మసాజ్‌ ముసుగులో వ్యభిచారం | adultery in the massage centers | Sakshi
Sakshi News home page

మసాజ్‌ ముసుగులో వ్యభిచారం

Aug 20 2017 3:16 PM | Updated on Sep 4 2018 5:29 PM

మసాజ్‌ ముసుగులో వ్యభిచారం - Sakshi

మసాజ్‌ ముసుగులో వ్యభిచారం

మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.

హైదరాబాద్‌: మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో  మాదాపూర్ , గచ్చిబౌలి , రాయదుర్గం పోలీస్ స్టేషన్ల పరిధిలో 12 మసాజ్ సెంటర్లు , స్పాల పై సైబరాబాద్ స్పెషల్ టీమ్ పోలీసులు దాడులు నిర్వహించారు. 30 మంది యువతులను , 25 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖుల పుత్ర రత్నాలు ఉన్నట్టు సమాచారం. వీళ్లని అదుపులోకి తీసుకున్న మాదాపూర్ పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. 

థాయిలాండ్ దేశానికి చెందిన 20మంది మహిళలు, మేఘాలయ ,త్రివేండ్రం,  సిక్కింకు చెందిన మహిళలు ఉన్నారు. టూరిస్ట్ వీసాపై విదేశీ మహిళలతో క్రాస్ మసాజ్‌తో పాటు సెక్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement