బాదం ప్రయోజనాలు!
బాదంలో విటమిన్–ఈ ఎక్కువగా ఉంటుంది. చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు మేలు చేస్తుంది. మన ఆహారనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణాశయానికి మంచి పెరుగు ఎంత మేలు చేస్తుందో, బాదం చేసే మేలు అంతకు తక్కువేమీ కాదు.శరీరంలో ఎక్కడైనా మంట, వాపులతో ఇన్‌ఫ్లమేషన్ ఉంటే బాదం తింటే తగ్గిపోతుంది. అందులోని ఒమెగా–3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఆ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. కరోనరీ గుండెజబ్బులను కూడా నివారిస్తుంది. బాదంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి జబ్బులను సమర్థంగా నివారిస్తాయి.
ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువ. పైగా వీటిలో ఉండే మెగ్నీషియమ్ రక్తంలో షుగర్‌ను సమర్థంగా నియంత్రిస్తుంది. కాబట్టి డయాబెటిస్ రోగులు తినడానికి అనువైన నట్స్‌గా వీటిని పరిగణించవచ్చు.మెగ్నీషియమ్ రక్తపోటు నివారణకు సైతం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడుతున్న వాళ్లు బాదం తీసుకుంటే మంచిది. బాదంలో ఆకలిని తగ్గించే గుణం ఉంది. కాబట్టి స్థూలకాయులు బరువు పెరగకుండా నియంత్రించుకోడానికి ఇది అనువైన నట్.ఎప్పుడు తినాలి : వీటిని ఎప్పుడైనా తినవచ్చు. డిన్నర్‌లో వేటమాంసం తిన్న తర్వాత కొన్ని బాదం గింజలు తినడం మంచిది. ఎందుకంటే ఇవి కొవ్వు అత్యధికంగా ఉండే పదార్థాల వల్ల గుండెకు కలిగే నష్టాన్ని నివారిస్తాయి.