ఆ పాము విషం.. రూ. 20 కోట్లు! | cobra venom worth 3 crores seized in bihar | Sakshi
Sakshi News home page

ఆ పాము విషం.. రూ. 20 కోట్లు!

Published Tue, Jan 24 2017 7:25 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

ఆ పాము విషం.. రూ. 20 కోట్లు!

ఆ పాము విషం.. రూ. 20 కోట్లు!

పాము విషంతో రకరకాల ఔషధాలు, సౌందర్య సాధనాలు కూడా తయారుచేస్తారని మనకు తెలుసు. కానీ ఆ విషం ఎంత ఖరీదు ఉంటుందో ఎప్పుడైనా తెలుసుకున్నారా? బిహార్‌లోని పూర్నియా ప్రాంతంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాదాపు 900 గ్రాముల బరువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

 
మార్కెట్లో దాని విలువ అక్షరాలా ఇరవై కోట్ల రూపాయలట! ఇద్దరు వ్యక్తులు దీన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా వాళ్లను పట్టుకుని ఈ విషం స్వాధీనం చేసుకున్నారు. ఒక్క బాటిల్లో ఉన్న ఈ విషం ఏకంగా మూడు కోట్ల రూపాయల విలువ ఉంటుందని తెలుసుకుని అధికారులే నోళ్లు వెళ్లబెట్టారట!! ఎందుకంటే, ఇది పాముల్లోనే అత్యంత విషపూరితమైన కోబ్రా విషం. అందుకనే దీనికి అంత ఖరీదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement