వ్యవసాయం కోసం ఉపయోగించే గ్రీన్‌హౌజ్ పైకప్పులను కూడా విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తే..! ఎంచక్కా పంటకు పంట.. విద్యుత్‌కు విద్యుత్. దీన్ని నిజం చేశారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు. సాధారణ సౌరఫలకాల స్థానంలో ప్రత్యేకమైనవి వాడారు. పక్క ఫొటోల్లో కనిపిస్తున్నది అదే. మెజెంటా రంగులో మెరిసిపోతున్న ఈ గ్రీన్‌హౌజ్ ద్వారా ఈ మధ్యే తొలి పంట పండించారు. ఈ హౌజ్‌లో పండిన కూరగాయలకు.. గ్రీన్‌హౌజ్‌లో పండించిన వాటికి తేడా ఏం లేదని తేలిందని శాస్త్రవేత్త మైకేల్ లోయిక్ చెబుతున్నారు.
సూర్యుడి వెలుతురులోని నీలి, పచ్చ రంగులను వేరుచేసి సోలార్‌సెల్స్‌కు పంపడం ద్వారా విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. మిగలిన రంగులతో గ్రీన్‌హౌజ్‌లో పంటలు సాధారణంగా పండుతాయి. ఈ కొత్త తరం సౌరఫలకాలను ‘వేవ్‌లెంగ్త్ సెలెక్టివ్ ఫొటోవోల్టాయిక్ సిస్టమ్స్’(డబ్ల్యూఎస్‌పీవీ) అని పిలుస్తున్నారు. అయితే నిర్దిష్ట రంగులు లేకపోవడం పంటలపై ఏమైనా ప్రభావం ఉంటుందా అని కూడా శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. టమోటాలతో పాటు దోసకాయలు, స్ట్రాబెర్రీ, మిరియాల వంటివి పండించారు. ఈ హౌజ్‌లో.. గ్రీన్‌హౌజ్‌లో పండించిన పంటల మధ్య తేడా ఏమీ లేదని స్పష్టమైంది. మెజెంటా హౌజ్‌లలో తక్కువ నీటితోనే పంట పండుతుందని గుర్తించారు. సంప్రదాయ సోలార్ ప్యానెల్స్‌తో పోలిస్తే ఈ కొత్త ప్యానెల్స్ ఖరీదు కూడా దాదాపు 40 శాతం తక్కువ.
వ్యవసాయంతో పాటే కరెంటు
Published Sun, Nov 5 2017 3:12 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment