పెంపుడు కుక్క మృతితో విషాదం | Pet hospital in Coimbatore booked over dog’s death | Sakshi
Sakshi News home page

పెంపుడు కుక్క మృతితో విషాదం

Published Wed, Nov 27 2024 8:12 AM | Last Updated on Wed, Nov 27 2024 8:19 AM

Pet hospital in Coimbatore booked over dog’s death

కోవైలో తల్లడిల్లిన కుటుంబం  

సేలం: కోవైలో కౌండంపాళయంకు చెందిన శరత్‌(30) ప్రైవేటు సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఇతని తల్లిదండ్రులు గుణశేఖరన్, కుమారి,  శరత్‌ చెల్లెలు శృతి. వీరి ఇంట్లో 11 సంవత్సరాలుగా పమేరియన్‌ జాతికి చెందిన శునకం సంజూను పెంచుకుంటున్నారు. ఈ స్థితిలో శరత్‌ చెల్లెలు శృతికి వివాహ ఏర్పాట్లు చేపట్టారు. 

ఈమెకు గత 22వ తేది కోవైలో నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో ఇంటిలో వివాహ కార్యక్రమాలు ఉండడంతో ఇంట్లో ఉన్న కుక్కను చూసుకునే వీలు లేకపోయింది. దీంతో మేట్టుపాళయం రోడ్డలో ఉన్న జంతు ఆస్పత్రిలో ఒక రోజు మాత్రమే ఉంచి చూసుకోవాలని కోరారు. అక్కడ 21వ తేదీ  ఉదయం వదిలి వెళ్లారు. ఒక్క రోజు సంజూను చూసుకోవడానికి రూ.1,200 ఇచ్చి వెళ్లారు. ఆ కుక్కను వైద్యులు సురేంద్రన్, గోపి పర్యవేక్షించడానికి తీసుకున్నారు. 

ఈ స్థితిలో అదే రోజు సాయంత్రం  డాక్టర్‌లు శరత్‌కు ఫోన్‌ చేసి కుక్క అనారోగ్యంతో ఉన్నట్టు తెలిపారు. హుటాహుటిన అక్కడికి వెళ్లి చూడగా ఆ కుక్క మృతి చెందినట్టు తెలిసింది. ఈ విషయంపై శరత్‌ సాయిబాబా కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా ఆస్పత్రికి వెళ్లిన శరత్‌ కుటుంబీకులు తాము పెంచుకున్న శునకం మృతదేహాన్ని చూసి బోరున విలపించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అవుతున్నాయి.    



 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement