
ప్రతీకాత్మక చిత్రం
కోయంబత్తూరు: బ్లాక్ ఫంగస్ కారణంగా అనారోగ్యంపాలైన 264 మంది పేషెంట్లలో 30 మందికి ఒక్క కన్ను చూపు పూర్తిగా పోయిందని స్థానిక ప్రభుత్వాస్పత్రి వర్గాలు తెలిపాయి. కరోనా సోకి తగ్గిన అనంతరం కొంతమందికి బ్లాక్ ఫంగస్‌గా పిలిచే మ్యూకోర్‌మైకోసిస్ సోకుతున్న సంగతి తెలిసిందే! ఇలా సోకి ఆస్పత్రిలో చేరినవారందరికీ ఎండోస్కోపీ చేశామని, 110మందికి చూపు తెప్పించే శస్త్ర చికిత్స చేశామని డా. నిర్మల చెప్పారు. అయితే 30 మంది పేషెంట్లలో ఈ ఫంగస్ తీవ్ర ప్రభావం చూపడంతో ఒక కన్ను చూపు పూర్తిగా పోయిందన్నారు. అయితే బ్లాక్ ఫంగస్ సోకిన తొలినాళ్లలో వచ్చినవారందరికీ నయమైందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment