
తలకు మర్దనా చేస్తున్నారా ..?. అయితే ఈ కొద్దిపాటి చిట్కాలు ఫాలోకండి. కేశ సౌందర్యానికే కాదు మన ఆరోగ్యానికి మంచిదట. ఇలా మర్దన చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన మటుమాయం అవుతాయంటున్నారు నిపుణులు. పైగా మనసుకు తేలిగ్గా అనిపించడమే కాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవట. మరీ అనుసరించాల్సిన చిట్కాలేంటో చూద్దామా..!.
తలకు మసాజ్ చేసేటప్పుడు ఒకసారి మొత్తంగా వలయాకారంగా మర్దన చేసిన తర్వాత క్రాస్‌స్ట్రోక్స్ ఇవ్వాలి. దీనికి బొటన వేలు – చూపుడు వేలిని మాత్రమే వాడాలి. రెండు వేళ్లలో ఇమిడేటంత జుట్టును కుదుళ్లకు దగ్గరగా పట్టుకుని ఇంగ్లిష్ అక్షరం ఆకారంలో అటూ ఇటూ లాగి వదలాలి. ఇలా నుదుటి దగ్గర నేరుగా పాపిడి తీసే దగ్గర మొదలు పెట్టి తల వెనుక వరకు వెళ్లి తర్వాత పక్కనే మరొక వరుస... ఇలా తలంతా చేయాలి.
ఇక పించింగ్ స్ట్రోక్స్ ఇవ్వాలి. దీనికి అన్నివేళ్లనూ వాడాలి. రెండు వేళ్లతో గిచ్చడం కాకుండా అన్నివేళ్లతో పుర్రెను గిచ్చుతున్నట్లు (గోళ్లు తగలకూడదు) ఒత్తిడి కలిగించాలి.
చివరగా మరొకసారి తలంతా వలయాకారంగా మర్దన చేయాలి. ఇంతటితో తలకు మసాజ్ పూర్తవుతుంది. మసాజ్ పూర్తయిన తర్వాత పది నిమిషాలకు తలస్నానం చేస్తే ఆహాయి రెండు– మూడు రోజులు ఉంటుంది. ఈ మసాజ్ కేశ సౌందర్యానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది. కొన్ని రకాల తలనొప్పులు, ఒత్తిడి కారణంగా వచ్చే చికాకులు మాయమవుతాయి. ఇలా వారానికి ఒకసారి చేస్తుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.
క్రమం తప్పకుండా జుట్టుకు ట్రీట్‌మెంట్ జరుగుతుంటే జుట్టు రాలడం, చిట్లిపోవడం, చుండ్రు మొదలైన సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉండదు. వంశపారంపర్యంగా కాక పోషకాహార లోపం వల్ల, సంరక్షణలోపం వల్ల చిన్న వయసులోనే తెల్లబడడాన్ని సమర్థంగా నివారించవచ్చు.
టేబుల్ స్పూన్ మినప్పప్పు, నాలుగు బాదంపప్పులు కలిపి నీటిలో రాత్రంతా నాబెట్టాలి. ఉదయాన్నే ఈ రెండింటిని మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు పట్టించి, మెల్లగా రుద్దాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, తాజాగా కనిపిస్తుంది.
(చదవండి: పారిపోవాలని అనిపిస్తోంది..! ఈ సమస్య నుంచి బయటపడేదెలా..?)
Comments
Please login to add a commentAdd a comment