massage
-
అందమైన ముఖాకృతి కోసం..!
చక్కటి ముఖాకృతితోనే అందం ఇనుమడిస్తుంది. నలుగురిలోనూ ప్రత్యేకంగా నిలుపుతుంది. చిత్రంలోని ఈఎమ్ఎస్ మైక్రోకరెంట్ ఫేస్ స్లిమ్మింగ్ స్కిన్‌కేర్ మెషిన్ ముఖకండరాలను బిగుతుగా మార్చి, ముఖాన్ని షేప్‌లోకి మారుస్తుంది. నిజానికి చబ్బీగా, గుండ్రటి ముఖంతో కనిపిస్తే, ఎంత అందంగా ఉన్నా, కండరాలు కాస్త పట్టు సడలగానే వయసు ఎక్కువగా కనిపిస్తారు. అదే ముఖం షేప్‌లో ఉంటే ఆ అందం మరింతగా ఆకట్టుకుంటుంది. ఈ డివైస్ చూడటానికి హెడ్‌ఫోన్స్ మాదిరిగా ఉంటుంది. దీని హెడ్స్‌ని బుగ్గలకు ఆనించి పెట్టుకుని, బటన్ ఆన్ చేస్తే, వైబ్రేట్ అవుతూ ట్రీట్మెంట్ అందిస్తుంది. ముఖంపై పేరుకున్న అదనపు కొవ్వును క్రమంగా కరిగిస్తుంది. చర్మాన్ని బిగుతుగా మార్చి, యవ్వనంతో తొణికిసలాడేలా చేస్తుంది. దవడ ప్రాంతంలో సడలిన కండరాలను, గడ్డం కింద డబుల్ చిన్ను తిరిగి యథాస్థితికి తీసుకొస్తుంది. ఈ పరికరం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ అయాన్లు వేగంగా చర్మం లోతుల్లోకి చొచ్చుకునిపోతాయి. దీనివల్ల కొలాజెన్ ఉత్పత్తి పెరిగి, ముడతలు తగ్గుతాయి. చర్మం నిగారింపు పెరుగుతుంది. ఈ పరికరం చాలా మోడల్స్‌లో, చాలా రంగుల్లో లభిస్తోంది. ఫేస్ మాస్క్ వేసుకుని కూడా ఈ పరికరంతో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ మైక్రోకరెంట్ రోలింగ్‌ను ఎక్కడికైనా సులభంగా వెంట తీసుకుని వెళ్లొచ్చు. దీనికి ఎప్పటికప్పుడు చార్జింగ్ పెట్టుకుని వినియోగించుకోవచ్చు. దీని ధర సుమారు 28 డాలర్లు. అంటే 2,374 రూపాయలు. (చదవండి: న్యూయార్క్‌లో డబ్బావాలా బిజినెస్..!అచ్చం భారత్‌లో..) -
శీతాకాలంలో చుండ్రు, జుట్టు సమస్యలు : నువ్వులతో చెక్
చర్మం లాగానే జుట్టు కూడా పొడిబారుతుంది. ముఖ్యంగా చల్లని శీతాకాలంలో ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. చుండ్రు సమస్యకూడా ఎక్కువగా వేధిస్తుంది. కాబట్టి జుట్టును తేమగా ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయిల్‌తో మసాజ్ చేసుకోవడం, ఎక్కువ హైడ్రేటింగ్ షాంపూలను ఉపయోగించడం లాంటివి చెయ్యాలి. కండిషనింగ్ విషయంలో నువ్వుల నూనె బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మరి జుట్టు సంరక్షణలో ఎలా వాడవచ్చో తెలుసుకుందాం!జుట్టు సంరక్షణలో నువ్వులుకప్పు నల్లనువ్వులను తీసుకుని మెత్తగా పొడిచేసి పక్కన పెట్టుకోవాలి. అరలీటరు కొబ్బరి నూనెను మందపాటి పాత్రలో పోయాలి. దీనిలో నువ్వుల పొడి, నాలుగు మందార పువ్వులు, పది కరివేపాకులు వేసి సన్నని మంటమీద మరిగించాలి. మందారపువ్వులు, కరివేపాకు వేగాక నూనెను దించేసి చల్లారనిచ్చి, ఎయిర్‌టైట్ కంటైనర్‌లో నిల్వ చేసుకోవాలి. రెండురోజుల కొకసారి ఈ ఆయిల్‌ను తలకు పట్టించి మర్దన చేసి నాలుగు గంటల తరువాత తలస్నానం చేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గడమేగాక, బాలనెరుపు నియంత్రణలో ఉంటుంది. జుట్టుకూడా ఒత్తుగా పెరుగుతుంది. తెల్లనువ్వుల్లో పోషకాలు ఉంటే నల్ల నువ్వుల్లో ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మాడుని తేమగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి మాడుని పొడిబారకుండా చేసి, చుండ్రుని తగ్గిస్తాయి. యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చుండ్రుని మరింత విస్తరించకుండా నియంత్రిస్తాయి. -
తల మసాజ్ వల్ల పక్షవాతం
బనశంకరి: కటింగ్ షాపులో తల మసాజ్ చేసుకున్న యువకునికి పక్షవాతం వచ్చింది, చికిత్స తీసుకుని రెండు నెలల విశ్రాంతి తరువాత కోలుకున్నాడు. సరైన శిక్షణ లేకుండా మసాజ్ చేయడం వల్ల ఇలా జరిగిందని డాక్టర్లు తెలిపారు. వివరాలు.. బెంగళూరులో హౌస్‌కీపింగ్ చేస్తున్న బళ్లారికి చెందిన యువకుడు (30) ఓ కటింగ్ షాపునకు వెళ్లి క్షవరం చేయించుకున్నాడు. తరువాత ఉచితంగా తల మసాజ్ చేస్తానంటే సరే అన్నాడు. ఈ సమయంలో ఆకస్మికంగా గొంతు తిప్పిన సమయంలో నొప్పి కలిగింది. మసాజ్ ముగించుకుని ఇంటికి వెళ్లాడు. కానీ గంట తరువాత దేహం ఎడమవైపు స్వాధీనం కోల్పోయింది. దీంతో భయపడిన కల్లేశ్ సమీపంలోని కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లాడు. మెడకాయ తిప్పడంతో శీర్ష ధమని దెబ్బతిని మెదడుకు రక్త సరఫరా క్షీణించి పక్షవాతం వచ్చిందని వైద్యులు తెలిపారు. వైద్యనిపుణుడు శ్రీకంఠస్వామి మాట్లాడుతూ బాధితుడు సాధారణ పార్శ్వవాయువు కు భిన్నమైన సమస్యకు గురయ్యాడు. బలవంతంగా గొంతు– మెడను తిప్పడం వల్ల ఈ సమస్య తలెత్తిందని వివరించారు. తల మసాజ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. బాధితుడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న తరువాత కోలుకుంటున్నాడు. -
ఈ డివైజ్‌తో కాళ్లు నొప్పులు మాయం!
తరుచు పెద్దవాళ్లు కాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. ఈ సమస్య ఎక్కువగా రాత్రి సమయాల్లోనే వేధిస్తుంటుంది. అలాగే ఎక్కువ గంటలు నిలబడి పనిచేసే ఉద్యోగులు కూడా ఇలాంటి సమస్యనే ఫేస్ చేస్తుంటారు. ముప్పై దాటిన మహిళలు, కొంతమంది పిల్లలు తరుచుగా కాళ్లు పీకేస్తున్నాయని అంటుంటారు. అలాంటి వాళ్ల కోసం అద్భుతమైన డివైజ్వచ్చింది. దీంతో దెబ్బకు ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఈ 8 పిక్స్ లెగ్ మసాజ్ మిషాన్ అలసిన కాళ్లకు చక్కటి రిలీఫ్‌ని ఇస్తుంది. చిటికెలో మీ కాళ్ల నొప్పులు మాయం అవుతాయి. అరికాళ్లు, మోకాళ్లు పీకేస్తున్నట్లు ఉన్నవాళ్లకి ఈ డివైజ్ అద్భుతమైన వరం. కాళ్లకు చాలా సున్నితంగా మసాజ్ చేస్తూ మొత్తం కాళ్లకు రక్తప్రసరణ జరిగేలా చేస్తుంది. ఇది ఒకరకంగా అసౌకర్యాన్ని తెలియని ఒత్తడిని కూడా దూరం చేస్తుంది. కాళ్లు నొప్పులుగా ఇబ్బందిగా ఉంటే ఒక విధమైన అసౌకర్యంగా, ఏమయ్యిందనే టెన్షన్ ఉంటుంది. ఈ మసాజ్ మెషిన్‌తో ఆ సమస్యలు దూరమవ్వడమే గాక మీ కాళ్ల సమస్యలు కూడా మాయం అవుతాయి. ఈ డివైజ్ ఖరీదు రూ. 13 వేలు పైనే ఉంటుందట. (చదవండి: 'జలుబు' ఇంత ప్రమాదకరమైనదా? ఇలా కూడా ఉంటుందా..?) -
క్షణాల్లో ముఖాన్నీ క్లీన్ చేసి మెరిసేలా చేసే డివైజ్!
ఫౌండేషన్స్, గ్లాసీ లోషన్స్‌తో ముఖాన్ని తాత్కాలికంగా మెరిపించడం ఈజీయే! కష్టమల్లా తర్వాత ఫేస్‌ని క్లీన్ చేసుకోవడమే! అందుకే ఈ బ్రష్‌ని మీ మేకప్ కిట్‌లో పెట్టేసుకోండి. మేకప్‌ను తొలగించడంతో పాటు బ్లాక్ హెడ్స్, డెడ్ స్కిన్ వంటి సమస్యల నుంచి బయటపడేందుకూ ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఈ 3–ఇన్–1 ఎలక్ట్రిక్ మసాజ్ టూల్.. చర్మాన్ని శుభ్రపరచడమే కాక మృదువుగానూ మారుస్తుంది. ముఖం, మెడ, వీపు ఇలా ప్రతిభాగాన్నీ క్లీన్ చేస్తుంది. స్కిన్ మసాజర్‌లా పనిచేసి స్కిన్ టోన్‌ను మెరుగుపరుస్తుంది. మృతకణాలను తొలగిస్తుంది. ముడతలను మాయం చేస్తుంది. ఒత్తిడిని.. అలసటను దూరం చేస్తుంది. ఈ డివైస్.. అన్ని వయసుల వారికీ అనువైనది. అలాగే స్త్రీ, పురుషులనే భేదం లేకుండా దీన్ని అందరూ వాడుకోవచ్చు. నచ్చినవారికి బహుమతిగా కూడా ఇవ్వొచ్చు. మసాజర్‌ను అవసరమైన విధంగా స్లో లేదా ఫాస్ట్ మోడ్‌లో ఉపయోగించుకోవచ్చు. యూజ్ చేసిన ప్రతిసారీ నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ గాడ్జెటే అయినా .. వాటర్ ప్రూఫ్ కావడంతో స్నానంచేసేటప్పుడూ వాడుకోవచ్చు. ఇందులో మూడు వేరువేరు బ్రష్‌లు ఉంటాయి. ఒకటి సెన్సిటివ్ ఫేస్ బ్రష్.. ఇది సున్నితమైన చర్మం కోసం మృదువుగా, సౌకర్యవంతంగా పని చేస్తుంది. రెండవది డీప్ క్లెన్సింగ్ బ్రష్.. ఇది రంధ్రాలను శుభ్రపరచి.. చర్మాన్ని నీట్‌గా మారుస్తుంది. మూడవది సిలికాన్ బ్రష్.. ఇది అన్ని చర్మతత్వాలకూ ఉపయోగపడుతుంది. ఈ బ్రష్‌లను స్కిన్ టైప్ని బట్టి మార్చుకుంటూ ఉండాలి. ఈ మెషిన్‌కి చార్జింగ్ పెట్టుకుని.. వైర్ లెస్‌గానూ వాడుకోవచ్చు. ఇందులో పింక్, బ్లూ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. (చదవండి: సంగీతం వస్తేనే సింగర్ అయిపోరు అని ప్రూవ్ చేసింది!) -
టెక్ టాక్: ఈ సరికొత్త వాటిని గురించి ఎప్పుడైనా విన్నారా..!
నిత్య జీవితంలో.. టెక్నాలజీ పరంగా నూతన మార్పులు సంభవిస్తున్నాయి. మానవ అన్నీ అవసరాలను తీర్చిదిద్దేలాగా ఈ టెక్నాటజీ వృద్ధి చెందుతుంది. విద్య, వైద్య, ఉద్యోగాలలోనూ దీని అవసరం మరెంతగానో ఉండేలా కాలం మారుతుంది. అందుకు అనుగుణంగానే ఈ సరికొత్త పరికరాలు మీ ముందుకొచ్చాయి. మరి వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది కట్టుకుంటే నొప్పులు మాయం.. జిమ్‌లో వ్యాయామం చేసేవారికి, మైదానాల్లో ఆటలాడే వారికి ఒక్కోసారి కీళ్లు పట్టేసి నొప్పులు తలెత్తడం మామూలే! ఇళ్లల్లో రోజువారీ పనులు చేసుకునేటప్పుడు కూడా ఒక్కోసారి నొప్పులు తలెత్తుతుంటాయి. ఇలాంటి నొప్పులకు నొప్పినివారణ మాత్రలు వాడటం, పైపూతగా ఆయింట్మెంట్లు పూసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇకపై వాటితో పని లేకుండా, ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరాన్ని నొప్పి ఉన్నచోట పెట్టుకుని, దీనికి ఉన్న బెల్టుతో బిగించి కట్టుకుంటే చాలు, సత్వరమే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అమెరికన్ కంపెనీ ‘థెరాబాడీ’ ఇటీవల ‘రికవరీ థెర్మ్‌క్యూబ్’ పేరిట ఈ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మనం కోరుకున్న విధంగా చల్లదనం లేదా వెచ్చదనాన్ని ఎంచుకోవడానికి స్విచ్‌లు ఉంటాయి. నొప్పి ఉన్న చోట ఈ క్యూబ్‌ను అదిమిపెట్టి బిగించి బెల్ట్ కట్టుకుంటే చాలు, రెండు గంటల్లోనే పూర్తిగా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని ధర 149 డాలర్లు (రూ.12,350) మాత్రమే! హైడ్రోజన్‌తో పరుగులు తీసే కారు.. జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ ‘హోండా’ తాజాగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో నడిచే కారును రూపొందించింది. హోండా మోడల్స్‌లోని ‘సీఆర్–వి’ మోడల్ ఎస్‌యూవీకి అవసరమైన మార్పులు చేసి, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో నడిచేలా ‘సీఆర్వీ: ఈఎఫ్సీఈవీ’ మోడల్‌కు రూపకల్పన చేసింది. ఇందులో ఉపయోగించే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మాడ్యూల్స్ తయారీకి మరో కార్ల తయారీ సంస్థ ‘జనరల్ మోటార్స్’ సహకారం తీసుకుంది. ఇందులో అమర్చిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మాడ్యూల్స్‌లోని 110 వోల్టుల పవర్ ఔట్లెట్ ద్వారా ఇంజిన్‌కు దాదాపు 1500 వాట్ల విద్యుత్తు సరఫరా అవుతుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసుకున్నట్లయితే, ఇది ఏకంగా 435 కిలోమీటర్ల వరకు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. ఈ కారును హోండా మోటార్స్ వచ్చే ఏడాది నాటికి మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. బ్యాటరీతో నడిచే ఈ–విమానం ఇది బ్యాటరీతో నడిచే ఈ–విమానం నమూనా. ఇది అందుబాటులోకి వస్తే, విమానయాన రంగంలో విప్లవాత్మకమైన మార్పు రాగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే రోడ్లపైకి వచ్చిన ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే ఈ విమానం కూడా రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. డచ్ విమానాల తయారీ కంపెనీ ‘ఎలీసియన్’ ఈ బ్యాటరీ విమానం నమూనాకు ఇటీవల రూపకల్పన చేసింది. ‘ఎలీసియన్–ఈ9ఎక్స్’ పేరుతో రూపొందించిన ఈ విమానం 2033 నాటికి అందుబాటులోకి రానున్నట్లు ‘ఎలీసియన్’ కంపెనీ ప్రకటించింది. సాధారణ విమానాల కంటే చాలా తక్కువ బరువుతో రూపొందించిన ఈ విమానం వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో 90 మంది ప్రయాణికులు ప్రయాణించడానికి వీలవుతుంది. ఇవి చదవండి: వీటిని చూశారంటే.. మంత్ర ముగ్ధులు అవక తప్పదు! -
హెల్త్: 'మెగా షేప్ మసాజర్' తో.. ఫిట్నెస్ సెంటర్స్‌కి చెక్!
ఏ డ్రెస్ వేసుకున్నా.. అతికినట్టు సరిపోవాలంటే బాడీ సరైన షేప్‌లో ఉండాలి. అందుకే స్లిమ్ అండ్ ఫిట్ షేప్ కోసం నానాతంటాలు పడేది! ఆ కష్టాన్నించి గట్టెక్కించేదే ఈ మసాజర్. ఇది చక్కటి శరీరాకృతిని అందిస్తుంది. దీన్ని సాధారణ సమయాల్లోనే కాదు.. స్నానం చేస్తున్నప్పుడూ వాడుకోవచ్చు. సాధారణంగా మెషిన్స్‌కి వాటర్ తగిలితే పనిచేయవు. కానీ ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందిన మెషిన్ కాబట్టి.. వాటర్‌ప్రూఫ్‌గా పనిచేస్తుంది. దాంతో స్నానం చేస్తూ కూడా దీన్ని చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు. మొదట ఏదైనా ఆయిల్ లేదా స్కిన్ టైటెనింగ్ క్రీమ్‌ని అప్లై చేసుకుని.. ఈ మసాజర్‌తో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మొత్తం 8 రోలర్లు, 13 ప్రోట్రూషన్ లతో కూడిన ఈ బ్యూటీ మసాజర్.. ఒత్తిడిని దూరం చేస్తుంది. డివైస్‌కి అమర్చుకునే రోలర్స్.. నాలుగు నాలుగు చొప్పున రెండు పార్ట్స్‌గా అమర్చి ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని మార్చుకోవచ్చు. మసాజ్ సమయంలో స్పీడ్ తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. ఇది కొవ్వును తగ్గిస్తూ యవ్వనంగా మారుస్తుంది. ఈ డివైస్‌తో పాటు.. ఎసిటినో 5డి డిజైనింగ్ క్రీమ్ కూడా లభిస్తుంది. దీన్ని విడిగా కూడా మార్కెట్లో కొనుగోలు చేసుకోవచ్చు. ఫిట్నెస్ సెంటర్స్‌కి వెళ్లాల్సిన పని లేకుండానే.. ఈ డివైస్ మిమ్మల్ని నాజూగ్గా, స్లిమ్‌గా మారుస్తుంది. దీనికి 3 గంటల పాటు చార్జింగ్ పెడితే.. సుమారు 30 గంటల పాటు పని చేస్తుంది. కాళ్లు, చేతులు, నడుము, మెడ, పొట్ట భాగాల్లో పేరుకున్న కొవ్వును వేగంగా కరిగిస్తుంది. దీన్ని మెత్తటి క్లాత్ లేదా టిష్యూ సాయంతో క్లీన్ చేసుకోవచ్చు. వినియోగించడం.. ఇతర ప్రదేశాలకు తీసుకుని వెళ్లడం అంతా సులభమే. దీని ధర 207 డాలర్లు. అంటే 17,167 రూపాయలు. ఇవి చదవండి: మిస్ వరల్డ్ పోటీల్లో పింక్ సీక్విన్ గౌనుతో మెరిసిన పూజా హెగ్డే! -
ఈ డివైజ్‌తో అందమైన ముఖ ఆకృతి మీ సొంతం!
ముఖాన్ని కాస్టీ కాస్మెటిక్స్‌తో, మేకప్‌తో తీర్చిదిద్దడం కంటే.. ఇలాంటి డివైస్ల సాయంతో తీర్చిదిద్దితే ఆ అందం ఎక్కువ కాలం నిలుస్తుంది. చిత్రంలోని ఈ మైక్రోకరెంట్ ఫేషియల్ మసాజర్‌ను ఉపయోగించి.. డబుల్ చిన్ను తగ్గించుకోవచ్చు. ముడతలు, గీతలు లేకుండా మృదువుగా మార్చుకోవచ్చు. ఈ స్కిన్ లిఫ్ట్ పరికరం.. హీటింగ్, వైబ్రేషన్‌తో పనిచేస్తుంది. ఇది కళ్లు, పెదవులు, బుగ్గలు ఇలా ప్రతి భాగంలోనూ ముడతలు, మచ్చలు, మొటిమలు, సన్‌స్పాట్‌లను పూర్తిగా మాయం చేస్తుంది. అలాగే ముఖ ఆకృతిని మార్చి.. డార్క్ సర్కిల్స్‌ని తగ్గిస్తుంది. ప్రత్యేకమైన గ్లోను అందిస్తుంది. ఎలక్ట్రిక్ డివైస్ అయిన ఈ మసాజర్.. ఎలాంటి ప్రమాదాలను కలిగించదు. స్కిన్ రిజువనేషన్ స్కిన్ కేర్ టూల్‌గా గుర్తింపు పొందిన ఈ మెషిన్‌కి చిత్రంలో చూపిన విధంగా చార్జింగ్ పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన బేస్ లభిస్తుంది. దానిమీద ఈ టూల్‌ని అమర్చుకుని చార్జింగ్ పెట్టుకోవాలి. ఇందులో మొత్తం నాలుగు రంగుల ప్రత్యేకమైన మోడ్స్ ఉంటాయి. రెడ్, పర్పుల్‌తో పాటు బ్లూ కలర్లో రెండు మోడ్స్ ఉంటాయి. ఈ డివైస్‌ని ఎలా వాడాలో తెలుపుతూ ఒక బుక్లెట్ కూడా లభిస్తుంది. దీనికి రెండు హెడ్స్ ఉంటాయి. ఒకటి క్లీనింగ్ బ్రష్ హెడ్, రెండు మసాజింగ్ హెడ్. వాటిని మార్చుకుంటూ చర్మాన్ని మొదట శుభ్రం చేసుకుని.. తర్వాత మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం అందుతుంది. (చదవండి: 'ఇంగువ'ని ఇలా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు!) -
ఇంట్లోనే ఈజీగా మసాజ్ చేయించుకోవచ్చు ఇలా..!
శారీరకంగా బాగా అలసిపోయినప్పుడు చాలామంది మర్దనతో సేదదీరాలని కోరుకుంటారు. ఒంట్లోని కండరాలు సేదదీరేలా మర్దన చేయడం ఒక కళ. ఈ కళలో నిపుణులైన వాళ్లు స్పాలు, మసాజ్ సెంటర్లలో సేవలందిస్తుండటం తెలిసిందే. ‘కరోనా’ కాలంలో మనిషి పొడ సోకితేనే భయపడే పరిస్థితులు దాపురించాయి. మనిషిని మనిషి తాకకుండా మర్దన చేయడం సాధ్యమయ్యే పనికాదు. అందుకే, మనిషితో ప్రమేయం లేకుండానే చక్కగా మర్దన చేయగల రోబోను అమెరికన్ కంపెనీ ‘ఫిలాన్ ల్యాబ్స్’ రూపొందించింది. ఈ మసాజర్ రోబో పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. మనిషి శరీరాకృతి, కండరాల పనితీరు ఆధారంగా తగిన రీతిలో మర్దన చేస్తుంది. ఈ రోబోకు అమర్చిన 35 సెంటీమీటర్ల భుజం మంచం మీద పడుకున్న మనిషి శరీరం అంతటా సంచరిస్తూ, గరిష్ఠంగా 6.8 కిలోల ఒత్తిడి కలిగిస్తూ మర్దన చేస్తుంది. సున్నితంగా మర్దన చేయాల్సిన చోట సున్నితంగా, ఎక్కువగా ఒత్తిడి కలిగించాల్సిన చోట ఎక్కువగా ఒత్తిడి కలిస్తూ నిమిషాల్లోనే కండరాలు సేదదీరేలా చేస్తుంది. దీని ధర 3,499 డాలర్లు (రూ.2.91 లక్షలు) మాత్రమే! (చదవండి: చాయ్ తాగాలంటే కొండ ఎక్కాల్సిందే! శిఖరాగ్ర పానీయం!) -
అలసిన కళ్లకు రిలీఫే ఈ ఐ మసాజర్!
