రేవ్ పార్టీల్లో పాము విషాన్ని వినియోగించారంటూ యూట్యూబర్ ఎల్వీష్ యాదవ్‌తో సహా నలుగురిపై కేసు నమోదవ్వడంతో ఒక్కసారిగా ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మేనక గాంధీ ఫిర్యాదుల మేరకు నిందితులపై కేసు నమోదైంది. ఎల్వీష్ యాదవ్, ఆయన సహచరులు నిర్వహించిన పార్టీల్లో పాములను, పాము విషాన్ని వాడారని, మత్తు కోసం పాము విషం తీసుకుంటున్న వీడియోలు బయటపడ్డట్లు పోలీసులు చెబతున్నారు. ఒక్కసారిగా ఈ ఘటన తీవ్ర కలవరపాటుకి గురిచేయడమే గాక ప్రస్తుతం ఇది భారత్‌లో ట్రెండ్‌గా మారడమా అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. అసలేంటి రేవ్ పార్టీలు? మత్తు కోసం పాము విషమా? వాళ్లకి ఆ విషం ప్రమాదం కాదా? తదితరాల గురించే ఈ కథనం!.
ఇటీవలకాలంలో సంపన్న కుటుంబాల పిల్లలు దగ్గర నుంచి అట్టడుగు వర్గానికి చెందిన కొందరూ అల్లరి చిల్లరి పిల్లలు వరకు ఈ రేవ్ పార్టీల సంస్కృతికి అలవాటుపడి దారితప్పుతున్నారు. విచ్చలవిడి ఈ సంస్కృతిలో డ్రగ్స్‌కి, కొన్ని రకాల చెడు అలవాట్లకు బానిసై చేజేతులారా జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి అనైతిక చట్ట విరుద్ధమైన పనులన్ని ఫామ్ హౌస్‌ల్లోనూ లేదా నగరానికి దూరంగా ఉండే ఫ్లాట్‌లలో జరుగుతుండటం బాధకరం.
అక్కడకి పోలీసులు ఇలాంటి వాటికి అడ్డకట్టవేసి అరెస్టులు చేయడం జరగుతోంది. ఇంత వరకు బాగానే ఉంది. ఇప్పుడు అది కాస్త శృతి మించి ఆ మత్తు పరాకాష్టకు చేరుకుందా అనేంత స్థాయికి దిగజారిపోయింది. ఏకంగా మత్తు సరిపోవడం లేదని అత్యంత విషపూరితమైన పాము విషం కూడా ఎక్కించుకునేంత స్థాయికి వెళ్లిపోయారంటే..ఎంతటి ప్రమాదకరమైన వ్యక్తులుగా మారిపోయారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
ఈ భయానక సంస్కృతి ఎక్కడది..?
మత్తు కోసం పాము విషాన్ని తీసుకునే అలవాటు చైనా, రష్యా, ఇతర పాశ్చాత్య దేశాల్లో చాలా ఏళ్లుగా ఉంది. ఇటీవల ఆ అలవాటు ఇండియాలోకి పాకడమే గాక ట్రెండ్‌గా మారింది. మరోవైపు, పాము కాటు మరణాలు భారత్‌లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. అదీగాక మన గ్రామీణ భారతంలో పాముకాటు అతిపెద్ద సమస్య. అలాంటి ప్రమాదకర పాముల విషంతోనే మత్తురాయళ్లు మత్తులో జోగేందుకు యత్నించడం అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ యూట్యూబర్ యాదవ్ ఘటన ఒక్కసారిగా రేవ్‌పార్టీలపై మరింత దృష్టిసారించి నిఘా పెట్టేలా చేసింది.
ఇంతవరకు నల్లమందు, పొగాకు, గంజాయి, ఎండీఎంఏ, మెత్ వంటి పదార్థాలను మత్తుకోసం వాడేవారు. ఐతే పాములు, తేళ్లు వంటి సరీసృపాల విషాలను కూడా మత్తుకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయని పరిశోధనల్లో తేలింది. ఈ విష సంస్కృంతి భారత్‌లో లేకపోయినా.. యువత దీన్ని ఫాలో అవ్వడం విచారకరం. పైగా ఇది ప్రాణాంతకం కూడా. మత్తుపదార్థాలకు విపరీతంగా బానిసైనవారు మరింత మత్తుకోసం ఇలా పాము విషం వైపుకి మళ్లుతారని నిపుణులు చెబుతున్నారు.
వినోదం కోసం పాము విషాన్ని దుర్వినియోగం చేసిన కేసులు భారత్‌లోనే నమోదవుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి. పాము విషం వల్ల మనసు మూడ్‌లు పలు రకాలు మారుతుందట. క్రమేణ బద్ధకం, దృష్టి అప్పష్టతకు కారణమవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ విషం మానవ రక్తంలో ప్రవేశించగానే శరీరం నెమ్మదిగా స్పందించేలా క్రియాశీల జీవక్రియలను విడుదల చేస్తుంది. ఫలితంగా శరీరం చచ్చుపడిపయేలా చేసేలా తీవ్ర దుష్ప్రభావాలను చూపిస్తుంది. ఐతే ఈ మత్తురాయళ్లు ఈ విషాన్ని ఎక్కించుకున్నప్పుడూ ఎలాంటి ప్రమాదం ఉండదు. వారు మత్తు కిక్‌లో తేలిపోతుంటారు. ఆ తర్వాత దాని ప్రభావం ఒక్కొక్కటిగా శరీరంపై చూపించడం మొదలవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పాముల నుంచి విషం తీసేస్తే..
దేశంలో చాలా తక్కువగా నాగుపాములు, కొండచిలువలు ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం అవి అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. ఇలా పాములు నుంచి విషాన్ని సేకరించే పనులకు పాల్పడటం వల్ల అవి మరణిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పాములకు ఆహారాన్ని జీర్ణం చేయడంలో విషమే కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. దీంతో పాములు విషాన్ని కోల్పోయినప్పుడు త్వరితగతిన చనిపోతాయి.
(చదవండి: మార్క్ జుకర్‌బర్గ్ మోకాలికి శస్త్ర చికిత్స..అసలేంటి చికిత్స? ఎందుకు?)
Comments
Please login to add a commentAdd a comment