Coimbatore
-
ఐటీ కంపెనీ బంపరాఫర్: ఉద్యోగులకు రూ.14.5 కోట్ల బోనస్
దేశంలోని చాలా దిగ్గజ కంపెనీలు భారీ లాభాలను పొందినప్పటికీ.. ఉద్యోగులను తొలగించడం, జీతాలు పెంచకపోవడం వంటివి చేస్తుంటాయి. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. అయితే తాజాగా కోయంబత్తూరుకు చెందిన ఓ కంపెనీ మాత్రం తన ఉద్యోగులకు ఏకంగా రూ.14.5 కోట్ల బోనస్ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.కోయంబత్తూరుకు చెందిన 'కోవై.కో' అనే కంపెనీ.. సంస్థలో మూడేళ్ళుగా పనిచేస్తున్న 140 మంది ఉద్యోగులకు 'టుగెదర్ వి గ్రో' చొరవ కింద రూ.14.5 కోట్లు విరాళం ప్రకటించింది. ఈ బోనస్‌ను డిసెంబర్ 31, 2022 నాటికి కంపెనీలో మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారికి పంపిణీ చేయనున్నట్లు సమాచారం.మూడేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులు వారి వార్షిక జీతంలో 50% బోనస్ పొందుతారు. ఇది వారి కృషి, అంకితభావానికి నిదర్శనం. ఇప్పటికే మొదటి దశలో 80 మందికి పైగా ఉద్యోగులు ఇప్పటికే వారి జనవరి జీత చెల్లింపులలో భాగంగా బోనస్‌లను అందుకున్నారు.కంపెనీ వృద్ధికి, విజయానికి సహాయపడే ఉద్యోగులకు.. సంస్థ పొందిన లాభాలలో వాటా ఇవ్వడం నా కల. అందుకే ఉద్యోగులకు బోనస్‌లు ఇస్తున్నట్లు కోవై.కో వ్యవస్థాపకుడు.. సీఈఓ శరవణ కుమార్ అన్నారు. 2023లో కంపెనీ గణనీయమైన లాభాలను ఆర్జించింది. బెంగళూరుకు చెందిన ఫ్లోయిక్ను కొనుగోలు చేసిన తరువాత సంస్థ వేగంగా అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు.ఇదీ చదవండి: ముంబైలో ఆఫీస్ కొన్న సన్నీ లియోన్.. ఎన్ని కొట్లో తెలుసా?ఉద్యోగులకు షేర్ రూపంలో ఇవ్వడం కంటే.. నగదు రూపంలో డబ్బు ఇవ్వడం వల్ల వారి ప్రయోజనాలను ఉపయోగపడుతుంది. బ్యాంక్ లోన్స్ చెల్లించడానికి లేదా ఇతర అవసరాలకు ఈ డబ్బు ఉపయోగపడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే బోనస్‌ను నగదు రూపంలో ఇవ్వాలని నిర్ణయించినట్లు శరవణ కుమార్ పేర్కొన్నారు. కంపెనీ తాము ఊహించినదానికంటే ఎక్కువ బోనస్ ఇచ్చినందులు ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. -
తమిళనాడులో దారుణం.. చిత్తూరు మహిళపై లైంగిక దాడి యత్నం
చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. కదులుతున్న రైలులో గర్భిణిపై లైంగిక దాడి చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఈ క్రమంలో సదరు మహిళ ప్రతిఘటించగా.. రైలు నుంచి ఆమెకు బయటకు తోసేశాడు. దీంతో, సదరు గర్భిణి తీవ్రంగా గాయపడగా.. ఆమెకు ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరుకు చెందిన రేవతి(36) తమిళనాడులో కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భిణి. ఈ క్రమంలో చిత్తూరులో ఉన్న ఆమె తన తల్లి వద్దకు వెళ్లిందుకు గురువారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కోయంబత్తూరు-తిరుపతి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. బాధితురాలు రైలులోకి మహిళల కోచ్‌లో కూర్చుంది. తాను కోచ్‌లోకి ఎక్కిన సమయంలో ఆమె పాటుగా మరికొందరు మహిళలు కూడా ఉన్నారు.కాగా, రైలు జోలార్‌పేట రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే కోచ్‌లో మహిళలు అందరూ దిగిపోగా రేవతి ఒక్కరే ఉన్నారు. ఆ స్టేషన్లోనే నిందితుడు హేమరాజ్(27) మహిళల కోచ్‌కి ఎక్కాడు. రైలు ప్రారంభమైన కొద్ది సెకన్లలోనే హేమరాజ్ కోచ్‌లోకి ప్రవేశించాడు. ఇక, కోచ్‌లోకి ఒంటరిగా ఉన్న రేవతిని నిందితుడు చూశాడు. కోచ్‌లో ఎవరూ లేకపోవడంతో ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. కానీ, రేవతి తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో, ఆవేశానికి లోనైన నిందితుడు.. రేవతిపై దాడి చేసి ఆమెను కదులుతున్న రైలులో నుంచి బయటకు తోసేశాడు. ఈ క్రమంలో రేవతి.. చేతులు, కాళ్లు, తలపై తీవ్ర గాయాలయ్యాయి.🚨A 4 month pregnant woman traveling alone in the ladies' compartment of the Coimbatore-Tirupati Intercity Express was molested and pushed out of the moving train near Vellore, Tamil Nadu. The suspect, Hemaraj has been arrested.pic.twitter.com/huAiRFEiKn— Trend_X_Now (@TrendXNow) February 7, 2025ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు రేవతిని వెల్లూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అనంతరం, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హేమరాజ్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. గతంలో కూడా హత్య, దోపిడీ కేసులో అతన్ని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. -
డుం.. డుం.. డుం..
ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించింది తమిళనాడుకు చెందిన ఓ యువతి. మనసులు కలవడానికి భాషా, సంస్కృతులు అడ్డంకులు కాబోవని చాటింది. తాను ఇష్టపడిని పరదేశీయుడిని పెద్దల అనుమతితో వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది. వీరి ప్రేమపెళ్లిని అందరూ మెచ్చుకుంటూ, శుభాకాంక్షలు చెబుతున్నారు.సేలం : కోవైకు చెందిన మహిళ నెదర్లాండ్ దేశానికి చెందిన తన ప్రియుడిని కుటుంబ సభ్యుల సమ్మతితో పెళ్లి చేసుకుంది. కోవై జిల్లా పెరియ నాయకన్ పాలయానికి చెందిన ప్రమీలా.. నెదర్లాండ్ ఐటీ సంస్థలో పని చేస్తున్నారు. అక్కడ ఒక టీవీ ఛానల్లో పని చేస్తున్న స్టీన్హీస్ అనే యువకుడి తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకు అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించారు. ఆ మేరకు ఇరు కుటుంబీకుల సమ్మతితో ప్రమీలాకు, నెదర్లాండ్ యువకుడికి కోవైలో తమిళ సాంప్రదాయం ప్రకారం వివాహం ఘనంగా జరిగింది. நெதர்லாந்து நாட்டு இளைஞரை காதலித்து தமிழ் பாரம்பரியப்படி தாலி கட்டி கரம் பிடித்த தமிழ் பெண்..#Coimbatore | #Netherland | #marriage | #TamilCulture pic.twitter.com/QPzEn6aPCY— Polimer News (@polimernews) January 20, 2025video credit To Polimer Newsచదవండి: పురుషుల కళాశాలలో చేరిన మొదటి స్త్రీ! -
పెంపుడు కుక్క మృతితో విషాదం
సేలం: కోవైలో కౌండంపాళయంకు చెందిన శరత్(30) ప్రైవేటు సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఇతని తల్లిదండ్రులు గుణశేఖరన్, కుమారి, శరత్ చెల్లెలు శృతి. వీరి ఇంట్లో 11 సంవత్సరాలుగా పమేరియన్ జాతికి చెందిన శునకం సంజూను పెంచుకుంటున్నారు. ఈ స్థితిలో శరత్ చెల్లెలు శృతికి వివాహ ఏర్పాట్లు చేపట్టారు. ఈమెకు గత 22వ తేది కోవైలో నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో ఇంటిలో వివాహ కార్యక్రమాలు ఉండడంతో ఇంట్లో ఉన్న కుక్కను చూసుకునే వీలు లేకపోయింది. దీంతో మేట్టుపాళయం రోడ్డలో ఉన్న జంతు ఆస్పత్రిలో ఒక రోజు మాత్రమే ఉంచి చూసుకోవాలని కోరారు. అక్కడ 21వ తేదీ ఉదయం వదిలి వెళ్లారు. ఒక్క రోజు సంజూను చూసుకోవడానికి రూ.1,200 ఇచ్చి వెళ్లారు. ఆ కుక్కను వైద్యులు సురేంద్రన్, గోపి పర్యవేక్షించడానికి తీసుకున్నారు. ఈ స్థితిలో అదే రోజు సాయంత్రం డాక్టర్లు శరత్‌కు ఫోన్ చేసి కుక్క అనారోగ్యంతో ఉన్నట్టు తెలిపారు. హుటాహుటిన అక్కడికి వెళ్లి చూడగా ఆ కుక్క మృతి చెందినట్టు తెలిసింది. ఈ విషయంపై శరత్ సాయిబాబా కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా ఆస్పత్రికి వెళ్లిన శరత్ కుటుంబీకులు తాము పెంచుకున్న శునకం మృతదేహాన్ని చూసి బోరున విలపించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. கோவையில், விலங்குகள் நல மருத்துவமனையில் பராமரிப்புக்காக விடப்பட்ட நாய் உயிரிழந்தது. இதனால் நாயை வளர்த்த குடும்பத்தினர் கதறி அழுதனர்.#coimbatore #dogissue pic.twitter.com/CtjCW7uPDk— Indian Express Tamil (@IeTamil) November 25, 2024 -
ఆధ్యాత్మికత ముసుగులో చిన్నారులపై లైంగిక వేధింపులు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఈషా ఫౌండేషన్ ఆధ్యాత్మికత ముసుగులో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడే వారికి కేంద్రంగా మారిందని ఈషా ఫౌండేషన్ పాఠశాల మాజీ ఉపాధ్యాయురాలు యామిని రాగాని, ఆమె భర్త సత్య ఎన్ రాగాని ఆరోపించారు. తమ కుమారుడిని తమిళనాడు కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌కు చెందిన పాఠశాలలో చదివించామని, ఆ సమయంలో అతడిపై తోటి విద్యార్థి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వెల్లడించారు. ఇటీవల అక్కడి ఈషా హోమ్స్కూల్లోనూ విద్యార్థులపై ఈ తరహా ఉదంతాలు కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే ఈషా యోగా కేంద్రంలో విద్యా కార్య క్రమాల పేరుతో ఈషా సంస్కృతికి చెందిన బాలికలతో అర్ధనగ్నంగా ఆధ్యాత్మిక దీక్షలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ (సద్గురు)కు అన్ని విషయాలు తెలిసినా ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నించారు. రాజమండ్రికి చెందిన ఈ దంపతులు కొంతకాలంగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈషా ఫౌండేషన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.ఎన్నో దురాగతాలుయామిని రాగాణి మాట్లాడుతూ.. ఈషా ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు ఈషా విద్య, ఈషా సంస్కృతి, ఈషా హెూమ్ స్కూళ్లలో 8 వేల మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తు న్నట్లు తెలిపారు. ఈషా పాఠశాలలో 8 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం జరిగిన విషయాన్ని బయటికి రానివ్వలేదన్నారు. అదేవిధంగా 13 ఏళ్ల బాలుడిని 3 సంవత్సరాల పాటు వేధించినట్టు ఆరోపణలు వచ్చాయని, యాజమాన్యం నిర్లక్ష్యంతో 12వ తరగతి విద్యార్థి ఒకరు ఈ ఏడాది జూన్ 21న మృతి చెందాడని చెప్పారు. ఇలా వరుస ఘటనలు చోటు చేసుకోవడం, తమ కుమారుడు సైతం లైంగిక వేధింపులకు గురికావడంతో కలత చెందిన తాము ధైర్యం చేసి మీడియా ముందుకు వచ్చామని వెల్లడించారు.సద్గురుపై ఉన్న భక్తి, విశ్వాసంతో తాము కూడా తమ కుమారుడిని ఈషా పాఠశాలలో చదివించామని వివరించారు. లైంగిక వేధింపుల విషయం యాజమాన్యం దృష్టికి, తద్వారా జగ్గీ వాసుదేవ్ దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పారు. అంతర్గతంగా ఈ పాఠశాలల్లో జరుగుతున్న విషయాలు వెలుగులోకి తెచ్చేందుకు తాను వలంటీర్ టీచర్‌గా ఫౌండేషన్‌లో రెండేళ్లు పనిచేసినట్టు యామిని రాగాని తెలిపారు. విద్యార్థులను బూతులు తిట్టడం, మానసికంగా, శారీరకంగా హింసించడం తాను ప్రత్యక్షంగా చూసి నట్టు చెప్పారు. తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు హిందుత్వం అనే పదాన్ని వాడుతున్నారని ఆరోపించారు.బాధితులను నిర్వాహకులు బెదిరిస్తున్నారు‘తెల్లవారుజామున యోగా పేరిట బాలికలను సైతం అర్ధనగ్నంగా కూర్చోబెడుతున్నారు. ఈ విషయం గురించి ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్, మరో ఇద్దరు ముఖ్యుల మధ్య ఈమెయిల్స్ నడిచాయి..’ అని యామిని, సత్య వెల్లడించారు. దీనిపై త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇప్పటివరకు ఏడు బాధిత కుటుంబాలు తమ వెంట వచ్చాయని, మిగిలిన బాధితులతో కూడా కలిసి ముందుకు వెళతామన్నారు. అయితే ఫౌండేషన్ నిర్వాహకులు బాధితుల ను బెదిరిస్తున్నారని, స్థానిక పోలీసులను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. వీటిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, జగ్గీ వాసుదేవ్ వ్యవహారాలన్నింటిపైనా సమగ్ర దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మాకు ప్రాణహాని ఉందిఈషా పాఠశాలలో చదువుతున్న తన ఏడేళ్ల కూతురుపై ఆ పాఠశాలలో పీఈటీ రెండేళ్ల పా టు అత్యాచారానికి పాల్పడ్డాడని సదరు బాలిక తల్లి ఫోన్‌కాల్‌లో మీడియాకు తెలిపారు. ‘మేం ఎంతో మనోవేదన అనుభవించాం. ఈషా ఫౌండేషన్‌లో దుర్మార్గాలు బయట పెట్టాలంటే భయంగా ఉంది. మాకు ప్రాణహాని ఉంది. అందుకే నా వివరాలు చెప్పలేకపోతున్నాను. కానీ త్వరలోనే నేను కూడా మీడియా ముందుకు వస్తా..’ అని పేరు, వివరాలు చెప్పడానికి ఇష్టపడని ఆ బాధిత మహిళ వెల్లడించారు. -
Kruthika Kumaran: సహజమైన గెలుపు
చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్న కుమార్తెను చూసి బాధ పడింది కృతిక కుమారన్. ఈ నేపథ్యంలోనే కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్‌ల గురించి ఆలోచించింది. నేచురల్ కాస్మటాలజీలో డిప్లమా చేసిన తరువాత ప్రయోగాలు ప్రారంభించి విజయం సాధించింది. కోయంబత్తూరుకు చెందిన కృతిక కుమారన్ ఆర్గానిక్ స్కిన్‌కేర్ స్టార్టప్ ‘విల్వా’ సూపర్ సక్సెస్ అయింది...తమిళనాడులోని గోబిచెట్టిపాళయం అనే ఉళ్లో పుట్టి పెరిగింది కృతి. తండ్రి లాయర్. తల్లి గృహిణి. ఉన్నత విద్య కోసం కోయంబత్తూరుకు వెళ్లిన కృతిక ‘కుమారగురు కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ’లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ చేసింది. ఆ తరువాత తమిళ్ కుమారన్ అనే వస్త్ర వ్యాపారితో కృతికకు వివాహం జరిగింది.కుమార్తెకు చర్మసమస్యలు వచ్చినప్పుడు మార్కెట్లోని కొన్ని సబ్బులు, షాంపులను ప్రయత్నించిందిగానీ అవేమీ ఫలితం ఇవ్వలేదు. దీంతో సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి సబ్బులు తయారు చేయాలని నిర్ణయించుకుంది. ‘కాస్మటాలజీలో డి΄÷్లమా చేయడం నుంచి యూ ట్యూబ్‌లో వీడియోలు చూడడం వరకు ఎన్నో అంశాలు నా ప్రయోగాలలో ఉపయోగపడ్డాయి’ అంటుంది కృతిక.ముందుగా వంటగదిలో మేకపాలతో ప్రయోగాలు మొదలుపెట్టింది. కుటుంబసభ్యులు కూడా ఈ ప్రయోగాల్లో పాలు పంచుకున్నారు. ‘అనేక ప్రయోగాల తరువాత విజయం సాధించాం. మొదట్లో రెండు మేకలు ఉండేవి. ఇప్పుడు మేకల మందలు ఉన్నాయి. వాటి తాజా పాలతో మా ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాం. హానికరమైన రసాయనాలకు దూరంగా ఉన్నాం’ అంటుంది కృతిక.జుట్టు, చర్మసంరక్షణ ఇతర సౌందర్య ఉత్పత్తులతోపాటు లెమన్ గ్రాస్‌తో దోమల నివారణ మందును కూడా తయారు చేశారు. ఇన్స్టాగ్రామ్ స్టోర్‌తో తొలి అడుగు వేశారు. రెండు సంవత్సరాల తరువాత వెబ్‌సైట్‌ను మొదలు పెట్టడంతో పాటు డిస్ట్రిబ్యూషన్, లాజిస్టిక్స్‌లోకి వచ్చారు. అగ్రశ్రేణి డిస్ట్రిబ్యూషన్, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లతో కలిసి పని చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత ఆఫ్‌లైన్ స్టోర్లకు కూడా శ్రీకారం చుట్టారు.‘ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మా ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసినప్పుడు కోయంబత్తూరుతో పాటు చుట్టుపక్కల ్రపాంతాల నుంచి వాట్సాప్ ద్వారా ఆర్డర్లు వచ్చేవి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, నైకా లాంటి ఈ–కామర్స్ ΄్లాట్ఫామ్స్ మా ఉత్పత్తులను లిస్టింగ్ చేయడంతో వ్యాపారపరిధి విస్తరించింది’ అంటుంది కృతిక.‘లాభాల దృష్టితో కాకుండా మా కంపెనీ ద్వారా రైతులు, చేతివృత్తుల కార్మికులకు ఏదో రకంగా ఉపయోగపడాలనుకుంటున్నాం. పర్యావరణ అనుకూల ΄్యాకేజింగ్లను ఉపయోగిస్తున్నాం’ అంటుంది కృతిక.సంగీత, నృత్యాలలో ప్రవేశం ఉన్న కృతికకు చిన్నప్పటి నుంచి కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఆసక్తి. ఆ జిజ్ఞాస ఆమెను వ్యాపార దారిలోకి తీసుకువచ్చింది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా తిరుగులేని విజయం సాధించేలా చేసింది. ఇద్దరితో ్రపారంభమైన ‘విల్వా’లో ఇప్పుడు వందమందికి పైగా పనిచేస్తున్నారు. పదివేల రూపాయలతో మొదలైన కంపెనీ సంవత్సరం తిరిగేసరికల్లా కోటి రూపాయల టర్నోవర్‌కు చేరింది. ఇప్పుడు కంపెనీ టర్నోవర్ 29 కోట్లు. -
సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది!
విచక్షణ లేకుండా, చేతికొచ్చినట్టు కమెంట్లు చేయడం, సూటిపోటి మాటలతో ఎదుటివారిని చిత్రవధ చేయడం సోషల్ మీడియా ట్రోలర్లకు పరిపాటిగా మారిపోయింది. ఫలితంగా పెద్ద ప్రమాదం నుంచి బిడ్డ బయటపడిందన్న సంతోషం ఒక తల్లికి ఎంతో సేపు నిలవనీయలేదు. వేధించి, వేధించి ఆమె ఉసురు తీసిన ఘటన విషాదం నింపింది.ఇటీవలి ప్రమాదవశాత్తు తల్లి చేతుల్లోంచి జారి సన్‌షేడ్‌పై పడిన పాపను రక్షించిన సంఘటన గుర్తుందా?ఎనిమిది నెలల పాపను రక్షించే రెస్క్యూ ఆపరేషన్‌లో స్థానికులు చాకచక్యంగా వ్యవహరించి బిడ్డను కాపాడారు. కానీ ఇపుడా పాపకు తల్లిని దూరం చేసింది మాయదారి సోషల్ మీడియా. కోయంబత్తూర్‌లో పాపను రక్షించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విడియో చూసిన నెటిజన్లు "బిడ్డను చూసుకోవటం చేత కాదా?" అని ఆ తల్లిని విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో తీవ్ర డిప్రెషన్‌కి గురైన ఆమె కోయంబత్తూర్‌లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అయితే, ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.కాగా చెన్నైలోని తిరుముల్లైవాయల్‌లోని ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో నాలుగో అంతస్తులో నివసించే రమ్య, వెంకటేష్‌లకు ఇద్దరు పిల్లలు, నాలుగేళ్ల అబ్బాయి, ఏడు నెలల పాప ఉన్నారు. ఏప్రిల్ 28న, ఐటీ ఉద్యోగి రమ్య తన ఫ్లాట్‌లోని బాల్కనీలో తన పసికందుతో ఆడుకుంటూ ఉండగా, పాప ఆమె చేతుల్లోంచి జారి కింద ఉన్న తాత్కాలిక సన్షేడ్లో పడింది. దీంతో పొరుగువారు కింద దుప్పట్లు పట్టుకోగా, ఒక వ్యక్తి సన్‌షేడ్ నుండి పాపను పట్టుకుని సురక్షితంగా క్రిందికి తీసుకు రాగలిగాడు. ఈ ఘటన తర్వాత రమ్య తల్లిగారింటికి వెళ్లింది. అక్కడికి వెళ్లినా ఆమెకు ఉపశమనం లభించలేదు. దీంతో శనివారం కారమడైలోని తల్లిదండ్రుల ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉసురు తీసుకుంది. -
దివ్యాంగులకు పరీక్షా కాలంలో పలికే చేయి
పరీక్షల సీజన్ వస్తే రమా పద్మనాభన్ ఇంటి వ్యవహారాలను పెద్దగా పట్టించుకోదు. పెళ్లిళ్లు, ప్రయాణాలు అసలే ఉండవు. ఆమె తనకు వచ్చే కాల్స్‌ను అటెండ్ చేసే పనిలో ఉంటుంది. ‘అక్కా.. ఈ ఎగ్జామ్ రాయాలి’ ‘ఆంటీ... ఈ డేట్‌న ఎంట్రన్స్ ఉంది’ ఇలా దివ్యాంగులు ఆమెకు కాల్స్ చేస్తుంటారు. వారి కోసం ఆమె పరీక్ష హాల్‌కు వెళ్లి వారి ఆన్సర్స్‌ను రాసి పెడుతుంటుంది. ‘ఇది గొప్ప తృప్తినిచ్చే సేవ’ అంటోందామె.చదువుకునే రోజుల్లో ఎవరైనా పరీక్షలు రాయవచ్చు. చదువు అయిపోయాక ఏవైనా కోర్సులు సరదాగా చదివితే పరీక్షలు రాయవచ్చు. కాని రమా పద్మనాభన్ అలా కాదు. ఆమె ప్రతి ఆరు నెలలకు విద్యార్థులకు సెమిస్టర్ ఎగ్జామ్స్ జరిగినప్పుడల్లా 50 పరీక్షలు రాస్తుంది. అంటే రాసి పెడుతుంది. గత పదకొండేళ్లుగా ఆమె అలా చేస్తూనే ఉంది. దివ్యాంగులకు పరీక్షలు రాసి పెట్టే స్క్రయిబ్గా ఆమెకు కోయంబత్తూరులో ఉండే పేరు అలాంటిది.గృహిణిగా ఉంటూ...కోయంబత్తూరుకు చెందిన రమా పద్మనాభన్ సైకాలజీలో డిగ్రీ చేసింది. ఆ తర్వాత ‘గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్’లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కూడా చదివింది. భర్త ఫైనాన్షియల్ సెక్టార్లో పని చేస్తాడు. ఆమెకు ఇద్దరు అబ్బాయిలు. గృహిణిగా పిల్లలను చూసుకుంటూ కాలం గడుపుతున్న రమా పద్మనాభన్ జీవితం 2013లో మారింది. ‘ఆ రోజు నేను యోగా క్లాసుకు బయలుదేరాను. నా స్నేహితురాలి నుంచి ‘ఒక అంధ విద్యార్థికి పరీక్ష రాసి పెడతావా?’ అనే విన్నపం వచ్చింది. అలా రాయగలనా అనుకున్నాను. పరీక్ష కేంద్రం దగ్గరే కనుక ట్రై చేద్దామనిపించింది. వెళ్లి రాసి పెట్టాను.పరీక్ష ముగిశాక ఆ అంధ విద్యార్థి ముఖంలో కనిపించిన కృతజ్ఞత నాకు ఎంతో మనశ్శాంతిని ఇచ్చింది. ఆ తర్వాత నాకు కాల్స్ రావడం మొదలైంది. కోయంబత్తూరులో లూయిస్ బ్రెయిలీ అకాడెమీ ఉంది. వాళ్లు కాల్ చేస్తూనే ఉంటారు. వీరు కాకుండా దివ్యాంగులు, ఆటిజమ్ విద్యార్థులు... వీరు పెన్ పట్టి పరీక్ష రాయడం కష్టం. వారికి పరీక్షలు రాసి పెడుతుంటాను’ అని తెలిపింది రమా పద్మనాభన్.అంతా ఉచితమేదివ్యాంగులకు, అంధులకు పరీక్షలు రాసేందుకు రమ ఎటువంటి రుసుమూ తీసుకోదు. పరీక్షా కేంద్రానికి కూడా సొంత ఖర్చులతోనే వెళ్లి వస్తుంది. ‘అయితే అందుకు నా భర్తను అభినందించాలి. నీ డబ్బులు ఖర్చు పెట్టి వేరొకరి పరీక్షలు ఎందుకు రాస్తున్నావు అని ఎప్పుడూ అడగలేదు’ అంటుంది రమ. ‘అంధ విద్యార్థులు తమకు పరీక్షలు రాసి పెట్టే వారు లేరని తెలిస్తే చాలా టెన్షన్ పడతారు. ఆబ్సెంట్ అయితే పరీక్ష పోతుంది. అందుకే వారికి స్క్రయిబ్లు కావాలి. వారు చెబుతుంటే జవాబులు సరిగ్గా రాయగలగాలి. నేను ఆటిజమ్ విద్యార్థులకు రాసి పెట్టేటప్పుడు మరింత శ్రద్ధగా ఉంటాను. వారు సమాధానాలు కంటిన్యూస్‌గా చెప్పడంలో ఇబ్బంది పడతారు. ప్రోత్సహిస్తూ రాబట్టాలి. అదే కాదు హైస్కూల్ పాఠాల దగ్గరి నుంచి ఇంజినీరింగ్ పాఠాల వరకూ అవగాహన ఉండాలి. అందుకే ఆ పాఠాలు కూడా తెలుసుకుంటూ ఉంటాను. స్క్రయిబ్గా నేను మారేటప్పటికి నా పిల్లలు చిన్నవాళ్లు. నా చిన్నకొడుకుకైతే ఐదారేళ్లవాడు. ఇంటిదగ్గర వాణ్ణి ఒక్కణ్ణే వదిలి తాళం వేసుకుని పరీక్ష రాసి పెట్టిన సందర్భాలున్నాయి’ అని తెలిపిందామె.కొనసాగే అనుబంధం‘నేను రాసిన పరీక్షలతో కోర్సులు పాసై ఉద్యోగాలు పొందిన దివ్యాంగులు చాలా మంది ఉన్నారు. వాళ్లంతా నా కాంటాక్ట్‌లో ఉంటారు. తమ జీవితంలో సాధిస్తున్న ప్రగతిని తెలియజేస్తుంటారు. అదంతా వింటుంటే ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది. జీవితానికి ఒక అర్థం దొరికినట్టు ఉంటుంది. నా పెద్దకొడుకు సీనియర్ ఇంటర్‌కు వచ్చాడు. వాణ్ణి వీలున్నప్పుడల్లా స్క్రయిబ్గా పని చేయడానికి పంపుతున్నా. వాడు ఆ పని చేస్తున్నందుకు ఎంత సంతోష పడుతున్నాడో చెప్పలేను’ అని ముగించింది రమా పద్మనాభన్. -
కోయంబత్తూరులో రూ.1000 కోట్లు.. బీజేపీ చీఫ్ సంచలన ఆరోపణలు
చెన్నై, సాక్షి: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, కోయంబత్తూరు అభ్యర్థి కె.అన్నామలై సంచలన ఆరోపణలు చేశారు. కోయంబత్తూరులో ఓటర్లను ప్రభావితం చేసేందుకు డీఎంకే, ఏఐఏడీఎంకేలు రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేశాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల మొదటి దశలో పోలింగ్‌లో భాగంగా అన్నామలై కరూర్‌లోని ఉత్తుపట్టిలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. కోయంబత్తూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైపై డీఎంకే నుంచి గణపతి పి.రాజ్‌కుమార్, ఏఐఏడీఎంకేకు చెందిన సింగై రామచంద్రన్ పోటీ చేస్తున్నారు. కోయంబత్తూరులో బీజేపీ వ్యక్తి తమను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు ఒక్కరినైనా తీసుకురాగలిగితే తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని అన్నామలై సవాలు విసిరారు. బీజేపీ సొంతంగా 25 శాతం దాటుతుందని, సీట్ల సంఖ్య కూడా రెండంకెల్లో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. "ఈ రోజు నేను నా ప్రజాస్వామ్య కర్తవ్యాన్ని నిర్వర్తించాను. దేశంలోని ప్రతి పౌరునికి ఇది ఒక ముఖ్యమైన కర్తవ్యం. ఎందుకంటే భారతదేశంలో పనిచేసే ప్రజాస్వామ్యం ఉంది. ఇక్కడ పౌరులు ప్రజాస్వామ్యాన్ని పని చేసేలా చేస్తారు. మంచి వ్యక్తులు, పాలనపై ప్రజలు తమ విశ్వాసాన్ని మరోసారి చూపిస్తారని మాకు నమ్మకం ఉంది. తమిళనాడు ప్రజలు చరిత్రాత్మకమైన మార్పునకు నాంది పలుకుతారు” అని అన్నామలై పేర్కొన్నారు. -
తమిళనాడులో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..!
తమిళనాడులో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చారు. తమ పార్టీ (డీఎంకే) 2024 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయాన్ని పొందుపరుస్తున్నట్లు స్టాలిన్ వెల్లడించారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో అత్యాధునిక హంగులతో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపడతామని స్టాలిన్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. As a sports and cricket enthusiast, I would like to add one more promise to our election manifesto for #Elections2024: 🏏🏟️ We will take efforts to establish a state-of-the-art cricket stadium in Coimbatore, with the active participation of the sports loving people of… https://t.co/B6rpHJKSBI — M.K.Stalin (@mkstalin) April 7, 2024 క్రికెట్ ఔత్సాహికుడినైన నేను #Elections2024 కోసం మా ఎన్నికల మేనిఫెస్టోలో మరో వాగ్దానాన్ని జోడించాలనుకుంటున్నాను. కోయంబత్తూరులోని క్రీడాభిమానుల చురుకైన భాగస్వామ్యంతో అత్యాధునిక క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తాను. ఈ స్టేడియాన్ని చెన్నై చిదంబరం స్టేడియం తర్వాత తమిళనాట రెండో అతి పెద్ద అంతర్జాతీయ క్రికెట్ వేదికగా తీర్చిదిద్దుతాను. క్రీడల మంత్రి ఉదయ్ స్టాలిన్ రాష్ట్రంలో ప్రతిభను పెంపొందించడానికి, క్రీడా మౌలిక సదుపాయాలు సమకూర్చడానికి కట్టుబడి ఉన్నాడంటూ స్టాలిన్ ట్వీట్ చేశారు. కాగా, తమిళనాట ఇదివరకే ఓ అంతర్జాతీయ స్టేడియం (చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం) ఉందన్న విషయం తెలిసిందే. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ఇది సొంత మైదానం. 1916లో స్థాపించబడిన చిదంబరం స్టేడియం దేశంలో రెండో పురాతన క్రికెట్ స్టేడియం. -
Lok Sabha elections 2024: కోయంబత్తూర్ రోడ్ షోకు హైకోర్టు ఓకే
చెన్నై: ఈ నెల 18వ తేదీన తమిళనాడులోని కోయంబత్తూర్ నగరంలో నాలుగు కిలోమీటర్ల మేర సాగాల్సిన ప్రధాని మోదీ రోడ్ షోకు మద్రాస్ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. మతపరంగా సున్నితమైన ప్రాంతం అనే కారణంతో కోయంబత్తూర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రోడ్ షోకు అనుమతి నిరాకరించడం సహేతుకంగా లేదని హైకోర్టు పేర్కొంది. ప్రధానమంత్రికి నిరంతరం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రత ఉంటుందని గుర్తు చేసింది. ‘ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వంటి ఉన్నత హోదా కలిగిన నాయకులను ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి, తమను ఎన్నుకున్న వారిని కలవకుండా నేతలను ఆపడం సరికాదు’అని అభిప్రాయపడింది. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత రోడ్ షో జరగనున్నందున పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందీ ఉండదన్నారు. రోడ్ షోకు అనుమతి నిరాకరిస్తూ పోలీస్ కమిషనర్ పురమ్ రంగే తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రమేశ్ కుమార్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్.ఆనంద్ వెంకటేశ్ శుక్రవారం విచారణ జరిపారు. రోడ్ షోకు షరతులతో కూడిన అనుమతివ్వాలని కమిషనర్‌ను ఆదేశించారు. -
ప్రధాని రోడ్ షోకు అనుమతి నిరాకరణ
చెన్నై: లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేశాయి. బీజేపీ, కాంగ్రెస్‌తో సహా ప్రాంతీయ పార్టీలు సైతం అభ్యర్ధుల ప్రకటన, ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. శుక్రవారం తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల పర్యటన చేపట్టిన మోదీ.. వచ్చేవారం మరోసారి తమిళనాడులో పర్యటించనున్నారు. మార్చి 18న ప్రధాని కోయంబత్తూర్‌లో 3.6 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో దాదాపు లక్షమంది పాల్గొనే అవకాశముందని తెలిపింది. అయితే కోయంబత్తూర్‌లో నిర్వహించే ప్రధాని రోడ్‌షోకు రాష్ట్ర పోలీసులు అనుమతివ్వలేదు. భద్రతాపరమైన కారణాలు, ప్రజలకు అసౌకర్యం, ముఖ్యంగా విద్యార్ధులకు ఇబ్బంది తదితర కారణాల దృష్ట్రా జిల్లా పోలీసు అధికారులు అనుమతి నిరాకరించారు. అలాగే రోడ్‌షో కోసం బీజేపీ ఎంచుకున్న మార్గం మత ఘర్షణలు చెలరేగేందుకు అవకాశాలున్న ప్రాంతమని పోలీసులు పేర్కొన్నారు. కాగా మోదీ రోడ్ షో చేసే కోయంబత్తూరులోని ఆర్ఎస్ పురంలో 1998లో వరస పేలుళ్లు జరిగాయి. అప్పటి నుంచి ఈ ప్రాంతంపై పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టారు. అక్కడ మతపరమైన ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నందున ఏ రాజకీయ పార్టీలు, సంఘాలకు రోడ్‌షోలకు అనుమతి ఇవ్వడం లేదు. చదవండి: కేరళలో కమలం వికసిస్తుంది: ప్రధాని మోదీ -
కోయంబత్తూరులోని ఆదియోగి శివ: వితికాశేరు భక్తి పారవశ్యం (ఫోటోలు)
-
Loganathan: క్లీన్ హెల్ప్
మనకు దండిగా డబ్బులుంటే ఇతరులకు దానం గానీ, సాయం గానీ చేయగలుగుతాం కానీ మనకే లేనప్పుడు ఇతరులకు ఏం సాయం చేయగలుగుతాం అని నిష్ఠూరాలు పోతుంటాము. లోగనాథన్ మాత్రం అలాంటి వ్యక్తికాదు. తన దగ్గర డబ్బులు లేకపోయినా సాయం చేయాలనుకున్నాడు. ఇందుకు కావలసిన డబ్బు కోసం టాయిలెట్స్‌ను శుభ్రం చేయడానికి కూడా వెనకాడటం లేదు లోగనాథన్. అలా వచ్చిన కొద్దిమొత్తాన్ని కూడా నిరుపేద పిల్లల చదువుకోసం ఖర్చు పెడుతున్నాడు. ఈ విషయం తెలిసి ప్రధాని మోదీ సైతం మన్‌కీ బాత్‌లో లోగనాథన్ని ప్రశంసించారు. కోయంబత్తూరులోని కన్నంపాళయంకు చెందిన 55 ఏళ్ల లోగనాథన్ తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు. ఇంటి పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో ఆరోతరగతితోనే చదువు ఆపేశాడు. తల్లిదండ్రులకు సాయం చేసేందుకు కొబ్బరి బోండాలు అమ్మేవాడు. అలా కొబ్బరిబోండాల దగ్గర ఉన్నప్పుడు లోగనాథన్‌కు.. చిరిగిపోయిన బట్టలు వేసుకుని, చదువుకునే స్థోమత లేక రోడ్ల మీద తిరుగుతున్న పిల్లలు కనిపించేవారు. వారిని చూసి జాలిపడేవాడు. ఇలా చూసి చూసి.. ‘‘పేదరికంతో నాలా మరెవరూ చదువుని మధ్యలో ఆపేయకూడదు. నిరుపేద పిల్లలు చదువు కొనసాగేందుకు చేతనైన సాయం చేయాలి’’ అని నిర్ణయించుకున్నాడు. పార్ట్‌టైమ్ పనులు చేస్తూ వచ్చిన డబ్బులను పేద పిల్లలకు ఖర్చుచేయడం మొదలుపెట్టాడు. టాయిలెట్స్ కడుగుతూ... కొన్నాళ్లకు లోగనాథన్ తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం తనపై పడింది. దాంతో కొబ్బరి బోండాలు అమ్మడంతోపాటు పేపర్‌మిల్‌లో పనికి చేరాడు. అప్పుడు కూడా డబ్బులు సరిపోయేవి కావు. అయినా పేదపిల్లలకు సాయం చేయడం మానలేదు. తనకొచ్చే జీతంలో కొంతమొత్తాన్ని సాయంగా ఇస్తూ్తనే ఉన్నాడు. డబ్బులు చాలనప్పుడు టాయిలెట్స్ క్లీన్ చేసి వచ్చిన డబ్బులను పేదపిల్లలకు ఇస్తున్నాడు. పాతికేళ్లుగా సాయంచేస్తూ పదిహేను వందలమందికిపైగా నిరుపేద పిల్లలకి ప్రాథమిక విద్యను అందించాడు. సిగ్గుపడకుండా... వృత్తిపరంగా వెల్డర్ అయిన లోగనాథన్‌కు.. తన ఎనిమిది గంటల డ్యూటీ అయిపోయిన తరువాత ఖాళీ సమయం దొరికేది. వెల్డింగ్ షాపు పక్కనే కొంతమంది శానిటరీ వర్కర్స్‌తో పరిచయం ఏర్పడింది. వాళ్లు టాయిలెట్స్ క్లీన్ చేసి సంపాదిస్తున్నారని తెలుసుకుని, తను కూడా గత పదిహేడేళ్లుగా టాయిలెట్స్ శుభ్రం చేస్తూ నెలకు రెండువేల రూపాయల పైన సంపాదిస్తూ అనాథ ఆశ్రమాలకు విరాళంగా ఇస్తున్నాడు. సంపన్న కుటుంబాల దగ్గర నుంచి పుస్తకాలు, బట్టలు సేకరించి అనాథపిల్లలకు ఇవ్వడం, ఏటా ప్రభుత్వం నిర్వహించే అనాథ ఆశ్రమాలకు పదివేల రూపాయల విరాళంగా ఇవ్వడం వంటి చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు లోగనాథన్. ‘‘నాకు సాయం చేయాలని ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు చిన్నప్పటి నుంచి ప్రతికూలంగానే ఉన్నాయి. ఎలాగైనా సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో నాకు తోచిన విధంగా చేస్తున్నాను. టాయిలెట్స్ కడగడం మొదలు పెట్టిన తరువాత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు విముఖత వ్యక్తంచేశారు. చాలాసార్లు హేళనకు కూడా గురయ్యాను. అయినా నాకు ఏమాత్రం బాధలేదు. ఏదోఒక విధంగా పేద పిల్లలకు సాయపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నీ అనుకూలిస్తే చారిటబుల్ ట్రస్టు పెడతాను’’. – లోగనాథన్ -
Tamil Nadu: మరో కలకలం.. కోయంబత్తూర్‌లో మాస్క్ తప్పనిసరి..
చెన్నై: తమిళనాడులోకి కోయంబత్తూరులో మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు అక్కడి అధికారులు. కోయంబత్తూరు జిల్లాలో జ్వరానికి సంబంధించిన కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటించాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. వివరాల ప్రకారం.. తమిళనాడులో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వైరల్ ఫీవర్ బారినపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. పలు జిల్లాలో జ్వరం భారీన పడుతున్న వారు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో, అప్రమత్తమైన అధికారులు ఎక్కడికక్కడ ఫీవర్ క్యాంపులను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమై.. కోవిడ్ మాదిరిగానే ఆదేశాలను పాటించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి కుమార్ కోరారు. ఈ సందర్బంగా కలెక్టర్ కాంత్రి కుమార్ మాట్లాడుతూ..‘ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా వైరల్ ఫీవర్ బారినపడుతున్న వారి సంఖ్య పెరిగింది. ఫ్లూ వైరస్.. పెద్దలను, పిల్లలను ప్రభావితం చేస్తోంది. దీంతో, జ్వర బాధితులు పెరుగుతున్నారు. బాడీ పేయిన్స్, జలుబు, తలనొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు రాబోయే కొద్దిరోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించండి. Tamil Nadu: 'Mask up', Coimbatore administration issues notice amid spike in fever cases due to rains#Fever #Coimbatore Read: https://t.co/GnIZOMx2ys — IndiaTV English (@indiatv) November 22, 2023 ప్రతీ ఒక్కరూ గోరు వెచ్చటి నీటిని త్రాగాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి. కోవిడ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలరో ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలు పాటించడం అవసరం. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి.. సామాజిక దూరం పాటించండి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరిన వారి వివరాలను సేకరిస్తున్నాం. వారి ఏరియాలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తాం’ అని అన్నారు. -
కోరమాండల్ నానోటెక్నాలజీ సెంటర్
చెన్నై: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ తాజాగా నానోటెక్నాలజీ సెంటర్‌ను కోయంబత్తూరులో ఏర్పాటు చేసింది. ఇది మొక్కల పోషణ, పంటల రక్షణ కోసం నానో ఆధారిత ఎరువులు, సస్య రక్షణ ఉత్పత్తుల అభివృద్ధికి తోడ్పడుతుందని కంపెనీ శుక్రవారం తెలిపింది. ఐఐటీ ముంబైలో సైతం కంపెనీకి నానోటెక్నాలజీ కేంద్రం ఉంది. కోయంబత్తూరు సెంటర్ కోరమాండల్‌కు ఆరవ పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా నిలిచింది. -
తమిళనాడులో భారీ వర్షం.. స్కూల్స్ బంద్, పలు రైళ్లు రద్దు
చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్థంభించిపోయింది. వరదల కారణంగా పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. 12 జిల్లాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే, తమిళనాడువ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. కోయంబత్తూరు, తిరువూర్, మధురై, థేనీ, దినిదిగుల్ జిల్లాల్లో గురువారం కుండపోత వాన కురిసింది. ఇక, నీలగిరి జిల్లాలోని ఐదు తాలుకాలను వర్షం ముంచెత్తింది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో శుక్రవారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తంజావూర్, తిరువారూర్, నాగపట్నం, మైలదుత్తురై, పుదుకోట్టై, శివగంగై, రామనాథపురం, విరుదునగర్, తూత్తుకుడి, తెంకాసి, తిరునెల్వేలి, కన్యాకుమారి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. Due to severe rains #Madurai is water logged #TamilNadu #Rains pic.twitter.com/eTvH8oK4JW — Ashok Varma (@AshokVarmaAA) November 10, 2023 ఇక, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. తాజాగా తిరువారూర్ జిల్లా, పుదుచ్చేరిలోని కారైక్కల్లోని పాఠశాలలను నేటి నుంచి మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదే సమయంలో వర్షం కారణంగా పలు రైళ్లను కూడా రద్దు చేశారు రైల్వే అధికారులు. నీలగిరి మౌంటైన్ రైల్వేలోని కల్లార్, కూనూర్ సెక్షన్ల మధ్య ట్రాక్‌పై కొండచరియలు, చెట్లు కూలిపడటంతో నవంబర్ 16 వరకు ఆ రూట్స్‌లో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. మెట్టుపాళయం నుంచి ఉదగమండలం వరకు నడిచే 06136, 06137 ప్యాసింజర్ ప్రత్యేక రైళ్లను నవంబర్ 10 నుంచి 16వ తేదీ వరకు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. VIDEO | Schools across Tamil Nadu’s Coimbatore shut due to heavy rains in the region. pic.twitter.com/Y0q73Zw1R7 — Press Trust of India (@PTI_News) November 9, 2023 -
Vitya And Nitya: ఆగొద్దు, పరుగు తీయండి
‘ముగ్గురు ఆడపిల్లల్ని కన్నావ్. ఎలా పెంచుతావో’ అని ఆ తల్లికి దారిన పోయేవారంతా సానుభూతి తెలిపేవారు. పేదరికంతో అలమటిస్తున్న కుటుంబం అది. ఆ తల్లి తన కూతుళ్లను ఆపదలచలేదు, ఆగిపోనివ్వలేదు. ‘ఫ్రీగా తిండి పెడతారు. తిని పరిగెత్తండి’ అని ఇద్దర్ని తీసుకెళ్లి స్పోర్ట్స్ హాస్టల్లో పడేసింది. కవలలైన ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఇవాళ భారతదేశంలో మేలైన అథ్లెట్లుగా మారారు. ఆసియన్ గేమ్స్‌కు క్వాలిఫై అయ్యారు. కోయంబత్తూరుకు చెందిన విత్య, నిత్యల పరుగు కథ ఇది. అబ్బాయిలు పుడితేనేనా సంతోషం? అమ్మాయిలు పుడితే బాధ పడాలా? ‘నాకు లేని బాధ మీకెందుకు?’ అని ఇరుగు పొరుగువారితో అనేది మీనా. కోయంబత్తూరులో నిరుపేదల కాలనీలో నివాసం ఉన్న మీనాకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. ‘సత్య’ అనే పేరు పెట్టింది. రెండో కాన్పులో ఏకంగా కవల ఆడపిల్లలు పుట్టారు. వారికి ‘విత్య’, ‘నిత్య’ అనే పేర్లు పెట్టింది. భర్త రామరాజ్ లారీ డ్రైవరు. డ్యూటీ ఎక్కితేనే సంపాదన. ఇంట్లో ఎప్పుడూ పేదరికమే. దానికి తోడు ‘ముగ్గురు ఆడపిల్లలు’! ‘ఎలా పెంచుతావో ఏమో’ అని ఇంటికొచ్చిన అందరూ అనేవారు. కాని మీనా అస్సలు బాధ పడలేదు. భయపడలేదు. ఆడపిల్లలే కదా అని ఇంట్లో మగ్గేలా చేయలేదు. ‘నా పిల్లలు చదువుకోవాలి. ఆడపిల్లలు పైకి రావాలంటే చదువే దారి’ అని స్కూల్లో చేర్చింది. పెద్దమ్మాయి సత్య చక్కగా చదువుకుంటే కవలలు విత్య, నిత్యలు స్కూల్లో హాకీ బాగా ఆడటం మొదలుపెట్టారు. కాని ఇంట్లో ప్రతి పూటా ఐదుగురికి ముద్ద నోట్లోకి వెళ్లాలంటే కష్టమైన సంగతి. స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ద్వారా స్పోర్ట్స్ స్కూల్ గురించి తెలిసింది. ఆ స్కూల్లో చేర్చితే చదువుతోపాటు ఆటలు నేర్పిస్తారు అని తెలుసుకుంది మీనా. ఇద్దరు కూతుళ్లు చిన్న పిల్లలు. ఏడవ తరగతి లో ఉన్నారు. కళ్లముందు పెరగాల్సిన బిడ్డలు. ‘ఏం పర్వాలేదు. మీ భవిష్యత్తే ముఖ్యం. స్పోర్ట్స్ స్కూల్లో కడుపు నిండా తిని బాగా పరిగెత్తండి’ అని చెప్పి కవల సోదరీమణులైన విత్య, నిత్యలను కోయంబత్తూరులోని స్పోర్ట్స్ స్కూల్లో చేర్చింది. ఆ తల్లి తపనను కూతుళ్లు అర్థం చేసుకున్నారు. బాగా ఆడారు. ఇవాళ విజేతలుగా నిలిచారు. ఆసియా గేమ్స్ ఆశాకిరణాలు మన దేశం నుంచి ఆసియా గేమ్స్‌లో పాల్గొన్న కవల క్రీడాకారులు తక్కువ. వారిలో మహిళా అథ్లెట్లు ఇంకా తక్కువ. మరో తొమ్మిది రోజుల్లో హాంగ్జవ్ (చైనా)లో మొదలుకానున్న ఆసియన్ గేమ్స్‌లో విత్య రామరాజ్, నిత్య రామరాజ్ పేర్లతో ఈ కవలలు పాల్గొనబోతున్నారు. విత్య 400 మీటర్ల హర్డిల్స్, ఫ్లాట్ రన్లో పాల్గొంటుంటే నిత్య 100 మీటర్ల పరుగులో పాల్గొననుంది. మన దేశం నుంచి మొత్తం 65 మంది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు ఆసియా గేమ్స్ కోసం ఎంపికైతే వారిలో విత్య, నిత్య ఉన్నారు. ‘ఇద్దరం ఎంపిక కావడంతో అమ్మ ఆనందానికి అవధులు లేవు. ఎవరో ఒకరు మాత్రమే అయితే ఆమె తప్పక బాధపడేది. ఆమె కోసం, దేశం కోసం ఎలాగైనా పతకాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నాం’ అన్నారు విత్య, నిత్య. పి.టి. ఉషతో సమానంగా విత్య రామరాజ్ చెన్నైలో శిక్షణ పొంది గత కొన్ని సంవత్సరాలుగా జాతీయ స్థాయి బంగారు పతకాలు గెలుస్తూ వచ్చింది. రెండ్రోజుల క్రితం చండీగఢ్‌లో జరిగిన గ్రాండ్‌ప్రిలో 400 మీటర్ల హర్డిల్స్‌ను 55.4 సెకెండ్లలో పూర్తి చేసింది. ఇది 1984 ఒలింపిక్స్‌లో పి.టి. ఉష రికార్డుకు కేవలం 0.01 సెకండ్ల కంటే తక్కువ. అంటే 39 సంవత్సరాల తర్వాత ఆ స్థాయి ప్రతిభను చూపే అథ్లెట్‌గా విత్య అవతరించింది. ఆనాడు ఆమె తల్లి ఆమెను ప్రోత్సహించకపోతే, ఆడపిల్లే అనుకుని ఖర్మకు వదిలిపెడితే ఈ రోజున ఇంత ప్రతిభతో నిలిచేదా? అలాగే నిత్య కూడా 100 మీటర్ల హర్డిల్స్‌లో మంచి ప్రతిభ చూపుతోంది. ‘మేమిద్దరం ఆసియా గేమ్స్‌లో మెడల్స్ సాధించి ఒలింపిక్స్‌కు వెళ్లాలని అనుకుంటున్నాం. ఆశీర్వదించండి’ అంటున్నారు విత్య, నిత్య. ఇలాంటి క్రీడాకారిణులకు అందరి ఆశీస్సులూ ఉంటాయి. -
మీకు తెలుసా? తాటాకు బొమ్మలకు చాలా డిమాండ్, ఉపాధి మార్గం
తాటాకులు ఇప్పటికీ మన పల్లెల్లో విస్తారం. కానీ తాటాకు విసనకర్రలు పోయాయి. తాటాకు చాపలు, తాటాకు బొమ్మలూ పోయాయి. ‘మన కళ ఇది. మన పిల్లలకు బార్బీ కంటే తాటాకు బొమ్మలే నచ్చుతాయి’ అంటుంది కోయంబత్తూరు మోహనవాణి. తాటాకు కళను పిల్లలకు నేర్చించి వారికై వారు తయారు చేసుకున్న బొమ్మలతో ఆడుకునేందుకు ప్రోత్సహిస్తోంది. స్త్రీలు సరిగా నేర్చుకుంటే ఉపాధి మార్గం అని కూడా చెబుతోంది. మన దేశంలో పశ్చిమ బెంగాల్లో తాటాకుతో చేసే బొమ్మలకు, బుట్టలకు చాలా డిమాండ్ ఉందని చాలా కొద్ది మందికే తెలుసు. విశాఖ జిల్లా నక్కపల్లి, నర్సీపట్నంల నుంచి శ్రేష్టమైన తాటాకు గ్రేడింగ్ అయ్యి, రంగులు అద్దుకుని కోల్‌కతాకి ఎగుమతి అవుతుంది. అక్కడ వాటితో బొమ్మలు, బుట్టలు తయారు చేసి అమ్ముతున్నారు. పెద్ద ఆదాయం. విశాఖలో జరుగుతున్నట్టుగా మిగిలిన జిల్లాల్లో జరగడం లేదు. తాటాకులు మన తొలి కాగితాలు. తాటాకుతో ఒకప్పుడు ఇళ్లు కప్పేవారు, పందిళ్లు వేసేవారు, చాపలు, బుట్టలు, బొమ్మలు తయారు చేసేవారు. ఇప్పుడు ఆ కళంతా ఎవరూ సాధన చేయడం లేదు. దానిని అందరికీ నేర్పించాలని కూడా అనుకోవడం లేదు. కాని తమిళనాడులో 34 ఏళ్ల మోహనవాణి అనే మహిళ పట్టుబట్టి తాటాకు బొమ్మల కళను అందరికీ నేర్పుతోంది. దక్షిణాదిలో విస్తారంగా ఉండే తాటి చెట్టు నుంచి ఆకు సేకరించి బొమ్మలు చేసి ఉపాధి పొందవచ్చంటున్నది. ఎనిమిదేళ్ల వయసులో.. మోహనరాణిది కోయంబత్తూరు. ఆమెకు ఎనిమిదేళ్లు ఉండగా మేనమామ ఆమెకు తాళపత్ర గ్రంథం చూపించాడు. రోజూ చూసే తాటాకుల మీద పుస్తకమే రాయవచ్చా అని మోహనరాణికి ఆశ్చర్యం వేసింది. తాటాకులతో చిన్న చిన్న బొమ్మలు చేసే ప్రయత్నం చేసిందిగాని పూర్తిగా రాలేదు. అప్పటినుంచి తాటాకు బొమ్మలు చేయాలనే కోరిక ఉండిపోయింది. ఐదేళ్ల క్రితం మదురైలో తాటాకు బొమ్మలు నేర్పించే వర్క్‌షాప్ జరుగుతున్నదని తెలిసి హాజరయ్యింది. మూడు రోజుల ఆ వర్క్‌షాప్‌లో తాటాకు బొమ్మలు చేయడం నేర్పించారు. పచ్చి ఆకుతో నేరుగా, ఎండిన ఆకైతే నీటితో తడిపి మెత్తగా చేసుకుని అప్పుడు బొమ్మలు చేయాలని తెలిసింది. ఎలా కత్తిరిస్తే ఏ షేప్ వస్తుందో అర్థమయ్యాక తన ఊహ కలిపి బొమ్మలు తయారు చేసింది. వాటికి పూసలు జత చేయడంతో స్పష్టమైన బొమ్మలు తయారయ్యాయి. మోహనవాణి తాటాకులతో చీమలు, చిలుకలు, నెమళ్లు, చేపలు... ఇలా చాలా బొమ్మలు చేస్తుంది. వాటితో గట్టి బుట్టలు కూడా అల్లుతుంది. పిల్లల లోకం అయితే ఈ బొమ్మలు తర్వాతి తరాలకు అందాలని నిశ్చయించుకుంది మోహనవాణి. కోయంబత్తూరులోని స్కూళ్లకు వెళ్లి తాటాకు బొమ్మలు నేర్పించింది. పిల్లలు ఎంతో హుషారుతో బొమ్మలు నేర్చుకున్నారు. కొత్త బొమ్మలు చేశారు. ‘ఆశ్చర్యం ఏమిటంటే మీరు తయారు చేసిన బొమ్మలతో కథ కల్పించి చెప్పండి అనంటే వాళ్లు చాలా విచిత్రమైన కథలు చెప్పారు. పిల్లలకు ఇదెంతో మానసిక వికాసం అనిపించి తరచూ అనేక స్కూళ్లకు వెళ్లి వర్క్‌షాపులు నిర్వహించి ఈ కళను నేర్పుతున్నాను’ అంది మోహనవాణి. ప్లాస్టిక్‌కు దూరం తాటాకు బొమ్మలు పర్యావరణ హితమైనవి. పిల్లల్ని, పర్యావరణాన్ని ప్లాస్టిక్ నుంచి దూరంగా ఉంచుతాయి. అంతేకాదు తాటాకు బొమ్మలు దేశీయమైనవి. మనదైన కళ కావడం వల్ల పిల్లలు కృత్రిమ పాశ్చాత్య బొమ్మలతో కాకుండా అమాయకమైన ఈ బొమ్మలతో ఎక్కువ ఆనందం పొందుతారు. ‘పర్యావరణ స్పృహ పెరిగింది కాబట్టి తాటాకు బుట్టలను, బాక్సులను, విసనకర్రలను చాలామంది కొంటున్నారు. మహిళలు ఈ కళను నేర్చుకుంటే అతి తక్కువ పెట్టుబడితో మంచి ఉపాధి పొందవచ్చు’ అంటోంది మోహనవాణి. ఆమె ఇప్పుడు ముంబైలోని కొన్ని స్కూళ్లకు వెళ్లి ఈ విద్య నేర్పుతోంది. మిగిలిన రాష్ట్రాలలో కూడా చాలా స్కూళ్లు ఆమెను ఆహ్వానిస్తున్నాయి. టీచర్లు ఈ క్రాఫ్ట్ నేర్చుకుంటే పిల్లలకు నేర్పించవచ్చని టీచర్లకు తాటాకు కళ నేర్పుతోంది మోహనవాణి. ‘తాటాకు బొమ్మలు చేయడం పెద్ద స్ట్రెస్‌బస్టర్. మీ ఒత్తిడి దూరం చేసుకోవడానికైనా తాటాకు అందుకుని బొమ్మలు చేయండి’ అంటోంది మోహనవాణి. -
ఈ రెస్టారెంట్లో నూనె లేకుండానే ఘుమఘుమలాడే వంటలు..
పొయ్యి వెలిగించకుండా వంట చేయడం సాధ్యమేనా? కర్రీస్‌లో కాస్త నూనె తక్కువైతేనే టేస్ట్ సరిగా లేదని చిర్రుబుర్రులాడుతుంటాం. ఈమధ్య ఇంటా,బయట రెస్టారెంట్లలోనూ లీటర్ల కొద్దీ నూనెను వాడేస్తున్నారు. మరిగించిన నూనెనే మళ్లీ మళ్లీ ఉపయోగిస్తుంటారు. అలాంటిది నూనె లేకుండా, ఉడికించకుండానే వంటలు టేస్టీగా వండేయొచ్చని మీకు తెలుసా? ఇలా ఏదో అర, ఒకటో కాదు.. నూనె లేకుండా, పొయ్యి వెలగించకుండా 2 వేలకు పైగా వంటలు వండటమే కాకుండా, తన రెస్టారెంట్లోనూ నో ఆయల్-నో బాయల్ కాన్సెప్ట్‌తో రుచికరమైన వంటలను పరిచయం చేస్తున్నారు. ప్రస్తుతం ఏ వంట చేయాలన్నా నూనె తప్పనిసరిగా ఉండాల్సిందే. అప్పుడే వంటలు కూడా రుచికరంగా ఉంటాయి. కానీ కోయంబత్తూరుకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి మాత్రం నూనె లేకుండా, పొయ్యి వెలగకుండా అద్భుతంగా వంట వండేయొచ్చని నిరూపించాడు. చిన్నప్పటి నుంచే శివకుమార్‌కు వంటలు చేయడం అంటే మహాపిచ్చి. ఎప్పుడూ ఏవేవో వెరైటీ వంటలు వండి అందరికీ రుచి చూపించేవాడు. ఈయనకు ఆధ్యాత్మికత ఎక్కువ. అందుకే చిన్నప్పటినుంచి శాఖాహారం మాత్రమే తినేవాడు. అదే సమయంలో నూనె లేకుండా సహజసిద్ద పద్ధతుల్లో వంట చేయడం ఎలాగో ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని సుమారు రెండువేల కొత్త వంటలను కనిపెట్టి సొంతంగా కోయంబత్తూర్‌లో ఓ రెస్టారెంట్‌ను కూడా ఓపెన్ చేశాడు. ఆహారమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ ఇప్పుడు మనం ఏది తినాలన్నా కల్తీనే. ముఖ్యంగా రెస్టారెంట్స్‌లో అయితే ఆర్టిఫిషిల్ ఫుడ్ కలర్స్ కలిపి, అవసరం లేని మసాలాలను దట్టించేసి వంటలు వండేస్తున్నారు. ఇక వాళ్లు వాడే ఆయిల్ క్వాలిటీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆధునిక ప్రపంచంలో అనేక అనారోగ్య సమస్యలకు ఆహారం ప్రధాన కారణం. ఊబకాయం, గుండెజబ్బులు, అలర్జీలు మొదలైన చాలా రకాల జబ్బులు ఫుడ్ వల్లే వస్తాయి. అందుకే ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన ఫుడ్ తినాలనే ఉద్దేశంతో ఈ నేచురల్ ఫుడ్ పద్ధతిని తీసుకొచ్చా” అంటున్నాడు పడయాళ్ శివ. పోపు పెట్టకుండా సాంబార్‌నే మనం ఊహించుకోలేం.. అలాంటిది నూనె లేకుండా,పొయ్యి వెలిగించకుండా వంటలు ఎలా చేయడం అనే కదా మీ సందేహం.. ఈ రెస్టారెంట్లో కొబ్బరి పాలు, టొమాటాలు, జీడిపప్పు, తెల్లమిరియాలను మిక్సీపడితే చాలు రుచికరమైన సాంబార్ రెడీ అవుతుంది. బియ్యానికి బదులు అటుకుల్నే నానబెట్టి వాటికి కొబ్బరితురుమునీ, జీలకర్రనీ చేర్చి రుచికరంగా మన ముందు ఉంచుతారు. చింతపండు, పచ్చి పసుపు పచ్చళ్లు,12 గంటలు నానబెట్టిన కొబ్బరి పాలు లాంటి వెరైటీ ఐటెమ్స్ ఇక్కడ దొరుకుతాయి. రుచికి ఏమాతం తీసిపోకుండా ఘుమఘుమలాడే వంటలను వండేస్తున్నారు. కోయంబత్తూరులో ఈ రెస్టారెంట్‌ని ఏర్పాటు చేసి మూడేళ్లుగా విజయవంతంగా నడుపుతున్నాడు. ఇలా ఏదో ఒక రోజు, ఒక పూట కాదు, మూడు పూటలా నో ఆయిల్-నో బాయిల్ పేరుతో చక్కటి సహజసిద్దమైన భోజనాన్ని అందిస్తున్నారు. #PadayalEnergeticWellnessCare#NaturalHealthyBuffetLunch#Just@Rs249 Healthy Buffet Lunch Menu#Welcome u All#For Taste The Healthy Lunch Padayal Energetik Wellness Care Coimbatore singanallur For Prebooking Contact :8754689434#CoimbatoreFoodGuideTheGroup pic.twitter.com/NS4mROFJp7 — Padayal Energetik Wellness Care (@PadayalC) January 24, 2021 The World's First South Indian cuisine No Oil No Boil Restaurant in Coimbatore presents Buffet Lunch Saturday Padayal Natural Restaurant Buffet Lunch is open 1PM and 3:00Pm Party Orders Undertaken. Door Delivary Available.. Padayal Energetik Wellness Care 8754689434 8637410022 pic.twitter.com/Qy7HRzNKsI — Padayal Energetik Wellness Care (@PadayalC) February 20, 2021 -
సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని కోయంబత్తూరు డీఐజీ ఆత్మహత్య
చెన్నై: తమిళనాడులో సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారు. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని కోయంబత్తూరుకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫోలీస్ (డీఐజీ) విజయ్ కుమార్ ప్రాణాలు విడిచారు. కోయంబత్తూరులోని డీఐజీ అధికారిక నివాసంలో శుక్రవారం ఈ సంఘటన వెలుగు చూసింది. తీవ్ర మానసిక ఒత్తిడితోనే విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే ఆయన మృతికి గల కారణలపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా 45 ఏళ్ల విజయ్ కుమార్ రేస్ కోర్స్ సమీపంలోని రెడ్ ఫీల్డ్స్‌లోని క్వార్టర్స్‌లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. శుక్రవారం ఉదయం 6.15 గంటల ప్రాంతంలో డీఐజీ విజయకుమార్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గన్ పేలిన శబ్దం విన్న ఆయన ఇంటి భద్రతా సిబ్బంది.. వెంటనే సీనియర్ అధికారులను అప్రమత్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయితే విజయకుమార్ తీవ్ర డిప్రెషన్లో ఉన్నారని, నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన కౌన్సిలింగ్ కూడా తీసుకుంటున్నారని, అతన్ని కుటుంబాన్ని కొన్ని రోజుల క్రితమే చెన్నై నుంచి కోయంబత్తూరుకు తీసుకొచ్చినట్లు పేర్కొన్నాయి. చదవండి: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు కాగా విజయ్ కుమార్ 2009 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన పోలీస్ అధికారి. ఈ ఏడాది జనవరిలో కోయంబత్తూరు రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకముందు ముందు కాంచీపురం, కడలూరు, నాగపట్నం, తిరువారూర్లకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా(ఎస్పీ) అన్నానగర్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. డీఐజీ ఆత్మహత్యపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. హోంమంత్రిత్వ శాఖ అధిపతి అయిన సీఎం.. ట్విటర్లో స్పందిస్తూ ‘ పోలీస్ అధికారి విజయకుమార్ అకాల మరణ వార్త విని దిగ్భ్రాంతి గురయ్యాను. ఆయన ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగించింది. జిల్లా ఎస్పీతోపాటు హా వివిధ హోదాల్లో పనిచేసిన విజయ్ కుమార్ మరణం తమిళనాడు పోలీస్ శాఖకు తీరని నష్టం. అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’అని పేర్కొన్నారు. ఉన్నది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
కూలిన కాలేజీ గోడ.. నలుగురి దుర్మరణం
చెన్నై: తమిళనాడు కోయంబత్తూరులో మంగళవారం సాయంత్రం ఘోరం జరిగింది. పూదూర్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ కళాశాల గోడ కూలి నలుగురు మృతి చెందారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కునియముత్తూర్లోని సుకునపురం కృష్ణ కళాశాల వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో ప్రహారీ గోడ కూలి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన నలుగురు పనుల కోసం వచ్చిన వలస కూలీలుగా తెలుస్తోంది. -
మహిళా డ్రైవర్‌కు కారును గిఫ్ట్‌గా ఇచ్చిన కమల్ హాసన్
ప్రముఖ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ గొప్ప మనసు చాటుకున్నారు. వివాదంలో చిక్కుకొని ఉద్యోగం కోల్పోయిన మహిళా బస్డ్రై వర్కు మహిళకు కారును గిఫ్ట్‌గా ఇచ్చి ఆశ్యర్యపరిచారు. కొయంబత్తూర్‌కు చెందిన మహిళా డ్రైవర్ షర్మిలను కమల హాసన్ తన కార్యాలయానికి పిలిపించుకొని ‘కమల్ కల్చరల్ సెంటర్’ ద్వారా కారును బహుమతికి అందించారు. ఇప్పటివరకు ఉద్యోగిగా ఉన్న ఆమె.. ఇకపై ఎంతో మందికి ఉపాధి కల్పించే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘కొయంబత్తూర్ మహిళా బస్ డ్రైవర్ షర్మిల చుట్టూ ఇటీవల జరిగిన చర్చతో కలత చెందాను. తన వయసులోని ఎంతో మంది యువతకు ఆమె ఆదర్శం. షర్మిల కేవలం డ్రైవర్‌గా మాత్రమే ఉండిపోకూడదు. తనలాంటి అనేకమంది షర్మిలలను తీర్చిదిద్దాలని నేను ఆశిస్తున్నా. కమల్ కల్చరల్ సెంటర్ తరఫున ఆమెకు కారును అందిస్తున్నాం. దానిని ఆమెకు అద్దె సర్వీసుల కోసం వినియోగించుకోవచ్చు. అలాగే గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదిగి మరెందరికో ఉపాధి కల్పించాలని ఆశిస్తున్నా’ అని కమల్ పేర్కొన్నారు. (చదవండి: రెచ్చిపోయిన దొంగలు.. గన్‌తో బెదిరించి.. కారును అడ్డగించి.. వీడియో వైరల్..) కాగా, 24 ఏళ్ల షర్మిల కొయంబత్తూరులో తొలి మహిళా డ్రైవర్. గాంధీపురం నుంచి సోమనూర్ వరకు వ్రైవేటు సంస్థకు చెందిన బస్సును నడుపుతున్నారు. గతంలో బీజేపీ నేత వనతి శ్రీనివాసన్ ఈమె బస్సులో ప్రయాణించగా.. గత శుక్రవారం ఉదయం డీఎంకే ఎంపీ కనిమొళి.. షర్మిల నడిపిన ప్రైవేటు సంస్థకు చెందిన బస్సులో కోయంబత్తూరులోని గాంధీపురం నుంచి పీలమేడు వరకు ప్రయాణించారు. అయితే, షర్మిల పబ్లిసిటీ మోజులో పడిందని ఆ బస్సు యాజమాన్యం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోవైపు బస్ కండక్టర్ మాటలు నమ్మి యాజమాన్యం తనను అవమానపర్చిందని, అందుకే కలల కొలువుకు దూరమైనట్టు షర్మిల మాట్లాడిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. (చదవండి: కనిమొళి అభినందన.. ఆమె ఉద్యోగం పోయిందా?.. అసలేం జరిగిందంటే..) Coimbatore's first woman bus driver #Sharmila who quit her job after a controversy erupted over issuing of bus ticket to DMK MP Kanimozhi, has now been presented a new car by MNM leader #KamalHaasan to continue her journey as an entrepreneur. @IndianExpress pic.twitter.com/SyMS059KvS — Janardhan Koushik (@koushiktweets) June 26, 2023 -
జీవితంలో ఏదీ అంతా ఈజీ కాదు: హీరోయిన్
సంచలన నటీమణుల్లో ఆండ్రియా ఒకరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈమె రాసలీలలు, ప్రేమలో పడడం, మోసపోవడం వంటి సంఘటనలు ఇప్పటికే మీడియాలో కథలు కథలుగా వెలువడిన విషయం తెలిసిందే. ఇక వివాదాస్పద కథా పాత్రల్లో నటించడం ఆండ్రియా తరువాతే ఎవరైనా అని చెప్పాలి. తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయడంలోనే ఈ భామ ముందే ఉంటారు. వీటితో పాటు మంచి నటి, గాయని అనే పేరు తెచ్చుకున్నారు. (ఇది చదవండి: ఫాదర్స్ డే స్పెషల్: మంచి తండ్రులందరికీ శుభాకాంక్షలు) అంతేకాకుండా ఆండ్రియాలో గీత రచయిత కూడా వున్నారు. ఇకపోతే షూటింగ్‌లు, పాటల రికార్డింగ్‌లు అంటూ బిజీగా వున్న ఆండ్రియా మధ్యలో సంగీత కచేరీలు చేస్తున్నారు. ఆ మధ్య కౌలాలంపూరులో తన సంగీత విభావరి కార్యక్రమాన్ని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. ఆ ఉత్సాహంతో తాజాగా జులై 1న కోయంబత్తూరులో సంగీత కచేరి నిర్వహించబోతున్నారు. దీని గురించి ఆమె కోయంబత్తూరులో మీడియాతో మాట్లాడుతూ జీవితంలో ఏది ఈజీ కాదని, ప్రతి విషయంలోనూ ఒక కష్టం ఉంటుందని పేర్కొన్నారు. తాను గతంలో 15 ఏళ్ల పాటు మ్యూజిక్ క్లాసులకు వెళ్లినట్లు చెప్పారు. అదే తనను ఇప్పుడు పాడేలా చేస్తుందని చెప్పారు. తను కోయంబత్తూరుకు చాలాసార్లు వచ్చానని.. కళాశాలలో చాలా షోలు చేశానని అయితే ఇక్కడ పబ్లిక్ మధ్య కచేరీ చేయడం ఇదే మొదటిసారి అని చెప్పారు. అయితే దీనిని పెద్ద విషయంగా తాను భావించడం లేదని అన్నారు. కాగా రాజకీయ రంగప్రవేశం చేసే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు ప్రస్తుతం కచేరీ గురించి మాట్లాడదాం అంటూ ఎస్కేప్ అయ్యారు. (ఇది చదవండి: తమిళనాడులో ఆస్తులు ఉండేవి.. అన్నీ అమ్మేశా: సుధాకర్) -
పరీక్షలో టాప్ వచ్చారు.. తీగ లాగితే డొంక మొత్తం కదిలింది!
చెన్నై (కొరుక్కుపేట): కోయంబత్తూరు–మేటుపాళయం రోడ్డులో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అటవీ జన్యుశాస్త్ర ప్రచార సంస్థ పనిచేస్తోంది. ఇందులో వివిధ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. దేశం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి కోయంబత్తూరులో ఈ నెల 4న రాత పరీక్ష నిర్వహించారు. అనంతరం పరీక్ష రాసేందుకు వచ్చిన వారి ఫొటో, వేలిముద్రలను నమోదు చేశారు. ఈ సందర్భంలో రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎంపికైన వారికి సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఆ సమయంలో పరీక్షకు హాజరైన నలుగురు అభ్యర్థుల ఫొటో, వేలిముద్రలు వేర్వేరుగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో అధికారులకు అనుమానం వచ్చింది. అధికారులు నలుగురిని ఆంగ్లంలో రాయడం, మాట్లాడాలని కోరారు. వారు మాట్లాడలేకపోయారు. కానీ పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించారు. విచారణలో ఈ నలుగురు అభ్యర్థుల పేర్లతో వేరే వారు పరీక్ష రాసినట్లు గుర్తించారు. దీనిపై సాయిబాబా కాలనీ పోలీస్ స్టేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ డైరెక్టర్ కుని కణ్ణన్ మంగళవారం ఫిర్యాదు చేశారు. విచారణలో నిందితులు హర్యానా రాష్ట్రానికి చెందిన ఆర్.అమిత్ కుమార్ (30), ఎస్.అమిత్ కుమార్ (26), వి.అమిత్ (23), సులైమాన్ (25) అని తేలింది. దీంతో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. -
తమన్నా లేడీ రౌడీ గ్యాంగ్ హల్చల్.. సంచలనంగా మారిన వీడియో
కోయంబత్తూర్‌లో ఓ లేడీ గ్యాంగ్ హల్చల్ చేస్తోంది. ఓ లేడీ కొందరు యువకులను వెంటబెట్టుకుని హంగామా చేస్తోంది. కాగా, గ్యాంగ్‌లో ఉన్న వారంత మారణాయుధాలు చేతిలో పట్టుకుని వీడియోలో ఫోజులు ఇవ్వడం కలకలం సృష్టించింది. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు.. లేడీ రౌడీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల ప్రకారం.. కోయంబత్తూరులోని విరుదునగర్‌కు చెందిన వినోదిని అలియాస్ తమన్నా(23) స్థానికంగా హల్చల్ చేస్తోంది. ఈ లేడీ రౌడీ కొంత మంది యువకులతో గ్యాంగ్ ఏర్పాటు చేసింది. ఈ గ్యాంగ్ వారం క్రితం ఓ యువకుడిని హత్య చేసింది. అయితే, స్థానికంగా ఉన్న మరో గ్యాంగ్(గౌతమ్ గ్యాంగ్)తో నెల రోజులుగా రెండు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లేడీ గ్యాంగ్ మరో గ్యాంగ్‌లోని వ్యక్తిని హత్య చేశారు. అనంతరం, లేడీ రౌడీ మారణాయుధాలు చేతిలో పట్టుకుని సిగరెట్ తాగుతూ.. వీడియోలు ఫోజులు ఇస్తూ అవతలి గ్యాంగ్‌కు వార్నింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోపై పోలీసులు దృష్టి సారించారు. ప్రత్యర్థి ముఠాలను బెదిరించేందుకే ఈ వీడియోలను పోస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు కోయంబత్తూరు పోలీసు కమిషనర్ వి. బాలకృష్ణన్ తెలిపారు. ఈ క్రమంలోనే మరో గ్యాంగ్(గౌతమ్ బ్యాచ్)కు చెందిన 56 మందిని అరెస్ట్ చేసినట్టు స్పష్టం చేశారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
భార్య హఠాన్మరణం.. అమితమైన ప్రేమతో ఆ భర్త..
Viral News: ఆయనది అభిమానం కాదు. అమితమైన ప్రేమ. అంతకుమించిన పదంతో చెప్పాలంటే.. ఆరాధన. అందుకే ఆయన చేస్తున్న పని కూడా అంతే ప్రత్యేకంగా అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. చనిపోయిన భార్య తన కంటికి దూరం కాకూడదనే ఉద్దేశంతో.. ఆమెకు గుర్తుగా గుడిని కట్టించాడు ఓ పెద్దాయన. తమిళనాడు కోయంబత్తూరులోని ఓ కుగ్రామంలో 75 ఏళ్ల పళనిస్వామి వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. 45 ఏళ్లపాటు పళనిస్వామి-సరస్వతమ్మల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగింది. 2019 జనవరి 21న ఆయన సరస్వతి జబ్బు చేసి హఠాత్తుగా కన్నుమూసింది. కొంతకాలం ఆయన మానసికంగా కుంగిపోయాడు. అయితే.. ఆమె జ్ఞాపకాలను దూరం చేసుకోకూడదని బాగా ఆలోచించాడాయన. చివరికి భార్యకు గుడి కట్టించిన భర్తల కథలు తెలుసుకుని ఆ స్ఫూర్తితో.. తానూ ఆ పని చేయాలనుకున్నాడు. సరస్వతమ్మ కోసం ఓ గుడిని కట్టించాడు. భార్య మొదటి వర్థంతి నాడు విగ్రహ ప్రతిష్ట చేశాడు. ఆమె విగ్రహాన్ని నిత్యం శుభ్రం చేస్తూ.. రెండు పూటలా తన ఇంటి దీపానికి దీపారాధన చేస్తూ వస్తున్నాడు. ముంతాజ్ కోసం షాజహాన్ కట్టించిన తాజ్‌మహల్ ప్రేమ చిహ్నమంటూ చరిత్ర ద్వారా చెప్పుకోవడమే గానీ.. ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమను కళ్లారా చూసినప్పుడు కలిగే ఆనందమే వేరు. -
గెలిపించి ఉంటే కేంద్రమంత్రి అయ్యేదాన్ని!
సాక్షి, చెన్నై: తన లాంటి ప్రతిభావంతులను ప్రజలు గుర్తించడం లేదని తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. తనలాంటి వారి ప్రతిభ వృథా కాకూడదనే కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవులు అప్పగించిందన్నారు. సోమవారం తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన స్టాఫ్ డే (ఉద్యోగ దినోత్సవం) కార్యక్రమంలో తమిళిసై ప్రసంగించారు. తాను ఈ కార్యక్రమానికి వచ్చే సమయంలో ఓ పెద్దాయన తన వద్ద ఉన్న రెండు సెల్ఫోన్లను చూసి, రెండు ఫోన్లను ఎలా భరిస్తున్నారని ప్రశ్నించారని చెప్పారు. తాను రెండు రాష్ట్రాలనే పర్యవేక్షిస్తున్నప్పుడు.. ఈ రెండు ఫోన్లను భరించలేనా? అని సమాధానం ఇచ్చానని వివరించారు. ఇక ఆదివారం ఓ కార్యక్రమంలో తాను కిందపడిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘రోజుకు 48 గంటలు ఉన్నా కూడా నేను పనిచేయడానికి సిద్ధం. అయినా నేను కిందా మీదా పడి పనిచేస్తుంటే అది వార్తగా రావడం లేదు. అదే కింద పడితే మాత్రం అతిపెద్ద వార్తగా వచ్చేస్తోంది.’’అని తమిళిసై చమత్కరించారు. రాజకీయాల్లో ఆమె ప్రస్థానంపై మీడియా అడిగిన పలు ప్రశ్నలకూ ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. ‘‘తమిళ ప్రజలు నన్ను గుర్తించలేదు. గుర్తించి ఉంటే పార్లమెంట్ వెళ్లి, ఆ తర్వాత కేంద్రమంత్రిని కూడా అయ్యేదాన్ని. ప్రజలు ఓడించినా నాలాంటి వారి ప్రతిభ వృధా కాకూడదనే ఉద్దేశంతోనే కేంద్రం గవర్నర్ పదవులను కేటాయిస్తోంది..’’అని పేర్కొన్నారు. -
ఎన్ఐఏ మెరుపు దాడులు.. మూడు రాష్ట్రాల్లో 60 చోట్ల సోదాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ బుధవారం మెరుపు దాడులు చేపట్టింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని 60 ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. గత ఏడాది కోయంబత్తూరు, మంగళూరు నగరాల్లో జరిగిన రెండు వేరువేరు పేలుళ్ల ఘటనల నేపథ్యంలో మూడు రాష్ట్రాల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ సానుభూతిపరులుగా అనమానిస్తున్న వారిని అదుపులోకి తీసుకునేందుకు ఈ దాడులు చేపట్టింది. కాగా గతేడాది అక్టోబర్ 23న తమిళనాడులోని కోయంబత్తూరులో కొట్టె ఈశ్వరన్ ఆలయం ముందు కారులో సిలిండర్ పేలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అనుమానిత ఉగ్రవాది జమేషా మబీన్ మరణించాడు. దీనిపై అక్టోబర్ 27న ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించగా.. ఇప్పటి వరకు ఈ కేసులో 11 మంది నిందితులను అరెస్ట్ చేసింది. జమీజా ముబీన్ తన సహచరులతో కలిసి దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఐసిస్‌తో కలిసి ఆలయ సముదాయాన్ని దెబ్బతియాలనే ఉద్ధేశంతో ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. దీంతో అతనితో సంబంధాలున్న వారిని ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. అదే విధంగా 2022 నవంబర్ 19న కర్ణాటకలోని మంగళూరులో ఆటో రిక్షాలో ప్రెషర్ కుక్కర్ బాంబు పేలింది. ఈ పేలుడులో ఆటో డ్రైవర్‌తోపాటు ప్రెషర్ కుక్కర్ తీసుకెళ్తున్న నిందితుడు మహ్మద్ షరీక్ కూడా గాయపడ్డాడు. ఈ కేసుపై డిసెంబర్లో ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. పలు కేసుల్లో నిందితుడు షరీక్ రాష్టరాంష్ట్రంలోని కోస్తా ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేలా పెద్ద ఎత్తున దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే ఐఎస్ఐఎస్కు చెందిన అనుమానితుల కదలికలు ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్నట్లు గుర్తించిన ఎన్ఐఏ ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: IT Raids on BBC: బీబీసీపై ఐటీ సర్వే -
ఈషా యోగా సెంటర్ నుంచి అదృశ్యం.. బావిలో శుభశ్రీ మృతదేహం
సాక్షి, చెన్నై : కోయంబత్తూరు ఈషాయోగా కేంద్రంలో యోగా శిక్షణకు వెళ్లి అదృశ్యమైన శుభశ్రీ మరణించింది. ఓ బావిలో ఆమె మృతదేహం ఆదివారం మధ్యాహ్నం బయట పడింది. వివరాలు.. తిరుప్పూర్‌కు చెందిన పళణి కుమార్ భార్య శుభశ్రీ గత ఏడాది డిసెంబర్లో వారం రోజుల పాటుగా ఈషాయోగా కేంద్రంలో శిక్షణ నిమిత్తం వెళ్లారు. గత నెల 18వ తేదీన ఆమె అదృశ్యమయ్యారు. ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదుతో కోయంబత్తూరు పోలీసులు తీవ్రంగా గాలించారు. సీసీ కెమెరాలలో ఆమె ఈషా యోగా కేంద్రం నుంచి బయటకు ఓ రోడ్డు మార్గంలో వెళ్తుండటం వెలుగు చూసింది. దీంతో ఆ పరిసరాలలో ఆమె కోసం గాలిస్తూవచ్చారు. ఆదివారం మధ్యాహ్నం సెమ్మేడు గాంధీ కాలనీలోని ఓ పాడు పడ్డ బావిలో మహిళ మృత దేహం బయట పడింది. పరిశీలనలో ఆ మృతదేహం శుభశ్రీగా తేలింది. శిక్షణకు వెళ్లిన శుభశ్రీ, యోగా కేంద్రం నుంచి బయటకు వచ్చేయడం, ఆ తర్వాత అదృశ్యం కావడం, ప్రస్తుతం మృతదేహంగా బావిలో తేలడం మిస్టరీగా మారింది. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు ఆసుపత్రికి తరలించిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. -
వాషింగ్టన్ సుందర్ పోరాటం వృథా.. ఆంధ్ర సంచలన విజయం
Ranji Trophy 2022-23 - Tamil Nadu vs Andhra- కోయంబత్తూరు: అద్భుత పోరాట పటిమ కనబరిచిన ఆంధ్ర జట్టు ఈ సీజన్ రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. తమిళనాడుతో శుక్రవారం ముగిసిన మ్యాచ్‌లో ఆంధ్ర ఎనిమిది పరుగుల ఆధిక్యంతో గెలిచి ఆరు పాయింట్లు సంపాదించింది. ఆంధ్ర నిర్దేశించిన 203 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన తమిళనాడు రెండో ఇన్నింగ్స్‌లో 56.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. పేస్ బౌలర్ కేవీ శశికాంత్ (4/47), ఆఫ్ స్పిన్నర్ షోయబ్ మొహమ్మద్ ఖాన్ (6/69) ఆంధ్ర విజయంలో కీలకపాత్ర పోషించారు. భారత క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ (65; 5 ఫోర్లు) చివరిదాకా క్రీజులో ఉండటంతో తమిళనాడు విజయంపై ఆశలు పెంచుకుంది. అయితే సుందర్‌ను శశికాంత్ అవుట్ చేసి ఆంధ్రకు చిరస్మరణీయ విజయం అందించాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 162/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర మరో 88 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయి 250 పరుగులవద్ద ఆలౌటైంది. రికీ భుయ్ (76; 7 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలువగా... చివర్లో శశికాంత్ (19; 1 సిక్స్), లలిత్ మోహన్ (16; 3 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో ఆంధ్ర ప్రత్యర్థిముందు ఊరించే లక్ష్యాన్ని పెట్టింది. చదవండి: IPL 2023 Auction: ఆ ముగ్గురూ సూపర్... ఐపీఎల్ వేలం విశేషాలు ఒకరు 4, మరొకరు 2 పరుగులు.. రోహిత్‌తో పాటు మిగతా వాళ్లు సున్నా! మరీ చెత్తగా.. IPL 2023: ధోని జట్టులోకి గుంటూరు కుర్రాడు.. ఎవరీ షేక్ రషీద్? -
కోయంబత్తూరులో భారతి సిమెంట్ టెర్మినల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్ తయారీ సంస్థ భారతీ సిమెంట్.. తమిళనాడులోని కోయంబత్తూరులో 7.5 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో అత్యాధునిక బల్క్ సిమెంట్ టెర్మినల్‌ను ఏర్పాటు చేసింది. కడప ప్లాంటు నుంచి ఈ కేంద్రానికి బల్క్ సిమెంట్ సరఫరా అవుతుంది. ఇక్కడ ప్యాకింగ్ చేసి సిమెంట్ పంపిణీ చేస్తారు. వికా గ్రూప్ చైర్మన్, సీఈవో గీ సీడో, వికా ఇండియా సీఈవో అనూప్ కుమార్ సక్సేనా, మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్ రెడ్డి ఈ టెర్మినల్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తమిళనాడు, కేరళ మార్కెట్ల కోసం క్విక్సెమ్ పేరుతో తదుపరి తరం పర్యావరణ అనుకూల ప్రీమియం సిమెంట్‌ను విడుదల చేశారు. -
పెట్రో బాంబు దాడుల కలకలం.. బీజేపీ నేతల ఇళ్లకు భద్రత పెంపు!
సాక్షి, చెన్నై: తమిళనాడులో బీజేపీ నాయకుల ఇళ్లు, కార్యాలయాలకు పోలీసులు భద్రతను పెంచారు. చెన్నైలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం కమలాలయం వద్ద, పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. డీఎంకే ఎంపీ రాజ హిందువులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. అదే సమయంలో రాజను బెదిరించే విధంగా బీజేపీ, హిందూ సంఘాలు మాటల తూటాలను పేల్చడంతో పోలీసులు కేసుల నమోదుపై దృష్టి పెట్టారు. బీజేపీ నేతలపై పలు చోట్ల కేసులు నమోదవుతున్నాయి. అరెస్టులు కూడా చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గురువారం రాత్రి కోయంబత్తూరు జిల్లాలో పలు చోట్ల బీజేపీ నేతలను టార్గెట్ చేసి గుర్తుతెలియని వ్యక్తులు పెట్రో బాంబులతో దాడి చేయడం కలకలం రేపింది. బీజేపీ నేతలు రత్నకుమార్, కుమార్, శివ, పొన్రాజ్ తదితరలను, వారి ఇళ్లు, కార్యాలయాలు, దుకాణాలపై ఈ దాడులు జరగడంతో కోయంబత్తూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దాడులు చేసిన వారిని అరెస్టు చేయాలని కోరుతూ బీజేపీ వర్గాలు ఆందోళనలు చేపట్టాయి. భద్రత పెంపు.. పెట్రో బాంబు దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేయడం కోసం కోయంబత్తూరులో ఐదు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. శుక్రవారం ఉదయం ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యాలయాల వద్ద భద్రతను పోలీసుల పెంచారు. ముఖ్య నాయకులకు భద్రత కల్పించారు. చెన్నైలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం కమలాలయం వద్ద సైతం భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆ పరిసర మార్గాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. Coimbatore, TN | Tension prevails in the city after bottle bomb hurled at BJP office; Rapid Action Force takes out flag march from Karumbukadai to Kuniamuthur (23.09) https://t.co/kJUaY3TKM0 pic.twitter.com/PuFksX4f8z — ANI (@ANI) September 23, 2022 -
పృథ్వీ షా సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా వెస్ట్‌జోన్
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా దులీప్ ట్రోఫీలో అద్భుత శతకంతో మెరిశాడు. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో ఈ వెస్ట్‌జోన్ ఓపెనర్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఫలితంగా వెస్ట్‌జోన్ భారీ ఆధిక్యం దిశగా పరిగెడుతుంది. ఈ మధ్యన పృథ్వీ షా స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. టీమిండియాలో ఎక్కువగా ఓపెనింగ్‌లో వచ్చిన పృథ్వీ షా.. ఓపెనింగ్ స్థానానికి పోటీ పెరిగిపోవడం.. అతను ఫామ్ కోల్పోవడంతో క్రమక్రమంగా జట్టుకు దూరమయ్యాడు. మూడోరోజు తొలి సెషన్లో వెస్ట్‌జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. పృథ్వీ షా(131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 136 నాటౌట్), ఆర్మాన్ జాఫర్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం వెస్ట్‌జోన్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలపుకొని 314 పరుగుల లీడ్‌లో ఉంది. అంతకముందు సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 128 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కర్ణ్‌శర్మ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఉనాద్కట్,తనుష్ కొటెన్‌లు చెరో 3 వికెట్లు తీయగా.. షెత్ 2, చింతన్ గజా, షామ్స్ ములాని చెరొక వికెట్ తీశారు. ఇక వెస్ట్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 257 పరుగులకు ఆలౌటైంది. చదవండి: 'మొన్ననే కదా ఫైనల్ చేరారు.. అంత మాట ఎలా అంటావు!' 'డైరెక్టర్ గారూ.. ఫెదరర్‌కు, బాలీవుడ్ నటుడికి తేడా తెలియదా?' -
ఉచితంగా చదువుకోండి.. ఉన్నతంగా ఎదగండి
నిరుపేద కుటుంబాల్లో తల్లిదండ్రులిద్దరూ పనిచేస్తే గానీ పూటగడవని పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా విద్యనందిస్తున్నప్పటికీ, బడిలో నేర్చున్న పాఠాలను ఇంట్లో వల్లెవేయించడానికి గానీ, హోంవర్క్ చేయించడానికి కానీ ఎవరూ ఉండరు. పిల్లలకు సొంతంగా హోమ్‌వర్క్ ఎలా చేయాలో తెలియదు. దీంతో వాళ్లు మరుసటి రోజు టీచర్ హోంవర్క్ అడుగుతుందని స్కూలుకు వెళ్లడానికి భయపడి మధ్యలోనే స్కూలు మానేసి అరకొర చదువులతో భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని ఆదుకోవడానికి 70 ఏళ్ల శివస్వామి, మహాలక్ష్మి దంపతులు ఏర్పాటు చేసిన ఉచిత సెంటరే ‘కల్వితునై’. ‘ఉచితంగా నేర్చుకుని ఉన్నతంగా ఎదగండి’ అని చెబుతున్నారు ఈ దంపతులు. కోయంబత్తూరుకు చెందిన మహాలక్ష్మి దంపతులు 2010 లో రిటైర్ అయ్యారు. ‘సమాజం ఇచ్చినదాన్ని తిరిగి ఇవ్వాలి’ అన్న ఆలోచనా దృక్పథం కలిగిన వారు కావడంతో.. నిరుపేద పిల్లలు పడుతోన్న ఇబ్బందులను గమనించి వారికోసం ఏకంగా నలభై లక్షల రూపాయలను పెట్టి 2014లో ‘కల్వితునై’ పేరిట విద్యాసంస్థను ఏర్పాటుచేశారు. నాలుగో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఒక బ్యాచ్‌గా, తొమ్మిది నుంచి 12వ తరగతి వరకు రెండోబ్యాచ్గా పిల్లలకు ట్యూషన్ చెబుతున్నారు. అలా ఈ సెంటర్లో నిత్యం 130 మంది పిల్లలు చదువుకుంటున్నారు. వీరికోసం టీచర్లకు జీతాలు చెల్లించి చదువు చెప్పిస్తున్నారు ఈ దంపతులు. ఇప్పటిదాకా వెయ్యిమందికిపైగా విద్యార్థులు ఇక్కడ చదువుకోగా, 350 మందికిపైగా మంచి ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. చదువుతోపాటు... పాఠాలేగాక కథలు చెప్పించడం, మొక్కలు నాటించడం, కల్చరల్ ఈవెంట్స్, జాతీయ పర్వదినాలను నిర్వహించడం ద్వారా పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇంకా సమ్మర్ క్యాంప్‌లు, టూర్లకు తీసుకెళ్లడం, సేంద్రియ వ్యవసాయం గురించి వివరించడం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలికలకు మెనుస్ట్రేషన్ సెషన్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ తయారీలో శిక్షణ ఇప్పిస్తున్నారు. విద్యార్థులు ఎటువంటి పరిస్థితుల్లోనూ జారిపోకుండా ఉండేందుకు వొకేషనల్ ట్రైనింగ్ కోర్సులు, సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణను మొదలు పెట్టారు. బేసిక్ కంప్యూటర్ కోర్సులు, బయట యాభైవేల రూపాయలు ఖరీదు చేసే సీఏ ఫౌండేషన్ కోర్సును 4,500కే అందించి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్‌ను బంగారు మయం చేస్తున్నారు. ఇవన్నీ చేయడానికి నెలకు లక్షరూపాయలు ఖర్చు అవుతుంది. సీఎస్ఆర్, బాష్, విప్రో, ఇంకా ఇతరులు ఇచ్చే విరాళాల ద్వారా సెంటర్‌ను నడిపిస్తున్నారు. వీరి వద్ద చదువుకున్న వాళ్లు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఇదంతా చూస్తుంటే ఇలాంటి వారు మన రాష్ట్రాల్లోనూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. చదువునుంచి దృష్టి మరల్చకుండా... నిరుపేదలకు కనీస అవసరాలు తీరాలన్నా కష్టమే. అందుకే వాళ్లు డబ్బు సంపాదన మీదే దృష్టిపెడతారు. పిల్లల చదువుల గురించి శ్రద్ధ తీసుకునే అవగాహన, సమయం వారికి ఉండదు. దానివల్ల వారి భవిష్యత్ తరాలు కూడా పేదరికంలోనే మగ్గిపోతున్నారు. ఇటువంటివారికి ఉచితంగా ట్యూషన్ చెప్పడం ద్వారా వారి భవిష్యత్ మారుతుందని ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. దీనిద్వారా కొంతమంది టీచర్లకు ఉపాధి దొరకడంతోపాటు విద్యార్థులకు చక్కని బోధన అందుతుంది. ఎప్పుడూ చదువే కాకుండా వివిధ రకాల విజ్ఞాన, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, సంక్రాంతి సమయంలో కొత్తబట్టలు ఇవ్వడం, రోజూ ఆరోగ్యకరమైన స్నాక్స్ అందిస్తూ చదువునుంచి పిల్లల దృష్టి మరలకుండా చూస్తున్నాం’’ – శివస్వామి, మహాలక్ష్మి -
స్విగ్గీలో ఐస్‌క్రీం, చిప్స్ ఆర్డర్ చేస్తే.. డెలీవరీ చూసి షాక్ అయిన వ్యక్తి
చెన్నై: ఒకప్పుడు ఏదైనా కావాలి అంటే స్వయంగా వెళ్లి కొని తెచ్చుకునే వాళ్లం. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందింది. ఫుడ్ నుంచి గ్రాసరీస్, మెడిసిన్, ఎలక్ట్రానిక్స్, హోం నీడ్స్ ఇలా ప్రతిదీ.. ఫోన్లో ఆర్డర్ చేస్తే క్షణాల్లో మన ముందు వాలుతోంది. అయితే అప్పుడు ఆర్డర్లు ఆలస్యం అవ్వడం, క్యాన్సిల్ అవ్వడం లేదా మనం చెప్పినా వస్తువుకు బదులు వేరే వస్తువు డెలివరీ అవ్వడం వంటి పొరపాట్లు సాధారణంగా జరుగుతుంటాయి. తాజాగా ఓ వ్యక్తికి కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఒక ప్రైవేట్ ఇంగ్లీష్ న్యూస్ మీడియాలో ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం(ఆగస్టు 27) రాత్రి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ నుంచి తన పిల్లల కోసం ఐస్ క్రీమ్, చిప్స్ ఆర్డర్ చేశాడు. అయితే తీరా ఆర్డర్ డెలివరీ అయ్యాకి.. పార్శిల్ ఓపెన్ చేసి అందులో ఉన్న వస్తువును చూసి ఖంగుతున్నాడు. ఐస్‌క్రీం, చిప్స్‌కు బదులు కండోమ్‌లు ఉన్నాయి. ఇది చూసి షాక్ తిన్న అతను దానిని ఫోటో తీసి తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. చదవండి: 14 సింహాలు వెంటపడినా జడవలేదు.. ఒంటరైనా బెదరలేదు! ఇక జరిగిన పొరపాటుపై స్విగ్గీ సంస్థ స్పందించింది. తప్పుడు వస్తువు డెలివరీ చేసినందుకు సదరు వ్యక్తికి క్షమాపణలు చెప్పి, డబ్బును తిరిగి ఇచ్చింది. అయితే ఓ ఫుడ్ డెలివరీ కంపెనీలో ఇలాంటి వస్తువులు డెలివరీ చేయడం ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ డెలివరీ కంపెనీ నుంచి కండోమ్ ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. -
యజమాని సాయం.. కోచ్ అండ.. ఇళ్లలో పనిచేసే ఆ ‘తల్లి’.. పవర్ లిఫ్టింగ్‌లో ‘పసిడి’!
ప్రతిభ ఉండి, వెలుగులోకి రానివారిని మట్టిలో మాణిక్యాలుగా పోలుస్తుంటారు పెద్దలు. అలాంటి పోలికకు సరిగ్గా సరిపోయే వ్యక్తే మాసిలామణి. పొట్టకూటికోసం పనిమనిషిగా చేస్తూ కూడా తనలోని ప్రతిభకు పదునుపెట్టి పవర్ లిఫ్టింగ్‌లో ఏకంగా బంగారు పతకం గెలుచుకుని ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. కోయంబత్తూరులోని కునియముత్తూరు దగ్గరల్లో ఉన్న రామానుజం నగర్లో నలభై ఏళ్ల మాసిలామణికి దర్శిని, ధరణి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్దకూతురుకు పెళ్లి అయి అత్తారింట్లో ఉంటోంది. మాసిలామణి భర్త రమేశ్ కూలిపనులు చేస్తుంటే మాసిలామణి రెండు ఇళ్లలో పనిచేస్తూ ఇద్దరూ కలిసి కుటుంబాన్ని లాక్కొస్తున్నారు. దయార్ద్ర హృదయం.. చేసిన సాయం ఇళ్లల్లో పనిచేస్తున్నప్పటికీ ఆమె పనితీరు, నిజాయితీ కారణంగా ఆమె పని చేసే ఇంటి యజమానులు మాసిలామణిని సొంతమనిషిలా చూసుకునేవారు. ఆమె కుటుంబం ఉండడానికి అద్దె లేకుండా ఇంటిని కూడా ఇచ్చారు ఒక ఇంటి యజమాని. ఎంతో దయార్ద్ర హృదయం కలిగిన ఈ యజమాని ఓ రోజు... ‘‘మాసిలామణి నువ్వు కాస్త లావుగా ఉన్నావు. వ్యాయామం చేస్తే అధిక బరువు తగ్గడమేగాక, మరింత ఆరోగ్యంగా తయారవుతావు. నాకు తెలిసిన ఒక జిమ్ ఉంది, అక్కడికి వెళ్లు’’ అని చెప్పారు. అలా పవర్‌లిఫ్టింగ్ నేర్చుకుని.. ఆ యజమానికి తెలిసిన జిమ్ ఓనర్ సి. శివకుమార్... పవర్ లిఫ్టింగ్‌లో ఏసియన్ గోల్డ్‌మెడల్ సాధించిన వ్యక్తి. జిమ్ నిర్వహించడంతోపాటు, ట్రైనర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఇంటి యజమాని సలహాతో మాసిలామణి శివకుమార్ జిమ్‌లో చేరింది. కొద్దిరోజుల్లోనే జిమ్‌లో చేసే వ్యాయామం నచ్చడంతో తన కూతురు ధరణిని కూడా జిమ్‌లో చేర్పించింది. తల్లీకూతుళ్లిద్దరూ ఎంతో ఉత్సాహంగా జిమ్‌లో ఉన్న బరువైన పరికరాలను సునాయాసంగా ఎత్తుతూ వ్యాయామం చేసేవారు. దీంతో మాసిలామణి బరువు తగ్గడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. వర్కవుట్స్‌లో మొదటి నుంచి వీరిద్దరి పట్టుదలను, దీక్షని గమనిస్తోన్న శివకుమార్ ‘‘మీకు పవర్‌లిఫ్టింగ్ ఎలా చేయాలో నేను ఉచితంగా నేర్పిస్తాను. మీరు చక్కగా నేర్చుకోండి చాలు’’ అని చెప్పారు. ఆ రోజు నుంచి ఇద్దరూ పవర్ లిఫ్టింగ్ సాధన చేయడం ప్రారంభించారు. కోచింగ్ ఫ్రీగా దొరికినప్పటికీ... కోచింగ్ ఉచితంగా అందుతున్నప్పటికీ బలమైన ఆహారం తీసుకునే స్తోమత వారికి లేదు. అయినా ఏ మాత్రం నిరాశపడలేదు. కఠోరదీక్షతో సాధన చేసేవారు. ఇలా చక్కగా శిక్షణ తీసుకున్న తల్లీ కూతుళ్లిద్దరూ గతనెలలో తిరుచ్చిలో జరిగిన ‘తమిళనాడు పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్’ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. మాసిలామణి 63 కేజీల విభాగంలో 77.5 కేజీల బరువుని అవలీలగా ఎత్తి స్వర్ణపతకం గెలుచుకుంది. 17 ఏళ్ల ధరణి 47 కేజీల విభాగంలో 72.5 కేజీల బరువును ఎత్తి కాంస్య పతకం దక్కించుకుంది. పేదరికం నుంచి పవర్ లిఫ్టింగ్‌లో తమ సత్తా చాటిన ఈ తల్లీకూతుళ్లు సెప్టెంబర్ 14 నుంచి 19 వరకు చెన్నైలో జరగనున్న తమిళనాడు పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ పోటీలలో పతకాలు గెలుచుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు. నవ్విన వాళ్లే అభినందిస్తున్నారు జిమ్‌లో చేరిన తొలినాళ్లలో అంతా మమ్మల్ని చూసి నవ్వారు. కొంతమంది కుటుంబ సభ్యులు, స్నేహితులు పనులు చేసేవాళ్లకు జిమ్‌లు అవసరమా? అని అవహేళనగా మాట్లాడారు. పవర్ లిఫ్టింగ్ గురించి తెలిసినప్పుడు ఈ వయసులో ఇలాంటి పనులు అవసరమా? ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? అని ఈసడించారు. ఇప్పుడు మేమేంటో నిరూపించాం. దీంతో అప్పుడు నవ్విన వారంతా అభినందిస్తున్నారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధిస్తాం. – మాసిలామణి చదవండి: Bengaluru: స్నేహితుడి అనారోగ్యం.. చికిత్స రిపోర్టు ఆలస్యం.. ఆ ఘటనే.. కల్యాణ్ ఆవిష్కరణకు బీజం Manasi Chaudhari: ‘పింక్ లీగల్’.. మహిళలకు న్యాయ సమాచారం.. ఏ డౌట్ వచ్చినా.. -
అలారంలోనే సాంకేతిక లోపం.. హడలిపోయిన ప్రయాణికులు
కొయంబత్తూర్: విమానంలో ఏదైనా సాంకేతిక లోపం ఉంటే ముందుగా అలారం మ్రోగడం సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అటువంటిది అలారంలోనే సాంకేతిక సమస్య తలెత్తి అది మ్రోగితే ఇక అంతే విమాన సిబ్బందిలో, ప్రయాణికుల్లో ఒకటే టెన్షన్ మొదలవుతుంది. విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యే వరకూ ఏం జరుగుతుందో అనే ఒకటే భయం ఉంటుంది. అలారంలో సాంకేతిక సమస్య తలెత్తి అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేయాల్సిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి 92 మంది ప్రయాణికులతో బయల్దేరిన గో ఫస్ట్ విమానాన్ని తమిళనాడులోని కొయంబత్తూర్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. కొయంబత్తూర్‌లో ఎయిర్పోర్ట్ అధికారులు పర్మిషన్ తీసుకుని ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానం ల్యాండ్ అయ్యే క్రమంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. అప్పటికే ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకుని ఉన్నారు. ఆ తర్వాత విమానాన్ని ఇంజనీర్లు తనిఖీ చేయగా ఎటువంటి సమస్య లేదని తేల్చారు. కాగా, అలారం ఎందుకు మోగింది అంటే అందులో ఏదో సాంకేతిక సమస్య రావడంతో అలా జరిగిందని ఇంజనీర్లు స్పష్టం చేశారు. విమానంలో ఎటువంటి ఇబ్బంది లేదని, అలారంలో ప్రాబ్లం వల్లే ల్యాండ్ చేయాల్సిన అవసరం వచ్చిందని ఎయిర్పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు. విమానంలో ఉండే ట్విన్ ఇంజన్స్ ఓవర్ హీట్‌కు గురైనప్పుడు అలారం మ్రోగడంతో అలర్ట్ అవుతారు విమాన సిబ్బంది. కానీ ఇక్కడ విమానంలో ఎటువంటి సమస్య లేకుండానే అలారం మ్రోగడం ఏంటా అనేది సదరు ఇంజనీర్లకే తెలియాలి. గతవారం గో ఫస్ట్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే పక్షి తాకడంతో విమానాన్ని తిరిగి అహ్మదాబాద్‌కు రప్పించిన సంగతి తెలిసిందే. -
చిచ్చర పిడుగు!...13 ఏళ్ల వయసులో 17 కంప్యూట్ భాషలు...
కొంతమంది పిల్లలు అత్యంత చురుకుగా అతి చిన్న వయసులోనేఅన్ని నేర్చుకుంటారు. జౌరా! అనిపించేలా పెద్దలే ఇబ్బంది పడి నేర్చుకున్న వాటిని సైతం అలవొకగా నేర్చుకుంటారు. అచ్చం అలానే ఇక్కడొక చిన్నారి అతి పిన్న వయసులోనే కంప్యూటర్ భాషలను నేర్చుకున్నాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 17 ప్రోగామింగ్ లాంగ్వేజ్‌లను సునాయాసంగా నేర్చకున్నాడు. ఇంతకీ ఆ చిన్నారి ఎవరంటే?... వివరాల్లోకెళ్తే....తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిప అర్నవ్ శివరామ్ 13 ఏళ్ల వయసులోనే 17 కంప్యూటర్ భాషలను నేర్చుకున్నాడు. అంతేకాదు ఆ చిన్నారి అతి పిన్నవయసులో కంప్యూటర్ భాషలను నేర్చుకున్న వారిలో ఒకడిగా నిలిచాడు. శివరామ్ 4 వతరగతి చదువుతున్నప్పుడే కంప్యూటర్ భాషలను నేర్చుకోవడం ప్రారంభించాడు. జావా, ఫైథాన్‌తో సహా మొత్తం 17 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను నేర్చుకున్నాడు. అంతేకాదు భారత్‌లో తక్కువ పెట్టుబడితో ఆటో పైలెట్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని రూపొందించాలని యోచిస్తున్నట్లు శివరామ్ తెలిపాడు. ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు ఆ చిన్నారికి మంచి భవిష్యత్తు ఉందంటూ ప్రశంసిస్తున్నారు. Tamil Nadu | Coimbatore's Arnav Sivram becomes one of the youngest children to have learnt 17 computer languages at the age of 13 I started learning computers when I was in 4th grade. I have learnt 17 programming languages including Java & Python, he said pic.twitter.com/FTehgFHrBt — ANI (@ANI) July 2, 2022 -
గున్న ఏనుగు చుట్టూ బాడీగార్డులు.. ఓ లుక్కేయండి
వైరల్: బాడీగార్డులు అంటే.. పెద్ద పెద్ద కండలు వేసుకుని.. అరడుగుల పైన ఉండి టైట్ టీ షర్టులు, హాఫ్షర్టులు వేసుకునే ఉండాలా?. సెక్యూరిటీ అంటే తుపాకులతో, కర్రలతో కాపలాగా ఉండాలా??. ఒక చిన్ని గున్న ఏనుగు.. జెడ్ ఫ్లస్ ఫ్లస్ ఫ్లస్ రేంజ్ భద్రత నడుమ వెళ్తుండడం ఎప్పుడైనా చూశారా?. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద అప్లోడ్ చేసిన సరదా వీడియో ఇప్పుడు అలాగే అనిపిస్తోంది. కోయంబత్తూర్ సత్యమంగళం అడవుల్లో అప్పుడే పుట్టిన ఓ ఏనుగు గున్నకు ఇలా ఏనుగులు ఎస్కార్టుల్లాగా వెళ్లాయి. రెప్పార్పకుండా కింది వీడియోను చూసేయండి మరి!. No body on earth can provide better security than an elephant herd to the cute new born baby. It’s Z+++. Said to be from Sathyamangalam Coimbatore road. pic.twitter.com/iLuhIsHNXp — Susanta Nanda IFS (@susantananda3) June 22, 2022 చదవండి: తిండిబోతు ఏనుగులు.. వదిలేస్తే రోజులో 18 గంటలు తింటూనే.. -
పట్టాలెక్కిన తొలి ప్రైవేటు రైలు
-
'వలిమై' థియేటర్‌పై పెట్రోల్ బాంబ్ దాడి
కోయంబత్తూరు (తమిళనాడు): కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా, టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్‌గా నటించిన తాజా చిత్రం వలిమై. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురువారం(ఫిబ్రవరి 24న) థియేటర్లలో రిలీజైంది. అజిత్ సినిమా ఫస్ట్ డే చూసేందుకు థియేటర్‌కు తరలివచ్చిన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటుండగా ఈ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. కోయంబత్తూరులోని గంగవల్లి మల్టీప్లెక్స్ థియేటర్ ముందు పెట్రోల్ బాంబ్ దాడి జరిగింది. బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వలిమై సినిమా నడుస్తున్న థియేటర్ ఎదుట బాంబుతో దాడి చేశారు. అక్కడే ఉన్న అభిమానులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు బైక్‌పై పరారయ్యారు. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలా ఉంటే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజైన వలిమైకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అజిత్, కార్తికేయల నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. -
Young Farmers: చింత, జామ, సపోట...15 ఎకరాల ‘ఫుడ్ ఫారెస్ట్’.. వీళ్లంతా సూపర్
Sankranthi 2022- Indian Young Farmers Forum: సంక్రాంతి అంటే...అచ్చంగా రైతు పండగ. ముద్దబంతిపూలు ముచ్చటగా అతడిని ముద్దాడే పండగ. ఈ రైతు పండగ సందర్భంగా వ్యవసాయాన్ని శ్వాస చేసుకుంటున్న ‘ఇండియన్ యంగ్ ఫార్మర్స్ ఫోరమ్’ గురించి తెలుసుకుందాం... పట్నం (కోయంబత్తూర్, తమిళనాడు)లో ఉంటున్నమాటేగానీ ప్రదీప్‌కుమార్‌కు తమ కరూర్ గ్రామంలో బీడుపడిన అయిదు ఎకరాల పంటపొలమే గుర్తు వచ్చేది. ఇక అక్కడ ఉండలేక ఊరికి వచ్చేశాడు. ‘ఫుల్‌టైమ్ రైతు’గా మారాడు. విజయవంతమైన రైతుగా తనను తాను నిరూపించుకున్నాడు. స్థానిక సంప్రదాయ జాతులను కాపాడుకోవడానికి ‘కమ్యూనిటీ సీడ్ బ్యాంక్’ కూడా ఏర్పాటు చేశాడు. కేరళలోని పాలక్కడ్‌కు చెందిన కె.జి.సర్వణన్ అరటి, జామ సాగులో నవీనపద్ధతులను అనుసరించి ప్రభుత్వ దృష్టిని ఆకర్షించాడు. కేరళ ప్రభుత్వం అతడి వ్యవసాయ క్షేత్రాన్ని ఆదర్శవ్యవసాయ క్షేత్రంగా గుర్తించింది. బెంగళూరులో ఉద్యోగం చేసే కైలాస్నాథ్కు తన స్వగ్రామం నర్సిపురంలో పొలాలు ఉన్నాయి. బెంగళూరును వదిలేసి నర్సిపురంలో స్థిరపడిన కైలాస్ నిర్జీవంగా పడి ఉన్న పంట పొలాలకు మళ్లీ జీవ కళ తెప్పించాడు. చంద్రశేఖరన్ సర్వణన్కు పొలాచ్చిలో చింత, జామ, సపోట...మొదలైన చెట్లతో పదిహేను ఎకరాల ‘ఫుడ్ ఫారెస్ట్’ ఉంది. అక్కడ గడపడం ఆయకు ఎంతో ఇష్టమైన పని. ‘ప్రకృతే ఈ తోటను కాపాడుకుంటుంది’ అంటాడు మురిపెంగా. దేశదేశాల్లోని వ్యవసాయవిధానాల గురించి తెలుసుకోవడంపై ఆసక్తి చూపే చంద్రశేఖరన్‌కు యువత వ్యవసాయంలోకి రావాలన్నది కల. తన కలను నెరవేర్చుకోవడానికి ‘ఇండియన్ యంగ్ ఫార్మర్స్ ఫోరమ్’ను మొదలుపెట్టాడు. PC: Saravanan Chandrasekaran FB ‘ఫోరమ్’ ఏర్పాటు చేయగానే పోలోమంటూ యూత్ వచ్చి చేరిపోరు కదా! ముందు వారికి నమ్మకం కలిగించాలి. ‘యస్. మేము సాధించగలం’ అనే ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి. అందుకు కొందరు రోల్‌మోడల్స్ కావాలి. ఫోరమ్ ఏర్పాటు చేసిన వెంటనే చంద్రశేఖరన్ అలాంటి వారి కోసం వెదికాడు. ఆ ప్రయత్నం లో పైన ప్రస్తావించిన ప్రదీప్ కుమార్, కైలాస్నాథ్,కె.జి. సర్వణన్.... మొదలైనవారు ఎందరో కనిపించారు. వీరు ‘ఫోరమ్’లో చేరిన యువ రైతులకు ధైర్యం చెప్పారు. తమ వ్యవసాయ క్షేత్రాన్నే బడిగా మలిచి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన యువరైతులకు పాఠాలు చెప్పారు. ‘అచ్చం నేను కూడా మీలాగే భయపడ్డాను. దిగితేనే కదా లోతు తెలిసేది. ఇలా చేసి చూడండి’ అని సలహాలు ఇచ్చారు. నవీన సాంకేతిక జ్ఞానాన్ని పరిచయం చేశారు. ఎన్నో సందేహాలకు సమాధానం చెప్పారు. ఈ ఫోరమ్ ప్రభావంతో పట్నంలో ఏదో ఒక ఉద్యోగం చేస్తున్న యువకులు తమ పూర్వీకుల పంటపొలాలను వెదుక్కుంటూ వస్తున్నారు. సాగుకళలో సక్సెస్ అవుతున్నారు. సమాచారాన్ని పంచుకోవడం కోసం ఫేస్బుక్, వాట్సాప్‌లాంటి వేదికలను కూడా ఫోరమ్ ఉపయోగించుకుంటుంది. దేశవ్యాప్తంగా విస్తరించాలనేది ఫోరమ్ లక్ష్యాల్లో ఒకటి. చదవండి: Bhogi Festival 2022: భోగం వైభోగం.. భోగి పళ్లు ఎందుకు? -
మధుమేహులకు వర్షిత తీపికబురు!
డయాబెటిస్ రోగికి రోజూ వేలికి సూది గుచ్చుకుని మరీ పరీక్ష చేస్తేగానీ... రక్తంలో చక్కెర మోతాదు ఎంత ఉందో తెలియదు. మరి అలాంటి అవసరమే లేకుండా దేహంలో షుగర్ ఎంత ఉందో చటుక్కున తెలిసిపోతే ఎంత బాగుంటుంది? క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించాల్సి రావడం వల్ల నెలకు నాలుగైదు వేలు ఖర్చు తప్పదు. కానీ ఇలా రోజూ పరీక్షలు చేయిస్తున్నా సరే... నాలుగేళ్లు గడిచాక కూడా ఆ వ్యయం... నెల ఖర్చుకు మించకపోతే ఇంకెంత బాగుంటుంది? చక్కెర జబ్బు అంటూ పేరులో మాత్రమే తీపి ఉన్న డయాబెటిస్ అనే ఈ సమస్య రోజూ చేసుకోవాల్సిన చిన్నపాటి గాయాలతోనూ, వ్యయాలతోనూ చాలా బాధిస్తుంటుంది. కానీ ఇకపై అలాంటి బాధలేవీ లేకుండానే... మొబైల్సహాయంతోనే చక్కెర మోతాదును తెలుసుకునే యాప్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నం చేసింది దువ్వూరు వర్షిత. ఆ ప్రయత్నానికి సాంకేతికంగా సహాయపడ్డాడు విమల్ అనే ఇంజినీర్. కాలం కలిసొస్తే ఎలాంటి గుచ్చుకోవడాలు లేకుండా మన మొబైల్లోనే గ్లూకోమీటర్ రూపొంది... దాని సహాయంతో చక్కెర మోతాదులు చాలా తేలిగ్గా తెలుసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనీ, మహా అయితే మరో ఆర్నెల్లు లేదా ఏడాది లోపే ఇది అందుబాటులోకి రావచ్చంటున్నారు 20 ఏళ్ల వర్షిత, యువ ఇంజనీర్ విమల్ కుమార్ లు. వారిరువురూ ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పిన విషయాలు డయాబెటిస్తో బాధపడుతున్న ఎందరికో తీపికబురు కాబోతున్నాయి. అవేమిటో తెలుసుకుందాం. ‘‘నా పేరు దువ్వూరు వర్షిత. మాది నెల్లూరు. పుట్టినప్పట్నుంచే టైప్–1 డయాబెటిస్ తో బాధపడుతున్నాను. ఒక్కోసారి ఒకేరోజు నాలుగైదుసార్లు సూదితో వేలిని గుచ్చుకుని చక్కెరను పరీక్షించుకోవాల్సి వచ్చేది. ఒక్కసారి పరీక్ష కోసం పెట్టే ఖర్చు రూ. 40 వరకు అయ్యేది. అంటే ఒక్కరోజుకు రూ. 160 అన్నమాట. అలా చూస్తే నెలలో కేవలం వైద్యపరీక్ష కోసమే ఐదువేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువే ఖర్చు చేయాల్సి వచ్చేది. చిన్నప్పుడు పెద్దగా బాధ తెలియకపోయినా పెరుగుతున్న కొద్దీ వేదన మరింత ఎక్కువైంది. రోజులో ఇన్నిసార్లు పరీక్షల కోసం పెట్టే ఖర్చే కాకుండా... ఇక మందులు, ఇన్సులిన్ లాంటివాటికి ఎంతవుతుందో ఊహించవచ్చు. ఓ సగటు మధ్యతరగతి వారికి ఇది ఎంత పెద్ద మొత్తమో ఎవరికైనా తెలిసే విషయమే. ఎప్పటికైనా నాలాంటివాళ్లకోసం ఏదైనా చేస్తానంటూ పదేళ్ల వయసప్పుడే నాన్న దగ్గర ఓ సంకల్పం తీసుకున్నా. అందుకే ఐఐటీకి క్వాలిఫై అయి, అందులో చేరాక కూడా బయోటెక్నాలజీపై ఆసక్తితో బయటకి వచ్చి చెన్నైలో ఆ కోర్సులో చేరాను. కోయంబత్తూరులో 2019లో ఓ హ్యాకాథాన్ (కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌పై తమ తమ భావాలు, ఆలోచనలు పంచుకునే సదస్సు) నిర్వహించారు. అక్కడ పరిచయమయ్యారు తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన విమల్‌కుమార్ అనే యువ ఎలక్ట్రానిక్ ఇంజనీర్. ఈ హ్యాకాథాన్లో నా ఆలోచనలను వివరించా. తన ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సామర్థ్యంతో నా ఐడియాలను సాకారం చేయవచ్చని విమల్‌తో మాట్లాడినప్పుడు తెలిసింది. అంతే... మేమిద్దరమూ కలిసి మా ప్రాజెక్టు కోసం పనిచేయడం ప్రారంభించాం. ఇందుకోసం రూపొందించిన గ్లూకోమీటర్ కూడా చాలా సింపుల్‌గా పనిచేస్తుంది. నిజానికి ఇదో చిన్న పెన్ డ్రైవ్ తరహాలో ఉండే పరికరం. దీన్ని మన మొబైల్‌కి జతచేయాలి. అక్కడ మన వేలిని ఉంచితే చాలు... ఎలాంటి సూదిగాయాలూ, నొప్పి లేకుండానే మన రక్తంలోని చక్కెర మోతాదులు తెలిసిపోతాయి’’ అంటూ తమ ప్రాజెక్టు గురించి వివరించింది వర్షిత. ‘‘ఇది వన్ టైమ్ ఎక్స్పెన్స్ ఎక్విప్మెంట్. అంటే ఒక్కసారి కొంటే చాలు ఎప్పటికీ వాడుకునేలా రూపొందించిన డివైస్ ఇది. నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ (ఎన్ఐఆర్) అనే సాంకేతికత సహాయంతో ఎలాంటి గాటూ లేకుండానే మన దేహంలోని చక్కెరను అంచనా వేస్తుంది ‘ఈజీ లైఫ్’ అనే పేరున్న ఈ పరికరం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో చక్కెర విలువలను విశ్లేషించడం వల్ల నిమిషంలోపే షుగర్ రీడింగ్స్ మనకు తెలిసిపోతాయి. ఎక్కడైనా ఎప్పుడైనా నిస్సంకోచంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు’’ అంటూ వివరించారు విమల్. హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ సదస్సులో వర్షిత, విమల్‌ల ఈ ‘స్టార్ట్ అప్’ ప్రథమస్థానంలో నిలిచింది. అంతేకాదు ‘ఎమ్పవర్–2021’ పేరిట గతేడాది నిర్వహించిన ‘వుమన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాంపిటీషన్’లో రన్నరప్‌గా నిలిచింది. ఇదొక్కటే కాదు... ‘ఎన్ఐటీటీఈ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్’ హ్యాకథాన్‌తో పాటు మరికొన్ని సదస్సుల్లోనూ వీరి ఆవిష్కరణ అనేక బహుమతులను గెలుచుకుంది. గతంలో దుబాయిలో గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నిర్వహించిన ఓ సదస్సులో దాదాపు 42 దేశాల నుంచి యువతులు పాల్గొన్నారు. ‘టై ఉమన్ గ్లోబల్ పిచ్–2021 హైదరాబాద్ చాప్టర్’ ప్రాజెక్టును ప్రోత్సహించి... వర్షితను ఆ సదస్సు కు పంపినప్పుడు అక్కడ కూడా ఆమె ప్రాజెక్టుకు మంచి ప్రశంసలు దొరికాయి. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని గుర్తించిన హైదరాబాద్‌కు చెందిన గ్రేలాజిక్ టెక్నాలజీస్ అండ్ ఎడిఫై పాత్ సంస్థల డైరెక్టర్ వర్ల భానుప్రకాశ్‌రెడ్డి... ఈ ప్రాజెక్టుకు మెంటార్‌గా, ప్రమోటర్‌గా వర్షిత, విమల్లకు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ పరిశోధనలో పాలు పంచుకునేలా అనేక ఇతర సంస్థలను సైతం వీరి ప్రాజెక్టుతో అనుసంధానిస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో రూపొందించనున్న ఈ ప్రాజెక్టుకు ‘వివాలైఫ్’ అని పేరు పెట్టుకున్నారు. వీళ్ల పరిశోధనలకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వేదికగా నిలిచింది. -
హే! ఇది నా హెయిర్ స్టైయిల్... ఎంత క్యూట్‌గా ఉందో ఈ ఏనుగు!!
కోయంబత్తూర్: మాములుగా మనం ఎవరైన బయటకి వెళ్లేటప్పుడూ లేదా ఏదైన ఫంక్షన్‌కి వెళ్లాలనుకుంటే ఎంతలా రెడీ అవుతాం. అంతేందకు చాలామంది ట్రెండ్‌కి అనుగుణంగా రెడీ అవ్వడానకి ప్రయత్నిస్తారు కూడా. అయితే ఈ మధ్య ఆ ఫ్యాషన్ జాబితాలోకి జంతువులు కూడా చేరిపోతున్నాయి. అవి కూడా సరికొత్త ట్రెండ్‌ని సృష్టించడానికీ ప్రయత్నిస్తున్నాయి. పైగా మా కేం తక్కువ అన్నట్లుగా రెడీ అవ్వడానికీ తెగ ఇష్టపడుతున్నాయి. (చదవండి: ఆమె పాటకు ఫిదా.. స్టేజీ మీదే నోట్లతో అభిషేకం..!! అసలు విషయంలోకెళ్లితే...కోయంబత్తూరులోని తేక్కంపట్టి గ్రామాంలోని ఒక ఏనుగు ఎంత చక్కగా రెడీ అవుతుందో తెలుసా. నిజం ఆ ఏనుగు బాబ్ కట్ హెయిర్‌తో భలే ఆకర్షిస్తుంది. పైగా ఆ జుట్టును దువ్వించుకోవడానికి ఎలా కాళ్లను వంచి కిందికు ఉండి సహకరిస్తుందో చూడండి. అంతేకాదు చాల చక్కగా దువ్వించుకుని నుదటిపై తిలకంతో ఎంతో ఆకర్షణీయంగా రెడి అవుతుందో. ఏది ఏమైనా ఆ ఏనుగు బాబ్ కట్ హెయిర్‌తో మంచి స్టైయిలిష్‌గా ఠీవిగా ఉంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. దీంతో నెటిజనల్లు వావ్ చాలా క్యూట్‌గా ఉందంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: భక్తి పారవశ్యంతో ఈ పూజారి చేసిన పని... విగ్రహానికి వైద్యం..!!) -
మహిళా ఐఏఎఫ్‌పై లైంగిక దాడి
న్యూఢిల్లీ/చెన్నై: తనపై లైంగిక దాడి జరిగిందని ఐఏఎఫ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదంటూ ఓ మహిళా ఐఏఎఫ్ అధికారి కోయంబత్తూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని 26న మహిళా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన వివరాల ప్రకారం ఫ్లైట్ లెఫ్టినెంట్ అమితేశ్ హార్ముఖ్ తన వద్ద శిక్షణ తీసుకుంటున్న ఐఏఎఫ్ మహిళా అధికారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఐఏఎఫ్ అధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా, వారు ఆమె చెప్పిన విషయాన్ని పెడచెవిన పెట్టారు. సుప్రీంకోర్టు కొన్నేళ్ల క్రితం నిషేధం విధించిన ‘టూ ఫింగర్ టెస్ట్’నూ ఆమెపై నిర్వహించారు. అయితే, తాజాగా స్థానిక కోర్టు ఆదేశాల తర్వాత ఆ కేసు తమకు బదిలీ అయ్యిందని, కోర్ట్ మార్షల్ నిర్వహిస్తామని ఐఏఎఫ్ తెలిపింది. -
లైంగిక దాడి: ఫ్లైట్ లెఫ్టినెంట్ అరెస్ట్
చెన్నై: తనపై ఫ్లైట్ లెఫ్టినెంట్ లైంగిక దాడి చేశాడని ఓ మహిళా అధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సదరు ఫ్లైట్ లెఫ్టినెంట్ అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లోని ఎయిర్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళా అధికారిణిని ఇటీవల ట్రైనింగ్‌లో భాగంగా ఆటలు అడుతున్న క్రమంలో గాయపడ్డారు. దీంతో ఆమె గాయం తగ్గడం కోసం మందులు వేసుకొని తన గదిలో నిద్రపోయారు. అయితే ఆమె నిద్ర లేచి చూశాక.. తనపై లైంగిక దాడి జరిగినట్లు గుర్తించించారు. ఈ ఘటనపై ఆమె రెండు వారాల క్రింతం తన పై అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ, వారు ఆమె ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదు. దీంతో ఆమె స్థానిక గాంధీపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫ్లైట్ లెఫ్టినెంట్‌ను అరెస్ట్ చేశారు. ఫ్లైట్ లెఫ్టినెంట్ ఛత్తీస్ఘర్ రాష్టానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతన్ని జిల్లా కోర్టు న్యాయమూర్తి వద్ద హాజరుపరిచారు. ఈ కేసులో నిందితుడి తరఫు న్యాయవాది సాయుధ దళాల సిబ్బందిని అరస్టు చేయడం స్థానిక పోలీసుల పరిధిలోకి రాదని తెలిపారు. దానిపై స్పందించిన పోలీసుల అధికారులు అరెస్టు పరిధిపై చర్చ జరుపుతున్నామని తెలిపారు. -
వైరల్ వీడియో: మరో కమల్ హాసన్.. నటనకు నెటిజన్లు ఫిదా!
Reporting Spoof Video: కరోనా మనిషికి ఎన్నో విషయాలను నేర్పించింది. ఇంటి పట్టునే కూర్చో పెట్టింది. వాస్తవానికి పాఠశాలలు మూతబడ్డాయి. పిల్లలు తమ తరగతులను ఆన్లైన్లో వింటున్నారు. కానీ చాలా మంది పిల్లలు తమ ఇళ్లలో ఖైదు అయిపోయారు. వారి జీవితాలు మొబైల్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్లకు పరిమితం అయిపోయాయి. స్నేహితులను కలవలేరు.. ఆట స్థలాలకు వెళ్లలేని పరిస్థితి. ఇదంతా ఒక పార్శ్వం. దీనికి మరో పార్శ్వం తమ సమయాన్ని సద్వినియోగం చేకుకోవడం. చెన్నై: కోయంబత్తూరుకు చెందిన అసేవెన్ అనే బాలుడు న్యూస్ రిపోర్టేజ్ గురించి చేసిన స్పూఫ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుంతోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారం రోజుల్లోనే 5.79 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. వివరాల్లోకి వెళితే.. రీతూ చిన్నప్పటి నుంచే దేన్నైనా చూసి ఇట్టే చేసేవాడు. దాన్ని చూసి తండ్రికి ఆశ్యర్యపోయాడు. అయితే లాక్డౌన్ సమయంలో రీతూ న్యూస్ క్లిప్‌లను ఎక్కువగా చూసేవాడు. దీంతో కొడుకు వీడియోలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడానికి ఇది వరకే ప్రారంభించిన ఛానల్లో ఈ స్పూఫ్ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో రీతూ యాంకర్‌గా, ఫీల్డ్ రిపోర్టర్‌గా, రైతుగా, సామాన్య వ్యక్తిగా నటించి నెటిజనుల హృదయాలను గెలుచుకుంటున్నాడు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘రీతూ నీ నటన సూపర్ ఉంది. ఇంతలోనే అన్ని అవతారాలా!’’ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. మరో నెటిజన్ ‘‘ చోటా కమల్ హాసన్ నటన అదిరిపోయింది. బొమ్మ పడితే బ్లాక్ బస్టర్.’’ అంటూ కామెంట్ చేశాడు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
30 మంది కంటిచూపు మింగేసిన బ్లాక్‌ఫంగస్
కోయంబత్తూరు: బ్లాక్ ఫంగస్ కారణంగా అనారోగ్యంపాలైన 264 మంది పేషెంట్లలో 30 మందికి ఒక్క కన్ను చూపు పూర్తిగా పోయిందని స్థానిక ప్రభుత్వాస్పత్రి వర్గాలు తెలిపాయి. కరోనా సోకి తగ్గిన అనంతరం కొంతమందికి బ్లాక్ ఫంగస్‌గా పిలిచే మ్యూకోర్మైకోసిస్ సోకుతున్న సంగతి తెలిసిందే! ఇలా సోకి ఆస్పత్రిలో చేరినవారందరికీ ఎండోస్కోపీ చేశామని, 110మందికి చూపు తెప్పించే శస్త్ర చికిత్స చేశామని డా. నిర్మల చెప్పారు. అయితే 30 మంది పేషెంట్లలో ఈ ఫంగస్ తీవ్ర ప్రభావం చూపడంతో ఒక కన్ను చూపు పూర్తిగా పోయిందన్నారు. అయితే బ్లాక్ ఫంగస్ సోకిన తొలినాళ్లలో వచ్చినవారందరికీ నయమైందని చెప్పారు. -
గూడెం గ్రాడ్యుయేట్..ఆఫ్‌లైన్‌లో లైఫ్ ఇస్తోంది
సంధ్య తన గూడెంలో తొలి మహిళా గ్రాడ్యుయేట్. గతేడాదే డిగ్రీ అయింది. డిగ్రీ చదివిన అమ్మాయిలు చాలామంది ఈమధ్య పిల్లలకు ఉచితంగా ఆన్లైన్ క్లాస్ లు తీసుకుంటున్నారు. సంధ్య మాత్రం ఆఫ్‌లైన్ క్లాస్ లు తీసుకుంటోంది. గూడెంలో పిల్లలకు ఫోన్లు ఉంటాయా? నెట్ ఉంటుందా? అందుకే పిల్లల్ని గూడెంలోనే సేఫ్‌గా ఒక చోట చేర్చి, వారికి ఉచితంగా మేథ్స్, ఇంగ్లిష్ చెబుతోంది. మిగతా సబ్జెక్టులను.. పాఠాలుగా కాకుండా, జనరల్ నాలెడ్జిగా మార్చి చదువుపై ఆసక్తి, శ్రద్ధ కలిగిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ గురించిన భయమే తప్ప, చతికిల పడబోతున్న చదువుల థర్డ్ వేవ్ గురించి ఆలోచించే పరిస్థితి ఇప్పుడు ఎక్కడా లేదు. స్థోమత కలిగిన పిల్లలు ఎలాగో ఆన్లైన్లో కుస్తీలు పడుతున్నారు. కంప్యూటర్, కనీసం ఫోన్ లేని పిల్లలు బడీ లేక, ఇంట్లో పాఠాల సడీ లేక అలా ఉండిపోతున్నారు. పట్టణాలు, గ్రామాల్లోనే ఇలా ఉంటే.. ఇక ఏ టెలిఫోన్ సౌకర్యమూ, నెట్ కనెక్షన్ లేని ఆదివాసీ గూడేలలోని పిల్లల చదువుల మాటేమిటి? ఏ ‘వేవూ’ లేని రోజుల్లోనే పిల్లల్ని బడికి కూడా పంపలేని పేదరికం ఉంటుంది ఆ మారుమూల ప్రాంతాల్లో! మరి వారి పిల్లల భవిష్యత్తు మాటేమిటి?! వారి భవిష్యత్తుకు మాట ఇస్తోంది అన్నట్లుగానే.. సంధ్య అనే ఓ అమ్మాయి.. ఈ మధ్యే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఆ అమ్మాయి.. తన గూడెం పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని మరీ ‘ఆఫ్‌లైన్’ పాఠాలు బోధిస్తోంది. ఆన్‌లైన్‌కి దారే లేనప్పుడు ఆఫ్‌లైన్‌లోనే కదా పిల్లల చేరువకు వెళ్లాలి. సంధ్య కూడా వాళ్ల గూడెం అమ్మాయే. తమిళనాడు, కోయంబత్తూరుకు సమీపంలోని చిన్నంపతి గూడెంలోనే ఆమె పుట్టింది. అక్కడే డిగ్రీ వరకు చదివింది. గూడెంలో తొలి పట్టభద్రురాలు సంధ్య. ఏడాదిన్నరగా పిల్లలు చదువుల్లేకుండా ఉండిపోవడం ఆమె చూస్తూనే ఉంది. అందుకు కారణం కరోనానే అయినా, అంతకన్నా పెద్ద కారణం పేదరికం. ఆ సంగతి గ్రహించింది కనుకనే తనే స్వయంగా చదువు చెప్పడానికి పిల్లల్నందర్నీ జమ చేసింది. చిన్నపిల్లల చేత అక్షరాలు దిద్దించడం, పెద్ద పిల్లలకు మేథ్స్, ఇంగ్లిష్ నేర్పించడం ఇప్పుడు ఆమె దినచర్య. ‘పాఠం’ అనే మాటెప్పుడూ పిల్లలకు ఆసక్తికరంగా ఉండదు. అందుకే మాటగా, ఆటగా పాఠాలను నేర్పిస్తోంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సంధ్యకు ఏదో ఒక ఉద్యోగం రాకుండాపోదు. వర్క్ ఫ్రమ్ ఇవ్వకా పోరు. కానీ తన గూడెం పిల్లలకు దగ్గరగా ఉండి వారి చదువుల్ని చూసుకోవాలనుకుంది. ‘‘బడి వారికి దూరమైంది. బడి తెరిచేవరకు నేను వారికి దగ్గరగా ఉంటాను’’ అంటోంది సంధ్య. -
కాలిబూడిదైన అంబులెన్స్.. తృటిలో తప్పిన ప్రమాదం
చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రి వద్ద శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్లు మారుస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది మిగతా సిలిండర్లను అక్కడినుంచి తరలించారు. అయితే అప్పటికే అంబులెన్స్‌కు మంటలు అంటుకోవడంతో పూర్తిగా కాలిపోయింది. ఈ సమయంలో అంబులెన్స్‌లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా ప్రమాదం జరిగే కొన్ని నిమిషాల ముందే అంబులెన్స్‌లో కోవిడ్ రోగులను ఆసుపత్రికి తీసుకొచ్చారు. కోవిడ్ రోగులను కరోనా వార్డుకు పంపిన వెంటనే సిబ్బంది వచ్చి ఆక్సిజన్ సిలిండర్ మారుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సిలిండర్ మారుస్తున్న సమయంలో గ్యాస్ లీకవడంతో పాటు అంబులెన్స్‌లో షార్ట్ సర్య్కూట్ చోటుచేసుకోవడంతో ఇది జరిగి ఉండొచ్చని సిబ్బంది వాపోయారు. అయితే ఆసుపత్రి రీజనల్ మెడికల్ ఆఫీసర్ మాత్రం ఈ ఘటనపై ఏం స్పందించలేదు. మరోవైపు తమిళనాడులో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గకపోవడంతో ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: covid: డబ్బులు ఇస్తేనే నీ భర్త మృతదేహం.. -
బీమా డబ్బుల కోసం భర్తనే...
చెన్నై: బీమా డబ్బుల కోసం భర్తనే సజీవ దహణం చేసింది ఓ భార్య. ఈ దారుణం తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. తుడుపతి నివాసి కె. రంగరాజు ఇటీవల ఓ ప్రమాదంలో గాయపడడంతో వైద్యం కోసం కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. చికిత్స అనంతరం రంగరాజ్ తన భార్య, బంధువు రాజాతో కలిసి తుడుపతికి తిరుగు ప్రయాణమయ్యాడు. రాజా, జోతిమణిలు మార్గం మధ్యలో నిర్మానుషమైన ప్రదేశంలో కారుని ఆపారు. వాహనం నుంచి దిగి, రంగరాజన్‌ను కారులో నుంచి బయట రాకుండా లాక్ చేశారు. అనంతరం కారుపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున, నిందితుడు రంగరాజన్ మరణం గురించి తిరుపూర్ పోలీసులకు ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగనట్లు సమాచారం ఇచ్చాడు. అయితే, అతని మాటల్లో పోలీసులకు అనుమానం రావడంతో దర్యాప్తును రాజా వైపు నుంచి మొదలుపెట్టారు. దీంతో అసలు బండారం మొత్తం బయట పడిందని పోలీసులు తెలిపారు. రంగరాజ్ వివిధ కారణాల కింద సుమారు 1.5 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు. తరచూ అప్పు ఇచ్చిన వాళ్లు జోతిమణిని ఇబ్బంది పెట్టావారు. అయితే రంగరాజ్ పేరు మీద రూ.3.5 కోట్ల విలువైన మూడు బీమా పాలసీలు ఉన్నాయి. అందులో జోతిమణిని నామినీగా ఉంది. ఈ క్రమంలో తన భర్త చనిపోతే తనకి అప్పుల బాధ ఉండదని అలాగే బీమా డబ్బులు కూడా వస్తాయని ఆలోచనతో తన సమీప బంధువు రాజాతో జోతిమణి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో నిజాలను బయట పడ్డాయి. ( చదవండి: పెళ్లయిన 43వ రోజు భార్య గొంతు కోసి దారుణ హత్య ) -
అలా అయితే సినిమాలు మానేస్తా: కమల్ హాసన్
సాక్షి, కోయంబత్తూరు: ఒకవేళ తన రాజకీయ జీవితానికి సినిమాలు అడ్డంకి అయితే, వాటిని వదిలేస్తానని మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ చెప్పారు. ఆయన ఆదివారం కోయంబత్తూరులో మాట్లాడారు. ప్రజలకు సేవ చేయాలన్నదే తన ఆశయమన్నారు. తాను రాజకీయాల్లో ప్రవేశించడం చరిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. దివంగత ఎంజీఆర్ ఎన్నో సినిమాల్లో ఎమ్మెల్యేగా నటించారని, రాజకీయాల్లో సీఎం పదవి చేపట్టి, ప్రజలకు సేవ చేశారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక తాను రాజకీయాల నుంచి తప్పుకొని, మళ్లీ సినిమాలు చేసుకుంటానని చాలామంది అంచనా వేస్తున్నారని గుర్తుచేశారు. రాజకీయాల నుంచి ఎవరు తప్పుకుంటారో చూద్దామని, అది ప్రజలే నిర్ణయిస్తారని వెల్లడించారు. ఎన్నికల ప్రచార ఖర్చులను తాను నిజాయతీగా ఎన్నికల సంఘానికి తెలియజేశానని అన్నారు. అందుకు ఎన్నికల సంఘం అధికారులు తనను అభినందించారని చెప్పారు. -
‘ఇడ్లీ అమ్మ’కు ఆనంద్ మహేంద్ర ఊహించని గిఫ్ట్
చెన్నె: ఒక్క రూపాయికే ఇడ్లీ విక్రయిస్తూ తమిళనాడులో ‘ఇడ్లీ అమ్మ’గా అందరి దృష్టిని ఆకర్షించిన కమలాథల్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర ఊహించని గిఫ్ట్ అందించారు. త్వరలోనే ఆమెను ఓ ఇంటి దాన్ని చేయనున్నాడు. ఈ మేరకు ఆ విషయాన్ని ఆనంద్ మహేంద్ర ట్విటర్లో చెప్పారు. త్వరలోనే కమలాథల్‌కు ఓ ఇంటిని నిర్మించి ఇవ్వనున్నట్లు, ఆ ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యిందని ఆనంద్ మహేంద్ర తెలిపారు. రిజిస్ట్రేషన్ సకాలంలో పూర్తయ్యిందని చెప్పారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. రూపాయికే ఇడ్లీ విక్రయిస్తున్న కమలాథల్ గురించి రెండేళ్ల కిందట సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో విస్తృత కథనాలు వచ్చాయి. వాటిని చూసి ఆనంద్ మహేంద్ర.. కమలాథల్ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి వ్యాపారం చేస్తానని ప్రకటించాడు. ఆ మేరకు ఆయన ప్రారంభించారు. కట్టెల పొయ్యితో వండుతుండడాన్ని చూసి ఆమెకు ఎల్పీజీ గ్యాస్ ఇస్తానని ఆనంద్ మహేంద్ర హామీ ఇచ్చారు. అయితే భారత్ గ్యాస్ వారు ఆమెకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ అందించారు. ఆమెకు ఇల్లు కానీ, హోటల్ కానీ నిర్మించి ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ క్రమంలో కమలాథల్‌కు కోయంబత్తూరులో ఓ ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు ఆనంద్ మహేంద్ర చర్యలు తీసుకున్నారు. ఈక్రమంలోనే తాజాగా శుక్రవారం కమలాథల్ ఇంటి నిర్మాణానికి సంబంధించి భూమి రిజిస్రే్టషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ఇదే విషయాన్ని ఆనంద్ మహేంద్ర షేర్ చేశారు. మహేంద్ర లైఫ్ స్పేసెస్ ఆ ఇంటిని నిర్మించనుంది. త్వరలోనే ఇంటి నిర్మాణం మొదలవుతుందని చెప్పారు. తొండముత్తూరులో ఆమెకు సంబంధించిన భూమి రిజిస్రే్టషన్ చేశారు. 🙏🏽 to the @MahindraRise team for understanding from Kamalathal how we can ‘invest’ in her business. She said her priority was a new home/workspace. Grateful to the Registration Office at Thondamuthur for helping us achieve our 1st milestone by speedily registering the land (2/3) pic.twitter.com/F6qKdHHD4w — anand mahindra (@anandmahindra) April 2, 2021 -
చెత్తకుప్ప పక్కన ప్రముఖ విలన్.. చివరికి!
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓట్లను చీల్చాలనే ఉద్దేశంతోనే ఆయన ఎన్నికల బరిలో దిగారంటూ విమర్శలు రావడంతో మనస్తాపం చెంది, పోటీ నుంచి విరమించుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా కోయంబత్తూరులోని తొండముత్తూరు నియోజకవర్గం నుంచి మన్సూర్ అలీఖాన్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో.. మన్సూర్ అలీఖాన్, చెత్తకుప్ప వద్ద పెన్ను పేపర్ పట్టుకుని, పక్కన కుక్కను పెట్టుకుని వినూత్న రీతిలో ప్రచారానికి తెరతీశారు. రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని, ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని బాటసారులకు విజ్ఞప్తి చేశారు. తాను ఎమ్మెల్యేను అయిన తర్వాత వీటిని అధిగమించేందుకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. అదే విధంగా, తొండముత్తూరులోని గాంధీ పార్కు ఏరియాలో వాలీబాల్ ఆడుతూ సరదాగా గడిపారు. జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తూ కలివిడిగా మెదిలారు. ఆ తర్వాత పెరూర్ పట్టేశ్వరర్ ఆలయం వద్ద దుకాణాదారులతో ముచ్చటించారు. ఈ మేరకు శుక్ర, శనివారాల్లో మన్సూర్ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో, కొంతమంది ఓటర్లు ఆయనపై విమర్శలు సంధించినట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న, ఆడియో క్లిప్‌లో ఉన్న వివరాల ప్రకారం.. మైనార్టీ ఓట్లను చీల్చేందుకు ఓ రాజకీయ పార్టీ దగ్గర తాను డబ్బు తీసుకున్నాననే ఆరోపణలు వస్తున్నాయని, ఈ విషయం తనను తీవ్రంగా బాధించిందని మన్సూర్ పేర్కొన్నారు. నిజాయితీగా సేవ చేద్దామనుకున్నా, ప్రజలు తనను శంకిస్తున్నారని, అందుకే పోటీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. అయితే, క్లిప్ వాస్తవమా కాదా అన్న అంశంపై స్పష్టత లేదు. మన్సూర్ అలీఖాన్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారోనన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కాగా కెప్టెన్ ప్రభాకరన్ సినిమాతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన మన్సూర్ అలీఖాన్, విలన్‌గా మెప్పించారు. దక్షిణాది భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయన, తెలుగులో ముఠామేస్త్రి, సాంబ, నాయుడమ్మ వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. చదవండి: ఆస్పత్రిలో సీనియర్ నటుడు -
ఫ్యాన్స్ అత్యుత్సాహం: ఆస్పత్రిలో కమల్!
చెన్నై: అభిమానుల ప్రేమకు హద్దూ అదుపూ ఉండదు. అభిమాన తార కళ్లముందు కనిపిస్తే చాలు.. వారి ఆనందం వర్ణించ వశం కాదు. సెలబ్రిటీలతో సెల్ఫీ దిగాలని, వారికి షేక్‌హ్యాండ్ ఇవ్వాలని, కుదిరితే కబుర్లు కూడా చెప్పాలని తహతహలాడిపోతుంటారు. కానీ వీరి అత్యుత్సాహం కొన్నిసార్లు హీరోలకు తలనొప్పిగా మారుతుంది. ఇదిగో ఇలాంటి అనుభవమే తమిళ స్టార్ హీరో కమల్ హాసన్‌కు ఎదురైంది. తమిళనాడు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ నుంచి ప్రచారం స్పీడు పెంచాడు కమల్. తను పోటీ చేస్తున్న కోయంబత్తూర్‌లో వరుస ప్రచారాలు చేపడుతూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. ఈ నేపథ్యంలో కోయంబత్తూరులో శనివారం నాడు మార్నింగ్ వాక్కు వెళ్లి అక్కడి స్థానికులను పలకరించాడాయన. ఈ విషయం తెలిసిన అభిమానులు హీరోను చుట్టుముట్టారు. సెల్ఫీలంటూ ఎగబడ్డారు. అందరితో ఓపికగా సెల్ఫీలు దిగుతుండగా చిన్న తోపులాట జరిగి ఓ వ్యక్తి కమల్ కుడి కాలిని తొక్కాడట. ఈ ఏడాది ప్రారంభంలో అదే కాలికి శస్త్రచికిత్స జరగడంతో కమల్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. దీంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లి కాలికి ఎక్స్‌రే తీశారు. అనంతరం అతడిని పరీక్షించిన వైద్యులు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. చదవండి: కమల్ కారుపై దాడి; చితక్కొట్టిన కార్యకర్తలు కమల్‌కు షాక్: రూ.11 కోట్లు సీజ్ -
కోయంబత్తూర్ సౌత్ నుంచి కమల్..
-
కోయంబత్తూర్ సౌత్ నుంచి కమల్.. ప్రధాన కారణం అదేనట
చెన్నై: తమిళనాట రాజకీయ వాతావరణం క్రమంగా హీటెక్కుతోంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలన్నీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తన పార్టీ రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల సందర్భంగా కమల్ ఈ విషయాన్ని ప్రకటించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తాను కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. తొలుత కమల్ చెన్నై, అలందూర్ నుంచి పోటీ చేయాలని భావించినప్పటికి చివరకు కోయంబత్తూరు నుంచి బరిలో దిగేందకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ.. ‘‘మా నాన్న నన్ను ఐఏఎస్ అధికారిగా చూడాలనుకున్నారు. ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఆశపడ్డారు. కాకపోతే నేను ఆయన కలను నిజం చేయలేకపోయాను. అందుకే మా పార్టీలోకి ఎక్కువ మంది ఐఏఎస్ అధికారులను ఆహ్వానించాను. వారికే సీట్లు కేటాయించాను. ఇది నాకు ఎంతో గర్వకారణం’’ అన్నారు. ఇక కమల్ నేడు ప్రకటించిన రెండో జాబితాలో డాక్టర్ సుభా చార్లేస్ ‘కన్యాకుమారి), డాక్టర్ ఆర్ మహేంద్రన్ (సింగనల్లూర్), డాక్టర్ సంతోష్ బాబు (వెలాచేరి), మరియు పాజా కరుపయ్య (టి నగర్) నుంచి పోటీ చేయనున్నారు. అలందూర్ స్థానాన్ని శరద్ బాబుకు కేటాయించారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు సౌత్‌లో ఏఐడీఏంకే తరఫున అమ్మన్ కే అర్జున్ విజయం సాధించారు. తాజాగా పొత్తుల్లో భాగంగా ఏఐడీఎంకే పార్టీ ఈ స్థానాన్ని మిత్ర పక్షం బీజేపీకి కేటాయించింది. అయితే దీనిపై ఏఐడీఏంకే కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇక 2019 జనరల్ ఎలక్షన్లో ఎంఎన్ఎం కోయంబత్తూరు నియోజకవర్గంలో 11 శాతం ఓట్లు సాధించగలిగింది. ఇక్కడ పార్టీకి మద్దతురాలు ఎక్కువ ఉండటం.. ప్రస్తుత ఎన్నికల్లో ఏఐడీఎంకే కాకుండా బీజేపీ కోయంబత్తూరులో బరిలో నిలవడం వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే కమల్ ఇక్కడ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. చదవండి: మూడో కూటమి సీఎం అభ్యర్థిగా కమల్ ఖరారు -
ఏనుగుపై దాడి.. మీరు మనుషులా రాక్షసులా!
కోయంబత్తూరు: నోరు లేని జంతువులపై దాడులు చేయడం మనుషులతో పాటు వాటికి శిక్షణ ఇచ్చేవారికి కూడా ఓ అలవాటుగా మారిపోతోంది. జంతు ప్రేమికులు ఎన్ని ఆందోళనలు చేపట్టినా మనుషుల్లో మార్పు రావటం లేదు. ఇలాంటి ఓ ఘటన కోయంబత్తూరులో చోటు చేసుకుంది. ఇద్దరు ఏనుగు మావటిలు ఓ ఏనుగును విక్షణరహితంగా కర్రలతో కొట్టారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్లితే.. శ్రీవిల్లిపుత్తూరులోని ఆండల్ ఆలయానికి చెందిన 19 ఏళ్ల ఆడ ఏనుగు ‘జయమల్యత’ను మావటిలు వినీల్ కుమార్, శివప్రసాద్ గోలుసులతో చెట్టుకు కట్టేసి మరీ కర్రలలో విపరీతంగా కొట్టారు. దిక్కుతోచని ఆ ఏనుగు ఆ దెబ్బల నొప్పికి అరుస్తూ విలపించింది. మావటీలు చెప్పినట్లుగా ఏనుగు వినకపోవడంతో దాని ప్రవర్తన వారికి నచ్చక కోపంతో ఈ దాడికి దిగినట్లు తెలుస్తోంది. అయితే నోరు లేని ఏనుగుపై అలా కర్రలతో దాడి చేయడం సరికాదని జంతుప్రేమికులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ వీడియోను తమ దృష్టికి వచ్చిందని ఏగునుపై దాడి చేసిన మావటిల సస్పెన్షన్ పెండింగ్‌లో ఉందని హెచ్‌ఆర్‌అండ్‌ఈసీ(హిందూ రిలిజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్స్)అధికారులు తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరిలోని వివిధ దేవాలయాలు, మఠాల నుంచి 26 ఏనుగుకు రెండు నెలల పాటు శిక్షణ ఇవ్వాలని కోయంబత్తూరు జిల్లాలోని తేకంపట్టికి తీసుకువచ్చారు. ఏనుగు దాడి వీడియో సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు.. ‘ఏనుగుపై దాడి దారుణం, మీరు మనుషులా రాక్షసులా, మీలో మానవత్వం చచ్చిపోయింది, దాడిచేసిన వారిని కఠిన చర్యలు తీసుకోవాలి’ అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: బుర్రను బీరువాలో పెట్టి వచ్చిందని.. -
వ్యవసాయం పద్మశ్రీ తెస్తుందని ఊహించలేదు
కోయంబత్తూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం దక్షిణాదిలోనే మొట్ట మొదటిదన్న విషయం తెలిసిందే. దీనికున్న మరో విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సి ఉంది. అదేమిటంటే.. ఈ విద్యాసంస్థ ఏభయ్యేళ్ల క్రితం నుంచే ‘రైతులకు సేంద్రియ వ్యవసాయా’న్ని నేర్పిస్తూ ఉంది! అందుకు ప్రత్యక్ష నిదర్శనం 104 ఏళ్ల పాపమ్మాళ్!! రసాయనిక రైతుగా 30 ఏళ్ల వ్యవసాయానుభవం తర్వాత.. 50 ఏళ్ల క్రితం.. కోయంబత్తూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ‘సేంద్రియ వ్యవసాయం’ నేర్చుకున్నారు. అనుదినం తానే నడుము వంచి పొలం పనులు చేసుకుంటున్న ఈ ‘మహా రైతమ్మ’ను పద్మశ్రీ పురస్కారం వరించింది.ఆమెను ‘సాక్షి’ పలుకరించింది.. తోట పనిలో పాపమ్మాళ్ మీరు వ్యవసాయంలోకి మీరెలా వచ్చారు? పొట్ట కూటి కోసం ఎంతకష్టమైనా పడకతప్పదు. 1914లో పుట్టాను. చిన్నప్పుడే అమ్మానాన్న చనిపోయారు. వారు నడిపే టీ బంకు మూతపడటంతో చెల్లితో కలిసి నానమ్మ దగ్గరకు చేరుకున్నాను. నానమ్మది కూడా ఫలసరుకుల దుకాణం పెట్టుకుని జీవితాన్ని నెట్టుకొచ్చే పేద కుటుంబం కావడంతో.. ఆమెకు సహకరిస్తూ రెండో క్లాసులోనే చదువు మానేశాను. 20 ఏళ్లకే పెళ్లయింది. పదేళ్ల క్రితం భర్త చనిపోయాడు. పిల్లలు లేకపోవడంతో సోదరి పిల్లలనే నా పిల్లలుగా చేరదీశాను. పొదుపు చేసిన సొమ్ముతో పది ఎకరాలు కొని సాగులోకి దిగాను. తదనంతరం కుటుంబ అవసరాల కోసం 7.5 ఎకరాలు అమ్మివేశాను. 2.5 ఎకరాల పొలంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా. ప్రస్తుతం అరటి పంట పెట్టా. సేంద్రియ సాగు ఎప్పటి నుంచి..? తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం సలహా బృందంలో సభ్యురాలిగా ఉన్నాను. ఆ సమావేశాలకు హాజరైనపుడు సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకున్నాను. ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేసే రసాయన ఎరువులు, పురుగుమందులతో ఇన్నాళ్లూ సేద్యం చేశానా? అని బాధపడ్డాను. సేంద్రియ వ్యవసాయంలోకి మారి 50 ఏళ్లు గడిచింది. దేశవాళీ విత్తనాలు సేకరించేదాన్ని. జొన్న వంటి చిరుధాన్యాలు, కూరగాయలు, కందులు పండించే దాన్ని. ఇపుడు అరటి సాగు చేస్తున్నా. సేంద్రియ వ్యవసాయంలో మీ ప్రత్యేకత ఏమిటి? ఆవు పేడ, మూత్రం, గడ్డి, బెల్లం మిశ్రమాలను వాడతాను. ఆవు పేడ, లవంగాలు, ఉప్పును ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి పొలంలోని భూమిలో పాతి పెడతాను. 15 రోజులకు ఒకసారి మూత తీసి ఆ మిశ్రమాన్ని కలియబెడతాను. 2 నెలల తరువాత బయటకు తీసి మొక్కల పాదుల్లో చల్లుతాను. వేపాకును ఎండ బెట్టి పొడి చేసి, వెల్లుల్లి పొడి, నీటితో కలిపి ద్రావణం తయారు చేసుకొని పంటలపై చల్లితే పురుగు పట్టదు. సేంద్రియ రైతుగా మీ అనుభూతి ఎలా ఉంది? ఆరోగ్యకరమైన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తేవడంలో ఎంతో ఆనందం ఉంది. సేంద్రియ వ్యవసాయం అనేది ఒక రకంగా సమాజ సేవ. రసాయనాలతో ఆహార పంటల సాగును పూర్తిగా మాన్పించాలి. సేంద్రియ సాగులోని బాగు గురించి భావితరాలకు అవగాహన కల్పించాలి. పద్మశ్రీ అవార్డుకు ఎంపికవ్వటం ఎలా అనిపిస్తోంది? పొట్ట గడవటం కోసం నా మానాన నేను చేసుకుంటున్న సేంద్రియ వ్యవసాయం పద్మశ్రీ అవార్డుకు తెచ్చి పెడుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. అసలు పద్మశ్రీ అవార్డు అనేది ఒకటి ఉందని కూడా నాకు తెలియదు. కేంద్ర ప్రభుత్వం నాకు పద్మశ్రీ ప్రకటించగానే మారుమూల గ్రామంలో ఉంటున్న నా వద్దకు ప్రజలు, బంధువులు, ముఖ్యంగా విలేకరులు తండోపతండాలుగా రావడం ప్రారంభించారు. ఈ హడావిడితోనే పద్మశ్రీ అవార్డు గొప్పతనం గురించి తెలిసింది. ఈ గుర్తింపు, గౌరవం నాకు కాదు సేంద్రియ వ్యవసాయానికే అని భావిస్తున్నాను. మీ ఆరోగ్య రహస్యం ఏమిటి? తెల్లవారుజామునే లేచి ఇప్పటికీ వేప పుల్లతోనే పళ్లు తోముతాను. కాలకృత్యాలు ముగించుకుని (టీ, కాఫీ తాగను) ఒక చెంబు నిండా గోరువెచ్చని నీళ్లు, రాగి గంజి తాగుతాను. ఎప్పుడైనా చికెన్ సూప్ సేవిస్తాను. అరటి ఆకులోనే భోజనం చేస్తాను. ఆకుకూరలు, ఆకుపచ్చని కూరగాయలతోనే నా భోజనం. మటన్ బిర్యానీ అంటే ఇష్టం. ఎప్పుడైనా కొద్దిగా తింటాను. ఉదయం 5.30–6 గంటల కల్లా చేలో ఉంటాను. కూలీలను పెట్టుకుంటే వారికి 10 గంటలకు కాఫీ లేదా కొబ్బరి బొండాం, సాయంత్రం మళ్లీ ఏదో ఒకటి తినడానికి ఇవ్వాలి. ఆ ఖర్చు భరించే స్థోమత నాకు లేదు. అందుకే నాటి నుంచి నేటి వరకు నేనే పొలం పని చేస్తాను. సోదరి, మనుమలు, మనుమరాళ్లు అప్పుడప్పుడూ పనిలో సాయం చేస్తారు. సాయంత్రం చీకటì పడే వరకు పొలం దగ్గరే ఉంటాను. దాదాపు 80 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా.. ఎప్పుడూ అలసి పోలేదు. నాకు 104 ఏళ్లు వచ్చాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. నిరంతరం పొలం పనులు చేయటం, ఆహారపు అలవాట్లే నా ఆరోగ్య రహస్యం అనుకుంటాను. – కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై -
ఛీ! ఇదేం పాడు బుద్ధి సుందర్రాజు
కోయంబత్తూర్ : పొరుగిల్లలోని బాత్రూముల్లోకి దొంగతనంగా ప్రవేశించి మహిళల లోదుస్తులను పాడుచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొట్టుచెర్రికి చెందిన 38 ఏళ్ల సుందర్రాజు కోయంబత్తూర్‌లోని ఒక్కిలిపాళియంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో రూము తీసుకుని తోటి కార్మికులతో కలిసి ఉంటున్నాడు. చదవండి : ‘నువ్వు ఆడా.. మగా? నీ గొంతు కుక్కలా ఉంది’ అయితే గత ఐదు రోజులనుంచి పొరుగిల్లలోని బాత్రూముల్లోకి దొంగతనంగా ప్రవేశించి మహిళల లోదుస్తులను పాడు చేయటం మొదలుపెట్టాడు. ఇది గమనించిన కొంత మంది మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుందర్రాజును అరెస్ట్ చేశారు. -
బాత్రూమ్లో 35 పాము పిల్లలు
సాక్షి, చెన్నై: పాము కనిపిస్తేనే భయంతో ఆమడ దూరం పరుగులు తీస్తాం. అలాంటిది ఒకరి కాదు రెండు కాదు ఏకంగా 35 పాము పిల్లలు ఒక్కసారిగా కనిపిస్తే చూసినవాళ్ల పరిస్థితి ఎలా ఉంటదో ఊహించారా? ఇలాంటి సంఘటనే తమిళనాడులో ఓ వ్యక్తికి ఎదురైంది. రెండు రోజుల క్రితం కోయంబత్తూరు ఈ ఘటన చోటుచేసుకోంది. కోవిమేడుకు చెందిన మనోహరన్ శుక్రవారం స్నానం చేయడానికి బాత్రూమ్కు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ 35 పాము పిల్లలను గమనించాడు. దాంతో భయంతో అక్కడ నుంచి పరుగులు పెట్టాడు. అనంతరం తేరుకుని వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చాడు. అతడు ఆ పాములను పట్టుకుని, వాటిని రస్సెల్ వైపర్‌గా గుర్తించి, సత్య మంగళం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. పామును పట్టుకున్న అంజనీకుమార్ హైదరాబాద్: నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ నివాసం వద్ద శనివారం ఉదయం ఓ పాము కలకలం సృష్టించింది. సీపీ వాహనం సమీపంలో ఓ జెర్రిపోతు ఉండటం చూసి, ఆయన పెంపుడు శునకం గుర్తంచి అరుస్తూ అప్రమత్తం చేసింది. ఆ పామును పట్టుకున్న కొత్వాల్ అంజనీకుమార్ జూ పార్క్‌కు పంపించారు. -
అప్పటి వరకూ కోయంబత్తూరే..
కోయంబత్తూర్ ఇప్పుడు కోయంపుత్తూరు. వెల్లూర్ ఇప్పుడు వీలూరు. ఇంకా 1016 ఊళ్లు తమిళనాడులో ఇంగ్లిష్ నుంచి అచ్చ తమిళ్లోకి మారిపోతున్నాయి. అయితే ఈ మార్పులు ఏమంత సవ్యంగా లేవని తమిళ చరిత్రకారులు, భాషాపండితులు అంటుండటంతో తమిళనాడు ప్రభుత్వం మునుపు తనిచ్చిన ‘ఊళ్ల పేర్ల మార్పు జీవో’ ను ఉపసంహరించుకుంది. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చాక కొత్త జీవోను జారీ చేస్తామని తమిళభాష, తమిళ సంస్కృతి శాఖల మంత్రి పాండియరాజన్ ఒక ట్వీట్ ఇచ్చారు. మయిలాప్పూర్ (మైలాపుర్), తూత్తుక్కుడి (ట్యూటికొరిన్), మథురై (మదురై), తండయియార్పేట్టయ్ (తొండయిర్ పేట్) వంటి చాలా ప్రాంతాల ఉచ్చారణ తమిళంలోకి మార్చిన తర్వాత కూడా ఇంగ్లిషుకు ఆనుకుని ఉండటమే తమిళ భాషాభిమానులకు నచ్చడం లేదు. -
ఇండిగో ప్రయాణికుడికి కరోనా..
చెన్నై : కరోనా లాక్డౌన్ కారణంగా.. దాదాపు రెండు నెలల తర్వాత భారత్‌లో దేశీయ విమాన సర్వీసులు పున: ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఇండిగో ఫ్లైట్‌లో ప్రయాణించిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. 24 ఏళ్ల ఓ వ్యక్తి సోమవారం చెన్నై నుంచి కోయంబత్తూరుకు ఇండిగో విమానంలో ప్రయాణించాడు. అయితే ఆ రోజు సాయంత్రం కోయంబత్తూరు చేరుకున్న అతనికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయింది. అయితే అతనికి కరోనా లక్షణాలు లేవని.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లలో అందరు ప్రయాణికులతో పాటు అతనికి కూడా స్క్రీనింగ్ నిర్వహించారని వైద్య అధికారులు తెలిపారు. దీంతో ఆ విమాన సిబ్బందిని 14 రోజుల హోం క్వారంటైన్లో ఉంచనున్నారు. అలాగే ఈ విమానంలోని ఇతర ప్రయాణికులను హోం క్వారంటైన్ చేసి.. వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించనున్నట్టు రాష్ట్ర వైద్య అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇండిగో సంస్థ కూడా ఒక ప్రకటన చేసింది. 25వ తేదీ సాయంత్రం చెన్నై నుంచి 6E-381 ఫ్లైట్‌లో ప్రయాణించిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ వైద్యుల నుంచి సమాచారం అందిందని తెలిపింది. ప్రయాణ సమయంలో అతని సమీపంలో ఎవరు కూర్చొలేదని.. అందువల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం తక్కువగా ఉంటుందని అభిప్రాయపడింది. అతనిని ప్రస్తుతం కొయంబత్తూరులోని ఈఎస్ఐ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని చెప్పింది. కాగా, ఆ ప్రయాణికుడు చెన్నైలోని ఓ బార్ హోటల్లో అతను అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. (చదవండి: 42 మందికి కరోనా : నోకియా ప్లాంట్ మూత) -
విమానాలు ఎగిరిన తొలిరోజే కరోనా కలకలం!
చెన్నై: విమానయానంపై మల్లగుల్లాలు పడిన అనంతరం దేశీయ విమాన సర్వీసులకి కేంద్రం పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. దీంతో రెండు నెలల తర్వాత విమాన సర్వీసులు నేడు(మంగళవారం) తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే తొలి రోజే ఓ విమానంలోని ప్రయాణికుడికి కరోనా ఉన్నట్లు తేలడం కలకలం రేపుతోంది. తొలి దశలో కొన్ని దేశీయ విమానాలకే అనుమతి లభించింది. అందులో భాగంగా మంగళవారం చెన్నై నుంచి ఇండిగో విమానం కోయంబత్తూరు చేరుకుంది. ఇందులోని ప్రయాణికులందరికీ పరీక్షలు చేయగా ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. (విమానాలకు లైన్ క్లియర్) వెంటనే అధికారులు అతడిని స్థానిక వినాయక ఆసుపత్రిలోని క్వారంటైన్ కేంద్రంలో చేర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ నెల 25వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి విమానాల రాకపోకలకు మార్గం సుగమమైంది. అయితే ప్రయాణికుల విషయంలో నిర్ధిష్టమైన మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో విమాన సర్వీసులు తొలి రోజు పూర్తి స్థాయిలో ప్రారంభం కాని విషయం తెలిసిందే. (ప్రారంభమైన విమాన సర్వీసులు) -
కమలాతాళ్‌కు స్టాలిన్ అభినందనలు
సాక్షి, చెన్నై : వయసులోనే కాదు.. మానవతా ధోరణిలోనూ ఆమెది పెద్ద మనస్సు. లాక్‌డౌన్‌ను అడ్డం పెట్టుకుని కొందరు వ్యాపారులు భారీగా సొమ్ము చేసుకునే ఈ రోజుల్లో ఎనిమిది పదులు దాటిన ఆ వృద్ధురాలు ప్రజల పట్ల తన ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. పలువురి ఆకలితీరుస్తున్నారు. కోయంబత్తూరు జిల్లా తొండాముత్తూరు యూనియన్ పరిధిలోని వడివేలాంపాళయంలో కమలాతాళ్ (85) అతిచిన్నదైన టిఫిన్ సెంటర్‌ను నడుపుతున్నారు. మూడు దశాబ్దాలుగా పొయ్యిలోనే వంటలు వండుతూ కేవలం రూపాయికే రుచికరమైన ఇడ్లీని అందిస్తున్నారు. వందలాది మందికి వృద్ధురాలు తయారు చేసే ఇడ్లీ అంటే ఎంతో మక్కువ. కరోనావైరస్ భీతి, లాక్డౌన్ అంక్షల రోజుల్లోనూ ఆమె టిఫిన్ సెంటర్‌ను నడుపుతున్నారు. ఇంతటి కష్టదినాల్లో సైతం విరామం లేకుండా టిఫిన్ సెంటర్ నడపడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ వీడియోకాల్ ద్వారా ఆమెతో మాట్లాడి అభినందనలు తెలిపారు. మీ సేవలు ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. (చదవండి : రూపాయికే ఇడ్లీ.. 2.50 పైసలు గారె) దీంతో గ్రామంలోని ఇతర డీఎంకే నేతలు నెలరోజులకు సరిపడా బియ్యం, పప్పుధాన్యాలు, కూరగాయలు వృద్ధురాలికి అందజేశారు. పొల్లాచ్చి పార్లమెంటు సభ్యుడు షణ్ముగానందం గ్రైండర్ కొనుగోలుకు రూ.10 వేలు ఆర్థికసాయం చేశారు. పొయ్యితోనే ఆమె టిఫిన్‌సెంటర్ నడుపుతున్న నేపథ్యంలో.. గ్యాస్ స్టౌ కనెక్షన్‌కు తొండాముత్తూరు యూనియన్ డీఎంకే కార్యదర్శి సేనాధిపతి ఆర్థిక సహాయం అందజేశారు. స్టాలిన్ సోమవారం రెండోసారి ఆ వృద్ధురాలితో వీడియో కాల్ ద్వారా సంభాషించి డీఎంకే నేతలు అందిస్తున్న సహాయంపై ప్రశ్నించారు. స్టాలిన్‌తో మాట్లాడటం తన జీవితంలో మరపురాని అనుభవమని ఆమె ఆనందాన్ని వెలిబుచ్చారు. (చదవండి : మానవత్వం చాటుకున్న బాలవ్వ..) ‘లాక్డౌన్ కారణంగా మినపప్పు ధర రూ.100 నుంచి రూ.150కి పెరిగిందని, చట్నీ తయారీకి అవసరమైన వేరుశనగపప్పు, మిరపకాయలు ధరలు సైతం కిలోపై రూ.50 వరకు పెరిగింది. అయినా రూపాయికే ఇడ్లీలు అమ్ముతు న్నా. లాక్డౌన్ సమయంలోనూ రోజుకు సుమారు 300 మంది ఇడ్లీలు కొనుక్కుని పోతున్నారు. లాక్డౌన్, వస్తువుల ధరలు పెరిగాయి కదాని ఇడ్లీలు చేయకుంటే నన్ను నమ్ముకుని వచ్చేవారంతా పాపం ఎక్కడికి పోతారు’ అని ఆమె చెప్పిన మాటలు అధికధరలతో దోచుకునేవారికి చెంపపెట్టు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఇప్పుడు కూడా రూపాయికే ఇడ్లీ...
చెన్నై : కమలాతాళ్.. రూపాయి ఇడ్లీ బామ్మ అంటే ఎవరైనా టక్కున ఆమె పేరే చెప్పేస్తారు. తమిళనాడులోని పెరూర్‌కి చెందిన ఈ బామ్మ 80 ఏళ్ల వయసులోనూ ఇడ్లీలు తయారు చేసి ఒక్క రూపాయికే విక్రయిస్తూ పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. లాక్డౌన్ ప్రభావంతో భారీగా నష్టం వాటిల్లినప్పటికీ.. కమలాతాళ్ తన ఇడ్లీల ధరను ఒక్క పైసా కూడా పెంచలేదు. నష్టాలు వచ్చినప్పటికీ పేద ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఒక్క రూపాయికే వేడి వేడి ఇడ్లీ(ఒక ఇడ్లీ ఒక్క రూపాయి), ఘుమఘుమలాడే సాంబారు, రుచికరమైన చట్నీ అందచేస్తుంది. (చదవండి : రూపాయికే ఇడ్లీ.. 2.50 పైసలు గారె) అవ్వకు దాతల సాయం లాక్డౌన్ నేపథ్యంలో కూడా రూపాయికే ఇడ్లీ అందిస్తున్న కమలాతాళ్‌కు పలువురు ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. భారతీయార్ విశ్వవిద్యాలయం ఆమెకు సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ డాక్టర్ పి కలిరాజ్ ఆహార, కిరాణా వస్తు సామగ్రిని విరాళంగా ఇచ్చారు. భారతీయార్ విశ్వవిద్యాలయ తలుపులు తన కోసం ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయని కమలాతాళ్ చెప్పారు. హిందూస్తాన్ స్కౌట్స్ మరియు గైడ్స్ సభ్యులు కమలాతాళ్‌కు అవసరమైన వస్తువులను ఇచ్చారు. కోయంబత్తూర్ సెక్టార్ హెడ్ ప్రశాంత్ ఉతమా మాట్లాడుతూ.. ‘కమలాతాళ్ బామ్మ గురించి చాలా సార్లు విన్నాం. ఆమె ఒక్క రూపాయికే ఇడ్లీ ఎలా అందిస్తున్నారో కూడా విన్నాం. కానీ కరోనా వైరస్ విజృంభిస్తున్న కాలంలో కూడా ఆమె ఒక్క రూపాయి ఇడ్లీని ఎలా నిర్వహించగల్గుతున్నారో విని ఆశ్చర్యపోయాను. ఆమె చేస్తున్న సేవకు మా వంతుకు కొంత సహాయం చేశాం’ అని అన్నారు. రెట్లు పెంచే ఆలోచన లేదు లాక్డౌన్ వల్ల భారీగా నష్టం వాటిల్లింది. అయినప్పటికీ రేట్లు పెంచే ఆలోచన నాకు లేదు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో కూడా రూపాయికే క్వాలిటీ ఇడ్లీ అందించేందుకు ప్రయత్నిస్తున్నాను. చాలా మంది ఇడ్లీల కోసం వస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఇక్కడే ఉండిపోయినా వలస కూలీలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. దాతల సహాయంతో వారందరికీ ఒక్క రూపాయికే ఇడ్లీ అందించగల్గుతున్నాను’అని కమలాతాళ్ ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలో చెప్పారు. -
నెలసరి ఉన్నా ఈ గర్భగుడిలోకి వెళ్లవచ్చు!
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఓ ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఈ ఆలయంలో నెలసరి సమయంలో కూడా మహిళలలు పూజలు చేసుకోవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ ప్రత్యేక ఆలయం కోయంబత్తూరులోని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆశ్రమంలో ఉంది. దీని పేరు ‘మా లింగా భైరవి’. ఇక్కడ బైరాగిని అమ్మవారు కొలువుదేరి ఉన్నారు. ఈ ఆలయ గర్భగుడిలోకి కేవలం మహిళలకు మాత్రమే అనుమతి ఉండటం మరో విశేషం. సద్గురు జగ్గీ వాసుదేవ్ ఉన్నత భావాలు కలిగిన స్వామిజీ అని అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఆశ్రమంలో.. మా లింగా భైరవి ఆలయానికి ప్రతిరోజు పురుషులు, మహిళా భక్తులు దర్శనార్థం వస్తుంటారు. కానీ ఈ ఆలయ గర్భగుడి లోపలికి వెళ్లి పూజలు చేసుకునే అవకాశం కేవలం మహిళలకు మాత్రమే ఆయన కల్పించారు. దీనికి కారణం రుతుస్రావం సమయంలో వారిని అంటరాని వారిగా చూడకూడదనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాటు చేశారు. అదే విధంగా మహిళలకు రుతుస్రావం అనేది ప్రకృతిలో భాగమనీ.. ఆ సమయంలో మహిళలు గుడికి రాకూడదు, పూజలు చేయకూడదంటూ ఆంక్షలు విధించడం సరైనది కాదని తాను అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. గత జన్మలో మహిళ.. ఈ జన్మలో ఇలా! ఈ విషయం గురించి నిర్మలా అనే ఆశ్రమ మహిళా సన్యాసిని మాట్లాడుతూ.. ‘ ఇది స్వామీ సద్గురు జగ్గీ వాసుదేవ్ నిర్ణయం. రుతుస్రావ సమయంలో మహిళల అభద్రతా భావాన్ని పోగొట్టేందుకే ఆయన ఇలా చేస్తున్నారు. దీంతో బైరాగిని మాతను పూజించుకోవడానికి రోజూ మహిళలు, పురుషులు వస్తారు. కానీ గర్భగుడిలోకి కేవలం మహిళలను మాత్రమే అనుమతించడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఆలయాల్లోని గర్భగుడిలోకి మహిళలకు అనుమతి ఉండక పోవడం.. ఇక్కడ ఆ ఏర్పాటు ఉండటంతో వారంతా సంతోషిస్తున్నారు’ అని ఆమె చెప్పారు. ‘నెలసరిలో వంట చేస్తే కుక్కలుగా పుడతారు’ ‘‘కంప్యూటర్ యుగంలో కూడా చాలా ప్రాంతాల్లో రుతుస్రావంలో ఉన్న మహిళలను, యువతులను అంటరానివారుగా భావిస్తారన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో వారిని ఇంట్లోకి అనుమతించరు. ఇక వారికి తినడానికి ప్లేటు, గ్లాసు విడిగా ఉంచుతారు. ఆ సమయంలో ఇంట్లోని వారంతా వారి పట్ల ప్రవర్తించే తీరు చూస్తే అభద్రత భావం కలుగుతుంది. ఈ ఆచారాన్ని వారు అవమానకరంగా భావించడంతో పాటుగా.. వారి ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. అందుకే వీటన్నింటికీ అడ్డుకట్ట వేసేందుకే సద్గురు వాసుదేవ్ ఇలా చేస్తున్నట్లు’’ నిర్మల తెలిపారు. -
కోయంబత్తూరు మెట్టుపాళ్యంలో ఘోర విషాదం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా మెట్టుపాళ్యంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మూడు భవనాలు కూలి 15 మంది మృతి చెందారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు సమాచారం. స్థానికులు, అగ్నిమాపక సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ వర్షాల కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా మృతుల్లో ముగ్గురు పురుషులు, 10మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతుల వివరాలు గురు (45), రాంనాథ్ (20), ఆనంద్ కుమార్ (40), హరిసుధ (16), శివగామి (45), ఒవియమ్మా (50), నిత్యా (30), వైదేహి (20), తిలగవతి(50), అరుకాని (55), రుక్మణి (40), చిన్నమ్మాల్ (70), అక్షయ (7), లోగురాం (7). ఈ ప్రమాదంలో ఒక కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షం బీభత్సంగా కురుస్తోంది. నిన్న 14 జిల్లాల్లో 53 చోట్ల 10 సె.మీకి పైగానే వర్షం కురిసింది. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు, చెరువులు పూర్తిగా నిండాయి. లోతట్టు ప్రాంతాలు, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కాయి. మరో రెండు రోజులు వర్షం కొనసాగనుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంత్రులందరూ వారి వారి జిల్లాలకు పరుగులు తీశారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. ఇక, ఈశాన్య రుతుపవనాలతో ఈ ఏడాది పడాల్సిన వర్షం పూర్తి స్థాయిలో పడింది. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో అధికార యంత్రాంగం ఆరంజ్ అలర్ట్ ప్రకటించింది. వీడని వాన.. ఆదివారం ఒక్క రోజు 14 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీగానే వర్షం పడింది. తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం, కడలూరులలో అతి భారీ వర్షాలు పడ్డాయి. తిరువళ్లూరు, కాంచీపురం, వేలూరు, తిరువణ్ణామలై, విల్లుపురం, ఈరోడ్, నీలగిరి, కోయంబత్తూరు, దిండుగల్, తేని జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. మదురై, పెరంబలూరు, అరియలూరు, తిరుచ్చి, తంజావూరు, పుదుకోట్టై , నాగపట్నం , శివగంగై జిల్లాల్లో మోస్తరుగా వర్షం పడుతోంది. తూత్తుకుడి జిల్లాలో వర్ష విళయానికి లోట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కి ఉన్నాయి. వేలాది ఇళ్లల్లోకి నీళ్లు చొరబడడంతో అధికార యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరంచేసింది. తూత్తుకుడి ప్రధాన రైల్వే స్టేషన్‌ను మూసివేయాల్సినంతగా పరిస్థితి మారింది. ప్లాట్‌ఫామ్‌లు సైతం కనిపించని రీతిలో నీళ్లు ఇక్కడ చుట్టుముట్టాయి. జాతీయ రహదారిలోనూ వరద ఉధృతి హోరెత్తడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం తప్పలేదు. తిరునల్వేలి జిల్లాల్లో అన్ని జలాశయాలు పూర్తిగా నిండాయి. కుట్రాలం మరీ కుండపోతగా మారడంతో ఆ దరిదాపుల్లో ఎవ్వర్నీ అనుమతించడం లేదు. తామర భరణి నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఆ తీరం వెంబడి గ్రామాలమధ్య సంబంధాలు తెగాయి. అనేక ఆలయాలు నీట మునిగి ఉన్నాయి. రామనాథపురం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. రామేశ్వరంలో గాలి ప్రభావానికి 30 పడవలు దెబ్బతిన్నాయి. కడలూరు జిల్లాలో అయితే, అతి పెద్ద చెరువుగా ఉన్న వీరానం నిండింది. ఉబరి నీటి విడుదలతో అనేక గ్రామాల్లోని పంట పొల్లాలు మునిగాయి. డెల్టాలోని తిరువారూర్, తంజావూరు, నాగపట్నం, అరియలూరు, పెరంబలూరు, పుదుకోట్టై జిల్లాల్లో అయితే, అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. వరి సాగులో అన్నదాత నిమగ్నమై ఉన్న దృష్ట్యా, వర్షం కారణంగా పొలాలన్నీ చెరువుల్ని తలపించే పరిస్థితి. భారీ వర్షాలు, పలువురు మృతి మరోవై ఈ వర్షాలతో నిన్నటి పది మంది ఇప్పటి వరకు మరణించారు. శుక్రవారం ఇళ్లు కూలడంతో కడలూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. శని, ఆదివారాల్లో కురిసిన వర్షాలకు మరో ఏడుగురు బలి అయ్యారు. తంజావూరులో ఇంటి గోడ కూలడంతో దురై కన్ను(70), పుదుకోట్టైలో మోటార్ సైకిల్‌తో పాటు వరదల్లో కొట్టుకెళ్లి ఓ యువకుడు గల్లంతయ్యాడు. చెన్నై అంబత్తూరులో రోడ్డుపై తవ్విన గోతిలో వర్షంపు నీరు చేరడంతో అది తెలియక అటు వైపుగా వచ్చిన షేక్ అలీ అందులోపడి విగతజీవి అయ్యాడు. తిరునల్వేలిలో తామరభరణిలో 81 ఏళ్ల వృద్ధుడు కొట్టుకెళ్లాడు. ఇక, కడలూరు, నాగపట్నంలలో కల్వర్టులను దాటుతూ వరద ఉదృతిలో మరో ముగ్గురు కొట్టుకెళ్లారు. వీరి జాడ కాన రాలేదు. మరణించి ఉంటారని నిర్ధారించిన పోలీసులు, మృతదేహాల కోసం గాలిస్తున్నారు. మంత్రుల పరుగు.. వర్షం మరో రెండు రోజులు కొనసాగనున్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించడంతో అధికార వర్గాలు మరింత అప్రమత్తం అయ్యాయి. వర్షం బీభత్సంగా పడుతుండడంతో మంత్రులు అందరూ తమ తమ జిల్లాలకు చెన్నై నుంచి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. అధికార వర్గాలతో కలిసి సహాయక చర్యల్లో మునిగి ఉన్నారు. ఇక, ఈ వర్షం రూపంలో పెను విపత్తు అన్నది చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యల్ని మరింత విస్తృతం చేయాలని జిల్లాల కలెక్టర్లకు సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. అలాగే, సోమవారం సచివాలయంలో సీఎం పళనిస్వామి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ఇక, వర్షాల ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్టు ఆదేశాలు జారీ చేశారు. కాగా, వర్షం ప్రభావిత ప్రాంతాల్లో పార్టీ వర్గాలు సహాయక చర్యల్లో నిమగ్నం కావాలని, బాధితులకు అండగా నిలవాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. విమాన సేవలకు ఆటంకం వర్షం కారణంగా చెన్నైలో విమాన సేవలకు ఆటంకాలు నెలకొన్నాయి. కుండపోతగా విమానాశ్రయ పరిసరాల్లో ఉదయాన్నే వర్షం పడింది. దీంతో ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, బెంగళూరు వైపుగా వెళ్లాల్సిన అనేక విమానాలు టేకాఫ్ చేసుకునేందుకు ఇబ్బందులు నెలకొన్నాయి. దీంతో కాస్త ఆలస్యంగా ఈ విమానాలు బయలుదేరాయి. అలాగే, సింగపూర్, దోహా, దుబాయ్, బక్రెయిన్‌లకు బయలుదేరాల్సిన విమానాలు గంటన్నర ఆలస్యంగా టేకాఫ్ చేసుకున్నాయి. చెన్నై నుంచి కోలాలంపూర్ బయలుదేరిన విమానం టేకాఫ్ చేసుకున్న కాసేపటికి సాంకేతిక లోపం కారణంగా ల్యాండింగ్‌ను అనుమతించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ విమానాన్ని బెంగళూరుకు దారిమళ్లించారు. అలాగే, కొలంబోకు బయలుదేరాల్సిన విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపానికి గురైంది. దీంతో ఆ విమానం మూడు గంటల సేపు ఆలస్యంగా బయలుదేరింది. ఈ కారణాలతో ఆదివారం చెన్నైలో విమాన సేవలకు ఆటంకాలు నెలకొన్నాయి. అలాగే, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. -
ఆ ఉద్యోగం కోసం వేలమంది ఇంజనీర్లు క్యూ
