Pushkaralu
-
గంగానదీ పుష్కరాలు.. కాశీకి పోలేము రామా హరీ..!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి వారణాసి మీదుగా వెళ్లే దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో వెయిటింగ్ లిస్టు 400ను దాటింది. మే మొదటివారం వరకు ఇదే పరిస్థితి. గత రెండు నెలల నుంచి వచ్చేనెల వరకు వెయింటింగ్ చూపుతున్నా ఈ మార్గంలో మరో అదనపు రైలును అధికారులు నడపటం లేదు. వారణాసి పుణ్యక్షేత్రానికి నిత్యం తెలంగాణ నుంచి దాదాపు రెండు వేలమంది భక్తులు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులు ఎంతో ప్రత్యేకంగా భావించే గంగానదీ పుష్కరాలు ఈ నెల 22 నుంచి మే మూడో తేదీ వరకు కొనసాగనున్నాయి. పుష్కరాలు జరిగే తేదీలతోపాటు వాటికి అటూ ఇటూగా దాదాపు 2లక్షల మందికిపైగా భక్తులు కాశీ యాత్రకు వెళ్తారన్నది ఓ అంచనా. సాధారణ రోజుల్లోనే ఈ ఒక్క రైలు సరిపోక, రోడ్డు మార్గాన అంత దూరం వెళ్లలేక భక్తులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. అలాంటిది పుష్కరాల వేళ, రద్దీ అంతకు పదిరెట్లు పెరుగుతున్నా అదనపు రైలు ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించలేకపోవటం గమనార్హం. భారీగా పెరిగిన విమాన చార్జీలు సాధారణ రోజుల్లో కాశీకి విమాన టికెట్ ధర రూ.5 వేల నుంచి రూ.8 వేలుగా ఉండేది. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు టికెట్ ధర పెంచుకునే డైనమిక్ ఫేర్ విధానాన్ని ఇప్పుడు విమానయాన సంస్థలు బాగా వినియోగించుకుంటున్నాయి. గంగా పుష్కరాలకు భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుండటంతో ఒక్కో టికెట్ ధరను రెట్టింపు చేసి విక్రయిస్తున్నాయి. కీలక రోజుల్లో అది మరింత ఎక్కువగా ఉంటోంది. అంత ధరను భరించే పరిస్థితి లేనివారు దానాపూర్ ఎక్స్‌ప్రెస్ వైపే చేస్తున్నారు. ఆ క్లోన్ రైలును పునరుద్ధరించాలి కాశీ విశ్వనాథుడిని దర్శించుకునేందుకు వెళ్లే దక్షిణ భారత యాత్రికుల్లో తెలుగువారే ఎక్కువ. రైల్లో కాశీకి వెళ్లేవారికి దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ఒక్కటే దిక్కు. హైదరాబాద్, ఇతర పట్టణాల్లో పనిచేస్తున్న బీహార్ వలస కూలీలు కూడా ఈ రైలు మీదే ఆధారపడుతుంటారు. దీంతో గతంలో ఈ రైలుకు అనుబంధంగా ఓ క్లోన్ రైలు నడిపేవారు. అంటే అదే మార్గంలో అరగంట తేడాతో నడిచే మరో రైలు అన్నమాట. ముందు రైలుకుఉన్న ఫ్రీ సిగ్నల్ క్లియ రెన్స్ సమయంలోనే ఈ క్లోన్ రైలు నడుస్తుంది. కోవి డ్ ఆంక్షల సమయంలో రద్దయిన ఈ రైలును తిరిగి పునరుద్ధరించలేదు. అది రద్దీ మార్గం కావటం, దా నికి తగ్గ అదనపు లైన్లు లేకపోవటం, ఉన్న అవకాశాలను ఇతర జోన్లు వినియోగించుకుంటుండటమే దీనికి కారణమని స్థానిక రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. రద్దయిన మన క్లోన్ రైలును వేరే రాష్ట్రం ఒత్తిడి తెచ్చి వినియోగించుకుంటున్నట్టు సమాచారం. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులతోపాటు రాష్ట్రప్రభుత్వం కూడా రైల్వే బోర్డుపై ఒత్తిడితెచ్చి ఆ క్లోన్ రైలును పునరుద్ధరిస్తే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. -
ముగిసిన ‘పుష్కరం’.. భక్తజన పునీతం
కౌటాల(సిర్పూర్)/కోటపల్లి(చెన్నూర్)/కాళేశ్వరం: ప్రాణహిత నది పుష్కరాలు ముగిశాయి. చివరిరోజు ఆదివారం పుష్కర స్నానాలకు భక్తులు పోటెత్తారు. ఈనెల 13న ప్రాణహిత పుష్కరాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇటు కుమురంభీం జిల్లా తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లాలోని అర్జునగుట్ట, వేమనపల్లితోపాటు అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమ పుష్కరఘాట్లలో ఈ పన్నెండు రోజుల్లో దాదాపు 20 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలాచరించారు. అలాగే కాళేశ్వరాలయాన్ని 10 లక్షల మంది భక్తులు సందర్శించారు. ఆలయానికి వివిధ పూజలు, లడ్డూ ప్రసాదాల రూపేణా రూ.70లక్షల ఆదాయం సమకూరినట్లు అంచనా. కాళేశ్వరం త్రివేణి సంగమ క్షేత్రంలో పన్నెండు రోజులు పన్నెండు హారతులిచ్చారు. ఆదివారం తుమ్మిడిహెట్టి వద్ద 108 యజ్ఞకుండాతో శివసంకల్ప మహాయజ్ఞం నిర్వహించారు. కాశీ నుంచి వచ్చిన వేదపండితులు నదికి ముగింపు హారతినిచ్చారు. -
ప్రాణహిత పుష్కరాలకు పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
-
‘ప్రాణహిత’కు పోటెత్తిన భక్తజనం
భూపాలపల్లి/కాళేశ్వరం/కోటపల్లి/వేమనపల్లి: ప్రాణహిత పుష్కరాలకు రెండోరోజు భక్తజనం పోటెత్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత నదీతీరం భక్తులతో కిటకిటలాడాయి. గురువారం సెలవు రోజు కూడా కావడంతో తెలంగాణతోపాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడు, కేరళ నుంచి భక్తులు తరలివచ్చారు. పుష్కర స్నానాలతోపాటు కాళేశ్వర ముక్తీశ్వరులను లక్షమంది వరకు భక్తులు దర్శించుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అర్జునగుట్ట, వేమనపల్లి, తుమ్మిడిహెట్టి పుష్కరఘాట్లలో రద్దీ కనిపించింది. కాగా, ప్రాణహిత పుష్కరాలకు మహారాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసి, సౌకర్యాలు కల్పించడంతో మన రాష్ట్రం నుంచి భక్తులు మహారాష్ట్రలోని సిరొంచ, నగురం ఘాట్లకు వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. మహారాష్ట్రలోని పుష్కరఘాట్లలో 2.5 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. -
Pranahita Pushkaralu: పుష్కరాలు షురూ.. తరలిన భక్త జనం
సాక్షి, మంచిర్యాల/భూపాలపల్లి /కాళేశ్వరం: ప్రాణహిత పుష్కర సంబురం మొదలైంది. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం సాయంత్రం 4 గంటలకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద ప్రాణహిత నదికి ప్రత్యేక పూజలు చేసి పుష్కరాలకు అంకురార్పణ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కాళేశ్వరంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వేమనపల్లి ఘాట్ వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పుష్కరాలను ప్రారంభించారు. వేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి, వైదిక క్రతువులు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ వెంట.. మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రాణహిత నది.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ప్రవహించి, కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. ఈ మేరకు ప్రాణహిత నది వెంట పలుచోట్ల పుష్కరాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంతోపాటు ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఇతర రాష్ట్రాలవారు మంగళవారం సాయంత్రానికే ప్రాణహిత తీరాలకు చేరుకుని.. తాత్కాలిక గుడారాల్లో బస చేశారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత పుష్కరాలు మొదలవడంతో భక్తులు పుణ్యస్నానాలు చేసి.. పిండ ప్రదానాలు, ఇతర వైదిక క్రతువులు నిర్వహించారు. సమీపంలోని ఆలయాలను దర్శించుకున్నారు. గురువారం నుంచి భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కాళేశ్వరంలో దేవాదాయశాఖ అధికారులు, వేదపండితులు కాలినడకన కలశాలు, మంగళ వాయిద్యాలతో ప్రాణహిత నదికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3.54 గంటలకు పడవలో నదికి అవతలివైపు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. నదికి పంచ కలశాలతో ఆవాహనం చేసి.. పుష్కరుడి(ప్రాణహిత)కి చీర, సారె, ఒడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. అనంతరం పంచ కలశాలల్లో నీటిని తీసుకొచ్చి శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామివారికి అభిషేకం, పూజలను నిర్వహించారు. ఇక కాళేశ్వరానికి అనుకుని అవతలివైపు ఉన్న మహారాష్ట్ర పరిధిలోని సిరొంచలో ఆ రాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే, ఎమ్మెల్యేలు పుష్కరాలను ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా పరిధిలోని రెండు ఘాట్లలో తొలిరోజు 10 వేల మందికిపైగా పుణ్యస్నానాలు చేసినట్టు అంచనా. ఇక్కడికి తొలిరోజున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు చెందినవారు ఎక్కువగా తరలివచ్చారని అధికారులు చెప్తున్నారు. ఇక్కడ సాయంత్రం ఆరు గంటలకు నదీ హారతి ఇచ్చారు. అర్జునగుట్ట వద్ద కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబసభ్యులతోపాటు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండె విఠల్, జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: ఇంద్రకరణ్‌రెడ్డి గోదావరి ఉప నదిగా మనకు ప్రాణహిత పుష్కలంగా నీరందిస్తోంది. స్వరాష్ట్రంలో తొలిసారిగా ప్రాణహిత పుష్కరాలు జరుగుతున్నాయి. ఇది సంతోషకరం. పుష్కర సమయంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు హరిస్తాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలకు అన్నిరకాల మేలు జరగాలని కోరుకున్నానని మంత్రి తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ‘ప్రాణహిత’ ప్రత్యేక టూర్ ప్యాకేజీ సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత పుష్కరాల కోసం తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌టీడీసీ) ప్రత్యేక యాత్ర ప్యాకేజీని బుధవారం ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి కాళేశ్వరం వరకు ఈ నెల 24దాకా అంటే 12 రోజుల పాటు ఈ ప్రత్యేక యాత్ర నడుస్తుంది. రోజూ ఉదయం 05:00 బషీర్‌బాగ్ సీఆర్వో నుంచి బస్సు బయలుదేరుతుంది, 8:30 గంటలకు అల్పాహారం ఉంటుంది. 11:00 గంటల సమయంలో కాళేశ్వరం ఆలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 వరకు సిరోంచ పుష్కరఘాట్ వీక్షించేందుకు సమయమిస్తారు. తర్వాత గంటపాటు దర్శన సమయం, 1.45 గంటలకు కాళేశ్వరం హరిత హోటల్లో భోజనం ఉంటాయి. 2.45 గంటలకు తిరుగు ప్రయాణమై రాత్రి 9.00 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఈ యాత్ర ఏసీ బస్సు టికెట్ ధర పెద్దలకు రూ.2,200, పిల్లలకు రూ.1,760, నాన్‌ఎసీ బస్సు టికెట్ ధర పెద్దలకు రూ.2,000, పిల్లలకు రూ.1,600గా ఉంటాయని టీఎస్‌టీడీసీ ప్రకటించింది. -
ప్రాణహిత పుష్కర సంబరం
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి, మంచిర్యాల: ప్రాణహిత పుష్కరాలకు నదీతీరం, త్రివేణి సంగమం సంసిద్ధమైంది. నదులకు 12 ఏళ్లకోసారి నిర్వహించే పుష్కరాల్లో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల గుండా ప్రవహించే ప్రాణహిత నదికి బుధవారం నుంచి పుష్కరాలు నిర్వహిస్తున్నారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని (సరస్వతి) నదులు కలిసే త్రివేణి సంగమ స్థానం కాళేశ్వరానికి భక్తులు పోటెత్తనున్నారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో నిర్వహించే ఈ పుష్కరాలకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఘాట్లను ఏర్పాటు చేశాయి. ఈనెల 24 వరకు జరిగే ఈ పుష్కరాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి మండల కేంద్రం, మహారాష్ట్ర వైపు సిరోంచ, నగు రంలో ఈ ఘాట్లు ఉన్నాయి. బుధవారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అర్జునగుట్ట వద్ద పుష్కరాలను ప్రారంభించనున్నారు. అన్ని పుష్కరఘాట్ల వద్ద విధుల నిర్వహణ కోసం సుమారు ఆరువేల మంది పోలీసులు, ఇతర శా ఖల సిబ్బంది పనిచేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రాణహిత జననం, పయనం: గోదావరి నదికి అతి పెద్ద ఉపనది ప్రాణహిత. పెన్‌గంగా, వార్దా నదిలో తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత పురుడు పోసుకుంది. ఈ నది తుమ్మిడిహెట్టి నుంచి 113 కి.మీ. ప్రవహిస్తుంది. బెజ్జూర్ మండలం గూడెం, సోమిని, తలాయి, వేమనపల్లి మండలం రావులపల్లి, వేమనపల్లి, కలలపేట, ముల్కల్లపేట, రాచర్ల, వెంచపల్లి, కోటపల్లి మండలం జనగామ, నందరాంపల్లి, పుల్లగామ, సిర్సా, అన్నారం, అర్జునగుట్ట గ్రామాల మీదుగా పయనిస్తుంది. మహారాష్ట్ర వైపు గడ్చిరోలి జిల్లాలోని చప్రాల నుంచి ప్రారంభమై అయిరి, ఇందారం, తోగుల వెంకటాపూర్ మీదుగా ప్రవహిస్తూ రేగుంట, కొత్తూర్, తేకడా, గిలాస్పేట, రాయిపేట, రంగాయపల్లి, హమురాజీ, సిరోంచ మీదుగా భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం (కాళేశ్వర ముక్తేశ్వరులుగా వెలిసిన పరమేశ్వరుడి పుణ్యక్షేత్రం) వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. పుష్కర ఘాట్లు ఇవే.. ►కాళేశ్వరం త్రివేణి సంగమం – జయశంకర్ భూపాలపల్లి జిల్లా ►తుమ్మిడిహెట్టి– కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ►అర్జునగుట్ట–మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ►వేమనపల్లి – మంచిర్యాల జిల్లా మండల కేంద్రం ►సిరోంచ, నగురం – మహారాష్ట్ర ఇలా చేరుకోవచ్చు.. ►కాళేశ్వరం: హైదరాబాద్ నుంచి కాజీపేట, వరంగల్ వరకు రోడ్డు, రైలు మార్గాలు ఉన్నా యి. వరంగల్ నుంచి రోడ్డుమార్గన భూపా లపల్లి మీదుగా కాళేశ్వరం చేరుకోవచ్చు. ►అర్జునగుట్ట: హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నుంచి మంచిర్యాల వరకు రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి. అక్కడి నుంచి చెన్నూరు మీదుగా అర్జునగుట్ట ఘాట్‌కు చేరుకోవచ్చు. ►తుమ్మిడిహెట్టి: కుమురంభీం జిల్లా కౌటాల మండలం తుమ్మిడి హెట్టి ఘాట్‌కు వెళ్లాలంటే హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నుంచి మంచిర్యాల మీదుగా రైళ్లు కాగజ్‌నగర్ వరకు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సిర్పూర్ టీ మీదుగా తుమ్మిడిహెట్టికి చేరుకోవచ్చు. ►వేమనపల్లి: నిజామాబాద్, కామారెడ్డి, జిల్లాల నుంచి జగిత్యాల మీదుగా మంచిర్యాల చేరుకుని అక్కడి నుంచి వేమనçపల్లికి వెళ్లవచ్చు. -
ప్రాణహిత పుష్కరాలకు వేళాయె..
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రాణహిత పుష్కరాలను ఈనెల 13 నుంచి 24 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2010 తర్వాత ఈసారి స్వరాష్ట్రంలో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు 5 రోజులుగా యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. పుష్కరాల నిర్వహణ ప్రత్యేక అధికారి, కలెక్టర్, వివిధ శాఖల అధికారులు ఆదివారం కూడా పనులను పర్యవేక్షించారు. తెలంగాణ–మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు.. గడ్చిరోలి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ పుష్కరాలు జరగనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం.. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ వద్ద.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తుమ్మిడిహట్టి వద్ద పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద సాధారణ ప్రజల కోసం ఒకటి, వీఐపీల కోసం మరొకటి ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ కాళేశ్వరంలో శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం ఉన్న నేపథ్యంలో భక్తులు 70 వేల నుంచి లక్ష వరకు కాళేశ్వరం చేరుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలాఉండగా, పుష్కరాల సందర్భంగా కంచిపీఠం ఆధ్వర్యంలో కాళేశ్వరంలో నిర్వహించే పూజా కార్యక్రమాలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కుటుంబ సభ్యులతో హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఆహ్వానం పంపినట్లు వెల్లడించారు. పుష్కరాల ప్రారంభం రోజునే సీఎం కేసీఆర్ రావచ్చని అధికారులు పేర్కొంటున్నారు. నిధుల విడుదలపై స్పష్టత కరువు.. 2010లో ప్రాణహిత పుష్కరాలకు అన్ని శాఖల నుంచి రూ.8 కోట్ల నిధులు మంజూరు చేసి ఘనంగా నిర్వహించారు. అయితే ఈ సారి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. కలెక్టర్ భవేష్ మిశ్రా కలెక్టర్ కోటా కింద రూ.49 లక్షలు మంజూరు చేశారు. కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి çఘాట్ల వద్ద తాత్కాలిక పనులు రూ.70 లక్షల అంచనాతో చేసేలా ఆ జిల్లా కలెక్టర్ భార తి హోళ్లికేరి అనుమతి ఇచ్చారు. ఈ నిధులతో ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు మరుగు దొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, ఇతర పనులు చేపట్టాయి. పుష్కరాల ప్రారంభానికి రెండు రోజులే ఉండగా, నిధుల మంజూరుపై స్పష్టత లేక అధికార యంత్రాంగం అయోమయంలో ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి కాళేశ్వరంలో లాడ్జిలు, హోటళ్లు, ఇళ్లు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. -
పుష్కరాలకు వెళ్లి.. మృత్యుఒడికి చేరింది
సాక్షి,పాలకొండ రూరల్(శ్రీకాకుళం): శ్రీనగర్‌లో జరుగుతున్న సింధూ నది పుష్కరాలకు వెళ్లిన జిల్లా వాసి అక్కడ ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. పాలకొండలోని దేవరపేటకు చెందిన వ్యాపారి బోగాది సీతయ్య, సతీమణి ఆదిలక్ష్మి (53) ఈ నెల 17న పుష్కర స్నానాల కోసం శ్రీనగర్ వెళ్లారు. అక్కడ ఓ హోటల్లో బస ఏర్పాట్లు చేసుకున్న వీరు శనివారం దైవ దర్శనం పూర్తి చేసుకున్నారు. తిరిగి ప్రయాణంలో భాగంగా బస చేస్తున్న హోటల్‌కు చురుకున్నారు. అదే రోజు రాత్రి కాలకృత్యాలు తీర్చుకోవడానికి మరుగుదొడ్డికి వెళ్లిన ఆదిలక్ష్మి మృతి చెందారు. ఈ విషయాన్ని సీతయ్య ఫోన్ ద్వారా పాలకొండలోని కుంటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈమెకు ముగ్గురు పిల్లలున్నారు. -
పుష్కరాల వేళ కూల్చేసిన ఆలయాలన్నీ తిరిగి నిర్మించాలి
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ)/నరసరావుపేట రూరల్ : పుష్కరాల సమయంలో కూల్చి వేసిన ఆలయాలన్నింటినీ తిరిగి నిర్మించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఆలయాల సందర్శన కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు శనివారం ఇంద్రకీలాద్రి నుంచి ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఎమ్మెల్సీ మాధవ్‌తో కలిసి దర్శించుకున్నారు. అనంతరం కృష్ణానది తీరంలో కూల్చివేసిన ఆలయ ప్రాంతాలను, ప్రభుత్వం ఇటీవల నిర్మాణం చేపట్టిన నాలుగు ఆలయాలను వారు పరిశీలించారు. అనంతరం గుంటూరు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని సోము వీర్రాజు దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ఆలయాలు నేలమట్టమై, అంతర్వేది రథం దగ్ధమై, రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసమై చాలా కాలమైందన్నారు. అయినా ఈ ఘటనలకు కారణమైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటూ మండిపడ్డారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత పోస్ట్‌లు ఒక వర్గానికే దక్కాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్ మర్చిపోయారని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయలేదని విమర్శించారు. తిరోగమనంలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలని త్రికోటేశ్వరస్వామిని కోరుకున్నట్టు సోము వీర్రాజు తెలిపారు. -
తుంగభద్ర నదిలో దీపాలతో భక్తుల సందడి
-
తుంగభద్ర పుష్కరాలు : సంకల్‌భాగ్ పుష్కరఘాట్‌లో భక్తుల సందడి
-
తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్
-
నది స్నానాలకు అనుమతి లేదు: వెల్లంపల్లి
సాక్షి, కర్నూలు : తుంగభద్ర పుష్కరాలు రేపటి(నవంబర్ 20) నుంచి ప్రారంభం అవుతున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. డిసెంబర్ 1 వరకు ఈ పుష్కరాలు కొనసాగుతాయన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుష్కరాలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు మాత్రమే ఘాట్‌లోకి భక్తులను అనుమతిస్తామని చెప్పారు. తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కర్నూలుకు రానున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్నానాలను నిషేదించిట్లు మంత్రి వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ నది స్నానాలకు అనుమతి లేదని మంత్రి గుర్తు చేశారు. పుష్కరాలను కూడా విపక్షాలు రాజకీయ కోణంలో చూస్తున్నాయని విమర్శించారు. పుష్కరాల పేరుతో చంద్రబాబు నాయుడు వందల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. -
కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పుష్కరాలు
-
తుంగభద్ర పుష్కరాలకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, కర్నూలు(సెంట్రల్): తుంగభద్ర పుష్కరాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పర్యటన ఖరారైంది. ఈ నెల 20న కర్నూలులోని సంకల్‌భాగ్ పుష్కర ఘాట్‌ను సందర్శిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పర్యటన సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. సీఎం సందర్శించే సంకల్‌భాగ్ (వీఐపీ) పుష్కర ఘాట్‌లోకి ఆయన పర్యటన సమయంలో జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులను తప్పా ఇతరులెవరినీ అనుమతించకూడదని నిర్ణయించారు. సీఎం తిరిగి వెళ్లిన తరువాతే ఇతరులను ఘాట్‌లోకి అనుమతిస్తారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు, ఏపీఎస్పీ బెటాలియన్‌లో ముఖ్యమంత్రిని కలిసేందుకు కొద్దిమందికి అవకాశం కల్పించనున్నారు. సమన్వయంతో పని చేయండి సీఎం వైఎస్ జగన్ పర్యటన విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. మంగళవారం ఆయన సునయన ఆడిటోరియంలో ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప, జేసీలు ఎస్.రామసుందర్‌రెడ్డి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్‌తో కలిసి తుంగభద్ర పుష్కరాలపై సమీక్షించారు. పుష్కరాలకు సీఎం వస్తున్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. పెండింగ్ పనులన్నీ బుధవారం సాయంత్రంలోపు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో బి.పుల్లయ్య, కేఎంసీ కమిషనర్ డీకే బాలాజీ, సబ్ కలెక్టర్ కల్పనా కుమారి పాల్గొన్నారు. ఏర్పాట్ల పరిశీలన సీఎం పర్యటన ఏర్పాట్లలో భాగంగా మంగళవారం సాయంత్రం కలెక్టర్ వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, నగరపాలక కమిషనర్ డీకే బాలాజీతో కలిసి నగరంలోని ఏపీఎస్పీ బెటాలియన్‌లో హెలిప్యాడ్, సంకల్‌భాగ్ ఘాట్‌ను పరిశీలించారు. అలాగే బెటాలియన్ నుంచి కొత్తబస్టాండ్, బంగారు పేట, ఎస్టీబీసీ కళాశాల, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, నరసింగరావు పేట మీదుగా సంకల్‌భాగ్‌లోని పుష్కరఘాట్ వరకు సీఎం వెళ్లే దారిని చూశారు. సంకల్‌భాగ్ పుష్కర ఘాట్‌లో ముఖ్యమంత్రి చేయనున్న పూజలకు సంబంధించిన ఏర్పాట్లు చూడాలని నగరపాలక కమిషనర్‌ను ఆదేశించారు. పర్యటన సాగేదిలా.. ఉదయం 11 గంటలు : తాడేపల్లిలోని ఇంటి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలు దేరుతారు. 11.20 : గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 11.30 : గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లుకు బయలుదేరుతారు. 12.30 : ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 12.40 –12.55 : ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంట : ఏపీఎస్పీ బెటాలియన్ నుంచి రోడ్డుమార్గాన సంకల్‌భాగ్ పుష్కర ఘాట్‌కు బయలు దేరుతారు. 1.10 : సంకల్‌భాగ్‌కు చేరుకుంటారు 1.10 – 1.50 : పుష్కర ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 1.50– 2.00 : సంకల్‌భాగ్ నుంచి బయలుదేరి బెటాలియన్‌కు చేరుకుంటారు. 2.05– 2.20 : బెటాలియన్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 2.30 : ఓర్వకల్లు నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళతారు. -
స్నానాలొద్దు.. నీళ్లు చల్లుకుంటే చాలు
సాక్షి, అమరావతి: భక్తుల సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకొని కరోనా పరిస్థితుల్లోనూ తుంగభద్ర పుష్కరాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి, ఆ దిశగా కట్టుదిట్టంగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా పుణ్య స్నానాలపై నియంత్రణ చర్యలు చేపట్టనుంది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు తుంగభద్ర నదికి ఈ సారి పుష్కరాలు రానున్నాయి. ఇది కృష్ణా నదికి ఉప నది. కర్ణాటకలో అత్యధిక భాగం, మిగతా ఏపీలోని కర్నూలు జిల్లాలో ప్రవహిస్తూ.. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల మీదుగా కృష్ణాలో కలుస్తుంది. పుష్కరాల నేపథ్యంలో కర్నూలు జిల్లాలో నదీ పరీవాహక ప్రాంతం వెంట ఉన్న 16 ప్రముఖ ఆలయాలలో రూ.కోటి ఖర్చుతో ఆధునికీకరణ, అలంకరణ కార్యక్రమాలు చేపడుతున్నట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ► పుష్కరాలలో భక్తుల పుణ్య స్నానాల నిర్వహణలో నియంత్రణ చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. లాక్డౌన్ అనంతరం దేశ వ్యాప్తంగా స్విమ్మింగ్ పూల్స్పై ఇప్పటికీ ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో దేవదాయ శాఖ తుంగభద్ర పుష్కరాలపై ప్రత్యేక నిబంధనావళితో ఉత్తర్వులు జారీ చేసింది. ► ప్రత్యేక ఘాట్ల ఏర్పాటుకు తగిన చర్యలు చేపడుతూనే వైరస్ వ్యాప్తికి అవకాశం లేకుండా భక్తులు పుష్కర రోజుల్లో ఇంటి వద్దనే స్నానాలు చేసి, నది వద్ద కేవలం పవిత్ర జలాలను నెత్తిన చల్లు కోవాలని (ప్రోక్షణ) విస్త్రత స్థాయిలో ప్రచారం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ► భక్తుల సెంటిమెంట్ దృష్ట్యా పితృ దేవతలకు పిండ ప్రదానం నిర్వహించడం వంటి కార్యక్రమాలను ఏకాంతంగా జరుపుకునేందుకు పూర్తి స్థాయిలో అనుమతి ఇస్తారు. ► ఇందుకోసం 16 దేవాలయాల పరిధిలో ప్రత్యేక షెడ్లు నిర్మిస్తున్నారు. 600 మంది పురోహితులకు గుర్తింపు కార్డులు ఇస్తున్నారు. ► వైరస్ లక్షణాల భక్తులు ఎవరైనా దర్శనం కోసం వచ్చినట్టు గుర్తిస్తే, ఆ భక్తుడే స్వచ్ఛందంగా తిరిగి వెనక్కు వెళ్లేలా నచ్చ జెప్పాలని దేవదాయ శాఖ కర్నూలు జిల్లా అధికారులను ఆదేశించింది. -
ఘనంగా తుంగభద్ర పుష్కరాలు
సాక్షి, అమరావతి: ‘తుంగే పానీ.. గంగే స్నానే’ అన్నది ఆర్యోక్తి. గంగానదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తుంగభద్ర జలాలు తాగితే అంతే పుణ్యం వస్తుందని దీనికి అర్థం! అత్యంత ప్రాశస్త్యమున్న తుంగభద్ర నదీ పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ నేపథ్యంలో పుష్కరాలకు వచ్చే వారిసంఖ్యను ముందే అంచనా వేసి.. ఒక్కరు కూడా ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. ఏర్పాట్ల కోసం రూ.199.91 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం పనుల్ని నవంబర్ 16 నాటికి పూర్తిచేయాలని నిర్దేశించింది. నవంబర్ 20న ప్రారంభమయ్యే తుంగభద్ర పుష్కరాలు డిసెంబర్ 1న ముగుస్తాయి. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి తుంగభద్ర నదికి పుష్కరాలు నిర్వహిస్తారు. గతంలో 2008లో తుంగభద్ర పుష్కరాలను దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఇప్పుడు ఆ మహానేత తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరింత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. వరద తగ్గగానే పుష్కర ఘాట్ల నిర్మాణం తుంగభద్ర నదిపై కర్నూలు జిల్లాలో కర్నూలు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల పరిధిలో 20 చోట్ల పుష్కర ఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.22.91 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. పదిరోజుల్లో వరద తగ్గిన వెంటనే ఘాట్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు జలవనరులశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కర ఘాట్లు, నదీ తీరప్రాంతంలో అత్యంత ప్రాశస్త్యమున్న పురాతన ఆలయాలకు వెళ్లే రహదారులను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని, అవసరమైన చోట కొత్తగా నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ పనులకు ఆర్ అండ్ బీ శాఖ రూ.117 కోట్లు, పంచాయతీరాజ్‌శాఖ రూ.30 కోట్లు మంజూరు చేశాయి. కర్నూలు నగరంలోను, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు పట్టణాల్లోను పారిశుధ్యం, అంతర్గత రహదారులకు కొత్తరూపు ఇవ్వడానికి రూ.30 కోట్లు మంజూరయ్యాయి. నిరంతరం మంత్రుల సమీక్ష ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పుష్కరాల ఏర్పాట్లను కర్నూలు జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, కార్మికశాఖ మంత్రి జయరాం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ నేతృత్వంలో 21 శాఖల అధికారులతో పుష్కరాల ఏర్పాట్ల కమిటీ ఏర్పాటు చేశారు. కోవిడ్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పుష్కర ఘాట్లతోపాటు జల్లు స్నానం చేసేందుకు షవర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఘాట్ల సమీపంలో స్నానపుగదులు, మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. పారిశుధ్యం పనుల నిర్వహణకు అదనపు సిబ్బందిని నియమించనున్నారు. -
నవంబర్ 20 నుంచి తుంగభద్ర పుష్కరాలు
సాక్షి, అమరావతి: తుంగభద్ర పుష్కరాలను నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 దాకా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్‌కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరాం దిశానిర్దేశం చేశారు. విజయవాడలో 18 శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు పుష్కరాలకు వచ్చే యాత్రికులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మంత్రులు ఏం చెప్పారంటే.. u పాత పుష్కర ఘాట్లకు అవసరమైన ప్రాంతాల్లో మరమ్మతులు చేయాలి. కొత్తగా నిర్మించే పుష్కర ఘాట్లను నాణ్యంగా, వేగంగా పూర్తి చేయాలి. భవిష్యత్‌లో వాటిని ఉపయోగించుకునేలా ఘాట్ల నిర్మాణాన్ని చేపట్టాలి. పుష్కర ఘాట్ల పనులు నవంబర్ 1లోగా పూర్తి కావాలి. u రహదారుల నిర్మాణం కోసం ఇప్పటికే రూ.117.02 కోట్లు మంజూరయ్యాయి. ఆ పనులను శరవేగంగా పూర్తి చేయాలి. u స్నాన ఘట్టాలను పరిశుభ్రంగా ఉంచాలి. తాగునీటి సరఫరా, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండాలి. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలి. -
బ్రహ్మపుత్ర నదికి పుష్కరాలు..
పుష్కరాలంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. అందుకు తగినట్లుగానే గతంలో కృష్ణా, గోదావరి తదితర పుష్కరాలకు పర్యాటకులు పోటెత్తారు. ఇప్పుడు తాజాగా నవంబర్ 5 వ తేదీ నుంచి బ్రహ్మపుత్ర నది పుష్కరాలు ప్రారంభ మవుతున్నాయి. ఈ సమయంలో పుష్కర స్నానాల కోసం పర్యాటకులు ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో నగరంలోని ఆర్.వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు ప్రత్యేక బ్రహ్మపుత్ర పుష్కరాల టూర్ ప్యాకేజీలు ప్రకటించారు. ఇందులో రెండు ప్యాకేజీలున్నాయి. 8 రోజుల టూర్ ప్యాకేజీ (రూ.14,500 ప్లస్ జీఎస్టీ)లో గౌహతి, షిల్లాంగ్ ప్రాంతాలకు తీసుకెళ్తారు. ఇక 11 రోజుల ప్యాకేజీ(రూ.17500 ప్లస్ జీఎస్టీ)లో గౌహతి, షిల్లాంగ్, కోల్కత్తా ప్రాంతాలు కవర్ అవుతాయి. ఇందులో భాగంగా కామఖ్య శక్తిపీఠం, శుక్లేశ్వర మందిరం, నవగ్రహ మందిరం, పికాక్ ఐలాండ్, డాన్‌బాస్కో మ్యూజియం, దక్షిణేశ్వర్ కాళీమాత మందిరం, హౌరా బ్రిడ్జి తదితర పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తారు. వివరాలకు 8106201230, 7032666925నెంబర్లలో సంప్రదించవచ్చు. -
భీమా పుష్కరాలు ప్రారంభం
మాగనూర్ (మక్తల్): మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా మండలంలో వ్రహిహిస్తున్న భీమా నది పుష్కరాలు గురువారం ప్రారంభమయ్యా యి. ఈ నది పుష్కరాల కోసం మూడు పుష్క ర ఘాట్లు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి 7.23 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛ రణల నడుమ పుష్కరుడికి మంగళ హారతి ఇచ్చి పుష్కరాలు ప్రారంభమైనట్లుగా ప్రకటిం చారు. నేరడగం పక్షిమాద్రి విరక్త మఠం పీఠాధిపతి శ్రీ పంచమ సిద్ధలింగ మహా స్వా మి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా దేవదాయ శాఖ కమిషనర్ శ్రీనివాస్‌రావు, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి తదితరులు పూజల తర్వాత నదీ స్నానం ఆచరించారు. -
నేటి నుంచి భీమా పుష్కరాలు
మాగనూర్ (మక్తల్): మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా మండలంలో ప్రవహిస్తున్న భీమా నది పుష్కరాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 22వ తేదీ వరకు కొనసాగే పుష్కరాలకు రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పుణ్యస్నానాల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కాగా, తెలంగాణలో కేవలం ఏడు కిలోమీటర్లు మాత్రమే భీమా నది ప్రవహిస్తోంది. ఈ పుష్కరాలను పురస్కరించుకుని తంగిడి, కుసునూర్, శుక్రలింగంపల్లి గ్రామాల్లో స్నాన ఘాట్లను ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం 7.24 గంటలకు అధికారులు, వేద పండితులు పుష్కరుడికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా పుష్కరాలను ప్రారంభించనున్నారు. -
నీళ్ల బొట్టు లేదు..
జన్నారం : గోదావరిలో పుణ్యస్నానానికి నీటి కటకట ఏర్పడింది. జన్నారం మండల పరిధి నదీ తీరంలో మహాశివరాత్రి పర్వదినాన పుణ్యస్నానం ప్రయాసగా మారింది. పరమేశ..గంగను విడువుము అని వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పక్కనున్న కడెం ప్రాజెక్టు నుంచి సైతం నీటి బొట్టు విడుదల లేదు. దీంతో మడుగుల్లోనే పుణ్యస్నానం చేయాల్సి వస్తుంది. జన్నారం మండలంలో కలమడుగు, ధర్మారం, బాదంపల్లి, చింతగూడ, రాంపూర్ గ్రామాలలో గోదావరి రేవులున్నాయి. ఇందులో కేవలం కలమడుగు గోదావరి రేవులో మాత్రమే ప్రస్తుతం నీళ్లున్నాయి. అవికూడా హస్తల మడుగులో ఎక్కువగా ఉన్నాయి. అయితే మడుగు ప్రాంతం అతి ప్రమాదకరం కాబట్టి భక్తులను పుణ్యస్నానాలకు అనుమతించడం లేదు. మిగతా గోదావరి తీర ప్రాంతాలలో నీరు లేదు. గత సంవత్సరం ఆయా రేవులలో నీరు పుష్కలంగా ఉంది. దీంతో శివరాత్రికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. కానీ ఈఏడాది స్నానాలకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కడెం ప్రాజెక్టు ఉన్నా.. గతంలో కూడా గోదావరి నదిలో నీరు లేని సమయంలో భక్తుల సౌకర్యం కోసం కడెం ప్రాజెక్టు నుంచి నీటిని వదిలారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. ఈసారి కడెంలోనూ సరిపడా నీరు లేకుండపోయింది. దీంతో నీటి విడుదల కుదరదని ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేశారు. కడెం పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 681 అడుగుల్లో నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గోదావరిలోకి చుక్కా నీరు రావడం లేదు. జాగ్రత్త వహిస్తే మేలు.. మండలంలో కేవలం కలమడుగు గోదావరి నది రేవులో మాత్రమే నీరు ఉంది. దీంతో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకే వచ్చే అవకాశముంది. ఇక్కడ కూడా హస్తల మడుగు(అత్తమడుగు) ప్రాంతంలో నీళ్లు ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరం. ఈ మడుగులో సుమారు 20 మంది వరకు స్నానాల కోసమని వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈసారి శివరాత్రికి కూడా ఇదే ప్రాంతంలో ఎక్కువ మంది స్నానాలకు వచ్చే అవకాశం ఉంది. అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి న అవసరం ఎంతైనా ఉంది. రాత్రి కడెం నీరు విడుదల.. శివరాత్రిని పురస్కరించుకుని స్నానాల కోసం గోదావరి నదీలోకి కడెం ప్రాజెక్టు నుంచి మూడువేల క్యూసెక్కుల నీటిని ఎస్ఈ శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రాత్రి విడుదల చేశారు. నేటి ఉదయం 12 గంటలకు గేట్లు బంద్ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే కడెం నీరు విడుదల చేసినా జన్నారం మండలం వరకూ వచ్చే అవకాశాలు లేకపోవడం గమనార్హం. -
పుష్కర పార్కింగ్ స్థలాల్లో మెుక్కల పెంపకం
మఠంపల్లి : పుష్కరాల కోసం మండలంలోని మట్టపల్లి వద్ద 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో అధికారులు మెుక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు బుధవారం వర్ధాపురం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సైట్ ఇన్చార్జి బి.మురళి నేతృత్వంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చింతలమ్మగూడెం ఫారెస్ట్ బీట్ పరిధిలో ఉన్న అటవీ భూమిలో పార్కింగ్‌కు కేటాయించిన స్థలంలో ఇటీవల 20 వేల గుంతలు తవ్వారు వీటిలో వేప, గానుగ, దిరిసిన, నారవేప, నెమలినార, సీమతంగేడు వంటి 12 వేల మెుక్కలు నాటినట్లు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బి.మురళి తెలిపారు. -
పుష్కరాల్లో ప్రజాధనం దుబారా: నాగం
మహబూబ్‌నగర్ న్యూటౌన్: రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉంటే పుష్కరాల పేరుతో వందలాది కోట్లు దుబారాగా ఖర్చుచేశారని, నిధుల వినియోగంపై సమగ్రంగా విచారణ జరిపించాలని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు మూడోవిడత రుణమాఫీ నిధులు ఇప్పటివరకు అందలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసినా ఇప్పటివరకు వారి ఖాతాల్లో జమచేయలేదన్నారు. మంగళవారం స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కోర్‌కమిటీ సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ప్రధాన చెరువులను నాలుగు ప్రాజెక్టుల నీళ్లద్వారా నింపాలని, రెయిన్ గన్స్ ఏర్పాటుచేసి రైతుల పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగరవేయాలని కోరారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధమైన పనులు మానుకొని ప్రజాసమస్యలపై దృష్టిసారించాలని హితవుపలికారు. బీజేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తిరంగాయాత్ర సెప్టెంబర్ 17వరకు కొనసాగుతుందన్నారు. సెప్టెంబర్ 3వ తేదీన జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బైక్‌ర్యాలీలు నిర్వహించాలని తీర్మానించినట్లు వెల్లడించారు. జిల్లాకేంద్రంలో బహిరంగ సభ నిర్వహిస్తామని, ఈ సభకు కేంద్రమంత్రి హన్స్‌రాజ్ గంగారం అహైర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు వెల్లడించారు. జిల్లాల పునర్విభజన లోపభూయిష్టం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న జిల్లాల పునర్విభజన పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో 30 మండలాలున్న చోట మూడు జిల్లాలను ఏర్పాటుచేశారని, పాలమూరు జిల్లాలో మాత్రం 64 మండలాలు ఉండగా మూడుజిల్లాలను మాత్రమే ఏర్పాటు చేయడం సరికాదన్నారు. షాద్‌నగర్ నియోజకవర్గాన్ని శంషాబాద్‌లో కలపడం సరికాదన్నారు. షాద్‌నగర్ నియోజకవర్గాన్ని మహబూబ్‌నగర్‌లో ఉంచి నాలుగు జిల్లాలుగా విభజించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కల్వకుర్తి, కొడంగల్ నియోజకవర్గాలను రెవెన్యూ డివిజన్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగురావు నామాజీ, రాష్ట్ర కార్యదర్శి శాంతికుమార్, జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి, ప్రధానకార్యదర్శి శ్రీవర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. -
నిర్మించినా.. నిరుపయోగమే!
– రూ.13కోట్లతో 7ఘాట్లు – రూ.17కోట్లతో రహదారులు – 2చోట్ల మాత్రమే ఉపయోగం కృష్ణా పుష్కరాల్లో భాగంగా పెబ్బేరు మండలంలో మొత్తం ఏడు ఘాట్లు నిర్మించారు. ఇందులో కేవలం రెండు చోట్ల మాత్రమే యాత్రికులు అధిక సంఖ్యలో రాగలిగారు.. రూ.లక్షలు ఖర్చు పెట్టి ఆయా చోట్ల మరుగుదొడ్లు, తాగునీటి వసతి, ఇతర సదుపాయాలు కల్పించారు.. రోడ్లు నాసిరకంగా ఉండటంతో పుష్కరాలకు ముందే దెబ్బతిన్నాయి. పెబ్బేరు : మండలంలోని రంగాపూర్ వీఐపీ ఘాట్ రూ.6.15కోట్లతో, మునగమాన్‌దిన్నె రూ.మూడు కోట్లు, తిప్పాయిపల్లి రూ.1.2కోట్లు, యాపర్ల రూ.96లక్షలు, బూడిదపాడు రూ.60లక్షలు, గుమ్మడం రూ.21 లక్షలు, రాంపూర్ ఘాట్ రూ.87లక్షలు ఇలా మొత్తం రూ.13కోట్లతో పుష్కరఘాట్లు నిర్మించారు. రూ.17కోట్లతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రోడ్లు నిర్మించారు. రూ.లక్షలు వెచ్చించి మరుగుదొడ్లు, తాగునీటి వసతి, ఇతర సదుపాయాలను అధికారులు కల్పించారు. అయితే పుష్కరాల ప్రారంభం నాటికి జూరాల వరదనీరు భారీగా రావడంతో కేవలం రంగాపూర్, రాంపూర్, మునగమాన్‌దిన్నె ఘాట్ల వద్ద మాత్రమే భక్తులకు స్నానాలు చేసేందుకు వీలయింది. రెండు రోజుల తర్వాత నుంచి రాంపూర్ ఘాట్‌కు నీళ్లు లేకపోవడంతో చివరి వరకు లక్షలాది మంది భక్తులు రంగాపూర్, మునగమాన్‌దిన్నె ఘాట్లకు వెళ్లి పుష్కరస్నానాలు ఆచరించారు. దీంతో బూడిదపాడు, యాపర్ల, తిప్పాయిపల్లి, గుమ్మడం, రాంపూర్ ఘాట్లు నిరుపయోగంగా మారాయి. రోడ్లు నాసిరకంగా ఉండటంతో పుష్కరాలకు ముందే దెబ్బతిన్నాయి. హైవే నుంచి రాంపూర్ ఘాట్‌కు వెళ్లే రోడ్డును పంచాయతీరాజ్ అధికారులు ఏకంగా అలైన్‌మెంట్‌నే మార్చేసి బీటీ స్థానంలో సీసీ మాత్రమే నిర్మించారు. అసంపూర్తిగా.. వీఐపీలకు వసతి కల్పించేందుకుగాను పెబ్బేరు పీజేపి అతిథి గహం మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.1.5కోట్లు విడుదల చేసింది. అందులోని గదులు, ఏసీలు, రంగులు, బెడ్లు తదితర పనులను మాత్రమే కాంట్రాక్టర్లు హడావుడిగా చేశారు. దీని ముందు టైల్స్, గార్డెన్, మరో నాలుగు ఏసీలు, ఎస్ఈ, ఈఈ క్వార్టర్ల మరమ్మతు, అంతర్గత బీటీరోడ్లు తదితర పనులను చేపట్టలేదు. ఇక చేసిన పనులను అసంపూర్తిగా, మిగిలినవి పుష్కరాల నాటికీ ప్రారంభించకపోవడం అధికారుల పర్యవేక్షణ తీరుకు అద్దం పడుతోంది. -
పుష్కర ఘాట్లలో అవినీతి ధార
మొక్కుబడిగా పనులు అడుగడుగునా నాసిరకం నిరుపయోగంగా 32 ఘాట్లు అమరావతిలో అసంపూర్తిగా వదిలివేసిన ఘాట్ నిర్మాణం సాక్షి, అమరావతి : పవిత్రమైన పుష్కర పనుల్లోనూ అవినీతి రాజ్యమేలింది. కోట్లాది రూపాయల సొమ్ము కష్ణమ్మ ఒడిలో కలిసిపోయింది. ఎలాగోలా పూర్తయితే చాలనే తీరే నిర్మాణాల్లో కనిపించింది. పుష్కరాలు పూర్తయినా ఆ పేరుతో చేసిన అవినీతి జాడలు మాత్రం కనిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల పూర్తయిన పుష్కరాల కోసం గుంటూరు జిల్లాలో 80 ఘాట్లను నిర్మించారు. ఇందుకోసం రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేశారు. హడావిడిగా, నాసిరకంగా చేయడంతో పుష్కరాలు పూర్తికాకముందే అనేక ఘాట్ల వద్ద టైల్స్ లేచిపోయాయి. శాశ్వతంగా ఉండేలా నిర్మాణాలు చేస్తున్నామని, విజిలెన్స్, ప్రత్యేక బందాల ద్వారా పనులను తనిఖీ చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చేసిన హడావిడి మాటలకే పరిమితమైంది. వ్యూహాత్మక జాప్యమే... పుష్కర పనులు ఆలస్యంగా మంజూరు చేయడం వ్యూహాత్మకంగానే జరిగింది. అధికారులు సైతం ఈ విషయాన్ని పేర్కొనడం గమనార్హం. జిల్లాలోనే ప్రధాన ఘాట్ అయిన అమరావతిలోనూ నిర్మాణ పనులు అడుగడుగునా నాసిరకంగానే జరిగాయి. కాంక్రీట్ పనులు పూర్తిగా నాసిరకంగా చేపట్టారు. చివరికి టైల్స్ సైతం అనేక చోట్ల సిమెంటు లేకుండా ఇసుకలోనే అతికించారు. పుష్కరాల ప్రారంభం రోజు వరకు పనులు కొనసాగించటం గమనార్హం. ఆ తర్వాత పైపై మెరుగులు మాత్రం అద్దారు. దీంతో పుష్కరాల ప్రారంభానికే టైల్స్ లేచిపోయిన పరిస్థితి కనిపించింది. హడావుడిగా, ఎగుడుదిగుడుగా టైల్స్ వేయటంతో కొన్నిచోట్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అమరావతిలో 1.3 కిలోమీటర్ల మేర ఘాట్ నిర్మాణం చేపట్టాల్సి ఉన్నప్పటికీ, ధరణికోట, అమరలింగేశ్వరుని ఘాట్ కలపకుండానే గుడి వెనుక భాగంలో కాంట్రాక్టర్ వదిలేశాడు. సీతానగరం ఘాట్‌లోను సిమెంటు పనులు నాసిరకంగానే జరిగాయి. 13 రోజులకే పనుల్లో డొల్లతనం బయటపడుతోంది. ఆ ఘాట్ల నిర్మాణం.. కొల్లగొట్టేందుకే.. జిల్లాలో గురజాల, రేపల్లె, మంగళగిరి, పెదకూరపాడు ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి, అవసరం లేకున్నా కాంట్రాక్టు పనుల కోసమే అన్నట్లు ఘాట్ల నిర్మాణాలు చేపట్టారు. దీనికి అనుబంధంగా లింక్ రోడ్లు వేసి కోట్ల రూపాయలను కొల్లగట్టారు. జిల్లాలో బ్యారేజీ దిగువన కొల్లిపర, దుగ్గిరాల, భట్టిప్రోలు మండలాల పరిధిలో నిర్మించిన 32 ఘాట్లకు నీరు లేక భక్తులు స్నానాలు చేయలేదు. నదిలో ఇసుక గోతులు ఉన్నాయని, ప్రమాదమని తెలిసినా దేశాలమ్మ ఘాట్, మోతర్లలంక, జువ్వలపాలెం ఘాట్లను నిర్మించారు. పుష్కరాల సమయానికి ప్రమాదం పేరుతో వాటిలో స్నానాలు చేయకుండా నిలిపివేశారు. గుండెమడ, పాటూరు వంటి ఘాట్లలో ఒక్కరు కూడా స్నానం చేయలేదు. ఇలా అవసరం లేకున్నా ఘాట్ల నిర్మాణం పేరుతో పనులు చేసి తెలుగు తమ్ముళ్లు కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. మరోపక్క అనేక ప్రాంతాల్లో ప్రజల సొమ్ముతో చేపట్టిన నిర్మాణాలకు పసుపు రంగు వేసి పూర్తిగా రాజకీయం ప్రదర్శించారు అధికార పార్టీ నేతలు. సీఎం కుటుంబ సభ్యుల కోసమే.. ఉండవల్లి సమీపంలో వీఐపీ ఘాట్‌ను నిర్మించినా పుష్కరాల్లో అందులోకి ఎవరినీ అనుమతించలేదు. కేవలం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు స్నానాలు చేసేందుకు వీలుగా దాదాపు కోటి రూపాయలతో ఈ ఘాట్ నిర్మాణం చేపట్టడం గమనార్హం. -
విషాదం
– గుండెపోటుతో పుష్కర విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మృతి – తీవ్ర సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం, ఐజీ, డీఐజీ, కలెక్టర్, ఎస్పీ – రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం – కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో కృష్ణాపుష్కరాల ముగింపు రోజు మంగళవారం విషాదం చోటు చేసుకుంది. పుష్కరాల బందోబస్తుకు శ్రీశైలం వచ్చిన కర్నూలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గోపాలకృష్ణ (39) గుండెపోటుతో మృతి చెందాడు. కమ్యూనికేషన్ సిబ్బందికి సహకారం అందించేందుకు నియమించిన గోపాలకృష్ణ ఉదయం 6.30 గంటల సమయంలో విధుల్లో ఉండగా ఒక్కసారిగా తీవ్ర గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే అతని సన్నిహితులు దేవస్థానం ఉచిత వైద్యశాలకు తరలించారు. అక్కడి అపోలో డాక్టర్లు కానిస్టేబుల్‌కు అత్యవసర చికిత్సలు చేసినా ప్రాణాలను కాపాడలేకపోయారు. మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం తెలుసుకున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జిల్లా కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ రవిష్ణ హుటాహుటిన దేవస్థానం వైద్యశాలకు చేరుకుని కానిస్టేబుల్ మృతదేహానికి నివాళులు అర్పించారు. జరిగిన సంఘటన తెలుసుకున్న రాయలసీమ జోన్ ఐజీ శ్రీధర్‌రావు కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 1985వ బ్యాచ్‌కు చెందిన గోపాలకృష్ణ స్వస్థలం కర్నూలులోని కృష్ణానగర్. ఆయనకు భార్య రామలక్ష్మి, కుమార్తె, కుమారుడు ఉన్నారని ఎస్పీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా: డిప్యూటీ సీఎం గుండెపోటుతో మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియాను డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మంగళవారం ప్రకటించారు. స్థానిక దేవస్థానం వీవీఐపీ భ్రమరాంబా అతిథిగహంలో ఆయన జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయస్సులోనే గోపాలకృష్ణ గుండెపోటుతో మరణించడం దిగ్భ్రాంతి కలిగించందని, ఆయన కుటుంబానికి తనప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఒకరికి ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తామని, ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని బుధవారమే వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బాబు ప్రసాద్, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు టి. నారాయణ పాల్గొన్నారు. ================== సంగమేశ్వరంలో కానిస్టేబుల్‌కు నివాళి ఆత్మకూరురూరల్: శ్రీశైలంలో పుష్కర విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మరణించిన కానిస్టేబుల్ గోపాలకృష్ణకు సంగమేశ్వరం ఘాట్‌లో జేసి హరికిరణ్, డీఎస్పీ వెంకటాద్రి, ఇతర పోలీసు అధికారులు నివాళులర్పించారు. -
దేదీప్యమానం..!
–అంబరాన్నంటిన పుష్కర ముగింపు వేడుకలు · శ్రీశైలంలో వైభవంగా పుష్పాభిషేకం · 30 మంది వేదపండితులతో శాస్త్రోక్తపూజలు ·12 టన్నుల పూలతో పుష్పోత్సవం శ్రీౖశైలం: కృష్ణాపుష్కరాల ముగింపు వేడుకలు మంగళవారం శ్రీశైల మహాక్షేత్రంలో అంబరాన్నంటాయి. వందల సంఖ్యలో భక్తులు పవిత్ర పాతాళగంగ వద్దకు మేళ తాళాలతో చేరుకున్నారు. ఓం నమఃశివాయ పంచాక్షరి నామజపం చేస్తూ కృష్ణవేణీ మాతను అనుగ్రహించాల్సిందిగా కోరారు. పుష్కర స్నానం చేసి కలశంలో పాతాళగంగలోని పుష్కర జలాన్ని నింపుకుని మల్లన్న ఆలయప్రాంగణం చేరుకున్నారు. మల్లన్న గర్భాలయ దక్షిణ ద్వారం నుంచి స్వామివార్ల వద్దకు చేరుకుని మూలవిరాట్‌ను అభిషేకించారు. ముపై ్ప మంది వేదపండితుల వేదమత్రోచ్చారణల మధ్య 12 టన్నుల పూలను మల్లన్న పుష్పాభిషేక మహోత్సవానికి వినియోగించారు. మల్లన్న పుష్పోత్సవ.... వైభోగం! అభిషేక ప్రియుడు, మల్లెపూలంటే విపరీతమైన ఆపేక్ష ఉన్న శ్రీమల్లికార్జునస్వామి రంగురంగుల గులాబీలు, అనేక రకాలైన చేమంతులు, వివిధరకాలైన టన్నుల కొద్ది పూలను రాశులుగా పోసి స్వామి అమ్మవార్లకు పుష్పాభిషేకాన్ని నిర్వహించారు. అక్కమహాదేవి అలంకార మండపం పక్కనే ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి ఓ వైపు వేదపండితులు మంత్రోచ్చారణలతో ఆలయప్రాంగణంలో ప్రతిధ్వనిస్తుండగా, జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామశివాచార్యా స్వామీజీ, దత్తగిరి పీఠాధిపతులు గణపతిపూజతో పుష్పాభిషేకాన్ని ప్రారంభించారు. డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా, ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణిరెడ్డి, కలెక్టర్ విజయమోహన్, డీఐజీ రమణకుమార్, ఎస్పీ రవికష్ణ, ఆర్డీఓ రఘుబాబు..తదితరులు స్వామివార్లకు పుష్పాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వందలాది మంది భక్తులు వేదికపై ఉన్న శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు పుష్పాలను సమర్పించారు. బాణ సంచా వెలుగులు పుష్పాభిషేక మహోత్సవం ముగుస్తున్న సమయంలో బాణ సంచా వెలుగులు ఒక్కసారిగా విరజిమ్మాయి. దాదాపు గంటపాటు ఆకాశంలో బాణ సంచా వెలుగులు కనువిందు చేశాయి. కృష్ణాపుష్కరాల ముగింపు వేడుకలలో మల్లన్న వైభోగాన్ని చూసిన భక్తులు ఆధ్యాత్మిక తరంగాలలో తేలియాడారు. ముగింపు వేడుకలను పూసగుచ్చినట్లుగా డాక్టర్ దీవి హయగ్రీవాచార్య చేసిన ప్రత్యక్ష వాఖ్యానం భక్తులను ఆకట్టుకుంది. ఇమ్మిడిశెట్టి కోటేశ్వరరావు తదితరులు ఉత్సవంలో పాల్గొన్నారు. -
పుష్కరాల నుంచి పుణ్య లోకాలకు...
విజయవాడ బెంజి సర్కిల్లో రోడ్డు ప్రమాదం ఇద్దరి మృతి–ముగ్గురి పరిస్థితి విషమం మరో ముగ్గురికి గాయాలు పుష్కరాల నుంచి తిరిగొస్తుండగా విషాదం కృష్ణా పుష్కరాలకు వెళ్లి తిరిగొస్తుండగా విజయవాడ బెంజి సర్కిల్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండగా, ఇంకో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను మండలానికి పంపించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తుండగా గాయాల పాలైన వారికి హెల్ప్ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలందిస్తున్నారు. ఈ ఘటనతో ఆయా కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే... పొందూరు : మండలంలోని తోలాపి, కింతలి గ్రామాలకుS చెందిన పైడి వెంకటరమణ(45), సనపల హర్షవర్ధన్(10)లు విజయవాడలో బెంజి సర్కిల్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పైడి అమ్మన్మమ్మ కుటుంబానికి చెందిన వారంతా తమ సొంత కారులో విజయవాడ కృష్ణా పుష్కరాలకు వెళ్లారు. మంగళవారం తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగింది. కింతలి గ్రామానికి చెందిన పైడి అమ్మన్మమ్మ పెద్ద కొడుకు పైడి వెంకటరమణ(45), చిన్న కొడుకు పైడి అప్పలస్వామి, చిన్న కోడలు పైడి శారదాదేవి, మనవళ్లు మహేష్ వర్మ, జ్ఞాన సూర్య, తోలాపి గ్రామానికి చెందిన సనపల భూలక్ష్మి(అమ్మన్నమ్మ కూతరు), మనవడు సనపల హర్షవర్ధన్(10) ఒకే కారులో పెళ్లి, పుష్కరాల కోసం ఆదివారం బయలుదేరి వెళ్లారు. అన్నవరంలో ఓ పెళ్లికి వెళ్లి సోమవారం ఉదయమే విజయవాడ పుష్కరాలకు బయలుదేరారు. పుష్కర స్నానం చేసిన వెంటనే మంగళవారం ఏలూరులోని కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లేందుకు ప్రణాళిక వేసుకొని, భోజనం చేసేందుకు వస్తున్నామని ఉదయం 11.30 గంటలకు ఫోన్లో బంధువులకు సమాచారం ఇచ్చారు. కాగా 12.30 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని ప్రమాదంలో గాయాల పాలైన సనపల భూలక్ష్మి భర్త సనపల మురళీధర్‌కు ఫోన్లో చెప్పింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇద్దరు మృతి చెందారు. విషాదం... ఈ ఘటనతో తోలాపి, కింతలి గ్రామాల్లోని శ్రీకాకుళంలోని పీఎన్ కాలనీలో విషాదం అలముకొంది. తోలాపిలో పైడి అమ్మన్నమ్మ, వెంకటరమణ, అప్పలస్వామి, శారదాదేవి, మహేష్ వర్మ, జ్ఞాన సూర్యలు నివాసముంటున్నారు. మృతుడు వెంకటరమణ సివిల్ ఇంజినీరింగ్ చదవడంతో ప్రైవేటు కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. వారిలో వెంకటరమణ మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. తోలాపిలో నివాసముంటున్న సనపల మురళీధర్, సనపల భూలక్ష్మి, హర్షవర్దన్‌లు ఇటీవలనే శ్రీకాకుళంలోని పీఎన్ కాలనీకి వెళ్లారు. మృతుడు హర్షవర్ధన్(10) సాయి విద్యామందిర్‌లో నాలుగో తరగతి చదువుతున్నాడు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
పుష్కర యాత్రికులపై పోలీసుల ప్రతాపం
-
రైళ్లలో జన ప్రవాహం
గద్వాల : పట్టణంలోని రైల్వేస్టేషన్ కృష్ణాపుష్కరాల ప్రయాణికులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు కావడంతో పుష్కర స్నానం చేయడానికి భక్తులు పెద్ద ఎత్తున గద్వాలకు తరలివచ్చారు. హైదరాబాద్, కర్నూలు నుంచి గద్వాలకు వచ్చే ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లన్నీ రద్దీగా మారాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద చాలాసేపు పడిగాపులు పడాల్సి వచ్చింది. పలు రైళ్లు ఆలస్యంగా రావడంతో ప్లాట్‌ఫాంపై జనం గంటల తరబడి వేచి ఉన్నారు. రైల్వేస్టేషన్‌తో పాటు రైల్వే ప్రాంగణంలో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. ఈ ఒక్కరోజే సుమారు 15వేల మంది యాత్రికులు పుష్కర స్నానాల కోసం వచ్చారు. రైల్వేస్టేషన్ నుంచి నదిఅగ్రహారం, బీచుపల్లి పుష్కరఘాట్లకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా ఆర్పీఎఫ్ అధికారులు చర్యలు తీసుకున్నారు. -
పిండ ప్రదానం.. వస్తువులు మాయం
– దోపిడీకి గురవుతున్న పిండ ప్రదాన కత్రువు భక్తులు – అరకొరగా వస్తువుల అందజేత – పూర్తి స్థాయి సామగ్రి కోసం అదనంగా చెల్లింపు శ్రీశైలం (జూపాడుబంగ్లా): తరతరాల కుటుంబ బాంధవ్యాలకు ప్రతీకమైన పిండ ప్రదానానికి పుష్కరాల్లో ఎంతో ప్రత్యేకత ఉంది. తమను వీడి పోయిన ఆత్మీయులకు 12 సంవత్సరాలకోసారి వచ్చే పుష్కరాల్లో భక్తిశ్రద్ధలతో పిండ ప్రదానం చేస్తారు. ఈ రోజుల్లో పితదేవతలు నదుల్లో ఉంటారనే విశ్వాసం ఉంది. భక్తుల నమ్మకాన్ని కొందరు దోచుకుంటున్నారు. పుష్కరాల్లో తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేసే వస్తువులు సరిగా లేకుండానే చేయాల్సి వస్తోంది. పిండప్రదాన కార్యక్రమం నిర్వహించేందుకు పసుపు, కుంకుమ, వక్కలు, బెల్లం, నెయ్యి ఐదు గ్రాములు, మూడు అగరవత్తులు, 30గ్రాముల నల్లనువ్వులు, పావుకిలో వరిపిండి, గంధం 10 గ్రాములు, కర్పూరం నాలుగు బిళ్లలు, తమలపాకులు 10, విస్తరాకులు 4, అరటిపండ్లు 12 అవసరం ఈ సామగ్రిని పొదుపులక్ష్మి మహిళలు రూ.50 విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. అందులో పిండప్రదాన క్రతువుకు అవసరమైన అన్నిరకాల వస్తువులు లేకపోవటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిట్లులోలేని వస్తువులు కావాలంటే అదనంగా పొదుపు మహిళలు మొత్తాన్ని వసూళ్లు చేస్తున్నట్లు భక్తులు పేర్కొంటున్నారు. డబ్బులు చెల్లించలేని భక్తులు పొదుపు మహిళలు ఇచ్చిన కిట్టులో ఉన్న వస్తువులతోనే పిండప్రదానాన్ని మమ అనిపిస్తున్నారు. పిండ ప్రదానం వస్తువులపై అవగాహన ఉన్న భక్తులు దబాయిస్తుండటంతో మిగిలిన వస్తువులను ఇస్తున్నారు. రోజుకు రూ.2.25లక్షల అమ్మకాలు: పిండప్రదానికి అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను దేవస్థానం వారు 30 మంది పొదుపు మహిళల ద్వారా విక్రయిస్తున్నారు. ఒక్కో కిట్టు రూ.50 చొప్పున రోజుకు ఒక్కో పొదుపు మహిళ కనీసం 150 కిట్లను విక్రయిస్తున్నారు. ఈలెక్కన రోజుకు రూ.2.25లక్షల అమ్మకాలు జరుగుతున్నాయి. లింగాలగట్టు దిగువ పుష్కరఘాటులో రోజుకు కనీసం 4,500 మంది భక్తులు పిండప్రదానాలు చేస్తున్నారు. పిండప్రదానం చేసే ఒక్కోభక్తుని నుంచి పూజారులు నిర్ణీత ధర రూ.300ల చొప్పున వసూళ్లు చేస్తున్నారు. దీంతో రోజుకు రూ.13.50 లక్షల మేర పిండప్రదానాల ద్వారా బ్రాహ్మణులకు ఆదాయం సమకూరుతుంది. -
దత్తభీమేశ్వరాలయంలో నిత్య అన్నదానం
మాగనూర్ (తంగడి ఘాట్ సాక్షి బృందం): కృష్ణా పుష్కరాల సందర్భంగా మాగనూరు మండలం తంగడి దత్తభీమేశ్వరాలయంలో నిత్య అన్నదానం కొనసాగుతుంది. కృష్ణ, భీమా నదుల సంగమ క్షేత్రంలో పుస్పుల దత్తపీఠాధిపతి విఠల్‌బాబా దత్తభీమేశ్వరాలయాన్ని నిర్మించారు. శ్రీపాద వల్లభుడు తిరుగాడిన ఆనవాల్లు ఇక్కడవున్నాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు మారెప్ప, ప్రధాన కార్యదర్శి ప్రహ్లాద్‌రెడ్డిని పలుకరించగా నిత్యం వేలాదిమంది పుష్కర భక్తులకు అన్నదానం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. -
లక్షల జనం
పలు పుష్కర ఘాట్లలో సినీనటుల సందడి సోమశిలలో బాలకష్ణ పుణ్యస్నానం.. పిండప్రదానం రంగాపూర్‌లో ఉపాసన, బీచుపల్లిలో అశోక్‌కుమార్ పుణ్యస్నానాలు ఘాట్ల వద్ద వెల్లివిరిసిన రక్షాబందన్ పుష్కరస్నానం ఆచరించి సోదరులకు రాఖీలు కట్టిన సోదరిమణులు డీఐజీ అకున్ సబర్వాల్‌కు రాఖీ కట్టిన ఎస్పీ, విద్యార్థులు సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కష్ణ పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి ఏడో రోజూ భక్తులు పోటెత్తారు. రక్షా బంధన్ సెలవు దినం కావడం.. పుష్కరాల ముగింపు 5 రోజులే మిగిలి ఉండడంతో కొంత రద్దీ పెరిగింది. ఘాట్లలో జనం కిటకిటలాడారు. గురువారం జిల్లా వ్యాప్తంగా 12.50 లక్షల మంది భక్తులు పుణ్యస్నానమాచరించినట్లు అధికారులు తెలిపారు. గొందిమళ్ల, సోమశిల, బీచుపల్లి, రంగాపూర్, నది అగ్రహారం, పస్పుల, పాతాళగంగ తదితర పుష్కరఘాట్లు వరుసగా భక్తులతో పోటెత్తాయి. జూరాల ఘాట్‌లో నీళ్లు లేకపోవడంతో వరుసగా మూడోరోజు మూసివేశారు. జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు తగ్గడంతో ప్రాజెక్టులోని నీటిని దిగువకు విడుదల చేయడాన్ని అధికారులు నియంత్రించారు. దీంతో పలు పుష్కరఘాట్లలో నీరు కొంత మేర తగ్గింది. అయితే పుష్కరాలు పూర్తయ్యేంత వరకు భక్తుల పుణ్యస్నానాలకు నీటి ఇబ్బంది ఉండబోదని అధికారులు చెబుతున్నారు. ఘాట్లలో రక్షాబంధన్ గురువారం రక్షా బంధన్ కావడంతో పుష్కరఘాట్‌లో పుణ్యస్నానం చేసిన భక్తులు తమ సోదరిమణులతో రక్షా బంధనం కట్టించుకున్నారు. హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్‌కు