Almond
-
వర్షాకాలంలో పచ్చి బాదంపప్పులే ఎందుకు తినాలంటే..?
సాధారణంగా ఎండు బాదంపప్పులను నానబెట్టుకుని తింటాం. వీటిలో ఎన్నో పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది కూడా. ఐతే వర్షాకాలంలో మాత్రం పచ్చిబాదంపప్పులు తినడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని తీసుకోవడం వల్ల సీజనల్‌గా వచ్చే వ్యాధులకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్ ఈ, విటమిన్ సీ, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని అందువల్లే ఇవే తీసుకోవడం మంచిదని అంటున్నారు. వర్షాకాలంలో ఏవిధంగా ఇవి మంచివో సవివరంగా చూద్దామా..!పెంకు లోపల ఉన్న గింజ పూర్తిగా పక్వానికి రాకముందే ఆకుపచ్చ బాదంపప్పును తినేందుకు వినియోగిస్తారు. ఇది పోషకమైనది కూడా.ఎలాంటి పోషకాలు ఉంటాయంటే..విటమిన్ 'ఈ': గ్రీన్ బాదంలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది, దీనిలోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.విటమిన్ సీ: రోగనిరోధక పనితీరు, చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సీ కూడా వీటిలో ఉంటుంది.ఆరోగ్యకరమైన కొవ్వులు: పరిపక్వ బాదం వలె, ఆకుపచ్చ బాదం మోనోశాచురేటెడ్ కొవ్వుల మూలం. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.ఫైబర్: ఇవి డైటరీ ఫైబర్‌ను అందిస్తాయి. అందువల్ల ఇవి జీర్ణక్రియలో సహాయపడతాయి, పేగు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి.మెగ్నీషియం, పొటాషియంల గని: ఆరోగ్యకరమైన రక్తపోటు, కండరాల పనితీరును నిర్వహించడానికి అవసరమైన ఖనిజాలు.వర్షాకాలంలో ఇవే ఎందుకు తీసుకోవాలంటే..వర్షాకాలంలో అధిక తేమ, హెచ్చుతగ్గుల ఉష్ణోగ్రతల కారణంగా అంటువ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఆకుపచ్చ బాదంలో విటమిన్లు ఈ, సీలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.వర్షాకాలం వాతావరణం కొన్నిసార్లు ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఆకుపచ్చ బాదంలోని ఫైబర్ కంటెంట్ ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది , ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లోని ఒక అధ్యయనం ప్రకారం, డైటరీ ఫైబర్ గట్ మైక్రోబయోటాను కూడా మెరుగుపరుస్తుంది. ఇది మొత్తం జీర్ణ వ్యవస్థను మెరుగ్గా ఉంచుతుంది. చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.వర్షాకాలంలో వచ్చేద హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని నివారిస్తుంది. దీనిలోని మోనోశాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.ఆకుపచ్చ బాదం అనేది హైడ్రేషన్, ఎనర్జీ లెవల్స్ నిర్వహించడానికి సహాయపడే పోషకాల మూలం. ఇందులోని మెగ్నీషియం, పొటాషియం ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, కండరాల పనితీరులో కీలక పాత్ర పోషిస్తాయి.(చదవండి: మినీ డ్రెస్‌లో మెరిసిన జాన్వీ..అచ్చం రవ్వదోసలా..!) -
జీడిపప్పు vs బాదం పప్పు: ఏది బెటర్?
బాదం పప్పు, జీడిపప్పు రెండు ఆర్యోగానికి మంచిది. ఈ రెండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు వద్దకు వచ్చేటప్పటికీ ఏదీ బెటర్ అనే సందేహం వస్తుంది. పైగా ఏదో ఒక్కటే ఎక్కువ తీసుకున్నా మంచిది కాదు. దీని వల్ల శరీరానికి అవసరమైన పోషకాలను కోల్పోతాం. ఈ రెండిటిలోనూ ఉండే కొవ్వులు, విటమిన్లు బరువును అదుపులో ఉంచుతాయి. ఇవి తీసుకుంటే తక్కువ ఆహారం తీసుకుంటాం. పైగా పొంట నిండిన ఫీలింగ్ ఉంటుంది. హెల్తీగా అనిపిస్తుంది కూడా. ముందుగా జీడిపప్పు, బాదంపప్పుల్లో ఏమేమీ ఉంటాయో సవివరంగా చూద్దాం!. బాదంపప్పు.. ఇతర డ్రైఫ్రూట్స్‌తో పోలిస్తే బాదంపప్పులో అత్యధికంగా పీచు పదార్థాలు ఉంటాయి. ఔన్సుకు మూడు గ్రాములు పీచు పదార్థం ఉంటుంది. ఇందులో విటమిన్ 'ఈ' పుష్కలంగా ఉంటుంది. శక్తమంతమైన ఆంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అంతేగాక రోగనిరోధక శక్తిని పెంచే బ్యాక్టీరియాల స్థాయిలను కూడా పెంచుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం టైప్2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది. అలాగే రక్తంలో ఎల్డీఎల్ స్థాయిలను పెంచుతాయి. ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీడిపప్పు.. తినేందుకు రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇది మంచి స్నాక్స్ ఐటెమ్ కూడా ఉంటుంది. వెన్న, పాలకి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా పరిమితం చేస్తుంది. ఎందుకంటే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్నందున డయాబెటిస్ రోగులకు కూడా ఇది మంచిదే. అలాగే ఇది రక్తంలోని ఎల్డీఎల్ కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఏది మంచిదంటే.. బాదం శరీరంలోని అదనప్పు కొవ్వుని తొలగించడంలో కీలకంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అమైనో యాసిడ్ ఎల్ అర్జినైన్లు పుష్కలంగా ఉంటాయి. అధిక బరువు తగ్గటం కోసం క్రమం తప్పకుండా బాదం తీసుకోవడం అనేది మంచి ఎంపిక అని చెబుతున్నారు. అయితే జీడిపప్పులో కొవ్వు ఎక్కువగా ఉన్నందున బరువు వద్దకు వచ్చేటప్పటికీ బాదంనే ప్రిఫర్ చేయమని చెబుతున్నారు. అలాగని బాదం తీసుకుంటే బరువు తపోతారని చెప్పేందుకు కచ్చితమై అధ్యయనాలు ఏవీ లేవన్నారు. జీడిపప్పులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తింటే ఎక్కువ సేపు నిండుగా ఉన్న ఫీల్ కలుగుతుంది. ఇందులో ఎక్కువ విటమిన్ కే, జింక్ వంటివి ఉన్నాయి. ఇవి శరీరానికి ఎంతో అవసరమైన విటిమిన్లు. అయితే బాదంలో ఫైబర్, విటమిన్ 'ఈ', కాల్షియం ఉన్నందున బరువు తగ్గడంలో తోడ్పడతాయని చెబుతున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ డ్రై ఫ్రూట్స్‌ని ఆహారంలో చేర్చుకోవాలనుకుంటే మాత్రం నిపుణులు లేదా డైటీషియన్ల సలహాలు, సూచనలు తీసుకుని ఫాలో అవ్వడం మంచిది. (చదవండి: కొరియన్ బ్యూటీ బ్రాండ్స్ వ్యవస్థాపకురాలిగా సత్తా చాటుతున్న టీచర్!) -
సమ్మర్లో చల్లటి బాదం పాలు ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
అప్పుడే వేసవికాలం వచ్చేసిందా అన్నంతగా మార్చి నుంచి ఎండ దంచి కొడుతోంది. బయట సూర్యుడి భగ భగలు ఎక్కువైపోతున్నాయి. ఈ ఎండకు చెమటలు పట్టేసి అలిసి సొమ్మసిల్లిపోతుంటా. ఈ కాలంలో ఎక్కువగా చల్లగా ఉండే పానీయాలే తాగేందుకు ఇష్టపడతాం. అలా అని కూల్‌డ్రింక్‌లు తాగితే అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదు. పైగా వాటిలో అధికంగా చక్కెర పరిమాణం ఉంటుంది. అందువల్లో ఇంట్లోనే హెల్తీగా ఉండే బాదం పాలు చలచల్లగా చేసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ సమ్మర్లో మంచి దాహార్తిని తీర్చే బలవర్థకమైన పానీయం కూడా.రీ బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలంటే.. కావలసిన పదార్థాలు: బాదం పప్పులు- ఒక కప్పు (ఎక్కువ పరిమాణంలో కావాలి అంటే.. ఎక్కువ తీసుకోవచ్చు) జీడిపప్పు- ఒక కప్పు చక్కర – 100 గ్రాములు.. ఎక్కువ తీపి కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. యాలకుల పొడి -ఒక స్పూన్.. రుచి మరింతగా కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. పాలు – అర లీటర్..(ఒకవేళ ఎక్కువ పాలు కావాలనుకుంటే మరిన్ని ఎక్కువ తీసుకోవచ్చు) తయారీ విధానం.. బాదంపప్పులను, జీడిపప్పులను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. మరో గిన్నెలో వెన్న తీయని పాలను వేడి చేసుకోవాలి. అలా వేడిగా ఉన్న పాలలో యాలకుల పొడి, చక్కర వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత పోటీ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు పొడిని అందులో కలపాలి. అనంతరం చిన్న మంట మీద పది నుంచి 15 నిమిషాలు ఆ పాలను మరగనివ్వాలి. ఆ తర్వాత పాలను దింపి చల్లారపెట్టాలి. అనంతరం ఆ పాలను గ్లాసుల్లో పోసుకొని.. పైన సన్నగా కట్ చేసుకున్న బాదాం, జీడిపప్పు, కిస్మిస్ మొక్కలు వేసి కొద్దిసేపు అలా ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒక అర్థగంట లేద గంట తర్వాత బయటకు తీస్తే చల్ల చల్లని బాదంపాలు సిద్ధంగా ఉంటాయి. అల వాటిని ఆస్వాదించుకుంటూ తాగొచ్చు. ఇలా పాలను రోజు పిల్లలకు తాగిస్తే ఎండాకాలం ఆరోగ్యంగా ఉంటారు. బయట తాగే బాదం పాలకంటే.. ఇంట్లో తయారు చేసుకునే బాదంపాలే ఆరోగ్యానికి మంచిది కూడా. బాదం పాలలో మంచి ఫైబర్ ఉంటుంది. జీడిపప్పులో కావాల్సినన్ని మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొవ్వులు తగ్గిస్తాయి. బరువులు తగ్గించడంలో సహకరిస్తాయి. బాదంపప్పులను రోజు ఉదయం లేవగానే తింటే మెదడు పనితీరు బాగుంటుంది. బాదంలోని క్యాల్షియం ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది. పిల్లలు ఏకాగ్రతను పెంచుతుంది. ఈ బాదంపాలు తాగేందుకు టేస్టీగా ఉండటంతో పిల్లలు కూడా భలే ఇష్టంగా తాగుతుంటారు. (చదవండి: నటి ఒలివియాకి బ్రెస్ట్ కేన్సర్! ఏకంగా నాలుగు సర్జరీలు..!) -
ఆల్ రౌండర్ ఆల్మండ్ ..ఈ విషయాలు తెలిస్తే..
-
జీడిపప్పు, బాదం పప్పు, వాల్ నట్స్ రోజూ తింటే
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఐరన్ ఒక ముఖ్యమైన అంశం. ఐరన్ లోపం వల్ల శరీరంలో రక్తహీనత వస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ చాలా అవసరం. వాస్తవానికి, హిమోగ్లోబిన్ రక్త కణాలలో ఉండే ఐరన్ అధికంగా ఉండే ప్రోటీన్, ఇది శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను అందించడానికి పనిచేస్తుంది. ఈ ప్రక్రియకు అంతరాయం ఏర్పడితే, చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది సజావుగా పనిచేయాలంటే, ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం, ఐరన్ అధికంగా ఉండే పదార్థాలను ఆహారం లో చేర్చడం చాలా ముఖ్యం. నాన్–వెజ్, సీఫుడ్, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ హిమోగ్లోబిన్ పెంచడానికి మంచి వనరులు. అవి మీ శరీరంలోని ఐరన్ లోపాన్ని పూరిస్తాయి. శరీరంలో హిమోగ్లోబిన్ వేగంగా పెరిగే డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం.. ఐరన్ అధికంగా ఉండే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు: ఐరన్ అధికంగా ఉంటుంది. మీరు రోజూ కొన్ని జీడిపప్పులను తీసుకుంటే, అది శరీరంలో 1.89 మి.గ్రా ఐరన్‌ను సరఫరా చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, స్నాక్స్ తినాలని అనిపించినప్పుడల్లా, మీరు కొన్ని జీడిపప్పు తినాలి. బాదం పప్పు రోజూ పొద్దున్నే నానబెట్టిన బాదంపప్పును తీసుకుంటే, అది మీ శరీరంలో రక్తం లేకపోవడాన్ని నయం చేస్తుంది. కొన్ని బాదంపప్పులో 1.05 మి.గ్రా ఐరన్ ఉంటుంది, ఇది ఒక రోజులో శరీర అవసరాన్ని తీర్చగలదు. అందువల్ల, మీ ఆహారంలో బాదంపప్పును చేర్చండి. వాల్ నట్స్: మామూలు గా మెదడుకు పదును పెట్టడానికి అక్రోట్లను తినమని సలహా ఇస్తారు, అయితే ఇది హిమోగ్లోబిన్ లోపాన్ని కూడా తీర్చగలదు. రోజూ కొన్ని అక్రోట్లను తీసుకుంటే, 0.82 మి.గ్రా ఐరన్ శరీరానికి అందుతుంది. పిస్తా సాధారణంగా పిసా ్తపప్పులను స్వీట్ల రుచి, అందాన్ని పెంచడానికి ఉపయోగిస్తారు, కాని ఇది ఐరన్‌తో సమృద్ధిగా ఉందని మీకు తెలియజేయండి, శరీరంలో ఐరన్ కొరత ఉన్నప్పుడు సులభంగా సరఫరా చేయగలదు. మీరు రోజూ కొన్ని పిస్తాపప్పులు తింటుంటే, శరీరానికి 1.11 మి.గ్రా ఐరన్ లభిస్తుంది. -
బూజుపట్టిన బాదం మిల్క్.. హెరిటేజ్ స్టోర్ మూసివేత
సాక్షి, రామాయంపేట(మెదక్): బూజుపట్టిన బాదం మిల్క్ బాటిల్‌ను విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రామాయంపేటలోని హెరిటేజ్ స్టోర్‌ను శుక్రవారం రాత్రి మున్సిపల్ అధికారులు మూసివేయించారు. వినియోగదారుడు స్టాల్లో బాదం మిల్క్ బాటిల్‌ను కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి బాటిల్ మూత ఓపెన్ చేయగా దుర్వాసన వచ్చింది. ఈ విషయాన్ని వినియోగదారుడు మున్సిపల్ అధికారుల దృష్టికి తెచ్చాడు. దీంతో అధికారులు బాటిల్‌ను స్వాధీనం చేసుకొని హెరిటేజ్ స్టాల్‌ను మూసివేయించారు. ఈ విషయంపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉదయ్‌కిరణ్ తెలిపారు. చదవండి: తెలుగు అకాడమీ కేసులో కీలక మలుపు.. ఏసీబీకి బదిలీ -
Beauty Tips In Telugu: ఆల్మండ్ స్క్రబ్‌తో నిగారింపు
ఐదు బాదం పప్పులను తీసుకుని బరకగా దంచుకోవాలి. కప్పు పెరుగుని బట్టలో వడగట్టి వచ్చిన నీటిని.. టీస్పూను, బాదం నూనె ఐదు చుక్కలు వేసి వీటన్నింటిని పేస్టులా కలిపితే ఆల్మండ్ స్క్రబ్ రెడీ. ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆల్మండ్ స్క్రబ్‌ను ముఖానికి, మెడకు అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మర్దనా చేయాలి. కాసేపు అలాగే ఉంచి ఆరిన తర్వాత కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఈవిధంగా చేయడం వల్ల ముఖచర్మంపై ఉన్న మృతకణాలు తొలగి, చర్మానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఫలితంగా చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. చదవండి: Sudha Reddy: మెట్ గాలాలో మెరిసిన సుధారెడ్డి -
హెల్దీ బాత్
ఐదు బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయం అందులో వందగ్రాముల తాజా పుదీనా ఆకులు వేసి మెత్తగా పేస్టు చేయాలి. పేస్టు చేయడానికి అవసరమైనంత గోరువెచ్చటి నీటిని వేయవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి ఆరిన తర్వాత వేడి నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే చర్మం నునుపుదనం, మెరుపు సంతరిచుకోవడంతోపాటు చర్మవ్యాధులను దూరం చేస్తుంది. ►స్నానం చేయడానికి పావుగంట ముందుగా మజ్జిగలో దూదిని ముంచి ఒంటికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల చర్మసౌందర్యంతో పాటు దేహ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. ఎండకు వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. ►తరచు స్కిన్ ఇన్ఫెక్షన్లు బాధిస్తుంటే ఒక లీటరు నీటిలో వేపాకులను వేసి మరిగించి ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. ►ఒక బకెట్ నీటిలో మూడు స్పూన్ల తేనె కలుపుకుని స్నానం చేస్తే చర్మం మృదువుగా, నునుపుగా మారుతుంది. ►ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ కాలంలో చెమటతో దుర్వాసన వస్తుంటుంది. స్నానం చేసే నీటిలో ఒక టీ స్పూన్ పన్నీరు కలుపుకుంటే రోజంతా తాజాగా ఉంటుంది. -
పిస్తా కుల్ఫీ
కావలసినవి: పాలు – 1 లీటరు, పంచదార – 250 గ్రా., బ్రెడ్ – ఒక స్లైస్ (చివర్లు కట్‌చేసి వైట్‌ది మాత్రమే తీసుకోవాలి), బాదంపప్పు – 20 (నీళ్లలో నానబెట్టి పై పొట్టుతీసి గ్రైండ్ చేసుకోవాలి), పిస్తాపప్పు – అర కప్పు (పైన పొట్టు తీసేసి, పలుకులుగా చేసుకోవాలి), ఏలకులు – 4, కుంకమపువ్వు – రెండు, మూడు రేకలు. తయారి: పాలు అరలీటర్ అయ్యేంత వరకు మరిగించాలి ►పాలు చల్లారాక ఇందులో పంచదార, బ్రెడ్, బాదంపప్పుపొడి, పిస్తాపప్పు, ఏలకులపొడి, కుంకుమపువ్వు వేసి కలపాలి ►కుల్ఫీ చేసే మౌల్డ్‌లో సిల్వర్ ఫాయిల్సెట్ చేసి అందులో పాలమిశ్రమం పోయాలి. ఐస్‌క్రీమ్ పుల్లను కూడా అమర్చాలి ►పన్నెండు గంటలపాటు కుల్ఫీమౌల్డ్ని ఫ్రీజర్‌లో ఉంచాలి ►కుల్ఫీ మౌల్డ్స్‌ని వేడినీటిలో ముంచితీస్తే ఫ్రీజ్ అయిన తర్వాత కుల్ఫీ బయటకు సులభంగా వస్తుంది ►చల్ల చల్లగా పిల్లలకు అందించవచ్చు. నోట్: కుల్ఫీ మౌల్డ్స్ లేకపోతే చిన్న గ్లాసులలో పాలమిశ్రమం పోసి ఫ్రీజర్‌లో పెట్టుకోవచ్చు. -
రాగుల వంటలు
రాగి లడ్డు కావలసినవి: మొలకెత్తిన రాగుల పిండి – ఒక కప్పు, బెల్లం పొడి – అర కప్పునెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు, సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు – పావు కప్పుఏలకుల పొడి – పావు టీ స్పూను, మరిగించిన పాలు – పావు కప్పుజీడి పప్పులు – 10 (చిన్న చిన్న ముక్కలు చేయాలి)బాదం పప్పులు – 10 (చిన్న చిన్న ముక్కలు చేయాలి)ఎండు కొబ్బరి తురుము – అలంకరించడానికి తగినన్ని తయారీ: ఒక గిన్నెలో నెయ్యి వేసి బాగా కాగిన తరవాత జీడి పప్పు పలుకులు, బాదం పలుకులు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. రాగి పిండి జత చేసి మరోమారు దోరగా వేయించాలి. బెల్లం పొడి, ఎండు కొబ్బరి తురుము, ఏలకుల పొడి జత చేసి మరోమారు వేయించాలి. వేడి పాలు జత చేసి కలియబెట్టాలి. మంట తగ్గించి, గిన్నె మీద మూత పెట్టాలి. రెండు మూడు నిమిషాలు అలాగే ఉంచి, దింపేయాలి. ఎండు కొబ్బరి ముక్కలు జత చేస్తూ, కావలసిన పరిమాణంలో లడ్డూలు తయారుచేసుకోవాలి. 100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత? రాగులు (Finger Millet) నియాసిన్ ((Niacin)mg (B3) 1.1 రిబోఫ్లావిన్ (Rivoflavin)mg (B2) 0.19 థయామిన్ (Thiamine) mg (B1) 0.42 కెరోటిన్ (Carotene)ug 42 ఐరన్ (Iron)mg 5.4 కాల్షియం (Calcium)g 0.33 ఫాస్పరస్ (Phosphorous)g 0.27 ప్రొటీన్(Protein)g 7.1 ఖనిజాలు (Minerals) g 2.7 పిండిపదార్థం (Carbo Hydrate) g 72.7 పీచు పదార్థం (Fiber) g 3.6 పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 20.19 రాగి మురుకులు కావలసినవి: రాగి పిండి – రెండు కప్పులు, వాము – ఒక టీ స్పూనుబియ్యప్పిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంతనూనె – డీప్ ఫ్రైకి సరిపడా, వేడి నీళ్లు – పిండి కలపడానికి తగినన్ని తయారీ: ఒక పెద్ద పాత్రలో రాగి పిండి, వాము, బియ్యప్పిండి, ఉప్పు వేసి కలపాలి. వేడి నీళ్లు జత చేసి జంతికల పిండిలా కలుపుకోవాలి. స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి. మురుకుల గొట్టంలో పిండి ఉంచి, కాగిన నూనెలో మురుకులు చుట్టాలి. బాగా వేగిన తరవాత పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. రాగి సేమ్యా ఖీర్ కావలసినవి: రాగి సేమ్యా – అర కప్పు, కొబ్బరిపాలు – 2 కప్పులుకొబ్బరి తురుము – పావు కప్పు, బెల్లం పొడి – అర కప్పుఏలకుల పొడి – చిటికెడు, జీడి పప్పు పలుకులు – 20 నెయ్యి – తగినంత తయారీ: స్టౌ మీద పాన్‌లో నెయ్యి వేసి కరిగించాలి. జీడిపప్పు పలుకులను వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి. రాగి సేమ్యా వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. ఒక పెద్ద గిన్నెలో కొబ్బరిపాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. మరుగుతున్న పాలలో సేమ్యా వేసి కలపాలి. సేమ్యా ఉడికిన తరవాత బెల్లం పొడి, కొబ్బరి తురుము వేసి బాగా కలిపి ఉడికించాలి. బాగా ఉడుకుతుండగా ఏలకుల పొడి, వేయించి ఉంచుకున్న జీడిపప్పులు వేసి కలిపి స్టౌ మీద నుంచి దింపేయాలి. రాగి – ఉల్లి చపాతీ కావలసినవి: రాగి పిండి – ఒక కప్పుఉల్లి తరుగు – పావు కప్పుఉప్పు – తగినంతసన్నగా తరిగిన పచ్చి మిర్చి – 1పెరుగు – 2 టీ స్పూన్లుకొత్తిమీర – అర కప్పు నూనె – తగినంత తయారీ: వెడల్పాటి పాత్రలో రాగి పిండి, ఉల్లి తరుగు, ఉప్పు, పచ్చి మిర్చి తరుగు, పెరుగు, కొత్తిమీర వేసి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి. చపాతీలా ఒత్తాలి. రాగి చపాతీ తొందరగా విరిగిపోతుంది కనుక చేతికి నూనె పూసుకుని, చేతితోనే ఒత్తాలి. స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేయాలి. ఒత్తి ఉంచుకున్న రాగి చపాతీ వేసి జాగ్రత్తగా రెండు వైపులా కాల్చి తీసేయాలి. పెరుగు, టొమాటో సాస్‌లతో తింటే రుచిగా ఉంటుంది. రాగి కేక్ కావలసినవి: రాగి పిండి – ముప్పావు కప్పుగోధుమ పిండి – ముప్పావు కప్పుబేకింగ్ పౌడర్ – ఒక టీ స్పూనుబేకింగ్ సోడా – అర టీ స్పూనుఉప్పు – చిటికెడుకోకో పొడి – 2 టేబుల్ స్పూన్లుబెల్లం పొడి – ఒక కప్పుకొబ్బరి పాలు – ముప్పావు కప్పువెనిలా ఎసెన్స్ – ఒక టేబుల్ స్పూనుకరిగించిన బటర్ – 150 మి.లీ.పెరుగు – పావు కప్పుటాపింగ్ కోసం...కొబ్బరి పాలు – ఒక కప్పుకోకో పొడి – 3 టేబుల్ స్పూన్లుపంచదార – 2 టేబుల్ స్పూన్లు తయారీ: కేక్ ప్యాన్‌కి కొద్దిగా నెయ్యి పూయాలి. అవెన్‌ను 170 డిగ్రీల దగ్గర కనీసం పావు గంట సేపు ప్రీహీట్ చేయాలి. రాగి పిండి, గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, కోకో పొడి... వీటన్నిటినీ జత చేసి జల్లించి పక్కన ఉంచాలి. మరో రెండు సార్లు జల్లెడ పట్టాలి. మెత్తగా చేసిన బెల్లం పొడి జత చేయాలి. ముప్పావు కప్పు కొబ్బరి పాలు జత చేయాలి. కరిగించిన బటర్, పెరుగు జత చేయాలి.ఉండలు లేకుండా అన్నీ బాగా కలిసేలా గరిటెతో కలియబెట్టాలి. నెయ్యి రాసిన ట్రేలో ఈ మిశ్రమాన్ని పోసి, అవెన్ సుమారు అరగంట సేపు ఉంచాలి. బయటకు తీయడానికి ముందు సుమారు పావు గంట సేపు చల్లారనివ్వాలి.ఒక పాత్రలో పాలు, పంచదార, కోకో పొడి వేసి స్టౌ మీద ఉంచి, పంచదార కరిగేవరకు బాగా గిలకొట్టాలి. మంట బాగా తగ్గించి, ఈ మిశ్రమాన్ని మరిగించాలి. ఇందులో వెనిలా ఎసెన్స్ వేసి, మిశ్రమం చిక్కబడేవరకు కలియబెట్టి, దింపి చల్లారబెట్టాలి. మిశ్రమం చిక్కగా, క్రీమీగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని కేక్ మీద సమానంగా పోసి, చాకుతో సరిచేయాలి. -
‘స్వీట్’ కార్ఖానా..హైటెక్ జమానా
అందులోకి అడుగు పెట్గగానే హెడ్ క్యాప్ ఇస్తారు. కాళ్లకు ప్లాస్టిక్ కవర్ తప్పనిసరి. తర్వాత మీరు ఎయిర్ ఫిల్టర్లు అమర్చి ఉన్న ద్వారం.. దానికి ఉన్న అత్యంత మందమైన ప్లాస్టిక్తెరలను కాసింత బలంగానేచీల్చుకుంటూ లోపలికి అడుగుపెట్టాలి. ఇదంతా చూస్తే అదేదో రీసెర్చ్ సైన్స్ ల్యాబ్ ఏమో అనిపిస్తుంది కదా. కానీ కాదు.. నగరంలోని ఓ మిఠాయి దుకాణం కిచెన్. రుచులతో మాత్రమే కాదు.. అత్యాధునిక కిచెన్తోనూ నగరవాసుల్ని ఆకట్టుకుంటున్నాయి మిఠాయి షాప్స్. కళ్లారా చూసి నమ్మండి అంటూ వినియోగదారులనుకూడా ఆహ్వానిస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో :చవులూరించే స్వీట్లు, హాట్లు సరే. మిరుమిట్లు గొలిపే లైట్లు, ఫ్యాన్సీ ఇంటీరియర్స్, ఎయిర్ కండిషనింగ్, యాంబియన్స్.. ఇవీ సరే. ‘వీటన్నింటికన్నా ఆ మిఠాయిలు ఎలా? ఎక్కడ? ఏ విధంగా తయారవుతున్నాయి? అనేదే వినియోగదారులకు అత్యంత ప్రధానమైన విషయం’ అంటారు కూకట్‌పల్లిలోని ఆల్మండ్ హౌస్ నిర్వాహకులు చైతన్య. నగరంలో ఆరు స్వీట్‌షాప్స్ నిర్వహిస్తున్న ఆల్మండ్ హౌస్... 4ఫ్లోర్లలో దాదాపు 20వేల చదరపు అడుగుల్లో విస్తరించిన తమ కిచెన్‌ను అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దింది. స్టోర్‌లో అలంకరణతో పాటు కిచెన్‌లో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నగరంలో ఇంతవరకూ ఏ స్వీట్ షాప్‌కు లేని హజార్డ్ అనాలసిస్ అండ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ (హెచ్ఏసీసీపీ) సర్టిఫికేషన్ సాధించే దిశగా పయనిస్తోంది. అత్యాధునికం.. అత్యంత పరిశుభ్రం ప్రత్యేక ప్యాకింగ్ గదులు, ఎయిర్ కండిషన్డ్ ఫినిషింగ్‌లతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో వంటశాలను తీర్చిదిద్దుతుండడం విశేషం. అందులో భాగంగా తయారీ విభాగంలోకి సరఫరా అయ్యే గాలిని సైతం శుద్ధి పరచడం, హ్యుమిడిటీ నియంత్రణ, యూవీ లైట్‌తో స్టెరిలైజ్ అయిన ఫ్రెష్ ఎయిర్... లాంటి ఎన్నో ప్రత్యేక విధానాలు ఇక్కడ కనిపిస్తాయి. గాలి నాణ్యతతో పాటు సూక్ష్మజీవుల పరిమాణాన్ని వారానికోసారి పరిశీలిస్తారు. తయారీదారులు, ఉత్పత్తులను హ్యాండిల్ చేసే సిబ్బంది ఆరోగ్య పరిస్థితులను మూడు నెలలకు ఒకసారి చెక్ చేస్తారు. ఎనీటైమ్.. తనిఖీ చేసుకోండి ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు చేస్తున్నారంటేనే నగరంలోని పెద్ద పెద్ద రెస్టారెంట్స్ సైతం వీలున్నంత వరకు తప్పించుకోవాలని చూస్తాయి. అలాంటిది.. సామాన్య ప్రజలు కూడా తమ కిచెన్‌ను తనిఖీ చేసుకోవచ్చునని ఆఫరిస్తున్నాయి ఆల్మండ్ హౌస్ లాంటి స్వీట్ షాప్స్. ‘కొనుగోలుదారుడిని కేవలం వ్యాపార లావాదేవీల వరకే పరిమితం చేయడం మా ఉద్దేశం కాదు. నిజానికి కిచెన్‌ను చెక్ చేసుకోవడమనేది వినియోగదారుడి హక్కు అని మేం భావిస్తాం. అందుకే మా కిచెన్‌ను మా కస్టమర్స్ ఎవరైనా ఎప్పుడైనా సరే తనిఖీ చేసేందుకు ఓపెన్‌గా ఉంచుతాం’ అంటున్నారీ స్టోర్ నిర్వాహకులు. అంతేకాదు.. నగరవాసులు చిన్న చిన్న బృందాలు, సమూహాలుగా ఈ కిచెన్‌ను సందర్శించాలనుకుంటే తాము స్వాగతిస్తామని చెప్పారు. విద్యాసంస్థలు సైతం తమ విద్యార్థులకు టూర్స్ నిర్వహించదలిస్తే సహకరిస్తామంటూ కొత్త ట్రెండ్‌కు తెరదీశారు. -
ఆరోగ్యానికి మోదం... బాదం!
గుడ్ ఫుడ్ గుప్పెడు బాదం పలుకులు రోజూ తినేవారికి రోగనిరోధక శక్తి పెరిగి అంత తేలిగ్గా అనారోగ్యాలు దరిచేరవన్న సంగతి అందరికీ తెలిసిందే. బాదంతో ఒనగూరే మరికొన్ని ఉపయోగాలను తెలుసుకుందాం.బాదం గింజలు రక్తంలోని చక్కెర పాళ్లను నియంత్రిస్తాయి. అందుకే డయాబెటిస్ రోగులు నట్స్ అన్నింటిలోనూ బాదంను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. బాదంలోని ఎల్–కార్నిటిన్ అనే పోషకం మెదడు పనితీరును చురుగ్గా చేస్తుంది. అందుకే మంచి జ్ఞాపకశక్తి కోసం, భవిష్యత్తులో అలై్జమర్స్ డిసీజ్ నివారణ కోసం బాదం బాగా ఉపయోగపడుతుంది. ∙బాదం తీసుకునే వారు అంత తేలిగ్గా బరువు పెరగరు. అందుకే ఊబకాయం నియంత్రణకు ఇవి ఉపయోగపడతాయి. నిగారించే చర్మం కోసం, నల్లటి మెరుపుతో కూడిన కురుల కోసం బాదంలోని పోషకాలు తోడ్పడతాయి. బాదంలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల బాదం పలుకులు తీసుకునే వారి జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులకు దోహదపడే ‘సీ–రియాక్టివ్ ప్రోటీన్’ అనే పదార్థాన్ని బాదం తగ్గిస్తుంది. తద్వారా ఇది అనేక గుండెజబ్బులను నివారిస్తుంది. -
బాదం ప్రయోజనాలు!
బాదంలో విటమిన్–ఈ ఎక్కువగా ఉంటుంది. చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు మేలు చేస్తుంది. మన ఆహారనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణాశయానికి మంచి పెరుగు ఎంత మేలు చేస్తుందో, బాదం చేసే మేలు అంతకు తక్కువేమీ కాదు.శరీరంలో ఎక్కడైనా మంట, వాపులతో ఇన్ఫ్లమేషన్ ఉంటే బాదం తింటే తగ్గిపోతుంది. అందులోని ఒమెగా–3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఆ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. కరోనరీ గుండెజబ్బులను కూడా నివారిస్తుంది. బాదంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి జబ్బులను సమర్థంగా నివారిస్తాయి. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువ. పైగా వీటిలో ఉండే మెగ్నీషియమ్ రక్తంలో షుగర్‌ను సమర్థంగా నియంత్రిస్తుంది. కాబట్టి డయాబెటిస్ రోగులు తినడానికి అనువైన నట్స్‌గా వీటిని పరిగణించవచ్చు.మెగ్నీషియమ్ రక్తపోటు నివారణకు సైతం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడుతున్న వాళ్లు బాదం తీసుకుంటే మంచిది. బాదంలో ఆకలిని తగ్గించే గుణం ఉంది. కాబట్టి స్థూలకాయులు బరువు పెరగకుండా నియంత్రించుకోడానికి ఇది అనువైన నట్.ఎప్పుడు తినాలి : వీటిని ఎప్పుడైనా తినవచ్చు. డిన్నర్లో వేటమాంసం తిన్న తర్వాత కొన్ని బాదం గింజలు తినడం మంచిది. ఎందుకంటే ఇవి కొవ్వు అత్యధికంగా ఉండే పదార్థాల వల్ల గుండెకు కలిగే నష్టాన్ని నివారిస్తాయి. -
బాదంతో చర్మకాంతి
బ్యూటిప్స్ బాదం పలుకులను గ్రైండ్ చేసి కొన్ని చుక్కల తేనె, అర టీ స్పూన్ గోరువెచ్చని పాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి ఆరిన తరవాత కడిగేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చర్మం నిగారిస్తుంది. పాలలో గంటసేపు నానబెట్టిన బాదం పలుకులని పేస్ట్ చేయాలి. దీంట్లో కొన్ని చుక్కల నిమ్మరసం, చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రపరచిన ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తరవాత కడిగేస్తే నిగనిగలాడే చర్మం మీ సొంతమవుతుంది. -
క్యారె ట్టూ గుడ్
తవ్వితే బయటపడే వంటల ఖజానా క్యారెట్! వెజిటబుల్‌లో దీనిని స్టార్ అంటారు. దుంపల్లో తార అన్నమాట. అన్నమాట ఎందుకు? తిన్నమాటే!! క్యారెట్ కేక్ కావలసినవి: క్యారెట్ తురుము – ఒకటిన్నర కప్పు, మైదా – 2 కప్పులు, వంటసోడా – పావు టీ స్పూన్, బేకింగ్ పౌడర్ – టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, దాల్చిన చెక్క పొడి – అర టీ స్పూన్, జాజికాయపొడి – చిటికెడు, వెన్న – కప్పు, పంచదార పొడి – కప్పు, కండెన్స్డ్ మిల్క్ – ఒక టిన్ను (500 ఎం.ఎల్), వెనిలా ఎసెన్స్ – అర టీ స్పూన్, బాదం, జీడిపప్పు, వాల్నట్స్, కిస్మిస్.. – అర కప్పు, పాలు – అర కప్పు తయారీ: ∙మైదా, బేకిండి పౌడర్, సోడా, ఉప్పు, దాల్చిన చెక్క పొడి, జాజికాయపొడి కలిపి జల్లించాలి. వెన్న పంచదారపొడి, కండెన్స్డ్ మిల్క్, వెనిలా ఎసెన్స్ వేసి నురగ వేసి గిలకొట్టాలి. ఇందులో జల్లించిన మైదా మిశ్రమం క్యారెట్ తురుము, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. పిండి గట్టిగా ఉంటే కొద్దిగా పాలు పోసి కలపాలి. కేక్ టిన్ను లోపల ఫాయిల్ పేపర్ పరిచి, కేకు మిశ్రమం వేసి గరిటెతో, లేదా చేత్తో టిన్ను లోపల అంతా సర్దాలి. ఒవెన్‌ని 150 డిగ్రీల సెల్సియస్‌లో వేడి చేసి, అర గంటపాటు బేక్ చేసి తీయాలి. తర్వాత కట్ చేసి, సర్వ్ చేయాలి. నోట్: ఈ కేక్‌ను కుకర్లోనూ తయారుచేయవచ్చు. కుకర్ అడుగున ఇసుక లేదా ఉప్పు పోసి తగిన స్టాండ్ అమర్చి, ఆ పైన కేక్ మిశ్రమం ఉన్న గిన్నె పెట్టె, పైన మూత ఉంచాలి. వెయిట్ పెట్టకుండా 40–50 నిమిషాలు బేక్ చేయాలి. క్యారెట్ పచ్చడి కావల్సినవి: క్యారెట్లు – 2, కారం – 1 1/2 టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, వెనిగర్ – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, ఆవనూనె – 6 టేబుల్ స్పూన్లు తయారీ: ∙పీలర్‌తో క్యారెట్ పై తొక్క తీయాలి. పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. పసుపుగా అనిపించే భాగాన్ని తీసేయాలి. ఈ ముక్కలలో ఉప్పు వేసి అర గంటసేపు ఉంచాలి. తర్వాత చేత్తో కలిపి, నీళ్లు పోసి వడకట్టాలి. 15–20 నిమిషాలు జల్లిలో వేసి నీళ్లన్నీ పోయే వరకు ఉంచాలి. ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, కారం, వెనిగర్, నూనె వేసి కలపాలి. దీంట్లో సిద్ధంగా ఉంచిన క్యారెట్ ముక్కలను వేసి కలపాలి. కారం, ఉప్పు ఎవరి ఇష్టమ్మేరకు వారు కలుపుకోవచ్చు. దీనిని ఒక జార్లో వేసి మూత పెట్టాలి. (వేడి నూనె పోయకూడదు. దీంట్లో పచ్చిమామిడికాయ తురుము కూడా వేసి కలుపుకోవచ్చు. 2–3 రోజులు నిల్వ ఉంచాలి. ఫ్రిజ్‌లో పెట్టవచ్చు. మూడవ రోజున భోజనంలోకి పప్పు వడ్డించినప్పుడు కాంబినేషన్‌గా ఈ పచ్చడిని వడ్డించాలి. దీంట్లోకి ఆవనూనె వాడితేనే రుచిగా ఉంటుంది. క్యారెట్ వడ కావల్సినవి: క్యారెట్ తురుము – కప్పు, ఉల్లిపాయ తరుగు – అర కప్పు, పచ్చిమిర్చి తరుగు – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, కరివేపాకు – 2 రెమ్మలు, శనగపిండి – కప్పు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి తగినంత తయారీ: ∙వెడల్పాటి గిన్నెలో క్యారెట్ తురుము, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఉప్పు వేసి కలపాలి. తర్వాత దీంట్లో శనగపిండి వేసి కలపాలి. (నీళ్లు కలపాల్సిన అవసరం లేదు. ఉల్లి, క్యారెట్ తురుములోని తడితోనే పిండి ముద్దలా అవుతుంది) నిమ్మకాయ పరిమాణంలో చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని అరచేతితో వత్తాలి. ఇలాగే అన్నీ చేయాలి. కడాయి పొయ్యిమీద పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. దీంట్లో సిద్ధంగా ఉంచిన పట్టీలను వేసి రెండు వైపులా గోధుమరంగు వచ్చేవరకు కాల్చాలి. తర్వాత నూనె పీల్చుకోవడానికి పేపర్ టవల్ మీద వేయించిన పట్టీలను వేయాలి. తర్వాత వాటిని గిన్నెలోకి తీసుకొని వేడి వేడిగా టొమాటో చట్నీ లేదా కెచప్‌తో వడ్డించాలి. క్యారెట్ రొయ్యలు కావల్సినవి: క్యారెట్లను నిలువుగా సన్నని ముక్కలుగా కోయాలి – 2, గుడ్లు – 4, రొయ్యలు – 15 (శుభ్రపరిచి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), ఉల్లిపాయలు – 3 (సన్నగా తరగాలి), నూనె – 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, సోయా సాస్ – అర టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్ తయారీ: ∙ఒక చిన్న గిన్నెలో గుడ్ల సొన వేయాలి. దీంట్లో మిరియాల పొడి వేసి బాగా గిలకొట్టాలి. పొయ్యిమీద కడాయి పెట్టి నూనె వేసి, ఉల్లిపాయలను వేయించాలి. ఉల్లిపాయలు వేగాక సిద్ధంగా ఉంచిన రొయ్యలను వేసి, సోయా సాస్ చల్లి వేయించాలి. దీంట్లో క్యారెట్ తరుగు వేసి పైన మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత గుడ్ల మిశ్రమం వేసి మూతపెట్టి, 3–4 నిమిషాలు కదపకుండా ఉంచాలి. తర్వాత గరిటతో రెండోవైపు తిప్పి, 2 నిమిషాలు ఉంచి ఒకసారి కలపాలి. వేడి వేడిగా అన్నంలోకి వడ్డించాలి. క్యారెట్ సూప్ కావల్సినవి: క్యారెట్లు – 3 (శుభ్రపరిచి, ముక్కలు చేయాలి), ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి), చిలగడ దుంప – 1 (తొక్క తీసి, ముక్కలు చేయాలి), వెల్లుల్లి రెబ్బలు – 2 (తరగాలి), కొత్తిమీర – పావు కప్పు, నీళ్లు – తగినన్ని, కూరగాయలు ఉడికించిన నీళ్లు – కప్పు, టొమాటో గుజ్జు – అర కప్పు, పండుమిర్చి ముద్ద – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – పావు టీ స్పూన్, కారం – పావు టీ స్పూన్, నూనె – టేబుల్ స్పూన్ తయారీ: ∙క్యారెట్లు, ఉల్లిపాయలు, చిలగడదుంప, వెల్లుల్లి, కొత్తిమీర ఒక గిన్నెలో వేసి నీళ్లు పోయాలి. ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టి సన్నని మంట మీద 15 నిమిషాలు ఉడికించాలి. తర్వాత చల్లారనివ్వాలి. నీళ్లు వడకట్టి కూరగాయల ముక్కలన్నీ మెత్తగా రుబ్బాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేసి కాగాక టొమాటో గుజ్జు, పండుమిర్చి ముద్ద, ఉప్పు, కారం కలిపి ఉడికించాలి. దీంట్లో కూరగాయలు వడకట్టిన నీళ్లు, రుబ్బిన మిశ్రమం కలిపి, మిరియాల పొడి వేసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి వేడి వేడిగా అందించాలి. -
పిచ్చి పలు రకాలు...
ఈ ఫొటోలో కనిపిస్తున్న దుకాణాలు స్వీడన్‌లోని మాల్మోలో ఉన్నాయి. ఇందులో ఒకదాంట్లో జీడిపప్పు, బాదం, పిస్తా లాంటి బలవర్థకమైన ఆహారాన్ని అమ్ముతుండగా... రెండోదాంట్లో చీజ్, బర్గర్, పిజ్జా లాంటి ఫాస్ట్‌ఫుడ్ అమ్ముతున్నారు. ఏ షాపులో ఏమి అమ్మితే మాకెందుకు అనుకుంటున్నారా? ఏమీ లేదండి.. ఈ షాపులు నిర్మిచింది మనుషుల కోసం కాదు.. ఎలుకల కోసం.. ఏంటి నమ్మలేకున్నారా? ఇది నిజంగా నిజం.. ఎవరో ఆకాశ రామన్న ఎలుకల కోసం ఈ షాపులు నిర్మించాడు. నిర్మించడమే కాదు.. వీటిలో ఆహారాన్ని కూడా ఉంచుతున్నాడట! సరే అయితే ఇందులో పెద్ద వింతేమి ఉంది ఎవరో దయా హృదయం ఉన్న వ్యక్తి ఈ పనికి పూనుకుని ఉంటాడు. ఈ మాత్రానికే ఇంత బిల్డప్ అవసరమా అనుకోకండి.. ఈ షాపులకు ఒక ప్రత్యేకత ఉంది. వీటిని ఎలుకల కోసం నిర్మించారు కాబట్టి వాటి సైజులు కూడా అంతే పరిమాణంలో ఉండేలా జాగ్రత్త పడ్డాడు. అంటే అత్యంత చిన్నగా (మైక్రో ఆర్ట్) 70సెం.మీ. పొడవుతో 30 సె.మీ. వెడల్పుతో నిర్మించారు. అయితే అక్కడి జనాలు ఎలుకల కోసం ఇంత కష్టపడడం ఏంటబ్బా.. వాడి పిచ్చికాని అని చెవులు కొరుక్కుంటున్నారు. -
బాదంతో బంగారు రంగు
బ్యూటిప్స్ బాదాములలో చర్మాన్ని శుభ్రపరిచే గుణాలతోపాటు యవ్వనాన్ని పెంచే గుణాలు కూడా ఉన్నాయి. బాదం గింజలను పొడిచేసి ఒక బాటిల్లో పోసి ఫ్రిజ్‌లో పెట్టుకుని రోజూ వాడుకోవచ్చు. పొడి మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా చేయాలి.ఒక స్పూను బాదం పొడిలో తగినన్ని నీళ్లు వేసి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో ముఖం, మెడ, చేతులకు పది నిమిషాలపాటు మర్దన చేయాలి. ఈ ట్రీట్మెంట్ చేస్తే చర్మానికి పట్టిన మురికి, చర్మం లోపలి గ్రంథులు విడుదల చేసిన మలినాలు తొలగిపోయి శుభ్రపడుతుంది. మృత కణాలను తొలగిస్తుంది కాబట్టి చర్మం కొత్త కాంతితో మెరుస్తుంది. బాదం పొడిలో పాలపొడి, కొద్దిగా నీటిని చేర్చి కలపుకోవాలి. పాల పొడి బదులుగా పాలు కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు, మెడకు ప్యాక్ వేసి, ఐదు నిమిషాల తర్వాత మర్దన చేయాలి. అనంతరం చన్నీటితో కడిగితే చర్మం మునుపటి కంటే తెల్లగా కాంతులీనుతుంది. -
ఇంటి ముందుకొచ్చే మనుషులు...
ఆ రోజులు... రాలిన బాదంకాయల కోసం పిల్లలు వచ్చేవారు. ఎర్రగా పూసి, గోడ బయటకు తలవాల్చిన మందారాల కోసం యూనిఫాముల్లో ఉన్న ఆడపిల్లలు వచ్చేవారు. దేవుని పటాలకు కాదనేదెవరని నందివర్థనాల కోసం పక్కింటామె వచ్చేది. చనువున్న కాలేజీ స్టూడెంట్ కాదనడానికి వీల్లేని పద్ధతిలో రోజాపువ్వును తెంపుకెళ్లేది. రెండు చేతులున్న ప్రతి మహాలక్ష్మి గుప్పెడు గోరింటాకు కోసం హక్కుగా గేటు బాదేది. నాలుగు పుదీనా రెబ్బల కోసం ఎవరైనా రావచ్చు. చారెడు కరివేపాకుకు అడగాల్సిన పనీ లేకపోవచ్చు. సవరాలు చేసిస్తాం అని మురికిగా ఉన్న ఆ ముగ్గురు ఆడవాళ్లు ఆశగా చూసేవారు. కాసింత సద్దన్నం పెడితే రేకుడబ్బాలో ఉన్న చెక్కదువ్వెనలిచ్చి నక్కలోళ్లు చక్కాపోయేవారు. తీరిగ్గా నడిచే ఒంటెద్దు బండి నుంచి శేర్ల లెక్కన ఉప్పు చేటల్లో ఒంపుకు రావాలి. ముగ్గు పిండి అమ్మే ముసలామెకు మొదటగా మంచినీళ్లు అందించాలి. కట్టెల మోపు అమ్మేవారికి చెమట ఆరేలోపు డబ్బులిస్తేనే పుణ్యం. నెయ్యి అమ్మేవాళ్ల మోసం ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడు. తేనె అమ్మేవాళ్లు తియ్యగానే మట్టి నాకిస్తారు. ప్లాస్టిక్ వస్తువులకు అతుకులు వేస్తామని వచ్చిన మనిషి పచ్చటి బిందెకు ఎర్రటి పాచ్ వేసేవాడు. కుడితి కోసం వచ్చే ఆడమనిషి అంతపెద్ద కుండను చులాగ్గా నడుముకు ఎత్తుకునేది. బావిలో పడ్డ వస్తువులను తీస్తాననేవాడు పలుచగా, రివటగా, అప్పుడే నీటి నుండి తీసిన గవ్వలా మెరుస్తుండేవాడు. సోది చెప్పే అమ్మి రేడియో లేని వెలితిని పోగొడుతూ చాలాసేపు రాగాలు తీసేది. కబళం మీద ఆశ లేని బుడబుక్కలవాడు చిల్లర డబ్బులు తీసుకుని బొంగురుగా ఆశీర్వదించేవాడు. ముస్లింల ఇంటి ముందు కూడా హరిదాసు కమ్మని కీర్తన ఆలపించేవాడు. హిందువుల గడపలు ఫకీరు దువాను ఆహ్వానించేవి. సంవత్సరానికి ఒకసారి పసుప్పచ్చ బట్టల్లో యామాలసామి గుర్రాన ఊరేగి ఇంటింటినీ కటాక్షించేవాడు. సత్రం వంకాయలు అమ్మే ఆమె తక్కెడలో మోసం ఉండేది కాదు. ప్రతి తెల్లారి చేపల బుట్టలతో వచ్చే బెస్త ఆడవాళ్లకు కపటం తెలిసేది కాదు. రంగురంగుల కోడిపిల్లలు ఆరు తీసుకుంటే రెండే బతికేవి. ఉడుము నుంచి తీసిన తైలం మోకాళ్లకు మంచిదని ఎవరో తచ్చాడేవారు. గాజుల మలారం దించి చేయి పట్టుకున్నాక డజనుకు రెండు కొసరుగా ఇవ్వాలి. చీరల మూట ఆసామి సులభ ఇ.ఎమ్.ఐలు కనిపెట్టేవాడు. చెవిలో గుబిలి తీసేవాడితో మగాళ్లకు బేరం తెగేది కాదు. కక్కు కొడతాం అని వచ్చేవాళ్లు ఎండన కూచుని నున్నబడ్డ పొత్రాల ఒళ్లు హూనం చేసేవారు. సిరిచాపలు అమ్మేవారు కాసింత నడుము వాల్చే తీరిక లేక అదే పనిగా తిరుగుతుండేవారు. పాముబుట్టతో వచ్చినవాడు పైసలిస్తే తప్ప పడగను తట్టేవాడు కాదు. ఎలుగుబంటి స్వయంగా వచ్చి ఇచ్చే తావీదును భయం భయంగా కొనాల్సి వచ్చేది. కోతిని తెచ్చేవాడికి అంతగా మతింపు లేదు. సోడాబండి వచ్చిందనే సంగతి సోడానే కయ్యిన కూసి దండోరా వేసేది. ఆకురాయి మీద సానపడుతున్న కత్తి చక్కున మెరిసేది. మల్లెల కన్నా ముందే వాటి పరిమళం వీధిలో ఆగి ఆగి ఒంటిని తాకేది. పీచుమిఠాయి గంట ఒన్ టూ త్రీగా మోగేది. చేతికి తీపి గడియారం చుట్టే మనిషి మొత్త చూసుకుని కూలబడ్డాడంటే మరి కదిలేవాడు కాదు. నల్ల ఈతకాయలు రుచా, పెద్ద ఈతకాయలు రుచా అంటే డబ్బును బట్టి ఉంటుంది. ప్రతి విజయదశమికి కళుగోళ్లమ్మ తల్లి పల్లకీ ఎక్కివచ్చేది. తొలి ఏకాదశికి విష్ణుమూర్తి రథమెక్కి వైభోగం తెచ్చేవాడు. శివరాత్రికి ఆదిదేవుడు తేరువుపై ఊరేగుతూ అభయమిచ్చేవాడు. మకరజ్యోతికి వెళ్లే స్వాములను సాగనంపుతూ ఆడపిల్లలంతా ప్రమిదలతో వెలుగు నింపే వారు. తప్పెట్ల మోతలో పీర్లు కవాతు చేసేవి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం సైకిల్‌కి బిగించిన తెల్లని మినీ హారన్‌తో ఏసు పాటలు పాడుతూ క్రైస్తవ బృందాలు వచ్చేవి. అమ్మ తరపు వాళ్లు వచ్చేవారు. అయ్య తరపు వాళ్లు వచ్చేవారు. అలిగిపోయిన వారు వచ్చేవారు. వచ్చి అలిగిపోయేవారు. తలుపు మూసిపెట్టడం చాలా అమర్యాదగా ఉండేది. ఇవాళలాగా మనుషులు వచ్చి పోయే ఇల్లంటే గౌరవం ఇనుమడించేది. ఇప్పుడు కొన్నే ఉన్నాయి. చాలా పోయాయి. కొన్నే గుర్తున్నాయి. చాలా కనుమరుగైపోయాయి. కాని- ఇన్నాళ్లు గడిచినా ఇన్నేళ్లు గడిచినా ఒక మిట్టమధ్యాహ్నం పూట తాగుడుకు బానిసైన భర్త అన్నీ తెగనమ్మగా ఆకలికి తాళలేక ఇంట్లో ఉన్న అడుగుబొడుగు వంటపాత్రలు తీసుకుని వాటిని అమ్మడానికి ఇంటి ముందుకు వచ్చిన పంతులుగారి భార్య ముఖం మరుపుకు రాలేదు. ఆ పాత్రలు తీసుకో నిరాకరించి అమ్మ తన దగ్గర ఉన్న డబ్బు ఇచ్చింది. అప్పుడు పంతులుగారి భార్య ఏడవడం గుర్తు. అమ్మ కూడా పెద్దగా ఏడవడం గుర్తే. - ఖదీర్