Padayal No Oil No Boil Restaurant Special Story In Telugu - Sakshi
Sakshi News home page

No Oil No Boil Restaurant: ఇక్కడ దొరికే ఫుడ్‌ ఐటెమ్స్‌.. ఏ రెస్టారెంట్‌లోనూ దొరకవు..

Published Tue, Jul 11 2023 3:52 PM | Last Updated on Fri, Jul 14 2023 4:45 PM

Padayal No Oil No Boil Restaurant Special Story In Telugu  - Sakshi

పొయ్యి వెలిగించకుండా వంట చేయడం సాధ్యమేనా? కర్రీస్‌లో ​కాస్త నూనె తక్కువైతేనే టేస్ట్‌ సరిగా లేదని చిర్రుబుర్రులాడుతుంటాం. ఈమధ్య ఇంటా,బయట రెస్టారెంట్లలోనూ లీటర్ల కొద్దీ నూనెను  వాడేస్తున్నారు. మరిగించిన నూనెనే మళ్లీ మళ్లీ ఉపయోగిస్తుంటారు.

అలాంటిది నూనె లేకుండా, ఉడికించకుండానే వంటలు టేస్టీగా వండేయొచ్చని మీకు తెలుసా? ఇలా ఏదో అర, ఒకటో కాదు.. నూనె లేకుండా, పొయ్యి వెలగించకుండా 2 వేలకు పైగా వంటలు వండటమే కాకుండా, తన రెస్టారెంట్‌లోనూ నో ఆయల్‌-నో బాయల్‌ కాన్సెప్ట్‌తో రుచికరమైన వంటలను పరిచయం చేస్తున్నారు. 

ప్రస్తుతం ఏ వంట చేయాలన్నా నూనె తప్పనిసరిగా ఉండాల్సిందే. అప్పుడే వంటలు కూడా రుచికరంగా ఉంటాయి. కానీ కోయంబత్తూరుకు చెందిన శివకుమార్‌ అనే వ్యక్తి మాత్రం నూనె లేకుండా, పొయ్యి వెలగకుండా అద్భుతంగా వంట వండేయొచ్చని నిరూపించాడు. చిన్నప్పటి నుంచే శివకుమార్‌కు వంటలు చేయడం అంటే మహాపిచ్చి. ఎప్పుడూ ఏవేవో వెరైటీ వంటలు వండి అందరికీ రుచి చూపించేవాడు.

ఈయనకు ఆధ్యాత్మికత ఎక్కువ. అందుకే చిన్నప్పటినుంచి శాఖాహారం మాత్రమే తినేవాడు. అదే సమయంలో నూనె లేకుండా సహజసిద్ద పద్ధతుల్లో వంట చేయడం ఎలాగో ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని సుమారు రెండువేల కొత్త వంటలను కనిపెట్టి సొంతంగా కోయంబత్తూర్‌లో ఓ రెస్టారెంట్‌ను కూడా ఓపెన్‌ చేశాడు. 


ఆహారమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ ఇప్పుడు మనం ఏది తినాలన్నా కల్తీనే. ముఖ్యంగా రెస్టారెంట్స్‌లో అయితే ఆర్టిఫిషిల్‌ ఫుడ్‌ కలర్స్‌ కలిపి, అవసరం లేని మసాలాలను దట్టించేసి వంటలు వండేస్తున్నారు. ఇక వాళ్లు వాడే ఆయిల్‌ క్వాలిటీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆధునిక ప్రపంచంలో అనేక అనారోగ్య సమస్యలకు ఆహారం ప్రధాన కారణం. ఊబకాయం, గుండెజబ్బులు, అలర్జీలు మొదలైన చాలా రకాల జబ్బులు ఫుడ్​ వల్లే వస్తాయి. అందుకే ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన ఫుడ్​ తినాలనే ఉద్దేశంతో ఈ నేచురల్​ ఫుడ్ పద్ధతిని తీసుకొచ్చా” అంటున్నాడు పడయాళ్ శివ. 

పోపు పెట్టకుండా సాంబార్‌నే మనం ఊహించుకోలేం.. అలాంటిది నూనె లేకుండా,పొయ్యి వెలిగించకుండా వంటలు ఎలా చేయడం అనే కదా మీ సందేహం.. ఈ రెస్టారెంట్‌లో కొబ్బరి పాలు, టొమాటాలు, జీడిపప్పు, తెల్లమిరియాలను మిక్సీపడితే చాలు రుచికరమైన సాంబార్‌ రెడీ అవుతుంది. బియ్యానికి బదులు అటుకుల్నే నానబెట్టి వాటికి కొబ్బరితురుమునీ, జీలకర్రనీ చేర్చి రుచికరంగా మన ముందు ఉంచుతారు.

చింతపండు, పచ్చి పసుపు పచ్చళ్లు,12 గంటలు నానబెట్టిన కొబ్బరి పాలు లాంటి వెరైటీ ఐటెమ్స్‌ ఇక్కడ దొరుకుతాయి. రుచికి ఏమాత​ం తీసిపోకుండా ఘుమఘుమలాడే వంటలను వండేస్తున్నారు. కోయంబత్తూరులో ఈ రెస్టారెంట్‌ని ఏర్పాటు చేసి మూడేళ్లుగా విజయవంతంగా నడుపుతున్నాడు. ఇలా ఏదో ఒక రోజు, ఒక పూట కాదు, మూడు పూటలా నో ఆయిల్‌-నో బాయిల్‌ పేరుతో చక్కటి సహజసిద్దమైన భోజనాన్ని అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement