చర్మకాంతికి ప్రొటీన్లు...
బ్యూటిప్స్
విటమిన్-ఇ క్యాప్సుల్స్ రెండు తీసుకుని, చివరలు కట్ చేసి, చెంచాడు రోజ్ వాటర్‌లో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు రాసి, మృదువుగా మసాజ్ చేయాలి. ఎక్కువ మొత్తం కావాలంటే మరిన్ని క్యాప్సుల్స్, అంతే పరిమాణంలో రోజువాటర్ తీసుకోవాలి. చర్మానికి మంచి మాయిశ్చరైజర్ లభించి మృదుత్వం, కాంతి పెరుగుతాయి.
గుడ్డు తెల్లసొనను ముఖమంతా మొత్తం రాసుకుని, 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే గుడ్డులోని తెల్ల సొన చర్మం ముడతలను నివారిస్తుంది. కళ్ల కింది నలుపును పోగొడుతుంది. అలొవెరా జెల్‌ను ముఖానికి, మెడకు పట్టించి, మృదువుగా మసాజ్ చేయాలి. రాత్రి పడుకునేముందు ఇలా మసాజ్ చేసుకుంటే చర్మానికి మరింత మృదుత్వం లభిస్తుంది.