snake venom
-
అసలేంటి ఈ స్నేక్ వెనమ్: సెలబ్రిటీలకు అంత మోజు ఎందుకు?
రేవ్ పార్టీలలో బడాబాబులు, సెలబ్రేటీలు అమ్మాయిలతో డ్యాన్సులు, మాదక ద్రవ్యాలు, అశ్లీల డ్యాన్సులు సాధారణంగా వినిపించేవి. మరి కొందరు మత్తు పదార్థాలూ తీసుకుంటారు. మరి సీక్రెట్‌గా పోలీసుల కంట పడకుండా రేవ్ పార్టీల్లో పాము విషం ఎందుకు హల్చల్ చేస్తోంది. పాము విషం చాలా ప్రమాదకరం. కొన్ని పాములు కరిచిన క్షణాల్లోనే ప్రాణాలు గాల్లో కలిసి పోవడం ఖాయం. మరి ఇంత ఖరీదైన పార్టీల్లో పాము విషానికి కోట్లాది రూపాయల డిమాండ్ ఎందుకు? చాలామంది సెలబ్రిటీలు పాము విషాన్ని డ్రగ్‌లా ఎందుకు వాడుతున్నారు? వివరాలను ఒకసారి చూద్దాం! ప్రముఖ యూట్యూబర్, ఓటీటీ 'బిగ్ బాస్' విజేత ఎల్విష్ యాదవ్, రేవ్ పార్టీలలో పాము విషాన్ని విక్రయించిన ఆరోపణలపై అరెస్టు అయ్యాడు. వీరినుంచి స్వాధీనం చేసుకున్న శాంపిల్స్‌లో నాగుపాము, క్రైట్ జాతుల విషం ఉన్నట్లు ఫోరెన్సిక్ విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో స్నేక్ వెనమ్ అడిక్షన్ అంటే ఏమిటి? దీన్ని ఎందుకు తీసుకుంటారు అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్నేక్ వెనమ్ అడిక్షన్ అంటే ఏమిటి? అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన నాగు పాముల విషానికి రేవ్ పార్టీలలో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. పాము విషాన్ని పౌడర్‌గా ప్రాసెస్ చేస్తారు. డ్రగ్స్ మాఫియాలో ఇదొక ఘోరమైన రూపంగా అవతరిస్తోంది. ఈ పౌడర్‌లోని న్యూరోటాక్సిన్ల కారణంగా విపరీత మైన మత్తు రావడంతోపాటు, ఇతర అనేక రకాల లక్షణాలను ప్రేరేపిస్తుంది. ఈ రకమైన వ్యససాన్ని అఫిడిజం అని పిలుస్తారు. బాగా ఎత్తును పొందుతారు, ఎక్కువ గంటలు నృత్యం చేయగలరు. ఈ పౌడర్ బలాన్ని బట్టి ఆరు-ఏడు గంటల నుంచి ఐదు-ఆరు రోజుల వరకు దీని ప్రభావం ఉంటుంది. నిజానికి స్నేక్ వెనమ్ అడిక్షన్ చాలా ప్రమాదకరమైనది , ప్రాణాంతకమైనది కూడా. దీర్ఘకాలంగా దీన్ని వినియోగిస్తున్న వారు అనేక శారీరక, మానసిక రుగ్మతలకు లోనవుతారు. అందుకే నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో దీన్ని సేవిస్తారట. స్నేక్ వెనమ్ ప్రోటీన్-ఆధారిత టాక్సిన్ అని, ఇది కడుపులోని ఆమ్లాలు, జీర్ణ ఎంజైమ్‌ల సహాయంతో జీర్ణమవుతుందని చెబుతున్నారు. విషానికి విరుగుడుగా వైద్యులు అందించే సూది మందును సైతం చాలా కొద్ది పరిమాణంలో విషంతో తయారు చేస్తారట. ముఖ్యంగా విదేశాల్లో పాము విషానికి డిమాండ్ ఎక్కువ, ఇది క్రమ మన దేశానికి పాకుతుండటం గమనార్హం. గుండె సంబంధిత వ్యాధులు, రక్త పోటు వంటి రోగాలకు ఉపయోగించే కొన్నిరకాల ఔషధాల్లోనూ పాము విషాన్ని వినియోగిస్తారట. పాము కాటు వేస్తే ఏం జరుగుతుంది? కట్ల పింజరి, కట్ల పాము, రాచ నాగు లాంటితో పోలిస్తే నాగు పాములే అత్యంత విషపూరితమైనవిగా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,500 రకాల పాములు ఉన్నాయట. అయితే వీటిలో 25 శాతం మాత్రమే విషపూరితమైనవి. ఒక విషపూరితమైన పాము మనిషిని లేదా ఇతర జీవులను కాటు చేసినప్పుడు అది విషపూరితమైన ప్రోటీన్లు, ఎంజైమ్‌లు, ఇతర పరమాణు పదార్ధాల సంక్లిష్ట మిశ్రమాన్ని రక్త ప్రవాహంలోకి చేరతాయి. దీంతో ఆ పాము విష తీవ్రతను బట్టి, గుండెలోని రక్తం గడ్డ కట్టడం, పక్షవాతం, అంతర్గత రక్తస్రావం లాంటి ప్రమాదకర సంకేతాలు కనిపిస్తాయి. కోలుకోలేని విధంగా మూత్రపిండాలు పాడు కావడం, కణజాల నష్టం,శాశ్వత వైకల్యం , అవయవాలను కోల్పోవడం లాంటివి జరగవచ్చు. ప్రతీ ఏడాది 50 లక్షలమందికిపైగా పాము కాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఆఫికా, ఆసియా, మధ్య , దక్షిణ అమెరికా తదితర దేశాల్లో పాము కాటు అనేది తీవ్రమైన సమస్యగా పేర్కొంటారు. 2023 లెక్కల ప్రకారం ప్రతీ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 5.4 మిలియన్ల మంది ప్రజలు పాము కాటు బారిన పడుతున్నారు. సుమారు 81 వేలనుంచి లక్షా,38 వేల దాకా మరణిస్తున్నారు. 1.8 నుండి 2.7 మిలియన్ల మంది పాము కాటు ప్రభావానికి గురవుతున్నారు. మూడు రెట్లకు పైగాబాధితులు శాశ్వత వికలాంగులుగా మారిపోతున్నారు. వ్యవసాయ కార్మికులు, పిల్లలు ఎక్కువగా పాము కాటుకు గురవుతున్నారు. -
మత్తు కోసం పాము విషమా?..అందుకోసం పార్టీల్లో..
రేవ్ పార్టీల్లో పాము విషాన్ని వినియోగించారంటూ యూట్యూబర్ ఎల్వీష్ యాదవ్‌తో సహా నలుగురిపై కేసు నమోదవ్వడంతో ఒక్కసారిగా ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మేనక గాంధీ ఫిర్యాదుల మేరకు నిందితులపై కేసు నమోదైంది. ఎల్వీష్ యాదవ్, ఆయన సహచరులు నిర్వహించిన పార్టీల్లో పాములను, పాము విషాన్ని వాడారని, మత్తు కోసం పాము విషం తీసుకుంటున్న వీడియోలు బయటపడ్డట్లు పోలీసులు చెబతున్నారు. ఒక్కసారిగా ఈ ఘటన తీవ్ర కలవరపాటుకి గురిచేయడమే గాక ప్రస్తుతం ఇది భారత్‌లో ట్రెండ్‌గా మారడమా అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. అసలేంటి రేవ్ పార్టీలు? మత్తు కోసం పాము విషమా? వాళ్లకి ఆ విషం ప్రమాదం కాదా? తదితరాల గురించే ఈ కథనం!. ఇటీవలకాలంలో సంపన్న కుటుంబాల పిల్లలు దగ్గర నుంచి అట్టడుగు వర్గానికి చెందిన కొందరూ అల్లరి చిల్లరి పిల్లలు వరకు ఈ రేవ్ పార్టీల సంస్కృతికి అలవాటుపడి దారితప్పుతున్నారు. విచ్చలవిడి ఈ సంస్కృతిలో డ్రగ్స్‌కి, కొన్ని రకాల చెడు అలవాట్లకు బానిసై చేజేతులారా జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి అనైతిక చట్ట విరుద్ధమైన పనులన్ని ఫామ్ హౌస్‌ల్లోనూ లేదా నగరానికి దూరంగా ఉండే ఫ్లాట్లలో జరుగుతుండటం బాధకరం. అక్కడకి పోలీసులు ఇలాంటి వాటికి అడ్డకట్టవేసి అరెస్టులు చేయడం జరగుతోంది. ఇంత వరకు బాగానే ఉంది. ఇప్పుడు అది కాస్త శృతి మించి ఆ మత్తు పరాకాష్టకు చేరుకుందా అనేంత స్థాయికి దిగజారిపోయింది. ఏకంగా మత్తు సరిపోవడం లేదని అత్యంత విషపూరితమైన పాము విషం కూడా ఎక్కించుకునేంత స్థాయికి వెళ్లిపోయారంటే..ఎంతటి ప్రమాదకరమైన వ్యక్తులుగా మారిపోయారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ భయానక సంస్కృతి ఎక్కడది..? మత్తు కోసం పాము విషాన్ని తీసుకునే అలవాటు చైనా, రష్యా, ఇతర పాశ్చాత్య దేశాల్లో చాలా ఏళ్లుగా ఉంది. ఇటీవల ఆ అలవాటు ఇండియాలోకి పాకడమే గాక ట్రెండ్‌గా మారింది. మరోవైపు, పాము కాటు మరణాలు భారత్‌లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. అదీగాక మన గ్రామీణ భారతంలో పాముకాటు అతిపెద్ద సమస్య. అలాంటి ప్రమాదకర పాముల విషంతోనే మత్తురాయళ్లు మత్తులో జోగేందుకు యత్నించడం అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ యూట్యూబర్ యాదవ్ ఘటన ఒక్కసారిగా రేవ్‌పార్టీలపై మరింత దృష్టిసారించి నిఘా పెట్టేలా చేసింది. ఇంతవరకు నల్లమందు, పొగాకు, గంజాయి, ఎండీఎంఏ, మెత్ వంటి పదార్థాలను మత్తుకోసం వాడేవారు. ఐతే పాములు, తేళ్లు వంటి సరీసృపాల విషాలను కూడా మత్తుకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయని పరిశోధనల్లో తేలింది. ఈ విష సంస్కృంతి భారత్‌లో లేకపోయినా.. యువత దీన్ని ఫాలో అవ్వడం విచారకరం. పైగా ఇది ప్రాణాంతకం కూడా. మత్తుపదార్థాలకు విపరీతంగా బానిసైనవారు మరింత మత్తుకోసం ఇలా పాము విషం వైపుకి మళ్లుతారని నిపుణులు చెబుతున్నారు. వినోదం కోసం పాము విషాన్ని దుర్వినియోగం చేసిన కేసులు భారత్‌లోనే నమోదవుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి. పాము విషం వల్ల మనసు మూడ్లు పలు రకాలు మారుతుందట. క్రమేణ బద్ధకం, దృష్టి అప్పష్టతకు కారణమవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ విషం మానవ రక్తంలో ప్రవేశించగానే శరీరం నెమ్మదిగా స్పందించేలా క్రియాశీల జీవక్రియలను విడుదల చేస్తుంది. ఫలితంగా శరీరం చచ్చుపడిపయేలా చేసేలా తీవ్ర దుష్ప్రభావాలను చూపిస్తుంది. ఐతే ఈ మత్తురాయళ్లు ఈ విషాన్ని ఎక్కించుకున్నప్పుడూ ఎలాంటి ప్రమాదం ఉండదు. వారు మత్తు కిక్‌లో తేలిపోతుంటారు. ఆ తర్వాత దాని ప్రభావం ఒక్కొక్కటిగా శరీరంపై చూపించడం మొదలవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాముల నుంచి విషం తీసేస్తే.. దేశంలో చాలా తక్కువగా నాగుపాములు, కొండచిలువలు ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం అవి అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. ఇలా పాములు నుంచి విషాన్ని సేకరించే పనులకు పాల్పడటం వల్ల అవి మరణిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పాములకు ఆహారాన్ని జీర్ణం చేయడంలో విషమే కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. దీంతో పాములు విషాన్ని కోల్పోయినప్పుడు త్వరితగతిన చనిపోతాయి. (చదవండి: మార్క్ జుకర్‌బర్గ్ మోకాలికి శస్త్ర చికిత్స..అసలేంటి చికిత్స? ఎందుకు?) -
ప్రాణం పోసే విషం.. లీటర్‌కు రూ.84 కోట్లు
సాధారణంగా విషం అంటే ప్రాణాలు తీసేది. పాములు, తేళ్లు, సాలీళ్లు ఇలా ఎన్నో రకాల జీవుల్లో విషం ఉంటుంది. కానీ అదే విషం కొన్నిసార్లు ప్రాణాలు కాపాడే ఔషధం కూడా. అలాంటిదే ‘డెత్‌స్టాకర్’ తేలు విషం. అత్యంత ప్రమాదకరమైన ఈ విషం ద్రవ పదార్థాల్లో ప్రపంచంలోనే అత్యంత విలువైనది కూడా. మరి దీని విశేషాలేమిటో తెలుసుకుందామా.. – సాక్షి, సెంట్రల్ డెస్క్ ‘ విషం నుంచే ఔషధం తేలు కుట్టిందంటే మంటతో విలవిల్లాడిపోతాం. కుట్టిన తేలును బట్టి కొన్నిసార్లు అస్వస్థత పాలవడం, మరికొన్నిసార్లు అయితే ప్రాణాలు పోవడం కూడా జరుగుతుంది. దీనికి కారణం తేలు కొండిలోని విషం. అందులోని న్యూరో ట్యాక్సిన్లు. అంటే మన శరీరంలోని నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే రసాయన పదార్థాలు. ఈ న్యూరో ట్యాక్సిన్లలో కొన్నిరకాలను అసాధారణ వైద్య చికిత్సల్లో వినియోగిస్తుంటారు. అందుకే వాటికి డిమాండ్ ఎక్కువ. ‘ మెదడు కేన్సర్ చికిత్సలో.. భూమ్మీద ఉన్న తేళ్లన్నింటిలోనూ ‘డెత్‌స్టాకర్’ తేళ్లు అత్యంత విషపూరితమైనవి. ఎక్కువగా ఉత్తర ఆఫ్రికా దేశాల్లో కనిపించే ఈ తేళ్లు రెండు నుంచి ఆరేళ్ల పాటు బతుకుతాయి. పది సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. వీటి విషంలో ‘క్లోరోట్యాక్సిన్’గా పిలిచే అత్యంత అరుదైన రసాయన పదార్థంతోపాటు మరికొన్ని ముఖ్యమైన న్యూరోట్యాక్సిన్లు ఉంటాయి. ఈ క్లోరోట్యాక్సిన్ మెదడులోని కేన్సర్ కణితులు మరింతగా విస్తరించకుండా అడ్డుకుంటుంది. అంతేగాకుండా మెదడులో కేన్సర్ సోకిన కణాలకు మాత్రమే అతుక్కుపోతుంది. దీనివల్ల వైద్యులు సర్జరీ చేసి కేన్సర్ సోకిన భాగాన్ని/కణాలను పూర్తిగా తొలగించేందుకు వీలవుతుంది. సాధారణంగా సర్జరీ తర్వాత కేన్సర్ కణాలు ఏమైనా మిగిలి ఉంటే.. వాటి వల్ల మళ్లీ కేన్సర్ తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది. క్లోరోట్యాక్సిన్ను మార్కర్‌గా వాడటం వల్ల ఈ సమస్య తప్పుతుంది. ‘ అత్యంత విలువైన విషం! ‘డెత్‌స్టాకర్’ తేలు విషం ధర ఒక లీటర్‌కు సుమారు రూ.84 కోట్లు (కోటి డాలర్లకుపైనే..). ఎందుకంత ధర అంటే.. ఈ విషంలో అత్యంత అరుదైన న్యూరోట్యాక్సిన్ ఉండటం, సేకరణ అత్యంత కష్టమైన పని అవడం, డిమాండ్ ఎక్కువగా ఉండటమే. ఒక తేలు నుంచి ఒకసారి కేవలం 2 మిల్లీగ్రాముల విషం మాత్రమే వస్తుంది. అంటే ఒక లీటర్ విషం కావాలంటే 10 లక్షల తేళ్ల నుంచి విషం సేకరించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల ఈ రకం తేళ్లను పెంచుతూ.. వాటి నుంచి విషాన్ని సేకరించి విక్రయిస్తుంటారు. ‘ప్రత్యేకంగా పరికరాన్ని రూపొందించి.. మామూలుగా తేళ్ల నుంచి విషం సేకరించడం కోసం.. మొదట వాటికి స్పల్ప స్థాయిలో కరెంట్ షాక్ ఇచ్చి, వాటి విష గ్రంధులను పరికరాలతో నొక్కుతారు. ఈ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తేళ్లు గాయపడటం, విష గ్రంధులు పగిలిపోవడం వంటివి జరుగుతాయి. ఈ నేపథ్యంలో మొరాకో శాస్త్రవేత్తలు తేళ్ల విషం సేకరణకోసం ఓ ప్రత్యేక పరికరాన్ని రూపొందించారు. తేళ్లను మెల్లగా పట్టుకుని, వాటి కొండిలను పరికరంలో పెడతారు. కొండిలోని విష గ్రంధుల వద్ద అతి సున్నితంగా కరెంట్ షాక్ ఇవ్వడం ద్వారా వాటంతట అవే విషాన్ని విడుదల చేస్తాయి. అవి గాయపడటం ఉండదు, ఎక్కువ విషం సేకరించవచ్చు. ‘ పాముల విషం నుంచి కూడా.. పాములు, తేళ్ల విషంలో ఉండే న్యూరోట్యాక్సిన్లు, ఇతర రసాయన పదార్థాలు మన శరీరంలోని నాడీ వ్యవస్థ, ఇతర అవయవాలపై ప్రత్యేకమైన ప్రభావం చూపుతాయి. ఒక్కో రకం జీవిలో భిన్నమైన రసాయన పదార్థాలు ఉంటాయి. వాటితో భిన్నమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా పాములు, తేళ్లు, ఇతర జీవుల విషం నుంచి సరికొత్త ఔషధాల అభివృద్ధికి పరిశోధనలు జరుగుతున్నాయి. వివిధ రకాల కేన్సర్లు, అధిక రక్తపోటు, గుండెపోటు, అల్జీమర్స్, పార్కిన్సన్స్, సుదీర్ఘకాలం బాధించే నొప్పులు వంటి సమస్యలకు పరిష్కారాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. -
ఇదెక్కడి వింత.. వ్యక్తిని కాటేసి ప్రాణాలు కోల్పోయిన కింగ్ కోబ్రా!
ప్రపంచములో చాలా ప్రమాదకరమైన పాములలో కింగ్ కోబ్రా(నల్లత్రాచు) ఒకటి. ఇవి అత్యంత విషపూరితమైనవి కూడా. కింగ్ కోబ్రా కాటు వేస్తే దాదాపు 15- 20 నిమిషాల్లోనే మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇందుకు భిన్నంగా ఉత్తర ప్రదేశ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ కింగ్ కోబ్రా మనిషిని కాటేసి చనిపోయింది. వివరాల్లోకి వెళితే.. బాగా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఖుషీనగర్ జిల్లా ఆసుపత్రి అత్యవసర విభాగానికి వచ్చాడు. వైద్యుల వద్దకు వెళ్లి కింగ్ కోబ్రా తనని రెండు సార్లు కాటు వేసిందని.. ఆ తర్వాత కొద్దిసేపటికే అది చనిపోయిందని తెలిపాడు. వైద్యులను నమ్మించేందకు ఆ వ్యక్తి చనిపోయిన కింగ్ కోబ్రాను పాలిథిన్ కవర్లో వేసి తన వెంట హాస్పిటల్‌కు తీసుకొచ్చి వైద్యులకు చూపించాడు. దీంతో పామును చూసిన వైద్యులు షాక్‌కు గురయ్యారు. అనంతరం సదరు వ్యక్తికి అత్యవసర విభాగంలో వైద్యం అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ మీమ్ పేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో తాగిన వ్యక్తి హాస్పిటల్ బెడ్‌పై పడుకొని వైద్యులతో మాట్లాడటం కనిపిస్తోంది. తన పాదంపై ఉన్న పాము కాటుని చూపించి అవసరమైన వైద్యం చేయాలని వైద్యులను కోరాడు. నెట్టింట్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈఘటనపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Shivam Kashyap (@kashyap_memer) -
మెడలో విష సర్పంతో అతిచేష్టలు.. నిండు ప్రాణం బలి!
లక్నో: పాములు పట్టేవాడు.. ఏదో ఒకనాడు దాని కాటుకే బలవుతాడంటారు. ఇది నిజమని నిరూపించింది ఇక్కడో ఘటన. ఊరిలో పాములు పట్టి వాటిని కాపాడే యత్నం చేసే ఓ వ్యక్తి.. తన ‘అతి’ చేష్టలతో, నిర్లక్ష్యంతో దాని కాటుకే ప్రాణం పొగొట్టుకున్నాడు. ఉత్తర ప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లా పరిధిలోని జైతీపూర్ గ్రామంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. దేవేంద్ర మిశ్రా అనే వ్యక్తి అప్పుడప్పుడు గ్రామంలో, చుట్టుపక్కల ఊళ్లలో ఇళ్లలో దూరిన పాముల్ని పట్టి.. వాటిని ఊరి బయట అడవుల్లో సురక్షితంగా వదిలేస్తుంటాడు. ఈ క్రమంలో తాజాగా రవీంద్ర అనే వ్యక్తి ఇంట్లో కట్లపాము దూరిందన్న సమాచారం అందుకున్నాడు. ఆ విష సర్పాన్ని ఓ కర్ర సాయంతో అతి సులువుగా పట్టుకుని.. దానితో ఊరంతా కలియదిరిగాడు. అక్కడితో ఆగకుండా దానిని ఓ చిన్నారి మెడలో వేసి ప్రదర్శించి.. ఆపై తన మెడలోనూ వేసుకుని ఊరంతా తిరిగాడు. అలా రెండు గంటలు గడిచిన తర్వాత.. పాము తల పట్టుసడలి అతన్ని కాటేసింది. వెంటనే దానిని మళ్లీ బంధించి.. ఓ కుండలో బంధించాడు. అయితే ఆస్పత్రికి వెళ్లకుండా.. ఆకు పసర్లతో గాయానికి చికిత్స చేసుకున్నాడు అతను. ఆపై ఇంటికి చేరుకుని పడుకున్నాడు. పాము మరీ విషపూరితం కావడంతో.. అవేం పని చేయక అతని ప్రాణం పోయింది. అటు కుండ కింద ఉంచిన పాము కూడా చచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. సకాలంలో వైద్యం అంది ఉంటే అతని ప్రాణం దక్కేదని వైద్యులు చెప్తున్నారు. ఇదీ చదవండి: లాడ్జిలో రిమాండ్ ఖైదీ సరసాలు -
పాముపై పగ తీర్చుకున్న 2 ఏళ్ల చిన్నారి.. ఏం జరిగింది?
ఇస్తాంబుల్: పాములు పగ తీర్చుకునే సంఘటనలు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. నిజ జీవితంలోనూ అక్కడక్కడ జరిగినట్లు తెలుసు. కానీ, పాముపై పగ తీర్చుకున్న సంఘటన ఎప్పుడైనా విన్నారా? అవునండీ.. నిజమే, తనను కాటు వేసిందనే కోపంతో ఓ రెండేళ్ల చిన్నారి పాముపై పగ తీర్చుకుంది. దానిని నోటితో ముక్కలు ముక్కలు చేసింది. ఈ సంఘటన టర్కీలోని కంతార్ గ్రామంలో జరిగింది. గ్రామంలోని తన ఇంటి వెనకాల పెరటిలో చిన్నారి ఆడుకుంటోంది. ఒక్కసారిగా పెద్దగా అరిచింది. దీంతో ఏదో జరిగిందని ఆందోళన చెందిన చుట్టుపక్కలవారు పరుగున పెరట్లోకి వెళ్లారు. అయితే, ఆ చిన్నారిని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పాప నోట్లో పాము ఉంది. మరోవైపు.. చిన్నారి కింది పెదవిపై పాము కాట్లు ఉన్నాయి. వెంటనే చిన్నారికి ప్రథమ చికిత్స అందించి స్థానిక బింగోల్ మెటర్నిటీ, చిల్డ్రెన్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సమక్షంలో 24 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచారు. చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ‘మా పాప చేతిలో పాము ఉన్నట్లు ఇరుగుపొరుగు వాళ్లు నాకు చెప్పారు. దాంతో ఆమె ఆడుకుంటుండగా కాటు వేసింది. ఆ కోపంతో ఆమె పామును కొరికేసింది.’ అని పాప తండ్రి మెహ్మెట్ ఎర్కాన్ పేర్కొన్నారు. మరోవైపు.. పాము కాటుకు గురైన ఓ 8 ఏళ్ల బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన సంఘటన టర్కీలోని మరో ప్రాంతంలో జరిగింది. చేతిపై కాటు వేయటంతో సాదారణ సైజ్‌తో పోలిస్తే ఐదింతలు ఉబ్బిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇదీ చదవండి: పోలీసులకు చిక్కకుండా గర్ల్‌ఫ్రెండ్ టెడ్డీబేర్‌లో దాక్కున్న దొంగ.. చివరికి -
సర్పాలతో మేలే.. ఏపీలో విషపూరిత సర్ప జాతులు నాలుగే
నల్లమల అభయారణ్యం ఎన్నో జీవజాతులకు ఆలవాలం. వందల రకాల పక్షులు, జంతువులతో పాటు పాములు కూడా ఎక్కువగా సంచరిస్తుంటాయి. విషపూరితమైన వాటితో పాటు విష రహిత పాములూ ఎక్కువే. ఈ నేపథ్యంలో సర్పాలపై ప్రత్యేకంగా డాక్యుమెంటరీ తయారు చేసి రైతులకు అవగాహన కల్పించేందుకు అటవీ శాఖ చర్యలు చేపడుతోంది. పెద్దదోర్నాల: సర్పాలంటే ప్రతి ఒక్కరికీ అంతు లేని భయం. విష పూరితమైన సర్పాలంటే గుండెల్లో దడ. పాము కనబడగానే దాన్ని మట్టుబెట్టడమో లేదా దానిని పట్టుకోవటానికి శిక్షణ పొందిన వారిని ప్రేరేపించటమో చేస్తుంటాం. అయితే మనకు ఎదురు పడిన పాములన్నీ మానవాళికి కీడు చేసేవి కావన్న నిజాన్ని గ్రహించాలని జీవశాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. పాములలో ఎన్నో రకాల జాతులు విషం లేనివే. వాటికి కోరలే ఉండవు. కాటు వేస్తే గాయమవడమే తప్ప ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదు. దీంతో పాటు కొన్ని పాముల వల్ల మానవాళికి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. పాము కాటుకు విరుగుడుగా ఉపయోగపడే యాంటీ వీనమ్‌ను తయారు చేయాలంటే దానికి పాము విషమే కావాలి. పర్యావరణ పరిరక్షణలో ఎన్నో రకాల