రాత్రిపూట తలకు నూనె రాస్తున్నారా..? | Is It Safe Does Applying Oil On Hair At OVernight | Sakshi
Sakshi News home page

రాత్రిపూట తలకు నూనె రాస్తున్నారా..? ఐతే ఆ సమస్యలు ఫేస్‌ చేయాల్సిందే..!

Published Tue, Jul 23 2024 5:21 PM | Last Updated on Tue, Jul 23 2024 7:02 PM

Is It Safe Does Applying Oil On Hair At OVernight

జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి, పోషకాహార లోపం జుట్టు రాలిపోవడానికి కారణమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో, జుట్టును సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం రెగ్యులర్‌గా తలకు నూనె రాస్తుంటారు చాలామంది. అయితే ఇలా జుట్టుకు నూనె రాసుకోవడం మంచిదే కానీ దానికి సరైన సమయం ఉంది. కానీ జుట్టుకు నూనె రాసుకునే విధానం సరిగా లేకపోతే అది జుట్టుకు ప్రయోజనం చేకూర్చడానికి బదులు సమస్యలు ఎదురయ్యేలా చేస్తుంది. 

జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల జరిగే మేలు ఎక్కువే అయినా రాసే సమయం అత్యంత ముఖ్యం అంటున్నారు నిపుణులు. అంతే కాదు హెయిర్ ఆయిల్ నెత్తిమీద రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఆయిల్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ రాత్రిపూట జుట్టుకు నూనెను రాయడం మాత్రం మంచిది కాదనే అంటున్నారు నిపుణులు. ఇలా రాయడం వల్ల జుట్టుతో పాటూ చర్మం కూడా డ్యామేజ్ అవుతుందని హెచ్చరిస్తున్నారు.

ఎందుకంటే..?
రాత్రంతా జుట్టుకు నూనెతో పడుకోవడం వల్ల తల ఉపరితల రంధ్రాలు మూసుకుపోతాయి. ఈ కారణంగా వ్యక్తికి సమస్యలు ప్రారంభమవుతాయి. ఒక విధమైన ఇరిటేషన్‌ వచ్చి గోకడం జరుగుతుంది. దీంతో గోళ్లలోకి మురికి చేరుతుంది. ఈ సమస్యను నివారించడానికి రాత్రిపూట జుట్టుకు నూనెను రాయకూడదు.

చుండ్రు సమస్య ఎక్కువవుతుంది..
చుండ్రు సమస్యలు ఉంటే, రాత్రిపూట హెయిర్ ఆయిల్ ఎట్టిపరిస్థితుల్లోనూ అప్లై చేయకూడదు. ఇలా చేస్తే ఆయిల్ వల్ల చుండ్రు తోపాటు నెత్తిమీద ఎక్కువ మురికి పేరుకుపోయి చుండ్రు సమస్యను పెంచుతుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే జుట్టుకు హైడ్రేటింగ్ హెయిర్ మాస్క్ అప్లై చేయాలి.

జుట్టు రాలడం
జుట్టు ఇప్పటికే రాలిపోతుంటే, రాత్రిపూట నూనె రాసుకోవడం వంటివి చేయవద్దు. వాస్తవానికి, జుట్టుకు నూనెను 12 గంటలకు మించి ఉంచడం వల్ల నెత్తిమీద మురికి పేరుకుపోతుంది. అందువల్ల హెయిర్ వాష్‌కు అరగంట ముందు నూనె రాసుకుంటే జుట్టు రాలే సమస్య రాకుండా ఉంటుంది.

మొటిమలు
రాత్రిపూట జుట్టుకు నూనె రాయడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఇలా మూసుకుపోవడం వల్ల మొటిమలు వచ్చే అవకావం ఉంది. ఇలాంటి మొటిమలను పోమేడ్ పింపుల్స్ అంటారు. కాబట్టి జుట్టుకు రాత్రిపూట నూనె పెట్టడం వల్ల చర్మంపై మొటిమలు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఆ జిడ్డు ముఖానికి కూడా అంటుకుని చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు ఎక్కువ అయిపోతాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రిపూట జుట్టుకు నూనె అప్లై చేయడానికి బదులుగా స్నానానికి అరగంట ముందు హెయిర్ ఆయిల్ రాసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల జుట్టుకు పోషణ అందడంతో పాటు వెంట్రుకలు బాగా శుభ్రం అవుతాయి.

(చదవండి: మంకీ స్పిట్‌ కాఫీ: ఛీ..యాక్‌ అలానా తయారీ..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement