ఆరోగ్యవంతమయిన చర్మం కోసం...
బ్యూటిప్స్
అర కప్పు పెసరపిండిలో టేబుల్ స్పూన్ పెరుగు, పేస్ట్ చేయడానికి సరిపడా నీటిని కలపాలి. ఈ మిశ్రమంతో ముఖాన్ని అయిదు పది నిమిషాల పాటు మర్దనా చేసి, ఆ తరవాత చన్నీటితో కడిగేయాలి.రెండు టీ స్పూన్ల శనగపిండిలో సరిపడా తేనె కలపాలి. ముఖానికి పట్టించి అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
కొద్దిగా తులసి ఆకులు, మూడు బచ్చలి ఆకులను కలిపి గ్రైండ్ చేయాలి. దీంట్లో సరిపడా నీటిని జత చేసి పేస్ట్ చేసి ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి క్రమం తప్పకుండా చేస్తే కాంతివంతమయిన చర్మం మీ సొంతం అవుతుంది.