కోయంబత్తూరు : తమిళనాడు, కోయంబత్తూరు నగర కార్పొరేషన్లో వందల సంఖ్యలో ఉన్న శానిటరీ కార్మికుల పోస్టుల భర్తీకోసం ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు (బీఎస్సీ, ఎంఎస్సీ,ఎంకామ్,)వేలకొద్దీ ఎగబడిన వైనం నిరుద్యోగ భారతానికి అద్దం పట్టింది. కార్పొరేషన్‌లోని 549 శానిటరీ కార్మికుల పోస్టులకు అధికారులు దరఖాస్తులను ఆహ్వానించారు. దీంతో మొత్తం 7 వేల మంది ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు దరఖాస్తు చేసుకోవడం విశేషం. గ్రేడ్ -1 శానిటరీ పోస్టుల కోసం పిలుపునివ్వగా వేల దరఖాస్తులు వచ్చి పడ్డాయని కార్పొరేషన్ అధికారులు స్వయంగా ప్రకటించారు. ఈ ఉద్యోగాల కోసం నిన్న(బుధవారం) ప్రారంభమైన మూడు రోజుల ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల ధృవీకరణ కార్యక్రమంలో 7వేల మంది దరఖాస్తుదారులు హాజరైనట్లు కార్పొరేషన్ అధికారిక వర్గాలు తెలిపాయి. దాదాపు 70 శాతం మంది అభ్యర్థులు ఎస్ఎస్ఎల్సి, కనీస అర్హత పూర్తి చేసినవారు కాగా, వీరిలో ఎక్కువ మంది ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు ఉన్నారని వారు తెలిపారు. వీరిలో ఇప్పటికే ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగం చేస్తున్నవారు కూడా ఉన్నారు. అలాగే గత పదేళ్లుగా కాంట్రాక్ట్ శానిటరీ కార్మికులుగా పనిచేస్తున్న వారు కూడా ఈ శాశ్వత ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రతిదీ ఒక వృత్తి కాబట్టి శానిటరీ వర్కర్‌గా పనిచేయడంలో పెద్దగా సిగ్గు లేదనీ బిఇ మెకానికల్ గ్రాడ్యుయేట్ ఎస్ విఘ్నేష్ అన్నారు. తల్లి, తమ్ముళ్లను పోషించుకోవాల్సి వుంది. అందుకే ఈ ఇంటర్వ్యూకి వచ్చానన్నారు. బీకామ్ గ్రాడ్యుయేట్ అయిన పూవిజి మీనా, ఎంకామ్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె భర్త ఎస్ రాహుల్, ఇంటర్వ్యూలో ఎంపికైతే తాము శానిటరీ కార్మికులుగా పనిచేయడానికి అభ్యంతరం లేదని ఈ జంట తెలిపింది. అలాగే 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ శానిటరీ వర్కర్‌గా పనిచేస్తున్న పి ఈశ్వరి మాట్లాడుతూ, కార్పొరేషన్ చాలా సంవత్సరాల తరువాత ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నందున పర్మినెంట్ జాబ్ కోసం చూస్తున్నానని చెప్పారు. ఈ ఉద్యోగాలకు కనీస విద్యార్హత 10వ తరగతి. ప్రారంభ జీతం రూ .15,700. పొద్దున మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు పని గంటలు. ఈ మధ్యలో ఉన్న విశ్రాంతి సమయంలో ఇతర చిన్న పనులు చేసుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది. ఇదే ఉద్యోగార్థులను ఆకర్షించినట్టు అధికారులు భావిస్తున్నారు. కాగా నగర కార్పొరేషన్లో 2,000 మంది పర్మినెంట్, 500 మంది కాంట్రాక్ట్ శానిటరీ కార్మికులు పనిచేస్తున్నారు. -
రాజేశ్వరి కుడికాలికి 7 గంటల శస్త్రచికిత్స
సాక్షి, చెన్నై : అధికార పార్టీ జెండా స్తంభం కారణంగా అనురాధ రాజేశ్వరి అనే మహిళ కాళ్లపై నుంచి లారీ దూసుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎడమ కాలు మోకాలు కింది భాగం మొత్తాన్ని తొలగించగా, రాజేశ్వరి కుడికాలికి మంగళవారం వైద్యులు ఏడు గంటల సేపు శస్త్రచికిత్స చేశారు. కాగా కోయంబత్తూరు సింగానల్లూరుకు చెందిన నాగనాధన్ కుమార్తె రాజేశ్వరి గత 11వ తేదీన పీలమేడు ప్రాంతంలో మొపెడ్‌లో వెళుతుండగా అన్నాడీఎంకే జెండా స్తంభం కూలడంతో అదే సమయంలో వస్తున్న లారీ కిందపడి గాయపడింది. ఆమెను నీలాంబూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్సలందించారు. అక్కడ ఎడమకాలికి ఇన్ఫెక్షన్ ఏర్పడటంతో ఆ కాలును మోకాలి వరకు తొలగించారు. ఇలావుండగా రాజేశ్వరి కుడి కాలులో శస్త్రచికిత్స చేసి రాడ్స్ అమర్చేందుకు వైద్యులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన శస్త్రచికిత్స నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు 7 గంటలపాటు సాగింది. ఎడమకాలి గాయం పూర్తిగా నయమైన తర్వాత ఆమెకు కృత్రిమ కాలును ఏర్పాటుచేయనున్నట్లు వైద్యులు వెల్లడించారు. -
అయ్యో పాపం అనురాధ.. కాలు తీసేశారు
చెన్నై : తమిళనాడులో అధికార పార్టీ శ్రేణుల అత్యుత్సాహం కారణంగా ప్రమాదం బారిన పడిన మహిళ తన కాలును కోల్పోయింది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలి ఎడమ కాలు మోకాలు కింది భాగం మొత్తాన్ని తొలగించినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆమె కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా మారింది. అధికార పార్టీ జెండా స్తంభం కారణంగా అనురాధ రాజేశ్వరి అనే మహిళ కాళ్లపై నుంచి లారీ దూసుకుపోయిన విషయం తెలిసిందే. ఆఫీసుకు స్కూటీపై వెళ్తున్న క్రమంలో కోయంబత్తూరు హైవే మీదకు చేరుకున్న అనురాధ.. అన్నాడీఎంకే పార్టీ జెండా కట్టేందుకు ఉపయోగించిన స్తంభం మీద పడటం గమనించింది. దానిని తప్పించబోయి కిందపడిపోయింది. అప్పుడే ఎదురుగా వస్తున్న లారీ ఆమె కాళ్ల మీద నుంచి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన ఈ ఘటనలో ఆమె రెండు కాళ్లకు గాయాలు కాగా ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆమె ఎడమ కాలిని తొలగించినట్లు ఆస్పత్రి వైద్యులు శనివారం తెలిపారు. దీంతో తమ ఒక్కగానొక్క కూతురు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంటూ అనురాధ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జీవనాధారంగా ఉన్న కూతురి దుస్థితికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.(చదవండి : యువతి కాళ్లపై నుంచి దూసుకెళ్లిన లారీ..) కాగా అనురాధ ఉదంతంతో తమిళనాట బ్యానర్లు, ఫ్లెక్సీల వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. గతంలో ఇదే తరహాలో శుభశ్రీ అనే టెకీ ప్రమాదం బారిన పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆమె తీవ్రగాయాలపాలై మరణించడంతో అన్నాడీఎంకేపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక తాజా ఘటనకు లారీ డ్రైవర్ అతి వేగమే కారణమని పోలీసులు చెబుతుండగా.. అనురాధ కుటుంబ సభ్యులు మాత్రం ముఖ్యమంత్రి పళనిసామికి స్వాగతం పలికేందుకు అన్నాడీఎంకే కార్యకర్తలు ఏర్పాటు చేసిన జెండానే కారణమని ఆరోపిస్తున్నారు. లారీ డ్రైవర్‌పై కేసు బనాయించి అధికార పార్టీ నాయకులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. -
పట్టాలపై చితికిపోయిన ఇంజనీరింగ్ విద్యార్థులు
కోయంబత్తూర్: రైలు కింద పడి నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందిన ఘటన కోయంబత్తూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అయిదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు బుధవారం రాత్రిపూట రైలు పట్టాలపై కూర్చున్నారు. అదే సమయంలో వేగంగా వచ్చిన చెన్నై-అలాప్పుజా ఎక్స్‌ప్రెస్ రైలు వారిపై నుంచి వెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మరణించగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. కోయంబత్తూరు దగ్గరలోని సూలూరు బ్రిడ్జ్ దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలంలో దొరికిన మందు బాటిళ్లు, ప్లాస్టిక్ కప్పులు ఆధారంగా వారు మద్యం సేవించడానికి పట్టాలపైకి వెళ్లినట్లు తెలుస్తోంది. మృతులు స్థానిక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు సిద్దిఖ్ రాజా(22), రాజశేఖర్ (20), గౌతమ్(23), కరుప్పసామీ(24)లుగా గుర్తించారు. వీరితోపాటు అక్కడే ఉన్న మరో విద్యార్థి విగ్నేశ్ తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలయ్యాడు. గౌతమ్, కరుప్పసామీ 2018లోనే ఇంజనీరింగ్ పూర్తవగా పరీక్షల కోసం నగరానికి వచ్చారు. రాజశేఖర్ మూడో సంవత్సరం, మిగతా ఇద్దరు నాలుగో సంవత్సరం చదువుతున్నారు. పరీక్ష రాసిన అనంతరం రౌతర్ పాలెంకు వెళ్లగా రైలు ప్రమాదంలో విగతజీవులుగా మారారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
యువతి కాళ్లపై నుంచి దూసుకెళ్లిన లారీ..
చెన్నై : తమిళనాట బ్యానర్లు, ఫ్లెక్సీల వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. అధికార పార్టీ జెండా స్తంభం కారణంగా ఓ యువతి కాళ్లపై నుంచి లారీ దూసుకుపోయింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన సదరు యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విచారకర ఘటన కోయంబత్తూరులో చోటుచేసుకుంది. వివరాలు... అనురాధ రాజేశ్వరి(30) అనే ఓ ప్రముఖ సంస్థలో బిజినెస్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం విధుల నిమిత్తం స్కూటర్‌పై ఆఫీసుకు బయల్దేరింది. కాగా కోయంబత్తూరు హైవే మీదకు వెళ్లగానే అన్నాడీఎంకే పార్టీ జెండా కట్టేందుకు ఉపయోగించిన స్తంభం మీద పడటం గమనించిన రాజేశ్వరి దానిని తప్పించబోయి కిందపడిపోయింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న లారీ ఆమె కాళ్లపై నుంచి దూసుకుపోయింది. దీంతో రాజేశ్వరి రెండు కాళ్లు పూర్తిగా విరిగిపోయాయి. ప్రస్తుతం ఆమెకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనపై రాజేశ్వరి బంధువులు అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజేశ్వరి అమ్మానాన్నాలకు తను ఒక్కగానొక్క కూతురు అని... ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుందని తెలిపారు. తనకు ఈ పరిస్థితి రావడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి పళనిసామికి స్వాగతం పలికేందుకు అవినాశి హైవేపై పెట్టిన జెండా స్తంభం కారణంగానే ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా లారీ డ్రైవర్ అధిక వేగంతో దూసుకురావడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా గతంలో ఇదే తరహాలో శుభశ్రీ అనే టెకీ ప్రమాదం బారిన పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆమె తీవ్రగాయాలపాలై మరణించడంతో అన్నాడీఎంకేపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన నేపథ్యంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మద్రాసు హైకోర్టు బ్యానర్లు, ఫ్లెక్సీలు నిషేధానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు శుభశ్రీ కేసులో నిందితుడిగా ఉన్న అన్నాడీఎంకే నాయకుడు జయగోపాల్‌కు సోమవారమే బెయిలు మంజూరుకావడం గమనార్హం. -
ప్యాడ్ గర్ల్
కోయంబత్తూరులోని గణపతి ప్రాంతానికి వెళ్లి ఇషానా గురించి అడిగారంటే వెంటనే ‘ఆనా క్రియేషన్స్ ఆనా క్లాత్ ప్యాడ్స్’ దుకాణం చూపిస్తారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ప్రఖ్యాత ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలూ గుర్తెరగగలిగిన పద్దెనిమిదేళ్ల ఇషానా గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే చిరుపారిశ్రామికవేత్తగా ఆమెకు తెలియకుండా ఆమె చేత పరిస్థితులు వేయించిన తొలి అడుగులలోకి వెళ్లాలి. ముస్లిం మధ్య తరగతి కుటుంబంలో పుట్టింది ఇషానా. 2018లో ప్లస్ టూ వరకు కోయంబత్తూరులోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పుడే ప్యాషన్ డిజైనింగ్ లో భాగంగా మిషన్ కుట్టడం నేర్చుకుంది. అదే సమయం పర్యావరణ పరిరక్షణకు పనిచేసిన బృందంలో సభ్యురాలిగా ఉంది. ఆమె ఆర్థిక స్తోమత ఉన్నత చదువులకు వెళ్లకుండా ఆమెను అడ్డుకోవడమే కాకుండా.. ప్రతి యువతికి యవ్వనంలో నెలసరికి అవసరమయ్యే శానిటరీ ప్యాడ్స్ కొనుగోలుకూ అవరోధం అయింది. అదే ఆమెలో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టేలా చేసింది. నాటి తరంలో ఆడవారు క్లాత్ ద్వారానే నెలసరిని ఎదుర్కొనటం, వాటి కారణంగా పర్యావరణానికి కూడా ఎటువంటి నష్టం వాటిల్లక పోవటంపై ఇషానా పలు ఆర్టికల్స్ తిరగేసేలా చేసింది. చివరికి ఇషానా చేత క్లాత్ ప్యాడ్ నాప్కిన్స్ తయారికీ నాంది పలికించింది. నాన్న దాచిన డబ్బే పెట్టుబడి స్థానికంగా కాటన్ మిల్స్ లో దొరికే పల్చటి పాప్లిన్ క్లాత్ పీస్ ద్వారా ప్యాడ్స్ తయారు చేసి వాటిని మధ్యలో పెట్టి వాషబుల్ నాప్కిన్స్ తయారు చేయటం మొదలు పెట్టింది ఇషానా. ముందుగా తాను వాడి చూసి, తన స్నేహితులు, ఇరుగు పొరుగు వారి వినియోగానికి అందించింది. వారి నుంచి వచ్చిన సానుకూల స్పందన ఇషానాలో ఆత్మవిశ్వాసం పెంచేలా చేసింది. దాంతో తన ప్రాడక్ట్‌ని మార్కెట్ లోకి విడుదల చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఆర్థికంగా సహాయం చేసే వారు లేకపోవటంతో పెట్టుబడి కోసం తన తల్లిదండ్రులను డబ్బు అడిగింది. ఇస్మాయిల్, సబీనా ఓ ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగులు. అయినప్పటికీ కూతురి ఆసక్తి, ప్రతిభ గమనించిన తండ్రి ఆమె పెళ్లి కోసం దాచిన నాలుగు లక్షలు ఇషానా చేతిలో పెట్టాడు. తండ్రి నమ్మకమే పెట్టుబడిగా తన ఇంటిపక్కనే ఉన్న ఒక షాపును అద్దెకు తీసుకుని ఐదు కుట్టు మిషన్లు కొనుగోలు చేసి పది మంది మహిళల సాయంతో గత మే నెలలో వాషబుల్ (ఉతికి వాడే) నాప్కిన్స్ తయారీ మొదలు పెట్టింది. రెండునెలల క్రితం వరకు కోయంబత్తూరు నగరానికే పరిమితమైన ఈ న్యాప్కిన్ల అమ్మకాలు ఆన్లైన్ తోపాటు, తమిళనాడులోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. వంద మందికి ఉపాధి! ఆరంభంలో రోజుకు వందల సంఖ్యలో తయారీతో సరిపెట్టుకున్న ఇషానా.. ఇప్పుడు వేల ప్యాడ్స్ తయారీలో చిన్నపారిశ్రామికవేత్తగా మారింది. ప్రస్తుతం ఇషానా దగ్గర ఇరవై మంది మహిళలు పని చేస్తుండగా బయట నుండి సుమారు ఎనభై మంది మహిళలు రోజుకు అరవై నుండి డెబ్భై ప్యాడ్స్ కుట్టి ఆమెకు అందిస్తున్నారు. వాటి ద్వారా ప్రతి మహిళకు ఉపాధితోపాటు రోజుకు 400–500 రూపాయలు ఇంటి నుండే సంపాదించుకునే అవకాశం లభిస్తోంది. ఒకవైపు వందకుపైగా మహిళలకు ఉపాధి, మరోవైపు చిన్న తరహా పరిశ్రమతో పద్దెనిమిదేళ్ల వయస్సులో యువ పారిశ్రామికవేత్తగా ఇషానా ఇప్పుడు కోయంబత్తూరు నగరానికి గర్వకారణంగా నిలుస్తోంది. ఈ విషయమై ఇషాను కదిలిస్తే నిండుగా నవ్వుతుంది. ‘‘ఇది నాపై నమ్మకం పెట్టుకున్న నా తల్లిదండ్రుల విజయం’’ అంటుంది. తన ఉత్పత్తికి పేటెంట్ హక్కేమీ తీసుకోలేదని, ఎవరైనా తన వద్దకు వస్తే తయారీ విధానం నేర్పుతానని అంటోంది. – సంజయ్ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధి సాక్షీ టీవీ, చెన్నైబ్యూరో -
వైరల్: క్షణాల్లో.. ఆయన లేకుంటే చచ్చేవాడే!
చెన్నై : ఓ ఆర్పీఎఫ్ పోలీసు అప్రమత్తత ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. క్షణాల కాలంలో జరిగిపోయిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. శనివారం తమిళనాడులోని కోయంబత్తూర్ రైల్వేస్టేషన్లో ఓ వ్యక్తి రన్నింగ్‌లో ఉన్న రైలులోకి ఎక్కాడు. అయితే పట్టుతప్పి రైలునుంచి జారాడు. ఆ వెంటనే రైలు హ్యాండిల్‌ను పట్టుకుని వేళాడాడు. ఇంకొద్ది క్షణాలు ఉంటే రైలు, ఫ్లాట్‌ఫాం మధ్య ఉన్న సందులో పడి అయిపోయేవాడే. కానీ, అదే సమయానికి అటుగా వస్తున్న ఓ ఆర్పీఎఫ్ పోలీసు క్షణాల్లో అతడ్ని లోపలికి తోశాడు. ఆ వ్యక్తి బతుకుజీవుడా అంటూ ఊపిరిపీల్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఆ పోలీసు అధికారి అప్రమత్తతకు నెటిజన్లు జోహార్లు చేస్తున్నారు. రియల్ హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. -
కోవైలో ఎన్ఐఏ సోదాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో శ్రీలంక పేలుళ్ల ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడి పేలుడు సంఘటనలతో సంబంధాలున్నట్లు సందేహిస్తున్న కోయంబత్తూరుకు చెందిన ఐదుగురికి చెందిన ఇళ్లు, పుస్తకాల దుకాణంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు గురువారం తనిఖీలు చేశారు. శ్రీలంకలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈస్టర్ పండుగ రోజున క్రైస్తవ ప్రార్థనామందిరాలు, స్టార్ హోటళ్లలో బాంబు పేలుళ్లు చోటుచేసుకోగా సుమారు 200 మందికి పైగా మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఐఎస్ఐ తీవ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడినట్లు విచారణలో తేలింది. జహరాన్ ఐఎస్ఐ తీవ్రవాది అనే ఇందుకు ప్రధాన సూత్రధారి అని కూడా అధికారులు గుర్తించారు. అతనితో వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా కోయంబత్తూరుకు చెందిన కొందరు సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలడంతో ఎన్ఐఏ అధికారులు వారిపై తీవ్రస్థాయిలో ఇటీవల నిఘా పెట్టారు. జూన్‌లో కోయంబత్తూరులో ఎనిమిది చోట్ల ఎన్ఐఏ అధికారులు మెరుపుదాడులు నిర్వహించి మహమ్మద్ అజారుద్దీన్, అక్రంజిందా, షేక్ ఇదయతుల్లా, అబూబకర్, సదాం హుస్సేన్, ఇబ్రహీం ఇళ్లు, అజారుద్దీన్‌కు చెందిన ట్రావెల్స్ కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మహమ్మద్ అజారుద్దీన్ కార్యాలయం నుంచి ముఖ్యమైన డాక్యుమెంట్లు, సెల్ఫోన్లు, సిమ్ కార్డులు, పెన్‌డ్రైవ్‌లు, మెమొరీకార్డులు, సీడీ, డీవీడీలు, నిషేధిత పోస్టర్లు, కరపత్రాలు స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు. మిగతావారిపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. వీరి నుంచి సేకరించిన సమాచారంతో కోయంబత్తూరులో మరో మూడుచోట్ల తనిఖీలు నిర్వహించారు. షాజహాన్, షబీబుల్లా, మహమ్మద్ హుస్సేన్ అనే వ్యక్తుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహించగా పలు డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. అరెస్టయిన అజారుద్దీన్ వద్ద జరిపిన విచారణలో కోయంబత్తూరు ఉక్కిడం జీఎంనగర్ మసీదు వీధికి చెందిన సదాం హుస్సేన్‌కు తీవ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు తేలింది. దీంతో అతనికి కూడా సమన్లు పంపి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు సద్దాం హుస్సేన్ ఇంటిలో తనిఖీలు చేశారు. కేరళ రాష్ట్రం కొచ్చికి చెందిన 25 మంది ఎన్ఐఏ అధికారుల బృందం కోయంబత్తూరు పోలీసుల సహకారంతో గురువారం తెల్లవారుజాము 5 గంటల సమయంలో సదాం హుస్సేన్‌తోపాటు పలువురు అనుమానితుల ఇళ్లలోకి అకస్మాత్తుగా ప్రవేశించి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు ఉదయం 10.30 గంటల వరకు సాగాయి. ఇదిలా ఉండగా, చెన్నైకల్పాక్కం సమీపం కూవత్తూరు గుండమనిచ్చేరి గ్రామానికి చెందిన సూర్య (22) ఈనెల 23వ తేదీన తిరుప్పోరూరులోని తన మేనమామ ఇంటికి వచ్చినపుడు తన స్నేహితులు దిలీప్రాఘవన్ (24), తిరుమాల్ (24), యువరాజ్ (27) జయరామన్ (26), విశ్వనాథన్ (24)లతో కలిసి 24వ తేదీన అక్కడి గంగై అమ్మన్ ఆలయ కొలను పూడిక తీశారు. అదేరోజున దిలీప్ జన్మదినం కావడంతో ఆలయ పరిసరాల్లో కేక్ కట్ చేసి సంబరం చేసుకున్నారు. ఈ సమయంలో అక్కడ కనపడిన వస్తువులను చేతికి తీసుకుని తెరుస్తుండగా అది పేలడంతో సూర్య, దీలీప్ రాఘవన్ దారుణంగా మరణించారు. అలాగే చెంగల్పట్లు సమీపంలోని ఒక చెరువులో బాంబు బయటపడింది. సైనికులు, ఐపీఎస్ అధికారులకు అక్కడికి సమీపంలోని మైదానంలో తుపాకీపై శిక్షణ ఇస్తున్నందున వారిని లక్ష్యంగా చేసుకునే ఈ బాంబు అమర్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ వరుసలో గురువారం హనుమంతపురం చెరువులో ఒక ఆవు మేతమేస్తుండగా భారీఎత్తున పేలుడు పదార్థాలు బైటపడడంతో పోలీసులు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. కాగా, పుళల్ జైలు సూపరింటెడెంట్‌పై గురువారం దాడియత్నానికి దిగిన ఇద్దరు తీవ్రవాదులపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
అలా రూ. 2 కోట్లు కొట్టేశాడు
సాక్షి, చెన్నై : అదను, పదును చూసి యజమాని ఇంటికే కన్నం వేసాడో ప్రబుద్ధుడు. యజమాని శైలేష్ ఇతిరాజ్ ఇంట్లో లేని సమయంలో ఆ ఇంటి పనిమనిషి , జార్ఖండ్‌కు చెందిన బికాష్ కుమార్ రాయ్ రూ.18 లక్షల నగదుతో సహా, విలువైన ఆభరణాలను కొట్టేశాడు. యజమాని అందించిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరికి అతని ఆట కట్టించారు. శైలేష్ కుటుంబంతో సహా ఊరు వెళ్లడాన్ని అదనుగా భావించిన పనివాడు బికాష్ కుమార్ రాయ్ 18 లక్షల నగదుతోపాటు బంగారు ఆభరణాలు, వజ్రాల నగలు దోచుకుని పరారయ్యాడు. మొత్తం విలువ రూ.2.07 కోట్లకు పైమాటే. దీంతో జూలై 31న పోలీసులకు ఫిర్యాదు చేశారు శైలేష్. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. బికాష్ జూలై 29న ఎర్నాకుళం-పాట్నా రైలు ఎక్కాడని రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ప్రత్యేక పోలీసు బృందం పాట్నాకు వెళ్లి మరీ శుక్రవారం అర్థరాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌చేసి, సెంట్రల్ జైలుకు తరలించారు. -
ఘోర ప్రమాదం : ఐదుగురి మృతి
-
ఘోర ప్రమాదం : ఐదుగురి మృతి
సాక్షి, కోయంబత్తూరు : కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 12 మంది ప్రయాణిస్తున్న వ్యాన్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. గాయపడ్డవారి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులంతా కోయంబత్తూరు వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు.