోగశాలల్లో బంగారాన్ని తయారు చేయడం కోసం మరిన్ని పద్ధతుల్లోనూ శాస్త్రవేత్తలు ప్రయోగాలు సాగిస్తున్నారు. వీటిలో ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఎంచుకున్న పద్ధతులు:1 రసాయనిక పద్ధతి బంగారం రకరకాల భారలోహ సమ్మేళనాల ద్రావణం నుంచి బంగారు కణాలను వేరు చేసేందుకు శాస్త్రవేత్తలు లేజర్ పద్ధతిని కనుగొన్నారు. సమ్మేళనాల ద్రావణంలోకి శక్తిమంతమైన లేజర్ కాంతిని పంపడం ద్వారా బంగారు నానో కణాలను వేరు చేయగలిగారు. చాలా ఖర్చుతో కూడిన ఈ పద్ధతిలో చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే బంగారం తయారీ సాధ్యమవుతోంది. కాబట్టి బంగారం తయారీకి ఈ పద్ధతి వల్ల ఉపయోగం అంతంత మాత్రమే!2లేజర్ పద్ధతిబంగారం రకరకాల భారలోహ సమ్మేళనాల ద్రావణం నుంచి బంగారు కణాలను వేరు చేసేందుకు శాస్త్రవేత్తలు లేజర్ పద్ధతిని కనుగొన్నారు. సమ్మేళనాల ద్రావణంలోకి శక్తిమంతమైన లేజర్ కాంతిని పంపడం ద్వారా బంగారు నానో కణాలను వేరు చేయగలిగారు. చాలా ఖర్చుతో కూడిన ఈ పద్ధతిలో చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే బంగారం తయారీ సాధ్యమవుతోంది. కాబట్టి బంగారం తయారీకి ఈ పద్ధతి వల్ల ఉపయోగం అంతంత మాత్రమే!3 బ్యాక్టీరియా పద్ధతిబ్యాక్టీరియాకు, బంగారానికి సంబంధం ఏమిటని ఆశ్చర్యం కలుగుతోందా? కొన్ని రకాల బ్యాక్టీరియాలకు బంగారాన్ని తయారు చేసే శక్తి ఉంది. ‘క్యూప్రియావిడస్ మెటాలిడ్యూరన్స్’ వంటి కొన్ని రకాల బ్యాక్టీరియాలకు బంగారం కలిసిన వివిధ సమ్మేళనాల నుంచి బంగారం అయాన్లను గ్రహించి, వాటిని స్వచ్ఛమైన బంగారు కణాలుగా మార్చే సామర్థ్యం ఉంది. భారలోహ సమ్మేళనాల నుంచి బంగారాన్ని వేరు చేసేందుకు ఇలాంటి బ్యాక్టీరియాలు ఉపయోగపడతాయి. వీటివల్ల విషపూరితమైన భారలోహాల కాలుష్యం తగ్గి, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మిషిగన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన మైక్రోబయాలజిస్టులు కాజేమ్ కషేఫీ, ఆడమ్ బ్రౌన్ తొలిసారిగా భారలోహ సమ్మేళనాల నుంచి బంగారాన్ని వేరుచేయగల బ్యాక్టీరియాను గుర్తించారు. -
వైరస్ల పనిపట్టే కృత్రిమ ప్రోటీన్.. పరిశోధకుల కీలక విజయం
పరమాణువులపై పరిశోధన చేస్తున్న ఢిల్లీ జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయ పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు. ముందులకు లొంగకుండా వైరస్లు ‘వ్యాధి నిరోధకత’ను సంతరించుకుంటున్న పరిస్థితికి చెక్‌పెట్టే దిశగా పరిశోధకులు కీలక విజయం సాధించారు. రష్యన్ శాస్త్రవేత్తలతో కలిసి సంయుక్తంగా చేపట్టిన ఒక పరిశోధనలో జేఎన్‌యూ సైంటిస్టులు హెచ్ఎస్పీ70 అనే మానవ ప్రోటీన్‌ను కనుగొన్నారు. మానవల్లో కోవిడ్, మలేరియా వంటి వైరస్ కారక వ్యాధులు ప్రబలడంలో హెచ్ఎస్పీ70 కీలకపాత్ర పోషిస్తోందని గుర్తించారు. వ్యాధికారక వైరస్లు ఇబ్బడిముబ్బడిగా పెరగడానికి హెచ్ఎస్పీ70 ప్రోటీన్ పరోక్షంగా సాయపడుతుంది. వ్యాధికారక ప్రోటీన్ జాడ తెలియడంతో ఈ ప్రోటీన్ చర్య, అభివృద్ధిని కట్టడిచేసే మరో ప్రోటీన్‌ను శాస్త్రవేత్తలు విజయవంతంగా అభివృద్ధిచేశారు. జేఎన్‌యూలో స్పెషల్ సెంటర్ ఫర్ మాలిక్యులార్ మెడిసన్ విభాగ అధ్యయనకారులు ఈ కృత్రిమ ప్రోటీన్‌ను అభివృద్ధిచేశారు. ఇది హెచ్ఎస్పీ70 పనితీరును క్షీణింపజేస్తుంది. దాంతో అది వ్యాధికారక వైరస్‌లకు పూర్తిస్థాయిలో సాయపడటంతో విఫలమవుతుంది. దాంతో మానవశరీరంలో వ్యాధి విజృంభణ ఆగుతుంది. చికిత్సకు, మందులకు లొంగకుండా వైరస్ కనబరిచే ‘వ్యాధినిరోధకత’సామర్థ్యమూ తగ్గుతుంది. హీట్షాక్ ప్రోటీన్ హీట్షాక్ ప్రోటీన్‌కి పొట్టిరూపమే హెచ్ఎస్పీ. వ్యాధికారక వైరస్ ప్రబలినప్పుడు కణాల్లో అవి క్షణాల్లో రెండింతలు, మూడింతలు, ఇలా కోట్ల రెట్లు పెరిగేందుకు హెచ్ఎస్పీ ప్రోటీన్ సాయపడుతుంది. శరీరాన్ని వేడెక్కేలా చేసి వైరస్ల సంఖ్య పెరగడానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. వైరస్ తనలాంటి లక్షలాది వైరస్‌లను తయారుచేయడంలో, అచ్చం అలాగే ఉండటంలో, రెట్టింపు ప్రక్రియలో తప్పులు దొర్లకుండా హెచ్ఎస్పీ ప్రోటీన్ చూసుకుంటుంది. ఇంతటి కీలక ప్రోటీన్ జాడను కనిపెట్టి జేఎన్‌యూ పరిశోధకులు ఘన విజయం సాధించారు. ఈ పరిశోధనా వివరాలు ప్రఖ్యాత బయోలాజికల్ మైక్రోమాలిక్యూల్స్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కోవిడ్ కారక సార్స్ కోవ్–2 వైరస్‌లోని కొమ్ములతో, మానవ కణంలోని ఏస్2 గ్రాహకాలకు మధ్య హెచ్ఎస్పీ అనుసంధానకర్తలా వ్యవహరిస్తోందని పరిశోధనలో తేలింది. కణాల్లోకి వైరస్ చొరబడాలంటే ఏస్2 రిసెప్టార్లదే కీలక పాత్ర. హెచ్ఎస్పీను నిలువరించడం ద్వారా వైరస్ల సంఖ్య పెరగడాన్ని అడ్డుకోగలిగామని జేఎన్‌యూ ప్రొఫెసర్లు ఆనంద్ రంగనాథన్, శైలజా సింగ్ చెప్పారు.‘‘హెచ్ఎస్పీని అడ్డుకునేలా పీఈఎస్–సీఐ అనే కొత్త ప్రోటీన్‌ను అభివృద్ధిచేశాం. దీనిని సార్స్–కోవ్2 సోకిన కణాల్లోకి జొప్పించాం. దీంతో సార్స్–కోవ్2 కణాల రెట్టింపు ప్రక్రియ గణనీయస్థాయిలో మందగించింది. సాంప్రదాయక ఔషధాలు నేరుగా వైరస్‌లపై దాడిచేస్తాయి. కానీ వైరస్‌లకు ఆతిథ్యమిచ్చే కణాలను లక్ష్యంగా చేసుకోవడం వంటి కొత్తరకం విధానాల ద్వారా వ్యాధుల వ్యాప్తిని గణనీయంగా అడ్డుకోవచ్చు. కోవిడ్ సంక్షోభం ముగియడంతో జనం దాదాపు కరోనా గురించి మర్చిపోయారు. కానీ పరిశోధనా ప్రపంచం ఎప్పుడూ రాబోయే కొత్తరకం వైరస్ల గురించి అప్రమత్తంగానే ఉంటుంది’’అని పరిశోధకులు అన్నారు.చదవండి: నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్‌ని కరిగించే బెడ్‌టైమ్ 'టీ'..!ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని డాక్టర్ ప్రమోద్ గార్గ్, పీహెచ్డీ స్కాలర్ ప్రేరణ జోషి సైతం ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. హఠాత్తుగా పుట్టుకొచ్చి విజృంభించే కొత్త రకం వైరస్ల కట్టడికి ఈ విధానం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ప్రేరణజోషి అన్నారు. అంతర్జాతీయంగా ఆరోగ్య సంక్షోభం తలెత్తినప్పుడు శాస్త్రసాంకేతి రంగం ఏ స్థాయిలో నూతన చికిత్సా విధానాలు, ఆవిష్కరణలతో సంసిద్ధంగా ఉండాలనే అంశాన్ని తాజా పరిశోధన మరోసారి నిరూపిస్తోంది. -
చైనా చేతికి ‘పవర్ఫుల్ బీమ్’.. గురి తప్పేదే లే..
బీజింగ్: చైనా.. గత కొన్నేళ్లుగా అధునాతన టెక్నాలజీ అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించింది. తాజాగా డెత్ స్టార్ ఆఫ్ ది స్టార్ వార్స్ సినిమా స్ఫూర్తితో తాము అత్యంత ప్రమాదకరమైన ఆయుధాన్ని రూపొందించామని చైనా శాస్త్రవేత్తలు బాంబులాంటి వార్తను ప్రపంచంముందు ఉంచారు. చైనా దీనికి ‘బీమ్ వెపన్’ అనే పేరు పెట్టింది. స్టార్ వార్స్ సినిమా చూడని వారికి ‘బీమ్ వెపన్’ ఎటువంటిదో అర్థం కాదు. అందుకే ఆ వివరాలు మీకోసం..స్టార్ వార్స్ చిత్రంలో ఎనిమిది వేర్వేరు లేజర్ కిరణాల కలయికతో ఒక తీవ్రమైన కాంతిపుంజం ఏర్పడుతుంది. ఈ కాంతిపుంజాన్ని శత్రువుపై దాడి చేసేందుకు వినియోగిస్తారు. ఈ అత్యంత శక్తివంతమైన కాంతిపుంజం ఒక గ్రహాన్నే నాశనం చేయగలదు. ఇదొక లేజర్ వెపన్. సరిగ్గా ఇలాంటి పవర్ఫుల్ ఆయుధాన్నే చైనా తయారుచేసింది.బీమ్ వెపన్ అనేది లేజర్‌తో కూడిన అధునాతన సాంకేతిక ఆయుధం. ఇది విడుదల చేసే శక్తివంతమైన కాంతి పుంజం లక్ష్యాన్ని అత్యంత వేగంగా ధ్వంసం చేస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్ వ్యవస్థలను క్షణాల్లో నిర్వీర్యం చేస్తుంది. బీమ్ వెపన్ రూపకల్పన సులభమేమీ కాదు. లేజర్ కిరణాలను నియంత్రిస్తూ, వాటిని శత్రువు వైపు ఎక్కుపెట్టడం అంత తేలికైన ప్రక్రియ కాదని శాస్త్రవేత్తలు తెలిపారు.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం మైక్రోవేవ్ బీమ్ ఆయుధాన్ని వినియోగంచేందుకు ఏడు వాహనాలు అవసరమవుతాయి. బీమ్ ఆయుధం భారీ పరిమాణంలో ఉంటూ, అధిక స్థలాన్ని ఆక్రమించినప్పటికీ లక్ష్యాన్ని ఛేదించడంలో అత్యున్నత సామర్థ్యాన్ని చూపిస్తుంది. ఇప్పటివరకూ ఈ స్థాయిలో లక్ష్యాన్ని ఛేదించగల ఆయుధం అందుబాటులో లేదని చైనా మోడరన్ నావిగేషన్ జర్నల్ పేర్కొంది. బీమ్ వెపన్ అధిక ఖచ్చితత్వాన్ని సాధించేందుకు, దానికి మైక్రోవేవ్ ట్రాన్స్‌మిటింగ్ వాహనాలను కనెక్ట్ చేయడానికి ఆప్టికల్ ఫైబర్‌ను ఉపయోగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.బీమ్ తరహా ఆయుధాల అభివృద్ధిలో అనేక సాంకేతిక, ఆచరణాత్మక సవాళ్లు ఎదురవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే అధిక శక్తి వనరులు అవసరమన్నారు. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ చైనా ఈ తరహా ఆయుధాల తయారీలో పురోగతి సాధిస్తోంది. భవిష్యత్తులో బీమ్ ఆయుధాలను విస్తృతంగా ఉపయోగించే ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ యుద్ధాల సమయంలో ఈ తరహా సాంకేతికత కీలకంగా మారనుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌కు శాంతి పరిరక్షక దళం?.. ఏం జరగనుంది? -
అముర్ ఫాల్కన్ సూపర్ర్...బర్డ్..
సాక్షి, అమరావతి: అలుపెరుగని బాటసారిలా... వేలాది కిలోమీటర్లు ఎగురుతూ అత్యంత సుదీర్ఘ ప్రయాణాలు చేసే అముర్ ఫాల్కన్ వలస పక్షుల్లో ఓ పక్షి తాజా పయనం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. భారత్ నుంచి బయలుదేరిన అముర్ ఫాల్కన్ 5 రోజుల 17 గంటల్లో సోమాలియా చేరుకుని, అక్కడ నుంచి కెన్యాలోకి ప్రవేశించింది. మధ్యలో ఎక్కడా ఆగకుండా పలు దేశాలతో పాటు, ఏకంగా అరేబియా సముద్రాన్ని కూడా దాటుకుని తన గమ్యస్థానం చేరుకుంది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు, స్థానిక వలంటీర్లు సైబీరియా నుంచి వచి్చన రెండు పక్షులను మణిపూర్‌లో పట్టుకుని వాటికి స్థానిక గ్రామాలైన చిలువాన్, గ్యాంగ్‌రామ్ పేర్లు పెట్టారు. ఈనెల 8వ తేదీన చిలువాన్–2 పక్షికి శాటిలైట్ రేడియో ట్యాగ్ అమర్చారు. మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉన్న గుహగర్ నుంచి 10వ తేదీన నాన్‌స్టాప్ జర్నీ మొదలుపెట్టిన చిలువాన్–2, 15వ తేదీ నాటికి సోమాలియాలోని మొదటి గమ్యానికి చేరుకున్నట్లు రేడియో ట్యాగ్ ద్వారా పక్షి గమనాన్ని పర్యవేక్షించిన సైంటిస్టు సురేశ్ కుమార్ తెలిపారు. అయితే గ్వాంగ్రామ్ పేరు పెట్టిన మరో పక్షి మాత్రం తమెంగ్‌లాంగ్‌లోని చిలువాన్ రూస్టింగ్ సైట్లోనే ఉన్నట్లు గుర్తించారు. చిలువాన్–2 గ్రేట్ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలోని స్కోటోరా ద్వీపం సమీపంలోని ఓ విమాన మార్గంలో ఉందని తెలిపారు. లక్షల సంఖ్యలో పక్షులు ‘ఆర్కిటిక్ టర్న్’ అనే పక్షి తర్వాత అత్యంత సుదీర్ఘ ప్రయాణాలు చేసే పక్షులుగా అముర్ ఫాల్కన్కు పేరుంది. 2018 నుంచి మణిపూర్‌లో ఈ పక్షుల వలస ప్రయాణాలు, మార్గాలను తెలుసుకునేందుకు రేడియో ట్యాగింగ్ చేసి అధ్యయనం చేస్తున్నారు. రేడియో ట్యాగ్లు అమర్చిన అన్ని పక్షులు గమ్యాలను చేరుకోలేకపోవడంతో వాటి గురించి పూర్తి వివరాలు తెలియలేదు. లక్షల సంఖ్యలో వెళ్లే పక్షుల్లో కేవలం రెండు, మూడు పక్షులకు మాత్రమే రేడియో ట్యాగ్లు అమర్చడం వల్ల వాటికి ఏమైనా హాని జరిగితే వాటి వలసల గురించి పూర్తి వివరాలు తెలుసుకోలేకపోతున్నారు. 2019లో ఒక అముర్ ఫాల్కన్ పక్షి సుదీర్ఘంగా ప్రయాణించి 26 వేల కిలోమీటర్లు వెళ్లడాన్ని గుర్తించారు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా మళ్లీ చిలువాన్–2 ద్వారా కొన్ని వివరాలు సేకరించగలిగారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే పక్షుల వలస మార్గాన్ని అధ్యయనం చేయడం ఈ పరిశోధన లక్ష్యమని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) సైంటిస్టు సురేశ్‌కుమార్ తెలిపారు. వాతావరణంలో జరిగే మార్పులను తెలుసుకోవడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ పక్షులు పొలంలోని పురుగులు, క్రిములు, కీటకాలను తినడం ద్వారా రైతులకు ఎంతో మేలు చేస్తాయని, అవి రాకపోతే పంట దిగుబడులు కూడా అనూహ్యంగా తగ్గిపోయే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు.సైబీరియా టు ఆఫ్రికా... వయా ఇండియా ఫాల్కన్ కుటుంబానికి చెందిన పక్షుల్లో చిన్నవైన అముర్ ఫాల్కన్ పక్షులు ఆగ్నేయ సైబీరియా, ఉత్తర చైనాలో సంతానోత్పత్తి చేస్తాయి. వేసవికాలం అక్కడే ఉండే ఈ పక్షులు తీవ్రమైన శీతాకాలం నుంచి తప్పించుకోవడానికి ఆఫ్రికా తీర ప్రాంతాల్లోని శీతాకాలపు మైదానాలకు వెళతాయి. ఈ క్రమంలో 15 నుంచి 20 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. సైబీరియా నుంచి ఆఫ్రికాకు వెళ్లే మార్గ మధ్యంలో నాగాలాండ్, మణిపూర్ ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాల్లో ఆగిపోతాయి. వీటిని నాగాలాండ్, మణిపూర్‌లో ‘అఖుయిపుయినా’ అని పిలుస్తారు. సగటున 45 రోజులు అవి ఇక్కడే ఉండి ఆహారాన్ని సమకూర్చుకుని సుదీర్ఘ ప్రయాణానికి అనువుగా సన్నద్ధమవుతాయి. నిరంతరాయంగా ఎగిరేందుకు వీలుగా బరువును తగ్గించుకుంటాయి. ఆఫ్రికాలో శీతాకాలం ముగిశాక ఏప్రిల్, మే నెలల్లో ఇవి తిరుగు ప్రయాణమై మళ్లీ సైబీరియా వెళతాయి. తిరిగి వెళ్లేటప్పుడు కూడా ఇవి మన దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఆగుతాయి. -
‘గ్యాన్‌దీప్’.. పిల్లలను డీఎన్ఏ సైంటిస్టులు చేయడమే టార్గెట్
సాక్షి,హైదరాబాద్:కేంద్రీయ విద్యాలయాల విద్యార్థుల నుంచి డీఎన్ఏ సైంటిస్టులను తయారు చేసేందుకు బ్రిక్ సెంటర్‌ఫర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ) కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ‘జెనెటిక్స్ఫర్యు’ సహకారంతో ‘గ్యాన్‌దీప్’ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ ప్రోగ్రామ్‌కు ఇండియా బయోసైన్సెస్ సంస్థతో పాటు హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయ యూనిట్ సంయుక్తంగా నిధులు సమకూ ర్చనున్నాయి.‘గ్యాన్‌దీప్’ ప్రారంభ సెషన్ శుక్రవారం (నవంబర్ 22) సీడీఎఫ్‌డీ ఆవరణలో జరిగింది. సీడీఎఫ్‌డీ హెడ్ఆఫ్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్ డాక్టర్ వర్ష, స్టాఫ్ సైంటిస్ట్ శ్వేతత్యాగి ఆధ్వర్యంలో ఈ సెషన్‌ను నిర్వహించారు. డీఎన్ఏ, జెనెటిక్స్ గురించి ఈ సెషన్లో డాక్టర్ చందనబసు పిల్లలకు వివరించారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని పలు కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీఎన్ఏ,జెనెటిక్స్,సెల్సైకిల్ తదితర అంశాల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అరటిపండ్ల నుంచి డీఎన్ఏను వేరు చేశారు. పలువురికి బహుమతులు ప్రదానం చేశారు. -
కోడి ముందా? గుడ్డు ముందా?
కోడి ముందా, గుడ్డు ముందా? చిరకాలంగా మనిషి మెదడును తొలుస్తున్న అంతుచిక్కని ప్రశ్న. దీనికి సమాధానం కనిపెట్టేందుకు సైంటిస్టులు ఎంతోకాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కోడి కంటే బహుశా గుడ్డే ముందు వచ్చి ఉండొచ్చని అలాంటి తాజా పరిశోధన ఒకటి పేర్కొంది. జంతువుల ఆవిర్భావానికి చాలాకాలం ముందునుంచే జీవుల్లో గుడ్డు వంటి నిర్మాణాలు ఏర్పడేవని తేలి్చంది. క్రోమోస్పెరియా పెర్కిన్సి అనే ఏకకణ జీవిపై చేసిన పరిశోధనల ఆధారంగా ఈ నిర్ధారణకు వచి్చనట్టు జెనీవా యూనివర్సిటీ బయోకెమిస్ట్ మరైన్ ఒలివెట్టా తెలిపారు. పరిశోధన బృందానికి ఆమే సారథ్యం వహించారు. పునరుత్పత్తి ప్రక్రియ సందర్భంగా సి.పెర్కిన్సిలో జరిగే పాలింటమీ ప్రక్రియ అచ్చం జంతువుల్లో పిండం ఎదుగుదలను పోలి ఉంటుందని ఒలివెట్టా వివరించారు. ‘‘ఆ ప్రక్రియ ఫలితంగా గుడ్డును పోలే బోలు కణ పదార్థం రూపొందినట్టు కనిపెట్టాం. సంక్లిష్టమైన బహుళకణ జీవుల ఆవిర్భావానికి చాలాముందే తొలినాటి జీవుల్లో పిండం వంటి నిర్మాణాల జెనెటిక్ ప్రోగ్రామింగ్ వ్యవస్థ ఉండొచ్చని దీన్నిబట్టి అంచనా వేయవచ్చు. తొలి నాళ్లలోనే జీవుల్లో బహుళకణ సమన్వయం వంటి ప్రక్రియలు సాగేవనేందుకు మా పరిశోధన ఫలితాలు ఊతమిస్తున్నాయి’’అని చెప్పారు. అయితే దీనిపై స్పష్టత రావాలంటే మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సి ఉందని అంగీకరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చంద్రుడు మన మామ కాదా?
‘చందమామ రావే.. జాబిల్లి రావే..’, ‘మామా.. చందమామా..’ అని పాటలున్నాయి. ‘కార్తీక పున్నమి వేళలోనా..’ అంటూ గీతాలూ ఉన్నాయి.. చంద్రుడి వెన్నెల తగలగానే రూపమే మారిపోయే జానపద కథలు మరెన్నో ఉన్నాయి.. ఏ దేశం, ఏ సంస్కృతి అనే తేడా లేకుండా చంద్రుడు మనందరికీ అంత దగ్గరైపోయాడు. కానీ చంద్రుడు మనవాడు కాదని, అంతరిక్షంలో తిరుగుతూ ఉంటే.. భూమి లాగేసి పట్టేసుకుందని శాస్త్రవేత్తలు కొత్త సిద్ధాంతాన్ని వెలుగులోకి తెచ్చారు. దీన్ని బలపర్చే పలు ఆధారాలనూ చూపుతున్నారు. చంద్రుడు ఎక్కడివాడు? భూమికి ఎలా దొరికిపోయాడు? ఆ సిద్ధాంతం ఏం చెబుతోంది? దానికి ప్రాతిపదిక ఏమిటనే వివరాలు తెలుసుకుందామా..భూమి నుంచి ఏర్పడిందనే అంచనాతో..చందమామ మన భూమి నుంచే ఏర్పడిందనేది ఇప్పటివరకు ఉన్న సిద్ధాంతం. దాని ప్రకారం.. సూర్యుడు, ఇతర గ్రహాలు ఏర్పడిన కొత్తలో.. అంగారకుడి పరిమాణంలో ఉన్న ‘థియా’అనే గ్రహం భూమిని ఢీకొట్టిందని, అప్పుడు భూమి నుంచి అంతరిక్షంలోకి విసిరివేయబడిన శకలాలు ఒకచోట చేరి చంద్రుడు రూపుదిద్దుకున్నాడు. భూమి గురుత్వాకర్షణ వల్ల గ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సిద్ధాంతాన్ని అందరూ విశ్వసిస్తున్నా.. ఎన్నో సందేహాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలోని పెన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. ఓ ‘బైనరీ గ్రహాల జంట’లో భాగమైన చంద్రుడిని భూమి లాగేసుకుని ఉంటుందని కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.ఎక్కడి నుంచో భూమి లాగేసుకుందా?చందమామ మిస్టరీలు ఎన్నో..నాసా శాస్త్రవేత్తలు చంద్రుడిపై నుంచి తెచ్చిన సుమారు 363 కిలోల రాళ్లు, మట్టిపై పరిశోధనలు చేశారు. ఆ రాళ్లు, మట్టిలో ఉన్న రసాయన సమ్మేళనాలలో కొన్ని భూమ్మీది తరహాలోనే ఉండగా.. మరికొన్ని చాలా విభిన్నంగా ఉన్నట్టు గుర్తించారు. భూమి నుంచే చంద్రుడు ఏర్పడితే.. ఆ రసాయన సమ్మేళనాలు ఎక్కడివనే సందేహాలు ఉన్నాయి. మరో గ్రహం భూమిని ఢీకొట్టడంతో అంతరిక్షంలోకి ఎగిసిపడిన పదార్థాలన్నీ కాలక్రమేణా ఒకచోటికి చేరి చంద్రుడు ఏర్పడినట్టు పాత సిద్ధాంతం చెబుతోంది. కానీ అలా ఎగసిపడిన పదార్థాలు.. శని చుట్టూ ఉన్న వలయాల తరహాలో భూమి మధ్య భాగానికి ఎగువన (భూమధ్య రేఖ ప్రాంతంలో) కేంద్రీకృతం కావాలని... అవన్నీ కలిసిపోయినప్పుడు చంద్రుడు కూడా భూ మధ్య రేఖకు ఎగువనే ఉండాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ చంద్రుడు భూమధ్య రేఖ కన్నా ఏడు డిగ్రీలు ఎగువన, వంపు తిరిగిన కక్ష్యలో పరిభ్రమిస్తున్నాడు. మరో తోడు నుంచి చంద్రుడిని లాగేసుకుని.. సౌర కుటుంబంలో, అంతరిక్షంలో అక్కడక్కడా ‘బైనరీ’ వ్యవస్థలు ఉంటాయి. అంటే కొంచెం అటూ ఇటుగా సమాన పరిమాణం ఉన్న ఖగోళ పదార్థాలు (ఆస్టరాయిడ్లు, గ్రహాల వంటివి..) రెండూ ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతూ ఉంటాయి. అదే సమయంలో ఆ రెండూ కలసి.. ఏదైనా నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. అలాంటి బైనరీ వ్యవస్థలో చంద్రుడు భాగమని కొత్త సిద్ధాంతం చెబుతోంది. ఆ బైనరీ మరుగుజ్జు గ్రహాలు భూమికి సమీ పం నుంచి వెళ్లినప్పుడు.. అందులోని చంద్రుడిని భూమి గురుత్వాకర్షణ శక్తితో లాగేసుకుందని, రెండో మరుగుజ్జు గ్రహం అంతరిక్షంలోకి విసిరివేయబడిందని పేర్కొంటోంది. అలా లాగేసుకోవడం సాధ్యమేనా? విశ్వంలో బైనరీ వ్యవస్థలు ఉండటం, అప్పుడప్పుడూ అలాంటి వాటిలోంచి ఒకదానిని పెద్ద గ్రహాలు, నక్షత్రాల వంటివి లాక్కోవడం సాధారణమేనని శాస్త్రవేత్తలు ఎప్పుడో గుర్తించారు. దీనికి ‘బైనరీ ఎక్సే్ఛంజ్ క్యాప్చర్’గా పేరుపెట్టారు. ఇలా బైనరీ వ్యవస్థ నుంచి ఒకదాన్ని లాక్కున్నప్పుడు.. రెండో గ్రహం/ఆస్టరాయిడ్ వేగంగా విసిరివేసినట్టుగా వెళ్లిపోతుంది.నెప్ట్యూన్ ఉపగ్రహం ట్రిటాన్.. అలా లాగేసుకున్నదే! మన సౌర కుటుంబంలోనే అలాంటివి ఎన్నోసార్లు జరిగాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డారెన్ విలియమ్స్ తెలిపారు. ‘‘ఉదాహరణకు నెప్ట్యూన్ గ్రహానికి ఉన్న ఉపగ్రహాల్లో అతిపెద్దదైన ‘ట్రిటాన్’కూడా ఒకప్పుడు బైనరీ వ్యవస్థలో భాగమే. నెప్ట్యూన్ తనకు దగ్గరగా ఆ వ్యవస్థ వచ్చినప్పుడు.. ట్రిటాన్ను లాగేసుకుందని ఇప్పటికే గుర్తించారు. అంతేకాదు ట్రిటాన్ ఉపగ్రహం నెప్ట్యూన్ చుట్టూ.. దాని మధ్యరేఖ ఎగువన కాకుండా, 67 డిగ్రీలు వంపు తిరిగిన కక్ష్యలో పరిభ్రమిస్తోంది. మన చంద్రుడు కూడా అలా వంపు తిరిగిన కక్ష్యలోనే పరిభ్రమిస్తున్నాడు. చంద్రుడిని భూమి లాగేసుకుందనే దానికి ఇదొక ఆధారం..’’అని డారెన్ విలియమ్స్ వెల్లడించారు. కొత్త సిద్ధాంతం సందేహాలను తీర్చుతోందా? ‘‘బైనరీ వ్యవస్థ నుంచి లాగేసుకున్న గ్రహాలు/ ఆస్టరాయిడ్లు దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరగాలి.. లాక్కున్న గ్రహం నుంచి మెల్లగా దూరంకావాలి.. అనే రూల్స్ కూడా ఉన్నాయి. వాటిని మా సిద్ధాంతం బలపరుస్తోంది..’’అని శాస్త్రవేత్త విలియమ్స్ తెలిపారు.మొదట్లో చంద్రుడు దీర్ఘవృత్తాకార కక్ష్యలోనే తిరిగేవాడని.. అయితే భూమి టైడల్ ఫోర్స్ వల్ల మెల్లగా వృత్తాకార కక్ష్యకు చేరాడని వివరించారు. ఆ ఫోర్స్ వల్లే చంద్రుడి ఒకవైపు భాగం ఎప్పుడూ భూమివైపే ఉండేలా..‘టైడల్ లాక్’అయిందని తెలిపారు. అంతేకాదు చంద్రుడు సగటున ఏటా మూడు సెంటీమీటర్ల మేర భూమి నుంచి దూరంగా జరుగుతున్నాడని గుర్తు చేశారు. ఎవరేం సిద్ధాంతాలు తెస్తేనేం? ఎప్పుడో కోట్ల ఏళ్లనాటి మాట అది. ఏది కరెక్టో, ఏదికాదో కాదుగానీ.. మనుషులు పుట్టేనాటికే చంద్రుడు ఇక్కడే ఉన్నాడు. అంటే మన మామ చందమామే!– సాక్షి, సెంట్రల్ డెస్క్ -
రక్తం తాగే గబ్బిలం..పరుగెడుతోంది మన కోసం..
గబ్బిలాలు అంటేనే కాస్త జలదరింపు.. అందులోనూ రక్తం తాగే గబ్బిలాలు ఇవి. వాటి పేరే ‘వాంపైర్ (రక్తపిశాచి) బ్యాట్స్’.. కానీ అవి మన కోసం పరుగెడుతున్నాయి.. పగలు, రాత్రి తేడా లేకుండా, అవసరమైనప్పుడల్లా ట్రెడ్‌మిల్‌పై పరుగెడుతున్నాయి.. ఇదేంటి రక్తపిశాచి గబ్బిలమేంటి? మన కోసం ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తడమేంటి? అని డౌట్ వస్తోందా.. ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం.. ఓ పరిశోధనలో భాగం.. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా..ఆహార అలవాటే కీలకం..సాధారణంగా జంతువులు, కీటకాలు వేటికైనా ప్రొటీన్లు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు, కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు (షుగర్స్) వంటి అన్ని పోషకాలు ఉండే ఆహారం కావాల్సిందే. లేకుంటే అవి ఆరోగ్యంగా ఉండవు. బతకవు కూడా. శరీరంలో వివిధ జీవక్రియలు సరిగా సాగాలంటే.. వేర్వేరు పోషకాలు తప్పనిసరికావడమే దీనికి కారణం. కానీ వాంపైర్ గబ్బిలాలు చాలా చిత్రం. అవి కేవలం జంతువుల రక్తం మాత్రమే తాగుతూ బతికేస్తుంటాయి. అలా ఎలా జీవించ గలుగుతున్నాయన్నది తేల్చేందుకు టొరొంటో స్కార్బోరో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు.ట్రెడ్‌మిల్‌పై పరుగుపెట్టించడం ఎందుకు? సాధారణంగా జంతువులు కదలడానికి, వేటాడటానికి, తినడానికి.. ఇలా అన్నింటికీ శక్తి అవసరం. చాలా వరకు కార్బోహైడ్రేట్లు (షుగర్స్), కొవ్వుల నుంచే అవి శక్తిని ఉత్పత్తి చేసుకుంటాయి. శాఖాహార, మాంసాహార జంతువులకు అవి తినే ఆహారం నుంచి ఇవి అందుతాయి. కానీ రక్తంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు అతి తక్కువ... ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలే ఎక్కువ. కేవలం వీటితోనే వాంపైర్ గబ్బిలాలు ఎలా శక్తిని ఉత్పత్తి చేసుకుంటున్నాయన్న దానిపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. ఇందుకోసం జంతువుల రక్తంలో.. కాస్త రసాయన మార్పులు చేసిన అమైనో యాసిడ్లు కలిపి గబ్బిలాలకు తాగించారు. తర్వాత వాటిని చిన్నపాటి ట్రెడ్‌మిల్‌పై నిమిషానికి 10, 20, 30 మీటర్ల వేగంతో పరుగులు పెట్టించారు. ఆ సమయంలో వాటి శరీరంలో శక్తి ఎలా ఉత్పత్తి అవుతోంది, ఏ ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు.. ఏరకంగా జీర్ణం అవుతున్నాయన్నది పరిశీలించారు.దీనివల్ల మనకేంటి లాభం? సాధారణంగా జంతువుల్లో వివిధ రకాల ప్రొటీన్లు, ఎంజైమ్‌లు ఉత్పత్తికావడానికి, అవయవాలు సరిగా పనిచేయడానికి అమైనో ఆమ్లాలు అవసరం. కానీ వాంపైర్ గబ్బిలాలు అమైనో ఆమ్లాలను నేరుగా శక్తి ఉత్పత్తి కోసం వాడుకుంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం వాటిని అత్యంత వేగంగా జీర్ణం చేసుకుంటున్నట్టు తేల్చారు. దీన్ని క్షుణ్నంగా అధ్యయనం చేస్తే.. క్షీరదాలు భౌతికంగా ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా శరీరంలో, ఆహారంలో చేసుకునే మార్పులను గుర్తించవచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ కెన్నెత్ వెల్చ్ తెలిపారు. మనలో జీర్ణ వ్యవస్థ లోపాలను సరిదిద్దడం, సమస్యలకు ఔషధాల రూపకల్పన, పోషకాహార లోపానికి చేపట్టాల్సిన చర్యలు వంటి ప్రయోజనాలు ఎన్నో ఉంటాయని వెల్లడించారు.– సాక్షి సెంట్రల్ డెస్క్ -
మతి మరవండి.. మంచిదే!
రోడ్డుపై వెళ్తుంటే ఎవరో పలకరించారు.. ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్నా వారెవరో వెంటనే గుర్తుకు రాదు.. ఏదో కొనుక్కొద్దామని దుకాణానికి వెళ్లారు.. వెళ్లాక అదేమిటో గుర్తుకు రాక కాసేపు తలగోక్కుంటారు.. వామ్మో మతిమరపు వచ్చేస్తోందని ఆందోళనపడుతుంటారు. కానీ ఏదో డిటర్జెంట్ ప్రకటనలో మరక మంచిదే అన్నట్టుగా.. ‘మరపు మంచిదే’నని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మతి మరవకుంటే మనిషి మనుగడ ఆగిపో యినట్టేనని తేల్చి చెప్తున్నారు. మరి మతిమరపు ఎందుకు మంచిదో మర్చిపోకుండా తెలుసుకుందామా..జ్ఞాపకం.. మరపు.. ఎలా జరిగేది?మెదడులోని న్యూరాన్ కణాల మధ్య ఏర్పడే బంధాలు (సినాప్సెస్) ఎంత బలంగా ఉంటే.. అక్కడ నిక్షిప్తమైన జ్ఞాపకం అంతగా మనలో నాటుకుపోయి ఉంటుంది. ఏదైనా పనిని ప్రత్యేక శ్రద్ధతో, ఏకాగ్రతతో, ఇష్టంతో చేసినప్పుడు.. ఒకే పనిని తరచూ చేస్తూ ఉన్నప్పుడు.. ఆ అంశానికి సంబంధించిన సినాప్సెస్ అంత బలంగా ఏర్పడి, జ్ఞాపకం (మెమరీ)గా మారుతాయి. ఆ పని లేదా అంశానికి సంబంధించి ప్రతిసారీ ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా.. ఆటోమేటిక్ మెమరీగా నిక్షిప్తం అవుతాయి. అదే మనం దేనిౖపె అయినా సరిగా దృష్టిపెట్టనప్పుడు సినాప్సెస్ బలహీనంగా ఉండి.. ఆ అంశం సరిగా రిజిస్టర్ కాదు. ఇలాంటి వాటిని మెదడు ఎప్పటికప్పుడు తొలగిస్తూ ‘క్లీన్’ చేస్తూ ఉంటుంది. అదే మతిమరపు. మనుషుల్లో వయసు పెరిగినకొద్దీ.. మెదడుకు ఏకాగ్రత, ఫోకస్ చేసే శక్తి వంటివి తగ్గిపోతాయి. దీనికి ఇతర కారణాలూ తోడై అల్జీమర్స్ వంటి సమస్యలు వస్తుంటాయి.కొత్త ‘దారి’ కోసం.. పాత దాన్ని మరుగుపరుస్తూ..రోజువారీ జీవితంలో కొత్త అంశాలను నేర్చుకోవడానికి, జ్ఞాపకాలను అప్డేట్ చేసుకోవడానికి మతిమరపు తప్పనిసరి అని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మనిషి పరిణామక్రమానికి, మనుగడకు ఇదీ కీలకమని తేల్చి చెప్తున్నారు. ఉదాహరణకు కొన్నేళ్లుగా రోజూ ఒకేదారిలో ఆఫీసుకు వెళుతూ ఉంటారు. ఆ మార్గం, మధ్యలోని సిగ్నళ్లు, మలుపులు, స్పీడ్ బ్రేకర్లు.. ఇలా అన్ని అంశాలు బలంగా రిజిస్టరై.. ఆటోమేటిక్ మెమరీగా మారుతాయి. కానీ ఉన్నట్టుండి ఒకరోజు ఆ రోడ్డు మూసేయడంతో.. కొన్నిరోజులు పూర్తిగా కొత్త దారిలో ఆఫీసుకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో మెదడులోని ఆ రోడ్డు మెమరీలో మార్పులు జరుగుతాయి. మనం వెళ్లే కొత్త దారిలోని సిగ్నళ్లు, మలుపులు, స్పీడ్ బ్రేకర్లు వంటివి బలంగా రిజిస్టర్ అవడం మొదలవుతుంది. ఇందుకోసం మన మెదడు మొదటి రోడ్డుకు సంబంధించిన సినాప్సెస్‌ను బలహీనం చేస్తుంది. అంటే పాత డేటాను కొంతమేర మరుగుపరుస్తూ.. కొత్త అంశానికి అప్డేట్ అవుతుంది. ఇలా చేయకపోతే జ్ఞాపకాలు చిక్కుముడి పడి (మెమరీ క్లట్టర్) సమస్యాత్మకంగా మారుతాయి. ప్రతిష్టాత్మక నోబెల్‌ను గెలుచుకున్న శాస్త్రవేత్త ఎరిక్ కండెల్ తన పరిశోధనల్లో ఈ విషయాన్ని గుర్తించారు. మరిచిపోకుంటే.. మనుగడకే ముప్పుమరుపు లేకుంటే ఎంత ప్రమాదమనే దానికి శాస్త్రవేత్తలు ఎన్నో ఉదాహరణలు చూపుతున్నారు. ఉదాహరణకు ‘పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ)’.. అంటే ఏదైనా ప్రమాదానికి, భయోత్పాత ఘటనకు లోనైనప్పుడు ఆ జ్ఞాపకాలు లోతుగా నిక్షిప్తమైపోయి, నిత్యం వెంటాడుతూ ఉండే పరిస్థితి. ప్రమాదాలకో, దారుణ ఘటనలకో గురైనవారు.. తరచూ అవి తమ కళ్ల ముందే మళ్లీ, మళ్లీ జరుగుతున్నట్టుగా భ్రాంతి చెందుతూ బాధపడుతుంటారు. డిప్రెషన్లోకి వెళ్లిపోతారు.సాధారణ జీవితం గడపలేరు. ఇక పరిణామక్రమానికీ.. మతిమరపు, జ్ఞాపకాల అప్డేషన్కు లింకు ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒకప్పుడు మనుషులు గుహల్లో ఉంటూ, వేటాడే బతికేవారు.. నీటికోసం సమీపంలోని కొలను దగ్గరికి వెళ్లేవారు. ఓసారి అలా వెళ్లినప్పుడు.. విషపూరిత పాములు, క్రూర జంతువులు కనిపిస్తే.. ఆ ప్రాంతం ప్రమాదకరమని మెదడులో జ్ఞాపకం అప్డేట్ అవుతుంది. ఈసారి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండటంగానీ, మరో కొలనును వెతుక్కోవడంగానీ చేసేలా ప్రేరేపిస్తుంది. ఈ లక్షణం కూడా మానవ పరిణామానికి తోడ్పడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.మరపు శాశ్వతం కాదు.. మళ్లీ రావొచ్చు..ఒకసారి ఆటోమేటిక్/దీర్ఘకాలిక మెమరీగా నిక్షిప్తౖమెన జ్ఞాపకాలు.. అంత త్వరగా వీడిపోవని, అవి మరుగునపడతాయని.. సరైన ప్రేరణ ద్వారా వాటిని తిరిగి పొందవచ్చని అమెరికన్ సైకాలజిస్టులు రోజర్ బ్రౌన్, డేవిడ్ మెక్నీల్ 1960వ దశకంలోనే ప్రతిపాదించారు. ఇటీవల చేసిన ప్రయో గాల్లో కొందరు శాస్త్రవేత్తలు దీనిని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఉదాహÆý‡ణకు మొదట చెప్పుకొన్నట్టు రోడ్డుపై వెళ్తుండగా కనబడిన వ్యక్తి పేరు వెంటనే గుర్తుకురాదు. కానీ ఆ పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో గుర్తుంటుంది. ‘అరె నాలుకపైనే ఉంది, బయటికి రావట్లేదు’ అని మనం అనుకుంటూ ఉంటాం. ఆ వ్యక్తి ఊరి పేరో, బంధుత్వమో, మరొకటో ప్రస్తావించగానే.. పేరు ఠక్కున గుర్తొస్తుంది. అంటే తగిన ప్రేరణతో జ్ఞాపకం వచ్చేస్తుందన్న మాట.ఎలా చూసినా.. మరీ మర్చిపోయేంత కాకుండా.. కాస్త మరపు మంచిదే. -
మహాప్రాణులకు మళ్లీ జీవం!
