cobra venom
-
ఎల్విష్ రేవ్ పార్టీ కలకలం: మేనకా గాంధీ ఫైర్, అసలీ ట్రాప్ ఎవరిది?
రేవ్‌పార్టీ, కోబ్రా విషం లాంటి సంచలన ఆరోపణలు ఎదుర్కొటున్న యూ ట్యూబర్ బిగ్ బాస్ OTT సీజన్ 2 విజేత ఎల్విష్ యాదవ్ వ్యవహారంలో ట్విస్ట్‌లు ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుతో తనకేమీ సంబంధంలేదనీ ఎల్విష్ వాదిస్తుండగా, అతడే కీలక సూత్రధారి కచ్చితంగా అరెస్ట్ చేయాలని బీజేపీ ఎంపీ మేనకా గాంధీ డిమాండ్ చేశారు. మరోవైపు ఈకేసులో అతని జోక్యంపై ఇంకా ఎలాంటి విషయాలు వెలుగు రాలేదని పోలీసులు తాజాగా తేల్చారు. దీంతో అసలీ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చింది. మేనకా గాంధీ ఎందుకు స్పందించారు లాంటి వివరాలు ఒకసారి చూద్దాం... యూట్యూబర్, బిగ్‌బాస్ ఓటీటీ సీజన్-2 (హిందీ) విజేత ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) పాములు, పాముల విషంతో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎల్విష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సంచలనం రేపింది. అయితే ఈ కేసులో తనను అరెస్టు చేసినట్లు ఆరోపణలు, ఇతర వాదనలు అవాస్తవమని పేర్కొన్నాడు. తనపై అసత్యం ప్రచారం జరుగుతోందంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నానంటూ మీడియాలో వస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం ఎంతమాత్రం నిజంలేదని, అసలు ఈ కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. దీనిపై విచారణ జరిపించాలంటూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు ఈ వ్యవహారంలో తనప్రమేయం ఉందని తేలితే తదనంతర పరిణామాలకు, తాను బాధ్యత వహిస్తానన్నాడు. శిక్ష అనుభవించడానికి సిద్ధమేనని పేర్కొన్నాడు. అంతేకాదు ఈ విషయంలో ఆధారాలు లేకుండా తన పేరును ప్రస్తావించ వద్దని యూపీ పోలీసులను కోరాడు. అతడే కింగ్ పిన్, అరెస్ట్ చేయండి మరోవైపు ఈ ఘటనపై బీజేపీ ఎంపి మేనకా గాంధీ స్పందించారు. ఎల్విష్ యాదవ్‌ను వెంటనే అరెస్టు చేయాలని మేనకా గాంధీ డిమాండ్ చేశారు. అంతేకాదు అతను నిర్దోషి కాకపోతే, ఎందుకు పరారీలో ఉన్నాడని ఆమె ప్రశ్నించారు. వన్యప్రాణుల చట్టం కింది. ఇది గ్రేడ్ 1 నేరం, ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు. అలాగే చాలా వీడియోలలో అంతరించిపోతున్న జాతుల పాములను ఉపయోగిస్తాడు. నోయిడా, గురుగ్రామ్‌లలో పాము విషాన్ని విక్రయిస్తున్నాడనే సమాచారం తమ వద్ద ఉందని స్పష్టం చేశారు. కింగ్ కోబ్రాస్ విషాన్ని బయటకు తీస్తే చనిపోతాయనిప తెలిపారు. ఆహారం జీర్ణం కావడానికి ఈ విషం తోడ్పడుతుందని, విషం లేకుండా ఏమీ తినలేక చనిపోతాయన్నారు. దేశంలో నాగుపాములు, కొండ చిలువలు చాలా తక్కువ.. వాటిని సొంతం చేసుకోవడం నేరమని వాటిని కాపాడాలని ఆమె మీడియాకు వెల్లడించారు. దీని వెనుక పెద్ద రాకెట్ ఉండి ఉండవచ్చని, ఈ స్మగ్లింగ్‌కు సంబంధించినమొత్తం వ్యవహారంలో కింగ్‌పిన్ అతడేనని మేనకా గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. మొన్న ఇస్కాన్.. ఇపుడు నేను, ఇలా అయితే లోక్ సభ సీటు వచ్చేస్తుందా? మేనకా గాంధీ వ్యాఖ్యలు తనకు షాకింగ్ అనిపించాయని దీనిపై తనకు క్షమాపణలు చెప్పాలంటూ ఎల్వీష్ ట్వీట్ చేశాడు. మొన్న ఇస్కాన్ మీద ఆరోపణలు, ఇపుడు తనను టార్గెట్ చేశారు... ఇలా లోక్‌సభ టిక్కెట్ వస్తుందా అంటూ ఎల్విష్ యాదవ్ మేనకా గాంధీపై విరుచుకుపడ్డాడు. ఇదిలా ఉండగా ఎల్విష్ పాముతో ఆడుకుంటున్నట్లు మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Judge saab proof ye rha pic.twitter.com/2db31v0bVb — Dr Nimo Yadav (@niiravmodi) November 3, 2023 పీపుల్ ఫర్ యానిమల్స్ ట్రాప్ మేనకా గాంధీ ఫౌండర్‌గా ఉన్న స్వచ్ఛంద సంస్థ పీపుల్ ఫర్ యానిమల్స్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, ఈ ఎన్జీవోనే ఎల్విష్ యాదవ్‌ను సంప్రదించి, రేవ్ పార్టీ నిర్వహించి, కోబ్రా విషం కావాలంటూ కోరింది. దీనికి సరేనన్న ఎల్విష్ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశాడు. కోబ్రా విషాన్ని తీసుకని రాహుల్ అనే అతను సెక్టార్ 51 బాంకెట్ హాల్‌కు వచ్చాడు. దీంతో నోయిడా పోలీసులు డిఎఫ్ఓతో పాటు అతగాడిని అరెస్టు చేశారు. రేవ్ పార్టీ కేసులో ఎల్విష్ , మరో ఐదుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదైనాయి. అలాగే దు కోబ్రాలతో సహా తొమ్మిది పాములను కూడా రక్షించారు. రాహుల్ నుంచి 20 ఎంఎల్ విషాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని విచారణ నిమిత్తం ఎఫ్ఎస్ఎల్కు పంపించిన సంగతి తెలిసిందే. Uttar Pradesh Police registers FIR against YouTuber and Bigg Boss winner Elvish Yadav, for making available snake venom at rave parties BJP MP and founder of People for Animals (PFA), Maneka Gandhi says, "He should be arrested immediately. This is a grade-I crime - that means… pic.twitter.com/26qX6gciG3 — ANI (@ANI) November 3, 2023 -
10 నాగుల నుంచి తులం విషం.. లీటర్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
సాక్షి, వెల్దుర్తి (కర్నూలు): పాములోళ్ల నుంచి నాగు పాముల విషాన్ని తులం (10 గ్రాములు) రూ.4 వేలకు కొంటారట. అదే విషాన్ని దళారులు రూ.40 వేలకు అమ్ముతారట. దేశీయ మార్కెట్లో లీటరు నాగు పాముల విషం ధర రూ.40 లక్షలట. అంతర్జాతీయ మార్కెట్లో ఆ ధర రూ.కోటి పైమాటేనట. అంతటి విలువైన విషాన్ని ప్రాణాలొడ్డి మరీ పాముల నుంచి కక్కించే పాములోళ్లు మాత్రం కూటికి లేని నిరుపేదలే. వెల్దుర్తి వద్ద నాగుపాముల్ని ఒడిసి పట్టి వాటి విషం సేకరించే వారి నుంచి ‘సాక్షి’ సేకరించిన ఆసక్తికర విషయాల్లోకి వెళితే... విషం తీసేందుకు తెచ్చిన నాగులను చూపుతూ.. నాగుల నుంచే సేకరిస్తారు కట్ల పింజరి, కట్ల పాము, రాచ నాగు తదితర విషం కలిగిన పాములున్నా.. పాములోళ్లు నాగు పాముల్ని మాత్రమే పట్టుకుంటారు. ఎందుకంటే.. మన రాష్ట్రంలో నాగు పాములు విరివిగా దొరుకుతాయి. సరీసృపాల జాతికి చెందిన ఆడ నాగులు 12 నుంచి 30 వరకు గుడ్లు పెడతాయి. రెండు నెలలు పొదుగుతాయి. అప్పుడే పుట్టిన పిల్ల పాములకు సైతం పూర్తిస్థాయిలో పనిచేసే విషపు గ్రంథులుంటాయి. ఏ వయసు నాగు పామును పట్టినా విషం సేకరించేందుకు అవకాశం ఉంటుంది. నాగు పాము చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇతర పాములకు భిన్నంగా నాగు పాము పడగ విప్పుతుంది. పాముకాటు వేసినచోట పాము తల నుంచి తీసిన రాయి, నాగమల్లి చెట్టు వేరు టి పడగ వెనుక వివిధ రంగుల్లో కృష్ణపాదాలు (అండాకార గుర్తుల నడుమ గీత, లోపలి వైపు వివిధ ఆకారాలు) ఆకర్షణీయంగా ఉంటాయి. పాములోళ్ల నాద స్వరానికి అనుగుణంగా (పాములకు చెవులు లేకపోయినా నాదస్వరం కదలికలకు, పాములోడి కాళ్లు భూమిని తడుతుంటే వచ్చే తరంగాలకు) పడగ విప్పి ఆడే నాగు పాముల ఆట చూసేవాళ్లకు హృద్యంగా ఉంటుంది. నాగు పాము విషం సేకరణకు, ప్రదర్శనలతో డబ్బు సంపాదించేందుకు ఉపయోగపడుతుంది. అందువల్లే పాములోళ్లు నాగు పాములను మాత్రమే పడుతుంటారు. 10 నాగుల నుంచి తులం విషం పాములోళ్లు 10 నాగు పాముల నుంచి తులం విషం సేకరిస్తారు. నాగు తల పైభాగం, దానికి కిందనున్న భాగాన్ని చేతులతో గట్టిగా నొక్కుతూ పాము విషపు గ్రంథులను అదమటం ద్వారా కోరల్లోంచి విషాన్ని కక్కిస్తారు. అలా సేకరించిన విషాన్ని దళారులకు తులం రూ.4 వేలకు కొంచెం అటూఇటుగా అమ్ముకుంటున్నారు. దళారి ఆ విషాన్ని ఏం చేస్తున్నాడు, ఎంతకు అమ్ముకుంటున్నాడన్నది వీరికి పట్టదు. అలా సేకరించిన విషాన్ని దళారులు పది రెట్లు అధిక ధరకు విక్రయిస్తారని తెలుస్తోంది. పాములోళ్లు సేకరించిన విషాన్ని రబ్బరు మూత గల చిన్న గాజు సీసాలో భద్రపరుస్తారు. దళారులు విషాన్ని కొనే సమయంలో దాని నాణ్యతను పరీక్షించి మరీ కొంటున్నారట. దళారులు కోడిని తెచ్చి దానికి చిన్నపాటి గాయం చేస్తారట. పాములోళ్లు సేకరించిన విషాన్ని పిన్నీసు మొనతో గాయమైన కోడికి పూస్తారు. అది అరగంటలో మరణిస్తే నాణ్యమైనదిగా గుర్తిస్తారట. లేదంటే ఆ విషాన్ని కొనరట. 4వ తరగతి చదువుతూ కరోనా పరిస్థితులలో తల్లిదండ్రులకు తోడుగా వచ్చి భిక్షమెత్తుతున్న చరణ్‌తేజ్ అంతర్జాతీయంగా డిమాండ్ పాము విషం మనిషి ప్రాణాల్ని కాపాడటానికి కూడా ఉపయోగపడుతుంది. పాము విషానికి ముఖ్యంగా విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. గుండె సంబంధిత వ్యాధులు, రక్త పోటు వంటి రోగాలకు ఉపయోగించే కొన్నిరకాల ఔషధాల్లోనూ పాము విషాన్ని వినియోగిస్తారట. విషానికి విరుగుడుగా వైద్యులు అందించే సూది మందును సైతం స్వల్పశాతం విషం ఉపయోగించే తయారు చేస్తారట. పాములు పట్టే తల్లిదండ్రులతో పిల్లలు చరణ్‌తేజ్, అమ్ములు, మైల ఇదే మా జీవనాధారం మాది ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతం. నంద్యాల బొమ్మల సత్రంలో పదుల కుటుంబాలతో కలిసి ఉంటున్నాం. ఎరుకల జాతికి చెందిన మాకు తాతల కాలం నుంచి నాగుపాములు పట్టడం, వాటినుంచి విషం తీసి అమ్మడమే తెలిసిన విద్య. మా నాన్న బళ్లారి ప్రాంతంలో పాము కాటుతోనే మరణించాడు. ఆ సమయంలో ఆయన వద్ద నాగమల్లి వేరు లేకపోవడమే కారణం. నాగమల్లి వేరు, పాము తల నుంచి సేకరించిన రాయి లేకపోతే మేం కూడా పాములు పట్టలేం. అవే మా ధైర్యం. పాముకాటుకు గురైన వాళ్లు మా వద్దకు వస్తే నాగమల్లి వేరుతో నయం చేస్తుంటాం. – హనుమంతు (గురునాథం బాబు), పాములు పట్టే వ్యక్తి -
ఆ పాము విషం.. రూ. 20 కోట్లు!
పాము విషంతో రకరకాల ఔషధాలు, సౌందర్య సాధనాలు కూడా తయారుచేస్తారని మనకు తెలుసు. కానీ ఆ విషం ఎంత ఖరీదు ఉంటుందో ఎప్పుడైనా తెలుసుకున్నారా? బిహార్‌లోని పూర్నియా ప్రాంతంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాదాపు 900 గ్రాముల బరువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో దాని విలువ అక్షరాలా ఇరవై కోట్ల రూపాయలట! ఇద్దరు వ్యక్తులు దీన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా వాళ్లను పట్టుకుని ఈ విషం స్వాధీనం చేసుకున్నారు. ఒక్క బాటిల్లో ఉన్న ఈ విషం ఏకంగా మూడు కోట్ల రూపాయల విలువ ఉంటుందని తెలుసుకుని అధికారులే నోళ్లు వెళ్లబెట్టారట!! ఎందుకంటే, ఇది పాముల్లోనే అత్యంత విషపూరితమైన కోబ్రా విషం. అందుకనే దీనికి అంత ఖరీదు. -
పాము విషం: ఫ్రాన్స్ టు చైనా వయా ఇండియా
జల్పాయిగురి: అతి ప్రమాదకరమైన పాము ఒక్కకాటులో 200 మిల్లీగ్రాముల నుంచి 500 మిల్లీ గ్రాముల విషాన్ని విడుస్తుంది. ఈ లెక్కన 70,00,000 మిల్లీగ్రాములు.. అంటే 7 కిలోగ్రాముల విషం పోగవ్వాలంటే ఎన్నిపాములు ఎన్నిసార్లు కాటేయాలి? ఊహించడానికే అదోలా ఉందికదా! కానీ స్మగ్లర్లకు ఇది చాలా చిన్నవిషయం. ఎక్కడో ఫ్రాన్స్ అటవీ ప్రాంతంలో విషాన్ని సేకరించి బెల్జియంలో తయారైన బుల్లెట్ ప్రూఫ్ జాడీల్లో భద్రంగా దాచి.. వేల కిలోమీటర్ల దూరంలోని చైనాకు వయా ఇండియా సరఫరా చేస్తున్నారు! ఈ అంతర్జాతీయ విషపు ముఠా గుట్టు పశ్చిమబంగాలో రట్టైంది. సిలిగురి జిల్లాలోని బెలాకోబా రేంజ్ అటవీశాఖ అధికారులు రెండు రోజులు శ్రమించి రూ.200 కోట్లు విలువచేసే పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెలాకొడా రేంజర్ సంజయ్ దత్ శనివారం మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పారు.. 'సిలిగురిలోని ఓ లాడ్జిలో ఇద్దరు వ్యక్తులు బసచేశారు. సరుకులు కనేందుకు వచ్చిన బయ్యర్లమని చెప్పుకున్న ఆ ఇద్దరి కదలికలపై మాకు సమాచారం అందింది. దీంతో వారిపై నిఘా పెట్టాం. పక్కాగా ప్లాన్ చేసి స్మగ్లర్లనూ పట్టుకున్నాం. బెల్జియంలో తయారైన ఐదు బుల్లెట్ ఫ్రూఫ్ జాడీల్లో దాచిన విషాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాం. దీని విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుంది. స్మగ్లర్ల విచారణలో బయటపడిందేమంటే.. ఫాన్స్ లో సేకరించిన పాము విషయం మొదట బంగ్లాదేశ్ చేరుతుంది. అక్కడి నుంచి పశ్చిమబంగా మీదుగా భూటన్ కు చేరుస్తారు. అటునుంచి ఆ విషాన్ని చైనాకు తరలిస్తారు. అక్కడ దీనికి భారీ డిమాండ్ ఉంది. కొన్నిరకాల మందులతోపాటు డ్రగ్స్ తయారీకి కూడా పాము విషాన్ని వినియోగిస్తారు. రేవ్ పార్టీల్లో వినియోగించే డ్రగ్స్ ఈ విషంతోనే తయారుచేస్తారని తెలిసింది' అని సంజయ్ దత్ వివరించారు. ఈ రాకెట్ కు సంబంధించి దినాజ్ పూర్ కు చెందిన సంజయ్ కుమార్ దాస్, బిపుల్ సర్కార్, పింటు బెనర్జీ, మాల్దాకు చెందిన అమల్ నుబియాలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని చెప్పారు.