సర్పాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. రైతులకు పరోక్షంగా సర్పరాజులు చేసే మేలు అంతా ఇంతా కాదు. వరి, గోధుమ లాంటి పంటలను నాశనం చేయటంలో మూషికాలదే ప్రధాన పాత్ర. అటువంటి మూషికాలను పాములు వేటాడి, వెంటాడి భక్షించటం వల్లనే పంటలకు మేలు జరుగుతుంది. దేశ వ్యాప్తంగా సుమారు 300 రకాలకు పైగా సర్పాలుంటే, వాటిలో కొన్ని రకాల పాములు మాత్రమే ప్రమాదభరితమైనవిగా గుర్తించినట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వాటిల్లో కూడా ఎక్కువగా సముద్ర జలాల్లోనే జీవిస్తుంటాయి. చదవండి: (AP: అర్ధరాత్రి వరకు హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి) విషపూరితమైన పాములతో అప్రమత్తంగా ఉండాలి నల్లమలలో సంచరించే విషపూరితమైన పాముల్లో ప్రధానంగా చెప్పుకునే సర్పజాతులు నాలుగు రకాలు ఉన్నాయి. వాటిలో నాగుపాము, రక్త పింజర, కట్లపాము, చిన్న పింజర పాములు ఉన్నాయి. నాగుపాము పడగ విప్పుకొని మనుషులను భయపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. నాగుపాములకు ఎలుకలు మంచి ఆహారం. ఎలుకల కోసమే నాగుపాములు పొలాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. దీంతో పాటు ఆకారంలో ఎంతో చిన్నదిగా ఉండేవి చిన్న పింజర పాములు. ఎంత ఆకారంలో చిన్నదైనా దీని విషం మాత్రం చాలా భయంకరమైంది. అది మనుషులపై మెరుపు వేగంతో దాడి చేస్తుంది. ఖాళీ ప్రాంతాలు, బీడు ప్రాంతాల్లో ఎక్కువగా ఇది కనబడుతుంది. గడ్డి లోపల, కాలిన ఆకుల మధ్య ఎక్కువగా ఉంటుంది. కట్లపాము రాత్రి పూట మాత్రమే ఆహారాన్ని వెతికే పనిలో ఉంటుంది. ఈ క్రమంలో నేల మీద పడుకుని ఉన్న వారిని కాటు వేసే ప్రమాదం ఉంది. రాత్రి వేళల్లో తిరిగేటప్పుడు ఎక్కువగా దీని వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. దాని పెద్ద ఆకారం, పెద్ద కోరలు, భయంకరమైన విషం. పాము కాట్ల మరణాలకు ఎక్కువ కారణం రక్తపింజరే. రాలిపోయిన ఆకుల మధ్య ఎక్కువగా దాక్కుని ఉంటుంది. చదవండి: (టీఎస్ఆర్టీసీ చార్జీల పెంపు.. ఏపీఎస్ఆర్టీసీకి రాబడి) విషరహితమైన పాములతో ప్రమాదమే లేదు నల్లమల అభయారణ్యంలో సంచరించే విషరహిత పాముల్లో పసిరిక పాము, జెర్రిపోతు, రెండు తలల పాములు, మట్టిపాములు లాంటివి ఎక్కువగా ఉంటాయి. వాటిలో చెట్లపై ఉండే పసిరిక పాములు ఆకుల రంగులో ఉండి పక్షుల గుడ్లు, చిన్న చిన్న పురుగులను తిని జీవిస్తుంటాయి. జెర్రిపోతు పాములకు భయం ఎక్కువగా ఉంటుంది. మానవాళికి వీటి వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. భూమి లోపల ఉండే పాముల్లో రెండు తలల పాములు ఒకటి. దాని వల్ల ఏ ప్రమాదం ఉండదు. అవి వేగంగా పరిగెత్తలేవు. దగ్గరలో ఉన్న బొరియల్లో ఎక్కువగా ఉంటాయి. మరో పాము మట్టిపాము. దీని వల్ల కూడా ఎవరికీ ప్రమాదం ఉండదు. ఇవి ఎక్కువగా ఎలుకలను తిని జీవిస్తుంటాయి. -
పాము విషం విక్రయం గుట్టురట్టు.. ఒక కిలో పాము విషం కోటిన్నర..?!
భువనేశ్వర్: పామువిషం విక్రయం గుట్టురట్టయింది. ఈ మేరకు ముందస్తు సమాచారం పోలీసులకు అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఈ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, స్టేషన్‌కి తరలించారు. అనంతరం వారి నుంచి 1 కిలోగ్రాము పాము విషం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.1.50 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం జప్తు చేసిన పాము విషం పరీక్షల కోసం ప్రయోగశాలకు తరలించారు. పట్టుబడిన నిందితుల్లో సంబల్పూర్ జిల్లా, సిందూర్‌పంక్ గ్రామస్తుడు కైలాస్ సాహు, సఖిపొడా గ్రామస్తుడు రంజన్‌కుమార్ పాఢి ఉన్నారు. రాష్ట్రేతర ప్రాంతాల నంచి సేకరించిన పాము విషాన్ని దేవ్‌గఢ్ ప్రాంతంలో విక్రయించేందుకు మంతనాలు జరుగుతుండగా, పోలీసులు దాడి చేసినట్లు సమాచారం. చదవండి: (24న కేంద్ర మంత్రివర్గ సమావేశం.. ఆ బిల్లుల ఉపసంహరణ..) -
10 నాగుల నుంచి తులం విషం.. లీటర్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
సాక్షి, వెల్దుర్తి (కర్నూలు): పాములోళ్ల నుంచి నాగు పాముల విషాన్ని తులం (10 గ్రాములు) రూ.4 వేలకు కొంటారట. అదే విషాన్ని దళారులు రూ.40 వేలకు అమ్ముతారట. దేశీయ మార్కెట్లో లీటరు నాగు పాముల విషం ధర రూ.40 లక్షలట. అంతర్జాతీయ మార్కెట్లో ఆ ధర రూ.కోటి పైమాటేనట. అంతటి విలువైన విషాన్ని ప్రాణాలొడ్డి మరీ పాముల నుంచి కక్కించే పాములోళ్లు మాత్రం కూటికి లేని నిరుపేదలే. వెల్దుర్తి వద్ద నాగుపాముల్ని ఒడిసి పట్టి వాటి విషం సేకరించే వారి నుంచి ‘సాక్షి’ సేకరించిన ఆసక్తికర విషయాల్లోకి వెళితే... విషం తీసేందుకు తెచ్చిన నాగులను చూపుతూ.. నాగుల నుంచే సేకరిస్తారు కట్ల పింజరి, కట్ల పాము, రాచ నాగు తదితర విషం కలిగిన పాములున్నా.. పాములోళ్లు నాగు పాముల్ని మాత్రమే పట్టుకుంటారు. ఎందుకంటే.. మన రాష్ట్రంలో నాగు పాములు విరివిగా దొరుకుతాయి. సరీసృపాల జాతికి చెందిన ఆడ నాగులు 12 నుంచి 30 వరకు గుడ్లు పెడతాయి. రెండు నెలలు పొదుగుతాయి. అప్పుడే పుట్టిన పిల్ల పాములకు సైతం పూర్తిస్థాయిలో పనిచేసే విషపు గ్రంథులుంటాయి. ఏ వయసు నాగు పామును పట్టినా విషం సేకరించేందుకు అవకాశం ఉంటుంది. నాగు పాము చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇతర పాములకు భిన్నంగా నాగు పాము పడగ విప్పుతుంది. పాముకాటు వేసినచోట పాము తల నుంచి తీసిన రాయి, నాగమల్లి చెట్టు వేరు టి పడగ వెనుక వివిధ రంగుల్లో కృష్ణపాదాలు (అండాకార గుర్తుల నడుమ గీత, లోపలి వైపు వివిధ ఆకారాలు) ఆకర్షణీయంగా ఉంటాయి. పాములోళ్ల నాద స్వరానికి అనుగుణంగా (పాములకు చెవులు లేకపోయినా నాదస్వరం కదలికలకు, పాములోడి కాళ్లు భూమిని తడుతుంటే వచ్చే తరంగాలకు) పడగ విప్పి ఆడే నాగు పాముల ఆట చూసేవాళ్లకు హృద్యంగా ఉంటుంది. నాగు పాము విషం సేకరణకు, ప్రదర్శనలతో డబ్బు సంపాదించేందుకు ఉపయోగపడుతుంది. అందువల్లే పాములోళ్లు నాగు పాములను మాత్రమే పడుతుంటారు. 10 నాగుల నుంచి తులం విషం పాములోళ్లు 10 నాగు పాముల నుంచి తులం విషం సేకరిస్తారు. నాగు తల పైభాగం, దానికి కిందనున్న భాగాన్ని చేతులతో గట్టిగా నొక్కుతూ పాము విషపు గ్రంథులను అదమటం ద్వారా కోరల్లోంచి విషాన్ని కక్కిస్తారు. అలా సేకరించిన విషాన్ని దళారులకు తులం రూ.4 వేలకు కొంచెం అటూఇటుగా అమ్ముకుంటున్నారు. దళారి ఆ విషాన్ని ఏం చేస్తున్నాడు, ఎంతకు అమ్ముకుంటున్నాడన్నది వీరికి పట్టదు. అలా సేకరించిన విషాన్ని దళారులు పది రెట్లు అధిక ధరకు విక్రయిస్తారని తెలుస్తోంది. పాములోళ్లు సేకరించిన విషాన్ని రబ్బరు మూత గల చిన్న గాజు సీసాలో భద్రపరుస్తారు. దళారులు విషాన్ని కొనే సమయంలో దాని నాణ్యతను పరీక్షించి మరీ కొంటున్నారట. దళారులు కోడిని తెచ్చి దానికి చిన్నపాటి గాయం చేస్తారట. పాములోళ్లు సేకరించిన విషాన్ని పిన్నీసు మొనతో గాయమైన కోడికి పూస్తారు. అది అరగంటలో మరణిస్తే నాణ్యమైనదిగా గుర్తిస్తారట. లేదంటే ఆ విషాన్ని కొనరట. 4వ తరగతి చదువుతూ కరోనా పరిస్థితులలో తల్లిదండ్రులకు తోడుగా వచ్చి భిక్షమెత్తుతున్న చరణ్‌తేజ్ అంతర్జాతీయంగా డిమాండ్ పాము విషం మనిషి ప్రాణాల్ని కాపాడటానికి కూడా ఉపయోగపడుతుంది. పాము విషానికి ముఖ్యంగా విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. గుండె సంబంధిత వ్యాధులు, రక్త పోటు వంటి రోగాలకు ఉపయోగించే కొన్నిరకాల ఔషధాల్లోనూ పాము విషాన్ని వినియోగిస్తారట. విషానికి విరుగుడుగా వైద్యులు అందించే సూది మందును సైతం స్వల్పశాతం విషం ఉపయోగించే తయారు చేస్తారట. పాములు పట్టే తల్లిదండ్రులతో పిల్లలు చరణ్‌తేజ్, అమ్ములు, మైల ఇదే మా జీవనాధారం మాది ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతం. నంద్యాల బొమ్మల సత్రంలో పదుల కుటుంబాలతో కలిసి ఉంటున్నాం. ఎరుకల జాతికి చెందిన మాకు తాతల కాలం నుంచి నాగుపాములు పట్టడం, వాటినుంచి విషం తీసి అమ్మడమే తెలిసిన విద్య. మా నాన్న బళ్లారి ప్రాంతంలో పాము కాటుతోనే మరణించాడు. ఆ సమయంలో ఆయన వద్ద నాగమల్లి వేరు లేకపోవడమే కారణం. నాగమల్లి వేరు, పాము తల నుంచి సేకరించిన రాయి లేకపోతే మేం కూడా పాములు పట్టలేం. అవే మా ధైర్యం. పాముకాటుకు గురైన వాళ్లు మా వద్దకు వస్తే నాగమల్లి వేరుతో నయం చేస్తుంటాం. – హనుమంతు (గురునాథం బాబు), పాములు పట్టే వ్యక్తి -
సిగ్గెక్కువ.. కానీ, కాటేస్తే వందమంది ఖతం!
ఈ భూమ్మీద సమస్త జీవరాశుల్లో సర్పాలు ఉన్నాయి. కానీ, మనుషుల భయాలు, అపోహలతో వాటి జనాభా తగ్గిపోతూ వస్తోంది. ఇది ఎంతవరకు సరైందన్నది పక్కనపెడితే.. చాలామందిలో చెడును చెప్పడానికి ‘పాములాంటోడు’ అని వర్ణిస్తుంటారు. కానీ, అవి అంత ప్రమాదకరమైనవి మాత్రం కావు. ఈ భూమ్మీద దాదాపు 4 వేల జాతుల దాకా పాములు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్తగా కనుగొంటూ పోతున్నారు. ఈ మొత్తంలో 650కి(25 శాతం) పైగా జాతులు మాత్రమే విషపూరితమైనవని సైంటిస్టులు ఇప్పటిదాకా(జులై 7 రిపోర్ట్ ప్రకారం) గుర్తించారు. అందులోనూ 200 జాతుల(10 శాతం) పాముల నుంచి మాత్రమే మనిషికి ముప్పు ఉంటోందని తేల్చారు. కానీ, అవేం పట్టించుకోకుండా కనిపిస్తే చంపేస్తూ.. వాటి జనాభాను తగ్గించేస్తున్నారు. అందుకే వాటి పరిరక్షణ కోసం, పాములన్నీ ప్రమాదకరమైనవి కాదని జనాల్లో అవగాహన కల్పించాలని.. అందుకోసం ఓ రోజు ఉండాలని జులై 16న వరల్డ్ స్నేక్ డే ను నిర్వహిస్తున్నారు కొందరు(స్నేక్ సొసైటీలు). ప్రతీ ఏడాది ఇదే థీమ్‌తో ముందుకు సాగుతున్నారు. వాసన కోసం నాలిక పాములకు చూపు సామర్థ్యం చాలా తక్కువ. చెవుల్లేకున్నా వినికిడి శక్తి కూడా పరిమితంగానే ఉంటుంది. పాము కింది దడవలో ఉన్న ఎముకలు శబ్దతరంగాలను పసిగడతాయి. కానీ, వాసన విషయంలో మాత్రం గొప్ప సామర్థ్యం కలిగి ఉంటాయి. అవి నాలుకతోనే వాసనను పసిగడతాయి. అందుకే ఎప్పుడూ అవి నాలికను అలా బయటకు ఆడిస్తుంటాయి. అత్యంత విషపూరితమైనవి విషానికి ప్రాథమిక కొలమానం ఎల్డీ 50. లెథాల్ డోస్ 50 పర్సంట్ టెస్ట్ అని పిలుస్తారు దీన్ని. ఈ పద్దతిలో పాముల విషాన్ని పరిశీలించే.. అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన పాముల జాబితాను సిద్ధం చేస్తుంది ఇంటర్నేషనల్ స్నేక్ సొసైటీ. ఈస్ట్రన్ బ్రౌన్ స్నేక్.. ఆస్ట్రేలియాలో కనిపించే అత్యంత ప్రమాదకరమైన పాము జాతి. దీని విషం నిమిషాల్లో మనిషిలో అంతర్గతంగా రక్త స్రావం అయ్యేలా చేస్తుంది. కిడ్నీలను పాడు చేస్తుంది. ఒక్కోసారి మెదడుకు చేరి పక్షవాతాన్ని కలగజేస్తుంది. చివరికి రక్తం గడ్డకట్టేలా చేసి మనిషి ప్రాణం తీస్తుంది. టైగర్ స్నేక్ ఎలాపిడ్ జాతికి చెందిన టైగర్ స్నేక్ పాములు కూడా ఆస్ట్రేలియా గడ్డపైనే కనిపిస్తాయి. ఒంటిపై ఉండే మచ్చల కారణంగా వాటికి టైగర్ స్నేక్ అనే పేరొచ్చింది. నివాస ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తూ.. అరగంటలో మనిషి మరణానికి కారణం అవుతుంటాయి. టైగర్స్నేక్స్ విషం నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపెడుతుంది. కండరాల్లో రక్తం గడ్డ కట్టేలా చేస్తుంది. కోబ్రా తరహాలో పడగ విప్పి.. భయపెడుతుంది. ఇన్‌ల్యాండ్ టైపాన్ ఈ భూమ్మీద అత్యంత విషపూరితమైన పాము ఇది(అనధికారికంగా). వంద గ్రాముల విషంతో వంద మందిని చంపగలిగే సామర్థ్యం ఉన్న పాము ఇది. వంద గ్రాముల విషాన్ని ఒకే కాటుతో దింపగలదు ఇది. కానీ, ఎల్డీ50 ప్రకారం(త్వరగా ప్రాణం తీసే లెక్కప్రకారం).. లిస్ట్ వల్ల మూడో ప్లేస్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ విషం ప్రభావంతో గంటలో ప్రాణం పోవడం ఖాయం. ఇవి జనారణ్యానికి దూరంగా ఏకాంతంగా బతుకుతాయి. ఈ పాముకి ‘సిగ్గు’ ఎక్కువ అని అంటుంటారు. మనుషులను చూస్తే.. ఇవి వేగంగా పాక్కుంటూ వెళ్లి ఓ మూల దాక్కుంటాయి. అలా ఈ డేంజర్ స్నేక్కు ‘సిగ్గున్న పాము’గా ముద్దు పేరు వచ్చింది. రస్సెల్స్ వైపర్ ఆసియాలో అత్యంత ప్రమాదకరమైన పాము జాతిగా పేరుంది రస్సెల్స్ వైపర్‌కి. అంతేకాదు ఎక్కువ మరణాలకు కారణమైన జాతి కూడా ఇదే. దీనిని గుర్తించడం కూడా చాలా తేలిక. భయంతో ఉన్నప్పుడు అది గట్టిగా శబ్దం చేస్తుంటుంది. కాటు వేసిన మరుక్షణం నుంచే విషం శరీరంలోకి ఎక్కేస్తుంటుంది. ఒక్క రస్సెల్స్ వైపర్ గక్కే విషంతో లక్షా యాభై వేల ఎలుకలను చంపొచ్చనేది సైంటిస్టుల మాట. బ్లూ క్రాయిట్ ఆసియాలో ప్రమాదకరమైన పాముల్లో దీని పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంటుంది. దీని విషయం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపెడుతుంది. చికిత్స అందినా సగం మంది చనిపోతుంటారు. అంత ప్రమాదకరమైంది ఈ పాము విషం. ఇవి విషపూరితమైన పాముల్నే ఆహారంగా తీసుకుంటాయి. జనసంచారానికి దూరంగా పగటి పూట పచ్చిక బయళ్లలో, అడవుల్లో స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి ఇవి. బూమ్స్లాంగ్ క్లౌబ్రిడ్ కుటుంబంలో అత్యంత విషపూరితమైన పాము జాతి ఇది. రంగు రంగుల్లో ఉంటాయి ఇవి. విషం అంత విషపూరితమైనది కాకపోయినా.. రక్తస్రావం కారణంగా ప్రాణం పోతుంటుంది. అందుకే ప్రమాదకరమైన పాముల లిస్ట్‌లో చేర్చారు. అయితే ఇవి మనుషులు కనిపిస్తే.. దూరంగా వెళ్లిపోతుంటాయి. ఇవి దాడులు చేసే సందర్భాలు చాలా తక్కువ. చెట్ల మీద ఉంటూ పక్షుల్ని, పురుగులని తింటాయి. మోజావే రాటెల్స్నేక్ అమెరికా నుంచి పాము జాతుల్లో అత్యంత విషపూరితమైన లిస్ట్‌లో ఫస్ట్ కనిపించేది ఇదే. రక్తం, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపెడుతుంది దీని విషం. నైరుతి అమెరికా పప్రాంతంలో ఎక్కువ మరణాలు సంభవించేది ఈ పాముల వల్లే. స్టిలెట్టో స్నేక్ పరిణామంలో చిన్నగా ఉండి, కలుగుల్లో దాక్కునే పాము ఇది. కానీ, విషపూరితమైంది. అయితే అదృషవశాత్తూ ఇది ఎక్కువ విషాన్ని కక్కదు. కానీ, దీని విషం ఎంత ప్రమాదకరమంటే.. కణజాలాన్ని దెబ్బ తీయడంతో పాటు గుండె పనితీరును స్తంభింపజేస్తుంది. అంతేకాదు వీటిని పట్టడం కూడా అంత ఈజీ కాదు. కోరలు కూడా విచిత్రంగా వంగి ఉంటాయి. కాబట్టి, నేరుగా కాకుండా వంగి మరీ కాటు వేస్తుంది స్టిలెట్టో. సా స్కేల్డ్ వైపర్ ఇది అంత విషపూరితమైన పాము కాదు. కానీ, ప్రమాదకరమైన జాతిలో ఒకటి. భారత్ తో సహా చాలా దేశాల్లో ఇవి కనిపిస్తుంటాయి. చిన్నసైజులో ఉన్నప్పటికీ అగ్రెసివ్‌గా ఇవి దాడులు చేస్తాయి. వైపర్ జాతి పాముల్లాగే రక్తం గడ్డకట్టించి చంపుతాయి. అయితే విరుగుడు వెంటనే ఇవ్వకపోతే బతకడం కష్టం. ఇసుకలో దాక్కుని వేటాడుతుంటాయి. ఒకవేళ దగ్గరగా వెళ్లాలని ప్రయత్నిస్తే.. గట్టిగా శబ్ధం చేస్తూ భయపెడుతుంటాయి. కింగ్ కోబ్రా విషానికి బ్రాండ్ అంబాసిడర్ ఈ జాతి. అత్యంత పొడవైన విషపూరితమైన పాము కింగ్ కోబ్రా. పైన చెప్పుకున్నంత రేంజ్లో వీటిలో విషం లేకపోయినా.. ఎక్కువ పరిమాణంలో విషం చిమ్మడం, కాటు వేయడంతో పాటు రూపంతోనే భయపెట్టేస్తుంటాయివి. ఇక ఆడ పాము గూడుకట్టి గుడ్లు పెట్టాక.. మగపాముతో కలిసి కాపలా కాస్తుంటుంది. వీటితో పాటు కోస్టల్ టైపాన్, బాండెడ్ క్రాయిట్, కామన్ డెత్ ఆడర్, సముద్రంలో ఉండే బీక్డ్ సీ స్నేక్, ఆఫ్రికన్ డేంజరస్ స్నేక్ జాతి ‘బ్లాక్ మాంబా’, చైనీస్ కోపర్హెడ్, సౌత్ అమెరికన బుష్‌మాస్టర్, ఫర్ డె డాన్స్, బెల్చర్స్ సీ స్నేక్, బ్లూ మలయన్ కోరల్ స్నేక్.. ఆ తర్వాతి స్థానాలో ఉన్నాయి. ఇక వీటితో పాటు విషం లేని బుక్స్నేక్(నార్త్ అమెరికా, అమెరికా), కొండ చిలువ జాతికి చెందిన పాములు, జెనస్ యూనెక్టస్కు చెందిన వాటర్ బోస్(అనకొండ) కూడా ఈ భూమ్మీద ఉన్నాయి. అదృష్టం అంటే దీనిదే.. చాలాకాలం కిందట వైరల్ అయిన వీడియో ఇది How could we dedicate #WorldSnakeDay to anything else? 🐍#PlanetEarth2 pic.twitter.com/B4YxSxqmvm — BBC Earth (@BBCEarth) July 16, 2018 "I'm asking you to respect these creatures, because they have a right to be on Earth, the same way we do." We know many of you may be scared of snakes but it's #WorldSnakeDay, so we asked the 'Snake Man of Lagos' - Dr Mark Ofua - why it's so important we protect them. 🐍 pic.twitter.com/DgWc12NvoS — BBC News Africa (@BBCAfrica) July 16, 2019 -
బ్లూ స్నేక్.. కనిపించేంత సాఫ్ట్ కాదు సుమీ..
పాము కల్లోకొస్తే గజగజ వణికిపోతాం. కళ్లెదురుగా కనిపిస్తే బిగుసుకుపోతాం. ‘పపపపపపపపప.. పాము...’ అంటూ పరుగులు తీస్తాం. అలాంటి సరీసృపాలను మనం అనేకం చూశాం. కానీ ఇక్కడ మీకు చెప్పబోయే పాము కొంచెం ప్రత్యేకమైనది. దీని రంగు కూడా కాస్తా ఆ భిన్నంగానే ఉంది. ఇప్పటి వరకు నీలి(బ్లూ) రంగు పాములను చూసిన వారు తక్కువే.. వాటిని లెక్కపెడితే వేళ్లల్లో కూడా ఉండకపోవచ్చు. లేత నీలి రంగులో ఉండే ఈ పాము పేరు బ్లూ పిట్ వైర్. దీనిని ‘లైఫ్ ఆన్ ఎర్త్’ అనే అకౌంట్ నుంచి ట్విటర్లో పోస్టు చేశారు. ఈ వీడియోను చూస్తుంటే ఓ తోటలో చెట్టుకున్న గులాబీ పువ్వును వాటేసుకొని చక్కగా అతుక్కుపోయినట్లు కనిపిస్తోంది. (ఆమె నోటిలో నుంచి 4 అడుగుల పాము..) ప్రస్తుతం ఈ పాముకు చెందిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఏకంగా రెండు మిలియన్ల వ్యూవ్స్ సంపాదించింది. ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ పాముపై నెటిజన్లు మనసు పారేసుకుంటున్నారు. చూడటానికి ఎంతో ముద్దుగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది పైకి కనిపించే అంతా సాఫ్ట్ కాదట ఈ పాము. ఇది అత్యంత విషపూరితమైనది. అంతే కాక ప్రాణాంతకమైన ఈ పాము కరిస్తే తీవ్రమైన నొప్పి, రక్తస్రావం అవుతుంది. మాస్కో జంతు ప్రదర్శకుల ప్రకారం.. పిట్ వైపర్ జాతీ పాములు సాధారణంగా తెలుపు, ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇలా నీలం రంగులో ఉండటం అరుదు. ఇవి ఇండోనేషియా, తూర్పు తైమూర్లలో కనిపించే విషపూరిత పిట్ వైపర్ ఉప జాతులు. (13 అడుగుల మొసలిని కామ్‌గా తొలగించాడు) The incredibly beautiful Blue Pit Viper pic.twitter.com/zBSIs0cs2t — Life on Earth (@planetpng) September 17, 2020 -
బాత్రూమ్లో 35 పాము పిల్లలు
-
బాత్రూమ్లో 35 పాము పిల్లలు
సాక్షి, చెన్నై: పాము కనిపిస్తేనే భయంతో ఆమడ దూరం పరుగులు తీస్తాం. అలాంటిది ఒకరి కాదు రెండు కాదు ఏకంగా 35 పాము పిల్లలు ఒక్కసారిగా కనిపిస్తే చూసినవాళ్ల పరిస్థితి ఎలా ఉంటదో ఊహించారా? ఇలాంటి సంఘటనే తమిళనాడులో ఓ వ్యక్తికి ఎదురైంది. రెండు రోజుల క్రితం కోయంబత్తూరు ఈ ఘటన చోటుచేసుకోంది. కోవిమేడుకు చెందిన మనోహరన్ శుక్రవారం స్నానం చేయడానికి బాత్రూమ్కు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ 35 పాము పిల్లలను గమనించాడు. దాంతో భయంతో అక్కడ నుంచి పరుగులు పెట్టాడు. అనంతరం తేరుకుని వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చాడు. అతడు ఆ పాములను పట్టుకుని, వాటిని రస్సెల్ వైపర్‌గా గుర్తించి, సత్య మంగళం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. పామును పట్టుకున్న అంజనీకుమార్ హైదరాబాద్: నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ నివాసం వద్ద శనివారం ఉదయం ఓ పాము కలకలం సృష్టించింది. సీపీ వాహనం సమీపంలో ఓ జెర్రిపోతు ఉండటం చూసి, ఆయన పెంపుడు శునకం గుర్తంచి అరుస్తూ అప్రమత్తం చేసింది. ఆ పామును పట్టుకున్న కొత్వాల్ అంజనీకుమార్ జూ పార్క్‌కు పంపించారు. -
రూ. 82 కోట్ల విలువైన పాము విషం పట్టివేత
సిలిగురి: పశ్చిమ బెంగాల్లో పాము విషం అక్రమ రవాణాకు అడ్డుకట్టపడడం లేదు. తాజాగా రెండు ఘటనల్లో రూ. 82 కోట్ల విలువ చేసే పాము విషాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాము విషాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను డార్జిలింగ్ జిల్లాలో పట్టుకున్నారు. శషస్త్ర సీమ బల్(ఎస్ఎస్బీ) సిబ్బంది వీరిని అదుపులోకి తీసుకుని పాము విషంతో కూడిన రెండు జాడీలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో రూ. 70 కోట్లు ఉంటుందని అంచనా చేశారు. నిందితులను విచారిస్తున్నామని ఎస్ఎస్బీ 41బీఎన్ కమాండెంట్ రాజీవ్ రాణా తెలిపారు. దక్షిణ దినాజ్‌పూర్‌లోని సోమవారం రాత్రి రూ. 12 కోట్ల విలువ చేసే పాము విషాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంగారాంపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఫుల్బరీ-ప్రాణసాగర్ ప్రాంతంలో అటవీ అధికారులతో కలిసి ఎస్ఎస్బీ, బీఎస్ఎఫ్ నిర్వహించిన దాడుల్లో రెండు జాడీల్లో దాచిన పాము విషాన్ని కనుగొన్నారు. నిందితుడొకరిని అరెస్ట్ చేశారు. ఔషధాలు, సౌందర్య సాధనాలు తయారు చేయడానికి ఉపయోగించే పాము విషానికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఒక్క గ్రాము విలువ లక్ష రూపాయలు పైగా ఉంటుందని అంచనా. ప్రపంచంలో ఏ దేశంలో జరగనంతగా ఒక్క భారత దేశంలోనే పాము విషం స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ పాము విషం అక్రమ రవాణా చాలా ఎక్కువ. పాము విషం స్మగ్లింగ్ చేస్తూ నిందితులు పట్టుబడడం బెంగాల్లో సాధారణంగా మారింది. -
ఆ పాము విషం.. రూ. 20 కోట్లు!
పాము విషంతో రకరకాల ఔషధాలు, సౌందర్య సాధనాలు కూడా తయారుచేస్తారని మనకు తెలుసు. కానీ ఆ విషం ఎంత ఖరీదు ఉంటుందో ఎప్పుడైనా తెలుసుకున్నారా? బిహార్‌లోని పూర్నియా ప్రాంతంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాదాపు 900 గ్రాముల బరువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో దాని విలువ అక్షరాలా ఇరవై కోట్ల రూపాయలట! ఇద్దరు వ్యక్తులు దీన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా వాళ్లను పట్టుకుని ఈ విషం స్వాధీనం చేసుకున్నారు. ఒక్క బాటిల్లో ఉన్న ఈ విషం ఏకంగా మూడు కోట్ల రూపాయల విలువ ఉంటుందని తెలుసుకుని అధికారులే నోళ్లు వెళ్లబెట్టారట!! ఎందుకంటే, ఇది పాముల్లోనే అత్యంత విషపూరితమైన కోబ్రా విషం. అందుకనే దీనికి అంత ఖరీదు. -
పాము విషం ఇంజెక్షన్ చేసి.. భార్యను కడతేర్చాడు!
తరచు గొడవ పడుతూ, వివాహేతర సంబంధం ఉందంటూ వేధిస్తున్న భార్యకు ఇంజెక్షన్ ద్వారా పాము విషం ఎక్కించి చంపేశాడో భర్త. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో జరిగింది. ఈ వివరాలను రామచంద్రపురం డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ పుల్లారావు విలేకరులకు వెల్లడించారు. అక్టోబరు 22న ఏడిద గ్రామానికి చెందిన షేక్ షహీదా బేగం (36) అనుమానాస్పదంగా మరణించింది. ఆమెను చంపింది తానేనంటూ భర్త మొఘలా సాహెబ్ 30వ తేదీన పోలీసుల వద్ద లొంగిపోయాడు. అతడిని కోర్టులో హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించింది. మొఘలా సాహెబ్‌కు షహీదా బేగంతో 16 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆమె తరచు భర్తతో గొడవపడుతూ, పుట్టింటికి వెళ్లి, నెలల తరబడి ఉండిపోయేది. భర్తకు భోజనం కూడా సరిగా పెట్టేది కాదు. వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందంటూ భర్తను వేధించేది. దీంతో ఆమెను అంతమొందించాలని మొఘలా సాహెబ్ నిర్ణయించుకున్నాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు, పాము కరిచి చనిపోయిందని నమ్మించేలా ప్రణాళిక వేశాడు. ఏడిద రోడ్డులో పాములు పట్టేవారి వద్దకు వెళ్లి.. ఆయుర్వేదం మందులోకి కావాలంటూ విషం సేకరించాడు. 22న ఉదయం షహీదాబేగంకు వాంతులు, విరేచనాలు కావడంతో ఆర్ఎంపీతో వైద్యం చేయించాడు. అతడు వెళ్లిపోయాక పాము విషాన్ని ఇంజెక్షన్ ద్వారా ఆమె కుడిచేతిలోకి ఎక్కించాడు. ఆమె కేకలు వేయగా, స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ ఆస్పత్రికి వెళ్లేలోపే ఆమె మరణించింది. -
‘క్షణాల్లో ఎంతటి నొప్పినైనా తగ్గిస్తుంది’
సిడ్నీ: భయంకరమైన నొప్పి నుంచి బయటపడాలంటే అత్యవసరంగా పనిచేసే సెడెటివ్ మాత్రలు వేసుకోవాల్సిందే. అవి పనిచేయాలంటే కూడా కొంత సమయం పడుతుంది. వెంటనే పనిచేసే మాత్రల గురించి పరిశోధకులు నిరంతరం ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు నిర్వర్తిస్నున్న విషయం తెల్సిందే. సెడెటివ్ మాత్రల తయారీలో పాము విషాన్ని విరివిగా ఉపయోగిస్తారు. నొప్పికి పాము విషమే మంత్రంగా పనిచేస్తుందికనుక ఎలాంటి పాము విషయం బాగా పనిచేస్తుందనే విషయమై ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ బ్య్రాన్ ఫ్రై పరిశోధనలు జరిపి విజయం సాధించారు. ‘కిల్లర్ ఆఫ్ ది కిల్లర్స్’గా వ్యవహరించే పాముకు ప్రపంచ పాముల్లోనే అత్యంత పొడౖÐð న విష గ్రంధులు ఉన్నాయని, ఇవి నిరంతరం శ్రవిస్తూనే ఉంటాయని, ఈ పాము విషాన్ని వినియోగించినట్లయితే మానువుల్లో నొప్పులు క్షణకాలంలో మటు మాయం అవుతాయని డాక్టర్ బ్య్రాన్ తెలిపారు. మూతి, తోక ఎరుపు రంగుతో ఉండి మిగతా శరీర భాగమంతా నీలి చారలతో ఈ పాము చూడముచ్చటగా∙ఉంటుందని ఆయన చెప్పారు. దీని శరీరం మొత్తం పొడువులో పావు భాగాన్ని విషపు గ్రంధులు ఆవరించి ఉంటాయని ఆయన తెలిపారు. కింగ్ కోబ్రానే కాకుండా ఖడ్గమృగాలను సైతం చంపే శక్తి ఈ పాము విషానికి ఉందని, శత్రువులను క్షణాల్లో మట్టి కరిపించేందుకు ఈ పాము విషానికి వేగంగా పనిచేసే గుణం ఉందని ఆయన తెలిపారు. ఆగ్నేయాసియాలో కనిపించే ఈ పాములు ఇప్పుడు దాదాపు 80 శాతం అంతరించి పోయాయని, కేవలం 20 శాతం మాత్రమే మనుగడ సాగిస్తున్నాయని ఆయన తెలిపారు. తాను ఈ పాములను రెందుసార్లు మాత్రమే చూశానని కూడా చెప్పారు. దీన్ని విషాన్ని సేకరించి ఔషధంగా తయారు చేస్తే అది నొప్పి ప్రభావాన్ని మానవుడికి కలిగించే సోడియం ఛానళ్లను క్షణాల్లో మొద్దుబారుస్తుందని చెప్పారు. ఆయన చైనా, అమెరికా, సింగపూర్‌కు చెందిన నిపుణులతో కలసి జరిపిన ఈ పరిశోధనా విషయాలను ‘టాక్సిన్’ పత్రికలో ప్రచురించారు. -
వామ్మో! పాము విషానికి అంత రేటా?
కోల్‌కతా: ప్రపంచంలో ఏ దేశంలో జరగనంతగా ఒక్క భారత దేశంలోనే పాము విషం స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్గురిలో పోలీసులు ఇటీవల నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఐదు గాజు పాత్రల్లో స్మగ్లింగ్ చేస్తున్న పాము విషం పొడిని స్వాధీనం చేసుకున్న సంఘటన ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తోంది. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో 245 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు ప్రకటించారు. అయితే దాని విలువ 175 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటుందని జాతీయ పత్రికలు పేర్కొన్నాయి. పత్రికలు వెల్లడించిన కథనాలనే నమ్మినట్లయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న వెయ్యి గ్రాములకు లెక్కకడితే ఒక్క గ్రాము విలువ 1,75,000 రూపాయలు ఉంటుందని తేలుతోంది. ఇదే విషయాన్ని పోలీసులను అడిగితే ఆ మాత్రం విలువ ఉంటుందని వారూ తెలిపారు. అందుకే వాటిని బుల్లెట్ ప్రూఫ్ గాజు పాత్రల్లో స్మగ్లింగ్ చేస్తున్నారని కూడా చెప్పారు. పాము విషయం విలువ అంత ఉంటుందా? ఎవరు అంత విలువు పెట్టి కొంటారు. ఎందుకు కొంటారు? అంతర్జాతీయ మార్కెట్లో సాధారణ నాగుపాము విలువ గ్రాముకు పది వేల రూపాయలు మాత్రమే ఉంది. ఎక్కువ విషాన్ని ఇచ్చే కింగ్ కోబ్రా నుంచి తీసే విషం గ్రాము విలువ తొమ్మిదివేల రూపాయలు మాత్రమే ఉంది. తాము స్వాధీనం చేసుకున్న పాము విషం గాజు పాత్రలపై వైద్య అవసరాల కోసం తయారు చేసినట్లు ఫ్రెంచ్ కంపెనీ గుర్తులున్నాయని పోలీసులు తెలిపారు. వారు చెబుతున్నట్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఔషధాల్లో ఈ విషాన్ని వాడతారనే విషయం మనందరికి తెల్సిందే. ముఖ్యంగా పాముకాటుకు విరుగుడు మందును తయారు చేయడానికే దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పాము కాటకు విరుగుడుగా ఇచ్చే యాంటీ వీనమ్ ఇంజెక్షన్ సీసా రేటు భారత్ మార్కెట్లో వెయ్యి రూపాయలకే లభిస్తోంది. అందులో విషం పాళ్లు తక్కువగానే ఉంటుంది. భారత ఔషధ కంపెనీలు పోలీసులు చెబుతున్నట్లుగా 1,75,000 రూపాయలకు గ్రాము విషాన్ని కొన్నట్లయితే వారు యాంటీ వీనమ్ వాయిల్‌ను వెయ్యి రూపాయలకు ఎలా సరఫరా చేస్తారు? అంతర్జాతీయ మార్కెట్లో చైనా గ్రాము విషాన్ని 4,500 రూపాయలకు విక్రయిస్తోంది. పైగా ప్రస్తుత మార్కెట్ అవసరాలకు వెయ్యి గ్రాముల పాము విషం అవసరం లేదు. బుల్లెట్ ప్రూఫ్ గాజుల్లో ఆ పాము విషం పొడిని సరఫరా చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. పైగా అన్ని రకాల పాముల విషాలను కలిపినట్లయితే అవి మందుల తయారీ కంపెనీలకు ఎందుకూ పనికిరావు. ఎందుకంటే ఒక్కో జాతి పాము విషయం వారికి వేర్వేరుగా కావాలి. తాచు పాము విషాన్నే భారత ఔషధ కంపెనీలు ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. ‘ఇరులా స్నేక్ క్యాచర్స్ కోపరేటివ్’ అనే సంస్థ ఎంతో కాలంగా అధికారికంగా భారత ఔషధ కంపెనీలకు అవసరమైన విషాన్ని సరఫరా చేస్తోంది. పది కిలోల తాచుపాము విషాన్ని సేకరించాలంటే 35వేల పాముల నుంచి 35 ఏళ్లు సేకరిస్తే వస్తుందని ఆ సంస్థ తెలియజేస్తోంది. పాము విషం ఆరుదైనప్పటికీ గ్రాము విలువ లక్షల్లో ఉంటుందని అనుకోవడం అతిశయోక్తేనని ఆ సంస్థ తెలిపింది. పైగా ఫ్రెంచ్ కంపెనీ పేరు స్మగ్లింగ్ సీసాలపై ముద్రించి ఉన్నట్లు పోలీసులే చెబుతున్నారు. అలాంటప్పుడు భారత ఫార్మాస్యూటికల్ కంపెనీలు నేరుగానే వాటిని దిగుమతి చేసుకోవచ్చు. వాటిని స్మగ్లింగ్ చేయాల్సిన అవసరమేలేదు. పాము విషం అన్నది వన్య జంతువుల సంరక్షణ చట్టం కిందకు వస్తోంది. మన దేశం దాటితే ఈ చట్టం ఎవరికి వర్తించదు. అలాంటప్పుడు ఫ్రెంచ్ పాముల విషాన్ని పట్టుకునే హక్కే మన పోలీసులకు లేదు. ఆ....రేవు పార్టీల్లో, మత్తు ఎక్కడానికి కుర్రకారు ఈ విషాన్ని అక్రమంగా వినియోగిస్తున్నారని, అందుకనే దీనికి ఇంతరేటు పలుకుతున్నట్లు ఉందని పోలీసులు చెబుతున్నారు. కొకైన్, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలకు కొంతమంది కుర్రవాళ్లు బానిలవుతున్న విషయం కూడా తెల్సిందే. ప్రపంచంలో ఎక్కడా గ్రాము కొకైన్ తొమ్మిదివేల రూపాయలకన్నా ఎక్కువ ధరలేదు. అలాంటప్పుడు లక్షల రూపాయలు పెట్టి పాము విషాన్ని ఎందుకు కొంటారు? అంతేకాకుండా పాము విషాన్ని తాగినట్లయితే కడుపులోని ఆమ్లాలు ఆ విషాన్ని వెంటనే నిర్వీర్యం చేస్తాయి. ఎలాంటి ప్రభావం ఉండదు. అల్సర్లు ఉంటే ప్రమాదం. ఎందుకంటే పాము విషం చాలా వేగంగా నరాల వ్యవస్థ, జన్యు వ్యవస్థను దెబ్బతీస్తాయి. రక్త ప్రసారాన్ని కూడా అడ్డుకుంటాయి. అందువల్ల మనుషులకు ప్రాణం పోవడం లేదా పక్షవాతం రావడం జరుగుతుంది. భారత దేశంలో ఏటా 45వేల మంది పాము కాటు వల్ల చనిపోతున్నారు. వారిలో ఒక్కరు కూడా తాము ఒకవిధమైన మత్తులో తేలిపుతున్న భావాన్ని వ్యక్తీకరించలేదు. భరించలేని బాధ తప్ప. ఇలాంటప్పుడు పాము విషం పేరుతో కొకైన్నే సరఫరా చేస్తున్నారా? ఎందుకంటే చూడడానికి పాము విషం పొడి, కొకైన్ పొడి ఒకేలా ఉంటాయి. కొకైన్‌తో దొరికిపోతే శిక్షలు పెద్దగా ఉంటాయి కనుక, పాము విషమని స్మగ్లర్లు నమ్మిస్తున్నారా? లేదా పోలీసులే చౌక ప్రచారం కోసం ఇన్ని కోట్ల విలువైన పాము విషాన్ని పట్టుకున్నామని చెబుతున్నారా? ఏదీమైనా తాము పట్టుకున్న పదార్థాన్ని ల్యాబ్ పరీక్షకు పంపించి అదేమిటో తేలాక పోలీసులు వాస్తవాలను పత్రికలకు వెల్లడిస్తే బాగుంటుంది. snake venom, smuggling, Cobra, anti venom injection, పాము విషం, స్మగ్లింగ్, కొకైన్, యాంటీ వీనమ్ ఇంజెక్షన్