సాక్షి, చెన్నై: పాము కనిపిస్తేనే భయంతో ఆమడ దూరం పరుగులు తీస్తాం. అలాంటిది ఒకరి కాదు రెండు కాదు ఏకంగా 35 పాము పిల్లలు ఒక్కసారిగా కనిపిస్తే చూసినవాళ్ల పరిస్థితి ఎలా ఉంటదో ఊహించారా? ఇలాంటి సంఘటనే తమిళనాడులో ఓ వ్యక్తికి ఎదురైంది. రెండు రోజుల క్రితం కోయంబత్తూరు ఈ ఘటన చోటుచేసుకోంది. కోవిమేడుకు చెందిన మనోహరన్ శుక్రవారం స్నానం చేయడానికి బాత్‌రూమ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ 35 పాము పిల్లలను గమనించాడు. దాంతో భయంతో అక్కడ నుంచి పరుగులు పెట్టాడు. అనంతరం తేరుకుని వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చాడు. అతడు ఆ పాములను పట్టుకుని, వాటిని రస్సెల్ వైపర్‌గా గుర్తించి, సత్య మంగళం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు.
పామును పట్టుకున్న అంజనీకుమార్
హైదరాబాద్: నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ నివాసం వద్ద శనివారం ఉదయం ఓ పాము కలకలం సృష్టించింది. సీపీ వాహనం సమీపంలో ఓ జెర్రిపోతు ఉండటం చూసి, ఆయన పెంపుడు శునకం గుర్తంచి అరుస్తూ అప్రమత్తం చేసింది. ఆ పామును పట్టుకున్న కొత్వాల్ అంజనీకుమార్ జూ పార్క్‌కు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment