నగరంలో పుష్కరాల సందడి మొదలైంది. వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విజయవాడ పుష్కరాల్లోనూ తమ ప్రత్యేకతను చాటుకుంటోంది.
పుష్కరాలకు ప్రత్యేక టీషర్టు, టోపీల విక్రయం
విజయవాడ(గుణదల): నగరంలో పుష్కరాల సందడి మొదలైంది. వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విజయవాడ పుష్కరాల్లోనూ తమ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇక్కడ వ్యాపారులు వినూత్న ఆలోచనలతో ముందుకెళుతున్నారు. నగరంలోని గాంధీనగర్కు చెందిన ఓ వస్త్ర దుకాణ వ్యాపారి, వన్టౌన్కు చెందిన ఓ మార్వాడి వస్త్ర వ్యాపారి పుష్కరాలపై ప్రత్యేకంగా టీ షర్టులు, టోపీలను రూపొందించి విక్రయిస్తున్నారు. ఒక్కో టీ షర్టు సైజు, క్వాలిటీని బట్టి రూ.100 నుంచి 300 వరకు ఉంది.
వీరికి ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సంస్థల నుంచి పెద్ద మొత్తంలో ఆర్డర్లు వస్తున్నాయి. గత పుష్కరాలకూ సుమారు 6 వేల టీషర్టులు, వెయ్యి టోపీల వరకు విక్రయించామని వ్యాపారస్తులు తెలిపారు. స్టోర్స్వేర్ క్లాత్తో రూపొందించే ఇవి కాలర్ లేకుండా తయారు చేస్తున్నారు. వ్యాపారులు సామాజిక మాధ్యమాల ద్వారా ‘కృష్ణా పుష్కరాలు-2016’ డిజైన్ చేసి ఆన్లైన్లోనూ విక్రయాలు నిర్వహిస్తున్నారు.