Vitamin-E
-
మీ వయసును బట్టి మీకు విటమిన్ ‘ఇ’ ఎంత కావాలో తెలుసా?
మన శరీరానికి కావల్సిన అనేక రకాల విటమిన్లలో విటమిన్ ఇ కూడా ఒకటి. ఇవి కొవ్వులో కరిగే విటమిన్. అంటే.. మనం తినే ఆహార పదార్థాల్లోని కొవ్వును ఉపయోగించుకుని శరీరం ఈ విటమిన్‌ను శోషించుకుంటుంది. విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది సహజంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, గోధుమలు, బాదం, అవకాడో, పొద్దుతిరుగుడు గింజలు, సాల్మన్ చేపలు, మామిడి పండ్లు, కివీలు, పాలకూర, క్యాప్సికమ్ వంటి వాటి ద్వారా లభిస్తుంది. విటమిన్ ఇ చిన్న మొత్తాలలో అవసరం అయినప్పటికీ శరీరంలో అనేక శరీర విధులను నిర్వహించడానికి అవసరం. ఇది శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. అనేక వ్యాధులను రాకుండా చూస్తుంది. విటమిన్ ఇ వల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశాలను తగ్గించవచ్చు. ఇది మూత్రపిండాల పనితీరును ప్రోత్సహిస్తుంది. అథెరోస్క్లెరోసిస్, ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ వంటి జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ లక్షణాలను నివారించడానికి సహాయపడుతుంది. కాగ్నిటివ్ ఫంక్షన్లను నిర్వహిస్తుంది. నరాల నష్టాన్ని నివారిస్తుంది. మంచి దష్టిని అందిస్తుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. ►విటమిన్ ఇ పురుషులలో సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ►విటమిన్ ఇ లోపం వల్ల మెదడు, నరాలు, వెన్నెముక, కండరాలు పనిచేయకపోవడం వంటి సమస్యలు వస్తాయి. కండరాల నొప్పి, బలహీనత, కార్డియోమయోపతి లేదా గుండె కండరాల వ్యాధి, కండరాల క్షీణత, నవజాత శిశువులు తక్కువ బరువుతో పుట్టడం, కళ్లను పైకి కిందికి కదిలించడంలో ఇబ్బంది, హైపోర్ఫ్లెక్సియా లేదా కండరాల రిఫ్లెక్స్ ప్రతిస్పందన తగ్గడం, రాత్రి పూట దృష్టి లోపం (రేచీకటి), తిమ్మిరి లేదా జలదరింపు భావన వంటి సమస్యలు కూడా విటమిన్ ఇ లోపం వల్ల వస్తాయి. కనుక మన శరీరానికి విటమిన్ ఇ ని తరచూ అందేలా చూసుకుంటే ఆయా సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ►పొద్దుతిరుగుడు గింజలు, సోయాబీన్స్, వేరుశెనగ, పాలకూర, మామిడి పండ్లు, బ్రోకలీ, బాదం పప్పుల్లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని తరచూ తింటే విటమిన్ ఇ లోపం రాకుండా చూసుకోవాలి. విటమిన్ ఇ ఎవరెవరికి ఎంత కావాలంటే ? ►వయస్సు 6 నుండి 12 నెలల వరకు: 4 మి.గ్రా. ►వయస్సు 1 నుండి 3 సంవత్సరాల వరకు : 6 మి.గ్రా. ►వయస్సు 4 నుండి 10 సంవత్సరాల వరకు : 7 మి.గ్రా. ►పెద్దలు, వృద్ధులకు: 10 మి.గ్రా. ►వైద్య పరిస్థితిని బట్టి విటమిన్ ఇ సప్లిమెంట్లను వాడవచ్చు. డాక్టర్‌ను సంప్రదించి వాటిని వాడుకోవాలి. -
మాంసాహారం తింటున్నారా? ఆ తర్వాత ఇవి తినండి...
వాస్తవంగా బాదాం పలుకులను ఎప్పుడైనా తినవచ్చు. అయితే ముఖ్యంగా మనం డిన్నర్లో వేటమాంసం, రెడ్ మీట్ తిన్న తర్వాత కొన్ని బాదాం తినడం మంచిది. ఎందుకంటే ఇవి కొవ్వు అత్యధికంగా ఉండే పదార్థాల వల్ల గుండెకు కలిగే నష్టాన్ని నివారిస్తాయి. ఇక మామూలు సమయాల్లో తిన్నా వీటి వల్ల మనకు ఒనగూరే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో క్యాల్షియమ్ పాళ్లు ఎక్కువ. కాబట్టి బాదాంలోని పోషకాలు మన ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. వైటమిన్–ఈ కూడా ఎక్కువే. అందుకే బాదాం గుండెకు మేలు చేస్తుంది. మన ఆహారనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణాశయానికి మంచి పెరుగు ఎంత మేలు చేస్తుందో, బాదం చేసే మేలూ అంతకు తక్కువేమీ కాదు. శరీరంలో ఎక్కడైనా మంట, వాపులతో ఇన్ఫ్లమేషన్ ఉంటే కూడా బాదాం తినడం మంచిది. అప్పుడు అందులోని ఒమెగా–3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఆ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. కొవ్వు పాళ్లు ఒకింత ఎక్కువగా ఉండే మాంసాహారం తర్వాత బాదాంలోని పోషకాలు కొవ్వుల దుష్ప్రభావాన్ని తగ్గించడం వల్ల బాదాం పలుకులు కరోనరీ గుండెజబ్బులనూ సమర్థంగా నివారిస్తాయి. చదవండి: అంతరిక్షంలో ఆతిథ్యం, ఎప్పటినుంచంటే.. ఈ ఫేమస్ యాడ్స్‌లో నటించిన సెలబ్రిటీలు వీళ్లే.. -
బాదం ప్రయోజనాలు!
బాదంలో విటమిన్–ఈ ఎక్కువగా ఉంటుంది. చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు మేలు చేస్తుంది. మన ఆహారనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణాశయానికి మంచి పెరుగు ఎంత మేలు చేస్తుందో, బాదం చేసే మేలు అంతకు తక్కువేమీ కాదు.శరీరంలో ఎక్కడైనా మంట, వాపులతో ఇన్ఫ్లమేషన్ ఉంటే బాదం తింటే తగ్గిపోతుంది. అందులోని ఒమెగా–3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఆ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. కరోనరీ గుండెజబ్బులను కూడా నివారిస్తుంది. బాదంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి జబ్బులను సమర్థంగా నివారిస్తాయి. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువ. పైగా వీటిలో ఉండే మెగ్నీషియమ్ రక్తంలో షుగర్‌ను సమర్థంగా నియంత్రిస్తుంది. కాబట్టి డయాబెటిస్ రోగులు తినడానికి అనువైన నట్స్‌గా వీటిని పరిగణించవచ్చు.మెగ్నీషియమ్ రక్తపోటు నివారణకు సైతం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడుతున్న వాళ్లు బాదం తీసుకుంటే మంచిది. బాదంలో ఆకలిని తగ్గించే గుణం ఉంది. కాబట్టి స్థూలకాయులు బరువు పెరగకుండా నియంత్రించుకోడానికి ఇది అనువైన నట్.ఎప్పుడు తినాలి : వీటిని ఎప్పుడైనా తినవచ్చు. డిన్నర్లో వేటమాంసం తిన్న తర్వాత కొన్ని బాదం గింజలు తినడం మంచిది. ఎందుకంటే ఇవి కొవ్వు అత్యధికంగా ఉండే పదార్థాల వల్ల గుండెకు కలిగే నష్టాన్ని నివారిస్తాయి. -
విటమిన్ స్నానం
బ్యూటిప్స్ జుట్టు పొడవుగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అందుకోసం చేయని ప్రయత్నాలు ఉండవు. అలాంటి వారు తలకు రాసుకునే కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి అందులో ఒక విటమిన్-ఇ టాబ్లెట్‌ను వేయాలి. ఆ నూనెను రాత్రి నిద్రపోయే ముందు మాడుకు, జుట్టుకు బాగా రాసుకొని ఉదయాన్నే కుంకుడు రసంతో తల స్నానం చేస్తే సరి. కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. {Mీములు, రకరకాల సబ్బులు వాడినా మొటిమలు తగ్గట్టేదని బాధ పడేవారు ఈ చిట్కా వాడి మంచి ఫలితాన్ని పొందండి. అందుకు వేరుశనగ(పల్లి) నూనె, నిమ్మరసం సమపాళ్లలో కలుపుకోవాలి. ఆ మిశ్రమంతో వారానికి మూడుసార్లు అంటే రోజు విడిచి రోజు ముఖాన్ని మర్దన చేసుకోవాలి. దాంతో మొటిమలు, నల్లమచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. చాలామందికి ముఖంపై చర్మం సాగిపోయి లూజ్‌గా ఉంటుంది. అలాంటి వారు ఆపిల్ ప్యాక్ వేసుకుంటే స్కిన్ టైట్ అవుతుంది. దానికి ఆపిల్ పండును పేస్ట్ చేసి అందులో తేనె, వెనిగర్, ముల్తాని మట్టి వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమంతో వారానికోసారి ఫేస్‌ప్యాక్ వేసుకుంటే చర్మం టైట్‌గా అవుతుంది. దాంతోపాటు ముఖంపై ముడతలు తగ్గుతాయి. అందం అనే సరికి అందరికీ గుర్తొచ్చేది ముఖం మాత్రమే. కానీ కాళ్లు, చేతులు కూడా అంతే ముఖ్యమని గ్రహించాలి. ఎందుకంటే ముఖంపై చూపినంత శ్రద్ధను కాళ్లపై చూపక, వాటిని అలాగే వదిలేస్తూ ఉంటారు. దాంతో వాటి రంగు, ముఖం రంగు వేరుగా ఉంటాయి. కాబట్టి కాళ్ల అందానికి ఒక కప్పు నిమ్మరసంలో రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్, పావుకప్పు పాలు, కొద్దిగా రోజ్ వాటర్ కలిపిన మిశ్రమాన్ని సగం నీళ్లున్న చిన్న టబ్బులో వేసి కలపాలి. రెండు కాళ్లను ఓ 20 నిమిషాల పాటు అందులో పెట్టాలి. తర్వాత కాళ్లను శనగపిండితో రుద్ది కడుక్కుంటే అందంగా తయారవుతాయి. -
చర్మకాంతికి ప్రొటీన్లు...
బ్యూటిప్స్ విటమిన్-ఇ క్యాప్సుల్స్ రెండు తీసుకుని, చివరలు కట్ చేసి, చెంచాడు రోజ్ వాటర్‌లో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు రాసి, మృదువుగా మసాజ్ చేయాలి. ఎక్కువ మొత్తం కావాలంటే మరిన్ని క్యాప్సుల్స్, అంతే పరిమాణంలో రోజువాటర్ తీసుకోవాలి. చర్మానికి మంచి మాయిశ్చరైజర్ లభించి మృదుత్వం, కాంతి పెరుగుతాయి. గుడ్డు తెల్లసొనను ముఖమంతా మొత్తం రాసుకుని, 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే గుడ్డులోని తెల్ల సొన చర్మం ముడతలను నివారిస్తుంది. కళ్ల కింది నలుపును పోగొడుతుంది. అలొవెరా జెల్‌ను ముఖానికి, మెడకు పట్టించి, మృదువుగా మసాజ్ చేయాలి. రాత్రి పడుకునేముందు ఇలా మసాజ్ చేసుకుంటే చర్మానికి మరింత మృదుత్వం లభిస్తుంది. -
బలమైన కండరాలకు విటమిన్-ఇ
కొత్త పరిశోధన ప్రొటీన్లు మాత్రమే కాదు, బలమైన కండరాల కోసం విటమిన్-ఇ కూడా చాలా అవసరం అని నిపుణులు చెబుతున్నారు. కండరాల దారుఢ్యాన్ని కాపాడటంలో విటమిన్-ఇ కీలక పాత్ర పోషిస్తుందని వారు అంటున్నారు. మన శరీరంలో ప్రతి కణం చుట్టూ ప్లాస్మా పొర ఉంటుంది. ఇది బలహీనపడితే, కణం దెబ్బతింటుంది. కణాల చుట్టూ ఉండే ప్లాస్మా పొర దెబ్బతినకుండా కాపాడటమే కాకుండా, బలహీనంగా మారిన ప్లాస్మా పొరను తిరిగి యథాస్థితికి తేవడంలో విటమిన్-ఇ కీలక పాత్ర పోషిస్తుందని జార్జియా మెడికల్ కాలేజీ నిపుణులు ఇటీవల జరిపిన పరిశోధనలో వెల్లడైంది. -
బక్కెట్ నిండా ఆహ్లాదం
బ్యూటిప్స్ రెండు టీ స్పూన్ల కోకా బటర్‌ను కరిగించి అందులో టీ స్పూన్ విటమిన్-ఇ ఆయిల్, టీ స్పూన్ నువ్వుల నూనె, 5-6 చుక్కల ఆరెంజ్ ఆయిల్, టీ స్పూన్ అల్లం రసం వేసి, కలిపి వేడి చేయాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేళ్లతో అద్దుకొని ఒంటికి మసాజ్ చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగై, ఒత్తిడి నుంచి త్వరగా విశ్రాంతి లభిస్తుంది. స్నానం చేసే బకెట్ నీటిలో కొబ్బరిపాలు, రోజ్ వాటర్ కలపాలి. ఆ నీటితో స్నానం చేస్తే చర్మం మృదుత్వాన్ని కోల్పోదు. పెప్పర్ మింట్ ఆయిల్(మార్కెట్లో లభిస్తుంది)ను కొద్దిగా నీటిలో కలుపుకొని స్నానం చేస్తే అలసిన దేహానికి సరైన విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడి తొలగిపోయి ఆహ్లాదంగా అనిపిస్తుంది.