Scalp Care
-
రాత్రిపూట తలకు నూనె రాస్తున్నారా..?
జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి, పోషకాహార లోపం జుట్టు రాలిపోవడానికి కారణమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో, జుట్టును సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం రెగ్యులర్‌గా తలకు నూనె రాస్తుంటారు చాలామంది. అయితే ఇలా జుట్టుకు నూనె రాసుకోవడం మంచిదే కానీ దానికి సరైన సమయం ఉంది. కానీ జుట్టుకు నూనె రాసుకునే విధానం సరిగా లేకపోతే అది జుట్టుకు ప్రయోజనం చేకూర్చడానికి బదులు సమస్యలు ఎదురయ్యేలా చేస్తుంది. జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల జరిగే మేలు ఎక్కువే అయినా రాసే సమయం అత్యంత ముఖ్యం అంటున్నారు నిపుణులు. అంతే కాదు హెయిర్ ఆయిల్ నెత్తిమీద రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఆయిల్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ రాత్రిపూట జుట్టుకు నూనెను రాయడం మాత్రం మంచిది కాదనే అంటున్నారు నిపుణులు. ఇలా రాయడం వల్ల జుట్టుతో పాటూ చర్మం కూడా డ్యామేజ్ అవుతుందని హెచ్చరిస్తున్నారు.ఎందుకంటే..?రాత్రంతా జుట్టుకు నూనెతో పడుకోవడం వల్ల తల ఉపరితల రంధ్రాలు మూసుకుపోతాయి. ఈ కారణంగా వ్యక్తికి సమస్యలు ప్రారంభమవుతాయి. ఒక విధమైన ఇరిటేషన్ వచ్చి గోకడం జరుగుతుంది. దీంతో గోళ్లలోకి మురికి చేరుతుంది. ఈ సమస్యను నివారించడానికి రాత్రిపూట జుట్టుకు నూనెను రాయకూడదు.చుండ్రు సమస్య ఎక్కువవుతుంది..చుండ్రు సమస్యలు ఉంటే, రాత్రిపూట హెయిర్ ఆయిల్ ఎట్టిపరిస్థితుల్లోనూ అప్లై చేయకూడదు. ఇలా చేస్తే ఆయిల్ వల్ల చుండ్రు తోపాటు నెత్తిమీద ఎక్కువ మురికి పేరుకుపోయి చుండ్రు సమస్యను పెంచుతుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే జుట్టుకు హైడ్రేటింగ్ హెయిర్ మాస్క్ అప్లై చేయాలి.జుట్టు రాలడంజుట్టు ఇప్పటికే రాలిపోతుంటే, రాత్రిపూట నూనె రాసుకోవడం వంటివి చేయవద్దు. వాస్తవానికి, జుట్టుకు నూనెను 12 గంటలకు మించి ఉంచడం వల్ల నెత్తిమీద మురికి పేరుకుపోతుంది. అందువల్ల హెయిర్ వాష్‌కు అరగంట ముందు నూనె రాసుకుంటే జుట్టు రాలే సమస్య రాకుండా ఉంటుంది.మొటిమలురాత్రిపూట జుట్టుకు నూనె రాయడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఇలా మూసుకుపోవడం వల్ల మొటిమలు వచ్చే అవకావం ఉంది. ఇలాంటి మొటిమలను పోమేడ్ పింపుల్స్ అంటారు. కాబట్టి జుట్టుకు రాత్రిపూట నూనె పెట్టడం వల్ల చర్మంపై మొటిమలు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఆ జిడ్డు ముఖానికి కూడా అంటుకుని చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు ఎక్కువ అయిపోతాయి.నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రిపూట జుట్టుకు నూనె అప్లై చేయడానికి బదులుగా స్నానానికి అరగంట ముందు హెయిర్ ఆయిల్ రాసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల జుట్టుకు పోషణ అందడంతో పాటు వెంట్రుకలు బాగా శుభ్రం అవుతాయి.(చదవండి: మంకీ స్పిట్ కాఫీ: ఛీ..యాక్ అలానా తయారీ..!) -
హెయిర్ స్ట్రైయిట్‌నింగ్ చేయించుకుంటున్నారా? వైద్యులు వార్నింగ్
ఇటీవల కాలంలో రకరకాల హెయిర్ స్టైయిలిష్లు వచ్చేశాయి. అందుకోసం కొన్ని రకాల కెమికల్స్ వాడటం జరుగుతుంది. అయితే అవి కొందరికి రియాక్షన్ ఇచ్చి సమస్యలు తెచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవి అంత సీరియస్ ఇష్యూని రైజ్ చేయలేదు కానీ, హెయిర్ స్ట్రైయిట్‌నింగ్ మాత్రం డేంజరస్ అని ఓ మహిళ విషయంలో వెల్లడయ్యింది. తాజా అధ్యయనంలో వైద్యులు ఈ విషయాన్ని గుర్తించారు. పైగా దయచేసి మహిళలెవరూ ఈ హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేయించుకోవద్దు, సురక్షితం కాదని హెచ్చరిస్తున్నారు. ఎందుకని? ఏమవుతుందంటే.. సెలూన్లో హెయిర్ స్ట్రైయిట్‌నింగ్ ట్రీట్మెంట్ కోసం వెళ్లి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంది. ఈ హెయిర్ స్ట్రైయిట్‌నింగ్ ట్రీట్మెంట్లో వాడే రసాయనం వల్ల శరీరంలోని అతి ముఖ్యమైన అవయవం పనితీరుపై ప్రభావం చూపుతుందని పరిశోధలనో తేలింది. 26 ఏళ్ల మహిళ పలు దఫాలుగా అంటే..జూన్ జూన్ 2020, ఏప్రిల్ 2021, జూలై 2022లో సెలూన్లో హెయిర్ స్ట్రయిట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకుంది. ఈ ట్రీట్మెంట్ తీసుకునే ముందు ఎలాంటి అనారోగ్య సమస్య ఎదుర్కొన్న చరిత్ర లేదు. ఇలా చేయించకున్న కొన్నాళ్ల తర్వాత నుంచి వాంతులు, విరేచనాలు, జ్వరం, వెన్నునొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంది. ఈ హెయిర్ స్ట్రెయిట్నింగ్ కారణంగా నెత్తిపై మంట, గడ్డలు ఏర్పడటం జరిగింది. ఆ తర్వాత మూత్రంలో రక్తం పడటం వంటివి జరిగాయి. దీంతో వైద్యులను సంప్రదించగా ఆమె కేసుని క్షణ్ణంగా స్టడీ చేశారు. అందులో భాగంగా హెయిర్ స్ట్రెయిట్నింగ్లో వాడే క్రీమ్ గ్లైక్సిలిక్ యాసిడ్‌పై అధ్యయనం చేశారు వైద్యులు. దీని కారణంగానే ఆమె నెత్తిపై మంట, గడ్డలు ఏర్పడ్డాయని భావించారు. పైగా ఈ హెయిర్ క్రీమ్ కారణంగా ఏమైన దుష్పరిణామాలు ఉన్నాయేమోనని ఎలుకలపై ప్రయోగం చేశారు. ఆ పరిశోధనలో ఆ యాసిడ్ చర్మం ద్వారా మూత్రపిండాలకు చేరి, దాని పనితీరుపై ప్రభావం చూపిస్తున్నట్లు గుర్తించారు. ఈ రసాయనం కారణంగానే బాధిత మహిళ మూత్రపిండ నాళికలలో కాల్షియం ఆక్సలేట్ స్పటికాలు పేరుకుపోయి మాత్రపిండాల పనితీరు దెబ్బతినేందుకు దారితీసిందిన తేలింది. ప్రస్తుతం సదరు మహిళ తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ అధ్యయనం ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ప్రచురితమయ్యింది. వైద్యులు తమ పరిశోధనలో జుట్టుని నిటారుగా చేయడంలో గ్లైక్సిలిక్ యాసిడ్ బాధ్యత వహిస్తుందని, ఐతే ఇది ఆరోగ్యానికి ఎట్టిపరిస్థితుల్లోనూ సురక్షితం కాదని తేలింది. అందువల్ల దయచేసి హెయిర్‌కి సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్‌లలో ఈ గ్లైక్సిలిక్ యాసిడ్ వాడకాన్ని నిషేదించాలని తయారీదారులను కోరుతున్నారు ఫార్మసీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జాషువా డేవిడ్ కింగ్ లైవ్. ఈ టెక్రిక్ని 1890ల నుంచి ఉపయోగిస్తున్నారు. కురులకు సొగసైన రూపు ఇచ్చేలా స్ట్రైయిట్‌నింగ్ చేయడం కారణంగా అనారోగ్య సమస్యలు బారిన పడే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. (చదవండి: వయసుని తగ్గించుకోవడంలో సక్సెస్ అయిన బ్రియాన్ జాన్సన్! ఏకంగా..) -
అలర్జీని ఎలా వదిలించుకోవాలి..?
ఒక్కోసారి మనం బాస్‌తో, సహోద్యోగులతో, స్నేహితులతోనో మాట్లాడే సమయంలో లేదా ఏమయినా ముఖ్యమైన పనులలో ఉన్నప్పుడు తల దురద పెడుతుంటుంది. ఆ సమయంలో కలిగే ఇబ్బంది ఇంతా అంతా కాదు. తల దురదకు కేవలం పేలు లేదా చుండ్రు వంటివి మాత్రమే కాదు, అలర్జీ కూడా కారణం కావచ్చు. అలర్జీ అనేది కేవలం శరీరంపై దద్దుర్ల రూపేణా మాత్రమే వస్తుందనుకోవడానికి వీలు లేదు. తలలో కూడా వస్తుంది. ముందుగా ఈ దురద ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే దాన్ని నివారించడం సులభమవుతుంది. కొన్ని రకాల క్రిముల వల్ల, కొంతమందికి సాధారణంగానే అరచేతులు, అరికాళ్లలో ఎక్కువ చెమట పడుతుంది. ఎప్పటికప్పుడు చెమటను తుడుచుకుంటూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. కొంతమంది ఎక్కువగా నీటిలో నానుతూ పనిచేస్తుంటారు. నీటిలో అదేపనిగా నానడం కూడా అలర్జీకి కారణమవుతుంది. కొన్ని సార్లు డిటర్జెంట్లు కూడా కొంతమందిలో అలర్జీకి కారణమవుతాయి. అదేవిధంగా కొన్ని రకాలైన నూనెలు, ఎరువులు, ఇంధనాలతో కూడా ఈ సమస్య వస్తుంది. పరిష్కారాలు: ఇలా ఇబ్బంది పెట్టే తల దురద నుంచి తప్పించుకోవటానికి మిరియాలు బాగా ఉపయోగపడుతాయి. అర స్పూన్ మిరియాలు, అర స్పూన్ పాలతో కలిపి బాగా నూరాలి. తర్వాత కొద్దిగా నీళ్లలో ఉడికించి పేస్టు మాదిరిగా చేసి దాన్ని ఆరబెట్టి కొద్దిగా వేడి ఉండగానే తలకు రుద్దాలి. అరగంట తర్వాత శీకాయ పొడితో తలస్నానం చేయాలి. ఈవిధంగా వారానికి మూడు, నాలుగు సార్లు చేస్తే తల దురద పూర్తిగా పోతుంది. ఆహారం ద్వారా: ఉప్పు, పులుపు, కారం తక్కువగా ఉండే, బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు అధికంగా ఉండే తాజా పళ్ళు, గ్రీన్ సలాడ్లను తీసుకోవడం మంచిది. మంచినీరు బాగా తాగడం, తగినంత వ్యాయామం, ధ్యానం చేయడం ద్వారా కూడా దురదలను తగ్గించుకోవచ్చు. దురద, దద్దుర్లు నిరోధించేందుకు మరికొన్ని జాగ్రత్తలు: దురద సమస్య ఎక్కువగా ఉంటే ముందు జాగ్రత్తగా తీపి పదార్ధాలను తినటం తగ్గించాలి. శరీరాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి: మనం వంటికి రుద్దుకునే సబ్బు లేదా తలకు రాసుకునే నూనె, మనం వాడే స్ప్రే లేదా కొత్త మోడల్ దుస్తులకు ఉపయోగించే మెటీరియల్ కూడా మన చర్మానికి సరిపడకపోవచ్చు. అందువల్ల ఉన్నట్టుండి దురదలు వస్తుంటే, మన అలవాట్లలో కొత్తగా వచ్చిన మార్పేమిటో తెలుసుకుని దానినుంచి దూరంగా ఉండటం ఉత్తమం. ఇవి చదవండి: 90 శాతం యువతుల్లో ఇప్పటికీ ఆ లోపం, బెస్ట్ ఫుడ్ ఇదిగో!