బాదంతో బంగారు రంగు
బ్యూటిప్స్
బాదాములలో చర్మాన్ని శుభ్రపరిచే గుణాలతోపాటు యవ్వనాన్ని పెంచే గుణాలు కూడా ఉన్నాయి. బాదం గింజలను పొడిచేసి ఒక బాటిల్‌లో పోసి ఫ్రిజ్‌లో పెట్టుకుని రోజూ వాడుకోవచ్చు. పొడి మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా చేయాలి.ఒక స్పూను బాదం పొడిలో తగినన్ని నీళ్లు వేసి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో ముఖం, మెడ, చేతులకు పది నిమిషాలపాటు మర్దన చేయాలి. ఈ ట్రీట్‌మెంట్ చేస్తే చర్మానికి పట్టిన మురికి, చర్మం లోపలి గ్రంథులు విడుదల చేసిన మలినాలు తొలగిపోయి శుభ్రపడుతుంది. మృత కణాలను తొలగిస్తుంది కాబట్టి చర్మం కొత్త కాంతితో మెరుస్తుంది.
బాదం పొడిలో పాలపొడి, కొద్దిగా నీటిని చేర్చి కలపుకోవాలి. పాల పొడి బదులుగా పాలు కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు, మెడకు ప్యాక్ వేసి, ఐదు నిమిషాల తర్వాత మర్దన చేయాలి. అనంతరం చన్నీటితో కడిగితే చర్మం మునుపటి కంటే తెల్లగా కాంతులీనుతుంది.