oil
-
ఓవర్ ఆయిల్ వద్దన్నమోదీ : ఎవరెంత వాడాలో తెలుసా?
ఇటీవల ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఊబకాయం (obesity)పై మన దేశ ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) మాట్లాడుతూ 10 శాతం వంట నూనెల వాడకం తగ్గించాలన్నారు. దీంతో ఆయిల్ వాడకం వల్ల లాభనష్టాల మాట మళ్లీ చర్చకి వచ్చింది. మనం ఎలాంటి నూనెలు వాడితే మంచిది? ఏ వయసువాళ్లు ఎంత నూనె వాడాలి? మహిళలు, పురుషులు వారి ఆరోగ్య రీత్యా వాడే నూనెలలో తేడాలుండాలా.. ఈ అంశాల గురించిన వివరణ. ప్రపంచంలో 250 కోట్ల మంది అధికబరువుతో ఉన్నారని, ఆహారంలో నూనెల వాడకం వల్ల ఈ సమస్య ఉత్పన్నం అవుతోందని మోదీ డబ్ల్యూహెచ్ఓ డేటాని ఉటంకిస్తూ రోజువారి ఆహారంలో తక్కువ నూనె వాడకం ప్రాముఖ్యతను వివరించారు.కుటుంబ బాధ్యతవంటల్లో నూనెని తగ్గిస్తే ఊబకాయం నుంచి బయటపడొచ్చు. వంటల్లో నూనె తగ్గించడాన్ని కుటుంబం పట్ల బాధ్యతగా తీసుకోవాలి. ఎక్కువ నూనె వాడితే గుండె సమస్యలు, షుగర్, బీపి వంటివి వస్తాయి. అలాంటి వాటి నుంచి తప్పించుకునేందుకు ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసి హెల్దీగా, ఫిట్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉండొచ్చు. ప్రమాదకరమైనవివంట నూనెల్లో ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనది. ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారం ఊబకాయానికి కారణమవుతుందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. నూనెలోని కొవ్వు చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయులను పెంచుతుంది. దీనివల్ల గుండె సమస్యలు, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి. అధిక రక్త΄ోటు ప్రమాదం పెరుగుతుంది. చదవండి: Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?తగ్గించాలంటే... పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, సమతుల ఆహారం తీసుకోవాలి. రోజూ కనీసం గంటసేపు వ్యాయామం చేయాలి. ఊబకాయం గురించి అవగాహన కల్పించడానికి మోదీ పదిమంది సెలబ్రిటీలను నామినేట్ చేశారు. వారిలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, నటులు ఆర్.మాధవన్, దినేష్ లాల్ యాదవ్ నిరాహువా, మోహన్ లాల్, స్పోర్ట్స్ షూటర్ మను భాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, గాయని శ్రేయా ఘోషల్, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ఉన్నారు. అధికంగా తీసుకుంటే నష్టాలుగ్రాము నూనెలో 9 క్యాలరీలు ఉంటాయి. అధికంగా తీసుకుంటే శరీర బరువు పెరుగుతుంది. కొవ్వు అధికంగా కలిగి ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు రావచ్చు.ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న నూనెలు హాని చేస్తాయి.అసమతుల్యమైన నూనెలు తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి, గుడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది.అధిక నూనె వాడకం ఫ్యాటీ లివర్ సమస్యకు దారితీస్తుంది. మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది.ఏ నూనెలు వాడాలి? సమతుల కొవ్వులు ఉండే నూనెలను వాడాలి. ముఖ్యంగా ప్రాసెసింగ్ తక్కువగా చేసిన (కోల్డ్ ప్రెస్డ్) నూనెలు ఆరోగ్యానికి మంచివి.సురక్షితమైన, ఆరోగ్యకరమైనవి: సన్‌ఫ్లవర్, వేరుశనగ, ఒమేగా, మొక్కజొన్న నూనె, ఆలివ్ ఆయిల్, అవిసె నూనె, కోల్డ్ ఫ్రెస్డ్ ఆయిల్లలో ప్రాసెసింగ్ తక్కువగా ఉండి పోషకాలు ఎక్కువ. చదవండి: Mahashivratri 2025: శివరాత్రికి ఉపవాసం, ఇంట్రస్టింగ్ టిప్స్తక్కువగా వాడవలసినవి: పామ్ ఆయిల్ (Palm oil) ) – అధికంగా ప్రాసెస్ అవుతుంది.వనస్పతి – ట్రాన్స్ ఫాట్స్ ఎక్కువ స్నాక్స్ తయారీలో ఒకసారి ఉపయోగించినవి, తిరిగి వాడుతుంటారు. వీటి వల్ల ఎక్కువ ప్రమాదం ఉంది. సరైన పరిమితిలో తగిన రకాల నూనెలను తీసుకోవడం ఆరోగ్యానికి మేలే చేస్తుంది.నూనెలు మంచి క్యాలరీ సోర్స్‌గా పనిచేస్తాయి. వీటిలో అవసరమైన కొవ్వు ఆమ్లాలు (ఫ్యాటీ యాసిడ్స్) ఉంటాయి.ఒమేగా–3, ఒమేగా–6 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.కొన్ని నూనెలలో విటమిన్–ఇ, కె, శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మం, కేశాల ఆరోగ్యానికి మంచిది.కొవ్వులు శరీరంలోని వివిధ హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైనవి.ఎవరు ఎంత ఆయిల్ పిల్లలు (6–19 ఏళ్లు) రోజుకు 4 – 5 టీస్పూన్లు (20–25ఎం.ఎల్) ఆడ–మగ ఇద్దరికీ. ముఖ్యంగా కొబ్బరి, ఆలివ్ ఆయిల్, కనోలా, నెయ్యి వంటి ఆరోగ్యకరమైన నూనెలు వాడాలి. 20 – 59 ఏళ్ల వరకు : రోజుకు 5 – 6 టీస్పూన్లు (25–30ఎం.ఎల్) ఆడ–మగ ఇద్దరికీ. ఆలివ్, కనోలా, అవకాడో, వేరుశనగ, సన్‌ఫ్లవర్, రిఫైన్డ్ వెజిటబుల్ ఆయిల్స్. కొబ్బరినూనె, అవిసె నూనె రోజుకు60 ఏళ్ల.. అంతకు మించి...రోజుకు 4 – 5 టీస్పూన్లు (20–25ఎం.ఎల్.) ఆడ–మగ ఇద్దరికీ. గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆలివ్, అవిసె, కనోలా నూనెలను వాడాలి. గర్భవతులు మాత్రం రోజూ 6–7 టీ స్పూన్ల ఆరోగ్యకరమైన నూనె వాడాలి. వాటిలో ఆలివ్, అవకాడో, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్స్ (ఒమెగా 3 ఉన్న నూనెలు) వాడాలి. -డా. జానకి, పోషకాహార నిపుణులు – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఆయిల్ -
రష్యా నుంచి రూ.4.45 లక్షల కోట్ల చమురు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టిన తర్వాత రష్యా నుంచి భారత్ వరుసగా మూడో ఏడాదీ 49 బిలియన్ యూరోల విలువైన (రూ.4.45 లక్షల కోట్లు సుమారు) చమురు కొనుగోలు చేసింది. ఈ వివరాలను ప్రైవేటు పరిశోధనా సంస్థ అయిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) నివేదిక రూపంలో వెల్లడించింది.భారత్ సాధారణంగా మిడిల్ఈస్ట్ దేశాల నుంచి చమురు సమకూర్చుకుంటుంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలు పెట్టిన తర్వాత మారిన సమీకరణాలతో.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ గణనీయంగా పెంచడం గమనార్హం. పాశ్చాత్య దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించడం, యూరోపియన్ దేశాలు కొనుగోళ్లను తగ్గించడంతో.. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ కంటే రష్యా చాలా తక్కువ ధరకే చమురును ఆఫర్ చేయడం ఇందుకు కారణం. అంతకుముందు వరకు దేశ చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఒక శాతంలోపే ఉండగా.. అక్కడి నుంచి 40 శాతానికి పెరిగాయి.‘‘రష్యా నుంచి మూడో ఏడాది అత్యధికంగా చైనా 78 బిలియన్ యూరోల చమురు కొనుగోలు చేయగా, భారత్ 49 బిలియన్ యూరోలు, టర్కీ 34 బిలియన్ యూరోల చొప్పున కొనుగోలు చేశాయి. దీంతో రష్యా చమురు ఆదాయాల్లో ఈ మూడు దేశాలు 74 శాతం సమకూర్చాయి’’అని సీఆర్ఈఏ తెలిపింది. ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన మూడో ఏడాది రష్యాకి శిలాజ ఇంధనాల ద్వారా 242 బిలియన్ యూరోలు, ఉక్రెయిన్‌పై దాడి మొదలు పెట్టిన తర్వాత మొత్తం 847 బిలియన్ యూరోల ఆదాయం లభించినట్టు వెల్లడించింది. ఒకానొక దశలో మార్కెట్ రేటు కంటే బ్యారెల్‌కు 18–20 డాలర్లు తక్కువే చమురును రష్యా ఆఫర్ చేసినట్టు తెలిపింది. దీంతో భార్ తక్కువ రేటుపై చమురును సొంతం చేసుకోగలిగినట్టు పేర్కొంది. అయితే ఇటీవలి కాలంలో రష్యా ఆఫర్ చేసే డిస్కౌంట్ బ్యారెల్‌పై 3 డాలర్లకు తగ్గినట్టు వెల్లడించింది. యూరప్, జీ7 దేశాలకు ఎగుమతులు భారత్‌లోని రిఫైనరీలు చౌకగా లభించిన రష్యా ముడి చమురును పెట్రోల్, డీజిల్ ఇంధనాలుగా మార్చి యూరప్, జీ7 దేశాలకు ఎగుమతి చేసినట్టు ఈ నివేదిక తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన మూడో ఏడాది జీ7 దేశాలు 18 బిలియన్ యూరోల ఆయిల్‌ను భారత్, టరీ్కలోని రిఫైనరీల నుంచి కొనుగోలు చేసినట్టు పేర్కొంది. భారత్, టర్కీ రిఫైనరీల నుంచి ఈయూ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా నిలిచింది. రిఫైనరీల మొత్తం ఉత్పత్తిలో 13 శాతం ఇలా ఎగుమతి అయినట్టు ఈ నివేదిక తెలిపింది. ఐరోపా యూనియన్‌లో నెదర్లాండ్స్ 3.3 బిలియన్ యూరోలు, ఫ్రాన్స్ 1.4 బిలియన్ యూరోలు, రొమానియా 1.2 బిలియన్ యూరోలు, స్పెయిన్ 1.1 బిలియన్ యూరోల చొప్పున భారత్, టర్కీ రిఫైనరీల నుంచి కొనుగోలు చేసినట్టు పేర్కొంది. -
ఏడోసారి జాతీయ అవార్డు అందుకున్న సంస్థ
వంటనూనెల తయారీ సంస్థ గోల్డ్‌డ్రాప్ తన ఉత్పత్తుల్లో నాణ్యాత ప్రమాణాలు పాటించినందుకు జాతీయ అవార్డు అందుకున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. బుధవారం జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈమేరకు గోల్డ్‌డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియాకు కౌన్సిల్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ట్రేడ్ డెవలప్మెంట్ (సీఐటీడీ) అవార్డును ప్రదానం చేశారు. గోల్డ్‌డ్రాప్ సంస్థ ఈ అవార్డు అందుకోవడం ఇది ఏడోసారి కావడం విశేషం.అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించడం, పరిశుభ్రత, పోషకాల పరంగా మెరుగైన వంట నూనెగా గోల్డ్‌డ్రాప్ నిబద్ధత చాటుకుంటోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మితేష్ లోహియా మాట్లాడుతూ ‘మరోసారి ఈ జాతీయ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. వినియోగదారులకు మెరుగైన ఉత్పత్తులు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. సంస్థ ఉత్పత్తుల్లో నాణ్యతను పాటించడం, కొత్తగా ఆవిష్కరణలు చేయడం పట్ల దృష్టి సారిస్తున్నాం’ అన్నారు.ఇదీ చదవండి: అందుబాటు ధరల్లో ఇళ్లు... విలువ రూ. 67 లక్షల కోట్లుఆహార ఉత్పత్తుల తయారీలో నిబంధనల ప్రకారం భద్రత, సరైన నాణ్యత పాటించే సంస్థలకు కౌన్సిల్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ట్రేడ్ డెవలప్మెంట్ ఇండియా (సీఐటీడీ) అవార్డులు అందిస్తోంది. గోల్డ్ డ్రాప్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1984 ఏప్రిల్ 28న స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఇది ఉత్పత్తులను తయారు చేస్తోంది. సన్‌ప్లవర్, రైస్ బ్రాన్ ఆయిల్, పామోలిన్ నూనె.. వివిధ ఆయిల్ ఉత్పత్తులను అందిస్తోంది. -
చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్ ఎత్తివేత
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు దిగివచి్చన నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తి చేసే చమురుపై, విమాన ఇంధనం, డీజిల్, పెట్రోల్ ఎగుమతులపై దాదాపు రెండున్నరేళ్లుగా విధిస్తున్న విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను కేంద్రం తొలగించింది. అలాగే పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై విధిస్తున్న రహదారులు, మౌలిక సదుపాయాల సెస్సును కూడా ఉపసంహరించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం రాజ్యసభ ముందుంచారు.దీనితో దేశీయంగా ముడిచమురు ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఓఎన్జీసీ), ఆయిల్ ఇండియా వంటి సంస్థలకు, అలాగే ఎగుమతులు చేసే రిలయన్స్, నయారాలాంటి కంపెనీలకు ప్రయోజనం చేకూరనుంది. ఆయిల్ కంపెనీలకు వచ్చే అసాధారణ లాభాలపై విధించే పన్నును విండ్‌ఫాల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తారు. 2022 జూలై 1న దేశీయంగా తొలిసారి దీన్ని విధించారు. ఆయిల్ బ్యారెల్‌ను 75 డాలర్లకు మించి ఎంత రేటుకు విక్రయించినా, వచ్చే ఆ లాభాలపై ప్రభుత్వం ఈ ట్యాక్స్‌ను విధిస్తూ వస్తోంది.2022లో దేశీయంగా ఉత్పత్తి చేసే క్రూడాయిల్‌పై టన్నుకు రూ. 23,250 చొప్పున, ఎగుమతి చేసే పెట్రోల్ .. ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 6 చొప్పున, డీజిల్‌పై లీటరుకు రూ. 13 చొప్పున దీన్ని విధించింది. తద్వారా 2022–23లో రూ. 25,000 కోట్లు, 2023–24లో రూ. 13,000 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం రూ. 6,000 కోట్ల వరకు సమీకరించింది. దీన్ని ఎత్తివేయాలంటూ చాలాకాలంగా పరిశ్రమతో పాటు కేంద్ర పెట్రోలియం..సహజ వాయువు శాఖ లాబీయింగ్ చేస్తున్నాయి. ప్రస్తుతం భారత్ దిగుమతి చేసుకునే క్రూడాయిల్ బాస్కెట్ రేటు సగటున 73.02 డాలర్ల స్థాయిలో ఉంది. -
సోరియాసిస్‌ను తగ్గించే సహజసిద్ధమైన ఆయిల్..
పర్పుల్ లైఫ్ సైన్సెస్ సోరియాసిస్ నుంచి ఉపశమనం కలిగించేలా ప్రకృతి సహజస్ధిమైన వాటితో తయారుచేసిన సరికొత్త ఆయిల్ PSOCAREని ప్రారంభించింది. ఈ సంస్థ సంప్రదాయ వైద్య విధానానికి పెద్దపీట వేసేలా.. ప్రకృతిసిద్ధమైన వాటిపై దృష్టిసారించిన ఏకైక సంస్థ. ఈ సంస్థ ప్రవేశపెట్టిన అనేక ఉత్పత్తుల్లో ఇలాంటి ప్రొడక్ట్ మొదటిదని సంస్థ పేర్కొంది. ఇది సోరియాసిస్ లక్షణాలను నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు సంస్థ ప్రతినిధులు. దీనిలో మొక్కల ఆధారిత ఆంథోసైనిన్, బాకుచియోల్, సోరాలిడిన్, ప్సోరాలెన్ ఉన్నాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మం వాపుని నయం చేయడమే గాక దీనికి కారణమైన ఆక్సీకరణ ఒత్తిడిని లక్ష్యంగా చేసుకుంటుంది. ఫలితంగా ఆవ్యాధి లక్షణాలను తగ్గుముఖం పడతాయి. ఇందులో ఉండే ఆంథోసైనిన్ కోసం పర్పుల్ మొక్కజొన్నను వాణిజ్యపరంగా పండిస్తున్న ఏకైక భారతీయ కంపెనీ కూడా ఇదే. ఈ PSOCARE అనేది సింథటిక్ పదార్థాలు లేదా దుష్ప్రభావాలు లేకుండా అందించే సహజ సిద్దమైన ఆయిల్. దీర్ఘకాలికి వ్యాధులను సమర్థవంతంగా నిర్వహించి, తగ్గించే లక్ష్యంతో ఈ ఉత్పత్తిని తీసుకొచ్చామని సంస్థ డైరెక్టర్ మొహలి, ఫార్మాస్యూటికల్ డైరెక్టర్ రాఘవ్ రెడ్డి చెబుతున్నారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సాంప్రదాయ చికిత్స విధానంతో చక్కటి ఆరోగ్యాన్ని అందివ్వాలన్నదే మా లక్ష్యం అని ఫైనాన్స్ అండ్ ఆపరేషన్స్ డైరెక్టర్ కే మణికంఠ రెడ్డి అన్నారు. అలాగే ప్రకృతి శక్తికి సాంకేతికతను జోడించి ఎలాంటి దుష్ప్రభావాలు ఇవ్వని సాంప్రదాయ వైద్యాన్ని సమర్థవంతంగా అందించడమే తమ సంస్థ లక్ష్యం అని చెబుతున్నారు.(చదవండి: ఇదేం చిత్రం..! జననాల రేటు పెంచడం కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ..!) -
‘స్మార్ట్’ స్టోర్స్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చమురు నుంచి టెలికామ్ వరకూ అన్ని రంగాల్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న రిలయన్స్... తన రిటైల్ బిజినెస్‌ను మరింతగా విస్తరిస్తోంది. ప్రస్తుతం సుమారు 900 పైచిలుకు ఉన్న బిగ్ బాక్స్ స్టోర్స్ (స్మార్ట్ బజార్, స్మార్ట్ స్టోర్స్) సంఖ్యను వచ్చే ఏడాది ఆరంభానికల్లా వెయ్యికి పెంచుకోనుంది. చిన్న పట్టణాల్లో కూడా స్టోర్స్‌కి ఆదరణ లభిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లోనూ గణనీయంగా విస్తరిస్తున్నట్లు సంస్థ రిలయన్స్ రిటైల్ సీఈవో (గ్రోసరీ రిటైల్ బిజినెస్) దామోదర్ మాల్ తెలియజేశారు. ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన... రిలయన్స్ రిటైల్‌కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో విస్తరణకు చేస్తున్న ప్రయత్నాలను సమగ్రంగా వివరించారు. ఐఐటీ, ఐఐఎంలో విద్యాభ్యాసం చేసిన దామోదర్, యూనిలీవర్లో తన కెరీర్‌ను ఆరంభించారు. వ్యాపారవేత్తగా సొంతంగా సూపర్‌మార్కెట్ వెంచర్‌ను కూడా నిర్వహించారు. ఫ్యూచర్ గ్రూప్ తర్వాత రిలయన్స్ రిటైల్‌లో వేల్యూ ఫార్మాట్‌కి (స్మార్ట్ బజార్, రిలయన్స్ ఫ్రెష్ మొదలైనవి) సంబంధించిన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే భారతీయ వినియోగదారుల పోకడలను, సూపర్ మార్కెట్ల తీరుతెన్నులను గురించి వివరిస్తూ ‘సూపర్మార్కెట్వాలా’, ‘బీ ఎ సూపర్మార్కెట్వాలా’ పుస్తకాలు కూడా రాశారు. రిలయన్స్ రిటైల్ కార్యకలాపాలపై మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.తెలుగు రాష్ట్రాలకు చాలా ప్రాధాన్యం ఉంది... రిలయన్స్ రిటైల్‌కి దేశవ్యాప్తంగా కార్యకలాపాలు ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలకు చాలా ప్రాధాన్యముంది. ఎందుకంటే తొలి రిటైల్ స్టోర్‌ను హైదరాబాద్‌లోనే ప్రారంభించాం. అలాగే తక్కువ ప్రాంతంలో ఎక్కువ స్టోర్స్ ఉన్నది కూడా ఇక్కడే. పండ్లు, ఎఫ్ఎంసీజీ, దుస్తులు, ఆహారోత్పత్తులు మొదలైనవన్నీ లభించే మా స్మార్ట్ బజార్ స్టోర్స్‌కి కూడా ఇక్కడ ప్రాధాన్యం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ఫార్మాట్లకు సంబంధించి 180 పైచిలుకు స్టోర్స్ ఉండగా వీటిలో 75 పైగా బిగ్ బాక్స్ స్టోర్స్ ఉన్నాయి. తెలంగాణలోనూ వివిధ ఫార్మాట్ల స్టోర్స్ 145 పైచిలుకు ఉండగా వాటిలో సుమారు 45 బిగ్ బాక్స్ ఫార్మాట్లో ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి 330 పైగా స్టోర్స్ ఉన్నాయి. ఇక చిన్న పట్టణాల విషయానికొస్తే, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లోని తణుకు, మదనపల్లె మొదలైనవి... అలాగే తెలంగాణలో బోధన్, సిద్దిపేట్ వంటి టౌన్లలో కూడా మా స్టోర్స్‌ను విస్తరించాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మా బిగ్ బాక్స్ స్టోర్స్ 900 పైచిలుకు ఉండగా వచ్చే ఏడాది ఆరంభం నాటికి ఈ సంఖ్యను వెయ్యికి పెంచుకోబోతున్నాం. పెద్ద నగరాల్లోలాగే చిన్న పట్టణాల్లోనూ వేల్యూ యాడెడ్, ప్రీమియం ఉత్పత్తుల కు మంచి డిమాండ్ ఉంటోంది. ఇక్కడి నుంచే భారీగా కొనుగోళ్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఆహారోత్పత్తులకు గణనీయమైన డిమాండ్ ఉంది. ఇక్కడ వాటి విక్రయాలు ఎక్కువ. దేశవ్యాప్తంగా ఉత్పత్తులను విక్రయించుకునేలా స్థానిక వ్యాపారులకు అవకాశాలు కల్పిస్తున్నాం. పలు లోకల్ బ్రాండ్లకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పిస్తున్నాం. ఎంట్రప్రెన్యూర్లతో కలిసి పని చేస్తున్నాం. ప్రాంతీయంగా వినియోగదారులతో మరింతగా మమేకం అవుతూ ఇటీవల పలు స్టోర్స్‌లో బతుకమ్మ వేడుకలను కూడా నిర్వహించాం.మెరుగ్గా పండుగ సీజన్.. ప్రస్తుతం పండుగ వేడుకలు భారీ స్థాయిలో ఉంటున్నాయి. వివిధ పండుగలను కలిసి జరుపుకుంటున్నారు. సాధారణంగా కొన్నాళ్ల క్రితం వరకు ఒక ప్రాంతానికి పరిమితమైన నవరాత్రి, దాండియా, పూజో మొదలైన వాటిని ఇపుడు మిగతా ప్రాంతాల వారు కూడా చేసుకునే ధోరణి పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి, వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి మొదలైనవి పెద్ద స్థాయిలో జరుపుకుంటారు. ఇలాంటి పండుగ సీజన్లో ఆహారోత్పత్తులు, దుస్తులు, బహుమతులు మొదలైన వాటికి డిమాండ్ గణనీయంగా ఉంటుంది. కాబట్టి వివిధ ప్రాంతాల్లో వివిధ వర్గాల నుంచి ఉండే డిమాండ్‌కి అనుగుణంగా మా స్టోర్స్‌ను నిర్వహిస్తున్నాం. పండుగ సీజన్ సందర్భంగా మరిన్ని ఆఫర్లు అందిస్తున్నాం. మా స్టోర్స్ విషయానికొస్తే పండుగ సీజన్ చాలా సానుకూలంగా ప్రారంభమైంది. వివిధ కేటగిరీలవ్యాప్తంగా విక్రయాలు బాగున్నాయి. పూజాద్రవ్యాలు, దుస్తులు మొదలైన వాటికి డిమాండ్ ఉంటోంది. ఆఫ్‌లైన్, ఆన్లైన్ రిటైల్ పోటీపడుతున్నాయని అనుకోవడం కన్నా ఒకదానికి మరొకటి అనుబంధంగా ఉంటున్నాయని చెప్పవచ్చు. అందుకే వీటన్నింటినీ కలిపి ఆమ్నిచానల్గా వ్యవహరిస్తున్నాం. ఇక, ఆన్లైన్లో ఫేక్ ఆఫర్ల విషయాల్లో వినియోగదారులు జాగ్రత్త వహించక తప్పదు. అపరిచితుల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయకుండా, విశ్వసనీయమైన చోటే కొనుగోలు చేయడం శ్రేయస్కరం. -
కాలుష్య కట్టడికి రూ.25 వేలకోట్లు
ప్రభుత్వ ఆధీనంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ 2040 నాటికి తన ఉత్పత్తుల తయారీలో ఎలాంటి కర్బన ఉద్గారాలు విడుదల కాకుండా ప్రయత్నాలు చేపట్టింది. అందుకోసం రూ.25,000 కోట్ల పెట్టుబడితో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ రంజిత్ రాత్ తెలిపారు.ఈ సందర్భంగా రంజిత్ రాత్ మాట్లాడుతూ..‘క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటులో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు, బయోగ్యాస్, ఇథనాల్ ప్లాంట్లను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశాం. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలున్నాయి. దాంతో నికర జీరో కర్బన ఉద్గారాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 65 లక్షల టన్నుల ముడి చమురు ఉత్పత్తి చేశాం. 2025-26 నాటికి ఇది 90 లక్షల టన్నులకు చేరుతుంది. అస్సాంలోని రవాణా, పరిశ్రమలకు ఉపయోగపడే ద్రవ ఇంధనాల స్థానంలో సహజ వాయువులు వాడేందుకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి 80 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇప్పటికే అస్సాంలో 640 మెగావాట్లు, హిమాచల్ ప్రదేశ్‌లో మరో 150 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేశాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: వంటనూనె ధరలు పెంపు..?ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) అన్ని విభాగాల్లో 2046 నాటికి నికర జీరో కర్బన ఉద్గారాలు లక్ష్యంగా నిర్ణయించుకుంది. చమురు, గ్యాస్ ఉత్పత్తిదారైన ఓఎన్జీసీ 2038 నాటికి అదే లక్ష్యాన్ని సాధించడానికి రూ.2 లక్షల కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), గెయిల్ ఇండియా లిమిటెడ్ తమ కార్యకలాపాల్లో నికర సున్నా కర్బన ఉద్గారాలను సాధించడానికి 2040 లక్ష్యంగా పెట్టుకున్నాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) 2046 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించింది. -
కాకరకాయ ఆయిల్‌తో ఎన్ని లాభాలో : చుండ్రుకు చెక్, జుట్టు పట్టుకుచ్చే!
కరేలా ఆయిల్ లేదా కాకరకాయ నూనె గురించి ఎపుడైనా విన్నారా? కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, బాదం నూనె, రోజ్ మేరీ గురించి విన్నాం గానీ, ఈ కరేలా హెయిర్ ఆయిల్ ఏంటి అనుకుంటున్నారా? కాకర తినడమే కష్టం.. కాకరకాయ హెయిర్ ఆయిలా? అని తేలిగ్గా తీసి పారేయకండి. కొన్ని శతాబ్దాలుగా ఆయుర్వేదంలో దీన్ని ఔషధంగా వినియోగిస్తున్నారు. జుట్టు, చర్మ ఆరోగ్యానికి ఉపయోపగడే కరేలా ఆయిల్ గురించి తెలుసుకుందాం.కాకరకాయ ఎన్నో ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. దీని నుంచి ఆయిల్‌ను బిట్టర్ గార్డ్ ఆయిల్, కరేలా ఆయిల్ అని కూడా పిలుస్తారు. ఈ నూనెలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు , కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం జుట్టు ,మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జుట్టుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు చుండ్రును తగ్గించి, జుట్టు ఆరోగ్యంగా ఎదగడానికి తోడ్పడుతుంది. రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న కాకరకాయ నూనె చర్మానికి రాస్తే మృతకణాలు నశించి యవ్వనంగా, కాంతి వంతంగా తయారవుతుంది. ఈ నూనెలో విటమిన్లు ఎ , సి వంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు కుదుళ్లకు పోషణనిచ్చి, జుట్టును బలంగా చేస్తాయి. కరేలా నూనెలో సహజ యాంటీ ఫంగల్ , యాంటీమైక్రోబయల్ చుండ్రు , స్కాల్ప్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేస్తుంది, దురద, ఇతర చికాకులనుకూడా ఇది చక్కటి పరిష్కారం.జుట్టు తెల్లబడకుండాకరేలా నూనెను వారానికి రెండుసార్లు అప్లై చేయడం వల్ల జుట్టు తొందరగా నెరసిపోకుండా ఉంటుంది. తల చర్మం, జుట్టు తంతువులు రెండింటినీ హైడ్రేట్ చేస్తుంది. జుట్టును తేమగా ఉంచుతుంది. సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. స్కాల్ప్ లోని సహజ నూనె (సెబమ్) ఉత్పత్తిని నియంత్రిస్తుంది ఇది జుట్టు పెళుసుదనాన్ని తగ్గిస్తుంది. కరేలా నూనెను క్రమం తప్పకుండా మృదువుగా, సున్నితంగా , మెరుస్తూ ఉంటుంది. యాంటీమైక్రోబయల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, చిన్న గాయాలు, కాలిన గాయాలకు తొందరగా నయమవుతాయి. -
ధరలు తగ్గించిన ఏకైన దేశం ఇండియా: కేంద్రమంత్రి
ప్రపంచవ్యాప్తంగా గడిచిన మూడేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన ఏకైక దేశం ఇండియా అని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ), డీలర్ల మధ్య మార్జిన్లకు సంబంధించి ప్రభుత్వం చర్చలను ప్రోత్సహిస్తోందన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘ఇతర దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నారు. అందుకు భిన్నంగా ప్రధాని తీసుకున్న సాహసోపేత, దూరదృష్టి నిర్ణయాల వల్ల భారత్‌లో వీటి ధరలు తగ్గుతున్నాయి. నవంబర్ 2021 నుంచి ఏప్రిల్ 2024 మధ్యకాలంలో దేశంలో పెట్రోల్ ధరలు 13.65 శాతం, డీజిల్ ధరలు 10.97 శాతం తగ్గాయి. ఇందుకు భిన్నంగా ఫ్రాన్స్‌లో 22.19 శాతం, జర్మనీలో 15.28 శాతం, ఇటలీలో 14.82 శాతం, స్పెయిన్‌లో 16.58 శాతం పెట్రోల్ ధర పెరిగింది. యూపీఏ ప్రభుత్వం రూ.1.41 లక్షల కోట్ల విలువైన ఫ్లోటింగ్ ఆయిల్ బాండ్లను(పెరుగుతున్న ముడి చమురు ధరల వల్ల ఓఎంసీ నష్టాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం జారీ చేసిన బాండ్లు) జారీ చేసింది. దానికోసం ప్రస్తుతం రూ.3.5 లక్షల కోట్లు తిరిగి చెల్లించాల్సి వస్తోంది’ అని మంత్రి వివరించారు.డీలర్ల మార్జిన్ పెరుగుదలపై మంత్రి స్పందిస్తూ..‘ఇది ఓఎంసీలు, డీలర్లు కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం. జులై 1, 2024 నాటికి దేశంలో 90,639 అయిల్ రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయి. వీటిలో 90 శాతం ప్రభుత్వ రంగ కంపెనీలకు చెందినవి. చివరిసారిగా 2017లో డీలర్ల మార్జిన్లు పెరిగాయి. ఇటీవల నిర్దేశించిన మార్గదర్శకాల్లోని కొన్ని షరతులు కొంత కఠినంగా ఉన్నాయని డీలర్లు కోర్టుకు వెళ్లారు. డీలర్ల మార్జిన్లు పెంచితే వారి ఉద్యోగులకు కనీస వేతన చట్టం ప్రకారం జీతాలు పెంచాల్సి ఉంటుంది. దీన్ని డీలర్లు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని నిబంధనలు సడలించి ఓఎంసీలు మార్జిన్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వీరి మధ్య చర్చలు సాగేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: ‘ఓలా మా డేటా కాపీ చేసింది’పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ గతంలో ఏర్పాటు చేసిన అపూర్వ చంద్ర కమిటీ నివేదికలోని వివరాల ప్రకారం.. డీలర్ల మార్జిన్ రివిజన్ సిఫార్సులను ఓఎంసీలు నిలుపుదల చేస్తున్నాయి. వీటిని ఏటా జనవరి, జులైలో రెండుసార్లు సవరించాలి. ఈమేరకు ఓఎంసీలు, డీలర్ల మధ్య నవంబర్ 4, 2016న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇదిలాఉండగా, గత ఏడేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నా ఎలాంటి మార్జిన్లు పెంచలేదని డీలర్లు అంటున్నారు. -
రాత్రిపూట తలకు నూనె రాస్తున్నారా..?
జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి, పోషకాహార లోపం జుట్టు రాలిపోవడానికి కారణమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో, జుట్టును సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం రెగ్యులర్‌గా తలకు నూనె రాస్తుంటారు చాలామంది. అయితే ఇలా జుట్టుకు నూనె రాసుకోవడం మంచిదే కానీ దానికి సరైన సమయం ఉంది. కానీ జుట్టుకు నూనె రాసుకునే విధానం సరిగా లేకపోతే అది జుట్టుకు ప్రయోజనం చేకూర్చడానికి బదులు సమస్యలు ఎదురయ్యేలా చేస్తుంది. జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల జరిగే మేలు ఎక్కువే అయినా రాసే సమయం అత్యంత ముఖ్యం అంటున్నారు నిపుణులు. అంతే కాదు హెయిర్ ఆయిల్ నెత్తిమీద రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఆయిల్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ రాత్రిపూట జుట్టుకు నూనెను రాయడం మాత్రం మంచిది కాదనే అంటున్నారు నిపుణులు. ఇలా రాయడం వల్ల జుట్టుతో పాటూ చర్మం కూడా డ్యామేజ్ అవుతుందని హెచ్చరిస్తున్నారు.ఎందుకంటే..?రాత్రంతా జుట్టుకు నూనెతో పడుకోవడం వల్ల తల ఉపరితల రంధ్రాలు మూసుకుపోతాయి. ఈ కారణంగా వ్యక్తికి సమస్యలు ప్రారంభమవుతాయి. ఒక విధమైన ఇరిటేషన్ వచ్చి గోకడం జరుగుతుంది. దీంతో గోళ్లలోకి మురికి చేరుతుంది. ఈ సమస్యను నివారించడానికి రాత్రిపూట జుట్టుకు నూనెను రాయకూడదు.చుండ్రు సమస్య ఎక్కువవుతుంది..చుండ్రు సమస్యలు ఉంటే, రాత్రిపూట హెయిర్ ఆయిల్ ఎట్టిపరిస్థితుల్లోనూ అప్లై చేయకూడదు. ఇలా చేస్తే ఆయిల్ వల్ల చుండ్రు తోపాటు నెత్తిమీద ఎక్కువ మురికి పేరుకుపోయి చుండ్రు సమస్యను పెంచుతుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే జుట్టుకు హైడ్రేటింగ్ హెయిర్ మాస్క్ అప్లై చేయాలి.జుట్టు రాలడంజుట్టు ఇప్పటికే రాలిపోతుంటే, రాత్రిపూట నూనె రాసుకోవడం వంటివి చేయవద్దు. వాస్తవానికి, జుట్టుకు నూనెను 12 గంటలకు మించి ఉంచడం వల్ల నెత్తిమీద మురికి పేరుకుపోతుంది. అందువల్ల హెయిర్ వాష్‌కు అరగంట ముందు నూనె రాసుకుంటే జుట్టు రాలే సమస్య రాకుండా ఉంటుంది.మొటిమలురాత్రిపూట జుట్టుకు నూనె రాయడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఇలా మూసుకుపోవడం వల్ల మొటిమలు వచ్చే అవకావం ఉంది. ఇలాంటి మొటిమలను పోమేడ్ పింపుల్స్ అంటారు. కాబట్టి జుట్టుకు రాత్రిపూట నూనె పెట్టడం వల్ల చర్మంపై మొటిమలు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఆ జిడ్డు ముఖానికి కూడా అంటుకుని చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు ఎక్కువ అయిపోతాయి.నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రిపూట జుట్టుకు నూనె అప్లై చేయడానికి బదులుగా స్నానానికి అరగంట ముందు హెయిర్ ఆయిల్ రాసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల జుట్టుకు పోషణ అందడంతో పాటు వెంట్రుకలు బాగా శుభ్రం అవుతాయి.(చదవండి: మంకీ స్పిట్ కాఫీ: ఛీ..యాక్ అలానా తయారీ..!) -
Lavender : అద్భుతమైన ప్రయోజనాలు
వర్షాలు మొదలయ్యాయంటే చాలు దోమలు, కీటకాల బెడద ఎక్కువ అవుతుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, చుట్టు పక్కల మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమ తెరలు వాడటంతో పాటు, ఇంట్లో కొన్ని రకాలు మొక్కల్ని పెంచుకోవడం ద్వారా దోమలు, పురుగుల బాధనుంచి తప్పించు కోవచ్చు. తులసి, పుదీనా, గోధుమ గడ్డి, లావెండర్‌ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. లావెండర్ మొక్కను ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అంతేకాదు లావెండర్ ఆయిల్, పువ్వుల వలన ఆరోగ్యప్రయోజనాలు లాభాలున్నాయి. అవేంటో చూద్దాం.లామియాసి లేదా పుదీనా కుటుంబానికి చెందిన పుష్పించే మొక్కను లావెండర్ అని పేరు. దీని బొటానికల్ పేరు లావెండర్ అఫిసినాలిస్. లావెండర్ అందమైన పుష్పాలనిస్తుంది. లావెండర్ ప్లాంట్‌ను ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి పురుగుల, కీటకాలు రావు. ఈగలు, దోమల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. చీమలు, సాలె పురుగులు కూడా కనిపించవు. ఎందుకంటే ఈ మొక్క నుంచి వచ్చే వాసన వాటికి పడదట. లావెండర్ మొక్క, దాని వాసన మనకు మాత్రం ఆరోగ్యాన్ని అందిస్తుంది. ప్రత్యేకమైన రుచి కోసం కుకీలు, కేకుల్లో వీటిని వాడతారు. టీ, సిరప్ లలో ఈ లావెండర్ పువ్వులను వినియోగిస్తారు. అలాగే తీపి కాస్త పులుపు రుచితో ఉండే పువ్వులను చక్కగా తీసుకొని తినవచ్చు. పచ్చిగా తినలేనివారు టీ రూపంలో లావెండర్ పువ్వులను తింటారు కూడా. లావెండర్ మొక్కలతో మైండ్ రిలాక్స్ అవుతుంది. ఆందోళన తగ్గుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. అంతేకాదు ఈ మొక్కనుంచి తీసిన ఆయిల్ అత్యంత ప్రజాదరణ పొందిన ఆయిల్ ఒకటి. ఈ నూనెను సౌందర్య ఉత్పత్తుల్లోనూ, అరోమాథెరపీలో ఉపయోగిస్తారు. లావెండర్ ఆయిల్ జీర్ణక్రియను మెరుగు పరచడానికి ఉపయోగిస్తారు. ఇది చర్మాన్ని కాంతివంతం చేయడంలో మొటిమలను తగ్గించడంలో సహాయ పడుతుంది. ముడతలను తగ్గిస్తుంది. ఈ అద్భుతమైన నూనె బ్యాక్టీరియాను చంపడానికి పని చేస్తుంది. లావెండర్ ఆయిల్‌లోని యాంటీ ఫంగల్ లక్షణం మంటను, వాపును తగ్గిస్తుంది. ఇది ఎగ్జిమాను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. జుట్టు సంరక్షణలో కూడా పనిచేస్తుంది. -
‘సన్‌ఫ్లవర్’ సలసలా
తాడేపల్లిగూడెం: సన్‌ఫ్లవర్ నూనెకు ధరల స్ట్రోక్ తగిలింది. ఇటీవలి కాలంలో పామాయిల్ కంటే తక్కువ రేటుకు పడిపోయిన ఈ నూనె ధరలు ఇప్పుడు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. పామాయిల్, పామ్ క్రూడ్, రిఫైన్డ్ పామాయిల్ మలేసియా, ఇండోనేíÙయా దేశాల నుంచి దిగుమతి అవుతాయి. మలేసియాలో పంట దిగుబడులు, కూలీల లభ్యత, వాతావరణ పరిస్థితుల ఆధారంగా, అంతర్జాతీయ విపణి సూత్రం ఆధారంగా డాలర్ల ధరల్లో వ్యత్యాసాలతో పామాయిల్ ధరలు ప్రభావితమయ్యేవి. రిఫైన్డ్ పామాయిల్ దిగుమతి ఖర్చుతో కూడుకునే వ్యవహారం కావడంతో, పామ్ క్రూడ్‌ను మాత్రమే రాష్ట్రంలోని కాకినాడ, కృష్ణపట్నం వంటి పోర్టుల ద్వారా దిగుమతి చేసుకునేవారు.ఈ పోర్టుల సమీపంలో ఉండే నూనె శుద్ధి కర్మాగారాలు (రిఫైనరీలు) పామ్ క్రూడ్‌ను శుద్ధిచేసి మార్కెట్లకు పంపించేవి. ఒకప్పుడు ఆకాశాన్నంటిన పామాయిల్ ధరలు ఇటీవల దాదాపుగా దిగొచ్చాయి. పామాయిల్‌తో పోల్చుకుంటే సన్‌ఫ్లవర్ నూనె ధర ఎక్కువగా ఉండేది. దీనికి భిన్నంగా పామాయిల్ ధర కంటే దిగువకు సన్‌ఫ్లవర్ నూనె దిగింది. అంతర్జాతీయ విపణిలో మార్పుల నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా సన్‌ఫ్లవర్ నూనె ధర పెరిగింది. ఉక్రెయిన్ ప్రభావం సన్‌ఫ్లవర్ ఎక్కువగా మన ప్రాంతానికి ఉక్రెయిన్ నుంచి దిగుమతి అవుతుంది. అక్కడ ఉత్పత్తులు పడిపోయిన కారణంగా రష్యా నుంచి ఈ నూనెను దిగుమతి చేసుకుంటున్నారు. ఉక్రెయిన్ కంటే భారతదేశానికి రష్యా మీదుగా నూనెను రవాణా చేయడంతో ఖర్చు అధికం అవుతోంది. ప్రీమియంగా పేర్కొనే ధర టన్నుకు వంద డాలర్లు పెరుగుతోంది. దీంతో గుత్త మార్కెట్లో టన్నుకు రూ.200కు పైబడి ధర పెరుగుతోంది. ఈ ధర ఇటీవల పెరుగుతూ వెళ్తోంది. రష్యా నుంచి సన్‌ఫ్లవర్ నూనెను దిగుమతి చేసుకోవాల్సిందే. ఈ పరిస్థితి సెపె్టంబరు వరకు ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నిర్ణిత కొలతలు లేవు గతంలో మాదిరిగా నూనెలకు నిర్ణీత కొలతలు లేవు. కిలో, అరకిలో, లీటరు వంటి ప్యాకింగ్‌లకు కాలం చెల్లింది. ఫుడ్ అండ్ వెయిట్ అండ్ మెజర్స్ నిబంధనల్లో ఇటీవల కేంద్రం మార్పులతో చట్టం చేసింది. దీంతో ప్యాకింగ్ ఎంతైనా చేసుకోవచ్చు. ప్యాకెట్‌పై మాత్రం కొలత, గ్రాము ధర ఎంతనే వివరాలు కచ్చితంగా ఉండాలి. ఈ కారణంగా మార్కెట్లో లీటర్ పౌచ్‌లు లేవు. 850 గ్రాముల నూనె ప్యాకెట్లు మాత్రమే దొరుకుతున్నాయి. సన్‌ఫ్లవర్ ప్యాకెట్ రూ.110 ప్రస్తుతం మార్కెట్లో సన్‌ఫ్లవర్ ప్యాకెట్ ధర రూ.110లు ఉంది. గతంలో ఈ ధర రూ.86కు పడిపోయింది. పామాయిల్ 850 గ్రాముల ధర రూ.86లు ఉంది. రైస్‌బ్రాన్ ఆయిల్ ప్యాకెట్ రూ.115లు, వేరుశనగ నూనె ప్యాకెట్ రూ.160లు ఉంది. ఈ ధరలు సెపె్టంబరు వరకు ఇదే రకంగా ఉండే అవకాశాలున్నాయి. రష్యా నుంచి దిగుమతి వల్లే ధర పెరుగుదల మార్కెట్లో సన్‌ఫ్లవర్ నూనెల ధరలు సెప్టెంబరు వరకు ఇదే విధంగా ఉండే అవకాశాలున్నాయి. ఉక్రెయిన్ నుంచి కాకుండా రష్యా నుంచి సన్‌ఫ్లవర్ నూనె దిగుమతి అవుతున్నందున మార్కెట్లో ఈ నూనె ధర పెరిగింది. – పవన్, వ్యాపారి, తాడేపల్లిగూడెం -
మార్కెట్ అల్లకల్లోలం
లోక్‌సభ తాజా ఫలితాలలో ఎన్డీఏ 300 సీట్లకంటే తక్కువకు పరిమితం కానున్నట్లు స్పష్టమవడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఆందోళన చెందారు. మార్కెట్ ఆరంభం నుంచే అమ్మకాలకు దిగారు. దీంతో సెన్సెక్స్ 6,234 పాయింట్లు, నిఫ్టీ 1,982 పాయింట్ల చొప్పున కుప్పకూలాయి. చివరికి కొంత కోలుకుని 4,390 పాయింట్ల నష్టంతో 72,079 వద్ద సెన్సెక్స్ నిలిచింది. 1,379 పాయింట్లకు నిఫ్టీ నీళ్లొదులుకుని 21,885 వద్ద ముగిసింది.ఇది రెండు నెలల కనిష్టంకాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 70,234కు పడిపోయింది. వెరసి ఎగ్జిట్ పోల్స్ కారణంగా సోమవారం ఇన్వెస్టర్లకు అందిన 3 శాతం లాభాలు ఒక్క రోజు తిరగకుండానే ఆవిరయ్యాయి. అంతేకాకుండా రికార్డ్ గరిష్టాలు 76,469, 23,264 పాయింట్ల స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ గత నాలుగేళ్లలోలేని విధంగా భారీగా పతనమయ్యాయి! ఇంతక్రితం కోవిడ్–19 మహమ్మారి కట్టడికి కేంద్రం లాక్డౌన్ ప్రకటించడంతో దేశీ స్టాక్ మార్కెట్లు 2020 మార్చి 23న ఇంతకంటే అధికంగా 13 % కుప్పకూలిన సంగతి తెలిసిందే!! పీఎస్‌యూ షేర్లు ఫట్ మోడీ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో ప్రభుత్వ రంగ కౌంటర్లు తీవ్రంగా నష్టపోయాయి. ప్రధానంగా ఆర్ఈసీ 24 శాతం, పీఎఫ్సీ 22%, బీఈఎంఎల్, కంకార్, బీఈఎల్, బీహెచ్ఈఎల్ 19%, హెచ్ఏఎల్ 17%, ఓఎన్జీసీ, మజ్గావ్ డాక్ 16%, రైల్‌టెల్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా 14%, ఆర్వీఎన్ఎల్ 13%, ఐఆర్సీటీసీ, పవర్‌గ్రిడ్, బీపీసీఎల్ 12% చొప్పున దిగజారాయి. ఇక పీఎస్‌యూ బ్యాంక్స్‌లో యూనియన్ బ్యాంక్, బీవోబీ, పీఎన్బీ, కెనరా బ్యాంక్, ఎస్బీఐ 18–13% మధ్య కుప్పకూలాయి. దీంతో పీఎస్ఈ ఇండెక్స్ 16%పైగా క్షీణించింది. ఎన్ఎస్ఈలో బ్యాంకెక్స్ 2022 ఫిబ్రవరి తదుపరి అత్యధికంగా 8% పతనమైంది. ఎదురీదిన ఎఫ్ఎంసీజీ.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్, చమురు, రియలీ్ట, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్ 15–6 శాతం మధ్య పతనమయ్యాయి. ఎఫ్ఎంసీజీ మాత్రం 1 శాతం బలపడింది. ప్రభుత్వేతర దిగ్గజాలలో ఎల్అండ్టీ, శ్రీరామ్ ఫైనాన్స్,టాటా స్టీల్, ఇండస్ఇండ్, హిందాల్కో, ఐసీఐసీఐ, జేఎస్‌డబ్ల్యూ, భారతీ, యాక్సిస్ 16–7 శాతం మధ్య క్షీణించాయి. అయితే హెచ్‌యూఎల్, బ్రిటానియా, నెస్లే, హీరో మోటో, టాటా కన్జూమర్ 6–2 % మధ్య జంప్ చేశాయి.అదానీ గ్రూప్ బేర్.. అదానీ గ్రూప్ కౌంటర్లు భారీగా పతనమై ముందురోజు ఆర్జించిన లాభాలను పోగొట్టుకోవడంతోపాటు మరింత నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ 21 శాతం, ఎనర్జీ సొల్యూషన్స్ 20 శాతం దిగజారగా.. గ్రీన్ ఎనర్జీ, ఎంటర్ప్రైజెస్, టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ 19 శాతం, అదానీ పవర్, అంబుజా సిమెంట్స్ 17 శాతం చొప్పున పతనమయ్యాయి. ఏసీసీ 15 శాతం, అదానీ విల్మర్ 10 శాతం పడ్డాయి. అత్యధిక శాతం షేర్లు కొనేవాళ్లులేక లోయర్ సర్క్యూట్లను తాకాయి. ఫలితంగా గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువకు ఒక్క రోజులో రూ. 3.64 లక్షల కోట్లమేర కోతపడింది. రూ. 15.78 లక్షల కోట్లకు పరిమితమైంది. -
తగ్గిన చమురు ధరలు.. ఒపెక్‌ప్లస్ కూటమి ప్రభావం
ముడిచమురు ఉత్పత్తిలో కోతలను వాయిదావేసేలా ఎనిమిది ఒపెక్ ప్లస్ దేశాలు ప్రణాళికలు సూచించాయి. దాంతో బ్రెంట్, వెస్ట్‌టెక్సాస్ ఇంటర్మీడియట్(డబ్ల్యూటీఐ) ఫ్యూచర్ ఇండెక్స్‌లపై ప్రభావం పడింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పడిపోయాయి.బ్రెంట్ ఫ్యూచర్స్ 24 పాయింట్లు లేదా 0.3% తగ్గి బ్యారెల్ చమురు ధర 80.87 అమెరికన్ డాలర్లకు చేరుకుంది. జులై నెల డెలివరీ కోసం యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) క్రూడ్ ఫ్యూచర్స్ 19 పాయింట్లు లేదా 0.25% పడిపోయి 76.80 అమెరికన్ డాలర్లకు చేరింది. (బ్రెంట్ ఫ్యూచర్లు, డబ్ల్యూటీఐ ద్వారా ప్రపంచమార్కెట్లో క్రూడాయిల్ ఇండెక్స్‌లో ట్రేడింగ్ చేయవచ్చు)పెట్రోలియం ఎగుమతి చేసే అజర్బైజాన్, బెహ్రెయిన్, బ్రూనై, మలేషియా, రష్యా, ఒమన్, సౌత్‌సుడాన్..వంటి దేశాల కూటమి ఒపెక్ ప్లస్ సమావేశం ఆదివారం నిర్వహించారు. 2025 వరకు ఉత్పత్తి కోతలను పొడిగించేందుకు కొన్ని దేశాలు నిరాకరించాయి. దాంతో సోమవారం క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి.ప్రస్తుతం ఒపెక్‌ప్లస్ దేశాలు రోజుకు 58.6 లక్షల బ్యారెల్స్ (బీపీడీ) చమురు ఉత్పత్తిని తగ్గించాయి. ఇది ప్రపంచ డిమాండ్‌లో 5.7%గా ఉంది. ఎనిమిది సభ్యదేశాలు గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం..2024 చివరి నాటికి 36.6 లక్షల బ్యారెల్స్, జూన్ 2024 చివరి నాటికి 22 లక్షల బ్యారెల్స్ చమురు ఉత్పత్తిపై స్వచ్ఛంద కోతలు విధించాయి. వాటిపై నిర్ణయం తీసుకునేలా ఇటీవల సమావేశం జరిగింది. ఇందులో 2025 చివరి వరకు 3.66 మిలియన్ బీపీడీ కోతలను పొడిగించడానికి కూటమి అంగీకరించింది. 22 లక్షల బీపీడీ కోతలను 2024 సెప్టెంబర్ చివరి వరకు మూడు నెలల పాటు పొడిగించింది.అయితే ఎనిమిది ఒపెక్ + దేశాలు అక్టోబర్ 2024 నుంచి సెప్టెంబరు 2025 వరకు 22 లక్షల బీపీడీ చమురు కోతలను క్రమంగా ఉపసంహరించుకునే ప్రణాళికలను సూచించాయి. సెప్టెంబర్ 2024 వరకు కోతలను పొడిగించనప్పటికీ భవిష్యత్తులో చమురు కోతలుండవని భావించి సోమవారం ధరలు పతనమయ్యాయి. -
రష్యా కంపెనీతో రిలయన్స్ ఒప్పందం.. ఎందుకంటే..
ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనింగ్ కాంప్లెక్స్ ఆపరేటర్‌గా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యాకు చెందిన రోస్నెఫ్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది. నెలకు కనీసం 3 మిలియన్ బ్యారెళ్ల చమురును రష్యా కరెన్సీ రుబెళ్లలో కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ డీల్ ఒక ఏడాదిపాటు కొనసాగుతుందని కంపెనీ వర్గాలు చెప్పాయి.రోస్నెఫ్ట్తో కుదిరిన ఈ డీల్ వల్ల రిలయన్స్ రాయితీ ధరలకే చమురు పొందనుంది. చమురు ఉత్పత్తిదారుల ఒపెక్ ప్లస్ కూటమి జూన్ తర్వాత స్వచ్ఛందంగా క్రూడ్ సరఫరాలో కోతలు విధించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ (ఒపెక్), రష్యాతో సహా మిత్రదేశాలతో కూడిన ఒపెక్ ప్లస్ కూటమి జూన్ 2న జరిగే ఆన్లైన్ సమావేశంలో చమురు కోతలపై చర్చించనుంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఈ డీల్ కుదుర్చుకోవడంపట్ల మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: థాయ్‌లాండ్ వీసా నిబంధనల్లో మార్పులురష్యా-ఉక్రెయిన్ మధ్య అనిశ్చితులు తీవ్రరూపం దాల్చిన సమయంలో వెస్ట్రన్ దేశాలు, అమెరికా రష్యా చమురు దిగుమతులపై ఆంక్షలు విధించింది. దాంతో రష్యా తక్కువ ధరకే భారత్ వంటి ఇతర దేశాలకు చమురు అమ్మడం ప్రారంభించింది. అందులో భాగంగానే రిలయన్స్ వంటి భారత ప్రైవేట్ చమురు కంపెనీలు ఆ దేశం నుంచి క్రూడ్ కొనుగోలు చేస్తున్నాయి. ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉంది. -
Cooking Oil: ఏ నూనె ఆరోగ్యానికి మంచిది? వైద్యులు చెబుతున్నదిదే..
ఆయా ప్రాంతాల్లోని వాతావరణాన్ని అనుసరించి ఆయా నూనెలు వాడటం జరుగుతుంది. మార్కెట్లో సన్‌ఫ్లవర్ ఆయిల్, పామాయిల్, ఆలివ్ ఆయిల్ వంటి రకరకాల ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఆహార పదార్థాల రుచి కూడా నూనెపైనే ఆధారపడి ఉంటుంది. కొవ్వు గురించి భయపడి చాలామంది ఆహరంలో తక్కువ నూనె వాడకానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. నలభై ఏళ్లు దాటినవారు ఆయిల్ ఫుడ్‌కు చాలా దూరంగా ఉంటారు. ఇంతకీ ఏ నూనె ఆరోగ్యానికి మంచిది? రిఫైన్డ్ ఆయిల్స్ కంటే గానుగ నూనె బెటరా అంటే.. గానుగ నూనె చాలా పురాతన నూనె. ఎద్దులను ఉపయోగించి గానుగపట్టి నూనె గింజల నుంచి నూనె తీసే విధానం శతాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉంది. కొన్నిదేశాల్లో గుర్రాలు, ఒంటెలను కూడా అందుకోసం ఉపయోగిస్తారు.గానుగలో తిప్పడం ద్వారా లభించే నూనెను 'కోల్డ్ ప్రెస్డ్' ఆయిల్ అంటారు. అంటే ఇక్కడ.. గానుగపట్టే సమయంలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది. నూనె గింజలను తక్కువ ఉష్ణోగ్రత వద్ద గానుగలో తిప్పడం వల్ల ఆ నూనెలో సహజ విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు వాటి అసలు రూపంలో ఉంటాయి. ఇవి నూనెను మరింత రుచికరంగా ఉంచుతాయి. ఆ కారణంగానే గానుగ నూనె శరీరానికి మేలు చేస్తుందని పలువురు వైద్యులు చెబుతున్నారు. కానీ, ఈ నూనె తయారీకి ఖర్చు ఎక్కువ. ఎందుకంటే, విత్తనాల నుంచి 30 - 40 శాతం నూనె మాత్రమే వస్తుంది, అందువల్ల వ్యర్థాలు ఎక్కువ. అయితే, ఎక్స్పెల్లర్ ప్రెస్డ్ ఆయిల్ మెషీన్ ద్వారా 80 నుంచి 90 శాతం నూనెను తీయవచ్చు. కానీ, మెషీన్ ద్వారా ఆయిల్ తీసే ప్రక్రియలో ఉష్ణోగ్రత స్థాయిలు 100 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండడం వల్ల నూనె సహజ స్వభావం మారుతుంది. ఆ తర్వాత వంట నూనె రిఫైనింగ్ (శుద్ధి) ప్రక్రియ జరుగుతుంది. మెత్తగా నూరిన విత్తనాల చూర్ణానికి హెక్సేన్ అనే రసాయనాన్ని కలుపుతారు. విత్తనాల నుంచి 100 శాతం నూనెను తీసేందుకు ఈ హెక్సేన్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాతి దశలో నూనెతో కలిపిన హెక్సేన్‌ను వేరుచేస్తారు. అలా వచ్చిన నూనెను వివిధ రసాయనిక పద్ధతుల్లో రిఫైన్ చేస్తారు. చివరగా, నీళ్లలా శుద్ధంగా కనిపించే రుచీపచీ లేని నూనె వస్తుంది.గత కొన్నేళ్లుగా ఉపయోగిస్తున్న సన్‌ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్స్ హెక్సేన్ ఉపయోగించి రిఫైన్ చేసే నూనెలే. ఏది బెటర్ అంటే.. చివరిగా అన్ని రకాల నూనెల్లోనూ మంచి కొవ్వులు ఉంటాయి. అవి శరీరానికి అవసరం కూడా. అయితే మనం ఎంత నూనె తీసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. గుండె జబ్బులు, ఊబకాయం, బీపీ వంటి ఆరోగ్య సమస్యలుంటే నూనె తీసుకోవాల్సిన పరిమాణంలో మార్పులుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక నెయ్యితో పాటు ఆలివ్ ఆయిల్‌ను కొద్దిగా తీసుకోవచ్చు. వేయించడానికి రైస్ బ్రాన్ ఆయిల్, వేరుశనగ నూనెను వాడొచ్చు. కొబ్బరినూనె, పామాయిల్ వంటి వాటిని కొద్దిమొత్తంలో తీసుకోవచ్చు. అందువల్ల ఒకటే నూనె కాకుండా, అన్ని నూనెలను నిర్దిష్ట మొత్తంలో తీసుకోవడం మంచిది. నిజం చెప్పాలంటే ఒక వ్యక్తికి రోజుకు 15 మిల్లీలీటర్ల నూనె సరిపోతుంది. అంటే.. నెలకు సుమారు 450 నుంచి 500 మిల్లీలీటర్లు చాలు అని చెబుతున్నారు వైద్యులు. (చదవండి: మానవ మెదళ్లు పెద్దవి అవుతున్నాయ్! ఇక ఆ వ్యాధి..) -
భారీ పెట్టుబడులకు వేదాంతా సై
న్యూఢిల్లీ: మైనింగ్ రంగ ప్రయివేట్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ వివిధ బిజినెస్‌లలో 6 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. అల్యూమినియం, జింక్, ముడిఇనుము, స్టీల్, చమురు, గ్యాస్ తదితర విభిన్న విభాగాలపై పెట్టుబడులు వెచ్చించేందుకు ప్రణాళికలు వేసింది. తద్వారా వార్షికంగా కనీసం 2.5 బిలియన్ డాలర్ల నిర్వహణ లాభాన్ని(ఇబిటా) జత చేసుకోవాలని చూస్తున్నట్లు ఇన్వెస్టర్ల సమావేశంలో కంపెనీ అత్యున్నత అధికారులు వెల్లడించారు. పైప్‌లైన్‌లో 50 యాక్టివ్ ప్రాజెక్టులుసహా విస్తరణ ప్రణాళికలున్నట్లు తెలియజేశారు. ఇవి కంపెనీ వృద్ధికి దోహదం చేస్తాయని, తద్వారా 6 బిలియన్ డాలర్ల ఆదాయానికి వీలున్నట్లు పేర్కొన్నారు. ఇది ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2023–24)లో సాధించే వీలున్న 5 బిలియన్ డాలర్ల ఇబిటాను వచ్చే ఏడాది(2024–25) 6 బిలియన్ డాలర్లకు పెంచనున్నట్లు అంచనా వేశారు. ఈ బాటలో 2027కల్లా 7.5 బిలియన్ డాలర్ల ఇబిటాను సాధించవచ్చని ఆశిస్తున్నారు. రానున్న 25ఏళ్లలో విభిన్న స్థాయికి కంపెనీ చేరనున్నట్లు వేదాంతా చైర్మన్ అనిల్ అగర్వాల్ ఇన్వెస్టర్లకు తెలియజేశారు. విభిన్న ప్రాజెక్టులపై 6 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అనిల్ సోదరుడు, కంపెనీ వైస్‌చైర్మన్ నవీన్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇది 6 బిలియన్ డాలర్ల అదనపు టర్నోవర్‌కు దారిచూపనున్నట్లు, వార్షికప్రాతిపదికన ఇబిటా 2.5–3 బిలియన్ డాలర్లవరకూ అదనంగా బలపడనున్నట్లు వివరించారు. -
చమురు వినియోగంపై ఈవీల ప్రభావం ఎంత..?
భారతదేశానికి ఎంతోకాలంగా ముడి చమురు సరఫరా చేస్తున్న సౌదీ అరామ్కో దేశంలో మరింత పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్ టు కెమికల్స్ వ్యాపారంలో 20% వాటా కోసం 15 బిలియన్ డాలర్ల బిడ్ వేసి విఫలమైన సంగతి తెలిసిందే. తాజాగా పెట్రోకెమికల్స్ బిజినెస్‌లో ఆసక్తి కనబరుస్తున్నట్లు చెబుతుంది. విద్యుత్ వాహనాలు పెరుగుతున్నా ప్రపంచంలో చమురు వినియోగం తగ్గదని చెబుతుంది. దాంతో ఇండియాలో మరింత వ్యాపారానికి ఆస్కారం ఉన్నట్లు సౌదీ అరామ్కోలో స్ట్రాటజీ అండ్ మార్కెట్ అనాలిసిస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫహద్ అల్ ధుబైబ్ ఓ మీడియాతో తెలిపారు. భారతదేశంలో జనాభా పెరుగుదలతోపాటు పారిశ్రామికీకరణ ప్రణాళికలు అధికమవుతున్నాయిని ధుబైబ్ అన్నారు. ‘గత రెండు దశాబ్దాలుగా భారత్ ఎంతో అభివృద్ధి చెందింది. 2050 వరకు దాదాపు 100 కోట్ల మంది ప్రజలు అధికంగా ఇంధనాన్ని వినియోగించనున్నారు. చమురుతోపాటు రానున్న రోజుల్లో పెట్రోకెమికల్స్‌లోనూ గణనీయమైన వృద్ధికి అవకాశం ఉంది. భారత్‌లో హైడ్రోకార్బన్లు, అవసరమైన రసాయనాలు, పదార్థాలను శుద్ధి చేయడంలో పెట్టుబడులు పెట్టేందుకు అరామ్కో పరిశీలిస్తుంది. భారతదేశానికి అరామ్కో ప్రధాన ఎల్పీజీ సరఫరాదారుగా ఉంది’ అని చెప్పారు. ఇదీ చదవండి: క్రూడాయిల్‌పై పన్ను పెంపు.. ఎంతో తెలుసా.. ‘ఇప్పటికీ చాలామంది బయోమాస్ లేదా కలపను వినియోగించి వంట చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డేటా ప్రకారం ఏటా ఇంట్లో పొగవల్ల ఏర్పడే కాలుష్యం కారణంగా దాదాపు 4 మిలియన్ల మంది మరణిస్తున్నారు. ఇవి తగ్గాలంటే ప్రతి ఇంట్లో ఎల్పీజీ వినియోగించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తూ రెన్యువెబుల్ ఎనర్జీకి అయ్యే ఖర్చులను తగ్గించేందుకు కృషి చేయాలని అరామ్కో యోచిస్తోంది’ అని ధుబైబ్ తెలిపారు. -
ఓఎన్జీసీ చేతికి 7 బ్లాకులు.. చమురు నిక్షేపాల తవ్వకాల్లో రిలయన్స్
న్యూఢిల్లీ: ఓపెన్ ఏకరేజ్ లైసెన్స్ పాలసీ(ఓఏఎల్‌పీ)లో భాగంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) 7 బ్లాకులను గెలుచుకుంది. ప్రయివేట్ రంగ కన్సార్షియం రిలయన్స్–బీపీ, ఇంధన రంగ పీఎస్‌యూ ఆయిల్ ఇండియా, సన్పెట్రోకెమికల్స్ ఒక్కో క్షేత్రం చొప్పున సాధించాయి. చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తికి సంబంధించి 8వ రౌండ్లో భాగంగా 10 బ్లాకులను ఆఫర్ చేసినట్లు చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. వెరసి ఓఏఎల్‌పీ–8లో తాజాగా 10 బ్లాకులకు సంతకాలు జరిగినట్లు వెల్లడించారు. ఇదేసమయంలో మూడు కోల్బెడ్ మిథేన్(సీబీఎం) బ్లాకులను సైతం కేటాయించినట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఓఏఎల్‌పీ–9వ రౌండ్ బిడ్డింగ్‌కు తెరతీసినట్లు తెలియజేశారు. తాజాగా ఆఫర్ చేసిన బ్లాకుల అన్వేషణ కార్యకలాపాలకు 23.3 కోట్ల డాలర్ల పెట్టుబడులు వెచ్చించవచ్చని భావిస్తున్నట్లు అధికారిక నోట్లో చమురు శాఖ పేర్కొంది. 2022 జులైలో ఓఎల్‌ఏపీ–8వ రౌండ్‌కు బిడ్డింగ్‌ను తెరిచిన సంగతి తెలిసిందే. చమురు శాఖ మొత్తం 10 బ్లాకులను ఆఫర్ చేసింది. పలు దఫాలు గడువు తేదీని సవరించాక 2023 జులైలో బిడ్డింగ్‌ను ముగించింది. హైడ్రోకార్బన్స్ డైరెక్టరేట్ జనరల్(డీజీహెచ్) వివరాల ప్రకారం ఓఎన్జీసీసహా వేదాంతా లిమిటెడ్, ఆయిల్ ఇండియా, సన్ పెట్రోకెమికల్స్, రిలయన్స్–బీపీ ఎక్స్‌ప్లొరేషన్(అల్ఫా) ఉమ్మడిగా 13 బిడ్స్ దాఖలు చేశాయి. బిడ్స్ తీరిలా కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేసిన 10 బ్లాకులలో ఏడింటికి ఒక్కొక్క బిడ్ దాఖలుకాగా.. మిగిలిన మూడు క్షేత్రాలకు రెండేసి బిడ్స్ లభించాయి. గ్లోబల్ ఇంధన దిగ్గజాలు ఎక్సాన్‌మొబిల్, షెవ్రాన్, టోటల్ఎనర్జీస్ బిడ్ చేయలేదు. మొత్తం 9 బ్లాకులకు బిడ్ చేసినఓఎన్జీసీ 6 బ్లాకులకు ఒంటరిగా రేసులో నిలిచింది. రిలయన్స్–బీపీ కేజీ బేసిన్‌లోని లోతైన సముద్రగర్భ బ్లాక్‌కు బిడ్ వేసింది. దశాబ్ద కాలంగా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్న రిలయన్స్–బీపీ గత ఓఏఎల్‌పీ రౌండ్లలోనూ ఒక బ్లాకును గెలుచుకున్నాయి. చమురు దిగుమతుల బిల్లును తగ్గించుకునే లక్ష్యంతో ప్రభుత్వం 2016లో ఓఏఎల్పీకి తెరతీసింది. తద్వారా చమురు సంస్థలు ఇంధన అన్వేషణకు గుర్తించిన ప్రాంత పరిధిని దాటి ఏ ఇతర ప్రాంతాన్నయినా ఎంపిక చేసుకునేందుకు వీలు కల్పించింది. ప్రత్యేక సీబీఎం బిడ్ రౌండ్–2022లో భాగంగా 3 బ్లాకుల కేటాయింపునకు సంతకాలు పూర్తయినట్లు మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. -
శీతాకాలం ముఖానికి కొబ్బరి నూనె రాస్తున్నారా?
శీతకాలంలో ముఖం డ్రైగా మారి గరుకుగా ఉంటుంది. స్కిన్ కూడా తెల్లతెల్లగా పాలిపోయినట్లు అయిపోతుంది. మన ముఖాన్ని టచ్ చేస్తేనే మనకే ఇరిటేషన్‌గా ఉంటుంది. దీంతో ఇంట్లో ఉండే కొబ్బరి నూనెనే గబుక్కున రాసేస్తుంటాం. అందరికీ అందుబాటులోనూ చవకగా ఉంటుంది కూడా. చిన్నప్పటి నుంచి చర్మంపై దురద వచ్చినా, కందినా కూడా కొబ్బరి నూనెనే రాసేవాళ్లం. అయితే ఇలా రాయడం మంచిదేనా? రాస్తే ఏమవుతుంది తదితరాల గురించే ఈ కథనం!. ఏం జరుగుతుందంటే.. ముఖానికి కొబ్బరి నూనె రాయడం చాలా మంచిదే గానీ దాన్ని సరైన విధంగా ముఖానికి అప్లై చేస్తేనే ఫలితం ఉంటుందని సౌందర్య నిపుణలు అంటున్నారు. రాత్రిపూట ముఖానికి కొబ్బరి నూనెతో సున్నితంగా మసాజ్ చేస్తే రాత్రంత ముఖం తేమగా, కోమలంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ మసాజ్ వల్ల ముఖం అంతా రక్తప్రసరణ జరిగి తాజాగా ఉండటమే గాక ముఖ చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది పొడి చర్మం ఉన్నవారికి ఈ కొబ్బరి నూనె మంచి మాయిశ్చరైజషన్గా ఉంటుంది. ఇందులో ఎలాంటి కృత్రిమ రసాయనాలు ఉండవు కాబట్టి దుష్ప్రభావాలు ఉండవని చెబుతున్నారు దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమల వల్ల వచ్చే వాపులను తగ్గిస్తుంది. అలాగే కళ్ల కింద వాపులను కూడా నయం చేస్తుంది. మొటిమలు, వాటి తాలుకా మచ్చలను తగ్గిచడంలో కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. బ్లాక్‌హెడ్స్, వైట్ హెడ్స్ వంటి వాటిని కూడా తగ్గిస్తుంది. అతినీలలోహిత కిరణాలను నిరోధించే శక్తి ఈ కొబ్బరి నూనెకు ఉంది. అందువల్ల ఇది మంచి యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీన్ని సహజ మేకప్ రిమూవర్‌గా కూడా ఉపయోగించొచ్చు. చెప్పాలంటే.. మేకప్‌ని తొలగించి చర్మాన్ని శుభ్రపరిచే క్లెన్సర్‌గా పనిచేస్తుంది. (చదవండి: బరువు తగ్గడంలో పనీర్ హెల్ప్ అవుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..?) -
80 డాలర్ల కిందకు వస్తేనే పెట్రో ధరల సవరణ
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు ఏడాదిన్నరగా ఒకే స్థాయిలో కొనసాగుతున్నాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో చమురు బ్యారెల్ ధర 80 డాలర్ల దిగువనకు వచ్చి స్థిరపడినప్పుడే, ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు (ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్) తిరిగి రోజువారీ రేట్ల సవరణకు వెళ్లొచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దేశ ఆయిల్ మార్కెట్లో ఈ మూడు ప్రభుత్వరంగ సంస్థల వాటా 90 శాతంగా ఉండడం గమనార్హం. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 84 డాలర్ల వద్ధ చలిస్తోంది. 2022 ఏప్రిల్ 6 నుంచి రోజువారీ రేట్ల సవరణ నిలిచిపోయిన విషయం విదితమే. అంతర్జాతీయ మార్కెట్లో గతేడాది ముడి చమురు బ్యారెల్‌కు 120 డాలర్ల వరకు వెళ్లినప్పటికీ, ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు నష్టాలను చవిచూశాయే కానీ, రేట్లను పెంచలేదు. ఆ తర్వాత బ్యారెల్ చమురు ధర 80డాలర్ల లోపునకు దిగి వచి్చనప్పటికీ, అంతకుముందు భారీ నష్టాలను చవిచూసిన కారణంగా అవి రేట్లను సవరించకుండా కొనసాగించాయి. ‘‘అంతర్జాతీయంగా చమురు ధరల్లో చెప్పుకోతగ్గ మేర అస్థిరత నెలకొంది. ధరలు అనూహ్యంగా ఆటుపోట్ల మధ్య చలిస్తున్నాయి. ఆయిల్ కంపెనీలు లీటర్‌కు రూపాయి తగ్గించినా అందరూ అభినందిస్తారు. కానీ, అంతర్జాతీయంగా రేట్లు పెరిగిపోతే తిరిగి విక్రయ ధరలను అవి సవరించడానికి అనుమతిస్తారా? అన్నదే సందేహం’’అని ఓ అధికారి పేర్కొన్నారు. మన దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో.. అంతర్జాతీయంగా ఉండే ధరలు కీలకంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. సెపె్టంబర్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 93.54 డాలర్లుగా ఉంటే, అక్టోబర్‌లో 90 డాలర్లు, నవంబర్‌లో 83.42 డాలర్లకు దిగొచ్చింది. స్థిరత్వం లేనందునే.. ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ విక్రయాలపై చమురు కంపెనీలకు లాభాలే వస్తున్నాయి. కానీ, ఇదే పరిస్థితి ఇక ముందూ కొనసాగుతుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. పైగా త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఒకవేళ అంత్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే, సవరించే పరిస్థితి ఉండదు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరల స్థిరత్వం ఆధారంగా రేట్లపై ఆయిల్ కంపెనీలు నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ‘‘కొన్ని రోజులు డీజిల్ విక్రయాలపై లాభాలు వస్తుంటే, కొన్ని రోజులు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకే విధమైన ధోరణి లేదు’’అని ఆ అధికారి పేర్కొన్నారు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర స్థిరంగా 80 డాలర్లకు దిగువన ఉన్నప్పుడు రేట్లను సవరించొచ్చని అభిప్రాయపడ్డారు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల్లోనూ మంచి లాభాలనే నమోదు చేశాయి. అయితే, గత ఆర్థిక సంవత్సరం నష్టపోయిన మొత్తం ఇంకా భర్తీ కాలేదని సదరు అధికారి తెలిపారు. క్రూడాయిల్ డిమాండ్‌కు భారత్, ఆఫ్రికా దన్ను అంతర్జాతీయంగా 2030 నాటికి రోజుకు 112 మిలియన్ బ్యారెళ్ల వినియోగం ∙ ఎస్అండ్పీ నివేదిక భారత్, ఆఫ్రికా దన్నుతో 2030 నాటికి అంతర్జాతీయంగా క్రూడాయిల్‌కి డిమాండ్ గణనీయంగా పెరగనుంది. ప్రస్తుత 103 మిలియన్ బ్యారెళ్ల (రోజుకు) స్థాయి నుంచి 112 మిలియన్ బ్యారెళ్లకు చేరనుంది. ఎస్అండ్పీ గ్లోబల్ కమోడిటీ ఇన్సైట్స్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. వంట, వాహనాల్లో స్వచ్ఛ ఇంధనాల వినియోగం గణనీయంగా పెరగగలదని ఇండియా కంటెంట్ హెడ్ పులకిత్ అగర్వాల్ తెలిపారు. 2040 నాటికి భారత్‌లో క్రూడాయిల్ డిమాండ్ గరిష్ట స్థాయైన 7.2 మిలియన్ బ్యారెళ్లకు (రోజుకు) చేరుతుందని అగర్వాల్ వివరించారు. ప్రస్తుతం ఇది రోజుకు 5.2 మిలియన్ బ్యారెళ్లుగా ఉంది. నివేదిక ప్రకారం.. దేశీయంగా కెమికల్ కమోడిటీ ఉత్పత్తుల విభాగం 2023లో 7 శాతం, 2024లో 8 శాతం మేర వృద్ధి చెందనుంది. 80–90 డాలర్ల రేటు.. సమీప భవిష్యత్తులో ధరపరంగా చూస్తే బ్యారెల్‌కు 80 డాలర్ల స్థాయిలో తిరుగాడి 2024 మూడో త్రైమాసికం నాటికి 90 డాలర్లకు చేరే అవకాశం ఉన్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ కమోడిటీ ఇన్సైట్స్ ఈడీ గౌరి జౌహర్ తెలిపారు. భారత్ వృద్ధి చెందే కొద్దీ పర్యావరణ అనుకూల ఇంధనాల వైపు క్రమంగా మళ్లుతుందని వివరించారు. ఇది టెక్నాలజీ ఆధారితమైనదిగా ఉంటుందని, ఇలాంటి సాంకేతికతలు భారీ స్థాయిలో వినియోగంలోకి రావాలంటే దేశీయంగాను, అంతర్జాతీయంగానూ నిధులు, విధానాలపరమైన మద్దతు అవసరమవుతుందని పేర్కొన్నారు. పటిష్టమైన ఆర్థిక వృద్ధి, పారిశ్రామికోత్పత్తి ఊతంతో వచ్చే ఏడాది ఆసియాలో పెట్రోకెమికల్స్ డిమాండ్‌కి సంబంధించి భారత్ కాంతిపుంజంగా ఉండగలదని సంస్థ అసోసియేట్ డైరెక్టర్ స్తుతి చావ్లా వివరించారు. డిమాండ్ ఎక్కువగానే ఉన్నప్పటికీ తగినంత సరఫరా ఉండటం, కొత్తగా ఉత్పత్తి సామర్థ్యాలు అందుబాటులోకి వస్తుండటం వంటి అంశాల కారణంగా ధరల్లో పెద్దగా మార్పులు ఉండవని చెప్పారు. ఫలితంగా మార్జిన్లపరంగా ఒత్తిడి ఎదుర్కొంటున్న దేశీ ఉత్పత్తి సంస్థలకు పెద్దగా ఊరట లభించకపోవచ్చని ఆమె పేర్కొన్నారు. -
Israel-Hamas war: ఒకేరోజు చమురుధరల్లో భారీ క్షీణత
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని నియంత్రించేందుకు మిడిల్ఈస్ట్ దేశాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో సోమవారం చమురు ధరలు 2% పైగా పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.33 అమెరికన్ డాలర్లు లేదా 2.5% తగ్గి బ్యారెల్ ధర 89.83 యూఎస్ డాలర్ల వద్ద స్థిరపడింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.59 డాలర్లు లేదా 2.9% తగ్గి బ్యారెల్ 85.49 యూఎస్ డాలర్లకు చేరింది. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి వల్ల చమురు సరఫరాపై తక్షణమే ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చునని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రాంతీయంగా తరచూ అనేక అనిశ్చితులు ఎదుర్కొనే ఇజ్రాయెల్.. రోజుకి మూడు లక్షల బ్యారెల్ సామర్థ్యం ఉన్న రెండు చమురు శుద్ధి కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో చమురు ఉత్పత్తి, శుద్ధి, సరఫరాపై తక్షణం ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చునని అంచనా! అయితే, ఉద్రిక్తతలు మరింత ముదిరి, సంక్షోభం సుదీర్ఘంగా కొనసాగితే మాత్రం ముప్పు తప్పదని నిపుణులు అంటున్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని నియంత్రించేందుకు మిడిల్ఈస్ట్ దేశాలు చేస్తున్న ఫలిస్తే మాత్రం క్రూడ్ ధర మరింత తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ ప్రతినిధులు ఈ వారం ఇజ్రాయెల్‌ను సందర్శించనున్నారు. ఇదిలా ఉండగా..పరిస్థితులను బట్టి చమురు ఉత్పత్తిని సర్దుబాటు చేస్తామని ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలైన బహ్రైన్, ఇరాక్, కువైట్, ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా హామీ ఇచ్చాయి. దానివల్ల ప్రపంచ ఆయిల్ మార్కెట్లో చమురు ధరలు స్థిరంగా ఉండవచ్చనే వాదనలు ఉన్నాయి. -
అందమైన కనుబొమ్మలకు కలోంజీ!
నల్ల జీలకర్ర (కలోంజీ) విత్తనాలను పొడిచేయాలి. ఈ పొడిలో ఆలివ్ ఆయిల్, అలోవెరా జెల్‌ను వేసి చక్కగా కలపాలి. ఇప్పుడు తడి కాటన్ వస్త్రంతో కనుబొమ్మలను శుభ్రంగా తుడిచి.. నల్ల జీలకర్ర మిశ్రమాన్ని ప్యాక్‌లా వేయాలి. ఇరవై నిమిషాలు ఆరాక కడిగేయాలి. కనుబొమ్మలను తడిలేకుండా తుడిచి కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను కనుబొమ్మలపైన రాసి ఐదునిమిషాల పాటు మర్దన చేయాలి. ఈ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలు.. ఈ ప్యాక్‌ను వారానికి మూడుసార్లు వేయడం వల్ల రక్తప్రసరణ చక్కగా జరిగి కనుబొమల మీద వెంట్రుకలు పెరుగుతాయి. నల్లజీలకర్ర ప్యాక్ పలుచటి కనుబొమలను ఒత్తుగా మారుస్తుంది. కనుబొమలు తీరైన ఆకృతిలో చక్కగా మెరుస్తాయి. కలోంజిలోని ΄ోషకాలు కనుబొమల వెంట్రుకలు రాలకుండా చేస్తాయి. కనుబొమలు తెల్లబడడం మొదలైన వారు సైతం ఈ ΄్యాక్‌ను వాడితే వెంట్రుకలు నల్లగా మారతాయి. (చదవండి: తవ్వకాల్లో బయటపడిన రెండు వేల ఏళ్ల నాటి బ్యూటీ పార్లర్!) -
పత్తి ఆహారపంట కూడా!
‘పత్తి’ కేవలం నూలువస్త్రాల ఉత్పత్తికి వాడే దూదిని అందించే వాణిజ్యపంటగానే సాధారణంగా పరిగణిస్తుంటాం. కానీ, అంతర్జాతీయంగా దీనిని వాణిజ్య పంటగానే కాకుండా ఆహార, చమురుపంటగా కూడా గుర్తిస్తున్నారు. అక్టోబర్ 7వ తేదీన ‘ప్రపంచ పత్తి దినోత్సవం’ సందర్భంగా అనేక అంతర్జాతీయసంస్థలు వ్యాప్తిలోకి తెచ్చిన సమాచారంలో ఇదొక ముఖ్యాంశం. పత్తి గింజల నుంచి తీసిన నూనెను వంటనూనెగా వాడుతున్నాం. పత్తిగింజల చక్కను పశుదాణాలో కలిపి పాడి పశువులకు మేపుతున్నాం. కొన్ని దేశాల్లో పత్తిగింజల నూనెను జీవ ఇంధనం తయారీకి కూడా వాడుతున్నారు. ఆ విశేషాలు కొన్ని.. ♦ ప్రపంచంలో అత్యధికంగా పత్తిసాగు చేస్తున్న దేశం భారత్. 23శాతం పత్తి మన దేశంలోనే పండుతోంది. 60 లక్షలమంది పత్తిసాగు చేస్తుండగా, మరో 40–50 లక్షల మంది పత్తి పరిశ్రమల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ♦ ప్రపంచవ్యాప్తంగా పత్తి రైతులు 3 కోట్ల 20 లక్షలు. ఇందులో దాదాపుగా సగం మహిళారైతులే. వీరిలో ఎక్కువమంది పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలవారే. మన దేశంలో 65శాతం పత్తి వర్షాధారంగానే సాగవుతోంది. అప్పుల పాలై ప్రాణాలు తీసుకునే రైతుల్లో మెట్ట ప్రాంతాల పత్తి రైతులే ఎక్కువ. ♦ 5 ఖండాల్లోని 80 దేశాల్లో 13 కోట్ల మందికి పైగా పత్తి ఆధారిత పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ♦ ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మికసంస్థల సమాచారం ప్రకారం.. కనీసం 18 దేశాల్లో పత్తి పొలాల్లో బాలకార్మికులతో పనులు చేయిస్తున్నారు. ♦ అంతర్జాతీయ పత్తి సలహామండలి (ఐసీఎసీ) అంచనా ప్రకారం రైతు పండించిన ఒక టన్ను పత్తి ఐదుగురికి ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తోంది. ♦ కిలో పత్తి పండించడానికి 20,000 లీటర్ల నీరు అవసరమనే భావన ఉంది. అయితే, నిజానికి 1,200–2,000 లీటర్ల నీరు సరిపోతుందని ఐసీఎసీ చెబుతోంది. అందువల్లనే నిస్సారమైన భూములు, కరువులకు ఆలవాలమైన సబ్ సహారన్ ఆఫ్రికాదేశాల్లో సాగు చేయదగిన అతికొద్ది పంటల్లో పత్తి కూడా ఉందని ఐసీఎసీ వాదన. ♦ పత్తి పంట సాగు వల్ల భూతాపం కూడా పెరగడం లేదని ఐసీఎసీ చెబుతోంది. రసాయనిక సేద్యంలో కిలో పత్తిసాగుకు 1.7 కిలోల కర్బన ఉద్గారాలు వెలువడుతు న్నాయని అంచనా. అయితే, దూదిలో 97శాతం సెల్యులోజ్ ఉంటుంది. కాబట్టి, పండే ప్రతి కిలో దూది 2.2 కిలోల కర్బన ఉద్గారాలను పీల్చుకుంటుంది. అంటే.. ప్రతి కిలో పత్తికి 0.5 కిలోల ఉద్గారాలు నిజానికి వాతావరణంలో తగ్గుతున్నట్టేనని ఐసీఎసీ లెక్క చెబుతోంది. ♦సేంద్రియ పద్ధతుల్లో సాగయ్యే కిలో దూదికి 0.9 కిలోల ఉద్గారాలు మాత్రమే విడుదలవుతున్నాయని ఐసీఎసీ అంటోంది. ♦సింథటిక్ ఫైబర్ బదులు పత్తిని వినియోగించడం ద్వారా భూతాపాన్ని తగ్గించొచ్చని, మైక్రోఫైబర్ కణాల కాలుష్యం నుంచి జలవనరులు, ఆహార చక్రాన్ని రక్షించుకోవచ్చని ఐసీఎసీ సూచిస్తోంది. ♦పంటకాలం పూర్తయిన తర్వాత పత్తి చెట్టు మొత్తంలో 3శాతం తప్ప వృథా అయ్యేదేమీ లేదు. పత్తి కట్టెతో బయోచార్ తయారు చేసుకొని సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చని ఐసీఎసీ అంటోంది. ♦ పెరుగుతున్న భూతాపం వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో పత్తి రైతులను ముఖ్యంగా మహిళా రైతులను వాతావరణ మార్పులు బహుముఖంగా ఇబ్బందుల పాలు చేస్తున్నాయని కాటన్‌కనెక్ట్ సంస్థ నిర్వహించిన అధ్యయనం చెబుతోంది. పొలం పనులు, పశుపోషణ, కుటుంబపోషణ సమస్యలతో మహిళా రైతులు సతమతమవుతున్నారు. వాతావరణ మార్పులు తట్టుకునే ఉపాయాలపై మహిళా రైతులకు అవగాహన కల్పించడం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని కాటన్ కనెక్ట్ నివేదిక తెలిపింది. ♦మన దేశంలో సాగవుతున్న పత్తి విస్తీర్ణంలో 95శాతం జన్యుమార్పిడి చేసిన వంగడాలే. – సాక్షి సాగుబడి డెస్క్ -
90 డాలర్ల ఎగువకు చేరిన బ్యారెల్ చమురు ధర
-
ఈ రెస్టారెంట్లో నూనె లేకుండానే ఘుమఘుమలాడే వంటలు..
పొయ్యి వెలిగించకుండా వంట చేయడం సాధ్యమేనా? కర్రీస్‌లో కాస్త నూనె తక్కువైతేనే టేస్ట్ సరిగా లేదని చిర్రుబుర్రులాడుతుంటాం. ఈమధ్య ఇంటా,బయట రెస్టారెంట్లలోనూ లీటర్ల కొద్దీ నూనెను వాడేస్తున్నారు. మరిగించిన నూనెనే మళ్లీ మళ్లీ ఉపయోగిస్తుంటారు. అలాంటిది నూనె లేకుండా, ఉడికించకుండానే వంటలు టేస్టీగా వండేయొచ్చని మీకు తెలుసా? ఇలా ఏదో అర, ఒకటో కాదు.. నూనె లేకుండా, పొయ్యి వెలగించకుండా 2 వేలకు పైగా వంటలు వండటమే కాకుండా, తన రెస్టారెంట్లోనూ నో ఆయల్-నో బాయల్ కాన్సెప్ట్‌తో రుచికరమైన వంటలను పరిచయం చేస్తున్నారు. ప్రస్తుతం ఏ వంట చేయాలన్నా నూనె తప్పనిసరిగా ఉండాల్సిందే. అప్పుడే వంటలు కూడా రుచికరంగా ఉంటాయి. కానీ కోయంబత్తూరుకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి మాత్రం నూనె లేకుండా, పొయ్యి వెలగకుండా అద్భుతంగా వంట వండేయొచ్చని నిరూపించాడు. చిన్నప్పటి నుంచే శివకుమార్‌కు వంటలు చేయడం అంటే మహాపిచ్చి. ఎప్పుడూ ఏవేవో వెరైటీ వంటలు వండి అందరికీ రుచి చూపించేవాడు. ఈయనకు ఆధ్యాత్మికత ఎక్కువ. అందుకే చిన్నప్పటినుంచి శాఖాహారం మాత్రమే తినేవాడు. అదే సమయంలో నూనె లేకుండా సహజసిద్ద పద్ధతుల్లో వంట చేయడం ఎలాగో ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని సుమారు రెండువేల కొత్త వంటలను కనిపెట్టి సొంతంగా కోయంబత్తూర్‌లో ఓ రెస్టారెంట్‌ను కూడా ఓపెన్ చేశాడు. ఆహారమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ ఇప్పుడు మనం ఏది తినాలన్నా కల్తీనే. ముఖ్యంగా రెస్టారెంట్స్‌లో అయితే ఆర్టిఫిషిల్ ఫుడ్ కలర్స్ కలిపి, అవసరం లేని మసాలాలను దట్టించేసి వంటలు వండేస్తున్నారు. ఇక వాళ్లు వాడే ఆయిల్ క్వాలిటీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆధునిక ప్రపంచంలో అనేక అనారోగ్య సమస్యలకు ఆహారం ప్రధాన కారణం. ఊబకాయం, గుండెజబ్బులు, అలర్జీలు మొదలైన చాలా రకాల జబ్బులు ఫుడ్ వల్లే వస్తాయి. అందుకే ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన ఫుడ్ తినాలనే ఉద్దేశంతో ఈ నేచురల్ ఫుడ్ పద్ధతిని తీసుకొచ్చా” అంటున్నాడు పడయాళ్ శివ. పోపు పెట్టకుండా సాంబార్‌నే మనం ఊహించుకోలేం.. అలాంటిది నూనె లేకుండా,పొయ్యి వెలిగించకుండా వంటలు ఎలా చేయడం అనే కదా మీ సందేహం.. ఈ రెస్టారెంట్లో కొబ్బరి పాలు, టొమాటాలు, జీడిపప్పు, తెల్లమిరియాలను మిక్సీపడితే చాలు రుచికరమైన సాంబార్ రెడీ అవుతుంది. బియ్యానికి బదులు అటుకుల్నే నానబెట్టి వాటికి కొబ్బరితురుమునీ, జీలకర్రనీ చేర్చి రుచికరంగా మన ముందు ఉంచుతారు. చింతపండు, పచ్చి పసుపు పచ్చళ్లు,12 గంటలు నానబెట్టిన కొబ్బరి పాలు లాంటి వెరైటీ ఐటెమ్స్ ఇక్కడ దొరుకుతాయి. రుచికి ఏమాతం తీసిపోకుండా ఘుమఘుమలాడే వంటలను వండేస్తున్నారు. కోయంబత్తూరులో ఈ రెస్టారెంట్‌ని ఏర్పాటు చేసి మూడేళ్లుగా విజయవంతంగా నడుపుతున్నాడు. ఇలా ఏదో ఒక రోజు, ఒక పూట కాదు, మూడు పూటలా నో ఆయిల్-నో బాయిల్ పేరుతో చక్కటి సహజసిద్దమైన భోజనాన్ని అందిస్తున్నారు. #PadayalEnergeticWellnessCare#NaturalHealthyBuffetLunch#Just@Rs249 Healthy Buffet Lunch Menu#Welcome u All#For Taste The Healthy Lunch Padayal Energetik Wellness Care Coimbatore singanallur For Prebooking Contact :8754689434#CoimbatoreFoodGuideTheGroup pic.twitter.com/NS4mROFJp7 — Padayal Energetik Wellness Care (@PadayalC) January 24, 2021 The World's First South Indian cuisine No Oil No Boil Restaurant in Coimbatore presents Buffet Lunch Saturday Padayal Natural Restaurant Buffet Lunch is open 1PM and 3:00Pm Party Orders Undertaken. Door Delivary Available.. Padayal Energetik Wellness Care 8754689434 8637410022 pic.twitter.com/Qy7HRzNKsI — Padayal Energetik Wellness Care (@PadayalC) February 20, 2021 -
స్నానం చేసే నీటిలో ఈ నూనె కలపండి.. మంచి నిద్ర పడుతుంది
ఈ నూనెతో హాయిగా నిద్ర పడుతుంది.. స్నానపు నీటిలో కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్‌ను కలపడం ద్వారా మరింత రిలాక్స్డ్గా, రిఫ్రెష్డ్గా ఉన్న అనుభూతిని పొందవచ్చు. లావెండర్ వాసన నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది, కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు మీ ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే స్నానం చేసిన వెంటనే మీ చర్మానికి మాయిశ్చరైజ ర్ రాయండి. తద్వారా మీ జుట్టు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. -
ముంబై హత్య కేసు: దుర్వాసన రాకుండా ఉండేలా..నీలగిరి నూనెని..
ముంబైలో సంచలనం రేపిన ప్రియురాలి హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతూ..ఒక్కొక్కటిగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు దొరక్కుండా ఉండేందుకు చేసిన పనులను చూసి పోలీసులు సైతం కంగుతిన్నారు. తొలుత బాధితురాలు తనకు కూతురు లాంటిదని ఏవేవో కట్టుకథలు చెప్పాడు. తర్వాత మళ్లీ మాటలు మారుస్తూ వేరువేరుగా ఇస్తున్న స్టేమెంట్లు చూసి పోలీసులు తలపట్టుకుంటున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు బాధితురాలి జుట్టకు సంబంధించిన ఫోటోలను ఆమె చెల్లెళ్లకు చూపించారు. వారంతా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఆమెకు తన పొడవాటి జుట్టు అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. బాధితురాలు సరస్వతి నలుగురు సోదరిమణులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ముగ్గురు వద్ద నుంచి వాంగ్ములాన్ని తీసుకున్నారు. నిందితుడు మనోజ్ సానేపై వారంతా కోపంగా ఉన్నారని, అతడిని కఠినంగా శిక్షించాలని కోరినట్లు తెలిపారు పోలీసులు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ మీరా భయందర్ వసాయి విరార్ మాట్లాడుతూ..సానే విచారణ సమయంలో పదే పదే వేర్వేరుగా స్టేమెంట్లు ఇస్తున్నాడని చెప్పారు. అతడి వాంగ్ములాన్ని క్రాస్ వెరిఫికేషన్ చేయగా..జూన్ 4న సరస్వతి వైద్యను హతమార్చిన అనంతరం హార్డ్‌వేర్ దుకాణం నుంచి ఎలక్ట్రిక్ కలప కట్టర్ కొనుగోలు చేసినట్లు తేలిందన్నారు. దానితోనే బాధితురాలి శరీర భాగాలను ముక్కలు చేయడమే గాక పనిచేయకపోతే మళ్లీ అదే షాపుకి వెళ్లి రిపేరు చేయించాడని పేర్కొన్నారు. మృతదేహం దుర్వాసన రాకుండా ఉండేందుకు ఏం చేయాలో గూగుల్‌లో సర్చ్ చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత ఓ దుకాణం నుంచి నీలగిరి నూనె బాటిళ్లను కొనుగోలు చేశాడని అన్నారు. మరో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే మొన్నటి వరకు ఆమె తన కూతుర లాంటిదని కథలు చెప్పిన మనోజ్ ఇప్పుడు ఆమెను ఓ గుడిలో పెళ్లి చేసుకున్నట్లు ఒప్పుకున్నాడని చెప్పారు ఇరువురి మధ్య వయసు తేడా ఎక్కువగా ఉండటంతో బంధువుల ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అతడు పెళ్లి చేసుకున్న ఆలయ పూజారిని గురించి ఆరా తీస్తున్నామని, అలాగే ఈ కేసుకి సంబంధించి ఇతర సాక్షుల గురించి కూడా తనిఖీ చేస్తున్నట్లు కమిషనరేట్ విరార్ వెల్లడించారు. కాగా, బాధితురాలిని గుర్తించేందుకు ఆమె కుటుంబ సభ్యుల డీఎన్ఏ నమునాలను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపనున్నట్లు తెలిపారు. (చదవండి: ముంబై హత్య కేసు: విచారణలో షాకింగ్ ట్విస్ట్..శ్రద్ధా ఘటన స్ఫూర్తితోనే చేశా!) -
వయాగ్రాపై బ్యాన్.. ఉడుం నూనె కోసం ఎగబడుతున్న యువత..!
ఇస్లామాబాద్: వయాగ్రా వినియోగంపై పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో కామోద్ధీపన కోసం ప్రత్నామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు అక్కడి యువకులు. ఈక్రమంలో ఉడుం కొవ్వుతో తయారు చేసిన నూనెను వాడితే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని బలంగా నమ్ముతున్నారు. అందుకే ఉడుములు వేటాడే ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్లో రావల్పిండి యువకులు ఈ ఉడుం నూనె కోసం పరితపిస్తున్నారు. ఎంత డబ్బైనా వెచ్చింది దీన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఉడుం నుంచి తీసిన కొవ్వును తేలు నూనెలో మేరినేట్ చేసి ఎరుపు రంగు మసాలలలో ఉపయోగిస్తారు. లేదా దీనితో సాందా తైలాన్ని తయారు చేస్తున్నారు. వీటిని ఉపయోగిస్తే లైంగిక వాంఛ, సామర్థ్యం పెరిగి పడకగదిలొ రెచ్చిపోవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో రావల్పిండిలోని రాజా బాజార్లో ఉడుం నూనె కోసం యువకుల తాకిడి పెరిగింది. పాకిస్తాన్‌లోని పంజాబ్, సింధ్ రాష్ట్రాల్లో చాలా ముంది ఉడుముల వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీటికి డిమాండ్ పెరగడంతో వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉడుములను చంపడం తమకు బాధగా అన్పిస్తోందని, కానీ జీవనోపాధి కోసం తప్పడం లేదని వారు చెబుతున్నారు. దశాబ్దాలుగా వీటిపైనే ఆధారపడి జీవిస్తున్నామని పేర్కొన్నారు. పాకిస్తాన్లో ఎక్కుమంది పిల్లల్ని కంటేనే సమాజంలో ఆ దంపతులను గౌరవం ఉంటుంది. పిల్లలు లేకపోతే పరువు పోతుందని చాలా మంది లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వయాగ్రా ఉపయోగించేవారు. ఇప్పుడు దానిపై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఉడుం నూనెకు డిమాండ్ పెరిగింది. అయితే దీని వల్ల లైంగిక వాంఛ, సామర్థ్యం, పటుత్వం పెరుగుతుందని ఇప్పటివరకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఉడుం వేటగాళ్లు మాత్రం నిజంగానే దీనిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణాలున్నాయని చెబుతున్నారు. చదవండి: ఏ మూడ్‌లో ఉందో సింహం! సడెన్‌గా కీపర్‌పైనే దాడి..చూస్తుండగా క్షణాల్లో.. -
రిలయన్స్ లాభాల రికార్డ్!
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో సరికొత్త రికార్డును సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 19 శాతం ఎగసి రూ. 19,299 కోట్లను తాకింది. ఒక త్రైమాసికానికి కంపెనీ చరిత్రలోనే ఇది అత్యధికంకాగా.. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 16,203 కోట్లు మాత్రమే ఆర్జించింది. రిటైల్, టెలికం విభాగాలతోపాటు చమురు, పెట్రోకెమికల్స్ బిజినెస్ వృద్ధి ఇందుకు దోహదం చేసింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2.14 లక్షల కోట్ల నుంచి రూ. 2.19 లక్షల కోట్లకు బలపడింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 66,702 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది కూడా సరికొత్త రికార్డుకాగా.. 2021–22లో రూ. కేవలం 60,705 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం దాదాపు రూ. 10 లక్షల కోట్లకు చేరింది. 2021–22లో రూ. 7.36 లక్షల కోట్ల ఆదాయం మాత్రమే అందుకుంది. పూర్తి ఏడాదికి ఆర్ఐఎల్ నిర్వహణ లాభం(ఇబిటా) తొలిసారి రూ. 1,54,691 కోట్లను తాకింది. ఇది 23 శాతం వృద్ధి. ఈ కాలంలో పెట్టుబడి వ్యయాలు రూ. 1,41,809 కోట్లుకాగా.. కంపెనీవద్దగల రూ. 1,93,282 కోట్ల నగదు బ్యాలెన్స్‌ను మినహాయిస్తే నికర రుణ భారం వార్షిక ఇబిటాకంటే తక్కువగా రూ. 1,10,218 కోట్లుగా నమోదైంది. అన్ని విభాగాల జోరు: క్యూ4లో ఆర్ఐఎల్ ఇబిటా 22 శాతం జంప్‌చేసి రూ. 41,389 కోట్లను తాకింది. రిఫైనింగ్, పెట్రోకెమికల్స్(ఓటూసీ) ఇబిటా 14 శాతంపైగా ఎగసి రూ. 16,293 కోట్లకు, టెలికంసహా డిజిటల్ సర్వీసులు 17 శాతం మెరుగుపడి రూ. 12,767 కోట్లకు, రిటైల్ విభాగం 33 శాతం దూసుకెళ్లి రూ. 4,769 కోట్లకు, ఆయిల్, గ్యాస్ ఇబిటా రెట్టింపై రూ. 3,801 కోట్లకు చేరాయి. డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ లాభాలపై రూ. 711 కోట్లమేర ప్రభావం చూపినట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. అంతక్రితం క్యూ4లో రూ. 1,898 కోట్లమేర ప్రభావం పడినట్లు ప్రస్తావించింది. ఆర్ఐఎల్ షేరు స్వల్ప వృద్ధితో 2,351 వద్ద క్లోజైంది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. రిలయన్స్ రిటైల్ భళా గతేడాది(2022–23) క్యూ4(జనవరి–మార్చి)లో రిలయన్స్ రిటైల్ నికర లాభం 13 శాతం వృద్ధితో రూ. 2,415 కోట్లను తాకింది. 2021–22 క్యూ4లో రూ. 2,139 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 21 శాతం ఎగసి రూ. 61,559 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 50,834 కోట్ల అమ్మకాలు సాధించింది. ఆదాయంలో డిజిటల్, న్యూ కామర్స్ బిజినెస్ వాటా 17 శాతానికి చేరింది. ఇక మొత్తం స్టోర్ల సంఖ్య 18,040కు చేరింది. క్యూ4లో 2,844 స్టోర్లను జత చేసుకుంది. సర్వీసులతో కలిపి క్యూ4లో ఆదాయం రూ. 69,267 కోట్లను తాకగా.. ఇబిటా 33 శాతం వృద్ధితో రూ. 4,914 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి మొత్తం ఆదాయం 32 శాతం జంప్‌చేసి రూ. 2,30,931 కోట్లను తాకింది. నికర లాభం 30 శాతం ఎగసి రూ. 9,181 కోట్లయ్యింది. సర్వీసులతో కలిపి స్థూల ఆదాయం రూ. 2,60,364 కోట్లుగా నమోదైంది. దేశీయంగా రిటైల్ రంగంలో రిలయన్స్ అత్యుత్తమ వృద్ధిని చూపుతున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈషా ఎం.అంబానీ పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధిలో భాగం డిజిటల్ కనెక్టివిటీ, ఆర్గనైజ్డ్ రిటైల్ విభాగాలలో కంపెనీ కార్యకలాపాలు వ్యవస్థాగత సామర్థ్యాలకు బలాన్నిస్తున్నాయి. తద్వారా ప్రపంచంలోనే వేగవంత వృద్ధిని సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నాయి. ఫైనాన్షియల్ సర్వీసుల విభాగాన్ని విడదీసి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరుతో లిస్ట్ చేయనున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఎంజే ఫీల్డ్, ఆర్క్లస్టర్ తదితరాలతో కలిపి కేజీ–డీ6 బ్లాకులో గ్యాస్ ఉత్పత్తి రోజుకి 3 కోట్ల ప్రామాణిక ఘనపుమీటర్లకు చేరే వీలుంది. –ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ -
నూనె మళ్లీ మళ్లీ మరిగించొద్దు.. చెడు కొలెస్ట్రాల్‌తో గుండెకు ముప్పు.. ఇంకా..
సాక్షి, అమరావతి: వంద లీటర్ల నూనెను వినియోగించి వంట చేస్తే 25 లీటర్లు మిగులుతుంది. సాధారణంగా మిగిలిన నూనెను మళ్లీ మళ్లీ మరిగించి వంటకు వాడుతుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో హానికరం. ఈ అంశంపై హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులకు అవగాహన కల్పిస్తూ.. వాడిన వంట నూనెను బయోడీజిల్ తయారీ సంస్థలకు విక్రయించేలా రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం చర్యలు తీసుకుంటోంది. ఇలా గత ఏడాదిలో 1,00,257 లీటర్ల వాడిన వంట నూనెను బయో డీజిల్ తయారీ ఏజెన్సీలకు సరఫరా అయ్యేలా చేశారు. రోజుకు 50 లీటర్లకు మించి వంట నూనెను వినియోగించే హోటళ్లు, రెస్టారెంట్లు, తినుబండారాల తయారీ సంస్థలు జాతీయ ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ)లో రిజిస్టరై ఉన్నాయి. ఇలా రిజిస్టరైన సంస్థలన్నీ ఒకసారి వాడిన నూనెను బయోడీజిల్ తయారీ సంస్థలకు విక్రయించాలని గతంలోనే ఉత్తర్వులు జారీ చేశారు. టీపీసీ 25 శాతానికి మించితే ఆరోగ్యం హుష్ మార్కెట్లో నూనెలు ఎక్కువగా వాడే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇతర ఆహార పదార్థాలకు అధిక డిమాండ్ ఉంటోంది. సాధారణంగా కంపెనీ నుంచి తయారై వచ్చిన నూనెలో టోటల్ పోలార్ కౌంట్ (టీపీసీ) 5 నుంచి 7 శాతం ఉంటుంది. ఆయిల్‌ను మరిగించే కొద్దీ టీపీసీ పెరుగుతూ ఉంటుంది. టీపీసీ మోతాదు 25 శాతానికి మించితే ఆరోగ్యానికి చాలా హానికరం. టీపీసీ మోతాదు పెరిగేకొద్దీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి. దీనివల్ల రక్తనాళాలు గట్టిపడటం, అల్జీమర్స్, కాలేయ సంబంధ వ్యాధులు, హైపర్‌టెన్షన్ తదితర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తోంది. ఇలా వాడటం వల్ల స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏజెన్సీలే సేకరిస్తాయి రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ (రూకో) విభాగంలో బయోడీజిల్‌ను తయారు చేసే అనుమతులు ఉన్న ఏజెన్సీలు గుంటూరు, విశాఖ, కాకినాడ నగరాల్లో ఐదు ఉన్నాయి. ఈ ఏజెన్సీలు రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో వాడిన వంట నూనెను సేకరిస్తున్నాయి. ఏజెన్సీల నిర్వాహకులే హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద ఖాళీ డబ్బాలను అందుబాటులో ఉంచుతారు. ఆ డబ్బాల్లోకి వాడిన నూనెను నింపి సమాచారం ఇస్తే తీసుకునివెళతారు. మార్కెట్లో నూనె ధరలకు అనుగుణంగా సేకరించే వాడిన నూనెకు ఏజెన్సీలు డబ్బు చెల్లిస్తాయి. ప్రస్తుతం లీటర్‌కు రూ.40 నుంచి రూ.50 వరకూ చెల్లిస్తున్నారు. రెండోసారి వాడితే చెడు కొలెస్ట్రాల్ తప్పదు నూనెను ఒకసారి ఉపయోగిస్తే అందులోని పోషకాలు మొత్తం మనం వాడుకున్నట్టే. తిరిగి ఆ నూనెను వేడి చేస్తే అది చెడు కొలెస్ట్రాల్‌గా మారుతుంది. చెడు కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి హాని చేస్తుంది. నూనెల్ని రెండోసారి వాడితే గుండె జబ్బులే కాకుండా ఉదరకోశ, అన్నవాహిక క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఒకసారి వాడిన నూనెను తిరిగి ఉపయోగిస్తే.. ఆహారం విషతుల్యమవుతుంది. దీనిని భుజిస్తే కడుపులో మంట, కడుపులో నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. -
ఆన్‌షోర్..ఆఫ్‌షోర్..ఎనీవేర్‌తో చమురు దోపిడీలకు చెక్
కాకినాడ క్రైం: ఆన్‌షోర్, ఆఫ్‌షోర్, ఎనీవేర్... ఇదీ చమురు దోపిడీలను నిలువరించేందుకు భద్రతా వ్యవస్థలు అనుసరిస్తున్న తాజా విధానం. సముద్ర ఉపరితలంపై కోస్టుగార్డు, తీర ప్రాంతాల్లో పోలీస్, ఎస్పీఎఫ్, మైరెన్ పోలీస్ తమ భద్రతా వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. సముద్ర భద్రత అంటే కోస్టుగార్డుకే పరిమితం అన్న స్థితిని దాటి తీర ప్రాంతాన్ని కూడా జల్లెడ పట్టి, జలాల్లో నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ తన అనుబంధ శాఖలతో కలిసి సమాయత్తమైంది. సముద్ర దొంగతనాలంటే సాధారణంగా చమురు కేంద్రంగా ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థనే శాసించే ప్రభావం ఉన్న చమురు ఉత్పత్తి నుంచి తరలింపు వరకు ప్రతి దశలోనూ పూర్తి స్థాయి భద్రత కల్పించేందుకు పేర్కొన్న వ్యవస్థలన్నీ ప్రత్యేక ప్రణాళికలతో శ్రమిస్తున్నాయి. ఆ వ్యూహాలను ప్రతిబింబించేలా కీలక సమావేశాలు, కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాయి. ఈ ప్రక్రియలో భాగంగానే గురువారం వరకూ చేపట్టిన మాక్‌డ్రిల్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ముగిసిన సముద్ర జలశుద్ధి ప్రక్రియ కాకినాడ తీరంలో అబ్బురపరిచే సముద్ర జల శుద్ది మూడు రోజుల ప్రక్రియ ముగిసింది. ఇండియన్ కోస్టు గార్డు ఆధ్వర్యంలో కాకినాడ స్టేషన్ పరిధిలో యుద్ద ప్రదర్శనను తలపించే రీతిలో రీజినల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ పేరుతో భారీ మాక్ డ్రిల్ నిర్వహించారు. కాకినాడ కోస్టుగార్డు స్టేషన్ కమాండెంట్ ఆఫీసర్ జి.వేణుమాధవ్ సారథ్యంలో భారీ స్థాయిలో చేపట్టిన ఈ మాక్ డ్రిల్ సముద్ర జలాల్లో చమురు తెట్లను తొలగించే ప్రక్రియతో పాటు భద్రతా పరమైన అంశాలకు నిర్వహణకు ఓ ట్రయల్‌గా అధికారులు తెలిపారు. అటు పోలీస్‌శాఖ... కోస్ట్‌గార్డుతో సహా అటు పోలీస్‌శాఖ సముద్ర తీరప్రాంత అనుబంధంగా జరిగే చమురు దోపిడీలపై దృష్టి సారించింది. ఏకంగా రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ డీఐజీ పాలరాజు ఆధ్వర్యంలో సముద్ర తీర ప్రాంతాలు హద్దులుగా ఉన్న అన్ని జిల్లాల ఎస్పీలతో ఇటీవల రాజమహేంద్రవరంలో ఓ ప్రత్యేక సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో జిల్లాల వారీగా చమురు చోరీల గణాంకాలపై చర్చించారని కాకినాడ జిల్లా పోలీస్ వర్గాలు తెలిపాయి. దొంగిలించి, తరలించేందుకు దొంగలు అనుసరిస్తున్న విధానాలపై అవగాహన ఏర్పరుచుకున్నారు. పోలీస్ లేదా కోస్ట్‌గార్డు అడ్డుకుంటే ఎదుర్కోవడానికి వారు వినియోగించే ఆయుధాలు, అవి వారికి సమకూరుతున్న పరిస్థితులపై చర్చించారు. ఈ నేపథ్యంలో చమురు దొంగతనాలకు పాల్పడ్డ పాత నిందితుల కదలికలపై నిఘా ఉంచాలని డీజీపీ ఎస్పిలను ఆదేశించారు. ఆయన ఆదేశాలమేరకు ఎస్పిలు యంత్రాంగాన్ని సమాయత్తపరిచారు. చమురు లీకై తే... చమురు తరలించే రెండు ఓడలు ప్రమాదవశాత్తు లేదా దాడుల నేపథ్యంలో సముద్రంలో ఢీకొట్టుకుంటే లేదా లీకేజీలు ఏర్పడితే జరిగే నష్టం సముద్ర జీవుల పట్ల ప్రాణసంకటమని కమాండెంట్ వేణుమాధవ్ తెలిపారు. లీకై న చమురు ఆక్సిజన్‌ను నీటిలోకి వెళ్లకుండా అడ్డుకుంటుందని అన్నారు. తద్వారా జీవాలు ప్రాణాలు కోల్పోతాయని తెలిపారు. చమురు నీటి నుంచి వేరు చేసే ప్రక్రియకు భారీ జల, వాయు మార్గ సంపత్తితో పాటు అధునాతన పరికర సామర్థ్యాన్ని కోస్టుగార్డు వినియోగించింది. 97 మంది అధికారులు సిబ్బంది మాక్ డ్రిల్‌లో పాల్గొన్నారు. వీరిలో 85 మంది సైలర్లు, 12 మంది అధికారులు ఉన్నారు. రెండు విధాలుగా శుద్ది... చోరీలు జరిగినపుడు, ప్రమాదవశాత్తూ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు, లేదా మరే కారణం వల్లనైనా భారీ పడవల నుంచి సముద్రంలోకి నేరుగా చమురు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చమురు తెట్లు ఏర్పడ్డ సముద్ర జలాల శుద్ది ప్రక్రియను రెండు విధాలుగా చేపడతారు. ఆ రెండు విధానాలను మాక్ డ్రిల్‌లో ప్రదర్శించారు. చమురు తెట్టుకట్టిన ప్రాంతాన్ని చుట్టుముట్టి టీసీ–3 రసాయనాన్ని చల్లడం, ఈ క్రమంలో జరిగే రసాయనిక చర్య వల్ల ఆ చమురు సముద్రగర్భంలోకి చేరుతుంది. ప్రత్యేక ప్రక్రియ ద్వారా ఆ వ్యర్థాన్ని తిరిగి సేకరిస్తారు. అంతకుముందు నీటిలో చమురు వ్యాప్తిని నిలువరించేందుకు ‘బూమ్’ను ప్రయోగించారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఓడలు భారీ ట్యూబ్ వంటి ప్రత్యేక నిర్మాణంతో రూపొందించబడ్డ ఈ బూమ్‌ను చమురు తెట్టు చుట్టూ వృత్తాకారంగా ఏర్పాటు చేస్తాయి. అది దాటి తెట్టు వ్యాపించే ప్రసక్తే లేదు. ఇది కాక రెండవ విధానం భారీ బ్రష్ ద్వారా తెట్టును సేకరించడం. ఇది తక్కువ మొత్తంలో ఏర్పడ్డ చమురు తెట్లు తొలగించేందుకు అనుకూలం. ఈ రెండు ప్రక్రియలు జరుగుతున్నంత సేపూ నిశిత పరిశీలన, పర్యవేక్షణ కోసం ‘ఏరియల్ రెక్కీ’ నిర్వహించారు. అద్భుత పనితీరు... సముద్ర జలాల్లో అసాధారణ పరిస్థితులను ఎదుర్కోవడంతో నేర నియంత్రణను సాకారం చేసే క్రమంలో అన్ని వేళల్లోనూ అప్రమత్తంగా ఉంటాం. మాక్‌డ్రిల్ పర్యావరణంపై మా బాధ్యత, చర్యలను ప్రతిబింబించే విధుల సమాహారం. ఈ ప్రదర్శన భారీ స్థాయిలో చేపట్టడంలో భద్రతా అంశాలను ప్రతిబింబించడం కూడా ఓ ఉద్దేశం. ఆ లక్ష్యంతోనే మాక్‌డ్రిల్‌కు గతంలో ఏనాడు వినియోగించని భారీ సంపత్తిని తీసుకొచ్చాం. అత్యంత సమర్థత ఉన్న సాంకేతికతనూ వినియోగించి ఎక్సర్సైజ్ నిర్వహించాం. ముఖ్యంగా చమురు దొంగతనాలను నిలువరించేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్దం చేసి అమలు చేస్తున్నాం– జి.వేణుమాధవ్, కమాండెంట్ ఆఫీసర్, కాకినాడ కోస్టుగార్డు స్టేషన్ చమురు చోరీల నివారణకు కార్యాచరణ చమురు చోరీల నివారణకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాం. రాష్ట్ర డీజీపీ ఆదేశాలు, డీఐజీ దిశానిర్దేశంలో ఈ చర్యలు కొనసాగుతున్నాయి. తాజా సమావేశంలో చమురు చోరీల నివారణ, భద్రత దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చమురు, గ్యాస్ సంస్థలకు భద్రత కల్పించడం, పైప్లైన్ల నుంచి పెట్రోలు, డీజిల్ దొంగిలిస్తున్న దొంగలను పట్టుకోవడం సంబంధిత దోపిడీలను అరికట్టడం ఇందులో కీలక అంశాలు. మైరెన్, కోస్ట్‌గార్డు పరస్పర సహకారంతో చమురు చోరీల నివారణ చర్యలకు సిద్దమయ్యాం. త్వరలో ప్రత్యేక కార్యాచరణ, బృంద నియామకాన్ని ప్రకటిస్తాం. – ఎస్.సతీష్‌కుమార్, ఎస్పి, కాకినాడ జిల్లా ప్రత్యేక భద్రత ఏర్పాటు సముద్రంలో చోరీలు ముఖ్యంగా చమురు దొంగతనాలు నిలువరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఆ దిశగా తీర ప్రాంత వాసులతో మమేకమవుతూ దొంగల కార్యకలాపాలు నిలువరించే ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. ఓఎన్జీసీ, రిలయన్స్ ఆయిల్ రిగ్‌ల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నాం. ఫాస్ట్ ఇంటర్సెప్ట్ బోట్లు అందుబాటులో ఉన్నా నిపుపయోగంగా ఉండటం వల్ల మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవడంలో చిన్నపాటి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వాటి మరమ్మతుల కోసం ఇప్పటికే విన్నవించాం. – సుమంత్, మైరెన్ సీఐ -
ఆర్థిక పటిష్టత ప్రాతిపదికనే ఎల్ఓసీలు
న్యూఢిల్లీ: తమ ఆర్థిక పటిష్టత, శక్తిసామర్థ్యాల ప్రాతిపదికనే ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్‌యూ) ‘లెటర్ ఆఫ్ కంఫర్ట్’ను జారీ చేయాలని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఎల్ఓసీల జారీ విషయంలో కొన్ని సడలింపులు ఇవ్వాలని కోరుతూ చమురు, విద్యుత్ రంగంలోని కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కోరిన నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది. సొంత ఆర్థిక బలం ఆధారంగా ఎల్ఓసీల జారీ సాధారణ వ్యాపార ఆచరణలో ఒక భాగం. ఇది సంస్థలు వాటి క్యాపెక్స్ లేదా వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం పోటీ రేట్ల వద్ద నిధులను సమీకరించుకోడానికి అలాగే జాయింట్ వెంచర్లు లేదా అనుంబంధ సంస్థలు లేదా గ్రూప్ కంపెనీల వ్యాపార ప్రయోజనాలను పరిరక్షించుకోడానికి దోహదపడుతుంది. ఇన్ఫ్రా ప్రాజెక్టుల కోసం నిధుల టై–అప్ కోసం బ్యాంకులకు ’లెటర్ ఆఫ్ కంఫర్ట్’ (ఎల్ఓసీ) జారీ చేయడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (ఎన్బీఎఫ్సీ) గత సంవత్సరం ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. -
Russian Oil: అందుకేనా! రష్యా భారత్‌వైపే చూస్తోంది!
రష్యా చమురుకు చైనా నుంచి డిమాండ్ పెరుగుతన్నప్పటికీ.. భారత్‌కే వీలైనంత ఎక్కువగా విక్రయించేందుకు మొగ్గు చూపుతుంది. అదీగాక రష్యాకి కూడా మరింత లాభదాయకంగా ఉండటంతో భారత్ మార్కట్ వైపే ఆసక్తి కనబరుస్తోంది. వాస్తవానికి ఒక ఏడాది క్రితం దాదాపుగా రష్యా చమురును భారత్ కొనుగోలు చేయలేదు. కానీ ఎప్పుడైతే అమెరికా, యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్ యుద్ధ విషయమై రష్యాపై ఆంక్షలు విధించాయో అప్పుడే భారత్ రష్యాకి కీలకమైన మార్కెట్‌గా మారింది. గత ఫిబ్రవరిలో భారత్ రష్యా నుంచి రోజుకు 1.85 మిలియన్ బ్యారెళ్లను దిగుమతి చేసుకుంది. అంటే దాని సంభావ్య గరిష్ట స్థాయి దాదాపు 2 మిలియన్ బ్యారెల్స్‌కు దగ్గరగా ఉంటుందని ప్రధాన ముడి విశ్లేషకుడు విక్టర్ కటోనా వివరించారు. ప్రస్తుతం చైనా కరోనా ఆంక్షలను ఎత్తేసింది. పైగా మొత్తం రష్యా చమురు ఎగుమతులను చైనా కొనుగోలు చేయగలదు కూడా అయినప్పటికీ రష్యా భారత్ మార్కెట్‌నే కొనసాగించాలని ఫిక్స్ అయ్యింది. ఎందుకంటే భారత్ దాని ముడి విక్రయితలకు ఎక్కువ నియంత్రణ ఇస్తుంది. ఇదిలా ఉండగా..అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) ప్రకారం..గత నెలలో, రష్యా చైనాకు రోజుకు 2.3 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును ఎగుమతి చేసింది. మహమ్మారి సమయంలో విధించిన ప్రయాణ ఆంక్షలు ముగిసిన తర్వాత ఈ ఏడాది ఆసియా దిగ్గజం చమురు డిమాండ్ రోజుకు సుమారు 9 లక్షల బ్యారెల్స్ పెరుగుతుందని ఐఈఏ అంచనా వేసింది. చైనా రష్యా ముడి చమురును కొనుగోలు చేయగలగడమే గాక సొంతంగా షిప్పింగ్ చేయగల సామర్థ్యాం కూడా ఉంది. ఐతే భారత్‌కి సరఫరా చేయడానికి స్థాపించిన ట్యాంకర్ల సమాంతర గ్రే ఫ్లీట్ నుంచి మాస్కో ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉందని అందువల్లే భారత్ ప్రయారిటీ ఇస్తోందని విక్టర్ కటోనా చెబుతున్నారు. అదీగాక భారత్‌కి ఓడరేవుల ద్వారా చమురు సరఫరా కేవలం 35 రోజులు పడుతుండగా చైనాకి సుమారు 40 నుంచి 45 రోజుల వరకు పడుతుంది. అంతేగాదు పెద్ద మొత్తంలో రష్యా చమురును ఉత్పత్తి చేసే రోన్సెఫ్ట్ పీజేఎస్ నయా ఎనర్జీ లిమిటెడ్‌లో 49.31% వాటాను కలిగి ఉంది. దీనికి సంబంధించిన షిప్పింగ్ రిఫెనరీ గుజరాత్‌లోని వదినార్‌లో ఉంది. ఇదే భారత్‌కు ఉన్న రెండోవ అతిపెద్ద వెసులుబాటు కావడంతో రష్యా భారత్‌కే విక్రయించేందుకు ఆసక్తి చూపుతోంది. (చదవండి: నిందితుడి అతితెలివి: పోలీసులకు చిక్కుకుండా కొరియన్‌లా సర్జరీ! కానీ..) -
India Buying Russian Oil: భారత్‌ని నిందించలేం! అది మా పని కాదు!
రష్యా నుంచి చమురు కోనుగోలు చేస్తున్న భారత్ గురించి జర్మన్ రాయబారి ఫిలప్ అకెర్మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం గురించి భారత్‌ని నిందించలేనని స్పష్టం చేశారు. రష్యా చమురు కొనుగోలుపై న్యూఢిల్లీ అనుసరిస్తున్న విధానం సౌకర్యవంతంగా ఉందని యూఎస్ చెప్పిన కొద్ది వారాల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం విషయమై భారత్‌ని విమర్శించలేను, అది మాకు అనవసరమైన విషయం అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇది భారత ప్రభుత్వానికి సంబంధించిన విషయం దీనిలో తాము జోక్యం చేసుకోమని తెగేసి చెప్పారు. అంతేగాదు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపగలిగే తగిన అభ్యర్థి భారతేనని, దానికి ఆ నైపుణ్యం, దౌత్యం ఉన్నాయని జర్మన్ రాయబారి అకెర్ మాన్ అన్నారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగిన తర్వాత నుంచి పాశ్చాత్య దేశాలు రష్యా చమురు కొనుగోలును తగ్గించాయి. కానీ చైనా, యూఎస్ తర్వాత ప్రపంచంలో మూడవ అతి పెద్ద ముడి చమురు దిగుమతి దారు అయిన భారత్ మాత్రం రష్యా నుంచి చమురును కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై పాశ్చాత్య దేశాలు విమర్శిస్తున్నా.. మంచి డీల్ లభించిన చోట చమురు కొనుగోలు చేస్తూనే ఉంటామని కరాఖండీగా చెప్పింది. ఐతే రష్యా చమురుపై పరిమితి విధించిన జీ7 దేశాలకు మద్దతివ్వకుండా భారత్ తీసుకున్న నిర్ణయాన్ని రష్యా స్వాగతించింది. భారత్‌లో రష్యన్ చమురు దిగుమతులు జనవరిలో రికార్డు స్థాయిలో 1.4 మిలియన్ల బారెళ్లకు చేరాయి. మాస్కో ఇప్పటికి న్యూఢిల్లీకి చమురు అమ్మకందారుగా ఉంది. దీంతో భారత్‌లో రిఫైనర్లు రష్యా కీలక చమురు క్లయింట్‌గా ఉద్భవించాయి. అంతేగాదు భారత్ ఐరోపా, యూఎస్ కోసం ఇంధనాన్ని శుద్ధి చేస్తోంది కూడా. ఐతే శుద్ధి చేసిన ఇంధనం రష్యన్‌కి చెందినదిగా పరిగణించబడదు. అదీగాక ముడి చమురును సాధ్యమైనంత వరకు తక్కువ ధరకు కొనుగోలు చేయడం కోసం రష్యాతో భారత్ కఠినమైన భేరాన్నే కుదుర్చుకుంది. దీంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని..ఇంధన భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో వాషింగ్టన్ న్యూఢిల్లీతో సౌకర్యవంతంగా ఉందని బైడెన్ పరిపాలనాధికారి తెలిపారు. (చదవండి: బీబీసీకి ఆ స్వేచ్ఛ ఉంది! భారత్‌లో పరిణామాలపై బ్రిటన్ స్పందన) -
5.85 శాతానికి టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం మాదిరే టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) సైతం నవంబర్‌లో గణనీయంగా తగ్గి 5.85 శాతానికి పరిమితమైంది. అంతకుముందు నెలలో (అక్టోబర్) ఇది 8.39 శాతంగా ఉంది. ఆహారం, చమురు, తయారీ ధరలు తగ్గుముఖం పట్టడం ద్రవ్యోల్బణం వేడి తగ్గేందుకు సాయపడ్డాయి. నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం సైతం అక్టోబర్‌లో ఉన్న 6.77 శాతం నుంచి 5.88 శాతానికి తగ్గడం తెలిసిందే. గతేడాది నవంబర్‌లో డబ్ల్యూపీఐ బేస్ అధికంగా ఉండడం, ఆహార ధరలు కొంత తగ్గడం ద్రవ్యోల్బణం నియంత్రణకు సాయపడినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ పరిశోధన పత్రంలో పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 4.83% తర్వాత, అతి తక్కువ స్థాయిలో నమోదు కావడం మళ్లీ ఇదే మొదటిసారి. విభాగాల వారీగా.. ► ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 8.33% ఉంటే, నవంబర్‌లో 1.07%గా ఉంది. ► కూరగాయల ధరలు అయితే ఊహించని విధంగా నియంత్రణలోకి వచ్చాయి. కూరగాయలకు సంబంధించి ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 17.61 శాతంగా ఉంటే, నవంబర్‌లో ఏకంగా మైనస్ 20 శాతానికి (డిఫ్లేషన్) పడిపోయింది. ► ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం 17.35 శాతంగా నమోదైంది. ► తయారీ ఉత్పత్తులకు సంబంధించి 3.59 శాతంగా ఉంది. మరింత తగ్గిస్తాం.. ప్రధాని మోదీ, మంత్రుల బృందం, అధికారులు ఎప్పటికప్పుడు జోక్యం చేసుకోవడం, చర్యలు తీసుకోవడం ఫలితాలనిచ్చాయి అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు తెలిపారు. సామాన్యుడి కోసం ద్రవ్యోల్బణాన్ని మరింత తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. -
భారత్‌కు చమురు సరఫరాలో రష్యానే టాప్
న్యూఢిల్లీ: భారత్‌కు అత్యధికంగా ముడిచమురు సరఫరా చేసే దేశాల జాబితాలో వరుసగా రెండో నెలా నవంబర్లోనూ రష్యా అగ్రస్థానంలో నిల్చింది. ఎనర్జీ ఇంటెలిజెన్స్ సంస్థ వర్టెక్సా గణాంకాల ప్రకారం రోజుకు 9.09 లక్షల బ్యారెళ్ల (బీపీడీ) ముడి చమురును సరఫరా చేసింది. అక్టోబర్‌లో ఎగుమతి చేసిన 9.35 లక్షల బీపీడితో పోలిస్తే ఇది కాస్త తక్కువే అయినా.. మిగతా దేశాల ద్వారా వచ్చిన క్రూడాయిల్‌తో పోలిస్తే అధికంగానే ఉంది. (గుడ్‌న్యూస్..ఈ ఐటీ కంపెనీలో కొలువులే కొలువులు) సాధారణంగా భారత్‌కు చమురు సరఫరా చేయడంలో ఇరాక్, సౌదీ అరేబియా అగ్రస్థానాల్లో ఉంటాయి. కానీ తాజాగా నవంబర్‌లో మాత్రం ఇరాక్ నుంచి 8.61 లక్షల బీపీడీ, సౌదీ అరేబియా నుండి 5.70 లక్షల బీపీడీ చమురు మాత్రమే దిగుమతయ్యింది. 4.05 లక్షల బీపీడీతో అమెరికా నాలుగో స్థానంలో ఉంది. భారత్‌కు రష్యా నుంచి చమురు ఎగుమతులు ఈ ఏడాది మార్చిలో కేవలం 0.2 శాతం స్థాయిలో ఉండేవి. (‘క్రోమా’ వింటర్ సీజన్ సేల్..బంపర్ ఆఫర్లు) కానీ ప్రస్తుతం భారత చమురు సరఫరాల్లో అయిదో వంతుకు పెరిగాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం దరిమిలా పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో భారత్‌కు రష్యా డిస్కౌంటు రేటుకే ముడి చమురును అందిస్తోంది. దీంతో ఇటీవలి కాలంలో రష్యా క్రూడాయిల్ దిగుమతులు గణనీయంగా పెరిగాయి. (ఎన్డీటీవీ బోర్డు: అదానీ గ్రూప్‌నకు 2 సీట్లు ఆఫర్) -
మేము బాధపడుతుంటే..భారత్ లాభపడుతోంది: ఉక్రెయిన్ మంత్రి ఫైర్
రష్యా సాగిస్తున్న దురాకమ్రణ యుద్ధంలో ఉక్రెయిన్లు ప్రతిరోజు చనిపోతుంటే..మీకు అది వరమైందంటూ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమెట్రో కులేబా భారత్‌పై విరుచుకుపడ్డారు. మా కారణంగానే మీకు రష్యా చమురును చౌకగా కొనుగోలు చేసే అవకాశం వచ్చిందంటూ మండిపడ్డారు. ఇది నైతికంగా భారత్‌కి తగనిది అని నొక్కి చెప్పారు. మా బాధల కారణంగా మీరు ప్రయోజనం పొందినట్లయితే మాకు మరింత సాయం చేయడం మంచిది అని కులేబా చురకలంటించారు. మరోవైపు ఇటీవలే ఈ విషయమై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ ఏడాదిలో కేవలం ఫిబ్రవరి, నవంబర్ నెలల మధ్య యూరోపియన్ యూనియన్ (ఈయూ) రష్యా నుంచి అత్యధిక స్థాయిలో శిలాజ ఇధనాన్ని కొనుగోలు చేసిందని తెలిపారు. దీనికి ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా ఈయూ కూడా అదే పనిచేస్తోందని ఆవేదన చెందారు. భారత్ చౌకైన చమురు లభించడం వెనకాల బాధలనుభవిస్తున్న ఉక్రెయిన్లను చూడండి అని భారత్‌ని అభ్యర్థించారు. భారత్ రష్యాతో వ్యూహాత్మక సంబంధాన్ని కొనసాగిస్తూనే..యుద్ధం విషయంలో రష్యా తీరుని ఖండించింది కానీ ఐక్యరాజ్యసమితిలో మాస్కోకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి మాత్రం దూరంగా ఉందన్నారు. అలాగే ప్రధాని మోదీ ఇది యుద్ధం చేసేందుకు సమయం కాదు అని ఉక్రెయిన్‌కి మద్దతుగా ప్రోత్సాహకరమైన సందేశాలు ఇచ్చారు. అలాగే మోదీ తన స్వరంతో దేన్నైనా మార్చగలరన్నారు. అందువల్ల యుద్ధం ముగించడంలో ఢిల్లీ కూడా తన వంతు ప్రయత్నం చేయాలని, ఇది అత్యంత ముఖ్యమైనదని అన్నారు. ప్రస్తుతం సమష్టి కృషి చేయడం ముఖ్యం, అందువల్ల భారత్ ముందుగా ప్రయత్నించకపోతే ఏది కాదని డిమెట్రో కులేబా వ్యాఖ్యానించారు. అలాగే ఈ శీతకాలంలో సైతం కీవ్ తన సైనిక దాడిని ఆపదని చెప్పారు. తాము ఒక్క రోజు కూడా ఆగమని, ఎందుకంటే తాము తీసుకునే ప్రతి విరామంలో రష్యా ఉక్రెయిన్ ఆక్రమిత భూభాగాల్లో వారి రక్షణ రేఖలను బలోపేతం చేసుకునేందుకు యత్నిస్తుందన్నారు. అదీగాక గత కొద్ది వారాలుగా ఉక్రెయిన్ పౌర మౌలిక సదుపాయాలను, ప్రత్యేకించి విద్యుత్ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని రష్యా డ్రోన్ క్షిపణి దాడులకు దిగిందని చెప్పారు. (చదవండి: బహిరంగంగా విద్యార్థులకు ఉరి...మరోసారి వెలుగులోకి కిమ్ నిరంకుశపాలన) -
కాకినాడ: ఇండియన్ ఫుడ్స్ ఆయిల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం
-
వేడి నూనెలో వట్టి చేతులతో..
యశవంతపుర: సలసల మరుగుతున్న నూనె చుక్క పడినా బొబ్బలెక్కుతాయి. కానీ అదే వేడి నూనెలో ఉడుకుతున్న వడలను చేతితో బయటకు తీశారు భక్తులు. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లా కుమట పట్టణంలో జరిగింది. పట్టణంలోని కామాక్షి దేవస్థానంలో దసరా తరువాత పౌర్ణమి రోజున ఘనంగా జాతర జరుగుతుంది. ఇందులో కళాయిలో వేగుతున్న వడలను తీసి భక్తిని చాటుకునే కార్యక్రమం ఉంటుంది. ఆదివారం సాయంత్రం జరిగిన జాతరలో కొందరు భక్తులు ఇలా వడలను తీశారు. ఎవరికీ బొబ్బలు ఎక్కలేదన్నారు. గోవా, మహారాష్ట్రల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. (చదవండి: యాత్ర తర్వాత కొత్త రాహుల్‌ను చూస్తారు) -
చమురు ఉత్పత్తికి ఒపెక్ కోత, దేశంలో మళ్లీ పెట్రో ధరల మంట?
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ విక్రయాలపై లాభాలు కళ్లచూద్దామన్న ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్) ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. పెట్రోల్ ఉత్పత్తుల ధరలు దేశంలో ఆరు నెలలుగా ఒకే స్థాయిలో ఉండిపోయాయి. కేంద్ర ప్రభుత్వ పరోక్ష ఆదేశాలతో ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు రోజువారీ రేట్ల సవరణను నిలిపివేశాయి. చమురు ఉత్పత్తికి కోత పెట్టాలని చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య (ఒపెక్) తాజాగా తీసుకున్న నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో రేట్ల సవరణ కూడా ఇప్పట్లో చేపట్టే అవకాశాల్లేవని తెలుస్తోంది. చమురు ధరలు ఇటీవలి గరిష్టాల నుంచి కొంత తగ్గుముఖం పట్టాయి. దీంతో చమురును ఉత్పత్తి చేస్తున్న దేశాల కూటమి ఒపెక్ రోజువారీగా 2 మిలియన్ బ్యారెళ్ల మేర తగ్గించుకోవాలని బుధవారం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ధరలు తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్న మన ఆర్థిక వ్యవస్థకు ఓపెక్ తాజా నిర్ణయం ప్రతికూలం కానుంది. మన దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధరలను సవరించకపోవడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల ధరలు తగ్గడంతో డీజిల్ మినహా పెట్రోల్, గ్యాస్‌పై అవి ఎదుర్కొంటున్న నష్టాలు సున్నా స్థాయికి చేరాయి. లీటర్ డీజిల్‌పై నష్టం రూ.5కు తగ్గింది. కానీ, తాజా పరిణామంతో తిరిగి ఆయిల్ కంపెనీలకు నష్టాలు పెరిగిపోనున్నాయి. మరోవైపు రూపాయి మారకం విలువ క్షీణించడం కూడా చమురుపై నష్టాలను పెంచనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. నష్టాల బాట.. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలన్న కేంద్ర సర్కారు లక్ష్యానికి అనుగుణంగా పెట్రోలియం ఉత్పత్తుల విక్రయ ధరలను సవరించకపోవడంతో ఆయిల్ కంపెనీల నష్టాలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా జూన్ త్రైమాసికంలో మూడు ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ఉమ్మడిగా రూ.18,480 కోట్ల నష్టాలను నమోదు చేశాయి. భారత్ దిగుమతి చేసుకునే బ్యారెల్ ముడి చమురు ధర సెప్టెంబర్ 27 నాటికి 84.75 డాలర్లకు తగ్గగా, అక్టోబర్ 5 నాటికి తిరిగి 92.17 డాలర్లకు పెరిగిపోయింది. చమురు ధరల క్షీణత ఇలానే కొనసాగితే, ఏప్రిల్ నుంచి ఎదుర్కొన్న నష్టాల భారం నుంచి గట్టెక్కొచ్చన్న చమురు కంపెనీల ఆశలు తాజా పరిణామంతో చెదిరిపోయాయి. 2021 నవంబర్ 4 నుంచి ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ పెట్రోల్, డీజిల్ ధరల సవరణను నిలిపివేయడం గమనార్హం. మార్చి 22 తర్వాత తిరిగి ఇవి రేట్లను సవరించాయి. ఫలితంగా లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.10 మేర పెరిగింది. తిరిగి ఏప్రిల్ 7 నుంచి రేట్ల సవరణ నిలిచిపోయింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 చొప్పున ఉంది. -
పెట్రోనెట్ ఎల్ఎన్జీ, రానున్న 5 ఏళ్లలో రూ.40వేల కోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: పెట్రోనెట్ ఎల్ఎన్జీ వచ్చే ఐదేళ్ల కాలానికి భారీ విస్తరణ ప్రణాళికతో ఉంది. రూ.40,000 కోట్లతో దిగుమతుల సదుపాయాలను విస్తరించుకోవడం, కొత్త వ్యాపారాల్లోకి ప్రవేశించడం ద్వారా లాభాలను రూ.10,000 కోట్లకు తీసుకెళ్లనున్నట్టు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం పెట్రోనెట్ ఎల్ఎన్జీ గుజరాత్‌లోని దహేజ్, కేరళలోని కోచిలో రెండు ఎల్ఎన్జీ దిగుమతి కేంద్రాలను కలిగి ఉంది. పెట్రోకెమికల్స్ వ్యాపారంలోకి సైతం అడుగుపెట్టాలని చూస్తున్నట్టు సంస్థ వార్షిక నివేదిక తెలియజేస్తోంది. ‘‘వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల టర్నో వర్ సాధించాలి. పన్ను అనంతరం వార్షిక లాభం రూ.10,000 కోట్లుగా ఉండాలి. ఇందుకోసం రూ.40,000 కోట్ల పెట్టుబడులు పెట్టా లి’’అని పెట్రోనెట్ ఎల్ఎన్జీ ప్రణాళిక రచించుకుంది. దీన్ని సూచించే విధంగా ‘1–5–10– 40’ అనే విధానాన్ని వార్షిక నివేదికలో ప్రస్తావించింది. గడిచిన ఆర్థిక సంవత్సానికి పెట్రోనెట్ ఎల్ఎన్జీ లాభం రూ.3,352 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.43,169 కోట్లుగా నమోదైంది. ఈ ప్రకారం నికర లాభం రెండు రెట్ల మేర, ఆదాయం రెట్టింపు మేర పెంచుకోవాలన్నది సంస్థ వ్యూహంగా ఉంది. -
RIL AGM: దీపావళికల్లా రిలయన్స్ 5జీ
ముంబై: దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత దూకుడుగా విస్తరించనుంది. ఇందుకోసం రూ. 2.75 లక్షల కోట్ల పెట్టుబడులతో భారీ ప్రణాళికలు రూపొందించుకుంది. ఇందులో 5జీపై రూ. 2 లక్షల కోట్లు, కీలకమైన చమురు.. పెట్రోకెమికల్స్ వ్యాపారంపై వచ్చే అయిదేళ్లలో రూ. 75,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5జీ టెలికం సర్వీసులను అక్టోబర్‌లో (దీపావళి నాటికి) అందుబాటులోకి తేనుంది. అలాగే పోటీ దిగ్గజం అదానీ గ్రూప్‌ను ఢీకొట్టేందుకు ఎఫ్ఎంసీజీ రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. సోమవారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. అలాగే వారసత్వ ప్రణాళికలను కూడా ప్రకటించారు. ముగ్గురు సంతానం సారథ్యం వహించబోయే విభాగాలను కూడా వివరించారు. చౌకగా, నాణ్యమైన 5జీ సేవలు.. రిలయన్స్‌లోని టెలికం విభాగం రిలయన్స్ జియో 5జీ నెట్‌వర్క్‌పై రూ. 2 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. దీపావళి నాటికి నాలుగు మెట్రో నగరాల్లో, ఆ తర్వాత 2023 డిసెంబర్ ఆఖరు కల్లా దేశవ్యాప్తంగా ఈ సర్వీసులను అందుబాటులోకి తేనుంది. ‘సిసలైన పాన్–ఇండియా 5జీ నెట్వర్క్ నిర్మించేందుకు మేము రూ. 2 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాం. వచ్చే రెండు నెలల్లో.. అంటే దీపావళి నాటికి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా సహా కీలకమైన మెట్రో నగరాల్లో జియో 5జీ సేవలను ప్రారంభిస్తాం’ అని ముకేశ్ అంబానీ వివరించారు. అత్యంత వేగవంతమైన 5జీ రాకతో కోట్ల కొద్దీ స్మార్ట్ సెన్సర్స్‌ను ఆవిష్కరిస్తామని, ఇవి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, నాలుగో పారిశ్రామిక విప్లవానికి ఊతమిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకంగా భారత్ కోసం 5జీ సొల్యూషన్స్ రూపొందించేందుకు చిప్ తయారీ దిగ్గజం క్వాల్‌కామ్‌తో జట్టు కట్టినట్లు అంబానీ చెప్పారు. అలాగే, అత్యంత చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్స్‌ను అభివృద్ధి చేసేందుకు టెక్ దిగ్గజం గూగుల్‌తో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్స్‌లోకి కూడా విస్తరిస్తున్నట్లు అంబానీ తెలిపారు. ఇటీవల ముగిసిన వేలంలో జియో రూ. 88,078 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. మరోవైపు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వంటి పవర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ కోసం కొత్తగా మరో గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే సోలార్ ప్యానెల్స్, ఎనర్జీ స్టోరేజీ, ఎలక్ట్రోలైజర్లు, ఫ్యూయల్ సెల్స్ ఉత్పత్తి కోసం నాలుగు గిగా ఫ్యాక్టరీలను రిలయన్స్ ప్రకటించగా ఇది ఐదోది కానుంది. ఎఫ్ఎంసీజీలో అదానీతో ఢీ.. వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ ఏడాది వినియోగ ఉత్పత్తుల (ఎఫ్ఎంసీజీ) విభాగంలోకి కూడా ప్రవేశిస్తున్నట్లు ముకేశ్ అంబానీ కుమార్తె, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) డైరెక్టర్ ఈశా అంబానీ తెలిపారు. ప్రజల రోజువారీ అవసరాలకు సంబంధించి అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను, చౌకగా అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. తొలి దశలో ఫుడ్, బెవరేజెస్, వ్యక్తిగత సంరక్షణ, నిత్యావసరాలు వంటి విభాగాల్లో పటిష్టమైన బ్రాండ్స్‌తో కలిసి పనిచేయనున్నట్లు ఈషా చెప్పారు. అలాగే కంపెనీల విలీనాలు, కొనుగోళ్ల ద్వారా పోర్ట్‌ఫోలియోను విస్తరించనున్నట్లు తెలిపారు. ‘వచ్చే అయిదేళ్లలో ఒక కోటి మంది పైగా వ్యాపారస్తులతో భాగస్వామ్యాలు కుదుర్చుకునే దిశగా ముందుకు వెడుతున్నాం. దేశవ్యాప్తంగా 7,500 పట్టణాలు, 5 లక్షల గ్రామాలకు విస్తరించబోతున్నాం’ అని ఈషా పేర్కొన్నారు. ఇదే సందర్భంగా జియోమార్ట్‌లో కొనుగోళ్లకు వాట్సాప్ ద్వారా ఆర్డర్లు పెట్టడం, చెల్లింపులు జరిపే విధానాన్ని ఆమె ఆవిష్కరించారు. అటు, జియోమార్ట్‌తో జట్టుకట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ .. ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. రిలయన్స్‌లో రిటైల్ వ్యాపారాలకు ఆర్ఆర్వీఎల్ హోల్డింగ్ కంపెనీగా వ్యవహరిస్తోంది. దీని విలువ దాదాపు రూ. 2 లక్షల కోట్లు.. 2022 జూన్ 30 నాటికి రిలయన్స్ రిటైల్‌కు 15,866 స్టోర్స్ ఉన్నాయి. ఎఫ్ఎంసీజీలో ఎంట్రీతో ఆ విభాగంలో దిగ్గజంగా ఉన్న అదానీ గ్రూప్‌తో రిలయన్స్ నేరుగా తలపడనుంది. అదానీకి చెందిన అదానీ విల్మర్ వంట నూనెలు మొదలుకుని వివిధ ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తులతో దేశంలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉంది. ఈ నేపథ్యంలో అదానీ ప్రధాన వ్యాపారమైన ఎఫ్‌ఎంసీజీలోకి అంబానీ ఎంట్రీ ప్రాధాన్యం సంతరించుకుంది. వారసులొచ్చేశారు.. ఆకాశ్‌కు టెలికం, ఈషాకు రిటైల్, అనంత్‌కు ఎనర్జీ.. ఏజీఎం వేదికగా ముకేశ్ అంబానీ (65) తమ వ్యాపార సామ్రాజ్యానికి వారసులను కూడా ప్రకటించారు. అంబానీకి ముగ్గురు సంతానం (ఇద్దరు కవలలు–ఆకాశ్, ఈషా) కాగా, రిలయన్స్ సామ్రాజ్యంలో ప్రధానంగా ఆయిల్ రిఫైనింగ్..పెట్రోకెమికల్స్, రిటైల్, టెలికం సహా డిజిటల్ సర్వీసులు అని మూడు వ్యాపార విభాగాలు ఉన్నాయి. వీటిని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున అంబానీ కేటాయించారు. ‘జియో (టెలికం విభాగం)లో ఆకాశ్ (30), రిటైల్‌లో ఈషా ఇప్పటికే సారథ్య బాధ్యతలు చేపట్టారు. కన్జూమర్ వ్యాపార విభాగాలను ప్రారంభించిన తొలినాళ్ల నుంచి వారు చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక అనంత్ (26) కూడా మా కొత్త ఇంధన వ్యాపార విభాగం కార్యకలాపాల్లో ఎంతో ఆసక్తిగా పాలుపంచుకున్నారు‘ అంటూ ఎవరికి ఏయే వ్యాపార విభాగాల బాధ్యతలు ఇస్తున్నదీ ఆయన వెల్లడించారు. అయితే, వారసులను ప్రకటించినంత మాత్రాన తాను రిటైర్ అవుతున్నట్లుగా భావించరాదని ఆయన స్పష్టం చేశారు. ‘స్వర్ణ దశాబ్ది ముగిసే 2027 నాటికి రిలయన్స్ విలువ రెట్టింపయ్యేలా, గ్రూప్ సమగ్రంగా..సురక్షితంగా ఉండేలా ఈ ప్రణాళికలు దోహదపడగలవు’ అని అంబానీ చెప్పారు. మూడు వ్యాపార విభాగాలు ప్రస్తుతం దాదాపు ఒకే పరిమాణం స్థాయిలో ఉన్నాయి. జూన్‌లోనే ఆకాశ్.. జియో ప్లాట్‌ఫామ్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈషా, అనంత్‌లు గ్రూప్ సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్నారు. ముందుజాగ్రత్త .. వారసత్వ ప్రకటన ద్వారా, గతంలో తండ్రి ధీరూభాయ్ అంబానీ మరణానంతరం రిలయన్స్ వ్యాపార విభజనపై సోదరుడు అనిల్ అంబానీతో తనకు తలెత్తిన విభేదాల్లాంటివి, తన సంతానం విషయంలో జరగకుండా ముకేశ్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అయిందని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. ధీరూభాయ్ అంబానీ 1973లో రిలయన్స్‌ను ప్రారంభించారు. టెక్స్టైల్స్ నుంచి చమురు, టెలికం వరకూ వ్యాపారాన్ని వివిధ విభాగాల్లోకి విస్తరించారు. అయితే, వీలునామాల్లాంటివేవీ రాయకుండా 2002లో ఆయన ఆకస్మికంగా మరణించడంతో రిలయన్స్ సామ్రాజ్యం బీటలు బారింది. ముకేశ్, ఆయన తమ్ముడు అనిల్ అంబానీల మధ్య విభేదాలు తలెత్తాయి. చివరికి వారి మాతృమూర్తి కోకిలాబెన్ జోక్యం చేసుకుని 2005లో రిలయన్స్‌ను విడగొట్టి సోదరులిద్దరికీ పంచారు. ముకేశ్‌కు రిఫైనింగ్, ఆయిల్, టెక్స్టైల్స్ వ్యాపారం లభించగా.. అనిల్‌కు టెలికం, అసెట్ మేనేజ్మెంట్ మొదలైనవి దక్కాయి. 2019 మార్చి ఆఖరు నాటికి రిలయన్స్‌లో అంబానీల వాటా 50.6 శాతంగా ఉంది. ప్రస్తుతం ముకేశ్ అంబానీ నికర సంపద విలువ 94 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీగా కొనసాగుతుండగా, భార్య నీతా అంబానీ (59) కంపెనీ బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు. -
దేశం కోసం.. ప్రజల కోసం ఆ పని: విదేశాంగ మంత్రి
బ్యాంకాక్/ఢిల్లీ: రష్యాతో భారత్ చమురు వాణిజ్యంపై అమెరికా చల్లబడినట్లుగానే అనిపిస్తోంది. ఉక్రెయిన్ యుద్దం తర్వాత అగ్రరాజ్యంతో పాటు చాలా పాశ్చాత్య దేశాలు భారత్ మీద మండిపడ్డాయి. అయినప్పటికీ భారత్ మాత్రం తగ్గేదేలే అన్నచందాన ముందుకు వెళ్తోంది. ఏప్రిల్ నుంచి గరిష్ఠ స్థాయిలో చమురు వాణిజ్యం జరుగుతోంది ఇరు దేశాల మధ్య. ఈ తరుణంలో రష్యాతో ఒప్పందం కొనసాగించాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న మరోసారి ఎదురైంది భారత్‌కు. మంగళవారం బ్యాంకాక్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఈ ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన బదులిస్తూ.. భారతీయులు చమురుకు అధిక ధరలు చెల్లించలేరని, అందుకే రష్యాతో ముడి చమురు ఒప్పందాలను కొనసాగిస్తున్నామని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం మేలిరకమైంది. భారత ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కొనసాగిస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రతీ దేశం అధిక ఇంధన ధరలను తగ్గించడానికి సాధ్యమైనంత మేరకు.. ఉత్తమమైన ఒప్పందాలపై వైపు మొగ్గు చూపిస్తుంది. అలాగే భారత్ కూడా అదే పని చేసింది. ప్రస్తుతం ఆయిల్, గ్యాస్ ధరలు అధికంగా ఉన్నాయి. సంప్రదాయ పంపిణీదారులంతా యూరప్‌కు తరలిస్తున్నారు. అలాంటప్పుడు భారత్ ముందర ఇంతకన్నా మార్గం మరొకటి లేదని ఆయన నొక్కి చెప్పారు. నైతిక బాధ్యతగా పౌరుల గురించి ఆలోచించే తాము రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని తేల్చి చెప్పారాయన. అంతేకాదు ఈ విషయం అమెరికాకు కూడా అర్థమైందని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. రష్యాతో భారత్ చమురు వాణిజ్యంలో మొదటి నుంచి అమెరికా అభ్యంతరాలు చెబుతూ వస్తోంది. అయితే.. ఈ ఏప్రిల్‌లో అమెరికా, భారత్ మధ్య జరిగిన 2+2 స్థాయి సమావేశంలో.. రష్యాతో వాణిజ్యం గురించి అమెరికా నిలదీయడంతో.. భారత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇదీ చదవండి: హైదరాబాద్-బెంగళూరు మధ్య జర్నీ రెండున్నర గంటలే!! -
వినియోగదారులకు శుభవార్త, అదుపులోకి రానున్న సీఎన్జీ, పైప్డ్ గ్యాస్ ధరలు!
న్యూఢిల్లీ: పరిశ్రమలకు సరఫరా చేస్తున్న సహజవాయువును పట్టణ గ్యాస్, పైప్డ్ గ్యాస్ కోసం మళ్లించాలంటూ పెట్రోలియం, సహజ వాయువు శాఖ ఆదేశించింది. సీఎన్జీ, పట్టణ పంపిణీ గ్యాస్ ధరలు 70% మేర పెరిగిపోవడంతో, వాటిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. గృహాల్లో వినియోగించే పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు వినియోగించే సీఎన్జీ డిమాండ్ తీర్చేందుకు వీలుగా, ఖరీదైన ఎల్ఎన్జీ దిగుమతితో లోటును అధిగమించాలని మూడు నెలల క్రితం పెట్రోలియం శాఖ ఆదేశించింది. ఇది ధరలు పెరిగేందుకు దారితీసింది. దీంతో దేశీయంగా ఉత్పత్తయ్యే గ్యాస్‌ను పట్టణాల్లో సరఫరాకే వినియోగించాలన్న పూర్వపు విధానానికి అనుకూలంగా పెట్రోలియం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో గ్యాస్‌ను పంపిణీ చేసే ఇంద్రప్రస్థ గ్యాస్‌కు, ముంబైలో గ్యాస్ పంపిణీలోని మహానగర్ గ్యాస్‌కు రోజువారీగా 17.5 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎంఎంఎస్‌సీఎండీ) నుంచి 20.78 ఎంఎంఎస్‌సీఎండీకి గ్యాస్ సరఫరా పెరగనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో సీఎన్జీ, పీఎన్జీ అవసరాలను 94% మేర తీర్చడానికి వీలవుతుందని పేర్కొన్నాయి. ప్రస్తుతం 84% వరకు దేశీయ సరఫరా కాగా, మిగిలిన మొత్తానికి దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. చదవండి👉భారత్‌కు ఎల్ఎన్జీ సరఫరాలో రష్యా డిఫాల్ట్! -
ఆపరేషన్ ఆర్కిటిక్.. మంచు ఖండం గర్భంలో అంతులేని సంపద
దొడ్డ శ్రీనివాసరెడ్డి ఆర్కిటిక్ ఖండంలో శరవేగంగా కరుగుతున్న మంచు ప్రపంచ దేశాల నైసర్గిక స్వరూపాన్నే మార్చేస్తోంది. 40 సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఇప్పటికే 50 శాతం మంచు కరిగిపోయింది. 2040 సంవత్సరం నాటికి మరో 25 శాతం మంచు మాయమౌతుందని అంచనా. ప్రపంచ పర్యావరణానికి ప్రమాదకరమైన ఈ పరిణామం కొన్ని దేశాలకు కొత్త అవకాశాలను తెచ్చి పెట్టనుంది. ఆర్కిటిక్‌లో దాగున్న అపార సంపదపై ఇప్పుడు అనేక దేశాల చూపు పడింది. ఉత్తర ధ్రువం చుట్టూ ఆవరించి ఉన్న ఆర్కిటిక్ మంచు అడుగున అపార ఖనిజ సంపద ఉందని గతంలోనే వెల్లడైంది. ప్రపంచ చమురు నిల్వల్లో 25 శాతం.. అంటే 9,000 కోట్ల బ్యారెళ్లు అక్కడ ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ గతంలో అంచనావేసింది. ప్రపంచ సహజవాయు నిల్వల్లో 30 శాతానికిపైగా దాగున్నట్టు ఓ అంచనా. ద్రవ రూపంలో మరో 4,400 కోట్ల బ్యారళ్ల సహజ వాయువు అక్కడ ఉందట. యురేనియం, బంగారం, వజ్రాల వంటి అతి విలువైన ఖనిజ సంపదకు ఆర్కిటిక్ ఆలవాలం. దాంతో ఈ మంచు ఖండంపై ఆధిపత్యం కోసం దేశాలు అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. ఆధిపత్యమెవరిదో! నిజానికి ఆర్కిటిక్ ఎవరి సొంతమూ కాదు. కానీ ఆ సముద్రం హద్దుగా ఉన్న ఎనిమిది దేశాలు ఇప్పుడు వ్యూహాత్మకంగా అక్కడి పలు ప్రాంతాలను తమ సరిహద్దులుగా పేర్కొంటున్నాయి. వాటిని అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనది రష్యా. అమెరికా, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్.. ఆర్కిటిక్ సరిహద్దు దేశాలే. ఇవి తమ వివాదాల పరిష్కారానికి ఆర్కిటిక్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. భారత్ సహా 13 దేశాలు ఇందులో పరిశీలక హోదాలో చేరాయి. ఈ దేశాల సరిహద్దుల నిర్ధారణకు ఐరాస 234 ఆర్టికల్‌ను రూపొందించింది. దీని ప్రకారం అవి తమ తీరాల నుంచి 200 మైళ్ల వరకు చేపలు పట్టడం, ఖనిజాన్వేషణ వంటి కార్యకలాపాలు చేసుకోవచ్చు. మిగతా ప్రాంతంపై ఎవరికీ హక్కు లేదు. అది ప్రపంచ మానవాళి ఉమ్మడి సంపద. నిప్పు రాజుకుంటోంది ఐరాస సూత్రీకరణలు ఎలా ఉన్నా ఆర్కిటిక్‌పై ఆధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నాలకు సరిహద్దు దేశాలు పదును పెడుతున్నాయి. ఆర్కిటిక్‌తో అక్షరాలా 24,000 కిలోమీటర్ల మేరకు సరిహద్దు ఉన్న రష్యా ఈ విషయంలో అందరికంటే ముందుంది. రెండేళ్లుగా ఆర్కిటిక్ వైపు బలగాల మోహరింపును ముమ్మరం చేస్తోంది. కొత్తగా ఆర్కిటిక్ బ్రిగేడ్‌ను ఏర్పాటు చేసింది. మూతబడ్డ నౌకా స్థావరాలన్నింటినీ పునరుద్ధరిస్తోంది. వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఈ జలాల్లో ముందస్తు అనుమతి లేకుండా నౌకాయానానికి వీల్లేదని, అనుమతి పొందిన నౌకలు టోల్ ట్యాక్స్ కట్టాలని వాదిస్తోంది. అవసరమైతే 1859 సంవత్సరంలో అమెరికాకు ఇచ్చేసిన అలాస్కాను వెనక్కు తీసుకుంటామని రష్యా పార్లమెంటు ‘డ్యూమా’ చైర్మన్ ఇటీవలే ప్రకటన చేశారు. రాజుకుంటున్న నిప్పుకు ఇది సూచన మాత్రమేనని విశ్లేషణలు వెలువడ్డాయి. దీంతో అమెరికా చకచకా పావులు కదుపుతోంది. అలాస్కా నుంచి నౌకా మార్గానికి అనువుగా ఆర్కిటిక్‌లో కొంత భాగాన్ని తమదిగా చెబుతూ కొత్త మ్యాప్‌లు తయారు చేస్తోంది. కెనడా అయితే తమ దేశం నుంచి ఉత్తర ధ్రువం దాకా ఉన్న ప్రాంతమంతా తమదేనని తెగేసి చెబుతోంది! సరికొత్త మార్గాలు ఆర్కిటిక్ మంచు కరిగి సముద్రంగా మారిపోతున్న కొద్దీ సరికొత్త నౌకా మార్గాలకు ద్వారాలు తెరుచుకుంటాయి. ఆర్కిటిక్ ప్రస్తుతం నౌకాయానానికి కొంతమేరకే అనువుగా ఉంది. దీని మార్గం ద్వారా ఏడాదికి వంద నౌకలు మాత్రమే ప్రయాణిస్తున్నాయి. మున్ముందు ఈ మార్గం వేలాది నౌకల రాకపోకలతో రద్దీగా మారనుంది. ప్రస్తుతం పనామా కాల్వ మార్గంలో ఏడాదికి 14 వేలు, సూయజ్ కాల్వ మార్గంలో 20 వేల నౌకలు ప్రయాణిస్తున్నాయి. ఆర్కిటిక్ సముద్ర మార్గం పూర్తిగా తెరుచుకుంటే యూరప్, ఆసియా ఖండాల మధ్య దూరం 40 శాతం పైగా తగ్గిపోతుంది. సరుకు రవాణా ఖర్చులు ఆ మేరకు తగ్గుతాయి. భారత్ వైఖరేమిటి? ఆర్కిటిక్ వాతావరణం భారత్‌లో రుతుపవనాల తీరుతెన్నులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. దాంతో భారత్ ఇటీవల ఆ ప్రాంతంపై దృష్టి సారించింది. ఆర్కిటిక్ పాలసీ పేరిట అధికారిక నివేదిక విడుదల చేసింది. ఆర్కిటిక్‌లో శాశ్వత స్థావరం ఏర్పాటుతో పాటు ఉపగ్రహాలను అనుసంధానించే గ్రౌండ్ స్టేషన్లు, పరిశోధన కేంద్రాల నిర్మాణానికి యోచిస్తోంది. -
తగ్గనున్న వంట నూనె ధరలు..ఎప్పటి నుంచంటే..?
సామాన్యులకు శుభవార్త. వంట నూనె ధరలు మరింత దిగిరానున్నట్లు తెలుస్తోంది. ఇండోనేషియా ఆగస్ట్ 31 వరకు అన్ని పామాయిల్ ఉత్పత్తులకు ఎగుమతి సుంకాన్ని రద్దు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో భారత్‌లో వంటనూనెల ధరలు తగ్గనున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఏ సంక్షోభం తలెత్తినా ఆ ప్రభావం ఇతర దేశాలపై ఉంటుంది. ఉదాహరణకు..ఉక్రెయిన్ నుంచి భారత్ 70శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. అదే సమయంలో ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా భారత్‌లో ఆయిల్ ధరలు ఆకాశాన్నంటాయి. యుద్ధానికి ముందు రూ.135 నుంచి 150 మధ్యలో ఉన్న వంట నూనె రూ.200కి చేరింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి నూనె రావడం లేదని వ్యాపారస్తులు వాటి ధరల్ని భారీగా పెంచారు. ధరల్ని తగ్గించాలి ఈ నేపథ్యంలో కేంద్రం ఆయిల్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెరిగిపోతున్న నిత్యవసర ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కల్పించేలా వెంటనే ఆయిల్ ధరల్ని రూ.15 తగ్గించాలని సూచించింది. ఈ తరుణంలో పామాయిల్ ఉత్పత్తులపై ఎగుమతి సుంకాన్ని ఇండోనేషియా రద్దు చేయడంతో..దేశీయ ఆయిల్ కంపెనీలు నూనెల ధరల్ని తగ్గించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వంట నూనె ధరలు ఎప్పుడు తగ్గుతాయంటే! 'విదేశాల నుంచి భారత్‌కు రవాణా అయ్యే సరకు జులై 15 ముందు నుంచే ప్రారంభమవుతుంది. జులై 25కల్లా భారత్‌కు చేరుతుంది. కాబట్టి.. అదే నెలలో (జులై) వంట నూనెల ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఆ తర్వాతి నెల నుంచి ధరలు తగ్గుతాయని' అదానీ విల్మార్ ఎండీ, సీఈవో అంగ్షు మాలిక్ అన్నారు. ఆయిల్ ధరల్ని తగ్గించాయి భారత్‌లో కొన్ని ఆయిల్ కంపెనీలు వాటి ధరల్ని తగ్గించాల్సి ఉంది. అదే సమయంలో అదానీ విల్మార్, మదర్ డెయిరీ, ఇమామి ఆగ్రోటెక్ పాటు ఇతర సంస్థలు గత నెలలో ఆయిల్ ఉత్పత్తులపై రూ .10 -15 ధరని తగ్గించాయి. -
గుడ్‌న్యూస్: భారత్‌లో తగ్గనున్న వంటనూనె ధరలు..కారణం ఇదే!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా రేట్లు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దిగుమతి చేసుకున్న వంటనూనెల ధరలను వారం రోజుల్లోగా లీటరుకు రూ. 10 వరకూ తగ్గించాలని తయారీ సంస్థలను కేంద్రం ఆదేశించింది. అలాగే, ఒక బ్రాండ్ ఆయిల్‌పై దేశవ్యాప్తంగా ఒకే ఎంఆర్పీ (గరిష్ట చిల్లర ధర) ఉండాలని సూచించింది. వంటనూనెల తయారీ సంస్థలు, అసోసియేషన్లతో బుధవారం భేటీ అయిన సందర్భంగా కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాంశు పాండే ఈ విషయాలు తెలిపారు. గడిచిన వారం రోజుల్లోనే అంతర్జాతీయంగా రేట్లు 10 శాతం తగ్గడంతో ఆ ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించాలని, ఎంఆర్పీని తగ్గించాలని సూచించినట్లు ఆయన చెప్పారు. పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటి దిగుమతి చేసుకునే అన్ని రకాల వంటనూనెల ధరలను వారం రోజుల్లోగా తగ్గిస్తామని ప్రధాన తయారీ సంస్థలన్నీ హామీ ఇచ్చినట్లు వివరించారు. ఆ తర్వాత మిగతా నూనెల ధరలనూ తగ్గిస్తామని తెలిపినట్లు పాండే చెప్పారు. జూలై 6 నాటి గణాంకాల ప్రకారం పామాయిల్ సగటు రిటైల్ ధర (లీటరుకు) రూ. 144.16, సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ. 185.77, సోయామీన్ ఆయిల్ రూ. 185.77, ఆవ నూనె రూ. 177.37, పల్లీ నూనె రూ. 187.93గాను ఉంది. మరోవైపు, తూకం విషయంలోనూ వస్తున్న ఫిర్యాదులపై కూడా తయారీ సంస్థలతో చర్చించినట్లు వివరించారు. 15 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్యాకింగ్ చేసినప్పుడు 910 గ్రాముల పరిమాణం ఉన్నట్లు ప్యాకెట్లపై కంపెనీలు ముద్రిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఆ ఉష్ణోగ్రతల్లో ఆయిల్ వ్యాకోచించడం వల్ల వాస్తవ బరువు 900 గ్రాములే ఉంటుందన్నారు. ఇలాంటివి జరగకుండా 30 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్యాకింగ్ చేయాల్సి ఉంటుందని పాండే వివరించారు. -
'ఏం కొనేటట్టు లేదు.. తినేటట్టు లేదు' తగ్గిన అమ్మకాలతో కంపెనీలు లబోదిబో!
న్యూఢిల్లీ: కొబ్బరినూనె, బిస్కెట్లు, సబ్బులు, కాస్మోటిక్స్ వంటి ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) పరిశ్రమలో ఏప్రిల్, మే, జూన్ త్రైమాసికంలో డిమాండ్ మందగమనంలో సాగింది. ప్రధాన కంపెనీలు డాబర్, మారికో, గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (జీసీపీఎల్) త్రైమాసిక నివేదికలు స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశాయి. ద్రవ్యోల్బణం తీవ్రత ఆదాయాలపై ప్రభావం చూపుతున్నందున, వినియోగదారులు ప్రధాన వస్తువులపై ఖర్చు చేయడానికి వెనుకాడారని సంస్థలు వెల్లడించాయి. దేశీయ ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయిల కారణంగా భారీగా దెబ్బతిందని పేర్కొన్నాయి. అమ్మకాలపై ప్రతికూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించాయి. వంట నూనెలు, తేనె, ఇతర వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు సంబంధించి సంస్థల స్థూల మార్జిన్లు ప్రభావితం అయ్యే స్థాయిలో వినియోగం పడిపోయిందని ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు తెలిపాయి. అంతేకాకుండా, పట్టణ మార్కెట్లతో పోలిస్తే గ్రామీణ మార్కెట్ల వృద్ధి జూన్ త్రైమాసికంలో నెమ్మదించిందని వెల్లడించాయి. గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, మారికోలు తమ భారతీయ వ్యాపార పరిమాణం క్షీణ దిశలో ఉందని కూడా ఆందోళన చెందుతుండడం గమనార్హం. పెరుగుతున్న ద్రవ్యోల్బణం డిమాండ్‌ను తగ్గిస్తుండడం దీనికి కారణం. ఇప్పటివరకూ అందిన సమాచారాన్ని బట్టి ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు డిమాండ్ ధోరణులు, సంస్థల పనితీరు గురించి తొలి అంచనాలను తమ అప్డేటెడ్ నివేదికల్లో పేర్కొన్నాయి. జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి వాటి సంబంధిత బోర్డులు సంస్థల ఆర్థిక ఫలితాలను ఆమోదించిన తర్వాత వివరణాత్మక ఆర్థిక ఫలితాలు వెల్లడవుతాయి. మూడు సంస్థలు ఈ మేరకు తమ జూన్ త్రైమాసిక అప్డేటెడ్ తొలి నివేదికలను వెల్లడించాయి. అంతర్జాతీయ వ్యాపారం ఓకే... ప్రపంచ అనిశ్చితి, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ జూన్ త్రైమాసికంలో అంతర్జాతీయ వ్యాపారం నుండి వృద్ధిని నమోదుచేసుకున్నట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు తెలిపాయి. వార్షిక ప్రాతిపదిక చూస్తే, కన్సాలిటేడెడ్ ఆదాయాలు పెరిగినట్లు మారికో పేర్కొంది. డాబర్ ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, బలమైన వృద్ధిని నమోదుచేసుకుంటామన్న ధీమాను వ్యక్తం చేసింది. దాదాపు అన్ని విభాగాల్లో తమ మార్కెట్ వాటా వృద్ధిని నమోదుచేసుకుంటోందని తెలిపింది. కాగా గోద్రెజ్ మాత్రం తమన కంపెనీకి భారత్ తరువాత అతిపెద్ద మార్కెట్ అయిన ఇండోనేయాలో వినియోగం, మార్జిన్లు దెబ్బతింటున్నట్లు తెలిపింది. ఆఫ్రికా, అమెరికా, పశ్చిమాసియాల్లో మాత్రం వృద్ధి రెండంకెల్లో నమోదవుతుందన్న భరోసాను వ్యక్తం చేసింది. వినియోగమంటే భయం ప్రస్తుత పోకడల ప్రకారం చూస్తుంటే, వినియోగదారులు కొన్ని అనవసరమైన వస్తువుల కొనుగోళ్లను మానేశారు. అవసరమైన వస్తువుల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తక్కువ ధర బ్రాండ్‌వైపు మళ్లడం, చిన్న ప్యాక్‌లకు మారడం వంటి ధోరణులను అవలంభిస్తున్నారు. కొన్ని ఉత్పత్తుల అమ్మకాలు క్షీణతలోకి కూడా జారిపోయాయి. సఫోలా ఆయిల్స్‌ను ఇక్కడ ప్రస్తావించుకోవాలి. సఫోలా నూనెలను మినహాయించి, భారతదేశ వ్యాపారం స్వల్ప పరిమాణంలో వృద్ధిని నమోదు చేసింది. పారాచూట్ కొబ్బరి నూనె స్వల్ప పరిమాణంలో క్షీణతను నమోదు చేసింది. – మారికో ఆదాయాలు పరిమితం 2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 35.4 శాతం ఆదాయ వృద్ధి నమోదయ్యింది. అయితే తాజాగా ముగిసిన జూన్ త్రైమాసికంలో ఈ రేటు ఒకంకెకు పరమితం అవుతుంని అంచనావేస్తున్నాం. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాలు అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి. అయితే తాజా పరిస్థితుల ప్రతికూల ప్రభావాలను భారత్ క్రమంగా అధిగమిస్తుందని విశ్వసిస్తున్నాం. తగిన వర్షపాతం, ద్రవ్యోల్బణం తగ్గుదల ఇందుకు దోహదపడతాయని అంచనా. – డాబర్ -
రిలయన్స్‌కు భారీ దెబ్బ: బ్యారల్‌పై 12 డాలర్ల మార్జిన్ ఫట్!
న్యూఢిల్లీ: దేశీయ ముడి చమురు ఉత్పత్తి, ఇంధన ఎగుమతులపై ప్రభుత్వం విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు (ఆర్ఐఎల్) రిఫైనింగ్ మార్జిన్లలో బ్యారెల్‌కు 12 డాలర్ల వరకూ కోత పెట్టనుంది (ప్రస్తుత మార్జిన్ 25 డాలర్లు). ఇక ఓఎన్జీసీ ఆదాయంపై కూడా ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. కొత్త పన్నుల వల్ల ప్రభుత్వానికి రూ. 1.3 లక్షల కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని బ్రోకరేజ్ సంస్థలు పేర్కొన్నారు. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురు సంస్థలకు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలతో భారీ లాభాలు వచ్చి పడుతున్నాయి. దీంతో దేశీయంగా ఉత్పత్తి చేసే టన్ను ముడి చమురుపై రూ.23,250 పన్ను లేదా బ్యారల్‌కు 40 డాలర్లు (విండ్‌ఫాల్ ట్యాక్స్) విధించింది. ఇక్కడి నుంచి ఎగుమతి చేసే లీటర్ పెట్రోల్‌పై రూ.6, విమాన ఇంధనం ఏటీఎఫ్‌పై రూ.6, లీటర్ డీజిల్ ఎగుమతిపై రూ.13 పన్ను విధిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ‘‘ఇటీవలి కాలంలో క్రూడ్ ధరలు గణనీయంగా పెరిగాయి. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు ఇది అనుకూలంగా మారింది. అంతర్జాతీయ ధరలకే దేశీ రిఫైనరీలకు అవి ముడి చమురును విక్రయిస్తున్నాయి. దీనివల్ల స్థానికంగా ముడి చమురు ఉత్పత్తి చేసే సంస్థలు భారీ లాభాలనార్జిస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని తాజా నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆర్థిక శాఖ తెలిపింది. జూలై 1 నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. దీనితోపాటు పసిడిపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 5 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 10.75 శాతం నుంచి 15 శాతానికి చేరింది. ఆయా అంశాలపై బ్రోకరేజ్ సంస్థల నివేదికలు పరిశీలిస్తే... రవాణా ఇంధనాలపై రూ.68,000 కోట్లు గత సంవత్సరంలో డీజిల్, గ్యాసోలిన్ ఎగుమతి పరిమాణం ఆధారంగా 2022–23 అంచనాలను మేము లెక్కగట్టాం. మేము మూడు రవాణా ఇంధనాలపై (పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్) రూ. 68,000 కోట్ల అదనపు ఆదాయాలను అంచనా వేస్తున్నాము. అదేవిధంగా, ముడి చమురుపై విండ్‌ఫాల్ పన్నులు అదనపు ఆదాయాలలో రూ. 70,000 కోట్లను పెంచే వీలుంది. దీనివల్ల రిలయన్స్ మార్జిన్ల విషయంలో బ్యారెల్‌కు 12 డాలర్ల మేర (వార్షిక ప్రాతిపదికన రూ. 47,000 కోట్లు) ప్రభావం చూపగలవని అంచనా. – నోమురా లోటు భర్తీ లక్ష్యం... : 2022 మేలో ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల కేంద్రం ఆదాయాలు ఒక లక్ష కోట్లు తగ్గాయని అంచనా. అదనపు ఎక్సైజ్ సుంకం (విండ్‌ఫాల్ ట్యాక్స్) విధింపు ప్రకటన ఇప్పుడు వెలువడింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. 2022 మేలో తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఆదాయ అంతరాన్ని పూరించడమే లక్ష్యంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతోంది. తాజా నిర్ణయం వల్ల రూ. 1.2 లక్షల కోట్ల ప్రభుత్వం ఆదాయాన్ని ఆర్జిస్తుందని భావిస్తున్నాం. దీనితోపాటు దేశీయ మార్కెట్ నుండి ఉత్పత్తుల ఎగుమతిని కూడా నిరుత్సాహపరచడానికి కూడా తాజా నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నాము. క్రూడ్ ఉత్పత్తిపై విండ్ ఫాల్ ట్యాక్స్ వల్ల రూ.65,600 కోట్లు, ఎగుమతి ఉత్పత్తులపై పన్నులు ఏడాది పాటు కొనసాగితే మరో రూ.52,700 కోట్ల ఆదాయం సమకూరుతుందని మా అంచనా. కొత్త పన్ను వల్ల ఓఎన్జీసీ ఆదాయాలు ఒక్కో షేరుకు రూ.30 తగ్గే అవకాశం ఉంది. ఆర్‌ఐఎల్‌పై దీని ప్రభావం రూ.36గా ఉంటుందని అంచనా. అయితే ఆర్ఐఎల్ దేశీయ మార్కెటింగ్ మార్జిన్లో నష్టం... ఎగుమతి పన్ను కంటే ఇంకా ఎక్కువగా ఉందని మేము విశ్వసిస్తున్నాము. అందువల్ల ఆర్ఐఎల్ గణనీయమైన మొత్తాలలో ఎగుమతి చేయడాన్ని కొనసాగించవచ్చని మేము భావిస్తున్నాము. – హెచ్ఎస్బీసీ గ్లోబల్ రీసెర్చ్ భారీ పన్ను రాబడులు: ఇదే నిర్ణయం ఇకముందూ కొనసాగితే, పన్నుల వల్ల వార్షిక ప్రాతిపదికన కేంద్రానికి రూ. 1.3 లక్షల కోట్ల అదనపు పన్ను రాబడులు వస్తాయని భావిస్తున్నాం. 2023 ఆర్థిక సంవత్సరానికి రూ. 1 లక్ష కోట్ల ఆదాయం ఒనగూడుతుందని అంచనా. - కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ 1.38 లక్షల కోట్ల అదనపు పన్ను : అదనపు పన్నుల ద్వారా ప్రభుత్వం ఏటా రూ. 1.38 లక్షల కోట్లను సేకరించవచ్చన్నది మా అంచనా. – యూబీఎస్ అంచనా -
పెట్రోలు సంక్షోభం, చేతులెత్తేసిన ప్రధాని
కొలంబో: దేశ ఆర్థికవ్యవస్థ చాలా దారుణంగా తయారైందని శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం, ఇంధనం, విద్యుత్ కొరతకు మించిన గడ్డు పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని స్వయంగా ప్రధాని పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. ఆహారం, ఇంధనం, విద్యుత్ కొరతతో నెలల తరబడి అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంక ఆర్థికవ్యవస్థ కుప్పకూలిందని ప్రధాని బుధవారం పార్లమెంటులో చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ చాలా తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది, పూర్తిగా కుప్పకూలిపోయిందని ప్రధాని విక్రమ సింఘే ప్రకటించారు. పెట్రోలియం కార్పొరేషన్ భారీ అప్పుల కారణంగా దిగుమతి చేసుకున్న ఇంధనాన్ని కూడా కొనుగోలు చేయలేకపోతోందన్నారు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే పనిలో ఉన్న ఆర్థికమంత్రి, ప్రధాని పేర్కొన్నారు. పరిస్థితిని చక్కదిద్దే అవకాశాన్ని ప్రభుత్వం కోల్పోయిందని, ఇంకా అట్టడుగు స్థాయికి పడిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం, సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ 700 మిలియన్ల డాలర్ల అప్పులో ఉందని, ఫలితంగా, ప్రపంచంలోని ఏ దేశం లేదా సంస్థ ఇంధనాన్ని అందించడానికి సిద్ధంగా లేదన్నారు. నగదు కోసం ఇంధనాన్ని అందించడానికి కూడా వారు సమ్మతించడం లేదన్నారు. రెస్క్యూ ప్యాకేజీపై అంతర్జాతీయ ద్రవ్య నిధితో చర్చల ఫలితం వచ్చే వరకు ఈ సంవత్సరం తిరిగి చెల్లించాల్సిన 7 బిలియన్ల డాలర్లు విదేశీ రుణాన్ని తిరిగి చెల్లించడాన్ని నిలిపి వేస్తున్నట్లు శ్రీలంక ఇప్పటికే ప్రకటించింది. 2026 నాటికి సంవత్సరానికి సగటున 5 డాలర్లు బిలియన్లు చెల్లించాల్సి ఉంది. దీనిపై చర్చించేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి అధికారులు శ్రీలంకలో ఉన్నారు. దీనిపై జూలై చివరి నాటికి సిబ్బంది స్థాయి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విక్రమసింఘే తెలిపారు. -
'మమ్మల్ని ఆదుకోండి సార్',కేంద్రం తలుపు తట్టిన చమురు కంపెనీలు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పటికీ, పెట్రోల్ ఉత్పత్తుల ధరలు వరుసగా రెండు నెలల పాటు ఎటువంటి మార్పు ల్లేకుండా కొనసాగించడం వల్ల నష్టాలను ఎదుర్కొంటున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు (బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ) చెబుతున్నాయని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఈ విషయంలో తమకు ఉపశమనం కావాలంటూ అవి ప్రభుత్వం తలుపు తట్టినట్టు చెప్పారు. లీటర్ పెట్రోల్‌పై రూ.17.10, డీజిల్‌పై రూ.20.40 చొప్పున నష్టాలను ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. ప్రైవేటు చమురు రిఫైనరీ కంపెనీలు రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేసి, రిఫైన్డ్ చేసిన తర్వాత అమెరికాకు ఎగుమతి చేయడం ద్వారా భారీ లాభాలను ఆర్జిస్తున్నాయన్న వార్తలపై స్పందించారు. అంతర్జాతీయంగా ధరలు పెరగడం వల్ల చమురు, గ్యాస్ కంపెనీలు ఆర్జించే అసాధారణ లాభాలపై విండ్‌ఫాల్ ట్యాక్స్ విధించడం అన్నది ఆర్థిక శాఖ పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. మన కార్పొరేట్ సంస్థలు అన్నీ బాధ్యతగానే పనిచేస్తాయన్నారు. గత నెలలో పెట్రోల్ లీటర్‌పై రూ.8, డీజిల్ లీటర్‌పై రూ.6 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ పన్నును తగ్గించడం తెలిసిందే. చమురు కంపెనీలు దీన్ని తమ నష్టాల భర్తీకి సర్దుబాటు చేసుకోకుండా.. వినియోగదారులకు బదిలీ చేయడం గమనార్హం. ప్రైవేటులో రిలయన్స్ బీపీ, నయాయా ఎనర్జీ (షెల్)కి మాత్రమే రిఫైనరీలు, దేశవ్యాప్తంగా పెట్రోల్ విక్రయ కేంద్రాలు ఉండడం గమనార్హం. ధరలు పెరగడంతో ఇవి స్థానికంగా విక్రయాలు తగ్గించుకుని.. ఎగుమతి చేయడం ద్వారా భారీ లాభాలను ఆర్జిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. -
ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. బిందెలు, డబ్బాలతో ఎగబడ్డ జనం
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ట్యాంకర్ నుంచి లీకైన వంట నూనె కోసం ఎగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. వివరాల ప్రకారం.. ముంబై-అహ్మాదాబాద్ జాతీయ రహదారిపై పాల్ఘర్ జిల్లాలోని తవా గ్రామ సమీపంలో 12వేల ఆయిల్ తరలిస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. గుజరాత్‌లోని సూరత్ నుంచి ముంబైకి నూనెను ట్యాంకర్లలో తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ట్యాంకర్ నుంచి లీకైన నూనె కోసం ఎగబడ్డారు. బిందెలు, క్యాన్లలో వంటనూనెను నింపుకునేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. పోలీసుల అధికారులు 3 గంటలపాటు శ్రమించి పరిస్థితిని చక్కదిద్దారు. A tanker carrying 12,000 litres of edible oil for processing from #Surat in #Gujarat to #Mumbai overturned on the busy Mumbai-#Ahmedabad highway at #Palghar in #Maharashtra. A number of locals rushed to the spot and looted the #oil overflowing from the tanker.#ACCIDENT #News pic.twitter.com/GktU2tztkd — Chaudhary Parvez (@ChaudharyParvez) May 22, 2022 -
మొండిఘటం: పుతిన్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..ఆ దేశాలకు రివర్స్ ఝులక్!
రష్యా అధ్యక్షుడు పుతిన్ యురప్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఓ వైపు యుద్ధంతో ఉక్రెయిన్‌తో పాటు శత్రు దేశాల్ని వణికిస్తూనే.. నెక్ట్స్ టార్గెట్‌గా ఆయా దేశాల అవసరాల్ని ఆసరాగా చేసుకొని దెబ్బకొట్టేలా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1నుంచి గ్యాస్ కొనాలంటే ఖచ్చితంగా రష్యా రూబల్స్లోనే చెల్లించాలని హుకుం జారీ చేశారు. లేని పక్షంలో శత్రు దేశాలుగా భావిస్తామని హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగుతుంది. వారాల తరబడి యుద్ధం చేస్తున్న రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యూహాలు రచయిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను టార్గెట్‌గా ఐరోపాలో పర్యటించారు. ఆ పర్యటన ముగిసింది. అదే సమయంలో అమెరికా దాని మిత్ర దేశాల ఆంక్షల కారణంగా రష్యా ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. యూరో- యూఎస్ డాలర్‌తో పోలిస్తే రష్యా రూబెల్స్ విలువ ఘోరంగా పతనమైంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యాపై ఆర్ధిక ఆంక్షలు విధిస్తున్న దేశాలకు భారీ ఝలక్ రష్యా అధ్యక్షుడు పుతిన్. తమ నుంచి గ్యాస్ కొనాలంటే ఖచ్చితంగా రష్యా రూబల్స్లోనే చెల్లింపులు చేయాలని షరతు విధించారని రష్యన్ మీడియా సంస్థ 'రియా నోవోష్ఠి' కథనాన్ని ప్రచురించింది. వీళ్లంతా మా శత్రువులే ఇప్పటికే తమ దేశంపై ఆంక్షలు విధించిన దేశాల్ని పుతిన్ తమ శత్రు దేశాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రష్యా 48 దేశాలతో ఓ జాబితాను విడుదల చేశారు. అమెరికా నార్వే, జపాన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌తో పాటు అన్నీ యూరప్ దేశాలను ఈలిస్ట్‌లో చేర్చారు పుతిన్. ఈ దేశాలేవీ తమకు మిత్రపక్షాలు కావని స్పష్టం చేశారు. ఇప్పుడీ దేశాలు రష్యా రూబెల్స్లోనే రష్యా నుంచి గ్యాస్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
ఉక్రెయిన్‌లో హింస ఆపండి
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో హింసాకాండకు సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్కు సూచించారు. ఉక్రెయిన్‌లో సంక్షోభానికి తెరపడాలని కోరుకుంటున్నామని, శాంతి యత్నాలకు తమ వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. భారత పర్యటనకు వచ్చిన లావ్రోవ్ శుక్రవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌లోని తాజా పరిణామాలను మోదీ దృష్టికి తీసుకొచ్చారు. ఉక్రెయిన్‌తో రష్యా శాంతి చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత స్వతంత్ర వైఖరి ప్రశంసనీయం ఉక్రెయిన్ సంక్షోభంపై భారత ప్రభుత్వ ‘స్వతంత్ర’ వైఖరిని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రశంసించారు. ఆయన శుక్రవారం భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌తో సమావేశమయ్యారు. భారత్ చాలా ముఖ్యమైన దేశమని, అమెరికా ఒత్తిడికి లొంగబోదని తెలిపారు. రక్షణ రంగంలో భారత్‌తో పరస్పర సహకారానికి రష్యా కట్టుబ డి ఉందని లావ్రోవ్ చెప్పారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయాలని భారత్ కోరుకుంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దోపిడీ వ్యవస్థ మనకొద్దు పశ్చిమ దేశాలే రష్యాను యుద్ధంలోకి నెట్టాయని సెర్గీ లావ్రోవ్ ఆరోపించారు. భారత విదేశాంగ విధానం, రష్యా విదేశాంగ విధానం ఒకే విధంగా ఉన్నాయన్నారు. జాతీయ కరెన్సీలతో భారత్, ఇతర భాగస్వామ్య దేశాలతో వాణిజ్య వ్యాపార లావాదేవీలు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. భారత్–రష్యా మధ్య రూపాయి, రూబుల్తో లావాదేవీలు జరగాలన్నారు. డాలర్ ఆధారిత చెల్లింపులకు స్వస్తి పలకాలన్నారు. రాత్రికి రాత్రే మన సొమ్మును దోచేసే దొంగల వ్యవస్థ మనకు అక్కర్లేదన్నారు. సొంత కరెన్సీల్లో చెల్లింపుల వ్యవస్థను ఇప్పటికే అభివృద్ధి చేసుకున్నామని వివరించారు. గతంలో చాలాసార్లు సంక్లిష్ట సమయాల్లోనూ ఇరు దేశాల నడుమ సంబంధాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. సంబంధాలు స్థిరంగా ఉండాలి: జైశంకర్ భేదాభిప్రాయాలను, వివాదాలను చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే భారత్ విధానమని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. ఉక్రెయిన్–రష్యా మధ్య సంక్షోభం త్వరగా పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. తమ ఎజెండాను విస్తృతం చేయడం ద్వారా సహకారాన్ని విస్తరింపజేస్తామని అన్నారు. సంక్లిష్టమైన అంతర్జాతీయ పరిణామాల మధ్య లావ్రోవ్తో తన భేటీ జరిగిందని తెలిపారు. ఆర్థిక, సాంకేతిక రంగాలతోపాటు భారత్–రష్యా ప్రజల మధ్య సంబంధాలు స్థిరంగా ఉండడం చాలా అవసరమని ప్రధాని అన్నారు. జైశంకర్, లావ్రోవ్ ద్వైపాక్షిక అంశాలతోపాటు వాణిజ్యం, పెట్టుబడులపై చర్చించుకున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అఫ్గానిస్తాన్, ఇరాన్, ఇండో–పసిఫిక్, అసియాన్‌పైనా లావ్రోవ్తో చర్చించినట్లు జైశంకర్ ట్వీట్ చేశారు. రష్యా నుంచి చౌక ధరతో ముడిచమురు కొనుగోలు చేయాలని భారత్ ఇప్పటికే నిర్ణయించుకుంది. ఈ విషయంలో అమెరికా హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా ముందడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ భారత ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రితో సమావేశమై చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలుపై తీవ్ర పరిణా మాలు ఉంటా యని అమెరికా హెచ్చరిస్తున్న సంగతి తెలి సిందే. చైనా గనుక యుద్ధం ప్రారంభిస్తే భారత్‌ను రష్యా రక్షించబోదని అమెరికా చెబుతోంది. ఇది చదవండి: పుతిన్‌కు పెరిగిన పాపులారిటీ.. రష్యాలోనూ ‘హీరో’గా ఫుల్ సపోర్ట్! -
భారత్‌కు ముడి చమురు ఎగుమతి చేసేందుకు ఇరాన్ సిద్ధం!..నేరుగానే డీల్
Rupee-rial trade mechanism: ఇరాన్ భారతదేశానికి రెండవ అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉండేది. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదొలగడంతో దాని చమురు ఎగుమతులపై మళ్లీ ఆంక్షలు విధించడంతో న్యూ ఢిల్లీ టెహ్రాన్ నుంచి దిగుమతులను నిలిపివేయవలసి వచ్చింది. ఒపెక్ సభ్యునికి వ్యతిరేకంగా ఆంక్షల ఎత్తివేతపై ప్రపంచ దేశలు, టెహ్రాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నందున భారత్‌కి ముడి చమురు అవసరాలను తీర్చడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని భారత్‌లోని ఇరాన్ రాయబారి డాక్టర్ అలీ చెగేని పేర్కొన్నారు. అంతేకాదు రూపాయి-రియాల్ ట్రేడ్ మెకానిజంతో రెండు దేశాల కంపెనీలకు ఒకరితో ఒకరు నేరుగా డీల్ నిర్వహించు కోగలుగుతారని అలీ చెగేని అన్నారు. దీని వల్ల మధ్యవర్తిత్వ వ్యయాలను తగ్గుతాయి అని కూడా చెప్పారు. ఇరాన్‌కి ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు, వినియోగదారు అయిన భారత్ ముడి చమురు అవసరాలలో 80% దిగుమతులతో కవర్ చేస్తుంది. భారతీయ రిఫైనర్లు ఇరాన్ చమురును స్థానిక బ్యాంకుకు రూపాయిలలో చెల్లిస్తున్న వ్యాపారాన్ని పరిష్కరించేందుకు భారత్, ఇరాన్ ఒక బార్టర్ లాంటి యంత్రాంగాన్ని రూపొందించాయి ఆ నిధులను టెహ్రాన్ భారతదేశం నుంచి దిగుమతులకు చెల్లించడానికి ఉపయోగించింది. ఆంక్షల కారణంగా భారత్-ఇరాన్ వాణిజ్యం మార్చి 2019 ఆర్థిక సంవత్సరంలోని తొలి తొమ్మది నెలలు నుంచి దాదాపు రూ. 1700 కోట్లు వాణిజ్యం ఈ ఏడాది మొదటి 10 నెలల ఏప్రిల్ నుంచి జనవరిలో 200 కోట్ల కంటే తక్కువగా పడిపోయింది. పైగా రెండు దేశాలు రూపాయి-రియాల్ వాణిజ్య విధానాలను ప్రారంభిస్తే, ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని చెగేని అన్నారు. (చదవండి: ఈ యుద్ధం జెలెన్ స్కీని హీరోని చేసింది...అందరి నోట అతని పేరే!) -
ఫ్లీజ్ మోదీజీ!! మమ్మల్ని ఆదుకోండి..భారత్‌కు రష్యా బంపరాఫర్!
ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఆ దేశ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. యుద్ధంతో ప్రపంచ దేశాల నుంచి ఎదరవుతున్న ఇబ్బందుల నుంచి ఆర్ధికంగా తమను ఆదుకోవాలంటూ రష్యా భారత్‌ను అర్జిస్తుంది. ఇందులో భాగంగా భారత్.. తమ దేశ దేశంలోని ఆయిల్, గ్యాస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికాతో పాటు ఇతర నాటో దేశాలు గుర్రుగా ఉన్నాయి. అందుకే రష్యా నుంచి దిగుమతులపై పూర్తి స్థాయిలో నిషేధం విధించాయి. దీంతో గత రెండు వారాలుగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. శనివారం ఈ ఏడాది చివరి నాటికి రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేస్తామని జర్మనీ కీలక ప్రకటన చేసింది. ప్రతి రోజు, ప్రతి గంటకు మేము రష్యన్ దిగుమతులకు వీడ్కోలు పలుకుతున్నాంటూ జర్మన్ ఆర్థిక శాఖ మంత్రి రాబర్ట్ హబెక్ ప్రముఖ మీడియా 'ఫ్రాంక్‌ఫర్టర్ ఆల్జెమీన్ జైటుంగ్' కు తెలిపారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం..జర్మనీ ప్రస్తుతం చమురులో 3వ వంతు, బొగ్గులో 45శాతం రష్యా నుండి దిగుమతి చేసుకుంటోంది. అయినా సరే ఈ నెల ముగిసే సమయానికి బొగ్గు కొనుగోళ్లను, సంవత్సరం చివరి నాటికి చమురు కొనుగోళ్ల నిలిపివేస్తామని మీడియా కు వెల్లడించారు. అదే సమయంలో క్రూడాయిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో పాటు రష్యా వద్ద చమురు ధరలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. రష్యా అమెరికాకు ప్రతిరోజు 7లక్షల బ్యారల్ల చమురును ఎగుమతి చేసేది. అంతేకాకుండా, ప్రపంచ చమురు అవసరాల్లో 12శాతం, సహజవాయివుల్లో 16శాతం అవసరాల్ని రష్యా తీరుస్తుంది. ఇప్పుడు ఆ చమురును కొనేవారు లేకపోవడంతో ఆ చమరును భారత్‌కు అతి తక్కువ ధరకే అమ్ముతామంటూ రష్యా..,భారత్‌కు ఆఫర్ చేసింది. ఇప్పటికే రష్యా నుంచి భారత్‌కు చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 1బిలియన్లకు చేరుకున్నాయి. ఇతర దేశాల నిషేదంతో రష్యాలో..భారత్ ఆయిల్, గ్యాస్ పెట్టుబడులు పెట్టాలని ప్రధాని మోదీతో మంతనాలు జరుపుతుంది. భారత్ అందుకు అంగీకరిస్తే తాము భారత్‌లో కంపెనీల ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామంటూ రష్యా ఉప ప్రధాని నోవాక్ భారత్‌ను సంప్రదించారంటూ భారత పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ఒకవేళ రష్యా ఇస్తున్న ఈ ఆఫర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. కానీ రష్యాతో స్నేహం కారణంగా అమెరికాతో పాటు నాటో దేశాలకు దూరం కావాల్సి ఉంది. ఇదే అంశంపై ప్రధాని మోదీ వేచి చూసే ధోరణిలో ఉన్నారని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: 'చిత్ర' విచిత్రమైన కథ..ఆ 'అజ్ఞాత' యోగి కేసులో మరో ఊహించని మలుపు!! -
భారీగా పామాయిల్ సాగు
న్యూఢిల్లీ: దేశీ రైతులు పండించిన నూనెగింజలను కొనుగోలు చేస్తూ వారికి మద్దతుగా నిలవాలని ప్రైవేటు కంపెనీలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అదే సమయంలో వంట నూనెల దిగుమతులు తగ్గించుకోవాలని సూచించారు. ఇది ఇరు వర్గాలకు ప్రయోజనకరమన్నారు. భారత్ వచ్చే 3–4 ఏళ్లలో వంట నూనెల ఉత్పత్తిని 50 శాతం పెంచుకునే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్’ కార్యక్రమం కింద పెద్ద ఎత్తున పామాయిల్ సాగుకు పుష్కలంగా అవకాశాలున్నట్టు పేర్కొన్నారు. ‘వ్యవసాయ రంగంపై బడ్జెట్ 2022 సానుకూల ప్రభావం’ అనే అంశంపై ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ‘‘వీటికి (కాయధాన్యాలు, నూనె గింజలకు) దేశంలో భారీ డిమాండ్ ఉంది కార్పొరేట్ ప్రపంచం ముందుకు రావాలి. మీకు భరోసానిచ్చే మార్కెట్ ఉంది. దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు? ఎంత పరిమాణంలో కాయధాన్యాలు, నూనె గింజలను కొనుగోలు చేస్తారో రైతులకు ముందే చెప్పండి’’అని మోదీ అన్నారు. పంట నష్టానికి రక్షణగా వ్యవసాయ బీమా యంత్రాంగం ఉన్నట్టు చెప్పారు. మనమంతా కలసి పనిచేయడం ద్వారా మన దేశ అవసరాలకు కావాల్సిన ఆహార ఉత్పత్తులను స్థానికంగానే పండించేలా చూడాల్సి ఉందన్నారు. దేశ వంట నూనెల అవసరాల్లో 60–65 శాతాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితిని ప్రధాని గుర్తు చేశారు. వంట నూనెల దిగుమతి బిల్లు 2020–21 సీజన్లో రూ.1.17 లక్షల కోట్లుగా ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. చిరుధాన్యాల సంవత్సరం 2023 అధిక పోషక విలువలు కలిగిన భారతీయ మిల్లెట్స్ (చిరు ధాన్యాలు)కు బ్రాండింగ్, ప్రచారానికి సహకారం అందించాలని కార్పొరేట్ సంస్థలను ప్రధాని కోరారు. 2023 సంవత్సరాన్ని మిల్లెట్స్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటించారు. నానో ఫెర్టిలైజర్ విభాగంలో కంపెనీలకు అపార అవకాశాలున్నట్టు గుర్తు చేశారు. దీనితోపాటు ఆహారశుద్ధి, ఇథనాల్ తయారీ సాగు ముఖచిత్రాన్ని మార్చేవిగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా భూసార పరీక్షా కేంద్రాల నెట్వర్క్ ఏర్పాటుకు స్టార్టప్‌లు, ఇన్వెస్టర్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భూముల సారాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. 2022–23 బడ్జెట్ భారత్ వ్యవసాయ రంగాన్ని ఆధునికంగా, స్మార్ట్‌గా మార్చడంపై దృష్టి సారించినట్టు ప్రధాని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో సాగు, వాణిజ్య అంశాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా మార్చేస్తుందన్నారు. అగ్రి స్టార్టప్‌లను ప్రోత్సహించినప్పుడే సాగులో డ్రోట్ టెక్నాలజీ మరింత అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. గత మూడు నాలుగేళ్లలో 700 వ్యవసాయాధారిత స్టార్టప్‌లు ప్రారంభమైనట్టు చెప్పారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం ‘‘రైతుల ఆదాయం పెంచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, రైతులకు ఆధునిక సదుపాయాలను కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం. రైతులకు అద్దెపై వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను అందించే వ్యవస్థను కార్పొరేట్లు ఏర్పాటు చేయాలి. సహజ, సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేయడంపై అవగాహన పెంచేందుకు యూనివర్సిటీలు, శాస్త్రవేత్తలు కృషి చేయాలి’’ అని ప్రధాని కోరారు. గడిచిన ఆరేళ్లలో వ్యవసాయానికి బడ్జెట్ ఎన్నో రెట్లు పెంచామని, వ్యవసాయ రుణాలు ఏడేళ్లలో రెండున్నర రెట్లు పెరిగినట్టు ప్రదాని గుర్తు చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం చిన్న రైతులకు మద్దతుగా నిలుస్తోందంటూ.. 11 కోట్ల మంది రైతులకు రూ.1.75 లక్షల కోట్ల రుణాలను ఈ పథకం కింద అందించినట్టు ప్రకటించారు. చమురులో 20 శాతం ఇథనాల్‌ను కలిపే లక్ష్యం దిశగా పనిచేస్తున్నట్టు, ఇప్పటికే ఇది 8 శాతానికి చేరినట్టు గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్ 2022: వ్యవసాయ రంగంపై సానుకూల ప్రభావం అన్న అంశంపై జరిగిన వెబినార్‌లో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ -
ఏపీ లక్ష్యం 6.68 ఎంటీవోఈ చమురు ఆదా
సాక్షి, అమరావతి: కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్ర ఇంధనశాఖ రాష్ట్రాలకు కార్యాచరణ రూపొందించింది. దీనిలో భాగంగా రాష్ట్ర ఇంధన శాఖకు 6.68 మిలియన్ టన్నుల ఆయిల్ ఈక్వలెంట్ (ఎంటీవోఈ) చమురును ఆదా చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. 2070 నాటికి కర్బన ఉద్గారాలను సున్నాకి తగ్గించాలనే కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా కేంద్ర విద్యుత్‌శాఖ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ద్వారా రాష్ట్ర ఇంధన సామర్థ్య కార్యాచరణ ప్రణాళికపై ప్రభుత్వ ఇంధన కార్యదర్శులతో వెబినార్ నిర్వహించింది. దేశవ్యాప్తంగా 2030 నాటికి 750 బిలియన్ యూనిట్లకు సమానమైన 887 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించే క్రమంలో రాష్ట్రాలన్నీ కలిసి 150 మిలియన్ టన్నుల చమురుకు సమానమైన ఇంధనాన్ని ఆదాచేయాలని కేంద్ర ఇంధనశాఖ సూచించింది. ఆ వివరాలను రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో చంద్రశేఖరరెడ్డి ఆదివారం మీడియాకు వివరించారు. కేంద్ర మంత్రి ప్రశంసలు రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలపై ఇంధనశాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ వివరించారు. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ)–2017 ద్వారా బిల్డింగ్ బైలాస్‌లో సవరణలు చేసి, తప్పనిసరిచేసిన కొద్ది రాష్ట్రాల్లో ఏపీ ఒకటని ఆయన తెలిపారు. ఎకో నివాస్ సంహిత (ఈఎన్ఎస్)–2018 ద్వారా ఏపీలో నిరుపేదలకు జగనన్న కాలనీల పేరుతో నిర్మిస్తున్న 28.3 లక్షల ఇళ్లలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. వీధి దీపాల జాతీయ కార్యక్రమం (ఎస్ఎల్ఎన్పీ) అమలులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో 6.02 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 23.54 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కె సింగ్ మాట్లాడుతూ రాష్ట్ర ఇంధన పొదుపు లక్ష్యాలను చేరుకోవడానికి కీలక శాఖలతో సమన్వయం చేసుకుని ఫాస్ట్ ట్రాక్ మోడ్‌లో అమలు చేయాలని, ఈఎన్ఎస్ని రాష్ట్ర బిల్డింగ్ బైలాస్‌లో చేర్చాలన్నారు. జగనన్న కాలనీలు, ఇతర విభాగాల్లో ఎనర్జీ ఎఫిషియెన్సీ కార్యక్రమాలను ఇంత పెద్ద ఎత్తున అమలు చేయడం ద్వారా ఏపీ గ్రీన్హౌస్ వాయు ఉద్గార తగ్గింపు చర్యలకు అత్యంత ఊతమిస్తోందని ప్రశంసించారు. అన్నిచోట్లా ఈవీ స్టేషన్లు ప్రధాన నగరాల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయాలని బీఈఈ అధికారులు సూచించారు. ఇంధన రిటైల్ అవుట్లెట్లు, మునిసిపల్ పార్కింగ్, మెట్రో పార్కింగ్, రైల్వే స్టేషన్లు, ఏయిర్‌పోర్టులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ భవనాలు వంటి ఇతర ప్రదేశాలలో పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ వెబినార్‌లో కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి ఆలోక్‌కుమార్, బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్‌కుమార్, సెక్రటరీ ఆర్కే రాయ్, డైరెక్టర్ మిలింద్ డియోర్,తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ పోలీస్.. టార్గెట్ న్యూ ఇయర్ పార్టీస్!
సాక్షి, సిటీబ్యూరో: డిసెంబర్ 31 రాత్రి జరగనున్న న్యూ ఇయర్ వేడుకలను టార్గెట్‌గా చేసుకున్న డ్రగ్ పెడ్లర్లు దందా వేగం పెంచారు. గంజాయికి బదులుగా దాని కంటే తేలిగ్గా రవాణా చేయగలిగే హష్ ఆయిల్‌పై దృష్టి పెట్టారు. దీనిని గమనించిన నగర పోలీసు విభాగం నిఘా ముమ్మరం చేసింది. ఫలితంగా నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముగ్గురిని పట్టుకుని, రూ.25 లక్షల విలువైన 3.5 లీటర్ల ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు, డీసీపీ చక్రవర్తి గుమ్మిలతో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ► విశాఖపట్నం జిల్లా, పాయకరావుపేటకు చెందిన సంపతి కిరణ్‌కుమార్ ఐటీఐ పూర్తి చేశాడు. ఆపై విజయవాడ, కాకినాడల్లో ఉద్యోగాలు చేసినా నిలదొక్కుకోలేదు. పాడేరు ఏజెన్సీకి చెందిన గంజాయి విక్రేతలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ► గత ఏడాది మేలో గంజాయి రవాణా చేస్తూ తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పోలీసులకు చిక్కాడు. మూడు నెలలకు బెయిల్‌పై బయటకు వచ్చిన ఇతగాడు నగరానికి వచ్చి మణికొండ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ► గత కొద్ది కాలంగా పోలీసులు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో రవాణా చేĶæడానికి అనువుగా మారిన హష్ ఆయిల్‌పై ఇతడి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో పాడేరు ప్రాంతానికి చెందిన వినోద్‌తో పరిచయం పెంచుకున్నాడు. ► వినోద్ స్థానికంగా లభించే గంజాయి మొక్కలతో ఈ ఆయిల్ తయారు చేస్తున్నాడు. అక్కడ తక్కువ రేటుకు 1.5 లీటర్లు ఖరీదు చేసిన కిరణ్ ట్రావెల్స్ బస్సులో సిటీకి తెచ్చాడు. విక్రయించడానికి ప్రయత్నిస్తూ గోల్కొండ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కాడు. ► జహనుమ, యాప్రాల్ ప్రాంతాలకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్, షేక్ కమల్ దూరపు బంధువులు. చిన్న చిన్న పనులు చేసే వీరు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం అక్రమ మార్గం పట్టారు. పాడేరుకు చెందిన గౌతమ్ నుంచి హష్ ఆయిల్ కొంటున్నారు. ► తొలినాళ్లల్లో వీళ్లే వినియోగించే వారు. అయితే న్యూ ఇయర్ పార్టీల నేపథ్యంలో ఈ సరుకు డి మాండ్ పెరగడంతో దందా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల సింహాచలం వరకు వెళ్లి గౌతమ్ నుంచి 2 లీటర్ల కొని తీసుకువచ్చారు. ► దీనిని విక్రయించే ప్రయత్నాల్లో ఉండగా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఫల క్‌నుమ ప్రాంతంలో పట్టుకున్నారు. వీడ్ ఆయిల్‌గానూ పిలిచే దీన్ని ఒక్కో మిల్లీ లీటర్ రూ.700 నుంచి రూ.1000 వరకు అమ్ముతున్నారు. ► న్యూ ఇయర్ సీజన్లో ఇది రూ.2000కు చేరే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ పార్టీలపై కన్నేసి ఉంచామని, పబ్ ఓనర్లనూ హెచ్చరించామని కొత్వాల్ పేర్నొఆ్నరు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలపై కన్నేసి ఉంచాలని సూచించారు. చదవండి: నవవధువు ఆత్మహత్య: భర్త వేధింపుల వల్లే మా కుమార్తె చనిపోయింది -
ఇష్టం లేని పెళ్లి.. తాగొచ్చాడని మరిగిన నూనె తీసుకుని..
సాక్షి,శృంగవరపుకోట( విజయనగరం): భార్యాభర్తల మధ్య విభేదాలు ముదిరి, భర్త ప్రాణాల మీదికొచ్చింది. మండలంలో వెంకటరమణపేట గ్రామానికి చెందిన పిల్లల గంగునాయుడు భార్యతో కొత్తూరు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న గంగునాయుడుకు 2017లో సత్యవతితో వివాహం జరిగింది. అయితే సత్యవతికి ఇష్టం లేని వివాహం కావడంతో భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. గురువారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన గంగునాయుడు భార్యతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో భార్య సత్యవతి అర్ధరాత్రి 12గంటల సమయంలో మరిగిన నూనెను గంగునాయుడు ముఖంపై పోసింది. దీంతో గంగునాయుడును ఇరుగుపొరుగువారు ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. సత్యవతిపై కేసు నమోదు చేశామని, విచారణ చేస్తున్నామని ఎస్సై లోవరాజు చెప్పారు. చదవండి: మాయలేడి: ఇంట్లోకి వచ్చి ఎంత పని చేసిందంటే..! -
కన్న తండ్రిపై అమానుషం.. పీకల దాక మద్యం తాగి.. ఆపై నూనె చల్లి..
సాక్షి, గచ్చిబౌలి(హైదరాబాద్): మద్యానికి డబ్బు ఇవ్వలేదన్న కోపంతో తండ్రిపై నూనె చల్లి నిప్పంటించాడు ఓ కిరాతకుడు. గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోటిపల్లి దుర్గారావు (55), భార్య, పెద్ద కొడుకు నాగబాబు (35)తో కలిసి ఇందిరానగర్‌లో అద్దెకు ఉంటున్నారు. దురలవాట్లకు బానిస కావడంతో నాగబాబుకు పెళ్లి కాలేదు. దీంతో నిత్యం మద్యం తాగి తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. దుర్గారావు ఆస్తమాతో బాధపడుతూ ఐదు నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు. మంగళవారం తల్లి కూలీ పనులకు వెళ్లగా నాగబాబు పీకలదాకా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో డబ్బులు ఇవ్వాలని తండ్రితో గొడవపడ్డాడు. దుర్గారావు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో కోపంతో తండ్రిమీద, మంచం, దుప్పట్లు, కిటికీల మీద నూనె చల్లి నిప్పంటించి బయటనుంచి తలుపు గడియ పెట్టి వెళ్లిపోయాడు. గది నుంచి పొగరావడం గమనించిన స్థానికులు తలుపులు పగులగొట్టి దుర్గారావును బయటకు తెచ్చారు. పోలీసులకు సమాచారం అందించడంతో బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటిన తరువాత దుర్గారావు మృతి చెందాడు. నాగబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రష్యాలో ప్రాజెక్టులు,15 బిలియన్ డాలర్లు దాటిన భారత్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్, రష్యా ద్వైపాక్షిక ఇంధన సహకార బలోపేతంపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురి, రష్యా ఇంధన మంత్రి నికోలయ్ షుల్గినోవ్‌తో శుక్రవారం వీడియో సమావేశం నిర్వహించారు. రష్యాలోని ఆయిల్, గ్యాస్ ప్రాజెక్టులపై భారత్ పెట్టుబడులు 15 బిలియన్ డాలర్లను మించడం గమనార్హం. అలాగే రష్యాకు చెందిన రోజ్‌నెఫ్ట్ భారత్‌కు చెందిన ఎస్సార్ ఆయిల్‌ను 2017లో 12.9 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేయడం తెలిసిందే. ఇంధన సహకార విస్తృతిపై నికోలయ్‌తో చర్చలు నిర్వహించినట్టు కేంద్ర మంత్రి పురి ట్వీట్ చేశారు. రష్యాలోని ప్రాజెక్టులపై భారత చమురు సంస్థల పెట్టుబడులను, ఎల్ఎన్జీ, ముడి చమురు సరఫరాను సమీక్షించినట్టు ప్రకటించారు. భారత ఇంధన రంగంలో రష్యా అతిపెద్ద పెట్టుబడిగా ఉన్నట్టు పేర్కొన్నారు. చదవండి : ఇకపై వాట్సాప్‌లో మాటలే కాదు..మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు -
థ్రిల్లర్ సినిమాను తలపించే ట్విస్టులు.. బకరా అయిన డాక్టర్
సాక్షి, హైదరాబాద్: పశువుల వ్యాక్సిన్ల తయారీకి వినియోగించే ఆగ్రో మెటాజైమ్ ఆయిల్‌ను భారత్‌లోనే ఖరీదు చేసి, తమకు ఎగుమతి చేస్తే భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన ఎన్నారై వైద్యుడికి టోకరా వేశారు. వివిధ దఫాల్లో మొత్తం రూ.11.94 కోట్లు (16,11,025 డాలర్లు) కాజేశారు. గురువారం హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంతో ముడిపడి ఉన్న సైబర్ నేరం నమోదు కావడం ఇదే తొలిసారని అధికారులు చెప్తున్నారు. ఇది నైజీరియన్ల పనిగా అనుమానిస్తున్న అధికారులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అమీర్‌పేట ప్రాంతానికి చెందిన వైద్యుడు ఎ.చంద్రశేఖర్ రావు (82) అమెరికా పౌరసత్వం ఉండగా... అక్కడ సుదీర్ఘకాలం వైద్యుడిగా పని చేసి వచ్చారు. ఈయనకు ఈ ఏడాది ఫిబ్రవరిలో లండన్‌లో ఉంటున్న డాక్టర్ బెంజిమన్ అని చెప్పుకున్న వ్యక్తి నుంచి ఈ–మెయిల్ వచ్చింది. తాను పని చేస్తున్న సంస్థ పశువులకు వేసే వ్యాక్సిన్లు తయారు చేస్తుందని నమ్మబలికాడు. దీనికోసం తాము నిత్యం భారత్ నుంచి ఆగ్రో మెటాజైమ్ ఆయిల్‌ను ఖరీదు చేస్తామని చెప్పాడు. ఈ ఆయిల్‌పై చంద్రశేఖర్‌కు పరిజ్ఞానం ఉండటంతో నమ్మారు. ఇప్పటి వరకు తమకు ఆయిల్ సరఫరా చేసిన వారితో అనివార్య కారణాల నేపథ్యంలో ఒప్పందం రద్దయిందని పేర్కొన్నాడు. ఆయిల్‌ను మీరే లీటర్ 14,625 డాలర్లకు (రూ.10.84 లక్షలు) ఖరీదు చేసి తమకు సరఫరా చేస్తే 22 వేల డాలర్లకు (రూ.16.31 లక్షలు) కొంటామంటూ ఎర వేశాడు. మహిళ నుంచి ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓపక్క ఈ సంప్రదింపులు జరుగుండగానే డాక్టర్ గీత నారాయణగా చెప్పుకున్న మహిళ నుంచి ఫేస్బుక్ రిక్వెస్ట్ వచ్చింది. అలా పరిచయమైన ఈమె వైద్యుడిని తెలివిగా ముగ్గులోకి దింపి సదరు ఆయిల్‌ను రాయ్‌గఢ్‌కు చెందిన మిల్లులో తయారు చేస్తారంటూ నమ్మించింది. అక్కడ పని చేసే లక్ష్మీ అనే మహిళతో తనకు పరిచయం ఉందంటూ చెప్పి ఆ పేరుతో సంప్రదింపులు జరిపింది. ఈ కథ ఇలా నడుస్తుండగా... మరోసారి టచ్‌లోకి వచ్చిన బెంజిమన్ శాంపిల్‌గా ఒక లీటర్ ఖరీదు చేసి పంపాలని, ఆ కంపెనీ ఖాతాలో డబ్బు జమ చేస్తే వాళ్లే తమకు ఆయిల్ పంపేస్తారంటూ చెప్పాడు. నగదు మాత్రం మీరే పేర్కొన్న ఖాతాలో వేస్తామంటూ పూర్తిగా నమ్మించాడు. చంద్రశేఖర్ ఒక లీటర్ ఆయిల్ కోసం లక్ష్మీని సంప్రదించారు. దాని నిమిత్తం 14,625 డాలర్లు పంపించారు. ఈలోపు మళ్లీ సీన్లోకి వచ్చిన బెంజిమన్... లీటర్‌తో తమకు ఉపయోగం లేదని, కనీసం 350 పంపిస్తే ఒక బ్యాచ్ వ్యాక్సీన్లు తయారవుతాయని చెప్పాడు. చంద్రశేఖర్ దానికి సంబంధించిన మొత్తం లక్ష్మీ పేర్కొన్న ఖాతాలకు పంపిన తర్వాత మరో కథ మొదలైంది. విమానాశ్రయంలో పట్టుకున్నారంటూ.. ఆ ఆయిల్‌ను లండన్ విమానాశ్రయంలో పట్టుకున్నారంటూ బెంజిమన్ చెప్పాడు. రిలీజ్ చేయడానికి కస్టమ్స్ డ్యూటీ, వ్యాట్ కట్టాలని చెప్పి మరికొంత మొత్తం కాజేశాడు. ఇలా ఈ ఏడాది మార్చ్ నుంచి మే వరకు వివిధ విడతల్లో మొత్తం 16,11,025 డాలర్లు వివిధ బ్యాంకు ఖాతాల్లో వేయించుకున్నారు. మరో 2 వేల డాలర్లు పంపాలంటూ నేరగాళ్ల కోరడంతో చంద్రశేఖర్ అనుమానించారు. ఈ క్రమంలో ఈ ఏడాది మేలో ఓ అపరిచిత వ్యక్తి నుంచి చంద్రశేఖర్‌కు మరో ఈ–మెయిల్ వచ్చింది. అందులో ఆయిల్ పేరుతో జరుగుతోంది పెద్ద మోసమంటూ అతడు పేర్కొన్నాడు. దీంతో అనుమానం వచ్చిన ఆయన లండన్ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులను సంప్రదించగా మొత్తం ఓ స్కామ్‌గా తేలింది. కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో చంద్రశేఖర్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బయటకు రాలేదు. చివరకు గురువారం తన సమీప బంధువు మురళీమోహన్ ద్వారా సీసీఎస్ సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతికి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. అమెరికా, దుబయ్ బ్యాంకులకు నగదు బదిలీ ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో చంద్రశేఖర్‌కు అమెరికాలోని వెల్స్ మార్గో బ్యాంకులో ఉన్న ఖాతా నుంచి అమెరికా, దుబయ్ల్లో ఉన్న మొరిల్లా బ్యాంక్ ఆఫ్ అమెరికా బ్రాంచ్‌లకు చెందిన తొమ్మిది ఖాతాల్లోకి ఈ నగదు వెళ్లినట్లు గుర్తించారు. కొన్నేళ్ల క్రితం ఇలానే ఓ వైద్యుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.2.5 కోట్లు కాజేశారు. ఇప్పటి వరకు ఇదే పెద్ద కేసుగా రికార్డుల్లో ఉంది. -
Oil Bulls: ఇంధనానికి కోవిడ్ గండం
సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఇంధన డిమాండ్‌కి కరోనా వైరస్ సెకండ్ వేవ్ రూపంలో గండం వచ్చి పడింది. కోవిడ్-19 కట్టడి కోసం ఎక్కడికక్కడ లాక్డౌన్లు, ఆంక్షలు విధిస్తుండటంతో డిమాండ్ రికవరీపై ప్రతికూల ప్రభావాలు పడొచ్చన్న ఆందోళనలు నెలకొన్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ తదితర రాష్ట్రాలు పరిమిత స్థాయిలో లాక్డౌన్లు అమలు చేస్తుండటంతో ప్రయాణాలు, వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం పడుతోంది. మిగతా రాష్ట్రాలు కూడా వివిధ సమయాల్లో కర్ఫ్యూలు అమలు చేస్తున్నాయి. ‘ఇలాంటి పరిస్థితుల్లో అన్నింటికన్నా ముందుగా ప్రయాణాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫలితంగా ఇంధన వినియోగం కూడా దెబ్బతింటుంది‘ అని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘ఈ నెలలో సీఎన్జీ అమ్మకాలు 20-25 శాతం దాకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా కొత్త వాహనాలు వస్తే మార్కెట్ మరింతగా పెరుగుతుంది. కానీ లాక్డౌన్లు విధిస్తే కొత్త వాహనాల అమ్మకాలు దాదాపుగా నిల్చిపోయినట్లే అవుతుంది‘ అని మరో అధికారి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇంధన వినియోగం దాదాపు 10 శాతం పెరగవచ్చని కోవిడ్-19 కేసులు విజృంభించడానికి ముందు కేంద్ర చమురు శాఖ అంచనా వేసింది. అయితే, కేసులు మరో నెల రోజుల పాటు ఇలాగే కొనసాగితే ఇంధన అమ్మకాల అంచనాలను సవరించుకోవాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ద్వితీయార్థంలోనూ డౌన్ ట్రెండే! తాజాగా ఈ ఏడాది మార్చితో పోలిస్తే డీజిల్, పెట్రోల్, విమాన ఇంధనం, ఎల్పీజీకి ఏప్రిల్ ప్రథమార్థంలో డిమాండ్ తగ్గిపోయింది. డీజిల్‌కు డిమాండ్ 3 శాతం, పెట్రోల్ అమ్మకాలు 5 శాతం పడిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం కరోనాకు ఎదురీదిన ఎల్పీజీ డిమాండ్ కూడా ప్రస్తుత ఏప్రిల్ ప్రథమార్ధంలో 6.4 శాతం క్షీణించగా, విమాన ఇంధన అమ్మకాలు 8 శాతం పడిపోయాయి. మరిన్ని రాష్ట్రాలు లాక్డౌన్లను విధిస్తుండటంతో ద్వితీయార్థంలో ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా కఠినతరమైన ఆంక్షలు అమలు చేయడంతో గత ఆర్థిక సంవత్సరం ఇంధన డిమాండ్ 9.1 శాతం పడిపోయిన సంగతి తెలిసిందే. గడిచిన రెండు దశాబ్దాల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ)గణాంకాల ప్రకారం 2019-20లో నమోదైన 214.12 మిలియన్ టన్నులతో పోలిస్తే 2020-21లో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం 194.63 మిలియన్ టన్నులకు పడిపోయింది. డీజిల్ వినియోగం అత్యధికంగా 12 శాతం, పెట్రోల్ డిమాండ్ సుమారు 7 శాతం తగ్గిపోయింది. చదవండి : మొదటి వేవ్‌తో పోల్చితే రెండో దశలోఎకానమీ బెటర్..! -
రిలయన్స్ సంచలన నిర్ణయం
సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. తన ఆయిల్-టు-కెమికల్స్ (ఓటూసీ) వ్యాపారాన్ని స్వతంత్ర అనుబంధ సంస్థగా రూపొందిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. వ్యాపార బదిలీతో కొత్తగా ఏర్పడిన ఈ అనుబంధ సంస్థపై 100 శాతం నిర్వహణ, నియంత్రణ కలిగి ఉంటుందని ఆర్ఐఎల్ తెలిపింది. మొత్తం అపరేటింగ్ టీం, కొత్త సంస్థలోకి మారుతుందనీ, అలాగే ఆదాయాలను తగ్గించడం లేదా నగదు ప్రవాహాలపై ఎటువంటి పరిమితులు ఉండవని పేర్కొంది. పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రమోటర్ గ్రూప్ ఓటూసీ వ్యాపారంలో 49.14 శాతం వాటాను కలిగి ఉంటుందనీ, ఈ ప్రక్రియతో కంపెనీ వాటాదారుల్లో ఎలాంటి మార్పు ఉండదని రెగ్యులేటరీ సమాచారంలో రిలయన్స్ వెల్లడించింది. దీనికి సంబంధించి ఇప్పటికే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) స్టాక్ ఎక్స్ఛేంజీల ఆమోదం లభించినట్టు ఆర్ఐఎల్ తెలిపింది. అయితే, ఈక్విటీ వాటాదారులు, రుణదాతలు, ఐటీ, ఎన్సీఎల్టీ బెంచ్‌ల నుండి ఇంకా క్లియరెన్స్ పొందలేదని చెప్పింది. 2022 నాటికి ముంబై, అహ్మదాబాద్ ఎన్సీఎల్టీ అనుమతి వస్తుందని ఆశిస్తున్నట్లు రిలయన్స్ తెలిపింది. సంస్థకు చెందిన రిఫైనింగ్, మార్కెటింగ్, పెట్రో కెమికల్ ఆస్తులు మొత్తం కొత్త అనుబంధ సంస్థలోకి బదిలీ అవుతాయి. సౌదీ అరామ్కోతో ఒప్పందం అనంతరం మరింతగా ఇన్వెస్టర్ల ద్వారా కేపిటల్ సమకూర్చుకోవడానికి దోహద పడుతుందని కంపెనీ తెలిపింది. -
తల్లిదండ్రులపై వేడి నూనె పోసిన కూతురు
నెల్లూరు(క్రైమ్): నిద్రిస్తున్న తల్లిదండ్రులపై కుమార్తె వేడి నీళ్లు, వేడి నూనె పోసి వారిని ఆస్పత్రి పాలు చేసిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై నెల్లూరులోని బాలాజీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. బాలాజీనగర్ స్టేషన్ పరిధిలోని రాయపుపాళెంలో జేమ్స్ పాల్ నివాసం ఉంటున్నాడు. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద కుమార్తెకు వివాహమైంది. అయితే ఆమె మూడేళ్ల నుంచి భర్తకు దూరంగా తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. ఏమి జరిగిందో గానీ ఈనెల 10వ తేదీ అర్ధరాత్రి జేమ్స్‌పాల్, అతని భార్య నిద్రిస్తుండగా పెద్ద కుమార్తె వేడి నీళ్లు, వేడి నూనెను వారిపై పోసింది. దీంతో దంపతులిద్దరూ ఇంట్లోంచి బయటకు పరుగులు తీశారు. వారిని వెంబడించిన కుమార్తె కారం చల్లేందుకు యత్నించింది. ఇంతలో దంపతులు పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జేమ్స్ పాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని బాలాజీనగర్ ఎస్సై జి.అంకమ్మ శుక్రవారం తెలిపారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. -
ఔరౌర గారెలల్ల.. అయ్యారె బూరెలల్ల
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ ముగిసేనాటికి కొంతమంది ప్రజలకు చొక్కాల గుండీలు పట్టవని, ఇళ్ల ద్వారాల నుంచి బయటకు రావటం కూడా కష్టమని.. సామాజిక మాధ్యమాల్లో జోకులు పేలాయి. తినడం.. కూర్చోవటం.. తినడం.. పడుకోవటం.. ఇదే ప్రధాన దినచర్య కావడంతో అమాంతం పొట్టలు పెరుగుతాయన్నది వాటి సారాంశం. జోకుల సంగతేమోగానీ.. ప్రజలు చిరుతిళ్లు మాత్రం బాగానే లాగించేశారు. ఎంతగా అంటే.. లాక్డౌన్ సమయంలో ఏకంగా దాదాపు 13 వేల టన్నుల మంచినూనె అదనంగా వినియోగించారు. లాక్‌డౌన్‌తో కొన్ని రంగాలు నష్టపోయినా, నూనె పరిశ్రమ మాత్రం గృహావసరాలకు సంబంధించి అదనపు అమ్మకాలతో కులాసాగా ఉంది. లాక్డౌన్ వేళ ఇళ్లకే పరిమితమైన జనం చిరుతిండిపై దృష్టి పెట్టడంతో అంతమేర అదనంగా నూనె ఖర్చయిపోయింది. ఓ దశలో డిమాండ్‌ను మంచినూనె కంపెనీలు అందుకోలేకపోయాయి. మామూలుగా వినియోగమయ్యే నూనె వాడకంకంటే దాదాపు 25 శాతం అదనంగా వాడినట్టు ఆయిల్ కంపెనీలు లెక్కలు తేలుస్తున్నాయి. ఇప్పుడు లాక్డౌన్ సడలింపులతో పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి రావటంతో అదనపు వినియోగానికి బ్రేక్ పడింది. సాధారణంగా ఎండాకాలం తీవ్రత అధికంగా ఉండే మే నెలలో మంచినూనె వినియోగం తక్కువగా ఉంటుంది. కానీ ఈనెల తొలివారంలో వినియోగం చాలా ఎక్కువగా నమోదైంది. ఇప్పుడు సాధారణ స్థాయికి చేరుకోవటంతో నూనె కంపెనీలు తేరుకున్నాయి. వాణిజ్య వినియోగం 80 శాతం తగ్గుదల.. సాధారణంగా మంచి నూనె వినియోగాన్ని కంపెనీలు మూడు రకాలుగా విభజిస్తాయి. పారిశ్రామిక అవసరాలైన బిస్కెట్లు, చాక్లెట్స్, ఐస్‌క్రీం తయారీదారులకు ముడి నూనెను అందిస్తాయి. లాక్డౌన్ సమయంలో పరిశ్రమలు కొంతకాలం పూర్తిగా నిలిచిపోవటంతో ఈ నూనె వాడకం కూడా బాగా తగ్గిపోయింది. ఒక దశలో వాణిజ్య వినియోగం ఏకంగా 80 శాతం పడిపోయింది. ఆ తర్వాత పరిశ్రమలకు అవకాశం కల్పించటంతో మళ్లీ డిమాండ్ పెరిగింది. హోటళ్లు, రెస్టారెంట్లు తదితరాలకు సరఫరా చేసే నూనెను వాణిజ్య కేటగిరీ కింద పరిగణిస్తారు. జనతా కర్ఫ్యూ నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు పూర్తిగా మూసే ఉండటంతో ఆ నూనె వినియోగం పూర్తిగా నిలిచిపోయింది. టేక్ అవేకు అనుమతిచ్చిన కారణంగా కేవలం 20 శాతం వినియోగం మాత్రమే జరిగినట్టు గుర్తించారు. వలస కూలీలు లేక కొత్త చిక్కులు.. లాక్డౌన్ నేపథ్యంలో లక్షల సంఖ్యలో వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్లిపోవటంతో మంచినూనె తయారీకి ఇబ్బందులు వచ్చిపడ్డాయి. దీంతో ప్రస్తుత డిమాండ్‌కు సరిపడా నూనెను మార్కెట్‌కు తరలించటంలో కొంత ఇబ్బంది తప్పేలా కనిపించటం లేదు. మంచినూనె తయారీకి సంబంధించి రిఫైనరీలో పెద్దగా వలస కూలీల అవసరం ఉండదు. కానీ ప్యాకింగ్, మార్కెట్‌కు సరఫరాలో వారి అవసరం ఉంది. ప్యాకింగ్ కార్మికుల్లో 30 శాతం వలస కూలీలే. ఇప్పుడు వారు పెద్ద సంఖ్యలో సొంత ప్రాంతాలకు వెళ్లటంతో తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో దుకాణాలకు మంచినూనె సరఫరాకు కొంత ఇబ్బంది తప్పేలా లేదు. ప్రస్తుతం సూపర్ మార్కెట్లు, సాధారణ దుకాణాల్లో అన్ని ప్రధాన బ్రాండ్ల నూనె అందుబాటులో ఉంటోంది. లాక్డౌన్ సమయంలో కొన్ని బ్రాండ్లు అసలే కనిపించలేదు. ఇప్పుడు పరిస్థితి మామూలుగానే ఉంది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 10 వరకు కొన్ని రకాల బ్రాండ్లు కనిపించలేదు. మార్కెట్లకు రావటానికి ఉన్న ఇబ్బందుల వల్ల పూర్తిస్థాయిలో సరఫరా కాకపోవటం ఒక కారణమైతే, కొన్ని చోట్ల నేతలు పెద్ద మొత్తంలో సొంతంగా స్టాక్ ఏర్పాటు చేసుకోవటం మరో కారణం. నిరుపేదలకు భోజన వసతి కల్పించటం, వారికి నిత్యావసరాల పంపిణీ కోసం చాలామంది నేరుగా కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో నూనె సమకూర్చుకోవటం కూడా కొరతకు కారణమైందని కంపెనీలు చెబుతున్నాయి. కొరత రానీయం.. కరోనా భయం అవసరం లేదు ‘‘లాక్డౌన్ సమయంలో గృహావసరాలకు మంచినూనె వినియోగం భారీగా పెరిగింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు వచ్చాయి. మళ్లీ జనం మార్కెట్లకు వస్తున్నారు. కానీ కరోనా నేపథ్యంలో కొన్ని వస్తువుల విషయంలో జనంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మంచి నూనె విషయంలో మేం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రిఫైనరీలు, ప్యాకింగ్, మార్కెట్లకు సరఫరా.. అన్ని చోట్లా సిబ్బంది పూర్తిగా కరోనా నిబంధనలు అనుసరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన పదార్థం అయినందున అత్యంత హైజనిక్‌గా వ్యవహరిస్తున్నాం. డిమాండ్‌కు సరిపడా మంచినూనెను సిద్ధంగా ఉంచేందుకు కృషి చేస్తున్నాం. వలస కూలీల రూపంలో కొత్త సమస్య వచ్చిపడినా, అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం’’ – పి.చంద్రశేఖరరెడ్డి, వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఫ్రీడం ఆయిల్ -
చేతి ‘చమురు’ వదిలింది!
సాక్షి, సిటీబ్యూరో: ఔషధాల తయారీలో వినియోగించే ఆయిల్‌ను తక్కువ ధరకు ఖరీదు చేసి, తమకు ఎక్కువ ధరకు విక్రయించాలంటూ ఎర వేసి, రూ.7.8 లక్షలు కాజేసిన కేసులో ఇద్దరు నిందితులను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు నైజీరియా నుంచి వచ్చి న్యూ ఢిల్లీలో నివసిస్తున్నట్లు సీసీఎస్ జాయింట్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి మంగళవారం పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. నైజీరియాకు చెందిన ఎజుమెజు లక్కీ ఓఝా ప్రస్తుతం న్యూ ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతను ఫేస్బుక్లో సోరాలిన్ అనే మహిళ పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. దీని ద్వారా లండన్‌కు చెందిన మహిళా వ్యాపారవేత్తనంటూ నగరంలోని అంబర్‌పేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం చేసుకున్నాడు. ఆమెగానే ఇతడితో సంప్రదింపులు కొనసాగించిన అతను జంతువులకు వినియోగించే ఔషధాలను తయారు చేస్తుంటామని చెప్పాడు. తమకు విటోలిన్ ఆయిల్ అవసరం ఎంతో ఉందని, అది కేవలం భారత్‌లో మాత్రమే దొరుకుతుందని నమ్మబలికాడు. అక్కడ ఒక్కో బాటిల్ రూ.19,500 ఖరీదు చేసి తమ కంపెనీకి 850 డాలర్లకు (దాదాపు రూ.61 వేలు) అమ్మే వ్యక్తి ఇటీవల మానేశాడంటూ చెప్పింది. తాము నేరుగా ఆయిల్ ఖరీదు చేయడానికి కంపెనీ నిబంధనలు అంగీకరించవని, తమ డీలర్ సునీతను వాట్సాప్ ద్వారా సంప్రదించి ఆ వ్యాపారం ప్రారంభించాలని సూచించింది. ఇందుకు బాధితుడు అంగీకరించడంతో సునీత పేరుతో తమ ముఠాకు చెందిన వ్యక్తి నంబర్ ఇచ్చింది. ప్రాథమికంగా 5 బాటిల్స్ ఖరీదు చేసి శాంపిల్‌గా తమకు పంపాలంటూ సోరాలిన్ నుంచి మెసేజ్ రావడంతో సునీతను సంప్రదించిన బాధితుడు వారి సూచనమేరకు రూ.97,500 వాళ్ళు సూచించిన బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఆపై బాటిల్స్‌ను కొరియర్ ద్వారా అందుకున్నాడు. కొన్ని రోజులకు సోరాలిన్ అని చెప్పుకున్న ఎజుమెజు ఓ మహిళతో ఫోన్లో మాట్లాడించాడు. లండన్ నుంచి తమ కంపెనీ ప్రతినిధి మార్క్ ఢిల్లీ వస్తున్నారని, అతడిని కలిసి శాంపిల్స్ చూపించాలని కోరాడు. గత ఏడాది సెప్టెంబర్ 3న ఢిల్లీకి వెళ్లిన బాధితుడిని మార్క్‌గా చెప్పుకున్న వ్యక్తి కలిశాడు. ఆ శాంపిల్స్ తనకు నచ్చాయంటూ మరో 35 బాటిల్స్ సిద్ధం చేస్తే మొత్తం 40 ఒకేసారి హైదరాబాద్ వచ్చి తీసుకువెళ్తానంటూ సూచించాడు. దీంతో మరోసారి సునీతను సంప్రదించిన బాధితుడు మరో రూ.6,82,500 ఆమె సూచించిన ఖాతాలోకి బదిలీ చేశాడు. ఆ బాటిల్స్ డెలివరీ అయినా.. మార్క్ నుంచి స్పందన లేదు. దీనికి తోడు మరోసారి బాధితుడిని సంప్రదించిన సునీత 400 బాటిల్స్ కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న అధికారులు నిందితులు వాడిన సెల్ నంబర్లతో పాటు బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈ స్కామ్‌కు సూత్రధారి ఎజుమెజు అని, గుర్గావ్కు చెందిన దీపక్ అనే వ్యక్తి కమీషన్ తీసుకుని బ్యాంకు ఖాతాలు అందించినట్లుగా గుర్తించారు. దీంతో ఢిల్లీ వెళ్లిన ప్రత్యేక బృందం ఇద్దరినీ అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చింది. గిఫ్ట్‌ల పేరుతో గాలం రూ.1.2 లక్షలు స్వాహా సాక్షి, సిటీబ్యూరో: ఫేస్బుక్ ద్వారా మహిళగా నగరవాసికి పరిచయమైన ఓ నైజీరియన్ గిఫ్ట్‌ల పేరుతో రూ.1.2 లక్షలు కాజేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీలో ఉంటున్న సదరు నైజీరియన్‌ను అరెస్టు చేసినట్లు సీసీఎస్ జాయింట్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి మంగళవారం వెల్లడించారు. ఢిల్లీలో ఉంటున్న జేమ్స్ లక్కీ ఒబాసి ఫేస్బుక్లో మహిళ పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. దీని ద్వారా నగరానికి చెందిన ఓ వ్యక్తిని పరిచయం చేసుకున్నాడు. లండన్‌లో ఉంటున్న సంపన్న కుటుంబానికి చెందిన మహిళగా చెప్పుకుంటూ నకిలీ నంబర్ ద్వారా అతడితో వాట్సాప్ చాటింగ్ చేశాడు. అనంతరం తాము కోర్టులో ఆస్తి సంబందించిన కేసు గెలిచామని, ఈ ఆనందంలో ఓ బహుమతి పంపిస్తున్నానంటూ చెప్పాడు. కొన్ని రోజులకు కొరియర్ సర్వీసు నుంచి అంటూ బాధితుడికి ఫోన్ వచ్చింది. లండన్ నుంచి కొరియర్లో వచ్చిన ఖరీదైన బహుమతులు డెలివరీ చేయడానికి కొన్ని పన్నులు చెల్లించాలని చెప్పారు. దీనిని నమ్మిన బాధితుడు వారు సూచించిన విధంగా రూ.1.2 లక్షలు చెల్లించాడు. చివరకు మోసపోయానని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏసీపీ కేవీఎం ప్రసాద్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ సీహెచ్ గంగాధర్ ఒబాసిని నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసి తీసుకువచ్చారు. -
అంబానీపై ఫేస్బుక్ ఫైర్
న్యూఢిల్లీ: డేటా విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటనకు కౌంటర్‌గా అన్నట్టు ఫేస్బుక్ భిన్నంగా స్పందించింది. డేటా అన్నది కొత్త చమురు కాదని, దీన్ని ఒక దేశం పరిధిలోనే నిల్వ చేయరాదని ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ నిక్‌క్లెగ్ వ్యాఖ్యానించారు. భారత్ వంటి దేశాలు డేటాను ఓ పరిమిత వస్తువుగా నిలిపివేయకుండా, సాఫీగా దేశ సరిహద్దులు దాటి వెళ్లేందుకు అనుమతించాలని అభిప్రాయపడ్డారు. ‘‘జాతి భద్రత దృష్ట్యా భారత్ వంటి దేశాలకు డేటాను పంచుకోవడం ఇప్పుడు కీలకం. ఎందుకంటే తీవ్ర నేరాలు, ఉగ్రవాదాన్ని తుదముట్టించే లక్ష్యంతో అంతర్జాతీయ డేటాను పంచుకునేందుకు భారత్ గొప్ప చర్యలనే చేపట్టింది’’ అని క్లెగ్ గుర్తు చేశారు. డేటాను దేశీయంగానే నిల్వ చేయాలని, ఇందుకు అన్ని కంపెనీలు చేర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. హక్కులను గౌరవించాలి.. ‘‘తమ డేటాకు ఏం జరుగుతుందో తెలుసుకునే వ్యక్తుల హక్కులను గౌరవించాలి. పోటీని, ఆవిష్కరణను ప్రోత్సహించాలి. ప్రతీ ఒక్కరు డేటాను పొందే దిశగా దాన్ని అందుబాటులో ఉంచాలి. ఈ దిశగా ఇంటర్నెట్కు భారత్ కొత్త నిర్వచనం చెప్పాలి’’ అని నిక్‌క్లెగ్ అన్నారు. డేటాను ‘న్యూ ఆయిల్’ (కొత్త ఇంధనం) అని, సామాజిక మాధ్యమ వేదికలు, ఇంటర్న్‌పై భారత యూజర్ల డేటాను కాపాడాల్సి ఉందని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇటీవలే వ్యాఖ్యానించారు. ‘‘దేశ డేటాను భారత వ్యక్తులే కలిగి ఉండడం, నియంత్రించడం చేయాలి. అది దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్లు కాదు’’ అని అంబానీ పేర్కొన్నారు. ‘‘భారత్‌లో చాలా మంది, అలాగే ప్రపంచ వ్యాప్తంగా డేటాను కొందరు కొత్త ఆయిల్గా భావిస్తున్నారు. దేశం పరిధిలోనే భారీ చమురు నిల్వలను కలిగి ఉండొచ్చు. ఇది కచ్చితంగా సంపదను పెంచుతుంది. కానీ, ఈ విధమైన పోలిక పొరపాటే అవుతుంది’’ అని క్లెగ్ గురువారం ఓ మీడియా సంస్థకు తెలిపారు. ‘‘నిలిపి ఉంచడం వల్ల డేటాకు విలువ రాదు. దాన్ని స్వేచ్ఛగా ప్రయాణించేందుకు అనుమతించడం ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించాలి’’ అని ఆయన సూచించారు. -
అసోంలో ఓఎన్జీసీ రూ.13,000 కోట్ల పెట్టుబడి..
గౌహతి: అస్సామ్‌లో చమురు అన్వేషణ, ఉత్పత్తి నిమిత్తం ఐదేళ్లలో రూ.13,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని ఓఎన్జీసీ తెలిపింది. ఈ విషయమై అస్సామ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని ఓఎన్జీసీ(ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) వెల్లడించింది. 2022 కల్లా దిగుమతులను 10% మేర తగ్గించుకోవాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ పెట్టుబడులు పెడుతున్నామని పేర్కొంది. నార్త్ఈస్ట్ హైడ్రోకార్బన్ విజన్ 2030లో భాగంగా ఈ పెట్టుబడుల ప్రణాళికను రూపొందించామని ఓఎన్జీసీ వివరించింది. అస్సామ్‌లోని జోర్హాట్, గోల్హాట్ జిల్లాల్లో ఆరు బావులు, ఐదు మైనింగ్ బ్లాక్‌ల్లో డ్రిల్లింగ్ కోసం ఆమోదాలు పొందామని తెలిపింది. ఇలాంటి 12 బావుల్లో డ్రిల్లింగ్ నిమిత్తం అనుమతుల కోసం వేచి చూస్తున్నామని పేర్కొంది. -
ముడిచమురు ముప్పు?
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల భారత ఈక్విటీలకు అతిపెద్ద రిస్కని సీఎల్ఎస్ఏ ఈక్విటీ వ్యూహకర్త క్రిస్‌వుడ్ హెచ్చరించారు. మే2 తర్వాత ఇరాన్ చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షల మినహాయింపు ముగిసిపోతుందని, తదనంతరం బ్రెంట్ క్రూడ్ ధర వందడాలర్ల వరకు దూసుకుపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. వీలయినంతవరకు ఈక్విటీ పొజిషన్లను చమురు స్టాకులతో హెడ్జ్ చేసుకోవాలని ఇన్వెస్టర్లకు తన గ్రీడ్ అండ్ ఫియర్ నివేదికలో సలహా ఇచ్చారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన స్వరం మార్చుకునే చాన్సులు కూడా ఉన్నాయని వుడ్ అభిప్రాయపడ్డారు. చైనాతో వాణిజ్య యుద్ధంలో పైచేయి సాధించేందుకు ఇరాన్ చమురు కొనుగోలుపై ఆంక్షల అంశాన్ని ట్రంప్ వాడుకోవచ్చన్నారు. ప్రస్తుతం సౌదీ తన ఉత్పత్తి పెంచుకునేందుకు ట్రంప్ ఒత్తిడి తెస్తున్నా అంగీకరించడం లేదని, అందువల్ల అటు చైనా, ఇటు సౌదీలను దారిలో తెచ్చుకునేలా ఇరాన్ ఆయిల్‌పై ట్రంప్ స్వరం మారే అవకాశాలున్నాయని అంచనా వేశారు. ఈ ఏడాది అంతర్జాతీయ టెన్షన్ల కారణంగా చమురు ధరలు ఇంతవరకు దాదాపు 40 శాతం ర్యాలీ చేశాయి. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ధర 75 డాలర్లను తాకింది. చమురు ధరల్లో అనూహ్య పెరుగుదల దేశీ కరెన్సీపై పడింది. దీంతో రూపీ 70 స్థాయిలకు పైన కదలాడుతోంది. ప్రస్తుతం ఇండియా స్టాక్ మార్కెట్‌పై సానుకూలంగా ఉన్నా, రూపాయిపై తాను ఆసక్తిగా లేనని వుడ్ చెప్పారు. రూపాయి వాస్తవ ఎక్చేంజ్ రేటు లెక్కన ఇంకా చౌకగా లేదని, ఆర్బీఐ పాలసీలో వచ్చిన మార్పుతో రూపాయికి రక్షణ తగ్గిందని వివరించారు. ఎన్నికలు– ఎకానమీ మోదీ ప్రభుత్వం తీసుకున్న కీలక ఆర్థ్ధిక నిర్ణయాల్లో నోట్లరద్దు, జీఎస్టీ ఎకానమీపై పెను ప్రభావం చూపాయి. వీటిలో నోట్లరద్దు ఆర్థిక వ్యవస్థకు అత్యంత చెరుపు చేసిందని వుడ్ అభిప్రాయపడ్డారు. నిజానికి ఎకానమీలో నల్లధనం ఏరివేతే నోట్లరద్దు ఉద్దేశమని, కానీ అసంఘటిత రంగానికి నోట్ల రద్దు చాలా కీడు చేసిందని, ఇదే తరుణంలో వచ్చిన జీఎస్టీతో ఈ రంగానికి మరింత ఇక్కట్లు కలిగాయని చెప్పారు. ముఖ్యంగా బీజేపీకి ప్రధాన మద్దతుదారులైన చిన్న వ్యాపారస్థులకు జీఎస్టీ దెబ్బ గట్టిగా తగిలిందన్నారు. అయితే తాజా ఎన్నికల్లో తిరిగి మోదీనే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని, కానీ గతంలో కన్నా మెజార్టీ తగ్గవచ్చని అంచనా వేశారు. అందుకే మోదీ ఈ దఫా గుజరాత్లో సైతం గట్టిగా ప్రచారం చేస్తున్నారన్నారు. అంతేకాకుండా ఎకానమీ సంబంధిత అంశాలను ఆయన ప్రస్తావించడం లేదని, కేవలం జాతీయత, దేశభక్తి, పాక్‌కు గుణపాఠం వంటి అంశాలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారన్నారు. ఆందోళనలో ఆటోమొబైల్ ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల దేశీయ ఆటోమొబైల్రంగాన్ని ఇబ్బంది పెట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ సరఫరా లోటు భర్తీ చేసేందుకు ఇతర దేశాలు ముందుకు వస్తున్నా, రాబోయే కొన్ని వారాల పాటు మాత్రం ముడిచమురు ధరలకు రెక్కలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో చమురు ఆధారిత రంగాలన్నీ క్రూడ్ ధర 90 డాలర్లను దాటకూడదని ఆశిస్తున్నాయి. ఒకవేళ క్రూడ్ 90 డాలర్లను దాటితే వెంటనే ఆర్థిక వ్యవస్థపై నెగిటివ్ ప్రభావం కనిపిస్తుంది. ఒకపక్క కొన్ని నెలలుగా దేశీ ఆటో విక్రయాలు మందగించాయి. ఇదే సమయంలో పెరుగుతున్న చమురు ధరలు ఆటో మొబైల్ పరిశ్రమను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవేళ క్రూడ్ 80 డాలర్లను చేరితే అసలే అంతంతమాత్రంగా ఉన్న విక్రయాలు మరింత దిగజారతాయని ప్రముఖ కంపెనీలు భయపడుతున్నాయి. క్రూడాయిల్ ధరల ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నాయి. కొందరు నిపుణులు మాత్రం ముడిచమురు ధరలు మరింత పెరిగితే టూవీలర్ విక్రయాలు, అందునా అధిక మైలేజ్ ఇచ్చే వాహనాల విక్రయాలు ఊపందుకుంటాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఎంట్రీలెవల్ బైక్స్, కాంపాక్ట్ కార్ల విక్రయాలు సైతం పాజిటివ్‌గా ఉండే చాన్సులున్నాయి. ఓఎంసీలకు గడ్డుకాలం! మరింత రాబడి కోసం చమురు మార్కెటింగ్ కంపెనీలపై(ఓఎంసీ) ప్రభుత్వం తెస్తున్న ఒత్తిళ్ల కారణంగా సమీప భవిష్యత్‌లో ఈ కంపెనీల ఫైనాన్షియల్ ప్రొఫైల్స్ ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఫిచ్ రేటింగ్స్ అభిప్రాయపడింది. ఓఎంసీల ఫలితాలు ఇబ్బందుల్లో పడితే వాటి క్రెడిట్ రేటింగ్ డౌన్‌గ్రేడ్ చేసే అవకాశాలు పెరుగుతాయని హెచ్చరించింది. బడ్జెట్లో పేర్కొన్న డిజి న్వెస్ట్మెంట్ అంచనాలను అందుకునేందుకు ప్రభుత్వం తంటాలు పడుతోందని తెలిపింది. ఇందుకోసం నగదునిల్వలు భారీగా ఉన్న పీఎస్‌యూలను రెండో దఫా మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని, షేర్ బైబ్యాక్ చేపట్టాలని కోరుతోందని తెలిపింది. ఈ కంపెనీలు వచ్చే రెండేళ్ల కాలానికి రూపొందించుకున్న పెట్టుబడుల ప్రణాళికలకు బైబ్యాక్‌లు, డివిడెండ్లు విఘాతం కల్పిస్తాయని తెలిపింది. ప్రస్తుతం ఓఐఎల్‌కు బీబీబీ నెగిటివ్ రేటింగ్, ఐఓసీ, బీపీసీఎల్‌కు బీబీ ప్లస్ రేటింగ్ ఉంది. క్రూడ్ ధర పెరిగినా ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా ఉంటే వీటికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 2008 రిపీట్?! ప్రస్తుత పరిస్థితులు 2008లో ముడిచమురు మార్కెట్‌ను గుర్తు చేస్తున్నాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు. అప్పట్లో ముడిచమురు ధరలు విపరీతంగా పరుగులు తీసి 150 డాలర్ల వరకు చేరాయి. అయితే ఈ పరిస్థితి ఇప్పుడు ఉండకపోవచ్చని ఎక్కువమంది అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో ఎక్కువ దేశాల్లో చమురు ధరలపై ప్రభుత్వాల నియంత్రణ ఉండేది. కానీ ఇప్పుడు చాలా దేశాలు ఓపెన్ మార్కెట్‌కు మరలాయి. ఇండియాలో చమురు ధరలపై ప్రభుత్వ పెత్తనం ఉన్నంత వరకు ఎకానమీపై తీవ్ర ఒత్తిడి ఉండేది. ధర పెరిగే కొద్దీ ప్రభుత్వం సబ్సిడీలు పెంచుతూ పోవాల్సి వచ్చేది. కానీ గత నాలుగైదేళ్లుగా చమురు ధరలు బాగా దిగివచ్చాయి. చాలా రోజులు క్రూడ్ ధర 40 డాలర్ల వద్ద కదలాడింది. ఈ సమయంలో ప్రభుత్వానికి చాలా మిగులు కలిగింది. ఇదే సమయంలో చమురు ధరలపై నియంత్రణ ఎత్తివేయడం కూడా జరిగింది. అంతర్జాతీయంగా అమెరికా షేల్ గ్యాస్ అందుబాటులోకి వచ్చింది. అందువల్ల గతంలోలాగా ముడిచమురు 150 డాలర్లకు చేరకపోవచ్చని ఎక్కువమంది భావన. -
క్రూడ్ మంట... డాలర్ల వెలుగు!
ముంబై: అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, దేశీయంగా అమెరికా డాలర్లకు పెరిగిన డిమాండ్.. ఈ రెండూ రూపాయిని బలహీనపరచాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 24 పైసలు బలహీనపడి డాలర్‌తో పోలిస్తే 69.86 వద్ద ముగిసింది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు భారీ డిమాండ్ ఏర్పడటంతో ఒక దశలో రూపాయి నాలుగు నెలల కనిష్టస్థాయి 69.97ను కూడా చూసింది. అమెరికాలో గృహ కొనుగోళ్లు బాగున్నాయన్న గణాంకాలు ఆ దేశ మాంద్యం భయాలను తగ్గించాయి. దీనితో ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 97పైన పటిష్టంగా కొనసాగుతోంది. నిజానికి డాలర్ బలోపేతం, క్రూడ్ ధరల పెరుగుదల వంటి అంశాల నేపథ్యంలో రూపాయి ఇంకొంత బలహీనపడాల్సి ఉంది. కానీ దేశంలోకి భారీగా వస్తున్న విదేశీ పెట్టుబడులు, ఈక్విటీల పటిష్ఠ ధోరణి రూపాయిని భారీగా నష్టపోకుండా చూస్తున్నాయి. రూపాయి సమీపంలో 70–68 శ్రేణిలో స్థిరీకరణ పొందవచ్చనేది విశ్లేషణ. 74.39 కనిష్టం నుంచి..: అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని రెండున్నర నెలల క్రితం 69.43 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి దాదాపు 20 డాలర్లకుపైగా పెరగడంతో అటు తర్వాత రూపాయి జారుడుబల్ల మీదకు ఎక్కింది. నాలుగు నెలల క్రితం 72–70 మధ్య కదలాడింది. అయితే కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టేది మోదీనేనన్న అంచనాలు, స్థిరంగా దేశంలోకి వస్తున్న విదేశీ నిధులు, ఈ నేపథ్యంలో ఎన్నికల ముందస్తు ఈక్విటీల ర్యాలీ రూపాయికి గత రెండు నెలలుగా సానుకూలమవుతోంది. -
ఇరాన్ చమురుకు చెల్లు!
న్యూఢిల్లీ: ఇరాన్ నుంచి చమురు దిగుమతులను మన దేశం నిలిపివేయనుంది. ఇరాన్‌పై గతేడాది ఆంక్షలు విధించిన అమెరికా భారత్, చైనా సహా కొన్ని దేశాలకు మాత్రం దిగుమతులకు మినహాయింపు కల్పించింది. అయితే, త్వరలోనే ఈ మినహాయింపులను రద్దు చేయాలని అమెరికా తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో మన దేశం ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నట్టు, ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి, పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘‘ఇరాన్ నుంచి చమురు దిగుమతిని నిలిపివేయనున్నాం. మినహాయింపులను తిరిగి పునరుద్ధరించనంత వరకు ఇరాన్ నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటుందని నేను భావించడం లేదు’’ అని ఆ సీనియర్ అధికారి తెలిపారు. అయితే, మే 2తో మినహాయింపులు ముగిసిపోనుండడంతో, వీటిని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం అమెరికా సర్కారును కోరనుందని, ఈ నెలాఖరులో దీనిపై చర్చలు జరగనున్నట్టు ఆ అధికారి పేర్కొన్నారు. అయితే, అంచనాల ఆధా రంగా కొనుగోళ్లు చేయలేమని, కనుక ఇరాన్ నుంచి చమురు దిగుమతి ఆ లోపు ఉండదన్నారు. ఇరాన్ నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా తర్వాత రెండో అతిపెద్ద దేశం భారత్. 2018– 19లో 24 మిలియన్ టన్నుల క్రూడ్‌ను దిగుమతి చేసుకుంది. ఇరాన్ దిగుమతులకు ప్రత్యామ్నా యంగా సౌదీ అరేబియా, కువైట్, యూఏఈ, మెక్సి కోల నుంచి సరఫరాకు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి అమెరికా నిర్ణయంతో ఏర్పడింది. సరఫరాకు తగిన ప్రణాళిక భారత రిఫైనరీలకు తగినంత చమురు సరఫరాకు వీలుగా ప్రణాళిక ఉందంటూ పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ట్వీట్ చేశారు. ‘‘ఇతర చమురు ఉత్పత్తి దేశాల నుంచి అదనపు సరఫరా చేసుకోనున్నాం. దేశీయంగా పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా చేసేందుకు రిఫైనరీలు సిద్ధంగా ఉన్నాయి’’ అని ధర్మేంద్ర ప్రదాన్ స్పష్టం చేశారు. మినహాయింపులు ముగిసిన తర్వాత చమురు సరఫరాకు ప్రణాళిక సిద్ధంగా ఉందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ సైతం ప్రకటన విడుదల చేసింది. ఏదైనా కొరత ఏర్పడితే ప్రత్యామ్నాయ వనరుల ద్వారా సమకూర్చుకోనున్నట్టు ఐవోసీ చైర్మన్ సంజీవ్‌సింగ్ సైతం తెలిపారు. -
ఇరాన్ చమురుపై భారత్‌కు షాక్
వాషింగ్టన్: ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనాతో పాటు అయిదు దేశాలకు అమెరికా షాకివ్వనుంది. ఇప్పటిదాకా దిగుమతి ఆంక్షల నుంచి ఇస్తున్న మినహాయింపులను ఎత్తివేయాలని నిర్ణయించింది. మీడియా కథనాల ప్రకారం.. ఇరాన్ నుంచి దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని, లేకపోతే ఆంక్షలు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆయా దేశాలను హెచ్చరించనుంది. అణ్వస్త్రాల తయారీ చేయొద్దన్న తమ మాటను బేఖాతరు చేసిన ఇరాన్‌పై మరింత ఒత్తిడి తెచ్చేందుకే అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణ మంత్రి మైక్ పాంపియో దీనిపై ప్రకటన చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఇరాన్ నుంచి ముడిచమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలకు మే 2 నుంచి ఎలాంటి మినహాయింపులు వర్తింపచేసేది లేదంటూ ఆయన ప్రకటించనున్నారని ఇద్దరు ప్రభుత్వాధికారులను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక పేర్కొంది. ఇరాక్, సౌదీ అరేబియా తర్వాత ఇరాన్ నుంచే భారత్ అత్యధికంగా చమురు దిగుమతి చేసుకుంటోంది. 2017 ఏప్రిల్ – 2018 జనవరి మధ్య కాలంలో భారత్‌కు ఇరాన్ 18.4 మిలియన్ టన్నుల ముడిచమురు ఎగుమతి చేసింది. ఒకవేళ మినహాయింపులను ఎత్తివేసిన పక్షంలో ముడిచమురు దిగుమతుల్లో లోటును తక్కువ వ్యయాలతో భర్తీ చేసుకునేందుకు భారత్ ఇతరత్రా మార్గాలను అన్వేషించాల్సి రానుంది. ద్వైపాక్షిక సంబంధాలకు దెబ్బ.. అణ్వస్త్రాల తయారీ ఆపేయాలన్న ఆదేశాలను ఉల్లంఘించిన ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోరాదంటూ అమెరికా ఆంక్షలు విధించడం తెలిసిందే. అయితే, భారత్, చైనా, జపాన్ వంటి 8 దేశాలకు తాత్కాలికంగా 180 రోజుల పాటు మినహాయింపునిచ్చింది. ఇరాన్ నుంచి చమురు దిగుమతులను గణనీయంగా తగ్గించుకున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి కొంత కొనుగోళ్లు జరపడం కొనసాగించేందుకు అనుమతిస్తోంది. తాజాగా ఈ మినహాయింపులను మొత్తం తొలగించి, దిగుమతులను పూర్తిగా నిలిపివేయించడం ద్వారా ఇరాన్‌పై ఒత్తిడి మరింత పెంచాలన్నది అమెరికా వ్యూహం. ఇరాన్ చమురును అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నది భారత్, చైనాలే. ఒకవేళ ఈ దేశాలు గానీ అగ్రరాజ్యం డిమాండ్లను పక్కనపెడితే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో పాటు వాణిజ్యం వంటి ఇతరత్రా అంశాలపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. -
హెల్త్ – బ్యూటిప్స్
►మందారపూలను బాగా ఎండబెట్టి వాటిని కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించాలి. ఆ నూనెను ప్రతిరోజు తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాదు మందార పువ్వుల్ని నానబెట్టి, మెత్తగా పేస్ట్‌లా చేసి జుట్టుకు పట్టించి తల స్నానం చేస్తే జుట్టు పట్టులా మెరిసిపోతుంది. ►మందార ఆకుతో చేసిన టీని తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. మందార ఆకు టీ సేవించటం వలన రోగనిరోధక శక్తి పెరిగి తద్వారా జలుబు, దగ్గు తగ్గటానికి సహాయపడుతుంది. మందార ఆకు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ►జామ పువ్వులను మెత్తగా నూరి కళ్లపై ఉంచితే కళ్లు తేటగా తయారవుతాయి. కళ్ల కలక, కళ్లు నీరు కారడం, కళ్లు ఎర్రబడటం వంటి సమస్యలకు అద్భుత ఫలితం కనిపిస్తుంది. ►ఆయాసం ఉన్నవారు రెండు చిటికెల పసుపు, ఒక చిటికెడు మెత్తటి ఉప్పు రోజూ తీసుకోవడం మంచిది. వేడి టీలో తొమ్మిది చుక్కల నిమ్మరసం, అర చెంచా తేనె కలిపి వేడివేడిగా తాగడం చాలా మంచిది. ►గోధువు పిండిలో తాజా మీగడను కలుపుకుని ఆ మిశ్రవూన్ని వుుఖం, మెడ, చేతులకు పట్టించుకోవాలి. నలుగు పెట్టుకున్నట్టుగా చేతితో మిశ్రవూన్ని తొలగించాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. దీనిలో గంధం పొడి ఉపయోగిస్తే ఇంకా వుంచి ఫలితం ఉంటుంది. ►వెడల్పాటి పాత్రలో అర లీటరు శుభ్రమైన నీటిని తీసుకుని దానిలో ఒక స్పూను రాళ్ళ ఉప్పును కలుపుకోవాలి. ఆ నీటిలోకి వుుఖంపెట్టి కళ్ళు వుూస్తూ, తెరుస్తూ చేయాలి. దీనివల్ల మీ అలసిన కళ్ళు ఫ్రెష్ అవతాయి. ►వేప ఆకులు నీటిలో వురిగించుకుని ఆ నీటితో వుుఖాన్ని, చేతులను కడుగుతుండటం వల్ల చికెన్‌పాక్స్ వల్ల ఏర్పడ్డ వుచ్చలు తొలగిపోతాయి. బియ్యంపిండిలో మీగడ కలిపి ఆ పేస్ట్‌ని వుుఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మృదువు అయ్యి కాంతులీనుతుంది. -
తక్కువ అన్వేషణలుంటే లాభాలు పంచుకోనక్కర్లేదు
న్యూఢిల్లీ: దేశీయంగా గ్యాస్, చమురు ఉత్పత్తి పెంపు దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ నిల్వలున్న క్షేత్రాల నుంచి చేసే ఉత్పత్తిలో ఎటువంటి లాభాలను ప్రభుత్వంతో పంచుకోవక్కర్లేదు. ఈ దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. తద్వారా ఈ విభాగంలోకి మరిన్ని ప్రైవేటు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించొచ్చని భావిస్తోంది. రెండున్నర దశాబ్దాలుగా అన్ని రకాల అవక్షేపాల బేసిన్లకు ఒకే విధమైన కాంట్రాక్టు విధానాన్ని అనుసరిస్తుండగా, దానికి ప్రభుత్వం చమరగీతం పాడింది. దీంతో నూతన విధానంలో ఇప్పటికే వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి జరుగుతున్న క్షేత్రాలకు, ఉత్పత్తి ఆరంభించాల్సిన వాటికి భిన్నమైన నిబంధనలు వర్తిస్తాయి. కేటగిరీ–1 పరిధిలో ఇప్పటికే ఉత్పత్తి జరుగుతున్న కృష్ణా గోదావరి, ముంబై ఆఫ్‌షోర్, రాజస్థాన్, అసోం క్షేత్రాల నుంచి జరిగే ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయంలో ప్రభుత్వంతో వాటాను పంచుకోవాల్సి ఉంటుంది. నేలపై, సముద్రంలో తక్కువ లోతులోని బ్లాకుల నుంచి నాలుగేళ్లలోపే ఉత్పత్తిని ఆరంభించినట్టయితే, సముద్రంలో మరింత లోతుల్లో ఉన్న బ్లాకుల నుంచి ఉత్పత్తిని కాంట్రాక్టు కుదిరిన నాటి నుంచి ఐదేళ్ల లోపు ప్రారంభిస్తే రాయితీ రేట్లు అమలవుతాయని ప్రభుత్వ నోటిఫికేషన్ పేర్కొంది. భవిష్యత్తు బిడ్డింగ్ నుంచి ఏ బేసిన్లు అన్న దానితో సంబంధం లేకుండా ఉత్పత్తి దారులకు పూర్తి మార్కెటింగ్, ధరల స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది. -
ఇతని ఆహారం..ఇంజిన్ ఆయిల్, టీ
కర్ణాటక ,తుమకూరు: ఎవరైనా ఆకలైతే భోజనం చేస్తారు. ఇతడు మాత్రం ఇంజిన్ ఆయిల్, టీ తాగి క్షుద్బాధను చల్లార్చుకుంటాడు. 30 ఏళ్లుగా ఇదే అతని దినచర్య. ఆహారంగా అన్నం, నీళ్లకు బదులు ఇంజన్ ఆయిల్, టీ తాగుతున్న వ్యక్తిని చూసి జిల్లాలోని మధుగిరి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. బెంగళూరులోని మహాలక్ష్మీ లేఅవుట్ అయ్యప్పస్వామి దేవాలయంలో ఉంటున్న కుమార్ అనే వ్యక్తి బుధవారం మధుగిరికి వచ్చాడు. బస్టాండ్‌లో ఒంటరిగా తిరుగుతున్న కుమార్‌ను గమనించిన ఆటోడ్రైవర్లు,స్థానికులు ఆహారం అందించగా తనకు అన్నం,నీళ్లు వద్దని తాగడానికి ఇంజన్ ఆయిల్, టీ కావాలని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. చిన్నప్పటి నుంచి ఇంజన్ ఆయిల్, టీ మాత్రమే తాగుతున్నానని ఒకసారి అన్నం, నీళ్లు తీసుకున్నపుడు రక్తపు వాంతులు అయినట్లు తెలిపాడు. -
చుండ్రు సమస్య తగ్గేదెలా?
నా వయసు 24 ఏళ్లు. నాకు చుండ్రు ఎక్కువగా వస్తోంది. అమ్మాయిని కావడంతో తలలో చేయిపెట్టి గీరుకోవడం చాలా ఎంబరాసింగ్‌గా అనిపిస్తోంది. దయచేసి నా సమస్య తీరడానికి ఏమైనా మార్గాలుంటే చెప్పండి. – సుప్రియ, విశాఖపట్నం నిజమే. అమ్మాయిలకు చుండ్రు ఉన్నప్పుడు వాళ్ల సెల్ఫ్–ఎస్టీమ్ కాస్తంత దెబ్బతిని, కొంత కుంగిపోతుంటారు. అయితే కొన్ని సాధారణ చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. అవి... ►చుండ్రు ఉన్నవారు తలకు జిడ్డుగా ఉండే నూనెలు రాయకపోవడమే మంచిది. కొందరిలో నూనె రాయకపోతే తలనొప్పి వంటివి వస్తాయనే ఫీలింగ్ ఉంటుంది. అలాంటి వారు తలకు నూనె రాయాల్సి వస్తే, కొద్దిసేపటి తర్వాత తప్పనిసరిగా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ నూనె రాసేటప్పుడు కూడా సువాసన నూనెలు కాకుండా శుభ్రమైన కొబ్బరినూనెకే పరిమితం కావడం మంచిది. ►మీరు తల స్నానం చేసేటప్పుడు మాడు అంతా పూర్తిగా శుభ్రపడేలా రుద్దుకుంటూ స్నానం చేయండి. మీకు సరిపడే మంచి షాంపూతో కనీసం వారంలో రెండుసార్లయినా తలస్నానం చేస్తుండాలి. ఇలా రోజు విడిచి రోజూ తలస్నానం చేయాల్సి వచ్చినప్పుడు మైల్డ్ షాంపూలు మాత్రమే ఉపయోగించాలి. ఓటీసీ యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడటమూ మంచి ప్రయోజనాలిస్తుంది. ►ఓటీసీ యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడాక కూడా చుండ్రు తగ్గకపోతే డర్మటాలజిస్ట్‌ను సంప్రదించి వారి సూచన మేరకు... యాంటీ ఫంగల్ ఏజెంట్స్, తార్ కాంపౌండ్స్ వంటివి ఉన్న మెడికేటెడ్ షాంపూలు వాడవచ్చు. అయితే గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... ఈ తరహా షాంపూలు ఉపయోగించేటప్పుడు వీటిని నీళ్లలో పలుచబార్చకూడదు. ఒకసారి తలకు పట్టించాక కనీసం 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి. అప్పుడే అవి తమ ప్రభావం చూపగలవు. ఐదు నిమిషాల తర్వాత వాటిని శుభ్రంగా కడిగేయాలి. జుట్టురాలుతున్నా లేదా దురద ఎక్కువగా ఉన్నా ఒక్కోసారి స్టెరాయిడ్ బేస్డ్ లోషన్లు కూడా డాక్టర్లు సూచిస్తారు. అయితే వీటిని డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడాలి. ►చుండ్రుతో పాటు మొటిమలు కూడా ఉంటే... హార్మోన్లలో ఏవైనా మార్పులు వచ్చాయా అనే పరీక్షలు చేయించాలి. ఆ వచ్చే ఫలితాలను బట్టే తర్వాతి చికిత్స కొనసాగాలి. ►జుట్టు పొడవుగా ఉండే మహిళలు తలస్నానం చేశాక వెంటనే దాన్ని ముడుచుకోవడం తగదు. ఎందుకంటే అలాంటి సమయంలో జుట్టులో తేమ చాలాసేపు ఉండి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే వాతావరణానికి అనువుగా ఉంటుంది. పైగా జుట్టు తొందరగా చిక్కులు పడుతుంది. అందుకే జుట్టును ఆరేందుకు ఫ్రీగా వదిలేయాలి. పూర్తిగా తడి ఆరకముందే దువ్వడం సరికాదు. దాదాపు పొడిబారిపోయే సమయంలో దువ్వడం మంచిది. ►విటమిన్–ఏ, జింక్ పాళ్లు ఎక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. ►చుండ్రు ఒక దీర్ఘకాలిక సమస్య. కేవలం కొద్దిరోజులు షాంపూ వంటివి వాడాక తగ్గిపోవడం అన్నది సాధారణంగా జరగదు. కాబట్టి సమస్య ఉన్నంతకాలం యాంటీ డాండ్రఫ్ షాంపూలు వాడుతుండటమే మంచిది. లేదా చుండ్రు మళ్లీ తిరగబెట్టినప్పుడు యాంటీడాండ్రఫ్ షాంపూల వాడకం మళ్లీ మొదలుపెట్టాలి. అవి చాలావరకు సురక్షితమే. అయితే దీర్ఘకాలం పాటు వాడుతున్నప్పుడు కొందరిలో అవి తలను పొడిబారేలా చేయవచ్చు. అలాంటప్పుడు కండిషనర్స్ కూడా వాడటం మంచిది. కొన్ని షాంపూల వల్ల జుట్టు రాలుతున్నట్లు గమనిస్తే వెంటనే షాంపూను మార్చి తమకు సరిపడేది వాడాలి. ఇక్కడ పేర్కొన్న జాగ్రత్తలతో చుండ్రును చాలావరకు తేలిగ్గానే అరికట్టవచ్చు. డాక్టర్ స్వప్నప్రియ, డర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ షాంపూఎంపిక ఎలా? నా వయసు 22 ఏళ్లు. చాలాకాలంగా షాంపూలు వాడుతున్నా దేనితోనూ సంతృప్తిపడలేకపోతున్నాను. మార్కెట్లో రకరకాల షాంపూలు అందుబాటులో ఉండటంతో పాటు, టీవీల్లో కనిపించే యాడ్స్‌తో ఇంకా అయోమయంలో పడిపోతున్నాను. నాలాంటి ఎంతోమంది అమ్మాయిలకు అది ఉపయుక్తంగా ఉంటుందనిపించేలా మంచి షాంపూను ఎంపికకు ఏమైనా సూచనలివ్వండి. ప్లీజ్! – ఎమ్ లక్ష్మీ సుశ్మిత కొందరివి పలుచటి వెంట్రుకలు, కొందరివి బిరుసుగా ఉంటాయి.. ఇలా సాధారణంగా అందరి వెంట్రుకలూ ఒక్కలా ఉండవు. కాబట్టి అందరి షాంపూ అవసరాలూ ఒకేలా ఉండవని మనం గుర్తుంచుకోడాలి. ఇక మన అవసరాలను బట్టి మార్కెట్లోకి రకరకాల షాంపూలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటప్పుడు కొంత అయోమయానికి గురికావడం సహజమే. అయితే మన అవసరాలను బట్టి మనం ఎలాంటి షాంపూలను ఎంచుకోవచ్చో తెలుసుకునేందుకు ఈ కింది సూచనలు పాటించడం చాలావరకు మేలు చేస్తుంది. అందరూ వాడదగ్గవి : ఇందులో శుభ్రపరిచే సామర్థ్యం (క్లెన్సింగ్ ఎబిలిటీ) నార్మల్‌గా ఉంటుంది. నార్మల్ హెయిర్ కోసం వాడాల్సిన ఈ షాంపూలు సాధారణంగా లారిల్ సల్ఫేట్ అనే నురగవచ్చే పదార్థంతో తయారవుతాయి. ఇందులో ఆ రసాయనంతో పాటు వినియోగదారులను ఆకర్షించేందుకు ఉత్పత్తిదారులు రకరకాల సుగంధ ద్రవ్యాలను చేర్చి వాటిని మంచి సువాసన వచ్చేలా రూపొందిస్తారు. ఇవి ఎవరైనా వాడవచ్చు. కాబట్టి మార్కెట్లో ఉన్న రకరకాల బ్రాండ్స్‌ను వాడుతూ... ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో... మీకు ఏది అనువైనదో, సౌకర్యమో అది వాడుకోవచ్చు. మీరు ఎంచుకున్న ఛాయిస్ షాంపూను మీ సంతృప్తి మేరకు కొనసాగించవచ్చు. జుట్టులో మంచి సువాసనతో పాటు, ఆహ్లాదకరమైన ఫీలింగ్ కోరుకునే వారు ఇలాంటివి వాడుకోవచ్చు. అయితే షాంపూ ఏదైనప్పటిక అది మైల్డ్‌గా ఉండటం అన్నది జుట్టు విషయంలో దాదాపుగా అందరికీ ఆరోగ్యాన్నిచ్చేందుకు డాక్టర్లు ఇచ్చే ఒక మంచి సూచన. పొడి వెంట్రుకలు ఉండేవారికి : వెంట్రుకలు చాలా పొడిబారినట్లుగా ఉంటాయి. ఇలాంటి వారికోసం తయారయ్యే షాంపూల్లో రోమాన్ని శుభ్రపరిచే రసాయనాలు మరీ తీవ్రంగా లేకుండా చూస్తారు. అంటే మైల్డ్ క్లెనింగ్ ఏజెంట్స్‌ను ఉపయోగించి చేస్తారు. దాంతో పాటు వెంట్రుక కండిషనింగ్ కోసం అందులో సిలికోన్ వంటి ఏజెంట్స్, కెటాయినిక్ పాలిమర్స్‌ను కలుపుతారు. వాటిని ఉపయోగించాక ఆ సిలికోన్ పొడి వెంట్రుకల మీద సమంగా విస్తరించి ఒక కోటింగ్‌లా ఏర్పడుతుంది. కాబట్టి పొడి వెంట్రుకలు ఉన్నవారికి సిలికోన్, కెటాయినిక్ పాలిమర్స్ ఇంటి ఇన్‌గ్రేడియెంట్స్ ఉన్నవి మంచి షాంపూలుగా పరిగణించవచ్చు. మీరు పొడి వెంట్రుకలు కలవారేతే... పైన పేర్కొన్న ఇన్‌గ్రేడియెంట్స్ షాంపూలో ఉన్నాయో లేవో చూసి, అలాంటి వాటినే ఎంపిక చేసుకోవచ్చు. జిడ్డు వెంట్రుకలు ఉన్నవారికి : తలలోని చర్మరంధ్రాల నుంచి సీబమ్ అనే స్రావం ఎక్కువగా వచ్చిన వారి వెంట్రుకలు సాధారణంగా జిడ్డుగా ఉంటుంటాయి. ఇలాంటి జిడ్డు వెంట్రుకలు ఉన్నవారికి అవసరమైన షాంపూలను మాడుపైన, వెంట్రుకపైన ఉన్న అదనపు సీబమ్‌ను తొలగించేలా రూపొందిస్తారు. ఇందులో క్లెన్సింగ్ ఏజెంట్‌గా లారిల్ సల్ఫేట్‌తో పాటు అదనపు నూనెవంటి స్రావాలను తొలగించడానికి ఉపయోగపడే ‘సల్ఫోసక్సినేట్’ వంటి రసాయనాలతో వీటిని తయారు చేస్తారు. అయితే జిడ్డుజుట్టు ఉన్నవారికి రూపొందించే షాంపూలలో కండిషనింగ్ తక్కువగా ఉండేలా చూస్తారు. కాబట్టి పైన పేర్కొన్న కాంబినేషన్స్ ఉన్నవి జిడ్డు కురుల వారు ఉపయోగించవచ్చు. అయితే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తే కురులు మరీ జీవం లేనట్టుగా మారిపోతాయి. అప్పుడది పీచులా కనిపించే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఎన్నిసార్లు తలస్నానం చేస్తే, అలా కనిపిస్తుందో ఎవరికివారు పరీక్షించి చూసుకొని, వారంలో అంతకంటే తక్కువసార్లు తలస్నానం చేయడం మంచిది. వారంలో తలస్నానం ఎన్నిసార్లు? జుట్టు రాలకుండా ఆరోగ్యంగా ఉండాలంటే, వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయవచ్చు. – ఆర్. రమణి, గుంటూరు సాధారణంగా వారానికి ఇన్నిసార్లే తలస్నానం చేయాలంటూ నిర్దిష్టంగా లెక్కేమీ ఉండదు. కొందరికి రోజూ తలస్నానం చేస్తే తప్ప స్నానం చేసినట్టు ఉండదు. ఇలాంటివారికి తమ వ్యక్తిగత సంతృప్తే ప్రధానం కాబట్టి... తమ తమ వ్యక్తిగత అభిరుచి మేర తలస్నానం చేయవచ్చు. అయితే సాధారణంగా వారంలో రెండు సార్లు, మరీ తలలో దురద ఎక్కువగా వచ్చేవారు రోజు విడిచి రోజు... (అది కూడా మైల్డ్ షాంపూతో మాత్రమే) తలస్నానం చేస్తే మంచిది. -
చర్మంపై ముడతలు పోవాలంటే..
►చర్మం వదులైతే ముడతలు పడు తుంది. చిన్న చిన్న చిట్కాలతో చర్మం బిగుతుగా ఉండేలా చూసుకోవచ్చు. ►ఆరు స్పూన్లు ఆలివ్ ఆయిల్ తీసుకుని కొద్దిగా వేడి చేసి అందులో చిటికెడు ఉప్పు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కంటి చుట్టూ భాగం వదిలేసి ముఖానికి అప్లై చేయాలి. 10–15 నిమిషాలపాటు చేతి వేళ్ళతో మృదువుగా మర్దన చేసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. -
ఐవోసీకి నిల్వల సెగ..
న్యూఢిల్లీ: చమురు రేట్లు క్షీణించడం, అధిక ధరలకు ఖరీదు చేసిన ఇంధన నిల్వల విలువ పడిపోవడం తదితర కారణాలు ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) ఆర్థిక పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సంస్థ లాభం ఏకంగా 91 శాతం క్షీణించి రూ. 717 కోట్లకు పడిపోయింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ. 7,883 కోట్లు. మరోవైపు టర్నోవరు రూ. 1.32 లక్షల కోట్ల నుంచి రూ. 1.6 లక్షల కోట్లకు చేరింది. నాలుగేళ్ల గరిష్ట స్థాయి నుంచి చమురు ధరలు క్షీణించడంతో.. అప్పటికే నిల్వ చేసి పెట్టుకున్న ఇంధన విలువ గణనీయంగా పడిపోయిందని, ఇది ఆర్థిక ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపిందని ఐవోసీ పేర్కొంది. ఇక దేశీయంగా ఇంధన అమ్మకాలు 3 శాతం పెరిగి 21.5 మిలియన్ టన్నులకు చేరాయని వివరించింది. బుధవారం బీఎస్ఈలో ఐవోసీ షేరు 2 శాతం క్షీణించి రూ. 134.65 వద్ద క్లోజయ్యింది. -
‘పల్లీ నూనె’తో పల్టీ కొట్టించాడు
నాగోలు: పల్లీనూనె వ్యాపారం పేరుతో వందలాది మందిని పల్టీ కొట్టించి రూ.100 కోట్లు వసూలు చేసిన కేసులో ప్రధాన నిందితుడు గ్రీన్‌గోల్డ్ బయోటెక్ కంపెనీ ఎండీ జిన్నా కాంతయ్యతో పాటు మరో ఇద్దరిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్ కేంద్రంగా అక్రమాలకు పాల్పడిన వీరి నుంచి రూ.5 కోట్ల విలువైన స్థిర,చరాస్తులతో పాటు రూ.21.20లక్షల నగదు, 20లీటర్ల పల్లీనూనె, 20లీటర్ల ఖాళీ క్యాన్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఎల్బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. ఆదినుంచి మోసాలే.. నిజామాబాద్ జిల్లా, సంకేట్ గ్రామానికి చెందిన జిన్న కాంతయ్య అలియాస్ జిన్న శ్రీకాంత్‌రెడ్డి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలం పాటు ముంబైలోని లెదర్ కర్మాగారంలో పనిచేసిన ఇతను 1991లో హైదరాబాద్‌కు వచ్చి సొంత వ్యాపారం మొదలు పెట్టాడు. 1995 కోల్‌కతాకు చెందిన మిట బిశ్వాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. సిగ్మా గ్రాఫిక్ అండ్ స్క్రీన్ ప్రింటింగ్ షాప్ నిర్వహించిన అతను ఆ తర్వాత నిజామాబాద్‌లో స్టాపర్స్ వరల్డ్ పేరుతో అగరుబత్తీలు తయారుచేసి విక్రయించేవాడు. నిరుద్యోగ యువతకు అగరుబత్తీల తయారీలో శిక్షణ ఇస్తానని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి రూ.75వేల చొప్పున వసూలు చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చిన అతను మహాలైఫ్ ఆన్లైన్ మార్కింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 2005లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. అదే సమయంలో తన కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్‌గా చేరిన అహల్యారెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఉప్పల్‌లోని ఫిర్జాదిగూడలో అహల్యారెడ్డి, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. కర్నూలులో 350 ఎకరాలకొనుగోలుకు యత్నం.. ప్రజల నుంచి వసూలు చేసిన సుమారు రూ.150కోట్లతో కర్నూలులో 350 ఎకరాల స్థలం కొనుగోలు చేసేందుకు జిన్నా కాంతయ్య ప్రణాళిక రూపొందించాడు. మార్చి 15 వరకు గోదాం లీజ్ అగ్రిమెంట్ పూర్తి కానుండడంతో కర్నూలులో రియల్ దందాకు సిద్ధమయ్యాడు. ఇతడిపై ఇప్పటికే హైదరాబాద్‌లో ఐదు కేసులు, వరంగల్ అర్బన్‌లో ఒక కేసు, కడపలో రెండు కేసులు నమోదైనట్లు సీపీ తెలిపారు. సమావేశంలో జాయింట్ సీపీ సుధీర్‌బాబు, మల్కాజ్గిరి డీసీపీ ఉమామహేశ్వర్రావు, ఉప్పల్ ఏసీపీ సందీప్, ఉప్పల్ సీఐ వెంకటేశ్వర్లు, డీఐ రవిబాబు, ఎస్ఐ ఆంజనేయలు పాల్గొన్నారు. ఆకట్టుకునేలా పథకాలు.. జిన్న కాంతయ్య సోదరుడు వెంకటేశ్వర్‌రెడ్డి 2014లో సికింద్రాబాద్‌లో గ్రీన్‌గోల్డ్ బయోటెక్ కంపెనీ పేరుతో కార్యాలయం ప్రారంభించాడు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో 2017 వరకు అతను దానిని పట్టించుకోలేదు. 2017 డిసెంబర్లో కంపెనీ బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్ 2018 జూలైలో కార్యాలయాన్ని ఉప్పల్‌కు మార్చి గోడౌన్‌ను ఏర్పాటు చేశాడు. రెండో భార్య అలేఖ్యారెడ్డి, బావమరిది అనిల్‌రెడ్డి, మేనేజర్ భాస్కర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రియ సహకారంతో మల్టీలెవల్ మోసాలకు తెరలేపాడు. సూరత్ నుంచి రూ.20వేలకు కొనుగోలు చేసి తెప్పించిన పల్లీనూనె యంత్రాలతో రూ.లక్షల్లో ఆదాయం వస్తుందంటూ ప్రచారానికి తెరలేపాడు. ఇంట్లోనే ఉంటూ నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు సంపాదించుకోవచ్చునని ప్రచారం చేశాడు. ఇందులో భాగంగా రూ.లక్షతో పల్లీనూనె యంత్రాన్ని కొనుగోలు చేస్తే 40 కిలోల పల్లీనూనె, 200 కిలోల పల్లీలు ఇస్తామని చెప్పాడు. పల్లీలను నూనెగా మార్చి ఇస్తే నెలకు రూ.10 వేలతో పాటు రూ.5 వేల అలవెన్స్ 24 నెలల పాటు ఇస్తానంటూ మభ్యపెట్టాడు. రూ.రెండు లక్షల మెషిన్ కొనుగోలు చేస్తే 80 కిలోల నూనె, 400 కిలోల పల్లీలు ఇస్తామని, ఆ పల్లీలను నూనెగా మార్చి ఇస్తే నెలకు రూ.20వేలతో పాటు అలవెన్స్ కింద రూ.పది వేలు రెండేళ్ల పాటు చెల్లిస్తామని చెప్పాడు. అగ్రిమెంట్ సమయంలో ప్రజలను నమ్మించేందుకు పిన్ నంబర్లు కూడా కేటాయించేవాడు. తొలుత చేరిన వ్యక్తి మరో ఇద్దరిని చేర్పిస్తే కమీషన్ ఇస్తామని ఆశచూపాడు. ఇదే తరహాలో ఏజెంట్లను నియమించుకుని తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో రూ.లక్ష స్కీంలో 1385 మందిని, రూ.2లక్షల స్కీంలో 144మందిని, ఐదు లక్షల స్కీంలో 19 మంది, పదిలక్షల స్కీంలో నలుగురిని చేర్పించాడు. ఆయా స్కీంలలో చేరిన వారికి డబ్బులు ఇవ్వకుండా పల్లీలు, మిషన్లు, అందజేశాడు. తన కంపెనీలో ఉద్యోగులను కూడా ఒక నెలపాటు పనిచేయించుకొని తొలగించేవాడు. దీనిపై సమాచారం అందడంతో సీపీ సూచనమేరకు ఈ బాగోతంపై దృష్టి సారించిన ఉప్పల్ పోలీసులు గుట్టురట్టు చేశారు. ప్రధాన సూత్రధారి జిన్నా కాంతయ్యతో పాటు కంపెనీ మేనేజర్ భాస్కర్ యాదవ్, లంకప్రియను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుతో సంబంధమున్న వెంకటేశ్వర్‌రెడ్డి, అలేఖ్యారెడ్డి, అనిల్‌రెడ్డి, అంజయ్యగౌడ్‌లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. -
గొలుసు కట్టు.. గుట్టు రట్టు!
హైదరాబాద్: వేరుశనగ గింజల నుంచి నూనె తీసే యంత్రాలు ఇస్తామని నమ్మించారు.. ఏజెంట్ల ద్వారా భారీ ప్రచారం చేశారు.. యంత్రం కొనుగోలు చేసిన వారికి నెలకు రూ.20 వేలు ఇస్తామని నమ్మబలికారు. వేలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు.. చివరికి వారందరినీ మోసం చేసి బోర్డు తిప్పేయాలని పన్నాగం పన్నారు. చివరికి పోలీసులు ఈ మోసగాళ్ల గుట్టు విప్పారు. ఇదీ మోసం.. నిజామాబాద్ జిల్లాకు చెందిన జిన్నా శ్రీకాంత్, భాస్కర్ అనే మరో వ్యక్తితో కలసి హైదరాబాద్ ఉప్పల్‌లో గ్రీన్‌గోల్డ్ బయోటెక్ పేరిట గతేడాది ఓ కంపెనీ ప్రారంభించారు. రూ.లక్ష చెల్లిస్తే వేరు శనగ గింజల నుంచి నూనె తీసే యంత్రం ఇస్తామని చెప్పేవారు. ప్రతి నెలా రూ.20 వేలు ఇస్తామని ఏజెంట్ల ద్వారా చాలా మందిని నమ్మించారు. ఏజెంట్లకు కూడా భారీ నజరానాలు ఇస్తామని ఆశ చూపెట్టారు. ఇలా కొద్ది కాలంలోనే అక్కడి ప్రజలకు నమ్మకంగా ఉంటూ కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ మోసంపై ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ గుట్టు వెలుగులోకి వచ్చింది. బుధవారం రంగంలోకి దిగిన పోలీసులు ఉప్పల్‌లో ఉన్న సంస్థ కార్యాలయంపై దాడి చేసి నిర్వాహకులతో పాటు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. మోసం బయటపడిందిలా.. సరూర్‌నగర్‌లో నివాసం ఉండే ఎన్.ఇందిరా కిరణ్ (28) అనే వ్యక్తి వ్యాపారం చేస్తుంటాడు. ఓ రోజు వేరుశనగల నుంచి నూనె తీసే యంత్రం స్కీం గురించి స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు. నూనెతో పాటు నెలకు రూ.20 వేలు కూడా వస్తాయని నమ్మి, మరుసటి రోజే గ్రీన్‌గోల్డ్ కార్యాలయానికి వెళ్లి నిర్వాహకులను సంప్రదించాడు. ఆ ‘స్కీం’గురించి అన్ని వివరాలు చెప్పి కిరణ్‌ను శ్రీకాంత్ నమ్మించాడు. ఇచ్చిన లక్ష రూపాయల నుంచి నెలనెలా రూ.20 వేల చొప్పున ఇస్తామని అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు. అయితే నెల దాటినా కూడా డబ్బులు రాకపోవడంతో కంపెనీ యాజమాన్యాన్ని ఆశ్రయించాడు. అయినా ఫలితం లేకపోయింది. తనలాగే చాలా మందిని కంపెనీ యాజమాన్యం మోసం చేసిందని గుర్తించిన బాధితుడు కిరణ్ ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. సూత్రధారులు శ్రీకాంత్, భాస్కర్ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆశ చూపి మాయ చేశారు ఆశలు చూపి మాయ చేశారు,, హంగులు ఆర్భాటాలు చేశారు. అరచేతిలో వైకుంఠం చూపి చివరకు నట్టేట ముంచారని చిలుకానగర్‌కు చెందిన రాంరెడ్డి తన ఆవేదనను తేలిపారు. మూడు నెలల క్రితం రూ.70 వేలు కట్టించుకున్నారని మొదట్లో మూడు నెలల వరకు రూ.10 వేలు నెలకు బ్యాంకు ఖాతాల్లో వేసేవారని తరువాత కొత్త కష్టమర్లను నమ్మడానికి పాత వారిని వదిలేసి కొత్త వారికి డబ్బులు వేసి అనేక రకాలుగా నమ్మించి మోసం చేశారని తన ఆవేదనను వెల్లడించారు. –చిలుకానగర్‌కు చెందిన రాంరెడ్డి బాధితుడు -
40వేల కోట్ల పెట్టుబడులు!!
న్యూఢిల్లీ: ఓపెన్ ఏకరేజ్ లైసెన్సింగ్ విధానం (ఓఏఎల్‌పీ) కింద తలపెట్టిన రెండో విడత చమురు, గ్యాస్ బ్లాక్‌ల వేలం ద్వారా రూ. 40,000 కోట్ల పెట్టుబడులు రావొచ్చని అంచనా వేస్తున్నట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. గతేడాది నిర్వహించిన తొలి విడతలో 55 బ్లాక్‌లు వేలం వేయగా రూ. 60,000 కోట్ల మేర పెట్టుబడులకు కమిట్మెంట్ లభించినట్లు ఆయన తెలియజేశారు. రెండో విడతలో 14 బ్లాక్‌లు ఉన్నట్లు సోమవారం వేలం ప్రక్రియ ప్రారంభించిన > మంత్రి చెప్పారు. మూడో విడత కింద 12 చమురు, గ్యాస్ బ్లాక్‌లు, అయిదు కోల్ బెడ్ మీథేన్ బ్లాక్‌ల వేలం వేయనున్నామని, ఈ ప్రక్రియ ఈ నెలలోనే ప్రారంభం కాగలదని ఆయన చెప్పారు. ఓఏఎల్‌పీ–2 కింద వేలం వేసే 14 బ్లాక్‌ల విస్తీర్ణం 29,333 చ.కి.మీ. ఉంటుందని, బిడ్ల దాఖలుకు మార్చి 12 తుది గడువుగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. 12,600 మిలియన్ టన్నుల నిక్షేపాలు.. కేజీ బేసిన్లో ఒక డీప్ వాటర్ బ్లాక్‌తో పాటు అండమాన్, కచ్ బేసిన్లో చెరి రెండు, మహానది బేసిన్లో ఒక బ్లాక్ వేలం వేస్తున్న వాటిలో ఉన్నాయి. ఈ 14 బ్లాక్‌లలో దాదాపు 12,609 మిలియన్ టన్నుల చమురు, తత్సమాన గ్యాస్ నిక్షేపాలు ఉండొచ్చని అంచనా. ఓఏఎల్‌పీ –1 లో మొత్తం 55 బ్లాకులు వేలం వేయగా వేదాంత సంస్థ 41 బ్లాకులు దక్కించుకుంది. మిగతావాటిలో ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్ ఇండియా తొమ్మిది, ఓఎన్జీసీ కేవలం రెండు మాత్రమే దక్కించుకున్నాయి. ఈ 55 బ్లాక్‌ల విస్తీర్ణం 59,282 చ.కి.మీ. ఉంటుంది. ప్రస్తుతం ఉత్పత్తి, అన్వేషణ లైసెన్సు పరిధిలో లేని చిన్న స్థాయి చమురు, గ్యాస్ బ్లాక్‌లను తీసుకునేందుకు కంపెనీలు ఓఏఎల్‌పీ కింద తమ ఆసక్తిని (ఈవోఐ) వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ఈ ఈవోఐల ఆధారంగా కేంద్రం ఏటా రెండు విడతలుగా వేలం నిర్వహిస్తుంది. ఉత్పత్తయ్యే చమురు, గ్యాస్‌లో ప్రభుత్వానికి అత్యధిక వాటా ఇచ్చే సంస్థకు బ్లాక్‌లు దక్కుతాయి. విదేశీ భాగస్వాములకు ఓకే.. సంక్లిష్ట క్షేత్రాల్లో ఇంధన ఉత్పత్తి పెంపునకు ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా సంస్థలు ప్రైవేట్, విదేశీ సంస్థలను భాగస్వాములుగా చేసుకునేందుకు అనుమతించనున్నట్లు ప్రధాన్ వివరించారు. -
ఓహో జామ! అయ్యో రామ!
రామతీర్థం గ్రామంలో సింగరాజుగారి దివాణం వెనుక తోటలో అనేక రకాల చెట్లు ఉన్నాయి. ఆ తోట అంతటికీ ముఖ్య ఆకర్షణ మధ్యలోనున్న జామచెట్టు. దాని చిన్న పిందె దగ్గర నుంచి పండు దాకా మహా తీపి! అది ప్రతిసారీ విరగకాసేది. దాంతో పాటుగా ఒడ్డున ఉన్న పనస, దానిమ్మ, సీతాఫలం, బత్తాయి వంటి పండ్ల జాతులు సైతం ఏపుగా ఎదిగాయి. అయితే తోటలోని మిగతా చెట్లపై చిన్నచూపు ఉండేది జామచెట్టుకి. తనకున్న ప్రాధాన్యత మిగతా వాటికి లేదనే భావం బాగా పాతుకుపోయింది.ఒకసారి జామచెట్టు ఒడ్డునున్న చెట్లను చూసి ఫక్కున నవ్వి, ‘‘చూశారా! నా విలువ! ఇన్ని చెట్లు తోటలో ఉన్నా జనాల కన్ను నావైపే! తియ్యని నా కాయలు, పండ్లు తిని మెచ్చుకోనివారు లేరు. అంతేకాదు, రామచిలుకలకు ఆవాసంగా ఉన్నాను. అవి నాపైన వాలి పళ్లు తింటుంటే ఎంత అందంగా ఉంటుందో చూసేవాళ్లకు! మిగతా పక్షులన్నిటికీ కూడా ఆహారంగా పనికి వస్తాను. మీరూ ఉన్నారు పనికిరాకుండా’’ అని గేలి చేసింది.అది విన్న పనస చెట్టుకు కోపమొచ్చింది. ‘‘అదేంటి! ఎవరి గొప్ప వారికి ఉంటుంది. నువ్వు గప్పాలు కొట్టుకోవడం తగదు’’ అంది. ‘‘ఆ! చెప్పొచ్చావులే. నీలో ఏం గొప్ప ఉంది గనుక? ఏనుగులా పెరుగుతావు గాని, నీ కాయలు బండల్లా అంతలేసి. అయినా సరే వాటిని తినలాంటే మనుషులు నానా అవస్థలు పడాల్సిందే! నీ చర్మం ఒలిచి అందులో తొనలు బయటకు తీయడానికి తట్టెడు నూనె పూసుకోవాలి. ఎంతో శ్రమ పడితే తప్ప నీ తొనలను తినే యోగం లేదు. అదైనా పిందె నుంచి పండుదాకా అవడానికి యుగాలు పడుతుంది’’ అని ఎకసెక్కంగా అంది జామచెట్టు. ఆ మాటలు విన్న సీతాఫలం చెట్టుకి మండిపోయింది. ‘‘ఏం కూస్తున్నావో తెలుసా? నీకేం తెలుసు పనస విలువ? హద్దులు మీరితే బాగుండదు’’ అని హెచ్చరించింది. ‘‘ఓహో! నువ్వా నీతులు చెబుతున్నది? నీకు మాత్రం ఏముంది గనుక? నీ పండ్లు బయటకు గుడ్లగూబల్లా కళ్లున్నట్లు ఉంటాయి గాని పైనున్న తొక్కంతా తీసి పారేస్తే గాని గుజ్జు కనబడదు. తీరా తిందామంటే కడుపులో నల్లని కాటుకలాంటి పిక్కలు అడ్డుతుంటాయి. మరి నీ పండు తినడానికి ఎంత కష్టపడాలి?’’ అని వికటంగా నవ్వింది జామ.ఆ మాటలకు దానిమ్మకు చిర్రెత్తింది. ‘‘ఏం జామా! జోరు మీదున్నావు? నువ్వొక్కత్తెవే గొప్పదానిలా మాట్లాడుతున్నావేంటి? మిగిలిన పండ్ల జాతులు నీ దృష్టిలో పనికిరానివా?’’ అని గద్దించింది.‘‘నువ్వు కూడా సీతాఫలానికి ఏమీ తీసిపోవు! ఎందుకంటే నీ కాయలు చూడటానికి ఒకేలా ఉన్నా, ఏది తీపో, ఏది పులుపో తినేదాక తెలియని అగమ్యం. చేత్తో ఒలిచి తినే సౌలభ్యమూ లేదు. నీ పండు తినాలంటే తిప్పలు పడాల్సిందే! అందువల్ల నన్ను నిలదీసే అర్హత నీక్కూడా లేదు’’ అంది వేలెత్తి చూపుతూ.జామ మాటలకు చెట్లన్నీ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాయి. ఏం జవాబు చెప్పాలో వాటికి అర్థం కాలేదు.‘‘చూశారా! మీకు నన్న ఎదిరించే దమ్ము లేదు. చూడండి నా ప్రత్యేకత ఏ పండ్ల జాతిలోనూ లేదు. ఎందుకో చెప్పనా? వినండి. ఏ పండైనా తొక్క ఒలవందే తినడానికి వీలవదు. మరి నన్ను చూడండి. చెట్లు మీంచి కాయి కోసుకుని హాయిగా నమిలెయ్యొచ్చు. వెంటనే రుచి చూసి లొట్టలేయొచ్చు. పక్షులన్నిటికీ నేను తిండి పెడుతున్నట్లే లెక్క! మిమ్మల్ని అసలు ఏ పక్షి అయినా నేరుగా తినగలదా? బిక్కమొహాలేసుకోవడం కాదు. చెప్పండి!’’ అంటూ హుంకరించింది.జామ చెప్పిన మాటల్లో నిజం ఉన్నప్పటికీ దాని అహాన్ని మాత్రం సహించలేకపోయాయి మిగిలిన చెట్లన్నీ. ఈ వ్యవహారమంతా గమనిస్తున్న తుమ్మచెట్టు తోటి చెట్లకు వత్తాసు పలుకుతూ... ‘‘నీ ప్రవర్తన సబబుగా లేదు. నీ మిడిసిపాటు ఎన్నాళ్లో సాగదు. దేనికైనా కాలమే గుణపాఠం చెబుతుంది. ఎవరి విలువ వారికి ఉంటుంది. నా కాయలు తినడానికి ఏమాత్రం ఉపయోగపడవు. కాని నా ముళ్లు తోట చుట్టూ కాపలాగా పనికొస్తాయి. దేముడు ప్రతిదానికి ఒక విలువ ఇచ్చాడు. అది గుర్తుంచుకో!’’ అంది ఎదురుదాడి చేస్తూ. ‘‘ఓహో! తోటి మిత్రులకు తోడుగా నువ్వు కూడా రంగంలోకి దిగావన్న మాట! అసలు నీ రూపం ఒక్కసారైనా చూసుకున్నావా? ఏమీ బాగులేని వారిని తుమ్మమొద్దులా ఉన్నావంటారు. నీ ముల్లు గుచ్చుకుంటే జనం గగ్గోలు పెట్టి తిట్టుకుంటారు.’’ అని చులకనగా మాట్లాడింది జామ.మరింక దాంతో తలపడలేక మౌనం వహించాయి చెట్లన్నీ. బత్తాయి, సపోటా, నేరేడు చెట్లు ఏదో అనబోతే వారించింది పనసచెట్టు. ‘‘చూశారా! మీరెవ్వరూ నాతో సాల్లేకపోయారు. అసలు నా విలువ మీ అన్నింటికంటే ఎక్కువ కాబట్టి నన్ను తోట మధ్య పాతి మిమ్మల్నందరినీ పనికిరానట్టు ఒడ్డున పడేశాడు యజమాని’’ అంటూ వికటంగా నవ్వింది జామచెట్టు.ఇది జరిగిన రెండు రోజుల తర్వాత యజమాని సింగరాజు కొందరు వడ్రంగులను వెంటబెట్టుకొచ్చి పనసచెట్టును చూపించాడు. వాళ్లు రంపాలతో దాని లావైన కొమ్మలను కోయడం చూసి, ‘‘చూశావా పనసా! నీ పనయ్యింది’’ అని హేళనగా అంది జామ. కాని వాళ్లు అదే చెట్టు కింద కూర్చొని ఆ కలపతో చిన్న చిన్న బొమ్మలు చేయడం మొదలుపెట్టారు. ఆ సన్నివేశం చూసిన జామచెట్టు ఆశ్చర్యపోవడం గమనించిన తుమ్మచెట్టు ‘‘ఎప్పుడూ పరాయివాళ్లను నిందించడమే పనిగా పెట్టుకోకు. పనస విలువ తెలిసిందా?’’ అని సూటిగా అడిగింది. అయినప్పటికీ జామకు ఏమాత్రం అహం తగ్గలేదు. సూటిపోటి మాటలు అంటూనే ఉండేది. ఇలా ఉండగా, ఒకరోజు తోట యజమాని సింగరాజు కొందరు వ్యక్తులతో తోటలోకి వచ్చాడు. వాళ్లు ఏయే చెట్లకు ఏయే తెగులు పడుతుందో చెప్పి, దానికి విరుగుడుకి కూడా సలహాలు చెబుతూ ‘‘ఈ జామచెట్టు చూస్తే బయటకు బాగానే కనిపిస్తున్నా, దీని కాండం భాగంలో తెగులు సోకింది. పైగా ఇది తోట మధ్యలో ఉండటం మూలంగా జనమంతా దాని పళ్ల కోసం మీ తోటలోకి దూకి మరీ చొరబడుతున్నారు. దాని వల్ల మీ తోట మొత్తం ధ్వంసం కావడానికి కారణమవుతోంది. దీనికున్న చీడ మిగిలిన చెట్లకు పాకక ముందే దీన్ని ఇక్కడి నుంచి వెంటనే తొలగించండి.’’ అని చెప్పడం విన్న జామచెట్టు ఒక్కసారిగా బావురుమన్నది. తప్పనిసరి పరిస్థితిలో ఆ జామచెట్టును కూకటివేళ్లతో తీసేయాల్సి వచ్చింది. అది చూసిన మిగతా చెట్లు తన అహంకారమే జామచెట్టును అంతం చేసిందని అనుకున్నాయి. - కె.కె.రఘునందన -
బంగారానికి ప్రతికూలమే!
న్యూఢిల్లీ: బంగారం ధరలు గత వారంలో తక్షణ నిరోధ స్థాయి ఔన్స్ 1,230 డాలర్లను అధిగమించలేకపోయాయి. డిసెంబర్ నెల బంగారం ఫ్యూచర్స్ ఏ మార్పు లేకుండా ఔన్స్ 1,223.50 డాలర్ల వద్దే ఉండిపోయింది. గత శుక్రవారం చమురు ధరలు ఒక్కరోజే 7 శాతం పతనం చెందడం తెలిసిందే. చమురు ధరల పతనం కమోడిటీ మార్కెట్ల పట్ల ఇన్వెస్టర్ సెంటిమెంట్‌కు విఘాతం కలిగించిందని, ఇది బంగారానికి కూడా ప్రతికూలమేనని కామర్జ్ బ్యాంకు కమోడిటీ రీసెర్చ్ హెడ్ యూజెన్వీన్బర్గ్ పేర్కొన్నారు. తక్కువ చమురు ధరలు ద్రవ్యోల్బణ అంచనాలపైనా ప్రభావం చూపిస్తాయన్నారు. బలహీన అయిల్ మార్కెట్ బంగారం ర్యాలీకి కష్టమేనని లండన్ క్యాపిటల్ గ్రూపు రీసెర్చ్ హెడ్ జాస్పర్ లాలెర్ అభిప్రాయపడ్డారు. అయితే, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి వాతావరణం అన్నది సురక్షిత పెట్టుబడి సాధనాలకు అనుకూలమేనన్నారు. సమీప కాలంలో ఔన్స్ బంగారం ధర 1,200 డాలర్ల పైనే కొనసాగొచ్చన్న అభిప్రాయాన్ని కూడా తెలిపారు. దేశీయంగా తగ్గిన డిమాండ్ అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, స్థానిక జ్యుయలర్స్ నుంచి డిమాండ్ తగ్గడం తదితర కారణాల వల్ల బంగారం ధరలు గత వారం 10 గ్రాములకు రూ.32,000లోపునకు దిగొచ్చాయి. 10 గ్రా.కు రూ.400 తగ్గి రూ.31,750కు చేరాయి. -
విదేశీ దిగుమతుల తగ్గింపే లక్ష్యం
సాక్షి, రాజమహేంద్రవరం: కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు విదేశాల నుంచి ఆయిల్ దిగుమతిని 10 శాతం తగ్గించటమే లక్ష్యంగా ఓఎన్జీసీ పని చేస్తోందని దాని అనుబంధ విభాగం ఓఎన్జీసీ విదేశ్ డైరెక్టర్ పి.కె.రావు చెప్పారు. విదేశాల్లో సంస్థ కార్యకలాపాలు విజయవంతంగా సాగిస్తున్నట్లు చెప్పారాయన. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అసెట్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘2002 నుంచి ఓఎన్జీసీ వివిధ దేశాల కంపెనీలతో కలసి సంయుక్తంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రస్తుతం 20 దేశాల్లో 41 ప్రాజెక్టులు చేపట్టాం. రష్యాలోని వెల్‌లో మైనస్ 38 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆపరేషన్స్ చేపడుతున్నాం. కొలంబియాలో 3200 బ్యారల్స్ ఉత్పిత్తి చేయగల బావిని సొంతంగా తవ్వాం’’ అని వివరించారు. ప్రస్తుతం తమ చమురు ఉత్పత్తి సామర్థ్యం 14.1 మిలియన్ మెట్రిక్ టన్నులుందని, దీన్ని 2030 నాటికి 60 ఎంఎంటీకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారాయన. సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ప్రాజెక్టుల నుంచి మన వాటాగా 26 శాతం వస్తోందని చెప్పారు. సమావేశంలో ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీఎంఆర్ శేఖర్, గ్రూప్ జనరల్ మేనేజర్ పి.కె.పాండే, కార్పొరేట్ కమ్యూనికేషన్ అధికారి ఎం.డి.జమీల్ తదితరులు పాల్నొన్నారు. -
అంతర్జాతీయ ట్రెండ్ ఆధారం
న్యూఢిల్లీ: రూపాయి రికవరీ, చమురు ధరలు దిగిరావడం, అమెరికా–చైనా మధ్య సయోధ్యకు అవకాశాలు, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆ దేశం నుంచి చమురు దిగుమతులకు భారత్‌కు అవకాశం కల్పించడం, గత వారం మార్కెట్‌ను లాభాల బాట పట్టించాయి. అయితే, ఈ వారంలో అమెరికాలో జరగబోయే ఎన్నికలు, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం వంటి అంశాల ఆధారంగా నెలకొనే అంతర్జాతీయ ట్రెండ్ మన మార్కెట్‌కు కీలకం కానుందని, అలాగే రూపాయి, చమురు ధరల కదలికలు కూడా మార్కెట్ల గమ్యాన్ని నిర్ణయించనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు సోమవారం నుంచే అమల్లోకి రానున్నాయి. కాకపోతే భారత్ సహా ఎనిమిది దేశాలకు అమెరికా మినహాయింపులు ఇవ్వడం కాస్త ఊరట. అయితే, దీని ప్రభావం ప్రపంచ మార్కెట్లపై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం ఒక్కరోజే రూపాయి 100 పైసలు బలపడి డాలర్‌తో 72.45కు చేరిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం రాత్రి ఆఫ్‌షోర్ మార్కెట్లో రూపాయి తిరిగి 73 దిగువకు పడిపోయింది. సర్వీసుల రంగంపై పీఎంఐ డేటా సోమవారం వెలువడనుంది. ఈ వారంలో స్టాక్ మార్కెట్ మూడు రోజులే పనిచేయనుంది. దీపావళి సందర్భంగా బుధవారం (7వ తేదీ), దీపావళి బలిప్రతిపాద సందర్భంగా గురువారం మార్కెట్లు పనిచేయవు. ఈ వారంలో కీలక పరిణామాలు సోమవారం సేవల రంగానికి సంబంధించి పీఎంఐ గణాంకాలు విడుదల కానున్నాయి. ఇవి మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. బుధ, గురువారాల్లో జరిగే అమెరికా ఫెడ్ భేటీలో వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాన్ని కూడా మార్కెట్లు పరిశీలించనున్నాయి. వడ్డీ రేట్లపై నిర్ణయం మన దేశ కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి వెలువడుతుంది. ఎస్బీఐ, బాష్, సిప్లా, గెయిల్, ఇండియన్ బ్యాంకు, పవర్‌గ్రిడ్ తదితర కంపెనీలు ఫలితాలను ప్రకటించనున్నాయి. ‘‘ఇరాన్‌పై ఆంక్షలతో ఈ వారం ఆరంభం కానుంది. తర్వాత అమెరికా లెజిస్లేటివ్ ఎన్నికలు, మన కార్పొరేట్ ఎన్నికల ఫలితాలు వంటి అంశాలు ఉన్నాయి. దీపావళి కారణంగా మార్కెట్ మూడ్ ఉత్సాహంగానే ఉండనుంది. ఇన్వెస్టర్లు అప్రమత్తతతో వ్యవహరించాలి’’ అని ఈక్విటీ99 సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ రాహుల్‌శర్మ తెలిపారు. ‘‘అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందితే దేశీయ మార్కెట్లకు మంచి అంశం అవుతుంది. చమురు ధరలు ఇటీవల తగ్గడంతో సెంటిమెంట్ సానుకూలంగా మారింది. ఐఐపీ, ద్రవ్యోల్బణం గణాంకాలు ఈ నెల రెండో వారంలో రానున్నాయి. సెలవు రోజులు కావడంతో ట్రేడింగ్ పరిమితంగా ఉంటుంది’’ అని ఎపిక్ రీసెర్చ్ సీవో ముస్తఫా నదీమ్ తెలిపారు. 7న ముహూరత్ ట్రేడింగ్ దీపావళి సందర్భంగా ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ఈ నెల 7న ముహరత్ ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు ఇరు ఎక్సేంజ్‌ల్లో సాధారణ రోజుల్లో మాదిరిగానే ట్రేడింగ్ ఉంటుంది. ఎఫ్‌పీఐల నిధుల ఉపసంహరణ రెండేళ్ల గరిష్టానికి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) అక్టోబర్ నెలలో రూ.38,900 కోట్ల మేర పెట్టుబడులను భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.28,921 కోట్లు, డెట్ మార్కెట్ల నుంచి రూ.9,979 కోట్ల మేర ఉపసంహరించుకున్నారు. 2016 నవంబర్‌లో రూ. 39,396 కోట్ల ఉపసంహరణ తర్వాత... గరిష్ట స్థాయిలో ఉపసంహరణ గత నెలలోనే జరిగింది. ఇక ఈ ఏడాదిలో ఇప్పటి వరకు విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్ల నుంచి వెనక్కి తీసేసుకున్న మొత్తం రూ.లక్ష కోట్లకు చేరింది. -
ఎట్టకేలకు నష్టాలకు బ్రేక్: మార్కెట్ జంప్
సాక్షి, ముంబై: రోజంతా తీవ్ర ఒడిదుడుకులతో లాభనష్టాల మధ్య కదలాడిని స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 187 పాయింట్లు పుంజుకుని 34033 వద్ద, నిఫ్టీ 78 పాయింట్లు జంప్ చేసి 10224 వద్ద ముగిసాయి. కీలక సూచీలు రెండూ మద్దతు స్థాయిలకు పైన స్థిరంగా ముగియడం విశేషం. ముఖ్యంగా ఆయిల్ ధరలు కిందికి రావడంతో చివరి గంటలో కొనుగోళ్లు పుంజుకున్నాయి. రియల్టీ బ్యాంక్ నిఫ్టీ లాభాలు మార్కెట్లను లీడ్ చేయగా మీడియా, ఫార్మా నష్టాల్లో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్, భారతి ఎయిర్టెల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ, హిందాల్కో టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. ఇండస్ఇండ్, హెచ్‌సీఎల్ టెక్, ఐబీ హౌసింగ్ కూడా లాభపడిన వాటిల్లో ఉన్నాయి. బజాజ్ఆటో, ఎస్‌బ్యాంకు, డీఆర్ఎల్, గ్రాసింగ్ అదానీ పోర్ట్స్, గ్రాసిమ్ బాగా నష్టపోయాయి. అంబుజా, ఎన్టీపీసీ, జీ, ఇన్ఫ్రాటెల్, గెయిల్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, కొటక్ బ్యాంక్ నష్టపోయిన ఇతర షేర్లు. -
పాపాయికి మసాజ్
♦ పిల్లలకు మసాజ్ చేసే ఆయిల్‌ను జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే తరచుగా చేతులు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఒంటికి రుద్దిన ఆయిల్ కడుపులోకి పోయే అవకాశం ఉంది. ఆయిల్ కొనే ముందు తయారీకి ఏమేమి వాడారో లేబుల్‌ను చెక్ చేసుకోవాలి. వెన్న, మీగడ వంటివైతే ఏ ఇబ్బంది ఉండదు. ♦ మసాజ్ చేయడానికి ఆయిల్‌ను అరచేతిలోకి వంపుకుని రెండు చేతులతో రుద్ది పాపాయి ఒంటి మీద కొద్దిగా రాసి పాపాయి కదలికలను గమనించాలి. ముఖ్యంగా కళ్లలోకి చూస్తే కొత్త రకం స్పర్శకు స్వాగతం పలుకుతోందా వద్దని చిరాకు పడుతోందా అన్నది తెలుస్తుంది. కొంతమంది పిల్లలు ఒంటికి కొత్త స్పర్శ తగిలిన వెంటనే తల అడ్డంగా తిప్పుతూ, కాళ్లు చేతులు విదిలిస్తూ తమ అయిష్టతను వ్యక్తం చేస్తారు. అలాంటప్పుడు ఒంటికి నూనెను కొద్దికొద్దిగా రాస్తూ పాపాయిని మసాజ్‌కు మానసికంగా సిద్ధం చేయాలి. ఆ తర్వాత ఏ ఇబ్బందీ లేకుండా హాయిగా చేయించుకుంటారు. -
రైస్‌బ్రాన్ ఆయిల్‌తో కొలెస్ట్రాల్‌కు చెక్!
కొలెస్ట్రాల్ గుండెకు హాని చేస్తుందన్న విషయం తెలిసిందే. మరి నూనె లేనిదే వంట లేదు. వంటలేనిదే ఆహారమూ లేదు. అలాంటప్పుడు రోజూ వంటల్లో నూనె వాడాల్సిందే కదా. అంటే కొలెస్ట్రాల్ ముప్పు ఉన్నట్లే కదా అంటూ ఆందోళన పడకండి. నూనెను వాడండి. అయితే కొలెస్ట్రాల్ సమస్యకు చెక్ పెట్టండి. ఈ రెండు ప్రయోజనాలు సాధించాలంటే చేయాల్సింది రైస్‌బ్రాన్ ఆయిల్‌ను వాడటం. దాని కథా కమామిషూ తెలుసుకోవాలంటే ముందుగా కొలెస్ట్రాల్ చేసే హాని ఏమిటో, దాని నుంచి రైస్ బ్రాన్ ఆయిల్ ఎలా రక్షిస్తుందో అర్థం చేసుకోవాలి. కొవ్వులు మన శరీరానికి హాని చేస్తాయంటూ, వాటిని అసలే తీసుకోబోము అంటే చాలా తప్పు. ఎందుకంటే మన శరీరానికి కొద్దిగా కొవ్వుల అవసరం ఉంటుంది. కొన్ని విటమిన్లు మన శరీరంలో ఇంకడానికీ, విటమిన్–డి తయారీలోనూ కొవ్వులు పరిమితంగా అవసరమే. అయితే మోతాదు మించితే ఆ కొవ్వులే ఎన్నో ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. కొలెస్ట్రాల్ కథ ఏమిటంటే... మన దేహంలో కొలెస్ట్రాల్‌ను ప్రధానంగా కాలేయం ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఒంట్లోని ఇతర కణజాలాలూ కొంతమొత్తంలో దీన్ని తయారు చేస్తాయి. ఇక జంతువుల నుంచి లభించే మాంసం, పౌల్ట్రీ, చేపలు, పాల ఉత్పాదనలు (డెయిరీ ప్రాడక్ట్స్)తో కూడా కొలెస్ట్రాల్ లభ్యమవుతుంది. కొలెస్ట్రాల్ రక్తంలో ప్రోటీన్లతో పాటు ప్రవహిస్తుంటుంది. దీన్నే లైపోప్రోటీన్స్ అంటారు. వీటిలో రెండు రకాలు ఉంటాయి. లో–డెన్సిటీ లైపోప్రోటీన్ (ఎల్డీఎల్) కొలెస్ట్రాల్ : శరీరంలోని కణజాలానికి అవసరమైన దానిలో ఈ రకం కొలెస్ట్రాలే అధికశాతం ఉంటుంది. దీన్నే చెడు కొలెస్ట్రాల్ అంటాం. రక్తప్రవాహంలో దీని మోతాదు మించితే ఇది ధమనుల్లో పేరుకుపోతుంది. హై–డెన్సిటీ లైపోప్రోటీన్ (హెచ్‌డీఎల్) కొలెస్ట్రాల్ : దీన్ని మంచి కొలెస్ట్రాల్ అంటారు. ధమనుల్లో పేరుకుపోయే కొలెస్ట్రాల్‌ను తొలగించడానికి ఇది తోడ్పడుతుంది. ఆరోగ్యవంతుడైన ఒక వ్యక్తి శరీరంలో మొత్తం కొలెస్ట్రాల్ 200 ఎంజీ/డీఎల్‌కు మించి ఉండకూడదు. అంతకు మించి ఉంటే దాన్ని హై బ్లడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఇలా ఎక్కువ ఉండటం అంత మంచి సూచన కాదు. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? : రక్తంలో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అది రక్తనాళాల గోడలకు అంటుకొని రక్తప్రవాహానికి అడ్డుపడే అవకాశాలున్నాయి. ఇదే పరిస్థితి గుండెకు రక్తాన్ని అందించే కొరొనరీ ఆర్టరీలో జరిగితే, ఆ నాళాలు మరింత సన్నబడతాయి. దాంతో గుండెకు మంచి రక్తం అందకుండా పోతుంది. అథెరోస్కి›్లరోసిస్ అనే ఈ కండిషన్ గుండెపోటుకు కారణమవుతుంది. మరి ఈ ముప్పును నివారించడం ఎలా : రైస్‌బ్రాన్ ఆయిల్‌ను తీసుకోవడం వల్ల ఈ ముప్పును నివారించవచ్చు. రైస్‌బ్రాన్ ఆయిల్లో ఒరైజనాల్ అధికంగా ఉంటుంది. ఇది కేవలం రైస్‌బ్రాన్ ఆయిల్లో మాత్రమే లభ్యమయ్యే ఒక మంచి యాంటీఆక్సిడెంట్. ఇది చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. కచ్చితంగా చెప్పాలంటే ఒరైజనాల్ అనే పోషకం రక్తంలో ఎల్డీఎల్ పేరుకుపోకుండా చూస్తుంది. రక్తంలో ఎక్కువగా ఉన్న ఎల్‌డీఎల్‌ను హెచ్‌డీఎల్ కాలేయానికి తీసుకువెళ్తుంది. అక్కడ కాలేయం దాన్ని శరీరం నుంచి బయటకు పోయేలా చేస్తుంది. ఇలా ఒరైజనాల్ అనేది జీర్ణక్రియలో పలు కీలక భూమికలు పోషించడంతో పాటు, గుండె(కార్డియోవాస్క్యులార్) జబ్బులను అడ్డుకుంటుంది. ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్‌బ్రాన్ ఆయిల్లో ఒరైజనాల్ పాళ్లను 10,000 పీపీఎం కన్నా ఎక్కువగా నిర్వహితమయ్యేలా చూస్తారు. దాంతో ఇది మొత్తం శరీరానికి ప్రయోజనం కలిగిస్తుంది. ఇండియా, జపాన్, యూఎస్‌లో జరిగిన పలు అధ్యయనాలు... దీనివల్ల కలిగే ప్రయోజనాలను నిర్ధారణ చేయడంతో పాటు, రైస్‌బ్రాన్ ఆయిల్‌కు హెల్తీ ఆయిల్ అనే పేరునిచ్చాయి. భారత్‌లోని ప్రతిష్టాత్మకమైన ఆహార పరిశోధన సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్... అత్యధిక మోతాదులో ఒరైజనాల్ పెంచడంతో పాటు కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గించే ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్‌బ్రాన్ ఆయిల్ ప్రయోజనాలను ధ్రువీకరించింది. ‘‘రైస్‌బ్రాన్ ఆయిల్‌లోని ప్రముఖ బ్రాండ్ అయిన ఫ్రీడమ్ రైస్‌బ్రాన్ ఆయిల్లో ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా స్టీమ్ డిస్టిలేషన్ విధానంలో శుద్ధి చేయడం వల్ల ఇందులోని పోషకాలు ఏమాత్రం నష్టపోనివిధంగా అలాగే ఉంటాయంటారు ఫ్రీడమ్ రైస్‌బ్రాన్ ఆయిల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ పి. చంద్రశేఖర్‌రెడ్డి. ఇక మనదేశంలో ఇప్పటికే మూడు కోట్ల మంది గుండెజబ్బులతో బాధపడుతుండటంతో పాటు ప్రతి ఏడాది మూడు లక్షల కొత్త కేసులు ఈ జాబితాకు చేరుతున్నందున మనం మన ఆహారంలో అతి తక్కువ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండే నూనెలు తీసుకోవాలని, రైస్‌బ్రాన్ ఆయిల్ ఇందుకు తోడ్పడుతుందని సిఫార్సు చేస్తున్నారు అపోలో హాస్పిటల్‌కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్టు డాక్టర్ జె. శివకుమార్. మన గుండె ఆరోగ్యం కోసం అందరూ రైస్‌బ్రాన్ ఆయిల్ వైపు మళ్లడం ఎంతో మేలు చేస్తుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. -
బ్రహ్మయ్యా.. కానుకలు దోచేస్తున్నారయ్యా..!
బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి సన్నిధిలో అక్రమాల పర్వం కొనసాగుతోంది. దేవస్థానంలో దీపారాధన కోసం భక్తులు కానుకగా ఇచ్చిన నూనె డబ్బాలను సైతం పక్కదారి పట్టిస్తూ స్థానికులకు దొరికిపోయారు. వివరాలు ఇలా ఉన్నాయి. పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామికి తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్నాటక ,మహారాష్ట్రలలో కూడా అధిక సంఖ్యలో భక్తులు ఉన్నారు. ఇక్కడికి ప్రతిరోజు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి వారికి తోచిన విధంగా విరాళాలు ఇచ్చి వెళుతుంటారు. బి.మఠంలో ప్రతి ఏడాది మూడు ఉత్సవాలు జరుగుతాయి. అందులో ప్రధానమైనది బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలు. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులు అధిక సంఖ్యలో స్వామికి వివిధ రకాల నూనె డబ్బాలు సమర్పించుకుంటారు. స్వామికి దీపారాధనలకే కాకుండా ఇతర అవసరాలకు వంట నూనెలు కూడా ఇస్తారు. వీటిని అధికంగా సమీపంలో ఉన్న మఠాధిపతి ఇంటిలో ఉంచుతారు. వీటితోపాటు మామూలు రోజులలో కూడా నూనె డబ్బాలతో పాటు బియ్యం, కందిపప్పు, దుస్తులు, బెల్లం, ఇతర వంటసరుకులు కూడా భక్తులు ఇస్తుంటారు. ప్రతి ఏడాది దేవస్థానం నిర్వాహకులు బియ్యం, కందిపప్పు, ఇతర వస్తువులను బహిరంగ వేలం వేస్తారు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం బియ్యం, మరికొన్ని వస్తువులు బహిరంగ వేలం వేసినట్లు తెలిసింది. ఇందులో నూనె డబ్బాలు లేవు. శనివారం సాయంత్రం మఠాధిపతి ఇంట్లోనుంచి పోరుమామిళ్లకు చెందిన నూనెల వ్యాపారి ఆముదము, వంట నూనెల 25 కేజీల 50 డబ్బాలు తరలిస్తుండగా స్థానికులు గమనించారు. భక్తులు బ్రహ్మంగారి దీపారాధనకు, వంటకు ఇచ్చిన నూనె డబ్బాలు ఎక్కడికి తీసుకెళ్తున్నారని నిలదీశారు. బహిరంగ వేలం వేయకుండా మీకు ఎలా విక్రయించారని ప్రశ్నించారు. నూనె వ్యాపారి మాత్రం 50 డబ్బాల నూనెను రూ.50వేలకు కొనుగోలు చేసినట్లు స్థానికులకు తెలిపి వాటిని తరలించుకు పోయాడు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ. లక్ష చేస్తుందని తెలుస్తోంది. కాగా వాటిని రూ.50 వేలకు కొనుగోలు చేసినట్లు వ్యాపారి పేర్కొంటున్నా అతనికి రూ.25వేల రూపాయల రసీదు మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. దీన్నిబట్టి దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకల విషయంలో గోల్మాల్ జరుగుతోందనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. నూనె డబ్బాల అమ్మకంపై స్థానిక మఠం మేనేజర్ ఏమంటున్నారంటే.. ‘భక్తులు ఇచ్చిన బియ్యం, ఇతర వస్తువులు బహిరంగ వేలం వేశాం. ఆ ఆదాయాన్ని మఠం నిధులకు జమ చేశాము. నూనె డబ్బాలు మాత్రం బహిరంగ వేలం వేయకుండా విక్రయించాము. 50 డబ్బాలను రూ.25వేలకు విక్రయించాము’ అని మ ఠం మేనేజర్ ఈశ్వరాచారి తెలిపారు. కాగా,నూనె కొనుగోలు చేసిన వ్యాపారిని స్థానికులు విచారిస్తే 50 డబ్బాల నూనెను రూ.50వేలకు కొన్నట్లు చెప్పాడు. మరి మిగిలిన సొమ్ము ఎవరి ఖాతాలోకి వెళ్లింది అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
మరింత పెరిగిన వాణిజ్యలోటు
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల ఆర్థిక వ్యవస్థకు ఆందోళన కరంగా మారిన వాణిజ్య లోటు తాజాగా మరింత భయపెడుతోంది. మే నెలలో వాణిజ్య లోటు 14.62 బిలియన్ డాలర్లకు పెరిగింది. దిగుమతులు 15 శాతం పెరిగాయని ప్రభుత్వం వెల్లడించింది. మే మాసానికి సంబంధించిన ట్రేడ్ డెఫిసిట్ 14.62 బిలియన డాలర్లుగా నమోదైందని వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు ప్రకటించారు. గత ఏడాది ఇదే కాలానికి వాణిజ్య లోటు 13.85 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఎగుమతులు 28.86 బిలియన్ డాలర్లు. గత ఏడాది 24.01 బిలియన్ డాలర్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 20.18శాతం వృద్ధిని సాధించాయి. దిగుమతులు 43.38 బిలియన్ డాలర్లు. వార్షిక ప్రాతిపదికన 14.85 శాతం వృద్ధిని నమోదు చేశాయి. దిగుమతులు గత ఏడాది 37.86 బిలియన్ డాలర్లుగా ఉంది. ముడి చమురు దిగుమతులు 49.46 శాతం పెరిగి 11.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగడంతో దిగుమతులు పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. -
అక్రమ ఆయిల్ ముఠా అరెస్ట్
కాకినాడ రూరల్: వాకలపూడి పరిసర ప్రాంతాల్లో అక్రమంగా ఆయిల్ అమ్మకాలు నిర్వహిస్తున్న ముఠాపై సర్పవరం పోలీసులు దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ ఆదేశాల మేరకు కాకినాడ డీఎస్పీ రవివర్మ పర్యవేక్షణలో సర్పవరం సీఐ డీఎస్ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దొంగ ఆయిల్ ముఠా వివరాలను వెల్లడించారు. తీరప్రాంతంలో ఒకసారి ఉపయోగించిన ఆయిల్‌ను నిల్వ చేస్తూ అమ్మకాలు చేస్తున్న ఆవుల శ్రీనివాసరెడ్డి, మందపాక సూరిబాబు, పెంటకోట గంగాధర్‌లను ఎస్సై శ్రీనివాసరెడ్డి సిబ్బంది సహాయంతో అరెస్టు చేసినట్టు వివరించారు. ఆవుల శ్రీనివాసరెడ్డి నుంచి ఆరు బ్యారెల్స్ (1200 లీటర్లు) యూజ్డ్ ఇంజన్ ఆయిల్, మందపాక సూరిబాబు నుంచి 75 లీటర్లు క్రూడ్ కాటన్ ఆయిల్‌ను, పెంటకోట గంగాధర్ అనే వ్యక్తి నుంచి 20 లీటర్ల డీజిల్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. పాతనేరస్తుడైన ఆవుల శ్రీనివాసరెడ్డి వాకలపూడి ఎఫ్‌సీఐ కాలనీలో ఖాళీ స్థలాన్ని అద్దెకు తీసుకుని పాత ఇనుప వ్యాపారం షాపు నడుపుతున్నట్టు తెలిపారు. ఒకసారి ఉపయోగించిన ఇంజన్ ఆయిల్‌ను సేకరించి వాటిలో కొంత మంచి ఆయిల్‌ను కలిపి మంచి ఇంజన్ ఆయిల్గా చుట్టుపక్కల లారీ యజమానులకు, చిన్నచిన్న కంపెనీవాళ్లకు విక్రయిస్తూ వ్యాపారులను మోసగిస్తున్నాడన్నారు. సీఐ చైతన్యకృష్ణకు ముందుగా వచ్చిన సమాచారం మేరకు దాడిచేసి పట్టుకున్నామన్నారు. ఈనెల 6వ తేదీన ఏపీ5డబ్ల్యూ 1282 నంబర్ గల లారీ యజమాని కడలి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకినాడ వాకలపూడిలోని ఎన్సీఎస్ ఆయిల్ కంపెనీ నుంచి అమలాపురం, రావులపాలెం పెట్రోల్ బంకులకు వెళ్లేందుకు డీజిల్ నింపిన ట్యాంకర్ నుంచి డ్రైవర్ పెంటకోట గంగాధర్ ట్యాంకర్ కంపార్ట్‌మెంట్‌కు సీలు తొలగించి సుమారు 20 లీటర్లు డీజిల్ ఆయిల్‌ను దొంగిలించడంపై అరెస్టు చేసినట్టు డీఎస్పీ రవివర్మ తెలిపారు. ఇదే విధంగా వాకలపూడి గ్రామంలోనే అక్రమంగా ఆయిల్ వ్యాపారం చేస్తున్న మంటపాక సూరిబాబుని అరెస్టు చేసి అతడి నుంచి 75 కిలోల కాటన్ క్రూడ్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గుంటూరు పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ట్యాంకర్ డ్రైవర్లు, క్లీనర్ల వద్ద నుంచి కాటన్ క్రూడ్ ఆయిల్ కలిపి చుట్టుప్రక్కల వారిని స్వచ్ఛమైన ఆయిల్గా నమ్మించి అమ్మి మోసగిస్తున్నట్టు తెలియడంతో అరెస్టు చేశామన్నారు. సర్పవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో వివిధ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ పేకాట, జూదం ఆడుతున్న తొమ్మిది పేకాట కేసుల్లో 54 మందిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ రవివర్మ తెలిపారు. నాలుగు గుట్కా కేసుల్లో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు తెలిపారు. పోర్టులో వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలను మోసగించి అక్రమ వ్యాపారాలు చేస్తున్న వివిధ కేసుల్లో ఉన్న పాతనేరస్తులు(ఆయిల్ కేసుల్లో) 15 మందిని అదుపులోకి తీసుకుని 15 కేసుల్లో బైండవర్ చేసినట్టు వివరించారు. ఎస్పీ విశాల్ గున్ని ఆదేశాల ఏరకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌లో భాగంగా పోర్టు ఏరియాలో రాకపోకలు సాగించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఉంచినట్టు డీఎస్పీ రవివర్మ వివరించారు. కార్యక్రమంలో సీఐ చైతన్యకృష్ణ, ఎస్సై సత్యనారాయణరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
అనారోగ్యానికి కేరాఫ్ ఆయిల్ ఫుడ్
శ్రీకాకుళం రూరల్ : ఆహార పదార్థాల్లో కొద్దిగా నూనె కనిపించినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. గారెలు, బూరెలు, అరిసెలు, బోండాలు, బజ్జీలు వంటిì వాటిల్లో నూనె కారుతున్నా ఇష్టంగా తినేవారు. ఇది నాటి పరిస్థితి. కాలం మారింది. ఆహారపు అలవాటుల్లో మార్పు వచ్చింది. డైటింగ్ వంటి వాటివల్ల చాలా మంది నూనె వస్తువులు చూసిన వెంటనే మొహం చాటేస్తున్నారు. అయితే చిన్నారులు, యువత మాత్రం నూనెతో తయారీ చేసే పదార్థాలను ఇష్టంగా తింటున్నారు. ఎండలు మండుతున్నా నూనెతో తయారీ అయ్యే వస్తువులను రుచి చూడాలన్నా ఆత్రుత పోవడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్ ఫుడ్ తినడం అంత మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శ్రీకాకుళం నగరం పరిధిలో సాయంత్రం అయితే చాలు ప్రధాన కూడళ్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా చిరు వ్యాపారులు వివిధ రకాల ఫాస్ట్‌ఫుడ్ జోరుగా విక్రయిస్తున్నారు. టిఫిన్లతో పాటు ఆయిల్‌తో తయారయ్యే సమోసాలు, బోండాలు, బజ్జీలు, వడలు, చికెన్ పకోడీలు వంటివి జోరుగా అమ్ముతున్నారు. నాసిరకం నూనెలు వినియోగం వ్యాపారులు నాణ్యమైన నూనెను వినియోగించకుండా తక్కువ ధరకు దొరికే నాసిరకం నూనెలను ఉపయోగిస్తున్నారు. ఒకరోజు వంటచేయగా మిగిలిపోయిన నూనెను మరుసటి రోజు, తర్వాత రోజు కూడా ఉపయోగిస్తున్నారు. దీనికారణంగా ఆయిల్ బాగా కాగి చిక్కదనం అవుతోంది. నిత్యం ఇదే ఆయిల్‌తో వివిధ రకాల వంటకాలు వండటం వల్ల వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు ఇలా.. ఎండా కాలంలో నాసిరకమైన, పదేపదే మరిగించిన నూనెలతో తయారు చేసిన వంటలు తినడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్, ఉబ్బసం, కడుపు, ఛాతీలో మంట, ఎసిడిటీ, అధిక దాహం, ఆరాటం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాన్సర్ సోకేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కళ్లు తిరిగి పడిపోవడం, రక్తపోటు పెరగటం, గుండె కొట్టుకోవడంలో వివిధ మార్పులు,చోటు చేసుకుంటాయి. నూనె పదార్థాలు వల్ల శరీరంలో మరింత ఉష్ణోగ్రత పెరిగి నీరసం, వడదెబ్బకు దారితీస్తోంది. జీర్ణకోశ వ్యాధితో పాటు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఎక్కువ. కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.ఆయిల్ ఫుడ్ తగ్గించాలి. వేసవి కాలంలో ఆయిల్ ఫుడ్‌ను ఎంత తగ్గిస్తే అంత ఆరోగ్యంగా ఉంటాం. రోడ్డుపక్కన అమ్మే పానీపూరి, ఫాస్ట్ఫుడ్స్, చపాతి, ఛాట్‌లతో పాటు ఇతరత్రా వాటికి దూరంగా ఉండటం మంచిది. వేసవిలో అంబలి, కొబ్బరి బొండాలు, బార్లీ, గ్లూకోజ్, నిమ్మరసాలు తీసుకుంటే చాలా మంచిది. – సూరజ్ పట్నాయక్, రిమ్స్ వైద్యులు, శ్రీకాకుళం -
మొక్కల నుంచి నూనె ఉత్పత్తి!
మొక్కల ద్వారా అధిక మోతాదులో నూనెలను ఉత్పత్తి చేసేందుకు బ్రూక్‌హేవన్ నేషనల్ లాబొరేటరీ శాస్త్రవేత్తలు మార్గం సుగమం చేశారు. పర్యావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించేలా జీవ ఇంధనాల ఉత్పత్తికి ఈ పరిశోధన సాయపడుతుందని అంచనా. మొక్కల బయోకెమిస్ట్రీపై పరిశోధనల సందర్భంగా శాస్త్రవేత్తలకు నూనె ఉత్పత్తికి విఘాతం కలిగిస్తున్న కొన్ని రసాయనాల వివరాలు తెలిశాయి. ఈ రసాయనాలను నిర్వీర్యం చేస్తే మొక్కల ద్వారా నూనె ఉత్పత్తి ఎక్కువవుతుందని వీరు అంచనా వేస్తున్నారు. ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువైనప్పుడు మొక్కలు నూనెల ఉత్పత్తిని తగ్గిస్తాయని ఇప్పటికే తెలుసునని.. అయితే ఇదెలా జరుగుతుందో తాము గుర్తించామని అంటున్నారు జాన్ శాంక్లిన్ అనే శాస్త్రవేత్త. అయితే సాధారణ పరిస్థితుల్లోనూ ఈ నియంత్రణ ఉండటం తమను ఆశ్చర్యపరిచిందని చెప్పారు. ఒక ఎంజైమ్ కారణంగా ఇలా జరుగుతోందని తాము గుర్తించామని, సహజసిద్ధంగా ఈ ఎంజైమ్‌లో లోపాలున్న మొక్కలతో కలిపి కొత్త వంగడాలను సృష్టించినప్పుడు నూనె ఉత్పత్తి ఎక్కువైనట్లు తెలిసిందని శాంక్లిన్ వివరించారు. -
కేజీ బేసిన్లో చమురు ఉత్పత్తి తగ్గింది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోని మొత్తం గ్యాస్ ఉత్పత్తిలో 50 శాతానికి పైగా ఏపీలోని కృష్ణా – గోదావరి (కేజీ) బేసిన్ నుంచే ఉత్పత్తవుతున్నట్లు హైడ్రోకార్బన్స్ డైరెక్టర్ జనరల్ ఆంతనూ చక్రవర్తి తెలియజేశారు. ‘‘దేశంలో రోజుకు 80 మిలియన్ ఘనపుటడుగుల (ఎంఎంసీఎం) గ్యాస్ ఉత్పత్తవుతోంది. దీన్లో కేజీ బేసిన్లోనే రెండు కంపెనీల నుంచి 43–45 ఎంఎంసీఎం ఉత్పత్తవుతోంది. దీన్లో ఓఎన్జీసీ వాటా 15–18 ఎఎంసీఎం కాగా ప్రైవేట్ సంస్థది 25–30 ఎంఎంసీఎం ఉంటుంది. గతంలో ఈ రెండు కంపెనీలూ కేజీ బేసిన్ నుంచి రోజుకు 65 ఎంఎంసీఎం గ్యాస్ ఉత్పత్తి చేసేవి. కానీ, ఇప్పుడది తగ్గింది’’ అని ఆయన వివరించారు. ఉత్పత్తి తగ్గటానికి ఆయన పలు కారణాలను వెల్లడించారు. కేజీ బేసిన్లో ఒక్కోచోట 1,200–2 ,600 మీటర్ల లోతు నీళ్లుంటాయని అందుకే చమురు ఉత్పత్తి సవాల్‌గా మారుతోందని వ్యాఖ్యానించారు. హైడ్రోకార్బన్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ లైసెన్సింగ్ పాలసీ (హెచ్ఈఎల్పీ) కింద ఓపెన్ ఆర్కేజ్ లైసెన్సింగ్ ప్రోగ్రామ్ (ఓఏఎల్‌పీ) వేలం జరిగింది. దేశంలోని 11 రాష్ట్రాల్లో 55 బ్లాక్స్‌కు వేలం నిర్వహించిన సందర్భంగా జాయింట్ సెక్రటరీ (ఎక్స్‌ప్లోరేషన్) దివాకర్ నాథ్ మిశ్రాతో కలిసి బుధవారమిక్కడ మీడియాతో ఆయన ఈ విషయాలు చెప్పారు. రూ.91 వేల కోట్ల పెట్టుబడులు.. 2021–2023 నాటికి కేజీ బేసిన్లో రెండు ప్రధాన చమురు, గ్యాస్ అన్వేషణ– ఉత్పత్తి కంపెనీల నుంచి సుమారు రూ.91 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముందని ఆంతనూ అంచనా వేశారు. ప్రస్తుతం ఓఏఎల్‌పీ వేలం నిర్వహిస్తున్న 55 బ్లాక్స్‌లో 5 బ్లాక్స్ (3 ఆన్‌ల్యాండ్, 2 ఆఫ్‌షోర్) కేజీ బేసిన్లోనే ఉన్నాయి. కాగా కేజీ బేసిన్ ఆన్‌ల్యాండ్ 28 వేల చ.కి.మీ., ఆఫ్‌షోర్ 2.02 లక్షల చ.కి.మీ. విస్తరించి ఉంటుంది. ఏప్రిల్ 3తో వేలం ముగుస్తుంది. మరో 15 రోజులు పొడిగించే అవకాశముంది. 2020 నాటికి తొలి చమురు ఉత్పత్తి.. ‘‘ప్రస్తుతం దేశంలో 70 శాతం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నదే. 2040 నాటికి దీన్ని 11 శాతానికి తగ్గించాలన్నది కేంద్రం లక్ష్యం. అందుకే 2016లో హైడ్రోకార్బన్ ఎక్స్‌ప్లోరేషన్ పాలసీని తీసుకొచ్చాం’’ అని అంతనూ తెలిపారు. ఇందులో భాగంగా గతేడాది మార్చిలో డిస్కవర్డ్ స్మాల్ ఫీల్డ్స్ (డీఎస్ఎఫ్)–1 వేలం నిర్వహించామంటూ... ‘‘23 కంపెనీలతో 30 ఒప్పందాలు చేసుకున్నాం. ఇందులో 13 కంపెనీలు కొత్తవే. వీటి నుంచి పన్నుల ద్వారా కేంద్రానికి రూ.9,300 కోట్లు, రాయల్టీగా రూ.5 వేల కోట్ల వాటా వస్తుంది. రాయల్టీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన వాటా ఉంటుంది’’ అని ఆయన వివరించారు. వచ్చే నెలలో డీఎస్ఎఫ్–2లో 60 బ్లాక్స్ వేలం ప్రారంభమవుతుందన్నారు. ఏటా చమురు డిమాండ్ 4.5–5 శాతం వృద్ధి.. ప్రస్తుతం దేశంలో 37 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు ఉత్పత్తి అవుతుండగా.. డిమాండ్ మాత్రం 100–120 మిలియన్ మెట్రిక్ టన్నులుందని, అలాగే రోజుకు 80 ఎంఎంసీఎఫ్ గ్యాస్ ఉత్పత్తి ఉండగా.. 140 ఎంఎంసీఎఫ్ డిమాండ్ ఉందని చెప్పారాయన. ఏటా 4.5–5 శాతం డిమాండ్ పెరుగుతోందని.. అదే విదేశాల్లో అయితే 1–1.5 శాతం వరకే పెరుగుదల పరిమితమవుతోందని ఆయన వివరించారు. -
కల్తీనూనె గుట్టు రట్టు
-
ఆయిల్ వద్దంటే అనర్థమే!
సాక్షి, హైదరాబాద్: ‘నూనె లేని ఆహార పదార్థాలు తింటేనే ఆరోగ్యకరమని చాలామంది అనుకుంటారు. కానీ అసలు నూనెలే వాడకపోవడం అనారోగ్యకరం’ అని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ)లోని ఆయిల్స్, ఫ్యాట్స్ సైంటిఫిక్ ప్యానెల్ జాతీయ చైర్మన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) మాజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్‌బీఎన్ ప్రసాద్ అన్నారు. ‘ప్రతీ మనిషికి సాధారణం గా రోజుకు 2 వేల కేలరీలు కావాలి. కష్టపడి పని చేసే వారికి 2,500 వరకు కేలరీలు అవసరం. అందులో 30 శాతం నూనెలు, కొవ్వుల ద్వారానే రావాలి. అంటే 50 నుంచి 65 గ్రాము ల వరకు ఫ్యాట్స్ అవసరం’అని తెలిపారు. శనివారం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆర్‌బీఎన్ ప్రసాద్.. నూనెలు వాడటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. సమాన నిష్పత్తిలో మూడు ఫ్యాటీ ఆమ్లాలు ఆయిల్స్‌లో శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉండాలి. ఈ మూడు సమాన నిష్పత్తిలో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టంచేసిం ది. ఈ నిష్పత్తిలో బ్యాలెన్స్ తప్పితే అనారోగ్య సమస్యలు ముంచెత్తుతాయి. పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు చాలా ముఖ్యమైనవి. ఇవి మన శరీరంలో తయారు కావు. వీటిని నూనెల ద్వారానే తీసుకోవాలి. ఇవి ఎక్కువున్నా, తక్కువున్నా సమస్యలే. పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాల్లో ఒమెగా–3, ఒమెగా–6 ఆమ్లాలుం డాలి. ఒమెగా–3 ఆమ్లాలు.. కేవలం సోయాబీన్, ఆవ నూనెల్లో మాత్రమే 5–10 శాతం ఉం టాయి. ఒమెగా–3 లేని నూనెలను వాడితే శారీరక రుగ్మతలు తలెత్తుతాయి. ఒమెగా–3 ఉన్న నూనెలను వాడని వారు తప్పనిసరిగా వేయించిన అవిసె గింజలు రోజూ కొద్దిగా తింటే సరిపోతుంది. అవిసె గింజల్లో 55 శాతం ఒమెగా–3 ఆమ్లాలుంటాయి. నిత్యం చేపలు తినేవారికి కూడా ఒమెగా–3 లభిస్తుంది. ఆలివ్ నూనెలో మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు 75 శాతం ఉంటాయి. ఇక సన్ ఫ్లవర్, సోయాబీన్, మొక్కజొన్న, పత్తి గింజ, అవిసె నూనెల్లో పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు 50 శాతం కంటే ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి నూనెలో 90 శాతం, పామాయిల్లో 50 శాతం వరకు శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. ఆ నూనెలు అత్యంత ప్రమాదకరం జంతువుల కొవ్వు, కళేబరాల నుంచి తయారు చేసే నూనెలు అత్యంత ప్రమాదకరం. వాటిలో శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయి. తినుబండారాలు తయారు చేసే కేంద్రాల్లో ఉపయోగించే అవకాశముంది. తక్కువ ధరకు దొరుకుతుంది కాబట్టి వ్యాపారస్తులు వారికి అంటగడుతుంటారు. వృక్షాల నుంచి తయారయ్యే నూనెలో కొలెస్ట్రాల్ ఉండదు. ఇక నూనెలను పలుమార్లు వాడకూడదు. ఎక్కువ సార్లు వేడి చేసినప్పుడు పెరా క్సైడ్ వంటి విష పదార్థాలు తయారవుతాయి. విడిగా కొనవద్దు.. - ఆయిల్‌ను విడిగా కొనవద్దు. ప్యాకింగ్ నూనెనే కొనుగోలు చేయాలి. ప్యాకింగ్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు అనిపిస్తే.. బ్రాండెడ్ నూనెలైనా సరే కొనకూడదు. - ప్యాకింగ్‌పై ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ఉందా లేదా చూసుకోవాలి. - న్యూట్రీషియన్ సమాచారం, ప్రమాణాల ప్రకారం 3 ఫ్యాటీ ఆమ్లాల సమాన నిష్పత్తి ఆధారంగానే నూనెలను ఎంపిక చేసుకోవాలి. - గుండెకు మేలు జరుగుతుందంటూ ప్యాకింగ్‌లపై రాస్తారు. అయితే సైంటిఫిక్ రిఫరెన్స్ లేబిలింగ్ ఉందో లేదో చూసుకుని మాత్రమే కొనాలి. అనుమానమొస్తే ఎఫ్ఎస్ఎస్ఏఐకి ఫిర్యాదు చేయవచ్చు. - పత్తి గింజల నుంచి నూనె తీస్తుంటారు. పత్తి పంటలో రసాయనాలు కలుపుతుండటం వల్ల నూనె కూడా విషంగా మారుతుందని అనుకోవడం అశాస్త్రీయం. రిఫైనింగ్‌లో అంతా సవ్యంగానే ఉంటుంది. బ్రాండెడ్ కంపెనీలు రిఫైనింగ్‌ను సరిగానే చేస్తుంటాయి. మహారాష్ట్రలో పత్తి నూనెను అధికంగా వాడతారు. -
ఆయిల్ మాత్రమే కాదు ..కొత్త సాయిల్ కూడా డేటానే
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ టెలికాం పరిశ్రమ నష్టాలకు జియోను నిందించొద్దని ప్రముఖ వ్యాపారవేత్త ,రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. భారతీ ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ తనకు ప్రత్యర్థి కాదని, స్నేహితుడని ప్రకటించారు. వ్యాపారంలో సాహసాల ఫలితంగానే లాభనష్టాలు వస్తాయని.. ఏది ఏమైనా కస్టమర్లు ప్రధానమని చెప్పుకొచ్చారు. దేశం పురోగతి చెందుతుందా, వినియోగదారుడికి ప్రయోజనం కలుగుతుందా అనేదే కీలకమన్నారు. హెచ్‌టీ లీడర్షిప్ సమ్మిట్ 2017 లో ముకేష్ అంబానీ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో 'డిజిటల్ హరిత విప్లవం' రావాలన్నారు. ఈ నేపథ్యంలో 58,000 కళాశాలలు, 700 విశ్వవిద్యాలయాలు , 19 లక్షల పాఠశాలలు డిజిటల్‌గా అనుసంధానంకానున్నాయన్నారు. దేశంలో జియో ఎంట్రీతో డేటా సేవల స్వరూపమే మారిపోయిందన్నారు. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో గత ఏడాది 150వ స్థానంలో ఉన్న భారత్ ప్రపంచంలో నంబర్‌వన్‌గా ఎదిగిందని ఆయన వెల్లడించారు. ఇపుడు దేశానికి ఆయిల్ సాయిల్ డేటా అని చెప్పారు. అలాగేతన మిత్రుడు నందన్‌నీలేకని సృష్టించిన బయోమెట్రిక్ ఆధార్ ప్రపంచంలోనే అత్యంత భద్రమైన వ్యవస్థగా నిలిచిందని ప్రశంసించారు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి మార్గంలో పయనిస్తోందని ముఖేశ్ అంబానీ అన్నారు. 2024 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ రెట్టింపై 5 ట్రిలియన్ డాలర్లను చేరుకుంటుందన్నారు. ‘2004లో భారత ఆర్థిక వ్యవస్థ 500 బిలియన్ డాలర్లుగా ఉంది. వచ్చే 20ఏళ్లలో 5 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అప్పుడే తాను అంచనా వేశాననీ, ప్రస్తుత ప్రగతి చూస్తుంటే అంతకంటే ముందే ఆ లక్ష్యాన్ని భారత్ చేరుకుంటుంది.వచ్చే పదేళ్లలో 7 ట్రిలియన్ డాలర్లకు కచ్చితంగా చేరగలం మనీ.. 2030 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల సమీపానికి ఎదుగుతామని అంబానీ వెల్లడించారు. -
ఆయిల్ చోరీ కేసులో టీడీపీ నేత కుమారుడు
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోలీసులు మంగళవారం ఆయిల్ మాఫియా ముఠాను అరెస్టు చేశారు. పోర్టు నుంచి వచ్చే పైపు లైన్లకు రంధ్రాలు వేసి ఈ ముఠా ఆయిల్ చోరీకి పాల్పడుతున్నారు. గత కొంతకాలంగా సాగుతున్న ఈ దందాకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఠా అరెస్టుతో మాఫియా వెనుక టీడీపీ నేత కుమారుడు గ్రంథి బాబ్జీ కుమారుడు రాజా ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం పరారీలో ఉన్న రాజా కోసం పోలీసులు గాలిస్తున్నారు. తస్కరించిన రెండు టన్నుల ఆయిల్ ను రాజా కొనుగోలు చేసినట్లు అభియోగాలున్నాయి. -
జగిత్యాల జిల్లాలో నీటిబావిలో చమురు
-
భర్తపై కాగుతున్న నూనె పోసిన భార్య
రేబాల (బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు) : భార్యభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో అసహనానికిగురైన భార్య తన భర్తపై కాగుతున్న నూనెను పోసింది. ఈ సంఘటన బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల తూర్పు దళితవాడలో చోటుచేసుకుంది. వివరాలు.. దళితవాడకు చెందిన మమత్కు (32) తన భార్యకు మనస్పర్ధలున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కాగుతున్న నూనెను మమత్పై అతడి భార్య పోసింది. దీంతో మమత్కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని 108 సహాయంతో బుచ్చిరెడ్డిపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
మచ్చలు పోవడానికి
అందమె ఆనందం ► కొబ్బరి నూనెలో గోరింటాకు పొడి కలిపి పేస్టు చేసుకుని ముఖానికి పట్టిస్తే మచ్చలు పోతాయి. కొబ్బరి నూనె బదులుగా మరే ఇతర నూనెనయినా వాడవచ్చు. ►అర టీ స్పూన్ నిమ్మరసంలో నాలుగు చుక్కల గ్లిజరిన్ కలిపి మచ్చల మీద రాస్తుంటే మచ్చలు పోతాయి. ►కరివేపాకులో చిటికెడు పసుపు వేసి గ్రైండ్ చేసి మచ్చల మీద రాసి పదిహేను నిమషాల తర్వాత కడగాలి. ►గోరింటాకు పొడిలో చిటికెడు పసుపు కలిపి మచ్చల మీద రాయాలి. ► ఎండిన తులసి, వేప, పుదీన ఆకులు ఒక్కొక్కటి వందగ్రాములు తీసుకుని అందులో చిటికెడు పసుపు వేసి కలుపుకుని నిలవ ఉంచుకోవాలి. వాడేటప్పుడు రెండు టీ స్పూన్ల పొడిలో తగినంత పన్నీరు వేసి కలుపుకుని ముఖానికి పట్టించాలి. ► తమలపాకుల్లో కొద్దిగా కొబ్బరినూనె కలిపి గ్రైండ్ చేసి మచ్చల మీద రాయాలి. ► తులసి ఆకులలో పసుపు వేసి గ్రైండ్ చేసి ముఖానికి పట్టించాలి. ► దోసకాయ రసాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగితే గీతలు, మచ్చలు తగ్గడమే కాకుండా చర్మం బిగుతుగా కూడ ఉంటుంది. ► తేనెలో కుంకుమ పువ్వు కలిపి రంగరించి మచ్చల మీద రాయాలి. -
నువ్వూ...నేనూ...నూనె...!
పురుషులందు పుణ్యపురుషుల్లాగే నూనెల్లో మంచినూనెలు వేరు. ఉప్పు కప్పురమ్ము లాగే అమాయకంగా కనిపించే కొవ్వులూ ఉన్నాయి. టేస్టు కోసమే చూసుకుంటే... ఫ్రయ్ లోంచి పొయ్యిలోకి దూకేసినట్లు అనుకుంటారు చాలా వుంది. రోస్ట్లతో ఎందుకీ రొష్టు అనుకొని హేస్టీ నిర్ణయంతో నూనె వస్తువులనే ముట్టరు కొందరు. అసలు నూనె వాడకపోవడం మంచిదేనా? కానే కాదు. శరీరానికి నూనె అవసరం. అవసరమైనంత నూనెను తీసుకుంటూనే ఆరోగ్యం కాపాడుకునే వూర్గాలు ఉన్నాయా? ఉన్నాయి. కాకపోతే మోతాదు మించనివ్వకూడదంతే. ఆ మోతాదేమిటో, నూనె వాడినా కొవ్వు చేరకుండా జాగ్రత్తలెలాగో తెలుసుకునేందుకే ఈ కథనం... నారు పెరగడానికి నీరు ఎలాగో, కూరా, నారా, చారూలో రుచి పెరగడానికి నూనె అలాగ. తాలింపు నుంచి వేయింపు వరకు తన ప్రాధాన్యం చూపుతుంది. కిచిడీ నుంచి పచ్చడి వరకూ మటన్ నుంచి చికెన్ వరకు కిచెన్‌ను శాసిస్తుంది. అయితేనేం... నూనెకు నిత్యం నీలాపనిందలు. కమ్మదనాన్ని పెంచినా కోప్పడేవారే ఎక్కువ... జబ్బులన్నింటికీ కారణం అదేనంటూ. మనిషి బతకడానికి ఆహారంలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఖనిజాలూ, విటమిన్లతో పాటూ కొవ్వులూ కావాల్సిందే. మిగతావాటన్నింటికీ బోల్డ్డంత గౌరవం ఒక్క నూనెలకు తప్ప. వుహా అదొక్కటే ఆరోగ్యాన్ని పాడుచేసేట్లు అవవూనాలూ, ఆడిపోసుకోవడాలు. అది నిజమేనా? నూనెను నిరసించాల్సిందేనా? ఆరోగ్యం చెడిపోనివిధంగా నూనెల్ని ఉపయోగించుకోలేవూ?... తప్పక ఉపయోగించుకోవచ్చు. శరీరంలో కొవ్వులు పెరక్కుండా కాపాడుకోవచ్చు. అవసరం కూడా... శరీర నిర్వహణకు అన్ని పోషకాలూ అవసరమైన పాళ్లలో కావాలి. అదే సమతులాహారం. ఓ ఆరోగ్యకరమైన వ్యక్తి తన ఆహారంలో 55% కార్బోహైడ్రేట్లు, 25%ప్రోటీన్లు, 20% కొవ్వులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమతౌల్యంలో ఏది లోపించినా అది మనిషి శారీరక, మానసిక ఆరోగ్యాలపై ప్రభావం చూపుతుంది. అందుకే శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థాలు సవుకూరేందుకు నూనెలు తీసుకొని తీరాల్సిందే. కాకపోతే అవసరమైన మోతాదుకు మించనివ్వకూడదు. పైగా అవి 20% కావాలంటే వాటి ప్రాధాన్యం ఎంతో గుర్తించి తీరాల్సిందే. నూనెల రకాలివి... శరీరానికి కొవ్వులను సవుకూర్చే నూనెలు 3 రకాలు. శాచురేటెడ్: సాధారణంగా ఇవి గది ఉష్ణోగ్రత వద్ద ఘనరూపంలో ఉంటాయి. తెల్లగా అవూయికంగా కనిపిస్తుంటాయి. అయితే కనిపించేంత అవూయికం కావవి. టేస్టీగా ఉన్నా కాస్తంత ఖతర్నాకే. అవే... నెయ్యి, వెన్న, జున్ను, మీగడ, పామోలిన్ ఆయిల్. (వాటితోపాటు పత్తిగింజల నుంచి తీసే నూనె కూడా శాచురేటెడ్ ఆయిలే. ఇది చాలా చవక కాబట్టి ఎక్కువ వుంది వాడుతుంటారు.) హైడ్రోజనేటెడ్: నెయ్యిలాంటి స్వాభావిక పదార్థాలను కృత్రివుంగా తయారు చేయడం కోసం ఈ ప్రక్రియ ద్వారా నూనెలు చేస్తారు. ఉదాహరణకు డాల్డా, వూర్జరిన్ వంటివి. (చిప్స్ వంటివి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే హైడ్రోజనేటెడ్ ఆయిల్స్‌లో వేయిస్తారు. పదార్థాలకు ఎక్కువ షెల్ఫ్‌లైఫ్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి). అన్‌శాచురేటెడ్: ఇందులో వుళ్లీ రెండు రకాలు ఉన్నాయి. మెుదటివి పాలీ అన్‌శాచురేటెడ్ నూనెలు. సంక్షిప్తంగా ‘ప్యూఫా’ అంటారు. ఇవి పొద్దుతిరుగుడు నూనె, కుసువు నూనె (సాఫ్ ఫ్లవర్ ఆయిల్) వంటివి. రెండో రకం నూనెలు మోనో అన్‌శాచురేటెడ్ ఆయిల్స్. సంక్షిప్తంగా ‘వు్యూఫా’ అంటారు. నువ#్వల నూనె, సోయాబీన్ నూనె, ఆలివ్ ఆయిల్... (వీటన్నింటిలోనూ ఆలివ్ ఆయిల్ వుంచిదంటారు నిపుణులు) ఇవన్నీ వు్యూఫా ఆయిల్స్. నిజంగానే ప్రమాదమా..?: కానే కాదు. పైగా వుుందుగా చెప్పినట్లు శరీరంలోని కీలక అవయవాల పరిరక్షణకు అవసరం కూడా. వునలోని కాలేయం కొన్ని కొవ్వులను తయారుచేస్తుంది. అందులో కొలెస్ట్రాల్ ఒకటి. కానీ ఈ ప్యూఫా, మన శరీరంలో తయారుకావలి. కాబట్టి శరీరానికి అవసరమైనవాటిగా ఈ నూనెల్ని ఆహారంలో తీసుకోక తప్పదు. ఇవి తీసుకోక తప్పదు కాబట్టే వీటిని ‘ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్’ అని కూడా అంటారు. పైగా విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ... వంటి కొన్ని విటమిన్లు శరీరంలోకి అబ్జార్బ్ కావాలంటే నూనెలు తీసుకోక తప్పదు. వాటిని ‘ఎసెన్షియల్’ అంటున్నావుంటే అవెంత అవసరమైనవో తెలియడం లేదూ! ఇక చేపల నుంచి అందే నూనెల్లో, అవిసె గింజల నూనెలో ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాటితో సుదీర్ఘకాలం ఆరోగ్యంతో పాటు వయసు కనపడకపోవడం వంటి సుగుణాలు ఉంటాయి. అందుకే వూంసాహారం తినేవారైతే వారానికి కనీసం వుూడు, నాలుగు రోజులు చేపలను సిఫార్సు చేస్తుంటారు ఆహారనిపుణులు. ఆరోగ్యాన్ని కాపాడుకోండి... ఇలా! నూనెలు ఎక్కువగా తీసుకుంటే అవి కొవ్గా వూరి రక్తనాళాల్లో పేరుకుపోతాయన్న విషయం తెలిసిందే. గుండెకు వెళ్లే రక్తనాళాల్లో ఈ కవ్వు పేరుకుని గుండె కండరానికి రక్తం సరఫరా కాకపోతే గుండెపోటు వచ్చే ప్రవూదం ఉంటుంది. రక్తపోటూ పెరుగుతుంది. ఇలాంటి ప్రవూదాలెన్నో ఉన్నాయి. అయితే మరోపక్క అవి అత్యవసరం కూడా. మరెలా? అందుకే ప్యూఫా, లను ఒకదానిపై ఒకటి నిఘా ఉంచేలా చేస్తే సరి అంటున్నారు నిపుణులు. శరీర అవయవాలన్నింట్లోనూ వీవీఐపీ గుండె. అంతటి వీఐపీకి ఇద్దరు సెక్యూరిటీ గార్డులను ఉంచితే సరి. ‘ప్యూఫా, మ్యూఫా’ నూనెలు రెంటినీ తీసుకుంటే వీవీఐపీ లాంటి గుండెకు రక్షణగా ఉంటాయవి. ప్యూఫా (పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్) నూనెలైన పొద్దుతిరుగుడు లేదా కుసుమ నూనెలను ఓ పూట తీసుకోవాలి. వురో పూట వు్యూఫా (మోనో అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్) నూనెలైన ఆలివ్ లేదా వేరుసెనగ నూనెలను తీసుకోవాలి. షిఫ్ట్ డ్యూటీల్లో ప్యూఫా, మ్యూఫా: ఈ ప్యూఫా, మ్యూఫాలను ఉదయం ఒక వెరైటీ నూనె ఉపయోగిస్తే, సాయంత్రం మరోటి ఉపయోగించాలి. అలా కాకపోతే ఒక నెలంతా ప్యూఫా ఉపయోగిస్తే, వురో నెలలో వు్యూఫా వాడాలన్నవూట. అంటే... ఒకనెల పొద్దుతిరుగుడు నూనె తీసుకుంటే మరో నెల వేరుశెనగ నూనె వాడాలి. దాంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. ఇలా ఉదయం, సాయంత్రం, ఓ నెల అదీ, వురో నెల ఇదీ అంటూ పూట షిఫ్టుల్లోగానీ, నెల, నెలా షిఫ్టుల్లోగానీ ఈ ప్యూఫా, మ్యూఫాలను ఉపయోగిస్తే వీవీఐపీ అయిన గుండె థిలాసా అన్న భరోసా మీ సొంతం. రౌడీ బాబాయిలతో రవ్వంత జాగ్రత్త... ఎలాగూ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు కదా అని హృదయాన్ని రఫ్ ఆడించే రౌడీలను లోనికి పంపడం సరికాదు కదా. అలాగే ఆరోగ్యం కోసం ప్యూఫా, మ్యూఫా తీసుకుంటున్న ధీమాతో నెయ్యీ, వెన్న, మీగడలను తీసుకోవద్దు. గుండెకు హాని చేసే రౌడీబాబాయిలివి. బంధం విషయంలో బాబాయిల్లా – రుచి విషయంలో శాచురేటెడ్ ఆయిల్స్ అయిన నెయ్యి, వెన్న, మీగడలు కమ్మగా ఉంటాయి. మెత్తగా ఉంటూనే గుండెలు కోసే టైపు అవి. నిజానికి ప్యూఫా నూనెలు శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను బ్యారికేడ్లా అడ్డుకుంటాయి. రక్తనాళాలనుంచి కొలెస్ట్రా్టల్ కవ్వును శుభ్రం అయ్యేలా చేస్తుంటాయి. అయితే ప్యూఫా ఎలాగూ కొలెస్ట్రాల్‌ను బయటకు పంపేస్తుంది కదా అని నెయ్యి, వెన్న, మీగడలు తీసుకుంటుంటే... ప్యూఫా నూనెలు కొలెస్ట్రాల్ శుభ్రపరిచే వేగం కంటే శాచురేటెడ్ కొవ్వుల వల్ల శరీరంలో పేరుకుపోయే కొవ్వు ఎక్కువ. పరిమితి ఎంత...? నూనెలు ఎక్కువైనా ప్రమాదం. అందుకే మోతాదు మించనివ్వకూడదు. మీ ఇంట్లో ఉన్న వ్యక్తుల సంఖ్యను బట్టి మీరు ఉపయోగించే నూనె ఎక్కువా? తక్కువా అన్న విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. తల ఒక్కంటికి నెలకు 500 ఎంఎల్ నూనె వాడితే మంచిది. అంటే... ఐదుగురు సభ్యులున్న ఇంట్లో నెలకు రెండున్నర లీటర్ల నూనె సరైన వినియోగం అన్నమాట. ఇవీ ప్రమాదాలు...: ఆహార పదార్థాలను బాగా ఫ్రై చేసి ఉపయోగించేందుకు నూనెలు వాడుతుంటారు. నిజానికి బాగా ఫ్రై చేయడం వల్ల ఆహారంలోని పోషకాలు వెళ్లిపోతాయి. దాంతో ప్రయోజనం లేదు. పైగా ఆలివ్ ఆయిల్ వంటి నూనెల్లోని రసాయన బంధాలు వేడి చేయడం వల్ల త్వరగా విడిపోతుంటాయి. అందుకే ఆలివ్ ఆయిల్‌తో డీప్ ఫ్రైస్ చేసుకోవద్దు. మరోవూట... ప్యూఫా, వు్యూఫాలను విడివిడిగానూ వాడుకోవాలి. రెండూ ఉపయోగిస్తే మంచిది కదాని రెండూ కలిపి ఉపయోగించవద్దు. ఎందుకంటే... వేడిచేసే సవుయంలో వాటి వాటి స్మోకింగ్ పాయింట్స్ వేర్వేరుగా ఉంటాయి. అందుకే దేనికదే వాడాలి. ఓసారి ఫ్రై చేయడం కోసం కాచిన నూనెను వురోవూరు ఉపయోగించకూడదు. మెుదటిసారి కాచిన నూనె వురోవూరు ఉపయోగిస్తే అది క్యాన్సర్ కారకం (కార్సినోజెనిక్) అవ#తుంది. కాబట్టి వాటిని పారేయడమే వుంచిది. కత్తికి రెండువైపులా పదునులాగే నూనెల విషయంలోనూ అంతే. కత్తిలాగే నూనె కూడా నిత్యావసరమే. అందుకే విచక్షణతో, జాగ్రత్తతో వాడుకుంటే అదెంతో రుచే కాదు... ఆరోగ్యం కూడా. ఎలాగూ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు కదా అని గుండెను రఫ్ ఆడించే రౌడీలను లోనికి పంపడం సరికాదు కదా. అలాగే ఆరోగ్యం కోసం ప్యూఫా, మ్యూఫా తీసుకుంటున్న ధీమాతో నెయ్యి, వెన్న, మీగడలను తీసుకోవద్దు. గుండెకు హాని చేసే రౌడీబాబాయిలివి. – యాసీన్, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పనీర్ సలాడ్
క్విక్ రెసిపీ తయారి సమయం: 15 నిమిషాలు కావలసినవి: ఆపిల్ ముక్కలు – కప్పు; కీరా – ఒకటి (చెక్కుతీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి); పచ్చి బఠాణీ – గుప్పెడు; క్యారట్ – రెండు పనీర్ ముక్కలు – అర కప్పు ; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – టీ స్పూన్; మిరియాల పొడి – పావు టీ స్పూన్; తేనె – అర టేబుల్ స్పూన్ తయారి: ముందుగా బఠాణీని కొద్దిగా ఉడకబెట్టుకుని నీటిని వంపేసుకోవాలి. క్యారట్‌ని సన్నగా తురిమిపెట్టుకోవాలి. పాత్రలో ఒక టీ స్పూన్ నూనె వేడయ్యాక పనీర్ ముక్కలు వేసి గోధుమరంగు వచ్చేలా వేయించి పక్కన పెట్టుకోవాలి. పై పదార్థాలన్నీ ఒక పాత్రలో ఒకదాని తరవాత ఒకటి వేసి, దీంట్లో తేనె జత చేసి కలియబెట్టి అందించాలి. -
చమురు ముప్పు
దాదాపు వారం రోజుల నుంచి చెన్నై సాగర తీరంలో సముద్ర జలాలతోపాటు కొట్టుకొస్తున్న చమురు తెట్టు మత్స్యకారులనూ, పర్యావరణవాదులనూ, ప్రజలనూ ఆందోళనకు గురిచేస్తోంది. కుటుంబసభ్యులతో, బంధు గణంతో, స్నేహితు లతో సాగరతీరాన్ని సందర్శించేవారూ... ఆరోగ్యాన్ని ఆశించి ఆ తీరంలో వ్యాహ్యా ళికి వెళ్లేవారూ అక్కడి గాలి మోసుకొస్తున్న చమురు వాసనతో ఇబ్బందిపడుతు న్నారు. మత్స్యకార గ్రామాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. గత నెల 28న చెన్నై సమీపంలోని ఎన్నోర్ ఓడరేవులో రెండు రవాణా నౌకలు పరస్పరం ఢీకొనడం పర్యవసానంగా చమురు లోడ్‌తో వెళ్తున్న ఒక నౌక ఒరిగి అందులోని 20 టన్నుల చమురు సముద్ర జలాల్లో కలిసింది. ఒలికిన చమురు ఇంతకన్నా చాలా రెట్లు ఎక్కువుంటుందన్నది పర్యావరణవేత్తల ఆందోళన. తీర రక్షక దళం సైతం ఆ మాటే చెబుతోంది. నౌక బాధ్యులు చెప్పినకంటే కనీసం పది రెట్లు ఎక్కువగా చమురు లీక్ అయి ఉంటుందని అంచనా వేస్తోంది. చమురు తెట్టును పూర్తిగా తొలగించడానికి కనీసం మరో వారం రోజులు పడుతుందని అంటున్నది. అయితే ఈ ఉదంతంలో అందరినీ కలవరపెడుతున్న అంశం ఈ చమురు లీక్‌పైనా, దాని పర్యవసానా లపైనా ఓడ రేవు అధికారులు పాటిస్తున్న గోప్యత. ఇదేమంత పెద్ద సమస్య కాద న్నట్టు మంత్రి రాష్ట్ర శాసనసభలో మాట్లాడారు. అనుకోనిదేమైనా జరిగి ఇబ్బం దులు ఏర్పడినప్పుడు అందుకు సంబంధించిన సరైన సమాచారాన్ని ప్రజానీకానికి అందించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఆందోళనను ఉపశమింపజేయ డానికి వీలవుతుంది. దాచి ఉంచితే సమస్య తీరదు సరిగదా వదంతులు వ్యాపి స్తాయి. ఈ సంగతి అటు ప్రభుత్వానికీ, ఇటు ఓడ రేవు అధికారులకూ తెలియక పోవడం విచిత్రం. చమురు తెట్టు తొలగింపు మరో వారానికో, పది రోజులకో పూర్తి కావొచ్చు... షిప్పింగ్ కంపెనీ చెబుతున్నట్టు ఒలికిన చమురు 20 టన్నులే కావొచ్చు. కానీ అది ఆ ప్రాంతంలోని మత్స్యసంపదపైనా, ఇతర సముద్ర జీవులపైనా, అక్కడి వాతావరణంపైనా కలిగించే ప్రభావం చాలా ఎక్కువుంటుంది. తిరిగి సాధారణ స్థితి ఏర్పడటానికి సమయం పడుతుంది. సముద్రంపై వీచే గాలులు తరచు దిశ మార్చుకుంటాయి. అందుకనుగుణంగా కెరటాలు కూడా ఉంటాయి. ఫలితంగా చమురు తెట్టు అన్ని దిశలకూ పోతుంది. ఒలికిన చమురు తీరానికి కొట్టుకుని వచ్చి నప్పుడు అక్కడి బురదనీటితో కలిసి అది మరింతగా పెరుగుతుంది. ఈ వారం రోజుల్లో తీర రక్షక దళం, వందలాదిమంది వలంటీర్లు కలిసి చమురు కలిసిన 600 టన్నుల అడుసును తీరం నుంచి తొలగించారు. కానీ ఇలా బకెట్లతో ఎన్ని రోజుల పాటు ఎన్ని వందలమంది నిర్విరామంగా పనిచేస్తే సాధారణ పరిస్థితులు ఏర్పడ తాయి? చమురు తెట్టు ఏర్పడినప్పుడు తొలగించడానికి ఉపయోగించే సాంకేతికత ఏమైనట్టు? అసలు జాతీయ విపత్తు నివారణ ప్రాధికార సంస్థ ఏం చేస్తున్నట్టు? ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అనుసరించాల్సిన విధివిధానాలపై అది మార్గ దర్శకాలు రూపొందించిందా? వాటిని ఓడ రేవు అధికారులకు అందజేసిందా? ఇంధనాన్ని మోసుకొచ్చే నౌకల భద్రత విషయంలో పటిష్టమైన నిబంధనలుం డాలి. వాటన్నిటినీ పాటించారా? ఇవన్నీ సాధారణ పౌరులను వేధిస్తున్న ప్రశ్నలు. ప్రమాదం జరిగిన వెంటనే చమురు తెట్టు తొలగింపునకు చర్యలు తీసుకుని ఉంటే నష్టం చాలా తక్కువుండేదని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. చమురు లీక్ కావడం ఇది మొదటిసారేమీ కాదు. 1997లో ముంబై తీరంలో ఒక వాణిజ్య నౌక మునిగి దాదాపు 200 టన్నుల చమురు, 13,000 టన్నుల రసా యన ఎరువులు సముద్ర జలాల్లో కలిసిపోయాయి. 2006లో సముద్ర గర్భంలో చమురు వెలికితీస్తున్న ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించి ఇంధనమంతా దహించుకుపోయింది. 2009లో సైతం ముంబై తీరంలోనే భారీమొత్తంలో చమురు సముద్రంలో కలిసింది. 2014లో సుందర్బన్స్ ప్రాంతంలో రెండు నౌకలు ఢీకొని లక్షలాది లీటర్ల చమురు ఒలికిపోయింది. ప్రమాదం జరిగిన కాసేపటికే చేపలు, ఇతర జలచరాలు వేల సంఖ్యలో తీరానికి కొట్టుకొచ్చాయి. 2010లో మెక్సికో జలసంధి వద్ద బ్రిటిష్ పెట్రోలియం(బీపీ) సంస్థకు చెందిన చమురు క్షేత్రంలో భారీ పేలుడు సంభవించి 11మంది చనిపోవడంతోపాటు లక్షలాది టన్నుల చమురు సాగర జలాల్లో కలిసింది. ఆ ఘటన కలిగించిన నష్టం అంతా ఇంతా కాదు. మెక్సికో జలసంధి పొడవునా ఉన్న అమెరికా రాష్ట్రాల్లో పర్యావరణం ఘోరంగా దెబ్బతింది. చివరకు బీపీ సంస్థ మెడలు వంచి అయిదేళ్ల తర్వాత భారీ మొత్తంలో పరిహారం రాబట్టారుగానీ ఆ ఘటన కలిగించిన నష్టం అంతా ఇంతా కాదు. ఇలాంటి ఉదం తాలు కలిగించే బహుముఖ నష్టాలపై నౌకల్లోని సిబ్బంది మొదలుకొని ఓడరేవు సిబ్బంది, తీర రక్షక దళం సిబ్బంది వరకూ అందరికీ అవగాహన ఉంటే ఇంధనాన్ని మోసుకొచ్చే నౌకల విషయంలో వారెవరూ ఏమరు పాటును ప్రదర్శించరు. చమురు తెట్టు తెచ్చే సమస్యలు బహుళమైనవి. సముద్ర జలాల్లో కలిసిన చమురులో కొంత ఆ జలాలతోపాటే ఆవిరై వాతావరణంలో కలుస్తుంది. తినే తిండి, పీల్చేగాలి కలుషితమై అదంతా మనిషి శరీరంలో చేరుతుంది. చర్మవ్యాధులు కలుగుతాయి. మత్స్యకారులు సముద్రంలో ఎంతో లోపలకు వెళ్లి చమురు తెట్టు ప్రభావం పడని ప్రాంతంలో చేపలు పట్టాల్సి ఉంటుంది. చమురు లీక్ తర్వాత చెన్నైకు సమీపంలోని వివిధ మత్స్యకార గ్రామాల ప్రజలు నిస్సహాయంగా సము ద్రంకేసి చూడటం తప్ప వేటకు వెళ్లలేకపోతున్నారు. మనకు జాతీయ విపత్తు నివా రణ ప్రాధికార సంస్థతోపాటు కాలుష్య నివారణ సంస్థలున్నాయి. ఈ సంస్థలు ప్రమాదాలకు ఆస్కారం ఉండేచోట పనిచేసేవారికి వాటిపై అవగాహన పెంచాలి. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో, ఆ ప్రమాదాలను నివారించడానికి లేదా వాటి తీవ్రతను తగ్గించడానికి ఏం చేయాలో చెప్పాలి. అవన్నీ సక్రమంగా అమలు జరగటం లేదని చెన్నై సమీపంలో చోటుచేసుకున్న తాజా ప్రమాదం నిరూపిస్తోంది. దీన్నుంచి గుణపాఠం తీసుకుని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడ వలసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. -
17 నెలల గరిష్టానికి ఆయిల్ ధరలు
న్యూయార్క్ : ఆయిల్ ఉత్పత్తి కోత, లిబియా, అమెరికానుంచి ఎగుమతులుపెరగనున్నాయనే అంచనాల నేపథ్యంలో ముడిచమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లలో 17 నెలల గరిష్టానికి చేరాయి. శుక్రవారం లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 0.2 శాతం పెరిగి 55.16 డాలర్ల వద్ద ముగిసింది. ఈ బాటలో న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ కూడా 0.13 శాతం బలపడి 53.02 డాలర్ల వద్ద స్థిరపడింది. ఇది 17 నెలల గరిష్టంకాగా, ఇంతక్రితం 2016 జూలైలో మాత్రమే చమురు ధరలు ఈ స్థాయిలో ట్రేడయ్యాయి. సరఫరా మరియు డిమాండ్ చుట్టూ చాలా అంశాలు పనిచేస్తున్నాయని అప్రమత్తంగా ఉండాలని యూరోపియన్ పరిశోధన డైరెక్టర్ , సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ లిమిటెడ్ క్రిస్టియన్ షుల్జ్ ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ,సరఫరా లో బ్యాలెన్స్ తప్పినపుడు ధరల పెరుగుదల సాధారణమని వ్యాఖ్యానించారు. లిబియన్ రీబౌండ్ లిబియాలో గత నెల కేవలం 600,000 బారెల్స్ గా చమురు ఉత్పత్తి పుంజుకుందని సరఫరా, బ్లూమ్‌బెర్గ్ అంచనాలు చూపిస్తున్నాయి. నేషనల్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తఫా సానల్లా ప్రకారం,2017 ప్రారంభంనాటికి ఒక రోజుకు 900,000 బారెల్స్, తదుపరి సంవత్సరం చివరి నాటికి 1.2 మిలియన్ బ్యారెల్స్ స్థాయికి ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. కాగా పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఎనిమిది సంవత్సరాలలో మొదటిసారి ఉత్పత్తి అరికట్టేందుకు గత నెల అంగీకరించింది. వియత్నాంలో నిర్వహించిన సమావేశంలో రష్యాతదితర నాన్‌ఒపెక్ దేశాలతో సౌదీ అరేబియా అధ్యక్షతన ఒపెక్ దేశాలు ఉత్పత్తిలో కోత విధించేందుకు ఒక అంగీకారానికి వచ్చాయి. 2017 జనవరి 1 నుంచి సంయుక్తంగా రోజుకి 18 లక్షల బ్యారళ్లమేర చమురు ఉత్పత్తిలో కోత విధించేందుకు నిర్ణయించాయి. దీంతో ఇటీవల చమురు ధరలు జోరందుకున్న సంగతి తెలిసిందే. -
క్విక్ ఫుడ్
పనీర్-కాజూ స్నాక్ కావలసినవి పనీర్: 100 గ్రా, జీడిపప్పు: 100 గ్రా (కచ్చాపచ్చాగా పలుకులు చేయాలి), కార్న్‌ఫ్లోర్: రెండు టీ స్పూన్లు , జీలకర్రపొడి : టీ స్పూన్, పసుపు: చిటికెడు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు: చిన్నకప్పు, నూనె: ఫ్రైకి సరిపడ, కొత్తిమీర తరుగు: టీ స్పూన్, పచ్చిమిర్చి తరుగు: టీ స్పూన్, గరంమసాలా పౌడర్: టీ స్పూన్, ఉల్లికాడల తరుగు: టీ స్పూన్, ఉప్పు: తగినంత తయారి పనీర్‌ని పది నిమిషాల సేపు వేడినీటిలో ఉంచి తీశాక మెత్తగా చిదమాలి. అందులో కార్న్‌ఫ్లోర్, జీలకర్రపొడి, గరంమసాలాపొడి, ఉల్లిపాయ తరుగు, పసుపు, ఉప్పు, కొత్తిమీర, ఉల్లికాడల తరుగు, పచ్చిమిర్చి తరుగు, జీడిపప్పు పలుకులను ఒక గిన్నెలో వేసి... తగినన్ని నీటితో ముద్దలా కలుపుకోవాలి. బాణలిలో నూనె పోసి వేడిచేయాలి. ఇప్పుడు పై మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకొని అరచేతిలో వేసి కావలసిన షేప్‌లో ఒత్తి కాగిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీయాలి. నూనెలో నుంచి తీసిన వెంటనే టిష్యూ పేపర్ మీద వేస్తే పేపర్ అదనంగా ఉన్న నూనెను పీల్చుకుంటుంది. ఈ పనీర్- కాజు స్నాక్‌కు టొమాటో సాస్ మంచి కాంబినేషన్. ఈవెనింగ్ స్నాక్‌గా చాలా బాగుంటుంది. -
క్రేజీ..వా!
కినోవా..? ఇదేంటబ్బా? ధాన్యమా? బంగారమా? కిలో ఖరీదు... వేలల్లోనా? ఆగండాగండి... అక్కడే ఉంది తిరకాసు అంతా. ప్రొటీన్లు, ఖనిజాలు- ఓయబ్బో బోలెడున్నాయ్ దీన్లో. అందుకే... గ్లామర్ తారలకిప్పుడిది ఫేవరెట్ ఫుడ్. రైతుకు రొక్కం... మనకు చేవ... కినోవా! కినోవా చికెన్ సలాడ్ కావలసినవి: కినోవా- ఒక కప్పు టొమాటో ముక్కలు- రెండు కప్పులు పాలకూర తరుగు- ఒక కప్పు చికెన్ - రెండు కప్పులు మీగడ- అర కప్పు వెల్లుల్లి రేకలు- మూడు (సన్నగా తరగాలి) నిమ్మకాయ- ఒకటి (పలుచగా తరగాలి) నిమ్మరసం- పావు కప్పు ఉప్పు- తగినంత మిరియాల పొడి- పావు టీ స్పూన్ ఆలివ్ ఆయిల్- రెండు టేబుల్ స్పూన్లు వేరుసెనగపప్పు- పావు కప్పు తయారీ: చికెన్ ముక్కలను ఉడికించాలి. రుచి పెరగడం కోసం కొద్దిగా అల్లం - వెల్లుల్లి, ఉప్పు వేసి ఉడికించుకోవచ్చు. లేదా ముక్కలను అలాగే ఉడికించవచ్చు. వేరుసెనగపప్పు, కినోవాను విడిగా మందపాటి పెనంలో సన్నమంట మీద దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత ఒక పాత్రలో కినోవా, టొమాటో, పాలకూర, చికెన్, మీగడ, వెల్లుల్లి, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. చివరగా వేరుసెనగపప్పు, నిమ్మకాయ చెక్కలను అలంకరించి సర్వ్ చేయాలి. గమనిక: పిల్లల కోసం చేసేటప్పుడు కినోవాను వేయించి చేస్తే ఇష్టపడతారు. పెద్దవాళ్లకు ఉడికించిన కినోవాతో చేస్తే మంచిది. కినోవా చిక్ పీ స్టిర్ ఫ్రై కావలసినవి: కినోవా ధాన్యం - ఒక కప్పు, పచ్చి సెనగలు - ఒక కప్పు, టొమాటో ముక్కలు- ఒక కప్పు, మిరప్పొడి- రెండు టీ స్పూన్లు, ఉప్పు- తగినంత, పాలకూర తరుగు - నాలుగు కప్పులు, ఉల్లిపాయ - ఒకటి (తరగాలి), వెల్లుల్లి రేకలు - నాలుగు (తరగాలి), అల్లం తరుగు - ఒక టీ స్పూన్, పచ్చి మిర్చి తరుగు - టీ స్పూన్ పోపు దినుసులు: ఆలివ్ ఆయిల్- మూడు టేబుల్ స్పూన్లు జీలకర్ర- రెండు టీ స్పూన్లు, గరం మసాలా పొడి- రెండు టీ స్పూన్లు, కూర పొడి- రెండు టీ స్పూన్, మిరియాల పొడి- చిటికెడు, ఎండు మిర్చి- రెండు (నిలువుగా చీరాలి) తయారీ: పచ్చి సెనగల్ని కడిగి ఆరుగంటల సేపు నానబెట్టి ఉడికించాలి. కినోవాను ఉడికించి పక్కన పెట్టాలి.మందపాటి వెడల్పు బాణలిలో ఆలివ్ ఆయిల్ వేసి, వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేయాలి. సన్నమంట మీద రెండు నిమిషాలపాటు వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు వేయాలి. గ్యాస్ స్టౌ మంటను మీడియంలో పెట్టి కలియబెడుతూ వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి వేసి, వేగిన తర్వాత కినోవా వేసి బాగా కలుపుతూ ఒక నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు ఉడికించిన పచ్చి సెనగలు వేసి, కలిపి రెండు నిమిషాల పాటు ఉంచాలి. టొమాటోలు, మిరప్పొడి, పాలకూర వేసి కలిపి మూతపెట్టాలి. అవి మగ్గిన తర్వాత ఉప్పు కలిపి మరో నిమిషం ఉడికించి, దించేయాలి. కినోవా ఉప్మా కావలసినవి: కినోవా - అర కప్పు, నూనె- ఒకటిన్నర టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు- ముప్పావు కప్పు, అల్లం తరుగు- అర టీ స్పూన్, పచ్చి మిర్చి తరుగు- ఒక టీ స్పూన్, ఎండు మిర్చి- ఒకటి, ఇంగువ- చిటికెడు, కరివేపాకు- ఒక రెమ్మ, ఆవాలు- అర టీ స్పూన్, జీలకర్ర- అర టీ స్పూన్, మినప్పప్పు- అర టీ స్పూన్, పచ్చి సెనగపప్పు- అర టీ స్పూన్, క్యారట్ ముక్కలు- ముప్పావు కప్పు, మొక్కజొన్న గింజలు- పావు కప్పు (పచ్చివి), పచ్చి బఠాణీలు- అర కప్పు, నీరు - రెండు కప్పులు, కొత్తిమీర తరుగు- రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు- తగినంత తయారీ: కినోవాను కడిగి పక్కన పెట్టాలి. బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి అవి పేలిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఎండుమిర్చి, ఇంగువ వేసి అర నిమిషం తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేయాలి. ఒక నిమిషం వేగిన తర్వాత క్యారట్ ముక్కలు, మొక్కజొన్న గింజలు, బఠాణీలు వేసి బాగా కలిపి మూతపెట్టి, సన్నమంట మీద రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు కినోవా, ఉప్పు వేసి కలిపి ఒక నిమిషం తర్వాత నీరు పోసి కలిపి మూత పెట్టి, సన్న మంట మీద ఉడికించాలి. నీరు పోసిన తర్వాత ఐదు నిమిషాల్లోనే కినోవా ఉడికి, ఉప్మా రెడీ అవుతుంది. గమనిక: కినోవా వంటకం పొడి పొడిగా ఉండాలంటే ఒక కప్పు కినోవాకు రెండు కప్పుల నీరు పోయాలి. మృదువుగా ఉండాలంటే రెండున్నర కప్పుల నీటిని పోయాలి. కూరగాయల మోతాదును బట్టి అంచనాతో నీటి మోతాదు పెంచుకోవాలి. కినోవా ధాన్యం సన్నగా ఉంటుంది. మామూలుగా పాత్రలో నీరు పోసి కడిగితే, నీటితోపాటు జారిపోతుంది. కాబట్టి పాత్రలో వేసి కడిగి, నీరు కారిపోవడానికి రవ్వను జల్లించే జల్లెడలో వేయాలి. -
బ్యూటిప్స్
జుట్టు నల్లగా నిగనిగలాడాలంటే గోరువెచ్చని ఆలివ్ ఆయిల్‌తో మర్దన చేయాలి. క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు చొప్పున చేస్తుంటే ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనెతో కూడా ఇలాగే మర్దన చేసుకోవచ్చు. మరీ పొడిబారి నిర్జీవంగా ఉంటే ఆలివ్ ఆయిల్ వాడితే త్వరగా ఫలితం ఉంటుంది. భృంగరాజ్, మహా భృంగరాజ్ నూనెలతో మర్దన చేస్తే కేశాలు నల్లగా మెరుస్తాయి. జుట్టు రాగి రంగులో ఉండే వాళ్లు దీనిని ప్రయత్నించవచ్చు. ఈ నూనెలు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. చుండ్రుతో బాధపడుతుంటే కరక్కాయ పొడిలో మామిడి టెంకలోని జీడిని పొడి వేసి తగినంత నీటితో పేస్టులా కలుపుకుని జుట్టుకు పట్టించాలి. కరక్కా య, మామిడి జీడి తాజావి దొరికితే రెండింటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకుని వాడితే పొడి కంటే బాగా పని చేస్తాయి. -
ఇంటిప్స్
పచ్చి బటానీలు ఉడికిస్తున్నప్పుడు వాటి రంగు మారుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఆ నీళ్లలో కొద్దిగా పంచదార వేస్తే చాలు.పాతబడిన లెదర్ బ్యాగ్‌లు, షూస్‌ను బేబీ ఆయిల్‌తో పాలిష్ చేస్తే కొత్తవాటిలా మెరుస్తాయి. మెత్తని క్లాత్ మీద కొద్దిగా బేబీ ఆయిల్ వేసి రుద్దాలి. అక్రిలిక్ పెయింట్ చర్మానికి అంటినట్లయితే వెంటనే బేబీ ఆయిల్ కాని అందుబాటులో ఉన్న మరేదయినా ఆయిల్ కాని రాసి బాగా రుద్దాలి. తరువాత సబ్బురాసి వేడి నీటితో కడిగితే పూర్తిగా పోతుంది. వేలి నుంచి ఉంగరాన్ని సులభంగా తీయాలంటే కొద్దిగా బేబీ ఆయిల్ కాని మరేదైనా ఆయిల్ కాని పట్టించాలి. ఉడెన్ ఫర్నిచర్‌ను శుభ్రం చేయాలంటే మెత్తటి క్లాత్ మీద కొద్దిగా బీర్ పోసి తుడవాలి. తర్వాత పొడి క్లాత్‌తో తుడిస్తే బాగా శుభ్రపడతాయి. బంగాళదుంపలు నిలవ ఉంటే మొల కలు వచ్చేస్తుంటాయి. బంగాళ దుంపలు ఉన్న బ్యాగ్‌లో ఒక ఆపిల్ ఉంచితే మొలకలు రావు. వెండి వస్తువులు నల్లబడకుండా ఉండాలంటే వాటిని భద్రపరిచే చోట కర్పూరం బిళ్ళలు ఉంచాలి. -
ఆయిల్, గ్యాస్ వ్యాపారం నుంచి వైదొలగం
ఎస్సార్ గ్రూప్ డెరైక్టర్ ప్రశాంత్ రుయా వెల్లడి పనాజి: ఆయిల్,గ్యాస్ వ్యాపారం నుంచి వైదొలగడం లేదని ఎస్సార్ గ్రూప్ సోమవారం స్పష్టం చేసింది. ఈ గ్రూప్ ఇటీవలే తన రిఫైనరీ కంపెనీ, ఎస్సార్ ఆయిల్లో 98 శాతం వాటాను రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్, ఇతర కంపెనీలకు 1,290 కోట్ల డాలర్లకు విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ విక్రయం కారణంగా వచ్చే నిధులతో..రూ.88 కోట్లుగా ఉన్న తమ రుణ భారం సగానికి తగ్గించుకుంటామని, వడ్డీ వ్యయాలు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గించుకుంటామని ఎస్సార్ గ్రూప్ డెరైక్టర్ ప్రశాంత్ రుయా చెప్పారు. అంతేకాకుండా ఇతర వ్యాపారాల్లో స్థిరీకరణకు, వృద్ధికి ఈ నిధులను వినియోగిస్తామని వివరించారు. భారత కార్పొరేట్ చరిత్రలో ఇదే అతి పెద్ద రుణ భారం తగ్గించుకునే ఎక్స్‌ర్‌సైజ్ అని అభివర్ణించారు. అంతా నగదులోనే జరిగే ఈ డీల్ వచ్చే ఏడాది మొదటి క్వార్టర్లో పూర్తవగలదని చెప్పారు. ఎస్సార్ గ్రూప్ ఆయిల్, గ్యాస్ వ్యాపారం నుంచి వైదొలగడం లేదని ప్రశాంత్ రుయా చెప్పారు. యూకేలోని స్టాన్‌లో నగరంలో 12 మిలియన్ టన్నుల రిఫైనరీను నిర్వహిస్తున్నామని, బ్రిటన్‌లో 12-13 శాతం మార్కెట్ వాటా ఉందని తెలిపారు. మౌలిక రంగంలో తగిన స్థాయిలో పెట్టుబడులు పెట్టి, అభివృద్ది చేస్తామని, తర్వాత సరైన సమయంలో విక్రయిస్తామని రుయా చెప్పారు. టెలికం వ్యాపారంలో కూడా ఎస్సార్ గ్రూప్ ఇదే విధంగా చేసింది. హాంగ్‌కాంగ్‌కు చెందిన హచిసన్ వాంపోవను కొనుగోలు చేసింది. తర్వాత 2011లో వొడాఫోన్‌కు 1,800 కోట్ల డాలర్లకు విక్రయించింది. -
పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు అన్యాయం
కర్నూలు సిటీ: అంతర్జాతీయ స్థాయిలో ఆయిల్ ధరలు తక్కువ రేటుకే లభిస్తున్నా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని తక్షణమే పెంచడం అన్యాయమని రక్షణ ఆటో, ఫోర్ వీల్లర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మోహన్ డిమాండ్ చేశారు. ఆదివారం ఓ స్కూల్ ఆవరణలో జరిగిన ఆటో కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారం వేసేందుకు పోటీ పడుతున్నాయని అన్నారు. ఎన్నికల సమయంలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ పార్టీలు అధికారంలోకి వస్తే అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఇంత వరకు నేరవేరలేదన్నారు. ఇప్పటీకే చాలా మంది ఆటో కార్మికులు ఫైనాన్స్ సంస్థల వేధింపులతో అవస్థలు పడుతుంటే ప్రభుత్వాలు 10 రోజుల్లో రెండు సార్లు పెట్రోల్, డీజీల్ ధరలు పెంచడం పేదలపై భారం మోపడమేన్నారు. పెంచిన ధరలను తగ్గించకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో రక్షణ ఆటో, ఫోర్ వీల్లర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు సుంకన్న, బాబుఖాన్ తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సీపీటీయూ నగర అధ్యక్ష, కార్యదర్శులు రాముడు, అంజిబాబు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ఈ నిర్ణయంతో పేదలపైనే భారం పడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసేందుకు కార్మికులు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. -
పుంజుకున్నచమురు ధరలు
లండన్: ఒపెక్ డీల్ కు పెట్టుబడిదారుల మద్దతు లభించినట్టు కనిపిస్తోంది. అల్జీరియా నాన్ ఒపెక్, ఒపెక్ దేశాల సమావేశం నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు బలపడుతున్నాయి. బ్రెంట్ చమురు బ్యారల్ ధర 50 డాలర్లను అధిగమించింది. ఆగస్ట్ తరువాత ఈ స్థాయికి చేరడం ఇదే ప్రథమం. విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా చమురు ధరలు ర్యాలీ అయ్యాయి. యూరోప్, ఆసియా మార్కెట్లు పెద్ద మార్కెట్లు గా ఉండగా, జర్మనీ, చైనా మార్కెట్లకు సోమవారం సెలవు. గత వారం అల్జీరియాలో జరిగిన రష్యా వంటి నాన్ ఒపెక్ దేశాలతో ఒపెక్ దేశాలు నిర్వహించిన సమావేశంలో ఉత్పత్తిలో కోత విధించేందుకు సౌదీ అరేబియా తదితర దేశాలు అంగీకరించాయి. గతరెండేళ్లుగా క్షీణిస్తున్న ధరలను ఊతం దిచ్చే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. రోజుకి 7.5 లక్షల బ్యారళ్ల మేర చమురు ఉత్పత్తిలో కోత పెట్టేందుకు సౌదీ అరేబియా తదితర దేశాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో లండన్ మార్కెట్లో 1 శాతం పెరిగి 50.69 డాలర్ల వద్ద ఉండగా, న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు కూడా బ్యారల్ దాదాపు 1 శాతం ఎగసి 48.70 డాలర్లకు చేరింది. -
బంగారం ధరెంతో తెలుసా?
♦ నిర్ణయించడానికి కొన్ని సూత్రాలు ♦ అంతర్జాతీయ ధర, డాలర్ మారకం ఆధారం ♦ డిమాండ్ సరఫరాలతో పాటు పలు అంశాల ప్రభావం చమురు, రాగి వంటి ఎన్ని కమాడిటీలున్నా... బంగారం ప్రత్యేకత బంగారానిదే. పెట్టుబడి సాధనంగా, పారిశ్రామిక పరంగా, అవసరాల్లో ఆదుకునే ఆపద్బాంధవిగా పసిడి మెరుపు ఎప్పటికీ తగ్గదు. ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ధరల్లో భారీగా హెచ్చుతగ్గులుండవు. అందుకని హెడ్జింగ్‌కు గొప్ప సాధనంగా బంగారాన్ని ఉపయోగిస్తారు. మరి ఇంతటి విలువైన బంగారం ధరలను నిర్ణయించేదెలా? ఒకసారి చూద్దాం... వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలపై, ప్రజలపై కమోడిటీ మార్కెట్ల ప్రభావం బలంగానే ఉంటుంది. కీలకమైన కమోడిటీల్లో కొరత ఏర్పడితే... ఆ కమోడిటీ సంబంధిత ఉత్పత్తులను చేజిక్కించుకోవాలనే తపన వినియోగదారుల్లో ఉంటుంది. దీంతో ఉత్పత్తిదారులు అధిక ధరలను డిమాండ్ చేస్తారు. వినియోగదారులేమో తమకు నచ్చిన కమోడిటీలను కొనుగోలు చేయడానికి అధిక ధరలు చెల్లించడానికైనా సై అంటారు. మరోవైపు సరఫరాలు అధికంగా ఉంటే ధరలు తగ్గుతాయి. నాలుగు రకాల కమోడిటీలు.. సాధారణంగా కమోడిటీలను 4 కేటగిరీలుగా విభజిస్తారు. ఇంధనం (ముడి చమురు, హీటింగ్ ఆయిల్, సహజవాయువు, గ్యాసోలిన్ తదితరాలు), లోహాలు (బంగారం, వెండి, ప్లాటినమ్, రాగి...మొదలైనవి), లైవ్ స్టాక్, మాంసం (గొర్రెలు, పోర్క్ బెల్లీ, ఇత్యాది), వ్యవసాయ ఉత్పత్తులు (మొక్కజొన్న, సోయాబిన్, గోధుమ, వరి, కొకోవా, కాఫీ, పత్తి, పంచదార... తదితరాలు). బంగారం లోహాల కేటగిరి కిందకు వస్తుంది. కమోడిటీ ట్రేడింగ్ కొంచెం భిన్నం... కమోడిటీల్లో ఇన్వెస్ట్ చేయడం, ట్రేడింగ్ చేయడం కాస్త భిన్నంగా ఉంటుంది. స్టాక్స్, బాండ్లలో ఇన్వెస్ట్ చేసినట్లుగా, ట్రేడింగ్ చేసినట్లుగా కమోడిటీల్లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఉండదు. కమోడిటీ ట్రేడింగ్ చేయాలంటే ముందుగా ఆమోదయోగ్యమైన ప్రమాణాలు అవసరం. ఇలాంటి ఆమోదయోగ్యమైన ప్రమాణాల కారణంగా భౌతికంగా ఆ కమోడిటీలను తనిఖీ చేయకుండానే ట్రేడింగ్ చేస్తుంటారు. డిమాండ్ - సరఫరాలతో పాటు అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధి, సాంకేతిక ప్రగతి, మార్కెట్ డిమాండ్ తదితర అంశాలు ముడి చమురు, అల్యూమినియం, రాగి, పంచదార వంటి కమోడిటీ ధరలపై ప్రభావం చూపుతాయి. పుత్తడిలోకి పెట్టుబడులు... స్టాక్ మార్కెట్ తీవ్రంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నా... లేక బాగా పడిపోతూ ఉన్నా... ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్తగా తమ సొమ్మును స్టాక్ మార్కెట్ నుంచి విలువైన లోహమైన బంగారంలోకి మళ్లిస్తారు. తరతరాలుగా విశ్వసనీయమైన, ఆధారపడతగ్గ ఆస్తిగా పుత్తడికి ప్రాధాన్యం ఉండటమే దీనికి కీలక కారణం. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నపుడు, కరెన్సీ విలువ పడిపోయినపుడు హెడ్జింగ్‌గా విలువైన లోహాలు ఉపయోగపడతాయి. అయితే కమోడిటీల్లో నేరుగా పెట్టుబడులు పెట్టడం కొంత రిస్క్‌తో కూడిన వ్యవహారమేనని చెప్పొచ్చు. సరైన వ్యూహాం లేకుండా ఇలా నేరుగా కమోడిటీల్లో ఇన్వెస్ట్ చేస్తే నష్టాలు వచ్చే అవకాశాలే అధికం. ఎంసీఎక్స్‌లో ట్రేడింగ్ ఎంసీఎక్స్ అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. షేర్ల ట్రేడింగ్‌కు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఎలాగో, కమోడిటీల ట్రేడింగ్‌కు ఎంసీఎక్స్ అలాగన్నమాట. ఈ ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలు, పత్తి, కాఫీ వంటి వ్యవసాయోత్పత్తులు, తదితర కమోడిటీల్లో ట్రేడింగ్ జరుగుతుంది. లావాదేవీలు సురక్షితంగా, పారదర్శకంగా, నియమనిబంధనలకనుగుణంగా జరిగేలా ఎంసీఎక్స్ చూస్తోంది. ధరలను నిర్ణయించేవి.. ట్రేడింగ్ కార్యకలాపాలు, ఇంకా మరికొన్ని అంశాలు కమోడిటీల ధరలను నిర్ణయిస్తాయి. అంతర్జాతీయ ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, బంగారం, వెండి లోహాల ధరలు ఏ యూనిట్లలో కోట్ అవుతున్నాయి? ట్రాయ్ ఔన్స్-గ్రాముల మారకం, ఎంసీఎక్స్ ట్రేడింగ్‌లో సరఫరా, డిమాండ్ తదితర అంశాలు.. ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధరలను నిర్ణయిస్తాయి. ఎంసీఎక్స్ గోల్డ్ ధర ఎలా నిర్ణయిస్తారంటే, పై అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఒక సాధారణ సూత్రంతో పుత్తడి ధరను నిర్ణయిస్తారు. ఎంసీఎక్స్‌లో పుత్తడి 10 గ్రాముల యూనిట్లలో కోట్ అవుతోంది. ఒక ట్రాయ్ ఔన్స్ 31.1 గ్రాములకు సమానం. దీని ఆధారంగా 10 గ్రాముల బంగారం ధరను నిర్ణయిస్తారు. అంటే... 10 గ్రాముల బంగారం ధర= (అంతర్జాతీయంగా పుత్తడి ధర) ్ఠ (డాలర్‌తో రూపాయి మారకం) ్ఠ 10 ్ఠ (ట్రాయ్ ఔన్స్-గ్రామ్ మారకం విలువ). పసిడి... మరో 2 నెలలు మెరుపే! ముంబై/న్యూయార్క్: పసిడి ధరపై సానుకూల అంచనాలు సమీప కాలంలో పటిష్టంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. వారం మధ్యన మంగళ-బుధవారాల్లో జరిగిన కీలక సమావేశాల్లో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్- ఫెడ్ ఫండ్ రేటును పెంచకపోవడం పసిడికి బలాన్నిచ్చింది. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో ధర ఔన్స్(31.1గ్రా)కు వారం వారీగా 28 డాలర్లు ఎగసింది. 1,341 డాలర్ల వద్ద ముగిసింది. జూన్ తరువాత పసిడి ఒక వారంలో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఈ పరిస్థితుల్లో పసిడి మరో ఒకటి రెండు నెలలు పటిష్ట ధోరణిలోనే కొనసాగుతుందన్నది నిపుణుల అభిప్రాయం. డిసెంబర్ నాటికి రేటు పెంచుతామని ఫెడ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచ వ్యాప్తంగా దిగువ స్థాయిలో ఫండమెంటల్స్ పటిష్టంగా లేకపోవటం వల్ల, ఒకవేళ ఫెడ్ రేటు పెంచినా... పసిడి ముందుకే సాగుతుందన్న వాదనా ఉంది. 0.25 శాతంగా ఉన్న ఫండ్ రేటు పెంచితే, పసిడి ఔన్స్‌కు 1,000 డాలర్ల దిగువకు పడిపోతుందన్న మెజారిటీ విశ్లేషణలకు అంచనాలకు భిన్నంగా ఇప్పటి వరకూ పసిడి పరుగులు తీయటం గమనార్హం. మరోవైపు దేశీయంగానూ పసిడి గత వారంలో బలపడింది. 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛత 10 గ్రాముల ధరలు వరుసగా రూ.370 చొప్పున ఎగశాయి. వరుసగా రూ.31,570, రూ.31,420 వద్ద ముగిశాయి. ఇక వెండి కేజీ ధర ఏకంగా రూ.1,650 ఎగసి రూ.47,235 వద్ద ముగిసింది. -
తమలపాకు ఆయిల్‌తో అనేక రుగ్మతలకు చెక్
విజయవాడ(ఆటోనగర్) : తమలపాకు ఆయిల్‌తో అనేక రుగ్మతలను నివారించవచ్చునని కరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ప్రశాంత్ గుహ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో తమలపాకు పంట సాగుపై రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఆటోనగర్‌లోని ఎగ్జిబిషన్ సొసైటీ హాలులో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తమలపాకుల సాగు, వినియోగం, దిగుబడి, విశిష్టతల గురించి 30 సంవత్సరాలుగా పరిశోధనలు చేసినట్లు వివరించారు. భారతదేశంలో 55 వేల హెక్టార్లలో తమలపాకు సాగు చేస్తుండగా ఏపీలో మూడు వేల హెక్టార్లలో సాగు చేస్తున్నట్లు చెప్పారు. వినియోగంపై అవగాహన లేకపోవడం వలన తమలపాకును వృథా చేస్తున్నారని వివరించారు. ఆయిల్‌తో మతిమరుపు, నొప్పులు, గాయాలకు, రక్తప్రసరణకు, జలుబు, దగ్గు నివారణ, యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఆయిల్‌ను తయారుచేసే యంత్రాన్ని రూపొందించి సంబంధిత పేటెంట్ హక్కును పొందినట్లు వివరించారు. రైతులు అవగాహన పెంచుకుని లాభాలు పెందాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ డీడీ పీవీఎస్ రవికుమార్, ఏడీ ఎన్.సుజాత పాల్గొన్నారు. -
ఫార్మాపై వెనెజులాతో భారత్ చర్చలు
* చమురు రూపంలో బకాయిల సర్దుబాటు ప్రతిపాదనపై కసరత్తు * కేంద్ర వాణిజ్య విభాగం డెరైక్టర్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్గత సంక్షోభం, కరెన్సీ పతనం తదితర సమస్యలతో సతమతమవుతున్న వెనెజులా నుంచి దేశీ ఫార్మా కంపెనీలకు అందాల్సిన చెల్లింపులను రాబట్టడంపై కేంద్రం మరింతగా దృష్టి సారించింది. బకాయిలను చమురు సరఫరా రూపంలో సర్దుబాటు చేసే ముసాయిదా ప్రతిపాదనను వెనెజులా ప్రభుత్వం ముందుంచింది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య విభాగం డెరైక్టర్ అనిస్ జోసెఫ్ చంద్ర తెలిపారు. ఇటు దేశీయంగా ఆర్థిక శాఖ, విదేశాంగ శాఖ, ఆర్బీఐ తదితర వర్గాలతో కూడా ఈ అంశంపై చర్చిస్తున్నట్లు ఆమె వివరించారు. వెనెజులాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా సమస్య పరిష్కారంలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఔషధాల ఎగుమతి ప్రోత్సాహక మండలి ఫార్మెక్సిల్ నిర్వహిస్తున్న ఫార్మా సీఈవోల సదస్సులో గురువారమిక్కడ పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు వివరించారు. దేశీ ఫార్మా సంస్థలకు వెనెజులా నుంచి రూ. 2,000 కోట్లు రావాల్సి ఉందని అంచనా. ఎగుమతుల్లో 12 శాతం వృద్ధి..: రష్యా వంటి మార్కెట్ల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఇతర మార్కెట్లు లోటు భర్తీ చేయగలవని, ఫార్మా ఎగుమతులు మెరుగ్గానే ఉండగలవని ఫార్మెక్సిల్ చైర్మన్, అరబిందో ఫార్మా హోల్‌టైమ్ డెరైక్టర్ మదన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ఎగుమతుల్లో సుమారు 10-12 శాతం వృద్ధి నమోదు కాగలదని ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం దాదాపు 17 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఈసారి సుమారు 19 బిలియన్ డాలర్ల మార్కును చేరుకోగలమని ఫార్మెక్సిల్ వైస్ చైర్మన్ దినేష్ దువా పేర్కొన్నారు. మరోవైపు, ప్రతిసారి ముంబైలో జరిగే ఫార్మా ఎక్స్పో ఐఫెక్స్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఫార్మెక్సిల్ డెరైక్టర్ జనరల్ పీవీ అప్పాజీ తెలిపారు. ఫార్మా సంస్థలకు పురస్కారాలు.. సదస్సు సందర్భంగా వివిధ విభాగాల్లో ఫార్మా సంస్థలకు పురస్కారాలు ప్రదానం చేశారు. ఎగుమతులకు సంబంధించి బల్క్ డ్రగ్స్ విభాగంలో (లార్జ్) అరబిందో ఫార్మా, ఫార్ములేషన్స్లో (మధ్య స్థాయి) హెటెరో ల్యాబ్స్ పురస్కారాలు దక్కించుకున్నాయి. ఆల్ రౌండ్ పార్ ఎక్సలెన్స్ (లార్జ్) పురస్కారాన్ని మైలాన్ ల్యాబరేటరీస్ దక్కించుకోగా, మిడ్ సెగ్మెంట్లో క్యాడిలా అవార్డు దక్కించుకుంది. పేటెంట్ అవార్డుల్లో ఎన్సీఈ/డ్రగ్ డిస్కవరీకి సంబంధించి సువెన్ లైఫ్ సెన్సైస్ పసిడి పురస్కారం అందుకోగా, బల్క్ డ్రగ్స్/ఏపీఐ విభాగంలో హెటెరో డ్రగ్స్ పసిడి, లారస్ ల్యాబ్స్ .. న్యూలాండ్ ఫార్మా రీసెర్చ్..ఎంఎస్ఎన్ ల్యాబ్స్ రజత పురస్కారం దక్కించుకున్నాయి. -
కళేబరాల డెన్..!
-
బావిలో పెట్రోల్.. తోడుకునేందుకు జనాల పోటీ!
అనగనగా ఓ పురాతన బావి ఉంది. ఆ బావిలో నీళ్లు ఉంటాయని భావించి బొక్కెన వేసి తోడారు స్థానికులు. కానీ ఆ బావిలో నీళ్లకు బదులు పెట్రోల్ లాంటి చమురు లభించింది. అంతే ఆ వార్త చుట్టుపక్కల గ్రామాలకు పాకిపోయింది. స్థానికులు పెద్ద సంఖ్యలో బకెట్లు, బిందెలు వేసుకొని బావి చుట్టూ మూగారు. తమ వాటా చమురు కోసం పోటీపడ్డారు. ఈ ఘటన బిహార్‌లోని గయా నగరంలో చోటుచేసుకుంది. ఓ బావిలో పెట్రోల్ లాంటి చమురు లభిస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. దీంతో పెద్దసంఖ్యలో జనం ఆ చమురును సొంతం చేసుకోవడానికి పోటీపడ్డారు. ఈ సమాచారం తెలియడంతో బిహార్ ప్రభుత్వం కూడా స్పందించింది. బావిలో పెట్రోల్ తరహా చమురు లభిస్తున్నట్టు తెలిసిందని, దీంతో బావిని స్వాధీనం చేసుకున్నామని స్థానిక ఎస్ఐ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. ఈ బావిని పరిశీలించడానికి త్వరలోనే ఓ నిపుణుల బృందం రానుందని ఆయన చెప్పారు. -
ఆయిల్ ఫ్రీడమ్
అనారోగ్యం నుంచి ఫ్రీడమ్ కావాలి. అజీర్తి నుంచి ఫ్రీడమ్ కావాలి. స్థూలకాయం నుంచి ఫ్రీడమ్ కావాలి. బద్దకం నుంచి ఫ్రీడమ్ కావాలి. ఐ వాంట్ గుడ్ హెల్త్ ! నాకు ఆయిల్ నుంచి ఫ్రీడమ్ కావాలి. ఓహో! వెరీ సింపుల్!! ఓ ఉడుకు ఉడికించండి. ఆరోగ్యాన్ని వడ్డించండి!! వెజ్ క్రంచీ క్రిస్పీ కట్లెట్ కావలసినవి: బంగాళదుంపలు-6 (ఉడికించి చిదమాలి) బీన్స్ - 6 (తరిగి ఉడికించాలి) బీట్రూట్ (మీడియం) - 1 (తురమాలి) పచ్చిబఠాణి-అరకప్పు (ఉడికించి చిదమాలి) జీలకర్ర పొడి - అర టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం- ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి - 2 (సన్నగా తరగాలి) కారం - ఒక టీ స్పూన్; ఉప్పు - తగినంత గరం మసాలా- ఒక టీ స్పూన్ జీడిపప్పు-10 (వేయించి పలుకులు చేయాలి) కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు కార్న్‌ఫ్లేక్స్ - 2 కప్పులు (పొడి చేయాలి) నిమ్మరసం - ఒక టీ స్పూన్ తయారీ: ఉడికించిన బంగాళదుంపలో బీన్స్, బఠాణి, బీట్రూట్ తురుము, జీడిపప్పు పలుకులు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్రపొడి, అల్లం, నిమ్మరసం వేసి బాగా కలపాలి. పై మిశ్రమాన్ని పెద్ద గోళీ అంత తీసుకుని గుండ్రంగా చేసి కార్న్‌ఫ్లేక్స్ పొడిలో అద్దాలి. కట్లెట్ ఆకారం వచ్చేలా మెల్లగా వత్తాలి. ఇలా మిశ్రమం మొత్తాన్ని చేసుకుని ఒక ప్లేట్లో సర్ది ఒవెన్‌లో 120 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఏడు నిమిషాల సేపు ఉంచాలి. కట్లెట్లను తిరగవేసి మరో ఏడు నిమిషాలు ఉంచాలి. గమనిక: ఒవెన్‌కు బదులు మందపాటి పెనాన్ని వేడి చేసి కట్లెట్లను సర్ది సన్న మంట మీద నూనె వేయకుండా కాల్చుకోవచ్చు. బేబీ కార్న్ పాలక్ కావలసినవి: పాలకూర- ఒక కట్ట బేబీకార్న్- ఆరు; జీలకర్ర- అర టీ స్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్లు- అర టీ స్పూన్ ధనియాల పొడి- ఒక టీ స్పూన్ నిమ్మరసం- అర టీ స్పూన్, ఉల్లిపాయ తరుగు - టేబుల్ స్పూన్: ఉప్పు - తగినంత, ఎండు మిర్చి- 2, మీగడ- రెండు టేబుల్ స్పూన్లు (కావాలనుకుంటేనే) తయారీ: బేబీ కార్న్‌ను గుండ్రంగా తరిగి పావు టీ స్పూన్ ఉప్పు కలిపి, కొద్దిగా నీరు పోసి ఐదు నిమిషాల సేపు ఉడికించాలి. పాలకూర శుభ్రంగా కడిగి వేడి నీటిలో వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. నీటిలో నుంచి తీసి చల్లార్చి మెత్తగా గ్రైండ్ చేయాలి. నాన్‌స్టిక్ పెనంలో జీలకర్ర వేసి అవి పేలిన తర్వాత అల్లంవెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి వేసి సన్నమంట మీద రెండు నిమిషాల సేపు వేయించాలి. ఇప్పుడు పాలకూర పేస్టు, బేబీకార్న్ ముక్కలు (ఉడికించిన నీటితో సహా), ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఐదు నిమిషాల సేపు ఉడికించాలి. మంట తీసేసిన తరవాత నిమ్మరసం వేసి కలిపి మూతపెట్టాలి. చివరగా మీగడ కలుపుకోవచ్చు. ఖాళీ పెనంలో ఎండుమిర్చి, ఉల్లిపాయ వేయించి గార్నిష్ చేయాలి. గమనిక: బేబీ కార్న్ బదులు పనీర్‌తోనూ చేసుకోవచ్చు. పనీర్‌ని ఉడికించనవసరం లేదు. బ్రౌన్ రైస్ రిసోట్టో కావలసినవి: ముడిబియ్యం (బ్రౌన్ రైస్) - 2 కప్పులు (కడిగి మునిగేలా నీటిని పోసి అరగంట సేపు నానబెట్టి, వడపోయాలి) వెల్లుల్లి రేక - 1 (సన్నగా తరగాలి) తరిగిన ఉల్లిపాయ - 1/3 కప్పు వెజిటబుల్ స్టాక్ - 6 కప్పులు (నీటిలో క్యారట్, ఆనియన్, బఠాణి, క్యాలిఫ్లవర్ అన్నీ కలిపి వందగ్రాములు ఉడికించాలి) కొత్తిమీర- రెండు రెమ్మలు; మిరియాల పొడి- ఒక టీ స్పూన్ చీజ్ - అర కప్పు (సన్నగా తరగాలి) బిర్యానీ ఆకు - ఒకటి; ఉప్పు- తగినంత తయారీ: ఒవెన్‌ను 220 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేసి అందులో వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలను రోస్ట్ చేయాలి. వెడల్పాటి పాత్ర వంటి పెనంలో బియ్యం వేసి ఒక మోస్తరుగా వేడి చేసిన తర్వాత అందులో బియ్యం నానబెట్టిన నీటిని పోసి, బిర్యానీ ఆకు, చీజ్ తరుగు, ఉల్లి, వెల్లుల్లి పలుకులు, ఉప్పు వేసి ఉడికించాలి. 8-10 నిమిషాలలో తేమ ఆవిరవుతుంది. ఇప్పుడు కూరగాయలు ఉడికించిన నీటిని కలపాలి. అడుగు పట్టకుండా తేమ ఆవిరయ్యే వరకు రెండు-మూడు సార్లుగా కలపాలి. బియ్యం ఉడికిన తర్వాత మంట ఆపేసి మిరియాల పొడి చల్లి, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. మెత్తగా కావాలనుకుంటే మరో కప్పు నీటిని వేడి చేసి చివరగా కలుపుకోవచ్చు. క్యారట్ కుకుంబర్ సూప్ కావలసినవి: పెద్ద కీరకాయలు- 2 (చెక్కు తీసి తరగాలి) క్యారట్లు (చిన్నవి)- 2 (చెక్కు తీసి తరగాలి) ఉల్లిపాయ (పెద్దది) - 1 (తరగాలి) నీరు - 7 కప్పులు, ఉప్పు - తగినంత క్రీమ్ - 2 కప్పులు (కావాలనుకుంటేనే వేసుకోవాలి) తయారీ: కూరగాయ ముక్కలలో నీటిని పోసి ఉడికించి మూతపెట్టాలి. 20 నిమిషాల తర్వాత మొత్తాన్ని బ్లెండ్ చేయాలి. ఇందులో ఉప్పు కలిపి సన్నమంట మీద ఉడికించాలి. క్రీమ్ వేసి లేదా అలాగే సర్వ్ చేయాలి. వెజిటబుల్ స్టాక్ ఇది కూరగాయలు ఉడికించిన నీరు. క్యారట్, బీన్స్, బఠాణి, క్యాలిఫ్లవర్ వంటివి కొద్ది కొద్దిగా మిగిలిపోయి ఉన్నప్పుడు వాటికి ఓ ఉల్లిపాయను చేర్చి ఉడికించి చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. దీనిని సూప్, ఇతర కూరల్లోనూ వాడుకోవచ్చు. ఈ స్టాక్ నాలుగైదు రోజుల వరకు తాజాగా ఉంటుంది. చెఫ్: అరుణ్ కుమార్ హోటల్: తాజ్ వివంతా, బేగంపేట, హైదరాబాద్ -
ఇంటిప్స్
గులాబ్‌జామ్ పిండిలో కొద్దిగా పన్నీరు తురుము కానీ జీడిపప్పు పొడి కానీ కలిపితే జామూన్లు ఎంతో మృదువుగా వస్తాయి! చీమలకు ఉప్పు అంటే పడదు. కాబట్టి చీమలు పడుతున్న చోట కాస్త ఉప్పు కలిపిన నీళ్లు చల్లితే సరి! సోఫా మీద నూనె మరకలు పడితే... ముందుగా వాటి మీద నిమ్మరసం చల్లాలి. తర్వాత దూదిని పెట్టి ఒత్తితే మరకలు పోతాయి. పులుసులు పెట్టినప్పుడు కొద్దిగా శెనగపిండి వేస్తే... పులుసు మరీ నీళ్లగా కాకుండా చిక్కగా వస్తుంది. రుచి కూడా బాగుంటుంది. -
వాన కురిసే.. గుగ్గిళ్లు ఉడికే..!
చిరు తిండి వాన తుంపర్లు ముఖం మీద పడుతుంటే ఉలిక్కిపడి నిద్రలేచాను. సగం మూసి ఉన్న కిటికీ తలుపులో నుంచి వానజల్లు గిలిగింతలు పెడుతోందని నాకు అర్థమైంది. చిన్నగా ఆవలించి, కిటికీ రెక్క వెయ్యబోయి, మళ్లీ ఎందుకో మనసు మార్చుకుని, కిటికీలోనుంచి రోడ్డు మీదికి చూస్తూ ఉండిపోయాను. పక్కింటిలోనుంచి పకోడీల వాసన ముక్కులో నుంచి కడుపులోకి దూరింది. నేనూ ఏమైనా తింటే బాగుండనిపించింది. లేచి అమ్మ దగ్గరకెళ్లాను. మెల్లగా కొంగుపట్టి లాగుతూ, ‘అమ్మా... ఆకలేస్తోంది’ అన్నాను. అమ్మ నవ్వుకుంటూ, బాదం ఆకులో ఏవో పోసి నా చేతికిచ్చింది. ఇంగువ తిరగమోత వేసి, తెల్లటి చిక్కుడు గింజల్లా ఉన్న వాటిని ఆశ్చర్యంగా చూస్తూ, ‘ఏంటమ్మా ఇవి?’ అన్నాను. ‘ముందు తిని చూడు, తర్వాత చెబుతాను’ అంది అమ్మ. ఒక్కో గింజా నోట్లో వేసుకుంటుంటే కరిగిపోతున్నట్లనిపిస్తోంది. మళ్లీ అడిగా... ‘ఏంట మ్మా ఇవి, భలే బాగున్నాయి, ఎట్లా చేశావు’ అని. ‘అవి అలచంద గుగ్గిళ్లు. మొన్న ఎవరో మా చేలో పండినయ్యి అని తెచ్చిస్తే, వాటిని కడిగి, నానబోశాను పొద్దున. ఇందాకనే వాటిని కాస్త పలుకుగా ఉండేలా ఉడకబెట్టాను. ఆ తర్వాత బాణలిలో రెండు చెంచాల నూనె వేసి, అందులో చెంచాడు సెనగపప్పు, అరచెంచా ఆవాలు, అరచెంచా జీలకర్ర, అరచెంచాడు మినపగుళ్లు, ఒక కరివేపాకు రెబ్బ వేశాను. నాలుగైదు పచ్చిమిరపకాయలు నిలువుగా చీరి అందులో పడేశాను. చిటికెడు ఇంగువ కూడా వేశాక ఈ ఉడికించిన అలచందలను అందులో వేసి మూతపెట్టాను. వేగేటప్పుడే ఒక స్పూను ఉప్పేసి బాగా కలియపెట్టాను. అంతే! అలచంద గుగ్గిళ్లు రెడీ. నువ్వు బజ్జోని లేచేసరికి టిఫిన్ సిద్ధం’ అంటూ నాటకఫక్కీలో చెప్పింది అమ్మ. నేను ఇంకాసిని గుగ్గిళ్లు కప్పులో పోయించుకుని, కిటికీలోనుంచి పడుతున్న వానను చూస్తూ, ఒక్కోటీ తింటుంటే ప్రాణం ఎక్కడికో వెళ్లినట్లనిపించింది. ఇంతలో పక్కింటి చింటూగాడు ఆడుకోవడానికి వచ్చాడు. వాడి జేబు ఉబ్బెత్తుగా కనిపించింది. ఏంటిరా అది అని అడిగేలోపు వాడే నాలుగు పకోడీలు తీసిచ్చాడు. ఇస్తూ నా కప్పులోనుంచి నాలుగు గుగ్గిళ్లు తీసి నోట్లో వేసుకున్నాడు. భలే బాగున్నాయిరా, ఏంటివి? అని అడిగాడు. నేను అమ్మ నాకెలా చెప్పిందో, వాడికి అలానే చెప్పా... అప్పటినుంచి వాళ్లింట్లో పకోడీలు వేగిన చప్పుడు వినిపించలేదు... గుగ్గిళ్ల ఘుమఘుమలు తప్ప! - బాచి -
పరుగులు పెడుతున్న బంగారం
బ్రెగ్జిట్ దెబ్బతో దూసుకెళ్తున్న పసిడి పరుగుకు బ్రేక్ పడట్లేదు. ఏకంగా రెండేళ్ల గరిష్ట స్థాయిలో పరుగులు తీస్తోంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ప్రజాభిప్రాయం ఊహించని విధంగా ఉండటంతో, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. ఆ అనిశ్చిత పరిస్థితిలో ప్రారంభమైన పసిడి దూకుడు, ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉంది. సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారం వైపు ఇన్వెస్టర్లు ఎక్కువగా మొగ్గుచూపుతుండటంతో పసిడి ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయి. అన్ని కోణాల నుంచి ఫైనాన్సియల్ మార్కెట్లు బలహీన సంకేతాలు అందిస్తున్నాయి. బ్రెగ్జిట్ దెబ్బతో అంతర్జాతీయంగా వస్తున్న ప్రతికూల పవనాలతో ఆసియన్ స్టాక్స్ 31 ఏళ్ల కనిష్టానికి నమోదవుతున్నాయి. దీంతో సురక్షిత సాధనంగా భావిస్తున్న పసిడి వైపు ఎక్కువగా పెట్టుబడులు తరలిపోతూ..అంతర్జాతీయంగా రెండేళ్లకు పైగా గరిష్టంలో పసిడి ధరలు నమోదవుతున్నాయి. స్పాట్ బంగారం ఔన్స్ కు 1,371.40 డాలర్లు(రూ.92,624.29) పైగా ఎగిసింది. 2014 మార్చిలో ఈ స్థాయిలో రికార్డు అయ్యాయి. కమెక్స్ గోల్డ్ ఫ్యూచర్లు 0.9 శాతం పెరిగి, 1,371.10డాలర్ల(రూ.92590.31)గా నమోదవుతోంది. 2010 నుంచి ఇదే అత్యంత పెరుగుదల. దేశీయ మార్కెట్లో సైతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.170 ఎగిసి రూ.31,953గా నమోదైంది. బ్రెగ్జిట్ పరిణామం బుల్లిష్ మార్కెట్లో పసిడికి మద్దతు పలుకుతూ సెంటిమెంట్ ను మరింత బలపరుస్తుందని ఎంకేఎస్ ట్రేడర్ జేమ్స్ గార్డినర్ తెలిపారు. బంగారం భారీ స్థాయిలో దూసుకెళ్తుండటంతో, 10 బిలియన్ ఫౌండ్ల విలువ చేసే మూడు బ్రిటీష్ కమర్షియల్ ప్రాపర్టి ఫండ్స్ 24గంటల్లోనే తమ ట్రేడింగ్ లను నిలిపివేశాయి. మరోవైపు ఆయిల్ ధరలు పడిపోతున్నాయి. బ్రెండ్ క్రూడ్ 0.4శాతం పడిపోయి 47.79 డాలర్లుగా నమోదవుతోంది. మంగళవారం ఒక్కరోజు 4.3శాతం బ్రెండ్ క్రూడ్ పతనమైంది. -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: సోమవారం నాటి మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఈ ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు రోజంతా లాభాల్లోనే పయనించాయి. సెన్సక్స్ 134 పాయింట్ల లాభంతో 27,279 దగ్గర,నిఫ్టీ 42.పాయింట్ల లాభంతో 8,371దగ్గర క్లోజయ్యాయి. కొంతమంది పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగినప్పటికీ, కొనుగోలు సానుకూల సెంటిమెంట్ బాగా బలపడింది. అలాగే అనుకూల ప్రపంచ సంకేతాలు, పెరిగినముడి చమురు ధరలు, బలంగా రూపాయి విలువ వెరసి ఆరో వరుస సెషన్ లో భారత ఈక్విటీ మార్కెట్లు ఉత్సాహంగా ట్రేడ్ అయ్యాయి. క్యాపిటల్ గూడ్స్, చమురు, గ్యాస్, ఆటోమొబైల్ స్టాక్స్ లాభాల బాటపట్టాయి. ఫార్మ, ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతు నెలకొంది. దీనికితోడు ఈ వర్షాకాలంలో ఆరోగ్యకరమైన వానలు కురుస్తాయనే అంచనాలతో పెట్టుబడిదారులు మార్కెట్ పట్ల ఆసక్తిగా ఉన్నారని ఎనలిస్టులు తెలిపారు. ప్రతికూల యూరోపియన్ మార్కెట్లు రాబోయే ఈవెంట్ నష్టాలు దలాల్ స్ట్రీట్ లాభాలను పరిమితం చేసిందని విశ్లేషకుల అంచనా. ఐటీ, ఫార్మా సెక్టార్ లో బైయింగ్ ట్రెండ్ నెలకొనగా, ప్రాఫిట్ బుకింగ్ కారణంగా బ్యాంకింగ్ సెక్టార్ నష్టపోయిందని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ధ్రువ్ దేశాయ్ తెలిపారు. మరోవైపు బులియన్ మార్కెట్లో పసిడి మెరుపులు కొనసాగుతున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్ లో 10.గ్రా. బంగారం ధర 365 రూపాయల లాభంతో 31,828 దగ్గర ఉంది. -
భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో భారత ఈక్విటీ మార్కెట్ సూచీలు వరుసగా 6వ సెషన్ లో కూడా దలాల్ స్ట్రీట్ భారీ లాభాల్లో కొనసాగుతోంది. ఇంతకు ముందు ఐదు సెషన్లలో 747 పాయింట్లు లాభపడిన ప్రారంభంలో 200 పాయింట్లకు పైగా లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 170 పాయింట్ల లాభంతో 27,315 దగ్గర సెన్సెక్స్ స్థిరంగా ట్రేడవుతోంది. 52 నిఫ్టీ పాయింట్ల లాభంతో 8,380 దగ్గర ట్రేడవుతోంది. ఒఎన్ జీసీ, టాటా మోటార్స్, గెయిల్, ఎల్ అండ్ టి, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, పవర్ గ్రిడ్, లుపిన్, ఎన్టిపిసి, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, ఆర్ఐఎల్ , టీసీఎస్ మార్కెట్ ను లీడ్ చేస్తున్నాయి. అలాగే ఇటీవల నష్టాలను చవిచూసిన షుగర్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా రేణుగా షుగర్, బలరాంపురీ చినీ లాభాలను ఆర్జిస్తున్నాయి. ఇతర ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల వలన కొనుగోళ్ల సెంటిమెంట్ బలపరిడిందని బ్రోకర్లు తెలిపారు. ఆశాజనకమైన వర్షాలుంటాయనే అంచనాలు కూడా మార్కెట్లకు సానుకూలంగా ఉన్నాయన్నారు. అటు కరెన్సీ మార్కెట్లో డాలర్ తో పోలిస్తే రూపాయి 0.13 పైసల లాభంతో 67.19 దగ్గర రూపాయి విలువ ఉంది. బంగారం కూడా దాదాపు 237 రూపాయలు లాభంతో 31 వేల700 స్థిరంగా ఉంది. -
లాభాల్లో పసిడి, కరెన్సీ, ఈక్విటీ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో భారత ఈక్విటీ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. చాలాకాలం తరువాత సెన్సెక్స్ 27 వేల పాయింట్లకు పైన, నిఫ్టీ 83 వేలకు పాయింట్లకు పైన స్థిరంగా నిలబడటం మదుపర్లకు ఉత్సాహాన్నిస్తోంది. 218 పాయింట్ల లాభంతో 27,217 దగ్గర సెన్సెక్స్ స్థిరంగా ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 8,345 దగ్గర ట్రేడవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది. హెల్త్ కేర్, ఆటోమొబైల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సెక్టార్ లో బైయింగ్ ట్రెండ్ నెలకొంది. అలాగే గ్లోబల్ చమురు ధరలు మరింత పుంజుకున్నాయి. కాగా కరెన్సీ, బులియన్ మార్కెట్లు సాధారణంగా వ్యతిరేక దిశలో ఉంటాయి. కానీ ఈ మార్కెట్లు రెండూ పాజిటివ్ వుండడం విశేసం. ఇటీవల బాగా బలపడుతున్న రూపాయి విలువ కూడా మార్కెట్ కు సంపూర్ణ మద్దతినిస్తోంది. కరెన్సీ మార్కెట్లో డాలర్ తో పోలిస్తే రూపాయి 0.08 పైసల లాభంతో 67.44 దగ్గర రూపాయి విలువ ఉంది. బంగారం కూడా దాదాపు మూడువందల రూపాయలు లాభంతో 31 వేల రూపాయల దగ్గర స్థిరంగా ఉంది. -
నూనె ఎలా పెడుతున్నారు?!
బ్యూటిప్స్ తలకు నూనె పెట్టామా.. షాంపూతో తలస్నానం చేశామా.. అనేది కాదు. ఈ రోజుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే శిరోజాల అందం దెబ్బతింటుంది. జుట్టుకుదుళ్లు బలంగా ఉండి, మృదుత్వం కోల్పోకుండా ఉండాలంటే.. ఈ ఏడు స్టెప్పులు పాటించాలి. 1. కప్పు వేడి నీళ్లు తీసుకోవాలి. 2. రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనె వేడినీళ్లలో కలపాలి. 3. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే మాడుకు పట్టించాలి. 4. పెద్ద పళ్ల దువ్వెనతో జుట్టు కుదుళ్ల నుంచి కింది వరకు దువ్వాలి. 5. కనీసం 30 నిమిషాలు వదిలేయాలి. 6. షాంపూతో తల శుభ్రం చేసుకోవాలి. 7. జుట్టు చివర్లకు కొన్నిచుక్కల నూనె రాయాలి. తలస్నానం చేసే ప్రతీసారీ ఈ విధంగా చేస్తుంటే మాడు పొడిబారదు, వెంట్రుకల నిగనిగలు తగ్గవు. జుట్టురాలడం, చుండ్రు సమస్యలు దరిచేరవు. -
నూనె ఎలా పెడుతున్నారు?!
బ్యూటిప్స్ తలకు నూనె పెట్టామా.. షాంపూతో తలస్నానం చేశామా.. అనేది కాదు ఈ రోజుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే శిరోజాల అందం దెబ్బతింటుంది. జుట్టుకుదుళ్లు బలంగా ఉండి, మృదుత్వం కోల్పోకుండా ఉండాలంటే.... 1. కప్పు వేడి నీళ్లు తీసుకోవాలి. 2. రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనె వేడినీళ్లలో కలపాలి. 3. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే మాడుకు పట్టించాలి. 4. పెద్ద పళ్ల దువ్వెనతో జుట్టు కుదుళ్ల నుంచి కింది వరకు దువ్వాలి. 5. కనీసం 30 నిమిషాలు వదిలేయాలి. 6. షాంపూతో తల శుభ్రం చేసుకోవాలి. 7. జుట్టు చివర్లకు కొన్నిచుక్కల నూనె రాయాలి. తలస్నానం చేసే ప్రతీసారీ ఈ విధంగా చేస్తుంటే మాడు పొడిబారదు, వెంట్రుకల నిగనిగలు తగ్గవు. జుట్టురాలడం, చుండ్రు సమస్యలు దరిచేరవు. -
నూనె నిల్... కరకర ఫుల్..!
చిప్స్ అంటేనే కరకరలాడాలి.. పొటాటో చిప్స్ అయినా ముల్లంగి చిప్స్ అయినా సరే.. అలాగే ఆయిల్ లేకుండా ఈ చిప్స్‌ను తయారు చేయాలి. అవునా, ఇవీ మన డిమాండ్స్... కానీ ఆయిల్ వాడకుండా చిప్స్ కరకరలాడాలంటే కష్టమే కదా. అలాంటి కష్టాన్ని ఈ చిప్స్ మేకర్ సెట్‌తో దూరం చేసుకోవచ్చు. ఎలా అంటే.. ఫొటోలో కనిపిస్తున్న ట్రేలనే చిప్స్ మేకర్ అంటారు. వీటిపై బంగాళాదుంపలను సన్నగా కట్ చేసి పెట్టి, కాసేపు అవన్లో పెట్టాలి. అంతే క్షణాల్లో మీ చిప్స్ రెడీ. బంగాళాదుంపకు బదులుగా వేటినైనా చిప్స్‌గా తయారు చేసుకోవచ్చు (ఉదాహరణకు స్వీట్ పొటాటో, కాకరకాయ, అన్ని రకాల పండ్లు). ఒకేసారి రెండు ట్రేలనూ అవన్లో పెట్టుకోవచ్చు. బంగాళాదుంపను కట్ చేసుకున్నాక కాసేపు గాలికి ఆరనిచ్చి, తర్వాత అవన్లో పెడితే.. చిప్స్ మరింత కరకరలాడతాయి. అలా చిప్స్ మేకర్‌తో ఆయిల్ తగలని చిప్స్‌ను హాయిగా, హెల్తీగా తినొచ్చు. -
చమురు వివాదాల పరిష్కారంలో ఒత్తిళ్లకు తలొగ్గం
ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీ: రిలయన్స్ కృష్ణ-గోదావరి (కేజీ)డీ-6 క్షేత్రం వంటి ఇతర చమురు వివాదాల పరిష్కారంలో ఎటువంటి ఒత్తిడులకు ప్రభుత్వం తలగ్గొదని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో సహా ప్రైవేటు చమురు కంపెనీలతో ఉన్న చమురు క్షేత్ర వివాదాల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని, ప్రభుత్వం ఒత్తిడుల్ని ఎదుర్కొంటున్నదా అంటూ రాజ్యసభలో ఒక బీజేపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన పై సమాధానమిచ్చారు. -
ఫ్యాట్‌ను లాగేస్తుంది..!
రోజూ టీవీల్లో, పేపర్లలో ‘మా ఆయిల్ వాడితే కొలెస్ట్రాల్ పెరగదు’ అంటూ నూనె కంపెనీల యాడ్లు హోరెత్తిస్తుంటాయి. మనం నిజమేనేమో అనుకుని వాటిని ఇష్టం వచ్చినట్టు పోసేశాం అనుకోండి... ఇక అంతే సంగతులు. ఏ వంటకంలో నూనె వేసినా, అది మనలో ఎంత కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది అనేది అంచనా వేసుకోవాలి. అది మనకు ఎలా తెలుస్తుంది? ఒకవేళ మన కూరలో నూనె ఎక్కువయ్యిందని తెలిస్తే దాన్ని ఎలా తగ్గించ గలం? అదంతా మన ఒంట్లోకి వెళ్లకుండా ఎలా అడ్డుకోగలం? ఈ ‘ఫ్యాట్ మ్యాగ్నెట్’ ఉంటే అవన్నీ చేయగలం. ఇది మహా షార్ప. దీన్ని ఒక్కసారి కూరలోనో చారులోనో పెడితే చాలు... ఎక్కువైన నూనెను చప్పున లాగే స్తుంది. దాంతో నూనె పైకి తేలు తుంది. అప్పుడు దాన్ని చెంచాతో తీసేయొచ్చు. మటన్ కరీ లాంటి వాటిలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కదా! దాన్ని కూడా విజయ వంతంగా తీసేస్తుందిది. కాబట్టి మన శరీరంలోకి అనవసరమైన కొవ్వు, నూనె వెళ్లవు. దీన్ని వంటకాల్లో పెట్టే ముందు ఓ అయిదు నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెడితే ఇంకా బాగా పని చేస్తుందని నిపుణులు అంటున్నారు! -
క్రూడ్ దిగుమతులపై భారత్, ఇరాన్ ఒప్పందం
దుబాయ్ : క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఇరాన్ తో భారత్ కు ఒప్పందాలు కుదిరాయి. రోజుకు 350 వేల బ్యారెల్ కంటే ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ను సరఫరా చేసేందుకు ఇరాన్ సమ్మతించింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అనంతరం ఇరాన్ ఇంధన మంత్రి ఈ విషయాన్ని తెలిపినట్టు షనా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. దక్షిణ ఇరాన్ ప్రాంతంలో చబాహర్ పోర్టు కోసం 20 బిలియన్ డాలర్లు భారత్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని కూడా తెలిపింది. ఆయిల్, గ్యాస్, పెట్రో కెమికల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి భారత కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ మంత్రి చెప్పారు. -
గ్యాస్ ధరకు కొత్త ఫార్ములా
♦ చమురు, గ్యాస్ రంగంలో సంస్కరణలు ♦ మైనింగ్ చట్టాల్లో సవరణలు కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు న్యూఢిల్లీ: దేశీ చమురు, గ్యాస్ రంగ వృద్ధికి తోడ్పడేలా కేంద్రం మరిన్ని సంస్కరణలు ప్రకటించింది. కఠిన ప్రాంతాల్లో అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయిన క్షేత్రాల్లో గ్యాస్ వెలికితీతను ప్రోత్సహించేలా కొన్ని పరిమితులతో కొత్త ధరల విధానానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. గిట్టుబాటు ధర లేనందువల్ల వదిలేసిన దాదాపు రూ. 1.80 లక్షల కోట్ల విలువ చేసే గ్యాస్‌ను వెలికితీసేందుకు ఇది ఉపయోగపడనుంది. అటు మైనింగ్ సంస్థలు మరిన్ని అసెట్స్‌ను సులువుగా విక్రయించుకునే వెసులుబాటు కల్పిస్తూ సంబంధిత చట్టాలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు, భవిష్యత్‌లో నిర్వహించే చమురు, గ్యాస్ బ్లాకుల వేలానికి సంబంధించి వివాదాస్పదమైన ఉత్పత్తి పంపక ఒప్పందం (పీఎస్సీ)స్థానంలో ఆదాయ పంపక ఒప్పందాన్ని కూడా ఓకే చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో గురువారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. కొత్త ఫార్ములాతో కఠిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ రేట్లు 85 శాతం మేర ఎగియనున్నాయి. ప్రస్తుత ధరల ప్రాతిపదికన చూస్తే యూనిట్ (ఎంబీటీయూ) ధర 7.08 డాలర్లకు పెరగనుంది. వివాదాల్లో ఉన్న క్షేత్రాలకు ఇది వర్తించదు. సుమారు 28 క్షేత్రాల్లోని 6.75 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్‌ను వెలికితీయడానికి కొత్త ధర ఉపయోగపడగలదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విలేకరులకు తెలిపారు. ప్రస్తుతం భారత్ రోజుకు 90 మిలియన్ ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్ ఉత్పత్తి చేస్తోంది. ఇది దేశీయవసరాల్లో సుమారు నలభై శాతానికి కూడా సరిపోవడం లేదు. కొత్తగా మిగతా క్షేత్రాలు అందుబాటులోకి వస్తే మరో 15 ఏళ్ల పాటు రోజుకు అదనంగా 35 ఎంసీఎండీ మేర గ్యాస్ ఉత్పత్తి జతవుతుందని ప్రధాన్ పేర్కొన్నారు. ఓఎన్జీసీ, ఆర్ఐఎల్, జీఎస్పీసీకి ప్రయోజనం.. తాజా ఫార్ములాతో అత్యధిక ఒత్తిడి, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాల నుంచి, అత్యంత లోతైన సముద్రగర్భాల నుంచి వెలికి తీసే గ్యాస్‌కు ధరను నిర్ణయించుకునేందుకు ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, జీఎస్పీసీలకు స్వేచ్ఛ లభిస్తుంది. అయితే, ఈ రేటుకూ ఒక పరిమితిని నిర్దేశించింది ప్రభుత్వం. దీని ప్రకారం దిగుమతి చేసుకున్న ఫ్యుయల్ ఆయిల్, బొగ్గు, నాఫ్తా మొదలైన వాటి ఏడాది సగటు ధర కన్నా.. ఈ రేటు తక్కువగానే ఉండాలి. 2015లో సగటు ఇంధన రేట్లను బట్టి చూస్తే యూనిట్ ధర సగటున 7.08 డాలర్లవుతుంది. కొత్త ధరల మార్గదర్శకాలు ఈ ఏడాది జనవరి 1 నాటికి ఇంకా ఉత్పత్తి ప్రారంభం కాని నిక్షేపాలకు వర్తిస్తాయి. వివాదాల్లోని గ్యాస్ క్షేత్రాలకు .. సదరు వివాదం పరిష్కారమయ్యే దాకా కొత్త ఫార్ములా వర్తించదు. కేజీ-డీ6 బ్లాక్‌లోని ధీరూభాయ్-1, 3 గ్యాస్ క్షేత్రాల గ్యాస్‌కు అధిక రేటు కోరుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్బిట్రేషన్‌కు వెళ్లిన నేపథ్యంలో తాజా ఫార్ములా నిబంధనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రిలయన్స్‌కి చెందిన కేజీ-డీ6 బ్లాకులో దాదాపు డజను పైగా నిక్షేపాలు, పొరుగునే ఉన్న కేజీ-డీ5లో ఓఎన్జీసీవి దాదాపు 6-7 నిక్షేపాలు, జీఎస్పీసీకి చెందిన కేజీ-ఓఎస్ఎన్-2001/3కి చెందిన మరికొన్ని నిక్షేపాల్లో ఇంకా గ్యాస్ ఉత్పత్తి ప్రారంభం కావాల్సి ఉంది. మరిన్ని వివరాలు.. ♦ ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం సమకూరేలా బిడ్లు వేసే సంస్థలకు.. అన్ని రకాల హైడ్రోకార్బన్ల వెలికితీత, ఉత్పత్తికి ఏకీకృత లెసైన్స్ లభిస్తుంది. ♦ బ్రిటన్ సంస్థ బీజీ గ్రూప్‌నకు చెందిన పన్నా/ముక్తా తపతి వంటి చిన్న, మధ్య తరహా క్షేత్రాల లెసైన్సు గడువును పదేళ్ల పాటు పొడిగించారు. ఇందుకోసం కొన్ని నిబంధనలు మార్చారు. అయితే, కెయిర్న్ ఇండియాకు చెందిన రాజస్తాన్ బ్లాక్ లెసైన్సు గడువు పెంపు ప్రస్తావించలేదు. ♦ వేలం ద్వారా కాకుండా కంపెనీలు కేటాయింపుల మార్గంలో దక్కించుకున్న ఖనిజ గనులను విక్రయించుకునేందుకు, విలీనాలు.. కొనుగోళ్లకు వీలు కల్పిస్తూ మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) 1957 చట్టానికి సవరణలను క్యాబినెట్ ఆమోదించింది. -
25 డాలర్లకు తగ్గనున్న చమురు
మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనాలు న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు, గ్యాస్ ధరలు పలు సంవత్సరాలపాటు ప్రస్తుత కనిష్ట స్థాయిల్లోనే కొనసాగవచ్చని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తెలిపింది. ఇతర ప్రాంతాల నుంచి సరఫరా తగ్గినా.. ఒకవేళ ఇరాన్ నుంచి ఉత్పత్తి మెరుగ్గా ఉంటే బ్యారెల్ ధర 25 డాలర్లకు కూడా పతనం కావొచ్చని వివరించింది. 2014 జూన్‌లో చమురు ధరల పతనం ప్రారంభమై ఇటీవలే దశాబ్దపు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇప్పటికే మార్కెట్లో పేరుకుపోయిన చమురు, గ్యాస్ నిల్వల వినియోగం నెమ్మదిగా జరుగుతున్నందున .. రేట్లు మరికొన్నాళ్ల పాటు కనిష్ట స్థాయిల్లోనే కొనసాగవచ్చని మూడీస్ వివరించింది. 2016లో చమురు ధరలు బ్యారెల్‌కు 33 డాలర్ల స్థాయిలోనే ఉండొచ్చని, వచ్చే ఏడాది 38 డాలర్లకు, అటుపైన 2018లో 43 డాలర్లకు చేరొచ్చని అంచనా వేసింది. ఇక ఈ ఏడాది అమెరికా హెన్రీ హబ్ సహజ వాయువు (గ్యాస్) రేటు యూనిట్‌కు (ఎంబీటీయూ) సగటున 2.25 డాలర్లుగా ఉండొచ్చని, వచ్చే ఏడాది 2.50 డాలర్లకు, 2018లో 2.75 డాలర్లకు చేరొచ్చని మూడీస్ పేర్కొంది. ఇలా కాకుండా చమురు, గ్యాస్ రేట్లకు కొన్ని ప్రతికూలాంశాలు కూడా ఉన్నాయని మూడీస్ తెలిపింది. ఒకవేళ ఇతర ప్రాంతాల నుంచి సరఫరాలు తగ్గినా.. ఇరాన్ నుంచి పెరిగితే చమురు రేటు 25 డాలర్లకు, గ్యాస్ ధర యూనిట్‌కు 1.75 డాలర్లకు పడిపోవచ్చని వివరించింది. అమెరికా, చైనా, భారత్ సహా ప్రధాన వినియోగ దేశాల్లో డిమాండ్ కన్నా మించి ప్రస్తుతం ఉత్పత్తి, సరఫరా ఉంటోందని మూడీస్ పేర్కొంది. చమురు రేట్లు తక్కువగా ఉండటం వల్ల ఉత్పత్తి దేశాల వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి కనీసం 0.8% మేర మందగించవచ్చని, అంతర్జాతీయ వృద్ధి అవకాశాలపైనా ప్రతికూల ప్రభావం పడొచ్చని తెలిపింది. -
తలనొప్పి వస్తోందంటే.. వేడినూనె పోశాడు
తమిళనాడులోని మదురైలో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా ఓ దుకాణంలో పనిచేస్తున్న బాలకార్మికుడిపై యజమాని క్రూరంగా ప్రవర్తించాడు. ఆరోగ్యం బాగోలేదన్న బాలుడిని ఆదుకోవాల్సిందిపోయి.. సలసల మరిగే వేడినూనె కుమ్మరించాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మదురైలోని ఒక స్వీటుషాపులో బాలుడు (15) పనిచేస్తున్నాడు. తనకు తలనొప్పిగా ఉందని యజమానికి చెప్పాడు. పని చేయడానికి సాకులు చెపుతున్నాడంటూ యజమాని ఆగ్రహానికి గురయ్యాడు. వేడి వేడి నూనెను బాలుడిపై పోసేశాడు. దీంతో చేతులు, తొడలు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాలల హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. మైనర్ బాలుడిని పనిలో పెట్టుకోవడమేకాకుండా, నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించిన సదరు యజమానిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడంపై హక్కుల సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే నిందితులను అదుపులోకి తీసుకుని బాధిత బాలుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
ఇంధన రంగంలో పెట్టుబడులపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు, ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అంతర్జాతీయ నిపుణులతో చర్చించారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన సమావేసంలో బ్రిటన్ చమురు దిగ్గజం బీపీ గ్రూప్ సీఈవో బాబ్ డడ్లీ, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) ఈడీ ఫాతిహ్ బిరోల్ తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడుల రాకకు ఎదురవుతున్న నియంత్రణపరమైన అడ్డంకులను తొలగించాలని, సహజ వాయువు ధరలపై నియంత్రణలను ఎత్తివేయాలని నిపుణులు ఈ సందర్భంగా సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉత్పత్తి వ్యయం కన్నా తక్కువగా క్రూడాయిల్ బ్యారెల్ రేటు 37 డాలర్లకు పడిపోవడంతో చమురు కంపెనీలు పెట్టుబడులను, సిబ్బందిని తగ్గించుకుంటున్న నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. భవిష్యత్‌లో వేలం వేసే క్షేత్రాల గ్యాస్‌కు మార్కెట్ ఆధారిత ధరను ఇచ్చే ప్రతిపాదన పరిధిలోకి ప్రస్తుత నిక్షేపాలకు కూడా వర్తింపచేసే అంశం ఇందులో చర్చకు వ చ్చినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. చమురు, గ్యాస్ రంగంలో టెక్నాలజీలను మెరుగుపర్చుకోవడం, మానవ వనరుల అభివృద్ధి, పెట్టుబడులను ఆకర్షించడం తదితర అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మోదీ చెప్పినట్లు వివరించింది. -
ఆయిల్, గ్యాస్ పరిశ్రమకు గడ్డుకాలం!
మూడీస్ నివేదిక * 2016లో ఆయిల్, గ్యాస్ ధరలు బలహీనమేనని అంచనా... * పెట్టుబడులు 25 శాతం వరకూ పడిపోవచ్చని విశ్లేషణ న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్, గ్యాస్ ధరలు ఈ సంవత్సరం కూడా బలహీనంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నివేదిక మంగళవారం అభిప్రాయపడింది. అధిక సరఫరాలు దీనికి కారణమని తెలిపింది. ఆయా అంశాల నేపథ్యంలో గ్యాస్ క్షేత్రాల అన్వేషణ, ఉత్పత్తులపై మూలధనం పెట్టుబడులు 20 నుంచి 25 శాతం శ్రేణిలో పడిపోయే అవకాశాలు ఉన్నాయనీ విశ్లేషించింది. ‘చమురు, సహజ వాయువుల పరిశ్రమ: 2016లో మూలధన పెట్టుబడుల, సవాళ్లు’ అన్న శీర్షికన మూడీస్ తాజా నివేదిక విడుదల చేసింది. ముఖ్యాంశాలు చూస్తే... * మార్కెట్ షేర్ పెంచుకోవడంపై దృష్టిపెట్టిన ఒపెక్ (ఓపీఈసీ)-పలు ఒపెక్ యేతర ఉత్పత్తి దేశాలు భారీగా ఉత్పత్తులను కొనసాగించడం వల్ల సరఫరాలు అధికంగా కొనసాగే అవకాశం ఉంది. ఇరాన్‌పై ఆంక్షలు ఎత్తివేత కూడా సరఫరాల పెరుగుదలకు కారణం. * ఉత్పత్తుల తగ్గుదల, ధరలు తక్కువగా ఉండడం వంటి అంశాలు భారత్, చైనా, అమెరికా వంటి దేశాల్లో చమురు వినియోగం పెరుగుదలకు దోహదపడుతుంది. * దిగువ స్థాయిలో ధరలు సంబంధిత కమోడిటీ ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు సవాలే. ఇక ఈ రంగం కూడా ‘డిఫాల్ట్స్’ సమస్యలను ఎదుర్కొనాల్సి రావచ్చు. చమురు అన్వేషణ, ఉత్పత్తి (ఈ అండ్ పీ) కంపెనీల క్యాష్ ఫ్లోస్‌పై ఇప్పటికే దిగువస్థాయి ధరలు ప్రభావం చూపుతున్నాయి. డ్రిల్లింగ్, ఆయిల్‌ఫీల్డ్ సర్వీస్ ప్రొవైడర్ల వంటి ఇతర ఇంధన కంపెనీలపై కూడా ప్రతికూల జాడలు కనిపిస్తున్నాయి. * ట్రెడెడ్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 2016లో బ్యారల్‌కు సగటున 43 డాలర్లుగా ఉండవచ్చు. అటు తర్వాత ఏడాది 48 డాలర్లకు, 2018లో 53 డాలర్లకు పెరిగే అవకాశం ఉంది. * సవాళ్లను అధిగమించడానికి పరిశ్రమలో కొన్ని కంపెనీల కొనుగోళ్లు, విలీనాల అవకాశం ఉంది. ఫండింగ్ అవసరాలూ అదనపు ఇబ్బందులు సృష్టించవచ్చు. దీనితో దివాలా దిశగా కొన్ని కంపెనీలు నడిచే కష్ట పరిస్థితులు ఉన్నాయి. ఆయా అంశాలు అసెట్ విలువలు ‘కొనుగోళ్లకు’ ఆకర్షణగా మారేందుకు దోహదపడతాయి. -
'టర్కీ దొంగ దేశం.. ఉగ్రవాదులకు సహకరిస్తోంది'
సిరియా: టర్కీపై సిరియా విమర్శల వర్షం కురిపించింది. టర్కీ ఉగ్రవాదులకు సహకరిస్తోందని సిరియా సైనికాధికారులు ఆరోపించారు. సిరియా సరిహద్దులోని ఇరాకీ ఆయిల్ ను , ఇతర యుద్ధ సామాగ్రిని దొంగచాటుగా ఉగ్రవాదుల నుంచి స్వీకరిస్తోందని ప్రకటించింది. టర్కీ సరిహద్దుల గుండా ఉగ్రవాదులు స్వేచ్ఛగా వెళ్లిపోతున్నా.. టర్కీ పట్టించుకోవడం లేదని తెలిపింది. మానవత్వంతో చేయాల్సిన సహాయం కాకుండా సిరియా ఉగ్రవాదులకు యుద్ధసామాగ్రిని కూడా అందిస్తుందని తీవ్ర ఆరోపణలు సిరియా సైన్యం చేసింది. సిరియా సైన్యానికి రష్యా సహకరిస్తున్న నేపథ్యంలో సిరియా ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
కెయిర్న్ ఇండియాకు చమురు దెబ్బ
70 శాతం తగ్గిన నికర లాభం న్యూఢిల్లీ: మైనింగ్ కుబేరుడు అనిల్ అగర్వాల్‌కు చెందిన కెయిర్న్ ఇండియా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 70 శాతం క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆరేళ్ల కనిష్టానికి పడిపోవడం దీనికి ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. గత క్యూ2లో రూ.2,278 కోట్లుగా(ఒక్కో షేర్‌కు రూ.13.77) ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.673(ఒక్కో షేర్‌కు రూ.5.54)కు పడిపోయిందని తెలిపింది. గత క్యూ2లో బ్యారెల్ చమురును సగటున 92.1 డాలర్లకు అమ్మామని, ఈ క్యూ2లో బ్యారెల్ చమురు సగటు విక్రయ ధర 43.7 డాలర్లుగా ఉందని, 53 శాతం క్షీణత నమోదైందని వివరించింది. చమురు ధరలు బాగా తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూలధన వ్యయాలను సగానికి (50 కోట్ల డాలర్లకు) తగ్గించుకున్నామని తెలిపింది. చమురు సరఫరాలు అధికం కావడం కూడా ధరలపై ప్రభావం చూపించిందని పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి రూ.17,943 కోట్ల నగదు నిల్వలున్నాయని వివరించింది. -
పప్పులు, నూనెలపై ‘నియంత్రణ’ పెంపు
ఏడాది పెంపునకు కేబినెట్ నిర్ణయం: రవిశంకర్ వెల్లడి * అక్రమ వ్యాపారం, నిల్వలపై రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు ఆస్కారం * రిజిస్టర్డ్ గోదాముల్లో పప్పులు, నూనెల నిల్వలపైనా పరిమితులు న్యూఢిల్లీ: పప్పుధాన్యాలు, వంట నూనెలు, నూనెగింజల అక్రమ వ్యాపారం, అక్రమ నిల్వలను రాష్ట్ర ప్రభుత్వాలు నిరోధించేందుకు చర్యలు తీసుకునే వీలు కల్పిస్తూ నిత్యావసర సరుకుల చట్టం కింద జారీ చేసిన నియంత్రణ ఉత్తర్వు గడువును మరో ఏడాది పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ మంగళవారం నాటి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. పప్పుధాన్యాలు, వంట నూనెలు, వంట నూనె గింజల కొరత దృష్ట్యా.. వాటిని వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చూసేందుకు వాటిని నియంత్రణ ఉత్తర్వు కిందకు తీసుకురావాలని 2014లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ ఉత్తర్వు గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ నియంత్రణ ఉత్తర్వు గడువును ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి 2016 సెప్టెంబర్ 30వ తేదీ వరకూ పొడిగించినట్లు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ అనంతరం టెలికం మంత్రి రవిశంకర్‌ప్రసాద్ విలేకరులకు తెలిపారు. పప్పుధాన్యాలు, వంట నూనెలు, నూనెగింజలకు సంబంధించి.. రిజిస్టర్ చేసుకున్న గోదాముల్లో నిల్వపై పరిమితులు పెట్టాలని కూడా కేబినెట్ నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. నియంత్రణ ఉత్తర్వు గడువు పెంపు వల్ల.. ఆయా సరుకుల అక్రమ వ్యాపారం, అక్రమ నిల్వలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు నిల్వలపై పరిమితులు విధించటం, లెసైన్సు నిబంధనలు కఠినం చేయటం వంటి చర్యలు చేపట్టవచ్చునని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో వివరించింది. తద్వారా అంతర్గత మార్కెట్లలో ఆయా సరుకులు అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు ధరలు కూడా నియంత్రణలో ఉండేలా చూడవచ్చునని పేర్కొంది. నిత్యావసర సరుకులు, వాటి ధరలు.. ప్రత్యేకించి పప్పుధాన్యాలు, ఉల్లిపాయలు అందుబాటులో ఉండేలా చూసేందుకు పలు చర్యలు చేపట్టామని తెలిపింది. ‘కందులు, మినుములు వంటి పప్పుధాన్యాలపై ఫ్యూచర్ ట్రేడింగ్‌ను ఇప్పటికే నిలిపివేశాం. పప్పుధాన్యాల ఎగుమతిని నిషేధించాం. వాటి దిగుమతిపై సుంకం తొలగించాం. దేశీయ మార్కెట్లో పప్పుధాన్యాల లభ్యతను పెంచేందుకు 5,000 టన్నుల కందులు, 5,000 టన్నుల మినుముల దిగుమతికి ఆదేశాలిచ్చాం. ఇవి త్వరలోనే రానున్నాయి. వీటివల్ల ధరల పరి స్థితి కాస్త సరళమవుతుంది’ అని వివరించింది. ఇదిలావుంటే.. పర్యాటక రంగంలో ద్వైపాక్షిక సహకారం కోసం భారత్, కంబోడియా దేశాల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. -
బతుకు భారం
-
చేతులపై చర్మం నలుపు తగ్గాలంటే...
పెరుగులో పసుపు, నిమ్మరసం, బియ్యం పిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతులు, వేళ్లకు రాసి, స్క్రబ్ చేసి పది నిమిషాలు వదిలేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చేతుల పైభాగంలోని నలుపు తగ్గి, చర్మకాంతి పెరుగుతుంది. చర్మం మృదువుగా మారుతుంది. టేబుల్ స్పూన్ ఎండిన చేమంతుల పొడిలో కోకా బటర్ టేబుల్ స్పూన్, వెన్న రెండు టేబుల్ స్పూన్లు, అప్రికాట్ ఆయిల్ రెండు టీ స్పూన్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో వేసి ఉడికించి, చల్లారాక జార్లో భద్రపరచాలి. రాత్రి పడుకునేముందు చేతులను శుభ్రపరుచుకొని ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. ఎండవల్ల నలుపుగా మారిన చేతులపై చర్మం సహజ రంగులోకి మారుతుంది. చర్మం మృదువుగా తయారవుతుంది. -
రిలయన్స్ గ్యాస్ బ్లాకులు మరో 2 వెనక్కి
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్యసంస్థ బీపీ.. కేజీ బేసిన్‌లోని మరో రెండు చమురు, గ్యాస్ బ్లాకులను కేంద్రానికి సరెండర్ చేశాయి. రక్షణ శాఖ పరిమితుల కారణంగా కేజీ-డీడబ్ల్యూఎన్-2003/1ను, అధిక రిస్కు చేసినా ముడి ఇంధనం లభించే అవకాశాలు అంతంతమాత్రంగా ఉండటం వల్ల సీవై-పీఆర్-డీడబ్ల్యూఎన్-2001/3 (సీవై-డీ6) బ్లాకును వదులుకున్నట్లు 2014-15 వార్షిక నివేదికలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది. డీడబ్ల్యూఎన్-2003/1 విషయంలో నియంత్రణలను సడలించాలంటూ చాలాకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో దీన్నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు వివరించింది. రిలయన్స్‌కి చెందిన 21 చమురు, గ్యాస్ బ్లాకుల్లో బ్రిటన్ కంపెనీ బీపీ 2011లో 30% వాటాలు కొనుగోలు చేసింది. అప్పట్నుంచీ లాభసాటిగా లేని బ్లాకులను ఇరు సంస్థలు క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నాయి. తాజా పరిణామంతో రెండు కంపెనీల భాగస్వామ్యంలో 4 బ్లాకులు మిగిలినట్లవుతుంది. ఇక హార్డీ ఆయిల్ సంస్థ భాగస్వామ్యంలో ఒక బ్లాకు, రెండు కోల్ బెడ్ మీథేన్ బ్లాకులు కంపెనీ చేతిలో ఉన్నాయి. రిలయన్స్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ ప్రొడక్షన్ (ఆర్ఈపీ) డీఎంసీసీ.. పెరూ, యెమెన్ తదితర దేశాల్లో దాదాపు 15 క్షేత్రాలను కొనుగోలు చేసింది. అయితే ముడి ఇంధనం లభించే అవకాశాలు తక్కువగా ఉండటంతో వీటిలో చాలా మటుకు క్షేత్రాలను వదులుకుంది. -
ఎగుమతుల లక్ష్యం మిస్...
⇒ 2014-15లో లక్ష్యం 340 బిలియన్ డాలర్లు ⇒ జరిగింది 311 బిలియన్ డాలర్లే ⇒ మార్చిలో భారీగా పెరిగిన వాణిజ్య లోటు ⇒ బంగారం దిగుమతుల పెరుగుదల ఎఫెక్ట్ న్యూఢిల్లీ: దేశ ఎగుమతులు గడచిన ఆర్థిక సంవత్సరం (2014 ఏప్రిల్-2015 మార్చి) తీవ్ర నిరుత్సాహ పరిచాయి. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం 340 బిలియన్ డాలర్ల వార్షిక లక్ష్యాన్ని ఎగుమతుల రంగం చేరుకోలేకపోయింది. కనీసం 2013-14 ఆర్థిక సంవత్సరం పరిమాణం కన్నా తక్కువగా నమోదయ్యాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 314 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగితే... 2014-15 ఆర్థిక సంవత్సరంలో 311 బిలియన్ డాలర్ల వద్ద చతికిలపడిపోయాయి. అంటే వార్షికంగా చూసుకుంటే అసలు వృద్ధి లేకపోగా(-) 1.23 శాతం క్షీణించాయన్నమాట. ఇక వార్షికంగా దిగుమతులు - 0.5 శాతం క్షీణించి 450 బిలియన్ డాలర్ల నుంచి 448 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దీనితో ఎగుమతులు-దిగుమతుల విలువల వ్యత్యాసం వాణిజ్యలోటు ఆర్థిక సంవత్సరంలో 137 బిలియన్ డాలర్లుగా ఉంది. మార్చిలో భారీ వాణిజ్య లోటు మార్చి నెల విదేశీ వాణిజ్యానికి సంబంధించి, ఈ నెలలో భారీ వాణిజ్యలోటు ఏర్పడింది. వార్షికంగా (2014 మార్చితో పోల్చి) ఎగుమతులు 21 శాతం తగ్గి 24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇంత భారీ స్థాయిలో ఎగుమతుల రేటు పడిపోవడం ఆరేళ్లలో ఇదే తొలిసారి. దిగుమతులు వార్షిక ప్రాతిపదికన చూస్తే- 13 శాతంపైగా తగ్గి 36 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో వాణిజ్యలోటు 12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఈ లోటు నాలుగు నెలల గరిష్ట స్థాయి. 2014 మార్చిలో వాణిజ్యలోటు 11 బిలియన్ డాలర్లయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ లోటు 7 బిలియన్ డాలర్లు. డిసెంబర్ నుంచీ ఎగుమతుల రంగం క్షీణ దశలో ఉంది. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు మార్చి నెలలో 59.5 శాతం తగ్గాయి. రత్నాలు, ఆభరణాల విలువ 8.36 శాతం తగ్గింది. రసాయనాల ఎగుమతుల విలువ 5.36% పడింది. ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు 2.5% తగ్గాయి. మొత్తం ఎగుమతుల్లో ఈ నాలుగు విభాగాల ఎగుమతుల వాటా దాదాపు 70 శాతం. భారీగా పెరిగి పసిడి దిగుమతులు... మార్చిలో వాణిజ్యలోటు పెరగడానికి దేశంలోకి బంగారం భారీ దిగుమతులు ఒక కారణం. 2014 మార్చి నెలతో పోల్చితే పసిడి దిగుమతులు దాదాపు రెట్టింపై 5 బిలియన్ డాలర్లకు పెరిగాయి. కలిసి వచ్చిన చమురు... ఇక చమురు దిగుమతుల విలువ 53% క్షీణించడం విశేషం. ఈ విలువ మార్చిలో 7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూసినా... చమురు దిగుమతుల విలువ 16% పైగా తగ్గి 138 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. అంతర్జాతీయ చమురు ధరలు దిగువ స్థాయిలో కొనసాగుతుండడం దీనికి ప్రధాన కారణం. ఇక చమురు యేతర దిగుమతుల విలువ 8.4% పెరిగి 310 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ప్రత్యేక దృష్టి అవసరం: నిపుణులు ఎగుమతుల రంగం మెరుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని నిపుణులు పేర్కొన్నారు. ఎగుమతి చేస్తున్న వస్తువుల నాణ్యతా ప్రమాణాలు, పోటీతత్వానికి ప్రభుత్వ తోడ్పాటు అవసరమని భారత్ ఉత్పత్తుల ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) డెరైక్టర్ జనరల్ అజయ్ సాహీ అభిప్రాయపడ్డారు. -
స్ప్రే వాడితే సేఫ్
వంటచేసేటప్పుడు చెంచాతో నూనె వేస్తుంటాం. దాంతో మనకు తెలియకుండానే ఎక్కువ నూనె పడుతుంది. అందుకే ఆయిల్ స్ప్రేలు వాడాలి. స్ప్రే చేయడం వల్ల తక్కువ నూనె గిన్నెలో ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది. వేసింది కాస్తే అయినా పదార్థాలన్నిటినీ బాగా తడుపుతుంది. నూనె వాడకం తగ్గింది కాబట్టి మన ఆరోగ్యమూ బాగుంటుంది. ఆయిల్‌తో నింపిన స్ప్రేలతో పాటు, మనం నూనె వేసుకుని వాడుకోవడానికి వీలుగా ఖాళీ స్ప్రే డబ్బాలు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. రూ.400 నుంచి మొదలవుతుంది ధర! -
ఎస్అండ్పీ వార్నింగ్-మార్కెట్లో అమ్మకాలు
- సెన్సెక్స్ 256 పాయింట్లు డౌన్ - 78 పాయింట్లు తగ్గిన నిఫ్టీ - క్షీణించిన బ్యాంకింగ్, ఆయిల్, ఎఫ్ఎంసీజీ షేర్లు - మార్కెట్ అప్డేట్ ముంబై: కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు మరో ఐదు రోజుల్లో వెల్లడికానున్న నేపథ్యంలో భారత్ రేటింగ్ పట్ల ప్రసిద్ధ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పీ) హెచ్చరికలు జారీచేయడంతో సోమవారం ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. ప్రపంచ మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్ ఫలితంగా ట్రేడింగ్ తొలిదశలో బీఎస్ఈ సెన్సెక్స్ 29,362 పాయింట్ల స్థాయికి పెరిగినప్పటికీ, అటుతర్వాత కొన్ని బ్లూచిప్ షేర్లలో అమ్మకాలు వె ల్లువెత్తడంతో 29,913 పాయింట్ల వద్దకు పతనమయ్యింది. చివరకు క్రితం ముగింపుకంటే 256 పాయింట్ల క్షీణతతో 29,975 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 78 పాయింట్ల తగ్గుదలతో 8,755 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ద్రవ్య పరిస్థితి బలహీనంగా వుండటం, ఆదాయస్థాయిలు కనిష్టంగా కొనసాగడం వల్ల భారత్ సార్వభౌమ రేటింగ్‌కు విఘాతం ఏర్పడుతున్నదంటూ ఎస్ అండ్ పీ హెచ్చరించింది. ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాలు జరిగాయి. ప్రధాన షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్, గెయిల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, ఎస్బీఐ, ఇన్ఫోసిస్‌లు 2-2.5 శాతం మేర తగ్గాయి. విలీనానికి అనుమతి కాంపిటీషన్ కమిషన్ అనుమతి లభించడంతో కొటక్ మహీంద్రా, ఐఎన్జీ వైశ్యా బ్యాంకుల షేర్లు పెరిగాయి.బొగ్గు గనుల వేలంలో గరిష్టంగా 3 బొగ్గు బ్లాకులను దక్కించుకున్నందున, హిందాల్కో ఇండస్ట్రీస్ షేరు ట్రేడింగ్ తొలిదశలో 3 శాతంపైగా ర్యాలీ జరిపి రూ. 161.8 స్థాయికి చేరినప్పటికీ, ముగింపులో లాభాల స్వీకరణతో రూ. 154.8 స్థాయికి తగ్గి ముగిసింది. సెన్సెక్స్‌లోని 24 షేర్లు క్షీణించగా, 6 షేర్లు మాత్రం పెరిగాయి. ఎక్సేంజీల్లో వ్యాపార లావాదేవీలు గత శుక్రవారంతో పోలిస్తే తగ్గాయి. బీఎస్ఈ నగదు విభాగంలో టర్నోవర్ రూ. 3,570 కోట్లకు తగ్గగా, ఎన్ఎస్ఈ నగదు విభాగం టర్నోవర్ రూ. 17,304 కోట్లకు పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.602 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ164 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. -
అసమానతలతో అనర్థం తథ్యం!
శత కోటి డాలర్ల కుబేరుల సిరులన్నీ చట్టబద్ధమైన లాభాలతో పోగుచేసినవి మాత్రమే కావు. అంతకన్నా ఎక్కువగా ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా సమకూరే ప్రభుత్వ రాబడిలోని భారీ మొత్తాలను సబ్సిడీలుగా పొందడం ద్వారా, గనులు, భూములు, చమురు, అటవీ సంపదల వంటి దేశ సంపదను, ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టి ఆర్జించినవి కూడా. మన దేశంలో ఇది మరింత విచ్చలవిడిగా సాగుతోంది. భారత బిలియనీర్ల సంపదతో దేశంలోని పేదరికాన్ని ఒకసారి కాదు, రెండుసార్లు నిర్మూలించవచ్చు. అది విశాఖ తీరంలోని రామకృష్ణ బీచ్. ఉదయం ఎనిమిది గంటలు. నులివెచ్చని ఉషోదయాన్ని ఆస్వాదించేందుకు అప్పుడప్పుడే పర్యాటకులు బీచ్‌లోకి వస్తున్నారు. కొందరు యువకులు, మరికొందరు నడివయస్కులు, కొందరు అటూ ఇటూగా ఉన్నవారు అక్కడున్నారు. ఓ వ్యక్తి మాత్రం భిన్నం గా కనిపించాడు. చెప్పులు చేతి సంచిలో వేసుకొని అలల్లో ఆదుర్దాగా దేనికోసమో వెతుకుతూ, వెతుకుతూ... అంతలోనే నిరాశగా వెనక్కి వస్తున్నాడు. సముద్రపుటలలపై నుంచి నా దృష్టి అతనివైపు మళ్లింది. వెళ్లి పలకరించాను, దేని కోసం వెతుకుతున్నావని అడిగాను. డబ్బుల కోసమని సమాధానం ఇచ్చాడు. నాకు మొదట అర్థం కాలేదు. ఎక్కడెక్కడో అలల్లో పడి కొట్టుకుపోయిన డబ్బులు ఏదో తీరానికి చేరతాయి. వాటి కోసమే ఈ వెతుకులాట. అదృష్టం బావుంటే వెండి మట్టెలు, బంగారం కూడా దొరుకు తాయని చెబుతున్నప్పుడు అతని కళ్ళల్లో మెరుపు చూశాను. రోజుకి ఎన్ని నాణేలు దొరుకుతాయని ప్రశ్నిస్తే... పది నుంచి పదిహేను రూపాయలు దొర కొచ్చు లేదా అసలేమీ దొరకకపోనూవచ్చు అన్నాడు. అతని పేరు నొల్లి రాములు. మత్స్యకారుడైన రాములు హార్బర్లో పనిచేసేవాడు. ఇటీవలే మానేశాడు. ఇద్దరు కొడుకులూ భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ ప్రమా దవశాత్తూ మరణించారు. ఆ తండ్రి కడుపు కూటికి సముద్రపుటలలు మోసు కొచ్చే చిల్లర కాసులే ఆధారం. ఎక్కడో ఎవరో పోగొట్టుకున్న లేదా గంగమ్మకు విసిరేసిన చిల్లర నాణేలను వెతుకులాడుతున్న రాములుని చూస్తే దిగులని పించింది. రాములులాంటి కోట్లాది మంది భారతీయులు సముద్రమంత సంపదను సృష్టిస్తే, అందులో చిల్లర పైసలు కూడా వారికి దక్కని దుస్థితిని చూసి, ఇదేం అసమాన ప్రపంచమనిపించింది. ఎటువంటి శ్రమ చేయకుండా వేల కోట్ల రూపాయల ఆస్తులను, అపార ధనరాశులను సొంతం చేసు కొని, విమానాలను, వందల కోట్ల రూపాయల బహుళ అంతస్తుల భవనా లను భార్యలకు ప్రేమ కానుకలుగా సమర్పించుకోగల భర్తలున్న సౌభాగ్య భారతావనిలోనే ఎంతటి వైరుధ్యం? బరువెక్కిన మనసుతో అక్కడి నుంచి కదిలాను. కొందరి చేతుల్లోనే సకల సంపదలు మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అసమానతలు, వ్యత్యాసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పదేళ్ళ క్రితం కంటే ఇప్పుడు అంతరాలు మరింతగా పెరిగాయి. గత జనవరిలో దావోస్‌లో జరిగిన ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ సమావేశాల్లో ఈ విషయాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా ‘ఆక్స్‌ఫామ్’ అనే సంస్థ ఒక పరిశోధనాత్మకమైన నివేదికను విడుదల చేసింది. 2009లో ప్రపంచంలో కోటి మంది కోటీశ్వరులు (శత కోటి అమెరికన్ డాలర్ల ఆస్తిపరులు) ఉంటే, 2013 వరకు ఆ సంఖ్య 1.37 కోట్లకు పెరిగినట్టు ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇక శత కోటి డాలర్ల కుబేరులు (బిలియనీర్లు) రెట్టింపై, వారి సంఖ్య 1,645కు పెరిగిందని కూడా తెలిపారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సగం ప్రపంచ జనాభా దగ్గర ఉన్న మొత్తం సంపదకు ఇంచుమించు సరిపడా సంపద 85 మంది వ్యక్తుల వద్దే ఉన్నదని ఆ నివేదిక తెలిపింది. ప్రపంచ జనాభా సుమారు 700 కోట్లు. అంటే, కేవలం 85 మంది కుబేరుల సంపద 350 కోట్ల మంది సంపదకు సమానం. ఇది వింటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన బిల్‌గేట్స్ సంపద గురించి ప్రస్తావిస్తూ, ప్రతిరోజూ పది లక్షల డాలర్లను (ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలు) ఖర్చు చేసినా, 218 సంవత్సరాల వరకు అవి సరిపోతాయని ఆక్స్‌ఫామ్ వెల్లడించింది. ఇలా కొందరి వద్దే సంపదంతా కేంద్రీకృతం కావడం కేవలం ధనిక దేశాలకే పరిమితం కాదని, భారత్ వంటి వృద్ధి చెందుతున్న వర్ధమాన దేశా ల్లో కూడా సంపద ఇలాగే కొందరి దగ్గర పోగు పడుతోందని గణాంకాలు చెబుతున్నాయి. 1990లో దేశంలో పదిమంది బిలియనీర్లు ఉంటే, 2014 వరకు వాళ్ళు 65 మందికి పెరిగారు. 2014 ‘ఫోర్బ్స్’ నివేదిక ప్రకారం. భారత దేశంలో ఉన్న మొదటి వంద మంది ధనికుల దగ్గర రూ. 22,49,600 కోట్ల సంపద పోగుబడి ఉన్నట్టుఆక్స్ఫామ్ నివేదిక బయటపెట్టింది. ఇది మన దేశ బడ్జెట్ కన్నా అధికం. 2013-14 కేంద్ర బడ్జెట్ మొత్తం రూ. 16 లక్షల కోట్లు మాత్రమే. అంటే ఏడాది పాటు భారత ఆర్థిక వ్యవస్థకి సరిపడే డబ్బు కన్నా ఎక్కువ సంపద కేవలం వంద మంది దగ్గరే పోగుపడివుంది. నిలువు దోపిడీతో సిరుల కులుకు ప్రపంచ కుబేరుల సిరులన్నీ వారు తన వ్యాపారాలు, పరిశ్రమల న్యాయమైన, చట్టబద్ధమైన లాభాల నుంచి మాత్రమే పోగు చేసినవి కాదు. అంతకన్నా ఎక్కువగా ప్రభుత్వాలు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల ద్వారా లభించే ప్రభుత్వ రాబడితో రూపొందించే బడ్జెట్లో పెద్ద మొత్తాలను కొల్లగొట్టడం ద్వారా పోగుచేసినవి కూడా. ప్రభుత్వ సబ్సిడీలు, అక్రమంగా సంపాదించే గనులు, భూములు, చమురు, అటవీ సంపదల ద్వారా అతి తక్కువ కాలంలోనే దేశ సంపదను, ప్రభుత్వ ధనాన్ని వీరు కొల్లగొడు తున్నారు. మన దేశంలో ఇది మరింత విచ్చలవిడిగా సాగుతోంది. ప్రభుత్వ కాంట్రాక్టులు, లెసైన్సులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, మౌలిక సదు పాయాల (రైల్వేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రహదారులు) నిర్మాణం, గనులు, టెలి కమ్యూనికేషన్స్, పెట్రోకెమికల్స్ లాంటి రంగాల్లోని ప్రైవేటీకరణ ద్వారా జాతి సంపదను స్వాహా చేస్తున్నారు. భారత బిలియనీర్ల సంపదతో దేశంలోని పేదరికాన్ని ఒకసారి కాదు రెండుసార్లు నిర్మూలిం చవచ్చని ఆర్థిక వేత్తల అంచనా. వేలకోట్ల రూపాయల సహజ వనరులను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెబుతున్న ప్రభుత్వాలు కనీసం ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బునైనా వారి సంక్షేమం కోసం ఖర్చు చేయడంలేదు. విద్యావైద్య రంగాల పట్ల కేంద్రంతోపాటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చూపుతున్న తీవ్ర నిర్లక్ష్యమే అందుకు తిరుగులేని సాక్ష్యం. మన దేశంలోని ధనికుల, నిరుపేదల రోజువారీ ఖర్చులో కూడా చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. అవి వారి జీవనశైలి, ఆరోగ్యాలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నగరాలలోని ధనికులు పెడుతున్న ఖర్చులో 12వ వంతు కూడా పేదలు ఖర్చు చేయడం లేదు. గ్రామాల్లో ఇది 9వ వంతు కంటే తక్కువ. 2012లో జరిగిన నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతంలోని పేద వాడు నెలకు రూ. 512 ఖర్చు పెడితే, ధనవంతుడు రూ. 2,084 వినియోగిస్తున్నాడు. అదే నగరాల్లో పేదవాడు రూ. 700 నెలకు ఖర్చు చేస్తే, ధనవంతుడు రూ. 10,282 ఖర్చు చేస్తున్నాడు. ఇవి సరాసరి లెక్కలు మాత్రమే. అంతరాల పెంపునకు ఏలికల అండదండలు ధనికుల ధన దాహానికి, రాజకీయ నాయకుల, ప్రభుత్వాధినేతల లాలూచీ తోడవుతుండటంతో ఈ వ్యత్యాసాలు మరింతగా పెరుగుతున్నాయి. ఆర్థిక, బీమా, మందుల తయారీ, ఆరోగ్యరక్షణ రంగాల కంపెనీలు ప్రభుత్వాధి నేతలను లోబర్చుకొని తమ దోపిడీకి మార్గం సుగమం చేసుకుంటున్నట్టు ఇటీవలి ఒక పరిశోధనలో వెల్లడైంది. అమెరికాలోని ఫైనాన్స్ కంపెనీలు తమ నిలువుదోపిడీ సాగించుకోవడానికి గత ఏడాది 40 కోట్ల డాలర్లు లంచాలుగా ఖర్చు చేశాయి. యూరప్‌లో 15 కోట్ల డాలర్లను లంచాల రూపంలో పంచిపెట్టాయి. అదేవిధంగా ఫార్మాస్యూటికల్ కంపెనీలు అమెరికాలో 48.7 కోట్ల డాలర్లు, యూరప్‌లో 5 కోట్ల డాలర్లు ఏటా ఖర్చు చేస్తున్నాయి. ఇవి మచ్చుకి కొన్ని ఉదాహరణలు మాత్రమే. భారత దేశంలో కూడా రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చులను కార్పొరేట్ రంగమే భరిస్తోందన్నది కఠోర వాస్తవం. నాయకులకు ఆస్తులను సమకూర్చి, కంపెనీలలో వాటాలు ఇచ్చి రాజకీయ అధికార వ్యవస్థను లోబరచుకొని కార్పొరేట్లు తమ వ్యాపారాలను, లాభాలను పెంపొందించుకుంటున్నాయి. ఇలా ప్రభుత్వాల ప్రోత్సాహంతోనే ఆర్థిక వ్యత్యాసాలు పెరుగుతున్నాయి. ప్రజలు నిత్య దారిద్య్రంతో కునారిల్లుతున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ సముద్రపు అలల్లో చిల్లర డబ్బులు ఏరుకుంటున్న రాములే రోజురోజుకీ పెరుగుతున్న ఆర్థిక అంతరాలు, అసమానతలు భవిష్యత్ సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రపం చ ఆర్థిక వేదిక జనవరిలో దావోస్‌లో జరిగిన సమావేశంలో కొన్ని హెచ్చరి కలు చేసింది. ఆ సమావేశంలో పాల్గొన్న కొందరు నిపుణులు మరింత తీవ్రంగా తమ నిరసనను తెలియజేశారు. ఈ వ్యత్యాసాల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోతున్నామనే నిరాశలో యువతరం కొట్టుమిట్టాడు తున్నదని వారు అభిప్రాయపడ్డారు. తమకిక భవిత లేదని యువత భావిస్తే, ఆ అసంతృప్తి క్రమంగా సమాజ విచ్ఛిన్నానికి దారితీయగలదని ప్రపంచ ప్రముఖ ఆర్థికవేత్త జెన్నీఫర్ బ్లాంకే ఆందోళన వ్యక్తం చేశారు. మరొక ఆర్థిక వేత్త డేవిడ్ కోలే తీవ్ర స్వరంతో ఇలా హెచ్చరించారు: ‘‘నేను పెట్టుబడిదారీ విధానానికి గట్టి మద్దతుదారుడిని, అయితే ఈ ఆర్థిక అంతరాలు, అసమా నతలు కొనసాగితే పెట్టుబడిదారీ విధానం తగు మూల్యం చెల్లించుకోక తప్పదు.’’ (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ నం: 9705566213) -
మూడు వారాల కనిష్టానికి నిఫ్టీ
* వెన్నాడిన చమురు, గ్రీస్ అందోళనలు * 79 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ మార్కెట్ అప్డేట్ ముంబై: భారత స్టాక్ మార్కెట్ల పతన తీవ్రత కొంత నెమ్మదించింది. మంగళవారం నిట్టనిలువుగా పడిపోయిన మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ జరిగినంత సేపూ సూచీలు స్వల్ప నష్టాల్లోనే కొనసాగాయి. బ్లూచిప్ షేర్లలో నష్టాల కారణంగా చివరకు 79 పాయింట్లు కోల్పోయి 26,909 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 275 పాయింట్ల రేంజ్లో కదలాడింది. నిఫ్టీ 25 పాయింట్ల నష్టపోయి 8,102 పాయింట్ల వద్ద ముగిసింది. ముడి చమురు ధరల పతనం కొనసాగుతూనే ఉండడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల జోరు సూచీల నష్టానికి కారణాలు. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 50 డాలర్లకు దిగువకు వస్తే అంతర్జాతీయంగా వృద్ధి అవకాశాలు మసకబారతాయని ఇన్వెస్టర్లు భయపడుతున్నట్లు బ్రోకర్లు చెప్పారు. యూరో జోన్ నుంచి గ్రీస్ వైదొలిగే అవకాశాలు పెరుగుతండడం సైతం ఇన్వెస్టర్లను ఇన్వెస్టర్లను ఆందోళనపర్చాయి. ఎలాంటి ప్రధాన సంఘటనలు లేకపోవడం, ముడి చమురు మరింతగా పతనమవడం వంటి కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకులమయంగా సాగాయని బొనంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హిరేన్ ధకన్ వ్యాఖ్యానించారు. లోహా, బ్యాంక్ షేర్లు సెన్సెక్స్‌ను పడగొట్టాయి. బీఎస్ఈలో మొత్తం టర్నోవర్ రూ.3,210 కోట్లుగా నమోదైంది. ఎన్ఎస్ఈలో మొ త్తం టర్నోవర్ ఈక్విటీల్లో రూ.16,358 కోట్లుగా, డెరివేటివ్స్‌లో రూ.2,32,360 కోట్లుగా నమోదైంది. -
తయారీ రంగానికి బూస్ట్..
చట్టాలు, నిబంధనలు మారుస్తాం ఎకానమీని మళ్లీ వృద్ధి బాట పట్టిస్తాం మేక్ ఇన్ ఇండియాపై పరిశ్రమ వర్గాలతో భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా తయారీ రంగానికి, ఉపాధి కల్పనకూ ఊతమిచ్చే విధంగా అవసరమైతే చట్టాలను, ప్రభుత్వ పనితీరునూ మారుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎకానమీని మళ్లీ వృద్ధి బాట పట్టిస్తామన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంపై సోమవారం జరిగిన వర్క్‌షాప్‌లో పరిశ్రమవర్గాలు, ప్రభుత్వాధికారులతో ఆయన సమావేశమయ్యారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ‘గత 3 నెలల్లో ప్రభుత్వ యంత్రాంగం అన్ని విధాలుగా సన్నద్ధమైంది. మారడానికి మేం సిద్ధంగా ఉన్నాం. చట్టాలు నిబంధనలు మార్చాలన్నా మార్చాలన్నా మేం రెడీ. ఆఖరికి వ్యవస్థే మారాలన్నా కూడా సిద్ధమే’ అని ఆయన చెప్పారు. తయారీ రంగం ఎదుగుదలకు ఎదురవుతున్న ఆటంకాలను పారదర్శకమైన, సమిష్టి నిర్ణయాలతో తొలగించగలమని హామీ ఇచ్చారు. సాధారణంగా ప్రభుత్వ విధానాలు తప్పించుకునేట్లు, పక్కదారి పట్టించేవిగాను, గందరగోళంగానూ ఉంటూ జాప్యాలకు దారి తీస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. వీటిని ఏబీసీడీగా ఆయన అభివర్ణించారు. వీటి స్థానంలో జవాబుదారీతనం, యాజమాన్య ధోరణి, బాధ్యత, క్రమశిక్షణ అలవడేలా చూడటానికి కట్టుబడి ఉన్నామన్నారు. దీన్ని ఆయన ‘రోడ్ (ఆర్వోఏడీ)’గా అభివర్ణించారు. మానవ వనరుల అభివృద్ధి, నవకల్పనలు, పరిశోధనలనేవి ప్రభుత్వ పనితీరులో భాగమైపోవాలని ప్రధాని అభిప్రాయపపడ్డారు. జీరో డిఫెక్ట్.. జీరో ఎఫెక్ట్.. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని లోప రహితంగానూ(జీరో డిఫెక్ట్), పర్యావరణానికి ఎలాంటి హాని కలుగని విధంగాను(జీరో ఎఫెక్ట్) అమలు చేయాలన్నది తమ లక్ష్యమని ప్రదాని చెప్పారు. అంతర్జాతీయంగా బ్రాండ్ ఇండియాకు ప్రత్యేక గుర్తింపు తేవాల్సిన అవసరం ఉందన్నారు. దేశమంతటా సమంగా అభివృద్ధి జరగాలని చెప్పారు. వర్క్‌షాప్‌లో ఎవరు ఏం చేయాలన్నది, విధానాల్లో ఏమేం మార్పులు చేయాలన్న దాంతో పాటు అనుసరించాల్సిన ప్రణాళికపై కూడా నిర్ణయాలు తీసుకున్నట్లు మోదీ తెలిపారు. ఇక నిర్ణయాలు ఆటోమేటిక్‌గా అమలు కాగలవన్నారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో అందర్నీ భాగస్వాములను చేయడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) విధానానికి కొత్త కోణం జోడిస్తున్నామని మోదీ చెప్పారు. అంతరిక్ష పరిశోధనల్లో భార తీయ శాస్త్రవేత్తలు సాధిస్తున్న విజయాల నుంచి, వారి పనితీరు నుంచి తయారీ రంగం ప్రేరణ పొందవచ్చని ఆయన సూచించారు. వర్క్‌షాప్‌లో వజ్రాభరణాలు, ఆటోమొబైల్స్, చమురు.. గ్యాస్, విద్యుత్, రసాయనాలు తదితర 24 పైచిలుకు రంగాలకు సంబంధించిన పరిశ్రమ వర్గాలు, ప్రభుత్వాధికారులు తమ అభిప్రాయాలు తెలిపారు. వచ్చే 30-40 ఏళ్ల అవసరాలకు సరిపడా సుశిక్షితులైన మానవ వనరులను అభివృద్ధి చేసుకునేందుకు విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, పరిశ్రమ వర్గాలు కలిసి పనిచేయాలని మోదీ సూచించారు. నవకల్పనలు, పరిశోధనలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాలన్నారు. పాతికేళ్ల నుంచి భారత్ ఐటీ రంగంలో సత్తా చాటుకుంటున్నప్పటికీ, గూగుల్ వంటి దిగ్గజాన్ని సృష్టించలేకపోయిందని, మన నిపుణులు విదేశాలకు తరలిపోతున్నారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారాలకు అవరోధాలు తొలగిస్తాం: అరుణ్ జైట్లీ వ్యాపారాలకు అవరోధాలు తొల గించి, సానుకూల పరిస్థితులు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. మెరుగైన పన్ను విధానాలు అమలు చేస్తామని, మేక్ ఇన్ ఇండియా నినాదం కింద తయారీ రంగానికి తోడ్పాటు అందిస్తామని ఆయన చెప్పారు. ఇటు దేశీ, అటు విదేశీ మార్కెట్లకు ఎగుమతుల కోసం చౌకగా నాణ్యమైన ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడమే తమ ముఖ్యోద్దేశం అని మేక్ ఇన్ ఇండియాపై జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ వివరించారు. మరోవైపు ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ కఠిన పరపతి విధానాలపై ఆయన విమర్శలు గుప్పించారు. తయారీ రంగంలో మందగమనానికి ఏకైక కారణం అధిక వడ్డీ రేట్లేనని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఈ వారం జరిగే బ్యాంకర్ల భేటీ .. మేక్ ఇన్ ఇండియా నినాదానికి మరింత ఊతం ఇవ్వగలదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజన్‌పై విసుర్లు..: ఎగుమతుల కన్నా దేశీ మార్కెట్‌పై దృష్టితో మేక్ ఇన్ ఇండియాను తలపెట్టాలంటూ రాజన్ గతంలో చేసిన వ్యాఖ్యలపై జైట్లీ ఘాటుగా స్పందించారు. దీని ప్రధానోద్దేశం.. చౌక ధరల్లో నాణ్యమైన ఉత్పత్తుల తయారీ మాత్రమేనని, అవి దేశీ మార్కెట్ కోసమా లేక ఎగుమతుల కోసమా అన్నది అప్రస్తుతం అన్నారు. ‘మేక్ ఇండియా అనేది భారత్‌లో వినియోగదారుల కోసమా లేక విదేశాల్లో వారి కోసమా అన్నది అప్రస్తుతం. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా నాణ్యమైన వస్తువులు చౌకగా కొనుక్కోవాలనుకుంటున్నారన్నది నేటి ప్రధాన సూత్రం. చౌకగా, నాణ్యమైన సర్వీసులు పొందాలనుకుంటున్నారు’ అని జైట్లీ చెప్పారు. ఇటు ధరలోనూ, అటు నాణ్యతలోనూ పోటీపడలేకపోతే భారత్ కేవలం వ్యాపార దేశంగా మాత్రమే మిగిలిపోతుందే తప్ప తయారీ కేంద్రంగా ఎదగలేదన్నారు. పన్నుల విధానాలు స్థిరంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈసారి కన్నా వచ్చే ఏడాదిలో ఆర్థిక వృద్ధి మరింత మెరుగుపడగలదని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు.