Eyesight
-
బాధపడకమ్మా.. నేనున్నా: సీఎం జగన్
బత్తలపల్లి: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అదే గ్రామానికి చెందిన నాగలక్ష్మి, ఆమె కుమారుడు అనుదీప్‌కుమార్‌రెడ్డి కలిశారు. చదువులో రాణిస్తున్న తన కుమారుడు అనుదీప్‌కు ఉన్నట్టుండి కంటిచూపు పోయిందని ముఖ్యమంత్రికి నాగలక్ష్మి తెలియజేసింది. ప్రస్తుతం డిగ్రీ సెకండియర్ చదువుతున్న అనుదీప్ యూట్యూబ్‌లో పాఠాలు వింటూ.. తోటి విద్యార్థి సహకారంతో పరీక్షలు రాస్తున్నాడని తెలిపింది. తన కుమారుడికి కంటి చూపు వచ్చేందుకు తగిన సాయం చేసి ఆదుకోవాలని వేడుకుంది. అర్జీ స్వీకరించిన సీఎం జగన్ స్పందిస్తూ.. బాధపడకమ్మా.. ఆదుకుంటానంటూ భరోసా ఇచ్చారు. కాగా, అర్జీ ఇచ్చిన అరగంటలోనే ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల నుంచి నాగలక్ష్మికి ఫోన్ వచ్చింది. అనుదీప్ ఆరోగ్య పరిస్థితి, కంటి ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు, ఆస్పత్రి తదితర వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. -
కళ్లల్లో ఎర్రటి మచ్చలు కనిపిస్తున్నాయా? బీపీ చెక్ చేసుకున్నారా?
హై బీపీ లేదా హైపర్ టెన్షన్... ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న ముఖ్య ఆరోగ్య సమస్య. ఒకరకంగా చెప్పాలంటే ఇది సైలెంట్ కిల్లర్ కూడా. ఎందుకంటే బీపీ అదుపులో లేకపోతే నేరుగా గుండెపైనే ప్రభావం పడుతుంది. గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీపీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం, హెచ్చు తగ్గులుంటే తగిన మందులు వాడటం అవసరం. ఎందుకంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, ఇది చాప కింది నీరులా అంతర్గత అవయవాలపై తీవ్ర దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది. రక్తపోటు ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉప్పు తగ్గించడం వాటిలో ముఖ్యమైనది. అధిక రక్తపోటును గుర్తించడానికి ఉత్తమ మార్గం క్రమం తప్పకుండా బీపీ చెక్ చేయించుకోవడం. రక్తపోటు ఎక్కువగా ఉంటే కొన్ని లక్షణాలు బయటపడతాయి. కళ్ళల్లో కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఎలాంటి లక్షణాలు? రక్తపోటు అధికమైతే మీ కళ్ళల్లో ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. ఇది రక్తనాళాల విచ్ఛిన్నం వల్ల జరుగుతుంది. కళ్ళు ఎర్రగా కనిపిస్తే బీపీ చెక్ చేసుకోవడం చాలా అవసరం. అధిక రక్తపోటు వల్ల దృష్టి సమస్యలు కూడా వస్తాయి. అందువల్ల కళ్లు ఎర్రగా కనిపిస్తుంటే ఓసారి బీపీ చెక్ చేయించుకోవాలని గుర్తుంచుకోండి. కళ్ళల్లో కనిపించే ఈ సంకేతాలు కాకుండా బీపీ అధికమైనప్పుడు మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి ఏమిటంటే ... ►ఛాతీలో నొప్పి పెట్టడం ► శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడం ► మూత్రంలో రక్తం కనిపించడం ►ఛాతీ, మెడ, చెవుల్లో ఇబ్బందిగా అనిపించడం ► తలనొప్పి తీవ్రంగా రావడం ► చిన్న చిన్న పనులు చేసినా తీవ్రమైన అలసట. -
ఈ దారుణానికి బాధ్యులెవరు?
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో మూడ్రోజుల క్రితం టీడీపీ నేతల మారణహోమ పథకం బెడిసికొట్టినా.. వాళ్లు చేసిన గాయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇప్పటికే ఏఎస్పీ, డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలతో సహా 27 మంది గాయపడ్డ ఈ ఘటనలో.. సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన రణధీర్ అనే స్పెషల్ పార్టీ పోలీస్ (ఎస్టీఎఫ్) కానిస్టేబుల్ మాత్రం తన కంటిచూపును కోల్పోయారు. మరో కన్ను కనిపిస్తున్నా చూపు కోల్పోయే ప్రమాదముందని వైద్యులు చెప్పడం కంటనీరు తెప్పిస్తోంది. ప్రస్తుతం తిరుపతి అరవింద కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రణ్‌ధీర్ గురించి ‘సాక్షి’ సేకరించిన వివరాలు.. అనంతపురానికి చెందిన రణధీర్ ఖాకీ యూనిఫామ్‌పై ఉన్న ఆసక్తితో 2013లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. సత్యసాయి జిల్లాలో ఉద్యోగం చేస్తూ ఈనెల 3 నుంచి చంద్రబాబు పర్యటనలో తన సహచరులతో కలిసి పుంగనూరులో బందోబస్తు డ్యూటీకి వచ్చారు. నాలుగో తేదీ శుక్రవారం టీడీపీ కిరాయి సేనలు మద్యం మత్తులో పోలీసులపై చెప్పులు, బాటిళ్లు విసురుతున్నారు. విధుల్లో ఉన్న రణధీర్, ఇతర పోలీసులు తమ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టీడీపీ కార్యకర్తలను సర్దిచెప్పి పంపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఒక్కసారిగా అల్లరిమూకలు రాళ్లతో దాడిచేయడంతో రణధీర్ బృందం వెనక్కు వచ్చేసింది. ఉన్నతాధికారులకు దెబ్బలు తగలకుండా అడ్డుగా నిలిచారు. ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు రాళ్లు, మద్యం బాటిళ్లు, టపాకాయ బాంబులు విసురుతున్నారు. దీంతో ఓ డీఎస్పీకి అడ్డుగా నిలబడి తీసుకెళ్తున్న రణధీర్‌కు ఓ రాయి వచ్చి నేరుగా కంటిని తాకింది. కంటి నుంచి రక్తం ధారలుగా కారిపోతూ, భరించలేని నొప్పిని అనుభవించాడు. రెండు కళ్లు కనిపించలేదు. హుటాహుటిన పోలీసులు రణధీర్‌ను పుంగనూరు ఆసుపత్రికి తీసుకెళ్తే పరిస్థితి బాలేదని, తిరుపతికి వెళ్లాలని సూచించారు. తిరుపతి అరవింద కంటి ఆసుపత్రిలో రణధీర్‌కు ఎంఆర్ఐ స్కాన్ తీశారు. రాయి కంటిని తీవ్రంగా తాకడంతో ఎడమకంటి నల్లగుడ్డు, తెల్లగుడ్డు దెబ్బతిన్నాయి. లోపలున్న సున్నితమైన నరాలు తెగిపోయాయి. ఫలితంగా ఓ కన్ను కనిపించదని వైద్యులు తేల్చిచెప్పేశారు. నరాలు తెగిపోవడంవల్ల కుడి కన్ను సైతం చూపు కోల్పోయే అవకాశముందని.. దీనికి మందులిచ్చి, ఆ ప్రమాదం రాకుండా ప్రయత్నం చేస్తున్నామని వైద్యులు చెప్పారు. రణధీర్ తన దుఃఖాన్ని దిగమింగుకుని.. ‘‘సార్, మా అమ్మ, నాన్న ఇద్దరూ పేషెంట్లు. నేను ఉద్యోగం చేసి, కుటుంబాన్ని పోషించాలి. పోలీసు ఉద్యోగమంటే గౌరవం పెంచాలని ఖాకీ డ్రెస్ వేసుకున్నాను. ఇప్పుడు చూపుపోయింది. ఇప్పుడు నా బాధంతా నాకు కంటిచూపు పోయిందని నా ఇద్దరు పిల్లలకు ఎలా చెప్పాలో అర్థంకావడంలేదు సర్..’’ అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. పోలీసులపై దాడిలో పైశాచిక ఆనందం పొందిన టీడీపీ నేతలు.. రణధీర్ జీవితాంతం అనుభవించే బాధకు ఏం బదులిస్తారు? కళ్లెదుటే పోలీసు వాహనాలను పచ్చమూకలు తగులబెడితే ప్రమాదవశాత్తు కాలిపోయాయని పిచ్చి రాతలు రాసిన ‘ఈనాడు’కు రణధీర్ లాంటి పోలీసుల కన్నీళ్లు కనిపించకపోవడం ఆ కంటికి పచ్చ కామెర్లు వచ్చినట్లే అవుతుంది. -
శుక్లం శాపం, దృష్టి లోపం.. కారణాలు, లక్షణాలు, చికిత్స
కంటిశుక్లం అత్యంత విలువైన కంటి చూపును తగ్గించే తీవ్రమైన సమస్య. దీనిపై ప్రజలలో ఇంకా అవగాహన పెరగాల్సి ఉంది. ఇది నిదానంగా పెరిగే సమస్య కావడం వల్ల చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. తద్వారా సమస్య తీవ్రత పెరిగేందుకు కారణమవుతున్నారు. ఈ నేపధ్యంలో కంటి శుక్లం– శస్త్రచికిత్స/క్యాటరాక్ట్ ఆపరేషన్ అవసరం...పై అపోలో స్పెక్ట్రా ఆసుపత్రికి చెందిన వైద్యులు, ప్రముఖ క్యాటరాక్ట్ సర్జన్ డా. అల్పా అతుల్ పూర్బియా అందిస్తున్న సమాచారం ఇది... కంటి శుక్లం..కారణాలు... కంటి లెన్స్ పుట్టుకతో స్పష్టంగా ఉంటుంది, ప్రధానంగా నీరు మరియు ప్రోటీన్లతో కూడి ఉంటుంది. ప్రోటీన్లు కాలక్రమేణా విచ్ఛిన్నం కావడంతో, లెన్స్ తెల్లగా లేదా బూడిద రంగులోకి మారడం ప్రారంభిస్తుంది, ఇది స్పష్టమైన చూపును నిరోధిస్తుంది. దీనికి సాధారణంగా వయస్సు పెరగడం కాగా, అతినీలలోహిత కిరణం/సూర్య కాంతికి గురికావడం వంటివి కూడా కంటిశుక్లంను ప్రేరేపించడానికి కారణాలే. ఇక ఇతర కారణాలలో అతిగా ధూమపానం, దీర్ఘకాలిక మధుమేహం, దీర్ఘకాలిక స్టెరాయిడ్స్ వాడకం వంటివి కూడా ఉండవచ్చు. అలాగే ఆల్కహాల్ దుర్వినియోగం, ఊబకాయం, రేడియేషన్ థెరపీ మొదలైనవి కూడా ఉన్నాయి. ప్రమాదవశాత్తు కంటికి అయిన గాయాలు కూడా కంటిశుక్లం వృద్ధికి కారణం కావచ్చు. కొన్ని సార్లు పుట్టుకతో కూడా కంటిశుక్లం వచ్చే అవకాశం ఉంది. చాలా అరుదుగా పిల్లలలో అభివృద్ధి చెందే కంటిశుక్లంని డెవలప్మెంటల్ క్యాటరాక్ట్ అంటారు. గుర్తించాల్సిందే... కంటిశుక్లం నిదానంగా అభివృద్ధి చెందే గుణం కలిగి ఉంటుంది కాబట్టి ముందుగా జాగ్రత్త పడడం కష్టమవుతుంది. దీనిని ముందుగా గుర్తించడానికి రాత్రిపూట దృష్టికి అంతరాయం, తక్కువ కాంతిలో చూడటం కష్టతరం అవడం వంటి లక్షణాలు ఉపకరిస్తాయి. కంటి శుక్లం ఉన్న రోగులు సాధారణంగా లైట్ చుట్టూ ఒక కాంతిని చూస్తారు. అలాగే కంటి శుక్లం ఉన్నప్పుడు ప్రకాశవంతమైన లైట్ల మెరుపు బాధాకరంగా ఉంటుంది, కంటిశుక్లం ఉన్న వ్యక్తులు ప్రకాశవంతమైన సూర్యకాంతిలో సరిగ్గా చూడటం కష్టంగా ఉండవచ్చు లేదా రాత్రి సమయంలో కొన్నిసార్లు మరింత చెదిరిన దృష్టిని గమనించవచ్చు. వారికి ఇండోర్ లైట్లలో కూడా చూపు కష్టంగా ఉండవచ్చు. వీధి లైట్లు ఎదురుగా వచ్చే వాహనాల నుండి వచ్చే హెడ్లైట్ల వల్ల కలిగే కాంతి కారణంగా రాత్రి సమయంలో డ్రైవింగ్ సమస్యగా మారవచ్చు చికిత్స...? కంటిశుక్లం బాగు చేసేందుకు మందులతో చేయగలిగిన వైద్య చికిత్స లేదు. మసకబారిన చూపును, దృష్టిని పునరుద్ధరించడానికి శస్త్రచికిత్స ద్వారా కంటిశుక్లం తొలగించడమే మార్గం. . కంటిశుక్లం లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లయితే, అద్దాలు లేదా కాంటాక్ట్ లెన్స్ అవసరం కావచ్చు, కానీ కాలక్రమేణా కంటిశుక్లం మరింత తీవ్రమవుతుంది. తర్వాత తర్వాత సాధారణ రోజువారీ కార్యకలాపాలకు కూడా ఇది ఆటంకం కలిగిస్తే శస్త్రచికిత్స చేయక తప్పదు. కంటిశుక్లం తొలగింపు శస్త్రచికిత్స ప్రక్రియను ఇంట్రాకోక్యులర్ లెన్స్ ఇంప్లాంటేషన్స్ తో ఫాకోఎమల్సిఫికేషన్ అంటారు. ఈ ప్రక్రియలో, కంటిశుక్లం వృద్ధి చెందిన అసలు లెన్స్, కృత్రిమ (ఇంట్రాకోక్యులర్ లెన్స్)తో భర్తీ చేయబడుతుంది. ఇది చాలా సురక్షితమైన ప్రక్రియ. ఈ శస్త్రచికిత్స తర్వాత కొన్ని రోజుల పాటు దురద, తేలికపాటి అసౌకర్యం కంటిలో నీరు కారడం వంటివి కనిపించవచ్చు. అయితే నేడు అందుబాటులో ఉన్న తాజా సాంకేతికతతో విజువల్ రికవరీ చాలా వేగంగా ఉంది. శస్త్రచికిత్స తర్వాత కోలుకునే కాలం ఒకరి నుండి మరొకరికి భిన్నంగా ఉండవచ్చు. కొంతమంది కొద్ది రోజుల్లోనే సాధారణ స్థితికి చేరుకుంటారు, మరికొందరికి కోలుకోవడానికి వారాలు పడుతుంది. ఇతరత్రా సమస్యలు లేనట్లయితే వైద్యులు ఒక వారం విశ్రాంతిని సిఫార్సు చేస్తారు. సాధారణంగా అయితే కొన్ని గంటలలోపే, కంటిలో కాలుష్యం లేదా ధూళి కణాలు ప్రవేశించకుండా నిరోధించడానికి రోగిని రక్షించే గ్లాస్ లేదా కంటికి ఐ ప్యాడ్‌తో ఇంటికి తిరిగి పంపుతారు. ––డా. అల్పా అతుల్ పూర్బియా, క్యాటరాక్ట్ సర్జన్, అపోలో స్పెక్ట్రా ఆసుపత్రి, కొండాపూర్ -
30 మంది కంటిచూపు మింగేసిన బ్లాక్‌ఫంగస్
కోయంబత్తూరు: బ్లాక్ ఫంగస్ కారణంగా అనారోగ్యంపాలైన 264 మంది పేషెంట్లలో 30 మందికి ఒక్క కన్ను చూపు పూర్తిగా పోయిందని స్థానిక ప్రభుత్వాస్పత్రి వర్గాలు తెలిపాయి. కరోనా సోకి తగ్గిన అనంతరం కొంతమందికి బ్లాక్ ఫంగస్‌గా పిలిచే మ్యూకోర్మైకోసిస్ సోకుతున్న సంగతి తెలిసిందే! ఇలా సోకి ఆస్పత్రిలో చేరినవారందరికీ ఎండోస్కోపీ చేశామని, 110మందికి చూపు తెప్పించే శస్త్ర చికిత్స చేశామని డా. నిర్మల చెప్పారు. అయితే 30 మంది పేషెంట్లలో ఈ ఫంగస్ తీవ్ర ప్రభావం చూపడంతో ఒక కన్ను చూపు పూర్తిగా పోయిందన్నారు. అయితే బ్లాక్ ఫంగస్ సోకిన తొలినాళ్లలో వచ్చినవారందరికీ నయమైందని చెప్పారు. -
వైద్యానికి వచ్చి అంధురాలై..
కాకినాడ క్రైం: రామచంద్రపురం డివిజన్ పరిధి కుందూరు పీహెచ్సీలో ఓ బాలికకు 2015లో అటెండర్ వైద్యం చేయడంతో చూపు కోల్పోయిన ఘటనపై శనివారం కాకినాడ డీఎంహెచ్ఓ కార్యాలయంలో విచారణ జరిగింది. రాష్ట్ర కుటుంబ సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి అనీల్ సింఘాల్ ఆదేశాల మేరకు జరిగిన విచారణలో విచారణాధికారిగా జోన్–1 ఆర్‌డీఎంహెచ్‌ఎస్ జి.సావిత్రి, సహాయ విచారణాధికారిగా జోన్–1 ఇన్చార్జి డీడీ శ్రీనివాస్‌కుమార్ వ్యవహరించారు. చార్జి మెమోలు పొందిన వారిలో నాటి డీఎంహెచ్ఓ ఎం.సావిత్రమ్మ, స్టాఫ్ నర్సులు జె.ఉమా, వి.సుగుణ, ఎస్పీహెచ్ఓ దుర్గాప్రసాద్, మెడికల్ అధికారి బీజే ప్రవీణతో పాటు ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) ఎస్.ప్రవల్లిక ఉన్నారు. ఆ ఆరుగురి నుంచి లిఖిత పూర్వకంగా వివరణ తీసుకున్నామని సావిత్రి తెలిపారు. కుడి కన్ను కోల్పోయిన బాలిక గొల్లపల్లి ఉదయశ్రీ నాటి ఘటనపై లిఖిత పూర్వక సమాచారాన్ని అందించిందన్నారు. విచారణ నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. జరిగింది ఇదీ.. 2015 జనవరి 22న జరిగిన ఈ ఘటన రాష్ట్ర స్థాయిలో సంచలనమైంది. ఆ రోజు సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో కుందూరు పీహెచ్‌సీకి కంట్లో బురద నీరు పడటంతో అదే గ్రామానికి చెందిన గొల్లపల్లి ఉదయశ్రీ కుటుంబ సభ్యులతో కలసి వచ్చింది. ఆ సమయంలో వైద్యులు, నర్సులు గానీ అందుబాటులో లేరు. అక్కడే ఉన్న ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్)గా పనిచేస్తున్న ఎస్.ప్రవల్లిక వైద్యం చేయాలని సిద్ధపడింది. సిరంజీకి సూదిగుచ్చి తోచిన వైద్యం చేయడానికి పూనుకుంది. ఈ క్రమంలో ఆ సూది నేరుగా బాలిక కుడి కంట్లో దిగబడిందని చెబుతున్నారు. తీవ్ర రక్తస్రావమై ఉదయశ్రీ తన కుడి కన్నును కోల్పోయింది. అప్పటి కలెక్టర్ అరుణ్‌కుమార్ ఘటనను సుమోటాగా స్వీకరించి విచారణకు ఆదేశించారు. ప్రవల్లికతో పాటు అప్పటి డీఎంహెచ్ఓ, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఎస్పీహెచ్ఓ, ఎంఓపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయితే వైద్యాధికారి ప్రవీణ అధికారిక పనులతోనే బయటకు వెళ్లడంతో క్రిమినల్ కేసు నుంచి ఆమెకు విముక్తి లభించింది. ఈ ఘటనపై ఇప్పటికే ఆర్డీఓ, కలెక్టర్ విచారణలు జరగ్గా శనివారం శాఖాపరమైన విచారణ పూర్తయింది. చదవండి: జనం ముందు కత్తులు.. తెర వెనుక పొత్తులు నాలుగో దశ: పెనుగొలనులో టీడీపీకి ఎదురుదెబ్బ -
అమ్మ మంత్రం పని చేసింది
‘‘అక్షరాలు రెండుగా కనిపిస్తున్నాయి. బొమ్మ బ్లర్ అవుతోంది. నాకు ఉన్న ఎన్నో ఆరోగ్య సమస్యలతో పాటు కంటి చూపు కూడా కోల్పోతున్నానేమో?’’ అని ట్వీట్ చేశారు అమితాబ్ బచ్చన్. వయసుతో సంబంధం లేకుండా ఎంతో ఎనర్జీతో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటారు అమితాబ్. అయితే కొన్ని రోజులుగా కంటి చూపులో తేడా గమనించాను అంటున్నారు ఆయన. ఈ విషయాన్ని సరదాగా తన బ్లాగ్ లో రాసుకొచ్చారు. ‘‘చిన్నప్పుడు కళ్లు మంటలుగా అనిపిస్తున్నాయి అని అమ్మకు చెబితే.. చీర కొంగు అంచుని చిన్న బంతిలా చుట్టి అందులోకి గాలి ఊది, కొంగుని కళ్ల దగ్గర ఉంచేది. వెంటనే నొప్పి మాయం అయిపోయేది. ఈ మధ్య కళ్లు మంటలు వస్తున్నాయి. అమ్మ చెప్పిన మంత్రాన్నే మళ్లీ ఫాలో అయ్యాను. అమ్మ మంత్రం మళ్లీ ఫలించింది. అలాగే డాక్టర్ని కూడా సంప్రదించాను. ఆయన చెప్పిన మందులు తీసుకున్నాను. కంప్యూటర్ ఎక్కువగా వాడటం వల్లే ఇదంతా అని చెప్పారు. ప్రస్తుతం మామూలుగానే చూడగలుగుతున్నాను’’ అని తెలిపారు బచ్చన్. -
టాయిలెట్లో దాక్కొన్నా.. కంటి చూపు పోయింది..
-
మొబైల్ గేమ్ ఎంత పనిచేసింది!
బీజింగ్: స్మార్ట్‌ఫోన్‌కి బానిసలై ఆన్లైన్లోనే గడిపేస్తున్న వారికిది నిజంగానే ఓ హెచ్చరిక. 21 ఏళ్ల యువతి స్మార్ట్‌ఫోన్‌లో 24 గంటల పాటు ఏకధాటిగా వీడియో గేమ్ ఆడి తన కుడి కంటి చూపును కోల్పోయింది. ఈ ఘటన వాయవ్య చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఆన్లైన్లో ‘హానర్ ఆఫ్ కింగ్స్’ అనే మల్టీప్లేయర్ గేమ్ ఆడుతున్న యువతికి ఒక్కసారిగా కంటి చూపు మసకమసకగా మారింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే యువతి తన కుడి కంటిచూపును కోల్పోయిందని దక్షిణ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. యువతిని దగ్గర్లోని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లినా.. చూపు కోల్పోడానికి గల కారణాన్ని గుర్తించలేకపోయారు. చివరికి నాన్‌చాంగ్ జిల్లాలోని ఓ ఆస్పత్రి ‘రెటినాల్ ఆర్టరీ అక్జూజన్’అనే సమస్య కారణంగా యువతి చూపు కోల్పోయినట్లు గుర్తించింది. ఈ యువతి స్థానికంగ ఉన్న కంపెనీలో ఫైనాన్స్ విభాగంలో పనిచేస్తునట్లు తెలిసినా.. పేరు కానీ, ఇతర ఏ వివరాలు కానీ తెలియరాలేదని పేర్కొంది. హానర్ ఆఫ్ కింగ్స్ ఆన్లైన్ గేమ్‌కు కేవలం చైనాలోనే సుమారు 20 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. -
కనుముప్పు
► చిన్నారుల పాలిట శాపంగా మారుతున్న సెల్ఫోన్లు, టీవీలు, ట్యాబ్‌లు ► పదేళ్ల వయసొచ్చేసరికే హ్రస్వదృష్టి వస్తున్న వారు వేలల్లో.. మయోఫియా బాధితుల సంఖ్య భారత్ 42 % అమెరికా 54 % దృష్టి లోపంతో బాధపడుతున్న పదేళ్లలోపు చిన్నారులు 1,22,000 రోజుకు 2 గంటలకు మించి గాడ్జెట్లు వాడుతున్న చిన్నారులు 4,00,000 చిన్నారుల కంటిచూపునకుకష్టమొచ్చింది. నిండా అమాయకత్వాన్ని నింపుకొన్న ఆ పసి చూపులు మొబైల్ మాయలో పడి మసకబారుతున్నాయి. లోకం పోకడే తెలియని ఆ కళ్ల లోగిళ్లలో వీడియో గేమ్స్ విలయతాండవం చేస్తున్నాయి. కంప్యూటర్ ‘కాల’నాగులు ఆ నేత్రాలను నీడలా వెంటాడుతున్నాయి.. ఎల్ఈడీ క్రీ నీడలు నిత్యం వెన్నంటే వస్తున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాల కబంధ హస్తాల్లో చిన్నారుల చూపులు చిక్కుకుపోయాయి. మొబైల్, ట్యాబ్, టీవీలను గంటల కొద్దీ చూడటం వల్ల చిన్ని చిన్ని ఆ కళ్లను భూతద్దాలు కూడా కాపాడలేని పరిస్థితులొచ్చాయి. సాక్షి, అమరావతి : మా అబ్బాయి వీడియోగేమ్‌లు ఎంత బాగా ఆడతాడో అంటూ ముచ్చటపడిపోతాం. పిల్లాడి చేతులు కీబోర్డ్‌పై చకచకా నడుస్తుంటే కళ్లప్పగించి చూస్తూ ఉంటాం. మా అబ్బాయి స్మార్ట్‌ఫోన్‌లో అన్ని గేమ్‌లూ ఆడగలడు అంటూ ఇరుగుపొరుగు వారికి చెప్పి సంతోషపడతాం. కానీ ఈ అలవాట్లు వ్యసనంగా మారి వారి కంటి చూపును కాటేస్తున్నాయనే విషయాన్ని గమనించలేకపోతున్నాం. గంటల తరబడి తీక్షణంగా వాటి మీదే దృష్టి సారించడం వల్ల రెటీనాపై తీవ్ర ప్రభావం పడుతోంది. వేగంగా కంటిచూపు తగ్గిపోతోంది. దీంతో యాభై ఏళ్ల వరకూ ఆరోగ్యంగా ఉండాల్సిన కళ్లు పదేళ్లకే మసకబారి పోతున్నాయి. ఇలాంటి చిన్నారులపై ‘సాక్షి’కథనం.. బ్లూ లైట్ ప్రభావం తీవ్రమైంది.. స్మార్ట్ ఫోన్లు, ఎల్ఈడీ టీవీలు, ల్యాప్‌టాప్‌లు వంటివాటికి బ్లూలైట్ ఉంటుంది. ఇలాంటి పరికరాలను ఎక్కువ సేపు కంటికి దగ్గరగా పెట్టుకుని చూడటం వలన కనుగుడ్డుపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఐదేళ్ల వయసు నుంచే కంప్యూటర్లో గేమ్స్ మొదలెట్టడం, పదేళ్లొచ్చే సరికి రోజుకు ఆరు గంటల నుంచి 8 గంటల వరకూ వీటితోనే గడుపుతున్నట్టు కూడా జాతీయ అంధత్వ నివారణ సంస్థ గుర్తించింది. వీటి కారణంగా పదేళ్లకే సమస్యలు వస్తున్నట్టు తేల్చారు. మయోఫియా బారిన చిన్నారులు.. మయోఫియా... దీన్నే హ్రస్వ దృష్టి అంటారు. దీనివల్ల దూరంగా ఉన్నవేవీ సరిగ్గా కనిపించవు. ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నారు చిన్నారులు. నేషనల్ ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా సంస్థ దీనిపై సర్వే చేయగా, భారత్, అమెరికాల్లో గతంలో కంటే మయోఫియా బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇవేగాక చిన్నారుల్లో తీవ్రమైన తలనొప్పి రావడం, కళ్లు లాగినట్టు ఉండటం, కళ్లలో తేమ శాతం తగ్గి మంటగా ఉండటం వంటి సమస్యలు వస్తున్నాయి. దీనివల్ల చిన్నపాటి సూర్యకాంతికి కూడా తట్టుకోలేక అల్లాడిపోయే పరిస్థితి ఎదురవుతోంది. కనీస జాగ్రత్తలు ఇవీ.. ♦ కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల వంటివి ఎక్కువసేపు వాడకుండా చిన్నారులను తల్లిదండ్రులు కట్టడి చేయాలి ♦ ఇండోర్ లైటింగ్‌లో.. అంటే ఇంట్లో లైట్ల వెలుగులో చిన్నారులు 16 గంటలకు పైగా గడుపుతున్నారు. దీన్ని తగ్గించి పగటి వెలుగులో మరింత సేపు గడిపేలా చూడాలి. ♦ కంటిచూపులో తేడా రాగానే వెంటనే అద్దాలు వాడటం లేదా ఏదైనా ప్రత్యామ్నాయ చికిత్స చేయించాలి. లేదంటే ఈ చూపు మందగించడం మరింతగా పెరిగిపోతుంది. తల్లిదండ్రులే చొరవ చూపించాలి.. ప్రస్తుతం మా దగ్గరకు వస్తున్న చిన్నారుల్లోఈ హ్రస్వ దృష్టి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. చిన్నారులను ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగ ప్రమాదం నుంచి బయట పడేయడానికి తల్లిదండ్రులే చొరవ చూపించాలి. ఎలక్ట్రానిక్ తెరలపై దృష్టి తగ్గిస్తే ఎంతైనా మంచిది. – డా.నరేంద్రనాథ్‌రెడ్డి, ప్రొఫెసర్ (కంటివైద్యనిపుణులు), కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల 20-20-20 ఫార్ములా.. 20–20–20 అంటే 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును గానీ, చిత్రాన్ని గానీ 20 సెకన్ల పాటు మాత్రమే చూడటం. దీనివల్ల కళ్లకు మధ్య మధ్యలో ఉపశమనం కలిగి కొన్ని జబ్బుల నుంచి బయటపడే అవకాశముందని తేల్చారు వైద్య నిపుణులు. కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ ఏదైనా గానీ ప్రతి 20 నిమిషాలకోసారి ఇలా 20 సెకన్లపాటు దృష్టిని మరల్చినప్పుడు కంటికి ఫార్ములా చికిత్సలా పనిచేస్తుందని, ఇది శాస్త్రీయంగా రుజువైందని వైద్యులు చెబుతున్నారు. మేధస్సు బాగా ఉందనుకున్నాం.. పిల్లాడు వీడియో గేమ్స్ ఆడుకుంటూ, ల్యాప్‌టాప్‌లో అన్ని ఫైల్స్ ఓపెన్ చేస్తా ఉంటే సాంకేతికంగా వీడికి ఎక్కువ మేధస్సు ఉందని అనుకున్నాం. కానీ ఏడేళ్ల వయసు వచ్చే సరికే 20 మీటర్ల దూరంలో ఉండే వస్తువులు కూడా చూడలేకపోయాడు. డాక్టర్‌కు చూపిస్తే అప్పుడు తెలిసింది మయోఫియా అని. – మోహన్‌రావు, ఎన్ఎఫ్సీ ఉద్యోగి, హైదరాబాద్ -
సెలైన్ వల్లే వారి కంటి చూపు పోయింది
సాక్షి, హైదరాబాద్: సెలైన్ వాటర్‌లో స్వచ్ఛత లేకపోవడం వల్లే సరోజినీ కంటి ఆసుపత్రిలో ఏడుగురు కంటి చూపు కోల్పోయారని కల్చర్ రిపోర్టు తెలిపింది. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) సుదీర్ఘంగా కల్చర్ (స్టెరిలిటీ) పరీక్షలు జరిపిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చింది. ఆ రిపోర్టును తాజాగా వైద్య ఆరోగ్యశాఖకు అందజేసింది. మొత్తం మూడు బ్యా చ్‌లకు చెందిన సెలైన్ వాటర్ బాటిళ్ల నమూనాలను పరీక్షించగా... వాటిలో ఒక బ్యాచ్ బాటిళ్ల నమూనాలో స్వచ్ఛత లేదని రిపోర్డు తెలిపింది. స్వచ్ఛమైన సెలైన్ వాటర్ కాదని నిర్ధారించిన డీసీఏ... అందులో ఏముందో స్పష్టత ఇవ్వలేదని అధికారులు తెలిపారు. బ్యాక్టీరియా ఉండవచ్చని అంచనా వేస్తున్నా రు. సెలైన్ వాటర్‌లో ఉండే ఏదో ఒక లవణంలో కానీ... రసాయనంలో కానీ లోపం ఉండొచ్చని భావిస్తున్నారు. వాటిని సరఫరా చేసిన కంపెనీపై చట్టపరంగా కేసు పెట్టి తగు చర్య తీసుకుంటామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ‘సాక్షి’కి తెలిపారు. 1,200 బాటిళ్ల సరఫరా... రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులన్నింటికీ మందులు, వైద్య పరికరాలు అన్నింటినీ టీఎస్‌ఎంఎస్‌ఐడీసీనే సరఫరా చేస్తుంది. ఆ ప్రకారం గతేడాది కాంపౌండ్ సోడియం లాక్టేట్ ఇంజెక్షన్ ఐపీ 500 ఎంఎల్/బీఎఫ్ఎస్/ఎఫ్ఎఫ్ఎస్ (సెలైన్) సరఫరా బాధ్యతను నాగపూర్‌కు చెందిన హసీబ్ ఫార్మాసూటికల్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి అప్పగించారు. వివిధ బ్యాచ్‌లకు చెందిన 7.95 లక్షల సెలైన్ బాటిళ్లు రాష్ట్రానికి వచ్చాయి. అందులో మూడు బ్యాచ్‌లకు చెందిన 1200 సెలైన్ బాటిళ్లు సరోజినీ ఆసుపత్రికి అందజేశారు. వాటిలో 16,385 బ్యాచ్‌కు చెందిన 816 బాటిళ్లు, 16,386 బ్యాచ్‌కు చెందిన 144 బాటిళ్లు, 16,387 బ్యాచ్‌కు చెందిన 240 బాటిళ్లు ఆ ఆసుపత్రికి అందాయి. వాటిలో 624 బాటిళ్లు ఉపయోగించారు. అందులోని కొన్నింటి కారణంగా ఏడుగురు కంటి చూపు కోల్పోయారు. వాటి నమూనాలనే డీసీఏ పరీక్షించి తాజా నివేదిక సమర్పించింది. -
దృష్టిలోపం ఉన్న వారి కోసం ప్రత్యేక యాప్
న్యూయార్క్: కంటి చూపు తక్కువ ఉన్న వారు స్మార్ట్‌ఫోన్‌ను వాడేటపుడు పెద్దగా కష్టపడకుండానే ఫోన్ స్క్రీన్‌ను చక్కగా ఉపయోగించేలా కొత్తరకం యాప్‌ను అభివృద్ధి చేశారు. భారత శాస్త్రవేత్త శ్రీనివాస్ పుండ్లిక్ నేతృత్వంలోని బృందం ఈ యాప్‌కు రూపకల్పన చేసింది. కంటిచూపు తక్కువ ఉన్న వారు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించేటపుడు ‘గూగుల్ గ్లాస్’ ఉపకరణాన్ని ధరిస్తే ఫోన్ స్క్రీన్ గూగుల్ గ్లాస్లో కనిపిస్తుంది. గూగుల్ గ్లాస్‌ను ధరించాక వీరి తల కదలికలకు అనుగుణంగా ఫోన్ స్క్రీన్‌ను జూమ్ చేసి చూపిస్తుంది. -
చీకట్లు
పసిమొగ్గల్లో అంధత్వం! ♦ చిన్నారుల్లో ఏ విటమిన్ లోపం ♦ {పతి వంద మందిలో ఏడుగురికి సమస్య ♦ రోజురోజుకు పెరుగుతున్న బాధితులు ♦ పౌష్టికాహారలోపం, చీకటి గదుల్లో విద్యాబోధనే కారణం ♦ కళ్లజోళ్లు తప్పనిసరి అవుతున్న దుస్థితి జోగిపేట: గతంలో కంటి చూపు తగ్గుతుందంటే వృద్ధాప్యం దగ్గర పడుతుందని భావించే వారు. కానీ నేడు వయసుతో సంబం ధం లేకుండా కంటిచూపు మందగిస్తోంది. చీకటి గదుల్లో విద్యా బోధన, టీ వీ చూడటం, కంప్యూటర్, వీడియో గేమ్స్, సెల్లో చిత్రాలు వీక్షించడం తదితర కారణాలతో పిల్లల్లో కంటి చూపు తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే పట్టుమని పదేళ్లు కూడా నిండని చిన్నారుల్లో దృష్టిలోపం ఏర్పడడం ఆందోళన కల్గించే అంశం. తల్లిదండ్రులు, వైద్య ఆరోగ్యశాఖ, విద్యాసంస్థలు జాగ్రత్తలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో పిల్లలందరూ కళ్లజోళ్లతో పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతి 100 మంది చిన్నారుల్లో ఏడుగురికి దృష్టిలోపం ఉన్నట్లు సమాచారం. జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఈ విద్యా సంవత్సరంలో 50 వేల మందికి పైగా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో తప్పనిసరిగా 2,609 మంది విద్యార్థుల కు కంటి అద్దాలు అవసరమని గుర్తించారు. ఈ మాసంలో అద్దాలను పంపిణీ చేయనున్నారు. వేలాది మంది విద్యార్థులకు కంటిలో వేసుకునేందుకు ఐ డ్రాప్స్‌ను పంపిణీ చేశారు. వీరిలో 10 ఏళ్లలోపు వారే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. జిల్లాలో కంటి చూపు తగ్గుతున్న పిల్లల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పదేళ్లలోపు చిన్నారుల్లో ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. పదేళ్లలోపు ఉన్న 100 మంది చిన్నారులను పరిశీలిస్తే అందులో ఏడుగురు దృష్టిలోపంతో బాధపడుతున్నారు. కంటి చూపు తగ్గకుండా వైద్య ఆరోగ్యశాఖ ప్రతి ఆరు నెలలకోసారి కంటి పరీక్షలు నిర్వహించి విటమిన్ ఏ అందిస్తున్నా ఆశించిన ఫలితం ఉండటం లేదు. కాగా.. పిల్లల చూపు తగ్గకుండా ఉండేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. చూపు తగ్గడానికి కారణాలు ♦ పిల్లలకు పాలు, గుడ్డు అకుకూరలు, కాయగూరలు, పప్పు దినుసులు అవసరమైనంత మేరకు తీసుకోకపోవడంతో విటమిన్ ఏ కాల్షియం స్థాయి తగ్గిపోయి కంటి చూపు మందగిస్తుంది. ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ♦ వెలుతురు, గాలి లేని తరగతి గదుల్లో విద్యాభ్యాసం చేయడం. ♦ తరగతి గదుల్లో బ్లాక్ బోర్డులనే వాడాలి. బ్లాక్ బోర్డుపై చాక్‌పీస్‌తో రాసిన అక్షరాలు దూరం నుంచి కూడా కళ్లపై ఒత్తిడి లేకుండా కనిపిస్తాయి. ♦ తెల్లబోర్డులు, మార్కర్లు వాడడంతో కళ్లపై ఒత్తిడి పడి నరాలపై ప్రభావం చూపి కంటి చూపు తగ్గుతుంది. ♦ {పస్తుతం పుస్తకాలలో అక్షరాలు కూడా మరీ చిన్నగా ముద్రిస్తున్నారు. ఇది కూడా కొంతవరకు ప్రభావం చూపుతుంది. ♦ టీవీ, కంప్యూటర్, వీడియో, సెల్లో గేమ్స్ ఆడే పిల్లల్లో కంటి చూపు సమస్య ఉత్పన్నమవుతుంది. 50 వేల మంది చిన్నారులకు కంటి పరీక్షలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం తరపున కంటి పరీక్షలు నిర్వహించాం. ఇందులో 2.069 మంది విద్యార్థిని, విద్యార్థులకు తప్పనిసరిగా కంటి అద్దాలు అవసరమని గుర్తించాం. వారికి ఈనెలలో కంటి అద్దాలను ఉచితంగా అందజేస్తున్నాం. అవసరమైన వారికి ఐ డ్రాప్స్ మందులను పంపిణీ చేశాం. చిన్నారులకు కంటిని కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలను ప్రతి పాఠశాలలో వివరించాం. ప్రతి సంవత్సరం కంటి పరీక్షలను పాఠశాలల్లో నిర్వహిస్తున్నాం. దృష్టిలోపంతో బాధపడుతున్న వారందరినీ గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం - డాక్టర్ అమర్‌సింగ్, డీఎంహెచ్ఓ, సంగారెడ్డి జాగ్రత్తలు తప్పనిసరి ఆహారంలో విటమిన్ ఏ, కెరోటినాయిడ్లు, ట్యూటిన్ అధికంగా ఉండే ఆకుకూరలు క్యారెట్, ద్రాక్ష, బొప్పా యి, చిలుగడదుంపలు తీసుకోవడం తో కంటి సమస్యల నుంచి రక్షణ పొం దవచ్చు. ఏ పనిచేస్తున్నా గంటకోసారి దూరంగా ఉన్న వస్తువును చూడాలి. ఇలా అయిదారు సార్లు చేయడంతో కళ్లపై వత్తిడి తగ్గుతుంది. పనిలో పడిపోయి కళ్లను మూ స్తూ.. తెరుస్తూ ఉండటం మరచిపోవద్దు. పిల్లలు, పెద్ద లు ఎలాంటి సమస్య లేకపోయినా క్రమం తప్పకుండా కళ్లను పరీక్ష చేయించుకోవాలి. కంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. పిల్లలకు దృష్టిలోపం రాకుండా ఉండేదుకు పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి. - డాక్టర్ ఎస్.రవీందర్‌గౌడ్, కంటి వైద్య నిపుణులు -
మూలకణాలతో కంటిచూపు!
కార్నియా మార్పిడికి ప్రత్యామ్నాయ చికిత్స ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, అమెరికా వర్సిటీల ఘన విజయం 10 మంది రోగులపై పరిశోధన రెండు మూడేళ్లలో అందుబాటులోకి సాక్షి, హైదరాబాద్: కంటిలోని కార్నియా(శుక్ల పటలం) దెబ్బతిని అంధత్వం బారినపడే వారికి ఇక కార్నియా మార్పిడి అవసరం లేకుండానే తిరిగి కంటిచూపును పునరుద్ధరించవచ్చు. కనుపాపపై పారదర్శక పొరలా ఉండే శుక్ల పటలాన్ని పునరుద్ధరించేందుకు తోడ్పడే మూలకణాలను శాస్త్రవేత్తలు కంటిలోనే కనుగొన్నారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఈ ఘనవిజయం సాధించారు. మూలకణాలతో కంటిచూపును పునరుద్ధరించేందుకు ఈ ఏడాది జనవ రి నుంచి జరుపుతున్న పరిశోధనలు తుది దశకు చేరుకున్నాయని, మరో రెండు మూడేళ్లలోనే ఈ చికిత్సా విధానం అందుబాటులోకి రానుందని ఎల్వీ ప్రసాద్ నేత్రవైద్య విజ్ఞాన సంస్థ కన్సల్టెంట్ సర్జన్, శాస్త్రవేత్త డాక్టర్ సయన్ బసు వెల్లడించారు. ఈ పరిశోధన వివరాలను గురువారం ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో జరిగిన సమావేశంలో డాక్టర్ బసు, యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఆప్తల్మాలజీ ప్రొఫెసర్ జేమ్స్ ఎల్.ఫండర్బర్గ్ స్కైప్ ద్వారా అమెరికా నుంచి జేమ్స్ విలేకరులకు తెలిపారు. ఈ మేరకు.. కనుగుడ్డులోని తెలుపు, నలుపు భాగాల మధ్య ఉండే లింబస్ ప్రాంతంలో కొత్త మూలకణాలను కనుగొన్నారు. దెబ్బతిన్న కార్నియా వద్దకు ఈ మూలకణాలను చేర్చగా, నాలుగు వారాలలోనే కొత్తకణాలతో కార్నియా తిరిగి మామూలు స్థితికి వచ్చింది. వీరి పరిశోధన ఫలితాలు ‘సైన్స్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇక కార్నియా శస్త్రచికిత్సలు అవసరం లేదు.. కార్నియా వల్ల అంధత్వం బారినపడుతున్నవారికి ప్రస్తుతం చనిపోయిన వారి నుంచి సేకరించిన నేత్రాలలోని కార్నియా కణజాలాన్ని మార్పిడి చేసి దృష్టిని పునరుద్ధరిస్తున్నారు. కానీ ‘స్టెమ్‌సెల్స్ థెరపీ ఫర్ కార్నియల్ బ్లైండ్నెస్’ అనే ఈ మూలక ణ చికిత్స అందుబాటులోకి వస్తే ఇక కార్నియా మార్పిడి శస్త్రచికిత్సలే అవసరం ఉండదు. రోగుల కంట్లోని మూలకణాలనే సేకరించి, ఆ మూలకణాలను జీవసంబంధ జిగురు ఫైబ్రిస్గ్లూ సాయంతో వారి కార్నియా వద్ద ప్రవేశపెట్టి కార్నియాను బాగుచేయవచ్చు. కార్నియా మార్పిడి వల్ల భవిష్యత్తులో మళ్లీ సమస్యలు రావచ్చు. జీవితాంతం మందులు వాడుతూ వైద్యుల సలహాలు పాటించాల్సి ఉంటుంది. కానీ మూలకణాల చికిత్సతో ఇక ఇలాంటి ఇబ్బందులేవీ ఉండబోవు. ఈ చికిత్స విఫలమవుతుందన్న భయమూ అక్కరలేదు. కార్నియా మార్పిడితో పోల్చితే ఈ పద్ధతి చాలా చౌక కూడా. ప్రస్తుతం ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో 10 మంది రోగులపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇవి విజయవంతమైతే అంధత్వంతో బాధపడుతూ, కార్నియా మార్పిడి కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి ఉపశమనం కలుగనుంది. -
జ్వరమొచ్చిందని వెళ్తే.. గుండె గుబిల్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్‌లోని పెటల్స్ నియో కేర్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి ఓ పసికందు శాశ్వతంగా కంటిచూపును కోల్పోయిన దుస్థితి వెలుగులోకి వచ్చి నాలుగు రోజులు కాకముందే.. మరో ప్రైవేటు ఆసుపత్రికి పట్టిన డబ్బు జబ్బు బయటపడింది. పదకొండేళ్ల బాబుకు జ్వర మొచ్చిందని వెళితే లేనిపోని పరీక్షలు నిర్వహించి మూడు రోజుల్లో రూ.35 వేలు బిల్లు చేసిన వైనం వెలుగుచూసింది. బాబుకు వచ్చిన రోగం కంటే ఆ తరువాత చేతిలో పెట్టిన బిల్లుతోనే తల్లిదండ్రుల కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి ఏర్పడింది. తమకు జరిగి అన్యాయంపై వినియోగదారుల మండలిని ఆశ్రయించారు. స్పందించిన మండలి రోగనిర్దారణ చేయకుండానే వసూలు చేసిన బిల్లు డబ్బులతో పాటు బాధిత కుటుంబాన్ని మానసికక్షోభకు గురిచేసినందుకు రూ.లక్ష చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యానికి నోటీసు ఇచ్చింది. దీంతో ఆసుపత్రి యాజమాన్యం బాధితులపైనే ఉల్టా దాడి కేసు బనాయించింది. దీంతో సదరు బాధితుడు శనివారం ‘సాక్షి’ని ఆశ్రయించాడు. ఆయన తెలిపిన వివరాలు.. ‘‘మాది వరంగల్ జిల్లా పరకాల. నా పేరు కేసిరెడ్డి సంపత్. దీపావళి పండగ సందర్భంగా కుటుంబసభ్యులతో కరీంనగర్‌కు వచ్చాం. గత నెల 19న కుమారుడు కె.వర్షిత్‌రెడ్డి(11)కి జ్వరం రావడంతో ఆర్కిడ్ ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఇద్దరు డాక్టర్లు బాలుడికి వైద్యపరీక్షలు చేసిన తర్వాత మరో వైద్యుడికి రెఫర్ చేశారు. ఆయన సీబీపీ పరీక్ష, మూత్ర పరీక్ష, వైడల్ ఫీవర్, డెంగీజ్వరం నిర్దారణ పరీక్షలు చేయించారు. 20వ తేదీన రిపోర్టులు పరిశీలించి ఆస్పత్రిలో ఉండాలని చెప్పి అడ్మిట్ చేసుకున్నారు. అదేరోజున మళ్లీ సీబీపీ పరీక్ష చేయించి ఐసీయూలో ఉంచి వైద్యం అందించారు. 21న మళ్లీ సీబీపీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించి చికిత్స అందించారు. 22న మళ్లీ సీబీపీ పరీక్ష చేయించారు. ఈ పరీక్షలన్నీ నిర్వహించి ఐసీయూ ద్వారా వైద్యం అందించినందుకు మూడు రోజులకు రూ.35 వేల బిల్లు కట్టించుకున్నారు. 22న పిప్టా 2.25 ఎంఎం మందు రాశారు. డాక్టర్ రాసిన మందుకు బదులుగా ఆస్పత్రిలోని మెడికల్ షాపు(బిల్నెంబర్ 18321) ఫార్మసిస్టు పిరటాజ్ 1.125 ఇంజక్షన్ ఇచ్చాడు. ఇదంతా గమనించిన నేను వేరే హాస్పిటల్‌కు వెళతామని బాబును డిశ్చార్జి చేయాలని వైద్యులను కోరాను. రక్తంలో ప్లేట్లేట్స్ సంఖ్య తక్కువగా ఉందని వెంటనే రక్తం ఎక్కించాలని భయబ్రాంతులకు గురిచేశారు. వాస్తవానికి బాబుకు ప్లేట్లెట్లు పడిపోలేదని, 1.75 లక్షల మేరకు ప్లేట్లెట్స్ ఉన్నట్లు సీబీపీ పరీక్షలో తేలింది. అయినప్పటికీ లేనిపోని భయాందోళనలు సృష్టించారు. లైఫ్‌కేర్ బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం తీసుకొస్తే దానిని ఎక్కించేందుకు నిరాకరించారు. వైద్యులు తామే సొంతంగా సేకరించిన బ్లడ్‌ను ఎక్కించి వేల రూపాయలు వసూలు చేశారు. బాబు పరిస్థితి విషమంగా ఉందని, మరో వారం రోజులపాటు అత్యవసర చికిత్స చేయాలని నమ్మించేందుకు యత్నించారు. అందుకోసం అవసరం లేకపోయినా బలవంతంగా నోటీ ద్వారా పైప్ వేసేందుకు సిద్ధమయ్యారు. చిన్నపాటి జ్వరమొస్తే ఇట్లా చేస్తున్నారేమిటని విస్తుపోయాను. చికిత్స పేరుతో బిడ్డ ప్రాణాలు తీసేలా ఉన్నారని భయపడ్డాను. తక్షణమే తమ బాబును డిశ్చార్చి చేయాలని కోరాను. ఆసుపత్రి యాజమాన్యం వినకపోవడంతో వైద్యులను ఎదిరించాను. దీంతో ఆసుపత్రి సిబ్బందికి, మాకు మధ్య గొడవ జరిగింది.’’ వరంగల్‌లో టైఫాయిడ్‌గా నిర్దారణ ‘‘ఆ తరువాత అక్కడినుంచి బయటపడి వర్షిత్‌రెడ్డిని తీసుకెళ్లి వరంగల్‌లోని నవీన చిల్ట్రన్స్ నర్సింగ్ హోమ్‌లో చేర్పించాం. ఆర్కిడ్ హాస్పిటల్లో వ్యాధి నిర్దారణకు చేసిన పరీక్షల రిపోర్టులను చూసిన అక్కడి వైద్యులు ఆశ్చర్యపోయారు. మూడు రోజులపాటు పరీక్షలు చేసి జ్వరాన్ని నిర్దారించలేకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. రోగికి అక్కడి డాక్టర్లు పరీక్షలు నిర్వహించి మలేరియా, డెంగీ వంటివి ఏమీలేవని తేల్చారు. వైడల్ టెస్ట్ చేసి టైపాయిడ్ జ్వరంతో బాధపడుతున్నట్లు నిర్దారించారు. వైద్యం అందించి మూడు రోజుల్లోనే పూర్తిగా నయం చేసి పంపించారు.’’ ఫోరమ్‌ను ఆశ్రయించినందుకు కేసు... ‘‘వ్యాధి నిర్దారణ చేయకుండా చికిత్స చేస్తున్నట్లు నమ్మించి రూ.35వేల బిల్లు వసూలు చేయడంపై కరీంనగర్ వినియోగదారుల మండలిని ఆశ్రయించాను. సదరు ఆసుపత్రి యాజమాన్యానికి మండలి నోటీస్ పంపింది. లేనిపోని పరీక్షలు చేసి వసూలు చేసిన రూ.35 వేలతోపాటు తమ కుటుంబాన్ని మానసిక క్షోభకు గురిచేసిందుకు రూ.లక్ష చెల్లించాలని అందులో పేర్కొంది. దీంతో ఆగ్రహించిన ఆసుపత్రి యాజమాన్యం మా ఇంటికి వచ్చి కేసు వాపసు తీసుకోవాలని కోరింది. లేనిపక్షంలో ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశారంటూ ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు బనాయిస్తామని బెదిరిస్తున్నారు. మాకు జరిగిన అన్యాయంపై మీడియాను ఆశ్రయించామని తెలియడంతో ఆర్కిడ్ ఆసుపత్రి యాజమాన్యం శనివారం కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వర్షిత్‌రెడ్డి తల్లిదండ్రులే ఆస్పత్రి సిబ్బందిపై దాడి చేశారని, రూ.5 లక్షలు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని తప్పుడు కేసు పెట్టారు’’ అని సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు. మాపై దాడి చేశారు శనివారం సాయంత్రం వర్షిత్‌రెడ్డితో కలిసి ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చిన సంపత్ దంపతులు ఆసుపత్రి యాజమాన్యం తమను, తమ బంధువులను రకరకాల వేధింపులకు గురిచేస్తోందని వాపోయారు. ఆసుపత్రి నుంచి తమ బాబును డిశ్చార్చి చేయాలని ఒత్తిడి చేసినందుకు సిబ్బంది చేత దాడి చేయించారని ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడద ని పేర్కొన్నారు. రూ.5లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నారు వర్షిత్‌రెడ్డి తల్లిదండ్రులే తమను బె దిరింపులకు గురిచేస్తున్నారని ఆర్కిడ్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ వికాస్ ఆరోపించారు. ఆసుపత్రిలో వర్షిత్‌రెడ్డిని అడ్మిట్ చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది వాళ్లేనని, తీరా అడ్మిట్ చేసుకున్నాక బిల్లు కూడా పూర్తిగా చెల్లించకుండా దబాయించారని పేర్కొన్నారు. ఒకదశలో తమ సిబ్బందిపైనా దాడి చేశారని ఆరోపించారు. ఇటీవల కాలంలో తరచూ ఫోన్లు చేస్తూ తమకు రూ.5లక్షలు ఇవ్వకపోతే మీ సంగతి చూస్తామంటూ బెదిరిస్తున్నారని చెప్పారు. అందుకే తాము పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. -
చూపు తగ్గిందని ఆస్పత్రికి వెళితే.. రెండు కళ్లూ పోగొట్టారు
ఆరోగ్యశ్రీ ద్వారా రూ.70 వేల చెల్లింపు కవాడిగూడలో బాధితుడి ఆందోళన ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన కవాడిగూడ: కంటి చూపు మందగించిందని, వైద్యం కోసం ఆస్పత్రికి వెళితే వైద్యులు ఉన్న చూపును కూడా పోగొట్టి పూర్తి గుడ్డివాడిని చేశారు. ఈ సంఘటన వెస్ట్ మారేడ్‌పల్లిలోని పుష్పగిరి ఐ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు న్యాయపోరాటానికి దిగుతున్నాడు. వివరాల్లోకి వెళితే... కవాడిగూడకు చెందిన అవనిగంటి సిద్ధయ్య(40) డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా కంటి చూపు తగ్గుతుండటంతో వెస్ట్ మారేడ్‌పల్లిలోని పుష్పగిరి ఐ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్ చేసి కంటి పొరలను తొలగిస్తామని వైద్యులు హామీ ఇచ్చారు. దీంతో సిద్ధయ్యలో గత ఏడాది జనవరి 31నలో ఆస్పత్రిలో చేరాడు. ఐదు రోజుల తర్వాత వైద్యులు డాక్టర్ మురళీధర్ ఆపరేషన్ చేశారు. అయితే, ఆపరేషన్ అనంతరం తన కుడి కన్ను కనిపించడం లేదని సిద్ధయ్య వైద్యుల వద్ద వాపోయాడు. అయితే, కుడి కన్ను చూపు తిరిగి రావాలంటే ఎడమ కంటికి కూడా ఆపరేషన్ చేయాలని, లేకుండే చూపు పోతుందని భయపెట్టారు. దీంతో బాధితుడు ఎడమ కంటి ఆపరేషన్‌కు సిద్ధవగా.. గత ఏడాది జూలైలో డాక్టర్ మురళీధరే ఆపరేషన్ చేశారు. అయితే, ఇప్పుడు సిద్ధయ్య రెండు కళ్ల చూపూ పోయింది. రెండు కళ్లకు శస్త్ర చికిత్స చేసినందుకు ఆస్పత్రికి రూ.70 వేలు ఆరోగ్యశ్రీ నుంచి మంజూరయ్యాయి. అంతా బాగుందని రిపోర్టు.. ఇదిలా ఉండగా సిద్ధయ్యకు ఆపరేషన్ చేసిన అనంతరం డిశ్చార్జ్ చేసిన రిపోర్టులో మాత్రం ‘స్టేటస్ గుడ్’ అని ఉండడం గమనర్హం. అంతే కాకుండా మొదట తన కుడి కన్నుకు ఆపరేషన్ చేశారని, ఆ తర్వాతే ఎడమ కంటికి చేశారని సిద్ధయ్య చెబుతున్నాడు. కానీ, రిపోర్టులో మాత్రం ముందు ఎడమ కన్నుకు ఆపరేషన్ చేసినట్టుగా, రెండో సారి మాత్రమే కుడి కంటికి చేసినట్టు ఉంది. ఈ ఆస్పత్రిలో తనతో పాటు ఆపరేషన్ చేయించుకున్నవారి పరిస్థితి కూడా తనలాగే ఉందని ఈ సందర్భంగా సిద్ధయ్య వాపోయాడు. ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. ఆస్పత్రి వర్గాల నుంచి ఈ విషయంపై వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా సంబంధిత అధికారులు అందుబాటులోకి రాలేదు. -
చూపు తగ్గుతోంది..!
న్యూఢిల్లీ: నగరంలో కంటిచూపు తగ్గుతున్న పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పది సంవత్సరాల లోపు చిన్నారుల్లో ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. పదేళ్లలోపు ఉన్న వంద మంది చిన్నారులను పరిశీలిస్తే.. సుమారు ఎనిమిది మందికిపైగా పిల్లలు దృష్టిలోపంతో బాధపడుతున్నారు. కొందరిలో కంటిఅద్దాలు సమకూర్చినా చూపు బాగుపడని పరిస్థితి ఉంది. పిల్లల్లో చూపు తగ్గడానికి అనేక కారణాలున్నారుు. ప్రధానంగా కంటిచూపు తగ్గడానికి జన్యుపర సమస్య ఒకటైతే, విటమిన్-ఏ లోపం, తగినంత వెలుతురు లేని గదుల్లో విద్యాభ్యాసం చేయడం, అదేపనిగా వీడియో గేమ్స్, కంప్యూటర్, టీవీ చూడటం వ ంటివి కూడా కారణమవుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. కంటిచూపు తగ్గకుండా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరునెలలకో సారి ఏ-విటమిన్ పిల్లలకు అందిస్తున్నా.. ఆశించిన స్థాయిలో ఫలితం ఉండడం లేదు. విటమిన్ ‘ఏ’ ద్రవం అందించే కార్యక్రమం పకడ్బందీగా చేపట్టకపోవడంతోనే సమస్య ఉత్పన్నమవుతున్నట్లు ఆరోపణలున్నారుు. పిల్లల చూపు తగ్గకుండా ఉండేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. కంటిచూపు సమస్యతో బాధపడుతునన వారిలో ఎక్కువగా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు.. వీరిలో ఎక్కువ మంది ఉన్నత వర్గాలకు చెందిన వారే ఉంటున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య రెండు లక్షల వరకు ఉంది. వీరిలో నాలుగు శాతం పదేళ్ల వయసులోపు పిల్లలు ఉండగా ... 11 నుంచి 16 సంవత్సరాల లోపు వారు ఎక్కువ గా ఉంటున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఆహారంలో విటమిన్ ఏ, కెరోటినాయిడ్లు, ట్యూటిన్ అధికంగా ఉండే ఆకుకూరలు, క్యారెట్, ద్రాక్ష, బొప్పాయి, చిలగడ దుంపలు వంటి తినడంతో కంటి సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. ఏ పనిచేస్తున్నా గంటకోసారి దూరంగా ఉన్న ఏదైనా వ స్తువును తదేకంగా చూడాలి. తర్వాత దగ్గరగా ఉన్న వస్తువును చూడాలి. ఇలా ఐదారుసార్లు చేయడంతో కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. పనిలో పడిపోయి కళ్లను మూసి తెరుస్తుండడం మరిచిపోవద్దు. పిల్లలు, పెద్దలు ఎలాంటి సమస్యలేకపోయినా క్రమం తప్పకుండా కళ్లను పరీక్ష చేయించుకోవాలి. కంటి సమస్యలు వచ్చిన ప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. పిల్లలకు దృష్టిలోపం రాకుండా ఉండేందుకు పెద్దలూ జాగ్రత్తలు తీసుకోవాలి. చూపు తగ్గడానికి కారణాలు ఇవీ.. * పిల్లలకు పాలు, గుడ్లు, ఆకుకూరలు, కాయగూరలు, పప్పుదినుసులు, అసవరం అయినంతమేరకు తీసుకోకపోవడంతో ఏ-విటమిన్, కాల్షియం స్థాయి తగ్గిపోయి కంటి చూపుతోపాటు ఇతర ఆరోగ్యసమస్యలూ వస్తాయి. * వెలుతురు, గాలి లేని ఇరుకుగదుల్లో విద్యాభ్యాసం చేయడం. * గతంలో బ్లాక్‌బోర్డుపై చాక్‌పీస్‌తో అక్షరాలు రాసేవారు. ఈ అక్షరాలు కళ్లకు ఇబ్బంది కలగకుండా పెద్దగా కూడా కనిపించేవి. తరగతి గదిలో చివరివరుసలో కూర్చున్నా..అక్షరాలు స్పష్టంగా కనిపించేవి. ఇప్పుడు బ్లాక్ బోర్డుల స్థానంలో వైట్‌బోర్డుపై మార్కర్‌తో చిన్న అక్షరాలు రాస్తూ విద్యాభ్యాసం చేస్తున్నారు. ఫలితంగా కళ్లపై ఒత్తిడిపడి నరాలపై ప్రభావం చూపి చూపు తగ్గుతోంది. * పస్తుతం పుస్తకాల్లో అక్షరాలు కూడా మరీ చిన్నవిగా ముద్రిస్తున్నారు. ఇది కూడా కొంతవరకు ప్రభావం చూపుతోంది. * టీవీ, కంప్యూటర్, వీడియో గేమ్స్ ఆడే పిల్లల్లో ఈ కంటిచూపు సమస్య ఉత్పన్నమవుతోంది. -
చూపు తగ్గుతోంది..!
న్యూఢిల్లీ: నగరంలో కంటిచూపు తగ్గుతున్న పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పది సంవత్సరాల లోపు చిన్నారుల్లో ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. పదేళ్లలోపు ఉన్న వంద మంది చిన్నారులను పరిశీలిస్తే.. సుమారు ఎనిమిది మందికిపైగా పిల్లలు దృష్టిలోపంతో బాధపడుతున్నారు. కొందరిలో కంటిఅద్దాలు సమకూర్చినా చూపు బాగుపడని పరిస్థితి ఉంది. పిల్లల్లో చూపు తగ్గడానికి అనేక కారణాలున్నారుు. ప్రధానంగా కంటిచూపు తగ్గడానికి జన్యుపర సమస్య ఒకటైతే, విటమిన్-ఏ లోపం, తగినంత వెలుతురు లేని గదుల్లో విద్యాభ్యాసం చేయడం, అదేపనిగా వీడియో గేమ్స్, కంప్యూటర్, టీవీ చూడటం వ ంటివి కూడా కారణమవుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. కంటిచూపు తగ్గకుండా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరునెలలకో సారి ఏ-విటమిన్ పిల్లలకు అందిస్తున్నా.. ఆశించిన స్థాయిలో ఫలితం ఉండడం లేదు. విటమిన్ ‘ఏ’ ద్రవం అందించే కార్యక్రమం పకడ్బందీగా చేపట్టకపోవడంతోనే సమస్య ఉత్పన్నమవుతున్నట్లు ఆరోపణలున్నారు. పిల్లల చూపు తగ్గకుండా ఉండేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. కంటిచూపు సమస్యతో బాధపడుతున వారిలో ఎక్కువగా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు.. వీరిలో ఎక్కువ మంది ఉన్నత వర్గాలకు చెందిన వారే ఉంటున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య రెండు లక్షల వరకు ఉంది. వీరిలో నాలుగు శాతం పదేళ్ల వయసులోపు పిల్లలు ఉండగా ... 11 నుంచి 16 సంవత్సరాల లోపు వారు ఎక్కువగా ఉంటున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఆహారంలో విటమిన్ ఏ, కెరోటినాయిడ్లు, ట్యూటిన్ అధికంగా ఉండే ఆకుకూరలు, క్యారెట్, ద్రాక్ష, బొప్పాయి, చిలగడ దుంపలు వంటి తినడంతో కంటి సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. ఏ పనిచేస్తున్నా గంటకోసారి దూరంగా ఉన్న ఏదైనా వ స్తువును తదేకంగా చూడాలి. తర్వాత దగ్గరగా ఉన్న వస్తువును చూడాలి. ఇలా ఐదారుసార్లు చేయడంతో కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. పనిలో పడిపోయి కళ్లను మూసి తెరుస్తుండడం మరిచిపోవద్దు. పిల్లలు, పెద్దలు ఎలాంటి సమస్యలేకపోయినా క్రమం తప్పకుండా కళ్లను పరీక్ష చేయించుకోవాలి. కంటి సమస్యలు వచ్చిన ప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. పిల్లలకు దృష్టిలోపం రాకుండా ఉండేందుకు పెద్దలూ జాగ్రత్తలు తీసుకోవాలి. చూపు తగ్గడానికి కారణాలు ఇవీ.. పిల్లలకు పాలు, గుడ్లు, ఆకుకూరలు, కాయగూరలు, పప్పుదినుసులు, అసవరం అయినంతమేరకు తీసుకోకపోవడంతో ఏ-విటమిన్, కాల్షియం స్థాయి తగ్గిపోయి కంటి చూపుతోపాటు ఇతర ఆరోగ్యసమస్యలూ వస్తాయి. వెలుతురు, గాలి లేని ఇరుకుగదుల్లో విద్యాభ్యాసం చేయడం. గతంలో బ్లాక్‌బోర్డుపై చాక్‌పీస్‌తో అక్షరాలు రాసేవారు. ఈ అక్షరాలు కళ్లకు ఇబ్బంది కలగకుండా పెద్దగా కూడా కనిపించేవి. తరగతి గదిలో చివరివరుసలో కూర్చున్నా..అక్షరాలు స్పష్టంగా కనిపించేవి. ఇప్పుడు బ్లాక్ బోర్డుల స్థానంలో వైట్‌బోర్డుపై మార్కర్‌తో చిన్న అక్షరాలు రాస్తూ విద్యాభ్యాసం చేస్తున్నారు. ఫలితంగా కళ్లపై ఒత్తిడిపడి నరాలపై ప్రభావం చూపి చూపు తగ్గుతోంది. {పస్తుతం పుస్తకాల్లో అక్షరాలు కూడా మరీ చిన్నవిగా ముద్రిస్తున్నారు. ఇది కూడా కొంతవరకు ప్రభావం చూపుతోంది. టీవీ, కంప్యూటర్, వీడియో గేమ్స్ ఆడే పిల్లల్లో ఈ కంటిచూపు సమస్య ఉత్పన్నమవుతోంది. -
పదేళ్లలోపు చిన్నారుల్లో చూపు తగ్గుతోంది..
- పదేళ్లలోపు చిన్నారుల్లో పోషకాహార లోపం.. - ఆహారపు అలవాట్లు, చీకటి గదుల్లో విద్యాబోధనే కారణం - తల్లిదండ్రులూ.. పారాహుషార్ గతంలో కంటిచూపు తగ్గిపోతోందంటే వృద్ధాప్యం దగ్గరపడుతుందని భావించేవారు. ప్రస్తుతం జీవనశైలి, ఆహారపు అలవాట్లు వెరసి వయసుతో నిమిత్తం లేకుండానే చూపు మందగిస్తోంది. పట్టుమని పదేళ్లు కూడా నిండని చిన్నారుల్లో చూపు సమస్య ఎక్కువగా కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు, వైద్య ఆరోగ్యశాఖ, విద్యాసంస్థలు జాగ్రత్తలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ప్రతి చిన్నారి కళ్లజోళ్లతో పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరీంనగర్ హెల్త్ :జిల్లాలో కంటిచూపు తగ్గుతున్న పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పది సంవత్సరాల లోపు చిన్నారుల్లో ఈ సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. పదేళ్లలోపు ఉన్న వంద మంది చిన్నారులను పరిశీలిస్తే.. నల్గురికి పైగా దృష్టిలోపంతో బాధపడుతున్నారు. కంటిఅద్దాలు సమకూర్చినా చూపు బాగుపడని పరిస్థితి ఉంది. పిల్లల్లో చూపు తగ్గడానికి అనేక కారణాలున్నారుు. ప్రధానంగా కంటిచూపు తగ్గడానికి జన్యుపర సమస్య ఒకటైతే, విటమిన్-ఏ లోపం, తగినంత వెలుతురు లేని గదుల్లో విద్యాభ్యాసం చేయడం, అదేపనిగా వీడియో గేమ్స్, కంప్యూటర్, టీవీ చూడటం వ ంటివి కూడా కారణమవుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. కంటిచూపు తగ్గకుండా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరునెలలకో సారి ఏ-విటమిన్ పిల్లలకు అందిస్తున్నా.. ఆశించిన స్థాయిలో ఫలితం ఉండడం లేదు. విటమిన్ ‘ఏ’ ద్రవం అందించే కార్యక్రమం పకడ్బందీగా చేపట్టకపోవడంతోనే సమస్య ఉత్పన్నమవుతున్నట్లు ఆరోపణలున్నారుు. పిల్లల చూపు తగ్గకుండా ఉండేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. కంటిచూపు సమస్యతో బాధపడుతున ్న వారిలో ఎక్కువగా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు.. వీరిలో ఎక్కువ మంది ఉన్నత వర్గాలకు చెందిన వారే ఉంటున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య రెండు లక్షల వరకు ఉంది. వీరిలో నాలుగు శాతం పదేళ్ల వయసులోపు పిల్లలు ఉండగా ... 11 నుంచి 16 సంవత్సరాల లోపు వారు ఎక్కువ గా ఉంటున్నారు. చూపు తగ్గడానికి కారణాలు ఇవీ.. - పిల్లలకు పాలు, గుడ్లు, ఆకుకూరలు, కాయగూరలు, పప్పుదినుసులు, అసవరం అయినంతమేరకు తీసుకోకపోవడంతో ఏ-విటమిన్, కాల్షియం స్థాయి తగ్గిపోయి కంటి చూపుతోపాటు ఇతర ఆరోగ్యసమస్యలూ వస్తాయి. - వెలుతురు, గాలి లేని ఇరుకుగదుల్లో విద్యాభ్యాసం చేయడం. - గతంలో బ్లాక్‌బోర్డుపై చాక్‌పీస్‌తో అక్షరాలు రాసేవారు. ఈ అక్షరాలు కళ్లకు ఇబ్బంది కలగకుండా పెద్దగా కూడా కనిపించేవి. తరగతి గదిలో చివరివరుసలో కూర్చున్నా..అక్షరాలు స్పష్టంగా కనిపించేవి. ఇప్పుడు బ్లాక్ బోర్డుల స్థానంలో వైట్‌బోర్డుపై మార్కర్‌తో చిన్న అక్షరాలు రాస్తూ విద్యాభ్యాసం చేస్తున్నారు. ఫలితంగా కళ్లపై ఒత్తిడిపడి నరాలపై ప్రభావం చూపి చూపు తగ్గుతోంది. - ప్రస్తుతం పుస్తకాల్లో అక్షరాలు కూడా మరీ చిన్నవిగా ముద్రిస్తున్నారు. ఇది కూడా కొంతవరకు ప్రభావం చూపుతోంది. - టీవీ, కంప్యూటర్, వీడియో గేమ్స్ ఆడే పిల్లల్లో ఈ కంటిచూపు సమస్య ఉత్పన్నమవుతోంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఆహారంలో విటమిన్ ఏ, కెరోటినాయిడ్లు, ట్యూటిన్ అధికంగా ఉండే ఆకుకూరలు, క్యారెట్, ద్రాక్ష, బొప్పాయి, చిలగడ దుంపలు వంటి తినడంతో కంటి సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. ఏ పనిచేస్తున్నా గంటకోసారి దూరంగా ఉన్న ఏదైనా వ స్తువును తదేకంగా చూడాలి. తర్వాత దగ్గరగా ఉన్న వస్తువును చూడాలి. ఇలా ఐదారుసార్లు చేయడంతో కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. పనిలో పడిపోయి కళ్లను మూసి తెరుస్తుండడం మరిచిపోవద్దు. పిల్లలు, పెద్దలు ఎలాంటి సమస్యలేకపోయినా క్రమం తప్పకుండా కళ్లను పరీక్ష చేయించుకోవాలి. కంటి సమస్యలు వచ్చిన ప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. పిల్లలకు దృష్టిలోపం రాకుండా ఉండేందుకు పెద్దలూ జాగ్రత్తలు తీసుకోవాలి. - రఘు, కంటి వైద్య నిపుణులు