సాక్షి, అమరావతి: వర్షం నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయడం గురించి విన్నారా? ఇప్పుడు దీనిపై ప్రయోగాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. భవిష్యత్తులో వర్షం ప్రధాన విద్యుత్ ఉత్పత్తి వనరుగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఈ దిశగా ఇప్పటికే దుబాయ్ వంటి కొన్ని దేశాలు తమ ప్రయత్నాలను విజయవంతంగా పూర్తి చేశాయి. రెయిన్ డ్రోన్ల సాయంతో వానలు కురిపించాయి. దుబాయ్ దేశంలో వర్షపు నీటితో విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంపై ప్రయత్నాలు జరిగాయి. ప్రత్యేకంగా తయారు చేసిన రెయిన్ డ్రోన్ల ద్వారా మేఘాలకు షాక్ ఇచ్చి ఎడారిలో వానలు కురిపించారు ఆ దేశ శాస్త్రవేత్తలు. వర్షపు నీటితో విద్యుత్ ఉత్పత్తిపై ప్రయోగాలు చేశారు.
రెయిన్‌డ్రాప్ విద్యుత్ ఉత్పత్తి..
చిన్న టరై్బన్‌లను నడపడానికి వర్షపు నీటిని ఉపయోగించడాన్ని రెయిన్‌డ్రాప్ విద్యుత్ ఉత్పత్తి అంటున్నారు. దీని ద్వారా ఇళ్లు, చిన్న నీటి శుద్ధీకరణ వ్యవస్థలకు విద్యుత్‌ను అందించవచ్చు. పియెజోఎలక్ట్రిక్ పదార్థాలు వర్షపు చినుకులు ఉపరితలంపైకి వచ్చినప్పుడు విడుదలయ్యే శక్తి ఆధారంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. హాంకాంగ్‌లో సిటీ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ పరిశోధకుల బృందం (డీఈజీ) బిందువుల ఆధారిత విద్యుత్ జనరేటర్‌ని రూపొందించింది.
వర్షపాతాన్ని విద్యుత్‌గా మార్చడానికి ‘ఫీల్డ్–ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్–స్టైల్ స్ట్రక్చర్‘ను ఉపయోగించింది. వీటి సాయంతో ఒక్కో వర్షపు బిందువు దాదాపు 140 వోల్ట్‌లను ఉత్పత్తి చేయగలదని బృందం పేర్కొంది. అంటే ఇళ్లకు సరఫరా చేయగలిగే విద్యుత్‌ను వాన నీటితో ఉత్పత్తి చేయవచ్చు. మన దేశంలోనూ ఆ దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)–ఢిల్లీ పరిశోధకులు నీటి చుక్కలు, వర్షపు చినుకులు, నీటి ప్రవాహాలు, సముద్రపు అలల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల పరికరాన్ని రూపొందించారు.
ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేయవచ్చు. ఇందుకోసం లిక్విడ్–సాలిడ్ ఇంటర్‌ఫేస్ ట్రైబోఎలక్ట్రిక్ నానోజనరేటర్‌ను ప్రత్యేకంగా తయారు చేశారు. ఇది కొన్ని మిల్లీవాట్ (ఎండబ్ల్యూ) శక్తిని ఉత్పత్తి చేయగలదు. దీంతో వాచీలు, డిజిటల్ థర్మామీటర్‌లు, రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్విుటర్లు, హెల్త్‌కేర్ సెన్సార్‌లు, పెడోమీటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు విద్యుత్‌ను అందించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment