Fridge
-
ప్రియురాలి మృతదేహాన్ని 9 నెలలుగా ఫ్రిడ్జ్‌లో దాచి..
దేశంలోని పలు ప్రాంతాల్లో హృదయవిదారక దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. బృందావన్ ధామ్‌లోని ఒక ఇంట్లో ఫ్రిజ్‌లో ఒక మహిళ మృతదేహం బయటపడటంతో ఈ వార్త దావానలంలా వ్యాపించింది.ఒక ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దేవాస్ పోలీసు అధికారి అమిత్ సోలంకి తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి ఆ ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. తాళాలు బద్దలుకొట్టి తలుపు తెరిచారు. లోపలున్న ఒక ఫ్రిజ్‌లో పోలీసులకు ఒక మహిళ మృతదేహం కనిపించింది. ఆ మృతదేహానికి చేతులు, కాళ్లు కట్టివేసివున్నాయి. ఈ ఉదంతం వెలుగు చూసిన కొద్ది గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు.పోలీసుల దర్యాప్తు(Police investigation)లో ఆ ఇంటి యజమాని ధీరేంద్ర శ్రీవాస్తవ అని, ఆయన ఈ ఇంటిని 2023 జూలైలో సంజయ్ పాటిదార్‌కు అద్దెకు ఇచ్చారని తేలింది. సంజయ్ జూన్ 2024లో ఇల్లు ఖాళీ చేశాడు. కానీ ఒక ఫ్రిజ్‌తో సహా కొన్ని వస్తువులను ఒక గదిలోనే వదిలేశాడు. కాగా సంజయ్ పాటిదార్ గత ఐదు సంవత్సరాలుగా ప్రతిభా అలియాస్ పింకీ ప్రజాపతితో సహజీవనం చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రతిభ వివాహం కోసం ఒత్తిడి తీసుకురావడంతో, ఆందోళనకు గురైన సంజయ్, తన స్నేహితుడు వినోద్ దేవ్‌తో కలిసి 2024 మార్చిలో ఆమెను గొంతు కోసి చంపాడు. తరువాత ఆ మృతదేహానికి చేతులు, కాళ్లు కట్టేసి ఫ్రిజ్(Fridge)లో దాచిపెట్టాడు.ఈ కేసులో సంజయ్ పాటిదార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని స్నేహితుడు వినోద్ ఇప్పటికే రాజస్థాన్‌లోని ఒక జైలులో ఉన్నాడు. సంజయ్ వివాహితుడని, వ్యవసాయ పనులు చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. కాగా దేవాస్‌లో జరిగిన ఈ సంఘటన ఢిల్లీలోని శ్రద్ధా వాకర్(Shraddha Walker) హత్యను తలపించేలా ఉందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నిందితుడు అఫ్తాబ్ పూనావాలా తన లివ్-ఇన్ పార్టనర్ శ్రద్ధను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో ఉంచాడు. తరువాత ఆ ముక్కలను ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. ఈ సంఘటన స్థానికులను భయకంపితులను చేసింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: ట్రంప్‌ను ఓడించేవాడిని: బైడెన్ పశ్చాత్తాపం -
ఇలాంటి క్రేజీ గ్రౌండ్ఫ్రిడ్జ్ని చూశారా..? కరెంట్‌తో పని లేకుండానే..
ఎన్నో రకాల ఫ్రిడ్జ్ మోడల్స్‌ని చూసి ఉంటారు. కానీ ఇలాంటి వెరైటీ ఫ్రిడ్జ్‌ని గురించి విని ఉండరు. ఈ ఫ్రిడ్జ్ ఎలక్ట్రిసిటీ అవసరం లేకుండా పనిచేస్తుంది. మన సంప్రదాయ మూలాలకు సంబంధించిన మోడ్రన్ వర్షనే ఈ ఫ్రిడ్జ్ అని చెప్పొచ్చు. మరీ ఇంతకీ ఇదెలా ఉంటుందంటే..ఈ గ్రౌండ్ ఫ్రిడ్జ్‌ని డచ్‌కి చెందిన డిజైనర్ ఫ్లోరిస్ షూండర్బీక్ రూపొందించారు. ఇది చూడటానికి గోళాకారంలో ఉండి చెక్కతో కూడిన మెట్ల ద్వారం ఉంటుంది. సరిగ్గా ఫాలిక్ ఆకృతిలో ఉంటుంది. ఇది ఆధునిక గృహోపకరణాలకు అత్యంత విభిన్నంగా ఉంటుంది. సుమారు మూడు వేల లీటర్లు ఉండే ఈ ఫ్రిడ్జ్‌లో దాదాపు 12 ఫ్రిడ్జ్‌లలో పట్టేంతా ఆహార పదార్థాలు పెట్టొచ్చుఈ గ్రౌండ్ ఫ్రిడ్జ్‌ని భూమిలో సుమారు 1 నుంచి 1.5 మీటర్ల లోతులో పెట్టి చుట్టూ మట్టిని కప్పేస్తారు. అక్కడ ఉష్ణోగ్రత సుమారుగా 10 నుంచి 12 డిగ్రీల సెంటీగ్రేడ్లు ఉంటుంది. అక్కడ చుట్టూ ఉన్న మట్టి నేచురల్ ఇన్సులేటర్‌గా పనిచేసి ఫ్రిడ్జ్ లోపల చల్లదనాన్ని క్రియేట్ చేస్తుంది. అలాగే దానిలోపల వేడిని కింద ఉన్న భూమి అబ్జర్వ్ చేసుకుని బయటకు వదులుతుంది. అందువల్ల అక్కడ ఎలప్పుడూ ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. అలాగే రాత్రి సమయాల్లో ఎయిర్ ఎక్స్ఛేంజ్ అయ్యి కూల్ ఎయిర్ వచ్చేందుకు టైమర్‌తో కూడిన ఒక ఫ్యాన్ ఫిక్స్ చేసి ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్‌ని ఇన్స్టాల్ చేసుకునేందుకు ఎలాంటి పర్మిషన్లు అవసరం లేదు. (చదవండి: ఆందోళనని హ్యాండిల్ చేయడంపై హీరో విక్కీ కౌశల్ సలహాలు!) -
ఉమెన్స్ హాస్టల్లో అగ్నిప్రమాదం.. ఇద్దరు యువతుల మృతి
చెన్నై: తమిళనాడులోని మధురైలో ఘోరం జరిగింది. ఓ లేడీస్ హాస్టల్ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ఇద్దరు యువతులు చనిపోయారు. పొగతో ఊపిరి ఆడక వీళ్లు మృతి చెందినట్లు నిర్ధారణ అయ్యింది మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కాట్రంపళయం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్లో తెల్లవారుజాము ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. రిఫ్రిజిరేటర్ ఒక్కసారిగా పేలడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. దాని దగ్గర నిద్రిస్తున్న ఇద్దరు యువతులు చనిపోయారు. వీళ్లలో ఒక యువతి స్థానికంగా టీచర్‌గా పని చేస్తున్నారు మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. ఘటనా సమయంలో హాస్టల్లో 40 మందికి పైగా ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఫ్రిడ్జ్ పేలి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.மதுரை பெண்கள் விடுதியில் தீ விபத்து.. ஆசிரியை உள்பட 2 பெண்கள் உயிரிழப்பு.. https://t.co/zm7evboOMe #madurai— Top Tamil News (@toptamilnews) September 12, 2024ఇదీ చదవండి: వృద్ధురాలి గొంతు కొరికి, ఆపై.. -
పెరుగు తొందరగా పాడైపోతుందా? ఈ చిట్కాలు పాటించండి!
వేసవికాలంలో పాలు పెరుగు తొందరగా పాడ పోతూ ఉంటాయి. ముఖ్యంగా పెరుగు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫ్రిజ్‌లో పెట్టినా రెండురోజుల్లో పెరుగు పులిసి పోతుంది. మరిపెరుగు ఎక్కువ రోజులు రుచి మారకుండా తాజాగా నిల్వ చేసుకోవాలో చూద్దాం. పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పెరుగులో ఉండే బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. పులావ్, ఖిచ్డీ, పరాటా, ఉప్మా ,ఇలాంటి అనేక వంటకాల తయారీలో దీన్ని ఉపయోగిస్తాం. ఇక వేసవిలో అయితే లస్సీకున్న ప్రాధాన్యతే వేరు. ♦ మట్టిపాత్రలో పాలు తోడుపెడితే పెరుగు కమ్మగా ఉంటుంది. నిల్వ ఉంటుంది కూడా. ♦ చక్కటి , చిక్కటి పాలను బాగా మరిగించి, కొద్దిగా వేడిగా ఉన్నపుడే తోడు పెట్టాలి. తోడు పెట్టే పెరుగు రుచిగా ఉండేలా చూసుకోవాలి. ♦ తోడు పెట్టిన పాలలో ఒక పచ్చిమిరప కాయగానీ, ఒక ఎండుమిర్చిగానీ వేస్తే గట్టిగా తోడు కోవడమే కాదు, పెరుగు రుచిగా కూడా ఉంటుంది. ♦ గాలి చొరబడని కంటైనర్లలో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అలాగే పెరుగును కూడా ఇలా కంటైనర్లలో నిల్వ చేయాలి. మూత తీసినప్రతీసారి టైట్‌గా పెట్టడం మాత్రం మర్చిపోకూడదు. ♦ పెరుగు తోడు పెట్టిన గిన్నెలోనుంచే నేరుగా తీసుకొని, మళ్లీ అదే గిన్నిని ఫ్రిజ్‌లో పెట్టడం కాకుండా, కావాల్సినంత వేరే గిన్నెలోకి తీసుకొని వాడుకోవాలి ( దోసెలు, ఇడ్లీ పిండిలాగా) ఉపయోగించే స్పూన్ కూడా శుభ్రంగా, తడి లేకుండా ఉండేలా చూసుకోవాలి. ♦ ఫ్రిజ్ డోర్లో నిల్వ ఉంచ కూడదు. ప్రిజ్‌ను తెరచిన ప్రతిసారి డోర్ మొదట వేడెక్కుతుంది. సో.. పెరుగు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఫ్రిజ్‌లోపల ఉంచితే పెరుగు తాజగా ఉంటుంది. -
టేస్టీగా..కూల్..కూల్‌గా, ఐస్ క్రీమ్స్ ఇలా చేస్తే పిల్లలు ఫిదా!
ఇంకా మార్చి నెల రాకముందే ఎండ సుర్రుమంటోంది. దీనికి తోడు పిల్లలకు గుర్తు రాకపోయినా సరే... మనింట్లో ఇడియట్స్‌బాక్స్ అదేనండీ.. టీవీ, రకరకాల ఐస్ క్రీమ్‌ల యాడ్స్‌తో ఊరిస్తూ ఉంటుంది. ఇక పిల్లలు ఊరుకుంటారా? అందుకే పిల్లలను పార్లర్‌కు పరుగు పెట్ట నివ్వకుండా.. ఇంట్లోనే కూల్ కూల్‌గా.. టేస్టీగా ఈజీగా ఐస్ క్రీమ్స్ తయారు చేసేద్దాం..! ఇంట్లోనే హెల్దీగా ఇలా ట్రై చేయండి ఆరెంజ్ ఐస్ క్రీమ్ కావలసినవి: చల్లటి పాలు – అర లీటరు (ఫుల్ క్రీమ్ టిన్డ్ మిల్క్); చక్కెర – 100 గ్రాములు; కార్న్‌ఫ్లోర్ – టేబుల్ స్పూన్; ట్యాంగ్ పౌడర్ – 3 టేబుల్ స్పూన్లు (ఆరెంజ్ ఫ్లేవర్); మీగడ – వంద గ్రాములు; ఆరెంజ్ ఎసెన్స్ – నాలుగు చుక్కలు. తయారీ: అర కప్పు పాలలో కార్న్‌ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా బీటర్ లేదా ఫోర్క్‌తో బాగా కలపాలి. మరో పాత్రలో మిగిలిన పాలను పోసి చక్కెర వేసి అడుగు పట్టకుండా గరిటతో కలుపుతూ ఐదు నిమిషాల సేపు మరిగించాలి. ఇప్పుడు కార్న్‌ఫ్లోర్ కలిపిన పాలను వేసి కలుపుతూ మీడియం మంట మీద మరో ఐదు నిమిషాల సేపు మరిగించి దించేయాలి. పాలు చల్లారిన తర్వాత అందులో ట్యాంగ్ పౌడర్, క్రీమ్ వేసి బీటర్‌తో బాగా చిలకాలి. మృదువుగా తయారైన మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేసి ఫ్రీజర్‌లో పెట్టాలి. ఆరు గంటల తర్వాత తీసి మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసి తిరిగి అదే పాత్రలో పోసి మళ్లీ అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేసి ఫ్రీజర్‌లో పెట్టాలి. పది గంటల సేపు ఉంచితే ఐస్‌క్రీమ్ గట్టిగా సెట్ అయి ఉంటుంది. ఇప్పుడు కప్పులో వేసి సర్వ్ చేయాలి. చాక్లెట్ చిప్ ఐస్ క్రీమ్ కావలసినవి: మీగడ 2 కప్పులు; పాలు 3 టేబుల్ స్పూన్లు; కోకో పౌడర్-3 టేబుల్ స్పూన్లు; కండెన్స్డ్ మిల్క్- అర కప్పు; చాకొలెట్ చిప్స్ -కప్పు; బ్రౌన్ షుగర్-కప్పులో మూడవ వంతు (బ్లీచ్ చేయని చక్కెర, అది లేకపోతే మామూలు చక్కెర తీసుకోవచ్చు) తయారీ: ∙మీగడను పన్నెండు గంటల సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ∙వెడల్పుగా ఉన్నపాత్రలో పాలు పోసి చిన్న మంట మీద వేడి చేయాలి. పాలు మరగాల్సిన అవసరం లేదు, వేడయితే చాలు (పాశ్చరైజేషన్ జరగని పాలయితే మరిగించి వేడి తగ్గే వరకు పక్కన ఉంచి గోరువెచ్చగా ఉన్నప్పుడు వాడాలి). అందులో కోకో పౌడర్ వేసి బీటర్‌తో కలపాలి. ఆ తర్వాత కండెన్స్డ్ మిల్క్ వేసి మొత్తం కలిసే వరకు బీటర్‌తో చిలకాలి. ఇప్పుడు చక్కెర వేసి చిన్న మంట మీద వేడి చేస్తూ కరిగే వరకు చిలకాలి. చక్కెర కరిగిన తర్వాత దించేసి చల్లారే వరకు మిశ్రమాన్ని పక్కన ఉంచాలి. ఫ్రిజ్‌లో ఉన్న మీగడను బయటకు తీసి సమంగా కలిసే వరకు చిలకాలి. ఆ తర్వాత ముందుగా తయారు చేసుకుని పక్కన ఉంచిన కోకో మిశ్రమాన్ని మీగడలో వేసి చిలికినట్లు కాకుండా నిదానంగా కలపాలి. ఇప్పుడు చాకొలెట్ చిప్స్ వేసి ఒకసారి కలిపి (చాకొలెట్ చిప్స్ అన్నీ ఐస్‌క్రీమ్‌లో ఒకచోట చేరకుండా అక్కడొకటి అక్కడొకటి వచ్చేటట్లు కలిపితే చాలు) మిశ్రమం మొత్తాన్ని ఒక ట్రేలో పోసి అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేసి ఫ్రీజర్‌లో పెట్టాలి. పది గంటల తర్వాత ట్రేని బయటకు తీసి ఐదారు నిమిషాల తర్వాత అల్యూమినియం ఫాయిల్ తొలగించి ఐస్‌క్రీమ్‌ని కప్పుల్లో వేసి సర్వ్ చేయాలి. వెనీలా ఐస్ క్రీమ్ కావలసినవి: కండెన్స్డ్ మిల్క్ -400 గ్రా; చిక్కటి మీగడ – 200 గ్రా; వెనీలా ఎక్స్ట్రాక్ట్ - 2 టీ స్పూన్లు. తయారీ: ఐస్‌క్రీమ్ తయారు చేయడానికి ముందు రోజు రాత్రి మీగడను ఫ్రీజర్‌లో పెట్టాలి. అలాగే ఒక ఖాళీ పాత్రను కూడా ఫ్రిజ్‌లో పెట్టి చల్లబరచాలి. కనీసం పది లేదా పన్నెండు గంటలసేపు ఉంచాలి. ∙ఫ్రిజ్‌లో నుంచి తీసిన తరవాత మీగడను ఫ్రిజ్‌లో చల్లబరిచిన పాత్రలో వేసి ఏడు లేదా ఎనిమిది నిమిషాల సేపు చిలకాలి. చిలికేటప్పుడు మొదట మెల్లగా చిలుకుతూ క్రమంగా వేగం పెంచాలి. ఆ తరవాత అందులో కండెన్స్డ్ మిల్క్ వేసి మెల్లగా చిలకాలి. ఈ మిశ్రమాన్ని ఒక ట్రేలో పోసి సమంగా సర్ది అల్యూమినియం ఫాయిల్ పేపర్ అమర్చి అంచులకు క్లిప్ పెట్టాలి. పేపర్ ఐస్ క్రీమ్ మిశ్రమంలోకి జారి పోకుండా ఈ ఏర్పాటు. ఈ ట్రేని పన్నెండు గంటల సేపు ఫ్రీజర్‌లో ఉంచాలి. ఫ్రీజర్‌లో నుంచి బయటకు తీసిన తర్వాత ఐదారు నిమిషాల సేపు కదిలించకూడదు. ఆ తర్వాత ట్రే మీద కవర్ చేసిన అల్యూమినియం ఫాయిల్‌ని తొలగించి ఐస్‌క్రీమ్‌ని పెద్ద స్పూన్‌తో తీసి కప్పుల్లో వేసి సర్వ్ చేయాలి. ఈ ఐస్ క్రీమ్ కోసం స్టవ్ వెలిగించే పనే లేదు. కావలసిన వస్తువులన్నీ రెడీమేడ్‌గా దొరికేవే కాబట్టి పిల్లలు కూడా పెద్దవాళ్ల సహాయం లేకుండా సొంతంగా చేసుకోవచ్చు. -
ఫ్రిజ్‌లో పెట్టిన కర్రీ తింటే డేంజరా?
రిఫ్రిజ్‌రేటర్లు వచ్చిన తర్వాత నుంచి వేస్ట్ అంటూ ఏమి ఉంచకుండా ప్రతీదీ దాంట్లోకే తోసేస్తున్నాం. ప్రతీ కూర మూడు నుంచి వారం రోజులకు పైనే ఫ్రిజ్‌లో పెట్టుకుని తింటున్నాం. ఇలానే తమిళనాడుకు చెందిన చిన్నారి ఫ్రిజ్‌లో పెట్టిన చికెన్ కర్రీ తిని మృతి చెందింది. ఆమె కుటుంబసభ్యులు కొద్ది పాటి అనారోగ్యానికి గురయ్యారు. ఇంతకీ ఫ్రీజ్‌లో పెట్టిన కూరలు తినొచ్చా? ఎన్ని రోజుల వరకు ఉంచి తింటే మంచిది? తమిళనాడులోని అరియలూరుకి చెందిన గోవిందరాజులు అనిర్బసి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. వాళ్లు కోడిమాంసం తెచ్చుకుని వండుకుని తినగా మిగిలింది ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు తిన్నారు. అంతే ఇంటిల్లపాది ఆస్పత్రి పాలయ్యారు. కానీ చిన్న కుమార్తె పరిస్థితి విషమించి మృతి చెందింది. ఫుడ్ పాయిజ్ కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఇంతకీ వాళ్లు సరిగా నిల్వ చేయలేదా? మరేదైనా అనేది తెలియాల్సి ఉంది. ఇలా అందరం సర్వసాధారణంగా చేస్తాం. కానీ పలు సందర్భాల్లో ఇలాంటి దిగ్భ్రాంతికర ఘటనలు తలెత్తుతున్నాయి. అసలు ఇంతకీ ఫ్రిజ్‌లో ఎలా నిల్వచేయొచ్చు. ఎన్ని రోజుల వరకు ఏ కూర అయినా ఉంచొచ్చు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందాం!. కూరల్లో సాధారణంగా టమాట, కొబ్బరి, మసాలా దినుసులు జోడించి ఎక్కువసేపు ఉడికిస్తాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అయితే మనకు నిల్వ ఉండాలనుకుంటే తక్కువ సేపట్లోనే ఉడికిపోయేలా వండుకోవాలి. ముఖ్యంగా నాన్‌వెజ్‌కి సంబంధించిన బటర్ చికెన్, వంటివి ఎక్కువసేపు మంటపై వండకూడదు. తక్కువ టైంలోనే వండేసి, ప్రిజ్‌లో పెట్టాలనుకున్న దాన్ని వేరుగా గాలి చొరబడిన బాక్స్‌లో వేసి ఫ్రిజలో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పైగా రుచి పాడవ్వదు. అలాగే కూర వండిన రెండు గంటల్లోపే ఫ్రిజ్‌లో నిల్వ ఉంచేలా చేస్తే మంచిది. అలాగే బట్టర్ చికెన్ వంటి కూరలు వండటానికి ముందే చికెన్‌ని మసాల, కారం పొడులతో చక్కగా మారినేట్ చేసుకుని ఫ్రిజ్ నాలుగు నుంచి ఐదు గంటలు ఉంచి వండుకోండి. అదికూడా జస్ట్ 30 నిమిషాలకు మించి ఉడకనివ్వకండి. అలాగే మటన్ వంటి కొన్ని రకాల నాన్‌వెజ్‌లు ఉడకటానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అలాంటి వాటిని ప్రెజర్ కుక్కర్ వంటి వాటిల్లో వండుకోండి. త్వరితగతిన ఉడికిపోతాయి. పైగా ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. అలాగే ఫ్రిజ్‌లో పెట్టాలనుకున్న కర్రీలను మంచి టైట్ బాక్స్‌లో ఉంచి పెట్టడం మంచిది. అలాగే ఫ్రిజ్‌ని కూడా ఎప్పటికప్పుడూ నీటిగా క్లీన్ చేసి ఉంచుకుంటే ఎలాంటి బ్యాక్టీరియాలు దరిచేరవు. ఫుడ్ పాయిజన్లు అవ్వడం జరగదు. ఏదైనా గానీ నిల్వ చేసుకోవాలనుకుంటే మాత్రం చల్లటి నీళ్లు పడకుండా ముందుగా వేరొక పాత్రలో తీసుకుని వెంటనే ఫ్రిజ్‌లో పెట్టేయండి. అంతేగానీ ఇష్టం వచ్చినట్లు కర్రీలో గరిటలు పెట్టి వాడేసి, ఆ తర్వాత మిగిలింది కదా అని ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. ఆ తర్వాత రెండు మూడు రోజలుకు గానీ ఆ విషయం గుర్తుకు రాదు. అప్పటికే అది పాడైపోయి ఉంటుంది. ఇక పడేయ్యడం ఇష్టం లేక తిని ఆస్పత్రి పాలవ్వుతారు. దయచేసి ఇలాంటి పనులు అస్సలు చేయకండి. వంటకు సంబంధించిన విషయాల్లో కాస్త జాగురకతతో వ్యవహరించండి. (చదవండి: నలభైలో కూడా 20లా కనిపించాలంటే..! ఇలా చేయండి!) -
నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి!
మన ఇంట్లో ఎక్కువగా వాడే నిమ్మపండు లాంటి సిట్రస్ జాతి పళ్లను ఎక్కువ రోజులు తాజగా ఉంచడం కాస్త సమస్యగా ఉంటుంది. అలాగే పాయాసం, లేదా కిచిడీలో డేకరేషన్కి లేదా రుచి కోసం ఉపయోగించే సగ్గుబియ్యం లాంటివి హడావిగా ఆఫీస్‌కి వెళ్లేటప్పడూ వీటిని ఉపయోగించలేక ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే వాడటానికి ముందు ఆ సగ్గబియ్యాన్ని కొంచెంసేపు నీటిలో నాననివ్వాల్సి ఉంటుంది. బిజీబీజీ లేఫ్లో ఇలాంటి వాటి ఎన్నింటికో మంచి ఇంటి చిట్కాలు ఉన్నాయి వెంటనే ఫాలోకండి సత్వరమే ఆ ఇబ్బంది నుంచి బయటపడండి. సులువుగా వండేసుకోండి, కూరగాయాలు కూడా మంచిగా నిల్వ చేసుకోండి. ఈజీ చిట్కాలు శుభ్రంగా కడిగి తుడిచిన నిమ్మకాయలకు కొద్దిగా నూనె రాసి టిష్యూపేపర్ వేసిన బాక్స్‌లో పెట్టి రిఫ్రిజిరేటర్లో పెడితే ఎక్కువ రోజులపాటు తాజాగా ఉంటాయి. గ్లాసు నీళ్లలో కొద్దిగా వెనిగర్ వేసి టూత్‌బ్రష్‌లను నానబెట్టాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే టూత్‌బ్రష్‌లు శుభ్రపడతాయి. సగ్గుబియ్యం చక్కగా నానిన తరువాత నీటిని వడగట్టి ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసి రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. ఇవి నాలుగైదు రోజులపాటు తాజాగా ఉంటాయి. అప్పటికప్పుడు సగ్గుబియ్యం నానపెట్టుకోకుండా ఇలా నిల్వచేసిన సగ్గుబియ్యాన్ని తీసుకుని వెంటనే కిచిడి, పాయసం, ఇడ్లీ, దోశల్లోకి వాడుకోవచ్చు. (చదవండి: ప్లాస్టిక్ మంచిదికాదని స్టీల్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారా?) -
టమాటాలు ఫ్రిజ్‌లో పెడుతున్నారా? హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు!
సాధారణంగా టమాటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఫ్రిజ్‌లో పెడితే కనీసం ఓ వారం అయినా వాడుకోవచ్చు. అందులో అయితే కనీసం నాలుగురోజుల వరకు పాడవ్వకుండా కాపాడుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఇలా ఫ్రిజ్‌లో పెట్టడం అస్సలు మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో పెట్టొదని హెచ్చరిస్తున్నారు కూడా. ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఏం జరుగుతుందో దాని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో సవివరంగా వెల్లడించారు. ఎందుకు పెట్టకూడదంటే.. ఫ్రిజ్‌లో పెడితే టమాటాలు ముందుగా వాటికుండే సహజసిద్ధమైన రుచిని కోల్పోతాయని చెబతున్నారు పరిశోధకులు. 39 డిగ్రీల చల్లటి ఉష్టోగ్రతలో ఉన్న టమాటాల్లో వాటికి సహజంగా ఉండే వాసన ఎలా కోల్పోతుంది పరిశోధనలో వెల్లడైంది. ఒకటి రెండు రోజులు ఫ్రిజ్‌లో ఉంటే పర్లేదు గానీ చాలా రోజులు ఫ్రిజ్‌లో ఉంటే మాత్రం టమాటకు ఉన్న సహజ లక్షణం కోల్పోతుందని చెప్పారు. అలాగే దాని డీఎన్ఏ మిథైల్ సంశ్లేషణలో మార్పులు వస్తాయని అన్నారు. మిథైలేషన్ అనేది మిథైల్ సమూహంగా పిలిచే అణువుల సమూహం. జీవి డీఎన్ఏకి అనుగుణంగా పనితీరును మార్చే ప్రక్రియ ఇది కీలకం. జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో మిథైలేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సక్రమంగా లేకపోతే అసాధారణ వ్యాధుల వచ్చేందుకు దారితీస్తుంది. ఎప్పడైతే సుదీర్థకాలం రిఫ్రిజిరేటర్లో టమోటాలు ఉంచుతామో వాటి లోపల ఉన్న జెల్లీ విరిగిపోతుంది. దీని కారణంగా ఇది మృదువుగా మారుతుంది. ఒకరకంగా చెప్పాలంటే లోపలంతా జ్యూసీగా అయిపోతుంది. దీన్ని ఆహారంగా తీసుకోవడం అంత మంచిది కాదు. టమాటాలు పండినప్పడు ఇథిలిన్‌ను విడుదల చేస్తాయి. ఐతే ఫ్రిజ్‌లోని చల్లదనం కారణంగా టమాటాల్లో ఇథిలిన్ ఉత్పత్తిని నిలిచిపోతుంది.. దీంతో టమాటాలు రుచిని కోల్పోయి పుల్లగా మారిపోతాయి. అందువల్ల వాటిని ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడమే మంచిది. టమాటాలు పండినప్పుడు ఇథిలిన్‌ను విడుదల చేస్తాయి. ఐతే రిఫ్రిజిరేటర్లోని చల్లదనం ఈ ఇథిలీన్ ఉత్పత్తిని నిలిపేస్తుంది. ఇది టమోటాలు రుచిని కోల్పోవడానికి లేదా పుల్లగా మారడానికి కారణమవుతుంది. కాబట్టి టమోటాలు ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడమే మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సుదీర్ఘకాలం ఫ్రిజ్‌లో ఉన్న టమాటాలు విషంతో సమానమని వాడకపోవడమే మంచిదని చెబుతున్నారు. కాగా, తాము ప్రస్తుతం చల్లదనంలో కూడా టమాటాలు రుచిని కోలపోకుండా ఉండేలా పలు పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు. (చదవండి: టైప్ 2 డయాబెటిస్ ఎందుకొస్తుందో కనిపెట్టిన శాస్త్రవేత్తలు! శాశ్వతంగా ఈ వ్యాధికి చెక్‌పెట్టేలా..) -
బెడ్ రూమ్‌లోని ఫ్రిజ్ ప్రాణాంతకమా? నిపుణులు ఏమంటున్నారు?
కొందరు అర్ధరాత్రి సమయంలోనూ ఆహారం తినాలని అనుకుంటారు. అలాంటివారు రిఫ్రిజిరేటర్‌ను పడకగదికి సమీపంలో ఉంచడానికి ఇష్టపడతారు. మరికొందరు బెడ్రూమ్లోనే ఫ్రిజ్ పెట్టుకుంటారు. బెడ్రూమ్లో ఫ్రిజ్‌ని పెట్టుకున్న వారి లిస్ట్‌లో మీరు కూడా ఉంటే ఈ వార్త మీకోసమే. బెడ్రూమ్లో ఫ్రిజ్ ఉంచడం అత్యంత ప్రమాదకరమని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పడకగదిలో రిఫ్రిజిరేటర్ ఉంచడం సురక్షితం కాదనడానికి పూర్తి స్థాయిలో శాస్త్రీయ ఆధారాలు లభించకపోయినా, ప్రమాదం పొంచివుండవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఫ్రిజ్ నుండి వెలువడే రేడియేషన్ గురించి చాలామంది ఆందోళన చెందుతుంటారు. వాస్తవానికి దీని నుంచి వచ్చే రేడియేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే రిఫ్రిజిరేటర్లోని గ్యాస్ కంప్రెసర్లోనే ఉంటుంది. అందువల్ల అది లీకయ్యే ఛాన్స్ ఉండదని నిపుణులు చెబుతున్నారు. రిఫ్రిజిరేటర్ పాడైపోయినప్పుడు ఈ రేడియేషన్‌లో కొంత గదిలోకి లీక్ అయ్యే అవకాశం ఉంది. మరో ఆందోళన కలిగించే అశం ఏమంటే రిఫ్రిజిరేటర్ అగ్ని ప్రమాదాలకు తావిస్తుందని చాలామంది అంటారు. అయితే ఇందుకు చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. కొత్త మోడళ్ల ఫ్రిజ్‌లలో అనేక భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. రిఫ్రిజిరేటర్ అదనపు వేడిని కలిగిస్తుంది. ఫ్రిజ్ నుండి వచ్చే వేడి పడకగది ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఫ్రిజ్‌ని బెడ్రూమ్లో ఉంచాలని నిర్ణయించుకుంటే, దాని నుంచి వచ్చేవేడిని బయటకు పంపడానికి దానిని కిటికీ దగ్గర ఉంచాలి. ఆహారాన్ని చల్లగా, తాజాగా ఉంచడానికి రిఫ్రిజిరేటర్ రోజంతా పని చేస్తుంది. కాగా ఫ్రీయాన్ వాయువు ద్రవ రూపంలోకి మారి లీక్ అయితే పలు వ్యాధులకు కలిస్తుంది. అయితే ఇది చాలా అరుదుగా జరుతుంది. దీనిని పీల్చినట్లయితే, ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే రిఫ్రిజిరేటర్‌ను ఎప్పటికప్పుడు సాంకేతిక నిపుణులతో చెక్ చేయించాలి. ఇది కూడా చదవండి: వీధి కుక్కలను చంపడం తప్పుకాదని గాంధీ ఎందుకన్నారు? -
చాక్లెట్ కోసమని ఫ్రిడ్జ్ తెరిస్తే.. షాక్‌తో చిన్నారి మృతి
నందిపేట్ (ఆర్మూర్): తల్లిదండ్రులతో కలిసి షాపింగ్ మాల్‌కు వెళ్లిన చిన్నారి.. చాక్లెట్ కోసమని ఫ్రిడ్జ్‌ని తెరిచే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో జరిగింది. నవీపేట మండల కేంద్రానికి చెందిన గూడూర్ రాజశేఖర్ భార్య, కూతురు రిషిత (4)తో కలిసి నందిపేటలో ఉండే అత్తగారింటికి ఆదివారం వచ్చాడు. సోమవారం ఉదయం వారు తిరిగి స్వగ్రామానికి వెళ్తూ.. నందిపేటలోని ఎన్ మార్ట్ షాపింగ్ మాల్‌లోకి సరుకులు కొనేందుకు వెళ్లారు. రాజశేఖర్ వస్తువులు తీసుకుంటుండగా పక్కనే ఐస్‌క్రీంలు ఉన్న ఫ్రిడ్జ్‌ని తెరిచేందుకు రిషిత ప్రయత్నించింది. ఫ్రిడ్జ్‌కి కరెంట్ సరఫరా కావడంతో చిన్నారి విద్యుదాఘాతానికి గురైంది. ఫ్రిడ్జికి అలాగే అంటుకుని కొన్ని సెకన్లపాటు వేలాడింది. గమనించిన తండ్రి పాపను తీసుకుని స్థానిక ఆస్పత్రికి, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే పాప మృతి చెందింది. చిన్నారి మృతదేహంతో రాస్తారోకో..: షాపింగ్‌మాల్ యజమానుల నిర్లక్ష్యం వల్లే రిషిత మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో మాల్ ఎదురుగా రోడ్డుపై నాలుగు గంటలపాటు రాస్తారోకో చేశారు. వీరికి స్థానికులు మద్దతు తెలుపడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాహుల్, తహసీల్దార్ ఆనంద్‌కుమార్ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, మాల్ యజమానులపై కేసులు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. -
మిగిలిపోయిన అన్నాన్ని మళ్లీమళ్లీ వేడి చేసి తింటున్నారా? క్యాన్సర్ వస్తుంది
ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని పదే పదే వేడి చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు మొత్తం నశిస్తాయి. ఇది క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు పాటించాలి. ఎలాంటి ఆహారాలు వేడి చేసి తినడం వల్ల నష్టం ఏమిటో తెలుసుకుందాం. ►చాలామంది నాన్ వెజ్ ఫుడ్‌ని ఫ్రిజ్‌లో స్టోర్ చేసి తర్వాత వేడి చేసి తింటూ ఉంటారు. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ► చాలామంది రాత్రి మిగిలిన అన్నాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఉదయం వేడి చేసి తింటారు. అలాగని ఉదయం మిగిలిన దానిని రాత్రికి వేడి చేసి తినడం మంచిదనుకోకండి. అది కూడా మంచి పద్ధతి కాదు. కొన్ని నివేదికల ప్రకారం అన్నాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే ఫుడ్ పాయిజన్ జరుగుతుందని తేలింది. ► గుడ్లని ఆమ్లెట్ వేసుకొని, ఉడకబెట్టుకొని తింటారు. కొన్నిసార్లు వీటితో కూరలు కూడా వండుతారు. గుడ్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే గుడ్లు వండిన వెంటనే తినడం మంచిది. ఫ్రిజ్‌లో పెట్టి వేడి చేసిన తర్వాత తినకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ► మైక్రోవేవ్ ఓవెన్లో కాఫీని మళ్లీ వేడి చేయడం దాదాపుగా అందరూ చేస్తుంటారు. ఈ విషయం తెలిస్తే ఆ పని అస్సలు చేయరు. ఎందుకంటే కాఫీ చల్లబడినప్పుడు ఆమ్లంగా మారుతుంది. ఇది గ్యాస్ సమస్యలకు దారి తీస్తుంది. దానికంటే కాఫీని థర్మో-ఫ్లాస్క్‌లో నిల్వ చేయండి. నచ్చినప్పుడు సిప్ చేయండి. ► చికెన్‌ని రోండోసారి ఉడికిస్తే అందులో మాంసకృత్తులు నశిస్తాయి. ► పుట్టగొడుగులను వండిన వెంటనే తినాలి. ఎక్కువసేపు నిల్వ ఉంచడం, రీహీట్ చేయడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల ప్రొటీన్లు విచ్ఛిన్నమై జీర్ణసంబంధిత సమస్యలు, ఇతరత్రా అనారోగ్యాలకు దారితీయొచ్చు. ► చేపలను మళ్లీమళ్లీ వేడి చేయడం వల్ల దాని మృదుత్వం మొత్తం పోయి పొడిగా మారుతుంది. ► ఆకుపచ్చ కూరగాయలు ఆకుపచ్చ కూరగాయలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో నైట్రేట్ కూడా ఉంటుంది. ఇలాంటి కూరగాయలతో వండిన వంటకాలని వేడి చేసినప్పుడు అవి క్యాన్సర్ కారకాలను విడుదల చేస్తాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే ఈ తప్పు అస్సలు చేయకూడదు. -
ఫ్రిజ్‌లో ప్రతీది పెట్టేస్తున్నారా..!
రిఫ్రిజిరేటర్లో ప్రతిదీ... తోసేయకండి. సీజన్‌తో పనిలేకుండా అన్నిరకాల ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్లో పెట్టేస్తుంటారు కొందరు. అయితే అన్నింటిని రిఫ్రిజిరేటర్లో పెట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. ఐదురకాల ఆహారాలను రిఫ్రిజిరేటర్లో పెట్టాల్సిన అవసరం అసలు లేదు. అవేంటో చూడండి... ఫ్రిజ్‌లో పెట్టకూడని పదార్థాలు.. సాస్, జామ్, జెల్లీలను రిఫ్రిజిరేటర్లో పెట్టాల్సిన అవసరంలేదు. టొమాటోలను ఫ్రిడ్జ్‌లో పెట్టడడం వల్ల వాటిలోని సహజసిద్ధమైన రుచి పోతుంది. వీటిని బయట ఉంచితేనే తాజాగా.. రుచిగా ఉంటాయి. అరటి పండ్లు త్వరగా పండిపోతాయని రిఫ్రిజిరేటర్లో పెడుతుంటారు. ఇది మంచిది కాదు. అరటిపండ్లను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితేనే మంచిది మీరు తులసి లేదా రోజ్మేరీని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే, అవి త్వరగా ఎండిపోతాయి. మీరు ఈ మూలికలను ఒక చిన్న గ్లాసులో కొద్దిగా గది-ఉష్ణోగ్రత నీటిలో ఉంచవచ్చు. లేదా వంటగదిలో సూర్యకాంతి నుంచి దూరంగా ఉంచవచ్చు. కాఫీను, కాఫీ పౌడర్‌ను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఒకవేళ ఉంచితే.. అది దాని చుట్టూ ఉన్న ఆహార పదార్థాల రుచిని తీసేసుకుంటుంది. పుచ్చకాయలను కట్ చేయకుంటే వాటిని బయటే ఉంచాలంటున్నారు నిపుణులు. వాటిని ముక్కలు చేసిన తర్వాతనే ఫ్రిజ్‌లో నిల్వచేయవచ్చని తెలిపారు. బ్రెడ్ స్లైసులను రిఫ్రిజిరేటర్లో ఉంచితే త్వరగా పాడైపోతాయి. ..పీచ్, ప్లమ్, బ్లాక్‌బెర్రీ, ఆవకాడోలను రిఫ్రిజిరేటర్లో కంటే బయటే ఉంచాలి. (చదవండి: పచ్చసొన తినకపోతే ఏం జరుగతుందో తెలుసా?) -
నిమిషాల్లో ఐస్‌క్యూబ్స్.. జర్నీలో చక్కగా పనికొస్తుంది
ఫ్రిజ్‌లో ఐస్‌క్యూబ్స్ తయారు చేసుకోవాలంటే, కొన్ని గంటల ముందుగానే ట్రేలో నీరు నింపి, డీప్ ఫ్రీజర్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. మామూలు రిఫ్రిజిరేటర్లలో ఐస్ తయారవడానికి ఆరు నుంచి పన్నెండు గంటల సమయం పడుతుంది. అయితే, ఈ ఫ్రిజ్‌లో ఐస్‌క్యూబ్స్ నిమిషాల్లోనే తయారవుతాయి. ఇళ్లల్లో వాడుకునే ఫ్రిజ్‌లను ఎక్కడికంటే అక్కడకు తీసుకుపోలేం. ఈ ఫ్రిజ్నైతే ఎక్కడికైనా ఈజీగా తీసుకుపోవచ్చు. ఇది పోర్టబుల్ ఫ్రిజ్. సాధారణ ఫ్రిజ్‌ల కంటే చాలా తేలిక కూడా. కాస్త పెద్ద సూట్‌కేసు సైజులో ఉండే ఈ ఫ్రిజ్‌కు చక్రాలు కూడా ఉంటాయి. కాబట్టి మోత బరువు లేకుండానే దీనిని కోరుకున్న చోటుకు తేలికగా తరలించవచ్చు. ఇందులోని ట్రేలో నీరు నింపేసి పెడితే, కేవలం పన్నెండు నిమిషాల్లోనే పద్దెనిమిది ఐస్‌క్యూబ్స్ తయారవుతాయి. ఇందులో నీళ్లు, పాలు, కూల్‌డ్రింక్స్, కూరగాయలు, పండ్లు వంటివి భద్రపరచుకునేందుకు కూడా వీలవుతుంది. ఇది పూర్తిగా సోలార్ చార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్‌చేస్తే, ఇరవై నాలుగు గంటల వరకు నిరాటంకంగా పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా దీనిలోని అడ్జస్ట్మెంట్స్ను ఎక్కడి నుంచైనా మార్చుకోవచ్చు. అమెరికాకు చెందిన ‘ఎకో ఫ్లో’ కంపెనీ ఈ అత్యాధునిక పోర్టబుల్ రిఫ్రిజిరేటర్‌ను రూపొందించింది. దీని ధర 899 డాలర్లు (రూ.73,402) మాత్రమే! -
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చేస్తే తాజాగా ఉంటుంది
రుచిగా, వేగంగా వంట చేయాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి... ♦కూర ఏదైనా రుచికోసం అల్లం వెల్లుల్లి పేస్టుని వాడుతుంటాం. ఈ పేస్టుని రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసినప్పటికీ కొన్నిసార్లు రంగు మారి, ఎండిపోయినట్లు అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్టుని నిల్వచేసేముందు కొద్దిగా నూనె కలిపి పెడితే మరిన్ని రోజులు తాజాగా ఉంటుంది. అల్లం, వెల్లుల్లి పేస్టులను విడివిడిగా నిల్వచేసినా నూనె కలుపుకోవడం మంచిది. ♦ మిగిలిపోయిన ఆహార పదార్థాలు, మసాలాలు, ఇడ్లీ దోశపిండిలతో రిఫ్రిజిరేటర్ నిండిపోతుంటుంది. దీంతో తలుపు తీసినప్పుడల్లా అదొక రకమైన వాసన వస్తుంటుంది. కాటన్ బాల్‌ను వెనీలా ఎసెన్స్‌లో ముంచి, రిఫ్రిజిరేటర్లో ఒక మూలన ఉంచితే దుర్వాసన పోతుంది. ♦ మిగిలిపోయిన దోశ, ఇడ్లీ్ల పిండి, గారెల పిండి వంటివాటిని రిఫ్రిజిరేటర్లో పెట్టినా, కొన్నిరోజులకే ఎండిపోవడమో, బాగా పులిసిపోవడమో జరుగుతుంది. అందువల్ల మిగిలిపోయిన పిండిలో రెండు మూడు ఎండు మిరపకాయలు వేసి రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. -
ఎంత దారుణం! పుట్టిన పసిపిల్లలని ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టి.. కొన్నాళ్ల తర్వాత
పిల్లలంటే ఇష్టపడని వారుండరు. అయితే వివాహం తర్వాత కొంత మంది దంపతులకు సంతానం కలగడం ఆలస్యం కావడంతో డాక్టర్లు చుట్టూ తిరుగుతుంటారు. ఈ క్రమంలో కొందరికి పిల్లలు పుడితే.. మరికొందరి ప్రయత్నాలు విఫలమై దత్తత లాంటివి వాటితో పిల్లలను పెంచుకుంటూ ఉంటారు. ఏది ఏమైన పెళ్లైన దంపతులకు పిల్లలు లేకపోతే వారి పడే మనోవేదన వర్ణణాతీతమనే చెప్పాలి. అలాంటిది ఓ తల్లి మాత్రం తనకు పుట్టిన పిల్లలను కిరాతకంగా చంపేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దారుణ ఘటన దక్షణి కొరియా సిరియా పరిధిలోని సువాల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సువాన్ సిటీకి చెందిన ఓ మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత 2018లో ఓ పాపకు జన్మనివ్వగా.. ఆ పసికందుని చంపి ఫ్రిజ్‌లో పెట్టింది. 2019లో మరో పాప పుట్టినప్పుడు కూడా అంతే కఠినంగా వ్యవహరించింది. ఈ విషయాన్ని ఎవరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఆసుపత్రిలో ప్రసవాలు జరిగిన దాఖలాలు ఉండగా ఆమె తన పిల్లల పేర్లు నమోదు చేయకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగడంతో.. తొలుత ఆమె పోలీసుల విచారణకు సహకరించలేదు. ఫ్రిజ్‌లో రెండు మృతదేహాలు లభ్యం కాగా చివరికి తన పసిపిల్లలను చంపినట్లు ఆ మహిళ అంగీకరించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అలా చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఆ మహిళ మాటలను విన్న ఆమె భర్త, అధికారులు, పోలీసులు అంతా షాక్ గురయ్యారు. ఈ హత్యల గురించి తనకు తెలియదని మహిళ భర్త తెలిపాడు. తన భార్య తనకు రెండుసార్లు అబార్షన్లు చేయించుకున్నట్లు చెప్పిందని అతను చెప్పాడు. చివరికి పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. 2022లో ఇలాంటి కేసులో, జియోంగ్గి ప్రావిన్స్‌లో చనిపోయిన తమ శిశువు మృతదేహాన్ని మూడు సంవత్సరాల పాటు కంటైనర్‌లో దాచిపెట్టినందుకు దక్షిణ కొరియాలోని ఒక జంటను పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: మిడిల్‌క్లాస్ భర్త.. రేయింబవళ్లు కష్టపడి భార్యని చదివిస్తే.. జాబ్ వచ్చాక మరొకడితో -
ఎంతసేపు ఫ్రిజ్‌లో ఉంచినా మద్యం గడ్డకట్టదు.. ఎందుకంటే?
ఈ రోజుల్లో చాలామందికి మద్యం అలవాటు ఉంది. మద్యాన్ని చాలామంది చల్లగా తాగేందుకు లేదా, ఐస్ ముక్కలు వేసుకుని తాగేందుకు ఇష్టపడుతుంటారు. అయితే మద్యాన్ని ఫ్రిజ్‌లో ఎంతసేపు ఉంచినా అది ఎందుకు గడ్డకట్టదో మీకు తెలుసా? దీనికి వెనుకనున్న కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంగతి తెలుసుకునేముందు ఏ ద్రవ పదార్థమైనా ఏ విదంగా గడ్డ కడుతుందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ లిక్విడ్లోనూ దాని అంతర్గత ఉష్ణోగ్రత ఉంటుంది. అది దాని వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అది ఉన్న వాతావరణంలోని ఉష్ణోగ్రత తగ్గితే దానిలోని అణువులు ఒకదానికొకటి మరింత దగ్గరవుతాయి. ఫలితంగా ద్రవ పదార్థం గడ్డకట్టే స్థితికి చేరుకుంటుంది. ద్రవ పదార్థం గడ్డకట్టడమనేది వివిధ కారణాలపై ఆధారపడివుంటుంది. మద్యంలో ఉండే ఆర్గానిక్ మాలిక్యూల్స్ దానిని గడ్డకట్టనీయకుండా చేస్తాయి. ద్రవపదార్థం గడ్డకట్టడం అనేది దాని ఘనీభవనస్థానంపై ఆధారపడి ఉంటుంది. ప్రతీ పదార్థానికి దాని ఘనీభవన స్థానం వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు నీటినే తీసుకుంటే అది జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఘనీభవిస్తుంది. అంటే నీటి ఘనీభవన స్థానం జీరో డిగ్రీ సెంటీగ్రేడ్. మద్యం విషయానికొస్తే దాని ఘనీభవన స్థానం 114 డిగ్రీ సెంటీగ్రేడ్. ఈ కారణం చేతనే మద్యం గడ్డ కట్టాలంటే 114 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. మన ఇళ్లలో ఉండో ఫ్రిజ్‌లలో 0 నుంచి -10 లేదా అత్యధిక ఉష్ణోగ్రత -30 డిగ్రీ సెంటీగ్రేడ్‌గా ఉంటుంది. అందుకే మద్యాన్ని ఇంటిలోని ఫ్రిజ్‌లో ఎంతసేపు ఉంచినా గడ్డకట్టదు. ఇది కూడా చదవండి: తొలి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్‌కు 56 ఏళ్లు.. ఆరోజు జరిగిందిదే.. -
వెంట వచ్చే రిఫ్రిజిరేటర్.. మొబైల్ ఫోన్లోనే కంట్రోలింగ్
సాధారణ రిఫ్రిజిరేటర్‌ను ఇంట్లో వాడుకోగలం గాని, బయటకు తీసుకుపోలేం. నడివేసవిలో దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు రిఫ్రిజిరేటర్ ఉంటే బాగుండనపిస్తుంది. పోర్టబుల్ కూల్‌డ్రింక్ చిల్లర్స్ వంటివి ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. ఇదీ చదవండి: నేను ‘మోనార్క్’ని... సెల్ఫ్‌డ్రైవింగ్ ట్రాక్టర్ తాజాగా పోర్టబుల్ మొబైల్ రిఫ్రిజిరేటర్‌ను అమెరికన్ బహుళజాతి సంస్థ ఏంకర్ అందుబాటులోకి తెచ్చింది. ‘ఎవర్ఫ్రాస్ట్ పవర్డ్ కూలర్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసిన ఈ మొబైల్ రిఫ్రిజిరేటర్ రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఇది 33 లీటర్లు, 43 లీటర్లు, 53 లీటర్ల పరిమాణాల్లో దొరుకుతుంది. ఇందులో మంచినీళ్లు, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్, పండ్లు, కూరగాయలు వంటివి పెట్టుకోవచ్చు. మొబైల్ ఫోన్లో దీని యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, యాప్ ద్వారా ఇందులోని ఉష్ణోగ్రతను కోరుకున్న రీతిలో నియంత్రించుకునే వెసులుబాటు కూడా ఉంది. దీని ప్రారంభ ధర 1464 డాలర్లు (సుమారు రూ.1.21 లక్షలు) మాత్రమే! -
మోడల్ హత్య..చంపి, ఫ్రిజ్‌లో కాళ్లను దాచి..
ఇటీవలకాలంలో కోపంతో లేదా మరేదైనా ఇతర కారణాలతోనూ హత్యలు చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా వారిలోంచి వికృతమైన సైకో బయటకు వచ్చి.. బాధితుల కుటుంబసభ్యులు కడసారిచూపు దక్కనివ్వకుండా చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు వరుసుగా చోటు చేసుకోవడం బాధకరం. అచ్చం అలాంటి దారుణ ఘటనే హాంకాంగ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. హాంకాంగ్‌లోని అబ్బి చోయి అనే 28 ఏళ్ల మోడల్ హత్యకు గురైంది. ఆమె కాళ్లను నగరశివార్లలోని ఒక ఇంట్లోని రిఫ్రిజిరేటర్లో గుర్తించారు పోలీసులు. ఆ ప్రాంతంలోని మృతదేహాన్ని కోసేందుకు వినియోగించే ఎలక్ట్రిక్ రంపాన్ని కూడా కనుగొన్నారు. ఇంకా.. ఆమె శరీరంలోని మొండెం, తల, చేతులు గుర్తించాల్సి ఉంది. ఇటీవలే ఎల్ అఫియల్ మొనాకో ఫ్యాషన్ మ్యాగజైన్ డిజిటల్ కవర్‌పై ఆమె ఫోటోలు ప్రచురితమయ్యాయి. ఈ కేసుకి సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి శరీర భాగాల కోసం గాలిస్తుండగా... స్థానిక మ్యాగజైన్లో ఆమె ఫోటోలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు హాంకాంగ్ పోలీసులు మాట్లాడుతూ..ఈ హత్యకు సంబంధించి ఆమె మాజీ భర్తను, బావా, అతని సోదరుడు, అత్తగారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ మోడల్ చోయి మంగళవారం నుంచి కనిపించకుండా పోయిందని, చివరిసారిగా తాయ్ పీఓ జిల్లాలో కనిపించిందని తెలిపారు. ఆమె శరీర భాగాలను ఆ జిల్లాలోని గ్రామంలోనే గుర్తించారు. మిగతా భాగాల కోసం డ్రోన్ల తోహా అధికారుల బృందం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు. ఐతే ఈ హత్యకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది. (చదవండి: పాక్, చైనాలకు సాయం కట్ చేస్తా.. అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు రావాలి) -
స్వరభాస్కర్ పెళ్లిపై సాధ్వి ప్రాచి వివాదాస్పద వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి స్వర భాస్కర్.. సమాజ్‌వాదీ పార్టీ నేత ఫాహద్ అహ్మద్‌ను పెళ్లి చేసుకోవడంపై పలువురు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) నేత సాధ్వి ప్రాచి వీరి వివాహంపై తీవ్రంగా స్పందించారు. శ్రద్ధ వాకర్‌కు పట్టిన గతే స్వర భాస్కర్‌కు పడుతుందని హెచ్చరించారు. బాహుశా పెళ్లికి ముందు స్వర భాస్కర్ ఒక్కసారైనా ఫ్రిడ్జ్‌ను చూడాల్సిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'శ్రద్ధవాకర్‌ను ఆమె ప్రియుడే 35 ముక్కలుగా నరికి ఫ్రిడ్జిలో దాచిన వార్తను స్వర భాస్కర్ ఎక్కువగా పట్టించుకోనట్లు ఉంది. పెళ్లి చేసుకోవాలనే పెద్ధ నిర్ణయం తీసుకునే ముందు స్వరభాస్కర్ ఒక్కసారైనా ఫ్రిడ్జ్‌ను చూడాల్సింది. ఇది ఆమె వ్యక్తిగత నిర్ణయం. నేనేమీ ఎక్కువగా చెప్పలేను. కానీ శ్రద్ధ వాకర్‌కు ఏం జరిగిందో స్వర భాస్కర్‌కు కూడా అదే జరుగుతుంది.' అని సాధ్వి ప్రాచి వ్యాఖ్యానించారు. ఫాహద్ అహ్మద్‌తో తన పెళ్లి విషయాన్ని ఫిబ్రవరి 16న ప్రకటించింది స్వరభాస్కర్. వీరి వివాహం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో అన్న అని పిలిచిన వ్యక్తిని ఎలా పెళ్లిచేసుకుంటున్నావ్ అంటూ స్వర భాస్కర్‌పై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ప్రత్యేక వివాహం చట్టం కింద వీరిద్దరూ కోర్టులో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇస్లామిక్ చట్టం ప్రకారం ఈ పెళ్లి చెల్లదని మతపెద్దలు పేర్కొన్నారు. ఢిల్లీలో శ్రద్ధవాకర్ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. తనతో సహజీవనం చేసిన అఫ్తాబ్ పూనావాలానే ఆమెను దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో దాచాడు. అనంతరం వాటిని తీసుకెళ్లి అడవిలో పడేశాడు. చదవండి: పెళ్లైన రెండో రోజే విగతజీవులైన నవ దంపతులు.. రిసెప్షన్‌కు ముందే.. -
షాక్‌లో శాస్త్రవేత్తలు.. బయటపడ్డ 5000 ఏళ్ల నాటి ఫ్రిడ్జ్.. అందులో ఏం దాచేవారో తెలుసా!
చరిత్రను వెలికితీయడంతో పాటు వాటి ఆధారాలను భద్రపరచే లక్ష్యంతో పురావస్తు శాఖ పని చేస్తుంటుంది. ఈ క్రమంలో ఒక్కోసారి వారికి ఆశ్చర్యం కలిగించే ఘటనలు ఎదురవుతుంటాయి. తాజాగా దక్షిణ ఇరాక్‌లో తవ్వకాలు జరుపుతున్న పురావస్తు శాస్త్రవేత్తల బృందానికి అటువంటి అనుభవమే ఎదురైంది. దాదాపు 5000 సంవత్సరాల నాటి రెస్టారెంట్ అవశేషాలు బయటపడ్డాయి. 5వేల ఏళ్ల నాటి ఫ్రిడ్జ్.. వివరాల్లోకి వెళితే.. సుమేరియన్ నాగరికతకు ముఖ్యమైన కేంద్రంగా పిలిచే పురాతన లగాష్ శిధిలాల మధ్య పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు ప్రారంభించారు. ఈనేపథ్యంలో ఇటీవల అక్కడ 5వేల ఏళ్ల నాటి రెస్టారెంట్‌ను కనుగొన్నారు. అందులో ఆ కాలం నాటి ఓవెన్, కొన్ని బెంచీలు, గిన్నెలు, ఇతర పాత్రలలో బయటపడ్డాయి. అన్నింటికంటే విచిత్రంగా ‘జీర్’ అనే పిలిచే మట్టి రిఫ్రిజిరేటర్ బయట పడటం శాస్త్రవేత్తలును ఆశ్చరపరిచింది. ఆ ఫ్రిజ్‌లో బీర్‌ను దాచినట్టు వారికి రుజువులు కూడా దొరికాయి. అంతేకాకుండా ఆ పురాతన బీర్ తయారు చేసే ఒక రెసిపీని కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు చెప్పారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, పిసా విశ్వవిద్యాలయ బృందాల సంయుక్త ప్రయత్నాల ఫలితంగా ఈ ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చాయి. ఈ తవ్వకాల ఆ బృందం.. డ్రోన్ ఫోటోగ్రఫీ, థర్మల్ ఇమేజింగ్, మాగ్నెటోమెట్రీ, మైక్రో-స్ట్రాటిగ్రాఫిక్ శాంప్లింగ్ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించుకున్నారు. -
Vandana Kalita: భర్త, అత్తలను ఫ్రిడ్జ్‌లో..
ఆమె నేరం చేసినట్లయితే ఆమెను కాల్చివేయండయ్యా. అలాంటి కూతురు నాకు వద్దు. వివాహేతర సంబంధంతో భర్త, అత్తలను చంపడం ఏంటయ్యా?. ఒకవేళ నిజంగా ఆమె తన భర్తను, అత్తగారిని చంపి ఉంటే నాకు ఆమెతో ఎలాంటి సంబంధం ఉండదు.. తన కన్నకూతురిని ఉద్దేశించి ఓ తండ్రి చెప్తున్న మాటలివి. గువాహతి: దేశంలో జరుగుతున్న ఒక తరహా నేరాలు-ఘోరాలపై విపరీతమైన చర్చ నడుస్తోంది. ప్రేమ.. సహజీవనం.. పెళ్లిమాటొచ్చేసరికి చంపేయడం లాంటి వరుస ఘటనలు చూస్తున్నాం. ఈ నేరాలను స్ఫూర్తిగా తీసుకుందేమో.. అసోంలో ఒకావిడ భర్త, అత్తలను ఆ కేసుల తరహాలోనే హతమార్చింది. అసోం గువాహతి సమీపంలో నూన్‌మతికి చెందిన ఓ వివాహిత.. భర్త, అత్తలను కడతేర్చి ముక్కలు చేసింది. ఆ ముక్కలను ఫ్రిడ్జ్‌లో భద్రపరిచింది. ఆపై ప్రియుడి సాయంతో వాటిని దూరంగా పడేసి వచ్చింది. దాదాపు ఆరు నెలల తర్వాత.. ఇది వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి భర్త, అత్తలు అడ్డువస్తున్నారనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందట. నిందితురాలి పేరు వందనా కలిటా. భర్త పేరు అమర్‌జ్యోతి దే. అత్త పేరు శంకరీ దే. కిందటి ఏడాది ఆగష్టు నెలలో వాళ్లను ప్రియుడు, మరొక వ్యక్తి సాయంతో చంపేసి ముక్కలు చేసింది వందన. ఆపై ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేసి.. ఫ్రిడ్జ్‌లో భద్రపరిచింది. మూడు రోజుల తర్వాత ప్రియుడి సాయంతో ఆ శరీర విడి భాగాలను 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరపుంజి(మేఘాలయా)కు తీసుకెళ్లి.. అక్కడ సోహ్రా ప్రాంతంలో వాటిని పడేసింది. తిరిగొచ్చి ప్రియుడితో కలిసి ఉంటోంది. ఏడు నెలలపాటు వాళ్ల గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. పోలీసులకు సైతం ఫిర్యాదు చేయకుండా జాగ్రత్త పడింది. తన కన్నతండ్రికి సైతం ఏం చెప్పకుండా ఉండిపోయింది. చివరికి.. దగ్గరి బంధువు ఒకరు అమర్, శంకరీల గురించి ఆరా తీయడంతో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్తూ వచ్చింది. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించగా.. వాళ్లు తమ శైలిలో విచారణ చేపట్టారు. చివరాఖరికి.. ఫిబ్రవరి 19వ తేదీన ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితురాలు వందనతో పాటు ఆమె ప్రియుడు అరుప్ డేక, అరుప్ స్నేహితుడు ధాంజిత్ డేకాలను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్తాభర్తల అదృశ్యం గురించి ఆమె(వందన) నాటకాలాడిందని, ఒకవేళ ఆమె నేరం చేసిందని రుజువైతే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాలని వందన తండ్రి పోలీసులను కోరుతున్నాడు. వివాహేతర సంబంధం తనకు భర్త, అత్తకు తెలిసిందని, వాళ్లు హెచ్చరించడంతోనే ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆమె పోలీసుల ముందు ఒప్పుకుంది. ఇదిలా ఉంటే శ్రద్ధా వాకర్ హత్య కేసు, తాజాగా నిక్కీ యాదవ్ కేసులోనూ ఫ్రిడ్జ్‌లో బాడీ విడిభాగాలు, బాడీని భద్రపర్చడం తెలిసిందే. -
Nikki Yadav: ప్రియుడు మోసగాడని తెలియక నిక్కీ..
క్రైమ్: శ్రద్ధా వాకర్ తరహాలో.. అదీ దేశరాజధానిలోనే వెలుగు చూసిన ‘ఫ్రిడ్జ్‌లో ప్రియురాలి శవం’ ఉదంతం డేటింగ్ కల్చర్‌పై మరోసారి చర్చకు దారి తీసింది. ఏళ్ల తరబడి కలిసి ఉన్న ఆమెకు.. ప్రియుడు చేసిన నమ్మక ద్రోహం తెలిశాక నిలదీసింది. అయితే తన దగ్గర సమాధానం లేకపోవడంతో.. వదిలించుకునేందుకు ఆమెను దారుణంగా హత్య చేశాడు. మంగళవారం ప్రియుడు సాహిల్ గెహ్లాట్‌కు చెందిన ఓ రెస్టారెంట్ ఫ్రిడ్జ్‌లో శవమై కనిపించింది నిక్కీ యాదవ్. ఛార్జింగ్ కేబుల్‌ను మెడకు బిగించి చంపి.. ఆపై ఆ శవాన్ని దగ్గర్లోనే ఉన్న తన కుటుంబానికి చెందిన ధాబాలోని ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టాడు సాహిల్. తన కూతురికి సాహిల్ మోసగాడు అని గుర్తించలేకపోయిందని, గుడ్డిగా ప్రేమించి ప్రాణం పొగొట్టుకుందని నిక్కీ తండ్రి విలపిస్తున్నాడు. సాహిల్‌కు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాడాయన. ఇదిలా ఉంటే.. సెక్యూరిటీ ఫుటేజ్ ద్వారా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. निक्की यादवचं हत्येच्या काही तास आधीचं CCTV आलं समोर#NikkiYadav Murder Case CCTV#SahilGehlot #SahilGahlot #Delhi pic.twitter.com/d7hJJtYfuV — Shivraj Yadav | शिवराज यादव 🇮🇳🖊️ (@shiva_shivraj) February 15, 2023 మరోవైపు నిక్కీ యాదవ్ చివరిసారిగా కనిపించిన వీడియో ఒకటి పోలీసుల ద్వారా మీడియాకు రిలీజ్ అయ్యింది. సౌత్ వెస్ట్ ఢిల్లీలోని తన ఇంట్లోకి ఆమె ప్రవేశిస్తున్న సమయంలో సీసీటీవీ ఫుటేజ్‌లో దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆ రోజు తేదీ ఫిబ్రవరి 9. ఆరోజే హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సాహిల్‌కి చాలారోజుల కిందటే.. మరో యువతితో వివాహం ఫిక్స్ అయ్యింది. ఆ విషయం నిక్కీకి తెలియకుండా జాగ్రత్తపడ్డాడు అతను. అయితే.. వివాహానికి ముందురోజు ఆమెకు ప్రియుడి చేస్తున్న మోసం తెలిసింది. దీంతో.. అతన్ని నిలదీసింది. మరో యువతిని వివాహం చేసుకుంటున్నాడని తెలియగానే.. నిక్కీ అతనితో గొడవకు దిగింది. ఇంట్లోకి వెళ్లిన నిక్కీ.. కాసేపటికే మళ్లీ బయటకు వచ్చింది. ఆపై సుమారు మూడు గంటలపాటు ఇద్దరూ కారులోనే వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. ఫోన్ ఛార్జింగ్కేబుల్ను ఆమె మెడకు బిగించి సాహిల్ హత్య చేశాడు. నిక్కీ స్వస్థలం హర్యానాలోని ఝాజ్జర్. అయితే ఆమె మాత్రం ఢిల్లీలో ఉంటోంది. మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లకు ప్రిపేర్ అవుతున్న క్రమంలోనే నిక్కీ-సాహిల్ మధ్య పరిచయం ఏర్పడింది. గత కొన్నేళ్లుగా ఇద్దరూ డేటింగ్లో ఉన్నారు. నిక్కీ కనిపించకుండా పోయిందని పొరుగింటి వాళ్లు ఫిర్యాదు చేయడంతో.. ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. విచారణలో సాహిల్ నేరాన్ని అంగీకరించినట్లు పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. -
వాలంటైన్స్‌డే రోజే ఢిల్లీలో దారుణం.. ప్రియురాలిని చంపి, ఫ్రిజ్‌లో దాచేసి..
న్యూఢిల్లీ: తనను ప్రేమించి మరో యువతిని ఎందుకు పెళ్లాడుతున్నావని నిలదీసినందుకు ప్రాణంతీశాడో దుర్మార్గుడు. చంపేసి ఊళ్లోని తన దాబాలో ఉన్న రిఫ్రిజరేటర్లో దాచాడు! రెండు, మూడు రోజుల క్రితం జరిగిన ఈ హత్యోదంతం ప్రేమికుల దినోత్సవం (ఫిబ్రవరి 14) రోజే వెలుగు చూడటం గమనార్హం. ఢిల్లీ పోలీసులు మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం నైరుతి ఢిల్లీలోని మిత్రోన్ గ్రామానికి చెందిన సాహిల్ గెహ్లాట్(24) గత కొన్ని సంవత్సరాలుగా హర్యానాకు చెందిన నిక్కీ యాదవ్ అనే యువతితో సహజీవనంలో ఉన్నాడు. 2018 జనవరిలో ఉత్తమ్ నగర్‌లోని ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వీరికి పరిచయం ఏర్పడి అది ప్రేమకు, తర్వాత సహజీవనానికి దారితీసింది. అప్పటి నుంచి సొంతూళ్లలో ఇంట్లో వాళ్లకు తెలీకుండా ఢిల్లీలో సహజీవనం చేస్తున్నారు. నిక్కీ సాహిల్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే ఇటీవల గెహ్లాట్ తల్లిదండ్రులు అతడికి వేరే అమ్మాయితో వివాహం నిశ్చయించారు. ఈ విషయం సాహిల్ ప్రియురాలికి చెప్పలేదు. అయితే ఎట్టకేలకు పెళ్లి విషయం తెలుసుకున్న నిక్కీ అతడిని నిలదీసింది. మరొకరిని పెళ్లాడితే వేరే కేసులో ఇరికిస్తానని బెదిరించింది. కాగా ఫిబ్రవరి 9వ తేదీన సాహిల్‌కు మరో అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. దీంతో నిక్కీ అతనికి ఫోన్ చేసి ఉత్తమ్ నగర్‌లోని తన ఫ్లాట్‌కు రమ్మని చెప్పింది. నిందితుడు తన కారులో బాధితురాలి ఇంటికి వెళ్లి అక్కడి నుంచి ఆమెను కారులో బయటకు తీసుకొచ్చాడు. అక్కడ కూడా పెళ్లి చేసుకోవద్దని ఆమె ఒత్తిడి చేసింది. అంతేగాక అదే ఫిబ్రవరి 9న ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లేందుకు ముందే ప్లాన్ చేసి టిక్కెట్లు బుక్ చేసుకుంది. తనతో పాటు గోవాకు రావాలని అడగ్గా.. సాహిల్ నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య అర్ధరాత్రి గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన గెహ్లాట్ కారులో మొబైల్ ఫోన్ డేటా కేబుల్‌తో అమ్మాయిని గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని కారులో తన దాబా దగ్గరకు తీసుకెళ్లాడు. దాబాలోని ఫ్రిజ్‌లో పెట్టి దానికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.. అదే రోజు(ఫిబ్రవరి 10 ఉదయం) వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. నిందితుడు గెహ్లాట్‌ను ఢిల్లీ దగ్గర్లోని కయిర్ గ్రామంలో అరెస్ట్చేశామని పోలీస్ స్పెషల్ కమిషనర్ చెప్పారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. మృతదేహం రిఫ్రిజిరేటర్ లోపల చెక్కుచెదరకుండా ఉండటం గుర్తించారు. నెమ్మదిగా కుళ్ళిపోవడం ప్రారంభించిందని, ఆమె శరీరంపై గొంతు నులిమిన గుర్తులు మాత్రమే ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితుడు కశ్మీర్ గేట్ సమీపంలో ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్య జరిగిన ప్రాంతాన్ని ఇంకా ధృవీకరించబడలేదు. -
నిమిషాల్లోనే ఐస్‌క్యూబ్స్.. అంతేనా మరెన్నో ప్రత్యేకతలు ఈ ఫ్రిజ్ సొంతం!
ఫ్రిజ్‌లో ఐస్‌క్యూబ్స్ తయారు చేసుకోవాలంటే, కొన్ని గంటల ముందుగానే ట్రేలో నీరు నింపి, డీప్ ఫ్రీజర్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. మామూలు రిఫ్రిజిరేటర్లలో ఐస్ తయారవడానికి ఆరు నుంచి పన్నెండు గంటల సమయం పడుతుంది. అయితే, ఈ ఫ్రిజ్‌లో ఐస్‌క్యూబ్స్ నిమిషాల్లోనే తయారవుతాయి. ఇళ్లల్లో వాడుకునే ఫ్రిజ్‌లను ఎక్కడికంటే అక్కడకు తీసుకుపోలేం. ఈ ఫ్రిజ్నైతే ఎక్కడికైనా ఈజీగా తీసుకుపోవచ్చు. ఇది పోర్టబుల్ ఫ్రిజ్. సాధారణ ఫ్రిజ్‌ల కంటే చాలా తేలిక కూడా. కాస్త పెద్ద సూట్‌కేసు సైజులో ఉండే ఈ ఫ్రిజ్‌కు చక్రాలు కూడా ఉంటాయి. కాబట్టి మోత బరువు లేకుండానే దీనిని కోరుకున్న చోటుకు తేలికగా తరలించవచ్చు. ఇందులోని ట్రేలో నీరు నింపేసి పెడితే, కేవలం పన్నెండు నిమిషాల్లోనే పద్దెనిమిది ఐస్‌క్యూబ్స్ తయారవుతాయి. ఇందులో నీళ్లు, పాలు, కూల్‌డ్రింక్స్, కూరగాయలు, పండ్లు వంటివి భద్రపరచుకునేందుకు కూడా వీలవుతుంది. ఇది పూర్తిగా సోలార్ చార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్‌చేస్తే, ఇరవై నాలుగు గంటల వరకు నిరాటంకంగా పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా దీనిలోని అడ్జస్ట్మెంట్స్ను ఎక్కడి నుంచైనా మార్చుకోవచ్చు. అమెరికాకు చెందిన ‘ఎకో ఫ్లో’ కంపెనీ ఈ అత్యాధునిక పోర్టబుల్ రిఫ్రిజిరేటర్‌ను రూపొందించింది. దీని ధర 899 డాలర్లు (రూ.73,402) మాత్రమే! చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మార్పులు రానున్నాయ్, నిమిషానికి 2 లక్షల టికెట్లు! -
మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా? అయితే ఈ పరికరం ఉండాల్సిందే!
బయట ఉంచినప్పటి కంటే ఫ్రిజ్‌లో ఉంచితే ఆహార పదార్థాలు, పానీయాలు మరింత ఎక్కువకాలం తాజాగా ఉంటాయని తెలిసిందే. ఫ్రిజ్‌లో కూడా కొంత పరిమితి వరకే ఇవి తాజాగా ఉంటాయి. ఫ్రిజ్‌లో ఆహార పదార్థాలు, పానీయాల తాజాదనం పరిమితిని మరింత పెంచడానికి ఒక బుల్లిసాధనం అందుబాటులోకి వచ్చింది. ఫొటోలో కనిపిస్తున్నది అదే! ‘ప్యూర్ ఎయిర్ ఫ్రిజ్ ఫుడ్ లైఫ్ ఎక్స్టెండర్’ పేరిట అమెరికాకు చెందిన ‘గ్రీన్‌టెక్ ఎన్విరాన్మెంటల్’ సంస్థ రూపొందించిన ఈ బుల్లి పరికరాన్ని ఫ్రిజ్‌లో ఉంచితే చాలు, ఫ్రిజ్‌లోని ఆహార పదార్థాలు, పానీయాలు మూడువారాల పాటు ఏమాత్రం చెడిపోకుండా నిక్షేపంగా తాజాగా ఉంటాయి. ‘ప్యూర్ ఎయిర్’ లీథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీనిని మూడు వారాలకు ఒకసారి చార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రిజ్‌లోని పదార్థాలను తాజాగా ఉంచడమే కాకుండా, ఇది ఫ్రిజ్‌లోని గాలిని శుభ్రపరుస్తుంది కూడా. ఇందులోని అయానైజేషన్, యాక్టివేటెడ్ ఆక్సిజన్ టెక్నాలజీ ఫ్రిజ్‌లో వెలువడే ఈథెలిన్ గ్యాస్‌ను ఎప్పటికప్పుడు తగ్గించేస్తుంది. ఫలితంగా ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పదార్థాలు మరింత ఎక్కువకాలం తాజాగా ఉంటాయి. ఆహార పదార్థాల వృథాను ఈ పరికరం గణనీయంగా అరికట్టగలదని దీని తయారీదారులు చెబుతున్నారు. చదవండి: Coding Contest: టెన్త్ క్లాస్ కుర్రాడికి బంపరాఫర్, భారీ ప్యాకేజ్‌తో పిలిచి ఐటీ జాబ్ ఇస్తామంటే! -
ఫ్రిజ్‌లో చేయి పెట్టేముందు జాగ్రత్త.. లేదంటే ఇలా కూడా జరగచ్చు!
శివమొగ్గ(బెంగళూరు): ఫ్రిజ్‌లో చేయి పెట్టేముందు జాగ్రత్తగా ఉండాలి. శివమొగ్గ నగరలోని సహ్యాద్రి నగర లేఔట్ మూడో క్రాస్‌లో ఉన్న ఇంట్లో ఫ్రిజ్‌లో ఓ పాము కనిపించింది. శంకర్ అనే వ్యక్తి ఇంట్లోని ఫ్రిజ్‌లో ఉల్లిగడ్డల ట్రేలో పాము ఉండడంతో స్నేక్ కిరణ్‌కు కాల్ చేశారు. కిరణ్ అక్కడికి చేరుకుని సురక్షితంగా పామును రక్షించి అడవిలో వదిలిపెట్టాడు. మరో ఘటనలో.. రైతులకు అవగాహన శిబిరం హోసూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గురువారం హోసూరు తాలూకా ఎం. కారుపల్లి గ్రామంలో జరిగిన రైతుల శిక్షణా శిబిరంలో డిప్యూటీ డైరక్టర్ రేణుక రైతులకు సూచించారు. వేసవి దుక్కి, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయ సాగుపై ఒక్క రోజు శిక్షణా శిబిరం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రైతులకు అందజేస్తున్న రాయితీలు, వేసవి దుక్కి వల్ల ఉపయోగాలను, మట్టి పరీక్షలు, కిసాన్‌కార్డు లాభాలను వివరించారు. సిబ్బంది హరీష్, మురుగేషన్, సుగుణ, మీన, యల్లప్ప పాల్గొన్నారు. చదవండి: మరో మహిళతో భార్యకు దొరికిపోయిన కేంద్ర మాజీ మంత్రి సోలంకీ -
ఫ్రిడ్జ్ అవసరం లేని ఇన్సులిన్!
సాక్షి, హైదరాబాద్: మధుమేహ నియంత్రణకు ఉపయోగించే ఇన్సులిన్ ఇంజెక్షన్లను ఫ్రిడ్జ్‌లలోనే నిల్వ చేసే పద్ధతికి ఇక స్వస్తి చెప్పవచ్చు. గది ఉష్ణోగ్రతలోనే కాదు.. మరింత ఎక్కువ వేడిని కూడా తట్టుకొని పనిచేయగల సరికొత్త ఇన్సులిన్‌ను హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), కోల్‌కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (ఐఐసీబీ) సంయుక్తంగా అభివృద్ధి చేయడం దీనికి కారణం. ఇప్పటివరకూ ఇంజెక్షన్ల రూపంలో తీసుకొనే ఇన్సులిన్‌ను కచ్చితంగా రిఫ్రిజరేటర్లలోనే నిల్వ చేయాల్సి వచ్చేది. లేదంటే కొన్ని గంటల వ్యవధిలోనే అందులో ఫిబ్రిలేషన్స్ (చిన్నచిన్న గడ్డలు కట్టడం) జరిగిపోయి అది వాడకానికి పనికిరాకుండా పోతుంది. అలాగని ఎక్కువ కాలం కూడా ఫ్రిడ్జ్‌లో ఉంచినా అది పాడైపోతుంది. ఈ కారణంగానే ఇన్సులిన్ ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇలా కాకుండా.. సాధారణ ఉష్ణోగ్రతల్లో ఉంచినా చెడిపోని ఇన్సులిన్‌ను తయారు చేయగలిగితే ఎన్నో లాభాలుంటాయి. దీనిపై దృష్టిపెట్టిన ఐఐసీటీ, ఐఐసీబీ శాస్త్రవేత్తలు... ఓ పెప్టైడ్ ద్వారా ఇన్సులిన్‌కు ఉన్న లోపాలను పరిష్కరించవచ్చునని గుర్తించారు. నాలుగు అమినోయాసిడ్లతో కూడిన ఈ పెప్టైడ్‌కు వారు ‘ఇన్సులక్’ అని పేరు పెట్టారు. ఈ పెప్టైడ్ ఇన్సులిన్ గడ్డకట్టకుండా ఉండగలదని, వేడి కారణంగా జరిగే నష్టాన్నీ అడ్డుకోగలదని ఎలుకలపై జరిపిన ప్రయోగాల ద్వారా శాస్త్రవేత్తలు నిర్ధారించుకున్నారు. అలాగే ఇన్సులక్ చేర్చడం వల్ల ఇన్సులిన్ పనితీరులో ఏ మార్పులూ కనిపించలేదు. ఇన్సులక్తో కూడిన ఇన్సులిన్‌ను సాధారణ గది ఉష్ణోగ్రతల్లోనే నెలలకొద్దీ నిల్వ చేయవచ్చని అంతర్జాతీయ జర్నల్ ‘ఐసైన్స్’లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం తెలిపింది. చదవండి: NGT: తాగునీటి కోసమే రిజర్వాయర్లు -
ఫ్రిజ్‌లో వృద్ధుడి శవం.. డబ్బుల్లేక మనవడే..
-
పక్కా ప్లాన్! అంతా క్లీన్..కానీ, ఫ్రిడ్జ్ మీద రక్తపు మరకలు
న్యూఢిల్లీ : నగరానికి చెందిన 75 ఏళ్ల కవితా గ్రోవర్ హత్య కేసులో ఫ్రిడ్జ్ మీది రక్తపు మరకలు కీలకంగా మారాయి. వాటి ఆధారంగానే పోలీసులు నిందితులను పట్టుకున్నారు. నిందితులు తను, అనిల్ ఆర్యాలు కవితా గ్రోవర్‌ను వాటర్ పైప్‌తో గొంతు బిగించి హత్య చేసిన సంగతి తెలిసిందే. హత్య అనంతరం ఆమె శరీరాన్ని కత్తితో మూడు భాగాలుగా చేశారు. వాటిని స్థానిక కాల్వలో పడేశారు. ఇంట్లో రక్తపు మరకలు లేకుండా పలుమార్లు అంతా శుభ్రం చేశారు. అయితే, మృతురాలిని ముక్కలుగా చేస్తున్నపుడు ఆమె రక్తం పక్కనే ఉన్న ప్రిడ్జ్పై పడింది. దీన్ని నిందితులు గమనించలేదు. దర్యాప్తు కోసం వచ్చిన పోలీసులకు ప్రిడ్జ్ మీది రక్తపు మరకలు దారి చూపించాయి. నిందితులను పట్టించాయి. ఒకవేళ ప్రిడ్జ్ మీద రక్తపు మరకలు లేకపోయిఉంటే నిందితులను పట్టుకోవటం చాలా కష్టం అయ్యేదని పోలీసులు చెబుతున్నారు. కేసు పూర్వాపరాలు.. అనిల్ ఆర్య, అతని భార్య తను ఆర్య ఢిల్లీలోని నజాఫ్‌నగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్ అధికారిగా పనిచేస్తున్న అనిల్, కవితా గ్రోవర్ వద్ద లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అవసరాల నిమిత్తం తీసుకున్న సొమ్మును చెల్లించమంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించేవాడు. ఈ నేపథ్యంలో మృతురాలు తన అప్పు తీర్చాలంటూ ఒత్తిడి చేయసాగింది. అది జీర్ణించుకోలేని అనిల్ దంపతులు ఆమెను ఎలాగైనా మట్టు బెట్టాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో మరోసారి డబ్బులకోసం ఒత్తిడి చేయడంతో ఆమెపై దాడి చేసి వాటర్ పైప్‌తో గొంతుకు ఉరిబిగించి హత్య చేశారు. జూన్ 30న హత్య జరగగా.. జులై 1న మృతదేహాన్ని మూడు ముక్కలుగా చేసి స్థానిక కాలువలో పడేశారు. -
విషయం తెలియడంతో భార్యపై సిద్ధిఖీ ఆగ్రహం, దాంతో
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ కార్మికనగర్‌లో టైలర్ సిద్దిఖీ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో సిద్దిఖీ భార్య రుబీనా పక్కా ప్రణాళికతో ప్రియుడు సయ్యద్ మహ్మద్ అలీచే హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డితో కలిసి వివరాలను వెల్లడించారు. కార్మికనగర్‌లో నివసించే మహ్మద్ సిద్దిఖీ అహ్మద్ (40), రుబీనా దంపతులు. సిద్దిఖీ టైలర్ పని చేస్తుంటాడు. ఈ క్రమంలో బోరబండ అక్బర్ మసీద్ ప్రాంతానికి చెందిన సయ్యద్ మహ్మద్ అలీ (22)తో రుబీనాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలియడంతో భార్యపై సిద్దిఖీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ ‘బంధానికి’ అడ్డుగా ఉన్న సిద్దిఖీని అంతమొందించేందుకు మహ్మద్ అలీ పక్కా పథకం వేశాడు. గత నెల 31న అర్ధరాత్రి ఇంటిలో ఒంటరిగా ఉన్న సిద్దిఖీ తలపై బైక్ షాక్ అబ్జర్వర్ రాడ్‌తో బలంగా బాది హత్య చేశాడు. ఈ నెల 1న మృతుడి సోదరుడు అతీక్ అహ్మద్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీలు, సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నిందితుణ్ని అదే రోజు రాత్రి అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. అడ్డు తొలగించుకోవడానికి హత్య చేసినట్లుగా అంగీకరించాడు. హత్యకు ముందు.. ఆ తర్వాత మృతుడి భార్య రుబీనాతో నిందితుడు మహ్మద్ అలీ మాట్లాడినట్లు విచారణలో తేలింది. వీరిద్దరూ కలిసే సిద్దిఖీ హత్యకు పథకం వేసినట్లు నిర్ధారించి నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
పుస్తకం చల్లగుండ
కోల్‌కతా పేరు వినగానే ప్రధానంగా రెండు విషయాలు మన మదిలో మెదులుతాయి. ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన మిష్టి దోయి అనే తీపి వంటకం, రెండవది రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు. కోల్‌కతా లో మిష్టిదోయితో పాటు బెంగాలీల రుచికరమైన పదార్థాలు అమ్మే ఓ షాప్ ముందు ఇటీవల ఠాగూరు పుస్తకాలతో పాటు మరికొన్ని పుస్తకాలున్న ఓ పాత ప్రిజ్ లాంటి అల్మరా మన చూపుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. కాళిదాస్ హర్దాస్, కుంకుమ్లు దంపతులు. కోల్‌కతాలోని పాటులీలో వీరిద్దరూ ఇటీవల స్ట్రీట్ లైబ్రరీని ప్రారంభించారు. తమ పాత ఫ్రిజ్‌ను పుస్తకాల అల్మరాగా మార్చారు. తినుబండారాలు అమ్మే షాప్ ఓనర్‌తో మాట్లాడి, ఆ షాపు బయట ఏర్పాటు చేసిన ఈ ఫ్రీ ఫ్రిజ్ బుక్ లైబ్రరీ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రజలలో పుస్తకపఠన అలవాటును పెంచడానికే ఈ ప్రయత్నం అంటున్నారు ఈ బెంగాలీ దంపతులు. ‘మేం పుస్తకాలను ఎంతగా ప్రేమిస్తున్నామో, ఆ ప్రేమను విస్తృతం చేయడం ద్వారా అంతగా సంతోషాన్ని పొందుతున్నాం’ అని చెప్పిన ఈ ఇద్దరూ షాప్ యజమానితో కలసి కోల్‌కతాలోని పాటులీలో ఉచిత వీధి గ్రంథాలయాన్ని తెరిచారు. షాప్ యజమాని తారాపోద్ కహార్ ను సంప్రదించి, అతని షాప్ ముందు ‘కొంత స్థలాన్ని పుస్తకాలు ఉంచడానికి ఉపయోగించవచ్చా’ అని అడిగారు. కహార్ వెంటనే వీరి ప్రతిపాదనను అంగీకరించాడు. దీంతో ఆ దుకాణం బయట పెద్దలు, యువకులు చదవడానికి వీలుగా పుస్తకాలతో నిండిన ఫ్రిజ్ అల్మరాను ఏర్పాటు చేశారు. సందేశాల ఫ్రిజ్ల్మరా! పాఠకులు ఉచితంగా ఒక పుస్తకాన్ని తీసుకొని ఒక నెల తర్వాత తిరిగి ఇవ్వమనే సందేశాన్ని ఫ్రిజ్‌కు పక్కన రాసి ఉంచారు. ఎవరైనా తమకు నచ్చిన, చదివిన పుస్తకాలను కూడా ఈ ఫ్రిజ్ బుక్ లైబరీ లో ఉంచచ్చు. సామాజిక మాధ్యమాల్లో ఈ బుక్ లైబ్రరీ గురించి తెలుసుకున్న ప్రజలు ఈ చొరవను ఇష్టపడ్డారు. ఇలాంటి లైబ్రరీలను మిగతా వారూ ప్రారంభించాలని, తామూ ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
భర్తను చంపి ఫ్రిజ్‌లో పెట్టి.. పుట్టింటికి వెళ్లింది
సాక్షి: హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మిక నగర్లో జరిగిన టైలర్ హత్య కేసును పోలీసులు చేధించారు. సాధిక్‌ను హత్య చేసింది భార్య రుబినా అని పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీల విషయంలోభార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తడంతో రుబినా తన భర్తను హత్య చేసింది. ఆ తర్వాత శవాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి తల్లిగారింటికి వెళ్లింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాధిక్ తొలుత అమీర్‌పేట్‌లో టైలర్ షాపు నడిపేవాడు. కానీ లాక్డౌన్ కారణంగా షాప్ మూతపడింది. ఈ క్రమంలో ఇటీవలే కూకట్పల్లి ప్రాంతంలో మరో షాప్ ఓపెన్ చేశాడు. ఇక అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. ఆ కోపంలో రుబినా భర్తను హత్య చేసింది. ఆ తర్వాత శవాన్ని ఫ్రిజ్‌లో పెట్టి పుట్టింటికి వెళ్లింది. ఈ విషయం గురించి తెలిసి కేసు నమోదు చేసిన పోలీసులు 24 గంటల వ్యవధిలోనే చేధించారు. ప్రస్తుతం రుబినాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చదవండి: స్కూటీపై వెళ్తుండగా వెంబడించి దారుణం -
జూబ్లీహిల్స్‌లో దారుణం: చంపి ఫ్రిజ్‌లో పెట్టారు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. దుండగులు ఓ వ్యక్తిని హత్య చేసి ఫ్రిజ్‌లో దాచి పెట్టారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి రహ్మత్ నగర్ డివిజన్ కార్మిక నగర్లో ఈ దారుణం వెలుగు చూసింది. మహమ్మద్ సిద్ధిక్ (35) అనే వ్యక్తి కార్మిక నగర్‌లోని ఓ భవంతిలో టైలరింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో దుండగులు సిద్ధిక్‌ని దారుణంగా హత్య చేసి అతడి ఇంటిలోని ఫ్రిజ్‌లో దాచి పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. చదవండి: జూబ్లీహిల్స్: ఇంటికి పిలిచి డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం -
మట్టికుండ.. సల్లగుండ
మియాపూర్: రోజు రోజుకూ భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉపశమనం కోసం ఎక్కువగా జనం దప్పిక తీర్చుకునేందుకు మట్టి కుండల వైపు మొగ్గు చూపుతున్నారు. అధిక సంఖ్యలో జనం ఆరోగ్యం పై శ్రద్ధ చూపుతూ సంప్రదాయ పద్ధతులను పాటిస్తున్నారు. ఇందులో భాగంగా మట్టి పాత్రలు, మట్టి కుండలలో వంటకాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో మట్టి కుండలు, మట్టి పాత్రలకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. రకరకాల డిజైన్‌న్లతో కుండలు ఆకర్షిస్తున్నాయి. టీ కప్పు నుంచి వాటర్ బాటిళ్లు, వంట పాత్రలు అందుబాటులోకి రావడంతో ఆరోగ్యానికి మేలు చేస్తోందని జనం వాటిని కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. మట్టి కుండలలో సహజంగా చల్ల బరిచే ప్రత్యేకత ఉంది. హిందూ సాంప్రదాయం ప్రకారం అధికంగా ఉగాది పండుగకు పచ్చడి చేసేందుకు కొత్త కుండలు కొనుగోలు చేస్తారు. కానీ ఇప్పుడు గత పదిహేను రోజుల నుండి ఎండలు మండిపోతుండటంతో చల్లటి నీరు తాగేందుకు ముందుగానే మట్టి కుండలను విక్రయాలు చేస్తున్నారు. చందానగర్‌లోని గంగారం గ్రామంలో మట్టి కుండలు తయారు చేసి విక్రయాలకు సిద్ధంగా ఉంచారు. మట్టి కుండలలో నీరు తాగడం వలన శరీరానికి చల్లదనం కలగడంతోపాటు ఆరోగ్య పరంగా ఎంతో మంచిదని మన పూర్వీకులు చెప్పడమే కాకుండా డాకర్లు సైతం సూచిస్తున్నారు. టీ కప్పులు, వాటర్ జగ్లు, వంట పాత్రలు, రంజన్లు, కూజాలు, వాటర్ బాటిళ్లు వాటిలో మట్టితో చేసిన వస్తువులు వివిధ రకాల సైజులతో అందుబాటులోకి వచ్చాయి. అదే విధంగా మట్టి వస్తువుల పై రంగు రంగుల చిత్రాలు చిత్రీకరించి పలు రకాల డిజైన్లలో ఆకర్షణీయంగా తయారు చేస్తూవిక్రయిస్తున్నారు. ఎక్కువగా మట్టి పాత్రలను రాజస్థాన్, గుజరాత్, కోల్కత్తా నుండి పలు రకాల డిజైన్ల పాత్రలను తీసుకొచ్చి విక్రయాలు చేస్తున్నారు. వేసవిలో ప్రత్యేకంగా ఉపయోగించే కుండలకు ట్యాప్ ఏర్పాటు చేసి అమ్ముతున్నారు. వాటికి గిరాకి ఉంది. -
ఫ్రిజ్‌లో ఎలా కూర్చున్నాడబ్బా?!
జెరూసలేం: టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది.. సృజనాత్మకత కొత్త పుంతలు తొక్కుతుంది. నోరెళ్లబెట్టే ఆశ్చర్యకరమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కోవకు చెందిన ఫోటోలు కొన్ని తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిని పోస్ట్ చేసిన వ్యక్తి సృజనాత్మకతను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు జనాలు. ఇంతకు ఆ ఫోటోల్లో ఏం ఉందో తెలియాలంటే ఇది చదవాల్సిందే.. పాలస్తీనాకు చెందిన సాయిద్ అనే యువకుడికి ప్లేన్‌గా, సాధారణంగా ఉన్న తన ఫ్రిజ్ స్క్రీన్ చూసిన ప్రతి సారి బోర్‌గా అనిపించేది. ఈ క్రమంలో ఓ రోజు సాయిద్ తన ఫ్రిజ్‌ను అందంగా మార్చాలని భావించాడు. ఇందు కోసం తనకు ఎంతో ప్రావీణ్యం ఉన్న ఫోటోషాప్‌ని ఉపయోగించుకున్నాడు. ఇక తన ప్రతిభతో అద్భుతాలను సృష్టించాడు. సాయిద్ ఎలాంటి ఫోటోలు తీశాడంటే.. సడెన్‌గా వీటిని చూసిన వారంతా.. నిజంగా అతడు ఫ్రిజ్ లోపల కూర్చాన్నాడేమో అనుకుంటారు. ఇలా తీసిన ఫోటోలని సాయిద్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే అనూహ్య రీతిలో వీటికి భారీ స్పందన వస్తోంది. ఇప్పటి వరకు ఈ ఫోటోలని 73,700 మంది రీట్వీట్ చేయగా.. 7,29,600కుపైగా లైకులు వచ్చాయి. చదవండి: ‘‘కన్నీరాగడం లేదు.. జీవితాంతం వెంటాడుతుంది’’ -
‘గాంగినా’తో ఫ్రెష్‌గా.. వాళ్లకు ఫ్రిజ్‌తో పనిలేదు
పండ్లు, కూరగాయలు వంటివి తాజాగా ఉండేలా నిల్వ చేసుకోవడానికి తప్పనిసరిగా ఫ్రిజ్ వాడుతుంటాం. అఫ్ఘానిస్తాన్‌లోని చాలా ప్రాంతాల్లో పండ్లు నిల్వ చేసుకోవడానికి ఫ్రిజ్‌లపై ఏమాత్రం ఆధారపడరు. ద్రాక్ష వంటి పండ్లను ఆరునెలల పాటు చెక్కుచెదరకుండా నిల్వ చేసుకోవడానికి వారు పురాతనమైన సంప్రదాయ పద్ధతినే నేటికీ నమ్ముకుంటున్నారు. ఎలాంటి పండ్లనైనా ఆరునెలల పాటు తాజాదనం చెక్కుచెదరకుండా నిల్వచేసే ఈ ప్రక్రియ పేరు ‘గాంగినా’. ఈ పద్ధతిలో తడి బంకమట్టితో బుట్టల్లాంటివి తయారు చేసి, వాటిలో తాజా పండ్లు ఉంచి, గాలి చొరబడే అవకాశం లేకుండా వాటిని మూసివేస్తారు. అవి పూర్తిగా ఎండిపోయే వరకు ఎండలో ఆరబెడతారు. ఎండిన బుట్టలను చీకటి గదుల్లో నిల్వ ఉంచుతారు. పండ్ల దిగుబడి లేని రుతువులో ఈ ‘గాంగినా‘ బుట్టలను తెరిచి, ఇందులోని పండ్లను వాడుకుంటారు. ‘గాంగినా’ బుట్టలను తయారు చేసేటప్పుడు వీటి అడుగు భాగాన్ని, పైమూతను రెండేసి పొరలుగా మట్టితో తయారు చేయడం వల్ల వీటిలో భద్రపరచిన పండ్లు చిరకాలం తాజాగా ఉంటాయి. వీటిలో పండ్లను నిల్వ చేసేటప్పుడు, ముందుగా అతిగా ముగ్గిన వాటిని, కుళ్లిన వాటిని వేరు చేసేస్తామని, లేకుంటే మొత్తం పండ్లు పాడైపోతాయని అబ్దుల్ మానన్ అనే రైతు చెప్పారు. -
ఫ్రిజ్‌లో సాల్మొనెల్లా సూక్ష్మజీవి!
మనమందరం రకరకాల ఆహారపదార్థాలను ఫ్రిజ్‌లో దాచుకుంటాం. ఫ్రిజ్‌లోని ఉష్ణోగ్రత చాలా చాలా తక్కువగా ఉండటం వల్ల అక్కడ సూక్ష్మజీవులు పెరగడానికి అవకాశమే లేదని అనుకుంటాం. నిజానికి అక్కడ కూడా సాల్మొనెల్లా అనే ఓ సూక్ష్మజీవి పెరగడానికి అవకాశం ఎక్కువే. సాధారణంగా మాంసాహారం నిల్వ చేసే సమయంలో ఈ సూక్ష్మజీవి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక ఆహారపదార్థంలో సాల్మొనెల్లా ఉందంటే అది ఫ్రిజ్‌లోని అన్ని రకాల ఆహారపదార్థాలనూ కలుషితం చేసే అవకాశం ఉంది. ఫలితంగా ఆయా ఆహారపదార్థాలను బాగా వేడిచేయకుండా తిన్నప్పుడు కొందరిలో నీళ్ల విరేచనాలతో పాటు డీ–హైడ్రేషన్ ముప్పు తప్పదు. అందుకే ఫ్రిజ్‌ను సైతం ఆరోగ్యకరంగా ఉండేలా ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రిజ్‌లో ఆహారపదార్థాలు దాచుకునే క్రమంలో ఫ్రిజ్ హైజీన్ కూడా అవసరమే ఇందుకోసం మనం అందులో మాంసాహారం, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు నిలువ చేసుకునే సమయంలో అవన్నీ వేర్వేరుగానూ, హానికరం కాని ప్యాకింగ్ మెటీరియల్‌తో ప్యాక్ చేసి పెట్టుకోవాలి. మాంసాహార పదార్థాల్లోనూ చికెన్, మటన్, సీఫుడ్స్ లాంటి మాంసాన్ని (రా–మీట్‌ను) దేనికదే విడివిడిగా ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒక మాంసాహారం మరో మాంసాహారంతో ఎట్టిపరిస్థితుల్లోనూ కలవకూడదు. (చదవండి: మంచి నిద్రకూ.. బ్యాక్టీరియాకు లింకు) ఫ్రిజ్‌లోంచి తీసిన ఆహార పదార్థాలను పచ్చిపచ్చిగా ఉన్నవాటిని సాధ్యమైంతగా రా–ఫుడ్ రూపంలో తినకపోవడమే మేలు. ఇక ఆకుకూరలూ, కాయగూరలను తగిన ఉష్ణోగ్రత వద్ద సరిగ్గా ఉడికాకే తినాలి. ఫ్రిజ్ నుంచి తీసిన మాంసాహారాన్ని తప్పనిసరిగా అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించేలా తప్పక జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే అత్యధిక ఉష్ణోగ్రత వద్ద సాల్మొనెల్లా లేదా ఈ–కొలై సూక్ష్మజీవులు చనిపోతాయి. మాంసాహారం తినేవారు దాన్ని సరిగ్గా ఉడికించాక (ప్రాపర్లీ కుక్డ్ ఫుడ్) మాత్రమే తినాలి. డీప్ ఫ్రీజర్ భాగంలో అర చేయి పెట్టి చూసినప్పుడు అది బాగా చల్లగా తగలాలే తప్ప... బాగా తడితడిగా చిత్తడిగా తగలకూడదు. అలా చిత్తడిగా ఉందంటే అక్కడ తగిన ఉష్ణోగ్రత నిర్వహితం (మెయింటెయిన్) కావడం లేదని అర్థం. ఫ్రిజ్‌లో తగిన చల్లదనం / ఉష్ణోగ్రత లేకపోతే దాని పనితీరు బాగాలేదని గ్రహించి, ఫ్రిజ్ రిపేర్ చేసేవారితో దాన్ని తప్పక బాగు (రిపేర్) చేయించుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ ఫ్రిజ్‌ను నెలకొకసారో లేదా రెణ్ణెల్లకొకసారో... ఇలా నిర్ణీత సమయంలో తప్పక శుభ్రం చేసుకుంటూ ఉండాలి. -
కంప్రెషర్ పేలి మహిళకు తీవ్రగాయాలు
గద్వాల క్రైం: అసెంబ్లింగ్ కూలర్ల తయారు, ఫ్రిజ్‌ల మరమ్మతు చేస్తున్న ఒకరి ఇంట్లో ప్రమాదవశాత్తు కంప్రెషర్ పేలడంతో ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన పట్టణంలోనిషేరెల్లివీధిలో గురువారం చోటుచేసుకుంది. బంధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. షెరెల్లివీధికి చెందిన బుర్రాన్‌ద్దిన్, నయూమ భార్యభర్తలు. బుర్రాన్‌ద్దిన్ ఇంటి వద్దే సొంతంగా అసెంబ్లింగ్ కూలర్లు తయారుచేయడంతోపాటు రిఫ్రిజిరేటర్లకు మరమ్మతు, ఫినాయిల్ తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నారు. అయితే మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భార్య నయూమ కూలర్‌కు పెయింట్ వేస్తున్న క్రమంలో ఓ కంప్రెషర్ ప్రమాదవశాత్తు పేలింది. దీంతో మహిళ కుడి చేయి మణికట్టు వరకు తెగిపోగా.. ముఖం సగా భాగం చీద్రమైంది. భారీ పెలుడు సంభవించడంతో కాలనీ ప్రజలు ఏం జరిగిందోనని తెలుసుకునే లోపే రక్తపు మడుగులో మహిళ పడి ఉండడం గమనించారు. దీంతో వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించి..మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భర్తపై అనుమానం.. పెబ్బేరు మండలం సూగూరుకు చెందిన బుర్రాన్‌ద్దిన్‌కు గద్వాలకు చెందిన నయూమతో గతంలో వివాహమైంది. అనంతరం గద్వాలలోనే జీవనం సాగిస్తుండగా.. భార్యభర్తల మధ్య తరచూ ఘర్షణ వాతావరణం ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే భర్త హత్య చేయాలనే ఉద్దేశంతో ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇద్దరు ఒకే చోట పనిచేస్తున్న క్రమంలో భర్తకు ఎలాంటి గాయం కాకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. ఈ సంఘటనపై నయూమ బంధువులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని విచారణ చేపడతామని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
ఔను.. ఇది కిరోసిన్ ఫ్రిడ్జ్
సాక్షి సిటీబ్యూరో: నిజాం పాలనలో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే నూతన టెక్నాలజీని నగరానికి తెప్పించేవారు. అవి హైదరాబాద్ సంస్థాన పాలకులు, నవాబులు, ధనికుల ఇళ్లలోకి చేరేవి. ఆలాంటి వాటిలో ఫ్యాన్లు, విద్యుత్ పరికరాలు, వాహనాలు, షాండ్లియార్లు వంటివి ఉన్నాయి. ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీతో పాటు ఇతర దేశాల్లో తయారయ్యే విలాస వస్తువులు మన దేశంలో తొలుత నగరానికే వచ్చేవి. ఇలాంటి వాటిలో ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు ‘కిరోసిన్ రిఫ్రిజిరేటర్’ కూడా ఉంది. కిరోసిన్ రిఫ్రిజిరేటరేంటి..! అలాంటిది కూడా ఒకటుందా..!! అని ఆశ్చర్యపోవద్దు. తొలినాళ్లలో రిఫ్రిజిరేటర్ విద్యుత్‌తో కాకుండా కిరోసిన్, నూనెతో పనిచేసేవి. ఆ నాటి ఆ రిఫ్రిజిరేటర్ ఇప్పటికీ పాతబస్తీలోని ఓ ఇంట్లో వాడుకలో ఉంది. ఈ రిఫ్రిజిరేటర్ వాడకం కూడా చాలా సులువు. అవసరాన్ని బట్టి దీపాన్ని ఎక్కువ,తక్కువగా మండిస్తే చాలు కావాల్సినంత గ్యాస్ ఉత్పత్తి అవుతంది. ఇందులో ఉంచిన పదార్థాలు అంతే తొందరగా చల్లాబడతాయి. పైగా నిర్వహణ కూడా చాలా తేలిక. ఫ్రాన్స్ నుంచి దిగుమతి కిరోసిన్ రిఫ్రిజిరేటర్‌ను ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఫెర్డినాండ్ కారే 1858లో కనుగొన్నాడు. ఫ్రిజ్ కింది భాగంలో ఓ పెట్టె ఉంది. ఇందులో కిరోసిన్ పోసి దాని కింది భాగంలోని ఓ చివర దీపం వెలిగిస్తారు. దాన్నుంచి వెలువడే వేడితో నీరు, సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మండిస్తే వెలువడే గ్యాస్ ఫ్రిజ్ వెనుక భాగంలో అమర్చిన పైపుల ద్వారా లోపలికి ప్రవేశించడంతో అందులోని పదార్థాలను చల్లగా ఉంటాయి. నగరంలోనే అరుదుగా.. నిజాం కాలంలో నగరంలోని ధనికులు ఈ రిఫ్రిజిరేటర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. 1980 వరకు పాతబస్తీలోని పలు నివాసాల్లో ఇలాంటి ఫ్రిడ్జిలు ఎక్కువగా వినియోగించే వారు. విద్యుత్ రిఫ్రిజిరేటర్లు వచ్చాక వీటి వినియోగం తగ్గింది. తమ ఇంటిలో పదేళ్ల క్రితం వరకు ఇలాంటి కిరోసిన్ ఫ్రిడ్జ్ వినియోగించారని జహీరానగర్ నివాసి ముజాహిద్ తెలిపారు. కూలింగ్ ఎక్కువ కావాలంటే దీపాన్ని పెద్దగా> మండించేవారని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. 175 ఏళ్లుగా సేవలు 19వ శతకంలో తయారైన ఈ కిరోసిన్ రిఫ్రిజిరేటర్‌ను నేను సంపాదించాను. ఆ రోజుల్లో విద్యుత్ అందుబాటులో లేని ప్రాంతాలు, మిలటరీ క్యాంపుల్లో ఆహారం నిల్వ ఉంచేందుకు వీటిని వాడేవారు. ఇప్పటికీ ఇది అద్భుతంగా పనిచేస్తోంది.– మీర్ యూసుఫ్ అలీ, జహీరానగర్ -
ఇంటిప్స్
క్యారట్ పైభాగాన్ని కోసేసి గాలి దూరని కవర్లో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి.క్యారట్ వండేటప్పుడు నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపితే రంగు ఆకర్షణీయంగా ఉంటుంది.అరటిపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నల్లని కవర్లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే వారం రోజులైనా తాజాగా ఉంటాయి. పచ్చిమిరపకాయలు తరిగిన తర్వాత వేళ్ళ మంట తగ్గాలంటే చల్లటి పాలలో కొద్దిగా చక్కెర వేసి అందులో వేళ్లను ముంచాలి. -
ఫ్రిజ్‌లో పాము
భువనేశ్వర్ : నగర వాసులు ఎక్కడ లేని కష్టాల్ని ఎదుర్కోవలసి వస్తోంది. క్రిములు, కీటకాలు, పాములు వగైరా భయంతో బిక్కు బిక్కుమంటున్నారు. మరో వైపు జబ్బులు, జ్వరాలతో మం చం పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు నగర శివారు చందకా అభయారణ్యం పరిసర ప్రాంత ఇళ్లలోకి అంతు చిక్కని క్రిమి, కీటకాలు గుంపులు గుంపులుగా చేరి వేధించాయి. అంతకు ముందు ఏసీ మెషీన్ నుంచి నాగుపాము బయటపడింది. తిరిగి ఇటువంటి సంఘటన తాజా గా వెలుగు చూసింది. స్థానిక శైల శ్రీ విహార్ ప్రాంతంలో ఒకరి ఇంటిలో పాము చొరబడి ఫ్రిజ్‌లో తలదాచుకుంది. జరజరా ఇంటిలోకి చొరబడిన పామును చూసి ఇంటిల్లపాదికి చెమటలు పట్టాయి. ఇంతలో చూస్తుండగానే పాము ఫ్రిజ్‌లోకి ప్రవేశించింది. వెనుక భాగం కంప్రెషర్ చాటున ఇరుక్కుని బుసలు కొట్టింది. ప్రాణ భయంతో కుటుంబీకులు స్నేక్ హెల్ప్ లైన్‌కు సమాచారం తక్షణమే చేరవేశారు. ఆ బృందం వచ్చి పామును బయటకు తీసేందుకు శతవిధాలా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరికి మత్తు మందు ప్రయోగించి పాము సొమ్మసిల్లేలా జేసి బయటకు లాగారు. పాము 4 అడుగుల పొడవు ఉన్నట్లు ఈ బృందం ప్రకటించింది. అనంతరం ఈ పామును నగరం శివారు అడవుల్లో విడిచి పెట్టారు. -
ఆ అనుమానంతోనే దోస్త్‌ను నరికి...
సాక్షి, న్యూఢిల్లీ : గత వారం నగరం దక్షిణ ప్రాంతంలోని సయిద్ ఉల్ అజయిబ్ ప్రాంతంలో సంచలనం రేపిన హత్య ఉదంతం మిస్టరీని పోలీసులు చేధించారు. ఓ వ్యక్తిని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టిన కేసులో అంతా అనుమానించినట్లుగానే స్నేహితుడే హంతకుడిగా తేల్చారు. పరారీలో ఉన్న అతనిని చివరకు ఒడిశాలో పట్టుకున్నట్లు దక్షిణ ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. విచారణలో ముందు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు యత్నించినప్పటికీ.. తర్వాత నిజం ఒప్పుకున్నట్లు వారు చెప్పారు. ఇక తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతోనే స్నేహితుడు విపిన్ జోషిని దారుణంగా హత మార్చినట్లు బాదల్ అంగీకరించాడు. దీంతో అతన్ని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. గార్డెన్ ఆఫ్ పైవ్ సెన్సెస్ ప్రాంతంలో ఎఫ్‌ఐవో కంట్రీ చికెన్ అండ్ బార్లో ప్రాణ స్నేహితులైన విపిన్ జోషి, బాదల్ మండల్లు పని చేసే వారు. అయితే తన భార్యతో చనువుగా ఉండటం.. తాను లేని సమయంలో కూడా విపిన్ తరచూ తన ఇంటికి వెళ్తుండటం బాదల్ గమనించాడు. దీంతో తన భార్యతో వ్యవహారం నడుపుతున్న స్నేహితుడిని మట్టుపెట్టేందుకు ప్రణాళిక వేసుకున్నాడు. అక్టోబర్ 9న తాను అద్దెకు ఉంటున్న గదిలో దావత్ ఇస్తానంటూ విపిన్‌ను ఆహ్వనించాడు. ఆపై చిత్తుగా తాగిన విపిన్‌ను అప్పటికే తెచ్చిపెట్టుకున్న మాంసం కత్తితో పొడిచి చంపేశాడు. ఆపై బాత్రూమ్లోకి లాక్కెల్లి శవాన్ని ముక్కలుగా నరికాడు. వాటిని ఫ్రిడ్జిలో దాచి.. ఏమీ ఎరుగనట్లు కోల్‌కతా పారిపోయాడు. అక్కడి నుంచి ఒడిశాలోని రూర్కెలాలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకోగా.. వారిచ్చిన సమాచారంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తీసుకొచ్చారు. -
కారు, ఫ్రిడ్జ్, ఏసీ ఉందా? అయితే వాటికి అనర్హులే!
పట్టణ ప్రాంతాల్లో ప్రతి 10 మంది గృహదారులలో ఆరుగురు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. ప్రభుత్వం అందించే ప్రజాసంక్షేమ పథకాలకు తాము అర్హులవుతామో కాదోనని... ఎందుకంటే తాజాగా ప్రభుత్వ ప్యానెల్ సమర్పించిన నివేదికల్లో నాలుగు రూముల ఇళ్లు లేదా నాలుగు కార్ల వాహనం లేదా ఎయిర్కండీషనర్ ఏదీ ఉన్న సంక్షేమ పథక ప్రయోజనాల నుంచి తొలగించాలని వెల్లడించింది. అంతేకాక రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, టూ-వీలర్స్ మూడు కలిగి ఉన్న పట్టణ ప్రాంత ప్రజలను ఆటోమేటిక్‌గా సంక్షేమ పథకాలకు అనర్హులు చేయాలని వివేక్ దేబ్రాయ్ కమిటీ ప్రతిపాదించింది. సామాజిక ఆర్థిక సర్వే చేపట్టిన ఈ కమిటీ ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచింది. నివాసిత, వృత్తిపరమైన, సామాజిక లేమి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఆటోమేటిక్‌గా పట్టణ ప్రాంత ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనకారులుగా అవకాశం కల్పించాలని కూడా ఈ కమిటీ సూచించింది. పాలిథిన్ గోడ్ లేదా రూఫ్ కలిగి ఉన్న ఇళ్ల గృహదారులు, లేదా అసలు ఇళ్లు లేని గృహదారులకు ప్రయోజనాలను అందించాలని చెప్పింది. అంతేకాక ఆదాయం లేని వారికి, కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు లేని వారికి లేదా కుటుంబానికి పెద్దగా పిల్లలే ఉంటున్న వారికి సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందించాలని పేర్కొంది. మిగతా ప్రజలు వారు, ప్రజాసంక్షేమ ప్రయోజనాలు పొందుతారో లేదో? అంచనావేసుకోవాలని పేర్కొంది. హసిమ్ ప్యానల్ ప్రతిపాదల ప్రకారం 41 శాతం పట్టణ ప్రాంత ప్రజలు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలకు అర్హులవుతారో కారో అంచనావేసుకోవాల్సి ఉండగా.. తాజాగా వివేక్ దేబ్రాయ్ కమిటీ సూచించిన ప్రతిపాదనలో 59 శాతం మంది తమ అర్హతను అంచనావేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సంబంధిత వర్గాలు చెప్పాయి. -
ఫ్రిజ్‌లోంచి ఎగసిన మంటలు
రాయదుర్గం అర్బన్: ఓ ఇంట్లోని ఫ్రిజ్‌లోంచి ఉన్నపళంగా మంటలు చెలరేగడంతో ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఇతర సామగ్రి కాలిపోయాయి. బాధితులు తెలిపిన మేరకు.. పట్టణంలోని ఐఓసీ గోదాము పక్కన హమాలీ గొల్ల గోవిందు నివాసం ఉంటున్నాడు. ఆదివారం ఉదయం 7 గంటలకు గోవిందు బజార్లోకి వెళ్లాడు. భార్య మంజుల 7.30 గంటలకు సమీపంలోని తమ టీస్టాల్కు వెళ్లింది. ఇంట్లో ఎవ్వరూ లేరు. సరిగ్గా 8.30 గంటల సమయంలో ఫ్రిజ్‌లో లోపాల వల్ల మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న టీవీ, నిత్యావసర సరుకులు, రూ.4వేల నగదు, ఒక సెల్‌ఫోన్ కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలు ఆర్పివేశారు. సిలిండర్ గనుక పేలి ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో రూ.50వేల నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. స్విచ్‌బోర్డులో షార్ట్‌సర్క్యూట్ జరిగి ఉండొచ్చని ఫైర్ ఆఫీసర్ ఖాద్రీ తెలిపారు. అయితే షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగలేదని విద్యుత్ సిబ్బంది స్పష్టం చేశారు. -
ఫ్రిజ్ తీసి..పరుగో పరుగు..
కేసముద్రం: సూర్యుడి ప్రతాపానికి మనుష్యులే విలవిలలాడుతుంటే.. ఇక సర్పాలు ఏంచేస్తాయి.. ఏంచక్కా ఫ్రిజ్ లో దూరుతాయి. అవును వేడికి తాళలేక రక్తపింజర ఫ్రిజ్‌లో దూరిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ధన్నసరిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మిర్యాల యాకయ్య ఇంట్లోని ఫ్రిజ్‌లో మంగళవారం రాత్రి రక్తపింజర పాము దూరింది. బుధవారం తెల్లవారుజామున యాకయ్య కూతురు మంచినీళ్ల కోసం ఫ్రిజ్ డోర్ తీయగా పాము కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆ బాలిక కేకలు పెడుతూ బయటకు పరుగెత్తింది.కుటుంబ సభ్యులు, చుట్టుపక్కలున్న వారంతా కలిసి వచ్చి ఆ పామును బయటకు తీసుకువచ్చి చంపేశారు. -
బనానా పుడ్డింగ్
హెల్దీ ట్రీట్ కావలసినవి: అరటి పండ్లు – 6 నీళ్లు – 3 కప్పులు పంచదార – 250 గ్రా. ఏలకుల పొడి – 2 టీ స్పూన్లు జీడిపప్పు, బాదం పప్పు – గార్నిష్‌కి కావల్సినంత తయారి: అరటిపండు పై తొక్క తీసి గుండ్రటి ముక్కలుగా కట్‌చేసి పెట్టుకోవాలి. నీళ్లను వేడి చేసి పంచదార కలిపి మరిగించాలి. పాకం చిక్కగా అయ్యాక దించి, అరటిపండు ముక్కలను వేయాలి. ఏలకుల పొడి, కొద్దిగా ఫుడ్ కలర్ వేసి కలిపాక పైన జీడిపప్పు, బాదంపప్పు వేసి చల్లారాక ఫ్రిజ్‌లో రెండు గంటలు ఉంచాలి. ఆ తర్వాత చల్లటి బనానా ఫుడ్డింగ్ని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేయాలి. ఒక కప్పు బనానా పుడ్డింగ్‌లో పోషకాలు... క్యాలరీలు : 174.2 కి. క్యా; కార్బోహైడ్రేట్లు : 22.3గ్రా, ప్రొటీన్లు – 1.74 గ్రా.; క్యాల్షియం – 22.4 మి.గ్రా.; ఐరన్ – 0.6 మి.గ్రా.; కొవ్వుపదార్థాలు – 2.56 గ్రా. -
ఫ్రిజ్‌లో దూరిన పాము
-
ఫ్రిజ్‌లో దూరిన పాము
సిరిసిల్ల/సిరిసిల్ల క్రైం: మండుతున్న ఎండలకు మనుషులే కాదు.. జంతువులకు సైతం ‘సెగ’ తగులుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సంజీవయ్యనగర్‌లో మంగళ వారం రాత్రి నాగుపాము ఫ్రిజ్‌లో దూరింది. నాలుగు అడుగుల పొడవున్న నాగుపాము రాపెల్లి రాజు ఇంట్లోని ఫ్రిజ్‌లోకి ఎలాగో దూరింది. ఎప్పటిలాగే నీళ్ల కోసం రాజు ఫ్రిజ్ తెరవగా.. అందులో నాగుపాము కనిపించడంతో కుటుంబసభ్యులంతా ఆందోళనకు గురయ్యారు. పాములు పట్టే పరశరాముకు సమాచారం ఇవ్వగా... పట్టుకొని తీసుకెళ్లాడు. -
జింజర్ ఫ్రూట్ పంచ్
సమ్మర్ డ్రింక్ కావలసినవి: అల్లం తురుము – 30గ్రా., పంచదార – అర కప్పు, ఆరెంజ్ జ్యూస్ – ఒకటిన్నర కప్పు, నిమ్మరసం – 1 టీ స్పూన్, చల్లని నీరు / క్లబ్ సోడా – 3 కప్పులు తయారి: ∙ ఒక పాత్రలో అల్లం తురుము, పంచదార, కప్పు నీరు కలిపి సన్నటి మంటపైన 15 నిమిషాల సేపు మరిగించాలి. ∙ ఈ మిశ్రమాన్ని మరో పాత్రలో పోసి చల్లబడనివ్వాలి. ∙ దీనిలో నిమ్మరసం, ఆరెంజ్ జ్యూస్ కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ∙ కావలసినప్పుడు తగినంత జ్యూస్ గ్లాస్‌లోకి తీసుకుని అందులో చల్లని నీరు లేదంటే క్లబ్ సోడా కలిపి చివరన ఐస్‌ముక్కలు వేసి సర్వ్ చేయాలి. పోషకాలు : క్యాలరీలు – 442.8 కి.క్యా, కార్బోహైడ్రేట్లు – 134.4 గ్రా., ప్రొటీన్లు – 4 గ్రా., ఫ్యాట్ – 5›గ్రా. నోట్: ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. వేసవిలో వచ్చే డీ హైడ్రేషన్ బారి నుంచి కాపాడుతుంది. -
ధర్మవరంలో అగ్ని ప్రమాదం
ధర్మవరం అర్బన్ : ధర్మవరం ఎమ్మార్సీ సమీపంలో నివసిస్తున్న పుణ్యవతి, ప్రతాప్ దంపతుల ఇంట్లో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. వ్యవసాయ పనుల నిమిత్తం ప్రతాప్ పొలానికి వెళ్లగా, పుణ్యవతి విధి నిర్వహణ కోసం చెన్నేకొత్తపల్లికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యుత్‌షార్ట్‌సర్క్యూట్ సంభవించింది. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఇంట్లోని ఫ్రిజ్, టీవీ, మిక్సి, గ్రైండర్, ట్యూబ్‌లైట్లు, వైర్లు, బియ్యం, దుస్తులు, సామగ్రి, మంచం తదితర ఇంటి సామగ్రి కాలిపోయాయి. వీఆర్ఓ రాజశేఖర్ సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు. రూ.5 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. -
ఇంటిప్స్
►బ్రెడ్ టోస్ట్ చేసేటప్పుడు వచ్చిన పొడిని, మిగిలి పోయిన బ్రెడ్‌ను పొడి చేసుకుని ఫ్రిజ్‌లో ఉంచుకుని కూర పలుచగా ఉన్నప్పుడు కలుపుకుంటే చిక్కబడుతుంది. ►మెంతికూర, పాలకూర వంటి వాటిని రెండు నిమిషాల పాటు ఉడుకుతున్న నీటిలో ఉంచి తీసి చన్నీటి ధార కింద ఉంచిన తర్వాత నీళ్లు లేకుండా పిండేసి ఫ్రీజర్‌లో ఉంచితే రెండు వారాల పాటు నిలవ ఉంటుంది. ►పెద్ద గిన్నెలో సగానికి నీళ్లు పోసి మరిగే వరకు ఓవెన్లో వేడిచేయాలి. గిన్నెను బయటకు తీసి క్లాత్‌తో ఓవెన్ అంతా తుడవాలి. తర్వాత సబ్బు కలిపిన గోరువెచ్చని నీటిలో క్లాత్ ముంచి ఓవెన్ మొత్తం శుభ్రం చేయాలి. -
స్లిమ్ కేక్స్
ఏడాదంతా బాగా తిన్నాం... ఫుల్లుగా లాగించాం... 2016లో పదహారణాల ఫ్యాట్ కుమ్మేశాం. 2017 వస్తోంది! సన్నగా, నాజూగ్గా అవ్వాలని అందరికీ ఉంది. కానీ, దానికి కేక్ అడ్డం కాకూడదు కదా! కండపట్టకుండా పిండేయండి. కేక్ బెండు తీయండి. 2017లో కేకుల కేక! స్లిమ్ కేక్... ఎంజాయ్! ఆరెంజ్ ఆల్మండ్ కేక్ కావల్సినవి: ఉప్పులేని బటర్ – 50 గ్రాములు (కరిగించాలి), ఆరెంజ్ జిస్ట్ (పై తొక్కను సన్నగా తరిగినది) – టేబుల్ స్పూన్, క్యాస్టర్ షుగర్ – కప్పు, గుడ్లు – 2, సెల్ఫ్రైజింగ్ ఫ్లోర్/గోధుమపిండి – కప్పు, గసగసాలు – 2 టేబుల్ స్పూన్లు, వెన్న తీసిన పాలు – పావు కప్పు, షుగర్ ఫ్రీ షుగర్ – తగినంత, బాదంపప్పు పలుకులు – పావు కప్పు తయారీ: ∙అవెన్ని 180 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద వేడి చేయాలి. కేక్ బేకింగ్ బౌల్ అడుగున నూనెను స్ప్రే చేసి, పైన బేకింగ్ పేపర్ పరవాలి. దీనిపైన కూడా వంటనూనెను స్ప్రే చేయాలి. ఒక గిన్నెలో బటర్, ఆరెంజ్ జిస్ట్, పంచదార, గిలక్కొట్టిన గుడ్లసొన, పిండి, గసగసాలు, పాలు పోసి బాగా కలపాలి. ∙దీంట్లో బాదంపప్పు పలుకులు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో పోసి 35–40 నిమిషాలు బేక్ చేయాలి. కేక్ బయటకు తీసి, తర్వాత ప్లేట్లోకి తీయాలి. ∙చివరగా పంచదార పొడి, వెనిలా ఎక్స్ట్రాక్ట్, పాలను కలిపి బాగా గిలక్కొట్టి, కేక్ టాప్ మీద సెట్ చేయాలి. ఆరెంజ్ ముక్కలతో అలంకరించాలి. బనానా స్లి్పట్ కేక్ కావల్సినవి: లైట్ వెనిలా స్పాంజ్ కేక్ – 1, అయిదు గుడ్డుల్లోని తెల్ల సొన, 3 గుడ్ల పసుపు సొన, సెల్ఫ్రైజింగ్ ఫ్లోర్/గోధుమపిండి – అర కప్పు, బేకింగ్ పౌడర్ – టీ స్పూన్, ఉప్పు – పావు టీ స్పూన్, వెనిలా ఎక్స్ట్రాక్ట్ – 2 టీ స్పూన్లు, పంచదార – అర కప్పు, వెన్నతీసిన పాలు – ఒకటిన్నర కప్పు, ఫ్యాట్ ఫ్రీ షుగర్ – పావు కప్పు, షుగర్ ఫ్రీ విప్డ్ క్రీమ్ – కప్పు, అరటిపండ్లు – 2 (పలచని ముక్కలుగా కట్ చేయాలి), స్ట్రాబెర్రీలు (పెద్దవి) – 4, షుగర్ ఫ్రీ చాకోలెట్ సిరప్ – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ∙ఒక గిన్నెలో గుడ్ల తెల్లసొన, పసుపుసొన వేసి బాగా గిలకొట్టాలి. బేకింగ్ పాన్‌లో నూనె స్ప్రే చేయాలి. అడుగున బేకింగ్ పేపర్ పరవాలి. ఆ పేపర్‌పై కూడా నూనె స్ప్రే చేయాలి. ∙మరొక గిన్నెలో పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి జల్లించాలి. ∙అవెన్‌ను 350 డిగ్రీల వద్ద∙ప్రీ హీట్ చేయాలి. వెనిలా, గుడ్డులోని పసుపు సొన కలిపి 5 నిమిషాలు మిక్సీలో బ్లెండ్ చేయాలి. దీంట్లో పావు కప్పు పంచదార వేసి, కరిగేంతవరకు గిలకొట్టాలి. దీంట్లో పూర్తి గుడ్ల మిశ్రమం పోసి కలపాలి. ∙బేక్ బౌల్లో స్పాంజ్ కేక్ పెట్టి, గరిటతో పాన్‌లో మీద పిండి మిశ్రమం వేయాలి. ∙గిలకొట్టిన గుడ్లసొన ఆ పిండి మీద మరో లేయర్‌గా పోయాలి. తర్వాత గిలకొట్టిన పావు కప్పు షుగర్ ఫ్రీ షుగర్ వేయాలి. దీనిని12 నిమిషాలు బేక్ చేయాలి. బయటకు తీసి వెంటనే బేకింగ్ పేపర్ చివర్లను పట్టుకొని వదులు చేయాలి. ప్లేట్లోకి తీసుకొని కట్ చేసి, ఫ్రిజ్‌లో పెట్టి, 10 నిమిషాల తర్వాత బయటకు తీసి విపింగ్ క్రీమ్ పైన రాయాలి. ∙ దీన్ని 2 గంటల సేపు ఫ్రిజ్‌లో ఉంచి తీయాలి. పేపర్‌టవల్ తీసేసి, కేక్ స్లైసులుగా కట్ చేయాలి. తర్వాత సన్నగా కట్ చేసిన అరటిపండు ముక్కలను, స్ట్రా బెర్రీల స్లైసులను, షుగర్ ఫ్రీ చాకోలెట్ సిరప్‌తో అలంకరించాలి. ఛీజ్ చెర్రీ కేక్ కావల్సినవి: క్యారమెల్ కుకీస్ – 250 గ్రాములు, బటర్ – 40 గ్రాములు (కరిగించాలి), లైట్ క్రీమ్ ఛీజ్ (మెత్తనిది) – 250 గ్రాములు, ఫ్యాట్లేని రికోటా ఛీజ్ – 400 గ్రాములు, వెనిలా యోగర్ట్ – 200 గ్రాములు గుడ్లు – 2, వెనిలా ఎక్స్ట్రాక్ట్ – టీ స్పూన్, సిరప్ చెర్రీ – 670 గ్రాములు, ఆరెంజ్ జిస్ట్ – 2 టీ స్పూన్లు, ఆరెంజ్ జ్యూస్ – 1/4 కప్పు, లెమన్ జిస్ట్ – 2 టీ స్పూన్లు, నిమ్మరసం – పావు కప్పు తయారీ: ∙అవెన్‌ను 170 సెంటీగ్రేడ్ల వద్ద వేడిచేయాలి. పాన్ వేడి 150 డిగ్రీల వద్ద ఉండాలి. ∙కుకీస్‌ను మిక్సీలో వేసి పొడి చేయాలి. దీన్ని పాన్ అడుగున బేకింగ్ పేపర్‌పైన చల్లాలి. ∙ఒక గిన్నెలో క్రీమ్ ఛీజ్, రికొట్టా, యోగర్ట్, గుడ్లు, వెనిలా వేసి కలపాలి. 30–35 నిమిషాలు బేక్ చేయాలి. చల్లారిన తర్వాత 4 గంటలు, లేదా రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. ∙చెర్రీ సిరప్, ఆరెంజ్ రిండ్, ఆరెంజ్ జ్యూస్, లెమన్ రిండ్, లెమన్ జ్యూస్ సాస్పాన్లో వేసి, మరిగించాలి. సిమ్‌లో మరో 6 నిమిషాలు ఉంచాలి. దీంట్లో చెర్రీస్ వేసి దించాలి. వేడి తగ్గాక ఛీజ్ కేక్ బయటకు తీసి, పైన అలంకరించాలి. ప్రెజర్ కుకర్ కేక్... అవెన్ లేకుండా ప్రెజర్ కుకర్లోనూ కేక్ తయారు చేసుకోవచ్చు. కుకర్ అడుగున కేజీ ఉప్పు లేదా ఇసుక పోయాలి. దీని పైన ఒక కుకర్ బాటమ్ ప్లేట్ ఉంచాలి. మంట పూర్తిగా తగ్గించి, కుకర్ని వేడి చేయాలి. కుకర్‌లో చిన్న స్టాండ్ పెట్టి, సులువుగా పట్టేటంత మరొక గిన్నె తీసుకొని కేక్మిశ్రమం పోయాలి. కేక్మిశ్రమం ఉన్న గిన్నెను కుకర్‌లో జాగ్రత్తగా ఉంచాలి. పైన వెయిట్ పెట్టకుండా కుకర్మూత ఉంచాలి. (వెయిట్ పెడితే కుకర్ పేలే ప్రమాదం ఉంటుంది.) సన్నని మంట మీద 30–35 నిమిషాలు కేక్‌ను బేక్ చేసి, మంట తీసేయాలి. కుకర్ వేడి పూర్తిగా తగ్గేవంత వరకు ఉంచి, కేక్ గిన్నెను బయటకు తీయాలి. తర్వాత నచ్చిన విధంగా అలంకరించుకోవాలి. పియర్ లేయర్ కేక్ కావల్సినవి: గుడ్ల తెల్ల సొన – కప్పు + అర కప్పు, వెనిలా ఎక్స్ట్రాక్ట్ – టీ స్పూన్, షుగర్ ఫ్రీ షుగర్ – కప్పు + 2 టేబుల్ స్పూన్లు, షుగర్‌లెస్ వెనిలా ఆల్మండ్ మిల్క్ – ముప్పావు కప్పు – 2 టేబుల్ స్పూన్లు, పియర్ పండు గుజ్జు – ముప్పావు కప్పు + టేబుల్ స్పూన్, క్యారమెల్ ఫ్లేవర్ – టీ స్పూన్, కొబ్బరి పొడి – కప్పు + పావు కప్పు (పచ్చికొబ్బరిని గ్రైండ్ చేసి, పిండి, పాలు తీయాలి. ఆ పొడిని బ్లాటింగ్ పేపర్ మీద పరిచి, దాదాపు 12 గంటల పాటు ఆరబెట్టాలి. తర్వాత దీన్ని మిక్సర్‌లో వేసి పొడి చేయాలి. ), తీపి లేని ముదురు రంగు కోకా పౌడర్ – పావు కప్పు, తీపిలేని సాధారణ కోకా పౌడర్ – పావు కప్పు, మసాలా – 2 టీ స్పూన్లు (దాల్చిన చెక్క పొడి టీ స్పూన్, జాజికాయ పొడి అర టీ స్పూన్, యాలకులు+లవంగాల పొడి అర టీ స్పూన్), బేకింగ్ పౌడర్ – టీ స్పూన్, బేకింగ్ సోడా – టీ స్పూన్, కళ్ళుప్పు (పొడి చేయాలి)– అర టీ స్పూన్ క్రీమ్‌కి కావల్సినవి: కొబ్బరినూనె/వంటనూనె – టేబుల్ స్పూన్, తియ్యగా లేని వెనిలా ఆల్మండ్ మిల్క్ – ముప్పావు కప్పు, ఆర్గానిక్ స్టేవియా ఎక్స్ట్రాక్ట్ – టీ స్పూన్, క్యారమెల్ ఫ్లేవర్ – టీ స్పూన్, బటర్ ఫ్లేవర్ – పావు టీ స్పూన్, కళ్ళుప్పు (పొడి చేయాలి)– పావు టీ స్పూన్, ఆర్గానిక్ బ్రౌన్‌రైస్ పౌడర్ – 100 గ్రాములు, ఎరిత్రిటోల్ పొడి – కప్పు + 1/4 కప్పు తయారీ: ∙అవెన్‌ను 350 డిగ్రీల వద్ద ప్రీ హీట్ చేయాలి. 200 డిగ్రీల వద్ద బేకింగ్ పాన్‌ను హీట్చేయాలి. ∙ గుడ్ల సొన బాగా గిలక్కొట్టి అందులో వెనిలా ఎక్స్ట్రాక్ట్, షుగర్‌లెస్ షుగర్ పొడి, బాదం పాలు, పియర్పండు గుజ్జు, క్యారమెల్ ఫ్లేవర్ వేసి బాగా కలపాలి. ∙ కుకింగ్ పాన్ అడుగున నూనెను స్ప్రే చేయాలి. ఆ పైన బేకింగ్ పేపర్‌ను పరవాలి. అలాగే పాన్ చుట్టుపక్కల పేపర్‌ను సెట్ చేయాలి. ∙ మరొక గిన్నెలో కొబ్బరి పొడి, కోకాపౌడర్లు, మసాలా పొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి జల్లించాలి. ∙ దీంట్లో గుడ్ల మిశ్రమం వేసి బాగా కలపాలి. మిక్సీలో వేసి 20 సెకన్లపాటు బ్లెండ్ చేయాలి. ∙ ఈ మిశ్రమాన్ని పాన్‌లో గరిటెతో వేసి, పైన గరిటెతో చక్కగా సెట్ చేసి, అవెన్‌లో పెట్టాలి. 45 నిమిషాల పాటు బేక్ చేయాలి. క్రీమ్ తయారీ: ∙అవెన్‌లో ఆల్మండ్ మిల్క్ పోసి 20 సెకండ్లు వేడి చేసి, తీయాలి. దీన్ని గిలకొట్టాలి. తర్వాత ఎక్స్ట్రాక్ట్, ఉప్పు, ఎరిథ్రిటాల్ వేసి కలపాలి. దీన్ని కేక్ మీద అప్లై చేసి, ప్రిజ్‌లో పెట్టాలి. 10 నిమిషాల తర్వాత తీసి సర్వ్ చేయాలి. లైట్ చాకోలెట్ కేక్ కావల్సినవి: అన్సాల్టెడ్ బటర్ – 75 గ్రాములు, క్యాస్టర్ షుగర్ – కప్పు, గుడ్లు – 2, గోధుమ పిండి – ఒకటిన్నర కప్పు, కోకాపౌడర్ – పావు కప్పు, సోడా – అర టీ స్పూన్, వెన్నలేని పాలు – కప్పు, కోకాపౌడర్, స్ట్రాబెర్రీలు, చెర్రీలు – అలంకరణకు తయారీ: ∙అవెన్‌ను 180 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ప్రీ హీట్ చేయాలి. పాన్ తగినది ఎంచుకోవాలి. ∙మిక్సర్‌లో బటర్, షుగర్, గుడ్ల సొన, పిండి, కోకాపౌడర్, సోడా, పాలు వేసి నిమిషం సేపు బ్లెండ్ చేయాలి. ∙ఈ మిశ్రమాన్ని పాన్‌లో పోసి 45–50 నిమిషాలు బేక్ చేయాలి. చల్లారాక ప్లేట్లోకి తీసుకొని పైన కోకాపౌడర్ చల్లి, ఆ పైన చెర్రీస్తో అలంకరించి సర్వ్ చేయాలి. -
తొడిమలు తీస్తే... తాజా!
ఇంటిప్స్ ► మొదలు చివర తుంచేసి, బెండకాయలకు ఒక ప్లాస్టిక్ కవర్లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేస్తే అవి తాజాగా ఉంటాయి. ► అల్లం–వెల్లుల్లి పేస్ట్ రంగు మారకుండా ఉండాలంటే, వాటిని మిక్సీలో వేసే ముందు కొద్దిగా వేయించుకోవాలి. ఇలా చేస్తే చాలారోజుల పాటు ఆ పేస్ట్ తాజాగా ఉంటుంది. ► ఆకుకూరలు ఉడకబెట్టిన నీళ్లు పారబోయకుండా వాటిని మరో గిన్నెలోకి తీసుకొని సూప్ తయారీలో వాడుకోవచ్చు. ఇలా చేస్తే అందులోని విటమిన్స్, మినరల్స్ వృథా కావు. ►అప్పడాలు ఉంచిన డబ్బాలో కొన్ని బియ్యపు గింజలు కానీ, సెనగపప్పు కానీ వేయాలి. అలా చేస్తే అప్పడాలు మెత్తబడకుండా ఉంటాయి. -
హెల్త్‌టిప్స్
► తులసి ఆకులను గ్రైండ్ చేసి ఒక టీ స్పూన్ మిశ్రమంలో అర టీ స్పూన్ తేనె కలిపి రోజుకొకసారి తీసుకోవాలి. ప్రతిరోజూ ఇలా తీసుకుంటుంటే చర్మం నిగారిస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ దరి చేరవు. ► తులసి రసాన్ని తలకు పట్టించి తలకు టవల్ చుట్టేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం తలస్నానం చేస్తే పేలు పోతాయి. ఇలా వారానికి ఒకసారి వరుసగా ఐదారు వారాలపాటు చేస్తే సమస్య పూర్తిగా పోతుంది. ► తులసి రసం అనేక చర్మ సమస్యలను నివారిస్తుంది. ఆకులను గ్రైండ్ చేసి తెల్లటి, నల్లటి మచ్చలున్న చోట రాసి ఆరిన తర్వాత కడగాలి. ఇలా రోజుకు నాలుగు సార్లు చేస్తుంటే రెండు వారాల్లో మచ్చలన్నీ చర్మంలో కలిసి పోతాయి. ► అర కప్పు టీ ఆకులు లేదా పొడిని అరలీటరు నీటిలో వేసి మరిగించి చల్లారిన తర్వాత వడపోసి గాలి దూరని సీసాలో పోసి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. కాలినగాయాలకు, అలసిన కళ్లకు ఇది చక్కటి చికిత్స. దీనిని దూదితో కాని అలాగే కాని చర్మం మీద రాస్తే సరిపోతుంది. ఎండ నుంచి వచ్చిన వెంటనే ఒకసారి చన్నీటితో ముఖాన్ని కడిగి ఈ ద్రవాన్ని రాస్తే సాంత్వన చేకూరుతుంది. -
ఇంటిప్స్
జిగురు గట్టిపడితే అందులో కాస్త వెనిగర్ కలిపితే మామూలుగా అయిపోతుంది. గోళ్ళరంగు సీసాలను ఫ్రిజ్‌లో పెడితే గట్టిపడకుండా ఉంటాయి. స్కెచ్‌పెన్ పనిచేయకపోతే లోపల స్పాంజ్లో అయిదారు చుక్కల వేడినీళ్లు పోసి కాసేపు ఉంచాలి. ఇలా చేస్తే తిరిగి మళ్ళీ పనిచేస్తాయి. బట్టలపైన పడిన మరకలు పోవాలంటే... మరకలు పడిన చోట నిమ్మరసం వేసి తొక్కతో రుద్ది, తరువాత సబ్బుతో ఉతికితే మరకలు మాయమవుతాయి. -
అందమె ఆనందం
వెండి వస్తువులు నల్లబడకుండా ఉండాలంటే వాటిని భద్రపరిచే చోట కర్పూరం బిళ్ళలు ఉంచాలి. వరిపిండి, శనగపిండి లాంటివి కవర్లో వేసి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. పింగాణీ కప్పులకు, సాసర్లకు కాఫీ, టీ మరకలు పట్టి వదలనట్లయితే సోడాబైకార్బనేట్లో కొద్దిగా నీటిని కలిపి దానితో శుభ్రం చేయాలి. -
పోషకాలు కోల్పోకుండా...
ఫ్రిజ్‌లో లేదా షెల్ఫ్‌లలో పదార్థాలను ఒకే పాకెట్లో 3-4 రకాలవి వేసి ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఆయా పదార్థాలకున్న ప్రత్యేక వాసన, పోషకాలు కోల్పోతాయి. ⇔ పదార్థాలను కట్‌చేసేటప్పుడు, వేరు చేసేటప్పుడు గోరువెచ్చని నీటితో తప్పనిసరిగా చేతులను శుభ్రం చేసుకోవాలి. ⇔ కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, మాంసాహారాన్ని శుభ్రపరిచేటప్పుడు గోరువెచ్చని ఉప్పు నీటిని ఉపయోగించాలి. ⇔ కటింగ్ బోర్డులు, గిన్నెలు ఉపయోగించడానికి ముందు, తర్వాత తప్పనిసరిగా సబ్బు నీటితో శుభ్రపరచాలి. నీచు వాసన రాకుండా ఉండటానికి ఘాటువాసనలు లేని బ్లీచ్‌ని ఉపయోగించవచ్చు. ⇔ వంటగదిలో వంటపాత్రలు, స్టౌ, ఉపయోగించే ఇతర పరికరాలు సురక్షితమైనవే ఎంచుకోవాలి. ⇔ రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన మాంసపదార్థాలు గానీ, కూరగాయలు గానీ 30 నిమిషాల లోపు వండేయాలి. ⇔ మిగిలిపోయిన పదార్థాలను రెండు గంటలకన్నా మించి బయట ఉంచకూడదు. ఫ్రిజ్‌లో అయితే ఒక రోజులోనే వాటిని పూర్తి చేయాలి. -
నెయ్యి రాస్తే... సాయంత్రానికీ నిల్వ!
• క్యాబేజీ వండేటప్పుడు కాసిన్ని సోంపు గింజలు వేస్తే పచ్చి వాసన రాకుండా ఉంటుంది. • బెండకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే... రెండు వైపులా తొడిమలు కోసేసి, పాలిథీన్ కవర్లో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. • మసాలా గ్రైండ్ చేసిన తర్వాత మిక్సీ జార్ అదే వాసన వస్తూ ఉంటే... కొన్ని బ్రెడ్ ముక్కలు కానీ రస్కులు కానీ వేసి రెండు నిమిషాలు గ్రైండ్ చేస్తే సరి. • టీ మరిగించే పాత్రలు నల్లబడిపోతుంటాయి. అవి మళ్లీ తళతళలాడాలంటే ఉప్పుతో రుద్ది కడగాలి. • కేక్ కట్ చేసే ముందు చాకుని వేడి నీటిలో ముంచి తీసి, బట్టతో తుడిచి అప్పుడు కోస్తే... కేక్ అందంగా తెగుతుంది. • చపాతీలు సాయంత్రం వరకూ ఎండిపోకుండా మెత్తగానే ఉండాలంటే... వాటికి కొద్దిగా నెయ్యి రాసి, పాలిథీన్ కవర్లో పెట్టి ఉంచాలి. -
కృష్ణప్రియం
కన్నయ్య వెన్నదొంగ. కన్ను పడిందా... కుండ వణికిందే! ఉట్టికెగిరి ఓ పట్టు పట్టేస్తాడు... యశోదమ్మకు పట్టుబడేస్తాడు.. అంతిష్టం.. వెన్నముద్దంటే..! ట్వంటీ ఫిఫ్త్న ఆయన బర్త్‌డే. కేకుల్లోని వెన్న... కిట్టయ్యకు ఏ మూలకు చెప్పండి? బాగా... వెన్నపూసను దట్టించి... వెరైటీగా... నైవేద్యాలు సమర్పించండి. చుట్టుపక్కల చిన్నారి కృష్ణయ్యలకు, కృష్ణమ్మలకు తిన్నంత వెన్న పంచిపెట్టండి. వందే కృష్ణప్రియం. అక్కరవడిసాల్ కావలసినవి: బియ్యం- అర కప్పు పెసరపప్పు- ఒక కప్పు; చక్కెర- ఒక కప్పు వెన్న తీసిన పాలు- 3 కప్పులు (ఫుల్ క్రీమ్ మిల్క్ కూడా వాడవచ్చు) వెన్న తీయని పాలు - అర కప్పు కుంకుమ పువ్వు- నాలుగు రేకలు బాదం, జీడిపప్పు పలుకులు- టేబుల్ స్పూన్ వెన్న- ఒక కప్పు తయారీ: బియ్యం, పెసర పప్పు కలిపి మందపాటి పెనంలో వేసి సన్న మంట మీద వేయించాలి. మంచి వాసన వచ్చే వరకు వేయించి దించేయాలి. చల్లారిన తర్వాత శుభ్రంగా కడిగి అందులో మూడున్నర కప్పుల పాలు పోసి ఆ గిన్నెను ప్రెషర్‌కుకర్‌లో పెట్టి ఉడికించాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత మంట తగ్గించి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఈ లోపు... అరకప్పు మీగడ పాలను మరిగించి కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచాలి. పెనంలో రెండు స్పూన్ల వెన్న వేసి జీడిపప్పు, బాదం పలుకులను వేయించి పక్కన పెట్టుకోవాలి. కుకర్‌లో ఉడికించిన అన్నం, పప్పు మిశ్రమాన్ని గరిటతో మెదపాలి. ఇప్పుడు వెడల్పాటి పెనంలో వెన్న వేసి కరిగిన తర్వాత అన్నం, పప్పు మిశ్రమం వేసి అందులో చక్కెర కలపాలి. చక్కెర కరిగినప్పుడు అన్నం గరిటె జారుడుగా అవుతుంది. అడుగు పట్టకుండా కలుపుతూ దగ్గరయ్యే వరకు ఉడికించాలి. చివరగా కుంకుమ పువ్వు పాలను పోసి కలిపి, వేయించిన జీడిపప్పు, బాదం పలుకులతో గార్నిష్ చేయాలి. గమనిక: ప్రెషర్ కుకర్‌లో నీటిని పోసి అందులో అన్నం, పప్పు ఉన్న పాత్రను పెట్టి ఉడికించాలి. ఈ పాత్ర చిన్నదైతే ఉడికేటప్పుడు పాలు ఒలికిపోతాయి. కాబట్టి పాత్ర సగం ఖాళీగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడు మిశ్రమం ఉడికిన తర్వాత కూడా పాత్రలో ముప్పావుకు మించదు. అవల్ పట్టు కావలసినవి: అటుకులు (అవల్) - ఒక కప్పు బెల్లం- అర కప్పు కొబ్బరి తురుము- రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు- పదిపలుకులు (వెన్నతో వేయించాలి) ఏలకుల పొడి- పావు టీ స్పూన్ వెన్న - అర కప్పు నీరు- అరకప్పు (బెల్లం కరగడానికి) తయారీ: ఖాళీ పెనంలో అటుకులను దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పలుకుగా గ్రైండ్ చేయాలి. కొద్దిగా నీటిని కలిపి (తడిపొడిగా ఉండేటట్లు) పక్కన ఉంచాలి. బెల్లంలో నీటిని కలిపి కరిగిన తర్వాత వడపోయాలి. ఆ నీటిని మందపాటి పాత్రలో పోసి తీగ పాకం వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఏలకుల పొడి, అటుకుల పొడి వేసి కలిపి కలపాలి. మరీ పొడిగా అనిపిస్తే కొద్దిగా నీటిని చల్లి కలిపి మూత పెట్టి మిశ్రమాన్ని వేడెక్కనివ్వాలి. చివరగా కొబ్బరి తురుము, జీడిపప్పు వేసి కలపాలి. వేడిగా వడ్డించేటప్పుడు పైన కొద్దిగా వెన్న ముద్ద పెట్టవచ్చు. అది సాధ్యం కాదనుకుంటే దించినప్పుడే పైన వెన్న వేసి కలపాలి. కేసర్ శ్రీఖండ్ కావలసినవి: పెరుగు - ఒక లీటరు చక్కెర లేదా బెల్లం - వంద గ్రాములు వేడి పాలు - ఒక టేబుల్ స్పూన్ కుంకుమ పువ్వు- పది రేకలు ఏలకుల పొడి- ఒక టీ స్పూన్ జాజికాయ పొడి- అర టీ స్పూన్ బాదం, పిస్తా పలుకులు- ఒక టేబుల్ స్పూన్ తయారీ: పెరుగును పలుచని తెల్లటి వస్త్రంలో వేసి మూట గట్టి ఐదు గంటల సేపు వేలాడ దీయాలి. ఇలా చేయడం వల్ల అదనంగా ఉన్న నీరంతా కారిపోతుంది. ఈ లోపు పాలలో కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచాలి. పెరుగులో చక్కెర, కుంకుమ పువ్వు పాలు, ఏలకుల పొడి, జాజికాయ పొడి కలపాలి. చివరగా బాదం, పిస్తాతో అలంకరించాలి. ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడిన తర్వాత సర్వ్ చేయాలి. ఇష్టమైతే పన్నీరు ఒక టీ స్పూన్ కలుపుకోవచ్చు. బెల్లం వేసేటట్లయితే కరిగించి వడపోసి కొద్దిగా ఉడికించి చల్లారిన తర్వాత కలపాలి. గమనిక: శ్రీఖండ్ తయారీకి వాడే పెరుగు తయారీ కూడా చాలా ముఖ్యం. పాలను ఎర్రగా కాచి చల్లార్చి పెరుగు చేయాలి. గోపాల్‌కాలా కావలసినవి: బియ్యం- 250 గ్రా తాజా కొబ్బరి తురుము - ఒక కాయది అల్లం- అంగుళం ముక్క (సన్నగా తరగాలి) చిక్కటి పెరుగు - 50 గ్రా; వెన్న- అర కప్పు పచ్చిమిర్చి- రెండు (సన్నగా తరగాలి) కీరదోస - 100 గ్రా(చిన్న పలుకులుగా తరగాలి) జీలకర్ర- ఒక టీ స్పూన్; ఉప్పు- తగినంత క్యారట్- ఒకటి(పలుకులుగా తరగాలి) కొత్తిమీర- చిన్న కట్ట; చక్కెర- అర టీ స్పూన్ తయారీ: బియ్యాన్ని కడిగి అరలీటరు నీటిని పోసి పావుగంట సేపు నానపెట్టాలి. ఒక పాత్రలో వెన్న, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వేసి మగ్గిన తర్వాత బియ్యం (నీటితో పాటు) వేసి కలపాలి. అందులో క్యారట్ ముక్కలు, ఉప్పు, కీరదోస, చక్కెర, పెరుగు, కొబ్బరి తురుము వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. దించిన తర్వాత కొత్తిమీరతో అలంకరించాలి. పాతబియ్యం అయితే నీటి మోతాదు పెంచుకోవాలి. ఉప్పు సీదై కావలసినవి: బియ్యప్పిండి - ఒక కప్పు (రెడీమేడ్‌గా పిండి లేకపోతే ఒకటిన్నర కప్పు బియ్యాన్ని కడిగి రెండు గంటల సేపు నానబెట్టి వడపోసి, తడి పోయే వరకు మందపాటి టవల్ మీద ఆరబెట్టి మిక్సీలో పొడి చేసి జల్లించాలి) మినప్పప్పు- 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి తురుము- 2 టేబుల్ స్పూన్లు వెన్న - ఒక కప్పు నువ్వులు- ఒక టేబుల్ స్పూన్ ఉప్పు- తగినంత నూనె - వేయించడానికి సరిపడినంత తయారీ: మందపాటి పెనంలో మినప్పప్పును దోరగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేయాలి. బియ్యప్పిండి, మినప్పిండిని కలిపి జల్లించాలి. ఈ పిండిలో ఉప్పు, వెన్న, నువ్వులు, కొబ్బరి పొడి వేసి కలపాలి. ఇప్పుడు తగినంత నీటిని వేస్తూ ముద్ద చేయాలి. బాణలిలో నూనె పోసి కాగేలోపు పిండి మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలి. నూనెలో కొద్దిగా పిండి వేసిన వెంటనే అది పైకి తేలితే నూనె కాగినట్లు. అప్పుడు ఉండలను వేసి చిల్లుల గరిటెతో కలియతిప్పుతూ బంగారు రంగులోకి వచ్చిన తర్వాత తీసేయాలి. ఇవి కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. చల్లారిన తర్వాత గాలి దూరని డబ్బాలో నిల్వ చేస్తే రెండు వారాల వరకు తాజాగా ఉంటాయి. గమనిక: ఉండలు బఠాణి గింజల కంటే కొంచెం పెద్దవిగా ఉండాలి. మరీ పెద్దవయితే లోపల సరిగా కాలవు. అలాగే మీడియం ఫ్లేమ్ మీద వేయించాలి. మంట ఎక్కువైతే లోపల పచ్చిగా ఉండగానే పైన నల్లగా అవుతాయి. వెన్న ఉండలు మరింత మృదువుగా కావాలనుకుంటే బియ్యప్పిండిలో మైదా కూడా కలుపుకోవచ్చు. ఆరోగ్యం కోసం మైదాను మినహాయించడమే మంచిది. వెన్నఉండలు కావలసినవి: బియ్యప్పిండి- ఒక కప్పు చక్కెర- ఒక కప్పు; వెన్న - నాలుగు కప్పులు తయారీ: బియ్యప్పిండిలో ఒక కప్పు వెన్న వేసి కలపాలి. అందులో వేడినీటిని పోస్తూ ముద్దగా చేయాలి. దాని మీద తడి వస్త్రాన్ని కప్పి గంట సేపు ఉంచాలి. ఒక పాత్రలో చక్కెర, కప్పు నీటిని పోసి మరిగించి సిరప్ తయారైన తర్వాత మంట తీసేయాలి. ఇప్పుడు బాణలిలో మూడు కప్పుల వెన్న వేసి కాగేలోపు బియ్యప్పిండి మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలి. వెన్న కాగిన తర్వాత ఉండలను వేసి కలియబెడుతూ ఎర్రగా కాలిన తర్వాత తీసి చక్కెర పాకంలో వేయాలి. -
పండ్లు పాడవకుండా...
ఇంటిప్స్ మూడు కప్పుల నీళ్లలో ఓ కప్పు వెనిగర్ వేసి కలపాలి. స్ట్రాబెర్రీస్, గ్రేప్స్ లాంటి పండ్లని ఈ నీటితో కడిగి, బట్టతో తుడిచి, ఆపైన మూత గట్టిగా ఉండే డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో ఉంచితే... కొన్ని వారాల పాటు పాడవకుండా ఉంటాయి.దుమ్ము కారణంగా కారు హెడ్‌లైట్స్ మీది అద్దాలు డల్‌గా అయిపోతే... ముందుగా టూత్‌పేస్ట్‌తో రుద్ది, ఆపైన మెత్తని బట్టతో తుడిచెయ్యాలి. అద్దాలు కొత్తవిలా మెరుస్తాయి. కార్పెట్‌కి బబుల్గమ్ అతుక్కుపోతే... ఓ ఐస్‌ముక్క తీసుకుని, గమ్ మీద బాగా రుద్దండి. కాసేపటికి ఊడి వచ్చేస్తుంది.చెక్క గరిటెలకు నూనె జిడ్డు అంటుకుని వదలకపోతే... వాటిమీద కాస్త టేబుల్ సాల్ట్ చల్లి, టిష్యూ పేపర్‌తో తుడవాలి. -
ఫ్రిజ్‌లో కాఫీ కాచుకోండి!
ఒకప్పుడు ఎవరింట్లోనైనా ఫ్రిజ్ ఉందంటే... వారిని అందరూ గొప్పగా చూసేవాళ్లు. తర్వాతి కాలంలో అందరింట్లోకి ఫ్రిజ్‌లు వచ్చేశాయి. దాంతో కొందరు డబుల్ డోర్లున్న ఫ్రిజ్‌లను కొనడం ప్రారంభించారు. ఆ తర్వాత కొత్త కొత్త ఫీచర్లున్న ఫ్రిజ్‌లు ప్రస్తుతం మార్కెట్లోకి బోలెడన్ని వచ్చేస్తున్నాయి. జనం కూడా వాటిలో వైవిధ్యం కోరుకుంటున్నారు. కింది ఫొటోను ఓసారి చూడండి. కాఫీ మిషన్లా కనిపిస్తుందా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. అది కాఫీ మిషన్ కాదండీ.. అసలైన రిఫ్రిజిరేటరే. ఇందులోని ఫీచర్స్ వింటే, మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే.. ఇది డ్రింక్స్‌ను కూల్ చేయడమే కాదు, వేడి వేడి కాఫీ, టీలనూ అందిస్తుంది. అంతేనా... ఇందులో వాటర్‌ను ప్యూరిఫై చేయగల ఫిల్టర్లూ ఉన్నాయి. అలాగే వైఫై కనెక్షన్‌తోనూ ఇది పనిచేస్తుంది. వీటి డోరుకు బయటివైపు ఓ ఎల్ఈడీ టచ్‌స్క్రీన్ కూడా ఉంటుంది. ఈ ఫ్రిజ్‌కు ఎలక్ట్రానిక్ టెంపరేచర్ కంట్రోల్డ్ డ్రాలు ఉంటాయి. నిజంగా ఇది స్మార్ట్ ఫ్రిజ్. -
బ్యూటిప్స్
రెండు మెత్తని అరటిపండ్లను తీసుకుని గుజ్జులా చేసుకోవాలి. ఇందులో రెండేసి చెంచాల చొప్పున తేనె, పెరుగు, ఆలివ్ నూనెల్ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అరగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచి... ఆపైన తీసి జుత్తుకి, మాడుకి పట్టించాలి. గంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకుని తలంటుకోవాలి. నెలకు రెండుసార్లయినా ఇలా చేస్తే... జుత్తు ఒత్తుగా పెరగడమే కాక కాంతులీనుతుంది. కొబ్బరిపాలు, నిమ్మరసం రెండూ జుత్తుకి మంచివే. ఈ రెండూ కలిస్తే కనుక మంచి కండిషనర్‌లా పని చేస్తాయి. జుత్తుని బలంగా చేస్తాయి. ఓ అరకప్పు కొబ్బరి పాలలో నిమ్మరసాన్ని కలిపి తలకు పట్టించి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలంటుకోవాలి. పొడి జుత్తు కలవారు వారానికి రెండుసార్లు ఇలా చేస్తే కొన్ని వారాల్లోనే డ్రైనెస్ పోయి జుత్తు పట్టులా మెరుస్తుంది. ఓ చెంచాడు సోయాబీన్ నూనెను, రెండు చెంచాల నువ్వుల నూనెను తీసుకుని బాగా కలపాలి. దీన్ని కాస్త వేడిచేసి చల్లార్చాలి. ఆపైన మాడుకు పట్టించి మసాజ్ చేసి, అరగంట తర్వాత తలంటుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే చుండ్రు బాధ తగ్గడంతో పాటు జుత్తు ఆరోగ్యంగా తయారవుతుంది. -
పాపను ఫ్రిజ్‌లో పెట్టిన తండ్రి
వాషింగ్టన్: ఒక తండ్రికి నిద్రపై ఉన్న వ్యామోహం అతని కూతురు ప్రాణాల మీదకు తెచ్చింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన విషాద ఘటన ఇది. మెలిస్సాలో నివాసముండే మైకేల్ తెడ్ఫోర్డ్ తన ఇద్దరు పిల్లల్ని డేకేర్ సెంటర్లో దింపేసి.. 6 నెలల పాపకు జ్వరం ఉన్నట్లు అనిపించడంతోఇంటికి తెచ్చాడు. ఇంటి దగ్గర కారు దిగగానే నిద్రపోవాలనే తొందరలో పాపను కారులోనే మరిచిపోయి ఇంట్లోకెళ్లి హాయిగా 4 గంటలు కునుకు తీశాడు. నిద్ర లేచిన తర్వాత పాప కారులోనే ఉందన్న విషయం గుర్తొచ్చి కారు వద్దకు వెళ్లాడు. ఆ రోజు మెలిస్సాలో ఉష్ణోగ్రత అప్పటికే 35 డిగ్రీ సెల్సియస్ ఉంది. కారులో వేడి మరింత ఎక్కువ ఉండటంతో పాప ఒళ్లు జ్వరంతో కాలిపోతోంది. పాపను చేతుల్లోకి తీసుకున్న తెడ్ఫోర్డ్, తన తెలివితక్కువ తనంతో పాపను చల్లబరచడానికని రిఫ్రిజిరేటర్లో ఉంచాడు. అలాఎంతసేపు ఉంచాడో గానీ ఫ్రిజ్ నుంచి బయటకు తీసిన తర్వాత తన భార్యకు, వైద్యులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు. అప్పటికే పాప చనిపోయి ఉంది. తెడ్ఫోర్డ్కు పిల్లలంటే ఇష్టమనీ, ఇటీవలే ఫాదర్స్‌డే వేడుకలను కూడా కుటుంబమంతా ఎంతో ఆనందంగా జరుపుకుందనీ, ఇంతలోనే ఇలా జరగడం దురదృష్టకరమని పొరుగువారు అంటున్నారు. -
ఇంటిప్స్
బిస్కెట్స్ ఉంచే డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ వేసి ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ఆకుకూరలను అల్యూమినియమ్ ఫాయిల్‌లో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచితే మూడు- నాలుగు రోజుల వరకు తాజాగా ఉంటాయి. మాడిన గిన్నెల అడుగు భాగం త్వరగా శుభ్రపడాలంటే తరిగిన ఉల్లిపాయలు, నీళ్లు పోసి 5 నిమిషాలు మరిగించాలి.చిన్న ఇంగువ ముక్క వేసి భద్రపరిస్తే కారం రంగు, రుచి తగ్గదు. కొత్తిమీర ఆకులను ఎండబెట్టి, పొడి చేసి భద్రపరుచుకుంటే పచ్చళ్లు, కూరలల్లో వాడుకోవచ్చు. -
లస్సీ విత్ ఫ్లేక్స్
కూల్ కూల్‌గా... కావలసినవి: పెరుగు - అరలీటరు, అల్లం తురుము - పావు టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను, కార్న్‌ఫ్లేక్స్ - పావు కప్పు, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - కొద్దిగా, క్రీమ్ - 3 టీ స్పూన్లు, ఉప్పు తయారి: మిక్సీలో అల్లం తురుము, పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేయాలి పెరుగు, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ఫ్రిజ్‌లో రెండు గంటలసేపు ఉంచాలి గ్లాసులో ఈ మిశ్రమాన్ని పోయాలి వరుసగా కార్న్‌ఫ్లేక్స్, కరివేపాకు, కొత్తిమీర, క్రీమ్‌లను పైన వేసి సర్వ్ చేయాలి. -
కిచెన్ టిప్స్
మామిడి ఊరగాయ చట్నీ ఎర్రగా కనిపించాలంటే పోపులో చిటికెడు బేకింగ్ సోడా కలపాలి. ఎండుమిరపకాయల్లో ఉప్పు, వేరుసెనగ నూనె కలిపి ఉంచితే ఎక్కువ రోజులు ఎర్రగా ఉంటాయి.బంగాళదుంపల చిప్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కరివేప ఆకులు వేసి ఉంచాలి. అరటిపండును ప్లాస్టిక్ ప్యాక్ డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే తొక్క నల్లబడక పండు తాజాగా ఉంటుంది. వర్షాకాలం ఒకోసారి పెరుగు తొందరగా తోడుకోదు. అలాంటప్పుడు ఆ పాలగిన్నెను ఫ్రిజ్ స్టెబిలైజర్పై ఉంచితే పెరుగు త్వరగా తోడుకుంటుంది. చపాతీలు మెత్తగా ఉండాలంటే గోరువెచ్చని నీటితో పిండి కలపాలి. వర్షాకాలంలో సోంపుగింజలు, గసగసాలు, నువ్వులు వంటి వాటిని వేయించి భద్రపరుచుకుంటే అవి త్వరగా పురుగుపట్టవు. -
‘స్మార్ట్’ ఫ్రిజ్
ఫ్రిజ్‌లో కూరగాయలున్నాయా? అయిపోయాయా? అన్న సంగతి మనకు ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేస్తే కానీ తెలియదు. అంతేకాదు.. అనుకోకుండా మార్కెట్‌కు వెళితే మన ఇంట్లో ఏ ఏ కూరగాయలున్నాయో గుర్తులేకుంటే అదో తలనొప్పే.. మరెలా దీనికి పరిష్కారం? బెంగ పడాల్సిన అవసరం లేదు.. మన బాధలను తీర్చేందుకు, మన పనుల్ని మరింత సులభతరం చేసేందుకు వచ్చిందే ఈ ‘స్మార్ట్ ఫ్రిజ్’. దీనికి ఉన్న ఫీచర్స్ తెలుసుకుంటే, ఎవరైనా ముక్కున వేలేసుకోక తప్పదు. ఎందుకంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఫ్రిజ్. దీనికి వైఫై కనెక్షన్‌తో పాటు ఓ టచ్‌స్క్రీన్ డిస్ప్లే కూడా ఉంటుంది. దాంతో ఫ్రిజ్‌లో ఉన్న పదార్థాలన్నిటినీ మనం డోర్ తెరవకుండానే, బయట ఉన్న ఆ డిస్ప్లేలో చూడొచ్చు. దీనికి కారణం ఫ్రిజ్‌కు అమర్చబడిన కెమెరానే. ఇది మీరు డోర్ వేయగానే లోపలున్న వాటిని వెంటనే ఫొటో తీసేస్తుంది. ఆ ఫొటోలను మీరు ఆ డిస్ప్లేలో కానీ లేదా మీ మొబైల్ ఫోన్లో కానీ చూడొచ్చు. అప్పుడు మీరు షాపింగ్‌కు వెళ్లినప్పుడు ఆ ఫొటోలను చూసి, అందులో లేని వాటిని కొనుక్కోవచ్చు. -
ఫ్రిజ్కి ‘ముక్కు’ వచ్చింది!
కుళ్లిపోయిన లేదా కుళ్లిపోవ డానికి సిద్ధంగా ఉన్న ఏ ఆహార పదార్థాలనైనా, మనం వాసనను బట్టి ఇట్టే పసిగడుతుంటాం. కానీ ఫ్రిజ్‌లో ఉన్నవి అలా గుప్పుమని వాసన వేయవు. దాంతో మనం వాటిని పట్టించుకోం. బాగానే ఉంటాయ్‌లే అనుకుంటాం. తీరా అవసరమై చూసేసరికి అవి కాస్తా కుళ్లిపోతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే మీ ఫ్రిజ్కి ఓ ముక్కుని తగిలించండి. అంటే... ఈ ‘ఫ్రిజ్ నోస్’ అనే పనికరాన్ని బిగించండి. ఇది ఓ ఎలక్ట్రానిక్ పరికరం. ఇందులో సెన్సార్లు ఉంటాయి. ఫ్రిజ్‌లో పదార్థాలు పాడైపోయే దశకు కనుక చేరుకుంటే ఇది పసిగట్టేస్తుంది. అలారం మోగించి మనల్ని అలర్ట్ చేస్తుంది. దాంతో మనం వెంటనే వాటిని వాడేయవచ్చు. వద్దు అనుకుంటే కుళ్లిపోయేలోపే తీసి పారేయొచ్చు. భలేగా ఉంది కదూ ఈ ‘ముక్కు’ ముచ్చట! -
జస్ట్ ఛిల్!
కొత్తకొత్తగా డ్రింక్ కూల్‌గా ఉంటేనే అందరికీ ఇష్టం. అందుకే డ్రింక్‌ను ఫ్రిజ్‌లో పెట్టడమో లేక ఐస్ ముక్కలను అందులో వేసుకోవడమో చేస్తాం. కానీ ఒక్కోసారి సగం తాగేసరికి డ్రింక్ కూలింగ్ తగ్గిపోతూ ఉంటుంది. దానిపై ఇష్టం పోతుంది. ఇకపై అలాంటి బాధ లేదు. ఎందుకంటే మార్కెట్లోకి కొత్తగా వచ్చిన గ్లాసులు ఈ సమస్యను తీర్చేస్తాయి. ఈ గ్లాసుల్లో డ్రింక్‌ను పోసుకుంటే చాలు.. అదే కూల్ అవుతుంది. ఎలా అంటే.. ఆ గ్లాసులో రీయూజబుల్ చిల్లర్స్ (అందులో జెల్ లాంటి ద్రవం ఉంటుంది) ఉంటాయి. ఒక గ్లాసు కొనుగోలు చేస్తే రెండు చిల్లర్స్‌ను ఇస్తారు. వీటిని ముందుగా మనం ఫ్రిజ్‌లో అరగంట పెట్టి ఫ్రీజ్ చేసుకుంటే అందులోని ద్రవం వల్ల అది ఐస్‌గా మారుతుంది. చిల్లర్లోని ఐస్ త్వరగా కరగకుండా సిలికాన్ గ్రిప్‌ను ఉపయోగిస్తారు. ఈ చిల్లర్సను గ్లాసులకు అమర్చుకుని, ఆపైన గ్లాసుల్లో డ్రింక్ పోయాలి. ఇక ఆఖరి చుక్క వరకు డ్రింక్ కూల్‌గానే ఉంటుంది. మూత ఉండే గ్లాసులు కూడా ఉన్నాయి. అవి కొనుక్కుంటే బైటికెళ్లినప్పుడు చక్కగా బ్యాగ్‌లో వేసుకుని తీసుకెళ్లొచ్చు! -
ఇంటిప్స్
బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఆ డబ్బాలో కరివేపాకు ఆకులు వేసి ఉంచాలి. యాలకుల లోపలి గింజలు వాడాకా పై పొట్టు పొడి చేసి చక్కెరలో కలపాలి. ఈ చక్కరెను టీలోకి వాడుకుంటే రుచిగానూ, సువాసనగానూ ఉంటుంది.కరివేపాకును గాజు సీసాలో వేసి గట్టిగా మూతపెట్టి, ఫ్రిజ్‌లో ఉంచితే ఆకులు ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటాయి. మామిడి ఊరగాయ చట్నీ ఎక్కువ రోజులు ఎర్రగా ఉండాలంటే తిరగమాతలో చిటికెడు బేకింగ్ సోడా కలపాలి. పల్లీలను తరచూ వంటలలో ఉపయోగిస్తుంటారు. వంటకు వాడినప్పుడల్లా వాటిని, వేయించి పొడి చేసుకుంటుంటారు. అలా కాకుండా ఒకేసారి వేయించి, దంచి, డబ్బాలో ఉంచుకుంటే టైమ్, గ్యాస్ రెండూ ఆదా అవుతాయి.ఎండుమిరపకాయల్లో ఉప్పు, మంచి నూనె కలిపి ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఉప్పు నీటిని చల్లి వాము(ఓమ)ను కొద్దిగా వేయించితే తినేటప్పుడు ఘాటుగా అనిపించదు. -
ఇక బాష్ ప్రిజ్ లు..
♦ వచ్చే నెలలో సిరీ 4 పేరుతో విడుదల ♦ 290-350 లీటర్ల రేంజ్ ♦ ధరలు రూ.34,000 నుంచి షురూ న్యూఢిల్లీ: బాష్ అండ్ సీమెన్స్ హౌస్‌హోల్డ్ అప్లయెన్సెస్(బీఎస్‌హెచ్) భారత రిఫ్రిజిరేటర్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. భారత వినియోగదారులు లక్ష్యంగా రూపొందించిన సిరీ 4 రేంజ్ రిఫ్రిజిరేటర్లను వచ్చే నెలలో మార్కెట్లోకి తేనున్నామని బాష్ అండ్ సీమెన్స్ హౌస్‌హోల్డ్ అప్లయెన్సెస్ తెలిపింది. 290 నుంచి 350 లీటర్ల రేంజ్లో ఫ్రిజ్‌లు అందించనున్నామని, వీటి ధరలు రూ.34,000 నుంచి ప్రారంభమవుతాయని బీఎస్‌హెచ్ హౌస్‌హోల్డ్ అప్లయెన్సెస్ ఎండీ, సీఈఓ(మాన్యుఫాక్చరింగ్) గుంజాన్ శ్రీవాత్సవ చెప్పారు. మరో 3 నెలల్లో 12-15 మోడళ్లను అందిస్తామని పేర్కొన్నారు. ఈ ఫ్రిజ్‌లను బాష్ బ్రాండ్ కింద విక్రయిస్తామని వివరించారు. ప్రస్తుతం ఏడాదికి 90 లక్షల ఫ్రిజ్‌లు అమ్ముడవుతున్నాయని, వీటిల్లో 22 లక్షలు డబుల్ డోర్వేనని పేర్కొన్నారు. మూడేళ్లలో డబుల్ డోర్ ఫ్రిజ్‌ల మార్కెట్లో 10% మార్కెట్ వాటా సాధించడం లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో 210 నుంచి 290 లీటర్ల రిఫ్రిజిరేటర్లను, సైడ్ బై సైడ్ ఫ్రిజ్‌లను, ఇతర ప్రీమియం రేంజ్ ఫ్రిజ్‌లనూ అందుబాటులోకి తెస్తామన్నారు. -
కోటి ఊటీల టేస్టు!
వేసవి నిప్పులు చెరుగుతూ తిప్పలు పెడుతోందా? ఎండ తాపం చండప్రచండమై చెండాడుతోందా?హిమకనుమలపైకి చేరాలని తమకంగా ఉందా? నాల్కతో రుచుల ఎవరెస్ట్‌ను తాకాలని ఉందా? అలాగైతే... పాలమీగడ క్రీమును మంచులా మార్చి... మామిడి గుజ్జుకు ఇంత పంచదారను చేర్చి... కొన్ని ఫ్లేవర్స్‌తో కొత్త రుచులను కూర్చి... మీ కిచెన్లోనే ఐస్‌క్రీమ్స్ చేసుకోవాలనుకుంటే... కోటి ఊటీల టేస్ట్‌ను ఫ్రిజ్‌లో దాచుకోవాలంటే ... ఈ పేజీని మస్ట్‌గా ఫాలో కండి. ఐస్‌క్రీమ్‌తో ఫీస్ట్‌ను చేసుకోండి. కావల్సినవి మామిడి పండు గుజ్జు - ఒకటిన్నర కప్పు ఫ్రెష్ క్రీమ్ / అమూల్ క్రీమ్ - 400 ఎం.ఎల్ (చల్లనది) పాల పొడి - ముప్పావు కప్పు పంచదార - ముప్పావు కప్పు తయారీ గిన్నెలో ఫ్రెష్ క్రీమ్ వేసి 5 నిమిషాలు గిలకొట్టాలి. దీంట్లో మామిడిపండు గుజ్జు, పంచదార వేసి 5-6 నిమిషాలు బాగా కలపాలి. ఈ మిశ్రమం చాలా మృదువుగా అవుతుంది. ఈ మిశ్రమం ఉన్న గిన్నెపైన ప్లాస్టిక్ కవర్ చుట్టి, డీప్ ఫ్రీజ్‌లో 3 గంటల సేపు ఉంచాలి. తర్వాత బయటకు తీసి, మిశ్రమం మరొక గిన్నెలోకి తీసుకోవాలి. దీంట్లో పాల పొడి వేసి బ్లెండ్ చేయాలి. ఐస్ అంతా కరిగేంతవరకు కలుపుతూనే ఉండాలి. ఈ మిశ్రమాన్ని వెడల్పాటి పాత్రలో పోసి, పైన ప్లాస్టిక్ కవర్ చుట్టి 7-8 గంటల పాటు డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి. సర్వ్ చేసేటప్పుడు బయటకు తీసి, స్కూప్‌తో ఐస్‌క్రీమ్ కప్పులో వేసి చల్లచల్లగా అందించాలి. వెనిల్లా ఐస్ క్రీమ్ కావల్సినవి: వెన్నతీయని పాలు - కప్పు (250 ఎం.ఎల్), వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ - అర టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ /అమూల్ క్రీమ్ - కప్పు, మొక్కజొన్న పిండి - టేబుల్ స్పూన్, పంచదార పొడి - అర కప్పు (70 గ్రా.లు) తయారీ: 3 టేబుల్ స్పూన్ల పాలు తీసి, మిగతావి గిన్నెలో పోసి మరిగించాలి. తీసిన పాలలో మొక్కజొన్న పిండి వేసి ఉండలు లేకుండా కలపాలి మరుగుతున్న పాలలో మొక్కజొన్న పిండి కలిపిన పాల మిశ్రమాన్ని పోస్తూ బాగా కలపాలి పాలు బాగా చిక్కబడేంతవరకు అలాగే కలుపుతూ, మంట తీసేయాలి ఒక గిన్నెలో క్రీమ్ తీసుకొని, అందులో 3 ఐస్‌క్యూబ్స్ వేయాలి. దీనిని 2 నిమిషాలు ఎగ్ బ్లెండర్ (కవ్వంతో చిలకాలి)తో బ్లెండ్ చేయాలి. దీంట్లో వెనీల్లా ఎసెన్స్ వేసి కలపాలి. అలాగే పంచదార పొడి వేసి కలపాలి మరిగి చల్లారిన పాలు పోసి, బాగా బ్లెండ్ చేసి, కలిపి 2 గంటల పాటు డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి 2 గంటల తర్వాత బయటకు తీసి 2-3 నిమిషాలు ఉంచి, తర్వాత మళ్లీ బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పాత్రలో పోసి 5-6 గంటల పాటు డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి తర్వాత తీసి, కప్పులో పెట్టి, డ్రై ఫ్రూట్స్ వేసి, వెంటనే సర్వ్ చేయాలి. చాకొలెట్ ఐస్‌క్రీమ్ కావల్సినవి: కోకా పౌడర్ - 3 టేబుల్ స్పూన్లు, మిల్క్‌మెయిడ్ - 4-5 టేబుల్ స్పూన్లు, అమూల్ క్రీమ్ - కప్పు, వాల్నట్స్ (తరగాలి) - 6 తయారీ: మిల్క్‌మెయిడ్ + కోకా పౌడర్ + అమూల్ క్రీమ్ లను ఒక గిన్నెలో వేసి గరిటెతో బాగా కలపాలి. దీనిని గాలి చొరబడకుండా పైనుంచి ప్లాస్టిక్ కవర్ చుట్టి, 10 గంటలు డీప్ ఫ్రిజ్‌లో ఉంచాలి వాల్నట్స్ తరిగి ఫ్రిజ్‌లో ఉంచాలి ఫ్రిజ్‌లో ఉంచిన మిశ్రమం తీసి, ఐస్‌క్యూబ్స్, 2 టీ స్పూన్ నీళ్లు లేదా పాలు పోసి బ్లెండ్ చేయాలి కప్పులో వేసి, వాల్‌నట్స్‌తో అలంకరించి వెంటనే అందించాలి. లెమన్ బటర్ మిల్క్ ఐస్‌క్రీమ్ కావల్సినవి పంచదార పొడి - ఒకటిన్నర కప్పు నిమ్మరసం - కప్పు పాలు - 2 కప్పులు చిక్కటి మజ్జిగ - 2 కప్పులు ఫ్యాట్ ఫ్రీ క్రీమ్ - 2 కప్పులు తయారీ ఒక గిన్నెలో పంచదార, నిమ్మరసం వేసి కలపాలి.పంచదార అంతా కరిగాక క్రీమ్, మరిగించి చల్లార్చిన పాలు, మజ్జిగ పోసి బాగా కలపాలి.ఈ మిశ్రమం ఉన్న గిన్నెను ఫ్రీజర్‌లో ఉంచాలి. 2 గంటల తర్వాత తీసి, మరొకసారి బ్లెండ్ చేసి, ఫ్రిజ్‌లో 4 గంటలసేపు ఉంచాలి. తీసి, ఐస్‌క్రీమ్ కప్పులో వేసి చల్లగా అందించాలి. -
బాదంతో బంగారు రంగు
బ్యూటిప్స్ బాదాములలో చర్మాన్ని శుభ్రపరిచే గుణాలతోపాటు యవ్వనాన్ని పెంచే గుణాలు కూడా ఉన్నాయి. బాదం గింజలను పొడిచేసి ఒక బాటిల్లో పోసి ఫ్రిజ్‌లో పెట్టుకుని రోజూ వాడుకోవచ్చు. పొడి మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా చేయాలి.ఒక స్పూను బాదం పొడిలో తగినన్ని నీళ్లు వేసి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో ముఖం, మెడ, చేతులకు పది నిమిషాలపాటు మర్దన చేయాలి. ఈ ట్రీట్మెంట్ చేస్తే చర్మానికి పట్టిన మురికి, చర్మం లోపలి గ్రంథులు విడుదల చేసిన మలినాలు తొలగిపోయి శుభ్రపడుతుంది. మృత కణాలను తొలగిస్తుంది కాబట్టి చర్మం కొత్త కాంతితో మెరుస్తుంది. బాదం పొడిలో పాలపొడి, కొద్దిగా నీటిని చేర్చి కలపుకోవాలి. పాల పొడి బదులుగా పాలు కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు, మెడకు ప్యాక్ వేసి, ఐదు నిమిషాల తర్వాత మర్దన చేయాలి. అనంతరం చన్నీటితో కడిగితే చర్మం మునుపటి కంటే తెల్లగా కాంతులీనుతుంది. -
కేశ సౌందర్యం...
బ్యూటిప్స్ పెరుగులో నిమ్మరసం కలిపి తలకు పట్టించి మర్దన చేసి తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది. పెరుగు మరీ పుల్లగా ఉంటే మంచిది. రెండు-మూడు రోజుల పాటు ఫ్రిజ్‌లో పెట్టకుండా గది వాతావరణంలోనే ఉంచి, పులుపెక్కిన పెరుగునే వాడాలి. దీనికి ఇదమిత్థంగా పాళ్లు అవసరం లేదు. ఒక కప్పు పెరుగులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసం వాడవచ్చు. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి పది నిమిషాల సేపు మర్దన చేయాలి. మర్దన పూర్తయిన తర్వాత పదిహేను నిమిషాలకు తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే ఒక నెలలోనే చుండ్రు బాధ తప్పుతుంది. ఒక స్పూను నిమ్మరసంలో అంతే మోతాదులో ఉసిరికాయల రసం కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఉదయాన్నే మామూలుగా తలస్నానం చేయాలి. ఇలా రెండు వారాలు చేస్తే చుండ్రు పూర్తిగా పోతుంది.చుండ్రు సమస్య ఉన్న కొందరిలో తలస్నానం చేసిన మొదటి రెండు రోజులు ఆ ఛాయలు కనిపించకుండా మూడవ రోజునుంచి కొద్దికొద్దిగా పొడి రాలుతూ ఉంటుంది. అప్పటి నుంచి తల దురదపెట్టడం క్రమేణా పొట్టు ఎక్కువగా రాలడం జరుగుతుంటుంది. ఇలాంటప్పుడు వారానికి మూడుసార్లు చొప్పున తలస్నానం చేస్తుంటే మంచిది. అలాగే ప్రతిరోజూ కనీసం ఐదు నిమిషాల సేపు గుండ్రటి పళ్లున్న దువ్వెనతో దువ్వి, వేళ్లతో వలయాకారంగా ప్రెషర్ అప్లయ్ చేస్తూ తలంతటినీ మర్దన చేయాలి. దీనికి ఎటువంటి ఆయిల్స్ అప్లయ్ చేయాల్సిన పని లేదు. ఈ ట్రీట్మెంట్ జుట్టు కుదుళ్లను ఉత్తేజితం చేస్తుంది. ఇలా చేస్తుంటే చుండ్రు సమస్యతోపాటు హెయిర్ఫాలింగ్ కూడా తగ్గుముఖం పడుతుంది. బీట్రూట్ రసంలో అంతే మోతాదు అల్లం రసం కలిపి తలకు పట్టించినా చుండ్రు తగ్గుతుంది. తాజా బీట్రూట్, అల్లం రెండింటినీ చిన్న ముక్కలుగా చేసి గ్రైండ్ చేసి రసం తీసుకోవాలి. వారానికి ఒకసారి తలస్నానం చేయడానికి గంట ముందు ఈ రసాన్ని తలకు పట్టించి మర్దన చేస్తే ఫలితం ఉంటుంది. -
ఇంటికి అందం.. వంటింటికి రుచి
ఇంటిప్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే, గ్రైండ్ చేసేప్పుడు ఒక స్పూన్ నూనె కలపాలి.పండ్లను కోశాక ముక్కలు నల్లబడకుండా వుండాలంటే, ముక్కలపై ఉప్పు కలిపిన నీళ్లు చల్లి తడిబట్టతో కప్పాలి.బంగాళాదుంప, చిలగడదుంప మొలకలు పెరిగితే, వాటిని ముక్కలుగా కోసి కుండీలలో... జార్లో నీళ్ళుపోసి పెంచొచ్చు. ఇండోర్ ప్లాంట్‌గా ఇంటి అందాన్ని పెంచుతాయి.ఇనుప సామాను తుప్పుపట్టకుండా ఉండడానికి వాటి మధ్య కర్పూరం బిళ్ళలు ఉంచాలి. ఖీర్ మిగిలిపోతే మళ్ళీ వేడి చేయకూడదు. దాన్నలాగే కుల్ఫీకప్స్లో పోసి ఫ్రిజ్‌లో పెట్టి, పిల్లలకివ్వవచ్చు. కొత్తిమీర, కరివేపాకు, పుదీన వంటి ఆకు కూరలు న్యూస్పేపర్లో చుట్టి పాలిథిన్ కవర్లో వుంచితే ఎక్కువకాలం నిలవ వుంటాయి.గోడలమీద క్రేయాన్‌తో గీసిన గీతలు పోవాలంటే సిగరెట్ బూడిదతో రుద్దాలి. కిరోసిన్ లో ముంచిన బట్టతో కిటికీలు, తలుపులు తుడిస్తే తుప్పు మరకలు పోతాయి. ఆ వాసనకు దోమలు కీటకాలు ఇంట్లోకి రావు. -
స్టాక్స్ వ్యూ
వర్ల్‌పూల్ ఇండియా కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.616 టార్గెట్ ధర: రూ.732 ఎందుకంటే: ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లు, తదితర ప్రదాన గృహోపకరణాలను తయారు చేసి, మార్కెట్ చేస్తోంది. గుర్గావ్ కేంద్రంంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 1980లో భారత్‌లోకి ప్రవేశించిన వర్ల్‌పూల్ 1995లో కెల్వినేటర్ ఇండియాను కొనుగోలు చేయడం ద్వారా రిఫ్రిజిరేటర్ మార్కెట్లోకి అడుగిడింది. మైక్రోవేవ్ ఓవెన్లు, ఏసీ, వాటర్ ప్యూరిఫయర్స్, బిల్టిన్ అప్లయెన్సెస్, ఇతర ఉత్పత్తులకు విస్తరించింది. ఫరీదాబాద్,పాండిచ్చేరి, పుణేల్లో ప్లాంట్లున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో నికర లాభం 18 శాతం వృద్ధితో రూ.98 కోట్లకు, నికర అమ్మకాలు 5 శాతం వృద్ధితో రూ.1,100 కోట్లకు పెరిగాయి. నిర్వహణ లాభం 17 శాతం వృద్ధితో రూ.162 కోట్లకు, స్థూల లాభం 18 శాతం పెరుగుదలతో రూ.146 కోట్లకు చేరాయి. షేర్‌వారీ ఆర్జన(ఈపీఎస్) 18 శాతం వృద్ధితో రూ.8కు పెరిగింది. ఇదే జోరు మరికొన్ని క్వార్టర్లు కొనసాగవచ్చు. ఈపీఎస్ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.22కు పెరుగుతుందని భావిస్తున్నాం రెండేళ్లలో నికర అమ్మకాలు 13 శాతం, నికర లాభం 31 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా.. మరో మూడేళ్ల పాటు కంపెనీ మిగులు కొనసాగవచ్చు. గృహోపకరణాల వినియోగం పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా పెరుగుతోంది. ఈ కంపెనీ టైర్ 2, టైర్ 3 నగరాలకు కూడా విస్తరిస్తోంది. పుుస్తక ధరకు, మార్కెట్ ధరకు మధ్య నిష్పత్తి ఈ ఆర్థిక సంవత్సరంలో 7.74గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.79గానూ ఉండొచ్చని అంచనా. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి రూ.732 టార్గెట్ ధరగా ప్రస్తుత ధరలో ఈ షేర్‌ను కొనుగోలు చేయవచ్చు. ఐషర్ మోటార్స్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ ప్రస్తుత ధర: రూ.18,892 టార్గెట్ ధర: రూ.22,500 ఎందుకంటే: భారత ప్రీమియమ్ బైక్ మార్కెట్లో ఐషర్ మోటార్స్ కంపెనీకి చెందిన రాయల్ ఎన్ఫీల్డ్(ఆర్ఈ) బ్రాండ్ మార్కెట్ వాటా 96 శాతంగా ఉంది. ఈ బైక్‌ల అమ్మకాలు మరో మూడేళ్లలో 33 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. పోటీ తక్కువగా ఉండడం, పటిష్టమైన స్థితిలో బ్రాండ్ ఉండడం, కొత్త మోడళ్లు అందుబాటులోకి తేవడం, నెట్వర్క్ విస్తరణ, మార్కెట్ అగ్రస్థానం వంటి అంశాలు దీనికి దోహదపడతాయి. బుల్లెట్, క్లాసిక్, థండర్బర్డ్, కాంటినెంటల్ జీటీలతో మంచి అమ్మకాలు సాధిస్తోంది. రెండేళ్లుగా అమ్మకాల్లేక కుదేలవుతున్న వాణిజ్య వాహనాల(సీవీ) మార్కెట్ ఇప్పుడిప్పుడే పుంజుకోవడం, కొత్త వాహ నాలను అందుబాటులోకి తీసుకురానుండడం వంటి కారణాల వల్ల వాణిజ్య వాహనాల విక్రయాలు మూడేళ్లలో 19 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని భావిస్తున్నాం. ఆర్ఈ అమ్మకాలు పుంజుకోవడం, సీవీ మార్జిన్లు అధికంగా ఉండడం వంటి కారణాల వల్ల మూడేళ్లలో కంపెనీ ఆదాయం 30 శాతం, నికర లాభం 50 శాతం చొప్పున పెరుగుతాయని అంచనా. ఈ ఏడాది ఆగస్టు వరకూ ఈ కంపెనీ షేర్ ధర 77 శాతం పెరిగింది. గత నెలలో 20 శాతం తగ్గినప్పటికీ, ఏడాది కాలంలో 50 శాతం వరకూ పెరిగినట్లు లెక్క. గరిష్ట స్థాయి నుంచి చూస్తే 20 శాతం తగ్గి ప్రస్తుతం ఆకర్షణీయ ధరలో లభ్యమవుతోందని భావిస్తున్నాం. ఎలాంటి రుణ భారం లేని కంపెనీ. ఐదేళ్లలో షేర్ ధర రెట్టింపు అవుతుందని భావిస్తున్నాం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
లైమ్ యాపిల్
ఇంటిప్స్ ఆపిల్ ముక్కలను కోసిన కొద్దిసేపటికే రంగు మారుతాయి. అలా కాకుండా ఉండాలంటే ఆ ముక్కలపై కొద్దిగా నిమ్మరసం చిలకరిస్తేసరి! రంగు మారకుండా తాజాగా ఉంటాయి.బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ పేస్ట్‌ను వంటింటి సింకు మొత్తానికి పట్టించాలి. రెండు నిమిషాల తర్వాత కొబ్బరి పీచుతో బాగా రుద్ది శభ్రం చేయాలి. ఇలా చేస్తే సింకు అడుగు భాగంలో ఏర్పడ్డ మరకలు తొలగిపోతాయి. ఒక్కోసారి ఫ్రిజ్‌లో పండ్లు, కూరగాయలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు దాని డోర్ తీయగానే ఏదో రకమైన వాసన వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఫ్రిజ్‌లోని మధ్య అరలో ఓ చిన్న ప్లేట్లో బేకింగ్ సోడా వేసి ఉంచండి. అలా చేస్తే దుర్వాసన రాదు. -
అందమె ఆనందం
రెండు టేబుల్ స్పూన్ల టీ డికాషన్‌ను ఫ్రిజ్‌లో పెట్టాలి. అరగ ంట తర్వాత దూది ఉండను ఆ చల్లటి టీ డికాషన్‌లో ముంచి, కనురెప్పల మీద పెట్టి, ఇరవై నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. అలసిన కళ్లకు మంచి సాంత్వన లభిస్తుంది. కళ్లకింద వలయాలూ తగ్గుతాయి. -
మీ ఫ్రిజ్ లో ఇవిగానీ ఉన్నాయా?!
ఆహారాన్ని దాచుకోవడానికి ఫ్రిజ్ ఉంది కదా అని ప్రతిదాన్నీ అందులో పెట్టేస్తుంటారు కొందరు. అలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే కొన్ని ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఫ్రిజ్ తగిన చోటు కాదు. ఉల్లిపాయల్ని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఎందుకంటే అందులోని చల్లదనం ఉల్లిపాయల్ని మెత్తబడిపోయేలా చేస్తుంది. కాఫీ గింజల్ని ఫ్రిజ్‌లో ఉంచితే అవి వాటి సహజ సువాసనను కోల్పోతాయి. చుట్టూ ఉన్నవాటి వాసనను పీల్చేసుకుంటాయి. ఆలివ్ నూనెను ఫ్రిజ్‌లో పెడితే దాని కన్సిస్టెన్సీ మారిపోతుంది. నూనె మరింత చిక్కబడిపోతుంది. తులసి ఆకు ఎంత సువాసన వస్తుందో, అంత త్వరగానూ తన వాసనను కోల్పోతుంది. అందుకే దాన్ని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. పెడితే మిగతా పదార్థాల వాసనను సంగ్రహించి వాటి వాసన మారిపోతుంది. తేనెను పరిమితిని మించిన చల్లదనంలో ఉంచితే అది గట్టిపడిపోయి పలుకులుగా అయిపోతుంది. కాబట్టి కాసిన్ని ఎక్కువ రోజులు దానిని నిల్వ ఉంచాలంటే ఫ్రిజ్‌లో పెట్టకపోవడమే మంచిది. {ఫిజ్లోని చల్లదనం బ్రెడ్లోని తేమను లాగేసి బిగుసుకుపోయేలా చేస్తుంది. వెల్లుల్లికీ అతి తేమ మంచిది కాదు. కాబట్టి ఫ్రిజ్ దానికి తగిన చోటు కాదు. బంగాళదుంపల్ని ఫ్రిజ్‌లో ఉంచితే ఆ తేమకి వాటిలోని గంజిపదార్థం చక్కెరగా మారిపోతుంది. కాబట్టి వాటిని పెట్టకూడదు. అలాగే కాస్త పచ్చిగా ఉన్న టొమాటోల్ని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఎందుకంటే అందులోని చల్లనిగాలి వాటిని పండనివ్వదు. దాంతో అవి ఫ్లేవర్‌ను కోల్పోతాయి.ఇక అరటిపండ్లు. తెలిసిందే. వాటిని ఫ్రిజ్‌లో పెడితే గట్టి పడి వాడికి ఉండే సహజమైన రుచిపోతుంది. - సమీ -
కొన్ని ఫ్రిజ్‌లో ఉంచితే ప్రమాదం!
రిఫ్రిజిరేటర్ (ఫ్రిజ్)లో ఉంచిన ఏ వస్తువైనా కొంతకాలం పాటు చెడకుండా ఉంటుందనేది శాస్త్రీయ సిద్ధాంతం. ఇంట్లో రిఫ్రిజిరేటర్ లేని గృహాలు నేడు అరుదుగా కనిపిస్తాయి. అయితే ఫ్రిజ్ ఉంది కదా అని అందులో ఏవి పడితే వాటిని ఉంచడం ఆరోగ్యకరం కాదంటున్నారు న్యూట్రీషనిస్ట్లు.ముఖ్యంగా కాయగూరల్లో ఏవి ఫ్రిజ్‌ల్లో ఉంచకూడదో వారు వివరిస్తున్నారు. ప్రస్తుతం మన ఇళ్లలో ఆహార పదార్థాలు, కూరగాయలు, వంట సరుకులు ఏవి తెచ్చినా గృహిణులు వెంటనే వాటిని ఫ్రిజ్‌లో పెట్టేందుకు అల వాటుపడ్డారు. ముఖ్యంగా వంటకు వాడే పదార్థాలనే కాకుండా వంటలు పాడైపోకుండా ఉం డేందుకు కూడా ఫ్రిజ్‌ల్లో పెట్టడం సర్వసాధారణమైపోయింది. ఐతే ఫ్రిజ్ లో ఏయే పదార్థాలను ఉంచాలి.. ఏవి ఉం చకూడదు.. కొన్ని పదార్థాలు ప్రిజ్‌లో ఉంచితో కలిగే నష్టాలను న్యూట్రీషనిస్టులు వివరిస్తున్నారు. బంగాళాదుంప బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో ఉంచితే దుంపలపై తొక్కలోని తేమ ఆవిరై గట్టిపడిపోతుంది. ముక్కలుగా తరిగేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. లోపల ఉండే పిండి పదార్థంలోని తేమను పూర్తిగా కోల్పోతుంది. ఫలితంగా వాటితో చేసిన పదార్థాలు చప్పగా రుచీ-పచీ లేకుండా ఉండటమే కాకుండా ఉడికించడానికి.. లేదా వేయించడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. టమాట టమాటాలను ముఖ్యంగా ఫ్రిజ్‌లో ఉంచరాదు. అలా ఉంచడం వల్ల టమాటాలపై ఉన్న పల్చటి పొర ముడతలు పడి అందులోని సీ-విటమిన్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. దాంతో వీటిద్వారా చేసే ఆహార పదార్థాల రుచి గణనీయంగా తగ్గిపోతుంది. కాబట్టి టమాటాలను గదిలోనే నిల్వ ఉంచాలి. ఉల్లిపాయలు ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో ఉంచకండి. ఎందుకంటే వాటిలోని అధిక నీటి శాతం ఫ్రిజ్ చల్లదనానికి ఐస్‌లా మారి వాటి పొరలను బాగా దగ్గరకు చేరుస్తుంది. ఇందువల్ల వాటిని వాడే సమయంలో పొరలుగా విడదీయడం కష్టమవుతుంది. వెల్లుల్లి వెల్లుల్లిని కూడా ఫ్రిజ్‌లో ఉంచరాదు. ఎందుకంటే త్వరగా మొలక మొలుస్తుంది. వీటిని ప్లాస్టిక్ కవర్లో ఉంచి రెఫ్రిజిరేట్ చేసినా ఇదే ఫలితం ఉంటుంది. చిల్లీ హాట్‌సాస్ చిల్లీ హాట్‌సాస్ బాటిల్‌ను ఫ్రిజ్‌ల్లో ఉంచకూడదు. బాటిల్‌ను ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే కూడా సాస్ నిల్వ ఉండడానికి వాడిన ఫ్రిజర్వేటివ్లో రసాయన చర్య సంభవించి ఫంగస్ ఏర్పడుతుంది. పుచ్చకాయ పుచ్చకాయలను కానీ, కోసిన పుచ్చ దబ్బ లను కానీ ఫ్రిజ్‌ల్లో పెట్టరాదు. అలాచేస్తే దానిలోని యాంటీ ఆక్సిడెంట్ల న్నీ చనిపోతాయి. ఇందువల్ల తియ్యగా ఉండాల్సిన పుచ్చకాయ మనకు చప్పగా తెలుస్తుంది. మునక్కాడ మునక్కాడలను(మునక్కాయలు) పొరపాటున కూడా ఫ్రిజ్ లో ఉంచకండి. కొయ్య ముక్కల్లా తయారైపోతాయి. వీటిని సాధారణ గది ఉష్ణోగ్రతలోనే నిల్వచేయడం ఉత్తమం. తేనె తేనెను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అది తొందరగా చిక్కబిడిపోవడమే కాకుండా, స్పటికత్వాన్ని పొందుతుంది. ఆ తర్వాత దీనిని బయటకి తీసి వాడుకోవడం కష్టమవుతుంది. బ్రెడ్ బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల పెలుసుగా తయారై అందులోని తేమను కోల్పోతుంది. వీటిని ఫ్రిజ్‌లో ఉంచాలి క్రీం బిస్కెట్లు, ఖరీదైన చాక్లెట్లు, కంటి చుక్కలు, చెవుల్లో వేసుకునే చుక్కలు (ఐ అండ్ ఇయర్ డ్రాప్స్), పండ్లు, ఆకు కూరలు, కొబ్బరి చిప్పలు (ఎండినవి ఉంచకండి), పాలు, పెరుగు, కొబ్బరి నీరు ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. క్రీం బిస్కెట్లు, చాక్లెట్లలో నాలుగు శాతం అల్యూమినియం, నికెల్ వంటి లోహాలుంటాయి. ఇవి గది ఉష్ణోగ్రత వద్ద ఆక్సిజన్‌తో త్వరగా చర్య జరిపి అల్యూమినియం ఆక్సైడ్, నికెల్ డయాక్సైడ్లుగా మారుతుంటాయి. ఇలా గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసిన వీటిని తినడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్లు వచ్చే అవకాశముంది కనుక వీటిని ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది.