Trend
-
అపార్ట్మెంట్, విల్లా కలిస్తే..
అవునూ.. హైదరాబాద్ నిర్మాణ రంగం (Hyderabad realty) ట్రెండ్ మారింది. అపార్ట్మెంట్, విల్లా రెండింటినీ మిక్స్ చేస్తూ స్కై విల్లాస్ (Sky villa) హాట్ కేక్‌లుగా అవతరించాయి. ఒక అపార్ట్మెంట్లో ఫ్లోర్‌కు ఒక్క ఫ్లాట్ మాత్రమే, అది కూడా 6 వేల నుంచి 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. పైగా విలాసవంతమైన వసతులు, భద్రత, ప్రైవసీలతో కట్టిపడేస్తున్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐ), ప్రవాసులు స్కై విల్లాస్ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తుండటంతో నగరంలో వీటి నిర్మాణాలు జోరందుకున్నాయి.గతంలో విలాసవంతమైన ఇళ్లలో నివసించాలనుకునేవారి కోసం విల్లాలు, బంగ్లాలు నిర్మించేవారు. వీటికి కొంత పరిమితులున్నాయి. భూమి ధర విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో డెవలపర్లకు ప్రధాన నగరంలో విల్లాలు, బంగ్లాలు నిర్మించడం సాధ్యం కాదు. దీంతో ఎత్తయిన అపార్ట్మెంట్లలో స్కై విల్లాలను నిర్మిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని పచ్చదనం, సిటీ వ్యూ అనుభూతిని కలిగిస్తుండటంతో ఎత్తయిన భవనాల్లో నివసించాలనే కోరిక పెరిగింది. దీంతో మల్టీ లెవల్ స్కై విల్లాలు నివాస సముదాయ విభాగంలో హాటెస్ట్ ట్రెండ్‌గా మారింది. జీవనశైలి పట్టణ వినియోగదారుల్లో ప్రజాదరణ పొందుతోంది. – సాక్షి, సిటీబ్యూరోస్కై విల్లాస్ అంటే? విల్లాలు, అపార్ట్మెంట్ల డిజైన్, వసతులు ఒకే భవనంలో కలిపి ఉండేవే స్కై విల్లాలు లేదా విల్లామెంట్‌లు. సాధారణంగా విల్లాలు పెద్ద ఫ్లోర్ ప్లాన్, ఎక్కువ స్థలం కలిగి ఉండే స్వతంత్ర గృహాలు. వీటిల్లో లగ్జరీ వసతులు, ఔట్‌డోర్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఇక, అపార్ట్మెంట్లు చిన్నగా, సమూహంగా ఉంటాయి. వీటిల్లో నివాసితులు కామన్ ఏరియాలను షేరింగ్ చేసుకుంటారు. ఈ రెండు కాన్సెప్ట్‌లు కలిపి.. విల్లాలోని విశాలమైన స్థలం, లగ్జరీ, ప్రైవసీ, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని సౌకర్యాలు, భద్రత కలిపి డిజైన్ చేసేవే స్కై విల్లాస్. సరళభాషలో చెప్పాలంటే ఇదొక డూప్లెక్స్ అపార్ట్మెంట్.ప్రైవసీ, ఆధునిక వసతులు.. ఒక స్వతంత్ర బంగ్లా మాదిరి కాకుండా స్కై విల్లాలు భవనం మొత్తం అంతస్తులో విస్తరించి ఉంటాయి. రెండు లేదా అంతకంటే ఎక్కువ అంతస్తులో విస్తరించి ఉండే విశాలమైన బహుళ స్థాయి గృహాలే స్కై విల్లాలు. ఈ ప్రాజెక్ట్‌లలో జన సాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రైవసీ, భద్రత ఎక్కువ. ఇంటి పరిమాణాన్ని బట్టి స్కై విల్లాలను ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ ఆటోమేషన్, టెక్నాలజీతో విలాసవంతంగా తీర్చిదిద్దవచ్చు.స్కై విల్లాల్లో చాలా వరకు నాలుగు వైపులా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. దీంతో సూర్యరశ్మి, గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి. మంచి వెంటిలేషన్ ఉంటుంది. స్కై విల్లాలలో ప్రైవేట్ లాన్, సన్డెక్తో కూడిన ప్రైవేట్ పూల్, ప్రత్యేక లిఫ్ట్, సెంట్రల్ ఎయిర్ కండీషనర్, హోమ్ థియేటర్, లగ్జరీ బెడ్ రూమ్స్, కిచెన్, స్టాఫ్ క్వార్టర్స్ వంటివి ఉంటాయి. అలాగే బ్యాడ్మింటన్ కోర్ట్, గోల్ఫ్ కోర్స్‌లు, విశాలమైన పిల్లల ఆట స్థలాలు, విలాసవంతమైన క్లబ్‌హౌస్, కాఫీ షాప్, స్విమ్మింగ్ పూల్తో పాటు ల్యాండ్ స్కేప్ గార్డెన్, వాకింగ్ ట్రాక్స్ వంటి వాటితో ప్రశాంత వాతావరణం ఉంటుంది.ఎక్కడ వస్తున్నాయంటే? స్కై విల్లాస్ ధరలు అపార్ట్మెంట్ల కంటే 30–40 శాతం ఎక్కువగా, విల్లా కంటే 20–30 శాతం తక్కువగా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్‌ల్లోని ఫ్లాట్లు భారీ విస్తీర్ణంతో పాటు సకల సౌకర్యాలు ఉండటంతో వీటి ప్రారంభ ధర రూ.6 కోట్ల నుంచి ఉంటాయి. కొల్లూరు, ఉప్పల్, కోకాపేట, కొండాపూర్, నార్సింగి, పుప్పాలగూడ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ తరహా ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. 30–50 అంతస్తుల భవనాల్లో ఇలాంటి స్కై విల్లాలు నిర్మిస్తున్నారు. ఆకాశహర్మ్యల్లో ఎత్తుకు వెళ్లే కొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతుంది.అందుకే ఖర్చును తగ్గించుకునేందుకు 6 వేల నుంచి 16 వేల చ.అ. విస్తీర్ణంలో ఒకటే ఫ్లాట్ ఉండేలా ప్రత్యేకంగా డిజైనింగ్ చేస్తున్నారు. అపార్ట్మెంట్లోని పైఅంతస్తులో ఈ తరహా స్కై విల్లాలను కడుతున్నారు. సౌకర్యాలకు లోటు లేకుండా ఆకాశహరమ్యల్లో ప్రతీ గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్నట్లే క్లబ్‌హౌస్‌తో పాటు అన్ని రకాల ఆధునిక వసతులను కల్పిస్తున్నారు. ఒక్కో క్లబ్‌హౌస్ 50 వేల చ.అ.విస్తీర్ణంలో ఉంటుంది.ప్రయోజనాలివీ..» విల్లామెంట్ ప్రయోజనాల్లో ప్రధానమైనది విల్లాలాంటి అనుభూతి. నివాసితులు విడిగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉండే వసతులు, సౌలభ్యాలను ఆస్వాదించవచ్చు. ఇందులో స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్క్‌లు వంటి భాగస్వామ్య సౌకర్యాలతో పాటు భద్రత, నిర్వహణ సేవలు ఉంటాయి.» డూప్లెక్స్ డిజైన్ బెడ్ రూమ్‌లు, బాత్రూమ్లు, లివింగ్, డైనింగ్ ఏరియాలతో పాటు ప్రైవేట్ టెర్రస్ లేదా గార్డెన్ ఉంటాయి. అదనంగా విల్లామెంట్లలో ప్రైవేట్ లిఫ్ట్, విశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యాలుంటాయి.» స్కై విల్లాస్ సాంప్రదాయ అపార్ట్మెంట్ కంటే ఎక్కువ స్థలం, ప్రైవసీని అందిస్తాయి.» విల్లామెంట్ కాంప్లెక్స్‌లు సెక్యూరిటీ గార్డులు, సీసీటీవీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. నివాసితులకు సురక్షితమైన జీవనం, మనశ్శాంతిని అందిస్తాయి.» విల్లాలాగే ప్రాపర్టీ మొత్తం నిర్వహణ వ్యయం యజమాని భరించాల్సిన అవసరం లేదు. విల్లామెంట్‌ల నిర్వహణ కమ్యూనిటీలోని అందరూ పాలుపంచుకుంటారు. దీంతో నివాసితులకు వ్యయం, సమయం ఆదా అవుతుంది. -
ఇంటి విలువను పెంచే ల్యాండ్ స్కేపింగ్
గతంలో ప్రతి చిన్న అవసరానికి బయటకు వెళ్లేవారు. ఇంట్లో గడిపే సమయం తక్కువగా ఉండేది. కానీ, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక అంతా ఆన్లైన్ మీదే ఆధారపడుతున్నారు. దీంతో ఇంట్లో గడిపే నాణ్యమైన సమయం పెరిగింది. ఇల్లు, పరిసర ప్రాంతాలు స్వచ్ఛమైన గాలి, వెలుతురు, ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చదనం ఉండాలని కోరుకుంటున్నారు. ఈనేపథ్యంలో నివాస సముదాయాల్లో (Residential) ల్యాండ్ స్కేపింగ్‌కు (landscaping) ఆదరణ పెరిగింది. - సాక్షి, సిటీబ్యూరోవేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న భవన నిర్మాణ సముదాయాలతో హైదరాబాద్ (hyderabad) అర్బన్ జంగిల్‌గా మారిపోతోంది. దీంతో నివాసితులకు పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం అనుభూతి కలిగించాలంటే ల్యాండ్ స్కేపింగ్ అనివార్యమైపోయింది. కనుచూపు మేర పచ్చదనం, అది కూడా సేఫ్టీ, సెక్యూరిటీ ఉండే గేటెడ్ కమ్యూనిటీలోనే ఉండాలని నేటి గృహ కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. పురుగుమందులు, రసాయనాలతో గాలి, నేల కాలుష్యం అవుతోంది. దీంతో సేంద్రీయ, సస్టెయినబుల్ గార్డెనింగ్‌కు ఆదరణ పెరుగుతోంది. వాక్ వే, టెర్రస్లలో.. సువాసన, ఆకర్షణీయమైన పూల మొక్కలు, చెట్లు, గడ్డితో నివాస సముదాయంలో వాక్, రన్ వే, డెక్‌లు, టెర్రస్ వంటి ప్రాంతాల్లో ల్యాండ్ స్కేపింగ్‌లను చేపడుతున్నారు. విశ్రాంతి తీసుకోవడానికి, సమావేశాల కోసం వినూత్న లైట్లతో ప్రత్యేకమైన థీమ్‌లతో అందంగా అలంకరిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన ల్యాండ్ స్కేపింగ్‌తో బార్బిక్యూ వంటి ఔట్‌డోర్ ఈవెంట్లు, పార్టీలను చేసుకునేందుకు ఆహ్లాదకరమైన వేదికగా ఉంటుంది.ఇదీ చదవండి: వెస్ట్ హైదరాబాద్.. వామ్మో ఎంత ఎత్తో..విద్యుత్ బిల్లు ఆదా.. గ్లోబల్ ల్యాండ్ స్కేపింగ్ సర్వీస్ మార్కెట్ 2024లో 330.8 బిలియన్ డాలర్లుగా ఉందని, 2024 నుంచి 2030 నాటికి 6.7 శాతం వృద్ధి రేటు ఉంటుందని పరిశ్రమ వర్గాల అంచనా. వేసవి వచ్చిదంటే చాలు భానుడి ప్రతాపం 43 డిగ్రీలు దాటుతోంది. ఎండ, ఉక్కపోతతో ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఏసీ, కూలర్లు ఉన్నా కృత్రిమమే. దీంతో ల్యాండ్ స్కేపింగ్ ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. ల్యాండ్ స్కేపింగ్ ప్రాజెక్ట్‌లలో ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. సాధారణ ఇళ్లతో పోలిస్తే ల్యాండ్ స్కేపింగ్ గృహాల్లో విద్యుత్ బిల్లు రూ.700 నుంచి రూ.వెయ్యి వరకు ఆదా అవుతుంది.ఇంటి విలువ 20 శాతం వృద్ధి.. ల్యాండ్ స్కేపింగ్‌తో ఇల్లు, పరిసర ప్రాంతాల రూపరేఖలు మారిపోతాయి. సహజ సౌందర్యం, ఆకర్షణీయంగా ఉంటుంది. అందమైన ల్యాండ్ స్కేపింగ్‌తో ఇంటి విలువ దాదాపు 20 శాతం వరకు పెరుగుతుంది. నిరంతరం గ్రీనరీ చూస్తుండటంతో మనిషిలో ఒత్తిడి తగ్గడంతో పాటు సృజనాత్మకత పెరుగుతుంది. ల్యాండ్ స్కేపింగ్‌తో పరిసర ప్రాంతాల్లో గాలి కాలుష్యం తగ్గుతుంది. అలాగే గడ్డి, పొదలతో కూడిన ల్యాండ్ స్కేపింగ్ మట్టిని బలంగా ఉండేలా చేస్తుంది. దీంతో వరదలు, వర్షం వంటి వాటితో భూమి కోతలను నివారిస్తుంది. అంతేకాకుండా సీతాకోకచిలుకలు, చిన్న పక్షలు వంటి స్థానికంగా జీవవైవిధ్యానికి ల్యాండ్ స్కేపింగ్ ఆసరాగా నిలుస్తుంది.క్లబ్ హౌస్‌లో కో–వర్కింగ్ ప్లేస్.. కరోనా తర్వాతి నుంచి వర్క్ ఫ్రం హోమ్ విధానం అలవాటయ్యింది. ఉద్యోగుల ఆసక్తి, నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం, మెరుగైన ఉత్పాదకత కారణంగా ఇప్పటికీ కొన్ని బహుళ జాతి కంపెనీలు ఇంటి నుంచి పని విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇంట్లో ప్రత్యేకంగా కొంత స్పేస్ ఆఫీస్ కోసం వినియోగిస్తే ఒప్పుకోవడం లేదు. ఇంట్లో పిల్లల అల్లరి, పెద్దల అవసరాలు, బంధువులు వస్తే హడావుడి తదితర కారణాలతో ఇంట్లోనే ఆఫీస్ స్పేస్ ఇస్తే ఇష్టపడటం లేదు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో అక్కడ.. కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!క్లబ్‌హౌస్‌లో ప్రత్యేకంగా కో–వర్కింగ్ స్పేస్ ఇస్తున్నారు. హై నెట్వర్క్ స్పీడ్‌తో వైఫై సేవలను అందిస్తున్నారు. కూర్చునేందుకు వీలుగా మంచి కుర్చీలు, ఇతరత్రా ఏర్పాట్లను చేస్తున్నారు. దీంతో ఆయా నివాస సముదాయంలో వర్క్ ఫ్రం హోమ్ చేసుకునే నివాసితులందరూ ఒకే చోట పనిచేసుకునే వీలు కలుగుతుంది. దీంతో ఇంట్లో ఎలాంటి అంతరాయం కలగదు. పైగా అత్యవసర సమయంలో వెంటనే ఇంటికి చేరుకోవచ్చు. -
బుల్ స్వారీలో ‘ఆమె’ జోరు
సాక్షి, అమరావతి: స్టాక్ మార్కెట్లో బుల్ స్వారీ చేయడానికి మహిళా ఇన్వెస్టర్లు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం 2022 తర్వాత ప్రారంభమవుతున్న ప్రతి నాలుగు డిమ్యాట్ అకౌంట్లలో ఒకటి మహిళా ఖాతాగా ఉన్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2021 నుంచి సగటున ఏటా మూడు కోట్ల ఖాతాలు ప్రారంభమవ్వగా, ఈ ఏడాది ఇప్పటికే నాలుగు కోట్లకు పైగా డిమ్యాట్ ఖాతాలు ప్రారంభం కావడం గమనార్హం. 2014లో దేశం మొత్తం మీద 2.2 కోట్ల ఖాతాలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 17 కోట్లు దాటింది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య క్రమేపి పెరుగుతూ వస్తోంది. 2014 ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.12,068 కోట్ల నిధులు సేకరిస్తే, 2024లో రూ.1.60 లక్షల కోట్లు స్టాక్ మార్కెట్ ద్వారా సేకరించడం గమనార్హం. సిప్ విధానం ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఏటా రూ.రెండు లక్షల కోట్లకుపైగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. రాష్ట్రంలో 22.7% మహిళా ఇన్వెస్టర్లు మహిళా ఇన్వెస్టర్లు వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. గత మూడేళ్లలో హిమాచల్ ప్రదేశ్ 3.7% వృద్ధితో మొదటి స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ 3.2% వృద్ధితో రెండవ స్థానంలో నిలిచింది. 2022లో మొత్తం ఇన్వెస్టర్లలో మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య 19.5% ఉండగా, అది ఇప్పుడు 22.7 శాతానికి పెరిగింది. జాతీయ సగటు 23.9% పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ, గత మూడేళ్లుగా రాష్ట్రంలో మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య వేగంగా పెరుగుతున్నట్టు ఎస్బీఐ రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది. పెద్ద రాష్ట్రాల్లో ఢిల్లీ 29.8%, మహారాష్ట్ర 27.7%, తమిళనాడు 27.5%తో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. చిన్న రాష్ట్రాలు కూడా కలుపుకుంటే గోవా 32%తో మొదటి స్థానంలో ఉంది. మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా ఉన్నాయి. కోవిడ్ తర్వాత నుంచి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే 30 ఏళ్లలోపు వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 2018లో మొత్తం ఇన్వెస్టర్లలో 22.9 శాతంగా ఉన్న 30 ఏళ్లలోపు ఇన్వెస్టర్ల సంఖ్య ఇప్పుడు 40 శాతానికి చేరుకుంది. కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్న వారిలో అత్యధికంగా హైదరాబాద్, బెంగళూరు, కాన్పూర్ వంటి పట్టణ ఇన్వెస్టర్లు ఉంటున్నట్లు ఎస్బీఐ నివేదిక వెల్లడించింది. -
జోరుగా.. హుషారుగా వసూళ్లు : ప్రీ వెడ్డింగా? ప్రీ వేస్టింగా!
పెళ్లంటే..పందిళ్లు, బాజాలు, భజంత్రీలు, బంధువుల, విందు భోజనాలు...ఇది ఒకప్పుడు ఇప్పుడు ట్రెండ్ మారింది. వివిధ రకాల ఫోటోషూట్లు వీటి స్థానాన్ని ఆక్రమించాయి. నేటి యువత పెళ్లి కంటే ప్రీ వెడ్డింగ్‌కే ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. వీటితోపాటు పెళ్లి, రిసెప్షెన్ డ్రస్సులకు కూడా వేలు, ఒక్కోసారి లక్షల్లో కూడా ఖర్చు చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్‌కు తమ చుట్టుపక్కల చూడదగిన రమణీయమైన ప్రాంతాలకు వెళ్లడం లేదా ప్రత్యేకంగా పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం చేస్తున్నారు.కాబోయే జంటలను తీసుకెళ్లడానికి కార్లు, భోజనం మొదలుకుని బస చేయడానికి హోటళ్లు, గెస్ట్ హౌస్‌లలో గదుల బుకింగ్ పనులన్నిటినీ ఫొటోగ్రాఫర్లే చూసుకుంటారు. కొందరు ప్రీ వెడ్డింగ్‌కు రూ.25 వేల నుంచి 35 వేలు చార్జీలు తీసుకుంటుండగా మరికొందరు రూ.50–75 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొంత హై ఫై సౌకర్యా లు కావాలంటే ఏకంగా రూ.90 వేల వరకు చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోటోగ్రాఫర్లు, ఈవెంట్మేనేజర్లకు డిమాండ్ పెరిగింది. (ప్రియురాలికి ఫ్లాట్, లగ్జరీ కారు, అడ్డంగా బుక్కైన ప్రియుడు!)ఎంతైనా తగ్గేదేలే... గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. వారానికి కనీసం మూడు, నాలుగు పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా పెళ్లి బాజాలు వినిపిస్తున్నాయి. సాయంత్రమైందంటే చాలు భాజాభజంత్రీలు, బ్యాండ్ల మోతలతో బారాత్‌లు(పెళ్లి ఊరేగింపులు) తీస్తున్న దశ్యాలే దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు పెళ్లంటే ఇంటి గుమ్మం ముందు లేదా ఖాళీ స్థలాల్లో జరిగేవి. కాని కాలం మారడంతో వాటికి స్వస్తి పలికి ఏసీ, నాన్ ఏసీ పంక్షన్ హాళ్లలో చేస్తున్నారు. ఫలితంగా హాళ్లకు డిమాండ్ పెరిగింది.ఇందుకోసం ఫొటోగ్రాఫర్లకు ఎంత చార్జీలు చెల్లించేందుకైనా వెనకాడడం లేదు. అయితే ఇది తమ తల్లిదండ్రులకు అదనపు భారంగా పరిణమిస్తుందని వధూవరులు గ్రహించలేక పోతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఫొటోగ్రాఫర్లు, మ్యూజిక్ బ్యాండ్లు, సంప్రదాయ సంగీత వాద్య బృందాలకు కూడా డిమాండ్ పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్లుగా.... అమ్మాయిల కొరత కారణంగా గత రెండు, మూడేళ్లుగా పెళ్లిళ్లు ఎక్కువ శాతం జరగలేదు. దీనికి తోడు ముహూర్తాలు కూడా ఎక్కువగా లేకపోవడంవల్ల చాలా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. కానీ ఈ ఏడాది ముహూర్తాలు ఎక్కువ ఉండడంవల్ల ఎక్కడ చూసిన పెళ్లి సందడి కనిపిస్తోంది. ఫంక్షన్ హాళ్లన్నీ ఇప్పటికే రిజర్వై పోయి ఉండటంతో అందుబాటులో ఉన్న స్కూళ్లు, కాలేజీ గ్రౌండ్లు, క్రీడా మైదానాలలో కూడా పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. ఒకప్పుడు ముహూర్తాలు చూసుకుని ఫంక్షన్ హాళ్లు బుక్ చేసుకునేవారు. (చిట్టి లవంగం : గట్టి లాభాలు, బరువు కూడా తగ్గొచ్చు!)కానీ ఇప్పుడు డిమాండ్ పెరగడంతో ఏ రోజు హాలు ఖాళీ ఉందో ఆరోజు ముహూర్తం పెట్టుకోవల్సిన పరిస్ఠితి వచి్చంది. ముఖ్యంగా ఫంక్షన్ హాళ్లు, బాంక్వేట్ హాళ్లలో వేడుకలకు ఖర్చు తక్కువ కావడంతోపాటు బంధువులకు భద్రత, విలువైన వస్తువులకు రక్షణ ఎక్కువ. కానీ గ్రౌండ్లలో, ఖాళీ మైదానాలలో పెళ్లి చేయాలంటే చాలా ఖర్చు చేయాల్సిఉంటుంది. భారీ వేదిక, చుట్టుపక్కల, పైన టెంట్లు నిర్మించడం, గాలికి దుమ్ము, ధూళి లేవకుండా మైదానంలో కార్పెట్లు వేయడం, కళ్లు జిగేల్మనిపించే విద్యుత్ దీపాలు, సిరీస్ లైట్ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేకంగా స్ధలం కేటాయించడం, విలువైన వస్తువులు దొంగతనానికి గురికాకుండా కాపాడుకునేందుకు, బిచ్చగాళ్లు, బయట వ్యక్తులు వచ్చి భోజనం చేయకుండా చూసేందుకు ప్రైవేటు సెక్యురిటీ గార్డులను నియమించడం... ఇదంతా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని.మరోపక్క డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని లౌడ్‌స్పీకర్ల యజమానులు, బ్రాస్ బ్యాండ్ నిర్వాహకులు, బారాత్‌లకు అద్దెకిచ్చే ఓపెన్ టాప్ కార్లు, మెర్సిడీస్ బెంజ్ వాహనాలు, గుర్రపు బండ్ల యజమానులు అడ్డగోలుగా చార్జీలు పెంచేశారు. మేకప్‌కు కూడా లక్షల్లోనే... ఈ ఖర్చులన్నీ ఒక ఎత్తైతే వధూవరులు అనవసరంగా చేస్తున్న ప్రీ వెడ్డింగ్, మేకప్ ఖర్చులు హద్దులు దాటుతున్నాయి. వధూవరులతోపాటు బంధువుల మేకప్‌కు సైతం లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. -
నయా ట్రెండ్ : పెళ్లికి ముందే బేబీ బంప్ ఫొటోషూట్ రచ్చ!
ప్రస్తుతం మెటర్నిటీ ఫోటోషూట్ ట్రెండింగ్‌లో ఉంది. మాతృత్వ అనుభూతులను అందంగా, పదిలంగా దాచుకోవాలనే లక్ష్యంతో ఇది పాపులర్ అయింది. కానీ చైనాలో ప్రెగ్నెన్సీ ఫోటోలకు సంబంధించి ఒక నయా ట్రెండ్ విమర్శలకు తావిస్తోంది. చైనాలో ఒంటరి మహిళలు ఇప్పుడు నకిలీ బేబీ బంప్, మెటర్నీటి ఫోటోషూట్లకు సోషల్‌మీడియాను ముంచుత్తెతున్నారు. దీంతో చర్చకు దారి తీసింది.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) రిపోర్ట్ ప్రకారం పెళ్లి కాని యువతుల బేబీ బంప్‌తో ఫొటోషూట్ చైనాలో కొత్త ట్రెండ్‌గా మారింది. హునాన్ ప్రావిన్స్‌కు చెందిన జనరేషన్ Z ఇన్ఫ్లుయెన్సర్ “ మెయిజీజీ గెగే” అక్టోబర్ 13న తన మెటర్నిటీ ఫోటోషూట్‌ను షేర్ చేసింది. అదీ ఆమె సింగిల్‌గా(పెళ్లి కాకుండానే), స్లిమ్‌గా ఉన్నప్పుడే బేబీ బంప్‌తో ఫొటోషూట్ చేసింది. అంతేకాదు గర్భధారణ సమయంలో పొందే ఆనందాన్ని అనుభవించాను అంటూ ఆమె రాసుకొచ్చింది. దీంతో ఇది ట్రెండింగ్‌లో నిలిచింది. 5.7 మిలియన్లకు పైగా ఫాలోవర్లను ఆమె విపరీతంగా ఆకర్షించింది. ఈ ఫేక్ బేబీ బంప్ ఫోటోషూట్ ట్రెండ్ వేగంగా ఊపందుకుంటోందిఈ ధోరణి చైనాలో జననాలు, వివాహాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ మెటర్నిటీ ఫోటోషూట్లు విపరీతంగా షేర్ అవుతున్నాయి. 26 ఏళ్ల గ్రాడ్యుయేట్ తాను సింగిల్ అయినప్పటికీ 23 ఏళ్ల వయస్సులో తన ప్రసూతి ఫోటోలను తీసినట్లు వెల్లడించింది. మరో యువతి తన పెళ్లి ఫోటోలను 22 ఏళ్ల వయసులో తీశానని, “నాకు 30 ఏళ్లలోపు ముడతలు వస్తే” ఎలా అంటూ వ్యాఖ్యానించింది. ఇలా 20 ఏళ్ళ వయస్సున్న అమ్మాయిలుకూడా ఇలా ఫేక్ బేబీబంప్ ఫోటో షూట్ చేయించుకుంటుండటం గమనార్హం.గర్భధారణ సమయంలో శరీర మార్పులు ఒళ్లు చేస్తే ఫొటోషూట్ నైస్‌గా అందంగా కుదరదని భావిస్తున్న యువతులు నాజూకైన శరీరం ఉండగానే ఫేక్ బెల్లీ ఫోటోలను తీయించుకుంటున్నారు. అయితే ఈ ట్రెండ్‌పై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అటు పాత తరం కూడా ఇదేం చోద్యం అంటూ మెటికలు విరుస్తూ ఆశ్చర్యపోతున్నారట. తాము కూడా 70 ఏళ్ల పుట్టినరోజు, అంత్యక్రియల ఫొటోషూట్లు నిర్వహించుకొంటామంటూ మండి పడుతున్నారు. -
ఉద్యోగం మానేయడమే ట్రెండ్
లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో స్వీడన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి ఉంది. కానీ ఇప్పుడది క్రమంగా మారుతోంది. అక్కడ మహిళా శ్రామికుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. యువతులు పని మానేయడాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ ధోరణి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు స్వీడన్లో ‘హేమాఫ్లిక్వాన్’లేదా ‘హేమాఫ్రూ’అంటే ‘సాఫ్ట్‌గాళ్’(ఇంట్లో ఉండే స్నేహితురాలు లేదా గృహిణి) హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సాఫ్ట్‌గాళ్ అంటే ఉద్యోగాలను చేయడానికి బదులు గృహిణిగా ఇంటికి పరిమితమై కొత్త జీవితాన్ని స్వీకరించం. సోషల్ మీడియాలో ఈ మైక్రో ట్రెండ్ 2010వ దశకం చివరలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ప్రారంభమైంది. కానీ స్వీడన్లో ఐదు దశాబ్దాలుగా శ్రామిక శక్తిలో సమాన భాగాన్ని పంచుకుంటున్న మహిళలను నెమ్మదిగా తగ్గించడం మొదలుపెట్టింది. మహిళలు ఉద్యోగాలు వదిలేయడం ఇటీవల కాలంలో మరింత ట్రెండ్‌గా మారుతోంది. స్వీడన్ యువతపై అతిపెద్ద వార్షిక సర్వే ఈ విషయాలను వెల్లడించింది. 15 నుంచి 24 ఏళ్ల వయస్సున్న యువతులు ఉద్యోగం వదిలేసి ‘సాఫ్ట్‌గాళ్’ట్రెండ్‌ను స్వీకరించడానికే ఆసక్తి చూపుతున్నారని తెలిపింది. ఉద్యోగాలు చేస్తూ సాధికారతను, స్వావలంబనను కోరుకునే ‘గాళ్ బాస్’ఆదర్శాన్ని ఇకపై త్యాగంచేయాలని చాలా మంది మహిళలు భావిస్తున్నారని అధ్యయనం వెల్లడించింది. అయితే పెళ్లయిన తర్వాత ఉద్యోగాలు వదిలేస్తున్న మహిళల అధికారిక డేటా లేదు. అయితే ఇది తక్కువ నిష్పత్తిలో ఉండే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. పెదవి విరిచిన అభ్యదయ వాదులు స్వీడన్లో ప్రధాన చర్చనీయాంశంగా మారిన ఈ ట్రెండ్‌పై స్వీడన్ మమిళా హక్కుల కార్యకర్త మాట్లాడారు. మహిళలు తమ భాగస్వాముల సంపాదనపై ఆధారపడటం అంటే లింగసమానత్వంలో వెనుకడుగు వేయడమే. ఇంకా పురుషాధిక్య సమాజాన్ని వ్యతిరేకించే మహిళలకు ఈ ధోరణి తప్పుడు సందేశాన్ని ఇస్తుంది’’అని ఆమె అన్నారు. పని చేసే హక్కు, జీవన భృతి పొందే హక్కు, ఆర్థిక స్వాతంత్య్రం కోసం మహిళలు శతాబ్దాలుగా ఎంతటి పోరాటం చేశారో నేటి స్వీడన్ మహిళలకు తెలీదనుకుంటా అని ఆమె అసహనం వ్యక్తంచేశారు. అయితే స్వీడన్ డెమొక్రాట్ల పార్టీ నేతలు ఈ సాఫ్ట్‌గాళ్ ట్రెండ్ పట్ల సానుకూలంగా ఉండటం విశేషం. ఎవరి జీవితంపై నిర్ణయం వారు తీసుకోవాల్సిందేనని, ఉద్యోగం చేయకుండా ఉండగలిగే అరి్థక వెసులుబాటు ఉంటే జాబ్ మానేయడమే మేలు అని వాళ్లు చెబుతున్నారు. ‘‘కెరీర్ కోసం అనేక అవకాశాలున్న దేశంలో నివసిస్తున్నాం. మాకు ఇప్పటికీ అన్ని హక్కులు ఉన్నాయి. కానీ మరింత సాంప్రదాయకంగా జీవించడాన్ని ఎంచుకునే హక్కు కూడా మాకు ఉంది’’అని కొందరు మహిళలు తమ నిర్ణయాన్ని సమరి్థంచుకున్నారు. ఒత్తిడే కారణమంటున్న నిపుణులు: సైద్ధాంతిక చర్చలను పక్కన పెడితే యువతులు పనిని విడిచిపెట్టడానికి లేదా సాదాసీదా జీవనశైలిని కోరుకోవడానికి గల సామాజిక, సాంస్కృతిక కారణాలపై చర్చలు మొదలయ్యాయి. చాలా మంది ఉద్యోగులు సంవత్సరానికి ఆరు వారాల సెలవు పొందుతారు. 1% కంటే తక్కువ మంది వారానికి 50 గంటల కంటే ఎక్కువ పని చేస్తారు. దీంతో పనిచేసే మహిళల్లో ఒత్తిడిపాళ్లు చాలా ఎక్కువగాఉంటున్నాయనితేలింది. ఇదే ‘సాఫ్ట్‌గాళ్’ట్రెండ్ వైపు వెళ్లడానికి కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ముఖ్యంగా జెన్ జెడ్ ఏజ్ గ్రూప్ (1997 నుంచి 2012 మధ్య జని్మంచిన) యువతులు కెరీర్లో లక్ష్యాల కంటే విశ్రాంతి వైపు దృష్టి పెడుతున్నారన్న వాదనలు ఎక్కువయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రీడ్.. రైట్.. రైట్
ఈ మధ్య మంచి సినిమా వచ్చింది చూశావా బ్రో.. ఇన్‌స్టాలో కొత్త రీల్ ట్రెండింగ్‌లో ఉంది తెలుసా మచ్చా.. యూట్యూబ్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది సెండ్ చేయాలా? ఈ తరం యువతను కదిపితే వారి నోటివెంట ఎక్కువగా వచ్చే మాటలు. మనలో చాలా మంది ఇలాగే మాట్లాడతారు కూడా. అదే ఏదైనా పుస్తకం గురించి చెప్పామనుకోండి.. పుస్తకమా.. పుస్తకం చదివే టైం ఎక్కడుంది.. అయినా ఈ రోజుల్లో పుస్తకాలు ఎవరు చదువుతారు చెప్పండి! అంటూ తిరిగి ప్రశ్నిస్తుంటారు. నిజమే పుస్తక పఠనం ఈ తరం యువతలో తగ్గిపోయిందని అనుకుంటారు. కానీ మనలో చాలా మంది ఈ ట్రెండ్స్‌ని ఫాలో అవుతూనే ఏదో ఒక పుస్తకాన్ని చువుతూ ఉంటారు. మరికొందరైతే పుస్తకాలంటే పడి చచి్చపోతుంటారు. తెలుగుతో పాటు ఇంగ్లిష్ పుస్తకాలను తెగ చదివేస్తున్నారు. ఇన్‌స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ మాత్రమే చూసే ఈ తరం యువతీ, యువకుల్లో చాలా మంది పుస్తకాలు చదివే వాళ్లు కూడా ఉన్నారా అని మనలో కొందరికి డౌటనుమానం? అయితే అదంతా వట్టి అపోహేనని ఏటా జరిగే హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు వచ్చే స్పందన రుజువు చేస్తోంది. వేలాది మంది యువత ఈ ఫెయిర్‌లో లక్షల సంఖ్యలో పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు బుక్ ఫెయిర్‌లో అమ్మకాలు ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలానే కొనసాగుతున్నాయని చెబుతున్నారు నిర్వాహకులు. నవలలకు ప్రాధాన్యం.. పుస్తకాలు చదివే వారిలో ఎక్కువగా నవలలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పొట్టి వీడియోలు, షార్ట్ న్యూస్ లాగే పొట్టి కథలు చదివేందుకు ఇష్టపడుతున్నారు. తక్కువ నిడివిలో చెప్పాల్సిన విషయాన్ని చెప్పేసే నవలలకు యువత ఎక్కవగా అట్రాక్ట్ అవుతోంది. ఇక, వచన కవిత్వంపై కూడా యూత్ మనసు పారేసుకుంటోంది. దీంతో పాటు ప్రముఖుల ఆత్మకథలు చదివేందుకు చాలా మంది యువతీ, యువకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకప్పుడు ఇంగ్లిష్ లో నవలలు చదివేందుకు కాలేజీ విద్యార్థులు మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు మాతృభాష అయిన తెలుగు పుస్తకాలు చదివేందుకు ప్రయతి్నస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న వారు తెలుగు పుస్తకాలు చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు.పాఠకులు పెరుగుతున్నారు.. 1990లలో పుస్తకాలు బాగా హిట్ అయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఎంత ఆసక్తిగా ఉన్నా కూడా పుస్తకాలు చదివే వారు తక్కువయ్యారని చాలా మంది అంటుంటారు. కానీ పుస్తకాలు చదివేవారు బాగానే పెరిగారు. ఓ సినిమా బాగుంటే ఎలా చూస్తున్నారో.. మంచి కథ.. విభిన్న కథనంతో పుస్తకాలు మార్కెట్లోకి వస్తే కళ్లకద్దుకుని చదివే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల వచ్చిన ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ అనే పుస్తకం దాదాపు లక్ష కాపీలు అమ్ముడుపోవడమే ఇందుకు నిదర్శనం. నిజ జీవితంలో జరిగే ఉదంతాలనే ఆసక్తిగా రాస్తే పుస్తకాలు చదువుతారని ఆ పుస్తక రచయిత నిరూపించారనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి పుస్తకాలు చదివిన తర్వాత చాలా మంది ఏదైనా మంచి పుస్తకం ఉంటే చెప్పండి బ్రదర్ అని తెలిసిన వారిని ఇప్పటి యువతీ, యువకులు అడుగుతున్న సందర్భాలు కోకొల్లలు.రచయితలుగానూ రాణిస్తూ.. ఇటీవలి కాలంలో పుస్తకాలు రాసేందుకు కూడా యువత ఆసక్తి కనబరుస్తోంది. ముఖ్యంగా మాతృభాషపై మమకారంతో తమకు సాధ్యమైనంత వరకూ రచనలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు హాబీగా ఖాళీ సమయాల్లో రచనలు చేస్తుండగా.. కొందరు మాత్రం రచనను కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. మంచి కథతో వస్తే పాఠకులు ఆదరిస్తారనే నమ్మకం పెరగడంతో, మంచి కథలు రాసేందుకు ప్రయతి్నస్తున్నారు. అందరికీ పుస్తకాలు అచ్చు వేయించుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకే చాలా మంది సామాజిక మాధ్యమాల్లో చిన్న చిన్న కథలు రాస్తూ తమ అభిరుచిని చాటుకుంటున్నారు. ఇలా రాస్తూ.. రాస్తూ.. పుస్తకాలు ప్రచురించేసి, ఆదరణ పొందుతున్న వాళ్లూ లేకపోలేదు. ఇక, పుస్తకాలు, సోషల్ మీడియాలో రాస్తూ సినిమాల్లో గేయ రచయితగా, స్క్రిప్ట్ రైటర్‌గా కూడా వెళ్లేందుకు దారులు వెతుక్కుంటున్నారు.వెలకట్టలేని అనుభూతి.. పుస్తక పఠనం ఎప్పటికీ వన్నె తరగనిది. సామాజిక మాధ్యమాలు తాత్కాలికమే. పుస్తకాలు చదివితే ఏదో వెలకట్టలేని అనుభూతి కలుగుతుంది. సోషల్ మీడియాలో సమయాన్ని వృథా చేసుకునే బదులు మంచి పుస్తకం చదివితే కొత్త ప్రపంచాన్ని చూసిన వాళ్లమవుతాం. – డాక్టర్ మల్లెగోడ గంగాప్రసాద్, రచయితఅవినాభావ సంబంధం చిన్నప్పటి నుంచే చిన్న చిన్న కథలు, వ్యాసాలు రాయడం అలవాటు. తెలుగుపై మమకారంతో తెలుగులో పీజీ చేశాను. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రచయిత్రుల కథా సాహిత్యం– స్త్రీ జీవన చిత్రణ అనే అంశంపై పీహెచ్డీ చేస్తున్నాను. పుస్తక పఠనంతో భాషను మెరుగుపరుచుకోవచ్చు. నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథలు ఆసక్తిగా ఉంటాయి. – పెద్దపల్లి తేజస్వి, పరిశోధక విద్యారి్థని, ఓయూబంగారు భవితకు బాట.. పుస్తక పఠనం యువత బంగారు భవితకు బాటలు వేస్తుంది. సాహిత్య పఠనం ద్వారా సామాజిక స్పృహ కలుగుతుంది. పుస్తకం చదువుతుంటే ఎంతో మందితో సాన్నిహిత్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. భావ వ్యక్తీకరణ, భాషా నైపుణ్యం, ఏకాగ్రత, ఓర్పు, సహనం పెరుగుతుంది. – రావెళ్ల రవీంద్ర, యువ రచయిత -
భాగ్యనగరాన్ని.. కమ్మేస్తున్న క్లౌడ్స్..
దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో.. విభిన్న ఆహార రుచులకు కేంద్రమైన నగరాల్లో హైదరాబాద్ కూడా ప్రముఖమైనది. ప్రస్తుత కాంటినెంటల్ వంటకాలే కాదు నిజాం కాలం నాటి స్థానిక సాంస్కృతిక వంటకాలతోనూ మన భాగ్యనగరం ‘బౌల్ ఆఫ్ డెలీíÙయస్ డిష్’గా గుర్తింపు పొందింది. ఇందులో భాగంగా నగరంలో స్థానిక వంటకాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన రుచులు కూడా ఆదరణ పొందుతున్నాయి. ఈ రుచుల కోసమే ప్రత్యేకంగా రెస్టారెంట్లు కూడా వెలిశాయి. అయితే కరోనా అనంతరం ఈ రంగంలో పెను మార్పులు వచ్చాయి. ముఖ్యంగా క్లౌడ్ కిచెన్. ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడంతో మొదలైన ఈ కల్చర్.. వెళ్లే అవకాశమున్నా ఆన్లైన్ లోనే ఆర్డర్ పెట్టేంతగా మార్పు చెందింది. నగరంలో విభిన్న రుచులు విభిన్న సంసంస్కృతుల సమ్మేళనానికి నిదర్శనంగా నిలుస్తుంది. హైదరాబాద్ బిర్యానీ మొదలు ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ వరకూ అన్ని రుచులూ ఆన్లైన్, డిజిటల్ వేదికగా ఒక్కొక్క ఆర్డర్‌తో అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్థానిక వంటకాలే కాదు చైనీస్, కొరియన్, మొగలాయి, కరాచి వంటి రుచులను అందించే రెస్టారెంట్లు తమ డోర్ స్టెప్ సేవలను అందిస్తున్నాయి. వీరికి వారధులుగా స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ వేదికలు ఉన్నాయన్న విషయం విధితమే. అయితే.. ఈ కోవలోకి స్టార్ రెస్టారెంట్లు కాస్త విముఖతను ప్రదర్శించాయి. నాణ్యత, బ్రాండ్ వాల్యూ విషయంలో ఈ సేవలు అందించలేదనేది నిపుణుల మాట. కానీ ప్రస్తుతం నగరంలోని టాప్ 5 స్టార్ హోటల్స్, రెస్టారెంట్లు సైతం క్లౌడ్కిచెన్కు ఆసక్తి చూపిస్తున్నాయి. వాటి పాకశాస్త్ర నైపుణ్యాలతో నాణ్యత, ప్యాకింగ్, బ్రాండ్ వాల్యూ వంటి అంశాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ సేవలు ప్రారంభిస్తున్నాయి. విలాసవంతమైన జీవితాల్లో ఈ లోటును పూడ్చడానికి స్టార్ హోటళ్ల యాజమాన్యం ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా గమనించాలి. జూబ్లిహిల్స్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల డిజిటల్ ఫుడ్ సేవలు ఊపందుకున్నాయి. అందరూ అదే దారిలో.. డైనింగ్‌తో పాటు ఈ క్లౌడ్ కిచెన్‌లో కూడా మంచి లాభాలు వస్తుండటంతో పలు రెస్టారెంట్లు ఈ డిజిటల్ ఇన్నోవేషన్‌కు సై అంటున్నాయి. కానీ స్టార్ హోటళ్లు మాత్రం అంతగా ఆసక్తి చూపించలేదు. అయితే గత కొంత కాలంగా 5 స్టార్ హోటళ్లు సైతం క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించాయి. వాటి బ్రాండ్ వాల్యూను కొనసాగిస్తూనే, పాకశాస్త్ర నైపుణ్యాలను డిజిటల్ వేదికతో అనుసంధానం చేస్తూ సేవలందిస్తున్నాయి. ఇక క్లౌడ్ కిచెన్ సేవలను నగరవాసులు ఆస్వాదిస్తున్న తీరు అద్భుతం. ఈ నేపథ్యంలో వారికి మా సేవలను సైతం అందంచాలనే లక్ష్యంతో ఐటీసీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫుడ్‌టెక్ సేవలు ప్రారంభించాం. స్విగ్గీ, జొమాటో వంటి వేదికలతో అనుసంధానమై మా పసందైన రుచుల పండుగను ఆహార ప్రియుల వద్దకే చేర్చుతున్నాం. ముఖ్యంగా మా ప్రయత్నంలో అధిక–నాణ్యత భోజనాన్ని అందించడంతో పాటుగా పర్యావరణహితమైన ప్యాకింగ్‌ను కొనసాగిస్తున్నాం. డిజిటలీకరణతో అద్భుత ఫలితాలు ఫుడ్, హోటల్స్ రంగంలో అధునాతన డిజిటలీకరణ అద్భుత ఫలితాలను అందిస్తుంది. ఫుడ్ సేఫ్టీ ప్రోటోకాల్స్‌లో పాకశాస్త్ర నిపుణులైన స్టార్ హోటల్ చెఫ్‌లు, కిచెన్ మేనేజర్లు విశేషమైన శిక్షణ ఉండటంతో ఈ విధమైన క్లౌడ్ కిచెన్‌కు మంచి ఆదరణ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా వివిధ దశల్లో ఆహార పదార్థాల తనిఖీ, తయారీ విధానంలోనూ అధునాతన సాంకేతికత వినియోగించడంతో పాటు శాటిలైట్ కిచెన్లలో ఉపయోగించే యాప్‌లు ఈ వంటలకు మరింత నాణ్యతను, ఖచి్చతత్వాన్ని పెంపొందిస్తున్నాయి. ఈ ఫుడ్ టెక్ సేవలలో సుస్థిరతే ప్రధాన లక్ష్యంగా స్టార్ హోటల్స్ ప్యాకింగ్‌ను వినూత్నంగా చేపడుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, మారే ఉష్ణోగ్రతలు ఆహారాన్ని పాడు చేయకుండా స్పిల్లేజ్ ప్రూఫ్ కంటైనర్లను ఉపయోగిస్తుండటం విశేషం. ఫుడ్ లవర్స్ అభిరుచికి అనుగుణంగా.. నగరంలోని ఫుడ్ లవర్స్ ఇష్టపడే రుచులకు అనుగుణంగా, మా నాణ్యతా ప్రమాణాలను పెంచుకుంటూ 3 రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇందులో భాగంగా ప్రముఖ మాస్టర్ చెఫ్‌లచే రూపొందించబడిన దాల్ మఖీ్న, కబాబ్‌లు, ర్యానీలతో సహా గౌర్మెట్ నార్త్ ఇండియన్ వంటకాలను అందించడానికి ‘ఐటీసీ మాస్టర్ చెఫ్ క్రియేషన్స్’, ఆరోగ్యానికి హితమైన మిల్లెట్ కిచిడీ, ఇంటి వంటలను తలపించే చపాతీలు, అన్నం వంటి వాటికోసం ‘ఐటీసీ ఆశీర్వాద్ సోల్ క్రియేషన్స్’, క్రోసెంట్స్, బేగెల్స్, గౌర్మెట్ బ్రెడ్లు వంటి బేకరీ ఐటమ్స్ కోసం ‘ఐటీసీ సన్‌ఫీస్ట్ బేక్డ్ క్రియేషన్స్’ సేవలు ఉన్నాయి. ఈ మూడు రకాల సేవలను హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నైలోని 19 క్లౌడ్ కిచెన్లలో ప్రారంభించాం. – రోహిత్ భల్లా, ఫుడ్ టెక్ బిజినెస్ హెడ్, ఐటీసీ లిమిటెడ్. -
ఈజీగా విదేశీ భాష, క్రేజీగా కొరియన్ నేర్చుకుందామా!
విదేశీ భాషని అధ్యయనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మన రెస్యూమ్‌ను బలోపేతం చేయడంతో పాటు పర్యాటక రంగంలో, గైడ్స్‌గా ఇతరత్రా రంగాల్లో రాణించడానికి, ట్రావెల్, బ్లాగులను తయారు చేయడం తదితర ఎన్నో రంగాల్లో ఉపాధి అవకాశాలను అందిస్తోంది. అంతేకాకుండా ప్రపంచం నలుమూలలకూ కమ్యూనికేట్ చేయగలిగేలా చేస్తుంది. విదేశీ విశ్వవిద్యాలయలో ప్రవేశాలకు కూడా ఉపయుక్తం అవుతున్నాయి.. ప్రస్తుతం వర్క్ కల్చర్, ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లకు మారడంతో విదేశీ భాషా నైపుణ్యాలతో ఫ్రీలాన్సర్‌గా అవకాశాలు పెరిగాయి. ఓటీటీ తదితర వేదికల విజృంభణతో అనువాదకులకు భారీగా డిమాండ్ పెరగడం కూడా విదేశీ భాషలను క్రేజీగా మార్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అనేక ఉద్యోగ అవకాశాలతో జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు దేశ విదేశాలలో రాయబార కార్యాలయాలు, హై–కమిషన్లలో విదేశీ భాషా ఉపాధ్యాయులుగా కొనసాగడానికి వీలైన కోర్సులకు డిమాండ్ సంతరించుకుంటున్నాయి. డిమాండ్‌లో ఫ్రెంచ్.. క్రేజీగా కొరియన్.. కొత్త భాషలు నేర్చుకోవడం కొన్నేళ్ల క్రితం వరకూ కేవలం హాబీగా భావించేవారు. అయితే, ప్రపంచీకరణతో విదేశీ భాషా నైపుణ్యం ఆదాయమార్గంగా కూడా అవతరించింది. దీంతో వయసుతో సంబంధం లేకుండా నగరవాసుల్లోనూ విదేశీ భాషలపై ఆసక్తి పెరుగుతోంది. సంపాదన కోసమో, మరేదైనా లక్ష్యాలతోనో సీరియస్‌గా ఫారిన్ లాంగ్వేజెస్‌కు జై కొడుతున్నారు. ప్రస్తుతం ఫ్రెంచి, రష్యన్, స్పానిష్, చైనీస్ అరబిక్ వంటి అనేక విదేశీ భాషలు బాగా డిమాండ్‌లో ఉన్నాయి. ఇటీవలే కొరియన్ వెబ్‌సిరీస్, మ్యూజిక్కూ పెరిగిన ఆదరణ కొరియన్ భాషా పరిజ్ఞానంపై యువత ఆసక్తిని పెంచింది. – సాక్షి, హైదరాబాద్ఈ నేపథ్యంలో విదేశీ భాష నేర్చుకోవడంలో సహాయపడే అనేక అకాడమీలు, సంస్థలు నగరంలో వెలుస్తున్నాయి. ఆయా భాషల కోర్సు వ్యవధి సాధారణంగా ఆరు నుంచి 12 నెలల్లో పూర్తి చేసి ప్రొఫెషనల్ డిగ్రీని అందుకుంటారు. అయితే అనర్గళంగా మాట్లాడడం, చదవడం, రాయడం అర్థం చేసుకోవడంపై పూర్తి పట్టు సాధించేందుకు మరింత వ్య«వధి అవసరం అవుతుందని శిక్షకులు అంటున్నారు. ఇవి కాకుండా ఒక విద్యార్థి ఆ భాష చరిత్ర, భాష సంస్కృతి సంబంధిత దేశాల ప్రజలు, అర్థం చేసుకునే పద్దతి, ఆ భాష యాస, డిక్షన్ గురించి కూడా నేర్చుకుంటేనే పూర్తి అవగాహన వస్తుందని సూచిస్తున్నారు. విద్యార్థులు పదో తరగతి తర్వాత సరి్టఫికెట్ డిప్లొమా స్థాయి కోర్సు లేదా పన్నెండో తరగతి పూర్తి చేసిన తర్వాత విదేశీ భాషలో డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును అభ్యసించవచ్చు. నగరంలో ఇంగ్లిష్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ, హైదరాబాద్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయాలు వంటివి విదేశీ భాషల్లో సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. అలాగే పలు ఆన్లైన్ లెరి్నంగ్ ప్లాట్‌ఫారమ్‌లలో విదేశీ భాషా కోర్సులను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. స్పానిష్ జోష్.. దాదాపు 50 కోట్ల మందికి పైగా మాట్లాడే వారితో స్పానిష్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మాట్లాడే భాషలలో రెండో స్థానంలో ఉంది. స్పానిష్ మాట్లాడే దేశాలతో మన దేశానికి ఇటీవల పెరుగుతున్న వాణిజ్యం దృష్ట్యా నేర్చుకోవడానికి అత్యధికులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యేకించి అంతర్జాతీయ వ్యాపారం, ఆతిథ్యం పర్యాటక రంగంలో ఆసక్తి ఉన్న వారికి ఇది బెస్ట్. ఫ్రెంచ్ పట్ల ఆసక్తి.. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది పైగా మాట్లాడే ఫ్రెంచ్ అత్యధికంగా మాట్లాడే భాషగా ఆరో స్థానంలో ఉంది. ఇది ఫ్రాన్స్, కెనడాతో సహా 29 దేశాల్లో అధికారిక భాష. ఫ్యాషన్, హాస్పిటాలిటీ, టూరిజంలో కెరీర్‌కు ఉపకరించే ఫ్రెంచ్ నేర్చుకోవడానికి విశ్వవ్యాప్తంగా విలువైన భాష. విన్.. జపాన్.. సాంకేతిక హబ్ హోదా, భారతదేశంతో బలమైన వాణిజ్య సంబంధాలు కలిగిన జపాన్ జపనీస్ అత్యధికులు కోరుకునే భాషగా మార్చాయి. ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల మందికి పైగా మాట్లాడే ఈ భాష సాంకేతికత, యానిమేషన్, గేమింగ్‌లో కెరీర్‌ను ఎంచుకున్న సిటీ యూత్ ఎంపికగా మారింది. మాండరిన్.. మంచిదే.. మనదేశపు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా చైనాను దృష్టిలో ఉంచుకుంటే.. అంతర్జాతీయ వ్యాపారం, దౌత్యం పర్యాటక రంగం కోసం మాండరిన్ నేర్చుకోవడం అవసరంగా మారింది. కో అంటే కొరియన్.. ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల మందికి పైగా మాట్లాడే కొరియన్‌కు నగరంలో బాగా డిమాండ్ ఉంది. ఆసియాలో మనదేశానికి మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కొరియా కావడం సాంకేతిక, వినోద పర్యాటక రంగాల్లో ఈ భాషా నైపుణ్యానికి డిమాండ్ పెంచుతోంది.జర్మన్‌కు జై.. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా, యూరోపియన్ యూనియన్‌లో అత్యధికంగా మాట్లాడే భాష జర్మన్. జర్మన్ నేర్చుకోవడం ఇంజినీరింగ్, సాంకేతిక రంగాల్లో విభిన్న అవకాశాలకు తలుపులు తెరుస్తోంది. ఇదీ..ఇటాలియన్..యూరోపియన్ యూనియన్‌లో అత్యధికంగా మాట్లాడే నాల్గో భాష ఇది. పర్యాటక కేంద్రంగా మరియు ఫ్యాషన్ మరియు డిజైన్‌కు కేంద్రంగా ఇటలీకి ఉన్న ప్రాచుర్యంతో ఫ్యాషన్, డిజైన్, హాస్పిటాలిటీలో కెరీర్‌ను లక్ష్యంగా చేసుకున్న సిటీ విద్యార్థులకు రైట్ ఛాయిస్‌గా నిలుస్తోంది. గ్రేస్.. పోర్చుగీస్..బ్రెజిల్ పోర్చుగల్‌తో సహా ఎనిమిది దేశాల్లో మాట్లాడేది పోర్చుగీస్. ఈ దేశాలతో మనకు విస్తరిస్తున్న సంబంధాల కారణంగా పోర్చుగీస్ భాషలో ప్రావీణ్యం అనేది భవిష్యత్తు విజయాలకు బాట వేస్తుంది.పలు భాషల్లో ప్రావీణ్యం కోసం.. విదేశీ భాషా పరిజ్ఞానం వల్ల ఉపాధి అవకాశాలతో పాటు మరెన్నో ప్రయోజనాలను యువత ఆశిస్తున్నారు. గతంలో పదుల సంఖ్యలో మాత్రమే విద్యార్థులు కనిపించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య వందలకు చేరింది. కెనడాలో ఉండే భారతీయులు కూడా ఆన్లైన్ ద్వారా మాకు స్టూడెంట్స్‌గా ఉన్నారు. నేర్చుకోవడం అనేది ఇలా సులభంగా మారడం కూడా విదేశీ భాషల పట్ల ఆసక్తిని పెంచుతోంది. – ఎం.వినయ్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫ్రెంచ్ భాషా విభాగం, ఉస్మానియా వర్సిటీ -
ఫుల్ ట్రెండ్ వేగన్ డైట్
చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. కొందరు మాత్రం మాంసాహారం ముట్టరు. కొందరేమో కొన్ని ప్రత్యేక వారాల్లో నాన్‌వెజ్ తినరు. కానీ మరికొందరు మరీ ప్రత్యేకం.. ఎందుకంటే వారు నాన్‌వెజ్ మాత్రమే కాదు.. కనీసం జంతువుల నుంచి తయారైన ఉత్పత్తులే తినరు. వారినే ఇప్పుడు వేగన్స్ అంటున్నారు. ఇటీవల వేగనిజం కాన్సెప్‌్టకు చాలామంది ఆకర్షితులవుతున్నారు. ఖచి్చతంగా పాటిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నారు. అసలు వేగనిజం అంటే ఏంటి.. అసలు అటువైపు ప్రజలు.. ముఖ్యంగా యువత ఎందుకు మొగ్గు చూపుతున్నారని పరిశీలిస్తే పర్యావరణ పరిరక్షణ, జీవహింసకు దూరంగా ఉండాలని చాలామంది పేర్కొంటున్నారు. పర్యావరణ, జంతు ప్రేమికుల్లో వేగన్‌గా మారాలన్న ఆలోచనలు పెరుగుతున్నాయి. తీసుకునే ఆహారంలో పోషకాలు కావాలంటే ఒక్క మాంసాహారమే తినాల్సిన అవసరం లేదు. శాఖాహారంలోనూ శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు, ప్రోటీన్లు లభిస్తాయని గట్టిగా నమ్ముతున్నారు. దీనికి సంబంధించిన స్టడీస్ ఆధారాలను ముందుంచుతున్నారు. జంతువుల నుంచి వచ్చే ముడిసరుకు ఆధారంగా తయారయ్యే ఉత్పత్తుల వలన కలిగే లాభాలు ఏంటి, వాటికి శాఖాహారపరంగా ప్రత్యామ్నాయాలను ఎలా సమకూర్చుకోవాలనే ఆలోచనలకు పదును పెడుతున్నారు.మాంసాహారం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలకు ఎక్కువగా వినియోగించే కోడినే ఉదాహరణగా చూపిస్తున్నారు. ఒక కోడి పెరగడానికి ఎన్ని రోజులు పడుతుంది. వేగంగా పెరగడానికి ఇస్తున్న స్టెరాయిడ్స్ వంటివి మానవ శరీరంపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపిస్తాయనే అంశాలను వివరిస్తున్నారు. అలాగే ప్రతి విషయంలోనూ ప్రస్తుత పరిస్థితుల్లో మాంసాహారం వల్ల రోగాలు కొనుక్కునట్లే అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి వాటికి దూరంగా ఉండి, ప్రకృతి సిద్ధమైన శాఖాహారం తీసుకోవడానికే ఇష్టపడుతున్నారు. నగరంలో పూర్తిగా కాకపోయినా వారంలో ఒకటి రెండు రోజులైనా పూర్తిస్థాయి వేగన్‌గా మారిపోవాలని కోరుకుంటున్నారు. గత రెండేళ్లలో ఇటువంటి వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వీళ్లకు అనుగుణంగా నగరంలోని పలు ప్రైమ్ ప్రాంతాల్లో వేగన్స్ ఫుడ్ స్టాల్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి శాఖాహార ఉత్పత్తులు అక్కడ లభిస్తున్నాయి.జీవన విధానంలో మార్పు కోరుకున్నా.. ఒక కోడి లేదా మేక పెరగాలంటే కనీసం మూడు నెలల నుంచి రెండు మూడేళ్లు పడుతుంది. దాన్ని ఒక్క రోజులో తినేస్తారు. ఆ జంతువు పెరగడానికి ఎన్ని ప్రకృతి వనరులు కావాలి. అంటే రెండేళ్ల రిసోర్సెస్‌ను ఒక్క పూటలో ఆరగించేస్తున్నామన్నమాట. మాంసం తింటేనే ప్రోటీన్లు అంటారా.. వాటికి ఎక్కడి నుంచి ప్రోటీన్ వస్తుందో అదే ఆహారం మనం తీసుకుంటే సరిపోతుంది కదా.. వేగన్‌గా మారడానికి ప్రకృతి, జీవహింస మాత్రమే కాదు. నా జీవన విధానంలో మార్పు కోరుకున్నా.. ఆచరిస్తున్నా. ప్రతివారం చెరువుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, పక్షుల సంరక్షణకు కార్యక్రమాలకు సమయం కేటాయిస్తా. – వినయ్, ఆర్కిటెక్ట్ఆరేళ్ల నుంచి ఆచరిస్తున్నాను నాకు జీవహింస చేయడం నచ్చదు. అందుకే వాటి నుంచి వచ్చే ఉత్పత్తులకు దూరంగా ఉంటాను. కాల్షియం కోసం పాలు తాగుతున్నాం.. నువ్వులు వినియోగిస్తే మన శరీరానికి అవసరమైన కాల్షియం వస్తుంది. పాలు కావాలంటే సోయాబ్సీన్తో తయారు చేసుకోవచ్చు. శాఖాహారంలోనూ పోషకాలన్నీ లభిస్తాయి. మాంసాహారమే కాదు లెదర్ బెల్టు, పర్సు, బూట్లు, జంతువుల నుంచి వచ్చే ఏ వస్తువులను వినియోగించను. సిల్క్ తయారు చేయడానికి లక్షల పురుగులను చంపాల్సి వస్తుంది. సిల్క్ వస్తువులకు దూరం. చికెన్ వంటి వంటకాలతో ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఆరేళ్ల నుంచి పూర్తిగా మారిపోయాను. – అఖిల్, హైదరాబాద్ -
ఓటీటీలో దూసుకుపోతున్న టాలీవుడ్ మూవీ
శివ, శరణ్య శర్మ, రఘు కుంచె, సుధాకర్ రెడ్డి, వంశీ నెక్కంటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బాలు గానీ టాకీస్. ఈ చిత్రానికి విశ్వనాథ్ ప్రతాప్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీని శ్రీనిధి సాగర్ నిర్మించారు.ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. ఆహా స్ట్రీమింగ్కు వచ్చిన ఈ చిత్రం ఏకంగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. సరికొత్త కంటెంట్ ఉంటే ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలు గాని టాకీస్ ఆహాలో టాప్- 2లో ట్రెండ్ అవుతోంది. విలేజ్ రివేంజ్, ఎమోషనల్ డ్రామాగా ఎంతో నేచురల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఓటీటీ ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. తన మేకింగ్‌తో విశ్వనాథ్ ప్రతాప్ అందరినీ మెప్పించారు. -
పెడల్ పవర్.. సైకిల్ ఫర్ ఎవర్
ఎటువైపు చూసినా ఆకాశమంత ఎత్తైన అద్దాల భవనాలు.. నిత్యం ట్రాఫిక్‌తో కిక్కిరిసిన రహదారులు.. కిలోమీటర్ల మేర బారులు తీరే వాహనాలు.. ఇది నగరంలోని రహదారుల పరిస్థితి.. దీంతో పాటు నగర శివారులోని టెక్ పార్కుల్లోనూ లక్షలాది మంది ఉద్యోగులతో ట్రాఫిక్ సమస్యలు తప్పడంలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇటీవల కొంత కాలంగా వీధుల్లో సైక్లింగ్ ట్రెండ్ నడుస్తోంది. రహదారులకు సమాంతరంగా సైక్లింగ్ ట్రాక్‌లను జీహెచ్ఎంసీ అభివృద్ధి చేసింది. దీంతో టెకీల్లో చాలా మంది సైక్లింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వారంలో కొన్ని రోజులైనా సైకిల్‌పై కార్యాలయానికి వెళ్లాలని కొంత మంది రూల్ పెట్టుకుంటున్నారు. క్లబ్‌లుగా ఏర్పడి వారాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలుకు శ్రీకారం చుడుతున్నారు. ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడటం, ట్రాఫిక్‌లో సమయం, డబ్బు ఆదా, వాతావరణ కాలుష్య నివారణకు ఈ విధానం సహాయపడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. టెక్కీలుగా స్థిరపడిన చాలా కుటుంబాల ఇళ్లల్లో కారు, మోటారు సైకిల్‌తో పాటు ఎలక్రి్టక్, గేర్, సాధారణ సైకిల్ తప్పనిసరిగా ఉంటోంది. మెట్రో స్టేషన్లకు, కూరగాయల మార్కెట్‌కు, వాకింగ్‌కో వెళ్లడానికి, ఐదు కిలో మీటర్ల లోపు పనులకు సైకిల్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. వివిధ సైక్లింగ్ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక టూర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒక్కో వారం ఒక్కో రకమైన థీమ్ ఉండేలా సెట్ చేసుకుంటున్నారు. వందలాది కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణాలు చేస్తున్నారు. ఆపై ట్రెక్కింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే వారాంతంలో కుటుంబ సభ్యులతో కలసి టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా కారు వెనకన తమ సైకిల్ కట్టుకుని పోతున్నారు. రిసార్ట్, ఫాం హౌస్, ఇతర డెస్టినేషన్‌లో సైక్లింగ్ చేస్తున్నారు.డెడికేటెడ్ ట్రాక్స్ కోసం.. నగరంలోని సైక్లిస్టులంతా ప్రస్తుతం ఉన్న సైకిల్ ట్రాక్‌లను డెడికేటెడ్ ట్రాక్‌లుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. కేబీఆర్ పార్క్, హైటెక్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్‌లకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. అయితే సాధారణ వాహనాలు సైతం ఈ సైకిల్ ట్రాక్‌పై నడిపిస్తున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ట్రాక్‌పై పదుల సంఖ్యలో వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌తో నిండిన రహదారిపై సైకిల్ తొక్కాలంటే భయమేస్తుదని పలువురు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న సైక్లింగ్ ట్రాక్స్‌కు బారికేడ్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇలా చేయడంతో మోటారు సైకిళ్లు, ఇతర వాహనాలు సైకిల్ ట్రాక్‌పైకి వచ్చే అవకాశం ఉండదు. దీంతో సైక్లిస్టులు వేగంగా, ధైర్యంగా ముందకు సాగేందుకు వీలుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓఆర్ఆర్ సమీపంలో సోలార్ రూఫ్‌తో ఏర్పాటు చేసిన సైకిల్ ట్రాక్ దేశంలోనే ప్రత్యేకమైనదిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరహాలో నగరాన్ని సైక్లింగ్ సిటీగా తీర్చిదిద్దాలనే డిమాండ్ వినిపిస్తోంది.ఏడేళ్ల నుంచి సైక్లింగ్..చిన్న చిన్న ప్రయాణాలకు సైకిల్‌పైనే వెళతాను. ఏడేళ్ల నుంచి క్రమం తప్పకుండా సైక్లింగ్ చేస్తున్నాను. ప్రతి మహిళ సైక్లింగ్ చేయాలి. ఆరోగ్యం పరంగా చాలా ఉపయోగాలున్నాయి. ఇతరులపైఆధారపడకుండా స్వతహాగా బయటకు వెళ్లి కూరగాయలు, పాలు, ఇతర సామాగ్రి తెచ్చుకుంటా. ఆఫీస్‌కి వెళ్లేందుకు మెట్రో వరకూ సైకిల్‌పైనే వెళతాను. సరికొత్త మోడళ్లు..ప్రధానంగా టెక్ వీధుల్లో వివిధ మోడల్ సైకిళ్ల హవా కనిపిస్తోంది. మెట్రో స్టేషన్ల నుంచి తమతమ కార్యాలయాలకు వెళ్లేందుకు ఉద్యోగులు సైకిళ్లను వినియోగిస్తున్నారు. ఎత్తుపల్లాలు ఉన్నా సైక్లిస్టులకు ఇబ్బంది లేకుండా బ్యాటరీ, గేర్ సైకిళ్లు అందుబాటులో ఉంటున్నాయి. రహదారికి సమాంతరంగా ఉన్నపుడు సైకిల్ తొక్కడం, ఎత్తు ఉన్నపుడు బ్యాటరీతో నడిపిస్తున్నారు. ఈ విధానం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కొనుక్కోవడం ఇష్టం లేకుండా, తమకు నచ్చినప్పుడు సైకిల్ సవారీ చేయడానికి అద్దె ప్రాతిపదికన వందలాది సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. టైం పాస్ కోసం.. సైక్లింగ్ టైం పాస్ కోసం ప్రారంభించాను. 10 కిలో మీటర్లు సైకిల్‌పై వెళ్లడానికి కష్టంగా ఉండేది. క్రమంగా అసోసియేషన్ సభ్యులతో సంబంధాలు ఏర్పడ్డాయి. సైక్లింగ్ వల్ల లాభాలపై అవగాహన వచి్చంది. ఇప్పుడు 100 కిలో మీటర్ల వరకూ వెళ్లిపోతున్నాం. వీలైతే ట్రెక్కింగ్ చేస్తున్నాం. సొంతంగా ఎస్కేప్ అండ్ ఎక్స్ప్లోర్ క్లబ్ స్థాపించాను. వారాంతంలో టూర్ ప్లాన్ చేస్తుంటాం. – అశోక్, ఎస్కేప్ అండ్ ఎక్స్ప్లోర్ నిర్వాహకులు21 వేల మంది సభ్యులు.. 2011లోనే సైక్లింగ్ రివల్యూషన్ ప్రారంభించాము. సాఫ్ట్వేర్ కంపెనీల్లో పర్యావరణం, ఆరోగ్యం, సమయం, డబ్బు ఆదాపై అవగాహన కల్పించాం. హైదరాబాద్ బైస్కిల్ క్లబ్‌ను స్థాపించాం. ప్రస్తుతం ఇందులో 21 వేల మంది సభ్యులున్నారు. 60 ఏళ్ల వయసులో లండన్ నుంచి పారిస్ వరకూ 518 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లాను. మూడున్నర రోజులు పట్టింది. ఢిల్లీ, ఛంఢీఘర్, చెన్నైలోనూ సైక్లింగ్ అసోసియేషన్స్ స్థాపించాం. సుమారు 6 వేల సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఏడేళ్ల క్రితం ఓఆర్ఆర్ సమీపంలో సైకిల్ ట్రాక్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించాం. 23 కిలోమీటర్ల సోలార్ రూఫ్ ట్రాక్ సిద్ధమైంది. – మనోహర్, ప్రపంచ సైక్లింగ్ సమాఖ్య వైస్ ప్రెసిడెంట్ -
iSmart హోమ్స్
ఇప్పటి వరకూ ఐటీ, మాన్యుఫ్యాక్చరింగ్, హెల్త్, బ్యాంకింగ్ వంటి పలు రంగాలకే పరిమితమైన ఆటోమేషన్.. ఇప్పుడు నట్టింట్లోకి చేరిపోయింది. భద్రత, ఆదా, సౌకర్యం.. హోమ్ ఆటోమేషన్ లాభాలివే. దీంతో నివసించే నగరమే కాదు ఇళ్లు కూడా హైటెక్‌గా ఉండాలని యువతరం కోరుకుంటోంది. వీరి అభిరుచులకు తగ్గట్టుగానే డెవలపర్లు కూడా స్మార్ట్ హోమ్స్‌ను నిర్మిస్తున్నారు. ఇంటిలోని లైట్లు, ఫ్యాన్లు, ఏసీ, ఫ్రిజ్, గీజర్, టీవీ వంటి ప్రతీ ఎలక్ట్రానిక్ ఉపకరణాన్ని సెల్‌ఫోన్‌తోనే నిర్వహణ చేసే వీలుండటమే స్మార్ట్ హోమ్స్ ప్రత్యేకత. కరోనా తర్వాత నుంచి హోమ్ ఆటోమేషన్‌పై నగరవాసుల్లో ఆసక్తి పెరిగింది. ప్రతి ఒక్కరూ ఇల్లు ఆధునికంగా, సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. రెండు దశాబ్దాలుగా స్మార్ట్ హోమ్స్ సేవలనేవి విలాసవంతమైన వసతుల నుంచి దైనందిన అవసరంగా మారిపోయాయి. దీంతో గతేడాదికి దేశంలో స్మార్ట్ హోమ్ మార్కెట్ రూ.90 వేల కోట్లుగా ఉందని, 2028 నాటికి రూ.1.40 లక్షల కోట్లకు చేరుతుందని రెడ్‌సీర్ నివేదిక అంచనా వేసింది. ఎలా పనిచేస్తాయంటే.. విప్రో, ఫిలిప్స్, హావెల్స్, ఎంఐ, క్రిస్టాన్, కేఎన్ఎక్స్, స్నైడర్, ల్యూట్రాన్, లెగ్గ్రాండ్, పెర్ట్ హోమ్, ఫైబరో వంటి కంపెనీలకు చెందిన వైర్లెస్, వైర్డ్ అనే రెండు రకాల హోమ్ ఆటోమేషన్ ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వైఫై, బ్లూటూత్, జెడ్ వేవ్, జిగ్బీ నాలుగు రకాల వైర్లెస్ ప్రొటోకాల్స్‌తో ఆటోమేషన్ ఉత్పత్తులు అనుసంధానమై ఉంటాయి. ఆయా ఉత్పత్తులకు చెందిన మొబైల్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకొని, ఇంట్లోని ఎన్ని సెల్ఫోన్లకైనా అనుసంధానిచవచ్చు. కస్టమర్లు ఇష్టాన్ని బట్టి కేవలం తన వాయిస్‌ను మాత్రమే గుర్తించేలా ఆయా ఉపకరణాలను అనుసంధానించవచ్చు. లేదా ఇంట్లోని ప్రతి ఒక్కరి వాయిస్‌నైనా గుర్తించేలా ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ప్లగ్‌తో పాత ఇళ్లకు కూడా.. పాత ఇళ్లను కూడా హోమ్ ఆటోమేషన్ చేయవచ్చు. సాధారణంగా మనం ఇళ్లలో వినియోగించే ఎక్స్టెన్షన్ బాక్స్లాగే ‘స్మార్ట్ ప్లగ్’తో ఇంటిని స్మార్ట్‌గా మార్చుకోవచ్చు. ఇంట్లో అల్రెడీ ఉన్న స్విచ్‌లో ఈ స్మార్ట్ ప్లగ్‌ను పెడితే చాలు.. 16 ఏఎంపీ వరకూ విద్యుత్ ఉపకరణాలను స్మార్ట్‌గా వినియోగించుకోవచ్చు. దీని ధర రూ.1,500 నుంచి రూ.5,000 వరకూ ఉంటుంది. లాభాలెన్నో.. హోమ్ ఆటోమేషన్తో విద్యుత్ వృథా ఉండదు. సాధారణ ఇళ్లతో పోలిస్తే స్మార్ట్ హోమ్స్‌లో 20–30 శాతం వరకూ విద్యుత్ ఆదా అవుతుంది. సమయం, డబ్బు ఆదా అవడంతో పాటు భద్రత మెరుగవుతుంది. ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసేలా సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు. 1,500 చదరపు అడుగుల అపార్ట్మెంట్(ఫ్లాట్)లో వీడియో డోర్ బెల్, ఒక లైట్, ఫ్యాన్, ఏసీ, గీజర్‌తో కూడిన బేసిక్ హోమ్ ఆటోమేషన్‌కు రూ.50 వేలు ఖర్చవుతుంది. ఎలక్ట్రిషన్, ఇంజినీర్, నెట్వర్క్, సాంకేతిక నిపుణులు నలుగురు వ్యక్తులు 3–4 రోజుల్లో పూర్తిగా హోమ్ ఆటోమేషన్ పూర్తి చేస్తారు.ఐఓటీ, ఏఐతోనే..ఇంటి ముందు గేటు నుంచి మొదలుపెడితే తలుపులు, కిటికీ కర్టెన్లు, లైట్లు, ఫ్యాన్లు, టీవీ, ఏసీ, గీజర్, ఫ్రిడ్జ్, గ్యాస్, హోమ్ థియేటర్, గార్డెన్.. ఇలా ప్రతి ఒక్క దాన్నీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతతో వినియోగించడమే హోమ్ ఆటోమేషన్. అలెక్సా, గూగుల్ హోమ్, సిరి ఈ మూడు వర్చువల్ అసిస్టెంట్ టెక్నాలజీలతో మనం ఎంపిక చేసిన సమయం ప్రోగ్రామింగ్ ప్రకారం ఆయా వస్తువులు పని చేస్తుంటాయి.సౌకర్యం కావాలంటున్నారుఆధునిక జీవనశైలిలో ప్రతి ఒక్కరూ సౌకర్యవంతం కోరుకుంటున్నారు. హోమ్ ఆటోమేషన్ ఉన్న ఇళ్ల కొనుగోలుకు యువతరం ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ తరహా ఇళ్లకు గిరాకీ పెరిగింది.– నర్సిరెడ్డి, ఎండీ, ఐరా రియల్టీస్మార్ట్ హోమ్స్‌కు డిమాండ్ కరోనా తర్వాతి నుంచి ఇల్లు స్మార్ట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. వాయిస్ కమాండ్స్, యాప్స్ ద్వారా పనిచేసే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్ట్‌లలో హోమ్ ఆటోమేషన్‌కు డిమాండ్ పెరిగింది.– మారుతీ రావు, వైస్ ప్రెసిడెంట్, పౌలోమీ ఎస్టేట్స్ -
ట్రెండీ.. టాటూ! ఇవి తెలియకుంటే తప్పదు చేటు!
సాక్షి, సిటీబ్యూరో: నేను ఫ్యాషన్ లవర్ని అని చెప్పకుండానే చెప్పే మార్గం టాటూ.. ఇప్పుడు వయసుతో పనిలేకుండా అన్ని వర్గాల వారూ టాటూస్‌ని ముద్రించుకోవడం నగరంలో సర్వసాధారణంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఎప్పటి నుంచో టాటూస్ వినియోగంలో అనుభవం ఉన్నవారితోపాటు కొత్తగా వాటి పట్ల ఆసక్తి పెంచుకుంటున్నవారికీ కొదవలేదు. ఈ నేపథ్యంలో ఎంత ఫ్యాషన్ అయినప్పటికీ టాటూ కల్చర్‌లోకి అడుగుపెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.టాటూ వేయించుకోవడానికి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం ఎందుకో తెలియాలంటే.. టాటూ సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా మనం తెలు సుకోవాలి. అప్పుడే ప్రిపరేషన్ లోపిస్తే వచ్చే పరేషాన్ ఏమిటో అర్థం అవుతుంది."స్వతహాగా చర్మ అలర్జీలకు గురయ్యే అవకాశం ఉన్నట్లయితే లేదా ముందుగా వ్యాధులు ఏవైనా ఉంటే, పచ్చబొట్టు వేయించుకునే ముందు వాటి గురించి వైద్యునితో చర్చించి వారి సలహా మేరకు టాటూ వేయించుకోవాలి."టాటూ వేయడానికి ముందు, దానికి వినియోగించే సూదులు క్రిమిరహితంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. స్టెరిలైజ్ చేయని లేదా కలుíÙతమైన సూదులను ఉపయోగించడం వల్ల హెచ్ఐవీ, హెపటైటిస్ బీ–సీ వంటి రక్తం ద్వారా సంక్రమించే వ్యాధుల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. – వెంటనే లేదా టాటూ వేసిన మొదటి రెండు వారాల్లో స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. వాపు, నొప్పి, ఎరుపు, దురద లేదా దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. తీవ్రమైన సందర్భాల్లో జ్వరం, పుండ్లు లేదా చీముకు దారితీస్తుంది. శరీరంలోకి ఇంజెక్ట్ చేసే ముందు నాన్ స్టెరైల్ వాటర్‌ని కలిపితే స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. కాబట్టి తరచి చూసుకోవడం అవసరం. – ఎంఆర్ఐ స్కానింగ్ ప్రక్రియలు చేయించుకుంటున్న రోగులు పచ్చబొట్టు పొడిచిన ప్రదే శంలో మంట, దురద లేదా వాపును అనుభవించవచ్చు. – ఇది తక్కువ–నాణ్యత లేని రంగులు లేదా టాటూ పిగ్మెంట్లలో ఐరన్ ఆక్సైడ్ వంటి రసాయనాల వల్ల కూడా కావచ్చు. – టాటూ వేయడానికి అయ్యే ఖర్చు కళాకారుడిపై మాత్రమే కాక ఉపయోగించిన సిరా రకం, పచ్చబొట్టు పరిమాణం, ఇంక్ చేయాల్సిన ప్రాంతం మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. ఖర్చుతో రాజీపడకుండా పేరున్న కళాకారుడితో టాటూ వేయించుకోవడం మేలు. – టాటూ వేయించుకున్న కొన్ని నెలల తర్వాత రంగు వాడిపోతుంది. కాబట్టి, రంగు సాంద్రతను స్థిరీకరించడానికి కొన్ని టచ్–అప్లు అవసరం కావచ్చు. – స్కిన్ ఇన్ఫెక్షన్లు లేదా ఇతర సమస్యలను నివారించడానికి టాటూ అనంతర సంరక్షణ చాలా ముఖ్యం. ఆ ప్రాంతం పూర్తిగా నయం అయ్యే వరకూ కళాకారుడి సలహాను పాటించండి.– టాటూలు వేసే పదాల స్పెల్లింగ్‌లు సరైనవని నిర్ధారించుకోవాలి. ఒక్కసారి టాటూ పూర్తయిన తర్వాత అక్షర దోషాలను సరిదిద్దలేరు. – మధుమేహం నియంత్రణలో లేకుంటే వైద్య సలహా తీసుకోవడం మంచిది. – టాటూ ఆర్టిస్ట్ చేతులను కడుక్కొని, స్టెరిలైజ్ చేసుకున్న తర్వాత టాటూ ప్రక్రియకు ముందు కొత్త గ్లౌజ్‌లు ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి. – ప్రక్రియకు 24 గంటల ముందు కెఫిన్ లేదా ఆల్కహాల్‌ను తీసుకోవద్దు. ఈ పదార్థాలు రక్తాన్ని పలచన చేసేవిగా వైద్యులు చెబుతున్న నేపథ్యంలో ప్రక్రియ సమయంలో అధిక రక్తస్రావం ఉండవచ్చు. – టాటూ కోసం ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవలసి ఉంటుంది కాబట్టి వదులుగా సౌకర్యవంతంగా ఉండే దుస్తులను ధరించడం మంచిది. – కనీసం 24 నుంచి 48 గంటల ముందు రక్తాన్ని పలచబరిచే మందులను తీసుకోకుండా ఉండటం మంచిది.అనారోగ్య ‘ముద్ర’.. అనస్థీషియా లేకుండా టాటూ వేయడం వల్ల కొంత నొప్పి, రక్తస్రావం కలిగే అవకాశం ఉంది. దీని గురించి ముందుగా తెలుసుకోవడం అవసరం. అలాగే టాటూ ఇంక్‌లో ఉండే రసాయనాలు లేదా లోహాలు, ప్రత్యేకించి కొన్ని రంగుల కారణంగా కొంతమందిలో అలర్జీ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు దురద, దద్దుర్లు, వాపు తదితర లక్షణాలు టాటూ వేయించుకున్న వెంటనే లేదా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా కనపడవచ్చు. టాటూల వల్ల అరుదుగా చర్మ కారక క్యాన్సర్‌కు కూడా కారణం కావచ్చు. ఎందుకంటే కొన్ని రంగులు లేదా వర్ణ ద్రవ్యాలు క్యాన్సర్ కారకాలు కావచ్చు.జాగ్రత్తలు ఇలా..– క్రిమిరహితం చేసిన సూదులు, మంచి నాణ్యమైన పిగ్మెంట్లు, ఉపయోగించిన సూదులు సరిగ్గా డిస్పోజ్ చేయడం వంటి ప్రమాణాలు పాటించే పేరున్న, లైసెన్స్ పొందిన స్టూడియోను ఎంచుకోవాలి. పరిశుభ్రతగల పరికరాలు భద్రతా ప్రమాణాలకు కొలమానాలు. అవి మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచేందుకు వీలుంటుంది.– పచ్చబొట్టు వేసుకునే రోజున, ప్రక్రియ సమయంలో ఆకలి బాధలు, తల తిరగడం లేదా మూర్ఛ వంటివి నివారించడానికి పుష్కలంగా నీరు తాగండి. తగినంత ఆహారం తీసుకోండి. టాటూ వేయించుకోవడానికి ముందు రోజు రాత్రి తగినంత నిద్రకావాలి.శుభ్రతతోనే.. సురక్షితం...టాటూకి సురక్షితమైన ప్రొఫెషనల్ స్టూడియోను ఎంచుకోవాలి. ఆ ప్రదేశం కూడా పూర్తి పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా ఉండాలి. ఎటువంటి సందేహాలు కలిగినా ఆర్టిస్ట్‌ను ప్రశి్నంచాలి. నీడిల్స్ తమ ముందే ఓపెన్ చేయాలని కోరాలి. రీ యూజబుల్ మెటీరియల్ అంతా ఆటో క్లోవ్లో స్టెరైల్ చేశారో లేదో గమనించాలి. అలాగే టాటూ వేసే సమయంలో నొప్పి భరించగలిగినంతే ఉంటుంది. అయితే శరీరంలో తల, పాదాలు, చేతుల అడుగు భాగం, పొత్తికడుపు, వెన్నెముక వంటి కొన్ని భాగాల్లోని చర్మ స్వభావం వల్ల కొంచెం నొప్పి ఎక్కువగా అనిపించవచ్చు. టాటూ వేసే సమయంలో వేసిన తర్వాత, కొన్ని రోజుల పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. – అమిన్, టాటూ ఆర్టిస్ట్ -
సరికొత్త ఫిట్నెస్ మంత్ర..సెవెన్ సెకండ్ కాఫీ ట్రెండ్..!
బరువు తగ్గడం గురించి పలు రకాల డైట్లు వెలుగులోకి వచ్చాయి. ఓమాడ్ డైట్, కీటో డైట్, మొక్కల ఆధారిత డైట్ అంటూ పలు రకాలు మొన్నటి వరకు బాగా ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్గా మరో ఫిట్నెస్ ట్రెండ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదే 'సెవెన్ సెకండ్ కాఫీ రూల్'. మరీ కాఫీని మితంగానే తీసుకోవాలని చెబుతుంటారు కదా..! ఇదెలా బరువుని అదుపులో ఉంచుతుంది..?. అసలు కెఫిన్ బరువు నియంత్రణకు ఎలా దోహదపడుతుంది అనే కదా సందేహం. ఇంకెందుకు ఆలస్యం ఏంటీ ఫిట్నెస్ మంత్ర చకచక తెలుసుకుందాం రండి..ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ప్రతి విషయం నిమిషాల్లో ట్రెండ్ అయ్యిపోతోంది. బరువు తగ్గడంలో ప్రధానంగా నియంత్రించాల్సింది ఆకలి సమస్య. ఆకలి నియంత్రణలో ఉంటే బరువు తగ్గడం చాలా సులభం. మరీ ఇంతకీ ఏంటీ సెవెన్ సెకండ్ కాఫీ అంటే..నిమ్మ, దాల్చిన చెక్క వంటి పదార్థాలతో ఏడు సెకన్లలలో తయారు చేసే బ్లాక్ కాఫీ అట. దీన్ని సేవిస్తే ఆకలి బాధలు నియంత్రించొచ్చట. బరువు తగ్గడానికి సులభమైన పద్ధతి అంటూ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక్కడ దీంతో నిజంగా బరువు తగ్గుతారా? అని చెప్పేందుకు పరిశోధన పూర్వకమైన ఆధారాలు లేవు అనే విషయం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం.ఎంత వరకు పనిచేస్తుందంటే..ఈ కాఫీ గురించి చెబుతున్న వ్యక్తుల అభిప్రాయం ప్రకారం..బ్లాక్ కాఫీ తాగడం వల్ల డోపమైన్, అడ్రినలిన్ వంటి హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఇవి ఆకలిని తాత్కాలికంగా అణిచివేస్తాయి. ఆకలి హార్మోన్లు, కెఫిన్ మధ్య ఏర్పడిన సంబంధం కారణంగా ఇది కొద్దిసేపు ఆకలిని నియంత్రింగలదు కాబట్టి వాళ్లు సూచించడం జరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం వేగంగా బరువు తగ్గే సులభమైన మార్గాలుగా చెబుతున్నారే గానీ ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయా? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. చాలామంది ఇలాంటి బరువు తగ్గిపోయే సులభమైన మార్గాలను అనుసరించిట మొదటికే మోసం తెచ్చుకుంటున్నారు. బంగారంలాంటి ఆరోగ్యాన్ని చేజేతులారా పాడు చేసుకుంటున్నారు. ఏ డైట్ అయినా మన శరీరతత్వం, వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించి ఫాలో అయితే ఎలాంటి సమస్య ఉండదనేది గుర్తించడం మంచిది. (చదవండి: అనంత్ అంబానీ ఇష్టపడే ఆంధ్ర పెసరట్టు..ఎమ్మెల్యే పెసరట్టు అని ఎందుకంటారో తెలుసా..!) -
ఈ- సైకిల్ యమ క్రేజ్
పర్యావరణానికి, ఆరోగ్యానికీ మేలు ఇంధన ధరలకు ప్రత్యామ్నాయం ఆదర్శంగా నిలుస్తామంటున్న టెకీలుసైకిల్ తొక్కడమంటే ఎవరికి ఇష్టముండదు? చిన్న పిల్లలు మొదలుకొని, పెద్దవారి వారకూ ఒకప్పుడు ఇదంటే యమ క్రేజ్.. అయితే రాను రాను పెట్రోల్ వాహనాల రాకతో సైకిల్ కాస్తా కనుమరుగైంది. అయితే ప్రస్తుతం మళ్లీ సైకిళ్లకు క్రేజ్ పెరుగుతోంది. దీనికి తోడు తయారీదారులు సైకిల్‌కి కొత్త హంగులద్ది.. ఈ సైకిల్స్‌గా మారుస్తున్నారు.. దీంతో ఓ వైపు పర్యావరణానికీ, మరోవైపు ఆరోగ్యానికీ మేలు చేకూర్చే ఈ–సైకిల్స్‌కి క్రేజ్ పేరుగుతోంది... ప్రస్తుతం భాగ్యనగరంలో ఇదో ట్రెండ్‌గా మారుతోంది.. అసలు ఈ–సైకిల్స్ కథేంటి? క్రేజ్ పెరగడానికి కారణమేంటి? తెలుసుకుందాం.. శ్వనగరంగా గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్‌లో టెకీలు, ఉన్నత ఉద్యోగుల్లో కొన్ని వర్గాల వారు విద్యుత్తు ఆధారిత సైకిళ్లను నడిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. బిట్స్ పిలానీ హైదరాబాద్, లా ట్రోబ్ విశ్వవిద్యాలయం ఆ్రస్టేలియా సంయుక్త ఆధ్వర్యంలో ప్రొఫెసర్లు ప్రశాంత్ సాహు, బందన్మ జుందార్, పరిశోధకుడు జుబివుల్లా ఈ సర్వే నిర్వహించారు. ఈ–సైకిల్.. పనితీరు ఇలా..ఈ– సైకిల్ తొక్కుతున్నపుడు ముందుకు వెళ్లే కొలది బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. సైకిలిస్ట్‌కు అవసరం అనుకున్నపుడు బ్యాటరీ చార్జింగ్ వినియోగించి సైకిల్‌ను నడిపించొచ్చు. రోడ్డు అప్ ఉన్న ప్రాంతాల్లో ఈ చార్జింగ్ ఉపయోగపడుతుంది. సుమారుగా రూ.20 వేల నుంచి రూ.30 వేల రేంజ్లో ఈ–సైకిళ్లు మార్కెట్లో లభిస్తున్నాయి.సర్వే చెబుతుంది ఇదే...మొత్తం 482 మంది ఈ–సైకిల్ నడిపిస్తున్న వారిని సంప్రదించగా.. ఒకొక్కరు తమ అభిప్రాయాలను వెళ్లడించారు. ప్రధానంగా మోటారు సైకిల్, కారు వినియోగించాలంటే ఇంధన ధరలు, వాయు, ధ్వని కాలుష్యం భారీగా పెరగడం, ట్రాఫిక్ సమస్యలు, సాధారణ సమయంలో సైక్లింగ్‌కు అవకాశం లేకపోవడం, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి కారణాలతో ఈ–సైకిళ్ల వైపు మొగ్గుచూపుతున్నారని తేలింది. నిత్యావసర ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ–బైక్‌ల వినియోగానికి ఇష్టపడుతున్నారట.60 శాతం ఈ–సైకిల్‌వైపు మొగ్గు..ఇదిలా ఉంటే నగర రహదారులపై ప్రయాణికులు ఈ–సైకిల్‌పై ప్రయాణించడం ఒక రోల్ మోడల్‌గా ఉండాలని ఎక్కువ మంది చూస్తున్నారు. చిన్నపాటి దూరం వెళ్లడానికే మోటారు సైకిల్, కారు వినియోగిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో... ఈ–సైకిల్ వైపు మొగ్గు చూపడానికి గల కారణాలపై సర్వే చేశారు. కాగా దాదాపు 60% మంది ప్రయాణికులు ఈ–సైకిల్‌ను నడపడానికి సిద్ధంగా ఉన్నారని అధ్యయన ఫలితాల్లో పేర్కొన్నారు. సర్వే చేసిన ప్రాంతాలు...హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లు, మెట్రో స్టేషన్ ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించినట్లు అధ్యయన పత్రాల్లో పేర్కొన్నారు. కాగా 482 మందిలో 48 శాతం పురుషులు ఉండగా, 52 శాతం మంది మహిళా ప్రయాణికులు దీనికి మొగ్గు చూపడం విశేషం. మహిళలు మెట్రో నుంచి ఇంటికి, ఆఫీస్‌కు వెళ్లి రావడానికి ఈ–సైకిల్స్‌ను వినియోగిస్తున్నారు. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, బేగంపేట్, వివిధ ప్రాంతాల్లోని మెట్రో స్టేషన్‌కు వచ్చే వారిలో మొదటి, చివరి మైలు కోసం ‘ఫీడర్’ వాహనాలుగా ఈ–బైక్‌లను ఇష్టపడతారని అధ్యయనంలో తేలింది. సైకిల్ ట్రాక్స్ అవసరం...సుమారుగా 10కిలో మీటర్ల వరకు ప్రయాణించే వారి ఆలోచనలో మార్పు వస్తుంది. సైకిలింగ్‌పై చాలామందికి ఆసక్తి ఉన్నప్పటికీ ఉద్యోగం, ఇంటి వద్ద వివిధ రకాల పనుల్లో బిజీగా గడిపేస్తున్నారు. ఇటువంటి వారు ఈ–సైక్లింగ్‌లో ఎక్కువ మంది పాల్గొంటున్నారు. నగరంలో భారీ సంఖ్యలో మోటారు సైకిళ్లు ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఈ–సైకిళ్లు, ఈ–బైకుల సంఖ్య కూడా భారీగానే పెరిగింది. దీంతో ఓఆర్ఆర్ను ఆనుకుని సోలార్ సైక్లింగ్ మార్గాన్ని జీహెచ్ఎంసీ నిర్మించింది. కేబీఆర్ పార్కు చుట్టూ సైక్లింగ్ ట్రాక్ కూడా ఏర్పాటైంది. అయినా వాటిపై వాహనాలను పార్కింగ్ చేయడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. అనుకున్న లక్ష్యానికి ఆటంకంగా ఏర్పడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని సైకిల్ ట్రాక్‌ల పర్యవేక్షణపై అధికారులు శ్రద్ధ వహించాలని పలువురు కోరుకుంటున్నారు. -
నీలి వెన్నెల జాబిలీ నిన్ను చూసి మురిసి...
‘బ్లూ మేకప్’ అనేది ఇప్పుడు వైరల్ బ్యూటీ ట్రెండ్. అమెరికన్ సింగర్–సాంగ్ రైటర్ బిల్లీ ఎలీష్ పాట ‘బ్లూ’ నుంచి ఈ మేకప్ ట్రెండ్ మొదలైంది. 2016లో ‘ఓషన్ ఐస్’ ఆల్బమ్ విడుదల అయిన తరువాత ‘బ్లూ’ పాట రాసింది ఎలీష్. లేటెస్ట్గా ఆ పాటను మరింత కొత్తదనంతో రీక్రియేట్ చేస్తే సంగీత ప్రియులను తెగ ఆకట్టుకుంది. ఆ పాటకు వచ్చిన పాపులారిటీ ‘బ్లూ బ్యూటీ ట్రెండ్’కు నాంది పలికింది.ఈ ట్రెండ్‌లో భాగంగా ఫ్యాషన్ అండ్ బ్యూటీ ఇన్ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలు రకరకాల వీడియోలు చేస్తున్నారు. ఈ ట్రెండ్‌లో భాగంగా కంటెంట్ క్రియేటర్, డాన్సర్ ఆనమ్ దర్బార్ స్విమ్మింగ్‌పూల్ వీడియో చేసింది. బ్యూటీ ఇన్ఫ్లూయెన్సర్ మృణాల్ పాంచాల్ ‘వాటర్’ ఎలిమెంట్‌తో వీడియో చేసింది. ఈ వీడియోలో మృణాల్ నీలిరంగు సీతాకోకచిలకలా కనిపిస్తుంది. మొత్తానికైతే ‘బ్లూ మేకప్ ట్రెండ్’ మన దేశంలోనూ సందడి చేస్తోంది. -
క్విట్ వెకేషనింగ్ ట్రెండ్ ఏమిటి? యువత ఎందుకు ఫాలో చేస్తోంది?
సాధారణంగా ఉద్యోగులు తమ ఉద్యోగానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమన్వయాన్ని కొనసాగించేందుకు పని నుండి కాస్త విరామం తీసుకుని, ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటారు. ఇందుకోసం తమ ఆఫీసులోని బాస్‌కు చెప్పి సెలవు తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. ప్రపంచంలోని అనేక దేశాలలో వివిధ ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు ఈ నూతన ట్రెండ్‌ను ఫాలో చేస్తున్నారు. దానిపేరే ‘క్విట్ వెకేషనింగ్’. ఇంతకీ ఈ కొత్త ధోరణి ఏమిటి?అమెరికన్ మార్కెటింగ్ అండ్ రీసెర్చ్ కంపెనీ ‘హారిస్ పోల్’ నిర్వహించిన సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం యూఎస్‌లోని దాదాపు 78 శాతం మంది ఉద్యోగులు, ప్రధానంగా యువత తమకు పని నుంచి విరామం కావాలని బాస్‌ను అడగడం లేదు. ఇలా అడగకుండా లీవ్ పెట్టడాన్ని వారు తప్పుగా భావించడంలేదని సదరు సర్వే చెబుతోంది. పని ఒత్తిడికి తగ్గించుకునేందుకే వారు ఇలా చేస్తున్నారని సర్వే వెల్లడించింది.పని నుంచి విరామం కోరుకునేందుకు ఉద్యోగులు తమకు తోచిన పరిష్కారాలను కనిపెడుతున్నారు. దీనిలో భాగంగానే క్విట్ వెకేషనింగ్ అనేది ఉద్భవించిందని సర్వే చెబుతోంది. ఈ సర్వేలోని వివరాల ప్రకారం క్విట్ వెకేషనింగ్ సమయంలో ఉద్యోగులు తాము పనిచేస్తున్నట్లు సంస్థకు భ్రమ కల్పిస్తారు. పని వేళల్లో తాము పంపాల్సిన ఈమెయిల్స్‌ను ముందుగానే షెడ్యూల్ చేస్తారు. పనివేళల తర్వాత కూడా ఓవర్ టైం చేస్తున్నట్లు కనిపించేందుకు కూడా ప్రయత్నిస్తుంటారు.మరి కొందరు ఉద్యోగులు అప్పుడప్పుడు తమ కంప్యూటర్ మౌస్‌ను కంపెనీ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌పై ఉంచి, పని చేస్తున్నట్లు కనిపించడానికి ప్రయత్నిస్తారు. ఇదంతా తెరవెనుక కొన్నాళ్లుగా జరుగుతున్నదని ఈ సర్వే చేపట్టిన సంస్థ తెలిపింది. అయితే అటు ఉద్యోగాన్ని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసేందుకు మంచి పరిష్కార మార్గం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని సర్వే నిర్వాహకులు తెలిపారు. -
‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ ఏంటి? ఫిజికల్ రిలేషన్ షిప్‌కు ఎందుకు తావులేదు?
వివాహం అంటే రెండు ఆత్మల కలయిక అని చెబుతుంటారు. వివాహానికి ఇచ్చే వివరణల్లో కాలనుగుణంగా అనేక మార్పులు వచ్చాయి. లివ్ ఇన్ రిలేషన్ షిప్ కూడా ఇలాంటివాటిలో ఒకటి. దీనిలో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ భార్యాభర్తలుగానే కలసి జీవిస్తుంటారు.ఇప్పుడు పెళ్లి విషయంలో మరో కొత్త ప్రయోగం జరుగుతోంది. ఇది జపాన్‌లో ప్రారంభమయ్యింది. అక్కడి యువతలో ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది వివాహాల్లో మరో నూతన విధానం. ఇందులో యువతీయువకులు భాగస్వాములుగా మారుతారు. అయితే ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’లో ప్రేమ లేదా శారీరక సంబంధానికి అవకాశం ఉండదు. జపాన్‌లోని మొత్తం జనాభాలో ఒక శాతం మంది ఈ రకమైన వివాహాన్ని ఇష్టపడుతున్నారు.‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’లో చట్టబద్ధంగా వివాహం చేసుకుంటారు. కానీ ఫిజికల్ రిలేషన్ షిప్కి అవకాశం ఉండదు. అయితే కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లలను కనేందుకు అవకాశం ఉంటుంది. ఇటువంటి వివాహంలో ఇద్దరు భాగస్వాములూ విడివిడిగా వారికి నచ్చిన మరో మరొక భాగస్వామితో సంబంధం పెట్టుకునే స్వేచ్ఛను పొందుతారు. ఇలాంటి వివాహం చేసుకున్న ఒక జంట మీడియాతో మాట్లాడుతూ ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’అంటే మనకు నచ్చిన రూమ్మేట్ని ఎంచుకోవడం లాంటిదని అన్నారు. ఈ విధంగా ఒకచోటు చేరిన భాగస్వాములు ఇంటి ఖర్చులను, ఇతర ఖర్చులను సమానంగా పంచుకుంటారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం 32 ఏళ్లుదాటిన యువతీ యువకులు ఇటువంటి వివాహలపై మక్కువ చూపిస్తున్నారు. పెళ్లయిన తర్వాత కూడా స్వేచ్ఛగా ఉండాలనుకునే వారు ఇటువంటి ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’కు ప్రాధాన్యతనిస్తున్నారు. 2015 మార్చి తరువాత నుండి జపాన్‌లో వంద మందికి పైగా యువతీ యువకులు ఈ విధమైన వివాహం చేసుకున్నారని సమాచారం. -
Lavanya Tripathi Konidela Photos: మెగా కోడలి లేటెస్ట్ పిక్స్ చూశారా? (ఫోటోలు)
-
Anchor Anasuya: ట్రెండీ లుక్‌లో అనసూయ.. చూపు తిప్పుకోలేరు (ఫోటోలు)
-
మొన్న విజయ్ దేవరకొండ.. నేడు జూనియర్ ఎన్టీఆర్.. ఇదేం పిచ్చిరా బాబు?
సోషల్ మీడియా వచ్చాక జీవితమంతా నెట్టింటే గడిచిపేస్తున్నారు జనాలు. ఇన్‌స్టా, ఫేస్బుక్, వాట్సాప్‌లతోనే కాలమంతా వెళ్లదీసే పరిస్థితికి వచ్చేశారు. అంతలా జనాలు సోషల్ మీడియాకు అలవాటు పడిపోయారు. అంతేకాదు విద్యార్థుల నుంచి రాజకీయ నాయకుల వరకు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. అసలే పరీక్షల సమయం రావడంతో ఇప్పుడైనా కాస్తా చదువుకోవాల్సిన విద్యార్థులు సైతం సామాజిక మాధ్యమాలకే అతుక్కుపోతున్నారు. ఇటీవల ఇద్దరు విద్యార్థినిలు ఏకంగా మేము పరీక్షలు రాయాలంటే విజయ్ దేవరకొండ కామెంట్ చేయాలని ఓ వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఊహించని విధంగా విజయ్ వారికి రిప్లై ఇచ్చాడు. 90 శాతం మార్కులు తెచ్చుకుంటే కలుస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఇప్పుడదే ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. (ఇది చదవండి: విజయ్ దేవరకొండపై అమ్మాయిల వీడియో.. స్పందించిన హీరో!) తాజాగా ఓ అమ్మాయి ఏకంగా జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి అలాంటి వీడియోను రిలీజ్ చేసింది. సోషల్ మీడియాలో ఇప్పుడిదే అసలైన ట్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది. నేను ఇండియాకు రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ కామెంట్ చేయాలంటూ అమ్మాయి చెబుతోన్న వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. నువ్వు ఇండియా రా? అని కామెంట్ పెడితే వచ్చేస్తా అంటూ అమ్మాయి చెబుతోన్న వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Anna papa edho aduguthundi chudu @tarak9999 🫣 pic.twitter.com/x93V6s67Nl — Veera 🎭 (@Veera_Tweetzs) February 21, 2024 -
కొత్త ఏడాది యువతరం ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే..?
కొత్త సంవత్సరం దగ్గరలో ఉంది. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ‘హ్యాపీ న్యూ ఇయర్’ పాట పాడగానే సరిపోతుందా? ‘పాటతోపాటు ప్రణాళిక కూడా ఉంది’ అంటుంది మన జెన్ జెడ్. కొత్త సంవత్సరంలో జెన్ జెడ్ లక్ష్యాలు, ప్రణాళికలు, అభిరుచులకు సంబంధించి ‘ట్రెండ్ టాక్ రిపోర్ట్–2024’ అద్దం పడుతోంది. ఇండియా, యూఎస్, యూకే, బ్రెజిల్, సౌత్ కొరియా దేశాలలోని జెన్ జెడ్ ట్రెండ్స్‌కు సంబంధించి ‘ట్రెండ్ టాక్ రిపోర్ట్’ను విడుదల చేసింది ఇన్స్టాగ్రామ్. వర్త్ గ్లోబల్ స్టైల్ నెట్వర్క్ (డబ్ల్యూజీఎస్ఎన్)తో కలిసి నిర్వహించిన ఈ సర్వేలో 2024 సంవత్సరానికి సంబంధించి ఫ్యాషన్, బ్యూటీ, సోషల్ మీడియా, ఫ్రెండ్షిప్కు సంబంధించిన ప్రశ్నలు జెన్ జెడ్‌ను అడిగారు. ఈ రిపోర్ట్ ప్రకారం ఫ్యాషన్ ట్రెండ్స్, బ్యూటీ అండ్ ఫుడ్ విభాగాలలో మన దేశం ట్రెండ్ సెట్టర్‌గా ఉంది. ఫుడ్ విషయానికి వస్తే కొత్త రుచులను ఆస్వాదించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇతరుల కంటే భిన్నంగా కనిపించే వస్త్రధారణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్త హెయిర్‌స్టైల్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. 2024కు సంబంధించి ‘జెన్ జెడ్’ ప్రాధాన్యతలలో హెల్త్, ట్రావెల్, కెరీర్లు మొదటి స్థానంలో ఉన్నాయి. తమ కెరీర్‌పై ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నట్లు 43 శాతం మంది తెలియజేశారు. ఇతర దేశాలతో పోల్చితే మన ‘జెన్ జెడ్’ వ్యాపారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. సంపద సృష్టికి వ్యాపారమే మార్గం అని చెబుతోంది. మన దేశంలో ‘జెన్ జెడ్’లో ఎక్కుమంది స్పోర్ట్స్‌కు సంబంధించి సూపర్‌ఫ్యాన్స్ ఉన్నారు. లైఫ్ అడ్వైజ్, తమ ప్రొఫెషన్‌కు సంబంధించి కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. జీఆర్డబ్ల్యూఎం(గెట్ రెడీ విత్ మీ)లాంటి క్రియేటివిటీతో కూడిన ఫ్యాషన్ ట్రెండ్స్‌పై అమిత ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. మన దేశంలో జెన్ జెడ్‌లో 44 శాతం మంది సొంత ఆలోచనలకు ప్రాధాన్యత ఇచ్చే డీఐవై(డూ–ఇట్–యువర్సెల్ఫ్) విధానాన్ని ఇష్టపడుతున్నారు. సంగీతం విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్, శ్రేయా ఘోషల్, అనిరుథ్ నుంచి సౌత్ కొరియన్ మ్యూజిక్ బ్యాండ్ ‘బీటీఎస్ ఆర్మీ’ వరకు ఇష్టపడుతున్నారు. వారికి నచ్చిన వీడియో గేమ్స్‌లో ఫోర్ట్‌నైట్, కాల్ ఆఫ్ డ్యూటీ, రాబ్లక్స్... మొదలైనవి ఉన్నాయి. జెన్ జెడ్‌లోని పదిమందిలో తొమ్మిదిమంది వారు ఇష్టపడే రంగాలకు సంబంధించి సెలబ్రిటీల అభిమానగణంలో ఉన్నారు. తమ అభిమాన సెలబ్రిటీలు, అథ్లెట్లు, క్రియేటర్ నుంచి జెన్ జెడ్ రాబోయే కాలంలో ఆశిస్తున్నది ఏమిటి? అనే ప్రశ్నకు వినిపించే జవాబు... లైఫ్ అడ్వైజెస్, వారి ప్రొఫెషన్‌కు సంబంధించిన కంటెంట్... ఇక మీమ్స్ విషయానికి వస్తే మూడింట ఒక వంతుమంది ‘బ్యాడ్ టేస్ట్ మీమ్స్’ను తమ ‘టాప్ టర్న్ ఆఫ్’గా ఎంచుకున్నారు. గతం సంగతి ఎలా ఉన్నా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో యువతరం ముందు ఉంటుంది. అభిరుచుల నుంచి కెరీర్ ఆప్షన్స్ వరకు కొత్తగా ఆలోచిస్తోంది. ‘కాలేజీ చదువు పూర్తయిన తరువాత వైట్–కాలర్ జాబ్ తెచ్చుకోవాలి’ అనేది సంప్రదాయ ఆలోచన. అయితే యువతరంలో అందరూ ఇలాగే ఆలోచించడం లేదు.‘కంఫర్టబుల్ లైఫ్‌స్టైల్’కు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీనికి కారణం జెనరేటివ్ ఏఐ. జెనరేటివ్ ఏఐ ప్రభావంతో వైట్–కాలర్ జాబ్స్‌కు ఉద్యోగభద్రత తక్కువ అనే అభిప్రాయం ఉంది. పియర్సన్ రిపోర్ట్ ప్రకారం జెనరేటివ్ ఏఐ వల్ల వైట్–కాలర్ ఉద్యోగాలలో 30 శాతం రిప్లేస్మెంట్ జరుగుతుంది. వైట్–కాలర్ జాబ్‌లతో పోల్చితే బ్లూ–కాలర్ జాబ్లకు అధిక ఉద్యోగ భద్రత ఉంది. రోబోట్స్ చేయలేని పనులు వీటిలో ఉండడమే కారణం. ఈ పనులు చేయడానికి ప్రత్యేక శిక్షణ, నైపుణ్యం అవసరం. అయితే జెన్ జెడ్‌లో ఎక్కువమంది ఈ హై–డిమాండ్ ఫీల్డ్‌పై ఆసక్తి ప్రదర్శించడం లేదు. వైట్–కాలర్ జాబ్, బ్లూ–కాలర్ జాబ్ అనేదానితో సంబంధం లేకుండా ప్రతి ఉద్యోగికి విశ్లేషణాత్మక ఆలోచన విధానం, సమస్య పరిష్కార నైపుణ్యం, సమర్థవంతమైన కమ్యూనికేషన్, స్ట్రెస్ మెనేజ్మెంట్ స్కిల్స్... మొదలైన వాటికి సంబంధించి ప్రొఫెషనల్ స్కిల్స్ అవసరం. వీటిపై జెన్ జెడ్ ఆసక్తి ప్రదర్శిస్తోంది. నిర్ణయాలు తీసుకోవడంలో ‘లైఫ్‌స్టైల్’ అనేది కీలకపాత్ర పోషిస్తోంది. డబ్బు నుంచి ఫ్రీ టైమ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ వరకు ఎన్నో విషయాలను దృష్టిలో పెట్టుకుంటుంది జెన్ జెడ్. గుడ్ ప్లానింగ్ 2024లో యువతరం ఆసక్తి చూపుతున్న రంగాలలో ట్రావెల్ ఒకటి. ట్రావెల్ ప్రేమికులకు టాన్యాలాంటి ట్రావెల్ వ్లోగర్ల సలహాలు ఉపయోగపడుతున్నాయి. అడ్వర్టైజింగ్ రంగంలో ఉద్యోగం చేసిన టాన్యా సోలోగా ట్రావెలింగ్ మొదలుపెట్టి తాను వెళ్లిన ప్రదేశాలకు సంబంధించి వ్లోగింగ్ మొదలు పెట్టింది. యూట్యూబ్, ఎయిర్‌టెల్‌లాంటి పెద్ద కంపెనీలతో కలిసి పనిచేసింది. ట్రావెలింగ్‌పై ఆసక్తి ఉన్నవారికి గుడ్ ప్లానింగ్ అనేది ముఖ్యం అంటుంది టాన్యా. ‘గుడ్ ప్లానింగ్’కు సంబంధించి టిప్స్ చెబుతుంటుంది. ప్రణాళిక ఉండాలి దిల్లీకి చెందిన మౌనికా మాలిక్ బిజినెస్ అండ్ ఫైనాన్స్‌కు సంబంధించి కంటెంట్ క్రియేటర్‌గా చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకుంది. పర్సనల్ ఫైనాన్స్ నుంచి స్టాక్‌మార్కెట్ వరకు ఎన్నో విషయాలను సులభంగా అర్థమయ్యేలా చెబుతోంది. ‘ఒక రంగంపై ఇష్టం ఉన్నంత మాత్రాన విజయం చేరువ కాదు. భవిష్యత్ ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలి. పరిశ్రమకైనా, వ్యక్తికైనా ఇది ముఖ్యం’ అంటుంది మాలిక్. (చదవండి: జుట్టు లేకపోయినా మోడల్‌గా రాణించి శభాష్ అనిపించుకుంది! హెయిర్‌లెస్ మోడల్‌గా సత్తా చాటింది) -
ఈ 'వెడ్డూరం' చూశారా? పెళ్లిని సొమ్ము చేసుకునే ట్రెండ్! ఏకంగా..
కొంతమంది ఎంతోఘనంగా జరుపుకునే తమ పెళ్లి వేడుకల వీడియోలను అమ్ముకుంటూ డబ్బులు సంపాదించడం ఇప్పటి ట్రెండ్‌గా మారింది. ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలు తమ పెళ్లి వీడియోలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీరిలానే సెలబ్రెటీ హోదాలేని వారు సైతం విదేశీయులకు పెళ్లి టికెట్లు అమ్మి వెడ్డింగ్ పర్యాటకానికి తలుపులు తెరుస్తున్నారు. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే చాలా మంది విదేశీయులు ఇక్కడి సంస్కృతిని తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. విదేశాలతో పోలిస్తే ఇండియాలో ఎంతో శాస్త్రోక్తంగా పెళ్లిళ్లు జరుగుతాయి. ఈ పెళ్లిళ్లను చూసేందుకు విదేశీయులు చాలా ఉత్సాహం చూపుతారు. పెళ్లి సంప్రదాయాలు, రకరకాల రుచికరమైన వంటకాలను టేస్ట్ చేసేందుకు తహ తహలాడుతుంటారు. అందుకే ఏ మాత్రం అవకాశం చిక్కినా వెంటనే వచ్చి ఇండియాలో వాలిపోతుంటారు. ఇందుకు ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. ఈ అభిరుచినే మన భారతీయ జంటలు, వెడ్డింగ్ ప్లానర్స్ సొమ్ము చేసుకుంటున్నారు. దీనికోసం ప్రత్యేకంగా వెబ్సైట్లూ నడుపుతున్నారు. వెడ్డింగ్ ఇన్విటేషన్‌ను టికెట్‌గా చూపిస్తూ నిశ్చితార్థం నుంచి, మెహందీ, సంగీత్, హల్దీ ఇలా ఒక్కో వేడుకకి ఒక్కో రేటుని చెబుతూ పర్యాటకులను ఆకర్షిస్తున్నారని వెడ్డింగ్ ప్లానర్స్ చెబుతున్నారు. జాయిన్ మై వెడ్డింగ్... పెళ్లి చేసుకునే జంట సొంతంగా జాయిన్ మై వెడ్డింగ్ పేరుతో అకౌంట్‌ను క్రియేట్ చేస్తారు. ఈ వెబ్సైట్లో పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరి ఫోటోలు, పెళ్లి తేదీ, ఎన్నిరోజులు వేడుకలు జరుగుతాయి.. ఏ రోజు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు... వంటి వివరాలను అప్లోడ్ చేస్తారు. పెళ్లిలో పెట్టే భోజనం వెజ్, నాన్‌వెజ్, మందు, చిందు ఉంటే అదీ చెబుతారు. ఇవేగాక డ్రెస్ కోడ్, అక్కడ మాట్లాడే భాష, వేడుక జరిగే ప్రదేశం అడ్రెస్‌తోపాటు ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను ఇస్తారు. విదేశీ పర్యటనలో ఉన్న వారికి ఈ పెళ్లి తేదీలు జత కుదిరితే టికెట్స్ బుక్ చేసుకుని వచ్చేసి మరీ పెళ్లి బ్యాండ్ బాజా, బారాత్‌లను ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కరోజుకి పన్నెండు వేలపైనే... ఎంతో ఆడంబరంగా జరిగే మన వివాహ వేడుకలను చూడడానికి పర్యాటకులు రోజు కోసం 150 డాలర్ల టికెట్‌ను సంతోషంగా కొనేస్తున్నారు. మన రూపాయలలో పన్నెండు వేలకు పైనే. ఇక పెళ్లి పూర్తి తతంగం మొత్తం అంటే రెండు రోజులు చూడాలంటే 250 డాలర్లు చెల్లించాలి (రూ.20 వేలకుపైన). ఒకటీ, రెండూ కాదు ఐదు రోజుల పెళ్లి చూడాలంటే ప్రత్యేక వెడ్డింగ్ ప్యాకేజీ టికెట్ కొనాల్సిందే. ఇలా పదిమంది విదేశీ అతిథులు పెళ్లికి వచ్చారంటే పెళ్లిలో కొన్ని ఖర్చులకు సరిపడా డబ్బు సమకూడినట్లే! అందుకే ఎక్కువ మంది వెడ్డింగ్ టూరిజంపైన ఆసక్తి కనబరుస్తున్నారు. తొలిసారి... హంగేరియన్– ఆస్ట్రేలియన్ సంతతికి చెందిన ఒర్సి పర్కాణి తొలిసారి 2016లో ‘జాయిన్ మై వెడ్డింగ్’ పేరిట వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసింది. అప్పుడు ఇది ఒక చిన్న స్టార్టప్. కానీ ఇప్పుడు ఇది ట్రెండ్‌గా మారింది. ఈ ఏడాది ఆగస్టు 19న పర్యాటక మంత్రిత్వ శాఖ వెడ్డింగ్ టూరిజంను ప్రారంభించింది. వెడ్డింగ్ టూరిజం ద్వారా భారతీయులేగాక, విదేశీయులు సైతం ఇక్కడికి వచ్చి ఇక్కడి సంప్రదాయాలకు తగ్గట్టుగా పెళ్లి వేడుకలు జరుపుకోవచ్చని చెబుతూ వెడ్డింగ్ టూరిజాన్ని ప్రోత్సహిస్తోంది. బీచ్ వెడ్డింగ్, నేచర్ వెడ్డింగ్, రాయల్ వెడ్డింగ్, హిమాలయన్ వెడ్డింగ్ థీమ్‌ల పేరిట ప్రచారం నిర్వహిస్తోంది. ఈ ట్రెండ్‌కు మంత్రిత్వ శాఖ ప్రోత్సాహం బూస్టర్‌గా పనిచేసి ఇండియాలో వెడ్డింగ్ వ్యాపారం వృద్ధిలోకి రాబోతుంది. ఇంకెందుకాలస్యం... మీ ఇంట్లో జరిగే పెళ్లివేడుకలకు వెడ్డింగ్ టూరిజంను జోడించి మరింత కలర్పుల్గా జరుపుకోండి. సెర్మనీ గైడ్... విదేశీయులను పెళ్లికి పిలవడమేగాక, వారికి అతిథి మర్యాదల్లో లోటు లేకుండా చూసుకోవడం ఈ వెడ్డింగ్ టూరిజం ప్రత్యేకత. వేడుక లో జరిగే ప్రతి విషయం, పర్యాటకులకు వచ్చే సందేహాలు నివృత్తి చేసేందుకు సెర్మనీ గైడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.‘‘ప్రస్తుతం రాజస్థాన్, ఢిల్లీ, ముంబైలలో ఈ వెడ్డింగ్ టూరిజం పెరుగుతోంది. రాజస్థాన్‌లోని చిన్నటౌన్లలో జరిగే వేడుకలకు విదేశీయులు ఆసక్తి చూపుతున్నారు. జో«ద్‌పూర్, జైపూర్, జైసల్మేర్, ఉదయ్పూర్లలో జరిగే రాయల్ ఇండియన్ వెడ్డింగ్స్‌కు డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంది’’ అని వెడ్డింగ్ ప్లానర్స్ చెబుతున్నారు. (చదవండి: ఉద్దానంలోని మరణాలకు గల కారణాన్ని కనిపెట్టిన పరిశోధకులు! చాలా మరణాలు..) -
మత్తు కోసం పాము విషమా?..అందుకోసం పార్టీల్లో..
రేవ్ పార్టీల్లో పాము విషాన్ని వినియోగించారంటూ యూట్యూబర్ ఎల్వీష్ యాదవ్‌తో సహా నలుగురిపై కేసు నమోదవ్వడంతో ఒక్కసారిగా ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మేనక గాంధీ ఫిర్యాదుల మేరకు నిందితులపై కేసు నమోదైంది. ఎల్వీష్ యాదవ్, ఆయన సహచరులు నిర్వహించిన పార్టీల్లో పాములను, పాము విషాన్ని వాడారని, మత్తు కోసం పాము విషం తీసుకుంటున్న వీడియోలు బయటపడ్డట్లు పోలీసులు చెబతున్నారు. ఒక్కసారిగా ఈ ఘటన తీవ్ర కలవరపాటుకి గురిచేయడమే గాక ప్రస్తుతం ఇది భారత్‌లో ట్రెండ్‌గా మారడమా అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. అసలేంటి రేవ్ పార్టీలు? మత్తు కోసం పాము విషమా? వాళ్లకి ఆ విషం ప్రమాదం కాదా? తదితరాల గురించే ఈ కథనం!. ఇటీవలకాలంలో సంపన్న కుటుంబాల పిల్లలు దగ్గర నుంచి అట్టడుగు వర్గానికి చెందిన కొందరూ అల్లరి చిల్లరి పిల్లలు వరకు ఈ రేవ్ పార్టీల సంస్కృతికి అలవాటుపడి దారితప్పుతున్నారు. విచ్చలవిడి ఈ సంస్కృతిలో డ్రగ్స్‌కి, కొన్ని రకాల చెడు అలవాట్లకు బానిసై చేజేతులారా జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి అనైతిక చట్ట విరుద్ధమైన పనులన్ని ఫామ్ హౌస్‌ల్లోనూ లేదా నగరానికి దూరంగా ఉండే ఫ్లాట్లలో జరుగుతుండటం బాధకరం. అక్కడకి పోలీసులు ఇలాంటి వాటికి అడ్డకట్టవేసి అరెస్టులు చేయడం జరగుతోంది. ఇంత వరకు బాగానే ఉంది. ఇప్పుడు అది కాస్త శృతి మించి ఆ మత్తు పరాకాష్టకు చేరుకుందా అనేంత స్థాయికి దిగజారిపోయింది. ఏకంగా మత్తు సరిపోవడం లేదని అత్యంత విషపూరితమైన పాము విషం కూడా ఎక్కించుకునేంత స్థాయికి వెళ్లిపోయారంటే..ఎంతటి ప్రమాదకరమైన వ్యక్తులుగా మారిపోయారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ భయానక సంస్కృతి ఎక్కడది..? మత్తు కోసం పాము విషాన్ని తీసుకునే అలవాటు చైనా, రష్యా, ఇతర పాశ్చాత్య దేశాల్లో చాలా ఏళ్లుగా ఉంది. ఇటీవల ఆ అలవాటు ఇండియాలోకి పాకడమే గాక ట్రెండ్‌గా మారింది. మరోవైపు, పాము కాటు మరణాలు భారత్‌లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. అదీగాక మన గ్రామీణ భారతంలో పాముకాటు అతిపెద్ద సమస్య. అలాంటి ప్రమాదకర పాముల విషంతోనే మత్తురాయళ్లు మత్తులో జోగేందుకు యత్నించడం అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ యూట్యూబర్ యాదవ్ ఘటన ఒక్కసారిగా రేవ్‌పార్టీలపై మరింత దృష్టిసారించి నిఘా పెట్టేలా చేసింది. ఇంతవరకు నల్లమందు, పొగాకు, గంజాయి, ఎండీఎంఏ, మెత్ వంటి పదార్థాలను మత్తుకోసం వాడేవారు. ఐతే పాములు, తేళ్లు వంటి సరీసృపాల విషాలను కూడా మత్తుకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయని పరిశోధనల్లో తేలింది. ఈ విష సంస్కృంతి భారత్‌లో లేకపోయినా.. యువత దీన్ని ఫాలో అవ్వడం విచారకరం. పైగా ఇది ప్రాణాంతకం కూడా. మత్తుపదార్థాలకు విపరీతంగా బానిసైనవారు మరింత మత్తుకోసం ఇలా పాము విషం వైపుకి మళ్లుతారని నిపుణులు చెబుతున్నారు. వినోదం కోసం పాము విషాన్ని దుర్వినియోగం చేసిన కేసులు భారత్‌లోనే నమోదవుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి. పాము విషం వల్ల మనసు మూడ్లు పలు రకాలు మారుతుందట. క్రమేణ బద్ధకం, దృష్టి అప్పష్టతకు కారణమవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ విషం మానవ రక్తంలో ప్రవేశించగానే శరీరం నెమ్మదిగా స్పందించేలా క్రియాశీల జీవక్రియలను విడుదల చేస్తుంది. ఫలితంగా శరీరం చచ్చుపడిపయేలా చేసేలా తీవ్ర దుష్ప్రభావాలను చూపిస్తుంది. ఐతే ఈ మత్తురాయళ్లు ఈ విషాన్ని ఎక్కించుకున్నప్పుడూ ఎలాంటి ప్రమాదం ఉండదు. వారు మత్తు కిక్‌లో తేలిపోతుంటారు. ఆ తర్వాత దాని ప్రభావం ఒక్కొక్కటిగా శరీరంపై చూపించడం మొదలవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాముల నుంచి విషం తీసేస్తే.. దేశంలో చాలా తక్కువగా నాగుపాములు, కొండచిలువలు ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం అవి అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. ఇలా పాములు నుంచి విషాన్ని సేకరించే పనులకు పాల్పడటం వల్ల అవి మరణిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పాములకు ఆహారాన్ని జీర్ణం చేయడంలో విషమే కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. దీంతో పాములు విషాన్ని కోల్పోయినప్పుడు త్వరితగతిన చనిపోతాయి. (చదవండి: మార్క్ జుకర్‌బర్గ్ మోకాలికి శస్త్ర చికిత్స..అసలేంటి చికిత్స? ఎందుకు?) -
స్టాక్ మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ స్తర్త్స్
-
కట్టు..బొట్టు తీరు.. కాస్త డ్రస్ కోడ్‌గా మారింది!..ఆ విధంబెట్టిదనినా..
కట్టు..బొట్టు తీరు.. ఇదివరకైతే కేవలం సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నం! తర్వాత వ్యక్తిగత అభిరుచికి అద్దమైంది! అటు తర్వాత సమయ సందర్భాలకు సూచిక అయింది! ఇప్పుడు.. పార్టీలు.. ప్రత్యేక వేడుకలు.. అంతెందుకు సరదా కాలక్షేపాలలో ఆయా సందర్భాలకు తగ్గట్టుగా ఈ కట్టు.. బొట్టు.. తీరు మార్చుకుంది! సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తూ! దాన్నే మోడర్న్‌గా ‘డ్రెస్ కోడ్’ అంటున్నారు! పలు రంగుల్లో.. భిన్నమైన డిజైన్లలో.. క్లాస్‌గా.. మాస్‌గా.. ఫన్‌గా.. వియర్డ్‌గా.. ట్రెడిషనల్‌గా.. ట్రెండీగా.. కనిపిస్తోంది! ఒకరకంగా ఇది.. దాన్ని ఫాలో అవుతున్న వాళ్ల అడ్రెస్ కోడ్‌గా మారింది!! ఆ విధంబెట్టిదనినా.. బార్బీ మూవీ ఫ్యాషన్.. మరిస్సా స్మిత్ అతి పెద్ద బార్బీ అభిమాని. గత సంవత్సరం బార్బీ సినిమా ట్రైలర్ విడదలైనప్పటి నుంచి ఆమె తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను మొత్తం బార్బీ ట్రెండ్ తోనే నింపేసింది. అచ్చం బార్బీలాగే రెడీ అయి వీడియోలు చేసింది. బార్బీ చిత్రం విడుదలైనప్పుడైతే అచ్చం బార్బీలాగే వెళ్లి ‘పింక్ ఫ్యాషన్ చాలెంజ్’ విసిరింది. అలా బార్బీ అభిమానులు మొత్తం ఆ సినిమాకు పింక్ డ్రెస్ కోడ్‌లోనే వెళ్లి చూశారు. కొంతమంది ఆ చాలెంజ్ ఏమిటో తెలియకుండానే పింక్ డ్రెస్‌లో వెళ్లి చూశారు. ఇప్పుడు ఈ ట్రెండ్ మన దేశంలోనూ కొనసాగుతోంది. దశాబ్దాల నాటి బొమ్మ పట్ల ప్రజలు తమ ఇష్టాన్ని వ్యకం చేసే విధానాల్లో ఈ పింక్ ఫ్యాషనూ ఒకటైంది! ఇది ఎంతలా ట్రెండ్ అయిందంటే పలు ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్స్ కూడా బార్బీ అభిమానుల కోసం స్పెషల్ డిజైన్స్‌ను, ఆఫర్స్‌ను ప్రకటించేంతగా! ఇదే తరహాలో.. ఆ తర్వాత విడుదలైన ‘ఓపన్ హైమర్’ సినిమాకూ చాలా మంది బ్లాక్ డ్రెస్ కోడ్‌లో వెళ్లారు. దెయ్యాల డ్రెస్ కోడ్.. హాలోవీన్.. ఈ పండగ పేరు చెప్పగానే అరివీర భయంకరమైన వేషాధారణ గుర్తుకు వస్తుంది. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ పండగ గ్లోబలైజేషన్లో భాగంగా మన దేశంలోకీ ప్రవేశించింది. హైదరాబాద్‌తో పాటు ఇతర మెట్రో నగరాల్లోనూ యువత హాలోవీన్ థీమ్ పార్టీల్లో పాల్గొంటూ.. ఎంజాయ్ చేస్తోంది. నిజానికి ఈ ‘హాలోవీన్ డే’ రెండువేల సంవత్సరాలకు పూర్వమే ప్రారంభమైందని చరిత్ర చెబుతోంది. ప్రాచీనకాలంలో పేగన్లు (మధ్యయుగం నాటి ఓ మతానికి చెందినవారు) సమ్ హెయిన్’ అనే పండగను జరుపుకునేవాళ్లట. అదే ఈ హాలోవీన్ పండగకు ప్రేరణ అని చరిత్రకారులు చెబుతారు. పేగన్ల సంవత్సరం అక్టోబర్‌తో పూర్తయ్యేది. అక్టోబర్ మాసం ఆఖరి రోజు రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకూ వేడుకలు జరిగేవి. అయితే అప్పట్లో మొదలైన ఓ నమ్మకం వింత ఆచారాలకు తెరతీసింది. కొత్త సంవత్సరాది సందర్భంగా అంతకుముందు చనిపోయిన పెద్దల ఆత్మలన్నీ భూమిపైకి తిరిగి వస్తాయని పేగన్లు నమ్మేవారు. ఆరోజు రాత్రి భూమికి, ఆత్మలు నివసించే ప్రపంచానికి మధ్యలో ఉండే తలుపు తెరుచుకుంటుందని, ఆత్మలు తమ బంధువులను చూసి వెళ్లడానికి భూమిపైకి వస్తాయని నమ్మేవారు. వాటికి భయపడి అవి తమ జోలికి రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకునేవారు. ఆత్మలు తమ పొలాలపై పడి వాటిని నాశనం చేయకుండా వాటికి ఆహారాన్ని ఏర్పాటు చేసి ఆరుబయట పెట్టేవారు. నిప్పు అంటే ఆత్మలు భయపడతాయని ఇంటికి దగ్గరగా మంటలు వేసేవారు. ఆత్మలు తమ వద్దకు రాకుండా ఉండేందుకు తెల్ల దుస్తులు వేసుకొని ముఖానికి నల్లని రంగు పూసుకునేవారు. అలా మొదలైన ఆ నమ్మకం తర్వాత సంప్రదాయంగా.. పదహారో శతాబ్దానికి ఓ పండగగా మారిపోయింది. పెళ్లి డ్రెస్ కోడ్ ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన ఘట్టం. ఆ పెళ్లి వేడుకను పదికాలాల పాటు గుర్తుండిపోయేలా చేసుకోవాలని భావిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటారు. ఖర్చుకు వెనుకాడకుండా ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ పెళ్లిళ్లలోనూ డ్రెస్ కోడ్ మొదలైంది. మెహందీ, హల్దీ, పెళ్లి కూతురు ఫంక్షన్, సంగీత్, పెళ్లి. ఇలా ఒక్కో వేడుకకు పెళ్ళికూతురు, పెళ్లి కొడుకుతో పాటు ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు, ఆత్మీయులు కూడా డ్రెస్ కోడ్‌లో కనిపిస్తున్నారు. అంతేకాదు మతాలకనుగుణంగా ఆయా పెళ్లిళ్లలో ఆయా సంప్రదాయాల రీతిలో దుస్తులు ధరిస్తున్నారు. ఉదాహరణకు క్రిస్టియన్లలో వధూవరులు తెల్ల గౌన్, బ్లాక్ సూట్ వేసుకుంటే, హిందువుల్లో వధూవరులు పసుపు చీర, తెల్ల పంచెలు ధరించడం! ఇలా మతాలు, పద్ధతులే కాకుండా పలు ప్రాంతాల్లోని ఆచారవ్యవహారాలూ ఆ డ్రెస్ కోడ్‌లో భాగమవుతున్నాయి. పెళ్లి ఆపేస్తున్నారు.. చైనాలో వివాహ వేడుకకు సంబంధించి ప్రజలు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. గతంలో పెళ్లి కోసం రిజిస్ట్రారు ఆఫీస్‌కి.. తమ ఇష్టానుసారమైన వస్త్రధారణతో వచ్చేవారట. దీంతో ఆ క్రమశిక్షణ రాహిత్యానికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం.. ఓ డ్రెస్ కోడ్‌ను ప్రవేశ పెట్టింది. పెళ్లి చేసుకోవడానికి రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వచ్చే దంపతులు సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించాలి. లేనిపక్షంలో మ్యారేజ్ సర్టిఫికెట్ మంజూరు కాదు. కనీసం పెళ్లిరోజు అయినా దేశ సంప్రదాయాలను కాపాడాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట. ఓనం చీర.. దక్షిణాదిన ఘనంగా జరుపుకునే పండగల్లో కేరళకు చెందిన ఓనం ఒకటి. ఆ పండగనాడు మిగిలిన ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నా, బంగారు అంచుతో కూడిన తెల్లటి కాటన్ లేదా సిల్క్ చీరను కట్టుకుంటారు మలయాళ మహిళలు. ఆ చీరను కసవ్ అంటారు. ఇప్పుడు ఈ కట్టూ బొట్టూ ఓనం రోజున ఒక్క కేరళకే కాకుండా దేశమంతటికీ కోడ్‌గా మారింది. తమిళనాడులో అయితే కళాశాలలు, కార్యాలయాల్లోని విద్యార్థులు, ఉద్యోగినులు ఓనం చీరలను ధరించి తరగతులకు, విధులకు హాజరవుతున్నారు. అయితే కరోనా తర్వాత ఓనం చీర కోడ్ కేరళలో ఒకరకంగా యూనిఫామ్‌గా మారిందని చెప్పవచ్చు. కరోనా లాక్‌డౌన్‌తో అక్కడ నేత కార్మికులు ఘోరమైన నష్టాలను చవిచూశారు. వాళ్లను ఈ కష్టం నుంచి గట్టెక్కించడానికి ‘సేవ్ ది లూమ్’ సంస్థ ఆ రాష్ట్ర మహిళా న్యాయవాదుల కోసం ఓనం చీరలనే మోనోక్రోమ్ చీరలుగా మార్చేసింది. ఇంకో అడుగు ముందుకు వేసి ప్రత్యేక కాలర్ గల జాకెట్, ఫార్మల్ గౌన్నూ నేయించింది! ఈ డిజైన్‌ను ‘విధి’ అంటున్నారు. ఇప్పుడది అక్కడ చాలా ఫేమస్. బ్లాక్ అండ్ వైట్.. నలుపు, తెలుపు.. న్యాయవాద వృత్తికి చిహ్నం.. ప్రపంచవ్యాప్తంగా! ప్రతి రంగుకున్నట్టే దీనికీ కొన్ని సానుకూల, ప్రతికూల అర్థాలున్నాయి. ఒక వైపు విషాదం.. నిరసనను సూచిస్తూనే ఇంకో వైపు బలం.. అధికారాన్నీ సూచిస్తుంది. న్యాయవాద వృత్తికి నలుపు రంగునే ఎంచుకోవడానికి మరో కారణం.. అప్పట్లో రంగులు అంతగా అందుబాటులో లేవు. విస్తారమైన ఫాబ్రిక్ నలుపు రంగులో మాత్రమే ఉండేది. అలాగే న్యాయవాది డ్రెస్‌లోని ఇంకో రంగు తెలుపు.. కాంతిని, స్వచ్ఛతను, మంచితనాన్ని సూచిస్తుంది. వాది, ప్రతివాది రెండు పక్షాల న్యాయవాదులు ఒకే విధమైన డ్రెస్ కోడ్‌ను ధరిస్తారు. స్కూల్ యూనిఫాం స్టోరీ.. 16 వ శతాబ్దంలో యూకేలో యూనిఫామ్‌లు ప్రారంభమయ్యేంత వరకు అవి పాఠశాల క్రమశిక్షణలో భాగం కాదు. పిల్లలు తమకు నచ్చిన దుస్తులను ధరించి బడికి వెళ్లేవారు. 16వ శతాబ్దంలో మెజారిటీ పాఠశాలలు స్వచ్ఛంద పాఠశాలలు. మెజారిటీ విద్యార్థులు వెనుకబడినవారే. కాబట్టి నాటి స్వచ్ఛంద సంస్థలు ఒకే రంగు, ఒకే డిజైన్ కుట్టిన దుస్తులను విరాళంగా ఇచ్చేవి. ఇవే యూనిఫామ్ పుట్టుకకు నాంది అయ్యాయి. అలా నాటి నుంచి చాలా బడులు తమ విద్యార్థులు అందరికీ డ్రెస్ కోడ్‌ను తప్పనిసరి చేశాయి. ఈ యూనిఫామ్‌లు పిల్లల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వ్యత్యాసాలకు చెల్లుచీటీ పాడి బడిలో పిల్లలంతా సమానమనే భావనను పెంచాయి. క్రమశిక్షణలో భాగం చేశాయి. చాలా దేశాలు విద్యార్థుల డ్రెస్ కోడ్ అయిన ఈ యూనిఫామ్‌ను అమోదించినప్పటికీ, యూనిఫామ్ అనే ఆ పదానికి అభ్యంతరం చెబుతున్న దేశాలూ ఉన్నాయి. అలాంటి దేశాలు యూనిఫామ్‌ను సున్నితంగా ‘స్కూల్ డ్రెస్’ అంటున్నాయి. మన దేశంలో ముంబైలోని కొన్ని పాఠశాలల్లో బ్లేజర్లు, ప్యాంటు, స్కర్టులు లేదా ట్యూనిక్స్, బూట్లు, సాక్స్‌లు వాళ్ల యూనిఫామ్‌లో భాగం. బ్రిటిష్ పాలకులు భారతదేశంలో ఇంగ్లిష్ మీడియం బడులను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా బడి యూనిఫాం కలోనియల్ డ్రెస్సింగ్ స్టైల్లోనే ఉంది. అయితే కొన్ని పాఠశాలలు మాత్రం దానిని మార్చుకున్నాయి. జపాన్‌లో బాలికల పాఠశాల యూనిఫామ్‌లు బ్రిటిష్ నావికాదళ యూనిఫామ్‌ను పోలి ఉంటాయి. అక్కడి పిల్లలు తరగతి గదిలోకి ప్రవేశించే ముందు వారు తమ షూను తీసివేయాలి. తరగతి గదిలో వారు ప్రత్యేకమైన చెప్పులు వేసుకుంటారు. యూని కోడ్.. కేరళలోని ఎర్నాకుళం జిల్లా వలయాంచిరంగార గ్రామంలో వందేళ్ల చరిత్ర ఉన్న సర్కారు బడి ఒకటి ఉంది. అందులో టీచర్లతోపాటు బోధనేతర సిబ్బంది కూడా మహిళలే. ఈ ఆల్ విమెన్ స్కూల్లో ప్రధానోపాధ్యాయురాలు సి.రాజి.. పిల్లల యూనిఫామ్ విషయంలో ఇప్పటి వరకు కొనసాగిన ఒక సంప్రదాయ విభజన రేఖను చెరిపేశారు. అన్ని స్కూళ్లలాగే ఆ స్కూల్లో కూడా అబ్బాయిలకు షర్టు – నిక్కరు, అమ్మాయిలకు షర్టు– స్కర్టు యూనిఫామ్‌గా ఉండేది. ప్రిన్సిపల్ నిర్ణయంతో ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ‘షర్టు – నిక్కరు’ వేసుకుంటున్నారు. ఆటలు ఆడేటప్పుడు బాలికలకు సౌకర్యంగా ఉండటం కోసమే ఇలా యూని (డ్రెస్) కోడ్‌ను తెచ్చారు. బాడ్మింటన్, షటిల్ ఆడాలన్నా.. హై జంప్ చేయాలన్నా స్కర్టు పైకి ఎగురుతుందేమోననే బిడియంతో ఆడపిల్లలు ఆటలు ఆడడానికి ముందుకు రావడంలేదట. మంచి క్రీడాకారులు కాగల సత్తా ఉన్న అమ్మాయిలను వస్త్రధారణ కారణంతో అలా రెక్కలు విరిచి కూర్చోబెట్టడం ఏమిటి అని ఆలోచించిన సి. రాజి.. ఆ స్కూల్ డ్రెస్‌ని అలా మార్చేశారు. ఫ్రెషీ చాయిస్ ట్రాన్స్జెండర్లకు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ యూనివర్సిటీ డ్రెస్ కోడ్‌ను ప్రకటించింది. ఫ్రెషర్స్‌లో ఆడవారికి, మగవారికి ప్రతిఏటా డ్రెస్ కోడ్‌ను ప్రకటించే ఆనవాయితీగల ఈ యూనివర్సిటీ ఈసారి తొలిసారిగా ట్రాన్స్జెండర్లకు కూడా డ్రెస్ కోడ్‌ను ప్రకటించడం విశేషం. విద్యార్థినులకు బటన్లు కలిగిన షార్ట్ స్లీవ్స్, డార్క్ కలర్ లాంగ్ స్కర్ట్స్‌ను, విద్యార్థులకు వైట్ షర్ట్, నెక్ టై, బ్లాక్ ట్రౌజర్లను డ్రెస్ కోడ్‌గా నిర్ణయించింది. వీటిలో ఏ డ్రెస్‌నైనా ధరించే అవకాశాన్ని ‘ఫ్రెషీ చాయిస్’ పేరిట ట్రాన్స్జెండర్లకు కల్పించింది. ఆధ్యాత్మిక డ్రెస్ కోడ్ పలు ప్రసిద్ధ దేవస్థానాల్లో ఎప్పటి నుంచో డ్రెస్ కోడ్ అమలవుతోంది. ఆలయ అధికారుల నిర్ణయానికి భక్తులు కూడా ఆమోద ముద్ర వేశారు. జీన్స్, టీ షర్టులను ధరించిన యువతులకే కాదు పంజాబీ డ్రెస్‌పై చున్నీ లేని యువతులకు సైతం ఆలయాల్లో అనుమతి దొరకడం కష్టం. సంప్రదాయ పద్ధతి తప్పనిసరి కావడంతో చాలామంది పంచె, చీరలను కొనుగోలు చేసి, సంప్రదాయ పద్ధతిలో దైవాన్ని దర్శించుకుంటున్నారు. ఈ తరహాలోనే అయ్యప్ప దీక్ష భక్తులు నలుపు రంగులోనూ, భవానీ భక్తులు ఎరుపు రంగు, హనుమాన్ భక్తులు కాషాయం.. ఇలా భక్తులు ఆయా దైవ దీక్షల నియమాసారం ఆయా రంగుల డ్రెస్ కోడ్‌లో దీక్షలను కొనసాగిస్తున్నారు. అలాగే పలు మతాలకు సంబంధించిన అధిపతులు, పూజారులు, సన్యాసులకూ పలు రంగుల డ్రెస్ కోడ్ ఉంది. పోప్స్ తెల్లని, నల్లని దుస్తులు ధరిస్తే.. హిందూ, బౌద్ధ మతాల్లోని పూజారులు, సన్యాసులు, స్వామీజీలు, భిక్షువులు కాషాయ దుస్తుల ధరిస్తారు. జైనంలో శ్వేతాంబరులు పేరుకు తగ్గట్టు తెల్లటి డ్రెస్ కోడ్‌లో ఉంటారు. ముస్లిం మతంలో ప్రాంతాలను బట్టి ఆకు పచ్చ, తెలుపు, నలుపు వంటి రంగులు కనిపిస్తుంటాయి. లెక్కల్లో.. గణాంకాల ప్రకారం పదహారవ శతాబ్దంలోనే స్కూల్ యూనిఫామ్, సైనికుల యూనిఫామ్, బిజినెస్ యూనిఫామ్, ఉద్యోగుల యూనిఫామ్.. ఇలా రకరకాల డ్రెస్ కోడ్లను వారు చేస్తున్న పనికి అనుగుణంగా డిజైన్ చేశారు. ఇప్పుడు దాని పరిధి విస్తృతమైంది. అమెరికాలో ఒక యూనివర్సిటీ నిర్వహించిన సర్వే ప్రకారం 2022లో యూనిఫామ్‌ల రకాలు 80 వేల కంటే ఎక్కువే! చదువులు.. వృత్తులు.. విధులకు సంబంధించిన యూనిఫామ్స్‌ని పక్కనబెడితే.. విందు వినోదాలు.. వేడుకలు.. సరదా కాలక్షేపాలు వంటి వాటన్నిటికీ డ్రెస్ కోడ్ ఓ ట్రెండ్ అయింది. పార్టీలు, పబ్బులు సరే.. పాప్ స్టార్స్ కన్సర్ట్స్కీ.. ఆ పాప్ స్టార్స్ స్టయిల్స్‌ను ప్రతిబింబించే డ్రెస్ కోడ్‌లో హాజరవుతున్న అభిమానులూ ఉన్నారు. ఇలా డ్రెస్ కోడ్ కూడా ఫ్యాషన్‌లో చేరి.. ఎక్స్‌ప్రెషన్‌కి.. కమ్యూనికేషన్కీ ఓ టూల్‌గా మారింది! (చదవండి: ఆ చిన్న పింగాణి పాత్ర ధర తెలిస్తే..నోరెళ్లబెట్టాల్సిందే!) -
ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్‌గా మురళీకృష్ణ బాధ్యతల స్వీకరణ
వెంగళరావునగర్: యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్‌గా పి.మురళీకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన ఏకే మిశ్రా బదిలీపై వెళ్లారు. కొండాపూర్‌లోని 8వ పటాలంలో విధులు నిర్వహించే మురళీకృష్ణను ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్‌గా నియమించారు. మురళీకృష్ణకు ఫస్ట్ బెటాలియన్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. పటాలం సిబ్బంది చేసిన పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. వారి నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫస్ట్ బెటాలియన్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజాసేవలో తమవంతు బాధ్యతలు నెరవేర్చడంలో బెటాలియన్ అధికారులు, సిబ్బంది ముందుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్స్ సత్యనారాయణ, రంగారెడ్డి, జవహర్లాల్, నరసింహ, ఆర్ఐలు సురేష్, ధర్మారావు, సాంబయ్య, శంకర్, జాఫర్, రవీందర్, రాజేశం, ఆర్ఎస్ఐలు, ఇతర ఫస్ట్ బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు. -
మళ్లీ లేఆఫ్స్‌డౌన్ ట్రెండ్‌లో ఐటీ.. టెకీల తొలగింపులో బెంగళూరు టాప్
సాక్షి, హైదరాబాద్: లేఆఫ్స్ పెరుగుదలతో టెకీలకు మళ్లీ కష్టాలు మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా టెకీల ఉద్వాసన పర్వం ఉధృతమవుతోంది. అమెరికా, ఐరోపాతో పాటు పలు దేశాల్లో ద్రవ్యోల్బణపెంపుతో ఐటీ, ఇతర కంపెనీల లాభాలు తగ్గిపోయాయి. ఆర్థికరంగ ఒడిదొడుకుల కారణంగా స్టార్టప్‌లలో పెట్టుబడుల సంఖ్య కూడా క్రమంగా తగ్గు ముఖం పట్టిందని నిపుణులు చెబుతున్నారు. ఆరునెలల్లోనే 2,13,020 మంది టెకీలకు ఉద్వాసన 2023లో (జనవరి నుంచి జూన్) ప్రపంచవ్యాప్తంగా 2,13,020 మంది ఉద్యో గులకు ఉద్వాసన పలికినట్టు లేఆఫ్స్. ఎఫ్‌వైఐ వెబ్సైట్ తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది 45,166 టెకీలు ఉద్యోగాలు కోల్పో గా, ఈ ఆరునెలల్లో ఉద్యోగుల లేఆఫ్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉద్యోగులను తొలగించిన జాబితాలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాహు, మెటా, జూమ్ ఉన్నాయి. భారత్‌లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితులు ఉన్నాయి. మన దగ్గర ఈ ఏడాది జనవరి నుంచి జూన్ దాకా 10,774 మంది టెకీలను తొలగించినట్టు లేఆఫ్స్.ఎఫ్‌వైఐ నివేదిక వెల్లడించింది. 2022లో ఉద్వాసనకు గురైన టెకీ ఉద్యోగుల సంఖ్య 6,530. ఈ ఏడాదితో పోల్చి చూసినప్పుడు తొలి ఆరునెలల్లో టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్నవారే అధికంగా ఉద్యోగాలు కోల్పోయారు. కోవిడ్ విజృంభించిన 2020లోనూ భారత్‌లోని 12,932 మంది టెకీలు ఉద్యోగాలు కోల్పో యారు. 2021లో కొత్త స్టార్టప్‌లకు ఫండింగ్ పెరిగింది. దీంతో ఈ సంఖ్య 4,080కు తగ్గింది. బెంగళూరు టాప్ టెకీల తొలగింపులో భారత్‌లో బెంగళూరు మొదటి వరుసలో ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే అక్కడ 6,967 మంది ఉద్యోగాలు కోల్పోయారు. స్టార్టప్ హబ్‌గా రూపొందుతున్న క్రమంలో ఈ ప్రభావం అధికంగా పడినట్టు నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో లేఆఫ్‌లు పెద్దగా లేకపోవడంతో లేఆఫ్స్,ఎఫ్‌వైఐ నివేదికలో టెకీ ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన గణాంక వివరాలు పొందుపరచలేదు. ఇప్పుడు స్టార్టప్‌లదీ వ్యథే... గత శీతాకాలం నుంచి ఇప్పటిదాకా 107 ఇండియన్ స్టార్టప్‌లలో 28,046 మంది ఉద్యోగులకు లే ఆఫ్ సెగ తాకినట్టు ఐఎన్‌సీ 42 తాజా నివేదిక వెల్లడించింది. ఏడాది కాలంలో 22 భారత ఎడ్టెక్ స్టార్టప్‌లు 9,871 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయని, 59 స్టార్టప్‌లు 9,271 మంది ఉద్యోగులను తొలగించినట్టు పేర్కొన్నారు. ఆ ఏడాది చివరి దాకా తప్పదు ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా ఐటీ సెక్టార్ డౌన్‌ట్రెండ్‌లోనే ఉందని చెప్పాలి. టెకీల లేఆఫ్ చేసే పరిస్థితులు ఈ ఏడాది చివరిదాకా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్లోబల్ ఎకానమీ ఎఫెక్ట్ కారణంగా ఆర్థికరంగ పరిస్థితి బాగా లేకపోవడంతో అమెరికా తో సహా ఇతరదేశాలు ప్రభావితమవుతున్నాయి. ఐటీ ఎనబుల్డ్ సర్వీసెస్‌పై ఈ ప్రభా వం ఎక్కువగా ఉండగా, భారత్‌లోనే కొంత ప్రభావం తక్కువగా కనిపిస్తోంది. పాత టెక్నాలజీపై పనిచేస్తూ, పనితీరు బాగాలేని వారికి ఉద్వాసన పలికేందుకు దీనిని కంపెనీలు ఒక అవకాశంగా తీసుకున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావం స్టార్టప్‌లపై తీవ్రంగా పడింది. – రమణ భూపతి, క్వాలిటీ థాట్ గ్రూప్ చైర్మన్, ఎడ్టెక్ కంపెనీ -
పీ ఫర్ పాడ్‌కాస్ట్.. బీ ఫర్ భార్గవి
లాక్డౌన్ లైఫ్స్టైల్లో మెరిసిన ఒక ట్రెండ్.... పాడ్‌కాస్ట్. ‘పాడ్‌కాస్ట్’ పాపులారిటీ గురించి వినడమేగానీ దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడానికి, సక్సెస్ఫుల్ పాడ్‌కాస్టర్‌గా రాణించాలనుకునే వారికి సాధికారికమైన సమాచారం కరువైంది. ఈ లోటును పూరించడానికి మంచి పుస్తకాన్ని తీసుకువచ్చి ఔత్సాహికులకు మేలు చేసింది భార్గవి.. లీడింగ్ హెచ్ఆర్ కన్సల్టింగ్ కంపెనీ ‘ఎక్సెల్ కార్పోరేషన్’కు సీయీవోగా ఉన్న బెంగళూరుకు చెందిన భార్గవి స్వామి మన దేశంలోని లీడింగ్ పాడ్కాస్టర్లలో ఒకరు. కంటెంట్ ప్రొడ్యూసర్‌గా కూడా తన సత్తా చాటుతుంది. మన దేశంలో పాడ్కాస్ట్పై వచ్చిన తొలిపుస్తకం ‘పీ ఫర్ పాడ్‌కాస్ట్’ రచయిత్రిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తన అనుభవాలను క్రోడీకరించి ఫస్ట్–పర్సన్లో రాసిన ఈ పుస్తకం పాడ్‌కాస్ట్ గురించి ప్రాథమిక విషయాలను తెలుసుకోవాలనుకునేవారికి దిక్సూచిలా నిలిచింది. ‘ఆర్ట్ ఆఫ్ పాడ్‌కాస్టింగ్’ను అక్షరాల్లోకి తెచ్చింది. బిజినెస్ పాడ్‌కాస్ట్ షో ‘పీపుల్ హూ మ్యాటర్’తో సక్సెస్ఫుల్ పాడ్‌కాస్టర్‌గా పేరు తెచ్చుకుంది భార్గవి. పాడ్‌కాస్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టే ముందు దాని లోతుపాతులు ఏమిటో తెలుసుకోవడానికి చిన్నపాటి రీసెర్చ్ లాంటిది చేసింది. అయితే పాడ్‌కాస్టర్‌గా తొలి అడుగులు వేయడానికి అవసరమైన సమాచారం దొరకడం గగనం అయింది. ‘జీరో ఇన్ఫర్మేషన్’ అనేది వెక్కిరిస్తున్నా తన పరిశోధనలో ఎక్కడా తగ్గింది లేదు. మాస్కమ్యూనికేషన్లో మాస్టర్స్ చేసిన భార్గవి తనదైన పద్ధతిలో పరిశోధన చేస్తూ సమాచారాన్ని సంపాదించింది. ‘తెలుసుకోవడానికి ఇన్ని విషయాలు ఉన్నాయా!’ అనిపించింది. తాను సక్సెస్ఫుల్ పాడ్‌కాస్టర్‌గా రాణించడానికి అవి మంచి మార్గాన్ని చూపాయి. తన సక్సెస్‌తోనే ఆగిపోకుండా పాడ్‌కాస్టింగ్‌లో సక్సెస్ కావాలనుకునేవారి కోసం ‘పీ ఫర్ పాడ్‌కాస్టింగ్’ అనే పుస్తకం రాసింది. వెబ్‌సీరీస్‌ల కోసం స్క్రిప్ట్ రాసినప్పుడు ఫస్ట్ డ్రాఫ్ట్‌లోనే ఓకే అయిపోయేది. ‘పీ ఫర్ పాడ్‌కాస్టింగ్’ విషయంలో మాత్రం పలుసార్లు పుస్తకాన్ని తిరగరాసింది. ఏదో ఒక విషయాన్ని కొత్తగా చేరుస్తూ వచ్చింది. ఈ పుస్తకానికి భార్గవి తల్లి ఎడిటర్లా వ్యవహరించింది. సూచనలు ఇచ్చింది. తల్లితో కలిసి ఈ ప్రాజెక్ట్ మీద పనిచేయడం భార్గవికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ‘పుస్తకాలు ఎక్కువగా చదవడం వల్ల రచనల ద్వారా ఒక విషయాన్ని సులభంగా కమ్యూనికేట్ చేయగలిగే విద్య పట్టుబడింది. నాలోని భావాలను ఆవిష్కరించడానికి రచనలను ఒక మాధ్యమంలా చేసుకుంటాను. అయితే పీ ఫర్ పాడ్‌కాస్ట్ అనేది నాలోని భావాల ఆవిష్కరణకు మాత్రమే పరిమితమైపోలేదు. ఎంతోమందికి దారి చూపించింది’ అంటుంది భార్గవి. అరవింద్ అడిగ, కిరణ్ దేశాయ్, అశ్విని సంఘీ.. మొదలైన వారి రచనలపై ఆసక్తి చూపించే భార్గవి కార్పొరేట్ దిగ్గజాల ఆలోచనలను, లీడర్షిప్, కోచింగ్‌లకు సంబంధించి పుస్తకాలను ఇష్టపడుతుంది. సంతోషం వెనక ఉండే శాస్త్రీయతను తెలుసుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తుంది. ‘పాడ్‌కాస్టర్‌గా నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మరింతగా ప్రయత్నిస్తున్నాను’ అంటున్న భార్గవి స్వామి వెబ్‌సీరీస్ కోసం స్క్రిప్ట్‌లు రాయడానికి, ఒక యంగ్ ఎంటర్ప్రెన్యూర్ గురించి ఫిక్షన్ బుక్ రాయడానికి సన్నాహాలు చేస్తోంది. సక్సెస్ మంత్ర లాక్డౌన్ లైఫ్‌స్టైల్ వల్ల రీడింగ్, రైటింగ్ అనేవి మనకు బాగా చేరువయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పాడ్‌కాస్ట్ సెగ్మెంట్ దూసుకుపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాడ్‌కాస్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టాను. ‘పాడ్‌కాస్టర్‌గా సక్సెస్ కావాలి’ అనుకోగానే సరిపోదు. అందుకు తగిన కసరత్తులు చేయాలి. మనదైన ప్రత్యేకత కోసం ప్రయత్నించాలి. స్కూల్‌రోజుల్లో నేను చదువుల్లో ముందు ఉండడంతో పాటు పాటలు పాడేదాన్ని. నృత్యాలు చేసేదాన్ని. ఉపన్యాస పోటీల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. అయితే ఇవేమీ స్కూలు దగ్గరే ఆగిపోలేదు. సృజనాత్మక విషయాలలో నాకు నిరంతరం తోడుగా నిలుస్తున్నాయి. ‘మీ సక్సెస్ మంత్ర ఏమిటి?’ అని చాలామంది నన్ను అడుగుతుంటారు. సక్సెస్‌కు షార్ట్కట్లు ఉండవు. మనల్ని సక్సెస్‌ఫుల్‌గా మార్చడానికి గాడ్ఫాదర్లు ఉండరు. వృత్తిపై మనం చూపే ఆసక్తి, పడే కష్టం, మన పరిచయాలు విజయపథంలో దూసుకుపోవడానికి కారణం అవుతాయి. సక్సెస్ కోసం ఒకరిని అనుసరించాలనే రూల్ ఏమీలేదు. ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేమిటో కనుక్కుంటే చాలు. – భార్గవి స్వామి, స్టార్ పాడ్‌కాస్టర్, ఎంటర్ప్రెన్యూర్ (చదవండి: పట్టుదారంతో జీవితాన్ని అల్లుకుంది ) -
లక్షితా... ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు?
ప్రతి ఒక్కరికీ ప్రైమరీ స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు. హైస్కూల్, కాలేజీ ఫ్రెండ్స్ టచ్‌లో ఉన్నంతగా ప్రైమరీస్కూల్ ఫ్రెండ్స్‌లో చాలా తక్కువమంది మాత్రమే టచ్‌లో ఉంటారు. అయితే వారి చిత్రాలు మన మదిలో ప్రింటై పోయి ఉంటాయి. ఏదో ఒక సమయంలో వారు గుర్తుకు వస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ యూజర్ నేహాకు తన ఎల్కేజీ ఫ్రెండ్ లక్షిత గుర్తుకు వచ్చింది. ‘ఎక్కడ ఉందో? ఎలా ఉందో’ అనే ఆసక్తి మొదలైంది. వెంటనే ‘ఫైండింగ్ లక్షిత’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎకౌంట్ క్రియేట్ చేసింది. నేహా ఆన్లైన్ సెర్చ్ జర్నీకి లక్షలాది లైక్ వచ్చాయి అనేది ఒక విషయం అయితే, మరో విశేషం... నేహాను అనుసరిస్తూ ఎంతోమంది తమ ఎల్కేజీ ఫ్రెండ్స్‌ను వెదుక్కునే పనిలో పడ్డారు. ఇదొక ట్రెండ్‌గా మారింది. ‘నా ఎల్కేజీ ఫ్రెండ్ జాడ కోసం నేను కూడా నేహాలాగే చేశాను. ఇదొక మంచి ఐడియా. ఏదో ఒకరోజు నా ఫ్రెండ్ గురించి కచ్చితంగా తెలుసుకుంటాను’ అని ఒక యూజర్ రాసింది. -
ఆ ట్రెండ్ మొదలుపెట్టింది ఆయనే... కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీలో జరిగిన ఆప్ కీ అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్న కేరళ ఎంపీ శశి థరూర్ ను సాన్ ఫ్రాన్సిస్కో వేదికగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకూ సబబని వ్యాఖ్యాత రజత్ శర్మ ప్రశ్నించగా మొట్టమొదట విదేశాల్లో దేశ వ్యవహారాల గురించి ప్రస్తావించింది ప్రధాని నరేంద్ర మోదీనే గాని రాహుల్ గాంధీ కాదని చురకలంటించారు. నీతులు ఎదుటివారికేనా...? రజత్ శర్మ "ఆప్ కీ అదాలత్" కార్యక్రమంలో శశి థరూర్ ను అంతర్జాతీయ వేదికల మీద రాహుల్ గాంధీ చేస్తోన్న వ్యాఖ్యలపై స్పందించమని కోరగా ఎంపీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆయన మాట్లాడుతూ... భారత దేశ అంతర్గత వ్యవహారాల గురించి అంతర్జాతీయ వేదికల మీద మొట్టమొదట ప్రస్తావించింది ప్రధాని నరేంద్ర మోదీనే. గత 60 ఏళ్లలో దేశంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెబుతూ ఈ సాంప్రదాయానికి తెరతీసింది ఆయనే గాని రాహుల్ గాంధీ కాదు. అయితే నీతులు చెప్తారు, లేదా తప్పుని కప్పిపుచ్చు కోవడానికి కథలు చెప్తారు... వారు చెప్పడం, మేము వినడమేనా? భారత అంతర్గత వ్యవహారాలను దేశ సరిహద్దు దాటనీయకూడదన్న ఇంగితం మొదట వారికి ఉండాలి. ఆ కనీస విజ్ఞత ఆయనకే లేనప్పుడు మిగిలినవారిని వేలెత్తి చూపించి ప్రయోజనం ఏమిటని ఎంపీ ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల ప్రస్తావన... ఆ ఎన్నికల్లో నా ఓటమికి నాదే బాధ్యత. వదంతులు చాలానే వచ్చి ఉండవచ్చు కానీ వాటిలో వాస్తవం లేదు. నేను ఆ ఎన్నికల్లో పోటీ చేయకముందే అప్పటి అధ్యక్షురాలు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక వాధ్రాను కలిశాను. వారు నామినేషన్ ఉపసంహరించుకోమని చెప్పి ఉంటే అప్పుడే వెనక్కు తీసుకునేవాడిని. కానీ వారేమీ మాట్లాడలేదు. నేను పోటీ చేసి ఓడిపోయాను, మల్లిఖార్జున్ ఖర్గే గెలిచారు. ఆ నిర్ణయాన్ని నేను గౌరవించాలని అన్నారు. చదవండి: భారత రెజ్లర్లకు బీజేపీ ఎంపీ మద్దతు.. ‘ఒక మహిళగా అభ్యర్థిస్తున్నా’ -
చల్ చల్ గుర్రం!
పిఠాపురం: గుర్రపు స్వారీ అనేది ఆటవిడుపు, సాహస క్రీడ. ప్రస్తుతం ఇది ట్రెండ్‌గా మారింది. యువతతో పాటు చిన్న పిల్లలు కూడా గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు హార్స్ రైడింగ్‌లో శిక్షణ ఇప్పించి.. వారు గుర్రాలపై స్వారీ చేస్తుంటే.. చూసి ముచ్చటపడుతున్నారు. యువత, చిన్నారుల తల్లిదండ్రుల ఆసక్తికి అనుగుణంగా హార్స్ రైడింగ్ ట్రైనింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 100 మంది 250 గుర్రాల వరకూ పెంచుతున్నారంటే.. గుర్రపు స్వారీపై యువత ఆసక్తి ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రాలు వెలిశాయి. గతంలో గుర్రపు స్వారీ నేర్చుకోవాలంటే పెద్ద పెద్ద నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఓ మోస్తరు పట్టణాల్లోనూ శిక్షణ కేంద్రాలు వెలుస్తున్నాయి. వేసవి కావడంతో యువతతో పాటు చిన్నారులు కూడా గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మానసిక వికాసానికి, శారీరక ఆరోగ్యానికి మేలు గుర్రపు స్వారీ అనేది పలు మానసిక, శారీరక సమస్యలకు సంజీవనిలా పనిచేస్తుంది. పోలియో, పక్షవాతం, మెదడు, వెన్నెముక సమస్యలు, వినికిడి లోపాలు, భావవ్యక్తీకరణ, స్థిమితం కోల్పోవడం వంటి వాటికి చక్కటి చికిత్సగా పనిచేస్తుంది. ముఖ్యంగా మానసిక వికాసం లోపించిన పిల్లలకు మంచి ఫలితాలనిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు గుర్రపు స్వారీ చేయడం వల్ల వారి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. గుర్రం కళ్లెం పట్టుకోవడం, నిటారుగా కూర్చోవడం, ఆశ్వాన్ని దూమికించడం, ఒకే లయలో ముందుకుసాగడం వంటి చర్యల వల్ల మెదడుకి, శరీరానికి మధ్య సమన్వయం ఏర్పడి మానసిక ఉత్తేజం కలుగుతుందని.. ఫలితంగా అనేక రుగ్మతలు వాటంతట అవే తగ్గిపోతాయని చెబుతున్నారు. గుర్రపు స్వారీకి అనువైన ప్రాంతంగా తీరం గుర్రపు స్వారీ అనేది సాహస క్రీడ. ప్రమాదాలకు ఎక్కువ అవకాశాలున్నాయి. అందుకే ఎలాంటి ప్రమాదాలు జరిగినా రైడర్‌కు ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. గట్టి నేలల్లో ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉండటంతో ఇసుల నేలల్లోనే నేర్పాల్సి ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా ఇసుకను తెచ్చి వేస్తుంటారు. అలాంటి పరిస్థితి లేకుండా తీర ప్రాంతాల్లో ఉన్న ఇసుక మేటలు గుర్రపు స్వారీలకు అనుకూలంగా ఉండటంతో కాకినాడ తీరం ప్రాంతంలో ఉన్న ఇసుక నేలల్లో గత నెల రోజులుగా గుర్రపు స్వారీ శిక్షణ ఇస్తున్నాము. రోజూ ఉదయం, సాయంత్రం రెండేసి గంటల చొప్పున నేర్పుతున్నాము. – కె.అనిల్‌రెడ్డి, గర్రపు స్వారీ శిక్షకుడు, కాకినాడ చాలా సరదాగా ఉంది.. మా నాన్న ఆడుకునేందుకు నాకు గుర్రపు బొమ్మ కొనిచ్చాడు. ఇది వద్దు.. నిజంగా గుర్రం మీద స్వారీ చేయాలని అడిగేవాడిని. అది ఇప్పుడు నిజమైంది. గుర్రంపై సవారీ చేయడం చాలా సరదాగా ఉంది. ముందు భయమేసినా రానురాను అలవాటైపోయింది. ఇప్పుడు ఏ భయం లేకుండా గుర్రంపై స్వారీ చేస్తున్నా. – ఆరుష్వర్మ, కాకినాడ చిన్ననాటి కల నేరవేరిందిలా.. ఎప్పటి నుంచో గుర్రపు స్వారీ చేయాలన్న కోరిక ఉండేది. శిక్షణ కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటి వరకూ కుదరలేదు. కాకినాడ తీరంలో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ఆ కోరిక ఇలా తీరింది. గుర్రపు స్వారీ చేయడం చాలా ఆనందంగా ఉంది. శిక్షణ పొందిన గుర్రాలు కావడంతో ఎలాంటి ప్రమాదం లేకుండా నేర్చుకుంటున్నాను. – అభిషేక్, కాకినాడ -
స్టార్ హీరోల ఇమేజ్ పెంచే అస్త్రంగా మారుతుందా..?
-
సీక్వెల్ కు జై కొడుతున్న స్టార్ హీరోలు..
-
ట్రెండ్ సెట్ చేసిన రామ్ చరణ్ పెంపుడు కుక్క రైమ్..
-
ఫొటో షూట్లకు యమా క్రేజ్!
సాక్షి, అమరావతి: ఒకప్పుడు పెళ్లి అంటే పందిళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడు ముళ్లు, ఏడు అడుగులతో పాటు రుచికరమైన భోజనం, గుర్తుంచుకునేలా కొన్ని ఫొటోలు. కానీ ఇప్పుడు వాటన్నింటితో పాటు కళ్లు చెదిరే లొకేషన్లలో ప్రీ, పోస్ట్ వెడ్డింగ్ షూట్లు కూడా కలిపితేనే ‘అసలైన పెళ్లి’ అని యువ జంటలు అంటున్నాయి. పెళ్లికి ముందు(ప్రీ వెడ్డింగ్), ఆ తర్వాత(పోస్ట్ వెడ్డింగ్) తీసే ఫొటోలు, వీడియోల కోసం ఎంత దూరమైనా, ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసే ఇదే క్రేజ్. ఇందులో కూడా ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తున్నారు. పెళ్లి అనే కాదు.. పుట్టినరోజుతో పాటు శుభకార్యక్రమం ఏదైనా సరే.. ఫొటో, వీడియో షూట్లకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందమైన ప్రాంతాలను ఎంపిక చేసుకుని.. ఫొటో షూట్లకు వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలోని సముద్ర తీరాలు, నదులు, రిసార్టులు, పార్కులు ప్రస్తుతం ఫొటో షూట్లతో కళకళలాడుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని లంబసింగి, అరకు, పాడేరు, చింతపల్లి, మారేడుమిల్లి, రంపచోడవరంతో పాటు నల్లమల, శేషాచలం అటవీ ప్రాంతాలు కూడా యువ జంటల ఫొటో షూట్లకు అడ్డాలుగా మారిపోయాయి. మరికొందరైతే ఈ షూట్ల కోసం ఫొటోగ్రాఫర్లను వెంటబెట్టుకొని దేశ, విదేశాలకు కూడా వెళ్లివస్తున్నారు. ట్రెండ్‌కు తగ్గట్లు సినీ పాటలకు స్టెప్పులు వేస్తూ.. తమ ప్రేమను, అనుబంధాన్ని వ్యక్తం చేసేలా ఫొటోలు తీయించుకుంటూ మురిసిపోతున్నారు. షూట్ల కోసం ప్రత్యేక స్టూడియోలు.. సినిమాలను తలపించేలా తీస్తున్న ఈ ఫొటో, వీడియో షూట్ల కోసం రాష్ట్రంలోని చాలా చోట్ల ప్రత్యేకంగా స్టూడియోలు కూడా ఏర్పాటయ్యాయి. వివిధ దేశాలు, రాష్ట్రాల్లోని అందమైన ప్రదేశాలు, భవనాలను పోలిన నిర్మాణాలను ఈ స్టూడియోల్లో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఈ స్టూడియోలు వెలిశాయంటే.. ఫొటో షూట్లకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల భీమవరంలో మూడు, పాలకొల్లులో రెండు, కాకినాడలో మూడు స్టూడియోలు ఏర్పాటయ్యాయి. ఇంకా పలు చోట్ల స్టూడియోలు నిర్మాణంలో ఉన్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లిలేని వారు.. ఈ స్టూడియోలకు వెళ్లి ఫొటోలు, వీడియోలు తీయించుకుంటున్నారు. ఖర్చుకు వెనుకాడడం లేదు.. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్లకు భారీ క్రేజ్ ఉంది. 90 శాతం జంటలు పెళ్లితో పాటు ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్లను కోరుకుంటున్నారు. ఇందుకోసం రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నారు. వారి ఆసక్తికి తగినట్లే అందమైన లొకేషన్లలో ఫొటోలు, వీడియోలు తీసి.. ట్రైలర్లు(చిన్న వీడియోలు)గా మార్చి.. శుభ కార్యక్రమానికి ముందే అందిస్తున్నాం. దీంతో వాటిని సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసి.. ఆహా్వనాలుగా ఉపయోగిస్తున్నారు. – షేక్ గౌస్‌బాషా, ఫొటోగ్రాఫర్ -
ఫలితాలు, ఆర్థిక గణాంకాలే దిక్సూచి
న్యూఢిల్లీ: ఈ వారం ప్రధానంగా ఐటీ దిగ్గజాల క్యూ3(అక్టోబర్– డిసెంబర్) ఫలితాలు ఈక్విటీ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీటితోపాటు ఆర్థిక గణాంకాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసిక(క్యూ3) ఫలితాల సీజన్ ఈ నెల 9నుంచి ప్రారంభంకానుంది. గత వారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అత్యధిక శాతం నికర అమ్మకందారులుగా నిలిచిన నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు వెనకడుగు వేశాయి. దీంతో విదేశీ పెట్టుడి పరిస్థితులు కీలకంగా నిలవనున్నట్లు నిపుణులు తెలియజేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సైతం నేడు(సోమవారం) సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఈ ఏడాది క్యూ3 ఫలితాలు విడుదల చేయనుంది. ఈ బాటలో ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 12న, విప్రో 13న క్యూ3 పనితీరును ప్రకటించనున్నాయి. ఇక బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ 14న ఆర్థిక ఫలితాలు వెల్లడించనుంది. ఇక మరోవైపు ప్రభుత్వం 12న నవంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు విడుదల చేయనుంది. ఇదే రోజు డిసెంబర్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) వివరాలు సైతం ప్రకటించనుంది. వెరసి ఈ వారం పలు అంశాలు దేశీ స్టాక్ మార్కెట్ల నడకను ప్రభావితం చేయనున్నట్లు పలువురు నిపుణులు తెలియజేశారు. ఇతర అంశాలకూ ప్రాధాన్యం ఈ వారం యూఎస్, చైనా ద్రవ్యోల్బణ గణాంకాలు సైతం ఈ నెల 12నే విడుదలకానున్నాయి. రష్యా– ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇవికాకుండా ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు నిపుణులు ప్రస్తావించారు. గత వారం విడుదలైన మినిట్స్ ప్రకారం యూఎస్ ఫెడ్ 2023లోనూ వడ్డీ రేట్ల పెంపువైపు మొగ్గు చూపనున్నట్లు వెల్లడికావడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కొంతమేర బలహీనపడ్డాయి. దేశీయంగా సెన్సెక్స్ 940 పాయింట్లు(1.55 శాతం), నిఫ్టీ 246 పాయింట్లు(1.4 శాతం) చొప్పున క్షీణించాయి. ఇక డాలరుతో మారకంలో రూపాయి సైతం 82–83 మధ్య కదులుతోంది. వెరసి ఈ వారం ఇన్వెస్టర్లు పలు అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఎఫ్‌పీఐల వెనకడుగు గత వారం దేశీ స్టాక్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అత్యధిక శాతం అమ్మకాలకే మొగ్గు చూపారు. దీంతో కొత్త కేలండర్ ఏడాది(2023) తొలి వారంలో నికర అమ్మకందారులుగా నిలిచారు. ఈ నెల 2–6 మధ్య ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 5,872 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. పలు దేశాలలో మరోసారి కోవిడ్–19 సమస్య తలెత్తడం, ఫెడ్ వడ్డీ పెంపు, రష్యా– ఉక్రెయిన్ మధ్య యుద్ధ భయాలు వంటి అంశాలు ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. యూఎస్‌లో ఈ ఏడాది ఆర్థిక మాంద్యం ఏర్పడనున్న అంచనాలు సైతం ఆందోళనలు పెంచుతున్నట్లు తెలియజేశారు. ఇకపై క్యూ3 ఫలితాలు, ద్రవ్యోల్బణం, జీడీపీ గణాంకాలు వంటి అంశాలు విదేశీ పెట్టుబడులను ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు వివరించారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం నిజానికి గత 11 ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 14,300 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. అయితే డిసెంబర్ నెలలో నికరంగా రూ. 11,119 కోట్లు ఇన్వెస్ట్ చేయగా.. నవంబర్‌లో రూ. 36,239 కోట్ల విలువైన స్టాక్స్ జత చేసుకోవడం గమనార్హం! పూర్తి ఏడాది(2022)లో మాత్రం దేశీ ఈక్విటీల నుంచి నికరంగా రూ. 1.21 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు మూడేళ్లుగా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చిన ఎఫ్‌పీఐలు పలు ప్రపంచవ్యాప్త ప్రతికూలతల నడుమ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. -
టాలీవుడ్ లో మల్టీస్టారర్ హవా
-
ట్విట్టర్ లో వైఎస్ జగన్ బర్త్ డే ట్రెండింగ్
-
RIPTwitter: సర్వనాశనం చేస్తున్నాడే!
ఈ భూమ్మీ ఏం జరిగినా.. పరిణామం ఎలాంటిదైనా సరే జెట్ స్పీడ్‌తో వైరల్ అయ్యే ప్లాట్‌ఫారమ్ అది. అంతేకాదు.. ట్రెండింగ్ పేరిట విషయాలన్నింటిని మామూలు యూజర్లకు కూడా అర్థం అయ్యే రీతిలో చెప్పే మాధ్యమం. అలాంటి వేదిక ఇప్పుడు సర్వనాశనం అవుతోందని.. అందుకు ప్రపంచంలో అత్యంత ధనికుడు ఎలన్ మస్క్ కారణం అయ్యాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే రిప్ ట్విటర్ ట్రెండ్ పుట్టుకొచ్చింది. #RIPTwitter.. అదే ట్విటర్లో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్. అదీ అలా ఇలా కాదు.. వెల్లువలా పోస్టులు పడుతూనే ఉన్నాయి. సంస్థను వీడుతున్న ట్విటర్ ఉద్యోగులే ఈ ట్రెండ్‌ను తీసుకొచ్చారు. ట్విటర్ కొత్త బాస్ తీరు.. పని షరతులు, కొత్త పరిస్థితులను భరించలేక ఉద్యోగులు సంస్థకు గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ట్రెండ్ తెరపైకి వచ్చింది. Twitter 2.0కు సంసిద్ధం కావాలని మస్క్ ఇచ్చిన పిలుపునకు స్పందన.. రాజీనామాల రూపంలో వస్తోంది. గురువారం సాయంత్రం మొదలైన ఈ పర్వం.. ఇంకా కొనసాగుతూనే వస్తోంది. #LoveWhereYouWorked, #ElonIsDestroyingTwitter అంటూ ట్యాగ్‌తో తమ నిరసన తెలియజేస్తున్నారు ఉద్యోగులు(మాజీలు). Ex-Twitter employees pitching investors next week. #RIPTwitter pic.twitter.com/aQe1Zpl2GT — Pete Haas (@dimeford) November 18, 2022 It’s been a pleasure tweeting with y’all for the past 13 years. #RIPTwitter pic.twitter.com/XsLuMNi59A — toby is the scranton strangler (@OhHELLNawl) November 18, 2022 ప్రముఖుల దగ్గరి నుంచి సామాన్య యూజర్ల దాకా డిగ్నిటీ ప్లాట్‌ఫామ్‌గా ట్విటర్‌ను ఉపయోగించుకుంటున్నారు. అయితే.. ఎప్పుడైతే ట్విటర్పిట్ట ఎలన్ మస్క్ చేత చిక్కిందో.. అప్పటి నుంచి దాని అంతం మొదలయ్యిందనే చర్చ జోరందుకుంది. ఆర్థిక నష్టం తప్పించుకునేందుకు సంస్కరణల పేరిట తీసుకుంటున్న నిర్ణయాలు, ఉద్యోగుల కోత, అదనపు ఆదాయం పెంచుకునే కొన్ని నిర్ణయాలు.. ఇలా ప్రతీదానిపైనా చర్చ(ప్రతికూల) జోరందుకుంది. ఫేక్ అకౌంట్ల కట్టడి.. ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కించడం కోసమే తాను కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందని మస్క్ చేస్తున్న ప్రకటనలను.. యూజర్లు, ట్విటర్లో పని చేస్తున్న ఉద్యోగులు అంగీకరించని స్థితికి చేరుకున్నారు. ఈ క్రమంలో చాలామంది యూజర్లు ట్విటర్‌కు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుండడం కొసమెరుపు. మరోవైపు ఈపాటికే సగం మందిని తప్పించిన ఎలన్ మస్క్.. ఈ రాజీనామాలతో మరో పాతిక శాతం ఉద్యోగుల భారాన్ని వదిలించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ట్విటర్లో మిగిలిన 25 శాతం మంది ఉద్యోగ వీసాలపై ఉండే అవకాశం ఉంది కాబట్టి కొత్త ఉపాధిని కనుగొనడం కష్టమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Ugh, end of an era. #RIPTwitter pic.twitter.com/aL3AQuoexO — Ju✨ (@_psiloveju) November 18, 2022 Every Twitter user right now after Elon Musk (predictively) ruined the site... Incase this is the end, goodbye Twitter... #RIPTwitter pic.twitter.com/HP1bxf68Ri — SpectreSaunders (@SpectreSaunders) November 18, 2022 Lets put this into perspective — at the beginning of this month, Twitter had 7,400 employees. Barely half way through the month, if 75% do actually stick to their decision today, the company will have shrunk by a whopping ~88%. — Kylie Robison (@kyliebytes) November 18, 2022 Twitter offices rn #RIPTwitter pic.twitter.com/ATEhUbPNmL — Alex (@alexculee) November 18, 2022 NGL I love twitter employees 😭😭😭 they roasting this fool #RIPTwitter pic.twitter.com/nOEuSxtHcv — 𝒮𝒸🅾☯️ter🐐 (@IanScottie4) November 18, 2022 #RIPTwitter, #GoodbyeTwitter ట్రెండింగ్‌లో భాగంగా.. కొందరి భయాందోళనలు, మరికొందరి గందరగోళం, ఇంకొందరి హాస్యం.. ఇలా రకరకాల భావాలు ట్విట్టర్‌ను తాకుతున్నాయి. ఈ ట్రెండ్‌కు ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ సైతం స్పందించడం గమనార్హం. ‘అది మునిగిపోనివ్వండి…’ అంటూనే.. ట్విట్టర్ వినియోగంలో మరో ఆల్-టైమ్ హై రికార్డును సృష్టించినట్లు ట్వీట్ చేశాడు. ఈ విషయంలో తాను మొండిగా ఉన్నట్లు మరోసారి స్పష్టం చేశాడు. pic.twitter.com/rbwbsLA1ZG — Elon Musk (@elonmusk) November 18, 2022 -
ట్రెండ్ మారింది గురూ..ఉద్యోగం వద్దు మహాప్రభో..కారణం అదేనా!
నెలంతా పనిచేసి ఒక రోజు జీతం తీసుకోవడం పాత తరం మాట. రోజూ పనిచేయడం, వ్యాపారాల్లో రాణించడం నేటి మాట. డిగ్రీలు చేతపట్టుకొని ఉద్యోగాల కోసం వేల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్‌లు తీసుకోవడం, చివరకు ఉద్యోగాలకు ఎంపిక కాక నిరాశ పడడం వంటి రోజులకు కాలం చెల్లింది. చదువు పూర్తి చేసుకున్న నేటి యువత తమ కాళ్ల మీద నిలబడే మనస్త్వత్వం పెరిగింది. ట్రెండ్ మారిందండోయ్ నేటి యువత.. ఒకరి మీద ఆధార పడటం, ఒకరి కింద పనిచేయడం కాకుండా సొంతంగా వ్యాపారం చేసుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. ఎంతో మంది యువత వ్యాపారంలో విజయవంతంగా రాణిస్తున్నారు. పిల్లల ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. వ్యాపారాల్లో రాణించాలనుకుంటున్న యువతకు ప్రభుత్వం పరిశ్రమల శాఖ నుంచి ప్రోత్సహం అందిస్తోంది. మరోవైపు బ్యాంకుల ఆర్థిక సహాయం వల్ల వ్యక్తిగతంగా జీవితంలో రాణిస్తున్నారు. 35 ఏళ్లకే స్థిరపడేందుకు ప్రణాళిక ఏళ్ల తరబడి ఉద్యోగాల్లో పనిచేసే రోజులు పోయాయి.సాధారణ డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు 21 సంవత్సరాలకు పూర్తి చేసుకుంటున్న యువత ఆ వెంటనే స్థిర పడేందుకు ప్రణాళిక రూపొందించుకుంటోంది. ఏళ్ల తరబడి పోటీ పరీక్షల పేరుతో సమయాన్ని వృథా చేయకుండా మార్కెట్ ట్రెండ్లను గుర్తించి వ్యాపారంలో రాణిస్తున్నారు. ప్రస్తుతం ఇదే ఒరవడి కనిపిస్తోంది. వ్యాపారంలోకి 25 ఏళ్లకే వచ్చి, 35 ఏళ్లకే ఆర్థికంగా స్థిరపడాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఆర్థికంగా ఎదిగిన యువ వ్యాపారులు బిట్ కాయిన్, స్టాక్ మార్కెట్, షేర్స్, మ్యూచివల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. యువతలో వస్తున్న ఈ మార్పునకు తల్లిదండ్రులు, బంధువులు సైతం వెన్ను దన్నుగా నిలుస్తున్నారు. వారి ఆలోచనలను గౌరవిస్తున్నారు. చేదోడు వాదోడుగా ఉంటున్నారు. చదవండి: ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. వాళ్లకి ప్రభుత్వం నుంచి ప్రతి నెలా పెన్షన్! -
ఆళ్ల సినిమాలు చూడొద్దంతే.. ఇప్పుడిదే నడుస్తోంది!
బాలీవుడ్లో బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాను బాయ్‌కాట్ చేయాలని గత కొద్ది రోజులుగా ట్విటర్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా ఫ్లాప్ కావడానికి ఇది కూడా ఒక కారణమన్న వాదన అప్పుడే మొదలైంది. ఆమిర్.. ట్రోలింగ్ గతంలో పీకే సినిమాలో ఇతర గ్రహం నుంచి భూమికి వచ్చిన పాత్రలో ఆమిర్ నట్టించారు. కళ్లను పెద్దవిగా చేసి, వెడల్పాటి చెవులతో చిత్రమైన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజా సినిమాలోనూ ఇలాగే నటించారని కొందరు విమర్శిస్తుంటే.. సిక్కులను చిత్రీకరించిన తీరు బాలేదంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమిర్‌ను హిందు వ్యతిరేకిగా పేర్కొంటూ #BoycottLaalSinghChaddha హ్యాష్‌టాగ్‌తో ట్విటర్లో నెటిజనులు ట్రోల్ చేశారు. భారత సైన్యాన్ని అగౌరవపరిచారని మరి కొందరు అలిగారు. తన చిత్రాన్ని బహిష్కరించవద్దని ఆమిర్ ఖాన్ పబ్లిగ్గా కన్నీళ్లు పెట్టుకున్నా నిరసనకారులు శాంతించలేదు. అయితే బాయ్‌కాట్ బాలీవుడ్‌కు కొత్తేమి కాదు. గతంలోనూ, ఇప్పుడు కూడా పలు చిత్రాలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాయి. గతంలో ఆమిర్‌ఖాన్ దంగల్, దీపికా పదుకోన్ పద్మావత్ సినిమాల విడుదల సమయంలోనూ ఇలాంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఈ రెండు సినిమా ఘన విజయం సాధించడం విశేషం. అక్షయ్‌కు తప్పని తలనొప్పి ఇక లాల్ సింగ్ చద్దాతో పాటే విడుదలైన అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్' సినిమా కూడా బహిష్కరణాస్త్రాన్ని ఎదుర్కొంది. ఈ సినిమా రచయిత్రి కనికా ధిల్లాన్ గతంలో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో #BoycottRakshaBandhanMovie హ్యాష్‌టాగ్‌తో ట్విటర్లో ప్రచారం చేశారు. అయితే వివాదస్పద ట్వీట్లను తొలగించి నిరసనకారులను చల్లబరిచే ప్రయత్నం చేశారు కనికా ధిల్లాన్. సినిమాలు చూడొద్దంటూ ప్రచారం చేయడం సమంజసం కాదని హీరో అక్షయ్ కుమార్ కూడా విన్నవించుకున్నాడు. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. తాప్సి సినిమా చూడొద్దు అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన దొబారా మూవీని చూడొద్దంటూ సోషల్ మీడియాలో ప్రచారం షురూ అయింది. అనురాగ్, తాప్సి తీరు నచ్చని సంప్రదాయవాదులు ట్విటర్లో వారికి వ్యతిరేకంగా #CancelDobaaraa హ్యాష్‌టాగ్‌తో ట్రోలింగ్ చేస్తున్నారు. ఆగస్టు 19న విడుదలవుతున్న ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలని ట్విటర్ వేదికగా పిలుపునిస్తున్నారు. బాయ్‌కాట్ ప్రచారాన్ని అనురాగ్, తాప్సి చాలా తేలిగ్గా తీసుకున్నారు. (క్లిక్: 'పోకిరి' స్పెషల్ షో.. దిమ్మతిరిగే కలెక్షన్స్ వసూలు) ఒటీటీలనూ వదలడం లేదు అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన డార్లింగ్స్ సినిమా ఆగస్టు 5న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సినిమా కూడా బాయ్‌కాట్ ప్రచారాన్ని ఎదుర్కొంది. #BoycottAliaBhatt హ్యాష్‌టాగ్‌తో అలియా భట్‌పై అక్కసు వెళ్లగక్కారు కొంతమంది. పురుషులను కించేపరిచేలా సినిమా తీసిన అలియా భట్ని అందరూ బహిష్కరించాలని పిలుపునిచ్చారు. పురుషులపై గృహ హింస అనేది బాలీవుడ్‌కు నవ్వులాటగా ఉందని ఫైర్ అవుతున్నారు. గౌరీ ఖాన్, గౌరవ్ వర్మతో కలసి అలియా భట్ నిర్మించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రారంభ వారాంతంలోనే 10 మిలియన్లపైగా వాచ్ అవర్స్ నమోదు చేసి దూసుకుపోతోంది. (క్లిక్: ట్విటర్లో తెగ ట్రెండ్ అవుతున్న దిల్‌రాజు.. కారణమిదే!) `బ్రహ్మాస్త్ర`పై నిషేధాస్త్రం రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటిస్తున్న `బ్రహ్మాస్త్ర` మూవీ ట్రైలర్ అలా రిలీజైందో లేదో వెంటనే బాయ్కాటర్లు రెడీ అయిపోయారు. #BycottBrahmastra ట్యాగ్‌తో వ్యతిరేక ప్రచారం మొదలెట్టేశారు. హీరో రణబీర్ కపూర్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని ట్విటర్ వేదికగా ఏకీపారేశారు. కాగా, ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో కనిపించనున్నారు. (క్లిక్: ‘సీతారామం’ నేను చేయాల్సింది.. నాగార్జున) -
ఈవెంట్ ఎంతో ఈజీ.. వేడుక ఏదైనా మేనేజ్ చేస్తారు
కల్చర్ మారిపోతోంది. ప్రజల ఆలోచనా విధానం కొత్తదనాన్ని కోరుకుంటోంది. రెడీమేడ్ను ఎక్కువగా ఇష్టపడుతోంది. ఒకప్పుడు పెళ్లి కోసం నెలల తరబడి కసరత్తు జరిగేది. ఊరూవాడా కలిసి వివాహ వేడుకల్లో పాలుపంచుకునేది. కానీ రోజులు మారాయి. పెళ్లిళ్లు, పుట్టిన రోజు తదితర వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తమకు నచ్చిన విధంగా వీటిని నిర్వహించే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. డబ్బు చెల్లించే స్తోమత ఉంటే చాలు.. ఒక్క ఫోన్ కాల్‌తో పిసరంత కష్టం లేకుండా కావలసినవన్నీ స్మార్ట్‌గా సిద్ధమైపోతున్నాయి. ఇక ఏర్పాట్ల హడావుడి లేకపోవడంతో కుటుంబం అంతా సంతోషంలో హైలెస్సా అంటూ ఎంజాయ్ చేస్తోంది. అదరహో అనిపించేలా.. కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల ధగధగలతో కల్యాణ వేదికలు కనువిందు చేస్తాయి. స్వర్గలోకాన్ని తలపించే స్వాగత ద్వారాలు అలరిస్తాయి. అక్కడ మంచు, వర్షం కురుస్తున్న అనుభూతి కలిగించే భారీ సెట్లు, ఫైర్ షాట్లు అబ్బుర పరుస్తాయి. విందారగించేందుకు లెక్కకు మిక్కిలి రుచులు కళ్లెదుట ప్రత్యక్షమవుతాయి. నిశ్చితార్థం, మెహందీ, సంగీత్, హల్దీ, వివాహం, రిసెప్షన్ తదితర వేడుకలతో పాటు ఫొటో షూట్లు, వధూవరుల ఊరేగింపు వంటి ఏర్పాట్లన్నీ ఈవెంట్ మేనేజ్మెంట్లే సమకూరుస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇక ఫంక్షన్‌కు వచ్చే వారికి వినోదాన్ని పంచడానికి ప్రత్యేకంగా ఉర్రూతలూగించే డ్యాన్స్ కార్యక్రమాలు, లైవ్ మ్యూజిక్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్‌లు ఉంటాయి. వచ్చిన వారిలో ఉత్తేజాన్ని నింపేందుకు హుషారైన యాంకర్లు ఉంటారు. ఇంకా పెళ్లి పందిళ్లు, పురోహితులను సమకూర్చే బాధ్యతలను తీసుకునే ఈవెంట్ మేనేజ్మెంట్లూ ఉన్నాయి. విజయవాడ నగర పరిధిలో వందకు పైగా ఈవెంట్ మేనేజిమెంట్ సంస్థలున్నాయి. వీటిలో 50 వరకు నాణ్యమైన, పది అత్యంత నాణ్యమైన ప్రమాణాలు పాటిస్తున్నవిగా గుర్తింపు పొందాయి. రోబో సర్వింగ్.. చీర్ గాళ్స్ హంగామా.. పెళ్లిళ్లకు వచ్చిన వారికి రోబోలతో స్వాగతం పలకడం, సర్వింగ్ చేసే సరికొత్త ట్రెండ్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. మరికొందరు మరో అడుగు ముందుకేసి రష్యాకు చెందిన చీర్ గాళ్స్ (నలుగురైదుగురుండే బృందం)ను రప్పించి వారితో వయ్యారాలొలికిస్తూ ఆనందాన్ని పంచుతున్నారు. స్వాగత ద్వారాల వద్ద వీరిని ప్రత్యేక ఆకర్షణగా ఉంచుతున్నారు. రోబోలు, చీర్ గాళ్స్ సంస్కృతి హైదరాబాద్‌లో ఇప్పటికే ఉంది. ఇటీవల కొంతమంది స్థితిమంతులు విజయవాడలోనూ ఈ సంస్కృతికి ఆకర్షితులవుతున్నారు. రోబోకు రూ.50–60 వేలు, చీర్ గాళ్స్‌కు రూ.50–70 వేల వరకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు వసూలు చేస్తున్నాయి. సరికొత్తగా కొన్ని వివాహాల్లో కేరళ డ్రమ్స్, పంజాబీ డోలు వాయిద్యాలను ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేస్తున్నారు. రూ.లక్షల్లో ప్యాకేజీలు.. ► పిండి కొద్దీ రొట్టె అన్నట్టు ఎవరి స్థాయిని బట్టి వారు వివాహ వేడుకలకు ఖర్చు చేస్తున్నారు. కొంతమంది ఖర్చు ఎంత అన్నది కాదు.. పెళ్లి ఎంత ఘనంగా చేశామా? అన్నదే ముఖ్యమని ఆలోచిస్తున్నారు. వివాహ వేడుకలకు ఎంత వెచ్చిస్తే అంత స్టేటస్ సింబల్‌గా భావిస్తున్న వారూ ఉన్నారు. ► దీంతో ఈవెంట్ మేనేజర్లు విందు భోజనాలు, కల్యాణ మండపాల డెకరేషన్, విద్యుదలంకరణ, ఫొటో, వీడియో షూట్లు, డ్యాన్స్ కార్యక్రమాలు, లైవ్ మ్యూజిక్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్‌లు వంటి వాటికి వేర్వేరు ధరలు నిర్ణయిస్తున్నారు. అన్నీ కలిపి ఓ ప్యాకేజీగాను, అలాకాకుండా వేర్వేరు ప్యాకేజీలుగాను వెసులుబాటు కల్పిస్తున్నారు. ► డెకరేషన్‌కు కనీసం రూ.లక్ష నుంచి ఏడెనిమిది లక్షలు, ఫొటోగ్రఫీ/ఫొటో షూట్లకు రూ.70 వేల నుంచి రూ.5–6 లక్షలు, విందు భోజనాలకు రూ.లక్ష నుంచి రూ.5–6 లక్షలు చొప్పున వసూలు చేస్తున్నారు. ► విజయవాడలో కొంతమంది స్థితిమంతులు వివాహ వేడుకలకు రూ.30 లక్షలు వెచ్చిస్తున్న వారూ ఉన్నారు. ► మునుపటికి భిన్నంగా ఇటీవల పలువురు డెకరేషన్ కంటే ఎంటర్టైన్మెంట్కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని విజయవాడలోని అమ్మ ఈవెంట్స్ నిర్వాహకుడు అనిల్‌కుమార్ ‘సాక్షి’కి చెప్పారు. కావాల్సిన విధంగా.. నా వివాహం ఇటీవల విజయవాడలో జరిగింది. రిసెప్షన్ ఘనంగా చేసుకోవాలనుకున్నాను. స్నేహితుల సాయంతో నగరంలో పేరున్న ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలను సంప్రదించాను. చివరకు ఓ ఈవెంట్ సంస్థకు అప్పగించాను. మాకు రిసెప్షన్‌కు ఏం కావాలో, ఎలాంటి డెకరేషన్ అవసరమో వాళ్లకు చెప్పాం. మా అభిరుచులకు అనుగుణంగా అన్నీ వారే సమకూర్చారు. డెకరేషన్ వగైరాలు కనుల పండువగా ఏర్పాటు చేశారు. అందువల్ల రిసెప్షన్ ఎలా జరుగుతుందా? అన్న ఆలోచనే లేకుండా పోయింది. ఈ రోజుల్లో ఈవెంట్ మేనేజ్మెంట్లు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. – విజయసాయి, విజయవాడ ట్రెండ్ మారుతోంది.. వివాహ వేడుకల ట్రెండ్ మారుతోంది. గతంలో మాదిరిగా అనవసర ఖర్చులు తగ్గించి ఎంటర్టైన్మెంట్కు ప్రాధాన్యత పెరిగింది. వెరైటీ వంటకాలు, వినూత్న హంగామాలు, లైవ్ మ్యూజిక్‌లు వంటి వాటిపై ఆసక్తి పెంచుకుంటున్నారు. వేడుక సమ్‌థింగ్ స్పెషల్‌గా, స్టేటస్ సింబల్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. కొందరు రోబోలు, చీర్ గాళ్స్ సందడితో పెళ్లిళ్లను నిర్వహిస్తున్నారు. వారి టేస్ట్‌కు అనుగుణంగా సంస్థలు అన్నీ సమకూరుస్తున్నాయి. – విజ్జు విన్నకోట, సెలబ్రిటీ ఈవెంట్స్, విజయవాడ -
ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? గొంతు కోసే పరిస్థితి ఎందుకు?
కొన్ని పద్ధతులు మారాలేమో. నిశ్చయ తాంబూలాల సమయంలో పెద్దల సమక్షంలో ‘ఈ పెళ్లి నీకు ఇష్టమేనా?’ అని అడగాలేమో. వధువు, వరుడికి అక్కడ ఒక ఆప్షన్ దొరుకుతుంది. శుభలేఖలు వేసే ముందైనా ‘ఈ పెళ్లి నిజంగానే నీకు ఇష్టం కదా’ అని మళ్లీ తప్పక అడగాలి. ఏమంటే పిల్లల మనసులు పెద్దలు ఊహించినట్టుగా లేవు. పెద్దలు తమ ఆకాంక్షలకు తగినట్టుగా ఉండమని కోరగలరేగాని బలవంతం చేయలేరు. ఇష్టం లేని పెళ్లి నిశ్చయం అయ్యిందని వరుడి గొంతు కోసే నిస్సహాయ స్థితికి వధువు చేరిందంటే ఆమె నోరు తెరిచి చెప్పేపరిస్థితి లేదనా? చెప్పినా వినే దిక్కు లేదనా?పెళ్లికి ‘నో’ అంటే ‘నో’ అనే అర్థం చేసుకోక తప్పదు. ఒక అవగాహన. పెద్దలు కుదిర్చిన పెళ్లి’ అనే మాట మనకు సర్వసాధారణం. మన దేశంలో పెద్దలు కుదిర్చిన పెళ్లికే ప్రథమ మర్యాద, గౌరవం, అంగీకారం. పెద్దలు కుదిర్చాక ఇక ఏ సమస్యా ఉండదు బంధువులకు, అయినవారికి, స్నేహితులకు, సమాజానికి. కాని ఆ కుదిర్చిన పెళ్లిలో వధువుకు వరుడో... వరుడికి వధువో నచ్చకపోతే? జీవితాంతం అది సమస్య కదా. దానిని మొదట ఇప్పుడు చర్చించాలి. తాజా సంఘటన: మెడ కోసిన వధువు అనకాపల్లిలో పుష్ప అనే అమ్మాయికి రామునాయుడు అనే అబ్బాయితో పెళ్లి నిశ్చయం అయ్యింది. మే 20న పెళ్లి. కాని అమ్మాయికి ఆ పెళ్లి ఇష్టం లేదు. దాంతో అబ్బాయి ప్రాణం తీస్తే ఈ పెళ్లి బాధ తప్పుతుందని వెర్రి ఆలోచన చేసింది. అబ్బాయిని ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లి సర్ప్రైయిజ్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి కళ్లకు తన చున్నీ కట్టి, వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసింది. కాని అబ్బాయి బతికాడు. అమ్మాయి తనను తాను ఏమైనా చేసుకునేదేమో తెలియదు. పోలీసులు ప్రాథమిక విచారణ చేసి ఆ అమ్మాయి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలని అనుకుంటోందని చెప్పారు. మరి తల్లిదండ్రులకు ఈ సంగతి చెప్పిందో లేదో తెలియాలి. వాళ్లు ఆ అమ్మాయిని పెళ్లి ఇష్టమో లేదోనని అడిగారో లేదో తెలియదు. అనవసరంగా ఇంత ప్రమాదం వచ్చి పడింది. పెళ్లి ఎందుకు? అబ్బాయి, అమ్మాయి కలిసి జీవించడానికి. ఫలానా అమ్మాయిని చూసొచ్చాం చేసుకో అంటే ముఖం కూడా చూడకుండా చేసుకున్న రోజులు ఉన్నాయి. నామమాత్రంగా పెళ్లి చూపుల్లో చూసుకుని చేసుకున్న రోజులు ఉన్నాయి. కాని ఇవాళ అలా లేదు. అమ్మాయి, అబ్బాయి చాలా విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు. వారి భవిష్యత్తు గురించి వారికి ఏవో నిర్ణయాలు ఉంటాయి. లేదా ఇష్టాలు ఉంటాయి. లేదా ఏదైనా ప్రేమ ఉండొచ్చు. ఇవన్నీ లేకపోయినా కేవలం తెచ్చిన సంబంధం నచ్చకపోవచ్చు. ‘ఆ సంబంధానికి ఏమైంది... మంచి సంబంధం’ అని తల్లిదండ్రులు అబ్బాయినిగాని, అమ్మాయినిగాని ఒప్పించి, సర్దిపుచ్చి, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి, బలవంతం చేసి పెళ్లి చేయదలిస్తే, దాని నుంచి బయటకు పోలేము... పూర్తిగా చిక్కిపోయాము అని వధువుగాని, వరుడుగాని అనుకుంటే వారికి ఒక ఆప్షన్ కుటుంబం నుంచి సమాజం నుంచి ఏమైనా ఉందా? నిశ్చితార్థంలో పెద్దల సమక్షంలో... పెళ్లిలో నిశ్చితార్థం ప్రధానం. ఆ సమయంలో పెద్దలు ఉంటారు. తల్లిదండ్రుల పిల్లల మంచికేనని విశ్వసించి పిల్లల బాగుకోసమేనని ఆ నిశ్చితార్థం జరుపుతున్నా... వారికి గట్టి వ్యతిరేకత ఉంటే అది చెప్పుకునే వీలు నిశ్చితార్థానికి ముందు వధువుకు, వరుడికి ఇవ్వొచ్చేమో ఆలోచించాలి. పెద్దల సమక్షంలో ‘ఈ పెళ్లి నీకు ఇష్టమేనా’ అని వధువును, వరుణ్ణి అడిగి వారి భావాలు చదివి, అంగీకారం తెలుసుకుని ముందుకుపోవడం లో తప్పు ఏముంది? తల్లిదండ్రులు పెడుతున్న ఇబ్బంది ఆ సందర్భంలో పెద్దలకు చెప్పుకునే చాన్స్ ఇవ్వొచ్చు కదా. భవిష్యత్తు ప్రమాదం నివారించిన వాళ్లం అవుతాము. లేదా శుభలేఖలు వేసే ముందు తల్లిదండ్రులే తమ అనుమానాలు పోయేలా ‘ఈ పెళ్లి నిజంగా నీకు ఇష్టమేనా?’ అని పిల్లల మేలు కాంక్షించి అడగాలి. వారి సంతోషం కోసమే కదా తల్లిదండ్రులు జీవించేది. వారి సంతోషాన్ని పూర్తిగా కాకపోయినా ఏదో ఒక మేర అంగీకారం వచ్చే సంబంధం కుదిరేవరకు ఆగడంలో మేలే తప్ప కీడు లేదు. గుసగుసలు వద్దు బంధువులకు, స్నేహితులకు అన్నీ తెలుస్తాయి. ఫలానా ఇంట్లో ఇష్టం లేని పెళ్లి జరుగుతున్నదని కచ్చితంగా తెలుస్తుంది. ఆ సందర్భంలో పిల్లలు, తల్లిదండ్రులు ఒకరికి ఒకరు శత్రువులు కాదు. కాని ఇష్టాలను గౌరవించడం లేదంతే. ఈ విషయం తెలిసినప్పుడు బంధువులు, స్నేహితులు మనకెందుకులే అని ఊరుకోకూడదు. గుసగుసలు పోవద్దు. ఆ తల్లిదండ్రులకు లేదా పిల్లలకు ఏ మేరకు నచ్చచెప్పగలరో చూడాలి. కుదర్దు అని అమ్మాయి, అబ్బాయి గట్టిగా చెప్తే కచ్చితంగా వారి నిర్ణయాన్ని గౌరవించాలి. పెళ్లి విషయంలో పిల్లలతో సంపూర్ణంగా చర్చించే సన్నిహితత్వం తల్లిదండ్రులకు ఉండాలి. అది ప్రధానం. వారితో మాట్లాడండి. వారు చెప్పేది వినండి. అలాగే అబ్బాయిలూ అమ్మాయిలూ మీరేం అనుకుంటున్నారో మనసు విప్పి తల్లిదండ్రులకు చెప్పండి. వివరించండి. లేదా ఒక తెల్లకాగితం మీద రాసి అందజేయండి. అంతేగాని నచ్చని పెళ్లి విషయంలో తీవ్ర నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. అందరూ అందమైన వైవాహిక జీవితం నిర్మించుకోవాలని కోరుకుందాం. పెళ్లిపీటల మీద అడగలేము... కానీ... చాలా సినిమాలలో పెళ్లి జరిగే ఉత్కంఠ సన్నివేశాలుంటాయి. అబ్బాయికో అమ్మాయికో పెళ్లి ఇష్టం ఉండదు. కాని ఈ పెళ్లి నాకు వద్దు అని చెప్పే ఆప్షన్ ఉండదు. నాటకీయంగా అరిచి చెప్పడమో, ఆత్మహత్య చేసుకోవడమో తప్ప. ఇదే పెళ్లి రిజిస్టార్ ఆఫీసులో జరగాలంటే ముందు నోటీసు పెడతారు, అభ్యంతరాలు తెలపమంటారు, తర్వాత సంతకాలు చేసే ముందు పెళ్లి ఇష్టమేనా అని అడుగుతారు. ఈ ఆప్షన్ వివాహంలో ఏదో ఒక స్థానంలో ఎందుకు ఉండకూడదు? కాలానికి తగిన ఒక చిన్న ప్రజాస్వామిక ఆప్షన్ ఇవ్వొచ్చా? -
జంతు చర్మాలు ఒలిచి అలంకారం.. ఇదిగో సమాధానం!
‘జంతు చర్మాలు ఒలిచి మనకెందుకు అలంకారం?!’ అంటున్న నవసమాజానికి ‘వీగన్ ఫ్యాషన్’ సమాధానంగా వచ్చేసింది. దీనిలో భాగంగా జంతువుల చర్మంతో కాకుండా మొక్కలు, పండ్ల నుంచి తీసిన గుజ్జుతో బ్యాగ్స్, షూస్, వాలెట్స్, బెల్ట్స్.. తయారు చేస్తున్నారు. డ్రెస్సులను రూపొందిస్తున్నారు. ఈ యేడాది సరికొత్త నిర్ణయంతో వీగన్ వైపు దృష్టి మరల్చి మన ముందుకు వచ్చిన సరికొత్త ఫ్యాషన్ ఇది.. సాధారణంగా జంతుజాలాన్ని చంపి, వాటి చర్మంతో తయారుచేసిన బ్యాగులు, షూస్, బెల్ట్‌ల రూపేనా మార్కెట్లో విరివిగా వస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు హక్కుల కార్యకర్తలు ఈ విధానం పట్ల ఏ మాత్రం సంతోషంగా లేరు. హింస ఒక్కటే కాదు, తోలు యాక్ససరీస్ ఉత్పత్తుల తయారీలో వెలువడే హానికారకాలు పర్యావరణానికి హాని చేస్తాయని, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను కనుకోవాల్సిందే అనే వాదనలూ పెరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచ దృష్టి వీగన్వైపు మళ్లింది. గ్రేప్ లెదర్ స్నికర్స్ తోలు ఉత్పత్తులతో కాకుండా పర్యావరణానికి హానికరం కాని వ్యర్థాల నుండి తయారుచేసిన లెదర్‌తో రూపొందించిన షూస్. ద్రాక్ష నుంచి, వైన్ వ్యర్థాల నుంచి తయారుచేసిన లెదర్‌తో శాకాహారి స్నికర్స్ను తయారుచేసింది పంగైయా కంపెనీ. కిందేటాడాది నైక్ పినాటెక్స్తో కలిసి పైనాపిల్ నుంచి రూపొందించిన లెదర్‌తో ఎయిర్మ్యాక్స్ స్నికర్స్ను తయారుచేసింది. వ్యర్థాలతో రీసైకిల్ స్నికర్స్ బ్రాండ్ ‘వెజా’ ప్లాస్టిక్ సీసాలను రీ సైకిల్ చేసి, మొక్కొజొన్న ఫైబర్‌తోనూ షూస్ తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. (చదవండి: ఎలాన్ మెచ్చిన మన ఎల్లుస్వామి) ఖరీదులోనూ ఘనమైనవే! క్రాస్ బాడీ బ్యాగ్, ట్రావెల్ ఆర్గనైజర్లు, బ్యాక్‌ప్యాక్‌లను వీగన్ ప్రియుల కోసం మూన్ రాబిట్ అందిస్తోంది. ఏ మాత్రం జంతుహింస లేని ఈ బ్యాగుల తయారీ తెలిసినవారు వీటిని సొంతం చేసుకుంటున్నారు. వెజిటబుల్ లెదర్‌తో తయారుచేసిన యాక్ససరీస్ ఖరీదులోనూ ఘనంగానే ఉన్నాయి. వేల రూపాయల్లో ఖరీదు చేసే ఈ వస్తువుల తయారీలో రానున్న రోజుల్లో వచ్చే మార్పులతో అందరికీ అందుబాటులో ఉండనున్నాయి. (హలో గురూ.. జర జాగ్రత్త! అంతా తెలుసు అని కొట్టిపడేయొద్దు.. చిట్కాలివిగో..) ట్రెండ్ సెట్ చేస్తున్న బ్రాండ్లు అమెరికన్ సోషలైట్ కిమ్ కర్దాషియన్ నుంచి మన బాలీవుడ్ తార దీపికా పదుకొనె వరకు పెటా ఆమోదించిన ‘ఔట్‌హౌజ్’ వీగన్ అలంకార ఉత్పత్తులను వాడుతున్నారు. కంపెనీ డిజైనర్ సాషా గ్రేవాల్ ‘డిజైనర్లుగా మనం ట్రెండ్‌ను సెట్ చేస్తున్నప్పుడు, పర్యావరణం పట్ల స్పృహతో కూడా ఉండాలి. మొదటి ఉత్పత్తి సమయంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ జంతు ఆధారిత ఉత్పత్తులను వాడకూడద’నుకున్న నిర్ణయాన్ని వివరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాండెడ్ కంపెనీలన్నీ ఇప్పుడు వీగన్స్ కోసం సరికొత్తగా ఫ్యాషన్వేర్ను తయారుచేస్తున్నాయి. (Health Tips: ముల్లంగి రసం తాగుతున్నారా.. అయితే..) గ్లోబల్ ఫౌండేషన్స్ ‘లెయిడ్’ ఫౌండేషన్ సృష్టికర్త డిజైనర్స్టెల్లా మెక్కార్ట్నీ ‘నో–లెదర్, నో–ఫర్’ ప్రతిజ్ఞతో ప్రారంభించి ఈ పని ద్వారా అన్ని వర్గాలకూ చేరవవుతున్నారు. ‘మీ వార్డ్‌రోబ్‌లో మరిన్ని శాకాహార ఉత్పత్తులను చేర్చడానికి మేం అన్నివేళలా పనిచేస్తాం’ అంటున్నారు ప్రపంచ ఫ్యాషన్ డిజైనర్లు. (వయ్యారి భామా.. నీ హంస నడకా! ఇండియన్ సిల్క్ క్వీన్ విజేతలు వీరే!) -
ఇదో రకం ట్రెండ్.. ఆవకాయ జాడీతో అదిరిపోయే అలంకరణలు
Trendy House Interior Design: ఇంటి అలంకరణలో ఫ్లవర్ వేజ్‌ల వాడకం తెలిసిందే. అందమైన ఫ్లవర్‌వేజ్‌ల ఎంపిక గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు. అయితే, ఇటీవల ఇంటీరియర్ డెకార్‌లో భాగంగా పాతకాలం నాటి వస్తువుల ప్రాధాన్యత పెరిగింది. వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగినది పచ్చడి జాడీ. బామ్మల కాలం నుంచి వివిధ రకరాల పచ్చడి జాడీల గురించి మనకు పరిచయమే. పది కేజీల పచ్చడి మొదలుకొని, పావు కేజీ పచ్చడి పట్టేంత జాడీలు ఉండేవి. ఆవకాయ, మాగాయ, ఉసిరి, చింత, గోంగూర.. ఇలా రకరకాల పచ్చళ్లకు రకరకాల పరిమాణాల్లో జాడీలు ఉండేవి. ఇప్పుడు వాటి వినియోగం తగ్గి, చాలా వరకు అటక చేరిపోయాయి. లేదంటే, ఊళ్లోనే వాటిని వదిలేసి వచ్చి ఉంటారు. కానీ, ఇప్పుడు ఇంటి అలంకరణలో ఇవే వైవిధ్యం అయ్యాయి. అందుకే ఎక్కడో మూలన చేరిన జాడీలు ముందు గదిలో దర్జాపోతున్నాయి. ఇత్తడి.. జాడీ పక్క పక్కనే చేరి కొత్తగా కబుర్లు చెప్పుకుంటున్నాయి పాతకాలం నాటి ఇత్తడి వస్తువులు, పచ్చడి జాడీలు. జాడీ పువ్వులను సింగారించుకొని బామ్మల కాలం నాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తుంటే ఇత్తడి పాత్రలు ఇంపుగా వింటున్నాయి. ఇంటి డెకార్‌లో వింటేజ్ స్టైల్ ఎప్పుడూ ప్రత్యేకమే అని నిరూపిస్తున్నాయి. చిన్నా పెద్ద.. జాడీ పరిమాణాలు, షేపుల్లో వివిధ రకాల జాడీలను ఎంచుకొని తాజా పువ్వులు లేదా డ్రై పువ్వులను అలంకరిస్తే సంప్రదాయ సొగసు, పండగ కళ నట్టింటికి నడిచివచ్చినట్టే. పచ్చని మొక్కకు జీవం ఎర్రని నోరూరించే పచ్చడికే కాదు పచ్చని మొక్కలకూ జీవం పోస్తుంది జాడీ. ఇండోర్ ప్లాంట్స్‌కు ఇలవేల్పుగా కొత్త రకం కుండీలో ఖుషీగా మారిపోతుంది. మొక్కలకు, పూలకు కుండీలుగా మారి కొత్త కళతో వెలిగిపోతున్నాయి. ఎప్పటికీ కళగా! తాజా పువ్వులు రోజూ అలంకరించలేం అనుకునేవారు ఇప్పటికే ఉన్న కృత్రిమ ఆకులు, పువ్వుల కొమ్మలను జాడీలో పొందిగ్గా అమర్చితే చాలు. సెంటర్ టేబుల్‌కి ఆకర్షణీయత పెంచుతుంది. సైడ్ వాల్ షెల్ఫ్‌లో కళగా మెరిసిపోతుంది. అటు సంప్రదాయం, ఇటు ఆధునికత కలిసి ఇంటికి కొత్త కళను తీసుకువస్తుంది. ఆధునికత వైపు పరుగులు తీసి అలసిపోతే ప్రాచీన సంపద అక్కున జేర్చుకుని మనసును సేద తీరుస్తుంది. అందుకు అసలు సిసలైన ఉదాహరణగా పచ్చడి జాడీలు నిలుస్తున్నాయని ‘హోమ్ హార్మనీ, మై హోమ్ వైబ్స్’ క్రియేషన్స్ అలంకరణను ఇలా కళ్లకు కట్టింది. చదవండి: బెదిరించినా సరే మహేశ్ అలా చేయరు : సుధీర్‌బాబు -
ఆ కాలంలో ఒకరోజు!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ 70ఏళ్లు వెనక్కి వెళ్లిపోయారు. ఇదేదో సినిమా కోసం అయ్యుంటుంది అనుకుంటే పొరపాటే. 1950లలో అమ్మాయిలు ఎలా ఉండేవారు? ఎలాంటి డ్రెస్‌లు వేసుకునేవారు? ఏ విధమైన నగలు పెట్టుకునేవారు? వాళ్ల హెయిర్ స్టయిల్ ఎలా ఉండేది? అనే ఆలోచన జాన్వీకి వచ్చింది. అంతే.. అప్పటి తరం అమ్మాయిలు ఎలా ఉండేవారో కొందరిని అడిగి తెలుసుకున్నారు. కొన్ని ఫొటోలు చూశారు. ఆ తర్వాత అప్పటి అమ్మాయిలా దుస్తులు, నగలు ధరించి ముస్తాబయ్యారు. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, ‘1950వ దశకంలో ఒక రోజు జీవించినట్లు ఉంది. ఆ అనుభూతి భలే ఆనందాన్నిచ్చింది’ అని పేర్కొన్నారు జాన్వీ. లేత ఆకుపచ్చ, బంగారు అంచు ఉన్న చీర, గోధుమ, బంగారు టోన్డ్ బ్రోకెడ్ జాకెట్టు, ముత్యాల సెట్‌తో రెట్రో వైబ్స్‌ను ప్రేరేపించే మేకప్‌లో అందంగా ముస్తాబైన జాన్వీ లుక్స్ వైరల్‌గా మారాయి. ‘మీ లుక్ అదుర్స్’ అని ఆమె అభిమానులు కామెంట్లు షేర్ చేశారు. -
షాపింగ్ ట్రెండ్ మారింది
సాక్షి, అమరావతి: కోవిడ్–19 ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చింది. ఈ మార్పు షాపింగ్‌లో కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మనసు పడ్డామనో, కొత్త ట్రెండ్ అనో గతంలో వస్తువులను కొనుగోలు చేసిన జనం.. ఇప్పుడు నిత్యవసరమో, అత్యవసరమో అయితేనే జేబులోంచి డబ్బు తీస్తున్నారు. ఈ కరోనా కాలంలో ఆదాయాలు తగ్గిపోవడంతో అనవసరమైన వస్తువుల జోలికి వెళ్లడం లేదు. మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఇదే షాపింగ్ ట్రెండ్ నడుస్తోంది. కోవిడ్–19 నేపథ్యంలో వినియోగదారులు వేటిపైన ఎక్కువ ఖర్చు పెడుతున్నారనే దానిపై మెకెన్సీ అండ్ కంపెనీ భారత్‌తో పాటు 45 దేశాల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా షాపింగ్ ట్రెండ్ 60 శాతం మారగా మన దేశంలో అది 80 శాతం కంటే ఎక్కువగా పెరిగింది. 70 శాతం మంది గతంలో మాదిరిగా వస్తువులు కొనుగోలు చేయడంలేదు. సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.. ► ముందుచూపుతో ఉన్నవారు విలాస వస్తువుల కొనుగోలు తగ్గించేశారు. ► ఎక్కువ మంది ఈ–కామర్స్ నెట్వర్క్ ద్వారా తమకు అవసరమైన వాటిని కొంటున్నారు. ► దీంతో అన్ని కేటగిరీల్లో ఆన్లైన్ షాపింగ్ పది శాతం పెరిగింది. నమ్మకమైన బ్రాండ్లు మాత్రమే కొనేవారు ఇప్పుడు తక్కువకు దొరికే కొత్త బ్రాండ్లను కొనుగోలు చేస్తున్నారు. ► ఆరోగ్యరక్షణ, పరిశుభ్రతకు సంబంధించిన వస్తువులపై ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. విహార యాత్రలు, ప్రయాణాలు మానుకోవడంతో పాటు జనం ఎక్కువ ఉండే ప్రాంతాలకు వెళ్లడం తగ్గించేశారు. ► మన దేశంలో ఇంట్లో అవసరమైన వస్తువులు, ఆరోగ్య రక్షణ వస్తువులకు 30 నుంచి 39 శాతం ఖర్చు చేస్తున్నారు. కిరాణా వస్తువులపై 15 నుంచి 29 శాతం, ఫిట్నెస్, వెల్నెస్, పెట్‌కేర్ సేవలకి 15 నుంచి 29 శాతం డబ్బు వెచ్చిస్తున్నారు. వ్యక్తిగత రక్షణ, మద్యం, పుస్తకాలు, వాహనాల కొనుగోళ్లకు ఒకటి నుంచి 14 శాతం ఖర్చు చేస్తున్నారు. ► రెస్టారెంట్లపై పెట్టే ఖర్చు గతం కంటే 50 శాతానికిపైగా తగ్గిపోయింది. ► ఫుట్‌వేర్, దుస్తులు, నగలు, గృహోపకరణాలపైనా 50 శాతం ఖర్చు తగ్గింది. ► షాపింగ్ ట్రెండ్ అమెరికాలో 75 శాతం, యూకేలో 71 శాతం, ఫ్రాన్స్‌లో 59 శాతం, జర్మనీలో 54 శాతం, స్పెయిన్‌లో 68 శాతం, ఇటలీలో 65 శాతం, భారత్‌లో 80 శాతం, జపాన్‌లో 33 శాతం, కొరియాలో 64 శాతం, చైనాలో 82 శాతం మారాయి. -
దేశవ్యాప్తంగా నడుస్తోన్న ఫాం హౌజ్ ట్రెండ్
-
మార్కెట్లోకి ‘ట్రెండ్ ఈ’ ఎలక్ట్రిక్ స్కూటర్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అవన్ మోటార్స్.. ‘ట్రెండ్ ఈ’ పేరుతో నూతన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను శుక్రవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. సింగిల్ బ్యాటరీ కలిగిన స్కూటర్ ధర రూ.56,900 కాగా, డబుల్ బ్యాటరీ స్కూటర్ ధర రూ.81,269. రెండు నుంచి నాలుగు గంటల్లో పూర్తిగా చార్జయ్యే విధమైన లిథియం–అయాన్ బ్యాటరీని ఈ స్కూటర్లలో అమర్చినట్లు తెలిపింది. సింగిల్ బ్యాటరీ స్కూటర్ గంటకు 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, డబుల్ బ్యాటరీ స్కూటర్ 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదని సంస్థ ప్రకటించింది. రూ.1,100 చెల్లించి స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ పంకజ్ తివారీ మాట్లాడుతూ.. ‘ప్రీ–బుకింగ్స్ సమయంలో ఈ స్కూటర్స్‌కు విశేష స్పందన మాకు ఆనందాన్ని ఇచ్చింది. ఈ స్కూటర్ ఫీచర్లు కస్టమర్లకు బాగా నచ్చుతాయని భావిస్తున్నాం’ అని అన్నారు. -
పార్టీలు మారిన వారే బరిలో
తాండూరు: నమ్మిన పార్టీ కోసం పనిచేసే నాయకులు నేటి రాజకీయాలలో తక్కువగా కనిపిస్తారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే రోజులు పోయాయి. నియోజకవర్గంలో 5 ఏళ్లలో పార్టీలు మారిన నేతలే అధికంగా కనిపిస్తున్నారు. పార్టీ గెలుపునకు కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నాయకులు నేటి రాజకీయాలలో కనిపిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.తాజాగా తాండూరు రాజకీయాలలో పార్టీలు మారుతున్న నాయకులు పొలిటికల్ ట్రెండ్ కొనసాగుతుందనడం గమనార్హం. కండువాలు మార్చిన నాయకులు... తాండూరు రాజకీయాలలో 5ఏళ్లుగా వివిధ పార్టీల నాయకులు జెండాలు మార్చుతున్నారు. అందులో 2014ఎన్నికల సమయంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డి టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర రవాణశాఖ మంత్రిగా కొనసాగారు. మరోవైపు కాంగ్రెస్‌కు చెందిన దివంగత మంత్రి చందుమహరాజ్ తనయుడు నరేష్ మహరాజ్ 2014సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ కండువా కప్పుకొని తాండూరు అ సెంబ్లీ బరిలో నిలిచారు. ఎన్నికలు పూర్తయిన ఏడాది తర్వాత తిరిగి నరేష్ మహరాజ్ కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం యు.రమేష్‌కుమార్ 4ఏళ్ల కిందట బీజేపీలో చేరి పార్టీని సంస్థాగతంగా పటిష్ట పరిచారు. ముందస్తు ఎన్నికల్లో జంపింగ్‌ల పర్వం... టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేసి ముంద స్తు ఎన్నికలకు వెళ్లడంతో రాజకీయ పార్టీలలో జం పింగ్ల పర్వం మొదలయింది. ఈ సారి ఏకంగా నియోజకవర్గ నాయకులు సైతం పార్టీలను మారా రు. బీజేపీ నుంచి తాండూరు అసెంబ్లీ స్థానాన్ని ఆ శించిన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమే ష్‌కుమార్ టికెట్ రాలేదనే కారణంతో టీఆర్ఎస్లో చేరారు. రమేష్‌కుమార్‌తో పాటు బీజేపీ నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కీలక పదవులు కలిగిన 30మంది నాయకులు రమేష్‌తో పాటు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి సందల్‌రాజుగౌడ్ టీడీపీకి గుడ్‌బై చెప్పనున్నారు. మాజీ ఎమెల్యే చూపు టీఆర్ఎస్ వైపు.. తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు చూపు టీఆర్ఎస్పై పడింది. టీఆర్ఎస్లో చేరితే పార్టీలో కీలక భాద్యతలను కట్టబెట్టేందుకు సీఎం కేసీఆర్ హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాండూరులో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తే నారాయణరావుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాలలో చర్చసాగుతోంది. ఎన్నికల తర్వాత మారాలా.. లేకా ఎన్నికల ముందే మారా లా అనే విషయమై తేల్చుకోలేక పోతున్నారు. కాంగ్రెస్‌లో చేరిన పైలెట్... తాండూరు నియోజకవర్గంలో హట్ టాపిక్‌గా మారిన పైలెట్ రోహిత్‌రెడ్డి దశాబ్ద కాలంగా టీఆర్ఎస్లో కొనసాగారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాండూరు టికెట్‌ను ఆశించి భంగపడ్డారు. టీఆర్ఎస్ ప్రçభుత్వం ఏర్పడ్డాకా పైలెట్ రోహిత్‌రెడ్డిని టీఆర్ఎస్ నుంచి బహిష్కరించారు. నాటి నుంచి యంగ్ లీడర్స్ సంస్థ తరపున తాండూరు ప్రాంతంలో బలం పెంచుకున్నారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రోహిత్‌రెడ్డి తాండూరు అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నారు. ట్రెండ్ పేరుతో.. రాజకీయాల్లోనూ ట్రెండ్ కొనసాగుతుంది. ఒకే పార్టీలో ఉంటే విలువ ఉండదని అందుకే పార్టీలు మారుతున్నామని నాయకులు అంటున్నారు. 4దశాబ్దాల కిందట పార్టీ కోసమే నాయకులు కార్యకర్తలు పనిచేశారు. తర్వాత రోజుల్లో నాయకుల కోసం పని చేశారు. ప్రస్తుతం పార్టీ గుర్తించలేదనే కారణంతో పార్టీలను వీడుతున్నారు. అయితే రాజకీయాలలో నేతలు విలువల కోసం పని చేయడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
జలాధిపత్యం
ఏ విధంగా సాయి పంచభూతాల్లోని ఆ పృథ్విని అంటే భూమాతని వినయంతో.. గౌరవంతో.. భక్తితో.. తనదానిగా చేసుకుని ఆమెని తన అధీనంలో ఉండేలా చేసుకోగలిగాడో వివరించుకున్నాం. ఆమె కూడా ఎందుకు అలా సాయికి అధీనురాలుగా అయిపోయిందో ఆ కారణాన్ని కూడా తెలుసుకున్నాం గత భాగంలో.ఆ క్రమంలో ఇప్పుడు పంచభూతాల్లోనూ 2,3,4,5గా గల నీరు, తేజస్(వేడిమి), వాయువు, ఆకాశం అనే వాటిని కూడా ఎలా తన అధీనంలో ఉండేలా వినయధోరణితో చేసుకోగలిగాడో తెలుసుకుందాం! నీటి దీపాలు ప్రతిరోజూ సాయికి తానున్న మసీదు నిండుగా దీపాలని వెలిగించి ఉంచడం ఇష్టం. అదొక ఆనవాయితీ కూడా. అది శీతకాలం కావచ్చు, వర్షకాలం కావచ్చు. దీపాల వేడిమి కారణంగా మసీదంతా ఉష్ణమయం అయిపోయే వేసవికాలం కావచ్చు. దీపాలు వెలగాల్సిందేననేది ఆయన అభిమతం.ఆ నూనె కోసం ఎందరో భక్తులిచ్చే దక్షిణలని దాదాపుగా ఉపయోగించేవారు కాదు. షిర్డీ గ్రామంలో ఉండే వర్తకుల వద్దకి సాయే స్వయంగా వెళ్లి నూనెని అడిగి మరీ తెచ్చుకుంటూండేవారు. లోకరీతి ఎప్పుడూ ఒకలా ఉండదు కదా! అందరూ కలిసి ఓసారి అనుకున్నారు. ఎప్పుడో ఒకసారంటే అడగడం, ఇయ్యడమనే దానిలో అర్థముంది కానీ నిత్యం ఇదేపనా? అయినా భక్తుల నుంచి అంతంత దక్షిణ వస్తూంటే.. అది చాలదన్నట్టుగా దబాయించి ‘ఇంత ఈయవలసిందే’ అంటూ దక్షిణలని తీసుకుంటున్న ఈయనకి వర్తకులమైన మనం ఎందుకు ఉచితంగా ప్రతిరోజూ నూనెనియ్యాలి? ఆయనే తలుచుకుని ఈ సంవత్సరమంతా నూనె ఖర్చు నీదే! అంటూ ఎవరినైనా శాసిస్తే కాదనేవాడు లేనేలేడు గదా! మనల్ని పీడించడం దేనికి? అయినా ఏదో ఒకటో రెండో దీపాలు చాలవా? మసీదంతా వెలుగులమయం కావాలా? ఇంతకు వెనుకకాలంలో ఒక్క దీపమే కదా ఉండేది అంత పాడుబడ్డ మసీదు మొత్తానికీ? ఏదో మనం ఇస్తున్నాం కాబట్టి వెలిగించడమా? అంటూ వ్యక్తికో అభిప్రాయం చొప్పున సామూహికంగా తెలియజేసుకుంటూ సాయి రాగానే అందరూ కలిసిగట్టుగా ఒకే మాట మీద నిలబడి నూనె లేనేలేదని చెప్పాలని నిశ్చయించుకుని నూనెని ఈయనేలేదు.ఎక్కడో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో.. ఏ ప్రవర్తనతో ఉన్నాడో.. ఏ వెనుకకాలంలో తనకి ఎంత రుణమున్నాడో కూడా తన అతీంద్రియశక్తితో గ్రహించగలిగిన సాయికి.. ఈ వర్తకులంతా లోపలేమనుకున్నారో.. ఏ తీరుగా ప్రవర్తించారో.. పైకి ఏమని చెప్తున్నారో తెలియదా? కానీ వీళ్లంతా ‘ఆయనకి ఈ లో–సమాచారం తెలియదు గదా!’ అని తెలిసినతనంతో తాము ప్రవర్తిస్తున్నామని అనుకున్నారు. సాయి నిరుత్సాహపడలేదు. మౌనంగా లోపల బాధపడ్డాడు. దానికి కారణం.. ‘ఏ మసీదులో దీపాలని వెలిగించి ఆ జ్యోతి వెలిగించిన కారణంగా వచ్చే పుణ్యఫలాన్ని ఆ వర్తకులందరికీ ఆయన పంచదలిచాడో ఆ భాగ్యం వాళ్లకి లేకపోయింది గదా! వాళ్లకి చెందకుండా చేసుకుంటున్నారు కదా!’ అని అనుకోవడమే.భాగవతంలో కుచేలుని భార్య తన భర్తతో తమ మిత్రుడైన శ్రీకృష్ణుని వద్దకి వెళ్లి.. కొంత ధనాన్ని యాచించి.. ప్రస్తుతమున్న ఆర్థికమైన గడ్డు పరిస్థితి నుంచి తాత్కాలికంగా బయటపడే ఉపాయాన్ని వెదకవలసిందని చెప్పింది. అలాగేనన్న కుచేలుడు ఆమెతో ‘వెళ్తాను. మహానుభావుడైన కృష్ణుడ్ని దర్శిస్తాను. అయితే ఆయనకి ఏమియ్యాలో దాన్ని సమకూర్చు!’ అన్నాడు.అయ్యవారి నట్టిల్లెలా ఉంటుందో ఎంత ఐశ్వర్యంతో ఉందో ఆయనకి తెలియదా? ఎందుకడిగినట్లు?పోనీ! ఆయనడిగాడే అనుకుందాం! ఈమె వెంటనే సమాధానమిస్తూ మనకే లేక దుఃఖిస్తూ ఉంటే ఏమియ్యగలను? అంటూ వ్యతిరేకించి వివాదపడలేదు. ఆ చుట్టుపక్కల నలుగురి ఇళ్లకి వెళ్లి (యాచిత్వా ముష్టీ శ్చతస్రః) నాలుగిళ్ల నుండీ కొంత కొంత చొప్పున బియ్యపుముక్కలు (నూకలు) తెచ్చింది. అంతరార్థమేమంటే.. ఆ నలుగురికీ ఈ కృష్ణదర్శన పుణ్యంలో భాగాన్ని పంచిపెట్టాలనీ, ఈ నలుగురి వైపు నుంచీ తన భర్తని పంపి అలా పట్టుకెళ్లిన పుణ్యాన్ని భర్తకి అందించాలనీనూ. ఈ రహస్యం ఆ దంపతులకి తెలుసుకాబట్టే ఈయన.. ఏదైనా ఈయవలసిందని అనడం, ఆమె కసురుకోకుండా ఆ నూకలని యాచించి ఈయనకి ఇయ్యడమూ జరిగింది.ఈ తీరు జ్ఞానం లేని కారణంగా వర్తకులంతా వ్యతిరేకించారు. సాయి మాత్రం వాళ్లందరికీ పుణ్యఫలాన్ని అందించదలిచినా వాళ్లంతా మేం ఆ పుణ్యానికి అర్హులంకాదంటూ తేల్చేసుకున్నారు నూనెని ఇయ్యకుండా. సాయి దుఃఖమంతా వీళ్ల దురదృష్టాన్ని పోగొట్టదలిస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారా? అనేదే!సరే! తర్వాతి కథ మనకి తెలిసినదే! ఆ నూనెడబ్బాని కడిగి దాన్ని తానే స్వయంగా తాగి, ఆ డబ్బానిండుగా నీటిని నింపి అందరూ చూస్తూండగా దీపాలని వెలిగించడం! నీటిని వశం చేసుకోవడం! తర్కశాస్త్రాన్ని మనకి అందించిన అన్నంభట్టనే పండితుడు నీటికి నిర్వచనాన్నీ లక్షణాన్నీ చెప్తూ శీత స్పర్శవత్య ఆపః – చల్లనిదనమే తమ స్వభావంగా కలిగినవీ స్పృశించడానికి వీలైనవీ (ఆకాశాన్ని స్పృశించలేము కదా! అలా కాకుండా) నీళ్లు – అన్నాడు. లోకంలోని ప్రతివస్తువుకీ ఓ ధర్మం(లక్షణం) ఉండి తీరుతుంది. దాన్నిబట్టే ఆ వస్తువు ఏదో దాన్ని గుర్తించగలుగుతాం. ఉదాహరణకి రాయి ఉందనుకుందాం! దానికి జ్ఞానం (తాను దొర్లిపడితే ఎవరికైనా గాయమవుతుందనే జ్ఞానం) ఉండదు. ఎక్కడ పడేస్తే అక్కడే ఉంటుంది. పెద్ద ప్రవాహం వచ్చి తనని కొట్టుకుపోయేలా చేస్తే వెళ్లిపోవడమే తప్ప అభిమానమంటూ ఉండదు. కనీసం మరో సురక్షిత ప్రాంతానికి వెళ్లి ఉందామనే ఆలోచనా ఉండదు. ఇదంతా దాని ధర్మం. అందుకే ఇలాంటి అజ్ఞాన నిరభిమాన లక్షణాలున్నవాడ్ని ‘వాడో బండరాయి’ అని రాతితో పోలుస్తాం! అలా ఆలోచిస్తే నీటికుండే సహజధర్మం చల్లగా ఉండటం అనేదే. సాయి ఈ నీటితో దీపాలని వెలిగించాడనేది అందరికీ కనిపించిన సత్యం.దీపానికి అతిముఖ్యమైనది నిప్పు. అంటే అగ్ని. అగ్నికుండే లక్షణాన్ని వివరిస్తూ తర్కశాస్త్ర పండితుడైన అన్నంభట్టు చెప్పింది అదే. ‘ఉష్ణ స్పర్శవ త్తేజః’ అని. వేడిగానే ఉంటూ ఉండటం, స్పృశించగల అవకాశాన్ని కలిగి ఉండటం తేజస్సు (వేడిమి–అగ్ని) లక్షణమని. అందుకే ఏ సూర్యుడున్నాడో ఆయన ఎంతో దూరంలో ఉండి ప్రకాశిస్తున్నా మన శరీరాలు ‘చుర్రు’మంటూ ఉంటాయి ఒక స్థాయి వేడిమి దాటితే. ఇక్కడ గమనించాల్సిన అంశమేమంటే.. నీటికున్న గుణం చల్లగా ఉండటం. అగ్నికున్న గుణం వేడిమితో ఉండటం. నీటికున్న చల్లదనమనే గుణాన్ని తొలగించడం అనే పనిని చేయడమే బహుకష్టం. మరో విశేషం ఉంది. చంద్రునికున్న చల్లదనం ఆకర్షణీయగుణం కారణంగానే ఆయన చంద్రుడవుతున్నాడు(చది ఆహ్లాదనే – చంద్రః) ఆ గుణమే ఆయనలో లేకుంటే ఆయన చంద్రుడు కాకుండాపోతాడు. అలాగే హిమవంతుడున్నాడు. నిరంతరం మంచుని కురిపిస్తూ.. ప్రవహింపజేస్తూ.. మళ్లీ అంతలోనే మంచుని కలిగి ఉండటం హిమవంతుని లక్షణం. ఆ హిమలక్షణం లేకుంటే ఆయన హిమవంతుడే కాలేడు.అదే తీరుగా సముద్రమనేదానికి – ‘అ వేల’ అని పేరు. వేల అంటే ఒడ్డు అని అర్థం. అవేల అంటే ఒడ్డు అనేదే లేనిదని భావం. మనం స్నానం చేసే స్థలం రేవు అవుతుంది తప్ప ఒడ్డు కానే కాదు. నాలుగు వైపులా సముద్రం ఉన్న కారణంగానూ ఆ నాలుగిటి మధ్య భూమి ఉన్న కారణంగానూ (చతురీపమ్ చతుస్సముద్ర వేలా వలయితమ్) సముద్రానికి ఒడ్డు అనేది లేనే లేదు. ఉండదు కూడా. అలా ఒక్కో ప్రత్యేక లక్షణం కలిగి ఉన్న కారణంగా అవి ఆయాపదార్థాలుగా గుర్తింపుని పొంది ఉన్నాయి లోకంలో. ఈ పరిస్థితిలో నీటికుండే సహజధర్మమైన చల్లదనాన్ని తొలగించినట్లయితే అది ‘నీరు’గా పిలువబడకూడదు. సాయి చేసిందిదే. నీటికుండే సహజ ధర్మమైన చల్లదనాన్ని తొలగించివేయడమనే పనినే. ఇప్పుడు నీరు కాస్తా ఏమయింది? ముడిపదార్థంగా మారిపోయింది. ఉదాహరణకి ఒక వ్యక్తికి ధర్మరాజుగా వేషాన్ని వేశాం. ఆ ఆహార్యాన్ని తొలగిస్తే అతడు మళ్లీ మనలో ఒక వ్యక్తిగా ‘ఫలాని పేరుగల వ్యక్తిగా’ అయిపోతాడు. మళ్లీ అతనికే మరో దశరథుని వేషం వేస్తే ఇదే ‘ఫలాని వ్యక్తి కాస్తా’ ఆ దశరథుడైపోతాడు.అదే తీరుగా సాయి నీటికున్న సహజధర్మమైన చల్లదనాన్ని తొలగించి నీటిని ఓ ముడిపదార్థంగా మార్చడమే కాకుండా ఆ ముడిపదార్థానికి ఇందాక ధర్మరాజు వేషాన్ని తొలగించి దశరథుని వేషం వేసినట్లుగా తేజస్సుకుండే సహజధర్మమైన వేడిమిని కలిగించి ఆ వేడిమితనం నీటి ద్వారా వత్తికి ప్రవహించేలా చేసి రాత్రిరాత్రంతా దీపాలన్నీ వెలిగే ఏర్పాటు చేశాడు సాయి.‘ఆయన దేవుడు కాబట్టి వెలిగించగలిగాడు’ అంటూ ఒకే ఒక్క వాక్యం ఈ సంఘటనకి ముగింపు పలకడం సరికాదు. ఎలా వెలిగించగలిగాడు? దానిలో దాగిన మూల రహస్యం ఏమై ఉంటుందని ఆ తీరుగా పరిశీలిస్తే సాయి మహత్త్వం (గొప్పదనం) ఏమిటో.. ఎంతదో.. మనకి అర్థమై మన హృదయంలో కనిపించే సాయిచిత్రం మరింత చిక్కగా కనిపించేంత దట్టంగా కనిపిస్తుంది.‘ఉపనిషత్తు చెప్పేది – అగ్నే రాపః’ అని. అగ్ని నుండి నీరు పుడుతుందని. సాయి నీటి నుండి నిప్పు పుట్టేలా (వేడిమి) చేయగలిగాడంటే అది మరింత సిద్ధశక్తికి ఉదాహరణం కదా! సాయి ఇక్కడ మాత్రమే నీటిని తన అధీనంలోనికి తెచ్చుకున్నాడనుకోవడం సరికాదు.తన జీవితంతో.. శరీరంతో.. ప్రాణంతో.. సమానంగా పెంచుకున్న గుర్రం చాంద్పాటిల్కి కనిపించక పిచ్చిపట్టిన వానిలా తిరుగుతున్న వేసవి సమయంలో.. సాయి చెట్టునీడన కూర్చుని చాంద్పాటిల్కి గుర్రపు జాడని చెప్పి సంతోషపెట్టి – హుక్కా తాగుదువు గాని రా! అంటూ తన సటకాతో నేలమీద కొట్టి నీటినీ.. మళ్లీ అదే సటకాతో అదే నేల మీద కొట్టి నిప్పునీ.. రప్పించి ఆ నీటితో హుక్కాగొట్టాన్ని తడిపి ఆ నిప్పుతో పొగాకు రజనుని వెలిగించుకున్నాడు. ఇది చూసినచాంద్పాటిల్కి ఆశ్చర్యమనిపించి ‘సాయి’ మహిమ తెలిసిందనుకున్నాం లోగడ!ఉపనిషత్తు చెప్పింది– ‘అబ్భ్యః పృథ్వి – నీళ్ల నుండి పుడుతుంది భూమి’ అని. మరి సాయి విషయంలో చూస్తే భూమి నుండి కదా నీటిని రప్పించాడాయన. ఇదేమిటి? ఎందుకింతగా నీరు ఆయనకి స్వాధీనమయింది? ఆలోచిద్దాం! ఇదీ కారణం! నీటిశక్తినీ స్వభావాన్నీ నిరోధించడమనేది భాగవతాది ఇతిహాసాల్లో కనిపిస్తుంది. దేవకీ, వసుదేవులకి పుట్టిన శ్రీహరి రూపంలో దర్శనమిచ్చిన బాలుడ్ని వసుదేవుడు తీసుకువెళ్తూంటే యమునానది తనకు తానుగా రెండుగా చీలి వసుదేవునికి నడిచేందుకు వీలుగా త్రోవనిచ్చింది. ఆంజనేయుడు సముద్రమ్మీద ఎగురుతూంటే సముద్రం తన కెరటాల ఎత్తునీ, ఉద్ధృతినీ తగ్గించి సహకరించింది. అగస్త్యుడు సముద్రాన్ని మూడు మార్లు ఆచమనం చేసి తనలో ఉంచేసుకున్నాడు. జహ్నుమహర్షి తన ఆశ్రమాన్ని వరదనీటితో ధ్వంసం చేస్తున్న భాగీరథీ (గంగ)ని ఆపోశనపట్టి ఆ గంగ ప్రార్థన మీద చెవి నుండి విడిచి పుచ్చాడు. అప్పటి నుండే గంగకి ‘జాహ్నవి’ అనే పేరొచ్చింది. కాబట్టి నీటిని నిరోధించడం, తమ శక్తితో ఆ నీటిని లోకోపకారం కోసం వినియోగించడమనే విధానం ఎప్పుడూ ఉండనే ఉందని అర్థమవుతోందిగా! ప్రాణాయామవిద్యతో దుర్వాసోమహర్షి యమునానదిలో ఉండిపోవడం వేరు – అలాంటి విద్యాప్రదర్శనమేమీ లేకుండా సహజసిద్ధవిధానంతో నీటిని వశం చేసుకోవడం లేదు. సరే!నీళ్లెందుకు సాయి అధీనంలోకి వచ్చేసాయి? అనేది కదా ప్రశ్న! వేదంలో నీళ్లని స్తుతించిన మంత్రాలున్నాయి. ‘ఆ పోహిష్ఠామయోభువః తాన ఊర్జే దధాతన... ఆపో జనయధా చనః’ అని కనిపిస్తాయి. ఇవి ప్రతినిత్యం మనం ఏ పూజని చేయదలిచినా ముందుగా చదువబడే మంత్రాలే.నీళ్లు లౌకిక సుఖాన్ని (స్వేదం మొదలైన వాటిని తొలగించి శారీరకమైన ఆనందాన్ని) కలిగిస్తాయి. ముఖవర్చస్సుని పెంచుతాయి. వ్యక్తికి శక్తినిస్తాయి. నీరు ఏ మాత్రం తాగవీల్లేదని వైద్యుడు చెప్తూ ఫలాని తేనెని లేదా ఔషధాన్ని ఇంతమాత్రపు నీటితో తాగవలసిందని చెప్తాడు. వేసవిలో నీటిశాతం శరీరంలో తగినంత ఉండని పక్షంలో వ్యక్తి మరణానికి చేరువౌతాడు. ఏయే పదార్థానికి (ఖర్జూరం, తేనె, బెల్లం, పంచదార, ద్రాక్ష, పటికబెల్లం..) ఏ తీరు తీపిదనముందో తెలిపేందుకు ఈ అన్నింటితో ఉన్న తీపినీ కలిపి రుచి చేసేందుకు అవసరమైనది జలం. నీటిలో చక్కని రుచి గుణాన్ని ఏర్పాటు చేసేది, పంటలని పండించేందుకు కావలసిన రాసాయనిక ఉత్పాదక శక్తినీ ఇచ్చేది నీరే.. అంటూ పై మంత్రం చెప్తుంది వివరంగా.ఇంత గొప్పవి నీళ్లు కాబట్టే పుష్కరాలు పేరిట 12 రోజుల పాటు పుణ్యస్నానాలని చేస్తాం. పాపభారాన్ని తొలగించుకుని కొంతలో కొంత పుణ్యాన్ని పొందుతాం!ఈ నేపథ్యాన్ని బాగా పరిశీలించుకుని చూస్తే... ఏ నీళ్లు అనేవి వ్యక్తుల పాపాలన్నింటినీ హరించే శక్తి కలిగి ఉన్నాయో ఆ పనిని సాయి కూడా చేస్తూ వ్యక్తులకి హితబోధ చేస్తూ పాపం పట్ల విముఖతా పుణ్యంపట్ల ఆత్రుతా కలిగేలా ప్రత్యక్షంగా చేస్తున్నాడు కాబట్టే తాను చేస్తున్న పనినే చేస్తున్న సాయికి జలాలు స్వాధీనం కావాలని నిర్ణయించుకుని ఆయన వశం అయిపోయాయి.పుష్కరాల్లో మనం స్నానం చేసేది ఎందుకంటే ఆ మన పాపాలన్నీ నదిలో విడిచేసేందుకు. మరి ఇందరి పాపాలని (కొన్ని లక్షలమందికి చెందిన వివిధ వివిధ పాపాలని) తీసుకున్న ఆ పుష్కర నది మహాపాపి కాదా? అంటే ఆ నది ఎదురు చూస్తుంది. ఒక్క పతివ్రత చాలు తనలో స్నానం చేస్తే మొత్తం పాపసమూహమంతా తొలగిపోతుంది అని. (అపి మాం పాపయే త్సాధ్వీ స్నాత్వేతీచ్ఛతి జాహ్నవీ జనకతనయా స్నానపుణ్యోదకేషు) ఏ నీళ్లు వ్యక్తుల పాపాలని హరించే ప్రయత్నం చేస్తోందో అలాగే సాయి కూడా పాపులందరికీ తమతమ పాపాలేమిటో వివరించి ఇక ఆ పాపాలని తిరిగి చేయాలనే దృక్పథాన్ని పూర్తిగా మార్చేసాడు. ఇది ఒక కారణం. శ్రీరామనవమి ఉరుసు చందనోత్సవం అనే మూడు పండుగలూ ఒకే రోజున జరుపవలసివస్తే ఎందరో జనులకి స్నానపానాదులకి నీళ్లు సరిపోతాయా? అనే చర్చలో జనులుంటే సాయి ఉప్పగా సముద్రజలంలా ఉండే నడబావి (4మార్గాలు కలిసే కూడలిలో ఉన్న నుయ్యి)లో మంత్రించిన పుష్పాలని వేసి పూర్తి తీపి జలంగా మార్చేసాడు. అలా జలం వశం కావడానికి కారణం ఎందరొస్తున్నారో ఆ ఉత్సవానికి. అలా వచ్చే అందరిలోనూ జాతి వర్గ మత కుల స్త్రీ బ్రాహ్మణ వృద్ధ, బాల, వితంతు... ఇలాంటి భేదాలు లేకుండా ఉండే తీరు సత్బుద్ధివిత్తనాలని నాటాడు. నాటుతూ ఉండేవాడు కాబట్టి.‘ఆపశ్శుంధంతు మై నసః’ ఓ జలములారా! నాకు నా పాపాలనుండి తొలగే శక్తిని ప్రసాదించవలసిందని ఈ మంత్రానికి అర్థం. దాంతో ఏదైనా పాపాన్ని చేస్తున్నానేమో? అనే బుద్ధివిచక్షణ ప్రతిక్షణమూ ప్రతివ్యక్తికీ కలుగజేస్తుంది ఆ మంత్రం. తన వద్దకొచ్చే అందరికీ ఈ పాప పుణ్య దృష్టీ ఆలోచనా అనేవాటిని నిరంతరం బోధిస్తూ ఉండేవాడు సాయి. అపవిత్రత తొలగి పవిత్రత రావాలంటే (అపవిత్రః పవిత్రోవా..) నీళ్లని శిరసున చల్లుకోవాలని మంత్రం చెప్తుంది. నీళ్లు ఏం చేయడానికి సృష్టింపబడ్డాయో, అదేపనిని సాయి కూడ చేస్తూ తనకి సహకరిస్తున్నాడనే ఉద్దేశ్యంతో జలం కూడా సాయికి స్వాధీనం అయింది. ఇక ‘తేజస్సు’ ఎలా సాయి అధీనానికి వెళ్లిందో, కారణమేమిటో తెలుసుకుందాం! – సశేషం డా. మైలవరపు శ్రీనివాసరావు -
కంటె కనువిందు
నానమ్మ, అమ్మమ్మల మెడలలో అప్పట్లో కంటె ఆభరణం (దీని నుంచే కంఠాభరణం అనే పేరు వచ్చి ఉంటుంది) ఉండేది. వేడుకలకే కాకుండా ఎప్పుడూ ధరించి ఉండేవారు. ఆ తర్వాత గోల్డ్ షాపుల్లో ‘కంటె’ కరిగి ఆధునిక నగగా రూపాంతరం చెందింది. కానీ, ఇప్పుడు ‘కంటె’ ట్రెండ్ మళ్లీ వచ్చింది. వేడుకలలో కనువిందు చేసే కంఠాభరణమైంది.కంటె ట్యూబులా ఉంటుంది. దీంట్లో వేల డిజైన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కంటెకు పెండెంట్ వేసుకోవచ్చు. పెండెంట్ లేకుండానూ కంటెను ధరించవచ్చు. 25 గ్రాముల నుంచి ఎంత మొత్తం బంగారంతోనైనా డిజైన్ని చేయించుకోవచ్చు. లైట్ వెయిట్లోనూ కంటె డిజైన్లు చేయించుకోవచ్చు. వివాహ వేడుకలలో ప్రత్యేకంగా కనిపించడానికి ఈ డిజైన్ బాగా అమరుతుంది. ఆభరణాల అలంకరణలో వయసుతో నిమిత్తం లేనప్పటికీ కంటె ఆభరణానాన్ని 50 ఏళ్ల లోపు వయసువారికి బాగా నప్పుతుంది. నవతరం అమ్మాయిలు ఆధునిక దుస్తుల మీదకు అలంకరించుకోవాలంటే స్టైల్‌గా ఉండే నెక్‌పీస్ కావాలి. ఇందుకు సన్నటి డిజైన్లలో ఉన్న కంటెను ఎంపిక చేసుకోవచ్చు. ఒకప్పుడు ప్లెయిన్‌గా ఉండే కంటెకు రాళ్లు, రత్నాలు పొదిగి, పెండెంట్లు జత చేయడం కంఠాభరణం కమనీయంగా మారిపోయింది. – శ్వేతారెడ్డి ఆభరణాల నిపుణురాలు -
ఆజ్ కా లిబాజ్
‘లిబాస్’ అంటే దుస్తులు.అందాన్ని రూపాన్ని ఇచ్చే ఇవాళ్టి దుస్తులు ఇవి.రంగులతో అల్లికలతో మెరుపును తెచ్చే ఇవాళ్టి దుస్తులు ఇవి.ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేకంగా కనిపించడానికి కూర్చిన నేటి దుస్తులు ఇవి. కట్‌లోనూ, కుట్టులోనూ ట్రెండ్‌లో ఉన్న దుస్తులు ఇవి.నేటి దుస్తులు. స్త్రీలు మెచ్చే దుస్తులు. ఆజ్ కా లిబాస్. షల్వార్ కమీజ్, అనార్కలీ సూట్స్, పటియాలా కుర్తీస్ ఇన్నాళ్లూ డ్రెస్‌లలో మహరాణుల్లా వెలిగిపోయాయి. ఇప్పుడు వీటి హవా తగ్గి షరారస్, లెహంగాస్, షార్ట్ లెంగ్త్‌లో ఉండే విభిన్నమైన ఫ్రాక్స్, కుర్తీస్ ట్రెండ్‌లోకి వచ్చాయి. వీటికి బెల్‌బాటమ్ ట్రౌజర్స్, కప్రీస్, టులిప్ షల్వార్స్ జత కట్టాయి. అమ్మాయిలు ముఖ్యంగా టీనేజర్స్ వెస్ట్రన్ స్టైల్లో ఉండే షార్ట్ కుర్తీస్, ఫ్రాక్స్.. జీన్స్, ప్యాంట్స్, స్కిన్సీ టైట్స్ మీదకు విరివిగా వాడుతున్నారు. ఇవన్నీ హాటెస్ట్ ట్రెండ్. వెస్ట్రన్ పార్టీలతో పాటు సంప్రదాయ వేడుకల్లో ప్రత్యేకత కలిగించనున్నాయి. వీటిలో మీ ఎంపిక ఏదైనా బెస్ట్ డ్రెస్డ్గా నిలిచిపోతుంది. అయితే, శరీరాకృతిని బట్టి డ్రెస్ ఎంపిక ఎప్పుడూ చక్కగా నప్పుతుంది. షరారా కమీజ్: ఇది 2000 సంవత్సరంలో మంచి కాంబినేషన్‌గా హిట్ అయిన డ్రెస్. ఈ స్టైల్ ఇప్పుడు మళ్లీ వచ్చింది. చాలా మంది బాలీవుడ్ నటీమణులు ఈ స్టైల్లో కనువిందు చేస్తున్నారు. షరారా బాటమ్ ఎక్కువ కుచ్చులతో ఆకట్టుకుంటుంది. దీని మీదకు స్కర్ట్ లేదా కమీజ్ చక్కగా నప్పుతుంది. ఘరారా మనవాళ్ల కామన్‌గా పిలిచే పేరు. దీనినే షరారా అంటున్నారు. మోకాళ్ల దగ్గర నుంచి బాటమ్ కుచ్చులతో వెడల్పుగా ఉంటుంది. వీటినే వైడ్ లెగ్గ్డ్ ప్యాంట్స్ అని కూడా అంటారు. మందపాటి బ్యాండ్ లేడా లేస్ లేదా గోటా పట్టీతో పై భాగాన్ని, కింది భాగాన్ని విడిగా చూపడానికి వాడతారు. దీంతో ఈ బాటమ్ రెండు భాగాలుగా ఉంటుంది. మీ శరీరాకృతిని బట్టి దీనిని ధరించాలి. ఎందుకంటే ఎత్తు తక్కువ ఉండి, బక్కపలచగా ఉండే శరీరాకృతి గల వారికి ఈ స్టైల్ బాగుంటంది. దీనిని మీదకు క్రాప్ టాప్ వేసుకొని దుపట్టా జత చేస్తే సంప్రదాయ డ్రెస్ అవుతుంది. ఈ షరారా మీదకు కుర్తీ లేదా కమీజ్ కూడా బాగుంటుంది. దీని మీదకు పొడవాటి కుర్తా ధరిస్తే మీ ఆకృతి కూడా పొడవుగా కనిపిస్తుంది. సిగరెట్ ప్యాంట్ విత్ కమీజ్:రెండేళ్ల క్రితం కమీజ్ విత్ ప్యాంట్స్ సూపర్ స్టైల్లో ఉండేవి. కమీజ్కే కాస్త ఆకట్టుకునే బాటమ్స్ జత చేసి స్టైల్‌ని బెటర్ చేశారు. ఫిటింగ్ కోసం సిగరెట్ప్యాంట్స్ సరైన ఫిటింగ్ కోసం ధరిస్తున్నారు. సిగరెట్ ప్యాంట్స్ మీద ఎంబ్రాయిడరీ చక్కగా కనిపిస్తుంది. టులిప్ స్టైల్ ప్యాంట్స్:గ్లామరస్ని పెంచుతూ వెలుగులోకి వచ్చాయి. ఇది షల్వార్ని రీప్లేస్ చేసిందని చెప్వచ్చు. ఈ ప్యాంట్స్ మీదకు ఎంబ్రాయిడరీ చేసిన ఫ్రాక్స్, కమీజ్‌లు మరింత అందాన్ని పెంచుతాయి. ఎంబ్రాయిడరీ వెర్సస్ లేత రంగులు: ఎలాంటి ఎంబ్రాయిడరీ లేకుండా ఉండే కమీజ్ను ఎంపిక చేసుకొని దానికి బాటమ్‌గా ఎంబ్రాయిడరీ చేసిన షరారా ధరిస్తే చాలు మీ లుక్‌లో గొప్ప మార్పు కనిపిస్తుంది. ∙కమీజ్ లేదా ఫ్రాక్ డిజైన్స్‌లో నెక్ బోట్ లేదా బార్టట్ నెక్స్ ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. ∙ఎంబ్రాయిడరీ చేసిన గ్రాండ్ లెహంగాలు, కుర్తీలు ఇప్పుడూ ట్రెండ్‌లో ఉన్నాయి. మీ అభిరుచి మేరకు వీటిని ఎంపిక చేసుకోవచ్చు. ఇక ఆభరణాల వంటి ఇతర అలంకరణలు డ్రెస్‌కు తగ్గట్టు ఎంచుకుంటే చాలు ఈ ఔట్ఫిట్స్ మీ పూర్తి ఆహార్యాన్ని మార్చివేస్తాయి. ఆభరణాలు: ∙ఈ తరహా డ్రెస్సుల మీదకు టస్సెల్ ఇయర్ రింగ్స్ బాగా నప్పుతాయి. ∙బ్యాంగిల్ సెట్స్‌లో ఏదైనా ఒకటి పెద్దది డిజైనర్ బ్యాంగిల్ ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ∙లేత రంగులు ముఖ్యంగా స్కిన్ కలర్స్, పీచ్ లేదా ఆకుపచ్చ కాంబినేషన్స్ పండగ కళను రెట్టింపు చేస్తాయి. ∙గోల్ టిక్కా మెహెందీ డిజైన్లు పండగ సంబరాన్ని మరింత కళగా మార్చుతాయి. – ఎన్.ఆర్ – అయేషా అజహర్, ఫ్యాషన్ డిజైనర్ లఖోటియా ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్ -
బృహత్తర పథకాలు.. సంచలన నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్ : రైతు ఎజెండా, జనాకర్షక పథకాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగో ఏడాది కొత్త ఒరవడి నెలకొల్పింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రయోగాత్మక పథకాలను అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలోని రైతులందరికీ మేలుచేసే బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రైతులకు ఖరీఫ్, రబీ సీజన్లలో ఎకరానికి రూ.4 వేల చొప్పున ఏటా రూ.8 వేలు వ్యవసాయ పెట్టుబడి సాయం అందించేలా ‘రైతుబంధు’ పథకాన్ని ప్రారంభించింది. అందులో ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి రూ.6 వేల కోట్లను రైతులకు అందజేసింది. ఈ కార్యక్రమం దేశమంతటా చర్చనీయాంశమైంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా పల్లెపల్లెనా భూరికార్డుల ప్రక్షాళనకు నడుం బిగించిన సర్కారు... యుద్ధప్రాతిపదికన నెల రోజుల రికార్డు సమయంలోనే భూముల రికార్డులను సరిచేసింది. ఈ వివరాలను ఆధారంగా చేసుకునే.. ‘రైతుబం«ధు’ చెక్కులను, కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసింది. రైతులందరికీ బీమా.. రైతు కుటుంబాలకు అండగా ఉండేందుకు రాష్ట్రంలోని రైతులందరికీ రూ.5 లక్షల బీమా పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తెస్తోంది. నాలుగో రాష్ట్రావతరణ వేడుకల కానుకగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రకటించనున్నారు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న ప్రతి రైతుకు బీమా చేసి... ప్రమాదమైనా, సాధారణ మరణమైనా, మరే కారణంతో చనిపోయినా పది రోజుల్లోనే రూ.5 లక్షల పరిహారం అందించేలా ఏర్పాట్లు చేసింది. ఇక రాష్ట్రంలోని అరకోటి రైతు కుటుంబాలకు ధీమానిచ్చేందుకు టీఆర్ఎస్ సర్కారు వ్యూహాత్మక చర్యలు చేపట్టింది. రాష్ట్ర రైతు సమన్వయ సమితి పేరుతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. దానికి రూ.200 కోట్ల మూలధనాన్ని సమకూర్చింది. రైతులను సంఘటితం చేయడంతో పాటు పంటల ఉత్పత్తి, మార్కెటింగ్‌లో రైతు సమితులు క్రియాశీల పాత్ర పోషించేలా ప్రణాళికలూ సిద్ధం చేసింది. వీటికితోడు రాష్ట్రంలోని గొల్ల, కుర్మ, యాదవ సామాజిక వర్గానికి నేరుగా లబ్ధి చేకూర్చేలా గొర్రెల పంపిణీని ప్రారంభించింది. ఇప్పటికే 75 శాతం సబ్సిడీపై దాదాపు రెండున్నల లక్షల గొర్రెల యూనిట్లను పంపిణీ చేసింది. పరుగులు పెడుతున్న పనులు.. ‘తెలంగాణ.. కోటి ఎకరాల మాగాణ’అన్న లక్ష్యం దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు వేగిరం చేసింది. నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తూ.. ఇటు కొత్త ప్రాజెక్టుల పనులను శరవేగంగా పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో వివిధ ప్రాజెక్టుల కింద 2014 నుంచి ఇప్పటివరకు ఏకంగా 10.95 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రావడం గమనార్హం. దీంతోపాటు మరో 9.81 లక్షల ఎకరాల ఆయకట్టునూ స్థిరీకరించారు. ఇక ఈ ఖరీఫ్‌లో కొత్తగా మరో 8.89 లక్షల ఎకరాలకు నీరందించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మరో నాలుగేళ్లలో 55.50 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నారు. గత నాలుగేళ్లలో ప్రాజెక్టులపై 50,120 కోట్లు ఖర్చు చేయగా.. మరో లక్ష కోట్లను ఖర్చు చేయనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి గోదావరి జలాలను తరలించేలా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపుహౌజ్‌ల పనులు సాగుతున్నాయి. రోజుకు ఒక టీఎంసీ చొప్పున 90 రోజుల్లో 90 టీఎంసీలను తరలించి.. పది లక్షల ఎకరాలకు నీరివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే తొలి మూడేళ్లు ప్రతిష్టాత్మకంగా అమలైన మిషన్ కాకతీయ పథకం మాత్రం ఈ ఏడాది కొంత నీరసించింది. అందరికీ సంక్షేమం.. సీఎం కేసీఆర్ చేపట్టిన మరో ప్రతిష్టాత్మక పథకం మిషన్ భగీరథ. ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని ప్రకటించిన కేసీఆర్.. పథకాన్ని వేగంగా పరుగులు పెట్టించారు. ఈ జూన్‌లోగా గ్రామాల అంతర్గత పనులు పూర్తి చేయాలని భావించారు. కానీ పలు చోట్ల జాప్యంతో పనులన్నీ ఇంకా చివరి దశలోనే ఉన్నాయి. దీంతో వచ్చే డిసెంబర్ నాటికి అన్ని గ్రామాల్లో ఇంటింటికీ నీరందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. గతేడాదిలో కేసీఆర్ కిట్ పేరుతో గర్భిణులు, బాలింతలకు ఉపయుక్తంగా ఉండే పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. ఈ ఏడాది అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ‘తెలంగాణ కంటి వెలుగు’పేరుతో త్వరలోనే పల్లెపల్లెనా అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక నాలుగేళ్లుగా విజయవంతమైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఇచ్చే నగదును ప్రభుత్వం రూ.75 వేల నుంచి రూ.లక్షా పదహారుకు పెంచింది. కొత్తగా బోదకాలు బాధితులకు పింఛన్ అందించాలని నిర్ణయించింది. కొత్త పీఆర్సీ.. బదిలీలు.. కొత్త రాష్ట్రం ఏర్పాటై, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో ఉద్యోగులకు 43 శాతం పీఆర్సీ ప్రకటించిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. గడువు ప్రకారం తాజాగా కొత్త పీఆర్సీని నియమించింది. గత నాలుగేళ్లుగా ఉద్యోగుల బదిలీలకు దూరంగా ఉన్నా.. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈసారి సాధారణ బదిలీలకు అవకాశం కల్పించింది. నియామకాలపై అసంతృప్తి ఉద్యోగ నియామకాల విషయంలో విమర్శలను ఎదురవుతున్న నేపథ్యంలో.. టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగో ఏడాది దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. వచ్చే ఎన్నికల నాటికి మొత్తంగా 1.12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. 2018 ఆగస్టుకల్లా ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని గతేడాది స్వాతంత్రం దినోత్సవం రోజున సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ నియామకాలు 56 వేలకు మించకపోవటంతో సర్కారు సైతం అసంతృప్తిగానే ఉంది. ఇక మొదట్లో అన్ని ఉద్యోగాల భర్తీ బాధ్యతలను టీఎస్పీఎస్సీకి అప్పగించిన ప్రభుత్వం.. నత్తనడక ప్రక్రియలు నడుస్తుండటంతో రెసిడెన్షియల్ స్కూళ్ల నియామకాలకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసింది. కొత్త పంచాయతీ చట్టం.. గడువులోపే ఎన్నికలు నిర్ణీత గడువులోగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమైంది. గ్రామాల్లో సర్పంచుల బాధ్యతలను మరింత పెంచుతూ కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చింది. సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీల రిజర్వేషన్ల కాలపరిమితిని పదేళ్లకు పొడిగించింది. సర్పంచ్‌లతోపాటు ఉప సర్పంచులకు ఉమ్మడిగా చెక్ పవర్ ఉండేలా నిబంధనలు చేర్చింది. కొత్త జోన్లతో సంచలనం కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పాత జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. కొత్తగా ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లను ప్రతిపాదించింది. స్థానికతకు కొత్త నిర్వచనం ఇవ్వడంతోపాటు రాష్ట్ర, మల్టీజోన్, జోన్, జిల్లా కేడర్లలో 95 శాతం పోస్టులను స్థానికులతోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోసం కేంద్రానికి ఫైలు పంపించింది. సచివాలయానికి దూరంగా..! నాలుగో ఏడాదిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి కూడా సచివాలయంలో అడుగు పెట్టలేదు. పూర్తిగా ప్రగతిభవన్ కేంద్రంగానే పాలన చేస్తున్నారు. జనహిత వేదికగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి కొత్త సచివాలయం నిర్మించాలని భావించినా వీలుకాలేదు. సచివాలయం నిర్మాణం రక్షణ శాఖ భూములు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. దీనిపై కొంతవరకు చర్చలు జరిగినా ఫలితం రాలేదు. ఇక రాష్ట్ర విభజనకు సంబంధించిన వివాదాలు ఇంకా సమసిపోలేదు. ఏపీ తమ అధీనంలో ఉన్న సచివాలయ భవనాలు అప్పగించకుండా జాప్యం చేసింది. హైకోర్టు విభజన, తొమ్మిది, పదో షెడ్యూల్లలోని సంస్థలకు సంబంధించిన అంశాలు సైతం పరిష్కారానికి నోచుకోలేదు. ప్రపంచం దృష్టి తెలంగాణపై.. గత ఏడాదిలో ప్రధాని మోదీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో రైలు పట్టాలెక్కింది. ఇక హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నాలుగో ఏడాదిలో హైలైట్‌గా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక రాష్ట్రంలోని బీబీనగర్ ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం నుంచి సూత్రప్రాయ అనుమతి లభించింది. నల్లగొండ, సూర్యాపేటల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. సిద్దిపేట మెడికల్ కాలేజీలో ఈ ఏడాది ప్రవేశాలు కూడా మొదలవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ హయాంలో మంజూరైన ఐటీఐఆర్‌కు కేంద్రం వీడ్కోలు పలికింది. -
అమ్మా! మియ్యావ్
ప్రకృతిని కూడా పుస్తకాల్లోనే చూసి నేర్చుకోవడం అలవాటైపోయింది! అయితే పుస్తకాలు తెరవకముందే పిల్లల ఆలోచనల్ని తెరిపిస్తుంది ప్రకృతి. ‘‘బుక్‌లో ఏమేమున్నాయి? చూద్దామా కృతి బంగారూ’’ గారంగా కూతుర్ని ఒళ్లోకి తీసుకుంది అమ్మ.అమ్మ చేతిలోని ‘మై ఫస్ట్ ఎబిసి’ బుక్ లాక్కుని తనే ఓపెన్ చేసింది కృతి. సి పేజీ ఓపెన్ అయింది.క్యాట్ అని చెప్పాలా... మాతృభాషలో పిల్లి అని నేర్పించాలా... తల్లికి మీమాంస.‘‘అమ్మా! మియ్యావ్’’ అంటూ రెండు చేతులను గొంతు కిందకు చేర్చి కళ్లు పెద్దవి చేసి మూతిని సున్నాలా చుట్టింది ఒకటిన్నర ఏళ్ల కృతి.పేజీలు తిప్పుతున్నారిద్దరూ. హెచ్ పేజీలో కోడి ఉంది. ‘హెన్’ పలకడం ఈజీ, మాటలు పూర్తిగా నేర్చుకున్న తర్వాత ‘కోడి’ అని నేర్పించవచ్చు... అనుకునే లోపే...‘‘అమ్మా! బోబు... బో బ్బో బ్బో... కొక్కొక్కో...’’ రెక్కలు విచ్చినట్లు చేతుల్ని చాచి చెప్పింది కృతి. తల్లి మురిపెంగా చూసింది కృతిని.పిల్లలకు తల్లే తొలి గురువు. తల్లి కంటే ముందు ప్రకృతే గురువు. ఆ తల్లికి చిన్నప్పుడు నేర్పించింది కూడా ప్రకృతే. పెద్దయ్యాకే పుస్తకాలు నేర్పించాయి. పుస్తకాలతో నేర్చుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి ప్రకృతిని కూడా ప్రకృతిలో కాకుండా పుస్తకాల్లోనే నేర్చుకోవడం అలవాటైపోయింది! అయితే పుస్తకాలు తెరవకముందే పిల్లల ఆలోచనల్ని తెరిపిస్తుంది ప్రకృతి.ప్రకృతిలో భాగంగానే నేర్పేవారు ఉంటారా లేక ప్రకృతే నేర్పుతుందా అని వర్డ్స్ వర్త్ ఓ చోట సంశయపడతాడు. నేర్పేవారు ఎవరైనప్పటికీ నేర్చుకోవడం అన్నది మనిషి ప్రవృత్తి. ఆ ప్రవృత్తే మనిషిని ప్రకృతి దగ్గరకు తీసుకెళుతుంది. ఆ తర్వాతే పుస్తకాలు. గురువర్యులు. -
మిమ్మల్ని మీరు స్మార్ట్ అనుకుంటుంటారా?
సెల్ఫ్‌చెక్ నేను డైలాగేస్తే చప్పట్లు మోగాల్సిందే... నేను చాలా స్టైల్, మీ అందరికంటే నేనే అందగా ఉంటాను... యు నో ఐ యామ్ సో ఇంటెలిజెంట్... ఇలాంటి డైలాగులేస్తూ వారికి వారు గొప్పతనాన్ని ఆపాదించుకొనే వారిని మన మధ్య చూస్తూనే ఉంటాం. వీరు వాస్తవానికి చాలా దూరంగా ఉంటారు. ఊహల్లో తేలిపోతుంటారు. దీనివల్ల ఇబ్బందులెదుర్కొంటున్నా, ఎదుటివారి ముందు చులకనవుతున్నా ఏమీ పట్టనట్టే ఉంటారు. చాలా ప్రశాంతంగా, బాధలు లేనట్లు కనిపించటానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి ప్రవృత్తి మీలో కూడ ఉందా? 1. ఎంత బిజీగా ఉన్నా మీ హెయిర్‌స్టైల్, డ్రెస్ కరెక్ట్‌గా ఉండేలా చూసుకుంటారు. ఎ. అవును బి. కాదు 2. కొత్తకొత్త ఇతర భాషాపదాలు నేర్చుకొని వాటిని ఇతరుల ముందు మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు 3. కొత్తగా ఏదైనా వస్తువు కొంటే దాన్ని ఇతరులకు చూపించకుండా ఉండలేరు. ఎ. అవును బి. కాదు 4. మీకు తెలిసిన విషయాలను అందరికీ చెప్తుంటారు. అవి ఎదుటివారికి ఇబ్బంది కలిగిస్తున్నాయా లేదా అనే విషయాన్ని గుర్తించరు. ఎ. అవును బి. కాదు 5. మీ చుట్టూ ఉన్నవారందరికంటే మీరే స్మార్ట్ (చురుకైన/అందమైన) అని మీ ఫీలింగ్ ఎ. అవును బి. కాదు 6. మీకు పరిచయమున్న వీఐపీలను కలిసే అవకాశమొస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు. ఒక వేళ మీరు వారిని కలవలేకపోతే చాలా దిగాలు పడతారు. ఎ. అవును బి. కాదు 7. మీ సామర్థ్యం గురించి అందరికీ తెలిసినా అంతకంటే ఎక్కువగా మీ నుంచి ఎదుటివారు ఎక్స్పెక్ట్ చే స్తారనుకుంటారు. ఎ. అవును బి. కాదు 8. బయటకెళ్లినప్పుడు ఇతరుల ముందు గొప్పకోసం మీకు ఇష్టంలేని ఆహారపదార్థాలను కూడ తినటానికి ట్రై చేస్తారు. ఎ. అవును బి. కాదు 9. మీకు ఇబ్బంది కలుగుతున్నా ఏమీ జరగనట్టే అందరిముందు యాక్ట్ చేస్తుంటారు. ఎ. అవును బి. కాదు 10. కారణం లేకుండానే నవ్వుతుంటారు. పేలని జోకులేస్తూ అందరినీ నవ్వించటానికి ప్రయత్నిస్తారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు ఏడు వస్తే మీ చర్యలతో పక్కవారికి విసుగు పుట్టిస్తుంటారు. మీరే స్మార్ట్ అని పిలిపించుకోవాలని ఆరాటపడటాన్ని మీతోటివారు గమనించి మిమ్మల్ని చూసి నవ్వుకుంటుంటారు. మీరు చాలా కూల్‌గా ఉంటారని మీ ఫీలింగ్ కాని మీ చేష్టల వల్ల మిమ్మల్ని మీరే చులకనగా మలచుకుంటుంటారు. ‘బి’ లు ఆరు దాటితే మీరు చాలా డీసెంట్‌గా ఉంటారు. మీ హద్దుల్లో మీరుంటారని అర్థం. -
వింతైన కఫ్ఫులు...
మారుతున్న ఫ్యాషన్, ట్రెండ్‌ను బట్టి మనమూ మారుతుండాలి. ఒకప్పుడు చెవికి ఎన్ని రంధ్రాలు, కమ్మలు ఉంటే అంత అందం అనుకునేవారు. తర్వాత ఒకే చోట దుద్దులు పెట్టుకోవడమే ఫ్యాషన్. కానీ ఇప్పుడో... ఇయర్ కఫ్స్ అని కొత్తగా ఫ్యాషన్ ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి. రెండు మూడు ఎక్స్ట్రాగా కుట్టించుకొని మరీ రింగ్స్, స్టడ్స్ పెట్టుకుంటున్నారు. అంతేకాదు... భారీ సైజులో ఉండే రెడీమేడ్ కఫ్స్ కూడా ఇప్పుడు ఫ్యాషన్. అంటే, వీటిని పెట్టుకోవడానికి చెవికి రంధ్రాలు ఉండాల్సిన పని లేదు.. ప్రెస్ చేస్తే సరి. అమాంతం చెవికి అతుక్కుపోతాయి. వీటిని షాపుల్లో కాకుండా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే..? ఇలా... కావలసినవి: కాపర్ లేదా స్టీల్ వైర్ (సన్నది, దృఢమైనది), కటింగ్ ప్లయర్, గ్లూ, పూసలు, చిన్న సైజు రాళ్లు తయారీ: ముందుగా ఇయర్ కఫ్స్ ఏ ఆకారంలో కావాలో నిర్ణయించు కోవాలి. తర్వాత దానికి తగ్గట్టు వైర్‌ను కటింగ్ ప్లయర్ సాయంతో మెలితిప్పు కుంటూ కట్ చేసుకోవాలి. ఎలాంటి ఆకారాన్ని తయారు చేసినా.. చివర్లను మాత్రం మెలితిప్పుకోవాలి. లేదంటే అవి చెవులకు గుచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే, ఈ తీగలకు కావలసిన చోట, డిజైన్‌ను బట్టి పూసలు ఎక్కించొచ్చు లేదా రాళ్లను గ్లూ సాయంతో అతికించొచ్చు. ఈ ఇయర్ కఫ్స్‌లో హ్యాంగింగ్స్ కూడా ఉంటాయి. ఒక్కో డిజైన్‌లో దళసరి తీగకు సన్నని తీగ చుట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఆ డిజైన్ మరింత అందంగా ఉంటుంది. అయినా ఓసారి పక్కనున్న ఫొటోలను చూడండి. తయారీ, డిజైన్ సెలక్షన్ అంతా మీకే అర్థమవుతుంది. -
టాట్రూస్
ఒకప్పటి రోజుల్లో కొంతమంది తమకు ఇష్టమైన వారి పేరునో, ఇష్టదైవం ఆకృతినో, తమ మత చిహ్నాన్నో మాత్రమే పచ్చబొట్లుగా పొడిపించుకుని, పచ్చబొట్టూ చెరిగీ పోదులే అంటూ పాటలు పాడుకునేవారు. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. వొంటిమీద... ఇంకా చెప్పాలంటే వొళ్లంతా సందులేకుండా వింత వింత టాటూలు వేయించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్. అదోవిధమైన క్రేజ్. అయితే అలా ఎక్కడపడితే అక్కడ టాటూలు వేయించుకోవడమంటే కోరికోరి ముప్పును కొని తెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఎందుకంటే టాటూలు వేయడానికి వాడే పరికరాలు కనుక అపరిశుభ్రంగా ఉంటే బ్యాక్టీరియా త్వరగా వృద్ధిచెందే అవకాశం ఉందట. దానిమూలంగా ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. టాటూలు వేయించుకునేవారిపై యూరోపియన్ కమిషన్స్ జాయింట్ రిసెర్చ్ (జేఆర్సి) నిర్వహించిన ఒక సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. సాధారణంగా టాటూలంటే పలురకాలైన ఇంకులను చర్మంలోకి చొప్పించి, వాటిని దీర్ఘకాలం పాటు కనిపించేలా చేయడమే! ఇక్కడే అసలు చిక్కొచ్చిపడుతోంది. అదేమంటే, అలా చొప్పించే ఇంకులన్నీ రసాయనాలతో కూడుకున్నవి కావడం, ఒకవేళ ఆ ఇంకు కనుక వొంటికి సరిపడకపోతే అది క్రమేపీ చర్మసంబంధ క్యాన్సర్‌కి దారితీస్తుందట. అదేవిధంగా టాటూలు వేసేందుకు వాడిన ఇంజెక్షన్ సూదుల్లాంటి పరికరాలు కనుక సరైన పద్ధతిలో శుభ్రం చేయకపోతే అలర్జీ సంబంధమైన పలు ఇతర రకాల ఇబ్బందులూ తలెత్తుతాయి కాబట్టి, ఒకవిధంగా చెప్పాలంటే ఎక్కడపడితే అక్కడ అంటే చవగ్గా పొడుస్తున్నారు కదా అని మరీ రోడ్డుపక్కన కూర్చోబెట్టి టాటూలు వేసే వారి వద్దకు వెళ్లిపోకండి మరి! -
ప్యాంట్ విత్ లేస్...
డెనిమ్ ప్యాంట్స్ నేటి అమ్మాయిల ఫేవరేట్. వార్డ్‌రోబ్‌లో తప్పక చేరుతున్న క్యాజువల్ వేర్. దీనిని స్టైల్‌గా, స్పెషల్ అనిపించేలా తీర్చిదిద్దాలంటే సింపుల్ అనిపించే ఓ చిన్న ఐడియాను ఆచరణలో పెట్టేయడమే. అదేంటో ఫొటోలో చూస్తే తెలిసిపోతుంది కదా! ఒకవైపు ప్యాంట్‌ని కట్ చేసి దానికి లేస్ డిజైన్ని జత చేయండి. స్టైల్ ప్యాంట్ ఇలా మీ ముందు రెడీ! స్టెప్ 1: బ్లాక్, వైట్.. లేస్ డిజైన్, రంగు ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్యాంట్‌కి ఏ భాగంలో లేస్ జత చేయాలో సరిచూసుకోవాలి. అందుకు మోకాలు, థైస్, పాకెట్, ఫుల్ లె గ్ లెంగ్త్.. మార్క్ చేసిన చోటే ప్యాంట్‌ను కట్‌చేయాలి. ముందే ఎంచుకున్న కాంబినేషన్ లేస్‌ను ప్యాంట్‌కి జత చేసి కుట్టాలి. దీంతో చూడముచ్చటైన లేస్ డెనిమ్ ప్యాంట్ రెడీ అవుతుంది. స్టెప్ 2: ప్యాంట్‌ను కట్ చేయాల్సిన అవసరం లేకుండా పై నుంచి లేస్ డిజైన్‌ను వేయాలనుకున్నవారు ప్యాచ్ వర్క్ చేసుకోవచ్చు. ఫ్లోరల్ ప్రింట్లు ఉన్న లేస్ డిజైన్స్ ఎంచుకోవాలి. ఎంత లెంగ్త్, ఏయే భాగంలో లేస్ వేయాలో మార్క్ చేసుకొని ఆ ప్రకారం లేస్‌ను గమ్‌తో అతికించాలి. తర్వాత కుట్లు వేయాలి. స్టెప్ 3: పొట్టివైన ప్యాంట్లకు అడుగు భాగాన లేస్‌ను జతచేయ వచ్చు. అలాగే డెనిమ్ కెప్రీస్, షార్ట్స్‌కు లేస్ జత చేస్తే ఓ కొత్త స్టైల్ ప్యాంట్ స్పెషల్వేర్గా మీ ముందు ఉంటుంది. నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతుంది. -
బై బై బాయ్స్!
అవకాశాల్లో... ఆసక్తిలో... ఎనర్జీలో... ఎచీవ్‌మెంట్‌లో.. అమ్మాయిలకు అబ్బాయిలకు తేడా లేనప్పుడు వాళ్లు వేసుకునే డ్రెస్సుల్లో మాత్రం తేడా ఎందుకు?! డైనమిక్‌గా.. స్మార్ట్‌గా.. ముచ్చటగా అనిపిస్తున్నారు. ఒకప్పుడు బాయ్స్ జోన్ అయిన ఈ డ్రెస్సులు ఇప్పుడు అమ్మాయిలు ఎంజాయ్ చేస్తున్నారు. బై బై.. బాయ్స్...!! క్యూట్ గర్ల్స్‌కి డిజైనర్ సూచనలు.. మగవారి వేషధారణలో తప్పనిసరి అయిన దుస్తులు ఇప్పుడు మగువల వార్డ్‌రోబ్‌లో ముందస్తుగా చేరుతున్నాయి. మరీ ముఖ్యంగా కూల్ క్రిస్ప్ షర్ట్స్, టైలర్డ్ బ్లేజర్స్, డెనిమ్స్, సిగరెట్ ప్యాంట్స్.. వంటి మెన్స్‌వేర్ ముందువరసలో ఉంటున్నాయి. మగవారి వస్త్రధారణలో ఎంత బాగున్నా స్త్రీ సహజత్వ మెరుగులు కనిపించేలా తయారైతేనే మరింత స్టైలిష్‌గానూ అందంగానూ కనిపిస్తారు. మగవారి డ్రెస్సింగ్ కదా! అనుకోనక్కర్లేదు. ఇప్పుడు ఇదే స్ట్రీట్ స్టైల్ ట్రెండ్ జాబితాలో చేరిపోయింది. మీ హృదయానికి నచ్చిన డ్రెస్సింగే కాలానికి తగ్గట్టుగా ఉంటే అదే అతి పెద్ద ట్రెండ్‌గా మెరుస్తుంది. ఈ తరహా వస్త్రధారణలో ఉన్నప్పుడు సింపుల్‌గా అనిపించాలి. ఆభరణాలు, మేకప్ నప్పవు. క్యాజువల్ వేర్ కదా అని మరీ ఒంటికి అతుక్కుపోయేలాంటి దుస్తులు ధరించకూడదు. ఎబ్బెట్టుగా కనిపిస్తారు. -
పుష్కర ట్రెండ్ గురూ..!
పుష్కరాలకు ప్రత్యేక టీషర్టు, టోపీల విక్రయం విజయవాడ(గుణదల): నగరంలో పుష్కరాల సందడి మొదలైంది. వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విజయవాడ పుష్కరాల్లోనూ తమ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇక్కడ వ్యాపారులు వినూత్న ఆలోచనలతో ముందుకెళుతున్నారు. నగరంలోని గాంధీనగర్‌కు చెందిన ఓ వస్త్ర దుకాణ వ్యాపారి, వన్‌టౌన్‌కు చెందిన ఓ మార్వాడి వస్త్ర వ్యాపారి పుష్కరాలపై ప్రత్యేకంగా టీ షర్టులు, టోపీలను రూపొందించి విక్రయిస్తున్నారు. ఒక్కో టీ షర్టు సైజు, క్వాలిటీని బట్టి రూ.100 నుంచి 300 వరకు ఉంది. వీరికి ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సంస్థల నుంచి పెద్ద మొత్తంలో ఆర్డర్లు వస్తున్నాయి. గత పుష్కరాలకూ సుమారు 6 వేల టీషర్టులు, వెయ్యి టోపీల వరకు విక్రయించామని వ్యాపారస్తులు తెలిపారు. స్టోర్స్వేర్ క్లాత్‌తో రూపొందించే ఇవి కాలర్ లేకుండా తయారు చేస్తున్నారు. వ్యాపారులు సామాజిక మాధ్యమాల ద్వారా ‘కృష్ణా పుష్కరాలు-2016’ డిజైన్ చేసి ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు నిర్వహిస్తున్నారు. -
మారిన మావోయిస్టుల పంథా
పార్వతీపురం: చేతిలో తుపాకీ... నెత్తిన టోపీ... కాళ్లకు బూట్లు... యూనిఫామ్‌తో ఒకప్పుడు కనిపించిన మావోయిస్టులు వారి పంథాను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. జనం కోసం... వారిలో ఒకరిగా కలసిపోయి సమస్యలపై పోరాడేందుకు... గిరిజన సంప్రదాయ దుస్తులు... వారి అలంకరణతో కలసిపోయి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్వతీపురం పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఇటీవల మావోయిస్టుల అలికిడి ఉన్నట్లు సమాచారం. వీరు ఆయా ప్రాంతాలకు చెందిన గిరిజనులతో మమేకమై వారి సమస్యలు పరిష్కరించేందుకు... గిరిజనుల బతుకులు బాగుచేస్తామంటూ వారికి దగ్గరవుతున్నట్లు సమాచారం. విస్తృతంగా సమావేశాలు వారి కొత్త వ్యూహంలో భాగంగా ఆయా ప్రాంతాలకు చెందిన గిరిజనులతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు వినికిడి. ఆయా గ్రామాల్లోని గిరిజనులను గ్రూపులుగా తయారు చేసి, వారి ద్వారానే సమస్యలు వివరింపజేసి... తామెలా దోపిడీకి గురవుతోందీ తెలియజేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల వైఫల్యాలను ఎదిరించడంపై వారికి శిక్షణనిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా గిరిజనులు సారాకు బానిసవుతున్న విషయాన్ని గుర్తించి, తయారు చేస్తున్న వారిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తయారీ నియంత్రణకు చురుగ్గా పనిచేసేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏఓబీలో సారా తయారు చేస్తున్నవారిని హెచ్చరించినట్లు సమాచారం. మౌలిక సదుపాయాలపై విప్పుతున్న గళం గిరిజన గ్రామాలకు, గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించలేని అధికారులు, పాలకుల అసమర్ధత, నిర్లక్ష్యంపైనా ప్రశ్నించేలా గిరిజనులను చైతన్య పరుస్తున్నట్టు తెలుస్తోంది. ప్రపంచం మినరల్ వాటర్‌వైపు పరుగులిడుతున్న తరుణంలో గిరిజనులు కనీసం గుక్కెడు మంచినీటికి నోచుకోకపోవడంపై మావోయిస్టులు వారిని చైతన్యపరుస్తున్నారు. ఏఓబీలో మరలా పట్టు సాధించేందుకు గట్టి కృషి చేస్తున్నట్లు సమాచారం. -
బంపర్ బొనాంజాతో దూసుకుపోతున్న ఐటీసీ
ముంబై : ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ ఐటీసీ సోమవారం నాటి మార్కెట్ లో దూసుకుపోతోంది. 12 వరుస త్రైమాసికాల క్షీణత తర్వాత ఈసారి లాభాలను నమోదు చేయడంతో ఐటీసీ షేర్లు మార్కెట్లో జోరుగా ట్రేడవుతున్నాయి. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక లాభాల్లో 5.67 శాతం వృద్ధిని నమోదు చేసింది. శుక్రవారం ఐటీసీ క్యూ 4 ఫలితాల్లో రూ 10, 060 కోట్ల అమ్మకాలతో దాదాపు రూ 2,500 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.2,361.18 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర అమ్మకాలు 9.51 శాతం పెరిగి రూ.10,062.38 కోట్లకు చేరాయని ఐటీసీ బీఎస్ఈకి వెల్లడించింది. 2014-15 ఇదే త్రైమాసికంలో రూ.9,188 కోట్ల అమ్మకాలను నమోదు చేసింది. బోనస్: మెరుగైన ఫలితాల నేపథ్యంలో 1:2 నిష్పత్తిలో (ప్రతి రెండు షేర్లు ఒక షేరు ) బోనస్ షేర్లను ప్రకటించింది. బోనస్ షేర్ల జారీతో పాటు ఒక రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో సాధారణ షేరుకు రూ.8.50 డివిడెండ్‌ను(షేరుకు రూ .2 ప్రత్యేక డివిడెండ్ సహా ) ఇచ్చేందుకు బోర్డు సమ్మతి తెలిపింది. ఫలితంగా బీఎస్ఈలో సంస్థ షేరు పరుగులు తీస్తోంది. . బుల్లిష్ ట్రెండ్: ఐటీసీ లాభాలపై మార్కెట్ ఎనలిస్టులు, అంచనా సంస్థలు పాజిటివ్ గా స్పందించాయి. రాబోయే 2017సం.రానికి ఐటీసీ మరింత పుంజుకుని రెండంకెల ఆదాయ వృద్ధిని నమోదు చేస్తుందని క్రెడిట్ స్యూజ్ కంపెనీ భరోసా ఇస్తోంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఎబిట్(ఈబీఐటి) 9 శాతం ఆదాయాన్ని సాధించి అగ్రస్థానంలో నిలస్తుందని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది.అటు డ్యుయిష్ బ్యాంక్ సహా ట్రేడింగ్ సంస్థలన్నీ ఐటీసీ షేరు ధరలు మరింత పెరగనున్నాయని అంచనావేశాయి. సాధారణ వర్షపాతం అంచనాలతో ఎఫ్ ఎంసీజీ వ్యాపారాన్ని జోరు పెంచిందనా అంచనావేస్తున్నారు. ఒక్కో షేరు 400 రూ. లను చేరుతుందని భావిస్తున్నారు. కాగా సోమవారం ఐటిసి 5 అధిక శాతం పెరిగి రూ 347 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీలో అత్యధిక లాభాలతో మార్కెట్ ను లీడ్ చేస్తోంది. ఐటీసీ వ్యాపారంలో ప్రధానమైన సిగరెట్లపై10 శాతం ఎక్సైజ్ సుంకం వృద్ధితో కంపెనీ సిగరెట్ ధరలను 10-13 శాతం పెంచిందని షేర్ ఖాన్ తెలిపింది. ఐటీసీ అగ్రి వ్యాపారం రూ 1,800 కోట్లకు పెరగ్గా, కంపెనీ హోటళ్లు / పేపర్ వ్యాపారం 4.8 శాతం పెరిగింది. -
కంగనాపై వ్యాఖ్యలు, మండిపడ్డ హృతిక్
ముంబయి: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పై ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యల పట్ల హీరో హృతిక్ రోషన్ మండిపడ్డారు. కంగనాను ఆడిపోసుకుంటూ ట్విట్టర్లో వస్తున్న వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా స్పందించారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిర్ణయించడం వ్యక్తిత్వం లేని చర్య అని హృతిక్ మండిపడ్డారు. అది ఏదైనా అయి ఉండొచ్చని, అవసరం అయితే ప్రేమను పంచాలిగానీ ఇలా ఒకరిని బయటకు ఈడ్చడం అపాయకరమైన చర్య అని అన్నారు. హృతిక్ రోషన్, కంగనా రనౌత్ మధ్య ప్రత్యక్ష యుద్ధం జరుగుతోందంటూ మీడియాలో కథనాలు వస్తుండగా.. అదేం లేదన్నట్లుగా హృతిక్ రోషన్ స్పందించారు. కంగనా రనౌత్‌కు హృతిక్ రోషన్ తో ఉన్న సంబంధాల గురించి కొంతమంది ట్విట్టర్లో అసభ్యకరమైన వ్యాఖ్యలు పెట్టారు. 'నేను కంగనా నటనను ఇష్టపడతాను. కానీ క్యారెక్టర్ లెస్ కంగనా దిగజారుడు జిమ్మిక్కులకు కాదు' అని ఓ ట్విట్టర్ యూజర్, 'ప్రచారం కోసం వివాదాస్పద అంశాన్ని కంగనా ఉపయోగించుకుంటుంది. ఇది చాలా దిగజారుడుతనం. క్యారెక్టర్ లెస్ కంగనా' అన మరో వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దీనిపైనే హృతిక్ ఘాటుగానే స్పందించారు. -
శ్రీమతి ధోతి
లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అబ్బాయి కడితే ఆర్డినరీ ధోతీ అమ్మాయి కడితే సింప్లీ సూపర్బ్! శ్రీమతి ధోతీ .. దీనికి లేదు ఏదీ సాటి. మగవారి ధోతీ కట్టు ఆడవారి ఫ్యాషన్ డ్రెస్‌గా మారి చాలా కాలమైంది. కానీ, ఇప్పటికీ ట్రెండ్‌లో కంఫర్ట్ సూట్‌గా ముందువరసలో సెటిల్ అయి కూర్చుంది. వెదర్, వెరైటీ రెండూ ఈ ‘కట్టు’ను మరీ ఆకట్టుకునేలా చేస్తున్నాయి. సందర్భానికి తగ్గట్టు డిజైనర్స్ ఎప్పటికప్పుడు కొత్త టచ్ ఇవ్వడంతో ధోతీ ‘కట్టు’ చూపులను కట్టడిచేస్తోంది. ధోతీ.. డిజైనర్ టిప్స్ పండగల్లోనూ విశేషంగా నిలుస్తోన్న ఈ స్టైల్‌ని మీరూ ఇంట్లోనే ఫాలో అయిపోవచ్చు. దోతీ ప్యాంట్స్, సూట్స్ అన్ని రకాల సైజుల్లో లభిస్తున్నాయి. ఎత్తు తక్కువ ఉన్నవారు ధోతీ ధరిస్తే మంచి హీల్ ఉన్న శాండల్స్ ధరించాలి. అలాగే, ఎక్కువ కుచ్చులు లేకుండా చూసుకోవాలి. టాప్‌గా షార్ట్ కుర్తీను ఎంచుకోవాలి.జార్జెట్, సిల్క్, క్రేప్, షిఫాన్, కాటన్.. ఇలా ఫ్యాబ్రిక్ ఎంపికలో శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువ కుచ్చులు వచ్చే ధోతీ ప్యాంట్ అందంగా ఉంటుంది. ప్లెయిన్ ధోవతి అయితే బ్లౌజ్ లేదా టాప్ మంచి పువ్వుల ప్రింట్లు, ఎంబ్రాయిడరీ చేసిన హాల్టర్ నెక్వి ఎంచుకోవాలి. ధోతి రంగులోనే ఉండే మ్యాచింగ్ బ్లౌజ్ లేదా టాప్ వేసుకుంటే సాదాసీదాగా కనిపిస్తారు. అందుకే ఎప్పుడూ కాంట్రాస్ట్ కలర్ టాప్ ఎంచుకోవాలి. రెడీ మేడ్ ధోతినీ ధరించి, నడముభాగాన ఒకవైపు 3-4 చీరకుచ్చులను టక్ చేయాలి. కుచ్చులు మరీ పెద్దగా, అలాగని చిన్నవిగా కాకుండా కనీసం 4 ఇంచులు ఉండాలి.ఎడమవైపు కొంగు భాగాన్ని నడుము చుట్టూ తిప్పి, ఎడమభుజం మీదకు తీసుకొచ్చి పిన్ చేయాలి. కుచ్చిళ్లు ముందు, వెనక, భుజం మీదుగా సరిగ్గా వచ్చాయో లేవో చెక్ చేసుకుంటే సరిపోతుంది. - రితుకుమార్, ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ -
హెడ్ టు టోయ్ ప్రామోనోయ్...
సిటీకి ఇప్పుడు ప్రామ్ థీమ్ అనే సరికొత్త ఫీవర్ పట్టుకుంది. ఈ ట్రెండీ థీమ్‌ను అనుసరించి ఫ్రాక్‌ల నుంచి షూస్ దాకా ఎన్నో వచ్చేశాయి. వీటన్నింటిని మేళవించి నిర్వహించే వేడుకలను ప్రామ్ థీమ్ పార్టీలంటున్నారు. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన ఈ ట్రెండ్ సిటీని ప్రస్తుతం పట్టి కుదిపేస్తోంది. - శిరీష చల్లపల్లి కాగితపు పూలతో తయారు చేసిన కిరీటాలు... బుట్ట గౌను, ఫ్రాక్‌లు.. విచిత్రంగా అనిపించే ఫ్యాన్సీ ఆభరణాలు.. యాక్ససరీస్.. టాప్ టు బాటమ్ వెరైటీగా అనిపించే లుక్‌తో ఆశ్చర్యపరిచే అమ్మాయిలే ప్రామ్ పార్టీకి సింబల్స్. నగరంలో పెరుగుతున్న ప్రామ్ క్రేజ్‌కు ఈ పార్టీలే నిదర్శనం. ప్రామ్.. ఫ్రమ్ అమెరికా పాశ్చాత్య దేశాల నుంచి పుట్టుకొచ్చిన ట్రెండ్ ఇది. అక్కడి హైస్కూళ్లలో సీనియర్లు, జూనియర్లు కలిసిన సందర్భాల్లో విద్యార్థినులు నిర్వహించే డ్యాన్స్ మేళవించిన వేడుకలే ఈ ప్రామ్ థీమ్ పార్టీలు. అమెరికా, కెనడా, యూకేలలో ఎక్కువగా కనిపిస్తాయి ఈ ప్రామ్ సెలబ్రేషన్స్. ఇప్పుడు మన నగరానికి కూడా వచ్చేశాయి. ఆద్యంతం.. ఆకట్టుకునే లుక్.. సాధార ణంగా సిటీలో జరిగే థీమ్ పార్టీల్లో వేదిక నుంచి అన్నీ థీమ్‌కు తగ్గట్టుగా ఉంటాయి. అయితే ఈ ప్రామ్ పార్టీల్లో థీమ్ అంతా వ్యక్తికే పరిమితం. ఈ పార్టీలకు హాజరయ్యే వ్యక్తి తల నుంచి కాళ్ల దాకా పూర్తి సెపరేట్‌గా డెకరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తలకి కాగితపు పూలతో తయారు చేసిన కిరీటం పెట్టుకోవడంతో ఇది మొదలవుతుంది. రంగురంగుల గులాబీలతో తలకు కిరీటంలో ధరించే ప్రామ్ హెడ్‌బ్యాండ్ ఈ పార్టీ థీమ్‌కి సరైన సింబల్. ఇక ఫ్లోర్ లెన్త్ ఫ్రాక్లాగా పొడుగ్గా మోకాళ్ల కిందకి ఉంటూనే స్లీవ్ లెస్ టచ్ ఇచ్చి.. అక్కడక్కడ ట్రాన్స్పరెంట్గా ఉండే వాటిని ప్రామ్ ఫ్రాక్ అని వ్యవహరిస్తున్నారు. నియాన్ గ్రీన్, నియాన్ పింక్, ఫంకీ బ్లూ, చిల్లీ రెడ్, కార్బన్ బ్లాక్ రంగులు కలిగిన ఫ్రాక్‌లు ఈ పార్టీలకు ఎక్కువగా డిజైన్ చేస్తారు. ఇక ఈ పార్టీకి షైనింగ్ ప్రామ్ స్పెషల్ జ్యువెల్లరీ కూడా ఉంది. స్పింజెడ్ స్టోన్స్‌తో అందంగా మెరిసే ప్రామ్ మిడ్ రింగ్స్, కళ్లు మిరిమిట్లు గొలిపేలా హైహీల్ ప్రామ్ షూస్ మార్కెట్లో ప్రత్యేకంగా లభిస్తున్నాయి. ఇలా తల నుంచి కాలి వరకు ఒక సరికొత్త థీమ్ డ్రెస్సింగ్‌తో అమ్మాయిలు తమదైన శైలిలో ప్రామ్ పార్టీలు జరుపుకుంటున్నారు. ఈ తరహా పార్టీలకు ఈ డ్రెస్ కోడ్ తప్పని సరి. దీని కోసం స్పెషల్ ఏంజల్ లుక్‌లో మెరిసిపోతూ ట్రెండ్‌ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు ప్రామ్ గర్ల్స్. ప్రామ్ ఫ్రాక్‌లు రూ.1500 నుంచి లభ్యమవుతున్నాయి. విభిన్న రకాల ప్రామ్ జ్యువెల్లరీ ఆన్లైన్లో అందుబాటులో ఉంది. -
ట్రెండ్ అవుతున్న 'బీజేపీ కౌంట్స్ కండోమ్స్'!
న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్యూ)పై బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ అహూజ చేసిన వ్యాఖ్యలు ఆన్లైన్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. జెఎన్యూ వ్యవహారంలో బాధ్యతారహితమైన వ్యాఖ్యలను చేసిన ఆయన పట్ల బీజేపీ అధినాయకత్వం కన్నెర్ర జేసింది. వెంటనే ఢిల్లీకి వచ్చి ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని సదరు ఎమ్మెల్యేను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశించినట్టు తెలుస్తోంది. 'జెఎన్యూలో మూడు వేల బీర్ బాటిళ్లు, రెండువేల భారత మద్యం బాటిళ్లు, 10వేల సిగరెట్ పీకలు, నాలుగు వేల బీడీలు, 50వేల మాంసం ఎముకలు, రెండువేల చిప్ కవర్లు, మూడువేల వాడిన కండోమ్‌లు, 500 అబార్షన్ ఇంజెక్షన్లు ప్రతిరోజూ లభిస్తాయి' అని రాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో బీజేపీ ఒక్కసారిగా ఆన్లైన్లో ట్రెండింగ్ అంశమైపోయింది. బీజేపీ కౌంట్స్ కండోమ్స్ (#BJPCountsCondoms) హ్యాష్ ట్యాగ్‌తో ఈ వ్యాఖ్యలపై విమర్శలు, సెటైర్లు ఆన్లైన్లో వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే అహూజా (63) గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసి వివాదాలు రేపారు. కాలేజీ చదువులు చదవని ఆయన ప్రతి ఏడాది జరిగే 'రామ్‌లీలా' నాటకంలో రావణ పాత్ర పోషించడం ద్వారా కూడా ప్రముఖుడయ్యారు. -
ఉగ్రవాదుల నయా ట్రెండ్!
న్యూఢిల్లీ: ఉగ్రవాదులు తమ ట్రెండ్ మార్చారు. మార్కెట్లు, రద్దీగా ఉండే ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని కాకుండా.. రాజకీయ నాయకులను కూడా టార్గెట్ చేసి దాడులు జరపడానికి కుట్ర పన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులకు తాజాగా అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదుల విచారణలో తేలింది. రాజకీయ నాయకులు, విదేశీయులు, కీలక ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరపాల్సిందిగా వారికి స్పష్టమైన ఆదేశాలు అందినట్లు అధికారులు గుర్తించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారం మేరకు జాతీయ దర్యాప్తు బృందం అధికారులు దేశవ్యాప్తంగా పలువురు అనుమానితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఎన్ఐఏ అధికారులు 12 మందిని కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వారికి ఫిబ్రవరి 5వ తేదీ వరకు రిమాండ్ విధించింది. నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. -
యువమార్గం... మార్పు కోసం
నేడు జాతీయ యువజన దినోత్సవం పెదగంట్యాడ యువత అంటే లక్ష్యాల సాధన కోసం అహర్నిశలు కష్టపడే ఒక వర్గం. యువత అంటే పెడదారి పట్టడానికి సిద్ధంగా ఉన్న వర్గమని మరికొందరి అభిప్రాయం. ఈ రెండూ విభిన్న దృక్పథాలు. స్ఫూర్తి నింపే వ్యక్తులుంటే పెడదారి నుంచి సన్మార్గం పట్టే అవకాశాలే మెండుగా ఉంటాయి. ఇందుకు కావలసిందల్లా సరైన మార్గదర్శనం. కర్తవ్య దీక్ష, స్పష్టమైన లక్ష్యాలు, ఆశావహ దృక్పథం. ప్రస్తుత సమాజంలో యువత లక్ష్యాలు, చేరుకోవాలనుకునే గమ్యాలు అంత సులభమైనవి కాదు. 1950లలో యువతరానికిఅక్షరాస్యత ఉంటే ఉద్యోగం వచ్చేది. తర్వాత 60లలో కొంచెం పోటీ పెరిగింది. 70, 80లు వచ్చే సరికి చేతిలో డిగ్రీలు, ఖాళీ కడుపులతో రోడ్లపై తిరిగే నిరుద్యోగులు అడుగడుగునా కనిపించేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒకరి దగ్గర ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది... సొంతంగా చిన్న ఎంటర్‌పెన్యూర్‌షిప్ తీసుకుని కాలేజ్ పూర్తికాక ముందే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు చదువు లక్ష్యం ఉద్యోగం సంపాదించడం మాత్రమే. కానీ ఇప్పటి యువతకు ఉద్యోగం కన్నా మంచి జీవితం ముఖ్యం. ఏదో సాధించాలనే తపన ఉత్సాహం ఉరకలు వేస్తుంది. కొత్తదనం కోసం కాకుండా సమాజంలో ఒక మార్పు కోసం ప్రయత్నించే యువకులు మన చుట్టూ ఎందరో ఉన్నారు. అందులో కొందరైనా మిగిలిన యువతలో స్ఫూర్తి నింపుతారు. మార్గదర్శకులవుతారు. సమాజానికో సందేశం... ఒక ప్రవేట్ స్కూల్లో టీచర్‌గా ఉద్యోగం చేస్తూ జీవితం సాగించే అప్పలరెడ్డి, డాన్స్ టీచర్‌గా పని చేస్తున్న మధు అనే ఇద్దరు యువకులు కలిసి ఇండియా యూత్ ఫర్ సొసైటీ అనే స్వచ్చంద సంస్థను స్థాపించారు. దానిని నిర్వహించడానికి అష్ట కష్టాలు పడ్డారు. ఉన్న కొంత సమయంలోనే అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం నిషేధించడం గురించీ, బీచ్ పరిసరాలను శుభ్రం చేయడం గురించి ఎన్నో సందేశాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. వైఎంసీఏ దగ్గర ఫ్లాష్‌మాబ్‌లు నిర్వహించి యువతను ఆకర్షించేవారు. ద్వారకా నగర్ జంక్షన్లో ప్లకార్డులతో ట్రాఫిక్‌పై అవగాహన కల్పించారు. ఇప్పటికీ ఎవరికి వారు తమ ఉద్యోగాలు చేసుకుంటూనే వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనాథ బాలల సేవలో... మురళీనగర్ జనరేషన్ యువ.... ఇది కూడా నలుగురి యువకుల లక్ష్యమే, వైజాగ్‌లో చైల్డ్ బెగ్గర్స్‌ను రూపు మాపడానికి అహర్నిశలు కష్టపడ్డారు. చివరకు సాధించారు. వారి వద్ద ఇప్పుడు 60 మందికి పైగా అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారిని రక్షించడానికి అర్ధరాత్రిళ్లు కూడా పిల్లల వెంట పరుగులు తీసి వాళ్ల చేత రాళ్ల దెబ్బలు తిన్నారు. ఇంజినీరింగ్ చదివి, విదేశాల వెళ్లి ఉద్యోగంలో స్ధిరపడాల్సిన సమయంలో ఒక చిన్న సంఘటన ద్వారా నరేష్ అనే యువకుడు సమాజానికి ఏదో చెయ్యాలని తాపత్రయ పడడంతో మొదలైన జనరేషన్ యువ ప్రారంభం అయింది. సాహసం, ధైర్యం నిండిన యువత కావాలి.... నెత్తురులో ఓజస్సు, నరాల్లో సత్తువ, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కావాలి...కార్యోన్ముఖులను చేసే ఆలోచనలు ఉండాలి. తనపై తనకు అచంచలమైన విశ్వాసం, స్థిర నిశ్చయం కలిగి, కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి నిత్యం సంసిద్ధంగా ఉండడమే యువ లక్షణం -
వెన్ను పూలు
అమ్మాయిల వెన్ను(బ్యాక్) డిజైనర్లకు ఓ క్యాన్వాస్గా మారినట్టు ఉంది. అందుకే బ్యాక్ డిజైన్స్ డ్రెస్సుల ట్రెండ్ ఇప్పుడు వరసకట్టింది. ఎన్నెన్నో పువ్వులు, లతలు.. వెన్నుపైన ఎంతో అందంగా, మరెంతో హుందాగా మెరిసిపోతున్నాయి. మొన్న మొన్నటి వరకు డిజైనర్లు చుడీదార్ నెక్ డిజైన్స్‌కి ఫ్రంట్ మీదే దృష్టి పెట్టేవారు. ఇప్పుడు కాస్త గాలి వెనక్కి మళ్లి.. వెన్ను మీద మరింత అందంగా రూపుకడుతున్నారు. బ్యాక్ డిజైన్స్ ఒక బ్లౌజ్లకేనా! అలా అని సరిపెట్టేసుకునే రోజలు కావివి. సాదాసీదా బ్యాక్ నెక్ డిజైన్ డ్రెస్సులు కంఫర్ట్ కోసం అయితే పర్వాలేదు. కానీ, పార్టీలో ఎదుటివారి చూపులు ఎనకే వెంబడించాలంటే మాత్రం బ్యాక్ డిజైన్ డ్రెస్సులు తప్పనిసరి. లేసులు.. ప్రింట్లు.. ఇవి ఓ మోస్తారు సాదాసీదా ఎంపికయే. అయినా వెన్ను మొత్తం ఆవరించేలా డిజైన్ ఉంటే మీరే అట్రాక్టివ్. అలాంటి డిజైన్ ఉన్నవాటిని ఎంపికచేసుకోవడమే కాదు, మీరే స్వయంగా డిజైన్ చేసుకోవచ్చు కూడా! ఫ్రంట్ కన్నా మిన్నగా కాలర్, రౌండ్, హాల్టర్.. నెక్ మోడల్స్ ఎన్ని వచ్చినా అవి డిజైన్‌తో తళుక్కుమనాల్సిందే! ఛాతిభాగం మొత్తం డిజైన్‌తో ఆకట్టుకున్నా అదేమంత స్టైల్ కాదు. అందరూ కాస్త ఎక్కువో, మరికాస్త తక్కువో ఫ్రంట్ డిజైన్ చుడీదార్ వేసుకునేవారే. అందరిలో ప్రత్యేకంగా కనిపించాలంటే మాత్రం బ్యాక్ డిజైన్ సృజనాత్మకంగా ఉండాలి. హారాలన్నీ వెన్నుకే మెడలో నగలు ముందున్నవారికి ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అలాగని నగలు వెనకేసుకోలేరు. అందుకే డిజైనర్లు ఎంబ్రాయిడరీ హారాలను డ్రెస్ వెనకాల అందంగా అల్లేస్తున్నారు. మణిమరకతాల్లాంటి స్టోన్స్‌తో వాటిని రూపుకట్టేస్తున్నారు. ఈ హారాలను చూస్తే బంగారు హారాలు చిన్నబోయేలా ఉన్నాయి. వేడుకలకే వెన్ను క్యాజువల్ డ్రెస్సులకు వెన్నుపైన సాదాసీదా ప్రింట్లు ఉన్నవి ఎంపిక చేసుకోవాలి. అదే పార్టీలకైతే స్వరోస్కి, జర్దోసి, కుందన్స్, చెమ్కీ.. ఇలా అన్నింటి మేలవింపు డిజైన్స్ ఇంపుగా ఉంటాయి. వయసు, ఎత్తు, లావు.. వీటిని దృష్టిలో పెట్టుకొని తమ శరీరాకృతికి తగిన బ్యాక్ డిజైన్లను ఎంచుకోవడంలో ఎవరి ఎంపిక వారిదే! నాలుగురాళ్లే కాదు నాలుగు డిఫరెంట్ బ్యాక్ డిజైన్స్ ఉన్న డ్రెస్సులను కూడా మీ వార్డ్‌రోబ్‌లో చేర్చండి. పార్టీ వేర్కి పర్ఫెక్ట్గా సూటయ్యే ‘బ్యాక్’తో మీ వెనకే చూపులను కట్టిపడేయండి. - ఎన్.ఆర్ నెటెడ్ ఫ్యాబ్రిక్ వచ్చాక బ్యాక్ కోసం ఎన్నో కొత్త డిజైన్లు పుట్టుకువచ్చాయి. వాటిలో ట్రాన్స్పరెంట్ డిజైన్ ఆకట్టుకుంటోంది సన్నగా ఉన్నవారికి లాంగ్ బ్యాక్ డిజైన్స్ బాగా నప్పుతాయి బొద్దుగా ఉన్నవారు డ్రెస్ బ్యాక్ ట్రాన్స్పరెంట్ డిజైన్స్ కి వెళ్లకపోవడమే మంచిది. అలాగే ఎంబ్రాయిడరీ సింపుల్ అనిపించే డిజైన్స్‌ను ఎంచుకోవాలి ‘ఎ’ షేప్ శరీరాకృతి గలవారు వెన్ను పై భాగాన డిజైన్ ఎక్కువ ఉండేవి, ‘స్పూన్’ షేప్ శరీరాకృతి గలవారు వెన్ను కింది భాగాన డిజైన్ ఎక్కువ ఉండేవి ఎంచుకుంటే ఆకర్షణీయంగా కనిపిస్తారు. -
కనుగుడ్లకు పచ్చబొట్టు!
ఐ బాల్ టాటూ... ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఫ్యాషన్ ప్రియుల నేస్తంగా మారింది. ఆందోళనకరమైన ఈ కొత్త పోకడను జనం ప్రేమగా ఆహ్వానించేస్తున్నారు. ఒకరిని చూసి ఒకరు వారి కనుగుడ్లకు పచ్చబొట్టు పొడిపించుకుంటున్నారు. తెల్లగుడ్డుకు రంగులను ఇంజెక్ట్ చేయించుకుని... అందరికీ భిన్నంగా కనిపించేందుకు ఆరాటపడుతున్నారు. అమెరికన్ బాడీ మాడిఫికేషన్ ప్రతిపాదకుడు లూనా కోబ్రా స్థాపించిన ఈ ఐ బాల్ టాటూయింగ్ ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచాన్నే ఉర్రూతలూగిస్తోంది. అంధత్వానికి, క్యాన్సర్ కు కారణమౌతుందని వైద్యులు హెచ్చరిస్తున్నా ఫ్యాషన్ ప్రియులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వెర్రి వేయి విధాలు అన్నట్టుగా తయారైంది ఇప్పుడీ ఫ్యాషన్ల జోరు. వద్దన్నా వినకుండా అందం కోసం అర్రులు చాస్తూ... ప్రపంచాన్ని చూపించే కనుపాపకే ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు. కనుపాపకు చుట్టూ ఉండే తెల్లని గుడ్డు ప్రాంతానికి రంగులతో టాటూ వేయించుకొని సంబరపడిపోతున్నారు. జనం ధోరణి మారుతోందని... వారు విభిన్నంగా ఉండాలని కోరుకుంటున్నారని.. ఐ బాల్ టాటూయింగ్ ఓ కొత్త ట్రెండ్ మాత్రమేనని లూనా కోబ్రా అంటున్నారు. అయితే ఇది ఎవరికి వారు వేసుకునే ప్రయోగం చేస్తే ప్రమాదమౌతుందేమోనని వైద్యులు ఆందోళన చెందుతున్నారని కోబ్రా చెప్తున్నారు. జోయెల్ ట్రాన్, నేయీపయర్ దంపతులు వారి కనుగుడ్లకు టెన్నిస్ బాల్ రంగును, ద్రాక్ష రంగును వేయించుకున్నారని ఈ బాడీ మాడిఫికేషన్ ఆర్టిస్ట్ చెప్తున్నారు. అయితే ఇటీవల కనుగుడ్లకు లూనా కోబ్రా చేత నీలిరంగును వేయించుకుందన్న కైలీ గార్గ్ మాత్రం ఈ ఐబాల్ టాటూయింగ్ చేసేప్పుడు నొప్పిగా అనిపించకపోయినా... ఇదో భయానకమైన చర్య అని చెప్పడం విశేషం. -
యంగ్స్కర్ట్స్
యంగ్‌స్టర్స్ కోసమే పుట్టింది స్కర్ట్. కాలేజీ అమ్మాయిలే కాదుస్కర్ట్ వేసుకుంటే అమ్మలూ యంగ్‌గా కనపడతారు. ఈ కాలంది కాకపోయినా కాలంతో పనిలేకుండా ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది స్కర్ట్. సినీతారల మేనిపైనే కాదు ఫ్యాషన్ షోలలోనూ హొయలు పోతోన్న స్కర్ట్ నయా ట్రెండ్ విశేషాలు ఇవి.... కాలేజీ, కార్యాలయం, క్యాజువల్.. అంతటా తానై అతివల మదిని దోచుకుంటున్న డ్రెస్ స్కర్ట్. 1970 ల కాలం నాటి ఈ డ్రెస్ ఈ యేడాది బిగ్గెస్ట్ ట్రెండ్ జాబితాలో ముందువరసలో ఉంది. 1970’ల కాలంలో ’అ’లైన్ మ్యాక్సీ స్కర్ట్లు బాగా ప్రాచుర్యంలో ఉండేవి. ఆ తర్వాత ప్యాచ్‌వర్క్, కుచ్చుళ్లు, ఎంబ్రాయిడరీ...తో రకరకాల హంగులను స్కర్ట్‌కు తీసుకువచ్చారు డిజైనర్లు. ‘ప్రపంచంలోని అన్నిదేశాల్లోనూ స్కర్ట్ డిజైనింగ్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. దీంతో స్కర్ట్ డిజైన్స్‌లో విస్తృతి పెరిగింది’ అంటున్నారు భారతీయ ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ రితూకుమార్. ‘ఫ్యాషన్ డిజైనర్లందరి చేతుల్లోనూ మెరిసిన ఏకైక డ్రెస్‌గా స్కర్ట్ ను చెప్పుకోవచ్చు’ అంటారు మరో ప్రసిద్ధ డిజైనర్ నీతాలుల్లా. 70’ల కాలంనాటి స్కర్ట్ నాటి యూత్ మదిని షేక్ చేస్తే, 80’ల కాలం స్కర్ట్ చిలిపితనాన్ని కళ్లకు కట్టింది. 90’ల కాలంలో మనసును హత్తుకుంటూ వస్తున్న స్కర్ట్ ఈ దశాబ్దంలోనూ ఎన్నో అద్భుతాలకు వేదికగా మారి ఔరా అనిపిస్తోంది. నేటి ఫ్యాబ్రిక్... షిఫాన్, క్రేప్, కాటన్,.. అన్ని రకాల క్లాత్‌లతో స్కర్ట్స్‌ని అందంగా ముస్తాబు చేయవచ్చు. ఇప్పుడు క్రష్డ్, డెనిమ్ ఫ్యాబ్రిక్‌తో ఎన్నో వైవిధ్యమైన స్కర్ట్లు చూపుతిప్పుకోనివ్వని డిజైన్లలో రూపుకడుతున్నాయి. రూ.200/- నుంచి లభిస్తున్న ఈ స్కర్ట్స్‌ను కాస్త డిజైనింగ్ సృ్పహ, కుట్టుపని తెలిసిన ఎవరైనా సొంతంగా తయారుచేసుకోవచ్చు. - ఎన్.ఆర్ సన్నగా ఉంటే లాంగ్ స్కర్ట్... కాళ్లు సన్నగా ఉన్నవారు ఫుల్ స్కర్ట్ ధరించాలి. లేదా మోకాలి కిందవరకూ ఉన్న స్కర్ట్‌ను ఎంచుకోవాలి.లాంగ్ స్కర్ట్స్ వేసుకున్నప్పుడు ఫిట్‌గా ఉండే టాప్ ధరించాలి. దీని వల్ల నడుము కింది భాగంలో స్కర్ట్ గొడుగు ఆకారంలా కనిపించి, చూడ్డానికి అందంగా ఉంటుంది.శరీరాకృతిని బట్టి రంగులు, ఫ్యాబ్రిక్స్‌ను ఎంచుకోవాలి. ప్రింట్లు ఉన్న ఫ్యాబ్రిక్‌ను స్కర్ట్‌కు ఎంచుకుంటే టాప్ ప్లెయిన్ లేదా తక్కువ ఎంబ్రాయిడరీ ఉన్నది ఎంచుకోవాలి. వేసవిలో పొట్టి స్కర్ట్స్, చలికాలంలో పొడుగు స్కర్ట్లు, వర్షాకాలంలో మిడ్ స్కర్ట్స్ బాగుంటాయి. స్కర్ట్ మీదకు క్రాప్‌టాప్ అందంగా ఉంటుంది. క్రాప్‌టాప్ మీదకు లేయర్డ్ డ్రెస్‌ను వేసుకుంటే స్టైలిష్‌గా కనిపిస్తారు. స్కర్ట్ ధరించినప్పుడు మెడ లో స్కార్ఫ్ అదనపు ఆకర్షణ. -
ప్రపంచ ట్రెండ్‌గా 'సెల్ఫీ విత్ డాటర్'
న్యూఢిల్లీ: ఇప్పుడు ఎక్కడ చూసినా తమ చిన్నారి కూతుర్లను, పెద్దవారైతే వారిని తమ గుండెలకు హత్తుకుని సెల్ఫీలు తీసుకునే పనిలో తండ్రులు పడ్డారు. ఒకటి కాకుంటే మరొకటి అనుకుంటూ వేర్వేరు కోణాల్లో తమ సెల్ ఫోన్లలో బందిస్తున్నారు. ఇదిప్పుడు కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పాకుతుండటంతో ఒక కొత్త ట్రెండ్ సృష్టించిన దేశాల జాబితాల్లో తాజాగా భారత్ కూడా చేరినట్లయింది. లింగ వివక్షను దూరం చేయాలని, కూతుర్లను కూడా కొడుకులతో సమానంగా చూడాలని బ్రూణ హత్యలు తగ్గించాలనే ఉద్దేశంతో పంజాబ్ లోని సునిల్ జగ్లాన్ అనే ఓ గ్రామ పంచాయతీ పెద్దాయన కూతురితో సెల్లో సెల్ఫీ తీసే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అలా ఫొటోలు తీసి పంపించినవారిలో కొన్నింటిని ఎంపిక చేసి బహుమతుల ప్రధానం కూడా పెట్టాడు. దీంతో అది మెల్లమెల్లగా పాకి అందరు తండ్రులు తమకూతుర్లతో సెల్ఫీలు దిగుతున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం మాట్లాడిన రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్'లో పంజాబ్ గ్రామపెద్ద చేసిన పనిని కొనియాడిన మరుక్షణం నుంచి అది కాస్త మరింత ఊపందుకుంది. మన్ కీ బాత్ కార్యక్రమం ఒక్క భారత్ ప్రజలే కాకుండా విదేశాల్లోని వారు ఫాలో అవుతుండటంతో మోదీ పిలుపునందుకు ఇప్పుడు అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవీస్, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ భేడిలాంటివారు కూడా దీనికి ఆకర్షితులై తమ కూతుర్లతో కెమెరాల్లో సెల్ఫీలు క్లిక్ మనిపించారు. -
ట్రెండ్ మారింది గురువా... తప్పదు!
అరుణ కిరణం... మమతల కోవెల...ఎర్ర మందారం... మామగారు... అన్న... పవిత్ర బంధం... హిట్లర్... పెళ్లి చేసుకుందాం... గోకులంలో సీత... అన్నయ్య... ఇలాంటి సూపర్ హిట్ సినిమాలను డెరైక్ట్ చేసింది ముత్యాల సుబ్బయ్య. ఎప్పుడూ వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో కనిపిస్తూ... ‘గురువా’ అంటూ స్వచ్ఛంగా పలకరించే ఈ పెద్దాయన ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అది తెలుసుకోవడానికే ‘సాక్షి’ ప్రయత్నించింది. ఆయన్నుకలిసి ముచ్చటించింది. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఊపిరి సలపకుండా సినిమాలు చేశారు. ఇప్పుడు ఒక్కసారిగా నిశ్శబ్దం. ఎలా ఉంది? ఎల్లకాలం మనమే రాజ్యం ఏలాలంటే కుదరదు. ట్రెండ్ మారింది గురువా... తప్పదు. దాన్ని స్వాగతించాలి. మా రోజుల్లో పెద్ద సినిమాలు, మోస్తరు సినిమాలు, చిన్న సినిమాలు... ఇలా మూడు రకాలుండేవి. నేను ఈ మూడు రకాల సినిమాలూ చేసేవాణ్ణి. సుబ్బయ్య పెద్ద సినిమాలు మాత్రమే తీస్తాడు అనే పేరు నాకు ఎప్పుడూ లేదు. నా ‘దీవించండి’ సినిమా తర్వాత ట్రెండ్ మారింది. సినిమాల్లో స్టార్డమ్ రాజ్యమేలడం ప్రారంభించింది. చిన్న సినిమాలు చచ్చిపోయాయి. మిడిల్ క్లాస్ హీరోలు కనుమరుగయ్యారు. నేను తీసే కుటుంబ కథలు టీవీల్లో సీరియల్స్‌లా వచ్చేస్తున్నాయి. చిరంజీవితో ‘అన్నయ్య’ వంటి పెద్ద హిట్టు తీసిన తరువాత కూడా పెద్ద సినిమాలు రాకపోవడానికి కారణం? ‘పవిత్రబంధం’ సినిమాను కన్నడంలో చేయమని అల్లు అరవింద్ అడిగారు. తీసిన కథనే తీయడం దేనికి? ఇక్కడే ఓ సినిమా ఇవ్వొచ్చు కదా! అనడిగితే... ‘అన్నయ్య’ ఇచ్చారాయన. చాలా పెద్ద హిట్ అది. కానీ... నా దురదృష్టం ఏంటంటే ఆ సినిమా తర్వాత నుంచే మన హీరోల మైండ్‌సెట్‌లో మార్పు మొదలైంది. కొత్తదనం కోసం తాపత్రయపడటం మొదలు పెట్టారు. మళ్లీ సుబ్బయ్యతో ఏం వెళతాం. ఈ దఫా ఇంకొకరితో పోదాం... అనే ధోరణికి వచ్చేశారు. నేను చేసేది నచ్చక వాళ్లు వేరే వాళ్ల దగ్గరకు వెళ్లలేదు. కేవలం కొత్తదనం కోసమే వెళ్లారు. ఇప్పటికి ఎన్ని సినిమాలు చేసుంటారు? 51 సినిమాలు చేశా. వాటిలో ‘ఇదేం ఊరురా బాబు’(2001) మాత్రం విడుదల కాలేదు. అందులో ఆకాశ్, ప్రత్యూష హీరో, హీరోయిన్లు. మీలోని మరో కోణం... సామాజిక స్పృహతో కూడిన సినిమాలు. నవభారతం, ఎర్రమందారం, అరుణకిరణం, అన్న... ఇవన్నీ ఆ కోవకు చెందినవే. మళ్లీ ఇలాంటి సినిమాలు చేయొచ్చుగా. ఆ ట్రెండ్ ఇప్పటికీ ఎవర్గ్రీన్ కదా? నేను రెడీ. సామాజిక స్పృహతో సినిమాలు తీద్దాం అనుకునే నిర్మాతలు ఎవరున్నారు చెప్పండి? ఈ తరం బ్యానర్లో టి.కృష్ణగారితో నేను పనిచేస్తున్నప్పుడు.. కథను కొత్తగా ప్రజెంట్ చేయాలని తపించిపోయేవారంతా. అలా ఆలోచించేవారు ఇప్పుడు లేరు. సినిమాకు డెరైక్టర్ కెప్టెన్ అంటారు కానీ... నిజానికి సినిమాకు కెప్టెన్ నిర్మాత. ఆయనకు అభిరుచి ఉంటే దర్శకుడు ప్రాణం పెడతాడు. అలాంటి నిర్మాతలు లేరు. ఇప్పడెవరైనా నిర్మాత అడిగితే, మీరెలాంటి సినిమా తీస్తారు? ఎలాంటి సినిమా తీస్తారని నిర్మాతను అడుగుతా. నిర్మాత మనసులోని కోరిక బట్టే నా సినిమా. నాకు సినిమా తప్ప వేరే తెలీదు. ఇప్పుడు నాకు సినిమాల్లేవ్ కానీ, ఇప్పటికీ నాకు ఆఫీస్ ఉంది. ఉదయం ఇక్కడకు వచ్చి కూర్చుంటా. బుక్స్ చదువుతా. సీడీలు పెట్టుకొని సినిమాలు చూస్తా. కాసేపు సీరియల్స్ చూస్తా. చివరగా... మీ సినీ ప్రస్థానాన్ని ఓసారి గుర్తు చేసుకుంటారా? మాది వ్యవసాయ కుటుంబం. నాన్నపేరు శంకరయ్య, అమ్మ పేరు శేషమ్మ. నెల్లూరు జిల్లా విడవలూరిలో బీకాం చేశా. అక్కడ్నుంచి సినిమాలపై ఆసక్తితో మద్రాస్ రెలైక్కాను. మొదట మానాపురం అప్పారావుగారి వద్ద చేరాను. ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత ఎ.సంజీవిగారు ‘సిసింద్రీ చిట్టిబాబు’(1971) చేస్తుంటే వెళ్లి చేరాను. అది అయ్యాక కొన్నాళ్లు ఖాళీ. తర్వాత పి.సి.రెడ్డిగారి వద్ద చేరాను. ఆయన దగ్గర చేస్తున్నప్పుడే ‘మూడుముళ్ల బంధం’తో దర్శకుణ్ణయ్యే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా ఆడకపోయే సరికి మళ్లీ ఖాళీ. నాకు ముగ్గురు పిల్లలు, భార్య. సంసారాన్ని ఎలా నడపాలి?అందుకే మళ్లీ కో డెరైక్టర్‌గా పి.సి.రెడ్డిగారి వద్దే చేరాను. ఆ టైమ్‌లోనే టి.కృష్ణగారు ‘విప్లవశంఖం’ సినిమా నిర్మించారు. దర్శకుడవ్వాలనేది ఆయన కోరిక. అందుకే ‘నేటి భారతం’ కథ కూడా రెడీ చేసుకున్నారు. మంచి కో డెరైక్టర్ కోసం వెతుకుతున్నప్పుడు పి.సి.రెడ్డిగారు నా పేరు సూచించారు. అలా టి.కృష్ణగారి సాంగత్యం లభించింది. మేం కలిసి చేసిన ‘నేటి భారతం’ పెద్ద హిట్. దేశంలో దొంగలుపడ్డారు, దేవాలయం, వందేమాతరం, ప్రతిఘటన... ఇలా ఆయన సినిమాలన్నింటికీ నేనే కో-డెరైక్టర్ని. ‘రేపటిపౌరులు’ మొదలు కాకముందే... నాకు ‘అరుణకిరణం’తో మరోసారి దర్శకునిగా అవకాశం వచ్చింది. ఆ సినిమా చేస్తూ... మరో వైపు ‘రేపటిపౌరులు’కి కో డెరైక్టర్‌గా చేశాను. ‘రేపటిపౌరులు’ సగం మీరే తీశారట కదా? అవును... ‘అరుణకిరణం’ అవకాశం రాగానే... ‘రేపటి పౌరులు’ సిట్టింగ్‌లో కూడా నేను కూర్చోలేదు. అయితే... అప్పటికే టి.కృష్ణగారికి క్యాన్సర్ అని తెలిసింది. ‘రేపటిపౌరులు’ రెండు రోజుల షూటింగ్ చేసి కృష్ణగారు అస్వస్థతకు గురయ్యారు. అలాంటి సమయంలో టి.కృష్ణగారి సలహాలు తీసుకుంటూ ఆ సినిమా పూర్తి చేశాను. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ టైమ్‌లో టి.కృష్ణగారు క్యాన్సర్ చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. ‘అరుణకిరణం’ విడుదలై విజయం సాధించిందని తెలిసి అమెరికా నుంచే అభినందనలు పంపారు. నిజంగా టి.కృష్ణగారి సాంగత్యం నా జీవితంపై ఎంతో ప్రభావం చూపించింది. బాలకృష్ణ-వాణిశ్రీలతో తీస్తే ఆ సినిమా పెద్ద హిట్టయ్యేది! నా తొలి సినిమా ‘మూడు ముళ్ల బంధం’ చాలా రిస్కీ సబ్జెక్ట్. భర్త కన్నా భార్య పెద్దదైతే? ఈ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. కానీ చాలామంది అది రాంగ్ అన్నారు. కృష్ణుని కంటే రాధ పెద్దది. రాముడి కంటే సీత వయసులో పెద్దది కాదా? సోక్రటీస్ కంటే ఆయన భార్య చాలా పెద్దది. అలాంటప్పుడు అది తప్పు ఎలా అవుతుంది? అసలు ఈ కథకు ఇన్స్పిరేషన్ మోదుకూరి జాన్సన్గారు. నేను పీసీరెడ్డిగారి వద్ద సహాయకునిగా చేస్తున్నప్పుడు ‘కొత్తకాపురం’ సినిమాలోని పాట కోసం మోదుకూరి జాన్సన్గారి ఇంటికెళ్లాను. వారి ఇంట్లో ఓ పెద్దావిడ ఉంది. ‘జాన్సన్...’ అని పిలుస్తోందావిడ. ‘మీ అమ్మగారు అనుకుంట పిలుస్తున్నారండీ...’ అన్నాన్నేను. ‘ఆవిడ మా అమ్మగారు కాదయ్యా... నా భార్య’ అన్నారు జాన్సన్ తాపీగా. నేను షాక్. ‘అదేంటిసార్’ అంటే... ‘అదంతా ఓ కథలే’ అన్నారాయన. ఇక ఆయన్ను నేను కదిలించలేదు. ఆ తర్వాత నాకు అసలు విషయం తెలిసింది. ఆమె నర్స్‌గా పనిచేస్తున్న రోజుల్లో జాన్సన్గారు చదువుకుంటూ ఉండేవారనీ, అనుకోకుండా సంభవించిన వారి పరిచయం ప్రేమగా మారి చివరకు పెళ్లికి దారి తీసిందనీ. ఆ భార్యభర్తల మధ్య పదిహేనేళ్ల తేడా. అప్పుడనిపించింది.. ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా ఎందుకు తీయకూడదు అని. అలా తయారైన కథే ‘మూడుముళ్ల బంధం’. ఆ పాయింట్ మింగుడు పడక ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందని చాలామంది అంటుంటారు. కానీ నిజానికి ఆ సినిమా ఫ్లాప్‌కి కారణం తారాగణం. నా అభిప్రాయం ఏంటంటే... పెద్దయ్యాక ఆ కుర్రాడు బాలకృష్ణ. హీరోయిన్ వాణిశ్రీ అని. అలా తీస్తే సినిమా పెద్ద హిట్. అసలు ఇప్పుడు రావాల్సిన కథ అది. కానీ ఏం లాభం... తొందరపడి కోయిల ముందే కూసేసింది. -
అన్నుల మన్నుల
మెరిసేదంతా బంగారం కాదు.. అందరికీ తెలిసిన సామెత. ఫ్యాషన్ ప్రపంచంలో మాత్రం మగువలను మురిపింపజేసేదంతా బంగారమే. పసిడితో ప్రాణం పోసుకుని నిగనిగలాడే నగలకు దీటుగా ధగధగలాడే ఆభరణాలు ఫ్యాషన్ సెక్టర్లో ఎన్నో ఉన్నాయి. వీనులను మెరిపించే దుద్దులైనా.. మెడను హత్తుకునే నెక్లెస్ అయినా.. మట్టితో తయారై మాణిక్యాల్లా మెరుస్తూ.. పుత్తడి ఆభరణాలను మరిపిస్తున్నాయి. అందుకే మనసుకు నచ్చి.. తనువుకు నప్పే నగలైతే చాలు.. దాన్ని దేంతో చేశారన్నది అప్రస్తుతం అంటున్న నారీమణులకు టైట జ్యువెలరీ వరంగా మారింది. మగువలకు జ్యువెలరీ కంటే ఇష్టమైంది మరొకటి ఉండదు. అందుకే స్వర్ణాభరణాలు ఎన్ని ఉన్నా.. మార్కెట్లోకి వచ్చే నయా ట్రెండ్ జ్యువెలరీని పక్కాగా ఫాలో అవుతుంటారు. నల్లపూసల హారం, చంద్రహారం, నెక్లెస్, వంకీలు, జుంకాలు.. బంగారంతో ఒక సెట్ చేయించుకోగలరు. కాస్త సిరిమంతుల ఇంతులైతే.. రెండు డిఫరెంట్ సెట్ల జ్యువెలరీ చేయించుకోగలరు. ఇన్ని ఉన్నా.. ట్రెండ్ మారిన ప్రతిసారీ దానికి తగ్గట్టుగా జ్యువెలరీ చేయించుకోవాలంటే అందరికీ సాధ్యం కాదు కదా..! అందుకే 1 గ్రామ్ గోల్డ్ వైపో.. రోల్డ్‌గోల్డ్ వైపో మొగ్గుచూపుతారు. ఈ కేటగిరీ మహిళలను టార్గెట్ చేసిన జ్యువెలరీ డిజైనర్లు టైట టెంపుల్ జ్యువెలరీకి అదనపు సొబగులు అద్ది మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. మట్టితో మాణిక్యాలు.. ప్రజెంట్ ట్రెండ్‌ను ప్రతిబింబిస్తూ.. ట్రెడిషనల్ లుక్ మిస్ కాకుండా మన ముందుకు వచ్చిన మోడల్ టైట టెంపుల్ జ్యువెలరీ. టైట బొమ్మల మాదిరి ఈ ఆభరణాలు కూడా మట్టితో తయారైనవే. మన్నుతో మన్నికైన ఆభరణాలు చేయడం అంటే మామూలా..! అందుకే బంగారు ఆభరణాలు చేసినంత జాగ్రత్తగా వీటిని తయారు చేస్తారు. లక్ష్మీ, సరస్వతీ దేవి వంటి దేవతా రూపాలు, విభిన్న డిజైన్లను లాకెట్లుగా మలిచి.. వాటికి రుద్రాక్షలు, ముత్యాలు, పగడాలు, రకరకాల రత్నాలు పొందికగా అటాచ్ చేసి జ్యువెలరీ లుక్ తీసుకొస్తారు. మట్టితోనే జుంకాలు సైతం తయారు చేస్తున్నారు. ఇన్నోవేటివ్ లుక్ సొంతం చేసుకున్న ఈ మట్టి ఆభరణాలను యువతుల నుంచి అమ్మమ్మల వరకు అందరూ సాదరంగా ఆహ్వానిస్తున్నారు. హ్యాండిల్ విత్ కేర్.. అన్ని రకాల సంప్రదాయ వస్త్రశైలులకూ ఈ జ్యువెలరీ అతికినట్టు సరిపోతుంది. అంతేకాదు ఫ్యాషన్ వేరింగ్కు నప్పుతుండటంతో యువతులు కూడా వీటిపై ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. చీరకట్టులో, చుడీదార్లో, లంగాఓణి, గాగ్రాచోలీ ఇలా ఏ రకమైన డ్రెస్సింగ్ చేసుకున్నా వాటిపైకి ఇవి ఇట్టే సెట్ అయిపోతున్నాయి. పైగా ధర తక్కువగా ఉండటంతో.. పండుగలకు, పబ్బాలకు తమ డ్రెస్సింగ్‌కు మ్యాచ్ అయ్యే మోడల్స్‌ను కొనుగోలు చేస్తున్నారు కొందరు. అంతేకాదు ఎప్పుడూ బంగారంలో మెరిసి బోర్ కొట్టిన వారు కాస్త డిఫరెంట్‌గా కనిపించడానికి కూడా వీటికి తమ జ్యువెలరీ సెట్లలో చోటిస్తున్నారు. అయితే వీటిని హ్యాండిల్ చేయడంలో మాత్రం జాగ్రత్త తప్పనిసరి అంటున్నారు డిజైనర్లు. మట్టితో చేసినవి కావడంతో ఏ మాత్రం చేజారినా.. పగిలే అవకాశం ఉంది. సో హ్యాండిల్ విత్ కేర్.. హ్యాపీ విత్ వేర్. శిరీష చల్లపల్లి -
ఉత్తరాదికీ... డిస్ట్రిబ్యూటర్ల తాకిడి?
ఒకరికి తెద్దునా... ఇద్దరికి తెద్దునా... అందరికీ తెద్దునా... అంటే ఇదే కావచ్చు! దక్షిణాది మొత్తంలో రికార్డు స్థాయి వసూళ్ళు సాధించే హీరో రజనీకాంత్‌కే ఇలా జరిగిందంటే, ఇక మామూలు హీరోల మాటేమిటని ఉత్తరాది హీరోలు ఇప్పుడు బెంబేలెత్తుతున్నారట! ఆ మధ్య విడుదలైన ‘లింగ’ చిత్రం పరాజయం పాలై, భారీ నష్టాలు మిగిల్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా వల్ల తమకు భారీ నష్టం వచ్చిందనీ, తమకు డబ్బులు వెనక్కి ఇవ్వాలనీ డిమాండ్ చేస్తూ తమిళ సినీ పంపిణీదారులు రజనీకాంత్ ఇంటి ముందే సామూహిక భిక్షాటన చేస్తామంటూ హెచ్చరించారు. తమిళనాట మొదలైన ఈ ‘ట్రెండ్’ ఎక్కడ ఉత్తరాదికి పాకుతుందోనని హిందీ హీరోలు సతమతమవుతున్నారని హిందీ సినీ వర్గాల కథనం. దక్షిణాదిలో కన్నా హిందీ సినీ రంగంలో ఫ్లాపుల రేటు, నష్టాలు ప్రస్తుతం భారీగా ఉన్నాయి. పెపైచ్చు, చాలామంది హిందీ హీరోలు ఇప్పుడు సొంతంగా సినిమాలు నిర్మిస్తున్నారు. రేపు పొద్దున రజనీకాంత్ చిత్రాల లాగానే తమ చిత్రాలకూ డిస్ట్రిబ్యూటర్లు వచ్చి గొంతు మీద కూర్చుంటే ఏం చేయాల్రా అని ఉత్తరాది తారలు తలపట్టుకు కూర్చున్నారు. మొత్తానికి, హిట్ల విషయంలోనే కాదు... ఈ విషయంలోనూ రజనీకాంత్ దెబ్బ హిందీ వాళ్ళకు తప్పదులా ఉంది. -
జస్ట్ ఫర్ కిడ్స
అంకెలు.. అక్షరాలు.. పదాలు.. వ్యాఖ్యలు.. సూక్తులు ఏవైనా ఎక్కడైనా అలంకారమే! ఇప్పుడివి గోడలపై, రకరకాల ఫర్నిచర్ రూపంలో పిల్లల్ని పలకరిస్తున్నాయి. వీటి ద్వారా పిల్లలకు వాటిపై అవగాహన కలగడంతో పాటు వారిలో ఆయా అంశాల పట్ల ఆసక్తి కలిగించడానికి వీలవుతుందని అంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. సిటీలో ఈ ట్రెండ్ ఇప్పుడు అంకెలు, లెక్కల ప్రాశాస్త్యాన్నీ, అక్షరాలు వర్ణమాలలోని ఆనుపానుల్నీ, పదాల భావసౌందర్యాన్నీ గుర్తు చేస్తూ అలరిస్తోంది. పదాలూ, పదబంధాలూ, చిత్రాలు, ప్రముఖుల మాటలు.. వీటిని పోస్టర్లు, ఫొటోల రూపంలో ఇప్పటి వరకు హాలు, బెడ్రూమ్, డ్రాయింగ్‌రూమ్, రీడింగ్‌రూమ్ గోడలకు అలంకారమయ్యేవి. ఇప్పుడవే ఫర్నిచర్ రూపంలో అలరిస్తున్నాయి. పిల్లల బెడ్రూమ్ గురించైతే ప్రత్యేకంగా చెప్పేదేముంది. రంగురంగుల అక్షరాలతో అలంకరిస్తే వాళ్ల ఆనందానికి అంతే ఉండదు. మాములుగా అక్షరాలనీ అంకెలనీ పుస్తకాల్లో చూపించో లేదో పలకమీద రాయమంటే ఓ పట్టాన మాట వినరు. అదే అక్షరాల్ని గోడలపై అందంగా కనిపిస్తే వాటిని ఏదో క్షణంలో చూస్తూ చదువుతారు. ఒకటికి పదిసార్లు చూస్తుండటం వల్ల అవి చిన్ని బుర్రల్లో పదిలమైపోతాయి. అయితే ఈ అక్షరాలనేవి గోడలమీద రాతలకే పరిమితం కాకుండా ఫర్నిచర్ రూపంలో వస్తున్నాయి. ఎక్కువగా బుక్ర్యాక్లు, టేబుల్స్, చైర్స్, బెడ్‌ల్యాంప్‌లు, ప్లవర్ వేజులు, గోడ గడియారాలు.. వంటివి అక్షర క్రమం వచ్చేలా రూపొందిస్తున్నారు. పిల్లల బంక్బెడ్స్లో ఏబీసీడీలు వచ్చేలా డిజైన్ చేస్తున్నారు. - విజయారెడ్డి -
అమ్మాయే ప్రపోజ్ చేయాలట!
సినిమాల్లోనైనా, వాస్తవజీవితంలోనైనా ప్రేమను ‘ప్రపోజ్’ చేసే విషయంలో అబ్బాయిలే ముందుండేవారు. ఒక చేత్తో గులాబి పువ్వు, ఇంకో చేతిలో లవ్‌లెటర్ పట్టుకొని అమ్మాయి చుట్టూ గింగిరాలు తిరిగేవారు. ఆమె ఓకే అనేంత వరకు ఒంటికాలి మీద తపస్సు చేసేవారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారినట్లు రకరకాల అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ‘‘నేను వెళ్లి ప్రపోజ్ చేయడమేమిటి? అయితే గీతే ఆమె ప్రపోజ్ చేయాలి’’ అనే వైఖరి 25 నుంచి 36 ఏళ్ల వయసు ఉన్న మగవాళ్లలో పెరుగుతుందని ‘షాది.కామ్’ పేర్కొంటుంది. ‘‘అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేయడంలో గొప్పేముంది? అమ్మాయి అబ్బాయికి ప్రపోజ్ చేయడంలోనే కిక్ ఉంది’’ అని 70 శాతానికి పైగా మగవాళ్లు అభిప్రాయపడుతున్నారు. ‘‘అమ్మాయికి ప్రపోజ్ చేయడం అనే విషయం బాగానే ఉన్నా, మనలాంటి సంప్రదాయ దేశాల్లో అది సాధ్యం కాదు. అమ్మాయే ప్రపోజ్ చేయాలనుకోవడం అత్యాశే అవుతుంది’’ అని కొద్దిమంది పురుషులు అంటున్నారు. ప్రపోజ్ చేయడంలో కూడా రెండు విధాలు ఉన్నాయి. 1. ముఖాముఖి 2. సెల్‌ఫోన్ సెల్ఫోన్లో కంటే ముఖాముఖిగానే అమ్మాయిలు చేసే ప్రపోజల్‌ను అబ్బాయిలు ఇష్టపడుతున్నారు.