కొందరు అర్ధరాత్రి సమయంలోనూ ఆహారం తినాలని అనుకుంటారు. అలాంటివారు రిఫ్రిజిరేటర్‌ను పడకగదికి సమీపంలో ఉంచడానికి ఇష్టపడతారు. మరికొందరు బెడ్‌రూమ్‌లోనే ఫ్రిజ్ పెట్టుకుంటారు. బెడ్‌రూమ్‌లో ఫ్రిజ్‌ని పెట్టుకున్న వారి లిస్ట్‌లో మీరు కూడా ఉంటే ఈ వార్త మీకోసమే. బెడ్‌రూమ్‌లో ఫ్రిజ్ ఉంచడం అత్యంత ప్రమాదకరమని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పడకగదిలో రిఫ్రిజిరేటర్ ఉంచడం సురక్షితం కాదనడానికి పూర్తి స్థాయిలో శాస్త్రీయ ఆధారాలు లభించకపోయినా, ప్రమాదం పొంచివుండవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఫ్రిజ్ నుండి వెలువడే రేడియేషన్ గురించి చాలామంది ఆందోళన చెందుతుంటారు. వాస్తవానికి దీని నుంచి వచ్చే రేడియేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే రిఫ్రిజిరేటర్‌లోని గ్యాస్ కంప్రెసర్‌లోనే ఉంటుంది. అందువల్ల అది లీకయ్యే ఛాన్స్ ఉండదని నిపుణులు చెబుతున్నారు.
రిఫ్రిజిరేటర్ పాడైపోయినప్పుడు ఈ రేడియేషన్‌లో కొంత గదిలోకి లీక్ అయ్యే అవకాశం ఉంది. మరో ఆందోళన కలిగించే అశం ఏమంటే రిఫ్రిజిరేటర్ అగ్ని ప్రమాదాలకు తావిస్తుందని చాలామంది అంటారు. అయితే ఇందుకు చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. కొత్త మోడళ్ల ఫ్రిజ్‌లలో అనేక భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
రిఫ్రిజిరేటర్ అదనపు వేడిని కలిగిస్తుంది. ఫ్రిజ్ నుండి వచ్చే వేడి పడకగది ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఫ్రిజ్‌ని బెడ్‌రూమ్‌లో ఉంచాలని నిర్ణయించుకుంటే, దాని నుంచి వచ్చేవేడిని బయటకు పంపడానికి దానిని కిటికీ దగ్గర ఉంచాలి. ఆహారాన్ని చల్లగా, తాజాగా ఉంచడానికి రిఫ్రిజిరేటర్ రోజంతా పని చేస్తుంది. కాగా ఫ్రీయాన్ వాయువు ద్రవ రూపంలోకి మారి లీక్ అయితే పలు వ్యాధులకు కలిస్తుంది. అయితే ఇది చాలా అరుదుగా జరుతుంది. దీనిని పీల్చినట్లయితే, ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే రిఫ్రిజిరేటర్‌ను ఎప్పటికప్పుడు సాంకేతిక నిపుణులతో చెక్ చేయించాలి.
ఇది కూడా చదవండి: వీధి కుక్కలను చంపడం తప్పుకాదని గాంధీ ఎందుకన్నారు?
Comments
Please login to add a commentAdd a comment