మారిన లైఫ్ స్టయిల్ వల్ల మన బాడీలో బాగా స్ట్రెయిన్ అవుతున్నవి కళ్లే! కంప్యూటర్, సెల్‌ఫోన్.. కళ్లకు క్షణం తీరికనివ్వడం లేదు. దాంతో ఆ అలసట అందాన్ని ఎఫెక్ట్ చేస్తోంది. దానికి చక్కటి రిలీఫే ఐ మసాజర్. చిత్రంలోని ఈ హీటింగ్ ఫటీగ్ థెరపీ వెల్నెస్ డివైస్.. కళ్ల భారాన్ని, ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇందులో హై, మీడియం, లో అనే త్రీ మోడ్స్ ఉంటాయి. ‘లో’ ఆప్షన్‌కి 36 డిగ్రీల సెల్సియస్ (97 డిగ్రీల ఫారెన్ హీట్) ప్రభావం ఉంటే.. ‘మీడియం’ ఆప్షన్‌కి 39 డిగ్రీల సెల్సియస్ (102 డిగ్రీల ఫారెన్ హీట్) ప్రభావం ఉంటుంది. ఇక ‘హై’ ఆప్షన్లో 42 డిగ్రీల సెల్సియస్ (108 డిగ్రీల ఫారెన్ హీట్) టెంపరేచర్ ఉత్పత్తి అవుతుంది. ఈ డివైస్ చేతిలో ఇమిడిపోయేంత చిన్నగా.. కళ్లకు అమరేంత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది వేడెక్కడానికి 10 సెకన్ల సమయం పడుతుంది. అలాగే దీనికి చార్జింగ్ పెట్టుకోవడానికి ప్రత్యేకమైన ప్యాడ్ లభిస్తుంది. దాంతో ఈ మసాజర్‌ని వైర్‌లెస్‌గా వినియోగించుకోవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించడంతో పాటు.. అలసటను దూరం చేస్తుంది. కళ్ల చుట్టూ మచ్చలు, ముడతలు ఏర్పడి, కళాహీనంగా మారకుండా సంరక్షిస్తుంది. అలాగే సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చి రిలాక్స్ చేస్తుంది. ఈ పోర్టబుల్ పర్ఫెక్ట్ ఐ మసాజర్‌ని ప్రతిరోజూ వినియోగించుకోవచ్చు. (చదవండి: ముఖానికి ఫేస్ యోగా! దెబ్బకు మొటిమలు, మచ్చలు మాయం!) -
ఈ పోర్టబుల్ డివైజ్ ఉంటే ఇంట్లోనే ఈజీగా రోల్ మసాజ్!
చర్మం బిగుతుగా.. మృదువుగా మెరవాలంటే తగినన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే. అందులో ఈ ప్రత్యేకమైన రోల్ మసాజ్ ట్రీట్మెంట్ మంచి ఫలితాన్ని అందిస్తోంది. జపనీస్ టెక్నాలజీతో రూపొందిన ఈ బ్యూటీ ఫేస్ రోలర్.. వినియోగం చాలా తేలిక. ముఖ కండరాలను ఉత్తేజపరచడంలో.. చర్మం మీదున్న ముడతలు తగ్గించడంలో.. ఇది ఎంతగానో సహకరిస్తుంది. దీనికి చార్జింగ్ పెట్టుకుని వినియోగించుకోవాలి. సుమారు 90 నిమిషాల పాటు చార్జింగ్ పెట్టుకుంటే.. 150 నిమిషాల పాటు ఈ డివైస్ నిరంతరాయంగా పని చేస్తుంది. ఈ చర్మ సంరక్షణ పరికరాన్ని ఈజీగా ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు. దీనిలో రెండు రోల్స్.. వి షేప్‌లో ఫిక్స్ చేసి ఉంటాయి. అవి చర్మం మీద సులభంగా రోల్ అవుతాయి. బుగ్గలు, మెడ భాగాల్లోని ఒంపుల్లో మసాజ్ చేసుకోవడానికి వీలుగా ఇది రూపొందింది. వైబ్రేట్ అవుతూ మసాజ్ చేసేందుకు ఇవి అనువుగా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్.. ఫేస్‌ని ఎంతగానో మెరిపిస్తుంది. దీని ధర 32 డాలర్లు. అంటే 2,664 రూపాయలు. అయితే ఈ ట్రీట్మెంట్కి ముందు చర్మాన్ని శుభ్రంగా చల్లటి వాటర్‌తో కడుక్కుని.. మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. మోడ్స్ ఆన్ చేసుకుని.. మసాజర్ వినియోగించుకోవాలి. ఇది ఆన్‌లో ఉంటే.. సుమారు మూడు నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. గ్లాస్ స్కిన్ కోసం.. ఒక కప్ ఓట్స్.. ఒక టేబుల్ స్పూన్ తేనెకు ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసి అది పేస్ట్‌లా మారేవరకు బాగా కలిపి ఆ పేస్ట్‌తో ఫేస్ రుద్దుకుని ఓ 15 మినిట్స్ వరకు అలా వదిలేయాలి. తర్వాత చన్నీళ్లతో ఫేస్ వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లయ్ చేసుకోవాలి. -
చక్కగా మసాజ్,ఈ బ్రష్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది..
చూడటానికి కంప్యూటర్ మౌస్లా కనిపించే ఈ పరికరం హెడ్మసాజర్. ఇది రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీని అడుగుభాగంలో సున్నితమైన బ్రష్ ఉంటుంది. ఆన్ చేసుకుని, కోరుకున్న వేగాన్ని సెట్ చేసుకుంటే చాలు. తలదిమ్ము వదిలేలా, తలకు హాయి కలిగించేలా ఇంచక్కా మర్దన చేస్తుంది. దీని బ్రష్ జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా జుట్టురాలడాన్ని అరికడుతుంది. జుట్టు ఇప్పటికే రాలిపోయిన చోట కొత్త వెంట్రుకలను మొలిపిస్తుంది. జపాన్‌కు చెందిన ‘హెబావోడాన్’ కంపెనీ ఈ పరికరాన్ని ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 5200 యెన్లు (రూ.2,925) మాత్రమే! -
ఒత్తిడితో బాధపడుతున్నారా? దీన్ని తలకు ధరించండి చాలు
మనసు ఆహ్లాదంగా ఉంటేనే మొహం మెరుస్తుంది. అలసట లేని అందం కావాలంటే.. హ్యాండ్స్–ఫ్రీ హెడ్ మసాజర్ మీ ఇంట్లో ఉండాల్సిందే. ఈ ఎలక్ట్రిక్ స్కాల్ప్ మసాజర్.. మొత్తం నాలుగు వైబ్రేషన్ మోడ్స్‌తో పనిచేస్తుంది. దీన్ని తలకు పెట్టుకుంటే.. రక్త ప్రసరణ పెరుగుతుంది. నిద్రలేమి దూరమై.. హాయిగా నిద్రపడుతుంది. అలసట మాయమవుతుంది.ఉద్యోగులు, డ్రైవర్లు, క్రీడాకారులు, వృద్ధులు, అలసటతో ఉన్న వారు, కార్మికులు, తలనొప్పి లేదా ఒత్తిడితో బాధపడుతున్న వాళ్లందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. యాక్టివ్ మోడ్, రిలాక్స్ మోడ్, బ్యూటీ మోడ్, స్లీప్ మోడ్ ఇలా.. ప్రతి మోడ్ భిన్నంగా ఉంటుంది. కావల్సిన ఆప్షన్‌ను ఈజీగా ఎంచుకోవచ్చు. చూడటానికి సాలెపురుగులా ఉన్న ఈ మసాజర్ పొడవాటి పది ఫ్లెక్సిబుల్ టూల్స్.. చేతి వేళ్ల మాదిరిగా తలను పట్టి ఉంచుతాయి. లోపలి భాగంలో బాల్స్ లాంటి మెత్తటి నాలుగు టూల్స్ ఉంటాయి. వాటన్నిటి నుంచి తలకు మృదువైన వైబ్రేషన్ లభిస్తుంది. సుమారు 15 నిమిషాలు దీన్ని వాడితే మంచి ఫలితం ఉంటుంది. అన్ని తెలిసిన స్టార్టర్స్కైనా.. ఆప్షన్స్ పెద్దగా తెలియని పెద్దవాళ్లకైనా దీని వాడడం సులభం. మెషీన్‌ను స్టార్ట్ చేయడానికి లేదా షట్ డౌన్ చేయడానికి పవర్ బటన్ ను 3 సెకన్ల పాటు నొక్కి ఉంచాలి. మోడ్ మారడానికి అదే బటన్ ఉపయోగపడుతుంది. హైక్వాలిటీ సిలికాన్‌తో రూపొందిన ఈ డివైజ్ చాలా తేలికగా.. ఎక్కడికైనా తీసుకెళ్లడానికి ఈజీగా ఉంటుంది. డిజైన్‌ను బట్టి దీని దీని ధర ఉంటుంది. -
బౌల్ మసాజ్‌తో మెరిసిపోండి!
కొబ్బరి నూనె, ఫేస్ ఆయిల్, మాయిశ్చరైజర్... వీటిలో ఏదైనా ఒకటి ముఖానికి రాయాలి. ఇప్పుడు చిన్న స్టీల్గిన్నెను తీసుకుని ముఖమంతా మర్దన చేయాలి. నుదురు, కనుబొమ్మలు, బుగ్గలు, మెడ భాగంలో గిన్నెను గుండ్రంగా తిప్పుతూ ముఖానికి రాసిన నూనె లేదా మాయిశ్చరైజర్ చర్మంలోకి పూర్తిగా ఇంకిపోయేంత వరకు మర్దన చేయాలి. ఇలా చేస్తే... ముఖం మీద ముడతలు తగ్గుతాయి. చర్మం మృదువుగా మారుతుంది. రక్తప్రసరణ మెరుగుపడి చర్మం కాంతిమంతంగా మెరుస్తుంది. కండరాల మీద ఒత్తిడి తగ్గి చర్మానికి విశ్రాంతి దొరుకుతుంది. ఈ బౌల్ మసాజ్ ఆయుర్వేద చికిత్సలో ఉపయోగిస్తారు కూడా. దీంతో కేవలం ముఖం మాత్రమే కాకుండా పాదాలు దగ్గర నుంచి బాడీ అంతా మసాజ్ చేస్తారు. ప్రత్యేకించి ఇత్తడి వంటి బౌల్‌తో మసాజ్ చేస్తారు. ఇది అలసట, వాపును తగ్గిస్తుంది. నిద్రలేమి నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే అలసటతో ఉన్న పాదాలను ఈ బౌల్‌తో మసాజ్ చేసుకుంటే రిలీఫ్‌గా ఉండటమే గాక రక్తప్రసర సంక్రమంగా జరిగి చాలా ఉపశమనంగా ఉంటుంది. కంటి పనితీరుకి ఈ మసాజ్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ బౌల్ మసాజ్ విధానం వల్ల శరీరీ పనితీరుని నియంత్రించే వాతపిత్త కఫా దోషాలను సమతుల్యం చేస్తుందట. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక్కసారి ఈ బౌల్ మసాజ్ ట్రై చేయండి. (చదవండి: ఈ కిట్ మీవద్ద ఉంటే..పార్లర్‌కి వెళ్లాల్సిన పని ఉండదు!) -
ఫేషియల్ మెషిన్.. ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది
స్కిన్ కేర్‌లో స్త్రీలు పాటించే పద్ధతులు చాలా ప్రత్యేకం. తెలిసిన చిట్కాలు.. నిపుణుల సలహాలు.. పార్లర్స్‌లో ట్రీట్మెంట్లు.. ఇలా రకరకాల పద్దతులను పాటిస్తుంటారు. అయినా సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. అందుకు మంచి సొల్యూషన్.. ఈ హ్యాండ్‌హెల్డ్ ఫేషియల్ మసాజర్. బెస్ట్ స్కిన్ స్పెషలిస్ట్‌లా ఉపయోగపడుతుంది.ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఫేస్ అండ్ స్కిన్ కేర్ థెరపీ టూల్.. సులభమైన ఎన్నో చికిత్సలను అందిస్తుంది. దీనిలోని ఎల్ఈడీ లైట్ థెరపీ హెడ్.. ముడతలను, మచ్చలను పోగొడుతుంది. చర్మం లోతుల్లోకి వెళ్లి శుభ్రపరుస్తుంది. ముఖ కండరాలను ఉత్తేజపరిచేందుకు.. కొల్లాజెన్‌ను నిర్మించడానికి.. తగిన మోతాదులో వైబ్రేషన్‌ను అందిస్తుంది. కాంతిమంతమైన ముఖాన్ని తీర్చిదిద్దడంలో ఈ పర్సనల్ బ్యూటీ మెషిన్ చక్కగా ఉపయోగపడుతుంది. హాట్ అండ్ కోల్డ్ రింగ్స్‌తో పాటు క్లీనింగ్ రింగ్నూ అవసరాన్ని బట్టి మార్చుకుంటూ స్వయంగా ఎవరికి వారే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మైక్రోకరెంట్ టెక్నాలజీతో ఈ ఫేషియల్ మెషిన్.. కళ్ల చుట్టూ ఉండే నల్లటి మచ్చలను పోగొడుతుంది. అలాగే చర్మపు బిగువును కాపాడుతుంది. ముఖ కండరాల్లో రక్తప్రసరణను బాగా పెంచి.. స్కిన్ టోన్‌ను మెరిపిస్తుంది. చిగుళ్ల నొప్పులు, తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలను.. అలసట, ఒత్తిడినీ దూరం చేస్తుంది.ఈ మెషిన్ ని భద్రపరచు కోవడానికి సాఫ్ట్ కేరింగ్ బ్యాగ్ లభిస్తుంది. అలాగే చార్జింగ్ పెట్టుకోవడానికి ఒక యూఎస్బీ చార్జింగ్ కేబుల్ ఉంటుంది. ఇలాంటి డివైజెస్‌ను ఆన్లైన్లో కొనుక్కునే ముందు వినియోగదారుల రివ్యూస్‌ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీని ధర 395 డాలర్లు. అంటే రూ. 32 వేల పైనే. అయితే ఆప్షన్స్‌ని బట్టి.. అదనపు రింగ్స్ కొనుగోలుచేయడానికి అదనపు ధర ఉంటుంది. దీన్ని పురుషులు కూడా వినియోగించుకోవచ్చు. -
‘అయ్యయ్యో.. లోపలుండిపోయానే’.. మసాజ్ మిషన్‌లో నుంచి కేకలు..
పెద్దపెద్ద ఎలక్ట్రానిక్ స్టోర్స్‌లో మసాజ్ చైర్లు కనిపిస్తుంటాయి. ఇక్కడకు షాపింగ్‌కు వచ్చిన వినియోగదారులు ఒక్కోసారి ఇటువంటి చైర్లలో సేదతీరుతుంటారు. అయితే ఈ విధంగా మసాజ్చైర్లో కూర్చున్న వ్యక్తికి వింత అనుభవం ఎదురయ్యింది. ఈ ఉదంతం జపాన్‌లో చోటుచేసుకుంది. ఒక వినియోగదారు మసాజ్ చైర్లో సేద తీరుతూ నిద్రపోయాడు. రాత్రి కావడంతో స్టోర్ బంద్ అయిపోయింది. ఆ వ్యక్తి ఫోనులో ట్వీట్ ద్వారా సాయం అడినప్పుడు ఈ విషయం వెలుగుచూసింది. @_Asphodelus అనే పేరు కలిగిన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ వ్యక్తి ట్వీట్ చేశాడు. చీకటితో కూడిన ఒక ఫొటోను షేర్ చేసిన ఆయన ‘అయ్యయ్యో.. లోపలుండిపోయానే’ అని రాశాడు. కేఎస్ అనే పేరు కలిగిన స్టోర్ బంద్ అయి ఉండటాన్ని ఫోటోలో చూడవచ్చు. కాగా అనంతరం ఆ వ్యక్తి స్టోర్‌లోని అలారం మోగించగా పోలీసులకు ఈ సమాచారం అందింది. వెంటనే వారు స్టోర్ యజమానికి ఈ విషయాన్ని తెలియజేశారు. మొత్తం 10 మంది పోలీసు అధికారులు స్టోర్‌లో నుంచి అతనిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అతనిని దొంగ కాదని నిర్ధారించుకున్నారు. కాగా స్టోర్‌కు తాళాలు వేసిన సిబ్బంది మసాజ్ చైర్లో ఉండిపోయి ఇబ్బందిపడిన వ్యక్తిని క్షమాణలు కోరారు. అయితే ఈ స్టోర్‌లో ఆ వ్యక్తి ఎంతసేపు బందీ అయిపోయారన్న విషయం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పోస్టుకు 39 వేలకుపైగా షేర్లు వచ్చాయి. ఈ పోస్టు చూసిన ఒక యూజర్ ‘డిపార్ట్మెంటల్ స్టోర్‌లో బంద్కావడం అనేది తన చిన్నప్పటి కల అని అన్నారు. మరొక యూజర్ తాను అలా బందీ అయితే ‘ఎస్కేప్ ది రూమ్’ స్టయిల్ గేమ్స్ ఆడుకుంటానని అన్నారు. ఇది కూడా చదవండి: ‘ఏంట్రా ఇదంతా’..‘ఎవర్రా మీరు’.. ‘ఇదేందిది’.. వీటికి బాప్ ఈ వీడియో! え…… pic.twitter.com/AalynpL1PB — こばたつ (@afdc1257) August 15, 2016 -
చైనీయుల స్కిన్ సీక్రెట్ ఇదే.. ఇలా చేస్తే మీరు కూడా యవ్వనంగా
వయసు పెరిగే కొద్ది ముఖమైనా, శరీరమైనా తగిన కొలతలతో, నాజూగ్గా కనిపించాలంటే.. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోక తప్పదు. చర్మం వదులుగా మారిపోకుండా.. బుగ్గలు, మెడ భాగాల్లో కొవ్వు పేరుకుపోకుండా, డబుల్ చిన్ ఏర్పడకుండా, కళ్లచుట్టు ముడతలు, వలయాలు పెరిగిపోకుండా జాగ్రత్త వహించాలంటే ఈ స్కిన్ రోలర్ మీ పర్సనల్ బ్యూటీ కిట్‌లో భాగం కావాల్సిందే! చిత్రంలోని ఈ టూల్‌ని గువా షా ఫేషియల్ రోలర్ అని కూడా పిలుస్తారు. గువా షా అంటే చైనీస్ సంప్రదాయ సౌందర్య సాధనం. తేలికపాటి టూల్‌తో ఫేస్ లేదా బాడీ మీద ఆక్యుప్రెజర్ పాయింట్స్‌ని ఉత్తేజపరిచే పద్ధతి. ఈ రోలర్ అలాంటిదే! ఇన్నోవేటివ్ షేప్ డిజైన్‌తో, అల్ట్రా–స్మూత్ జింక్ అల్లాయ్ మెటీరియల్‌తో రూపొందిన ఈ టూల్.. చర్మ ఆకృతిని బిగుతుగా చేస్తుంది. పోగొట్టుకున్న యవ్వనాన్ని తిరిగి ఇవ్వడంలో సహకరిస్తుంది. చర్మాన్ని తాజాగా మారుస్తుంది. ఈ టూల్లోని రోలింగ్ బాల్ కళ్లు, ముక్కు వంటి భాగాల్లోని సున్నితమైన మూలల్లో బాగా పని చేస్తుంది. చేరుకోలేని చిన్నచిన్న భాగాల్లో అది చక్కగా ఉపయోగపడుతుంది.ఈ ట్రీట్మెంట్ని దినచర్యలో భాగం చేసుకుంటే.. చర్మం మీద చిన్నచిన్న గీతలు, ముడతలు తగ్గి చర్మం మృదువుగా మారుతుంది. అనవసరమైన కొవ్వు పేరుకుపోదు. కండరాల్లో ఒత్తిడి కూడా తగ్గి ఉపశమనంగా ఉంటుంది. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని, అవసరమైనప్పుడు తీసి మసాజ్ చేసుకుంటూ ఉండాలి. పని పూర్తి కాగానే క్లీన్ చేసి మళ్లీ ఫ్రిజ్‌లో భద్రపరచుకోవచ్చు.ఈ రోలర్‌లో గుండ్రటి బాల్ 360 డిగ్రీలు రొటేట్ అవుతుంది. మధ్యభాగంలో ఒకవైపు వీపు వెనుక, నుదుట మీద మసాజ్ చేసుకోవడానికి.. మరోవైపు బుగ్గలు, మెడ, కాళ్లు, చేతులు వంటి ఒంపులున్న భాగాల్లో మసాజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక కింది భాగంలో చేప తోకలా కనిపిస్తున్న ఆ భాగంతో గడ్డం చుట్టు మసాజ్ చేసుకోవచ్చు. -
ప్లాటినం బాడీ మసాజర్.. అందంతో పాటు ఆరోగ్యం కూడా
అందం, ఆరోగ్యం రెండింటినీ అందించే డివైస్‌లకు ఈ రోజుల్లో గిరాకీ ఎక్కువ. చిత్రంలోని ఈ మసాజర్ బ్యూటీ ప్రొడక్ట్‌తో పాటు హెల్త్ టూల్ కూడా. ఈ డ్యూయల్ రోలర్ ప్లాటినం బాడీ మసాజర్.. రెండు రోలర్లను కలిగి ఉంటుంది. ఈ రోలర్స్ను పక్కపక్కనే ఉంచుకుని వినియోగించుకోవచ్చు లేదా ‘వి’ షేప్‌లా మార్చుకుని కూడా ఉపయోగించుకోవచ్చు. దాంతో ముఖం, మెడ, నడుము, తొడలు, కాళ్లు, చేతులు ఇలా అన్ని భాగాల్లో మసాజ్ చేసుకోవచ్చు. సాధారణంగా చాలామంది మహిళలు తమ చర్మ సంరక్షణను చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అలాంటి వారు రోజుకి కొన్ని నిమిషాల పాటు బాడీ మొత్తాన్ని ఈ మసాజర్‌తో మసాజ్ చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. కండరాల్లో ఉత్తేజం కలిగించడానికి, ముడతలు, నొప్పులు పోగొట్టడానికి ఈ పరికరం బాగా ఉపయోగపడుతుంది. చర్మం కూడా కాంతిమంతమవుతుంది. దీనికి చార్జింగ్‌తో పని లేదు. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఈ సెట్‌ని జాగ్రత్త చేయడానికి ప్రత్యేకమైన పర్స్‌తో పాటు.. రోలర్ని శుభ్రం చేయడానికి మెత్తటి క్లాత్ కూడా లభిస్తుంది.అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్, ప్లాటినం పౌడర్, జర్మేనియం పౌడర్ వంటి మెటీరియల్స్‌తో రూపొందిన ఈ టూల్ నాణ్యమైనది.. మన్నికైనది. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం తేజోవంతమవుతుంది. బాడీ ఎనర్జిటిక్‌గా మారుతుంది. బాగుంది కదూ! -
కళ్లకు గంతలు కాదు.. హైటెక్ మసాజర్
ఫొటోలో కనిపిస్తున్న యువతి కళ్లకు తెల్లని గంతలు తొడుక్కున్నట్లు కనిపిస్తోంది కదూ! ఆమె కళ్లకు తొడుకున్నది గంతలు కాదు, హైటెక్ మసాజర్. అమెరికన్ కంపెనీ ‘ట్రూరెల్’ రూపొందించిన ‘ఐ మసాజర్’. ఇది బ్లూటూత్ ద్వారా పనిచేస్తుంది. అలసిన కళ్లను సుతారంగా మర్దన చేస్తుంది. కళ్ల చుట్టూ తగినంత నులివెచ్చదనాన్ని కలిగిస్తుంది. (Radhika Merchant Bag: అంబానీకి కాబోయే కోడలు చేతిలో చిన్న బ్యాగు.. అందరి దృష్టి దానిపైనే.. ధర ఎంతో తెలుసా?) ఇందులోని ఎస్టీవీ టెక్నాలజీ ద్వారా కోరుకున్న రీతిలో వైబ్రేషన్స్, పల్సింగ్ సృష్టించి, తగినంత వెచ్చదనాన్ని, గాలి పీడనాన్ని కలిగించి కళ్ల అలసటను ఇట్టే మటుమాయం చేస్తుంది. ఇది అడ్జస్టబుల్ హెడ్‌సెట్‌తో లభిస్తుంది. తల పరిమాణానికి తగినట్లుగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులోని ప్లేలిస్ట్‌లో ఉన్న పాటలను వింటూ, కళ్లకు మర్దన తీసుకుంటూ, హాయిగా సేదదీరవచ్చు. దీని ధర 105 డాలర్లు (రూ.8,678) మాత్రమే. (వెంట వచ్చే రిఫ్రిజిరేటర్.. మొబైల్ ఫోన్లోనే కంట్రోలింగ్) -
హెయిర్ కేర్ టిప్స్
ప్రతి రోజూ పది నుంచి పదిహేను నిమిషాలపాటు తలకు మసాజ్ చేసినట్లయితే జుట్టు కుదుళ్లు గట్టిపడి జుట్టు రాలడం తగ్గుతుంది. రోజూ తలస్నానం చేసేవాళ్లు తల రుద్దుకునేటప్పుడే పది నిమిషాల సేపు మసాజ్ చేసినట్లు రుద్దితే రెండు పనులూ అవుతాయి. ఉసిరిక పొడి, కుంకుడుకాయ, శీకాయపొడి అన్నీ సమపాళ్లలో అంతా కలిసి రెండు టేబుల్‌స్పూన్లు ఉండేటట్లు చూసుకోవాలి. ఇందులో కోడిగుడ్డు సొన కలిపి అవసరమైతే కొద్దిగా నీటిని కలిపి పేస్టు చేసుకుని తలంతా పట్టించి పది నిమిషాల సేపు మసాజ్ చేయాలి. మసాజ్ పూర్తయిన తర్వాత ఇరవై నిమిషాలకు కడిగేయాలి. అవసరమనిపిస్తే కొద్దిగా గాఢత తక్కువగా ఉన్న షాంపూ వాడవచ్చు. వారానికి కనీసం మూడుసార్ల చొప్పున నెల రోజుల పాటు ఈ ట్రీట్మెంట్ చేస్తే హెయిర్‌లాస్‌ను పూర్తిగా నివారించవచ్చు. హెయిర్‌లాస్‌ను కంట్రోల్ చేయడానికి ఆముదం, బాదం నూనె చక్కటి కాంబినేషన్. ఈ రెండింటినీ సమపాళ్లలో తీసుకుని గోరువెచ్చగా చేసి తలకు పట్టించి మసాజ్ చేయాలి. మసాజ్ పూర్తయిన అరగంటకు తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచిఫలితం ఉంటుంది. ఆముదం, బాదం బదులుగా కొబ్బరి నూనెను కూడా వాడవచ్చు. రోజూ పది నిమిషాల సేపు ఆల్మండ్ ఆయిల్‌తో తలకు మసాజ్ చేస్తే జుట్టు రాలదు. -
ఆగిన గుండెకు.. నేరుగా మసాజ్.. కడుపులో నుంచి చేతిని పంపించి..
గుంటూరు మెడికల్: అరుదైన వ్యాధితో బాధపడుతోన్న వృద్ధుడికి గుంటూరు జీజీహెచ్ జనరల్ సర్జరీ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ జరుగుతుండగా రోగి గుండె ఆగిపోగా.. అప్రమత్తమైన జనరల్ సర్జన్ నేరుగా కడుపులో నుంచి చేతిని గుండెపైకి పంపించి గుండెకు మసాజ్ చేసి ఆగిన గుండెను కొట్టుకునేలా చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడారు. బుధవారం గుంటూరు జీజీహెచ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆపరేషన్ వివరాలను జనరల్ సర్జరీ రెండో యూనిట్ ఇన్చార్జి డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ మీడియాకు చెప్పారు. ప్రకాశం జిల్లా నందనవనం గ్రామానికి చెందిన విట్టా వెంకటేశ్వర్లు (70) నెల రోజులుగా కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, వాంతులు, ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడటం తదితర సమస్యలతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని జనవరి 17న గుంటూరు జీజీహెచ్‌కు తీసుకువచ్చారు. జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో వృద్ధుడికి అత్యవసర సేవల విభాగంలో పరీక్షలు చేసి (గ్యాస్టిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్) చేసి కడుపులో క్యాన్సర్ వల్ల ఆహారం పొట్టలోకి వెళ్లడం లేదని నిర్ధారించి వార్డులో అడ్మిట్ చేసుకున్నారు. జనరల్ సర్జరీ వార్డులో మెరుగైన చికిత్స అందించేందుకు సీటీ స్కాన్, బేరియం ఎక్స్‌రే, గ్యాస్ట్రోస్కోపి, ఎండోస్కోపి చేశారు. స్కానింగ్‌లో గుండె చాలా బలహీనంగా ఉన్నట్లు గుర్తించారు. దాంతోపాటుగా లక్షల్లో ఒకరికి మాత్రమే సంభవించే అత్యంత అరుదైన డయాఫ్రాగ్మెటిక్ హెరి్నయాతో రోగి బాధపడుతున్నట్లు గుర్తించారు. గుండె, ఊపిరితిత్తులు, కడుపుకి మధ్యలో ఉండే డయాఫ్రమ్‌కు రంధ్రం ఏర్పడి అందులో నుంచి కడుపు, పెద్దపేగు సగభాగం గుండెకు, ఊపిరితిత్తులకు అతుక్కున్నట్లు నిర్ధారించారు. సాధారణంగా పుట్టుకతో డయాఫ్రమ్‌కు రంధ్రాలు ఏర్పడి వయసు పెరిగే కొద్ది పూడుకుపోతుందని కిరణ్‌కుమార్ చెప్పారు. వెంకటేశ్వర్లు విషయంలో డయాఫ్రమ్‌కు ఉన్న రంధ్రం పూడుకుపోకుండా పేగులు, కడుపు, గుండె, ఊపిరితిత్తుల మధ్యకు వెళ్లిపోయిందని తెలిపారు. ఆగిన గుండె.. గుండె, ఊపిరితిత్తుల మధ్య అతుక్కుని ఉన్న పేగులు, కడుపును కిందకు తీసేందుకు ఫిబ్రవరి 2న ఆపరేషన్ ప్రారంభించామని, ఆపరేషన్ చేస్తోన్న సమయంలో వృద్ధుడి గుండె ఆగిపోయిందన్నారు. మత్తు వైద్యులు ఛాతిపై నుంచి మసాజ్ చేసే (సీపీఆర్) ప్రయత్నం చేస్తామని, ఆపరేషన్ ఆపాలని సూచించినట్లు చెప్పారు. తక్షణమే తాను డయాఫ్రమ్‌కి ఉన్న రంధ్రం ద్వారా చేతిని గుండెపైకి పోనిచ్చి నేరుగా చేతితో ఆగిపోయిన గుండెను నొక్కి కార్డియాక్ మసాజ్ చేయడంతో కొద్ది క్షణాల్లో ఆగిన గుండె కొట్టుకోవడం ప్రారంభించిందన్నారు. 3 గంటల సేపు ఆపరేషన్ చేసి ఛాతి, గుండెలోకి వెళ్లిన పెద్ద పేగు, కడుపును కిందకు లాగి మరలా సమస్య ఉత్పన్నం కాకుండా ప్రొలేన్ మెష్ అమర్చి డయాఫ్రమ్‌ను మూసివేశామన్నారు. 48 గంటల పాటు ఐసీయూలో రోగిని ఉంచి గుండె, ఊపిరితిత్తులు, మెదడు పనితీరు బాగున్నాయని నిర్ధారించుకున్న తరువాత వెంటిలేటర్ తొలగించి సాధారణ వార్డుకు తరలించినట్లు చెప్పారు. వృద్ధుడు కోలుకోవడంతో బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. చదవండి: భారీగా తగ్గిన చికెన్ ధరలు కిలో ఎంతంటే? ప్రైవేట్ ఆసుపత్రుల్లో దీని చికిత్సకు రూ.10 లక్షలు ఖర్చవుతుందని, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేశామని తెలిపారు. జీజీహెచ్‌కు సీఎం వైఎస్ జగన్ అత్యాధునిక వైద్య పరికరాలు అందజేయడంతో జనరల్ సర్జరీ వైద్య విభాగంలో కార్పొరేట్ ఆసుపత్రి కంటే మెరుగైన ఆపరేషన్లను తాము పేదలకు ఉచితంగా చేస్తున్నామన్నారు. ఆపరేషన్‌లో తనతోపాటు వైద్యులు రమణాచలం, వంశీ, వెంకటరమణ, సంతోష్, నిఖిల్, అనూష, లిఖిత, కిషోర్, వేణు, కోటి, మత్తు వైద్యులు మహే‹Ùబాబు, ప్రదీప్, ధరణి, శ్వేత పాల్గొన్నట్లు వెల్లడించారు. జనరల్ సర్జరీ వైద్య బృందాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి అభినందించారు. -
కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, మచ్చలు, ముడతలకు చెక్! ధర ఎంతంటే
Manual Eye And Face Massager: ముఖంలో కళ్లు ఎంత ప్రత్యేకమో అంతే సున్నితం. కళ్ల విషయంలో ఎప్పటికప్పుడు సురక్షితమైన జాగ్రత్తలు తప్పనిసరి. పైగా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, మచ్చలు, ముడతలు వంటి సమస్యలను దూరం చేయాలంటే.. ఇక్కడ కనిపిస్తున్న మసాజర్‌ని వెంట ఉంచుకోవాల్సిందే. ఈ మాన్యువల్ ఐ అండ్ ఫేస్ మసాజర్.. కళ్లకు సంబంధించి పర్ఫెక్ట్ బ్యూటీ టూల్ అని చెప్పుకోవచ్చు. ముఖానికి కూడా చక్కటి మసాజ్‌ని అందిస్తుంది. ఇది ఐ బ్యాగ్స్‌ని దూరం చేయడంతో పాటు డార్క్ సర్కిల్స్‌ని తొలగించి కళ్లను, ముఖాన్ని అందంగా మారుస్తుంది. ముఖ కండరాలకు రిలాక్స్ మసాజర్లోని బాల్ 360 డిగ్రీలు తిరుగుతూ సరికొత్త యవ్వనాన్ని అందిస్తుంది. కంటి చుట్టూ సున్నితంగా మసాజ్ చేస్తూ ముఖ కండరాలను రిలాక్స్ చేస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. నుదుటి మీద ఏర్పడే ముడతలను దూరం చేయడంతో పాటు.. పెదవులు, బుగ్గల మధ్య ఏర్పడే సన్నటి గీతలను పోగొడుతుంది. దీని ఎర్గోనామిక్ నాన్ – స్లిప్ హ్యాండిల్.. కాంపాక్ట్ డిజైన్‌తో, స్కిన్ ఫ్రెండ్లీ టచ్‌తో.. ఏ వేళలోనైనా ఎక్కడైనా వినియోగించడానికి.. చాలా సులభంగా ఉంటుంది. ఈ టూల్ ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లగలిగేంత చిన్నది. తేలికైనది కూడా. ఇది చిన్న హ్యాండ్ బ్యాగ్‌లో లేదా కాస్మెటిక్ బ్యాగ్‌లో చక్కగా సరిపోతుంది. మెరుగైన ఫలితాలను పొందడానికి దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించాలి. ధర 199 డాలర్లు. అంటే 16,251 రూపాయలు. దీన్ని ప్రియమైన వారికి బహుమతిగానూ ఇవ్వచ్చు! చదవండి: Anasuya Bharadwaj: ఎప్పుడు ఒకే ఆహారపదార్థాలను తినలేం కదా.. ఇదీ అంతే: అనసూయ తలనొప్పి.. ఛాతిలో నొప్పి.. పాదాలు- అరిచేతులు చల్లగా అవుతున్నాయా? ఇవి తిన్నా, తాగినా.. -
ముద్దుల పెట్‌కు గ్లామర్...
సాక్షి, హైదరాబాద్: నేటి ఆధునిక కాలంలో గ్లామర్ మేనియా ఇంట్లో వారికే కాదు.. వాళ్ల పెంపుడు జంతువులకూ ముఖ్యమైపోయింది. ముద్దొచ్చే తమ పెట్స్‌ను మరింత అందంగా చూడాలనుకుంటున్న యజమానులు ఇందుకోసం ఎంతయినా ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పెంపుడు జంతువులను ముస్తాబు చేసే సంస్థలు హైదరాబాద్‌లో క్రమంగా పెరుగుతున్నాయి. మసాజ్, గోళ్ల కత్తిరింపు, బబుల్ బాత్ వంటి సేవలను పెంపుడు జంతువులకు అందిస్తున్నాయి. తరలి వచ్చె తళుకులద్దగ... గతంలో ఈ తరహా పెట్ గ్రూమింగ్ సేవల్ని హైదరాబాద్‌లో కొన్ని సంస్థలు మాత్రమే అందించేవి. అయితే కరోనా సమయంలో తమ పెంపుడు జంతువులను గ్రూమింగ్ పార్లర్స్‌కు తీసుకెళ్లలేక నగరవాసులు పడిన ఇబ్బందులు మొబైల్ పార్లర్స్‌కు ఆజ్యం పోశాయి. ప్రస్తుతం నగరంలో దాదాపు డజనుకుపైగా మొబైల్ వ్యాన్లు పెట్ స్పాలను ఇంటింటికీ మోసుకొస్తున్నారు. ఈ సేవల కోసం పూర్తిగా రసాయనాలు లేని ఉత్పత్తులనే ఉపయోగిస్తున్నామని మొబైల్ పార్లర్ల నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తం గ్రూమింగ్ ప్రక్రియ దాదాపు గంట పడుతుందని... బొచ్చు కుక్కలకు మాత్రం 90 నిమిషాల వరకు సమయం పడుతుందంటున్నారు. అలాగే పిల్లులను పెంచుకొనే వారికి కూడా సేవలు అందిస్తున్నామని వివరిస్తున్నారు. పెట్‌ను ఫంక్షన్ లేదా ఫోటోషూట్‌కు తీసుకెళ్లాల్సి వస్తే అందుకు తగిన దుస్తులు ధరింపజేయడం, ప్రత్యేకంగా హెయిర్‌ను సెట్ చేయడం కూడా చేస్తామని చెబుతున్నారు. వెటర్నరీ డిప్లొమా వారినే తీసుకున్నాం... మా మొబైల్ సెలూన్లలో పనిచేసే గ్రూమర్లందరూ వెటర్నరీ కళాశాల డిప్లొమా హోల్డర్లు. ఉద్యోగంలో భాగంగా తొలుత వారికి 3 నెలలపాటు శిక్షణ సైతం అందిస్తున్నాం. – జస్ట్ గ్రూమ్ నిర్వాహకురాలు చైత్ర వ్యాధుల వ్యయంతో పోలిస్తే నయమే.. శుభ్రత పాటిస్తే పెట్స్ ఆరోగ్యంగా ఉంటాయి. వాటికి సరైన విధంగా స్నానం చేయించడం మన వల్ల సాధ్యం కాదు. ఫలితంగా పెట్స్‌కు చర్మవ్యా« దుల వంటివి రావచ్చు. అందుకే నా పెట్‌కి నెలకో సారి స్పాలో స్నానం, 3 నెలలకు ఒకసారి గ్రూమింగ్ చేయిస్తాను. సగటున దాని శుభ్రతకు నెలవారీగా రూ. 3 వేలు ఖర్చు పెడుతున్నా. అయితే పెట్స్‌కు వ్యాధులు సోకితే అంతకన్నా ఎక్కువే ఖర్చు చేయాలి. పెట్ మొబైల్ సేవల వల్ల పెట్ స్పా కోసం దూరభారం ప్రయాణించే అవసరం పోయింది. – పరిమళ, సికింద్రాబాద్ -
Satyendar Jain: తీహార్ జైల్లో ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు మసాజ్
తీహార్ జైల్లో ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు మసాజ్ -
ఆప్ మంత్రికి మసాజ్.. కొత్త మలుపు