డైనోసార్లు, మామత్‌లు వంటి ప్రాణులను ఇప్పటి వరకు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనూ, టీవీ సిరీస్‌లలోను మాత్రమే చూశాం. ఇలాంటి ప్రాణుల్లో కొన్ని త్వరలోనే మన కళ్ల ముందు సజీవంగా కనిపించనున్నాయి. సహస్రాబ్దాల కిందట అంతరించిపోయిన ప్రాణులు మొదలుకొని, మన కళ్ల ముందే కనుమరుగైపోయిన చాలా ప్రాణులు తిరిగి ప్రాణం పోసుకోనున్నాయి. అంతరించిపోయిన ప్రాణుల పునరుత్థానానికి ఇప్పటి శాస్త్రవేత్తలు సాగిస్తున్న ప్రయత్నాలపై ఒక విహంగ వీక్షణమే ఈ కథనం.పన్యాల జగన్నాథదాసుఈ భూమ్మీద తొలి జీవకణం ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలీదు. భూమ్మీద మనుషులు పుట్టక ముందే ఎన్నో జీవజాతులు ప్రాణం పోసుకున్నాయి. వాటిలో కొన్ని జీవజాతులు ఆదిమానవుల కాలంలోనే అంతరించిపోయాయి. మన కాలంలోనూ మరికొన్ని జీవజాతులు అంతరించిపోయాయి. ఇంకొన్ని జీవజాతులు ప్రమాదం అంచుల్లో అంతరించిపోయే దశకు చేరువగా ఉన్నాయి. ఒకప్పుడు భూమ్మీద సంచరించిన డైనోసార్లు, మామత్‌లు వంటి వాటి గురించి పుస్తకాల ద్వారా, సైన్స్‌ఫిక్షన్ సినిమాల ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతున్నామే తప్ప వాటిని ఈ భూమ్మీద సజీవంగా చూసిన మనుషులెవరూ ఇప్పుడు లేరు. శతాబ్దాల కిందటే అంతరించిన కొన్ని జీవజాతులు సమీప భవితవ్యంలోనే తిరిగి మన కళ్ల ముందు కనిపించనున్నాయి. అంతరించిపోయిన ప్రాణుల పునరుజ్జీవానికి శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా కొనసాగిస్తున్న ప్రయోగాల్లో కొన్ని ఒక కొలిక్కి వచ్చాయి. మరో నాలుగేళ్లలోనే మామత్‌కు మళ్లీ ప్రాణం పోయనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే రీతిలో మరిన్ని జీవులకూ పునర్జీవం కల్పించనున్నట్లు చెబుతున్నారు. అంతరించిపోయిన జీవులకు తిరిగి ప్రాణం పోసే ప్రక్రియను ‘జైవ పునరుత్థానం’గా (బయో రిసరెక్షన్) అభివర్ణిస్తున్నారు.మరో నాలుగేళ్లలోనే మామత్ పునరుత్థానంఎప్పుడో మంచుయుగంలో అంతరించిపోయిన ప్రాణి మామత్. ఏనుగులాంటి భారీ జంతువు ఇది. దీనికి ఏనుగులాగానే తొండం, దంతాలతో పాటు ఒంటి నిండా దట్టంగా రోమాలు ఉండేవి. భూమ్మీద మంచు యుగం 26 లక్షల ఏళ్ల కిందటి నుంచి 11 వేల ఏళ్ల కిందటి వరకు కొనసాగింది. ఆ కాలంలోనే మామత్ భూమ్మీద సంచరించేది. మంచుయుగం ముగిసిన తర్వాత మామత్ జనాభా క్రమంగా క్షీణించింది. నాలుగు వేల ఏళ్ల కిందట ఇది పూర్తిగా అంతరించిపోయింది. సహస్రాబ్దాల కిందటే అంతరించిపోయిన మామత్‌కు పునర్జీవం కల్పించేందుకు శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మామత్ 2028 నాటికల్లా పునరుత్థానం చెందుతుందని, అప్పటికల్లా దీనికి మళ్లీ ప్రాణం పోయనున్నామని అమెరికన్ స్టార్టప్ కంపెనీ ‘కలోసల్ బయోసైన్సెస్’కు చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల ప్రకటించారు.‘కలోసల్ బయోసైన్సెస్’ అమెరికాలోని తొలి డీ–ఎక్స్‌టింక్షన్ కంపెనీ. మామత్ పునరుత్థానం కోసం దీనికి చెందిన అత్యంత కీలకమైన జన్యువులను సేకరించామని ఈ కంపెనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రాణుల పునరుత్థానం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కంపెనీకి ‘పేపాల్’ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్, సెలబ్రిటీ మోటివేషనల్ స్పీకర్ టోనీ రాబిన్స్ వంటి ప్రముఖులే కాకుండా, అమెరికన్ గూఢచర్య సంస్థ సీఐఏ కూడా భారీ స్థాయిలో నిధులు సమకూరుస్తున్నట్లు అమెరికన్ వార్తా సంస్థ ‘ది ఇంటర్సెప్ట్’ వెల్లడించింది. ‘తొలి మామత్‌కు 2028 ద్వితీయార్ధం నాటికల్లా ప్రాణం పోయాలని లక్ష్యం నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం అదే పనిలో పురోగతిలో కొనసాగుతున్నాం.అంతరించిపోయిన జీవుల్లో మొదటిగా పునరుత్థానం పొందే ప్రాణి మామత్ మాత్రమే కాగలదు. దీని గర్భధారణ వ్యవధి ఇరవైరెండు నెలలు. మామత్ జన్యువుల్లో 99.5 శాతం జన్యువులు ఆసియన్ ఏనుగుల్లో ఉన్నాయి. జన్యు సవరణ, మూలకణాల అనుసంధానం ప్రక్రియల ద్వారా ఆడ ఆసియన్ ఏనుగు అండానికి ఫలదీకరణ జరిపి మామత్‌కు పునరుత్థానం కల్పించనున్నాం’ అని కలోసల్ బయోసైన్సెస్ సీఈవో బెన్ లామ్ తెలిపారు.‘జురాసిక్ పార్క్’ మాదిరిగా కాదు స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలోని సైన్స్ ఫిక్షన్ సినిమా ‘జురాసిక్ పార్క్’ చాలామంది చూసే ఉంటారు. ఇదే పేరుతో మైకేల్ క్రైటన్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో ఒక పారిశ్రామికవేత్త క్లోనింగ్ ద్వారా పునర్జీవం కల్పించిన డైనోసార్లతో ఒక థీమ్ పార్కు ఏర్పాటు చేస్తాడు. డైనోసార్ల బాగోగులను చూసుకునే ఒక వ్యక్తిని వెలాసిరేప్టర్ జాతికి చెందిన డైనోసార్ చంపేస్తుంది. ఇందులో క్లోనింగ్ కోసం అంతరించిన డైనోసార్ల డీఎన్ఏ ఉపయోగించినట్లుగా ఉంది. కలోసల్ బయోసైన్సెస్ జరుపుతున్న ప్రయోగాల్లో మాత్రం డీఎన్ఏను నేరుగా ఉపయోగించడం లేదు. ‘ జురాసిక్ పార్క్‌లో మాదిరిగా మేము మామత్ డీఎన్ఏను తీసుకుని, దాంతో ఆసియన్ ఏనుగు జన్యువుల రంధ్రాలను పూడ్చే పని చేయడం లేదు. సవరించిన మామత్ జన్యువులను, మూలకణాలను ఆరోగ్యకరమైన ఆడ ఆసియన్ ఏనుగు అండంలోకి ప్రవేశపెట్టి ఫలదీకరణ జరపనున్నాం’ అని బెన్ లామ్ వివరించారు.దశాబ్ద కాలంగా సంఘటిత కృషి అంతరించిపోయిన ప్రాణుల పునరుత్థానికి దాదాపు దశాబ్ద కాలంగా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సంఘటితంగా కృషి చేస్తున్నారు. ప్రాణుల పునరుత్థాన ప్రయోగాల కోసం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్‌కు (ఐయూసీఎన్) చెందిన స్పీసీస్ సర్వైవల్ కమిషన్ 2014లో డీ ఎక్స్‌టింక్షన్ టాస్క్‌ఫోర్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇందులో వివిధ దేశాలకు చెందిన తొమ్మిదివేల మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఈ టాస్క్‌ఫోర్స్‌లోని శాస్త్రవేత్తలు అంతరించిపోయిన ప్రాణుల్లో వేటికి పునరుత్థానం కల్పిస్తే, పర్యావరణానికి ఎక్కువగా మేలు కలుగుతుందో గుర్తించడంతో పాటు ప్రాణుల పునరుత్థాన ప్రయోగాల కోసం ఎంపిక చేసుకున్న ప్రక్రియల సాధ్యాసాధ్యాలపై తమ విశ్లేషణలను అందిస్తారు. మామత్తో పాటు మరికొన్ని అంతరించిపోయిన ప్రాణులకు కూడా తిరిగి ప్రాణం పోయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని అంతరించిన ప్రాణులకు చెందిన జన్యుపదార్థాలను సేకరించి, వివిధ దశల్లో ప్రయోగాలు చేస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.క్వాగాఇది జీబ్రా జాతికి చెందిన జంతువు. జీబ్రాలా క్వాగాకు ఒంటి నిండా చారలు ఉండవు. తల నుంచి ఛాతీ భాగం వరకు చారలు ఉంటాయి. ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది. తల నుంచి ముదురు రంగులో ఉండే ఛారలు ఛాతీ భాగం వద్దకు వచ్చే సరికి మసకబారుతాయి. క్వాగాలు ఒకప్పుడు దక్షిణాఫ్రికాలో విరివిగా కనిపించేవి. చిట్టచివరి క్వాగా 1878లో మరణించినట్లుగా రికార్డులు ఉన్నాయి. అంతరించిపోయిన క్వాగాకు తిరిగి ప్రాణం పోసేందుకు 1987లో ‘క్వాగా ప్రాజెక్టు’ ప్రారంభమైంది. జీబ్రా జాతుల్లోని బర్షెల్స్ జీబ్రాలో క్వాగా జన్యువులు అధిక శాతం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. బర్షెల్స్ జీబ్రా ద్వారా క్వాగా పునరుత్థానానికి వారు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.ఎలిఫంట్ బర్డ్ఎగరలేని భారీ పక్షుల్లో ఎలిఫంట్ బర్డ్ ఒకటి. మడగాస్కర్‌లో ఈ పక్షులు విరివిగా ఉండేవి. స్థానికులు ఇష్టానుసారం వీటిని వేటాడి తినేయడంతో దాదాపు వెయ్యేళ్ల కిందటే ఇవి అంతరించిపోయాయి. మడగాస్కర్‌లో పరిశోధనలు సాగిస్తున్న అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు ఎలిఫంట్ బర్డ్ గుడ్ల శిలాజాలు దొరికాయి. వాటి నుంచి వారు ఎలిఫంట్ బర్డ్ జన్యు పదార్థాలను సేకరించగలిగారు. ఎలిఫంట్ బర్డ్ పక్షుల్లో ఎనిమిది జాతులు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. డోడో మాదిరిగానే ఎలిఫంట్ బర్డ్‌కు కూడా తిరిగి ప్రాణం పోసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.స్టెల్లర్స్ సీ కౌఇది తిమింగలంలాంటి భారీ జలచరం. ఒకప్పుడు అలాస్కా, రష్యాల మధ్య బేరింగ్ సముద్రంలో కమాండర్ దీవుల చుట్టూ కనిపించేది. పర్యావరణ మార్పులు, విచ్చలవిడిగా సాగిన వేట ఫలితంగా స్టెల్లర్స్ సీ కౌ జాతి పద్దెనిమిదో శతాబ్దిలో అంతరించిపోయింది. చివరిసారిగా ఇది 1768లో కనిపించినట్లుగా రికార్డులు ఉన్నాయి. జర్మన్ ప్రకృతి శాస్త్రవేత్త జార్జ్ విల్హెల్మ్ స్టెల్లర్ 1741లో ఈ జలచరం గురించి తన రచనల్లో విపులంగా వర్ణించాడు. అందువల్ల దీనికి అతడి పేరు మీదుగా ‘స్టెల్లర్స్ సీ కౌ’ అనే పేరు వచ్చింది. బేరింగ్ దీవి తీరంలో స్టెల్లర్స్ సీ కౌ పూర్తి అస్థిపంజరం 1987లో శాస్త్రవేత్తలకు దొరికింది. దీని ఆధారంగా జన్యు పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు స్టెల్లర్స్ సీ కౌకు పునరుత్థానం కల్పించడం సాధ్యమేనని, ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నామని చెబుతున్నారు.ఐరిష్ ఎల్క్జింక జాతుల్లో అతిపెద్ద జంతువు ఇది. సహస్రాబ్దాల కిందట భూమ్మీద సంచరించేది. ఐర్లండ్ నుంచి సైబీరియాలోని బైకాల్ సరస్సు వరకు గల ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో ఉండేది. పర్యావరణ కారణాల వల్ల, మనుగడకు సంబంధించిన పరిమితుల వల్ల ఐరిష్ ఎల్క్ జాతి ఏడువేల ఏళ్ల కిందటే అంతరించింది. ప్రస్తుతం భూమ్మీద మనుగడ సాగిస్తున్న జింక జాతుల్లో ఐరిష్ ఎల్క్ జన్యువుల్లో ఎక్కువ శాతం జన్యువులు ఉన్న జాతి ఫ్యాలో డీర్ అని శాస్త్రవేత్తలు గుర్తించారు. పంతొమ్మిదో శతాబ్ది నుంచి సాగిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలకు ఐర్లండ్‌లో ఐరిష్ ఎల్క్ అస్థిపంజరాలు విరివిగా దొరికాయి. వీటి ఆధారంగా ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఫ్యాలో డీర్ ద్వారా ఐరిష్ ఎల్క్కు పునర్జీవం కల్పించవచ్చనే అంచనాతో ఆ దిశగా ప్రయోగాలు చేస్తున్నారు.వూలీ రైనోసరస్ఇది ఖడ్గమృగం జాతికి చెందిన భారీ జంతువు. ఖడ్గమృగం శరీరం నున్నగా ఉంటే, దీనికి మాత్రం ఒంటి నిండా దట్టంగా రోమాలు ఉంటాయి. ఈ జంతువు సహస్రాబ్దాల కిందటే అంతరించిపోయింది. పర్యావరణ మార్పుల ఫలితంగా దాదాపు 8,700 ఏళ్ల కింద వూలీ రైనోసరస్ అంతరించిపోయినట్లు శాస్త్రవేత్తల అంచనా. మామత్‌కు ఏనుగు ద్వారా పునర్జీవం కల్పించే ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగానే, వూలీ రైనోసరస్కు ఖడ్గమృగం ద్వారా పునర్జీవం కల్పించేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు జరుపుతున్నారు.ఆరోక్స్ఇది గోజాతికి చెందిన పురాతన జంతువు. ఇవి మిగిలిన జాతుల ఎద్దులు, ఆవుల కంటే భారీగా ఉంటాయి. నాలుగేళ్ల కిందటి వరకు ఆసియా, యూరోప్, ఉత్తరాఫ్రికా ప్రాంతాల్లో ఇవి విరివిగా ఉండేవి. ఆ తర్వాత పదిహేడో శతాబ్దం ప్రారంభం నాటికి ఇవి పూర్తిగా అంతరించిపోయాయి. ఆరోక్స్ జాతికి తిరిగి ప్రాణం పోయడానికి శాస్త్రవేత్తలు 2009 నుంచి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికీ మనుగడలో ఉన్న పురాతన గోజాతుల్లో ఆరోక్స్ డీఎన్ఏ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆరోక్స్ డీఎన్ఏ ఎక్కువ శాతం ఉన్న గోజాతులను ప్రత్యేకంగా ఎంపిక చేసి, వాటి ద్వారా ఆరోక్స్ జాతికి పునరుత్థానం కల్పించడానికి ప్రయోగాలు చేస్తున్నారు.టాస్మానియన్ టైగర్పెద్దపులి మాదిరిగానే దీని ఒంటి మీద చారలు ఉంటాయి గాని, ఇది తోడేలు జాతికి చెందిన జంతువు. ఒకప్పుడు టాస్మానియా ప్రాంతంలో విరివిగా సంచరించిన ఈ జంతువుకు ఒంటి మీద చారల కారణంగా ‘టాస్మానియన్ టైగర్’ అనే పేరు వచ్చింది. కొందరు దీనిని ‘టాస్మానియన్ వూల్ఫ్’ అని కూడా అంటారు. ఈ జంతువు దాదాపు శతాబ్దం కిందట అంతరించిపోయింది. దాదాపు 110 ఏళ్ల కిందట చనిపోయిన టాస్మానియన్ టైగర్ అస్థిపంజరం నుంచి శాస్త్రవేత్తలు దీని ఆర్ఎన్ఏను సేకరించారు. ఈ ఆర్ఎన్ఏను ఇథనాల్‌లో భద్రపరచారు. దీని ద్వారా టాస్మానియన్ టైగర్‌కు తిరిగి ప్రాణం పోయడానికి కలోసల్ బయోసైన్సెస్ కంపెనీ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ యూనివర్సిటీకి చెందిన ‘థైలాసైన్ ఇంటిగ్రేటెడ్ జెనెటిక్ రిస్టరేషన్ రీసెర్చ్ లాబ్ శాస్త్రవేత్తల సహకారంతో ప్రయోగాలు సాగిస్తోంది.వూలీ రైనోసరస్ఇది ఖడ్గమృగం జాతికి చెందిన భారీ జంతువు. ఖడ్గమృగం శరీరం నున్నగా ఉంటే, దీనికి మాత్రం ఒంటి నిండా దట్టంగా రోమాలు ఉంటాయి. ఈ జంతువు సహస్రాబ్దాల కిందటే అంతరించిపోయింది. పర్యావరణ మార్పుల ఫలితంగా దాదాపు 8,700 ఏళ్ల కింద వూలీ రైనోసరస్ అంతరించిపోయినట్లు శాస్త్రవేత్తల అంచనా. మామత్‌కు ఏనుగు ద్వారా పునర్జీవం కల్పించే ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగానే, వూలీ రైనోసరస్కు ఖడ్గమృగం ద్వారా పునర్జీవం కల్పించేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు జరుపుతున్నారు.ది గ్రేట్ ఆక్ఇది చూడటానికి పెంగ్విన్‌లా కనిపించే ఎగరలేని పక్షి. వేటగాళ్ల తాకిడి వల్ల ది గ్రేట్ ఆక్ పక్షిజాతి పంతొమ్మిదో శతాబ్దిలో అంతరించిపోయింది. చిట్టచివరి ది గ్రేట్ ఆక్ పక్షిని 1844 జూలైలో వేటగాళ్లు చేజిక్కించుకుని, చంపి తినేసినట్లు రికార్డులు ఉన్నాయి. స్పెయిన్ ఉత్తర తీరం నుంచి కెనడా వరకు అట్లాంటిక్ తీర ప్రాంతమంతటా ఈ పక్షులు ఒకప్పుడు విరివిగా ఉండేవి. ధ్రువపు ఎలుగుబంట్లు ఈ పక్షులను తినేవి. వాటి కంటే ఎక్కువగా మనుషులు వేటాడి తినేవారు. ది గ్రేట్ ఆక్ పునరుత్థానం కోసం శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. టెక్సస్‌లోని ఏ అండ్ ఎం యూనివర్సిటీ, ఆస్ట్రేలియన్ యానిమల్ హెల్త్ లేబొరేటరీ వంటి సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ దిశగా ప్రయోగాలు కొనసాగిస్తున్నారు.శాస్త్రవేత్తల ప్రయోగాలు ఫలించినట్లయితే, అంతరించిపోయిన జీవరాశుల్లో కనీసం కొన్ని అయినా తిరిగి ప్రాణం పోసుకోగలవు. వాటి వల్ల భూమ్మీద జీవవైవిధ్యం మాత్రమే కాకుండా, ప్రకృతి సమతుల్యత కూడా మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరించిపోయిన జీవుల పునరుత్థానం కోసం సూక్షా్మతి సూక్ష్మస్థాయిలో సాగిస్తున్న జన్యు ప్రయోగాలు, మూలకణాల ప్రయోగాల వల్ల మానవాళిని పట్టి పీడించే ఎన్నో వ్యాధులకు చికిత్స మార్గాలను కూడా కనుగొనే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. -
నోబెల్ అవార్డులు చెప్పే పాఠాలు
ఈ ఏడాది భౌతిక, రసాయనశాస్త్ర నోబెల్ అవార్డులను పరిశీలించారా? ఈ రెండింటితోనూ రేపటితరం టెక్నాలజీగా చెప్పుకొంటున్న కృత్రిమ మేధకు సంబంధం ఉంది. కృత్రిమ మేధ పునాదులు దశాబ్దాల నాటి ఆవిష్కరణల్లో ఉన్నాయని ఈ పురస్కారాలు చాటుతున్నాయి. మౌలికాంశాలపై పరిశోధ నలు ఎంత ముఖ్యమో కూడా ఇవి మరోసారి స్పష్టం చేస్తున్నాయి. మానవ విజ్ఞానం విస్తరించేందుకూ ఇవి ఎంతగానో అవసరం. మౌలికాంశాల పరి శోధనలకు ప్రత్యామ్నాయం లేదు. భారతీయులెవరికీ నోబెల్ అవార్డులు దక్కడం లేదంటే... అందుకు కారణం అదే. అంతర్జాతీయ స్థాయి శాస్త్ర రంగంలో భారత్ తనదైన ముద్ర వేయాలంటే, మౌలికాంశాలపై పరిశోధనలకు పెద్దపీట వేయాలి. ఇదో దీర్ఘకాలిక కార్యక్రమం అన్నది కూడా గుర్తు పెట్టుకోవాలి.ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ అవార్డులు పొందిన జాన్ హాప్ఫీల్డ్, జెఫ్రీ హంటన్ భౌతిక శాస్త్ర సిద్ధాంతాలను, టూల్సును మెషీన్ లెర్నింగ్ కోసం ఉపయోగించారు. అణువు తిరిగే పద్ధతి సాయంతో హాప్ఫీల్డ్ సమా చారాన్ని నిల్వ చేసుకునే, పునర్మించే నిర్మాణం రూపొందించారు.హంటన్ సమాచార ధర్మాలను స్వతంత్రంగా గుర్తించగల పద్ధతిని ఆవిష్కరించారు. ప్రస్తుతం విస్తృత వినియోగంలో ఉన్న న్యూరల్ నెట్ వర్క్‌కు పునాదులు ఇవే. కాలక్రమంలో ఈ ఆవిష్కరణలు కంప్యూటర్లు కాస్తా మానవుల జ్ఞాపకశక్తి, నేర్చుకునే శక్తులను అనుకరించేంత శక్తి మంతమయ్యాయి.ఇప్పుడు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు సంగతి చూద్దాం. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన డేవిడ్ బేకర్, గూగుల్ డీప్‌మైండ్‌లో పని చేస్తున్న డెమిస్ హస్సాబిస్, జాన్ ఎం.బంపర్లకు ఈ పురస్కారం దక్కింది. ప్రొటీన్ డిజైన్‌ను కంప్యూటర్ల సాయంతో అంచనా వేసేందుకు బేకర్ ఒక పద్ధతిని ఆవిష్కరిస్తే, డీప్‌మైండ్ శాస్త్ర వేత్తలు ప్రొటీన్ల నిర్మాణాన్ని ముందస్తు అంచనా వేయగలిగారు. మన శరీరంలోని కణాలు, జీవక్రియలన్నింటికీ ప్రొటీన్లే కీలకం. అవి అతి సంక్లిష్టమైన పద్ధతుల్లో ముడుచుకుని ఉంటాయి. ఈ ముడతల్లోని తేడాలు, మార్పులు శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అణు నిర్మాణం, పరిసరాల్లోని నీటి పరమాణువులు ప్రొటీన్ ముడతలను నిర్ణయిస్తాయి. ఒకే ఒక్క ప్రొటీన్ లెక్కలేనన్ని ఆకారాల్లో ఉండవచ్చు. కొత్త ప్రొటీన్లను డిజైన్ చేసేందుకు అవసరమైన కంప్యూటర్ నియ మాలను బేకర్ అభివృద్ధి చేశారు. దీనివల్ల కొత్త చికిత్సలు, పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఇక గూగుల్ డీప్‌మైండ్ శాస్త్రవేత్తలు ఆల్ఫా–ఫోల్డ్ పేరుతో తయారు చేసిన సాఫ్ట్వేర్ అమైనో ఆమ్ల క్రమాన్ని బట్టి ప్రొటీన్ త్రీడీ నిర్మాణాన్ని ముందుగానే అంచనా కడుతుంది. పథ నిర్దేశకులకే నోబెల్...మౌలికాంశాలపై పరిశోధనలు ఎంత ముఖ్యమో ఈ అవార్డులు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. సీవీ రామన్ తరువాత భారతీయు లెవరికీ నోబెల్ అవార్డు దక్కలేదంటే... కారణం ఇదే. హరగోబింద్ ఖొరానా, ఎస్.చంద్రశేఖర్, వెంకీ రామకృష్ణన్ వంటి వారు విదేశీ విశ్వవిద్యాలయాల్లో మౌలిక అంశాలపైనే పరిశోధనలు చేసి నోబెల్ అవార్డులు సాధించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. నోబెల్ అవార్డులు సాధారణంగా సాంకేతిక, శాస్త్ర రంగాల్లో కొత్త మార్గాలను ఆవిష్కరించిన వారికే ఇస్తూంటారు. హాప్ఫీల్డ్ విషయాన్నే తీసుకుందాం. తొంభై ఒక్క సంవత్సరాల వయసున్న ఈయన ‘హాప్ ఫీల్డ్ నెట్వర్క్’ అని పిలుస్తున్న ఆవిష్కరణ కోసం 1980 నుంచే కృషి చేస్తున్నారు. హంటన్ ఆవిష్కరించిన ‘బోల్æ్ట›్జమన్ మెషీన్’ పద్ధతి కూడా దశాబ్దాల కృషి ఫలితమే. ఎంతో కాలం తరువాత 2010లో ఈ ఆవిష్కరణలు మెషీన్ లెర్నింగ్ రంగాన్ని సమూలంగా మార్చేశాయి. చాట్‌జీపీటీ వంటి వినియోగదారు ఉత్పత్తికి వీరి పరిశోధనలే మూలం. ఇదే విధంగా రసాయన శాస్త్రంలో బేకర్ ప్రొటీన్ నిర్మాణా లపై దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. 1998లో ఆయన తన తొలి ఆవిష్కరణ ‘రొసెట్టా’ను సిద్ధం చేశారు. ఇలాంటి ఆవిష్కరణల్లో భారతీయుల పాత్ర కూడా ఉందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కృత్రిమ మేధ, డిజిటల్ కంప్యూటర్లకు సంబంధించి శాస్త్రవేత్తల్లో ప్రాథమికంగా ఒక ఆలోచన మొదలైన 1950లలోనే గణాంక శాస్త్రవేత్తగా మారిన భౌతిక శాస్త్రవేత్త ప్రశాంత చంద్ర మహాలనోబిస్ ఒక భావనను ప్రతిపాదించారు. ‘మహాలనోబిస్ డిస్టెన్స్’ అని పిలిచే ఈ భావన వేర్వేరు డేటా పాయింట్లలోని తేడాలను లెక్కిస్తుంది. అనంతరం ఈ మహాలనోబిస్ డిస్టెన్స్‌ను కంప్యూటర్ సైన్స్, కృత్రిమ మేధ రంగాల్లో విస్తృతంగా వినియోగించారు. కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ) వ్యవస్థాపకుడు కూడా మహాలనోబిసే. సైబర్నెటిక్స్ ప్రాము ఖ్యతను అప్పట్లోనే గుర్తించారు. ఇందుకు తగ్గట్టుగా 1955లోనే నార్బెర్ట్ వీనర్ వంటి వారిని ఐఎస్ఐ విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఆహ్వానించారు. ద్విజేశ్ దత్తా మజుందార్ వంటి వారిని ఫజీ లాజిక్, న్యూరల్ నెట్వర్క్ వంటి రంగాల్లో పరిశోధనలకు వీనర్ పురిగొల్పారు.ప్రొఫెసర్ రాజ్ రెడ్డి భాగస్వామ్యం...1966లో అమెరికాలో డాక్టోరల్ విద్యార్థిగా ఉన్న రాజ్ రెడ్డి... మాటలను గుర్తించేందుకు ‘హియర్సే–1’ వంటి వ్యవస్థలను అభివృద్ధి చేశారు. మనుషుల్లానే కంప్యూటర్లు కూడా విషయాలను జ్ఞాపకం ఉంచుకునేలా, మనిషి మాటలను గుర్తించి అర్థం చేసుకోగల సామ ర్థ్యాన్ని కల్పించారు. ప్రస్తుతం కంప్యూటర్లు, రోబోలు మాటలను గుర్తించేందుకు ఉపయోగిస్తున్నది రాజ్ రెడ్డి అభివృద్ధి చేసిన ‘హియర్సే –2’, హార్పీ, డ్రాగన్ వంటి సిస్టమ్సే. ‘బ్లాక్‌బోర్డ్ మోడల్’ పేరుతో రాజ్ రెడ్డి అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్... కృత్రిమ మేధ వేర్వేరు మార్గాల నుంచి వచ్చే సమాచారాన్ని సమన్వయపరచుకునేందుకు కీలకంగా మారింది. ఈ ఆవిష్కరణకు గాను 1994లో ప్రొఫెసర్ రాజ్ రెడ్డికి కంప్యూటర్ సైన్సులో నోబెల్ అవార్డుగా పరిగణించే ‘టూరింగ్ అవార్డు’ దక్కింది. నోబెల్ అవార్డులు కృత్రిమ మేధ రంగంలో కీలక ఆవిష్కరణలకు దక్కడం బాగానే ఉంది. అయితే ఈ టెక్నాలజీతో వచ్చే ప్రమాదాలను కూడా ఈ ఏడాది నోబెల్ గ్రహీతలు గుర్తించారు. ఏఐ ఛాట్బోట్లు భయం పుట్టించేవే అని గూగుల్ కృత్రిమ మేధ విభాగపు అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తరువాత హింటన్ వ్యాఖ్యానించడం గమనార్హం. కృత్రిమ మేధ విస్తృత వాడకం వల్ల సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతాయనీ, ఏఐ కారణంగా పెరిగిపోయే ఉత్పాదకత, సంపద ధనికులకు మాత్రమే సాయపడుతుందనీ అంచనా కట్టారు. కృత్రిమ మేధ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే చిన్నా చితకా ఉద్యోగాలు అనేకం లేకుండా పోతాయని హెచ్చరించారు. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వాలు సార్వత్రిక సామాన్య వేతనం వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలని హింటన్ సూచించారు. భారతీయులకు నోబెల్ అవార్డు దక్కక పోవడం గురించి కూడా మాట్లాడుకుందాం. పరిశోధనలకు అవసరమైన నిధులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ ఒకదాన్ని ఏర్పాటు చేసింది. కాకపోతే ఇందుకు నిధులు ఎలా సమకూరుస్తారన్నది ఇంకా స్పష్టం కాలేదు. అంతర్జాతీయ స్థాయి శాస్త్ర రంగంలో భారత్ తనదైన ముద్ర వేయాలని కృత నిశ్చయంతో ఉంటే, యూనివర్సిటీల్లో మౌలికాంశాలపై పరిశోధనలకు పెద్దపీట వేయాలి. అలాగే అన్ని రకాల మద్దతు అందివ్వాలి. ఇదో దీర్ఘ కాలిక కార్యక్రమం అన్నది గుర్తు పెట్టుకోవాలి. అప్లైడ్ రీసెర్చ్, టెక్నా లజీ డెవలప్మెంట్లపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా తక్షణ సామాజిక, పారిశ్రామిక అవసరాలను తీర్చుకోవచ్చు. స్థూలంగా చెప్పాలంటే నిధుల కేటాయింపు విషయంలో మౌలికాంశాలపై పరిశోధనలతోపాటు అప్లైడ్ రీసెర్చ్, టెక్నాలజీలు రెండింటికీ మధ్య ఒక సమతూకం సాధించాలి. ప్రైవేటు రంగం కూడా ఈ ఏడాది నోబెల్ అవార్డు గ్రహీతల నుంచి స్ఫూర్తి పొందాలి. రసాయన శాస్త్ర నోబెల్ అవార్డులో సగం గూగుల్ శాస్త్రవేత్తలకు దక్కిన విషయం గమనార్హం. మౌలికాంశాలపై పరిశోధనలకు ఆ ప్రైవేట్ కంపెనీ పెట్టిన పెట్టుబడులు ఇందుకు కారణం. నోబెల్ స్థాయి అవార్డు రావాలంటే, మౌలికాంశాలపై పరిశోధనలకు పెట్టుబడులు సమకూరుస్తుండటమే మార్గం.దినేశ్ సి.శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఏఐ సాయంతో అరుదైన బట్టమేక పిట్ట పిల్ల జననం
జైసల్మేర్: రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో గల సుదాసరి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బ్రీడింగ్ సెంటర్లో శాస్త్రవేత్తలు ఏఐ సాయంతో కృత్రిమ గర్భధారణ పద్ధతిని అనుసరించి, అరుదైన బట్టమేక పిట్ట పిల్లకు జన్మనిచ్చారు. ప్రపంచంలో ఇటువంటి ఘనత సాధించిన దేశంగా భారత్ నిలిచిందని, ఇకపై అంతరించి పోతున్న అరుదైన బట్టమేకపిట్ట పక్షి జాతికి రక్షణ లభిస్తుందని సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బట్టమేక పిట్ట స్మెర్మ్‌ను సేవ్ చేసేందుకు బ్యాంకును ఏర్పాటు చేయడం ద్వారా ఈ అరుదైన పక్షి జాతి కాపాడుకోగలుగుతామని శాస్త్రవేత్త ఆశిష్ వ్యాస్ తెలిపారు.ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ హౌబారా కన్జర్వేషన్ ఫౌండేషన్ అబుదాబి (ఐఎఫ్హెచ్సీ)లో టైలర్ పక్షిపై ఈ తరహా పరీక్ష నిర్వహించామని, అది విజయవంతమైందని ఆశిష్ వ్యాస్ తెలిపారు. ఇండియాస్ వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)కి చెందిన శాస్త్రవేత్తలు గత ఏడాది అక్కడికి వెళ్లి ఈ టెక్నిక్ నేర్చుకున్నారన్నారు. తదనంతరం బట్టమేక పిట్ట పిల్లను సృష్టించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్నారు. సెప్టెంబర్ 20న టోనీ అనే ఆడ బట్టమేక పిట్టకు కృత్రిమ గర్భధారణ చేశామన్నారు.అది సెప్టెంబరు 24న గుడ్డు పెట్టిందని, ఆ గుడ్డును శాస్త్రవేత్తలు జాగ్రత్తగా పర్యవేక్షించారు. అంతిమంగా శాస్త్రవేత్తల కృషి ఫలించి, అక్టోబర్ 16న గుడ్డులోంచి బట్టమేక పిట్ట పిల్ల బయటకు వచ్చిందని వ్యాస్ తెలిపారు. ఆ పిల్లను వారం రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచి, అన్ని వైద్య పరీక్షలు చేశారు. ఇప్పుడు బట్టమేక పిట్ట పిల్ల ఆరోగ్యంగా ఉందని వ్యాస్ తెలిపారు. ఈ పద్ధతిని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ (ఏఐ)గా పిలుస్తారన్నారు. ఈ బట్టమేక పిట్ట పిల్లకు ఏఐ అనే పేరు పెట్టాలకుంటున్నామని వ్యాస్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: లోదుస్తులు చోరీ.. పోలీసులకు ఫిర్యాదు -
ప్రోటీన్లపై పరిశోధనకు నోబెల్
స్టాక్‌హోమ్: మనిషి ఆరోగ్యకరమైన జీవనానికి మూలస్తంభాలైన ప్రోటీన్ల డిజైన్లు, వాటి పనితీరుపై విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ సంవత్సరం రసాయనశాస్త్ర విభాగంలో నోబెల్ అవార్డ్ వరించింది. ప్రోటీన్లపై శోధనకుగాను శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్, డెమిస్ హసాబిస్, జాన్ జంపర్లకు 2024 ఏడాదికి కెమిస్ట్రీ నోబెల్ ఇస్తున్నట్లు కెమిస్ట్రీ నోబెల్ కమిటీ సారథి హెనర్ లింక్ బుధవారం ప్రకటించారు. పురస్కారంతోపాటు ఇచ్చే దాదాప రూ.8.4 కోట్ల నగదు బహుమతిలో సగం మొత్తాన్ని బేకర్‌కు అందజేయనున్నారు. మిగతా సగాన్ని హసాబిస్, జాన్ జంపర్లకు సమంగా పంచనున్నారు. జీవరసాయన శాస్త్రంలో గొప్ప మలుపు ‘‘అమైనో ఆమ్లాల క్రమానుగతి, ప్రోటీన్ల నిర్మాణం మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వీరి పరిశోధన రసాయనరంగంలో ముఖ్యంగా జీవరసాయన శాస్త్రంలో మేలి మలుపు. ఈ ముందడుగుకు కారకులైన వారికి నోబెల్ దక్కాల్సిందే’’ అని నోబెల్ కమిటీ కొనియాడింది. అమెరికాలోని సియాటెల్‌లో ఉన్న వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో డేవిడ్ బేకర్ పనిచేస్తున్నారు. హసాబిస్, జాన్ జంపర్ లండన్‌లోని గూగుల్ సంస్థకు చెందిన డీప్‌మైండ్ విభాగంలో పనిచేస్తున్నారు. ‘‘బేకర్ 2003లో ఒక కొత్త ప్రోటీన్‌ను డిజైన్‌చేశారు. అతని పరిశోధనా బృందం ఇలా ఒకదాని తర్వాత మరొకటి కొత్త ప్రోటీన్లను సృష్టిస్తూనే ఉంది. వాటిల్లో కొన్నింటిని ప్రస్తుతం ఫార్మాసూటికల్స్, టీకాలు, నానో మెటీరియల్స్, అతి సూక్ష్మ సెన్సార్లలో వినియోగిస్తున్నారు. వీళ్ల బృందం సృష్టించిన సాంకేతికతతో వెలువడిన ఎన్నో కొత్త డిజైన్ల ప్రోటీన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి’’అని నోబెల్ కమిటీలో ప్రొఫెసర్ జొహాన్ క్విస్ట్ శ్లాఘించారు. BREAKING NEWSThe Royal Swedish Academy of Sciences has decided to award the 2024 #NobelPrize in Chemistry with one half to David Baker “for computational protein design” and the other half jointly to Demis Hassabis and John M. Jumper “for protein structure prediction.” pic.twitter.com/gYrdFFcD4T— The Nobel Prize (@NobelPrize) October 9, 2024 నిర్మాణాలను అంచనా వేసే ఏఐ మోడల్ డెమిస్ హసాబిస్, జంపర్లు సంయుక్తంగా ప్రోటీన్ల నిర్మాణాలను ఊహించగల కృత్రిమమేధ నమూనాను రూపొందించారు. దీని సాయంతో ఇప్పటిదాకా కనుగొన్న 20 కోట్ల ప్రోటీన్ల నిర్మాణాలను ముందే అంచనావేయొచ్చు. చదవండి: ఏఐ మార్గదర్శకులకు...ఫిజిక్స్ నోబెల్ -
మెడిసిన్‌లో విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌కు నోబెల్
2024 సంవత్సరానికిగానూ మెడిసిన్ విభాగంలో ఇద్దరికి నోబెల్ బహుమతి ప్రకటించారు. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ బహుమతి దక్కింది. మైక్రోఆర్ఎన్ఏను ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. జీన్ రెగ్యులేషన్‌లో మైక్రో ఆర్ఎన్ఏ పాత్రను విశ్లేషించినందుకు ఆ ఇద్దరికి అవార్డును ప్రకటిస్తున్నట్లు నోబెల్ కమిటీ సోమవారం వెల్లడించింది.స్వీడెన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ మెడికల్ యూనివర్సిటీ నోబెల్ అసెంబ్లీ మెడిసిన్ లో విజేతను ప్రకటించింది. అవార్డు కింద 11 మిలియన్ల స్వీడిష్ క్రానర్(మిలియన్ అమెరికా డాలర్లు) బహుమతిగా అందిస్తారు. గతేడాది ఫిజియాలజీ, మెడిసిన్ విభాగంలో.. కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినందుకుగాను హంగేరియన్ శాస్త్రవేత్త కాటలిన్ కరికో , అమెరికాకు చెందిన డ్రూ వెయిస్మన్తకు నోబెల్ పురస్కారం వచ్చింది. BREAKING NEWSThe 2024 #NobelPrize in Physiology or Medicine has been awarded to Victor Ambros and Gary Ruvkun for the discovery of microRNA and its role in post-transcriptional gene regulation. pic.twitter.com/rg3iuN6pgY— The Nobel Prize (@NobelPrize) October 7, 2024వైద్యశాస్త్రంలో మొత్తంగా ఇప్పటివరకు నోబెల్ బహుమతిని 114 సార్లు ప్రకటించగా.. 227 మంది అందుకున్నారు. ఇందులో కేవలం 13 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. కాగా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్స్ బహుమతి విజేతల్లో ప్రతి ఏడాది ముందుగా మెడిసిన విభాగంలోనే ప్రకటిస్తారు. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్య విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించినవారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. వీటిని ఆల్ఫ్రెడ్ జయంతి సందర్భంగా జ డిసెంబర్ 10న విజేతలకు బహుమతులు అందజేస్తారు. -
దామగుండం.. రాడార్ గండం!
సాక్షి, హైదరాబాద్: దామగుండం.. అడవుల్లో నేవీ రాడార్ నిర్మాణం ప్రతిపాదనతో ఈ ప్రాంతం వార్తలకెక్కింది. తమ ఉనికికి ముప్పు వాటిల్లుతుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో చర్చనీయాంశంగా మారింది. జీవ వైవిధ్యానికి ముప్పు పొంచి ఉందని, అడవుల విధ్వంసానికి పాల్పడితే భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసిన వాళ్లమవుతామని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీనే దామగుండంలో రాడార్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతారని సమాచారం. ఔషధ మొక్కలకు నిలయం.. వందల ఏళ్ల ఆలయం వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం రిజర్వ్ ఫారెస్టు పచ్చని చెట్లతో జీవవైవిధ్యానికి మారుపేరుగా ఉంటుంది. వందల ఏళ్లుగా ప్రజలకు జీవనాధారంగా, జంతు జాతులు, పక్షులకు ఆలవాలంగా ఉంది. దాదాపు 206 రకాల జాతుల పక్షులకు ఈ అడవులు నెలవుగా ఉన్నాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలకు ఈ అడవి నిలయం. ఈ అడవుల మధ్యలోనే 400 ఏళ్ల నాటి రామలింగేశ్వర ఆలయం కూడా ఉంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ ఇలవేల్పుగా రామలింగేశ్వరుని కొలుస్తున్నారు. అడవి మధ్యలో దేవాలయానికి సంబంధించిన భూములు కూడా ఉన్నాయి. కాగా రాడార్ నిర్మాణం కోసం.. ఈ అడవుల్లోని 2,900 ఎకరాల భూమిని నావికాదళం అధికారులు స్వా«దీనం చేసుకోనున్నారు. అయితే ఈ క్రమంలో 12 లక్షల చెట్లను నరికివేస్తారంటూ ప్రచారం జరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. చుట్టుపక్కల గ్రామాలతో పాటు సమీపంలో ఉన్న హైదరాబాద్‌కూ తీవ్ర నష్టం వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, పశు పక్షాదులకు నిలువ నీడ లేకుండా పోతుందని చెబుతున్నారు. ఇక రాడార్ చుట్టూ కంచె వేస్తే తాము ఆలయానికి వెళ్లి పూజలు చేసుకోవడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని గ్రామస్తులు అంటున్నారు. తమ అడవిలో తాము పరాయివారిగా మారుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలేమిటీ నేవీ రాడార్? నౌకలు, జలాంతర్గాముల (సబ్మెరైన్ల)తో సమాచార మార్పిడిని (కమ్యూనికేషన్) మెరుగుపరుచుకునేందుకు నావికాదళం వెరీ లోఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్లను నిర్మిస్తుంది. దామగుండం సముద్రమట్టానికి 460 మీటర్ల ఎత్తులో ఉన్నందున శత్రు దేశాల కళ్లు కప్పి సమాచార మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుందని, వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం ఎంతో అనుకూలమైనదని నేవీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు దేశంలో తమిళనాడులోని తిరునల్వేలిలో కట్ట»ొమ్మన్ రాడార్ స్టేషన్ మాత్రమే ఉంది. దీన్ని 1990లో నిర్మించారు. వాస్తవానికి దామగుండంలో రెండో స్టేషన్ నిర్మించాలని ఏళ్ల క్రితమే నిర్ణయించినా ముందుకుసాగలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడమే కాకుండా ఇందుకోసం తూర్పు నావికాదళానికి కావాల్సిన 2,900 ఎకరాల భూమిని బదలాయించేందుకు అంగీకరించింది. ఈ స్టేషన్‌ను 2027 నాటికి పూర్తి చేయాలని నేవీ భావిస్తోంది. రాడార్ నిర్మాణంతో పాటు ఇక్కడ దాదాపు 3 వేల మంది నివాసం ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. రేడియేషన్ ముప్పు ఉండదంటున్న శాస్త్రవేత్తలు సాధారణంగా రాడార్ వ్యవస్థ చాలా తక్కువ (3– 30 కిలోహెడ్జ్) రేడియో ఫ్రీక్వెన్సీతో పనిచేస్తుంది. పైగా ఇక్కడ దాదాపు 450 మీటర్ల ఎత్తు టవర్లు ఉంటాయని, వీటివల్ల చుట్టుపక్కల ఉండే ఏ వస్తువుకు కానీ, వ్యక్తికి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదని రక్షణ శాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్ర జలాల గుండా చొచ్చుకుపోయే ఫ్రీక్వెన్సీ తరంగాల ఆధారంగా సబ్ మెరైన్లలోని సిబ్బందితో సమాచార మార్పిడి జరుగుతుందని పేర్కొంటున్నారు. 12 లక్షల చెట్లు తొలగింపు అవాస్తవం! ప్రాజెక్టు ఏర్పాటులో భాగంగా 12 లక్షల చెట్లను తొలగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆటవీ శాఖ అధికారులు మాత్రం ఇది అవాస్తవం అంటున్నారు. నేవీకి అప్పగించే భూమిలో చాలావరకు చిన్న పొదలు, ఖాళీ ప్రదేశం మాత్రమే ఉందని, దట్టమైన అటవీ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోరని చెబుతున్నారు. కేవలం 1.5 లక్షల చెట్లు తొలగించే అవకాశం ఉన్నట్లు ఫారెస్టు శాఖ అంచనా వేస్తోంది. రాడార్ స్టేషన్ ఏర్పాటు చేసే ప్రాంతం, ఇతర నిర్మాణాలు చేపట్టే ప్రదేశాల్లో మాత్రమే చెట్లను తొలగిస్తారు. అయితే ఈ నష్టాన్ని పూడ్చేందుకు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏకంగా 17.5 లక్షల మొక్కలు నాటేందుకు ఆటవీ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. అరుదైన జాతులు కనుమరుగు దామగుండం రాడార్ స్టేషన్ నిర్మాణంతో అడవుల్లో పచ్చదనం పోతుంది. అరుదైన జంతు జాతులు కనుమరుగవుతాయి. పర్యావరణానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతుంది. చెట్లను కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో లక్షలాది చెట్లను నరికేయడం చాలా దారుణం. సమీపంలోని హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వాతావరణం కూడా ప్రభావితం అవుతుంది. ఈ ప్రాజెక్టును వేరే ప్రాంతానికి తరలించాలి. – రుచిత్ ఆశ కమల్, క్లైమేట్ ఫ్రంట్ ఇండియా ఏం చేయలేని స్థితిలో ఉన్నాం రాడార్ స్టేషన్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. మాకెవరూ సహకరించడం లేదు. అసలు రాడార్ స్టేషన్‌తో ఎలాంటి పరిణామాలు ఉంటాయో సరిగ్గా అవగాహన కల్పించే వాళ్లు కూడా లేరు. దీంతో అది నిర్మించిన తర్వాత నిజంగా ఏం జరుగుతుందో తెలియట్లేదు. – పి.వెంకట్‌రెడ్డి, పూడూరు గ్రామవాసి -
Ghost Shark: కొత్త దెయ్యం షార్క్ దొరికింది
విల్లింగ్టన్: పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత లోతుల్లో సంచరించే కొత్త రకం చేపను న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ చేప కళ్లు చాలా నల్లగా ఉండటంతోపాటు చిమ్మచీకటిమయమైన సముద్రం లోతుల్లో సంచరిస్తుండటంతో దీనిని ‘ఘోస్ట్ షార్క్’గా పేర్కొంటున్నారు. ఘోస్ట్ షార్క్‌లను స్పూక్ షిఫ్ లేదా చిమేరా అని కూడా అంటారు. వీటిలో ముళ్లులు, పొలుసులు ఉండవు. శరీరం మొత్తం మెత్తగా మృదులాస్థితోనే తయారై ఉంటుంది. న్యూజిలాండ్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ అటా్మస్ఫిరికల్ రీసెర్చ్ బృందం ఈ చేప జాతిని కనుగొంది. న్యూజిలాండ్‌కు తూర్పున ఉన్న ఛాథమ్ రైస్ అనే సముద్రజలాల ప్రాంతంలో ఈ చేపలు జీవిస్తున్నాయి. ఉపరితలం నుంచి దాదాపు 2,600 మీటర్లలోతు మాత్రమే సంచరిస్తుంటాయి. మొత్తం పొడవులో సగం ఉండే పొడవాటి ముక్కు లాంటి నోరు వీటి ప్రత్యేకత. ‘‘లాటిన్లో అవియా అంటే బామ్మ. అందుకే దీనిని హరియోటా అవియా అని పేరు పెట్టాం. అంతరించి పోతున్న జాతుల జాబితాలో చేర్చే విషయమై ఆలోచిస్తున్నట్టు నిపుణులు తెలిపారు. -
చర్చ కాదు, రచ్చ
మాట్లాడగలగడం, మేధ వికసించడం మానవ చరిత్రలో మహత్తర ఘట్టాలంటారు శాస్త్రవేత్తలు. అవి లేకపోతే మనిషి మనుగడా, ఆ మనుగడతో పెనవేసుకున్న ప్రపంచమూ ఇప్పటిలా ఉండేవే కావు. మేధ జ్ఞానాన్ని పెంపొందిస్తే, దానిని నలుగురికీ పంచేది మాటే. మాట నేర్చిన తొలిరోజుల్లో దాని ప్రభావానికి ఆశ్చర్య చకితుడైన మనిషి దానికి మహత్తును ఆపాదించి మంత్రంగా మార్చు కున్నాడు. నిత్య జీవనంలో దాని లౌకికమైన విలువనూ గుర్తించాడు. ఒంటరి మనిషిలో స్వగతంగా ఉన్న మాట, మరో మనిషి జత కాగానే సంభాషణ అయింది; మరికొందరు జత పడితే చర్చ అయింది; శ్రోతలు పెరిగిన కొద్దీ ప్రసంగమైంది. వీటిలో ప్రతి ఒక్కటీ జ్ఞానవ్యాప్తికి వాహిక అయింది. చర్చనే వాద, ప్రతివాదమనీ; సంవాదమనీ; ఆంగ్లంలో డిబేట్, డిస్కషన్ అనీ అంటున్నాం. చర్చలేని సందర్భం మానవ జీవితంలో ఉండనే ఉండదు. కుటుంబ స్థాయి నుంచి, దేశస్థాయి వరకూ నిరంతరం చర్చ సాగుతూనే ఉంటుంది. చర్చకు వస్తువు కాని విషయమూ ఉండదు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగినట్టే మానవ ప్రపంచం చర్చ చుట్టూ తిరుగుతుంది. దేనినైనా సరే చర్చించే అభ్యాసం మనకు కొత్తది కాదంటూ నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ ‘ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్’(సంవాద భారతీయుడు) అనే పుస్తకమే రాశాడు. రామాయణ, మహాభారతాల్లో, భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో చర్చలూ, వాదప్రతివాదాలూ ఎలా సాగాయో ఎత్తిచూపాడు. హెచ్చు, తగ్గుల సమాజంలో కిందిమెట్టు మీద ఉన్న స్త్రీ, పురుషవర్గాల గొంతుకూ మన సంవాద సంప్రదాయం ఎంతోకొంత చోటిచ్చిందన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం వేళ్ళు చర్చలోనే పాతుకున్నాయంటూ, ప్రత్యేకించి మన దేశంలోని రకరకాల అసమానతలను ప్రజాస్వామికంగా పరిష్కరించుకోడానికి మనదైన సంవాద సంప్రదాయం స్ఫూర్తినిస్తుందన్నాడు. రామాయణంలో రాముడికి పట్టాభిషేక నిర్ణయాన్ని దశరథుడు అందిరినీ సంప్రదించే తీసుకుంటాడు. జాబాలికి, రాముడికి జరిగిన సంవాదం మరో ఉదాహరణ. పరలోకం లేదనీ, పితృవాక్పాలన అర్థరహితమనీ, ప్రత్యక్షంగా కనిపించే రాజ్యాన్ని అనుభవించమనీ జాబాలి అన్నప్పుడు రాముడు అతని మాటలు ఖండిస్తూ, నువ్వు చెప్పినట్లు చేస్తే ప్రజలు నన్నే ఆదర్శంగా తీసుకుని విచ్చలవిడిగా సంచరిస్తారంటాడు. విభీషణ శరణాగతి లాంటి ప్రతి సందర్భంలోనూ రాముడు సహచరులతో చర్చించే నిర్ణయం తీసుకుంటాడు. మహాభారతంలో ధర్మరాజు తనను జూదంలో ఒడ్డి ఓడినప్పుడు; తన్నోడి నన్నోడెనా, లేక నన్నోడి తన్నోడెనా అన్న చర్చను ద్రౌపది సభాముఖంగా లేవదీస్తుంది. ధర్మరాజు యుద్ధానికి విముఖుడైనప్పుడు యుద్ధపక్షాన వాదిస్తుంది. బృహదారణ్యకో పనిషత్తులో గార్గి అనే విదుషీమణి యాజ్ఞ్యవల్క్యునితో వాదోపవాదాలు జరిపి ఓటమిని హుందాగా ఒప్పుకుంటుంది. యాజ్ఞ్యవల్క్యునికి, అతని భార్య మైత్రేయికి జరిగిన సంవాదం గురించి కూడా ఉపనిషత్తు చెబుతుంది. ప్రత్యామ్నాయ చింతన నుంచి, ప్రతివాదం నుంచి, ప్రతిపక్షం నుంచే జైన, బౌద్ధ తాత్వికతలు అభివృద్ధి చెందాయి. అద్వైతవాది అయిన శంకరాచార్యుడు, కర్మవాది అయిన మండనమిశ్రునితోనూ, అతని భార్య ఉభయభారతితోనూ రోజుల తరబడి వాదోపవాదాలు జరిపి ఓడిస్తాడు. ఇప్పటిలా ప్రచురణ, ఎలక్ట్రానిక్, ఇంటర్నెట్ ఆధారిత సామాజిక మాధ్యమాలు లేని కాలంలో సైతం మనిషి తనే సంచార మాధ్యమంగా మారి, దూరభారాలను జయించి పండిత పరిషత్తులను మెట్టాడు; వాద, ప్రతివాదాలలో ప్రకర్షను చాటి జ్ఞానవిజ్ఞాన వ్యాప్తికి వేగుచుక్క అయ్యాడు. అలాంటి ఒక పండిత స్పర్థలోనే శ్రీనాథ మహాకవి ‘‘పగుల గొట్టించి తుద్భటవివాద ప్రౌఢి గౌడడిండమభట్టు కంచుఢక్క’’ అని చెప్పుకున్నాడు. నిన్నమొన్నటి వరకూ కాశీ, బెంగాల్‌లోని నవద్వీపం మొదలైనవి విద్వత్పరీక్షలకు పట్టుగొమ్మలుగా ప్రసిద్ధికెక్కాయి. అయల సోమయాజుల గణపతిశాస్త్రి అనే పండితుడు ఆంధ్రదేశం నుంచి నవద్వీపం వెళ్ళి అక్కడి విద్వజ్జనాన్ని మెప్పించి ‘కావ్యకంఠ’ బిరుదును అందుకొని వచ్చాడు. పురాతన నాగరికతలన్నీ సంవాద సంప్రదాయాన్ని పెంచి పోషించినవే. ప్రాచీన గ్రీకు తాత్వికుడు సోక్రటిస్ అభివృద్ధి చేసిన ప్రశ్నోత్తరాల సంవాద శైలి ‘సోక్రటిక్ డైలాగ్’ పేరిట ఒక వచనరచనా ప్రక్రియగా సారస్వతంలో భాగమైంది. సాంస్కృతిక పునరుజ్జీవనం దరిమిలా యూరప్‌లో ఆధునిక చర్చారూపాలు అభివృద్ధి చెంది, సంవాద సమాజాలు ఏర్పడి వైజ్ఞానిక వికాసాన్ని కొత్తపుంతలు తొక్కించాయి. సంవాద ప్రక్రియ నిర్దిష్టమైన రూపురేఖలు తెచ్చుకుని పాఠశాల నుంచి, విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యలో భాగమైంది. అందులో పోటీపడే విద్యార్థుల తర్ఫీదుకు శిక్షకులు అవత రించారు. ఆల్ఫ్రెడ్ స్నైడర్, మాక్స్ వెల్ ష్రూనర్ అనే ఇద్దరు శిక్షకులు సంవాదకళను అనేక కోణాల నుంచి చర్చిస్తూ, నిర్వచిస్తూ ‘మెనీ సైడ్స్– డిబేట్ ఎక్రాస్ కరిక్యులమ్’ అనే పుస్తకం వెలువరించారు. ఈ మొత్తం నేపథ్యం నుంచి చూసినప్పుడు మన పరిస్థితే ఆశ్చర్యకరం. రాచరికపు రోజుల్లోనే మనం తీర్చిదిద్దుకున్న సంవాద సంప్రదాయం ప్రజాతంత్రంలో అక్కరకు రాకుండాపోయింది. ఇన్నేళ్ళ ప్రజాస్వామ్యంలో కీలక సంవాద కేంద్రాలైన శాసనసభలకు వేలసంఖ్యలో ప్రతినిధులను పంపుకున్నా, పంపుతున్నా సంవాద విధివిధానాల శిక్షణ అంచెలంచెల విద్యలో ఇప్పటికీ భాగం కాలేదు. ఎక్కడైనా పాఠ్యేతర అంశంగా కొన ఊపిరితో ఉన్నా కార్పొరేట్ చదువులు దానినీ పాడి ఎక్కించాయి. కొత్తగా సామాజిక మాధ్యమాల వెల్లువ సంవాదపు బరిలో ప్రతి ఒకరికీ అవకాశమిచ్చి మేలు చేసినా విధివిధానాల శిక్షణ లేక చర్చ రచ్చగా మారడం; ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు కావలసిన సంవాదం విషవాయువు కావడం చూస్తున్నాం! -
పరిశోధనల సులభతరం ఇలాగా!
ఐఐటీ ఢిల్లీతో పాటు దేశంలోని మరికొన్ని విద్యా సంస్థలకు ఇటీవల ఓ నోటీసు వచ్చింది. గడచిన ఐదేళ్ల కాలంలో పరిశోధనల కోసం అందుకున్న నిధులపై జీఎస్టీ ఎందుకు చెల్లించలేదని అందులో ప్రశ్నించారు. జీఎస్టీ సకాలంలో చెల్లించనందుకు జరిమానా, వడ్డీ కలిపి రూ.120 కోట్లు కట్టమని కూడా ఆదేశించారు. రెండేళ్ల క్రితమే సాంకేతిక పరిజ్ఞాన పరికరాలపై జీఎస్టీని 5 నుంచి 18 శాతానికి పెంచారు. ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థలు ఎదుర్కొంటున్న ఇంకో సమస్య రెడ్ టేపిజమ్. ప్రతిష్ఠాత్మక సైన్సు అవార్డులను కూడా నగదు బహుమతి లేకుండానే అందిస్తున్నారు. ఉన్నత విద్యారంగంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పరిశోధనలను తగ్గించేందుకు ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే వీటిని చూడాలి. ఐఐటీ ఢిల్లీతో పాటు దేశంలోని మరికొన్ని విద్యా సంస్థలకు వచ్చిన జీఎస్టీ చెల్లింపుల నోటీసుపై శాస్త్రవేత్తలు స్పందించలేదు కానీ, ‘ఇన్ఫోసిస్’ మాజీ సీఎఫ్‌వో, ఇన్వెస్టర్ టీవీ మోహన్ దాస్ పై మాత్రం దీన్ని ‘అతి నీచమైన పన్ను తీవ్రవాదం’ అని వ్యాఖ్యానించారు.నెల క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పరిశోధనల కోసం ఉపయోగించే రసాయనాలపై కస్టమ్స్ డ్యూటీని 10 నుంచి 150 శాతానికి పెంచడం... అకస్మాత్తుగా పెరిగిన ప్రాజెక్టు ఖర్చులతో శాస్త్రవేత్తలు, విద్యా సంస్థలు బెంబేలెత్తడం తెలిసిన విష యమే. పరిశోధనలకు అవసరమైన ఎంజైములు, రీజెంట్లు చాలా వరకూ విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవే. కస్టమ్స్ డ్యూటీ పెంచ డమంటే వాటిని దాదాపుగా అడ్డుకోవడమే. శాస్త్రవేత్తల నిరసనల నేప థ్యంలో ప్రభుత్వం దిగి వచ్చింది. సృజనాత్మక ఆలోచనలు వృద్ధిచెందాలంటే, ‘రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్’(ఆర్ అండ్ డీ)కి మరిన్ని నిధులు ఇవ్వాల్సి ఉండగా... కేంద్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం గమనార్హం.జీఎస్టీ నోటీసులు, కస్టమ్స్ డ్యూటీ పెంపులు ఏవో చెదురు ముదురు సంఘటనలు కావచ్చునని అనుకునేందుకూ అవకాశం లేదు. ఉన్నత విద్యా రంగంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పరిశోధనలను తగ్గించేందుకు ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే వీటిని చూడాల్సి ఉంది. రెండేళ్ల క్రితమే సాంకేతిక పరిజ్ఞాన పరికరాలపై జీఎస్టీని 5 నుంచి 18 శాతానికి పెంచడం, తాజాగా నిధు లపై జీఎస్టీ నోటీసులు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఈ రెండు నిర్ణయాల వల్ల పరికరాలను సమకూర్చుకోవడం, పరిశోధనల నిర్వహణ ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. ఈ విషయంపై ఆందో ళనతోనే కేంద్ర ప్రభుత్వానికి శాస్త్ర అంశాల్లో సలహా ఇచ్చే విభాగంకేంద్రానికి ఒక నోట్‌ను పంపింది. జీఎస్టీ వసూళ్లు, పన్నుల పెంపుల ప్రభావం నుంచి ప్రైవేట్ సంస్థలు సర్దుకోవచ్చుననీ, ప్రభుత్వ సంస్థల్లో ఇందుకు అవకాశాలు తక్కువనీ ఈ నోట్లో స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నోట్‌పై స్పందిస్తూ, సంస్థలకు కేటాయించే నిధు లను ఎక్కువ చేస్తున్నాము కాబట్టి జీఎస్టీతో నష్టమేమీ ఉండదని నమ్మబలికే ప్రయత్నం చేసింది. కానీ పరిస్థితిని సరిచేసేందుకుచేసింది మాత్రం శూన్యం. పరిశోధనలకు ఊతం ఇలా కాదు...ఏ దేశంలోనైనా స్వేచ్ఛగా పరిశోధనలు చేసుకునే వాతావరణం ఉన్నప్పుడు కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయి. తగినన్ని నిధులు సమకూర్చడం, భాగస్వామ్యాలను ప్రోత్సహించడం.... పన్నులు, నిబంధనల విషయంలో ఆచితూచి వ్యవహరించడం అవసరం. ఈ అన్ని అంశాలు భారత్‌లో ఇప్పుడు కొరవడ్డాయనే చెప్పాలి. నిధుల విషయాన్ని చూద్దాం. జాతీయ స్థూల ఉత్పత్తిలో ఒక శాతం కంటే తక్కువ. అన్ని రకాల ప్రాజెక్టులకు ఒకే ఛత్రం కింద నిధులిస్తామని ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ’ (ఏఎన్ ఆర్ఎఫ్) ఒకటి ఏర్పాటు చేసేందుకు ఐదేళ్లుగా ప్రయత్నాలు సా...గుతూనే ఉన్నాయి. మరోవైపు పరిశోధనలకు తాము నిధులు ఎక్కువ చేశామని ప్రభుత్వం బాకా ఊదుతూనే ఉంది. ఐదేళ్ల కాలంలో కొత్త సంస్థ ద్వారా 50 వేల కోట్ల రూపాయలు ఇస్తామని పదే పదే సంకల్పం చెప్పుకుంటోంది. ఈ మొత్తం కూడా వట్టి మాటే. తామిచ్చేది 30 శాతమనీ, మిగిలిన 70 శాతాన్ని ఆయా సంస్థలు ప్రైవేట్ రంగంలో సేకరించుకోవాలనీ ప్రభుత్వమే తేల్చి చెప్పింది. అంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తం ఏడాదికి రూ.30,000 కోట్లు మాత్రమే అవుతుంది. ఇది ప్రస్తుత కేటాయింపుల కంటే చాలా తక్కువ. 2024–25లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖకు రూ.16,628 కోట్లు కేటాయించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఏఎన్ ఆర్ఎఫ్ ఏర్పాటు ఆలోచన వెనుక ‘ఆర్ అండ్ డీ’ బరువును తగ్గించుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని స్పష్టం అవుతోంది. అదెలా చేయాలో మాత్ర స్పష్టత కనిపించడం లేదు. దేశంలో ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థలు ఎదుర్కొంటున్న ఇంకో సమస్య రెడ్ టేపిజమ్. నిధులు పొందేందుకు, పంపిణీ, స్కాలర్షిప్, ఫెలోషిప్‌ల నిర్ధారణ వంటి అనేక అంశాల్లో అధికారుల జోక్యం ఉంటోంది. మేకిన్ ఇండియా వంటి వాటికి అనుగుణంగా ప్రాజెక్టుల రూపకల్పన ఇంకో సమస్య. వీటన్నింటి మధ్య తాము పరిశోధనలపై దృష్టి ఎలాకేంద్రీకరించగలమని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్త ఒకరు ‘ఎక్స్’ వేదికగా వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పరిశోధనలకు అడ్డంపడే ఇలాంటి విషయాలు ఇంకా అనేకమున్నాయి. అంతర్జా తీయ ప్రయాణాలకు అందించే నిధులపై నియంత్రణ వాటిల్లో ఒకటి. కీలకమైన శాస్త్ర అంశాల్లో పలు దేశాలు కలిసి పని చేయడం ఎక్కువ అవుతున్న ఈ కాలంలో కాన్ఫరెన్సులకు వెళ్లేందుకు ఇలాంటి వంకలు పెట్టడం గమనార్హం.సైన్ ్స వ్యవహారాల్లో సౌలభ్యమెంత?గత ఏడాది ఫౌండేషన్ ఫర్ అడ్వాన్సింగ్ సైన్ ్స అండ్ టెక్నాలజీ (ఫాస్ట్) ఒక సర్వే చేసింది. టాప్–10 పరిశోధన సంస్థల్లో పని చేస్తున్న శాస్త్రవేత్తలను ప్రశ్నించి దేశంలో పరిశోధనలు చేసేందుకు అనువైన వాతావరణం ఎలా ఉందో అంచనా కట్టింది. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మాదిరిగా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ సైన్ ్స’ అన్నమాట. 2015లో ప్రధాని నరేంద్ర మోదీనే ఈ పదాన్ని పరిచయం చేశారు. ‘ఫాస్ట్’ చేసిన సర్వేలో స్థూలంగా, ఈజ్ ఆఫ్ డూయింగ్ సైన్స్ బాగుందని ఆరు శాతం మంది కితాబిచ్చారు. నిధులు పొందే విషయంలో మాత్రం యావరేజ్ కంటే తక్కువని తేల్చారు. నిధులిచ్చే సంస్థలు గ్రాంట్లు ఇచ్చేందుకు తీసుకునే సమయం, నిధుల మొత్తం, ప్రాజెక్టు ఉద్దేశం వంటి అంశాల ఆధారంగా పనిచేస్తున్నాయని వీరు చెప్పారు. ఇకఅందించిన నిధులను స్వేచ్ఛగా వాడుకునే అవకాశం ఉందా? విదే శాల్లో జరిగే సదస్సులకు వెళ్లగలుగుతున్నారా? పరిశోధనలకు అవస రమైన వనరులు, పరికరాలు అందుబాటులో ఉన్నాయా? అన్న ప్రశ్న లకు శాస్త్రవేత్తల సమాధానం ‘అధ్వాన్నం’ అని!ప్రతిభను ఎప్పటికప్పుడు గుర్తించి ప్రోత్సహించడం, ‘ఆర్ అండ్ డీ’ వాతావరణం బాగుందని అనేందుకు ఇంకో గుర్తు. కానీ శాంతి స్వరూప్ భట్నాగర్ పేరిట ఇస్తున్న ప్రతిష్ఠాత్మక అవార్డులను కూడా ‘విజ్ఞాన్ పురస్కార్’ పేరిట నగదు బహుమతి లేకుండానే అందిస్తు న్నారు. 2022లో సైన్ ్స అవార్డులను నిలిపివేసిన ప్రభుత్వం నోబెల్ స్థాయిలో ‘విజ్ఞాన రత్న’ అవార్డు ఒకదాన్ని అందిస్తామని చెప్పింది. గత నెలలో ఈ అవార్డును ప్రకటించారు కూడా. ఇందులోనూ నగదు ప్రస్తావన లేదు. ఆసక్తికరంగా ఉత్తర ప్రదేశ్, హరియాణా ప్రభుత్వాలు అందించే రాష్ట్ర స్థాయి అవార్డులైన ‘విజ్ఞాన్ గౌరవ్’, ‘విజ్ఞాన్ రత్న’ (జాతీయ అవార్డుకు ముందే అమల్లో ఉన్న రాష్ట్ర స్థాయి అవార్డు)లకు రూ. 5 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు!ఒకవైపు భారత్‌లో సైన్సును సులభతరం చేయడం తగ్గిపోతూండగా, చైనా మున్ముందుకు దూసుకెళుతోంది. భారత్ తన జీడీపీలో 0.66 శాతం పరిశోధనలకు వెచ్చిస్తూండగా, చైనా 2.4 శాతం ఖర్చు పెడుతోంది. చైనాలోని పెకింగ్, ట్సింగ్హువా యూనివర్సిటీల పరి శోధన బడ్జెట్ మనం విద్యకు పెడుతున్న దాని కంటే ఎక్కువ ఉండటం చెప్పుకోవాల్సిన అంశం. ఈ విషయాన్ని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ వి. రాంగోపాల్ రావు ఇటీవలే ఒక సమావేశంలో తెలిపారు. పరిశోధనల నిధుల విషయంలో యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలను పస్తు పెట్టడం అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను మార్చాలన్న ఆకాంక్షను నెరవేర్చేది ఎంతమాత్రం కాదన్నది గుర్తించాలి.- రచయిత సైన్ ్స అంశాల వ్యాఖ్యాత- (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) దినేశ్ సి. శర్మ -
రెండు 'టీ' లకు మించొద్దు..! లేదంటే ఆ సమస్య తప్పదు..!
రోజూ రెండు కప్పుల టీ, మరో రెండు కప్పుల కాఫీ తాగేవారిలో మతిమరపు సమస్య అంత తేలిగ్గా రాదని అంటున్నారు చైనా పరిశోధకులు. టీ, కాఫీలను చాలా పరిమితంగా అంటే రోజూ రెండు కప్పులకు మించకుండా తాగేవారిలో కేవలం మతిమరపు (డిమెన్షియా) నివారితం కావడమే కాదు... పక్షవాతం వచ్చే అవకాశాలూ తక్కువే అంటున్నారు ఈ పరిశోధన నిర్వహించిన పరిశోధకులు. టీ కాఫీలు తాగని వారితో పోల్చినప్పుడు... రోజూ రెండు కప్పుల చొప్పున టీ, కాఫీ తాగేవారిలో మతిమరపు రావడమన్నది దాదాపు 28 శాతం తక్కువని పేర్కొంటున్నారు చైనాకు చెందిన టియాంజిన్ మెడికల్ యూనివర్సిటీ అధ్యయనవేత్తలు డాక్టర్ యువాన్ ఝాంగ్, ఆయన బృందం. దాదాపు 5,00,000 మందిపై పదేళ్ల పాటు వారు బ్రిటన్‌లో సుదీర్ఘ పరిశోధన చేశారు. కాఫీ, టీల మీద ఇలా పరిశోధనలు జరగడం మొదటిసారి కాదు. గతంలోనూ జరిగాయి. ఈ ఫలితాల మీద కొన్ని భిన్నాభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. రీడింగ్ యూనివర్సిటీకి చెందిన ప్రయుఖ న్యూట్రిషనల్ సైన్సెస్ నిపుణురాలు డాక్టర్ కార్లోట్ మిల్స్ మాట్లాడుతూ... ‘‘మతిమరపు నివారణకు కేవలం కాఫీ, టీలు మాత్రమే కారణం కాకపోవచ్చు. ఇతర అంశాలూ కారణమయ్యే అవకాశాలూ లేక΄ోలేద’’న్న అభి్ప్రాయం వ్యక్తం చేశారు. ఇంకొందరు అధ్యయనవేత్తలు సైతం ఈ పరిశోధనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాఫీ, టీలలో మెదడు, నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే పదార్థాలుంటాయి. వాటిని పరిమితికి మించి తీసుకుంటే కలిగే ప్రమాదాల గురించి వారు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు గతంలో ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో రోజుకు ఆరు కప్పులకు మించి కాఫీ/టీ తాగేవారిలో 53% మందికి డిమెన్షియా వస్తుందని తెలిసిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అందుకే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ‘‘కేవలం రెండే’’ అన్న పరిమితికి గట్టిగా కట్టుబడి ఉండాలంటున్నారు. ఈ పరిశోధన పలితాలు ప్రముఖ మెడికల్ జర్నల్ ప్లాలస్ మెడిసిన్’ (PLos Medicine)లో ప్రచురితమయ్యాయి.(చదవండి: కిస్మిస్ని నీళ్లల్లో నానబెట్టే ఎందుకు తినాలో తెలుసా..!) -
పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివేనా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివనే చాలామంది భావిస్తారు. అంతెందుకు పూర్వకాలం మన పెద్దవాళ్లు అప్పుడే పితికిన పాలనే నేరుగా తాగేవారు కూడా. ఇలా తాగితే మంచి పోషకాలు అందుతాయని విశ్వసించేవారు. అయితే శాస్త్రవేత్తుల ఇలా అస్సలు తాగకూడాదని చెబుతున్నారు. దీని వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తయాని చెబుతున్నారు. పచ్చిపాలు తాగడం మంచిదనే భావన కేవలం అపోహే అనే కొట్టిపారేస్తున్నారు. అంతేగాదు పాశ్చరైజ్డ్ పాలను మాత్రమే తాగాలని పిలుపునిస్తున్నారు. అసలు పచ్చిపాలు ఆరోగ్యానికి ఎందుకు ప్రమాదకరం? శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఏం వెల్లడయ్యిందంటే..పాశ్చరైజ్ చేసిన పాల కంటే పచ్చిపాలే రుచిగా ఉంటాయని చాలామంది ప్రగాఢంగా నమ్ముతారు. దీని వల్ల లాక్టోస్ అసహనం ఉండదని, అలెర్జీలకు చికిత్స చేయగలదని చెబుతుంటారు. ముఖ్యంగా గట్ ఆరోగ్యానికి తోడ్పడుతుందని వాదనలు వినిపిస్తునన్నాయి. కానీ శాస్తవేత్తల పరిశోధనల్లో ఇవన్ని నిజం కాదని తేలింది. అంతేగాదు పాశ్చరైజ్డ్ పాలతో పోలిస్తే పచ్చి పాలు తాగడం లేదా సంబంధిత ఉత్పత్తులను తీసుకోవడం చాలా ప్రమాదమని అధ్యయనంలో వెల్లడయ్యింది. అలాగే ఆరోగ్యానికి సురక్షితం కాదని తేలింది. అదే పాశ్చరైజేషన్ పాల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం చాలా తక్కువని తెలిపారు. ఎందుకు ఆరోగ్యానికి ప్రమాదకరం అంటే..పచ్చిపాలల్లో సూక్ష్మక్రిములు ఎక్రువగా ఉంటాయి. ఇవి ఆహార విషాన్ని కలిగిస్తాయి. ఇవి తీసుకోవడం వల్ల ఉదర తిమ్మిరి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తయని చెబుతున్నారు. పచ్చిపాలల్లో సాల్మొనెల్లా, ఇ. కోలి, లిస్టేరియా, క్యాంపిలోబాక్టర్ వంటి సూక్ష్మక్రిములు ఉంటాయిని, ఇవి అనారోగ్యానికి కారణమవుతాయని చెప్పారు. పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తుల వల్ల 840 రెట్లు అనారోగ్య ప్రమాదం, 45 రెట్లు ఆస్పత్రిలో చేరే అవకాశం ఉంటుందని అన్నారు. పచ్చిపాలు తాగే అలవాటు ఉన్నవాళ్లు ఎవరైనా దీర్ఘకాలంలో కచ్చితంగా అనారోగ్యానికి గురవ్వుతారని వైద్యలు హెచ్చరించారుముఖ్యంగా చిన్నారులు, యువకులు, గర్భిణీస్త్రీలు, వృద్ధులు, కేన్సర్, మధుమేహం లేదా హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ వంటి పరిస్థితులు ఉన్నవారికి ఈ పాలు మరింత ప్రమాదకరమని చెప్పారు. అంతేగాదు అమెరికాలో పచ్చిపాలను విక్రయించడం చట్టవిరుద్ధం. కొన్ని రాష్ట్రాల్లో ఈ పాల విక్రయానికి షరతులతో కూడిన అనుమతి ఉంది. కేవలం రైతు నేరుగా పచ్చిపాలను విక్రయిస్తేనే అక్కడ ప్రజలు వినియోగించవచ్చు. అదీగాక ఇటీవల కాలంలో బర్డ్ ఫ్లూ కలకలం పచ్చిపాల వినియోగాన్ని మరింతగా పరిమితం చేసింది. పక్షులు నుంచి పౌల్ట్రీ అలా యూఎస్‌లోని ఆవులకు సైతం ఈ వైరస్ వ్యాప్తి చెందడం జరిగింది. దీని కారంణంగా నలుగురు వ్యక్తులు మరణించారు కూడా. ఈ నేపథ్యంలో పచ్చిపాల వినియోగంపై మరింత ఆందోళనలు వెల్లువెత్తాయి. పాశ్చరైజేషన్ అంటే..? ఇది పాలను సురక్షితంగా చేస్తుందా..?పాల భద్రతకు పాశ్చరైజేషన్ ముఖ్యం. పాలను 145 డిగ్రీల ఫారెన్ హీట్‌కు గురిచేయడం వల్ల అనారోగ్యానికి కారణమయ్యే జెర్మ్స్, సూక్ష్మజీవులు చనిపోతాయి. అలాగే ఈ ప్రక్రియలో పాలు త్వరతిగతిన చల్లబడిపోతాయి కూడా. పశ్చిపాలల్లో ఉండే పోషలకాలే పాశ్చరైజేషన్ పాలల్లో కూడా ఉండటమే కాకుండా వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. (చదవండి: కివీ కర్రీ..శ్రీలంక ఫేమస్ రెసిపీ..!) -
చిన్నారుల్లో కోపం స్మార్ట్ గాడ్జెట్స్ ప్రభావం..
సాక్షి, అమరావతి: స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ వాడకం చిన్నారుల్లో ప్రతికూల భావోద్వేగాలను పెంచుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఎల్రక్టానిక్ పరికరాలు వాడే ప్రీ స్కూల్ చిన్నారుల్లో చిరాకు, కోపం ఎక్కువగా కనిపిస్తోందని గుర్తించారు. కెనడా లోని షెర్‌బ్రూక్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం.. స్మార్ట్ ఫోన్ వాడకం చిన్నారుల్లో స్వీయ నియంత్రణ, నైపుణ్యాల అభివృద్ధికి అవరోధం ఏర్పడుతోంది. మూడున్నరేళ్లు, నాలుగున్నరేళ్ల వయసు నుంచి టాబ్లెట్‌కు అలవాటుపడ్డ చిన్నారుల భావోద్వేగాలను పరిశీలించారు. ఇలాంటి చిన్నారుల్లో ఏడాది తర్వాత కోపం, నిరాశ విపరీతంగా పెరిగినట్టు గుర్తించారు. చిన్నారులు సొంత ప్రతికూల భావోద్వేగాలను నేర్చుకునే విధానం సాంకేతిక పరికరాల ద్వారా జరుగుతుండటం శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సంరక్షకుల పర్యవేక్షణలో బాల్య వికాసం జరిగితేనే.. సరైన భావోద్వేగం ప్రదర్శిస్తారని చెబుతున్నారు. ప్రతి ఇంట్లో చిన్నారుల అల్లరిని కట్టడి చేసేందుకు, ఏడుపును అదుపు చేసేందుకు స్మార్ట్ ఫోన్ అలవాటు చేయడం సరైన పద్ధతి కాదని అధ్యయనం చెబుతోంది. ఇది బాల్యం, యుక్తవయసులో చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందంటున్నారు. యునిసెఫ్ సైతం యునిసెఫ్ సైతం చిన్నారుల స్క్రీనింగ్ అలవాట్లను తీవ్రంగా తప్పుపడుతోంది. ఏడాది కంటే తక్కువ వయసున్న పిల్లలు ఎటువంటి సాంకేతిక పరికరాల నుంచి ఏమీ నేర్చుకోలేరని చెబుతోంది. వారికి స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు చూపించడం ద్వారా మెదడుపై ప్రతికూల ప్రభావం గురించి యునిసెఫ్ వైద్య బృందం సైతం హెచ్చరిస్తోంది. ఆఫ్–్రస్కీన్ అనుభవాలను అందించడం ద్వారా క్లిష్టమైన వాటిని కూడా చిన్నారులు నేర్చుకోవడంతో పాటు సామాజిక, అభిజ్ఞా నైపుణ్యాలు మెరుగుపడతాయని చెబుతున్నారు. చిన్నారుల్లో మెదడు బాహ్య ప్రపంచం నుంచి గ్రహించిన వాటితోనే అభివృద్ధి చెందుతుందని, కథలు వినడం, పుస్తకాలను బిగ్గరగా చదవడం, చిత్రాలను గుర్తించడం ద్వారా ప్రేరణ పెరుగుతోందని వైద్యులు నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు స్క్రీన్ సమయం ఇవ్వకూడదని, నాలుగేళ్ల లోపు చిన్నారులకు పాఠ్యాంశాల పరమైన వాటికి, గంటలోపు మాత్రమే స్క్రీనింగ్‌కు కేటాయించాలని సూచిస్తోంది. తాజా పరిశోధనలో 75 నిమిషాలు, అంతకంటే ఎక్కువ రోజువారీ స్క్రీన్ సమయం ఉండటం గమనార్హం. స్క్రీనింగ్‌తో అనారోగ్యం మన ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ల స్క్రీన్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. స్క్రీన్ సమయంలో కదలకుండా ఒకేచోట కూర్చోవడంతో బరువు పెరగడం, ఊబకాయం సమస్యలు తలెత్తున్నాయి. ఇది యుక్త వయసు వచ్చేసరికి మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్, చిత్త వైకల్యానికి దారితీస్తున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలతో పాటు మాట్లాడే పదాలను తక్కువగా నేర్చుకోవడంతో పాటు డిప్రెషన్ ప్రమాదాన్ని మూడు రెట్లు పెంచుతాయని అధ్యయనంలో పాల్గొన్న వైద్యులు చెబుతున్నారు. -
వాతావ'రణం'
సాక్షి, అమరావతి: వాతావరణ మార్పులు మానవ జీవనాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. కట్టుబట్టలతో ఆవాసాలను వదులుకుని వలసలు పట్టాల్సిన దుస్థితిలోకి నెట్టేస్తున్నాయి. భారతదేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు గ్లోబల్ వార్మింగ్ దుష్ప్రభావాల బారిన పడుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు,, అనావృష్టి, సముద్ర మట్టం పెరుగుదల, వరదలు, ఇతర కాలుష్యాల విపత్తుల కారణంగా ఉన్న ప్రాంతాలను వదులుకుని వలస దారులు వెతుక్కుంటున్నారు. 2019లో దాదాపు 50 లక్షల మంది దేశంలో వివిధ ప్రదేశాల్లో తలదాచుకున్నట్టు గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ నివేదిక పేర్కొంది. 2050 నాటికి 4.50 కోట్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యే అవకాశం ఉందని క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ – దక్షిణాసియా నివేదిక తాజాగా ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. 2021 – 22 నుంచి దేశంలో గ్లోబల్ వార్మింగ్ 11 శాతం పెరిగిందని అమెరికాలోని కొలరాడోకు చెందిన యేల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ కమ్యూనికేషన్ రిసెర్చ్ సంస్థ ప్రకటించింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే నష్టాలు ఇవి.. » విపరీతమైన వేడి, కరువు, సముద్ర మట్టం పెరుగుదల, వరదలు వంటి వాతావరణ మార్పుల కారణంగా వలసలు పెరుగుతాయి. » వ్యవసాయం దెబ్బతినడంతో దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు వేరే ప్రాంతాలకు వలస పోతారు. » మొక్కలు, జంతు జాతులకు ముప్పు వాటిల్లుతుంది. » తీవ్రమైన వేడి తరంగాలు వంటి పర్యావరణ ప్రమాదాలు తలెత్తుతాయి.» ముఖ్యంగా ప్రజల జీవనానికి కరువు, నీటి కొరత, తీవ్రమైన వాయు కాలుష్యం, తీవ్రమైన తుపానులు, వరదలు ఆటంకం కలిగిస్తాయి.» వాతావరణ విపత్తులతో వలసల ప్రభావం మహిళలపై తీవ్రంగా పడుతోంది. కుటుంబంలోని పురుషుడు వలస వెళ్ళినప్పుడు స్త్రీలు వ్యవసాయం, కుటుంబ సభ్యుల సంరక్షణ బాధ్యతలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. » కుటుంబాలతో సహా వలస వెళ్లిన వారు సొంత భూమితో సంబంధాన్ని కోల్పోతున్నారు. భారత్ సహా దక్షిణాసియాకు ప్రమాద ఘంటికలువాతావరణ ప్రేరిత వలసలు దక్షిణాసియాను కుదిపేస్తున్నాయి. ప్రజల కష్టాలను పెంచి వలసలకు దారితీస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్‌లో నదులు కోతకు గురవుతున్నాయి. పాకిస్తాన్, భారతదేశంలో వరదలు పోటెత్తుతున్నాయి. నేపాల్‌లో హిమానీ నదాలు కరుగుతున్నాయి. ఫలితంగా భారత్, బంగ్లాదేశ్‌లలో సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంత ప్రజలు ఆవాసాలు కోల్పోవాల్సి వస్తోంది. శ్రీలంకలోని వరి, టీ ఎస్టేట్లపై సాధారణంకంటే భారీ వర్షాలు, తుఫానులు విరుచుకుపడటంతో ప్రజల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రత భారత్‌లోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతోంది. మానవుల వల్ల కలిగే గ్లోబల్ వార్మింగ్ దశాబ్దానికి 0.26 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. గత దశాబ్దంలో ఉష్ణోగ్రత 1.14 డిగ్రీల నుంచి 1.19 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. గత ఏడేళ్లలో భారత తలసరి బొగ్గు ఉద్గారాలు 29% పెరిగాయి. వాతావరణంలో వస్తున్న ఈ మార్పులు ప్రజల జీవన విధానాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. -
AP: ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. వర్షాలు అధికంగా ఉన్న కోస్తా జిల్లాలతో పాటు కనీస వర్షపాతం నమోదు కాని రాయలసీమ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాయలసీమ జిల్లాల్లో సగటున 35 డిగ్రీల ఉష్ణోగ్రత.. కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. తాజా ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నట్టు జనం వాపోతున్నారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాల్లో ఉక్కపోత మరింత ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది. ఉక్కపోత కారణంగా వేసవి తరహాలో గృహ విద్యుత్ వినియోగం పెరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీల వినియోగం ఆగస్టులో తీవ్రంగా పెరిగినట్టు తేలింది. రానున్న 2 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తుపానుకు రెండు రోజుల ముందు ఉష్ణోగ్రతల్లో తీవ్ర మార్పులు ఉంటాయని చెబుతున్నారు. బంగాళాఖాతంలో పీడనం తగ్గినప్పుడు గాలిలో తేమ శాతం పెరుగుతుంది. దీనివల్ల ఉష్ణోగ్రతలు ఓ మోస్తరుగా ఉన్నా ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల విపరీతంగా చెమటలు పట్టడం, ఎక్కువ దాహంగా ఉండటం కనిపిస్తుందంటున్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజుల్లో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది. పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంటుందని అనంతపురంలోని రేకుల కుంట వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వాతావరణ శాఖ కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. తుపాను అనంతరం ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. “గాలిలో తేమ శాతం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఉక్కపోత ఉంటుంది. దీనికి ప్రధాన కారణం బంగాళాఖాతంలో వాయు గుండం ప్రభావమే. వాతావరణంలో మార్పులు కూడా కొంత మేరకు ఈ పరిస్థితికి కారణం’ అని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త విజయశంకర్ బాబు తెలిపారు. -
కాప్సూల్ ఇంట్లో కులాసాగా..
సాక్షి, అమరావతి: ఈ ఇంటిని చూస్తే.. సైంటిఫిక్ ఫిక్షన్ సినిమాలో ఇంటిలాగానో, అంతరిక్ష ప్రయోగానికి సిద్ధం చేసిన స్పేస్ షిప్లాగానో ఉంది కదూ! ఈ ఇంటి లోపల చూస్తే నిజానికి అదే అనుభూతి కలుగుతుంది. స్పేస్ కాప్సూల్ హౌస్‌గా పిలిచే ఈ ఇంటిని 20 ఏళ్ల క్రితం ‘నాసా’ స్పేస్ టెక్నాలజీతో తయారు చేశారు. ఈ తరహా మోడల్ హౌసెస్ సైంటిఫిక్ ఫిక్షన్ సినిమాలైన మార్వెల్ మూవీస్‌లో సైతం కన్పిస్తుంటాయి. అమెరికాలో అభివృద్ధి చెందిన ఈ టెక్నాలజీని చైనా శాస్త్రవేత్తలు అందిపుచ్చుకొని విశ్వవ్యాప్తం చేశారు. ఈ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించే సాంకేతిక, పరికరాలన్నీ చైనా నుంచే ప్రపంచ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రస్తుతం అమెరికాతో పాటు చైనా, యూరప్, గల్ఫ్ దేశాల్లో విస్తృతంగా వాడుకలోకి ఉన్న ఈ ఇళ్ల నిర్మాణ టెక్నాలజీ మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అందుబాటులోకి వచి్చంది. రాజమహేంద్రవరానికి చెందిన సీబాక్స్ హౌసెస్ కంపెనీ రాష్ట్రానికి ఈ కొత్త ఇళ్లను పరిచయం చేసింది. ఈ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించే మెటీరియల్ అంతా విదేశాల నుంచే దిగుమతి చేసుకున్నదే. ఇంటి అవుట్‌సైడ్ బాడీ అల్యూమినియంతోనూ, ఇన్సైడ్ బాడీ స్ట్రక్చర్ పూర్తిగా గల్వనైజ్డ్ ఐరన్తోనూ నిరి్మస్తారు. ఇక తలుపులు, కిటికీల కోసం గట్టిగా ఉండే అత్యాధునిక ప్లాస్టిక్ ఉడ్ని వాడుతున్నారు. 500 నుంచి 1000 చదరపు అడుగుల స్థలం ఉంటే చాలు.. కావాల్సిన మోడల్స్‌లో సింగిల్ బెడ్ రూమ్, డబుల్ బెడ్ రూమ్, ట్రిబుల్ బెడ్ రూమ్ ఇంటిని అత్యంత సులువుగా నిరి్మంచుకోవచ్చు. 45 రోజుల్లో ఇంటి నిర్మాణం ఇంటి నిర్మాణానికి కేవలం 45 రోజుల సమయం పడుతుంది. మోడల్‌ను బట్టి రూ. 25 లక్షల నుంచి రూ. 55 లక్షల వరకు అవుతుంది. ఇవి 50 ఏళ్ల వరకు చెక్కుచెదరవు. క్రేన్ సహాయంతో కంటైనర్లు తరలించే భారీ లారీలపై ఒకచోట నుంచి మరొక చోటకు అత్యంత సులభంగా తరలించుకుపోవచ్చు. మైదాన ప్రాంతాల కంటే కొండ ప్రాంతాల్లో నిరి్మంచుకుంటే ఆకర్షణీయంగా ఉంటాయి. ఫామ్ హౌసెస్, రిసార్ట్స్ నిర్మాణానికి ఇవి ఎంతగానో అనుకూలం. మడత పెట్టే ఫోల్డెడ్ హౌసెస్ మడత పెట్టే కురీ్చలు, మంచాల మాదిరిగానే దేశంలోనే తొలిసారి మడతపెట్టే పోల్డెడ్ హౌసెస్ కూడా మన రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయి. కేవలం గంటలోనే వీటిని ఫిక్స్ చేయవచ్చు. 1 బీహెచ్‌కే నుంచి 4 బీహెచ్‌కే ఫోల్డబుల్ హౌసెస్ నిర్మించుకోవచ్చు. వీటి నిర్మాణానికి జీఏ మెటీరియల్‌ను వినియోగించడం వలన చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కేవలం రూ. 11.5 లక్షల్లోనే ఆకర్షణీయమైన ఇల్లు అందుబాటులోకి వస్తుంది. కంటైనర్ హౌసెస్ కాదు» ఇవి కంటైనర్ హౌసెస్ లాంటివి కాదు. పూర్తి రక్షణతో కూడుకున్న గృహాలు. » ఇవి సన్ ప్రూఫ్‌తో పాటు ఫైర్ ప్రూఫ్, సౌండ్ ప్రూఫ్ కూడా. నిర్మాణంలో అన్బ్రేకబుల్ డీజే గ్లాసెస్‌ను వినియోగిస్తున్నారు. » సెంట్రలైజ్డ్ ఏసీతో పాటు పగలు, రాత్రి ఉష్ణోగ్రతలకు తగ్గట్టుగా తనకు తానుగా మార్చుకునే ఆటో టెంపరేచర్ కంట్రోల్ ఫ్లోర్ ఈ ఇంటి ప్రత్యేకం. » ఆహ్లాదం గొలిపేలా అత్యంత ఆకర్షణీయమైన రీతిలో ఇంటీరియర్స్ ఉంటాయి. » అత్యంత లగ్జరీగా ఉండే లివింగ్ రూమ్, కిచెన్, బెడ్రూమ్స్, బాత్ రూమ్స్, స్మార్ట్ టాయిలెట్, రిమోట్‌తో పనిచేసే ఆటోమేటిక్ కర్టెన్స్, విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఈ ఇళ్ల సొంతం. దేశంలోనే తొలి ప్రయోగంఏడాది క్రితం చైనాకు వెళ్లినప్పుడు ఈ తరహా మోడల్స్ చూశాం. చాలా బాగున్నాయనిపించి వీటిని మన దేశానికి తీసుకురావాలన్న సంకల్పంతో సీబాక్స్ హోమ్స్‌ను ప్రారంభించాం. మన దేశంలో స్పేస్ టెక్నాలజీతో ఈ తరహా ఇళ్ల నిర్మాణం చేపట్టడం ఇదే తొలిసారి. మెటీరియల్ పూర్తిగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి 8 ఇళ్ల నిర్మాణానికి ఆర్డర్స్ వచ్చాయి. రాజమహేంద్రవరంలోని జేఎన్రోడ్లో మోడెల్ హౌసెస్‌ను ఏర్పాటు చేశాం. వీటితో పాటు ఫోల్డెడ్ హౌసెస్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ తరహా ఇళ్ల నిర్మాణం దేశంలో మరెక్కడా అందుబాటులో లేవు. ఏడాది పాటు సరీ్వస్ పూర్తిగా ఉచితం. ఆ తర్వాత సరీ్వస్ చార్జీ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఇళ్ల నిర్మాణం కోసం చైనాలో శిక్షణ పొందిన 10 మంది సాంకేతిక సిబ్బంది అందుబాటులో ఉన్నారు. – ఎం.ప్రదీప్, మేనేజర్, సీబాక్స్ హోమ్స్ -
ప్రళయమొచ్చినా..ఈ ఐదూ బతికేస్తాయట!
ఏదైనా అత్యంత భయానక ప్రకృతి విపత్తు వస్తేనో, ఏదైనా పెద్ద ఆస్టరాయిడ్ ఢీకొంటేనో.. భూమ్మీది జీవరాశిలో చాలా వరకు నామరూపాలు లేకుండా పోవడం ఖాయం. కానీ ఓ ఐదు రకాల జీవులు మాత్రం బతికి ఉండగలుగుతాయట. వాటికి ఉన్న ప్రత్యేక లక్షణాలు, కఠిన పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అవేమిటో తెలుసుకుందామా.. టాప్‌లో టార్డిగ్రేడ్లు.. జీవులన్నింటిలో అత్యంత కఠిన పరిస్థితులను తట్టుకుని బతకగలిగే అతి చిన్న జీవులు టార్డిగ్రేడ్లు. నీటిలో జీవిస్తుండటం, ఎలుగుబంటిని పోలి ఉండటంతో వీటిని వాటర్ బేర్లు అని కూడా పిలుస్తారు. 150 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలను, మైనస్ 70 డిగ్రీల వరకు తీవ్ర చలిని ఇవి తట్టుకోగలవు. ఆక్సిజన్, ఆహారం, నీళ్లు లేని పరిస్థితుల్లోనూ వారాలకు వారాలు బతికేస్తాయి. అందుకే ప్రళయమొచ్చినా బతికే జీవుల్లో టార్డిగ్రేడ్లు టాప్‌లో ఉన్నాయి. బొద్దింకలూ బతికేస్తాయి.. మనను నానా చికాకు పెట్టే బొద్దింకలను అంత ఈజీగా తీసుకోవద్దు. ఎందుకంటే ఎన్నో విపత్కర పరిస్థితులను తట్టుకునే శక్తి వాటి సొంతం. డైనోసార్లతో కలిసి జీవించిన బొద్దింకలు.. భూమిని ఆస్టరాయిడ్ ఢీకొన్నప్పుడు డైనోసార్లు అంతమైపోయినా బతకగలిగాయి. మట్టిలో, రాళ్లలో, మరెక్కడైనా దూరిపోయి దాక్కోవడం, ఏది దొరికితే దాన్ని తిని బతికేయడం, చాలా వరకు విషపదార్థాలను, రేడియేషన్‌ను కూడా తట్టుకోగలగడం వీటి స్పెషాలిటీ. అందుకే ఎంత తీవ్ర విపత్తు వచ్చినా బొద్దింకలు బతికే అవకాశాలు ఎక్కువట. రాబందులను తక్కువగా చూడొద్దు భూమ్మీద ప్రకృతి విపత్తు వచ్చే స్థాయిని బట్టి కొన్ని రకాల జంతువులకు లాభమూ జరుగుతుంది. అలాంటివాటిలో రాబందులు ఒకటి. ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనడం వంటివి జరిగితే.. గాల్లో అంతెత్తున, చాలా దూరం ప్రయాణించి తప్పించుకోగలవు. విపత్తుల మరణించే జంతువుల మాంసాన్ని తింటూ బతికేయగలవు. కుళ్లిన మాంసంలో పెరిగే బ్యాక్టీరియాను, ఇతర సూక్ష్మజీవులను కూడా డైజెస్ట్ చేయగల యాసిడ్లు రాబందుల జీర్ణాశయంలో ఉత్పత్తి అవుతాయి. షార్క్‌లకు విపత్తులంటే లెక్కే లేదు.. భూమ్మీది పురాతన జీవుల్లో షార్క్ చేపల జాతి కూడా ఒకటి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. భూమ్మీద చెట్లు ఏర్పడకముందే సముద్రాల్లో షార్క్‌ల జాతి ఉద్భవించి జీవిస్తున్నాయి. తర్వాత జరిగిన ప్రకృతి ఉత్పాతాల్లో డైనోసార్లు సహా ఎన్నో జీవజాతులు అంతరించినా షార్క్‌లు మాత్రం బతికేస్తూనే ఉన్నాయి. సముద్రాల్లో అత్యంత లోతున, ఎలాంటి వెలుగు ప్రసరించని చోట, తీవ్ర పీడనాన్ని తట్టుకుని బతకగలగడం షార్క్‌ల స్పెషాలిటీ. ఇప్పుడు మరో విపత్తు వచ్చినా అవి తట్టుకుని బతికేయగలవు మరి. ఎంపరర్ పెంగ్విన్లకూచాన్స్ ఎక్కువే..అంటార్కిటికా ఖండంలో ఉండే అత్యంత శీతల పరిస్థితులను, గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకుని జీవిస్తున్న జంతువులు ఎంపరర్ పెంగ్విన్లు. వాటి శరీరంలో గణనీయంగా కొవ్వు ఉంటుంది. కొన్నివారాల పాటు ఆహారం లేకున్నా బతికేయగలవు. పైగా అవి ఉన్న ప్రాంతాల్లో విపత్తులు ఏర్పడే అవకాశాలూ తక్కువని, నిక్షేపంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. -
మండుతున్న భూగోళం, 29 ఏళ్ల రికార్డు బద్ధలు!
ఉష్ణోగ్రతలు రికార్డులు బద్ధలుకొడుతున్నాయి. ప్రతి ఏడాది రికార్డు స్థాయిలో పెరుగుతూ ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. ఒకవైపు పెరుగుతున్న టెంపరేచర్లు, మరోవైపు ముంచెత్తుతున్న భారీ వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అయితే.. ఇది స్వీయ తప్పిదమే అంటున్నారు నిపుణులు. మానవ తప్పిదాల వల్లే వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని హెచ్చరిస్తున్నారు.పెను ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నాయి. గత మే నెల అత్యంత వేడి నెలగా రికార్డు క్రియేట్ చేసింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఎండల తీవ్రత దాదాపు సంవత్సరమంతా కొనసాగింది. ఆయా నెలలకు సంబంధించిన సరాసరి ఉష్ణోగ్రతల్లో రికార్డులు బద్ధలయ్యాయి. ఈ ఏడాది మేలో ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మాగ్జిమమ్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. వాతావరణంలో విపరీతమై మార్పుల వల్ల వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఎల్‌నినోతో పాటు.. మానవ తప్పిదాలే వాతావరణ మార్పులకు కారణమంటూ ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ క్లైమెట్ ఛేంజ్ సర్వీసెస్ వెల్లడించింది.ఈ ఏడాది మే నెలలో సరాసరి ఉష్ణోగ్రతలు.. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే 1.52 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా ఉన్నట్లు ఐరోపా వాతావరణ సంస్థ వివరించింది. అయితే ఇది దీర్ఘకాలం పాటు కొనసాగితేనే పారిస్ ఒప్పందంలో పేర్కొన్న 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని మించిపోయినట్లు భావిస్తారు. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మే మధ్య 12 నెలల సరాసరి భూ ఉష్ణోగ్రతల్లోనూ రికార్డు నమోదైంది. 1991 నుంచి 2020 మధ్యనాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే 0.75 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యింది. అంటే.. పారిశ్రామికీకరణకు ముందునాటి కంటే ఇది 1.63 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువ.రాబోయే ఐదేళ్లలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయనే వార్తలు ప్రజలను భయపెడుతున్నాయి. పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే వచ్చే ఐదేళ్లలో ఏదో ఒక ఏడాది.. 2023లో నమోదైన ఉష్ణోగ్రతల రికార్డులు బద్ధలవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూతాపంలో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ దాటడానికి 80 శాతం మేర అవకాశముందని ఐరోపా వాతావరణ సంస్థ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావడానికి 86 శాతం అవకాశముందని వివరించింది. 2024-28 మధ్యకాలంలో ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ కొనసాగడానికి 47 శాతం అవకాశం ఉందని తెలిపింది. 2023-27 మధ్య కాలంలో ఇందుకు ఒక శాతం మేర అవకాశం ఉందని గత ఏడాది డబ్ల్యూఎంవో ఇచ్చిన నివేదిక వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం.. 1850 నుంచి 1900 మధ్యనాటితో పోలిస్తే 2024 నుంచి 2028 మధ్యకాలంలో భూ ఉపరితలానికి చేరువలోని వాతావరణం సరాసరి ఉష్ణోగ్రత 1.1 నుంచి 1.9 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా ఉండొచ్చని తెలిపింది. -
Malaria Vaccine : సరికొత్త టీకా, జేఎన్‌యూ శాస్త్రవేత్తల కీలక పురోగతి
మలేరియావ్యాధి నిర్మూలనలో పరిశోధకులు గొప్ప పురోగతి సాధించారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం (జెఎన్‌యు) శాస్త్రవేత్తల బృందం మలేరియాకు వ్యతిరేకంగా మరింత ప్రభావవంతమైన నివారణ, చికిత్సా వ్యూహాలకు మార్గం సుగమం చేయగల మంచి వ్యాక్సిన్ తయారీలో మరో అడుగు ముందు కేశారు. జెఎన్‌యులోని మాలిక్యులర్ మెడిసిన్ సెంటర్ ప్రొఫెసర్ శైలజా సింగ్, ప్రొఫెసర్ ఆనంద్ రంగనాథన్ నేతృత్వంలోని పరిశోధన, టీకా వ్యూహంలో భాగంగా కొత్త పారాసైట్ ఇంటరాక్టింగ్ కాంప్లెక్స్‌ను గుర్తించింది.మనిషిలోఇన్ఫెక్షన్కు కారణమైన రెండు తటస్థ అణువులు పీహెచ్బీ2-హెచ్ఎస్పీ70ఏ1ఏను గుర్తించినట్లు పరిశోధనలో భాగమైన ప్రొఫెసర్ శైలజ తెలిపారు. ఈ పారాసైట్ ప్రొటీన్ పీహెచ్బీ2 ఓ ప్రభావవంతమైన వ్యాక్సిన్‌కు దోహదం చేయగలదన్నారు.మానవ హోస్ట్ లోపల పరాన్నజీవి ఇన్ఫెక్షన్ పొందడంలో సహాయపడే నవల PHB2-Hsp70A1A రిసెప్టర్ లిగాండ్ జతను తాము గుర్తించామని, పరాన్నజీవి ప్రోటీన్ PHB2 ఒక శక్తివంతమైన టీకా ఇదని ఆమె తెలిపారు. వివిధ సెల్యూలార్ ప్రాసెస్లను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించే ప్రొటీన్ల కుటుంబం ప్రొహిబిటిన్స్ ఇవి అని చెప్పారు. పీఎఫ్‌పీహెచ్‌బీ2 యాంటీబాడీల ఉనికిని గుర్తించడం మలేరియా చికిత్సలో గొప్ప మలుపు అని మరో పరిశోధకుడు మనీషా మరోథియా వివరించారు. యాంటీబాడీ చికిత్స పరాన్నజీవుల పెరుగుదలను పూర్తిగా రద్దు చేయడం విశేషమని పేర్కొన్నారు.. అలాగే శాస్త్రవేత్తలుగా, మలేరియా నిర్మూలన పట్ల ఆకాంక్ష ఎప్పటికీ ఆగదని ఇరువురు ప్రొఫెసర్లు పునరుద్ఘాటించారు.మలేరియా ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వ్యాపించే వెక్టర్-బోర్న్ వ్యాధి. ప్రధానంగా ఇండియా సహా అనేక దేశాల్లో శతాబ్దాలుగా మిలియన్ల మంది ప్రాణాలను బలితీసుకొంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 249 మిలియన్ కేసులు మరియు 60,800 మరణాలు సంభవిస్తున్నాయి. యాంటీ మలేరియల్ డ్రగ్స్ ప్రభావాన్ని నిరోధించగలిగే రోగ నిరోధక సామర్థ్యాన్ని దోమలు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నాయి. మరోవైపు మలేరియాకు సమర్థవంతమైన టీకాలు లేవు. దీంతో ఈ ప్రాణాంతక మహమ్మారితో పోరాటంలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీనిపై అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కోవిడ్-19 మహమ్మారి పరిశోధనకు కలిగించిన అంతరాయం ఫలితంగా ఇటీవల కేసులు, మరణాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధ్యయన ఫలితం ఆశాజనకంగా భావిస్తున్నారు నిపుణులు. -
కాళేశ్వరం పరిశీలించిన శాస్త్రవేత్తలు
-
కాళేశ్వరం బ్యారేజీలకు శాస్త్రవేత్తల బృందం
కాళేశ్వరం/ సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనంలో భాగంగా పుణేలోని సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) శాస్త్రవేత్తలు రాష్ట్రానికి చేరుకున్నారు. జేఎస్ ఎడ్లబడ్కార్ (జియో టెక్నికల్ పరీక్షల నిపుణుడు), ధనుంజయ నాయుడు (జియో ఫిజికల్ పరీక్షల నిపుణుడు), ప్రకాశ్ పాలీ (నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ నిపుణుడు)తో కూడిన బృందం బుధవారం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించింది. ఇరిగేషన్ సీఈ సుధాకర్‌రెడ్డి, ఇతర ఇంజనీర్లతో కలసి ఈ బృందం పరీక్షలు నిర్వహించింది. బృందం సభ్యులు ముందుగా మేడిగడ్డ బ్యారేజీ వంతెనపైన కాలినడకన వెళ్లి పరిశీలించారు. గత ఏడాది అక్టోబర్ 21న కుంగిన 7వ బ్లాక్‌లోని పియర్‌ను, అడుగు భాగం ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరీక్షించారు. కుంగుబాటుకు గల కారణాలను సీఈని అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు చేసిన పరీక్షల వివరాలను అడిగారు. బ్యారేజీ ఎగువ, దిగువ ప్రవాహ ప్రాంతాల్లో తిరిగారు. కుంగిన పియర్లు, క్రస్టుగేట్లు, అక్కడి పరిసరాలను ఫొటోలు తీసుకున్నారు. బ్యారేజీ 7వ బ్లాక్‌లో 15 నుంచి 21వ పియర్ వరకు ఉన్న ఇసుక మేటలు, గేట్ల మరమ్మతు పనులను పరిశీలించారు. గంటపాటు మేడిగడ్డను పరిశీలించిన అనంతరం అన్నారం బ్యారేజీకి వెళ్లారు. అక్కడ సీఈ, ఈఈ యాదగిరిలు వారికి బ్యారేజీలో ఏర్పడ్డ సీపేజీ బుంగలు, చేపట్టిన మరమ్మతుల వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం బ్యారేజీ డౌన్ స్ట్రీమ్‌లో చేస్తున్న సీసీ బ్లాక్ పనులను చూశారు. ఎగువన ఇసుక మేటలను చూసి త్వరగా వాటిని తొలగించాలని అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఈ బృందం గురువారం సుందిళ్ల బ్యారేజీని సందర్శించనుంది. మూడు కేంద్ర సంస్థలతో పరీక్షలు.. కాగా, బృందం పర్యవేక్షణలో బ్యారేజీలకు జియోటెక్నికల్, జియోఫిజికల్ పరీక్షలు నిర్వహించి లోపాలను గుర్తించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు సీడబ్ల్యూపీఆర్ఎస్తో పాటు ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్), హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)తో జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే శాశ్వత మరమ్మతులను నిర్వహించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ ఇటీవల మధ్యంతర నివేదికలో సిఫారసు చేసింది.దీంతో ప్రతిష్టాత్మకమైన ఈ మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీడబ్ల్యూపీఆర్ఎస్ శాస్త్రవేత్తల బృందం తమ పరిశోధనలను ఇప్పటికే ప్రారంభించగా, త్వరలో ఎన్జీఆర్ఐ, సీఎస్ఎంఆర్ఎస్ సంస్థల నుంచి సైతం శాస్త్రవేత్తలు పని ప్రారంభిస్తారని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ప్రతి బ్యారేజీకి రెండు సంస్థలతో వేర్వేరుగా ఈ పరీక్షలు నిర్వహించిన అనంతరం అవి సమర్పించే నివేదికల ఆధారంగా మరమ్మతులు నిర్వహించాలని సోమవారం జరిగిన రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
మందు తాగినా లివర్ సేఫ్.. సరికొత్త జెల్ కనిపెట్టిన సైంటిస్టులు
బీరు, విస్కీ, బ్రాందీ, రమ్ము ఏ రూపంలోనైనా మందు(ఆల్కహాల్) హానికరమని అందరికీ తెలుసు. ఇందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న చాలా మంది మందు మానేయాలనుకుంటుంటారు..కానీ అంత ఈజీగా మానలేరు. పార్టీలు, ఫంక్షన్లు, స్నేహితులు, బంధువులతో కలిసినపుడు తప్పక తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. దీంతో ఎక్కడో ఒక మూల భయపడుతూనే తరచూ మందు తాగేస్తుంటారు.ఇలాంటి వారి కోసమే సైంటిస్టులు ఒక సరికొత్త పరిశోధన మొదలు పెట్టారు. మందు తాగినా అది శరీరంపై పెద్దగా చెడు ప్రభావం చూపకుండా ఉండేలా ఒక జెల్‌ను కనిపెట్టారు. ఈ పరిశోధన ప్రస్తుతం ఎలుకల మీద ప్రయోగ దశలో ఉంది. అన్నీ కలిసొస్తే త్వరలో మనుషులకూ జెల్‌ను అందుబాటులోకి తెస్తారు. ఈ విషయాన్ని నేచర్ నానోటెక్నాలజీ జర్నల్ తాజాగా ప్రచురించింది. అసలు మందు(ఆల్కహాల్) బాడీలోకి వెళ్లి ఏం చేస్తుంది..మందు తాగిన వెంటనే కడుపులోని పేగుల్లోని పైపొర మ్యూకస్ మెంబ్రేన్ నుంచి రక్తంలో కలుస్తుంది. తర్వాత కాలేయంలోకి వెళుతుంది. అక్కడ హార్మోన్లు జరిపే రసాయన చర్యల వల్ల ఆల్కహాల్ తొలుత హానికరమైన ఎసిటాల్డిహైడ్గా మారుతుంది. అనంతరం కొద్ది సేపటికే ఎసిటిక్ యాసిడ్‌గా మారుతుంది. ఎసిటిక్ యాసిడ్ మాత్రం శరీరానికి పెద్దగా హానికారకం కాదు. ఈ కెమికల్ రియాక్షన్ మొత్తం వేగంగా జరుగుతుంది. ఈ రియాక్షన్లో శరీరానికి హాని చేసే ఎసిటాల్డిహైడ్ ఎక్కువసేపు ఉనికిలో ఉండకుండా హాని చేయని ఎసిటిక్ యాసిడ్‌గా మారతుంది. అయినా ఆ తక్కువ సమయంలోనే ఎసిటాల్డిహైడ్ లివర్‌కు చాలా నష్టం చేస్తుంది. ఇక తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కాలేయంలో ఈ రియాక్షన్ కాస్త నెమ్మదిగా జరుగుతుంది. దీంతో ఎసిటాల్డిహైడ్ ప్రభావంతో తాగేవారికి కిక్కెక్కుతుంది. అదే సమయంలో శరీరంలోని లివర్‌తో పాటు మిగతా ముఖ్యమైన అవయవాలు ఆల్కహాల్ ప్రభావానికి గురవుతాయి. ఇప్పుడు పిక్చర్లోకి నానోజెల్..జెల్ తీసుకున్న తర్వాత పేగుల లోపల ఒకపొరలాగా ఏర్పడుతుంది. నానో ప్రోటీన్లతో తయారైన ఈ జెల్ జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. ఆల్కహాల్ పేగుల్లోకి వచ్చి రక్తంలోకి కలిసే ప్రక్రియను ఈ జెల్ ఆలస్యం చేస్తుంది. దీంతో పాటు జెల్ హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను విడుదల చేస్తుంది. ఆల్కహాల్ రక్తంలోకి వెళ్లి లివర్‌కు చేరి ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ ఏర్పడకముందే పేగుల్లో ఉండగానే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆల్కహాల్‌ను హానికరం కాని ఎసిటిక్ ఆసిడ్‌గా మార్చేస్తుంది.దీంతో మందు రక్తంలో కలిసినా లివర్‌పై పెద్దగా ప్రభావం పడదు. ఈ రియాక్షన్లో ఎక్కడకా ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ లేకపోవడం వల్ల తాగే వారికి పెద్దగా కిక్కు కూడా తెలియదు. దీనికి తోడు లివర్‌తో పాటు శరీరంలోని ముఖ్యమైన అవయవాలు ఆల్కహాల్ బారిన పడి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. జెల్ ఎలా తయారు చేశారు..స్విట్జర్లాండ్‌లోని జురిచ్ యూనివర్సిటీ సైంటిస్టులు తయారుచేసిన ఈ యాంటీ ఇన్‌టాక్సికెంట్ జెల్లో గ్లూకోజ్, గోల్డ్ నానో పార్టికల్స్‌తో పాటు వే ప్రోటిన్ నుంచి ఉత్పత్తైన నానో ఫైబర్లుంటాయి. ఈ నానో ఫైబర్లు ఐరన్ అణువులతో కప్పి ఉంటాయి. గ్లూకోజ్, గోల్డ్ కణాలతో జరిగే రియాక్షన్‌కు ఐరన్ అణువులు ఉత్ప్రేరకంగా పనిచేసి హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఎలుకలపై ప్రయోగం సక్సెస్..ప్రస్తుతానికి యాంటీ ఇన్‌టాక్సికెంట్ జెల్‌ను ఎలుకల మీద ప్రయోగించి చూశారు. ఎలుకలకు ఒక డోస్ ముందు పోశారు. కొన్నింటికి నానో జెల్ ఇచ్చారు. మరికొన్నింటికి ఇవ్వలేదు. జెల్ తీసుకున్న ఎలుకల రక్తంలో జెల్ తీసుకోని ఎలుకల రక్తంతో పోలిస్తే 16 శాతం తక్కువ ఆల్కహాల్ ఉండటాన్ని సైంటిస్టులు గుర్తించారు. జెల్ తీసుకున్న ఎలుకల శరీరంలో ప్రమాదకర ఎసిటాల్డిహైడ్ కూడా కనిపించలేదు. ఆల్కహాల్ కారణంగా ఈ ఎలుకల లివర్ మీద కూడా పెద్దగా ప్రభావం పడకపోవడాన్ని గమనించారు. త్వరలో జెల్‌ను మనుషుల మీద ప్రయోగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు మందు తాగకపోవడమే మేలు‘అసలు ఆల్కహాల్ తీసుకోకపోవడమే శరీరానికి మంచిది. కానీ తీసుకోకుండా ఉండటం కుదరదనే వారి శరీరాలపై ఆల్కహాల్ పెద్దగా ప్రభావం చూపకుండా యాంటీ ఇన్‌టాక్సికెంట్ జెల్ ఉపయోగపడుతుంది’అని జెల్ కనుగొన్న సైంటిస్టుల బృందం హెడ్ రఫ్ఫేల్ మెజ్జెంగా చెప్పారు. -
గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
సహజ వజ్రాలు భూగర్భంలో తీవ్ర ఒత్తిడి, ఉష్ణోగ్రతలలో ఏర్పడటానికి వందల, లక్షల ఏళ్లు పడుతుంది. ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయిన సింథటిక్ వజ్రాలు కొన్ని వారాల్లో తయారు చేయవచ్చు. ఇపుడిక కొన్ని నిమిషాల్లోనే తయారు చేయవచ్చు. ఎక్కడ? ఎలా అంటారా. అయితే మీరీ కథనం చదవాల్సిందే.!వజ్రాలు.. డైమండ్స్.. పేరు చెబితేనే ఖరీదైన వ్యవహారం అని అనుకుంటాం. జేమ్స్ బాండ్ మూవీ టైటిల్ ట్రాక్ ‘‘డైమండ్స్ ఆర్ ఫరెవర్’’ లో చెప్పినట్టు వజ్రాలు శాశ్వతం. అందుకే తమ ప్రేమ కలకలం నివాలని ప్రేమికులు డైమండ్ రింగులను ఇచ్చి పుచ్చుకోవడం ఫ్యాషన్. కానీ గుడ్ న్యూస్ ఏమిటంటే కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే తయారైన వజ్రాలు ఫ్యాషన్ మార్కెట్లలోకి రాబోతున్నాయి. దక్షిణ కొరియాలోని ఇన్స్టిట్యూట్ ఫర్ బేసిక్ సైన్స్ పరిశోధకుల బృందం డైమండ్స్ తయారీలో ఒక వినూత్న విధానాన్ని కొనుగొంది. దీంతో సింథటిక్ వజ్రాల ఉత్పత్తిలో గణనీయమైన మార్పురానుందని, సరసమైన ధరల్లో డైమండ్స్ అందుబాటులోకి రానున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. భూమి పొరల్లో కొన్ని లక్షల సంవత్సరాలపాటు అత్యధిక ఉష్ణోగ్రత, పీడనానికి గురై కార్బన్ అణువులు ఘనీభవించడం వల్ల ఏర్పడుతుంది. అయితే ల్యాబ్‌లో వజ్రాల తయారీకి కూడా కొంత సమయం ఎక్కువ పడుతుంది. కానీ పరిశోధకులు కేవలం 150 నిమిషాల్లో వజ్రాలను తయారు చేసే ప్రక్రియను గుర్తించారు. ప్రత్యేకమైన ద్రవ లోహ మిశ్రమంతో కేవలం 150 నిమిషాల్లోనే వజ్రాలను తయారు చేసే పద్ధతిని రూపొందించారు. అది కూడా సాధారణ వాతావరణ పీడనంతోనే వాటిని తయారు చేయడం విశేషం.అయితే వజ్రాలకోసం కార్బన్‌ను ద్రవ లోహంలో కరిగించడం కొత్తదేమీ కాదు. కరిగిన ఇనుము సల్ఫైడ్ను ఉపయోగించే ప్రక్రియను 50 ఏళ్ల క్రితమే జనరల్ ఎలక్ట్రిక్ అభివృద్ధి చేసింది. అయితే ఇందుకోసం భారీ పీడనాన్ని ఉపయోగించాల్సి వచ్చేది. కొత్త విధానంలో గేలియం, ఐరన్, నికెల్, సిలికాన్ లను మీథేన్, హైడ్రోజన్ వాయువులతో కలిపి వ్యాక్యూమ్ చాంబర్ లో అత్యంత వేగంగా వేడి చేస్తారు. దీనివల్ల కార్బన్ అణువులు ద్రవ లోహంలో పారదర్శక స్పటికాలుగా మారి తరువాత డైమండ్ సీడ్స్ తయారవుతాయి. అలా మొత్తంగా 150 నిమిషాలకు వజ్రం ముక్కలు ఏర్పడతాయి. ఈ కొత్త పద్ధతి ద్వారా పారిశ్రామిక అవసరాల కోసం వజ్రాల ఉత్పత్తిని పెంచేందుకు ఉపయోగ పడుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిశోధన వివరాలను నేచర్‌లో ప్రచురించారు. -
సీఫుడ్ ఇష్టంగా తినేస్తున్నారా? శాస్త్రవేత్తల స్ట్రాంగ్ వార్నింగ్!
సీఫుడ్స్ అంటే ఇష్టపడనివాళ్లు ఉండరు. వాటితో చేసిన వివిధరకాల రెసిపీలు చాలా రుచికరంగా ఉంటాయి. అదీగాక రెస్టారెంట్లలలో కూడా ఈ సీఫుడ్ వంటకాల ఖరీదు ఎక్కువే. అయినా కూడా ప్రజలు చాలా ఇష్టంగా లాగించేస్తుంటారు. ఇవి తీసుకోవడం వల్ల ఓమెగా 3 వంటి విటమిన్లు, పోషకాలు శరీరానికి అందుతాయి. అయితే ఇప్పుడున్న పారిశ్రామిక కాలుష్యం కారణంగా సీఫుడ్ ఆరోగ్యానికి అంత సేఫ్ కాదని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. పైగా ఇది తినకపోవడమే మేలంటూ విస్తుపోయే విషయాలు చెప్పుకొచ్చారు. ఇంతకీ అధ్యయనాల్లో ఏం వెల్లడయ్యిందంటే.. యూకేలోని డార్ట్మౌత్ కళాశాల నిపుణులు పాదరసం వంటి ఇతర కలుషిత రసాయనాల దృష్ట్యా ప్రజలు సీఫుడ్ వినియోగంపై మార్గదర్శకాలు తీసుకోవాలని తెలిపారు. సముద్రాల్లో చమురు ఓడల క్రాష్ అవ్వడం లేదా మునిగిపోవడం, పారిశ్రామి రసాయనాలు వదలడం వంటి కారణంగా సీఫుడ్ వినియోగం ఎంత వరకు సురక్షితం అనే దిశగా పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. దీని వల్ల లభించే విలమిన్లు, పోషకాలను పక్కనే పెడితే ప్రమాదకరమై పర్ పాలి ఫ్లోరో అల్కైల్స్ (పీఎఫ్ఏఎస్) వంటి విషపదార్థాల ప్రమాదానికి గురవ్వక తప్పదని హచ్చరిస్తున్నారు. వీటిని "ఫారెవర్ కెమికల్స్" అని కూడా పిలుస్తారు. అందువల్ల నిపుణులు సీఫుడ్ తీసుకోవద్దని సూచిస్తున్నారు. నిజానికి సీఫుడ్ లీన్ ప్రొటీన్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్ల మూలం. కానీ కాలుష్యం కారణంగా సముద్ర జీవుల్లో మోతాదుకి మించి విషపదార్థులతో నిక్షిప్తమై ఉన్నాయి. అందువల్ల ఇవి మానవుని ఆరోగ్యానికి ఎంతమాత్రం సురక్షితం కాదని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా గర్భిణి స్త్రీలు, పిల్లలు వంటి వారికి ఈ సీఫుడ్ మరింత హానికరమని చెబుతోంది అధ్యయనం. నిపుణుల పరిశోధనలో సముద్ర జాతుల నమునాలో ఈ పీఎఫ్ఏఎస్కి సంబంధించిన 26 రకాల విషపూరిత రసాయనాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా కాడ్, హాడాక్, సాల్మన్, స్కాలోప్ వంటి చేపలు, పీతలు, రొయ్యల్లో ఇది ఎక్కువగా ఉన్నట్లు వెల్లడయ్యింది. ఆయా జీవుల్లో ఒక గ్రాము మాంసంలో దాదాపు 1.74 నుంచి 3.30 నానో గ్రాముల పీఎప్ఏఎస్ వంటి రసాయన సమ్మేళనాలు ఉన్నట్లు గుర్తించారు. కాల క్రమేణ పరిస్థితి ఇలా ఉంటే నెమ్మదిగా పర్యావరణ విచ్ఛిన్నమవుతుందని, అదిగాక ఈ పీఎఫ్ఏఎస్ పదార్థాలు పర్యావరణంలో వేల సంవత్సరాల అలానే ఉండిపోతాయని అందువల్ల ప్రజలకు, వన్యప్రాణుల మనుగడకు హానికరంగా మారుతుందని చెప్పారు. ఈ పీఎఫ్ఏఎస్ రసాయనాలు కారణంగా కేన్సర్, పిండ సంబంధిత సమస్యలు, అధిక కొలస్ట్రాల్, థైరాయిడ్, కాలేయం, పనరుత్పత్తి రుగ్మతలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. (చదవండి: 'ఖైమర్ అప్సర'గా భారత దౌత్యవేత్త!) -
ప్రపంచానికి పొంచివున్న మరో మహమ్మారి ముప్పు: డిసీజ్ ‘ఎక్స్’
కోవిడ్-19 మహమ్మారితో అల్లాడిపోయిన ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కోవిడ్-19 కంటే 20 రెట్లు ప్రాణాంతకం కావచ్చట. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనికి ఇచ్చిన పేరు డిసీజ్ ‘ఎక్స్’ (Disease X). నిపుణుల అభిప్రాయం ప్రకారం, వ్యాధి X ఎప్పుడైనా ,ఎక్కడైనా పెరుగుతుంది. లేదా ఇప్పటికే ప్రస్తుతం ఎక్కడో పెరుగుతూ ఉండవచ్చు లేదా ఇప్పటికే పెరిగి ఉండవచ్చు. దీని ఆవిర్భావాన్ని అంచనా వేయడం అంత తేలిక కాదని, మరో విధంగా చెప్పాలంటే డిసీజ్ X తో మానవజాతి అంతం కావచ్చేనే అంచనాలు కూడా ఉన్నాయి. డిసీజ్ ఎక్స్ రూపంలో ప్రపంచానికి మరో పెను ప్రమాదం పొంచి ఉందని వారు జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీలో సీనియర్ స్కాలర్ అమేష్ అడాల్జా ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త వైరస్‌ను ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే ఇది కొత్తది కాదని 2018 నుండి ఎక్స్ వ్యాధి గురించి చర్చ ఉందని అమేష్ అడాల్జా తెలిపారు. వైరస్ ద్వారా రావచ్చు. లేదా ఒక జంతు జాతి నుండి మానవునికి వ్యాపించి కొత్త లక్షణాలను అభివృద్ధి చేసే మహమ్మారిగా మారవచ్చు అని అంచనావేశారు. 90 శాతం సాధారణ జలుబు లేదా న్యుమోనియాగా ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. టీకాలు, యాంటీవైరల్‌లు, మోనోక్లోనల్ యాంటీ బాడీలు, డయాగ్నస్టిక్ సెంటర్లు ఎంత వేగంగా అందుబాటులో ఉంటే మహమ్మారిని నిలువరించడం అంత సులభం అవుతుందన్నారు. ముఖ్యంగా డబ్ల్యూహెచ్‌వో, సీడీసీ, యూరోపియన్ సీడీడీ, యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వంటి ఇతర పబ్లిక్ హెల్త్ ఏజెన్సీలు సంసిద్ధంగా ఉండాలన్నారు. అలాగే కరోనామహమ్మారి తరహాలో డిసీజ్ ఎక్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపిస్తుందని బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ కు నాయకత్వం వహిస్తున్న డేమ్ కేట్ బింగ్ హామ్ ఇటీవల వెల్లడించారు. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న అనేక వైరస్లు వేగంగా రూపాంతరం చెందుతున్నాయని, అయితే వాటినన్నింటిని ప్రమాద కరమైనవిగా పరిగణించలేమని, వాటిలో కొన్ని ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
పాపికొండల్లో అరుదైన మిత్రుడు
కైకలూరు: పర్యావరణ మిత్రునిగా పిలిచే అరుదైన డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ (గుడ్డి పాము) జాడ నిజమేనని మంచినీటి జీవశాస్త్ర ప్రాంతీయ కేంద్రమైన హైదరాబాద్‌లోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గుంటూరులోని బయోడైవర్సిటీ బోర్డు పాపికొండలు సమీపంలోని రంపచోడవరం జలపాతం వద్ద 2022 సెపె్టంబర్ 8న చనిపోయిన డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ మృతదేహాన్ని కనుగొన్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన శాస్త్రవేత్తలు దీపా జైస్వాల్, బి.భరత్, ఎం.కరుతాపాండి, శ్రీకాంత్ జాదవ్, కల్యాణి, కుంటేలు గుడ్డిపాము కళేబరాన్ని రసాయనాలతో హైదరాబాద్ జూలాజికల్ మ్యూజియంలో భద్రపరిచారు. అప్పటినుంచి పరిశోధనలు చేసి చివరకు డీఎన్ఏ పరీక్ష ద్వారా దీనిని అరుదైన డయార్ట్స్ బ్లైండ్ స్నేక్‌గా నిర్ధారించారు. 1839లో జావా దీవుల్లో గుర్తింపు డయార్ట్స్ బ్లైండ్ స్నేక్‌ను 1839లో ఇండోనేషియాలోని జావా దీవుల్లో తొలిసారిగా గుర్తించారు. ఫ్రెంచ్ ప్రకృతి శాస్త్రవేత్త పియరి మోడర్డ్ డియార్డ్ గౌరవార్థం దీనికి డయార్ట్స్ అని నామకరణం చేశారు. ఆర్గిరోఫిస్ డయార్టి శాస్త్రీయ నామం కలిగిన ఇది టైఫ్లోపిడే కుటుంబంలో విషపూరితం కాని పాము జాతికి చెందినది. ఇవి అడుగు వరకు పొడవు పెరుగుతాయి. భారతదేశంలో ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, హరియాణా, బిహార్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర ప్రాంతాల్లో వీటి జాతి ఉంది. మొదటిసారి ఏపీలోని పాపికొండలు అభయారణ్య ప్రాంతమైన రంపచోడవరం జలపాతం వద్ద దీనిని కనుగొన్నారు. వానపాములు భూసారాన్ని పెంపొందించడంలో ఏ విధంగా సాయపడతాయో అంతకంటే ఎక్కువగా పర్యావరణాన్ని కాపాడటంలో గుడ్డిపాములు దోహదపడతాయి. ఐయూసీఎన్ ఆందోళన ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) తగ్గుతున్న జీవుల జాబితా అయిన రెడ్ లిస్ట్‌లో డయార్ట్స్ బ్లైండ్ స్నేక్‌ను చేర్చింది. భారతీయ వన్యప్రాణి (రక్షణ) సవరణ చట్టంలో దీనిని చేర్చారు. చిత్తడిగా ఉండే అటవీ ప్రాంతం, పొదలు, గడ్డి భూముల్లో ఇవి నివసిస్తాయి. వీటితో పర్యావరణం పరిఢవిల్లుతుందని శాస్త్రవేత్తలు భావిస్తారు. తూర్పు కనుమల ప్రాంతమైన తమిళనాడు, ఏపీ, ఒడిశా ప్రాంతాల్లో కేవలం పాపికొండలు వద్ద ఈ జాతిని గుర్తించడంతో ఈ ప్రాంతాల్లో మరింతగా వీటి జాడ ఉండే అవకాశం ఉంది. విషపూరితమైనవి కావు డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ విషపూరితమైనవి కావు. క్రిమికీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. వానపాములు ఏ విధంగా సంతానోత్పత్తి చేస్తాయో అదేవిధంగా వీటి సంతతిని వృద్ధి చేసుకుంటాయి. పంట పొలాల్లో రసాయనాలు అధిక వినియోగం వల్ల వీటి సంతతి నశిస్తోంది. పర్యావరణ పరిరక్షణలో వీటి పాత్ర గణనీయంగా ఉంటుంది. వీటిని పరిరక్షించుకోవాలి. – బి.భరత్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హైదరాబాద్ -
భారత్‌కు గుడ్‌న్యూస్.. త్వరలో ‘ఎల్‌నినో’ మాయం!
న్యూఢిల్లీ: దేశంలోని రైతులకు వాతావరణ సైంటిస్టులు గుడ్‌న్యూస్ చెబుతున్నారు. గత ఏడాదిలా కాకుండా ఈ ఏడాది దేశంలో సమృద్ధిగా వర్షాలు పడతాయని వారు అంచనా వేస్తున్నారు. 2023లో దేశంలో అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావానికి కారణమైన ఎల్‌నినో పరిస్థితులు నైరుతి రుతుపవనాలు వచ్చే సమయానికి మారిపోతాయని అమెరికాతో పాటు భారత్‌కు చెందిన వాతావరణ సైంటిస్టులు వెల్లడిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడంతో ఏర్పడిన ఎల్‌నినో(వర్షాభావ పరిస్థితి) జూన్ నాటికి బలహీనపడి లా నినా ఏర్పడుతుందని అమెరికాకు చెందిన క్లైమేట్ ప్రెడిక్షన్ సెంటర్, నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకటించాయి. ఎల్‌నినో తొలుత ఏప్రిల్-జూన్ మధ్య ఈఎన్ఎస్ఓ(తటస్థ స్థితి)కి రావడానికి 83 శాతం, ఆ తర్వాత ఇది జూన్-ఆగస్టు మధ్య లానినాగా మారడానికి 62 శాతం అవకాశం ఉందని వెల్లడించాయి. లా నినా పరిస్థితులు ఏర్పడితే గనుక ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో దేశంలో సాధారణవర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ సైంటిస్టులు చెబుతున్నారు. ఒక వేళ లానినా ఏర్పడకపోయినా తటస్థ(ఈఎస్ఎన్ఓ) పరిస్థితులు ఏర్పడినా భారత్‌లో ఈ ఏడాది వర్షాలకు ఢోకా ఉండదని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ మాజీ సెక్రటరీ మాధవన్ రాజీవన్ తెలిపారు. భారత్‌లో 70 శాతం వార్షిక వర్షపాతం నైరుతి రుతుపవనాల వల్లే నమోదవుతుంది. జీడీపీలో 14 శాతం వాటా కలిగిన వ్యవసాయరంగానికి ఈ రుతుపవనాలే కీలకంగా ఉండటం గమనార్హం. ఇదీ చదవండి.. రైతుల ఉద్యమం మరింత ఉధృతం -
మనిషి ఎంతకాలం జీవించవచ్చు? పరిశోధనల్లో ఏం తేలింది?
దీర్ఘాయుష్షు... ఇది ప్రతీమానవునికీ ఉండే కోరిక. అందుకే శాస్త్రవేత్తలు నిరంతరం మనిషి ఆయుష్షు పెంపుదలకు సంబంధించిన పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఇటీవల డచ్ పరిశోధకులు మానవుడు ఎంత సుదీర్ఘకాలం పాటు జీవించవచ్చనే విషయాన్ని తమ పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. డచ్ పరిశోధకులు మనిషి దీర్ఘాయువు వెనుకగల రహస్యాలను కూడా వెల్లడించారు. పోషకాహారం, మెరుగైన జీవన స్థితిగతులు, ఆధునిక వైద్య సంరక్షణ విధానాలతో ఆయుర్దాయం పెరుగుతుందని డచ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీరు తమ పరిశోధనల కోసం ముందుగా వేర్వేరు కాలాల్లో మరణించిన సుమారు 75 వేల మంది డచ్ పౌరుల డేటాను సేకరించారు. దీని ని సమూలంగా విశ్లేషించారు. వారు మరణించే సమయంలో వారి వయసును పరిగణలోకి తీసుకుని ఒక నివేదిక రూపొందించారు. రోటర్‌డామ్‌లోని టిల్బర్గ్, ఎరాస్మస్ విశ్వవిద్యాలయాలకు చెందిన గణాంక నిపుణులు తమ పరిశోధనల ద్వారా మహిళల గరిష్ట వయోపరిమితి 115.7 ఏళ్లని తమ పరిశోధనల ద్వారా కనుగొన్నారు. అలాగే పురుషుల గరిష్ట ఆయుర్దాయం 114.1 అని వెల్లడించారు. దీని ప్రకారం చూస్తే పురుషుల ఆయుష్షు కంటే మహిళల ఆయుష్షు కాస్త ఎక్కువేనని వారు చెబుతున్నారు. పరిశోధకులు మూడు దశాబ్దాల డేటా ఆధారంగా మానవుని గరిష్ట ఆయుష్షును అంచనావేయగలిగారు. ఈ పరిశోధనలు సాగించిన శాస్త్రవేత్తలలో ఒకరైన ప్రొఫెసర్ జాన్ ఐన్‌మహ్ల్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా మనిషి ఆయుష్షు పెరుగుతూ వస్తోందని, వృద్ధాప్యం కూడా దూరమవుతున్నదన్నారు. ఇటీవలి కాలంలో నెదర్లాండ్స్‌లో 95వ పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. మనిషి ఆయుర్దాయం అనేది సామాజిక శ్రేయస్సును సూచించే కొలబద్ద అని అని డచ్ పరిశోధకులు పేర్కొన్నారు. కాగా ఈ డచ్ శాస్త్రవేత్తల పరిశోధనలు అంతకుముందునాటి అమెరికన్ శాస్త్రవేత్తల పరిశోధనల నివేదికలను పోలివుండటం వివేషం. అమెరికా శాస్త్రవేత్తలు కూడా డచ్ పరిశోధకులు వెల్లడించిన గరిష్ట వయో పరిమితినే గుర్తించారు. అయితే తమ దేశంలో ప్రస్తుతం ఉన్న వృద్ధులు తమ పూర్వీకుల మాదిరిగా దీర్ఘ కాలం జీవించడం లేదని వారు వివరించారు. డచ్ పరిశోధకుడు ఐన్‌మహ్ల్, అతని బృందం ఈ పరిశోధనల కోసం ‘ఎక్స్ట్రీమ్ వాల్యూ థియరీ’ అనే ప్రత్యేక గణాంక విధానాన్ని ఉపయోగించారు. ఇది డేటాను విశ్లేషించేందుకు, వివిధ సందేహాలను తొలగించేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది. అయితే 122 సంవత్సరాల164 రోజులు జీవించిన ఫ్రెంచ్ సూపర్ సెంటెనేరియన్ జీన్ కాల్మెంట్ తన ఆయుష్షుకు అడ్డుపడే అన్ని పరిధులను అధిగమించారని ఐన్‌మహ్ల్ పేర్కొన్నారు. ఈయన మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న ఈ పరిశోధనల వివరాలు త్వరలోనే ప్రచురితమై అందుబాటులోకి రానున్నాయి. -
సంజీవని కావాలి!
మనం మనుషులం, మర్త్యులం. పుట్టిన ప్రతి మనిషికీ మరణం తప్పదు. మరణించిన మనుషులు తిరిగి బతికిన ఉదంతాలు అరుదుగా వార్తల్లో కనిపిస్తుంటాయి. చితి మీద నుంచి లేదా శవపేటిక నుంచి అలా బతికి లేచిన వాళ్లు కూడా ఏదో ఒకరోజు మరణిస్తారు. ‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ/ తస్మాద పరిహార్యేర్థే న/ త్వం శోచితు మర్హసి’ అని భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు. పుట్టిన వారికి మరణం తప్పదని, మరణించిన వారు తిరిగి పుట్టక తప్పదని, ఇదంతా ఒక చక్రమని చాలా మతాలు నమ్ముతాయి. ఈ నమ్మకంలోని నిజానిజాలు ఆ భగవంతుడికే ఎరుక! ఇది ఇంతవరకు శాస్త్రీయంగా రుజువు కాలేదు. నమ్మకాలకు రుజువులతో పనిలేదు. నమ్మకాలను కలిగి ఉండటం ప్రజల హక్కు గనుక జనన మరణ చక్రంపై నమ్మకాన్ని అలా విడిచిపెడదాం. మన పురాణాల్లో మరణించిన వారిని బతికించిన ఉదంతాలు ఉన్నాయి. అసురగురుడు శుక్రాచార్యుడి వద్ద మృతసంజీవని విద్య ఉండేదట! ఆ విద్యతోనే దేవతలతో జరిగిన యుద్ధాల్లో మరణించిన దానవులందరినీ ఆయన మళ్లీ బతికించేసేవాడట! అప్పట్లో దేవతల వద్ద ఈ విద్య ఉండేది కాదు. ఆ తర్వాత క్షీరసాగర మథనంలో పుట్టిన అమృతం తాగిన తర్వాతనే దేవతలు అమర్త్యులుగా మారారు. క్షీరసాగర మథనానికి ముందు ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా దేవగురువు బృహస్పతి మృతసంజీవని విద్యను శుక్రుని వద్ద నేర్చుకోవడానికి స్వయంగా తన కొడుకు కచుడిని పంపించాడు. శుక్రాచార్యుడి ఆశ్రమంలో కచుడి ప్రవేశం ముక్కోణపు ప్రేమ గాథకు దారితీసింది. అదంతా వేరే కథ! త్రేతాయుగం నాటి రామాయణంలో కూడా మృతులను బతికించిన సందర్భం కనిపిస్తుంది. అప్పట్లో ఈ విద్య వానర వైద్యుడు సుషేణుడికి తెలుసు. రామ రావణ యుద్ధంలో ఇంద్రజిత్తు బాణం దెబ్బకు లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సుషేణుడి సలహాపై హనుమంతుడు సంజీవని మూలిక దొరికే సుమేరు పర్వతానికి వెళ్లి, మూలికను గుర్తించలేక ఏకంగా పర్వతాన్ని పెకలించుకొచ్చాడు. సుషేణుడు సంజీవని మూలికతో లక్ష్మణుడు తెప్పరిల్లేలా చేశాడు. అప్పటి వరకు యుద్ధంలో మరణించిన వానరులను తిరిగి బతికించాడు. ఇదంతా రామాయణ కథనం. ద్వాపర యుగం నాటికి మరణించినవాళ్లను తిరిగి బతికించే విద్య అంతరించిందేమో! కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన వాళ్లెవరూ తిరిగి బతికిన దాఖలాలు కనిపించవు. ఆధునిక కాలంలో మనమేం చేస్తున్నామంటే, భూమ్మీద సృష్టి మొదలైనది లగాయతు ఇప్పటి వరకు ఏమేమి అంతరించిపోయాయో లెక్కలు వేసుకుంటున్నాం. భూమ్మీద జీవసృష్టి మొదలయ్యాక దాదాపు ఐదువందల కోట్ల జీవరాశులు ఉద్భవించాయి. వాటిలో తొంభైతొమ్మిది శాతం అంతరించిపోయాయి. ఇప్పటికి మిగిలిన జీవజాతులు దాదాపు ఎనభై ఏడు లక్షలు మాత్రమే! వీటిలోనూ కొన్ని జీవజాతులు మన కళ్లముందే అంతరించిపోయే పరిస్థితులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమ్మీద అంతరించిపోతున్నవి జీవరాశులు మాత్రమే కాదు. భూమ్మీద పుట్టిన మనుషులు సృష్టించుకున్న ఎన్నో నాగరికతలు, భాషలు అంతరించిపోయాయి. ఆధునికత అభివృద్ధి చెందే క్రమంలో ఎన్నో వస్తువులు, ఎన్నో కళలు కనుమరుగైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడువేల భాషలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో దాదాపు ఐదువందల వరకు భాషలు పూర్తిగా అంతరించాయి. మనుగడలో ఉన్న భాషల్లోనూ కొన్ని సాహితీప్రక్రియలు కనుమరుగైపోయాయి. కొన్ని భాషలు కొన ఊపిరితో ఉన్నాయి. యునెస్కో రూపొందించిన ‘వరల్డ్ అట్లాస్ ఆఫ్ లాంగ్వే జెస్’ ప్రకారం ప్రస్తుత ప్రపంచంలో సుమారు రెండున్నరవేల భాషలు రానున్న కాలంలో కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయి. ఒక భాష అంతరించిపోతే, ఆ భాషతో ముడిపడి ఉన్న ప్రజల చరిత్ర అంతరించిపోతుంది. ఆ భాషలో నమోదై ఉన్న విలువైన సాహిత్యం, శాస్త్రవిజ్ఞానం; ఆ భాష ప్రజల సంస్కృతి కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఇప్పటికే అంతరించిపోయిన భాషలను ఎటూ కాపాడుకోలేకపోయాం. కనీసం ప్రమాదం అంచుల్లో ఉన్న భాషలనైనా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. మరణించిన భాషలకు ప్రాణం పోసే మృతసంజీవని విద్య ఏదీ ఇప్పటివరకు లేదు. అయితే, అంతరించిపోయిన కొన్ని అరుదైన జీవరాశులకు తిరిగి ప్రాణం పోయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. నాలుగు శతాబ్దాల కిందట అంతరించిపోయిన ‘డోడో’ అనే ఎగరలేని పక్షిని జన్యుసాంకేతిక పరిజ్ఞానంతో తిరిగి పుట్టించడానికి అమెరికన్ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. నాణ్యత అరుదైపోతున్న ప్రక్రియల విషయానికి వస్తే – తెలుగు సాహిత్యంలో ఇప్పుడు కొన ఊపిరితో ఉన్న ప్రక్రియ విమర్శ. ఆధునిక తెలుగు సాహిత్యంలో కందుకూరి వీరేశలింగంతో మొదలైన విమర్శ – రాచమల్లు రామచంద్రారెడ్డి నాటికి గొప్ప దశకు చేరుకుంది. కానీ, తర్వాత తర్వాత చప్పబడింది. రచయితలు రాటుదేలడానికి విమర్శకులు చాలా అవసరం. తెలుగు సాహిత్యంలో ప్రస్తుతం రచయితలకు, కవులకు కొదవలేదు గాని, విమర్శకుల లోటు బలంగా ఉంది. కొద్దిమంది విమర్శకులు ఈ ప్రక్రియను బతికించుకుంటూ వస్తున్నారు. అలాగని విమర్శ ప్రక్రియ క్షీణతకు కేవలం విమర్శకులను తప్పుపట్టలేం. విమర్శను తట్టుకునే శక్తి రచయితల్లో కొరవడటం కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చు. విమర్శ కనుమరుగైపోతే, సాహితీ సృజన అంతరించి పోవడానికి ఎంతోకాలం పట్టదు. ఇప్పుడు విమర్శకు పునర్జీవం కల్పించే సంజీవని కావాలి! -
పెరిగే వయసుతో... నచ్చే రుచుల మార్పు
రుచి కేవలం నాలుక మీద మాత్రమే తెలుస్తుంది అని చాలామంది అనుకుంటారు. ఒక రకం తిండి మనకు ఇష్టమా లేదా అని తెలియడానికి నాలుక ఒక్కటే ఆధారం కాదు. ఉదాహరణకు మనం ఏదో ఒక పండును కొరుకుతాము. ఒక్కసారిగా మెదడుకు రకరకాల నాడీ రసాయన స్పందనలు అందుతాయి. వాటి కారణంగా ఆ పండును మరొక సారి మనం కొరుకుతామా లేదా అన్నది నిర్ణయం అవుతుంది. నాలుక మీద ఉండే రుచిని గుర్తించే కణాలను ‘టేస్ట్ బడ్స్’ అంటారు. అంగిలి అంటే నోటిలో పైభాగం, గొంతు లోపలి పక్క, ఇంకొంచెం కిందకు ఉండే ఈసోఫేగస్ లాంటివన్నీ తిండి గురించిన సమాచారాన్ని మెదడుకు చకచకా పంపిస్తాయి. దానితో నోటిలోకి అందిన తిండి రుచి తెలుస్తుంది. మనకు కలకాలంగా ఆరు రుచులు అన్న సంగతి గురించి చెబుతున్నారు. శాస్త్రజ్ఞులు ఇంకొక పక్కన ఉన్నది ఐదు రుచులు మాత్రమే అంటున్నారు. తీపి, పులుపు, ఉప్పు, చేదులతోపాటు ఉమామి అనే ఒక కొత్త రుచిని కూడా ఈ మధ్యన చెబుతున్నారు. మనిషి వయసు పెరుగుతున్న కొద్దీ ఈ రుచులు తెలుసుకొని ఇష్టపడే లక్షణాలు మారుతూ ఉంటాయట. ‘రుచులు తెలిసేది మెదడు కారణంగానే! ఈ మెదడు మొండిగా ఉండదు. మారుతూ ఉంటుంది. కనుకనే వయస్సుతో పాటు రుచి, వాసనలను గ్రహించే తీరు మారుతూ పోతుంది’ అంటున్నారు ఫిలడెల్ఫియా పరిశోధకురాలు జూలీ మెనెల్లా. ముఖ్యంగా బాల్యంలో అంటే మరీ చిన్న వయసులో రుచులను ఇష్టపడడంలో చాలా మార్పులు వస్తాయి అంటారావిడ. మరీ చిన్న వయసులో రుచి గురించిన తీరు చాలా వేరుగా ఉంటుంది. అయితే ఆ ప్రభావం మాత్రం చాలా కాలంగా కొనసాగుతుంది అని ఆమె వివరించారు. తీపి, ఉప్పు రుచిగల తిండి పదార్థాలను ఇష్టపడడం అన్నది బాల్యంలో మెదడులో గట్టిగా పాతుకుపోయి ఉంటుంది. మానవ పరిణామం దృష్ట్యా చూస్తే తీపి అన్నది ఎక్కువ శక్తి గల ఆహార పదార్థాలతో సంబంధం కలిగిన విషయం. ఇక శరీరానికి ఎంతో అవసరమైన ఖనిజలవణాలు ఉప్పగా ఉండే తిండితో అందు తాయి. చిన్న వయసులో ఉన్న వారికి శరీరం పెరుగుదల కారణంగా చాలా శక్తి అవసరం ఉంటుంది అన్నది తెలుసు. ‘అందుకే ఆ వయసులో ఎక్కువ శక్తిని అందించగల తీయని పదార్థాల వైపు దృష్టి ఉంటుంది. ఈ లక్షణం శరీరంలోనే సహజంగా ఉంటుంది. శరీరానికి శక్తి ఆ రకంగా అందుతుంది’ అంటారు మెనెల్లా. ఇక చేదు రుచి గురించి చూస్తే, చేదు రుచి మనకు ఇష్టం లేని పదార్థాలతో గట్టిగా ముడిపడి ఉంటుంది. అయినప్పటికీ వాటిని తిన్నందువల్ల నష్టం జరగదు, మంచి జరగవచ్చు అని అర్థమైతే అప్పుడు వాటిని అంగీకరించే మానసిక పరిస్థితి వస్తుంది. బిడ్డలు తల్లి కడుపులో ఉండగానే ఆహార పదార్థాల రుచి అలవాటు అవుతుంది అని గమనించారు. గర్భంతో ఉన్న స్త్రీలకు చేదు రుచి పట్ల ఏవగింపు ఉంటుంది. తల్లి తీసుకుంటున్న ఆహారం ప్రభావం కడుపులోని బిడ్డ మీద కూడా పడుతుంది. తల్లి ఏదో మందు మింగితే కడుపులోని పాప ముఖం ముడుచుకుంటున్నట్టు అల్ట్రాసౌండ్ పరీక్షలలో కనిపించింది. బాల్యం, యవ్వనం గడుస్తున్న కొద్దీ ఆ మేర రుచులకు స్పందించడం తగ్గుతుంది. చేదును అంగీకరించడం మొదలైన కొద్దీ, తీపి, ఉప్పుల మీద కొంత ఆసక్తి తగ్గినా తగ్గవచ్చు. కనుకనే యుక్త వయసు దాటిన తరువాత తిండి విషయంగా అంతగా పట్టింపు ఉండకపోవచ్చు. అప్పుడిక అంతకు ముందు ఏవగించు కున్న తిండి పదార్థాలను కూడా తినే పద్ధతి మొదలవుతుంది. 50వ పడిలో పడిన తరువాత నాలుక మీద అంతవరకు ఉన్న పదివేల రుచి కణాల సంఖ్య రాను రాను తగ్గుతుంది. అవి మళ్లీ తిరిగి పెరగవు. అంతకు ముందు మాత్రం అవి పది రోజులకు ఒకసారి సమసిపోయి తిరిగి పుడుతుంటాయి. పాడయిన కణాల స్థానంలో కొత్తవి రాకపోవడంతో రుచి తెలియడం తగ్గుతుంది. వాసన విషయంగా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ మార్పులు అంతగా గుర్తించగలిగే స్థాయిలో ఉండకపోవచ్చు. ఏదో ఒక్క రుచీ, ఒక్క వాసనకే పరిమితం కాకపోవచ్చు. అంటే అన్ని వాసనలూ తెలియకుండా పోయే పరిస్థితి ఉండదు. ఏవో కొన్ని రకాలు, ఉదాహరణకు మల్లెల వాసన తెలియకపోవచ్చు, ఉల్లివాసన మాత్రం బాగా తెలియ వచ్చు. రుచులు తెలియకుండా పోవడానికి వయసు ఒకటే కారణం కాదు. రక్తపు పోటును తగ్గించడానికి వాడే కొన్ని మందులు కూడా ఈ రకం ప్రభావాన్ని చూపిస్తాయి. శ్వాస మండలంలోని పైభాగంలో వచ్చే ఆరోగ్య సమస్యల చికిత్సకు ఇచ్చే మందులు కూడా రుచి, వాసనలు తెలియకుండా చేస్తాయి. ఈ విషయం కోవిడ్ వల్ల తెలిసింది. అసలు కోవిడ్ గురించి మొదటి సూచన లుగా ఈ లక్షణాలను ఎంచుకున్నారు. ప్రభావం తగ్గిన తర్వాత చాలామందికి రుచి, వాసనలు తెలియడం తిరిగి మొదలయింది. కొందరికి మాత్రం ఆ రకంగా జరగలేదు. కె.బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ రచయిత ‘ 98490 62055 -
మొటిమల ముల్లుకు మొటిమలతోనే విరుగుడు!
టీనేజర్లను బాగా వేధించే సమస్య మొటిమలు. ముఖంపై చిన్న బొడిపెల మాదిరిగా వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. ఒక్కొసారి వాటి నుంచి జిడ్డుగా ఉండే ఒక రకమైన ద్రవం కారుతుంది. గిల్లడం వల్ల ముఖంపై ఎర్రటి పొక్కుల్ల అసహ్యంగా కనిపిస్తాయి. ఓ పట్టాన తగ్గవు. ఇంతవరకు మొటిమలు తగ్గేందుకు యాంటీ బయోటిక్ మందులతో చికిత్స అందిస్తున్నాం. అవి కేవలం మొటిమలు రావడానికి కారణమయ్యే సెబమ్ అనే జిడ్డుని ఉత్పత్తి చేసే కణాలతో పోరాడేవి లేదా నాశనం చేసేవి. నిజం చెప్పాలంటే ఆ ఔషధాలు మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను లక్ష్యంగా చేసుకునే చికిత్స చేసేవారు వైద్యులు. అయితే ఆ మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియానే మనకు మేలు చేసేలా మారిస్తే..! అనే సరికొత్త అధ్యయానికి నాంది పలికారు స్పెయిన్ శాస్త్రవేత్తలు. ఈ మేరకు పాంప్యూ ఫాబ్రా విశ్వవిద్యాలయం(యూపీఎఫ్) శాస్త్రవేత్తలు మొటిమల మందులలో క్రియాశీల పదార్థాలు ఉత్పత్తి అయ్యేలా చర్మంలో ఉండే బ్యాక్టీరియాను ఎలా ఇంజనీర్ చేయాలనే దిశగా పరిశోధనలు చేస్తున్నారు. మొట్టిమలకు కారణమయ్యే క్యూటిబాక్టిరియాని రిపేర్ చేయడమే లక్ష్యంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ బ్యాక్టీరియా మన చర్మంపై ఉండే వెంట్రుకల కుదుళ్లలో లోతుగా నివశిస్తుంది. ఇది సెబమ్ అనే ఒక విధమైన జిడ్డు అధికంగా ఉత్పత్తి చేసి మొటిమలు వచ్చేందుకు కారణమవుతోంది. అందువల్ల వైద్యులు ఆ జిడ్డుని ఉత్పత్తి చేసే కణాలను చంపేలే ట్రీట్మెంట్ చేసేవారు. ఇప్పుడూ ఆ సెబమ్ అనే జిడ్డు తక్కువగా ఉత్పత్తి చేసేలా చర్మంలోని బ్యాక్టీరియాని మార్చే టెక్నిక్‌ని అభివృద్ధి చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అందుకోసం మానవ చర్మ కణాల్లోని బ్యాక్టీరియాను ల్యాబ్‌లో పరీక్షించగా మెటిమలను రాకుండా చేసే ఎన్జీఏఎల్ అనే ప్రోటీన్‌ను కూడా స్రవించగలదని గుర్తించారు. దీంతో ఆ బ్యాక్టీరియాతోనే ముఖంపై ఏర్పడే జిడ్డు ఉత్పత్తికి కారణమ్యే సెబమ్ ఉత్పత్తిని నియంత్రించొచ్చని కనుగొన్నారు. దీన్ని ఎలుకలపై ప్రయోగించగా.. ఆ బ్యాక్టీరియా ఎలుకల్లో జీవించగులుగుతుందని గుర్తించారు. ఆ విధానం పనిచేస్తుంది కానీ మొటిమల ప్రభావాల గురించి ఎలుకలపై ప్రయోగించి తెలుసుకోవడం అనేది కుదరదు. ఎందుకంటే? ఎలుక చర్మం మానవ చర్మాని కంటే విభిన్నంగా ఉంటుంది. కచ్చితంగా మనుషులపైనే ఈ టెక్నిక్ ట్రయల్స్ నిర్వహించక తప్పదు. అయితే ఈ టెక్నిక్‌ని తొలుత త్రీడీ స్కిన్ మోడల్లో ప్రయత్నిస్తే బెటర్ అని భావిస్తున్నారు. ఎందుకంటే? అన్ని రకాల చర్మ పరిస్థితులకు ఈ విధానం అనువుగా ఉంటుంది. అదే సమయంలో మానువులపై ట్రయల్స్ నిర్వహించేందకు మరింత లోతుగా ఈ టెక్నిక్‌పై పరిశోధనుల చేయాల్సి ఉందని కూడా చెప్పారు పరిశోధకులు. అలాగే తాము ఈ బ్యాక్టీరియాను వివిధ రకాల చర్మ వ్యాధులకు కూడా మేలు చేసేలా మార్చేలా ఆ టెక్నిక్‌ని అభివృద్ధిపరచనున్నట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు. అంతేగాక మొటిమల నివారణకు మొటిమలనే ఉపయోగించడంపై కూడా దృష్టి సారిస్తున్నట్లు కూడా తెలిపారు. (చదవడం: శిల్పాశెట్టి చెప్పే తిరగలి తిప్పే భంగిమ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!) -
మూలాల అన్వేషణలో వరదకు ఎదురీత
కల్లూరి భాస్కరం రచించిన ‘ఇవీ మన మూలాలు’ అనే పుస్తకం ఒక మల్టి– డిసిప్లినరీ అధ్యయనం. మానవుడికి సంబంధించిన ఒక సుదీర్ఘమైన కథని ఎంతో ఉత్కంఠభరితంగా చెప్తున్న రచన ఇది. ఇటువంటి కృషి ఒక్క మనిషి ఒంటి చేత్తో చెయ్యగలిగేది కాదు. ఏదైనా ఒక విశ్వ విద్యాలయమో లేదా ఒక శాస్త్రవేత్తల బృందమో మాత్రమే చెయ్యగల పని. మానవ చరిత్ర దశాబ్దాల లెక్కకో, చివరికి శతాబ్దాల లెక్కకో కుదించగలిగేది కాదు. అది సహస్రాబ్దాల లెక్కలో అర్థం చేసుకో వలసింది. మనం ఈ రోజు అట్లాసులో చూస్తున్న ఈ ఖండాలు ఎల్లప్పుడూ ఇలానే లేవనీ, ఈ దేశాలూ, ఈ సరిహద్దులూ ఎప్పటి కప్పుడు మారుతూనే ఉన్నాయనీ, ఈ రోజు భారతదేశంతో సహా ఎన్నో జాతీయరాజ్యాలు భావిస్తున్నట్టుగా వాటి జాతి చరిత్ర అవి గీసుకున్న సరిహద్దులకే పరిమితం కాలేదనీ, నిజానికి మనం కట్టు కుంటున్న గోడలేవీ ఒకప్పుడిలా లేవనీ, ఇప్పుడు కూడా ఈ గోడలు ఇలానే శాశ్వతంగా నిలబడిపోయేవి కావనీ మనం గ్రహించవలసి ఉంటుంది. మన్వంతరాల చరిత్రలో మానవుడు ఈ వసుధ మొత్తాన్ని ఏక కుటుంబంగా భావించాడనీ, ఎక్కడో సుదూర ప్రాంతానికి చెందిన మానవ సమూహాలు మరెక్కడో సుదూర ప్రాంతానికి పోయి అక్కడ నాగరికతలు నిర్మించాయనీ ఈ రోజు ఎన్నో ఆనవాళ్ళు లభిస్తున్నాయి. ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా తన సంస్కృతి, తన సాహిత్యం, తన సాంకేతికత పూర్తిగా తన ఘనత మాత్రమే అనుకోడానికి లేదనీ, మానవుడు ఏ దేశంలో ఉన్నా అతడు సాధించిన ప్రతి విజయంలోనూ ప్రపంచ మానవులందరి పాత్రా ఉందని మనం ఒప్పుకోవలసి ఉంటుంది. ఇదే మాట మన జన్యు వారసత్వం గురించి కూడా చెప్పుకోక తప్పదు. ఇప్పుడు ఈ నేల మీద నడయాడుతున్న ప్రతి ఒక్క మానవుడూ, ఇంతదాకా ఈ పృథ్వి మీద సంచరించిన ప్రతి ఒక్క మానవుడికీ జన్యుపరంగా వారసుడేనన్నది ఒక వైజ్ఞానిక సత్యం. ఇంత కొట్టొచ్చినట్టుగా మన ముందు బయటపడుతున్న మానవుడి గతాన్ని చూడటానికి ఇష్టపడకుండా, ఇంకా శుద్ధ జాతులూ, శుద్ధరక్తమూ, శుద్ధ సంస్కృతీ ఉంటాయనుకోవడం సాంస్కృతిక అంధ త్వం మాత్రమే! ఇటువంటి గుడ్డితనం ఎవరో ఒక రిద్దరు వ్యక్తులకి ఉండటం వేరు, ఒక జాతి అత్యధికభాగం ఇటువంటి కథనాల్ని చెప్పుకుంటూ తనని తాను నమ్మించుకోడం వేరు. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. తాను బలపడుతున్నానుకుంటూ నిజా నికి ఒక జాతి దుర్బలమైపోతున్న ప్రక్రియ ఇది. ఈ నేపథ్యంలో భాస్కరం గారి పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది. జాతీయోద్యమ నాయకులు భారతదేశ చరిత్రలో ప్రతి ఒక్కరి పాత్రనీ గుర్తించారు. కానీ కొత్త జాతీయవాదులు అటు వంటి విశాల దృక్పథాన్ని స్వాగతించరు సరికదా, అటువంటి విస్తృత దృక్పథాన్ని సహించలేరు కూడా. తమ అసహనాన్ని ప్రక టించడానికి వారికున్న అనేక సాధనాల్లో కృత్రిమ కథనాల్ని ప్రచారం చేయడం కూడా ఒకటి. ముఖ్యంగా భారతదేశ చరిత్ర గురించి వాళ్ళు శాస్త్రీయ దృక్పథానికి బదులు పౌరాణిక దృక్ప థాన్ని ప్రచారం చేస్తారు. ప్రజల్ని ఉద్రిక్తుల్ని చేయడానికి వాస్తవం కన్నా కల్పనది దగ్గరి దారి అని వాళ్ళ నమ్మకం. సరిగ్గా ఈ వరదకు ఎదురీదుతూ భాస్కరం గారు ఈ పుస్తకం రాశారని చెప్పవచ్చు. ఇది సాహసమే కాని ఎంతో అవసరం. ఆయనిలా అంటున్నారు: ‘ఒక్కోసారి రాజకీయం తన హద్దును, తూకాన్ని దాటిపోయి సంస్కృతి, సాహిత్యం, శాస్త్రవిజ్ఞానం తదితర జ్ఞాన రంగాలను కూడా తన పరిధిలోకి తెచ్చేసుకుని, రాజకీయాన్నీ వాటినీ కలగా పులగం చేసి సర్వం తానే అవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. రాజకీయానికి సమాంతరంగా జ్ఞానరంగానికి ఉన్న ప్రాము ఖ్యాన్నీ, దాని స్వేచ్ఛా స్వాతంత్య్రాల్నీ గుర్తించి దాని ఉనికిని ఎప్పటికప్పుడు పటిష్ఠం చేసుకోవడమే రాజకీయ స్వైరవిహారానికి విరుగుడు.’ ఈ రచన సత్యాన్వేషణ దృష్టితో చేసిన కృషి. ఇందుకు గాను భాస్కరంగారు ఆధునిక, సమకాలిక జన్యుశాస్త్ర పరిశోధనల్ని తన ముడిసరుకుగా తీసుకున్నారు. ఎందుకంటే ఆయనే ఒక చోట రాసినట్టుగా ‘జనశాస్త్రమంటే జన్యుశాస్త్రమే.’ ఒక ప్రాంతం నుంచి వలసపోయినవాళ్ళో లేదా అక్కడికి వలస వచ్చినవాళ్ళో మాత్రమే అక్కడి చరిత్రని నిర్మించారని భాస్కరం గారు ఈ రచనలో ఎక్కడా రాయలేదు. ఆయన చెప్తు న్నదల్లా ఏమిటంటే, ఏ దేశ చరిత్రనైనా కేవలం ఆ దేశీయులు మాత్రమే నిర్మించారనుకోకండి, అది బహుళ జాతుల సంస్కృతుల ఆదాన ప్రదానాలతో నిరంతరం సంభవిస్తూండే ఒక ప్రక్రియ అని మాత్రమే. అలాగే, శుద్ధమైన జాతి అంటూ ఏదీ లేదనీ, అలా ఉంటుందనుకుని తమ దేశం చుట్టూ సాంస్కృతి కంగా గోడలు కట్టుకోవడం మూర్ఖత్వం మాత్రమే కాదు, ప్రమా దకరమని కూడా ఆయన చెప్తున్నారు. ముందే చెప్పినట్టుగా ఇదొక మల్టీ డిసిప్లినరీ అధ్యయనం. ఇందులో జన్యుశాస్త్ర పరిశీలనలతో పాటు, పురావస్తు, మానవ శాస్త్ర పరిశీలనలతో పాటు, తులనాత్మక భాషాశాస్త్రం, మైథాలజీ, వేద, పురాణ, ఇతిహాసాల పరిశీలనలతో పాటు, సంస్కృత, తెలుగు సాహిత్యాల నుంచి కూడా ప్రస్తావనలు ఉన్నాయి. ఈ ఒక్క గ్రంథం చదివితే ఎన్నో గ్రంథాలు చదివినట్టు! ఈ అధ్యయ నంలో భాస్కరంగారు ఎన్నో హైపోథీసిసులు మనముందుంచ డమేకాక, మన సంస్కృతి, చరిత్రలకు సంబంధించిన ఎన్నో చిక్కుముళ్ళు విడి పోవడానికి అవసరమైన తాళంచెవులు కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఒకటి, ఆయన స్వయంగా పండిత కుటుంబం నుంచి వచ్చిన వారు కావడంవల్లా, భారతీయ సంస్కృతికి మూలగ్రంథాలు అని చెప్పదగ్గవాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసినందువల్లా ఇది సాధ్యపడిందని చెప్పవచ్చు. రెండోది– ఏళ్ళ తరబడి ఆయన ఎంతో సమర్థవంతంగా నిర్వహించిన పాత్రికేయ వృత్తి ఆయనకు సమకాలిక ప్రపంచం గురించీ, భారతీయ సామాజిక పరివర్తన గురించీ ప్రత్యక్ష పరిజ్ఞానాన్ని అందించడం మరో కారణం. (‘ఇవీ మన మూలాలు’కు రాసిన ముందుమాట నుంచి) వాడ్రేవు చినవీరభద్రుడు వ్యాసకర్త కవి, రచయిత (ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ‘ఇవీ మన మూలాలు’ పుస్తక ఆవిష్కరణ) -
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వర్ధిల్లాలి!
ఏటా జనవరిలో జరగాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఈసారి రద్దుకావడం అవాంఛనీయ పరిణామం. భారతీయ శాస్త్ర సమాజం ఒక పొందికతో పురోగమించేందుకు... నూటా పదేళ్లుగా సాగుతున్న ఈ సమావేశాలూ ఒక కారణమంటే అతిశయోక్తి కాదు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది ఓ విభిన్న వేదిక. ప్రత్యేక అంశాలు ఇతివృత్తంగా ఏర్పాటు చేసే శాస్త్రీయ సెమినార్లలో ఆ యా రంగాల్లో నిష్ణాతులైన శాస్త్రవేత్తలు మాత్రమే పాల్గొంటారు. సైన్స్ కాంగ్రెస్‌లో మాత్రం అన్ని రంగాలకు సంబంధించిన చర్చోపచర్చలూ జరుగుతాయి. శాస్త్రవేత్తలతో పాటు సామాన్యులు, డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులు కూడా హాజరవుతారు. ఇవి వారికి ఎంతో స్ఫూర్తిదాయకం. అందుకే ఈ సమావేశాలు నిరాటంకంగా కొనసాగాలి. భారతీయ శాస్త్ర పరిశోధన రంగానికి జనవరి నెల చాలా ముఖ్యమైంది. ఏటా ఈ నెల లోనే ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ సమావేశాలు ఘనంగా జరుగు తాయి. భారత ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ వార్షిక ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది శాస్త్రవేత్తలు, విద్యార్థులు హాజరవుతారు. కానీ ఈ ఏడాది సైన్స్ కాంగ్రెస్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ చివరి నిమిషంలో ఊహించని సమస్యల కారణంగా తప్పుకొంది. సమావేశాలకు ఆర్థిక సాయం అందించే కేంద్ర ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గడంతో ఈ ఏడాది కార్య క్రమాలు అనివార్యంగా రద్దయ్యాయి. కీలకమైన అంశాలపై మేధోమధనం జరిపేందుకు, ఆ విషయా లపై ప్రభుత్వాలకు సూచనలిచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ఉంటాయి. ఇలాంటి సలహా, సూచనలు గతంలో విధాన రూపకల్పనకు ఉపయోగపడిన ఉదాహరణలు కోకొల్లలు. కేంద్రంలో పర్యావరణ విభాగం (తరువాతి కాలంలో మంత్రిత్వ శాఖ స్థాయికి ఎదిగింది) ఏర్పాటుకూ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్ మెంట్ (ప్రస్తుతం ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీ) ఏర్పాటుకూ సైన్స్ కాంగ్రెస్ ఇచ్చిన సలహాలే కారణం. వీటన్నింటికీ మించి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేలా అత్యంత కీలకంగా వ్యవహరించింది. నూరేళ్లకు పైగా అప్రతిహతంగా... 1914లో ఏర్పాటైంది మొదలు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఏటా అప్రతిహతంగా కొనసాగాయి. కోవిడ్ కాలం నాటి పరిస్థితులు ఒక్కటే మినహాయింపు. అప్పట్లో లక్నోలోని కానింగ్ కాలేజ్ అధ్యాపకులు పి.ఎస్. మెక్‌మోహన్ , మద్రాస్‌లోని ప్రెసిడెన్సీ కాలేజీ అధ్యాపకులు జేఎల్ సైమన్ సెన్ మానస పుత్రికగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఆవిర్భవించింది. ‘బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్’ తరహాలో వారు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ప్యూర్, అప్లైడ్ సైన్స్ రంగాలపై అభినివేశం ఉన్న వారందరికీ ఒక వేదిక కల్పించడం దీని ప్రధానోద్దేశం. సమాజానికీ, సైన్స్కూ మధ్య ఒక వారధిగానూ ఈ సంస్థ ఉపయోగపడుతుందని వారు భావించారు. గణిత, ఖగోళ, భౌతిక, రసాయన, భౌగోళిక, జీవ శాస్త్రాల్లో పరిశోధనలు చేస్తున్న వారందరికీ తొలి ఉమ్మడి వేదిక కూడా ఇదే. ఆయా శాస్త్ర రంగాలకు సంబంధించిన కొత్త ఆలోచనలు పంచుకునేందుకు సైన్స్ కాంగ్రెస్ ఎంతో ఉపయోగపడింది. దశాబ్దాల సైన్స్ కాంగ్రెస్ సమావేశాల కారణంగా దేశంలో మరిన్ని శాస్త్రీయ సొసైటీలు, వృత్తినైపుణ్యమున్న సంస్థలు ఏర్పడ్డాయి. ఈ వేదిక ఈ కాలానికి సరిపోయేది కాదనీ, పాతకాలపు పద్ధతులనే కొనసాగిస్తోందనీ కొందరు అంటూంటారు. దేశంలో శాస్త్ర రంగాల అభివృద్ధితో పరుగులు పెడుతూనే, వేర్వేరు దశల్లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎలా ఎదిగిందో విస్మరించేవారే ఇలాంటి విమర్శలు చేయగలరు. ప్రాక్ – పశ్చిమాల మేళవింపు... ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ప్రస్థానంలో తొలిదశ 1914–47 మధ్యకాలమని చెప్పవచ్చు. ఈ సమయంలో భారతీయ, యూరోపియన్ శాస్త్రవేత్తల మధ్య సమాచార వినిమయం ఎక్కువగా ఉండేది. యూరోపియన్ శాస్త్రవేత్తలు అనేకులు భారతీయ పరిశోధన సంస్థల్లో పనిచేస్తూండేవారు. తమ ఆలోచనలు పంచుకునేందుకు వీరికి ఉన్న ఒకే ఒక్క వేదిక ఇండియన్ సైన్స్ కాంగ్రెస్సే. దీనికి సమర్పించే అన్ని పరిశోధన వ్యాసాలనూ సమాకాలీన శాస్త్రవేత్తలు సమీక్షించేవారు. ఈ రకమైన సమీక్ష, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు అన్న భావన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ద్వారానే ఏర్పడ్డాయి. భారత్‌లో సైంటిఫిక్ జర్నల్స్ ప్రచురణ కూడా సైన్స్ కాంగ్రెస్ పుణ్యమే. ప్రఖ్యాత శాస్త్రవేత్త మేఘనాథ్ సాహా ప్రచురించిన ‘సైన్స్ అండ్ కల్చర్’ జర్నల్ దీనికి ప్రబల ఉదాహరణ. దేశంలో స్వాతంత్య్ర ఉద్యమం బాగా నడుస్తున్న 1930లలో జాతీయ నాయకత్వం దేశ భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో దేశాభివృద్ధిలో సైన్స్‌ను వినియోగించడంపై దీని వేదికగా అనేక కొత్త ఆలోచనలపై చర్చ జరిగింది. పారిశ్రామికీకరణ, సమాజం పట్ల సైన్స్ బాధ్యత వంటి ఆలోచనలు పురుడు పోసుకున్నది ఇక్కడే. 1937లో జరిగిన సమావేశాల్లోనే జవహర్లాల్ నెహ్రూ ‘‘ఈ కాలపు స్ఫూర్తి సైన్స్. ఆధునిక ప్రపంచాన్ని శాసిస్తున్నదీ ఇదే. సైన్స్‌తో మిత్రత్వం నెరిపేవారిది, సమాజ పురోభివృద్ధికి దాని సాయం తీసుకునేవారిదే భవిష్యత్తు’’ అన్న వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947లోనూ ఈ సమావేశాలకు నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్నారు. 1964లో ఆయన మరణించేంత వరకూ కొనసాగారు. ఆ తరువాతి కాలంలో ఈ సమావేశాల్లో దేశ ప్రధాని శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించే సంప్రదాయం మొదలైంది. చాలా సందర్భాల్లో దేశ ప్రధానులు ఈ వేదికపై నుంచి కొన్ని కీలకమైన విధాన నిర్ణయాలను కూడా ప్రకటించేవారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో శాస్త్ర పరిశోధనల పునాదులకు శ్రీకారం చుట్టారు. జాతీయ పరిశోధన సంస్థలు, రీసెర్చ్ కౌన్సిళ్లు పనిచేయడం మొదలైంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కూడా ఒక కొత్త దశలోకి అడుగుపెట్టింది. శాస్త్ర పరిశోధనలపై చర్చలకు వేదికగా నిలుస్తూనే ప్రణాళిక, ఆహార సంక్షోభం, ఆరోగ్యాభివృద్ధి వంటి విస్తృత స్థాయి విధానపరమైన అంశాలపై కూడా చర్చలు మొదలయ్యాయి. యూనివర్సిటీ వ్యవస్థలోని పరిశోధకులతో పాటు జాతీయ పరిశోధన సంస్థలు, శాస్త్ర విభాగాలకు చెందినవారు ఇండి యన్ సైన్స్ కాంగ్రెస్ ప్రక్రియలో ఎక్కువగా పాలుపంచుకోవడం మొదలైంది. ఈ క్రమంలోనే కొన్ని దశాబ్దాల తరువాత ఆయా రంగా లకు ప్రత్యేకమైన సంస్థలు ఏర్పడటంతో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ తన ప్రాభవాన్ని కొంత కోల్పోయిందని చెప్పాలి. ఆయా రంగాల పరి శోధన పత్రాలను మునుపటిలా సైన్స్ కాంగ్రెస్‌లో కాకుండా ప్రత్యేక సంస్థలకు సమర్పించడం మొదలైంది. శాస్త్రీయ దృక్పథం పెరగాలంటే... ప్రస్తుతానికి వద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో, సైన్స్ రంగంలో పోటీని దృష్టిలో పెట్టుకుంటే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ఫలితాలను పంచుకోవాలని అను కోవడం అత్యాశే అవుతుంది. అందుకే ఈ సమావేశాలపై కొంతమంది పెదవి విరుస్తున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యం అనండి... ఇంకేమైనా కానివ్వండి... సైన్స్ వ్యతిరేకులు కొందరికి ఈ సైన్స్ కాంగ్రెస్ వేదికగా మారడం ఇటీవలి పరిణామం. ఒక్కటైతే నిజం. యువతరంతో తమ పరిశోధనల వివరాలను పంచుకోవాలని అనుకునే శాస్త్రవేత్తలకు, ఇతర రంగాల్లోని సహోద్యో గులతో ఆలోచనలు పంచుకోవాలనుకునేవారికి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అవసరం ఇప్పటికీ ఉంది. నోబెల్ అవార్డు గ్రహీతలు ఇక్కడ చేసే ప్రసంగాలు ఎంతోమంది యువకులు, విద్యార్థులకు స్ఫూర్తినిస్తా యనడంలో సందేహం లేదు. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో ఉంచు కుంటే ఈ సమావేశాలు భవిష్యత్తులోనూ కొనసాగాలి. సామాజిక మాధ్యమాల ద్వారా సూడోసైన్స్ కూడా సైన్స్ పేరిట చలామణి అవుతున్న ఈ సమయంలో దేశంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఇలాంటి వేదికలు అనేకం అవసరం. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ 2024 సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు ఆర్థిక సాయాన్ని ఎందుకు నిలిపేసిందో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
పుట్టుకొస్తున్న ప్లాస్టిక్ శిలలు..ఆందోళనలో శాస్త్రవేత్తలు!
సైంటిస్టులను కలవరపెడుతున్న ప్లాస్టిక్ శిలలు. ఇప్పటికే ఐదు ఖండాలలో విస్తరించి ఉన్నాయి. ఇవి గనుకు వేగంగా ఏర్పడటం మొదలైతే ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇవి పర్యావరణం, మానువుని ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. ఇంతకీ ఏంటీ ప్లాస్టిక్ శిలలు?. ఎలా ఏర్పడతాయంటే.. ఇప్పటి వరకు ఐదు ఖండాల్లో ఈ ప్లాస్టిక్ శిలలు ఆవిర్భవించి విస్తరిస్తున్నట్లు నివేదికల్లో వెల్లడయ్యింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో కనిపించే ఈ శిలలు విచిత్రమైన రూపాలను కలిగి ఉంటాయి. ఇవి కంప్రెస్డ్ రాక్ మాదిరిగా ప్లాస్టిక్ పాలిమర్లతో కూడి ఉంటాయి. సుమారు 11 దేశాలలోని తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలో కనిపించాయి. వీటిని ఏమని పిలుస్తారంటే.. ఈ ప్లాస్టిక్ ఇన్ఫ్యూజ్డ్ శిలలను పిలవడంపై శాస్త్రవేత్తల్లో ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది. అయితే ఆయా ప్రదేశాల్లో వీటిని ప్లాస్టిక్స్టోన్, ప్లాస్టిక్రస్ట్, ప్లాస్టిగోమెరేట్, ప్లాస్టిటార్, ఆంత్రోపోక్వినాస్, ప్లాస్టిసాండ్స్టోన్లు అని పిలుస్తారు. ఆ పేర్లన్నీ అలా ఏర్పడటానికి దారితీసిన ప్రక్రియలను వివరిస్తున్నాయి. ఎలా కనుగొన్నారంటే.. జియాలజిస్ట్ ప్యాట్రిసియా కోర్కోరాన్ దాదాపు ఒక దశాబ్దం క్రితం హవాయిలో మొదటిసారిగా ఈ ప్లాస్టిక్ రాక్‌ను కనుగొన్నారు. అప్పుడే దీని గురించి చర్చ మొదలైంది. ఆ టైంలోనే ప్లాస్టిక్ గొమెరైట్ అనే పదం వెలుగులోకి వచ్చింది. అయితే ఇటీవల సింఘువా విశ్వవిద్యాలయం పర్యావరణ అసోసీయేట్ ప్రొఫెసర్ దేయీహౌ అతని బృందం ప్లాస్టిక్, రాక్ మధ్య రసాయన బంధంపై చేసిన పరిశోధనల్లో లోతట్టు ప్రాంతాల్లో కనుగొన్న తొలి ప్లాస్టిక్ శిలను కనుగొన్నారు. ఆ తర్వాత వారి విస్తృతమైన పరిశోధనల్లో ఐదు ఖండాలు, 11 దేశాల్లో వీటి ఉనికిని గుర్తించారు. ఎలా ఏర్పడ్డాయంటే.. ఇవి ఏర్పడ్డ విభిన్న పద్ధతులపై అధ్యయనం చేయగా మంటలు లేదా వ్యర్థాలను కాల్చడం వంటి కార్యకలాపాలాల్లో ప్లాస్టిక్ శిథిలాలు కరిగిపోవడం, చలబడి ఖనిజ మాతృకలో మిళితం అవ్వడంతో ఏర్పడతున్నట్లు తెలుసుకున్నారు. ఇందుకు సముద్రపుప అలల పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ కలిగి ఉన్న చమురు సముద్రంలోకి లీక్ అయితే అది అలల కారణం బీచ్‌లకు చేరుకుంటుంది. అక్కడ రాళ్లకు ప్లాస్టిక్ చమురు తట్టు అతుక్కుని పాక్షికంగా బాష్పీభవనం చెంది ఘనీభవించడం జరుగుతుంది. అలాగే సూర్యకాంతి కారణంగా ఈ ప్లాస్టిక్ ఆక్సీకరణ చెంది రసాయన బైండింగ్ జరిగి ఈ ప్లాస్టిక్స్టోన్ ఉత్పత్తికి దారీతీస్తోంది. ఎక్కడెక్కడ ఉన్నాయంటే.. బ్రెజిల్, బంగ్లాదేశ్, హవాయి, చైనా, జపాన్, ఇండియా, ఇటలీ, పోర్చుగల్, పెరూ, యునైటెడ్ కింగ్డమ్, స్పానిష్ ద్వీపాలలో ఈ ప్లాస్టిక్ రాళ్లు కనపడ్డాయి. ఇది ఒకరకంగా ప్లాస్టిక్ కాలుష్యానికి అద్దం పడుతుందనే చెప్పాలి. ఈ విచిత్రమైన రాతి నిర్మాణాల ఏర్పాటుకు దారితీస్తున్న క్లిష్టమైన ప్రక్రియలే అందుకు నిదర్శనం. కలిగే పర్యావరణ ప్రభావాలు.. ఈ ప్లాస్టిక్ శిలలు సమీపంలోని నేలలో సూక్ష్మజీవులు పెరిగేందుకు కారణమవుతుంది. స్థానిక పర్వావరణ వ్యవస్థలన్నీ దీనికి ప్రభావితం అవుతుంది. ఇప్పటికే చాలా వరకు జంతువులు, మనుషులు శరీరాలపై దారుణమైన ప్రభావం చూపిస్తోంది. మానవులు కారణంగా ఈ భూమిపై ప్లాస్టిక్ ద్రవ్యరాశి సుమారు 22 నుంచి 28 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్నట్లు అంచనా వేశారు. దీనికీ తోడు ఆవిర్భవిస్తున్న ఈ ప్లాస్టిక్ రాక్లు మరింత కాలుష్యానికి, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వీటికారణంగా సూక్ష్మజీవులు అభివృద్ధి చెందితే మైక్రోప్లాస్టిక్‌లు బెడద ఎక్కువ అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ కాలుష్యాని తగ్గించే తక్షణ చర్యలకు పూనుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన నొక్కి చెబుతోందని శాస్త్రవేత్తలు అన్నారు. (చదవండి: కాన్ఫిడెన్స్‌ని దెబ్బతీసే రౌడీబేబీని ఎదుర్కొండి ఇలా! ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండిలా..!) -
గగనాంతర గవేషణ
కొత్త ఏడాది మొదలవుతూనే భారత్ మరో మైలురాయికి చేరుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన అంతరిక్ష ప్రయోగవాహక నౌక పీఎస్ఎల్వీ–సీ58 సోమవారం విజయవంతంగా నింగిలోకి దూసుకుపోవడంతో రోదసీ శోధనలో మన దేశం మరో ముందడుగు వేసింది. ‘ఎక్స్–రే పోలారిమీటర్ శాటిలైట్’ (ఎక్స్పో శాట్)నూ, మరో 10 ఇతర ఉపగ్రహాలనూ మోసుకుంటూ నింగిలోకి సాగిన ఈ ప్రయోగం అనేక విధాల ప్రత్యేకమైనది. ఖగోళంలోని కృష్ణబిలాలను (బ్లాక్ హోల్స్) అధ్యయనం చేసి, కొత్త అంశాల్ని వెలికితీసేందుకు ‘ఎక్స్‌పోశాట్’ ఉపకరిస్తుంది. ఈ తరహా శాస్త్రీయ శోధనకే పూర్తిగా అంకితమైన ఉపగ్రహాన్ని ఇస్రో పంపడం ఇదే తొలిసారి. దీంతో, అమెరికా తర్వాత రోదసిలోని ఇలాంటి దృగ్విషయాలపై ప్రయోగాలు జరుపుతున్న రెండో దేశమనే ఖ్యాతి భారత్‌కు దక్కింది. ఇక, వివిధ ప్రైవేట్ సంస్థల, విద్యార్థుల, ఇస్రో కేంద్రాలకు చెందిన మిగతా ఉపగ్రహాలు మన శాస్త్రవేత్తల, ప్రైవేట్ రంగ ఆలోచనలనూ, ఆకాంక్షలనూ ప్రతిబింబిస్తున్నాయి. గత ఏడాది చరిత్రాత్మక చంద్రయాన్3 మిషన్‌తో మనం చంద్రునిపై జెండా పాతాం. చంద్ర యాన్3 విజయం తర్వాత గత అయిదు నెలల్లో ఇస్రో విజయవంతం చేసిన రెండు మిషన్లూ శాస్త్రీయ స్వభావమున్నవే కావడం గమనార్హం. సూర్యుడి అధ్యయనానికి ముందుగా ఆదిత్య ఎల్1ను నింగిలోకి పంపింది. తాజాగా ఖగోళ–భౌతిక శాస్త్ర ఘటనలో భాగంగా వెలువడే ధ్రువీకృత ఎక్స్‌రేల అధ్యయనానికి ఈ ‘ఎక్స్పో శాట్’ను తెచ్చింది. ‘ఆదిత్య ఎల్1’ లాగా ‘ఎక్స్పో శాట్’ సైతం పూర్తిగా అంతరిక్ష పరిశోధన–ప్రయోగశాలే. ఇది రెండు పేలోడ్లను నింగిలోకి మోసుకుపోయింది. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన ‘పోలిక్స్’ పేలోడ్ రాగల అయిదేళ్ళలో దాదాపు 50 మూలాల నుంచి వచ్చే ఉద్గారాలను పరిశీలిస్తుంది. 8 నుంచి 30 కిలో ఎలక్ట్రాన్ ఓల్ట్ (కేఈవీ) శక్తి పరిధిలోని ఎక్స్‌రేల గమనాన్ని గమనిస్తుంది. ఇక, ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ రూపొందించిన ‘ఎక్స్పెక్ట్’ అనే రెండో పేలోడ్ 0.8 నుంచి 15 కేఈవీల శక్తి గల ఎక్స్‌రేలను పరిశీలిస్తుంది. నిరంతర ఎక్స్‌రే ఉద్గారాల్లోని మార్పులను అధ్యయనం చేస్తుంది. వెరసి రెండు పేలోడ్లూ ప్రబల మైన ఎక్స్రేస్కు ఉత్పత్తిస్థానాలైన కృష్ణబిలాలు, పల్సర్ల విషయంలో కొత్త అంశాల్ని వెలికి తీస్తాయి. గగనాంతర సీమలో మన తాజా గవేషణ... అమెరికా, చైనా, రష్యాలదే ఆధిపత్యమైన అంతరిక్ష యాన రంగంలో భారత్ స్థానాన్ని సుస్థిరం చేస్తుంది. 2021 డిసెంబర్లోనే అమెరికా ‘నాసా’ చేసిన ఈ తరహా ఐఎక్స్‌పీఈ మిషన్‌కు ఏకంగా 188 మిలియన్ డాలర్లయితే, మన తాజా ఎక్స్పో శాట్ కేవలం 30 మిలియన్ డాలర్ల (రూ. 250 కోట్ల)కే సిద్ధమవడం విశేషం. అమెరికా ఉపగ్రహ జీవిత కాలం రెండేళ్ళే. మనది అయిదేళ్ళు. ఇలా అగ్రరాజ్యంతో పోలిస్తే అతి తక్కువ బడ్జెట్లో మరింత సమర్థమైన రాకెట్లు, ఉపగ్రహాలు రూపొందించి మన ‘ఇస్రో’ మరోసారి సత్తా చాటింది. మిగతా దేశాల్ని ఆశ్చర్యపరిచింది. నిజానికి ఎక్స్కిరణాల ధ్రువీభవనాన్ని కొలిచేందుకు సాగుతున్న ప్రయత్నాలు తక్కువ. ‘నాసా’ చేస్తున్నవీ బెలూన్ ఆధారిత, స్వల్పకాలిక ప్రయోగాలే. 2015 సెప్టెంబర్‌లో మనం ప్రయోగించిన ఆస్ట్రోశాట్ ద్వారానే భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు గతంలో ఎక్స్‌రే ఉత్పత్తి స్థానాల బ్రాడ్‌బ్యాండ్ వర్ణపటమాపనం చేస్తూ వచ్చారు. అతి సున్నితమైన, కచ్చితమైన ఉపకరణాలు అవసరం గనక ఎక్స్‌రేల ధ్రువీభవనాన్ని కొలిచే ప్రయత్నాలెప్పుడూ పెను సవాలే. ఇస్రో చేసిన ఎక్స్పో శాట్ ప్రయోగం ఆ సవాలుకు సరైన జవాబవుతుందని ఆశంస. ఇలాంటి అనేక సవాళ్ళను ఇస్రో భుజానికెత్తుకుంది. పలు అంతరిక్ష ప్రయోగాలు, మిషన్లతో ఈ ఏడాది పొడుగూతా ఇస్రో క్యాలెండర్ నిండిపోయి ఉంది. సగటున నెలకు కనీసం ఒక అంతరిక్ష ప్రయోగమో, ప్రయత్నమో చేయనుంది. ఈ జోరు ఇలాగే సాగితే, ఈ జోరులో ఇస్రో ఈ ఏడాది జరిపే ప్రయోగాల సంఖ్య డజను దాటేసినా ఆశ్చర్యం లేదు. వాణిజ్య విభాగమైన ‘న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్’ (ఎన్ఎస్ఐఎల్) కోసం రెండు పీఎస్ఎల్వీ వాణిజ్య మిషన్లను సైతం ఇదే ఏడాది ఇస్రో చేపడుతోంది. అలాగే, నిరుడు చేసిన పునర్వినియోగ ప్రయోగవాహక నౌక ప్రయోగాన్ని మరింత కఠోర పరిస్థితుల మధ్య విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొన్నేళ్ళ క్రితం హైడ్రోజన్‌ను ఇంధనంగా చేసుకొని శ్క్రామ్జెట్ ప్రయోగాత్మక పరీక్ష చేసిన ఇస్రో ఈసారి కిరోసిన్ వాడి, పరీక్షించనుంది. అలాగే, నిరుడు సెప్టెంబర్ 2న ఆరంభమైన భారత తొలి సౌరయాత్ర ‘ఆదిత్య ఎల్1’ సైతం తుది విన్యాసం అనంతరం ఈ జనవరి 6 నాటికి లక్షిత ఎల్1 గమ్యానికి చేరుకోనుంది. మొత్తం మీద ఈ కొత్త ఏడాది అంతా ఇస్రో తీరిక లేకుండా ప్రయోగాలు చేయనుంది. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాటల్లో చెప్పాలంటే ఈ 2024 ‘గగన్‌యాన్’ సన్నాహక సంవత్సరం. అంతేకాదు... తాజా రోదసీ ప్రయోగంలో భాగంగా నింగిలోకి పంపిన ఇతర ఉపగ్రహాలలో ‘ఉయ్ శాట్’ పూర్తిగా కేరళలోని మహిళలే తీర్చిదిద్దినది కావడం విశేషం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళల ముందంజకు అది ఓ ప్రతీక. ఇతర ప్రైవేట్ ఉపగ్రహాల వ్యవహారం అంతరిక్ష రంగంలో వస్తున్న సంస్కరణల్ని ప్రతిఫలిస్తోంది. ఈ ఆవిష్కరణలు, అతి తక్కువ ఖర్చు ప్రయోగాలు ప్రైవేట్ రంగానికి రోదసి తలుపుల్ని బార్లా తీస్తున్న భారత్‌కు కలిసొచ్చే అంశం. ఇప్పటికే దేశంలోని అంకుర సంస్థలు విదేశీ సంస్థలతో జత కలిసి ఉపగ్రహ నిర్మాణ వ్యాపారంలో దూసుకొస్తున్నాయి. ఖగోళ శోధనలో పురోగతికీ, ఉపగ్రహ నిర్మాణ సాధనలో భారత్ కేంద్రంగా మారడానికీ ఇవన్నీ శుభ శకునాలే! నూతన సంవత్సరం తొలి రోజున సాగిన విజయవంతమైన ప్రయోగం అందులో ఒకటి. -
పూల రంగులు మార్చేయండి
సాక్షి, అమరావతి: పెళ్లిళ్లు.. వేడుకల్లో భారీగా వినియోగించే పూలను ఒకే రంగులోకి మార్చాలంటే టింటింగ్ పద్ధతి మాత్రమే ఇప్పటివరకు అందుబాటులో ఉంది. ఈ పద్ధతిలో ఒక్కొక్క పువ్వును మాత్రమే రంగు మార్చాల్సి వస్తోంది. ఇలా చేయడం చాలా కష్టతరమైన పని. ఒకేసారి అన్ని పూల రంగును సులువుగా మార్చేందుకు ఇంతవరకు ఎలాంటి పద్ధతి కనుగొనలేదు. ప్రపంచంలోనే తొలిసారి ఈ సమస్యకు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా తిరుపతిలో ఉన్న ఉద్యాన పరిశోధన స్థానం ఓ చక్కని పరిష్కారాన్ని కనుగొంది. పువ్వుల నుంచి ఇంకులను తయారు చేసి.. వాటితో విలువ ఆధారిత వస్తువులను తయారు చేసేందుకు పీహెచ్డీ విద్యార్థులు వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా పూల ఇంకులను వినియోగించి ఒకేసారి మనకు నచ్చిన రంగులో భారీ ఎత్తున పూలను ఉత్పత్తి చేసుకునే విధానాన్ని కనుగొన్నారు. ఎలా తయారు చేస్తారంటే.. సేకరించిన పూలను మెత్తగా గ్రైండ్ చేస్తారు. ఆ తర్వాత ప్రకృతి సిద్ధంగా లభించే ద్రవ్యాలను జతచేసి మరోసారి గ్రైండింగ్ చేస్తారు. ఇలా వచ్చిన ద్రవ్యాలను వడగట్టి వాటి సహజతత్వం కోల్పోకుండా శీతలీకరణ చేయడం ద్వారా రంగు ద్రావణాన్ని తయారు చేస్తారు. ఎంపిక చేసిన తెలుపు రంగు పూలపై.. వాటిని కోసేందుకు ముందు ఆ ద్రావణాన్ని పిచికారీ చేస్తారు. స్ప్రే చేసిన వెంటనే పూల రంగు మనకు కావాల్సిన రంగులోకి సహజ సిద్ధంగా మారిపోతుంది. గంటసేపు ఆరిన తరువాత పువ్వుల్ని కోత కోసి నిల్వ చేసుకోవచ్చు. ఈ విధానంలో అతి తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో పూలను కావాల్సిన రంగులోకి మార్చుకునే వెసులుబాటు ఉంది. ప్రయోగం ఇలా.. తిరుమల శ్రీవారి సేవకు ఉపయోగిస్తున్న పూల నుంచి తయారు చేసిన రంగులతో కోతకు సిద్ధంగా ఉన్న తెల్ల రంగు చామంతి పూలపై ప్రయోగించి ఫలితాలను రాబట్టారు. కనీసం వారం రోజుల పాటు నిల్వ ఉంటుందని గుర్తించారు. అలాగే పూర్ణిమ రకం చామంతి తోటలోని పూలపై ఇలా తయారు చేసిన పూల రంగును ప్రయోగాత్మకంగా పిచికారీ చేసి వాటి రంగు, తాజాదనాన్ని పరిశీలించారు. ఇది నూరు శాతం సహజసిద్ధంగా తయారవడంతోపాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూపలేదని గుర్తించారు. వినియోగదారుల కోరిక మేరకు అవసరమైతే వారు కోరుకున్న సువాసనల కోసం సెంట్‌ను అద్దుకునే వెసులుబాటు సైతం ఉంది. ప్రస్తుతానికి తిరుమల శ్రీవారి సేవకు ఉపయోగించే పూలను ఉచితంగా సేకరిస్తున్నారు. వాడిన పూలను కొనుగోలు చేస్తే కిలోకు సుమారుగా రూ.10 ఖర్చవుతుంది. వీటి ద్వారా ఒక లీటర్ రంగు తయారీకి రూ.20 నుంచి రూ.50 వరకు ఖర్చవుతుంది. లీటర్ ద్రావణం 15–20 మొక్కలపై పిచికారీ చేసుకోవచ్చు. ఒక ఎకరాకు 2 వేల లీటర్ల ద్రావణం అవసరమవుతుంది. మరింత విస్తృతంగా పరిశోధనలు జెక్స్ బెరా (వైట్), రోజా (వైట్) ఇతర రకాల పూలపై కూడా ప్రయోగాలు చేసేందుకు ఉద్యాన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. పూల రంగులతో పెన్నుల తయారీపైనా పరిశోధనలు చేస్తున్నారు. రంగుల కోసం ప్రస్తుతం ఏ పూలను వినియోగిస్తున్నారంటే రోజా (మిరాబుల్ రెడ్), డెకరేషన్‌కు ఉపయోగించే బంతి (ఆరంజ్), చామంతి (ఎల్లో), తామర (పింక్, వైట్), ఆర్కిడ్స్ (సోనియా రకం పర్పల్ కలర్)ను ఉపయోగిస్తున్నారు. తోటల్లోని పూలపై స్ప్రే చేసినప్పుడు వాతావరణంలో తేమను బట్టి వాటి రంగులు మారే అవకాశం ఉందని గుర్తించారు. సాఫ్ట్ ల్యాండ్ స్కేపింగ్ ఇండస్ట్రీ, ఫ్లోరిస్ట్స్–బాక్వీ షాప్స్, ఇన్‌స్టంట్‌గా కలర్ చేంజ్ చేసి కస్టమర్ చాయిస్‌కు అనుగుణంగా బాంక్విట్స్ను ఇచ్చేందుకు ఉపయోగించవచ్చు. చాలా ఆనందంగా ఉంది రసాయనాలు కలపకుండా ప్రకృతిలో లభించే పూల నుంచే సహజ సిద్ధమైన రంగులను తయారు చేయవచ్చని నిరూపించాం. తద్వారా ఏక మొత్తంలో ఒకే రంగు పూలను తయారు చేసేందుకు వీలుగా నూతన సాంకేతికతను అభివృద్ధి చేయడంలో భాగస్వామి అయినందుకు చాలా ఆనందంగా ఉంది. – జగదీశ్వరి, పీహెచ్డీ విద్యార్థిని, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ, తాడేపల్లిగూడెం పరిశోధన విజయవంతం పువ్వుల నుంచి ఇంకులను తయారు చేసి వాటి ద్వారా విలువ ఆధారిత వస్తువులను తయారు చేసే క్రమంలో పలువురు పీహెచ్డీ చేస్తున్న విద్యార్థులు చేసిన ఈ తరహా ప్రయోగం సక్సెస్ అయ్యింది. 10 రోజుల్లో 8 వేల లీటర్ల ద్రావణం తయారు చేశాం. ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేసేందుకు పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటివరకు సైడ్ఎఫెక్ట్స్ ఏమీ లేవు. ఇతర పూల విషయంలో ఈ తరహా ప్రయోగం చేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమోననే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. పూలకు సెంట్స్ యాడ్ చేసే విషయంలో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. – ఆర్.నాగరాజు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధనా స్థానం ఫ్లోరీ కల్చర్ ఇండస్ట్రీలో ముందడుగు ఫ్లోరీ కల్చర్ ఇండస్ట్రీలో ఇదో గొప్ప చారిత్రాత్మక ముందడుగుగా పేర్కొనవచ్చు. ఇప్పటి వరకు ఇలా ఏక మొత్తంలో ఒక రంగు పూలను కావాల్సిన రంగులోకి మార్చుకునే సాంకేతికత ఎక్కడా లేదు. ఈ తరహా ప్రయోగం జరిగినట్టుగా జర్నల్స్‌లో కూడా ఎక్కడా లేదు. కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసిన పీహెచ్డీ విద్యార్థిని జగదీశ్వరి బృందంకు నా అభినందనలు. – టి.జానకీరామ్, వీసీ, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ -
సైన్సులో మన ఘన విజయాలు
చంద్రయాన్ –3 విజయవంతం కావడం శాస్త్రరంగంలో భారత్ 2023లో సాధించిన అతిగొప్ప విజయం. ఏళ్లపాటు శ్రమించిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల విజయమిది. చంద్రయాన్ సక్సెస్ తరువాత కొంత కాలానికే భారతదేశపు ప్రతిష్ఠాత్మక ఆదిత్య–ఎల్1 ప్రయోగం కూడా విజయవంతంగా ముగియడం హైలైట్లలో మరొకటి. ‘లిగో ఇండియా’ ప్రాజెక్టుకు మన దేశం అంగీకరించడం ఒక మేలి మలుపు. మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో లిగో ఇండియా నిర్మాణం ప్రారంభమైంది. నేషనల్ క్వాంటమ్ మిషన్ కు కూడా 2023లోనే శ్రీకారం పడింది. అయితే, సెన్స్ రంగంలో ఇచ్చే పలు అవార్డులను రద్దు చేయడం, జీవ పరిణామ క్రమాన్ని వివరించే పాఠాలను పుస్తకాల్లోంచి తొలగించడం ఆందోళన రేకెత్తించిన కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ లను జాబిల్లి పైకి మోసుకెళ్లిన అపోలో–11 లూనార్ మాడ్యూల్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ కెమెరా ఉండేది. ఆ ఇద్దరు వ్యోమగాములు చందమామపై మొదటిసారి అడుగుపెట్టిన చారిత్రక ఘట్టపు లైవ్ ప్రసారం ఈ కెమెరా ద్వారానే జరిగింది. అప్పట్లో ఈ ప్రసారాన్ని 53 కోట్ల మంది వీక్షించారు. అంతరిక్ష పరిశోధనల్లో 1969 జూలై 20 నాటి ఈ ఘటన అత్యంత కీలకమైందనడంలో సందేహం లేదు. అలాగే టెలివిజన్ ప్రసారాల్లోనూ ఓ మైలురాయిగా నిలిచింది. యాభై ఏళ్ల తరువాత 2023 ఆగస్టు 23న కూడా దాదాపు ఇలాంటి చారిత్రక ఘటనే భారత్ లోనూ నమోదైంది. చంద్రయాన్ –3 జాబిల్లిపై అడుగుపెట్టిన ఘట్టాన్ని యూట్యూబ్‌లోనే 80.9 లక్షల మంది వీక్షించారు. యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్‌కు సంబంధించి ఇదో రికార్డు. చంద్రయాన్ –3 విజయవంతం కావడం శాస్త్రరంగంలో భారత్ 2023లో సాధించిన అతిగొప్ప విజయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏళ్లపాటు శ్రమించిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల విజయ మిది. చంద్రయాన్ ప్రయోగం సక్సెస్ తరువాత కొంత కాలానికే భారతదేశపు ప్రతిష్ఠాత్మక ఆదిత్య–ఎల్1 ప్రయోగం కూడా విజయవంతంగా ముగియడం హైలైట్లలో మరొకటిగా చెప్పుకోవచ్చు. కొత్త సంవత్సరం తొలివారంలో ఈ అంతరిక్ష నౌక సూర్యుడిని పరిశీలించేందుకు అనువైన స్థానానికి చేరుకోనుంది. ఈ రెండు ప్రయోగాలు మాత్రమే కాకుండా 2023లో ‘ఇస్రో’ ఖాతాలో పలు కీలకమైన ప్రాజె క్టులను అమలు చేసిన ఖ్యాతి చేరింది. రీయూజబుల్ లాంచ్ వెహికల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించడం, రెండోతరం నావిగేషన్ ఉప గ్రహాల్లో తొలి ప్రయోగం, మానవ సహిత ప్రాజెక్టు ‘గగన్‌యాన్ ’లో క్రూ ఎస్కేప్ మోడల్ పరీక్ష ఈ జాబితాలో కొన్ని మాత్రమే. అంతరిక్ష ప్రయోగాలకు ఆవల... దేశం శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో అంతరిక్ష ప్రయోగాలకు ఆవల కూడా మన దేశం పలు విజయాలను నమోదు చేసింది. లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (లిగో ఇండియా)కి ప్రభుత్వం అంగీకరించడం ఒక మేలి మలుపు. మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో లిగో ఇండియా ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. ప్రపంచంలోనే అరుదైన గురుత్వ తరంగాల వేధశాలగా, అతి సున్నితమైన నాలుగు కిలోమీటర్ల పొడవైన ఇంటర్ఫెరోమీటర్ సొరంగం ఉన్నదిగా ఇది రికార్డులకు ఎక్కింది. కృష్ణ బిలాలు, న్యూట్రాన్ నక్షత్రాల వంటివి కలిసిపోయినప్పుడు పుట్టే గురుత్వ తరంగాలను గుర్తించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అమెరికాలో ఇప్పటికే పని చేస్తున్న లిగో వేధశాలలతో కలిసి హింగోలి వేధశాల పనిచేస్తుంది. నేషనల్ క్వాంటమ్ మిషన్‌కు కూడా 2023లోనే అడుగు పడింది. సూపర్ కండక్టింగ్, ఫొటోనిక్ ప్లాట్‌ఫామ్‌ల సాయంతో మధ్యమ స్థాయి క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. దీంతోపాటే కృత్రిమ మేధ ద్వారా దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను గుర్తించేందుకు కూడా జాతీయ స్థాయి కార్య క్రమం ఒకటి ఈ ఏడాది మొదలైంది. కృత్రిమ మేధను బాధ్యతా యుతమైన టెక్నాలజీగా అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. పరిశోధనల్లోనూ ఉన్నత స్థితిలో... భారతదేశంలో ప్రచార ఆర్భాటాలకు చిక్కని, అత్యుత్తమ, అంత ర్జాతీయ స్థాయి పరిశోధనలు ఎన్నో నమోదయ్యాయి. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి హైదరాబాద్‌లోని లాకోన్స్లో ఒక పర్యావరణ వ్యవస్థలో జీవవైవిధ్యతను గుర్తించేందుకు అభివృద్ధి చేసిన పద్ధతి. సీసీఎంబీ అనుబంధ సంస్థ అయిన లాకోన్స్లో ఎస్. మను, జి.ఉమాపతి ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. నీరు, మట్టి, గాలుల్లోని డీఎన్ ఏ పోగుల ఆధారంగా జీవవైవిధ్యతను కొలవడం ఈ పద్ధతి ప్రత్యేకత. కర్నాల్(హరియాణా)లోని నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు దేశీ గిర్ జాతి ఆవును క్లోనింగ్ పద్ధతి ద్వారా సృష్టించడం 2023 విశేషాల్లో ఇంకోటి. బనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన జ్ఞానేశ్వర్ చౌబే నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దక్షిణాసియా జన్యుక్రమాల్లో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. సింహళీయులకు, శ్రీలంకలోని తమిళులకు మధ్య దగ్గరి జన్యు సంబంధాలు ఉన్నట్లు పరిశోధన పూర్వకంగా నిర్ధారించింది. ఆసక్తికరమైన ఇంకో విషయం ఏమిటంటే, ఈ రెండు వర్గాల ప్రజలకూ మరాఠా జనాభాకూ మధ్య సంబంధాలు ఉండటం! కోవిడ్ విషయానికి వస్తే, పుణె కేంద్రంగా పనిచేస్తున్న జెన్నోవా బయో ఫార్మాస్యూటికల్స్ దేశీయంగా తయారు చేసిన ఎంఆర్ఎన్ ఏ టీకాను విడుదల చేసింది. ఒమిక్రాన్ వైరస్ నియంత్రణకు పనికొస్తుందీ టీకా. విధాన నిర్ణయాలను పరిశీలిస్తే... దేశం మొత్తమ్మీద శాస్త్ర పరిశోధనలకు అవసరమై నిధుల కేటా యింపును పర్యవేక్షించేందుకు ‘నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ’ ఒకదాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. వివరాలు పూర్తిగా బహిరంగం కాలేదు. ఇదిలా ఉంటే దశాబ్దాలుగా పనిచేస్తున్న విజ్ఞాన్ ప్రసార్‌ను 2023లో మూసివేశారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ (ఐఎస్‌సీఏ)కు నిధుల కేటాయింపులు తగ్గించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే ఏటా జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయి. సైన్స్ రంగంలో ఇచ్చే పలు అవార్డులను రద్దు చేయడం, జీవ పరిణామ క్రమాన్ని వివరించే పాఠాలను పుస్తకాల్లోంచి తొలగించడం ఆందోళన రేకెత్తించిన కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో జనవరిలో సైన్స్ కాంగ్రెస్ జరిగే అవకాశాలు లేవు. డీఎస్టీ తమ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా వ్యవహరించిందని ఐఎస్‌సీఏ ఆరోపిస్తోంది. సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను లక్నోలో కాకుండా జలంధర్ సమీపంలోని పగ్వారాలో నిర్వహించాలన్న ఐఎస్‌సీఏ నిర్ణయం డీఎస్టీకి రుచించలేదు. 2023లో సైన్స్ కాంగ్రెస్‌ను నాగ్‌పూర్‌లో నిర్వహించారు. మరోవైపు పలు శాస్త్ర సంబంధిత విభాగాలు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ విజ్ఞాన్ భారతి ప్రాయో జకత్వం వహిస్తున్న వార్షిక్ సైన్స్ ఫెస్టివల్‌కు పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం అందిస్తూండటం గమనార్హం. దురదృష్టవశాత్తూ చాలా సంస్థలు రాజకీయ పెద్దల అడుగులకు మడుగులొత్తే స్థితికి చేరిపోయాయి. లక్నోలోని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ 108 రేకులున్న కమలాన్ని అభివృద్ధి చేసి దానికి ‘నమో 108’ అని నామకరణం చేసింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రి జితేంద్ర సింగ్ ‘నమో 108’ను ఆవిష్కరిస్తూ ‘మతపరంగా కమలానికి, 108 సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యతలను దృష్టిలో ఉంచుకుంటే ఈ కొత్త రకం కమలం చాలా ప్రత్యేకమైన గుర్తింపుని ఇస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ‘నిరంతర కృషీవలుడు నరేంద్ర మోదీ అంతః సౌందర్యానికి ఈ కమలం ఓ గొప్ప బహుమానం’ అని కూడా అన్నారు. ఇంకో సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ నికోటిన్ మోతాదు తక్కువగా ఉన్న పొగాకు వంగడాన్ని అభివృద్ధి చేసింది. ఈ వంగడం అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తి అని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ ఎన్ .కళైసెల్వి వ్యాఖ్యానించారు. ఇంకో పక్క ఎన్సీఈఆర్టీ చంద్రయాన్ ప్రయోగ కీర్తి ప్రధానికి దక్కుతుందని పొగడటం ప్రస్తావనార్హం. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వంటి స్వతంత్ర సంస్థలు ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలోనూ నిశ్శబ్దంగా ఉండటం ఆశ్చర్య పరు స్తోంది. 2023లో భారతదేశం సాధించిన అతి గొప్ప విజయం చంద్రయాన్ అనుకుంటే... సైన్స్ సంస్థల రాజకీయీకరణ అత్యంత దురదృష్టకరమైనదిగా చెప్పాలి. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కాఫీ రుచి బెటర్‌గా ఉండేందుకు ట్రిక్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు!
ఒక కప్పు కాఫీ ఉదయాన్నే సిప్ చేస్తే ఆ ఆనందమే వేరు. అలాంటి కాఫీ స్ట్రాంగ్‌గా రుచిగా తయారు చేసుకోవాలంటే చాల పద్ధతులు ఉన్నాయి. కానీ అవేమీ అవసరం లేకుండా ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అయితే ఈజీగా స్ట్రాంగ్ కాఫీ తయారు చేసుకోవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. అలాంటి కాఫీ ప్రిపరేషన్‌కి పరిశ్రమలకు మాత్రం కోట్లలో ఖర్చు అవుతుందట!. చాలామంది స్ట్రాంగ్‌గా ఉండే కాఫీనే ఇష్టపడతారు. మంచి రంగు రుచి సువాసన ఉండాలను కుంటారు. అందుకని కాఫీ గింజలను గ్రైండ్ చేసుకుని మరీ తయారు చేసుకుంటారు. అయితే ఈ డ్రై కాఫీ గింజలు గ్రైండ్ చేసటప్పుడు స్టాటిక్ ఎనర్జీకి గురవ్వుతాయి. దీంతో సరిగా డ్రైండ్ అవ్వవు. అందువల్ల వేస్ట్ కూడా తెలియకుండా వెళ్లిపోతుంది. అంటే కొన్ని సరిగా నలగకపోవడంతో వేస్ట్ రూపంలో వడకట్టినప్పుడు కాఫీ కొంత వేస్ట్‌గా పోయి రుచి తగ్గుతుందట. అలా కాకుండా పూర్తిస్థాయిలో గ్రైండ్ అయ్యి రుచిగా ఉండాలంటే కాస్త నీటిని జోడిస్తే మరింత రుచిగా కాఫీ తయారవ్వుతుందట. దీని వల్ల కాఫీ వేస్టేజ్ కూడా తగ్గుతుంది. మనకు కావాల్సిన రుచి, రంగు సువాసన ఉంటాయని చెబుతున్నారు. ఇలాంటి స్ట్రాంగ్ డ్రై కాఫీ తయారు చేయాలంటే కాఫీ పరిశ్రమలకు మాత్రం భారీ ఆర్థిక సమస్యలు ఎదురవ్వుతాయని అన్నారు. ఈ స్రాంగ్ డ్రైనెస్ కాఫీ తయారీ నాణ్యతను మెగుపరచడం అనేది కాఫీ పరిశ్రమలకు మాములు నష్టాలను తెచ్చి పెట్టదని కూడా అంచనా వేసి మరీ పరిశోధకులు వెల్లడించారు. (చదవండి: ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ దందా! జస్ట్ ప్రెగ్నెంట్ చేస్తే చాలు..ఏకంగా లక్షలు ..!) -
175 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో చిద్రమైన వ్యక్తి ముఖాన్ని పునర్నిర్మించారు!
అనుకోని ప్రమాదంలో చిద్రమైన ఓ వ్యక్తి ముఖాన్ని పునర్నిర్నించారు శాస్త్రవేత్తలు. ఏకంగా 28 గ్రాములు రాడ్ ఎడమ చెంపలోంచి తలలోకి దూసుకుపోయింది. సరిగ్గా 175 ఏళ్ల క్రితం ఓ దారుణ ప్రమాదంలో ముఖం చిద్రం అయిన వ్యక్తి ముఖాన్ని త్రీ డీ సాంకేతికతో పునర్నిర్మించారు శాస్త్రవేత్తలు. దీంతో వైద్య విధానంలో సరికొత్త విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. అసలేం జరిగిందంటే..యూఎస్‌కి చెందిన ఫినియాస్ గేజ్ అనే రైల్రోడ్ కార్మికుడు సెప్టెంబర్ 13, 1848లో విచిత్రమైన ప్రమాదానికి గురయ్యాడు. అతను అమెరికాలోని వెర్మోంట్లో కొత్త రైల్వే లైన్ నిర్మాణం కోసం కొన్ని రాళ్లను పేల్చివేయడానికి సిద్ధమవుతుండగా ఈ ప్రమాదం బారినపడ్డాడు. అతను వదిలేసిన ఇనుపరాడ్ గన్పౌడర్కి తగిలి ఎగొరొచ్చి నేరుగా అతని ఎడమ చెంపలోకి దూసుకుపోయింది. సుమారు 3.18 సెంటీమీటర్ల వ్యాసం, 1.09 మీటర పొడవుతో సుమారు ఆరు కిలోగ్రాముల ఉన్న రాడ్ అతని బ్రెయిన్లో దూసుకోపోయింది. వెంటనే హుటాహుటినా ఆస్పత్రికి తరలించి గేజ్ పుర్రెలోకి దిగిన రాడ్‌ని వైద్యుడు తొలగించి కుట్టు వేశారు. అయితే ఆ ప్రమాదం అతని ముఖాన్ని భయానకంగా మార్చింది. అదిగాక ఈ ప్రమాదం తర్వాత అతని యాక్టివిటీలో మార్పు వచ్చింది. చెప్పాలంటే ఓ చిన్న పిల్లవాడి మాదిరిలా బిహేవ్ చేయడం మొదలు పెట్టాడు. అలా అతను యాక్సిడెంట్ తర్వాత సుమారు 12 ఏళ్ల ఆరు నెలల ఎనిమిది రోజుల వరకు బతికాడు. సరిగ్గా మే 21, 1861న తుది శ్వాస విడిచాడు. అయితే ఆ వ్యక్తి ముఖాన్ని యథావిధిగా పునర్నిర్మించడంపై పరిశోధకులు రకరకాలుగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ మేరకు ఫోరెన్సిక్ నిపుణుడు సిసెరో మోరేస్ అతడి ముఖాన్ని త్రీడీ టెక్నాలజీతో పునర్నించాడు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ని యూట్యూబ్‌లో షేర్ చేశాడు. వైద్య విధానంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికేలా సాంకేతికతను జోడించి ఇలాంటి ప్రమాదాల బారిన పడిన రోగులకు ఉపయుక్తంగా ఉండేలా సరికొత్త చికిత్స పద్ధతులను అభివృద్ధి పరిచారు. రోడ్డుప్రమాదాలు లేదా ఇతరత్ర ప్రమాదాల్లో ముఖం చిద్రమైన వాళ్లకి ఈ సాంకేతికతో కూడిన వైద్యం ఉపయోగ పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేగాదు గేజ్ ప్రమాద సమయంలో ఎలా ఉన్నాడు? ఎలా ఆ రాడ్‌ని తొలగించి పునర్నిర్మించొచ్చు వంటి వాటిని ఓ వీడియోలో విజ్యువల్స్ రూపంలో వెల్లడించారు. (చదవండి: 'బిగ్ విన్'! ఒక్క వీడియో..ప్రముఖ ఫుడ్ కంపెనీని షేక్ చేసింది! చరిత్రలో తొలిసారి..) -
గోబర్.. గాభరా !
ఇప్పుడంటే ప్రతి ఇంట్లోనూ గ్యాస్ స్టవ్లొచ్చాయిగానీ కొన్నాళ్లు ‘గోబర్ గ్యాస్’ (పశువుల పేడతో తయారైంది) కూడా ఓ వెలుగు వెలిగింది! గ్రామాల్లో పశు సంపద అధికంగా ఉండే ఇళ్లలో వీటిని బాగానే ఆదరించారు. చిన్నపాటి బావి లాంటి గుండ్రటి ఇనుప డ్రమ్ముల్లో నిల్వ చేసిన పేడ కరగడం ద్వారా నెమ్మదిగా మీథేన్ విడుదలవుతుంది. దీన్ని పైపు ద్వారా తరలించి వంటకు వినియోగించడం తెలిసిందే. అంత చాకిరీ చేసే ఓపిక లేకపోవడంతో కాల క్రమంలో గోబర్ గ్యాస్ కనుమరుగైంది. అలా వంటకు ఉపయోగపడ్డ మీథేన్ ఇప్పుడు వాతావరణంలో మంటకు కూడా కారణమవుతోంది!! – పల్లా రవికిరణ్, ఏపీ సెంట్రల్ డెస్క్ వాహనాల పొగ, ఏసీలు, ఫ్రిడ్జ్‌ల నుంచి విడుదలయ్యే క్లోరో ఫ్లోరో కార్బన్లకు మించి పశువుల నుంచి వెలువడే గ్యాస్ భూతాపానికి దారి తీస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పశువులు ఆహారాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో, వాటి వ్యర్థాల నుంచి వెలువడే మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వాయువులు భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. వాతావరణంలో ప్రతికూల మార్పులకు కారణమవుతున్నాయి. ఎంత ఆలస్యంగా జీర్ణం అయితే అంత ఎక్కువగా గ్యాస్ విడుదల అవుతుంది. కాబట్టి వాటికి తేలిగ్గా జీర్ణమయ్యే, సహజ సిద్ధమైన ఆహారాన్ని అందించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నైట్రస్ఆక్సైడ్.. నిప్పుల కొలిమి కార్బన్డయాక్సైడ్ కంటే మీథేన్ గ్యాస్ 28 రెట్లు అధికంగా భూ తాపానికి కారణమవుతోంది. నిల్వ చేసిన పశువుల పేడ నుంచి అధిక మోతాదులో వెలువడే నైట్రస్ ఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు కంటే దాదాపు 265 రెట్లు అధికంగా వాతావరణం వేడెక్కటానికి దారి తీస్తోంది. పశువులు తీసుకునే ఆహారంలో చోటు చేసుకుంటున్న మార్పులు దీనికి కొంతవరకూ కారణం. ప్రస్తుతానికి ఈ సమస్యను పూర్తి స్థాయిలో అరికట్టలేకున్నా మెరుగైన యాజమాన్య పద్ధతులు, పాల దిగుబడిని పెంచుకోవడం, దాణాలో కొన్ని రకాల మందులను చేర్చడం ద్వారా కొంతవరకు నియంత్రించవచ్చు. 2070 నాటికి జీరో కర్బన ఉద్గారాల లక్ష్యంగా మన దేశం వేగంగా అడుగులు వేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం క్రమంగా ఊపందుకుంటోంది. సౌర విద్యుత్తు, గ్రీన్ హైడ్రోజన్, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ తరుణంలో గ్రీన్హౌస్ వాయువులను నియంత్రించడంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత నెలకొంది. సమతుల్య ఆహారంతో.. అమెరికాలోని హోల్స్టీన్ ఆవులతో పోలిస్తే మన దేశంలో సంకర జాతికి చెందిన పశువులు 4.8 శాతం అధికంగా గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేస్తున్నాయి. ఇక దేశవాళీ ఆవులు 11.8 శాతం అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. భూతాపాన్ని అరికట్టేందుకు 2030 నాటికి మీథేన్ఉద్గారాలను 11–30 శాతం వరకు నియంత్రించాలని, 2050 నాటికి 24–47 శాతం వరకు కట్టడి చేయాలని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సూచించింది. 3 ఎన్వోపీ (నైట్రాక్సీ ప్రొఫెనాల్)ను పశువులకు అందించే దాణాలో కలపడం ద్వారా మీథేన్ ఉద్గారాలు 30 శాతం వరకు తగ్గుతున్నట్లు కన్సల్టేటివ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్(సీజీఐఏఆర్) తాజా నివేదిక వెల్లడించింది. పశువుల ఆరోగ్యానికి ఇది సురక్షితమేనని సూచించింది. సంతులిత (సమతుల్య) ఆహారాన్ని ఇవ్వడం ద్వారా కూడా 15 శాతం దాకా ఉద్గారాలు తగ్గే అవకాశం ఉందని మరో సర్వే తెలిపింది. 98 శాతం మీథేన్ వీటి నుంచే 1. వ్యవసాయం 2. ఆయిల్ అండ్ గ్యాస్ 3. బొగ్గు తవ్వకాలు 4. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఘన వ్యర్థాల నిర్వహణ) 5. వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ (వ్యర్థ జలాల నిర్వహణ) స్వల్పంగా పెరిగినా మంటలే! ♦ మీథేన్ ఎంత ఎక్కువగా విడుదలైతే పుడమి అంత అధికంగా వేడెక్కుతుంది. ♦ ఉష్ణాన్ని బంధించి ఉంచే శక్తి కారణంగా మీథేన్ శాతం స్వల్పంగా పెరిగినావాతావరణంలో భారీ మార్పులకుదారి తీస్తుంది. ♦ పశువులు తీసుకునే ఆహారం మీథేన్ విడుదలను ప్రభావితం చేస్తుంది.ఎక్కువ మొత్తంలో తీసుకోవడం, నాసిరకం మేతను ఇవ్వడం మీథేన్ విడుదలను పెంచుతుంది. ♦ పశువుల ఆరోగ్యానికి చేటు చేయకుండా మీథేన్ విడుదలను నియంత్రించే టీకాపై న్యూజిలాండ్ పరిశోధన చేస్తోంది. ♦ బ్రోమోఫార్మ్ లాంటివి పశువుల శరీరంలోని బ్యాక్టీరియా మీథేన్ ఉత్పత్తి చేయటాన్ని 65 శాతం వరకు తగ్గించినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నా దీని వాడకానికి సంబంధించి పలు సందేహాలున్నాయి. పశువుల శరీరంలోకి చేరిన శైవలాలు (ఆల్గే) వాటి పాలు, మాంసం ద్వారా మనుషుల దేహంలోకి ప్రవేశించి థైరాయిడ్ గ్రంథి పనితీరును అస్తవ్యస్థం చేసే ప్రమాదం ఉందనే వాదనలున్నాయి. అందువల్లే అన్ని రకాల ఔషధాలను శాస్త్రవేత్తలు సిఫారసు చేయడం లేదు. సంక్లిష్ట జీర్ణ ప్రక్రియ.. పశువులు ఆహారాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో మీథేన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. వాటిలో జీర్ణ ప్రక్రియ కొంత సంక్లిష్టంగా పొట్ట నాలుగు అరలుగా (రూమినెంట్స్) ఉంటుంది. పీచు పదార్థాలు త్వరగా జీర్ణం కావు. పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని మళ్లీ నోటిలోకి తీసుకొచ్చి నెమరు వేస్తాయి. తిన్న ఆహా రం కిణ్వ ప్రక్రియకు (పులవడం) గురైనప్పుడు మీథేన్ విడుదలవుతుంది. ఇది నోటి ద్వారా త్రేన్పులు రూపంలో, అపాన వాయువు రూపంలో వెలువడుతుంది. ఎంత తక్కువ సమయంలో ఆహారం జీర్ణం అయితే మీథేన్ ఉత్పత్తి అంత తగ్గిపోతుంది. బోవర్, రెడ్సీ వీడ్, అగోలిన్, ఒరిగానో లాంటి వాటిని పశువుల మేత, దాణాలో కలిపి ఇవ్వడం ద్వారా త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఎఫ్‌డీఏ ఆమోదించిన నైట్రాక్సీ ప్రొఫనాల్ను దాణాలో కలపడం వల్ల మీథేన్ శాతం బాగా తగ్గుతుంది. జొన్నలు, సజ్జలు తగినంత మోతాదులో అందిస్తే పీచు పదార్థాలు ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఖనిజ లవణాల మిశ్రమాన్ని తగిన మోతాదులో ఇవ్వాలి. ఇక పశువుల ఎరువును సరైన విధంగా నిల్వ చేయనప్పుడు నైట్రస్ ఆక్సైడ్ పెద్ద మొత్తంలో విడుదలవుతుంది. యాసిడ్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాలు పేడను ఆర్గానిక్ ఆమ్లాలుగా మారుస్తాయి. మీథేన్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాలు దీన్ని మీథేన్, కార్బన్‌డయాక్సైడ్‌గా మారుస్తాయి. గ్రీన్హౌస్ వాయువుల్లో మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వాతావరణం వేడెక్కడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. పశువులకు సహజ సిద్ధమైన మేత, దాణా అందిస్తూ పాల దిగుబడి పెరిగేలా నాణ్యమైన జాతులను సాకాలి. -
ఆకాశంలో దెయ్యం
పెద్దగా నోరు తెరుచుకుని మీదికొస్తున్న దెయ్యంలా.. చూడగానే వామ్మో అనిపించేలా ఉందికదా! ఇది ఏ గ్రాఫిక్స్ బొమ్మనో, సరదాగా సృష్టించిన చిత్రమో కాదు.. సుదూర అంతరిక్షంలోని ఓ భారీ గెలాక్సీ (నక్షత్రాల గుంపు) ఇది. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ (జేడబ్ల్యూఎస్‌టీ) సాయంతో టెక్సాస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ గెలాక్సీని గుర్తించారు. మన విశ్వం పుట్టుక తొలినాళ్లలోనే ఈ గెలాక్సీ ఏర్పడిందని.. అది భారీగా దుమ్ము, ఇతర ఖగోళ పదార్థాలతో నిండి ఉందని వారు తెలిపారు. విసిరివేసినట్టుగా ఉన్న ఆ ఖగోళ పదార్థాల నుంచి వేలాది కొత్త నక్షత్రాలు జన్మిస్తున్నాయని.. ఈ క్రమంలో దెయ్యం ముఖం వంటి ఆకృతి ఏర్పడిందని వివరించారు. అయితే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చిత్రాలు మసకగా ఉండటంతో.. ఓ చిత్రకారుడితో మరింత స్పష్టత వచ్చేలా మార్చామని వివరించారు. -
బుర్జ్ ఖలీఫా ఎత్తును దాటేసిన పర్వతం.. ఎక్కడుందంటే..
ప్రపంచంలో అత్యంత ఎత్తయినది ఏదంటే ఎవరైనా వెంటనే బుర్జ్ ఖలీఫా అని చెబుతారు. అయితే దీనికి మించినది మరొకటి ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. పైగా అది భూమి మీద కాకుండా సముద్రపు లోతుల్లో ఉందని తెలిస్తే.. దీనిని కనుగొన్న శాస్త్రవేత్తలకు సలాం చేయకుండా ఉండలేరు. దక్షిణ అమెరికా దేశమైన గ్వాటెమాల తీరంలో నీటి అడుగున ఒక భారీ పర్వతాన్ని పరిశోధకులు కనుగొన్నారు. సముద్ర మట్టాన్ని మ్యాపింగ్ చేసే శాస్త్రవేత్తలు దీనిని ఆవిష్కరించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఈ పర్వతం ఎత్తు 5,249 అడుగులకు పైగానే ఉంది. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా భవనం ఎత్తు 2 వేల 722 అడుగులు. ఈ భారీ పర్వతం భూ ఉపరితరం నుంచి 7 వేల 874 అడుగుల దిగువన ఉంది. ఈ పర్వతాన్ని స్మిత్ ఓపెన్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు కనుగొన్నారు. స్మిత్ ఓషన్ ఇన్స్టిట్యూట్ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు వెండీ స్మిత్ ఒక ప్రకటనలో ఫాకర్ యాత్రలో ఉన్న పరిశోధకులు.. ఊహించని, విస్మయం కలిగించే అంశాన్ని కనుగొన్నారని ఒక ప్రకటనలో తెలిపారు. సముద్రంలో మనకు అంతుచిక్కని అంశాలు వెల్లడైనప్పుడు ఎంతో ఆసక్తి కలుగుతుంది. దీనిపై అన్వేషణ కొనసాగించడానికి సంతోషిస్తున్నామన్నారు. ఈ పర్వతం 14 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని పరిశోధకులు చెబుతున్నారు. వారు సముద్రపు అడుగుభాగపు మ్యాప్‌ను రూపొందించడానికి మల్టీబీమ్ ఎకోసౌండర్ అనే పరికరాన్ని ఉపయోగించారు. ఇది కూడా చదవండి: ‘మహాబోధి’ మహోత్సవానికి భారీగా బౌద్ధ అనుచరుల రాక! -
స్త్రీ సాధికారతతోనే దేశ పురోగమనం
ప్రపంచంలో వేగంగా వస్తున్న మార్పులను అనుసరించి భారతీయ సమాజం కూడా ఆధునికీకరణ చెందుతోంది. విద్య, వైద్యం, ఆరోగ్య, వాణిజ్య, పారిశ్రామిక, పర్యావరణ, సాంకేతిక రంగాల్లో స్త్రీలు దూసుకుపోతున్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు స్త్రీలు అంకురార్పణ చేస్తున్నారు. సుమారు వందమంది మహిళా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చంద్రయాన్–3 మిషన్‌లో కీలక సేవల్ని అందించారు. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిణామంలోనూ స్త్రీలు వారి ప్రతిభను చూపుతూనే వున్నారు. ఇది వారి వ్యక్తిత్వంలోని ఔన్నత్యం. వివక్ష, అణిచివేత వారిని నిలువరించలేక పోతున్నాయి. అయితే స్త్రీల రాజకీయ ప్రాతినిధ్యం కూడా పెరిగినప్పుడే సమానత్వం పునాదిగా కలిగిన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. అన్ని రంగాల్లో ప్రాముఖ్యతను సాధించేందుకు, వివక్షకు వ్యతిరేకంగా స్త్రీలు యుద్ధం చేస్తూనే ఉన్నారు. గత రెండు సంవత్సరాల్లో ప్రకటించిన శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులలోస్త్రీలకు ఒక్కటి కూడా లభించలేదు. వీటిని ప్రతి సంవత్సరం 45 ఏళ్ళ లోపు వయసున్న 12 మంది అసాధారణ యువ శాస్త్రవేత్తలకు ఇస్తున్నారు. ఈ అంశంపై పలువురు మహిళా శాస్త్రవేత్తలు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏ రంగంలో అయినా సామర్థ్యాలను అంచనా వేసేటప్పుడు హేతుబద్ధత అవసరం. 1958 నుండి ఆరు దశాబ్దాలుగా 592 మంది భట్నాగర్ పుర స్కారాన్ని స్వీకరించారు. ఇప్పటి వరకు 20 మంది మహిళా శాస్త్ర వేత్తలకు మాత్రమే ఈ అవార్డు లభించింది. మహిళలు తమ కుటుంబ, సమాజ బాధ్యతలు పూరించేందుకుగానూ కోల్పోయిన కెరీర్ సంవ త్సరాలను వారి జీవ సంబంధ వయస్సుతో నిర్ణయించకుండా, ‘అకడమిక్’ వయసుతో పరిగణించాలని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. నోబెల్ బహుమతి గ్రహితల్లో స్త్రీకి ప్రాధాన్యం లేకపోవడంపై 2019లో ‘నేచర్’లో ఒక వ్యాసం ప్రచురితమైంది. ఈ వివక్షను వారు సైద్ధాంతికంగా అధ్యయనం చేసినపుడు పలు ఆసక్తికర విషయాలు వెల్లడైనాయి. మహిళలకు అందుబాటులో వున్న వనరులు తక్కువగా ఉండటంతో, వారి ప్రచురణలు పురుషులతో పోల్చినప్పుడు తక్కు వగా వుంటున్నాయి. అధ్యాపక రంగంలో వున్న మహిళలు పురుషు లతో సమానంగా వారి ప్రచురణార్థం ఖర్చు చేసుకోలేక ప్రచురణలో వెనుకబడుతున్నారు. అసంఘటిత కార్మిక రంగంలో స్త్రీల ఉత్పాదక తపై పరిశోధన గావించిన క్లాడియా గోల్పిన్కు ఆర్థిక శాస్త్రంలో 2023లో నోబెల్ బహుమతి లభించిన నేపథ్యంలో ఈ చర్చ ప్రాధా న్యత సంతరించుకుంది. అయితే ఈ సంవత్సరం వివిధ రంగాల్లో నోబెల్ బహుమతి పొందినవారిలో మహిళా ప్రాతినిధ్యం పెరిగింది. మానవ నాగరికతను పరిశీలించినపుడు, ప్రతి కీలకమైన పరి ణామంలో స్త్రీ ప్రధాన భూమిక పోషించింది. బ్రిటీష్ వారి అణచి వేతను ఎదుర్కోవలసినప్పుడు ముందుండి పోరాటాన్ని నడిపించిన ధీర వనితలు ఎందరో దేశం కోసం అసువులు బాశారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి కుల మతాలకు తావులేకుండా కొల్లిపర సీతమ్మ, కొర్రపాటి అంతమ్మ, నాదెళ్ళ రంగమ్మ, మల్లంపాటి రత్నమాణి క్యమ్మ, దోనేపూడి బాలమ్మ, గొర్రెపాటి సరస్వతమ్మ, మానేపల్లి సరళా దేవి, సూరపనేని వెంకట సుబ్బమ్మ, మిక్కిలినేని వరలక్ష్మమ్మ మొద లుగు మహిళామణులు స్వాతంత్య్రోద్యమ సమరాన్ని ముందుండి నడి పారు. పోరాటాలను భారతీయ మహిళలకు కొత్తగా నేర్పించా ల్సిన పనిలేదు. వారి మాతృత్వం, కరుణ, సమానత్వం వారి వ్యక్తిత్వ వికాసానికి పునాది. ఇటీవలే నూతన పార్లమెంటు భవనంలో చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తొలి బిల్లును ప్రవేశపెట్టారు. ఇది చారిత్రాత్మక నిర్ణయం. అసలు చట్ట సభల్లో 33 శాతం మహిళలకు కేటాయించాల్సిన ఆవశ్యకత భారతదేశానికి ఎందుకు కలిగిందో ఆలోచించాలి. 1970లో లోక్‌సభలో వీరి ప్రాధాన్యం 5 శాతంగా వుండగా, 2009లో అత్యధికంగా 15 శాతం మంది మహిళా ప్రతినిధులు లోక్‌సభలో ప్రవేశించారు. 12.7 శాతం ప్రతినిధులు రాజ్యసభలో సభ్యత్వం పొందగలిగారు. ఈ గణాంకాలు భారతీయ సమాజం సమానత్వానికి ఎంత దూరంలో వుందో స్పష్టం చేస్తున్నాయి. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవు తోంది. అయినా రాజకీయ రంగంలోని లింగవివక్షను రూపు మాపాలంటే, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అసమానతలను రూపు మాపాల్సి ఉంటుందని గుర్తించాలి. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ అన్నట్లు ఆర్థిక స్వావలంబన భారతీయ సమాజంలో స్త్రీకి యింకా పూర్తిగా లభించలేదు. అందుకే వారి రాజకీయ ప్రాతినిధ్యం పది నుండి పదిహేను శాతానికి పరిమి తమైంది. నూతన నారీ శక్తి వందన చట్టం అమలులోకి వస్తే లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లోని మొత్తం సీట్లలో 33 శాతం మహిళలకు రిజర్వ్ అవుతాయి. ఎక్కువమంది స్త్రీలు నాయకులుగా ఈ దేశానికి అవసరం. స్త్రీ నాయకురాలైనపుడు వ్యవస్థలో నీతి, నిజాయితీ, నిస్వార్థ సేవ, మాతృస్వామ్య గుణం వర్ధిల్లుతాయి. వీరి సారథ్యంలో దేశం నిష్పాక్షికంగా పురోగతి సాధిస్తుంది. స్త్రీ సాధికారికతను వారి సుస్థిత ఆర్థిక ప్రగతి, పురోగతి నిర్దేశిస్తాయి. బహిరంగ ప్రదేశాల్లో భద్రత, సమానత్వం పెంపొందించడం ద్వారా మరింత మహిళా భాగస్వామ్యం మెరుగుపరచడానికి అవకాశం వుంటుంది. అదే విధంగా అసంఘటిత స్త్రీలు, విద్యాధికు లతో పోల్చినపుడు ఓటు హక్కును వినియోగించుకోవడంలో స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. విద్యావంతులైన స్త్రీలు రాజకీయ నాయకురాళ్ళుగా మరింత ఉత్సా హంగా భాగస్వాములు కావాల్సి వుంది. ఈ లక్ష్యాలు నెరవేరడానికి స్త్రీపై పెట్రేగిపోతున్న దమనకాండను నిలువరించాలి. విద్యార్జన కొరకు స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్తున్న వారిపై జరుగుతున్న లైంగిక దాడుల నుండి సమాజం రక్షణ కల్పించాలి. ఆనాడే వారు అభివృద్ధిలో కీలక భాగస్వాములు కాగలుగుతారు. వారి జీవన గమనాన్ని నిర్దేశించే చట్టాల రూపకల్పనలో వారి వాణి బలంగా వినిపించాల్సి వుంది. రాజకీయాల్లో స్త్రీ పాత్రపై విశ్లేషించినపుడు పలు ఆసక్తికర అంశాలు ముందుకు వస్తున్నాయి. కేవలం ప్రాతినిధ్యం వలన రాజ కీయ సమానత్వం సాధ్యమేనా? క్రియాశీలక నిర్ణయాధికారానికి స్త్రీలు ఆయా రాజకీయ పార్టీల్లో సమర్థులుగా పరిగణింపబడుతున్నారా? మహిళల నేతృత్వంతో అభివృద్ధి ఆకాంక్షిస్తున్న వేళ కేవలం రాజకీయ ప్రాతినిధ్యం సరిపోదు. ఆయా పార్టీలు రాజకీయ అవగాహనా తరగ తులు నిర్వహించి వారిని ప్రోత్సహించవలసి వుంది. అనేక సందర్భాల్లో డిబేట్స్‌లో గానీ, సోషల్ మీడియాలో గానీ నాయకమణులుగా గొంతు విప్పుతున్న స్త్రీలు టార్గెట్ అవుతున్నారు. ఇది రాజకీయ చైతన్యవంతులుగా ముందుకు వస్తున్న వారిని నీరు గార్చుతుంది. వ్యక్తిగత దూషణలు శృతిమించుతున్నాయి. ఒక పార్టీకి ప్రతినిధులుగా ఎదిగిన స్త్రీలు కూడా అవతలి పార్టీలలో వున్న మహిళా నాయకురాళ్ళను దారుణంగా దుర్భాషలాడుతుండడం గమ నిస్తున్నాము. ఆయా రాజకీయ పార్టీల వేదికను గౌరవిస్తూనే, పార్టీల కతీతంగా స్త్రీలందరూ ఐక్యంగా నైతిక విలువలు పెంపొందించాలి. వ్యక్తిగత పోరు వల్ల రాజకీయాలలో వున్న స్త్రీ గౌరవం ఇనుమడించే అవకాశం లేదు. నేటి స్త్రీలు ఆయా రాజకీయ పార్టీల ఎజెండాలకు తలాడించే వారుగా వున్నారో లేదా స్వతంత్ర భావవ్యక్తీకరణ ద్వారా స్ఫూర్తిదాయకంగా వుండదల్చుకున్నారో నిర్ణయించుకోవాల్సిన సందర్భం యిది. రాజకీయ ప్రవేశం స్త్రీ ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఇనుమడింప జేసేదిగా వుంటే మరింత మంది మహిళా మణులు ఈ రంగంలో కదంతొక్కే అవకాశం వుంటుంది. మహిళా మణులు పురుషాధిక్య సమాజం చేతిలో పావులుగా మిగిలిపోతున్నారనే బాధ కలుగుతుంది. ఈ పరిస్థితి మారాలి. పార్టీ లకు అతీతంగా మహిళా నాయకురాళ్ళు ఎదుర్కొంటున్న అణచివేతకు వ్యతిరేకంగా గొంతెత్తాలి. అదే విధంగా అణగారిన మహిళలను ముందుకు నడిపించాలి. చట్టాల్ని రూపొందించే ప్రక్రియలో భాగస్వా మ్యమే అసమానతల్ని రూపుమాపే కార్యాచరణకు పునాది. సమా నత్వం పునాదిగా కలిగిన సమాజాన్ని నిర్మిద్దాం. డా‘‘ కత్తి సృజన వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ -
స్క్రీన్కు అతుక్కుంటే ప్రమాదమే!
న్యూఢిల్లీ: పన్నెండేళ్లలోపు చిన్నారులు ఎక్కువ సేపు స్క్రీన్లకు అతుక్కుపోతే మెదడు పనితీరులో మార్పులు చోటుచేసుకుంటున్నాయని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. గత 23 సంవత్సరాలపాటు 30,000 మంది చిన్నారుల మెదడు ఇమేజ్‌లను విశ్లేషించి సంబంధించిన సమగ్ర అధ్యయనాన్ని హాంకాంగ్, చైనా, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల బృందం బహిర్గతంచేసింది. చిన్నారుల మెదడు సంక్లిష్ట అభివృద్ది క్రమంపై ‘డిజిటల్’ ప్రభావం స్థాయిని లెక్కించేందుకు ఈ అధ్యయనం చేపట్టారు. మెదడు అభివృద్ధి చెందే క్రమంలో కొత్త రకం పనులు చేయాల్సి వచ్చినపుడు న్యూరాన్ల నెట్వర్క్ ఏ మేరకు మార్పులకు లోనవుతుందనే అంశాలనూ శాస్త్రవేత్తలు పరిశీలించారు. రీసెర్చ్ కోసం చిన్నారి మెదడు 33 విభిన్న ఇమేజ్‌లను విశ్లేషించారు... ► ఎక్కువ సేపు టీవీ చూడటం, కంప్యూటర్ గేమ్స్ ఆడటంతో 12 ఏళ్లలోపు చిన్నా రుల మెదడు పనితీరు ప్రభావితమవుతోంది ► దీంతో మెదడు పైపొర కార్టెక్స్లో నిర్మాణాత్మక మార్పులు జరుగుతున్నాయి ► జ్ఞాపకశక్తి, ప్లానింగ్ సామర్థ్యం, స్పందించే గుణంలో మార్పులు వస్తున్నాయి ► దీంతో స్పర్శ, ఒత్తిడి, వేడి, చల్లదనం, నొప్పి వంటి ఇంద్రియ సంబంధ అంశాలను మెదడు ప్రాసెస్ చేసే విధానంలోనూ మార్పులు కనిపించాయి ► జ్ఞాపకశక్తి, వినడం, భాష వంటి వాటిని గుర్తుంచుకునే మెదడు భాగంలో నిర్మాణాత్మక మార్పులు వచ్చాయి ► దృశ్య సమాచారాన్ని సరిపోల్చే మెద డు భాగంలో భౌతిక మార్పులు కనిపించాయి ► ముఖ్యంగా ‘ట్యాబ్’ను వినియోగించే వారి మెదడు పనితీరు, సమస్యల పరిష్కార సామర్థ్యం బాగా తగ్గిపోయాయి. ► మేథస్సు, మెదడు పరిమాణం తగ్గిపోవడానికి వీడియో గేమ్స్, అత్యధిక ఇంటర్నెట్ వినియోగమే కారణమని రీసెర్చ్ వెల్లడించింది. ► డిజిటల్ అనుభవాలు చిన్నారుల మెదడులో మార్పులు తెస్తున్నాయని అధ్యయనం కరస్పాండింగ్ రచయిత, హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన హూయిలీ చెప్పారు. -
అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న కొత్త కరోనా: ఈ లక్షణాలుంటే..!
యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి అమెరికాలో మరోసారి వేగంగా విస్తరిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ కొత్త వేరియంట్ హెచ్వీ.1 అమెరికన్లను భయపెడుతోంది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుండి వచ్చిన డేటా ప్రకారం అక్టోబర్ 28తో ముగిసిన రెండు వారాల వ్యవధిలో కొత్తగా నిర్ధారణ అయిన కేసుల్లో 25.2 శాతం ఈ వేరియంట్ కారణమని తేల్చింది. గతంలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరించిన ఈజీ.5 అకా ఎరిస్ వేరియంట్ల కంటే ఈ హెచ్వీ.1 వేరియంట్ ఎక్కువ డామినెంట్ వేరియంట్ అని, ఇటీవల నమోదైన కేసుల్లో నాలుగో వంతు కంటే మించి హెచ్వీ.1 వేరియంట్ కేసులేనని గుర్తించారు. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తాజా గణాంకాల ప్రకారం జూలైలో 0.5 శాతంగా ఉన్న ఈ వేరియంట్ కేసులు సెప్టెంబర్ నాటికి అవి 12.5 శాతానికి పెరిగాయి. దీన్ని ఒమిక్రాన్ గ్రాండ్ చైల్డ్‌గా వాండర్బిల్ట్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్లోని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రొఫెసర్ డా. విలియం షాఫ్నర్ పేర్కొన్నారు. అలాగే పిలోరా జేఎన్.1 వేరియంట్‌ను ఐస్లాండ్, పోర్చుగల్, స్పెయిన్‌తో సహా 12 దేశాలలో కనుగొన్నారు. కోవిడ్ టంగ్ ఈ వేరియంట్ సోకిన వారిలో గొంతు నొప్పి, జలుబు, దగ్గు, తలనొప్పి, అలసట, కండరాల నొప్పి, చలి లాంటివి కోవిడ్‌లో కీలక లక్షణాలు. అయితే, ఈ కొత్త వేరియంట్ సోకిన వారి నోటిలో కోవిడ్ టంగ్ లక్షణం కనిపిస్తోందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయాన్ని ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. దీని ప్రకారం ఒమిక్రాన్ హెచ్వీ.1, పిరోలా జాతి జేఎన్.1 వేరియంట్స్ బారిన పడిన వారిలో నాలుక వాపు లేదా మంట ముఖ్య లక్షణంగా ఉంటోంది. కొంతమంది రోగుల నాలుకపై సాధారణం కంటే తెల్లని మందపాటి పొర ఏర్పడుతోంది. దీంతోపాటు నాలుక బాగా ఎర్రగా మారడం, మంట, రుచి కోల్పోవడం, కొద్దిగా తిమ్మిరి కనిపించాయట. కొన్నిసార్లు నాలుకపై గడ్డలు , అల్సర్లు ఏర్పడినట్టు తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. అయిదే మన శరీరంలోని ఇమ్యూన్ సిస్టం వైరస్‌తో పోరాడుతున్నదానికి సంకేతం కావచ్చని, కొంతమందికి, కొన్ని రోజుల తర్వాత వాపు దానంతట అదే తగ్గిపోతుందని తెలిపారు. మరికొంతమందికి మందులు వాడాల్సి ఉంటుందన్నారు.ఈ నేపథ్యంలో ఇలాంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుణిని సంప్రదించాలని చెప్పారు. ఈ వేరియంట్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, శాస్త్రవేత్తలు హెచ్వీ.1 లాంటి వేరియంట్ కొత్త వేరియంట్ల గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదని ఎన్బీసీ న్యూస్ రిపోర్ట్ చేసింది.ఎక్కువ మ్యుటేషన్ అయ్యే వేరియంట్లు తక్కువ హాని కలిగిస్తాయని వీరు పేర్కొన్నారు. -
ఏటా కొత్త వ్యాధికారకం!
సాక్షి, హైదరాబాద్: మానవాళికి అంటువ్యాధుల ముప్పు క్రమంగా పెరుగుతోంది. కోవిడ్–19 వైరస్ వ్యాప్తి కారణంగా యావత్ ప్రపంచమంతా దాదాపు మూడేళ్లపాటు అతలాకుతలమైంది. వందల ఏళ్లుగా ఈ వ్యాధికారకాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ ప్రస్తుతం వాటి సంఖ్య మరింత ఎక్కువవుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన చెబుతున్నారు. గత మూడు దశాబ్దాల్లో ఏకంగా 30 రకాల వ్యాధికారకాలు ఉద్భవించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పరిశోధనలో తేలింది. ఈ లెక్కన ఏటా సగటున ఒక వ్యాధికారకం వెలుగులోకి వచ్చి ంది. అయితే ఈ వ్యాధికారకాల ఉద్భవంలో అత్యధికం జంతువుల నుంచే కావడం గమనార్హం. అడవుల నరికివేత, జంతువుల వలసలు... అంటువ్యాధుల కారకాలపై డబ్ల్యూహెచ్‌వో ఎప్పటి కప్పుడు పరిశోధనలు చేస్తూనే ఉంది. ప్రధానంగా జంతువుల నుంచే వ్యాపిస్తున్నవి 60 శాతంగా ఉంటున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అడవుల నరికివేత వల్ల జంతువుల వలసలు పెరగడంతోపాటు అటవీ జంతువులను ఆహారంగా మార్చు కోవడం, జంతు ఉత్పత్తుల వాడకంతో ఈ పరిస్థితులు ఎదురవుతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. మనుషుల ఆహార జాబితాలో గతంలో శాకాహార జంతువులే ఉండగా క్రమంగా మాంసాహార జంతువులూ చేరాయి. శాకాహార జంతువులతో పోలిస్తే మాంసాహార జంతువుల జీర్ణవ్యవస్థ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆహార అరుగుదల కోసం ఉపయోగపడే బ్యాక్టీరియా, ఇతరత్రా మానవ శరీరానికి ప్రమాదకారిగా మారుతున్న సందర్భాలున్నాయి. కోవిడ్–19 వైరస్ ఇదే తరహాలో ఉద్భవించిందనే వాదనలు సైతం ఉన్నాయి. ఎబోలా, రేబిస్ మొదలైన వైరస్లు ఈ కోవకు చెందినవే. కట్టడి కోసం ‘వన్ హెల్త్’.. డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం 2003 నుంచి ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధుల కారణంగా కోటిన్నరకుపైగా మరణాలు సంభవించాయి. అలాగే ప్రపంచ దేశాలు 4 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకున్నాయి. జంతువుల నుంచి వచ్చే వ్యాధికారకాలను ఎదుర్కొనేందుకు, వాటిని నిలువరించేందుకు డబ్ల్యూహెచ్‌వో వన్‌హెల్త్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ, జంతు సంరక్షణ సంస్థలు, వైద్య నిపుణులు, వెటర్నరీ నిపుణులు కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ కార్యక్రమాల వల్ల జంతు వ్యాధికారకాలను నిలువరించవచ్చని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. అంతేకాకుండా ఆర్థికపరమైన భారం కూడా తగ్గుతుందని భావిస్తోంది. కోవిడ్‌పై పోరులో 28 విభాగాల కృషి కోవిడ్–19 వ్యాప్తి తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ద పెరిగింది. కోవిడ్ టీకాల కోసం దేశంలో 28 విభాగాలు సమన్వయంతో పనిచేసి అద్భుత ఫలితాలు సాధించాయి. పర్యావరణం, మొక్కలు, జంతువులు, మానవాళి మధ్య సంబంధాల్లో సమతౌల్యం ఎప్పుడూ పాటించాలి. దాని ఆమలుకు సంబంధించినదే వన్ హెల్త్ విధానం. డబ్ల్యూహెచ్‌వో రూపొందించిన ఈ విధానం వల్ల ఆర్థికంగా కలసిరావడంతో పాటు ఎక్కువ ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ అంశం అన్ని దేశాలు పూర్తిస్థాయిలో అమలు చేసే స్థాయికి చేరుకుంటాయని ఆశిస్తున్నా. – డాక్టర్ కిరణ్ మాదల, ఐఎంఏ సైంటిఫిక్ కమిటీ కన్వినర్ -
ఆకుకూరలు మంచిదని తినేస్తున్నారా? శాస్త్రవేత్తలు స్త్రాంగ్ వార్నింగ్!
ఆకుకూరలు తినడం మంచిదని తినేస్తుంటారు. కానీ ఇవి ఎలా పండుతున్నాయ్, వాటిలో ఏం ఉంటున్నాయ్ అన్నవి తెలుసుకోకపోతే లేనిపోని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. బెంగుళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాల్లోని దుకాణాల్లో అస్సలు ఆకుకూరలు కొనుగోలు చేయొద్దు, తినొద్దని హెచ్చరిస్తున్నారు. ఎందుకని? ఏం జరిగింది... బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ఆకుకూరలను మరుగు నీటి వ్యర్థాలతో పండిస్తున్నారు. దీంతో ఆ మొక్కలు మోతాదుకు మించి లోహన్ని గ్రహిస్తున్నాయిని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అందులోనూ ఆకుకూరలు కూరగాయాల కంటే ఎక్కువ లోహాన్ని గ్రహిస్తాయి. ఈ మేరకు బెంగళూరులోని ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకులు కొన్ని ఆకుకూరలను సేకరించి పరీక్షించగా వాటిలో అధిక మోతాదులో మెటల్ సాంద్రతలు ఉన్నట్లు గుర్తించారు. వారి పరిశోధన ప్రకారం కూరగాయాల్లో సూచించిన దాని కంటే లోహాలు అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అవి కాస్త హైపర్ అక్యుమ్యులేటర్లుగా మారాయని పరిశోధకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా బచ్చలి, ఆకుకూరల్లో లోహం మోతాదు ఎక్కువుగా ఉన్నట్లు తెలిపారు. అలాగే కొన్ని రకాల కాయగూరల్లో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇలా అధిక మోతాదులో మెటల్ కలిగిన కలుషిత ఆకుకూరలు,కాయగూరలు తీసుకోవడం వల్ల క్యాన్సర్, రక్తహీనత, రక్తపోటు, పోషకాహార లోపం వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఆకుకూరల్లో ఉండాల్సిన లోహం 425.5 mg/kg కాగా, వాటిలో 514.05 mg/kg లోహం ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. భారీ లోహలు మానవ శరీరాన్ని బాగా ప్రభవితం చేస్తాయిని, ఫలితంగా ఈ కింది అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కాలేయం సంబంధిత సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు మూత్రపిండ పమస్యలు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ రక్తహీనత ఊపిరి ఆడకపోవడం లేదా ఆస్మా వంటి వ్యాధులు పిల్లలు కౌమారదశలోనే ఊబకాయం రావడం కాలేయ క్యాన్సర్ గుండె జబ్బులు ఎముకల వ్యాధులు పుట్టుకతో వచ్చే వైకల్యాలు తక్కువ జనన బరువు అందువల్ల దయచేసి సేంద్రీయ ఎరువులతో సురక్షితమైన ప్రదేశంలో పెరిగిన ఆకుకూరలనే తినేందుకు యత్నించండి. కుదరకపోతే ఎట్టిపరిస్థితుల్లో అలా పండిన ఆకుకూరలను అస్సలు తినొద్దని స్త్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం బెంగుళూరులోని ఆకుకూరలన్నింటిలో లోహం సాంద్రత ఎక్కువ ఉందని బెంగుళూరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ కమిషనర్ ప్రకారం అసురక్షితంగా లోహం అధికంగా ఉన్న కూరగాయాలను పండిస్తున్న లేదా విక్రయిస్తున్న వారిని ఆరు నెలల నుంచి ఆరేళ్ల వరకు జైలు శిక్ష తోపాటు లక్ష నుంచి ఐదు లక్షల వరకు జరిమానా పడుతుంది. (చదవండి: ఏకంగా 27 నిమిషాల పాటు గుండె ఆగిపోయింది!ఆల్మోస్ట్ డెడ్ కానీ..) -
అంతరించిపోయే స్టేజ్‌లో బనానా!..శాస్త్రవేత్తలు స్ట్రాంగ్ వార్నింగ్
కాలుష్యం లేదా కొన్ని రకాల చీడపీడల కారణంగా పూర్వం నాటి ప్రముఖ పండ్లు, కూరగాయాలు అంతరించిపోవడం జరిగింది. వాటి విత్తనాలు సైతం కనుమరగవ్వడం. అందుబాటులో ఉన్న మొక్కల సాయంతోనే కొత్త రకాల వంగడాలను సృష్టించడం వంటివి చేశారు శాస్త్రవేత్తలు. ఇలా ఎందుకు జరుగుతుందని శాస్త్రవేత్తల మదిని తొలిచే చిక్కు ప్రశ్న. ఇప్పుడు ఆ స్టేజ్‌లోకి బనానాలు కూడా వచ్చేశాయి. ఔను!.. మనం ఎంతో ఇష్టంగా తినే అరటిపండ్లు అంతరించే పోయే ప్రమాదంలో ఉన్నాయని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఎందువల్ల అరటిపండ్లు అంతరించిపోతున్నాయి? రీజన్ ఏంటి? తదితరాల గురించే ఈ కథనం!. పేదవాడు సైతం కొనుక్కుని ఇష్టంగా తినగలిగే పండు అరటిపండు. అరటిపండులో ఉండే పోటాషియం వంటి విటమిన్లు ఎన్నో రకాల వ్యాధులను దరి చేరకుండా రక్షిస్తుంది. అలాంటి పోషకవిలువలు కలిగిన పండు ప్రస్తుతం కనుమరగయ్యే స్థితిలో ఉందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్రజలు ఇష్టంగా తినే అరటి పండ్లలలో కావెండిష్ అరటిపండ్లు ఒకటి. ఇది వాణిజ్యం పరంగా అధికంగా ఎగుమతయ్యే అరటిపండు కూడా ఇదే. ఈ అరటిపండ్ల చెట్లకు పనామా అనే ఉష్ణమండల జాతికి చెందిన ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందని. ఇది చెట్టు మూలల్లో అటాక్ చేసి నాశనం చేస్తుందని చెబుతున్నారు. ఇది చెట్టు మొదలులోనే రావడంతో ముందుగా మొక్కను నీటిని గ్రహించనీయకుండా చేస్తుంది. తద్వారా కిరణజన్య సంయోగక్రియను చేసుకోలేని పరిస్థితి మొక్కలో ఏర్పడి చివరికి మొక్క చనిపోతుంది. దీంతో ఈ కావెండీష్ రకం అరటిపండ్లు అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు అంతరించిపోయే దశలో ఉన్నట్లు వెల్లడించారు. సమస్యను పరిష్కరించలేని స్థితిలో ఉన్నామని "ది ఫేట్ ఆఫ్ ది ఫ్రూట్ దట్ చేంజ్ ది వరల్డ్" అనే పుస్తకంలో రచయిత డాన్ కోపెల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శాస్త్రవేతలు ఈ అరటిపండ్లకు ఈ ఫంగల్ తెగులుని తట్టుకునే విధంగా వ్యాధి నిరోధకతను పెంచేలా జన్యు మార్పులు చేసే పనిలో ఉన్నారన్నారు. రైతులు కూడా ఈ రకం అరటి సాగుకి సంబంధించి ప్రత్యామ్నాయా మార్గాలపై దృష్టిసారించడం లేదా ఈ పండ్ల సాగును మానేయడం వంటి పనులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నిజానికి ఈ కావెండిష్ రకం పండ్లను 1989లో తైవాన్‌లో గుర్తించారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు విస్తరించింది. అక్కడ నుంచి భారత్, చైనాలోకి ప్రవేశించి, ప్రధాన అరటి ఉత్పత్తిలో ఒకటిగా నిలిచింది. ఆఖరికి ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో కూడా ఈ రకం పండిస్తున్నారు. ఇటీవలే ఈ వ్యాధి దక్షిణాఫ్రికాలోని అరటి చెట్లలో కూడా కనిపించిందని క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ప్రోఫెసర్ జేమ్స డేల్ తెలిపారు. ఈ రకమైన వ్యాధి అరటి చెట్లకు ఒక్కసారి వస్తే వదిలించడం చాలా కష్టమని చెబుతున్నారు. ఇలానే గతంతో గ్రోస్ మిచెల్ అనే రకం అరటిపండుకి టీఆర్ 4 అనే తెగులు వచ్చింది. దీంతో రైతులు మరో రకం అరటిపళ్లను సాగు చేయడంపై దృష్టిసారించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ రకం అరటిపండు క్రమేణ కనుమరుగయ్యింది. దాని స్థానంలోనే ఈ కావెండిష్ రకం అరటిపళ్లు వచ్చాయి. అయితే ఇది గ్రోస్ మిచెల్లా కావెండిష్ రకం అరటిపళ్లు అంతరించడానికి టైం పడుతుందని, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ తీవ్రమవ్వడానికి కనీసం దశాబ్దం పడుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈలోగా ఆ వ్యాధిని నివారించేలా జన్యుపరమైన మార్పులు చేయడం లేదా మొక్కల్లో వ్యాధినిరోధక స్థితిని పెంచి ఈ సమస్య నుంచి సులభంగా బయటపడగలిగేలా చేయగలమని కొందరూ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేయడం విశేషం. (చదవండి: పత్తి కేవలం వాణిజ్య పంటే కాదు ఆహార పంట కూడా..ఆఖరికి కొన్ని దేశాల్లో..) -
గగన్‌యాన్‌కు ముందు నింగిలోకి టీవీ–డీ1
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టబోయే మానవ సహిత గగన్‌యాన్ ప్రాజెక్టుకు ముందు ఈనెల 21న మానవ రహిత ప్రయోగం చేపట్టనున్నారు. దీనిలో భాగంగా మొట్టమొదటి క్రూ మాడ్యూల్ సిస్టం (వ్యోమగాముల గది)తో కూడిన గగన్‌యాన్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ (టీవీ–డీ1)ను శనివారం ఉదయం 7 గంటలకు నింగిలోకి పంపడానికి శాస్త్రవేత్తలు అంతా సిద్ధం చేశారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదికనుంచి ప్రయోగించనున్నారు. ఇప్పటికే పలు రకాల భూస్థిర పరీక్షలను నిర్వహించారు. ఇందులోని మోటార్ల పనితీరును నిర్థారించుకున్నారు. ఎంఎస్‌టీలో టీవీ–డీ1 రాకెట్ అనుసంధానం పనులన్నీ పూర్తి చేశారు. ఈ టీవీ–డీ1 రాకెట్ ద్వారా క్రూ మాడ్యూల్ సిస్టంను భూమికి సుమారు 17 కిలో మీటర్ల దూరంలోని అంతరిక్షంలోకి పంపించి తిరిగి దాన్ని సురక్షితంగా తీసుకురావడమే ఈ ప్రయోగం ఉద్దేశం. రాకెట్ శిఖరభాగంలో అమర్చిన క్రూ మాడ్యూల్ సిస్టంను అంతరిక్షంలో వదిలిపెట్టిన తరువాత దానికి పైభాగంలో అమర్చిన 10 పారాచూట్ల సాయంతో శ్రీహరికోట తీరం నుంచి 10 కిలో మీటర్ల దూరంలో బంగాళాఖాతంలో దించి.. నేవీ సాయంతో ప్రత్యేక బోట్లో అక్కడ నుంచి సురక్షితంగా తీసుకువచ్చే ప్రక్రియను చేపడుతున్నారు. భవిష్యత్తులో అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములను తిరిగి క్షేమంగా తీసుకువచ్చే ప్రక్రియను ప్రయోగాత్మకంగా నిర్వహించే ప్రయోగం ఇది అని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఇటీవల ఓ సమావేశంలో తెలిపారు. గగన్‌యాన్ ప్రయోగం ఇప్పటికే ఒక రూపానికి వచ్చిందని, ఆ ప్రయోగంలో టీవీ–డీ1 మొట్టమొదటి అంకమని ఆయన చెప్పారు. టీవీ–డీ1 ప్రయోగమిలా.. ♦ టీవీ–డీ1 ప్రయోగాన్ని 531.8 సెకన్లకు పూర్తి చేయనున్నారు. 34.954 మీటర్లు పొడవు కలిగిన టీవీ–డీ1 రాకెట్ ప్రయోగ సమయంలో 44 టన్నుల బరువు ఉంటుంది. ♦ ప్రయోగం ప్రారంభమైన 60.6 సెకన్లకు టెక్నికల్ వెహికల్ నుంచి క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం విడిపోతుంది. ♦ 90.6 సెకన్లకు క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం నుంచి క్రూ మాడ్యూల్ విడిపోతుంది. ♦ ఆ తరువాత 95.9 సెకన్లకు ఏసీఎస్ పారాచూట్ విచ్చుకుని క్రూమాడ్యూల్ను సురక్షితంగా భూమివైపుకు తీసుకొస్తుంది. ♦ 96.2 సెకన్లకు అపెక్స్ కవర్ విడిపోతుంది. 98.2 సెకన్లకు డ్రోగ్ పారాచూట్ విచ్చుకుంటుంది. ♦ 296.1 సెకన్ల తరువాత డ్రోగ్ పారాచూట్ విడిపోతుంది. ♦ 296.3 సెకన్లకు పైలట్ పారాచూట్ విచ్చుకుంటుంది. ♦ 296.5 సెకన్లకు మెయిన్ పారాచూట్ విచ్చుకుని క్రూమాడ్యూల్ను సురక్షితంగా భూమివైపునకు తీసుకొస్తుంది. ♦ 531.8 సెకన్లకు క్రూమాడ్యూల్ బంగాళాఖాతంలో దిగడంతో టీవీ–డీ1 ప్రయోగం పూర్తవుతుంది. -
ఆకాశంలో ఆ చుక్కల లెక్కలన్నీ మారిపోతాయట!
రాత్రిపూట ఆకాశాన్ని చూస్తే కోట్ల కొద్దీ నక్షత్రాలు కనువిందు చేస్తుంటాయి. అందులో కొన్ని ఆకారాలూ కనిపిస్తుంటాయి. కానీ భవిష్యత్తులో ఆ చుక్కల లెక్కలన్నీ మారిపోతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నక్షత్రాలన్నీ స్థానం మారిపోతాయని.. ఆకాశాన్ని అత్యంత ప్రకాశవంతమైన వెలుగు ఆక్రమిస్తుందని అంటున్నారు. మరి దానికి కారణం ఏమిటో తెలుసా? మన భూమి, సౌర కుటుంబం ఉన్న పాలపుంత గెలాక్సీ, సమీపంలోని ఆండ్రోమెడా అనే మరో గెలాక్సీ రెండూ ఢీకొని కలసిపోనుండటమే. ఇప్పటికే ఈ రెండూ ఒకదానికొకటి సమీపంలోకి వస్తున్నాయి. మరో 375 కోట్ల ఏళ్ల తర్వాత ఢీకొనడం మొదలవుతుంది. సుమారు 700 కోట్ల ఏళ్ల తర్వాత రెండూ పూర్తిగా కలసిపోయి పెద్ద గెలాక్సీగా మారిపోతాయి. ఈ క్రమంలో చాలా నక్షత్రాలు చెల్లాచెదురైపోతాయి. వాటి స్థానాలు మారిపోతాయి. మరి ఇలా రెండూ దగ్గరికి రావడం, కలిసిపోవడం జరుగుతున్నప్పుడు మనకు ఆకాశం ఎలా కనిపిస్తుందనే దానిపై నాసా ఓ వీడియోను రూపొందించింది. చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ తీసిన చిత్రాలు, దాని సాయంతో చేసిన పరిశీలన ఆధారంగా సిద్ధం చేసిన ఈ వీడియోను.. చంద్ర అబ్జర్వేటరీ పేరిట ఉన్న ‘ఎక్స్ (ట్విట్టర్)’ ఖాతాలో పోస్ట్ చేసింది. మనం చూసేది పాలపుంతే కాదు..! మన సౌర కుటుంబం ఉన్న పాలపుంత (మిల్కీవే) గెలాక్సీ అంటూ ఫొటోల్లో, ఇంటర్నెట్లో మనం చూస్తున్నది నిజానికి పాలపుంత ఫొటో కానే కాదు. అసలు మనం పాలపుంత మొత్తం చిత్రాన్ని తీయడం సాధ్యమే కాదు. ఎందుకంటే కొన్ని వేల కోట్ల నక్షత్రాలున్న పాలపుంత గెలాక్సీలో మధ్య భాగానికి ఓ పక్కన మన సూర్యుడు, భూమి ఉన్నాయి. పాలపుంత గెలాక్సీ మొత్తాన్ని దాటి బయటికి వెళితే తప్ప దీనిని ఫొటో తీయలేం! ఎలాగంటే.. సముద్రం మధ్య చిన్న పడవలో కెమెరా పట్టుకుని కూర్చున్న మనం వేల కిలోమీటర్లు విస్తరించి ఉన్న సముద్రం మొత్తాన్ని ఫొటో తీయగలమా? ఇదీ అంతే.. మరి మనం చూసే పాలపుంత చిత్రం ఏమిటి అంటారా.. దాదాపుగా పాలపుంతలా ఉండే ఆండ్రోమెడా గెలాక్సీ చిత్రమే. ఈ గెలాక్సీయే భవిష్యత్తులో పాలపుంతను ఢీకొట్టేది. -
బెడ్ రూమ్‌లోని ఫ్రిజ్ ప్రాణాంతకమా? నిపుణులు ఏమంటున్నారు?
కొందరు అర్ధరాత్రి సమయంలోనూ ఆహారం తినాలని అనుకుంటారు. అలాంటివారు రిఫ్రిజిరేటర్‌ను పడకగదికి సమీపంలో ఉంచడానికి ఇష్టపడతారు. మరికొందరు బెడ్రూమ్లోనే ఫ్రిజ్ పెట్టుకుంటారు. బెడ్రూమ్లో ఫ్రిజ్‌ని పెట్టుకున్న వారి లిస్ట్‌లో మీరు కూడా ఉంటే ఈ వార్త మీకోసమే. బెడ్రూమ్లో ఫ్రిజ్ ఉంచడం అత్యంత ప్రమాదకరమని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పడకగదిలో రిఫ్రిజిరేటర్ ఉంచడం సురక్షితం కాదనడానికి పూర్తి స్థాయిలో శాస్త్రీయ ఆధారాలు లభించకపోయినా, ప్రమాదం పొంచివుండవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఫ్రిజ్ నుండి వెలువడే రేడియేషన్ గురించి చాలామంది ఆందోళన చెందుతుంటారు. వాస్తవానికి దీని నుంచి వచ్చే రేడియేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే రిఫ్రిజిరేటర్లోని గ్యాస్ కంప్రెసర్లోనే ఉంటుంది. అందువల్ల అది లీకయ్యే ఛాన్స్ ఉండదని నిపుణులు చెబుతున్నారు. రిఫ్రిజిరేటర్ పాడైపోయినప్పుడు ఈ రేడియేషన్‌లో కొంత గదిలోకి లీక్ అయ్యే అవకాశం ఉంది. మరో ఆందోళన కలిగించే అశం ఏమంటే రిఫ్రిజిరేటర్ అగ్ని ప్రమాదాలకు తావిస్తుందని చాలామంది అంటారు. అయితే ఇందుకు చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. కొత్త మోడళ్ల ఫ్రిజ్‌లలో అనేక భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. రిఫ్రిజిరేటర్ అదనపు వేడిని కలిగిస్తుంది. ఫ్రిజ్ నుండి వచ్చే వేడి పడకగది ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఫ్రిజ్‌ని బెడ్రూమ్లో ఉంచాలని నిర్ణయించుకుంటే, దాని నుంచి వచ్చేవేడిని బయటకు పంపడానికి దానిని కిటికీ దగ్గర ఉంచాలి. ఆహారాన్ని చల్లగా, తాజాగా ఉంచడానికి రిఫ్రిజిరేటర్ రోజంతా పని చేస్తుంది. కాగా ఫ్రీయాన్ వాయువు ద్రవ రూపంలోకి మారి లీక్ అయితే పలు వ్యాధులకు కలిస్తుంది. అయితే ఇది చాలా అరుదుగా జరుతుంది. దీనిని పీల్చినట్లయితే, ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే రిఫ్రిజిరేటర్‌ను ఎప్పటికప్పుడు సాంకేతిక నిపుణులతో చెక్ చేయించాలి. ఇది కూడా చదవండి: వీధి కుక్కలను చంపడం తప్పుకాదని గాంధీ ఎందుకన్నారు? -
పురుగు.. పిట్టా.. పంట.. కనుమరుగు!
సాక్షి, అమరావతి: వాతావరణ మార్పులు కీటకాలపై ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా వాటి జనాభా తగ్గుతోంది. ముఖ్యంగా రక్షిత ప్రాంతాల్లోని కీటకాల సంతతి అత్యంత వేగంగా తగ్గిపోవడమే కాకుండా పెరుగుదల కూడా భారీగా పడిపోయిందని జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ వర్జ్‌బర్గ్ బయో సెంటర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జోర్గ్ ముల్లర్ వెల్లడించారు. ఈ నెలలో విడుదలైన నేచర్ మ్యాగజైన్లో ఆయన రాసిన కథనం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది. 1989 నుంచి 2016 మధ్యకాలంలో జర్మనీలోని రక్షిత ప్రాంతాల్లో కీటకాల జీవం 75 శాతం కంటే ఎక్కువగా తగ్గిపోయిందని ముల్లర్ పేర్కొన్నారు. 2005లో అత్యంత వేగంగా పతనమైందని.. ఆ తర్వాత సంవత్సరాల్లో వాటి పెరుగుదల కోలుకోలేదని అధ్యయనం నిరూపించిందని స్పష్టం చేశారు. ముల్లర్ 2022లో చేసిన అధ్యయనంలో కీటకాల బయో మాస్లో కొంత పెరుగుదల కనిపించింది. అయితే, గతంలో తగ్గినంత వేగంగా ఈ పెరుగుదల లేదని ఆయన పేర్కొన్నారు. ముల్లర్ బృందం 2016, 2019, 2020, 2022లో పచ్చిక భూములు, వ్యవసాయ యోగ్యమైన పొలాలు సహా అనేక బహిరంగ ఆవాసాలలో పురుగుల బయో మాస్ పెరుగుదలపై పరిశోధనలు చేసింది. వాతావరణ మార్పులు.. ఆవాసాల నష్టం పర్యావరణ పరిరక్షణలో ఎంతో కీలకమైన కీటకాల క్షీణత మానవాళి జీవనంపైనా పెద్ద ప్రభావం చూపుతుందని ప్రొఫెసర్ ముల్లర్ పేర్కొన్నారు. వీటి జాతి తగ్గిపోవడానికి వాతావరణ మార్పులు ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. ఆవాసాల నష్టం, పట్టణీకరణ, కాలుష్యం, సింథటిక్ పురుగు మందులు, ఎరువుల వినియోగం కూడా కారణమని తేల్చారు. వీటితోపాటు జీవ సంబంధ కారకాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా 1989 నుంచి 2016 మధ్య కీటకాల బయో మాస్లో 75 శాతానికి పైగా క్షీణత నమోదైనట్టు.. 2005 తర్వాత వాతావరణ ప్రభావాలు కీటకాలకు ప్రతికూలంగా మారినట్టు గుర్తించారు. ఉష్ణోగ్రతలు కీటకాల జీవన చక్రంలోని వివిధ దశల్లో వాటి జనాభాను ప్రభావితం చేస్తాయని, వీటి మనుగడ శీతాకాల పరిస్థితులు, వేసవి వంటి చివరి వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని ముల్లర్ తన అధ్యయనంలో పేర్కొన్నారు. శీతాకాలంలో చాలా వెచ్చగాను పొడిగాను ఉండటం, వేసవిలో చల్లగాను తడిగాను మారడంతో ఆ పరిస్థితులను తట్టుకోలేక కీటకాలు అంతరించిపోయినట్టు తేల్చారు. కీటకాల నాశనం ఆహార గొలుసును చిక్కుల్లో పడేస్తోందని.. దీనివల్ల కీటకాలను తినే పక్షులకు ఆహారం లభించక మరణిస్తున్నాయని మ్యూనిచ్ టెక్నికల్ యూనివర్సిటీలో ఎకో క్లెమటాలజీ ప్రొఫెసర్ అన్నెట్ మెన్జెల్ తెలిపారు. దీనివల్ల పంటలు నాశనం అవుతున్నట్టు తేల్చారు. ముఖ్యంగా ఈ తగ్గుదల 2005 నుంచి 2019 మధ్య బాగా తగ్గినట్టు గుర్తించారు. 20 నుంచి 30% తగ్గిన పంటలు ఆహార గొలుసులో కీటకాలు తగ్గిపోవడంతో పక్షులకు ఆహారం దొరకక చనిపోతున్నాయని, వీటిలో సముద్ర పక్షులు అధికంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రభావం జర్మనీతో పాటు సమీప యూరోపియన్ దేశాల్లోనూ కనిపించినట్టు తేల్చారు. ఆహారం కొరతతో వలస పక్షులు సైతం రావడం లేదని, స్థానిక పక్షులు సైతం తగ్గిపోతున్నాయని, ఉన్నవి పంటలపై దాడులు చేస్తున్నాయని గుర్తించారు. ఈ క్రమంలో 2005–2019 మధ్య పంట దిగుబడులు 30% వరకు తగ్గినట్టు అంచనా వేశారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న గ్రీన్ హౌస్ వాయువుల్ని తగ్గించాలని, సమతుల వాతావరణ పరిస్థితులను కాపాడేందుకు అడవులను పెంచాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. లేకపోతే ఆసియా, అమెరికా దేశాలకూ ఇదే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. -
ఆకులపై జంతువుల డీఎన్ఏ
సాక్షి, అమరావతి: జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ఏ ప్రాణి.. ఎక్కడ.. ఎలా జీవిస్తోందనే సమాచారం సేకరించేందుకు శాస్త్రవేత్తలు కొత్త పద్ధతులను అన్వేషిస్తున్నారు. ఇప్పటివరకు కెమెరా ట్రాపింగ్, లైన్ ట్రాన్‌సెక్టు్టలను ఉపయోగించి జంతువుల కదలికలను ట్రాక్ చేయడం ద్వారా వన్యప్రాణుల ఉనికిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ట్రాకింగ్ నిర్ధిష్ట ప్రాంతం, ప్రత్యేకించి డిజైన్ చేసిన ట్రయల్స్‌గా మాత్రమే ఉంటోంది. ఇందులో ఖరీదైన పరికరాల వాడకం, శ్రమతో కూడుకోవడంతో పాటు ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. ఒక ప్రాంతంలోని అన్ని జాతులను గుర్తించడం సాధ్యపడటం లేదు. దట్టమైన వర్షారణ్యాల్లో ఈ రకమైన ట్రాకింగ్ కష్టతరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ జీవ వైవిధ్య శాస్త్రవేత్తల బృందం అడవుల్లో జంతువుల డీఎన్ఏ నమూనాల సేకరణ ద్వారా జీవ వైవిధ్యాన్ని సులభంగా, తక్కువ ఖర్చుతో గుర్తించవచ్చని ఓ అధ్యయనంలో పేర్కొంది. గాలిలోకి కణాలుగా జంతు డీఎన్ఏ ఉగాండాలోని కిబలే జాతీయ పార్కులోని వర్షారణ్యంలో అంతర్జాతీయ పరిశోధన బృందం మొక్కలు, చెట్ల ఆకులపై జంతువులు డీఎన్ఏలను కనుగొంది. జంతువులు తమ డీఎన్ఏను గాలిలోకి కణాలుగా విడుదల చేస్తున్నట్టు.. అది కాస్తా అడవిలోని వృక్ష సంపదపై సన్నని మైనం పొర మాదిరిగా అల్లుకుంటున్నట్టు పరిశోధనలో తేలింది. ఆకులపైన స్వాబ్ నమూనాలను కాటన్ బడ్స్ ద్వారా సేకరించి డీఎన్ఏ సీక్వెన్సింగ్ పరీక్ష ద్వారా జాతుల వివరాలను తెలుసుకోవడంతోపాటు జీవ వైవిధ్యాన్ని మ్యాప్ చేయవచ్చని పరిశోధన బృందం చెబుతోంది. పర్యావరణంలోని మార్పులను అర్థం చేసుకుంటూ జీవ వైవిధ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి, అటవీ జనాభాను పర్యవేక్షించడానికి డీఎన్ఏ పరీక్షా విధానం ఎంతగానో ఊతమిస్తోంది. కోవిడ్ తర్వాత డీఎన్ఏ సీక్వెన్సింగ్ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందడం కూడా కలిసి వస్తోంది. ఆకులను శుభ్రపరచడానికి టెక్నాలజీ, ఖరీదైన పరికరాలు, ఎక్కువ శిక్షణ అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైల్డ్‌లైఫ్ అథారిటీలో పని చేసే సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర జీవ శాస్త్రవేత్తలు దీనిని సులభంగా నిర్వహించవచ్చు. వాస్తవంగా పర్యావరణంలో సేకరించే డీఎన్ఏ చాలా పెద్దస్థాయిలో జీవ వైవిధ్య పర్యవేక్షణకు దోహదపడుతుంది. వర్షాధార పరిస్థితుల్లో, అత్యంత వేడి పరిస్థితుల్లో మాత్రమే ఆకులపై డీఎన్ఏ త్వరగా క్షీణిస్తుంది తప్ప మిగిలిన సందర్భాల్లో పరిశోధనలకు అనుకూలంగా ఉండటంతో ఈ పద్ధతిపై అంచనాలు పెరుగుతున్నాయి. గంటలో 50కి పైగా జాతుల గుర్తింపు కిబలే జాతీయ పార్కు గొప్ప జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని ‘ప్రైమేట్ క్యాపిటల్’ (కోతి జాతులు) నిలయంగా ఉంది. ఇందులో అంతరించిపోతున్న రెడ్ కోలోబస్ కోతి, చింపాజీలతో సహా 13 జాతులు ఇందులో ఉన్నాయి. ఇక్కడ పరిశోధకులు కేవలం ఒక గంటలో 24 కాటన్ బడ్స్ ద్వారా ఆకులపై స్వాబ్ నమూనాలను సేకరించారు. వాటి విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపగా.. ఏకంగా 50 రకాల క్షీరదాలు, పక్షులు, ఒక కప్ప జాతులను గుర్తించడం గమనార్హం. ప్రతి మొక్క ఆకులపై దాదాపు 8 జంతు జాతులను కనుగొన్నారు. వీటిల్లో పెద్దవైన అంతరించిపోతున్న ఆఫ్రికన్ ఏనుగు నుంచి చిన్న జాతులైన సన్‌బర్డ్ వరకు భారీ జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించాయి. డీఎన్ఏల ద్వారా ఒక మీటరు పొడవాటి రెక్కలుండే గబ్బిలాలు, బయటకు కనిపించని పర్వత కోతులు, బూడిద, ఎరుపు వర్ణాల కోతులు, సుంచు ఎలుకలు, అనేక రకాల చిలుకలు ఉన్నట్టు గుర్తించారు. -
‘అంతరిక్ష విత్తనాలు’ ఆదుకుంటాయా?
భూమ్మీద అధిక ఉష్ణం, కరువు పరిస్థితులను ఎదుర్కొని సజావుగా పంట దిగుబడులు పొందాలంటే అందుకు తగినంత జన్యు దృఢత్వం కలిగిన వైవిధ్య భరితమైన వంగడాలు అవసరం. కానీ గడ్డు పరిస్థితులను తట్టుకొనే జన్యు దృఢత్వం తేవడం ఎలా అన్నది ప్రశ్న? అయితే అంతరిక్షంలో వేగంగా ఉత్పరివర్తనాలకు గురైన విత్తనాలతో భూమ్మీద ప్రతికూలపరిస్థితులను తట్టుకొనే వంగడాల తయారీ సాధ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఇందులో నిజం ఎంత? ఈ నెల 4 నుంచి 10 వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేక కథనం. (సాక్షి, సాగుబడి డెస్క్) విత్తన జన్యువ్యవస్థను సంపూర్ణంగా ప్రభావితం చేసే స్పేస్ బ్రీడింగ్... జన్యుమార్పిడి/సవరణకన్నా మెరుగైన ఫలితాలను అందిస్తుందని కొందరు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. 15 ఏళ్లుగా స్పేస్ బ్రీడింగ్ ద్వారా కొత్త వంగడాలు రూపొందిస్తూ బహుళ ప్రయోజనాలు పొందుతున్నట్లు చైనా చెబుతోంది. మరోవైపు తొలిసారిగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ), ఐక్యరాజ్య సమితి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) సంయుక్తంగా స్పేస్ బ్రీడింగ్ ప్రాజెక్టుకు 2022 నవంబర్ 7న శ్రీకారం చుట్టాయి. ‘నాసా’కు చెందిన వాల్లప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ రోదసీ నౌక ద్వారా భూమికి 175 మైళ్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తెల్లజొన్న విత్తనాలు, అరాబిడోప్సిస్ అనే ఆకుకూర విత్తనాలను అంతరిక్షంలోకి పంపాయి. కొన్ని విత్తనాలను అంతరిక్ష కేంద్రం లోపల భారరహిత స్థితిలో ఉంచగా మరికొన్నింటిని కేంద్రం బయట కాస్మిక్ రేడియేషన్‌కు గురిచేశాయి. ఆర్నెల్ల తర్వాత వాటిని 2022 ఏప్రిల్‌లో తిరిగి భూమిపైకి తీసుకొచ్చాయి. ఆ్రస్టియా రాజధాని వియన్నాలో ఏర్పాటైన ఐఏఈఏ, ఎఫ్ఏఓ ఉమ్మడి ప్రయోగశాలలోని పాలిహౌస్‌లో వాటిని ప్రయోగాత్మకంగా పెంచుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు కేరళకు చెందిన జన్యుశాస్త్ర నిపుణురాలు డా. శోభ శివశంకర్ సారథ్యం వహిస్తుండగా, మరో భారతీయ శాస్త్రవేత్త అనుపమ హింగనె ప్రయోగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అనేక సీజన్లపాటు సాగు చేసి వాటి జన్యుమార్పులను నిర్ధారించాక సరికొత్త వంగడాలను రైతులకు అందించనున్నాయి. చైనా పొలాల్లో 260 ‘అంతరిక్ష వంగడాలు’! అంతరిక్షంలోని రేడియేషన్‌లో కొన్నాళ్లు ఉంచి భూమిపైకి తెచి్చన విత్తనాల (స్పేస్ ఇండ్యూస్డ్ మ్యుటేషన్ బ్రీడింగ్ లేదా స్పేస్ బ్రీడింగ్)తో సరికొత్త వంగడాలను రూపొందిస్తూ చైనా కొన్ని దశాబ్దాలుగా ప్రయోజనం పొందుతోంది. చైనా వ్యవసాయ పరిశోధనా సంస్థ (సీఏఏఎస్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్, చైనా అణు వ్యవసాయ శా్రస్తాల సంస్థ అధ్యక్షుడు కూడా అయిన డా. లూక్సియాంగ్ లియు చెబుతున్న మాట ఇది. ‘ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్’ న్యూస్‌లెటర్ 2023 జనవరి సంచికలో స్పేస్ బ్రీడింగ్ ప్రయోజనాలను వివరిస్తూ ఆయన ఓ వ్యాసం రాశారు. వరి, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, నువ్వు, క్యాప్సికం, టొమాటో తదితర పంటలకు చెందిన 260 వంగడాలను ఇప్పటివరకు విడుదల చేసినట్లు డా. లియు ఆ వ్యాసంలో వెల్లడించారు. 2011లో విడుదల చేసిన ‘లుయుయాన్ 502’ గోధుమ వంగడంతో 12% దిగుబడి పెరగడంతోపాటు కరువును, ప్రధాన తెగుళ్లను తట్టుకుంటోందని పేర్కొన్నారు. హెక్టారుకు 12.18 టన్నుల గోధుమ దిగుబడినిస్తున్నదని డా. లియు చెప్పారు. 2016 తర్వాత 21 గోధుమ, 15 వరి, 7 మొక్కజొన్న వంగడాలను అధికారికంగా విడుదల చేశామన్నారు. మెరుగైన వంగడాల అభివృద్ధికి అవసరమే! అంతరిక్షంలో ఉత్పరివర్తనాలు(మ్యుటేషన్లు) ఎక్కువ సంఖ్యలో వస్తాయి. కాస్మిక్ ఎనర్జీ వల్ల విత్తనాల్లోని డిఎన్ఎలో పెనుమార్పులు సంభవిస్తాయి. కాంబినేషన్లు మారిపోతాయి. కొత్త వేరియంట్స్ ఆవిష్కరణకు, విస్తృతమైన జీవ వైవిధ్యానికి ఇది అవసరం. 1960వ దశకంలో ఎక్స్‌రేస్, గామారేస్‌తో మ్యుటేషన్ బ్రీడింగ్‌పై విస్తృత పరిశోధనాలు జరిగాయి. వరిలో జగన్నాద్ రకం అలా వచ్చిందే. అయితే, ఆ మ్యుటేషన్ల ద్వారా మనుగడలోకి వచ్చిన వంగడాలు చాలా తక్కువ. స్పేస్ బ్రీడింగ్ వల్ల లక్షల్లో మ్యుటేషన్లు వస్తే వాటిని స్థిరీకరించిన తర్వాత కొన్నయినా ఉపయోగపడొచ్చు. మ్యుటెంట్ లైన్స్‌ను ఉపయోగించుకొని పలు వాతావరణ పరిస్థితులకు అనువైన వాటిని స్థిరీకరించిన తర్వాత మెరుగైన వంగడాలను తయారు చేసుకోవడానికి స్పేస్ బ్రీడింగ్ ఉపయోగపడుతుంది. – డా. రాఘవరెడ్డి, మాజీ కులపతి, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం. రైతుల సమస్యలు తీరతాయనుకోవటం భ్రమే! మొక్కలు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సహజంగానే మారుతూ ఉంటాయి. అంతరిక్షంలో గాలి, వత్తిడి ఉండదు. కాస్మిక్ కిరణాలు పడతాయి. అటువంటి అంతరిక్షంలోకి పంపిన విత్తనాల్లో వచ్చే పెను మార్పులు మంచివి కావొచ్చు, చెడువి కావొచ్చు. కొన్నిటిని మాత్రమే మనం గుర్తించగలం. గుర్తించలేని మార్పుల వల్ల ఎటువంటి పరిణామాలుంటాయో తెలియదు. మారిన దాని ప్రభావం వల్ల ఎలర్జీ రావచ్చు, ఇంకేదైనా సమస్య రావచ్చు. జన్యుమార్పిడి మాదిరిగానే మ్యూటేషన్ బ్రీడింగ్ వల్ల కూడా జీవ భద్రతకు ముప్పు ఉంటుంది. దీని వల్ల ఉపయోగం 0.0001% మాత్రమే. దానికి పెట్టే ఖర్చుకు, పొందే ప్రయోజనానికి పొంతన ఉండదు. ఈ హై టెక్నాలజీ ఫలితాలు అకడమిక్ పరిశోధనలకు పరిమితం. దీంతో రైతుల సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందనుకోవటం భ్రమ. 60 ఏళ్లుగా మ్యూటేషన్ బ్రీడింగ్ అనుభవాలు చెబుతున్నది ఇదే. భూమ్మీదే సుసంపన్నమైన పంటల జీవవైవిధ్యం ఉంది. ప్రకృతిసిద్ధమైన వాతావరణంలో రెగ్యులర్ సెలక్షన్ ద్వారా వంగడాల ఎంపికపై ఆధారపడటమే మేలు. అధిక ఉష్ణాన్ని తట్టుకునే టొమాటో మొక్క భూమ్మీద దొరుకుతుంది. చంద్రుడి మీద దొరకదు కదా! – డా. జీవీ రామాంజనేయులు, సుస్థిర వ్యవసాయ కేంద్రం, కృష్ణ సుధా అకాడమీ ఫర్ ఆగ్రోఎకాలజీ. -
ఆకులు మార్చి.. ఏమార్చే.. ఊసరవెల్లి చెట్టు!
పరిసరాలను బట్టి రంగులు మార్చేసే ఊసరవెల్లులు తెలుసు! అక్కడ ఉన్నాయా లేవా అన్నట్టుగా పరిసరాల్లో కలిసిపోయే కీటకాలు, జంతువులూ మనకు తెలుసు! కానీ తాను పాకే చెట్టును బట్టి ఆకుల ఆకృతిని మార్చేసుకునే తీగ చెట్టు తెలుసా? ప్రకృతి వింతల్లోనే వింతైనదిగా శాస్త్రవేత్తలు చెప్తున్న ఆ తీగ చెట్టు ఏమిటి? ఆకుల ఆకృతిని మార్చుకోవడం ఏమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ చెట్టు వేరు.. ఆకులు ఒకటే.. చిలీలోని దట్టమైన అడవులు.. ఎర్నెస్టో గియనోలి అనే వృక్ష శాస్త్రవేత్త చెట్లు, మొక్కలపై పరిశోధన చేస్తున్నారు. నడు స్తూ వెళ్తున్న ఆయన ఓ చోట పడి ఉన్న ఆకులను చూసి ఆశ్చర్యంతో ఆగిపోయారు. అక్కడున్న చెట్టు ఆకులు ఒక ఆకారంలో ఉంటే.. కిందపడి ఉన్న ఆకులు భిన్నమైన ఆకారాల్లో ఉండటమే దానికి కారణం. ఇదేమిటా అని పరిశోధన చేసిన ఎర్నెస్టో.. తానున్న చెట్టును బట్టి ఆకుల ఆకృతిని మార్చేసే తీగ చెట్టును గుర్తించారు. ఆ తీగ చెట్టుకు ‘బోక్విలా ట్రైఫోలోలిటా’గా పేరు పెట్టారు. చెట్టులో చెట్టు.. తీగలో తీగ.. ఏ చెట్టు, మొక్క అయినా దాని ఆకుల న్నీ ఒకేలా ఉంటాయి. ఆకారం నుంచి రంగు దాకా పెద్దగా తేడా ఉండదు. కానీ ‘బోక్విలా ట్రైఫోలోలిటా’తీగ చెట్టు మాత్రం.. తాను పాకుతూ పెరిగే ఇతర చెట్లు, మొక్కల ఆకులను పోలినట్టుగా తన ఆకులను మార్చుకుంటుంది. ఒక్క ఆకారమే కాదు, పరిమాణం, రంగు కూడా మార్చుకోగలగడం విచిత్రం. పలు దక్షిణ అమెరికా దేశాల్లోని అడవుల్లో ఈ తీగ చెట్లు పెరుగుతాయని చెప్తున్నారు. ఒకే తీగపై.. వేర్వేరు ఆకులతో.. ‘బోక్విలా ట్రైఫోలోలిటా’ తీగ తన ఆకులను గుండ్రంగా, చతురస్రాకారంగా, సన్నగా, పొడవుగా భిన్నమైన ఆకారాలు, పరిమాణాల్లోకి.. రంగుల్లోకి మార్చుకుంటున్నట్టు గుర్తించారు. అంతేకాదు ఒకే తీగ చెట్టు ఎక్కడైనా రెండు వేర్వేరు రకాల చెట్లపైకి పాకి ఉంటే.. ఏ చెట్టుపై పాకి ఉన్న భాగంలో ఆ చెట్టు తరహాలోకి ఆకులను మార్చేసుకుంటున్నట్టు తేల్చారు. అంటే ఒకే తీగచెట్టుకు వేర్వేరు ఆకారాలు, రంగులు, పరిమాణాల్లో ఆకులు ఉండటం గమనార్హం. మార్చేసుకోవడం ఎందుకు? చెట్లు, మొక్కలను తినే జంతువులు, కీటకాల నుంచి రక్షణ కోసమే ‘బోక్విలా ట్రైఫోలోలిటా’ ఆకుల ఆకా రాలను మార్చుకుంటున్న ట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నా రు. జంతువులు, కీటకాలు పెద్దగా ఇష్టపడని, తినని చెట్లు/మొక్కల ఆకుల రూపంలోకి తీగచెట్టు తన ఆకులను మార్చేసుకోవడం దీనికి ఉదాహరణ అని వివరిస్తున్నారు. ఎలా మార్చేసుకుంటోంది? ‘బోక్విలా ట్రైఫోలోలిటా’ తీగకు ఇతర చెట్లు/మొక్కలతో భౌతికంగా ఎలాంటి అనుసంధానం లేదని.. అయినా ఆకుల రూపాన్ని ఎలా మార్చుకుంటోందన్నది పెద్ద ప్రశ్నగా మారిందని శాస్త్రవేత్తలు ఎర్నెస్ట్, కరాస్కో చెప్తున్నారు. అయితే చెట్లు/మొక్కల నుంచి వెలువడే కొన్ని రసాయన సంకేతాల సాయంతో ‘బోక్విలా ట్రైఫోలోలిటా’తన ఆకుల ఆకారాన్ని మార్చుకుంటూ ఉండొచ్చని ప్రతిపాదించారు. అలాకాకుండా కీటకాలు, సూక్ష్మజీవుల ద్వారా చెట్ల జన్యువులు తీగ చెట్టుకు చేరడం.. అనుకరణకు మార్గం వేస్తుండవచ్చని మరో ప్రతిపాదన కూడా చేశారు. తీగ చెట్టుకు కళ్లున్నాయా? శాస్త్రవేత్తలు అలంకరణ కోసం వాడే ఓ ప్లాస్టిక్ చెట్టును తీసుకుని.. దానిపైకి ‘బోక్విలా ట్రైఫోలోలిటా’ తీగ పెరిగేలా చేశారు. ఆ ప్లాస్టిక్ ఆకుల రూపంలోకి కూడా ఈ తీగ చెట్టు ఆకులను మార్చుకుంది. దీనితో జన్యువుల మార్పిడి, రసాయన సంకేతాల వంటి ప్రతిపాదనలు తేలిపోయాయి. ఈ క్రమంలో ‘బోక్విలా ట్రైఫోలోలిటా’లో కాంతిని గ్రహించే కణాలు ఉన్నాయని.. వాటి సాయంతో ఇతర చెట్లు/ మొక్కల ఆకులను గమనించి (చూసి) మార్చుకుంటోందని కొత్త ప్రతిపాదన వచ్చింది. అయితే చెట్లు చూడటమనే ప్రతిపాదనే అసంబద్ధమని శాస్త్రవేత్త ఎర్నెస్ట్ స్పష్టం చేస్తున్నారు. మరి ఆకులు ఎలా మార్చుకుంటోంది?.. ఇది ఇప్పటికీ మిస్టరీయే.. -
అమెరికా భూమికి పగుళ్లు!
అగ్రరాజ్యం అమెరికాకు పెను ప్రమాదం ముంచుకొస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ నేలపై పుట్టుకొస్తున్న మైళ్ల కొద్దీ పొడవైన భారీ పగుళ్లు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. పొంచి ఉన్న పెను ఉత్పాతాలకు ఇది బహుశా ముందస్తు సంకేతం మాత్రమే కావొచ్చన్న సైంటిస్టుల హెచ్చరికలు మరింత భయం పుట్టిస్తున్నాయి. పర్యావరణంతో ఇష్టారాజ్యంగా చెలగాటం ఆడితే ఎలా ఉంటుందో ఆ దేశానికిప్పుడు బాగా తెలిసొస్తోంది! అమెరికా అతి పెద్ద పర్యావరణ విపత్తును ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా వాయవ్య రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ నేల నిట్టనిలువుగా చీలుతోంది. అది కూడా చిన్నాచితకా సైజులో కాదు! మైళ్ల పొడవునా, మీటర్ల వెడల్పులో పగుళ్లిస్తోంది. ఫిషర్స్గా పేర్కొనే ఈ చీలికలు దశాబ్దాలుగా భూగర్భ జలాలను విపరీతంగా తోడేస్తున్న తాలూకు దుష్పరిణామమేనని పర్యావరణవేత్తలు మాత్రమే గాక భూ¿ౌతిక శాస్త్రవేత్తలు కూడా నిర్ధారిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమంటూ ఇప్పుడు తీరిగ్గా నెత్తీ నోరూ బాదుకుంటున్నారు! పగుళ్లు ఎక్కడెక్కడ? ► అరిజోనా, ఉతా, కాలిఫోరి్నయా రాష్ట్రాల్లో ఇవి మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ► ముఖ్యంగా అరిజోనాలో 2002 నుంచే ఈ తరహా పగుళ్లు వస్తున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న పగుళ్లు పరిమాణంలో గానీ, సంఖ్యలో గానీ ముందెన్నడూ చూడనివి కావడమే కలవరపరుస్తున్న అంశం. జాతీయ సంక్షోభమే: న్యూయార్క్ టైమ్స్ ఈ పగుళ్లు ఇప్పుడు జాతీయ సంక్షోభం స్థాయికి చేరాయని న్యూయార్క్ టైమ్స్ మీడియా గ్రూప్ పరిశోధక బృందం తేల్చడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సర్వే ఏం చెప్పిందంటే... ► అమెరికాలో 90 శాతానికి పైగా జల వనరులకు ప్రధాన ఆధారమైన జల ధారలు శరవేగంగా ఎండిపోతున్నాయి. ► ఎంతగా అంటే, అవి కోలుకోవడం, బతికి బట్ట కట్టడం ఇక దాదాపుగా అసాధ్యమే! ► సర్వే బృందం పరిశీలించిన సగానికి సగం చోట్ల భూగర్భ జల ధారలు గత 40 ఏళ్లలో చెప్పలేనంతగా చిక్కిపోయాయి. ► 40 శాతం ధారలైతే కేవలం గత పదేళ్లలో ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయాయి. ► వాయవ్య అమెరికావ్యాప్తంగా అతి ప్రధాన మంచినీటి వనరుగా ఉంటూ వస్తున్న కొలరాడో నది కేవలం గత 20 ఏళ్లలో ఏకంగా 20 శాతానికి పైగా కుంచించుకుపోయింది. ► గ్లోబల్ వారి్మంగ్ తదితర పర్యావరణ సమస్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. భూగర్భ జలమే ముఖ్య ఆధారం మనిషుల నీటి అవసరాలను తీర్చడంలో భూగర్భ జలం కీలకంగా మారింది. ఎంతగా అంటే... ► ప్రపంచ తాగునీటి అవసరాలూ సగం భూగర్భ జలంతోనే తీరుతున్నాయి. ► ఇక 40% సాగునీటి అవసరాలకు ఇదే ఆధారం. ► అయితే, అసలు సమస్య భూగర్భ జలాలను తోడేయడం కాదు. వెనుకా ముందూ చూసుకోకుండా విచ్చలవిడిగా తోడేయడమే అసలు సమస్య. అంత వేగంగా భూమిలోకి నీరు తిరిగి చేరడం లేదు. ఏం జరుగుతోంది? ► భూగర్భం నుంచి నీటిని విచ్చలవిడిగా తోడేయడం నేల కుంగిపోవడానికి దారితీస్తోంది. ► అదే చివరికిలా పగుళ్లుగా బయట పడుతోంది. ► ఫిషర్లుగా పిలిచే ఈ పగుళ్లు సాధారణంగా పర్వతాల మధ్య ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ► వీటితో ఇళ్లకు, రోడ్లకు, కాల్వలకు, డ్యాములకు తదితరాలకు నష్టం అంతా ఇంతా కాదు. ► చాలాసార్లు ఈ భారీ పగుళ్ల వల్ల ఊహించలేనంతగా ప్రాణ నష్టం కూడా సంభవించవచ్చు. పశు సంపదకు కూడా నష్టం కలగవచ్చు. ఇవి ప్రాకృతికంగా జరుగుతున్న పరిణామాలు కావు. నూటికి నూరు శాతం మనుషుల తప్పిదాలే ఇందుకు కారణం’’ – జోసెఫ్ కుక్, పరిశోధకుడు, అరిజోనా జియాలాజికల్ సర్వే – సాక్షి, నేషనల్ డెస్క్ -
రోదసీలోకి మనిషిని పంపడంపై ఇస్రో దృష్టి
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): రానున్న రెండు మూడేళ్లలో రోదసీలోకి వ్యోమగాములను పంపించి వారిని సురక్షితంగా భూమి పైకి తెచ్చే గగన్‌యాన్–1(మ్యాన్ మిషన్) ప్రయోగాన్ని నిర్వహించే లక్ష్యంతో ఇస్రో పనిచేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ మూడో వారంలో గగన్‌యాన్ ప్రయోగానికి సంబంధించి క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టంగా పిలవబడే ఒక ప్రయోగాత్మక ప్రయోగాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. చంద్రుడిపై పరిశోధనలను విజయవంతంగా చేసిన అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పుడు గగన్‌యాన్ ప్రయోగాన్ని నిర్వహించే పనిలో అనేక ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించి సామర్థ్యాన్ని నిర్థారించుకుంటున్నారు. ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించి ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్గా గగన్‌యాన్ ప్రయోగాన్ని నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు. ఎల్వీఎం3 రాకెట్ ద్వారా 8,200 కిలోలు బరువున్న క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టం పేరుతో ప్రయోగాన్ని నిర్వహించే యత్నం చేస్తున్నారు. 3.25 వెడల్పు, 3.58 పొడవుతో క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టంను రూపొందించారు. ఈ మాడ్యూల్‌ను లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టి ఏడు రోజుల తర్వాత మళ్లీ కిందకు.. అంటే భూమికి సురక్షితంగా తీసుకొచ్చే ప్రక్రియను నిర్వహిస్తారు. చంద్రయాన్–3లో విక్రమ్ ల్యాండర్‌ను దిగిన చోటు నుంచి మరో చోటుకు తరలించే ప్రయత్నాన్ని కూడా ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించడంతో, భవిష్యత్తులో చంద్రుడిపైకి వ్యోమగాములను పంపి తిరిగి తీసుకొచ్చేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని వారు చెప్పిన విషయం తెలిసిందే. క్రూమాడ్యూల్ సిస్టంను కూడా లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి పంపి తిరిగి భూమికి తీసుకొచ్చే సమయంలో మిషన్ విఫలమయ్యే పరిస్థితి సంభవిస్తే.. వ్యోమగాములు సురక్షితంగా బయటపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని నిర్థారించుకునేందుకు గగన్‌యాన్ ప్రయోగాత్మక ప్రయోగం ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా రెండు ఎక్స్పెరిమెంటల్ ప్రయోగాలు చేశాక గగయాన్ సిరీస్‌లో మ్యాన్ మిషన్ ప్రయోగానికి సిద్ధమవుతామని ఇస్రో శాస్త్రవేత్తలంటున్నారు. వ్యోమగాములను రోదసీలోకి పంపి తిరిగి క్షేమంగా తీసుకురావడమే ఇస్రో ముందున్న లక్ష్యమని వారు చెబుతున్నారు. -
ఇస్రో శాస్త్రవేత్త వలర్మతి మృతి.. తొలి మహిళగా ఆమె పేరిట రికార్డు..
బెంగళూరు: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో).. ఇప్పుడు ఎక్కడా విన్నా ఇస్రో పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఇస్రో ప్రాజెక్ట్ లాంచింగ్ సందర్భంగా కౌంట్‌డౌన్ చదువుతూ ఒక మహిళ గొంతు వినపడుతుంది. కాగా, ఆ స్వరం మూగబోయింది. ఇస్రో ప్రతీ ప్రాజెక్ట్‌లో కౌంట్‌డౌన్ వినిపించే గొంతు ఇక మళ్లీ వినపడదు. కౌంట్‌డౌన్ చదివే ఇస్రో శాస్త్రవేత్త వలర్మతి తుదిశ్వాస విడిచారు. వివరాల ప్రకారం.. వరుస విజయాలతో ఎంతో ఆనందంతో ఉన్న ఇస్రో శాస్త్రవేతల బృందంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇస్రో ప్రయోగాలకు కౌంట్‌డౌన్ వాయిస్ అందించే శాస్త్రవేత్త వలర్మతి కన్నుమూశారు. గుండెపోడుతో వలర్మతి మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆమె మృతి పట్ల ఇస్రో శాస్త్రవేత్తలు సంతాపం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తల సంతాపం.. అయితే, శాస్త్రవేత్త వలర్మతి.. చంద్రయాన్-3 లాంచ్ సమయంలోనూ ఆమెనే స్వరాన్ని అందించారు. అదే ఆమె వాయిన్ వినిపించిన చివరి మిషన్. ఇస్రోలో ఆమెను వలర్మతి మేడం అని పిలుస్తారు. వలర్మతి మరణం నేపథ్యంలో ప్రముఖులు, ఇస్రో శాస్త్రవేత్తలు సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని తెలుపుతున్నారు. కాగా, వలర్మతి మృతిపై ఇస్రో మాజీ డైరెక్టర్ పీవీ వెంకటకృష్ణన్ స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. భవిష్యత్తులో శ్రీహరికోట నుంచి ఇస్రో చేపట్టి ప్రాజెక్ట్స్ కౌంట్డౌన్లలో వలర్మతి మేడం గొంతు వినిపించదు. చంద్రయాన్-3నే ఆమె చివరి కౌంట్‌డౌన్. ఆమెది ఆకస్మిక మరణం. బాధగా ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ISRO scientist Valarmathi, who lent her voice on countdowns for rocket launches, has died due to cardiac arrest. Her last countdown was during the launch of Chandrayaan-3. pic.twitter.com/UwaFKN8EUG — Nandan Pratim Sharma Bordoloi (@NANDANPRATIM) September 4, 2023 అబ్దుల్ కలాం అవార్డు పొందిన తొలి మహిళ.. శాస్త్రవేత్త వలర్మతి.. తమిళనాడులోని ఆరియలూర్లో 1959 జులై 31న జన్మించారు. కోయంబత్తూర్‌లోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ చదివారు. 1984లో ఇస్రోలో శాస్త్రవేత్తగా జాయిన్ అయ్యారు. ఇస్రో చేపట్టిన అనేక ప్రయోగాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. తొలి దేశీయ రాడార్ ఇమేజింగ్ సాటిలైట్ (ఆర్‌ఐఎస్‌ఏటీ-1) మిషన్‌కు ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. తమిళనాడు ప్రభుత్వం.. 2015లో ఆమెకు అబ్దుల్ కలామ్ అవార్డు ఇచ్చింది. ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి వలర్మతి కావడం విశేషం. ఇది కూడా చదవండి: చాందినీ చౌక్ చరిత్ర ఏమిటి? -
సుస్థిర వ్యవసాయంతోనే ఆహార భద్రత
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : రానున్న సంవత్సరాల్లో భారత్‌లో ఆహార సంక్షోభం తలెత్తనుందా? దేశవ్యాప్తంగా సుస్థిర వ్యవసాయాభివృద్ధి సాధ్యం కావడం లేదా? కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ సుస్థిర వ్యవసాయంలో ముందుకు వెళ్తున్నాయా? అలా వెళ్తున్న రాష్ట్రాలు ఆహార భద్రతకు భరోసా కల్పిస్తున్నాయా? సుస్థిర వ్యవసాయానికి మొత్తం 51 సూచికలను ప్రామాణికంగా తీసుకుని దేశవ్యాప్తంగా జరిపిన అధ్యయనం తర్వాత సుస్థిర వ్యవసాయం సాధించలేని పక్షంలో ఆహార భద్రత కష్టమేనని అఖిల భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–ఐకార్) అభిప్రాయపడుతోంది. ‘కాంపోజిట్ ఇండెక్స్ ఆఫ్ అగ్రికల్చర్ సస్టైనబులిటీ’పేరిట దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని వ్యవసాయ విధానా లను ఐకార్ శాస్త్రవేత్తలు డాక్టర్ ప్రేమ్‌చంద్, కిరణ్‌కుమార్‌లు పరిశీలించి నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో ఐకార్ ఈ అభిప్రాయానికి వచ్చింది. వ్యవసాయ విధానాల్లో స్పష్టమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తోంది. వ్యవసాయ సుస్థిరతకు సవాళ్లు ‘వ్యవసాయ రంగంలో రసాయన ఎరువుల వినియోగం పెరగడం, తీవ్ర వ్యవసాయ పద్ధతులను అవలంబించడం, భూసారం తగ్గిపోవడం వ్యవసాయ సుస్థిరతకు పెనుసవాలుగా మారుతోంది. 2030 నాటికి దేశ జనాభా 150 కోట్లకు చేరుకుంటుంది. ఆ జనాభాకు ఆహార భద్రత కల్పించాల్సిన బాధ్యత సాగు రంగంపై ఉంది. కొన్ని రాష్ట్రాలు సామాజిక, ఆర్థిక రంగాల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నా.. వ్యవసాయ సుస్థిరత సూచీలకు వచ్చేస రికి వెనుకబడుతున్నాయి..’అని ఐసీఏఆర్ వెల్లడించింది. పంజాబ్, హరియాణ సామాజిక, ఆర్థిక రంగాల్లో ముందంజలో ఉన్నప్పటికీ.. వ్యవసాయ సుస్థిరత సూచీని పరిశీలించినప్పుడు వెనుకబడి ఉన్నట్లు తెలిపింది. భారత వ్యవసాయ రంగం సుస్థిరత కోణంలో ఉన్నత స్థానంలో లేదని ఓ మోస్తరు సుస్థిరతతోనే ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వాలుసహకరించాలి.. ‘సుస్థిర వ్యవసాయానికి ప్రధాన సూచికలైన అతి తక్కువ నీరు,రసాయనాలు, ఎరువులు,విద్యుత్ వినియోగిస్తూ, భూసారం తగ్గకుండా పంటలు పండించే రైతాంగానికి ప్రభుత్వాలు సరైన సమయంలో సాయం అందించాల్సిన అవసరం ఉంది. అప్పుడే భారత్‌లో ఆహార భద్రతకు ఇబ్బందులు రావు. ప్రస్తుతం మిజోరం, కేరళ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్,పశ్చిమ బెంగాల్ మాత్రమేసుస్థిర వ్యవసాయాభివృద్ధి సాధిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులుఎదుర్కొనే రాజస్తాన్ సుస్థిరవ్యవసాయంలో చివరలో ఉంది..’ అని ఐకార్ నివేదిక తెలిపింది. సుస్థిర వ్యవసాయానికి 51 సూచికలు సుస్థిర వ్యవసాయాభివృద్ధికి 51 సూచికలను ప్రామాణికంగా తీసుకున్నట్లు ఐకార్ వెల్లడించింది. సారవంతమైన నేలలు, నీటి వనరులు, జీవ వైవిధ్యం, సామాజిక, ఆర్థిక, పర్యావరణ సమతుల్యత తదితర సూచికలు ప్రధానమైనవిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, బిహార్, హరియాణాతోపాటు వరి పండించే జార్ఖండ్, అస్సాం రాష్ట్రాలు ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్లు ఐకార్ వివరించింది. ఇక్కడ వ్యవసాయ విధానాల్లో మార్పులు అత్యావశ్యమని హెచ్చరించింది. పంటల మార్పిడి, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి, పంట రుణాలు, నీటి వనరుల కల్పన తదితరాలతో సుస్థిర వ్యవసాయం సాధ్యమంది. అధిక ఇన్పుట్ సబ్సిడీల నుంచి పద్ధతి ప్రకారం రైతులకు లబ్ధి చేకూరే విధానాలు రావాల్సి ఉందని తెలిపింది. భూములు సారవంతంగా లేని చోట రసాయన ఎరువుల వాడకం పెరుగుతోందని, దీనివల్ల భూమిలో ఆర్గానిక్ కార్బన్ తగ్గుదల చోటు చేసుకుంటోందని వివరించింది. దేశంలో ఓ మాదిరి సుస్థిరతే.. సుస్థిర వ్యవసాయంలో 0 నుంచి 1ని ప్రామాణికంగా తీసుకుంటే దేశంలో సరాసరిన 0.50 నమోదు అవుతోందని, ఇది ఓ మాదిరి సుస్థిరత మాత్రమేనని ఐసీఏఆర్ తేల్చింది. 0ను అధ్వానంగా పేర్కొంటే, 1ని అత్యుత్తమంగా పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళలు జాతీయ సగటును మించి ఉన్నాయి. పంజాబ్, హరియాణా, రాజస్తాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లు అధ్వానంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో భూ గర్భ జలాల వినియోగం అధికంగా ఉందని, భూగర్భ జలాలు 40 సెంటీమీటర్ల మేరకు వేగంగా పడిపోయాయని ఐకార్ పేర్కొంది. ఇక పర్యావరణ సుస్థిరతలో కర్ణాటక, మహారాష్ట్ర, మిజోరం, ఉత్తరాఖండ్‌లు మెరుగైన పనితీరును కనపరుస్తున్నట్లు తెలిపింది. ఇందులో అస్సాం, మణిపూర్, జార్ఖండ్, పంజాబ్, తెలంగాణ అధ్వానంగా ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని పేర్కొంది. ఈ రాష్ట్రాల్లో ఆర్గానిక్ వ్యవసాయం చాలా తక్కువ పరిమాణంలో ఉందని, గ్రీన్హౌస్ గ్యాసెస్ ఎక్కువగా వ్యవసాయ రంగం నుంచే వెలువడుతున్నట్లు పేర్కొంది. వాణిజ్య పంటలున్నా ఏపీ భేష్ సుస్థిర వ్యవసాయాభివృద్ధి సాధిస్తున్న ఐదారు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉండటం అభినందనీయం. మిజోరం, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఉన్నా.. ఆ రాష్ట్రాల్లో వాణిజ్య పంటలు తక్కువగా ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో వాణిజ్య పంటలు అధికంగా సాగు చేస్తున్నా.. రసాయన ఎరువులు, నీరు తక్కువ వినియోగం, భూసారాన్ని పెంపొందించేలా చేయడం ద్వారా సుస్థిర వ్యవసాయాన్ని సాధించింది. సుస్థిర వ్యవసాయం చేస్తున్న రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉంది. ఈ రైతులను ఆదుకుంటే దేశ ఆహార భద్రతకు వచ్చే ముప్పేమీ ఉండదు. -
ప్రభుత్వ బడుల్లో బాల శాస్త్రవేత్తలు
సాక్షి, అమరావతి: సర్కారు బడుల్లో నాడు–నేడు కార్యక్రమం ద్వారా సకల సదుపాయాలు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చురుకైన విద్యార్థులను శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రోత్సహించి.. సరికొత్త ఆవిష్కరణలు చేసేలా మార్గనిర్దేశం చేసింది. ఫలితంగా సౌర విద్యుత్‌తో నడిచే ట్రాక్టర్, రోడ్డు పాడవకుండా దమ్ము ఇనుప చక్రాలతో నడిచే ట్రాక్టర్, బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగకుండా హెచ్చరించే సెన్సార్, కారులో ఇరుక్కుపోయిన పిల్లలను రక్షించే యంత్రం, రూ.1,200కే బట్టలు ఉతికే వాíషింగ్ మెషిన్ వంటి అనేక పరికరాలకు విద్యార్థులే ప్రాణం పోశారు. రాష్ట్ర ప్రభుత్వం, యునిసెఫ్ సంయుక్తంగా ‘ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ 2022–23’ పేరిట నిర్వహించిన ప్రదర్శనలో ప్రతిభ చాటిన 27 బృందాలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేశారు. ప్రారంభమైన పోటీలు మూడు రోజులపాటు జరిగే ఈ పోటీలు సోమవారం విజయవాడలోని ఓ హోటల్లో ప్రారంభమయ్యాయి. 9, 10వ తరగతి విద్యార్థులు రూపొందించిన యంత్ర పరికరాలు వేటికవే ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ఇందులో 10 విజేత బృందాలకు నగదు బహుమతితో పాటు భవిష్యత్‌లో యంత్రాల తయారీ, పేటెంట్ హక్కులు సైతం ఇవ్వనుండటం విశేషం. మొదటి బహుమతిగా రూ.లక్ష, రెండో బహుమతి రూ.75 వేలు, మూడో బహుమతి రూ.50 వేలు, నాలుగో బహుమతి రూ.35 వేలు, ఐదో బహుమతిగా రూ.25 వేలు ప్రకటించారు. మరో 5 బృందాలకు రూ.10 వేల చొప్పున అందజేయనున్నారు. రైతు నేస్తం సోలార్ ట్రాక్టర్ రైతులు పొలం పనులు చేయాలంటే ట్రాక్టర్ వినియోగం తప్పనిసరి. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధన ఖర్చు పెరుగుతున్నాయి. ఈ ఖర్చును తగ్గించాలనుకున్నాను. పైగా దమ్ము చేసే ఇనుప చక్రాలతో ట్రాక్టర్లు రోడ్లపైకి రావడంతో ఆ రోడ్లు పూర్తిగా పాడైపోతున్నాయి. ఈ రెండు సమస్యలకు ఒక పరిష్కారం చూపాలని సోలార్‌తో నడిచే సపోర్టు ల్యాండింగ్ చక్రాల ట్రాక్టర్‌ను రూపొందించాం. ట్రాక్టర్ పైన బిగించే సోలార్ ఫలకాల ద్వారా బ్యాటరీ చార్జి అవుతుంది. దానితో అవసరమైనంత పనిచేసుకోకోవచ్చు. మరోపక్క దమ్ము రిమ్ములు బిగించి రోడ్డుపైకి రాగానే వెనుకనున్న సపోర్టు ల్యాండింగ్ చక్రాల విచ్చుకుని ఇనుప చట్రాలను పైకి లేచేలా సహకరిస్తాయి. అప్పుడు రోడ్డు పాడవకుండా ట్రాక్టర్ ప్రయాణించవచ్చు. అతి తక్కువ ఖర్చుతో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవచ్చు. – బోయిన సౌమ్య, కలిదిండి జెడ్పీ హైస్కూల్, ఏలూరు జిల్లా ఆరోగ్యాన్నిచ్చే వాషింగ్ మెషిన్ గ్రామాల్లో బట్టలు ఉతకడం కోసం చాల కష్టపడుతుంటారు. బట్టలు ఉతకడానికి మా అమ్మ పడుతున్న కష్టాన్ని చూసి చవకైన వాషింగ్ మెషిన్ రూపొందించాలనుకున్నాను. మా బృందంలోని ముగ్గురం కలిసి పాత సైకిల్, ప్లాస్టిక్ డ్రమ్‌తో వాషింగ్ మెషిన్ తయారు చేశాం. ఇందులో బట్టలు, నీరు, డిటర్జెంట్ పౌడర్ వేసి సైకిల్ తొక్కితే కొద్దిసేపటికి మురికిపోతుంది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం కూడా దక్కుతుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.1,200 మాత్రమే ఖర్చయ్యింది. – గుడాల సంహిత సిరి, రాయకుదురు జెడ్పీ హైస్కూల్, పశ్చిమ గోదావరి జిల్లా ఆక్సిజన్ తగ్గితే అలారమ్ కారులో ఉన్న వారికి ఆక్సిజన్ అందకపోతే వెంటనే చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసే సెన్సార్‌ను బోర్డును తయారు చేశాం. కారులో ఆక్సిజన్ తగ్గిపోతూ.. కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుతుంటే వెంటనే అలారమ్ మోగుతుంది. దీంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై సాయం అందించేందుకు వీలుంటుంది. తక్కువ ఖర్చుతో ఏ కారులైనా బిగించుకునేలా ఈ ప్రాజెక్టును రూపొందించాం. – సి.ప్రదీప్, వావిలి తోట జెడ్పీ హైస్కూల్, చిత్తూరు జిల్లా -
అందిన ‘మామ’ అందరివాడా?
అంతర్జాతీయ యవనికపై మన జాతీయ పతాకం సమున్నతంగా రెపరెపలాడిన దృశ్యం. భరతమాత ముద్దుబిడ్డల హృదయాలు ఎందుకు ఉప్పొంగవు? ఆబాల గోపాలం ఆనంద తరంగిణిలో ఎందుకు ఓలలాడదు? ఉరుము ఉరిమితేనే, మెరుపు మెరిస్తేనే, ఆకసాన హరివిల్లు విరిస్తేనే బాల్యం మురిసి పోతుందట! అవన్నీ తనకోసమేనని గంతులేస్తుందట! ఊహలు ఊరడం మొదలైన తొలిరోజు నుంచీ బాల్యానికి కథలు చెప్పే పుస్తకం చందమామ. కలలకు రెక్కలు తొడిగే నేస్తం చంద మామ. అలాంటి చందమామ మన చేతికందిన దృశ్యం పిల్లల్ని పరవశింపజేయకుండా ఉంటుందా? ఆ పారవశ్యం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనిపించింది. పిల్లలకూ, పెద్దలకూ ఎన్నెన్నో సైన్స్ పాఠాలను నేర్పింది. ఓ పిడికెడు మందికి కామర్స్ పాఠాలు, బిజినెస్ పాఠాలు కూడా నేర్పి ఉండవచ్చు. అయినా ఆ శుభదినాన్ని (ఆగస్టు 23) ‘జాతీయ స్పేస్ డే’గానే ప్రధాని ప్రకటించారు. చంద్రగోళాన్ని క్షేమంగా తాకిన నాలుగు దేశాల్లో ఇప్పుడు భారత్ ఒకటి. అంటే అంతరిక్ష విజ్ఞానంలో తొలి నాలుగు స్థానాల్లో మనకు చోటు దక్కింది. అందులో క్లిష్టమైన దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని ఎంచుకొని దిగిన తొలి దేశంగా మన దేశం రికార్డులకెక్కింది. ఘన రూపంలో అపార జల నిక్షేపాలు, ఖనిజ సంపద ఈ ప్రాంతంలో ఉన్నాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భూగోళం పుట్టిన తొలిరోజుల్లో అంగారకుడి పరిమాణంలో ఉండే పదార్థం ఒకటి దాన్ని ఢీకొట్టిందట! ఫలి తంగా కొన్ని భూశకలాలు భూమి నుంచి వేరుపడి ఆ తర్వాత ఒకచోటకు చేరి చందమామగా ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బహుశా అందుకే భూమాతకు తోబుట్టువుగా భావించి మనం మేన మామగా పిలుచుకుంటున్నామేమో! ఇక్కడ జరిగే పరిశోధనల ఫలితంగా తొలిరోజుల నాటి భూగర్భ రహస్యాలపై అధ్యయనం చేయవచ్చు. ప్రాథమికంగా భూభౌతిక పదార్థమే గనుక, నీళ్లు కూడా ఉన్నాయని చెబుతున్నారు కనుక మానవ ఆవాస యోగ్యమైన పరిస్థితులు సృష్టించడం కష్టం కాదనే భావన ఏర్పడింది. దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగడం సవాళ్లతో కూడుకున్నది కనుకనే గతంలో అమెరికా, రష్యా, చైనా దేశాలు ఈక్వెటార్ ప్రాంతంలోనే దిగాయి. అంతరిక్ష రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న రష్యా మన చంద్రయాన్–3 కంటే రెండు రోజుల ముందు ఇక్కడ దిగడానికి విఫలయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ కూడా ఇటువంటి ప్రయత్నంలో విఫలమైంది. నాలుగేళ్ల కింద మన చంద్రయాన్–2 ప్రయత్నం చివరి క్షణాల్లో విఫలం కావడం ఈ విజయానికి గుణపాఠంగా ఉపయోగప డింది. ఇక దక్షిణ ధ్రువంపై కాలూనడానికి ప్రపంచంలోని మిగిలిన అంతరిక్ష సంస్థలు కూడా పోటీపడతాయి. 2025లో ఆర్టెమిస్ అనే వ్యోమనౌకను అమెరికా ప్రయోగించబోతున్నది. ఇద్దరు మనుషుల్ని కూడా ఈ ప్రయోగం ద్వారా అమెరికా దించబోతున్నది. వారు ఒకటి రెండు వారాలపాటు అక్కడ గడుపుతారు. తాత్కాలిక స్థావరాన్ని కూడా ఏర్పాటు చేయ బోతున్నారు. పోర్చుగీసు నావికుడైన వాస్కోడాగామా ఐరోపా నుంచి భారత్‌కు సముద్ర మార్గాన్ని కనుగొన్నాడని మనకు తెలుసు. ఫలితంగా పోర్చుగీసు వారు అప్పటికి సుసంపన్న దేశంగా ఉన్న భారత్ నుంచి సుగంధ ద్రవ్యాలను కారుచౌకగా తరలించుకొని వెళ్లి వ్యాపారాల్లో బాగా లాభపడ్డారు. కామ ధేనువు లాంటి ఇండియాకు మార్గం తెలిసింది కనుక ఐరోపాలో అంతకంటే బలవంతుడైన బ్రిటిష్‌వాడు ప్రవేశించాడు. పోర్చు గీసు వారిని తరిమేసి కామధేనువు మూలుగల్ని పీల్చిపారేశాడు. తాజా కథ కూడా దాదాపు ఇలాంటిదే కావచ్చేమో! అంతరిక్ష విజ్ఞానం శాస్త్ర జిజ్ఞాస దశను దాటి వాణిజ్య దశలోకి ప్రవేశించింది. అంతరిక్ష ప్రయోగాలు చేయగలిగే దేశాలకు ఇప్పుడు చేతినిండా ‘ఆర్డర్లు’. కమ్యూనికేషన్లు తదితర అవసరాల కోసం అన్ని దేశాలూ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించుకోవాలి. కొన్ని ప్రైవేట్ సంస్థలకు కూడా అటువంటి అవసరాలున్నాయి. ఇవి ఒన్‌టైమ్ ఆర్డర్లు మాత్రమే కాదు,నిరంతరం ఉండేవి. అంతరిక్ష ప్రయోగాల నైపుణ్యం ఉన్న దేశాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో చౌకగా పనిచేసి పెట్టే దేశం భారత్. ఫలితంగా భారత అంతరిక్ష మార్కెట్ రూ.70 వేల కోట్లకు చేరుకున్నది. ఇంకో పదిహేనేళ్లలో ఈ మార్కెట్ మూడున్నర లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఇప్పుడు చంద్రయాన్–3 విజయంతో భారతదేశ సామర్థ్యం పట్ల నమ్మకం పెరిగింది. అతి తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను ప్రయోగించగలిగే దేశం భారత్ మాత్రమే! భారత ఆధునిక అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ ఇస్రోలో మొదటి నుంచి పొదుపును ఒక అలవాటుగా తీర్చిదిద్దారని చెబుతారు. అందుబాటులో ఉన్న వనరులను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడంతోపాటు, పూర్తి స్వదేశీ పరికరాలనే ఇస్రో ఉపయోగిస్తున్నది. ప్రపంచంలోని మిగిలిన స్పేస్ సెంటర్లలో పనిచేసే వారితో పోలిస్తే మన ఇస్రో సిబ్బంది జీతాలు చాలా తక్కువ. మన దేశంలో ఐటీ ఉద్యోగులతో పోల్చినా కూడా బాగా తక్కువే. ప్రయోగం విజయవంతమైన సమయంలో టీవీ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వారిని దేశ ప్రజలందరూ గమనించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబీకుల్లాగానే వారి ఆహార్యం కనిపించింది. జీతాల్లో, జీవితాల్లోనే వారు మధ్య తరగతి. విజ్ఞానంలో, అంకితభావంలో, దేశభక్తిలో వారు అత్యున్నత తరగతికి చెందినవారని పదేపదే నిరూపితమవుతూ వస్తున్నది. రాంచీలో ఉన్న హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ (హెచ్ఈసీ) వాళ్లు చంద్రయాన్ కోసం రాకెట్ లాంచ్ ప్యాడ్‌ను తయారుచేసి ఇచ్చారు. ఇది కూడా ప్రభుత్వరంగ సంస్థే. బహుశా ప్రైవేటీకరణ లిస్టులో ఉందేమో! ఇక్కడ ఇంజనీర్లకూ, ఉద్యోగులకూ 17 నెలలుగా జీతాలు లేవు. అయినా సరే దేశంకోసం చేసే పనిని దైవకార్యంగా భావించి ఉద్యోగులు జీతాలపై పట్టుబట్టకుండా ఇచ్చిన కాంట్రాక్టును గడువు లోపల పూర్తిచేసి పెట్టారు. సాధారణ ఉద్యోగులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తల త్యాగం పెట్టుబడిగా ఇప్పుడు భారత్ లక్షలకోట్ల మార్కెట్‌కు వల వేసింది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు ఇప్పుడు భారత అంతరిక్ష మార్కెట్ విధానం. ‘ఆదిపురుష్’ సినిమా కంటే తక్కువ ఖర్చుతో చంద్రయాన్–3 అనేది నినాదం! లక్షల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే కొత్త మార్కెట్ ఇది. న్యూ ఎకానమీ. కొత్త ఆర్థిక రంగానికి ద్వారాలు తెరిచినప్పుడు పరమ పవిత్రమైన పెట్టుబడిదారీ వ్యవస్థ సంప్రదాయాల ప్రకారం ముందుగా ప్రైవేట్ రంగం కుడికాలు మోపి లోపలికి ప్రవేశించాలి. అందుకు అనుగుణంగా మన అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. సాంకేతిక నైపుణ్య అభివృద్ధికీ, పరిశోధనలకూ ఇస్రోను పరిమితం చేస్తారు కాబోలు! ఉపగ్రహాలు ప్రయోగించడం, ముందుముందు అంతరిక్ష, చంద్రగ్రహ టూరిజం అభివృద్ధి చెందితే వ్యోమ నౌకలను ప్రైవేట్ ట్రావెల్స్ పేరుతో నడపడం వంటివన్నీ ప్రైవేట్ చేతికి వెళ్తాయి. ఆవు శిరస్సు భాగం ప్రభుత్వ నిర్వహణలో ఉంటుంది. దానికి గడ్డి వేయాల్సిన బాధ్యత ప్రభు త్వానిది. పొదుగు భాగం ప్రైవేట్‌కు వెళ్తుంది. పాలు పిండుకునే కర్తవ్యం వారిది. ముందుముందు ఈ రంగంలో భారీ పెట్టుబడుల అవసరం ఉంటుంది కనుక ప్రైవేట్‌రంగం ప్రవేశించక తప్పదని ప్రభుత్వం వాదన. ఇందుకు వారు ‘నాసా’ను మార్గ దర్శిగా ఎంచుకున్నారు. భూగర్భంలోని ఖనిజాలు, చమురు–వాయువులు, భూమ్మీద కొండలు గుట్టలు, అడవులు, ఆకాశయానాలతో సహా అన్నిటా ఇప్పటికే ప్రైవేటు రంగం ప్రవేశించింది. స్పేస్ టెక్నాలజీ సృష్టించిన న్యూ ఎకానమీని కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించాలా? మౌలిక రంగాల్లో , సంక్షేమ రంగాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నది కదా! దీనికి డబ్బెక్కడి నుంచి రావాలి? మనం కట్టే పన్నులేనా? సాధారణ ప్రజలు పన్నులు కట్టాలి... బడాబాబులు బ్యాంకులు లూటీ చేయాలా? ఇదెక్కడి న్యాయం? ఇటువంటి సందేహాలు సగటు కుటుంబరావులకు సహజంగా కలుగుతుంటాయి. వారికి ఆర్థిక సూత్రాలు, వాటి లోతుపాతులు అర్థంకావు. అర్థం కాదు కాబట్టే దాన్ని ఆర్థిక శాస్త్రం అన్నారు. ప్రభుత్వాలకూ, పెట్టుబడులకూ సరిగ్గా అర్థమవుతాయి. లాభాలు ఏ రంగంలో వచ్చినా సరే దేశ జీడీపీ పెరుగుతుంది. అది పెరుగుతున్నకొద్దీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తలసరి ఆదాయాలు పెరుగుతాయి, తలసరి విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఇటువంటి లెక్క లేవో చెబుతారు. కార్మికులు, ఉద్యోగులు, శాస్త్రవేత్తలు, శ్రామికులు, కష్టాలు, కన్నీళ్లు, దోపిడీ, పీడన, బ్యాంకుల లూటీ, ఎర్రజెండాలు, ధర్నా చౌకులు... వగైరా పదజాలాన్ని కాస్సేపు పక్కనబెడదాం. చంద్రయాన్–3 ప్రయోగ విజయం న్యూ ఎకానమీ వృద్ధికి తోడ్పడు తుందనేది నిర్వివాదాంశం. ఈ విజయం ఆర్థిక రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. జీ–20 అధ్యక్ష హోదాలో ఉన్న సమయంలోనే వచ్చిన అవకాశం. దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తుంది. ఆర్థికరంగం, శాస్త్ర విజ్ఞాన రంగం, రక్షణ పాటవం... ఈ మూడు రంగాల్లో ఏ దేశం ఆధిపత్యం వహిస్తుందో అదే అగ్రరాజ్యం. ఈ మూడు రంగాల్లో కూడా ఇంచుమించు టాప్–5 లోకి భారత్ ప్రవేశించిన సూచనలు కనిపిస్తున్నాయి. మరో మూడు నాలుగేళ్లలో టాప్ త్రీలోకి చేరుతామని ప్రధాని చెబుతున్నారు. అందుకు చంద్రయాన్ విజయం లాంటివి ఉపకరి స్తాయి. అందుకే కాబోలు ఈ ప్రయోగం మీద ప్రధాని ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ‘బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొంటున్నప్పటికీ నా మనసంతా ఇక్కడే ఉంద’ని ఇస్రో శ్రేణులతో సంతోషాన్ని పంచుకున్నారు. ఇండియాకు వచ్చిన తర్వాత స్వయంగా ఇస్రో కేంద్రానికి వెళ్లి సిబ్బందిని అభినందించారు. ల్యాండర్ దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’గా నామకరణం చేశారు. ప్రయోగాల ముందు పూజలు, దేవుళ్ల పేరుతో నామ కరణాలు వగైరాల పట్ల అభ్యంతరం చెబుతున్నవారు కూడా తక్కువేమీ కాదు. మూఢ నమ్మకాలు సైన్స్ పురోగతికి ప్రతిబంధకాలే. కానీ మూఢ నమ్మకాలు వేరు, విశ్వాసాలు వేరు. ఈ సృష్టికి కారణమేమిటి? అనే ప్రశ్నకు సైన్స్ ఇప్పటికీ సంతృప్తికరమైన సమాధానాన్ని ఇవ్వలేదు. సైన్స్ ఆ సమాధానం చెప్పనంతవరకూ ఎవరి విశ్వాసం వారికుంటుంది. ఆ విశ్వాసాల మేరకు ప్రార్థనలూ, పూజలూ ఉంటాయి. కాకపోతే రాజ్యాంగబద్ధంగా మనది సెక్యులర్ దేశం కనుక ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎటువంటి పూజా విధానాలను అనుసరించాలి అనే అంశంపై ఆమోదయోగ్యమైన మార్గదర్శకాలు అవసరం. అంతరిక్షంతోపాటు సమస్త విజ్ఞానమంతా వేదాల్లోనే ఉన్నదని హిందూ చరిత్రకారులు ఢంకా భజాయిస్తారు. ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయట’ అంటూ వారిని కొందరు వేళాకోళం చేస్తుంటారు. వేళాకోళం చేయవలసిన అవసరమయితే కనిపించడం లేదు. రుగ్వేద కాలం నాటికే మనకు అంతరిక్ష పరిజ్ఞానం ఉన్నది. ఈ విశ్వం అనంతమైనదని, ఎక్కడ మొదలైందో, ఎక్కడ అంత మవుతుందో తెలియదని ఖగోళ శాస్త్రం చెబుతున్నది. ఆది మధ్యాంత రహితమని వేదం కూడా చెప్పింది. విశ్వం ఆవిర్భవించడానికి కారణంగా బిగ్‌బ్యాంగ్ థియరీని శాస్త్రవేత్తలు ప్రతి పాదించారు. ఇది ఇరవయ్యో శతాబ్దం ప్రథమార్ధం నాటి సంగతి. అంతకంటే సుమారు నాలుగు వేల ఏళ్లకు పూర్వం రుగ్వేదంలోని నాసదీయ సూక్తం కూడా దాదాపు ఇదే ప్రతి పాదన చేసింది. ‘హిరణ్యగర్భం’లో సంభవించిన బ్రహ్మాండ విస్ఫోటనం వల్ల నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఈ సూక్తం చెబుతున్నది. రుగ్వేద కాలం నాటికి అంతరిక్ష పరిజ్ఞానం ఉన్నదనే మాట కేవలం హిందూ చరిత్రకారులు మాత్రమే చెప్పడం లేదు. హేతువాది, బౌద్ధ మతావలంబి, కమ్యూనిస్టు ఆలోచనాపరుడైన మహాపండితుడు రాహుల్ సాంకృత్యాయన్ కూడా తన ‘రుగ్వేద ఆర్యులు’ పుస్తకంలో ఈ సంగతి నిర్ధారించారు. విశ్వం మీద ప్రసిద్ధ రచనలు చేసిన కార్ల్ సేగన్ అభిప్రాయం ప్రకారం ఆధ్యాత్మికతకూ, సైన్స్కూ వైరుద్ధ్యం లేదు. పైగా ఆధ్యాత్మిక ఆలోచనలకు సైన్స్ గొప్ప ప్రేరణ కూడా! మనకు దృగ్గోచరమైన జగత్తులో సూర్యుడు ప్రసరించే కోటానుకోట్ల కిరణాల్లో ఒక కిరణం వెదజల్లే అనంతకోటి ధూళి రేణువుల్లో ఒకదాన్ని చూడండి. అదే మన ఇల్లు. అక్కడే మన చరిత్ర. మన సంస్కృతి. అక్కడే రాజులూ–రాజ్యాలు, నాగరికత నిర్మాతలు – విధ్వంసకులు, ప్రేమలు – పగలు, తల్లీదండ్రీ, ఆనందాలు – ఉద్వేగాలు, కష్టాలు–కన్నీళ్లు, మతాలు–ప్రార్థ నలు, నీతులు చెప్పే పంతుళ్లు – అవినీతి గోతులు తీసే నాయకులు, సూపర్ స్టార్లు – సుప్రీమ్ లీడర్లు, సాధువులు – పాపులు... అన్నీ.. అందరూ అక్కడే ఆ ధూళి రేణువుపైనే అంటాడు. సూర్యకాంతిలోని ఓ ధూళి రేణువంత భూగోళంలో ఉన్న మనం ఈ అనంత విశ్వాసాన్ని ఎప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలి! మహా అయితే ఇంకో వందేళ్లకో, రెండొందల ఏళ్లకో మనం ఈ భూమిని ఖాళీ చేయవలసిందే! ఆ తర్వాత ఇంకెంతమాత్రం భూగోళం ఆవాసయోగ్యం కాదని స్టీఫెన్ హాకింగ్ చేసిన హెచ్చరిక పదేపదే చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. అంతగా ధ్వంసం చేశారు భూదేవిని! ‘సముద్రవసనే దేవీ, పర్వతస్తన మండలే, విష్ణుపత్నీ నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే’ అని పూజించిన భూమిని కొందరు స్వార్థం కోసం పీల్చి పిప్పిచేశారు. దురాశతో, కక్కుర్తితో, కండూతితో నిస్సారంగా మార్చారు. అందువల్ల మరో గ్రహాన్వేషణ తప్పదట! మరో గ్రహంలో తలదాచుకోకపోతే మానవజాతి అంతరించిపోక తప్పదట. అదిగో అందుకోసం కూడా ఈ చంద్రయానం తప్పనిసరి. ఇది మొదటి అడుగు. చందమామపై నివాసంతోపాటు దాన్ని అంతరిక్ష గేట్వేగా ఉపయోగించుకొని అంగారక గ్రహానికి (మార్స్) వలస పోవాలని ప్రయత్నాలు ప్రారంభమవుతున్నాయి. ఈ ‘స్పేసి’ నేని ట్రావెల్స్ ప్రభుత్వరంగంలో కాక ప్రైవేట్‌రంగంలో ఉండబోతున్నది కనుక ప్రయాణం చేయగలిగినవాడు కోటీశ్వరుడై ఉండాలి. యుగాంతంపై తీసిన ‘2012’ సినిమా గుర్తుకొస్తున్నది. సౌరతాపం వల్ల భూకేంద్రకం వేడెక్కి సము ద్రాలు ఉప్పొంగుతాయని హెచ్చరికలు వస్తాయి. కొన్ని దేశాలు కలిసి బలిష్ఠమైన పడవల్లాంటి ఆశ్రయాలను హిమాలయాలపై నెలకొల్పుతాయి. వీటిలో 40 లక్షల మందే పడతారు. వారంతా ఖరీదైన టిక్కెట్లు కొనుక్కొని ప్రాణాలు కాపాడుకుంటారు. మిగిలిన 700 కోట్ల జనాభా మునిగిపోతుంది. ‘టైటానిక్’ సినిమా కూడా అంతే కదా! పడవ మునగబోతున్నది, లైఫ్ బోట్లలో 700 మందే పడతారు. పెద్దటిక్కెట్లు కొన్నవారిని క్షేమంగా లైఫ్ బోట్లలో తరలిస్తారు. పేద టిక్కెట్ల బ్యాచ్ 1,500 మంది జలసమాధి అవుతారు. భూ విధ్వంసానికి ఎవరైతే కారకులయ్యాలో వారే స్పేస్ ట్రావెల్స్ టిక్కెట్లు కొనుక్కొని బతికి బయటపడవచ్చు... కొనలేని వారి పరిస్థితి? ‘మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు’ అంటూ శ్రీశ్రీ శ్రామిక లోకానికి పిలుపు నిచ్చారు. ఇంకో వందేళ్లకు సంపన్నులందరూ తోసుకుంటూ దూసుకుంటూ మరో ప్రపంచానికి వెళ్తారు కాబోలు! చంద మామా నువ్వు అందరివాడివా? కొందరివాడివా? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర మరువలేం
హఫీజ్‌పేట్: దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర మరువలేమని, ఇంజినిరింగ్ ఫీల్డ్ ఎంతో విలువైనదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఎస్కీ) ప్రాంగణంలో ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా, ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ–20 సమ్మిట్, అంతర్జాతీయ సదస్సును ఆమె జ్యోతి వెలిగించి ఆమె ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇంజినీర్లు భారతదేశంతోనే కాకుండా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా సమగ్ర అభివృద్ధికి కావాల్సిన అవసరాన్ని కూడా గుర్తించి వారికి అందరికీ అందేలా చేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తించాలన్నారు. ఇంజినీరింగ్ రంగంలో ఉండే వాళ్లు మొదట వారి అమ్మను సంతోషపరిచేలా చేస్తే దేశాన్ని కూడా సంతోషపరిచేలా చేస్తారన్నారు. 2030 నాటికి విద్యుత్‌కు ప్రత్యామ్నాంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించడం మంచి నిర్ణయమన్నారు. ప్రతియేటా దశాబ్దాలుగా విద్యుత్ రంగంలో 50 మిలియన్ కొత్త కనెక్షన్లు అందిస్తున్నామని, ఇవి మరింత పెరిగేలా చూడాలన్నారు. విద్యుత్‌కు ప్రత్యామ్నాయం ఆలోచిస్తే పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో తోడ్పడుతుందన్నారు. 2070 ఎనర్జీ డిమాండ్ గణనీయంగా పెరగడంపై అందరూ దృష్టి పెట్టాలన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టడం సంతోషించదగ్గవిషయమని, 70 నుంచి 80 శాతం విద్యుత్‌ను సోలార్ ద్వారా వినియోగించేలా చూడాలన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంటుందన్నారు. భారత దేశం ఆర్థిక రంగం ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో మరింత పటిష్టంగా మారుతోందన్నారు. చంద్రుడిపై అడుగిడడం కూడా శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల పాత్ర మరువలేనిదని, అందరినీ అభినందిం చాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సదస్సు బ్రోచర్‌ను గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా అధ్యక్షుడు శివానంద్ రాయ్, ఆర్టనైజింగ్ కమిటీ చైర్మన్ పి సూర్యప్రకాశ్, ‘ఎస్కీ’ డైరెక్టర్ డాక్టర జి రామేశ్వరరావు ప్రసంగించారు. తర్వాత జరిగిన చర్చా కార్యక్రమంలో ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ కీరిట్పారిఖ్, ఐఈఐ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ ఐ సత్యనారాయణరాజు, సెంటర్ ఫర్ సోషల్ ఎకనామిక్ ప్రొగ్రెస్ సీనియర్ ఫెల్లో రాహుల్టాంగియా,రీ సస్టేనబిలిటీ లిమిటెడ్, రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర పీజీ శాస్త్రి, హడ్కో సీఎండీ వి సురే‹Ù, ప్రణాళికాసంఘం మాజీ కమిషనర్ అశోక్‌కుమార్ జైన్ పాల్గొన్నారు.