ఎస్పీ రెమా రాజేశ్వరి రంగాపూర్ ఘాట్‌లో రాఖీకట్టారు. పలువురు విద్యార్థులు డీఐజీకి రక్షా బంధనం కట్టారు. దీనికి డీఐజీ స్పందిస్తూ తనకు ఈ రక్షా బంధనం ఎస్పీతో సహా ఆరుగురు సోదరిమణులను ఇచ్చిందని అన్నారు. తనకు రక్షాబంధనం కట్టిన విద్యార్థులకు తన ఫోన్‌నంబర్ ఇవ్వడమే కాకుండా వారి నుంచి ఫోన్‌నంబర్లు తీసుకున్నారు. హైదరాబాద్ వచ్చినప్పుడు తనను కలవొచ్చని ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని రాఖీ కట్టిన విద్యార్థినులకు చెప్పారు. పలువురు పోలీసులకు మహిళా పోలీసులు రాఖీలు కట్టారు. వివిధ శాఖల సిబ్బందికి కూడా రక్షాబంధన్ కట్టారు. పుష్కరస్నానం ఆచరించి పిండప్రదానం చేసిన హీరో బాలకష్ణ మరోవైపు వివిధ పుష్కర ఘాట్లలో ప్రముఖ సినీ నటులు పుణ్యస్నానాలు ఆచరించారు. నందమూరి బాలకష్ణ సోమశిల పుష్కరఘాట్‌లో స్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన తండ్రి ఎన్టీ రామారావు, తల్లి బసవతారకమ్మలకు పిండ ప్రదానం చేశారు. బాలకష్ణతో పాటు ఆయన సోదరిమణులు, కుటుంబీకులు, బంధువులు పాల్గొన్నారు. తొలుత కొల్లాపూర్ చేరుకున్న బాలకష్ణను రాష్ట్ర మంత్రి జూపల్లి కష్ణారావు కలిశారు. కేఎల్ఐ అతిథి భవనంలో జూపల్లి కష్ణారావు అల్పాహార విందులో బాలకష్ణతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. టీడీపీ నేతలకు, కార్యకర్తలకు బాలకష్ణ కొల్లాపూర్ వస్తున్న విషయంపై సమాచారం లేకపోవడంతో పలువురు నేతలు విషయాన్ని బాలకష్ణ దష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన బాల కష్ణ అల్పాహారం కాగానే పార్టీ పరంగా ఏదైనా కార్యక్రమం పెట్టుకోమని సూచించడంతో కొల్లాపూర్ పట్టణంలోని ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసేందుకు పార్టీ నేతలు ఆహ్వానించారు. దీంతో బాలకష్ణ ఎన్‌టి రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళలు బాలకష్ణకు రాఖీ కట్టారు. అనంతరం అలంపూర్‌లోని జోగుళాంబ దేవాలయాన్ని బాలకష్ణ కుటుంబసమేతంగా సందర్శించారు. ప్రముఖుల సందడి.. రంగాపూర్ పుష్కరఘాట్‌లో ప్రముఖ సినీ నటుడు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన పుణ్యస్నానమాచరించారు. బీచుపల్లి పుష్కరఘాట్‌లో సినీ నిర్మాత అశోక్‌కుమార్ పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. పుష్కరాలకు విచ్చేసే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని పుష్కర ఏర్పాట్లు చేయడంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీపడుతున్నాయని ఇందు వల్ల భక్తులకు మరిన్ని మెరుగైన సేవలు కలుగుతున్నాయని అన్నారు. -
కదిలించిన ‘సాక్షి’ ఫొటో
– వికలాంగునికి చేయూతనిచ్చిన కానిస్టేబుల్‌కు అవార్డు – రూ.5,016 రివార్డు ప్రకటించిన డీజీపీ శ్రీశైలం: కృష్ణా పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లా శ్రీశైలంలోని లింగాలగట్టు పుష్కర ఘాట్‌లో ఓ దివ్యాంగుడిని కానిస్టేబుల్ తన చేతులతో ఎత్తుకొని ఒడ్డుకు చేరుస్తున్న ఫొటోను గురువారం ‘సాక్షి’ ప్రముఖంగా ప్రచురించింది. ఈ దశ్యం డీజీపీ సాంబశివరావును కదిలించింది. కానిస్టేబుల్ సేవలను ప్రశంసిస్తూ గురువారం ఆయన రివార్డు ప్రకటించారు. డీజీపీ ఆదేశాల మేరకు రాయలసీమ జిల్లాల ఐజీ శ్రీధర్‌రావు, డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకెరవికష్ణ, ఆత్మకూరు డీఎస్పీ సుప్రజలు గురువారం ఉదయం స్వయంగా లింగాలగట్టు దిగువ ఘాటుకు చేరుకొని పుష్కర విధుల్లోని కానిస్టేబుల్ మధుకుమార్‌ను అభినందించి రూ.5,016 నగదు రివార్డును అందజేశారు. మధుకుమార్(పీసీ 229) కోసిగి మండల పోలీసుస్టేషన్లో పనిచేస్తున్నారు. గతంలో మంత్రాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనూ ఈయన అవార్డును అందుకోవడం విశేషం. -
ఏడోరోజు కొనసాగిన పుష్కరాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కృష్ణా పుష్కరాల ఏడోరోజు జిల్లాలో 3.5లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. గురువారం రాఖీ పర్వదినం కావడం.. ఇంకా పుష్కరాలకు నాలుగురోజులే మిగిలి ఉన్నా ఆశించిన మేర భక్తులు రాలేదు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 28 ఘాట్లలో కొన్ని ఘాట్లు వెలవెలబోతున్నా నాగార్జునసాగర్, వాడపల్లి, మట్టపల్లిల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కర స్నానాలు చేస్తున్నారు. నాగార్జునసాగర్ శివాలయం, ఆంజనేయస్వామి ఘాట్లు కలిపి గురువారం లక్ష మందికి పైగా స్నానాలు చేసినట్టు అంచనా. వాడపల్లిలో 80వేల మంది, మట్టపల్లిలో 40వేల మంది వరకు స్నానాలు చేశారు. కనగల్ మండలం దర్వేశిపురం ఘాట్‌కు 30వేల మంది భక్తులు వచ్చి ఉంటారని అంచనా. దర్వేశిపురం ఘాట్‌కు రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో స్థానిక ప్రజలు, అధికారుల్లో ఉత్సాహం రెట్టింపవుతోంది. అయితే, మట్టపల్లిలో ఏడో రోజు భక్తుల సంఖ్య తగ్గింది. నేరేడుచర్ల మండలం మహంకాళిగూడెం ఘాట్‌లో కూడా భక్తులు తగ్గగా, చందంపేట మండలం కాచరాజుపల్లి ఘాట్‌కు మాత్రం 10వేల మందికి పైగా భక్తులు వచ్చారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో ఇలా... హుజూర్నగర్ నియోజకవర్గంలోని అన్ని ఘాట్లలో భక్తుల సంఖ్య కొంత మేర తగ్గింది. పుష్కర స్నానం కోసం ఈనెల 20వ తేదీన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ మట్టపల్లికి రానుండటంతో జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి మట్టపల్లికి వచ్చి ప్రహ్లాద ఘాట్‌లో ఏర్పాట్లు పరిశీలించారు. పర్యటన ప్రశాంతంగా సాగేందుకు కావలసిన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం స్థానికంగా ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణికుల కలుగుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మేళ్లచెరువు మండలంలోని పుష్కర ఘాట్లను ఎస్పీ పరిశీలించారు. మట్టపల్లి ప్రహ్లాదఘాట్లో ఇంటలిజెన్స్ డిఐజీ శివశంకర్‌రెడ్డి పుష్కర స్నానం ఆచరించి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. దామరచర్ల మండలంలో ఇలా... దామరచర్ల మండలంలోని ఘాట్లకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం తెల్లవారు జామున భక్తులు తక్కువగా వచ్చినా రాఖీ పౌర్ణమి కావడం వల్ల తొమ్మిది గంటల తర్వాత భక్తుల తాకిడి పెరిగింది. శివాలయం ఘాట్‌తో పాటు అడవిదేవులపల్లి, అయ్యప్పఘాట్లకు భక్తులు భారీగా వచ్చారు. అడవిదేవులపల్లి పుష్కరఘాట్‌లో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబసభ్యులతో కలిసి స్నానాలు చేశారు. వాడపల్లిలోని శివాలయం వద్ద వీఐపీ ఘాట్‌లో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం కుటుంబ సభ్యులతో కలిసి పిండప్రదానం చేసి పుణ్యస్నానాలు చేశారు. అదే విధంగా ముదిమాణిక్యం పుష్కరఘాట్‌లో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఇర్కిగూడెం ఘాట్‌లో జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, వాడపల్లిలో ఏజేసీ వెంకట్రావ్, స్థానిక ఎమ్మెల్యే బాస్కర్‌రావు సతీమణితో పాటు ఆయన బంధువులు స్నానాలు చేశారు. -
పుష్కరాలు పుణ్యఫలితాన్నిస్తాయి
జోగుళాంబను దర్శించుకున్న సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మానవపాడు/అలంపూర్‌రూరల్ : పుష్కరాలు పుణ్యఫలితాలను ఇస్తాయని, అందుకే భక్తులు పెద్దఎత్తున పుష్కరస్నానాలు ఆచరిస్తారని సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. గురువారం ఆయన కుటుంబ సమేతంగా అలంపూర్ ఆలయాలను దర్శించుకునేందుకు వచ్చారు. దీంతో ఆలయ ఈఓ గురురాజ, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ టి. నారాయణరెడ్డి, టీడీపీ తాలూకా ఇన్చార్జ్ ఎస్. ఆంజనేయులు, సర్పంచ్ జయరాముడు ఆలయ అర్చకులతో కలసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. మొదటగా బాలబ్రహ్మేశ్వరుడిని దర్శించి అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా వారికి దేవస్థానం వారు శేషవస్త్రాలు, అమ్మవారి జ్ఞాపికలు, ప్రసాదాలను అందజేశారు. భక్తులతో ఆత్మీయ పలకరింపు అమ్మవారి, స్వామివారి దర్శనానికి క్యూలో నిలబడిన భ క్తులను ఎక్కడి నుంచి వచ్చారంటూ కరచలనం చేస్తూ ఆ ప్యాయంగా పలకరించారు. అనంతరం టీడీపీ కార్యకర్త లు విశ్వం, గోపాల్, స్వామి, రామును అభినందిస్తూ పు ష్కరాల్లో భక్తులకు సేవలందించాలని ప్రోత్సహించారు. అభిమానులుగా మారిన భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలో పెద్ద ఎత్తున నిల్చున్న భక్తులు ఒక్కసారి గా క్యూలో నుంచి బయటకు దూకి బాలకృష్ణను కలసిందేకు గుమిగూడారు. దీంతో ఒక్కసారిగా క్యూలైన్ ఖాళీ అయింది. బాలకృష్ణకు స్వాగతం పలికిన మంత్రి సోమశిల నుంచి సాక్షి బృందం : సప్తనదుల సంగమమైన సోమశిల పుష్కరఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం 11గంటల సమయంలో సోమశిల వీఐపీ ఘాట్‌కు చేరుకున్నారు. ఆయనకు మంత్రి జూపల్లి కృష్ణారావు సాదరంగా స్వాగతం పలికారు. పుణ్యస్నానాల సందర్భంగా సినీనటుడు బాలకృష్ణ భద్రత దృష్ట్యా గట్టి ఏర్పాట్లు చేయాలని అక్కడున్న పోలీస్ సిబ్బందికి సూచించారు. ఈయనతోపాటు జెడ్పీటీసీ హన్మంతునాయక్, ఎంపీపీ నిరంజన్‌రావు, పెద్దకొత్తపల్లి ఎంపీపీ వెంకటేశ్వర్రావు, కొల్లాపూర్ సింగిల్‌విండో అధ్యక్షుడు తదితరులు ఉన్నారు. -
దామరచర్లలో వీవీఎస్ లక్ష్మణ్ పుష్కరస్నానం
దామరచర్ల: ఇండియన్ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ గురువారం కృష్ణా పుష్కరాల్లో స్నానమాచారించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం అడవిదేవులపల్లిలోని పుష్కర ఘాట్‌కు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుణ్య స్నానమాచారించారు. -
ఆరు రోజులుగా ఏడు లక్షల మంది
నాగార్జునసాగర్ : పుష్కరాలు ఆరోరోజుకు చేరుకున్నాయి. జిల్లాలో 28 స్నానఘాట్లు ఏర్పాటు చేయగా భక్తులు అత్యధికంగా నాగార్జునసాగర్‌కు తరలి వస్తున్నారు. ఎక్కువగా శివాలయం ఘాట్‌లోనే స్నానం చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే ఇక్కడ రద్దీ పెరగడంతో పోలీసులు కొంత మేరకు భక్తులను సురికివీరాంజనేయస్వామి ఘాట్‌తోపాటు ఊట్లపల్లి గాట్‌కు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. కేవలం సాగర్‌లో ఏర్పాటు చేసిన శివాలయం, సురికిఆంజనేయస్వామి, పొట్టిచెల్మఘాట్లలో ఈ ఆరురోజుల్లో దాదాపు ఏడు లక్షల మంది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించినట్టు అధికారులు తెలిపారు. కాగా బుధవారం శివాలయం ఘాట్ వద్ద 80వేల మంది, సురికి ఆంజనేయస్వామి ఘాట్‌లో 34వేల మందితో మెుత్తం 1.14లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. -
ఆరు రోజులుగా ఏడు లక్షల మంది
నాగార్జునసాగర్ : కష్ణాపుష్కరాలు ఆరోరోజుకు చేరుకున్నాయి. జిల్లాలో 28 స్నానఘాట్లు ఏర్పాటు చేయగా భక్తులు అత్యధికంగా నాగార్జునసాగర్‌కు తరలి వస్తున్నారు. ఎక్కువగా శివాలయం ఘాట్‌లోనే స్నానం చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే ఇక్కడ రద్దీ పెరగడంతో పోలీసులు కొంత మేరకు భక్తులను సురికివీరాంజనేయస్వామి ఘాట్‌తోపాటు ఊట్లపల్లి గాట్‌కు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. కేవలం సాగర్‌లో ఏర్పాటు చేసిన శివాలయం, సురికిఆంజనేయస్వామి, పొట్టిచెల్మఘాట్లలో ఈ ఆరురోజుల్లో దాదాపు ఏడు లక్షల మంది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించినట్టు అధికారులు తెలిపారు. కాగా బుధవారం శివాలయం ఘాట్ వద్ద 80వేల మంది, సురికి ఆంజనేయస్వామి ఘాట్‌లో 34వేల మందితో మెుత్తం 1.14లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో నటికి తీవ్రగాయాలు
-
పుష్కరాల్లో అపశ్రుతి
–కరెంట్ షాక్‌తో తమిళనాడు వాసి మృతి – నల్లగొండ జిల్లాలో ఘటన –వివిధ శాఖల సమన్వయ లోపమే కారణం –గుండెపోటని కప్పిపుచ్చుకునేందుకు అధికారుల యత్నాలు నల్లగొండ టూటౌన్: నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం వద్ద ఏర్పాటు చేసిన పుష్కర ఘాట వద్ద అపశృతి చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని శివగంగ జిల్లాకు చెందిన చెవుగా పేరుమళ్లు (55) శనివారం విద్యుత్ షాక్‌తో మరణించాడు. ఇటీవల కొంత కాలం నుంచి నల్లగొండ సమీపంలోని అద్దంకి బైపాస్ రోడ్డు వెంట ఉన్న లెప్రసీ కాలనీలో ఒక్కడే గదిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఛాయా సోమేశ్వరాలయం వద్దకు చేరుకొని పుష్కర స్నానం ఆచరించాడు. స్నానం చేసిన అతను దేవాలయం ప్రహరీపై పెట్టిన దుస్తులను తీసుకోవడానికి వెళ్లగా ఆలయం వద్ద డెకరేషన్ లైట్లకోసం పక్కనే భూమిలో ఎర్త్కునాటిన సీకు వైరు తగిలి అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని అత్యవర వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చారు. ఫస్ట్ ఎయిడ్ చేసి అంబులెన్స్ ద్వారా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మతి చెందినట్టు «ధ్రువీకరించారు. కరెంట్ షాక్‌తోనే మరణించినట్లు మొదట పేర్కొన్న అధికారులు ఆతరువాత మాటమార్చారు. గుండె పోటుతో చనిపోయాడనే ప్రచారాన్ని తెరపైకి తీసుకురావడం గమనార్హం. మతుడినిS పోస్ట్ మార్టం చేయకముందే గుండె పోటు అని చెప్పడం గమనార్హం. -
ఘనంగా కృష్ణా పుష్కరాలు
-
రోడ్డు ప్రమాదంలో నటికి తీవ్రగాయాలు
విజయవాడ: కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టెలివిజన్ నటి రోహిణి రెడ్డికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు పుష్కరాల్లో పాల్గొనడానికి వెళుతుండగా ఆమె ప్రయాణిస్తున్న బెలీనో కారు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రోహిణిరెడ్డితో పాటు కారు డ్రైవర్ ఉషప్పగౌడ్, అసిస్టెంట్ చంటిలకు కూడా తీవ్రగాయాలయ్యాయి. విజయవాడ గొల్లపూడిలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీనివాస కళ్యాణం తదితర సీరియల్స్‌లో రోహిణిరెడ్డి నటించారు. -
పుష్కర యాత్రికులతో ట్రాఫిక్‌జామ్
– పోలీసుల చొరవతో గేట్లు ఎత్తివేసిన సిబ్బంది – 2గంటల్లో దాటిన 10వేల వాహనాలు షాద్‌నగర్ : పుష్కర స్నానం కోసం వెళుతున్న ప్రయాణికుల వాహనాలకు టోల్గేట్ వద్ద బ్రేకులు పడ్డాయి. సుమారు రెండుగంటల పాటు వాహనదారులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రెండోరోజు శనివారం పుష్కర భక్తులు పెద్దఎత్తున తమ వాహనాల్లో పుష్కరస్నానం కోసం బయల్దేరారు. ఫరూఖ్‌నగర్ మండలంలోని రాయికల్ టోల్‌ప్లాజా వద్దకు ఒక్కసారిగా పెద్ద ఎత్తున వాహనాలు వచ్చాయి. టోల్ రసీదులు జారీ చేస్తున్నా వాహనాల రాక ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. దీంతో పట్టణ సీఐ రామకష్ణ అక్కడికి చేరుకుని అన్ని గేట్లను ఎత్తివేయించడంతో వాహనదారులు ఎలాంటి టోల్ రుసుము చెల్లించకుండానే వెళ్లిపోయారు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే పదివేల వాహనాలు వెళ్లాయని నిర్వాహకులు తెలిపారు. అనంతరం షాద్‌నగర్ నుంచి జడ్చర్ల వైపు వెళ్లే దారిలో ఉన్న ఆరు, జడ్చర్ల నుంచి ౖహె దరాబాద్ వైపు వెళ్లే దారిలో ఉన్న రెండు టోల్ కౌంటర్ల ద్వారా యాత్రికులను జడ్చర్ల వైపు పంపారు. రద్దీ పెరిగే అవకాశం వరుసగా మూడురోజుల పాటు సెలవులు ఉండటంతో పుష్కర యాత్రికులు పెద్దఎత్తున బీచ్పల్లి, అలంపూర్ తదితర ఘాట్లకు తరలే అవకాశముంది. టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిని క్రమబద్ధీకరించడానికి బైపాస్ జాతీయ రహదారిలో ఉన్న యమ్మీ హోటల్ సమీపంలో నుంచి చిల్కమర్రి మీదుగా బూర్గుల ఆపై తిరిగి జాతీయ రహదారికి వాహనాలను మళ్లించాలని స్థానికులు కోరుతున్నారు. -
జాతీయ రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్
-
జాతీయ రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు కావడంతో పుష్కరాలకు వెళ్లే వాహనాలతో రెండు రాష్ట్రాల్లో జాతీయరహదారులు కిక్కిరిసిపోయాయి. టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్-కర్నూలు, హైదరాబాద్-విజయవాడ రహదారుల్లో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రత నిమిత్తం రాయ్కల్ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేపట్టారు. -
పుష్కరాలనూ రాజకీయం చేస్తున్నారు : కె.పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: పుష్కరాల పేరుతో ఆడుతున్న డ్రామాలను కట్టిపెట్టాలని సీఎం చంద్రబాబుకు వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి హితవు పలికారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని తన ఇంటి కార్యక్రమాల్లా చేస్తూ చంద్రబాబు ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. పుష్కరాలు ప్రారంభమయ్యాక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆహ్వానం పంపడం బాబు రాజకీయ కుట్రలో భాగమేనని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతను గౌరవించే విధానం ఇదేనా? అని ప్రశ్నించారు. ప్రొటోకాల్ ప్రకారం ఎవరిని పడితే వాళ్లను పిలవచ్చా? అని నిలదీశారు. ప్రోటోకాల్ చంద్రబాబు ఇంటి వ్యవహారంలా మారిపోయిందని ఆయన విమర్శించారు. ఇది తప్పన్నారు. ఇన్విటేషన్ ఇచ్చినా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాలేదని చెప్పి చంద్రబాబు దీన్నికూడా రాజకీయం చేస్తారని మండిపడ్డారు. సొంత వ్యవహారమన్నట్టు ప్రవర్తించడం దారుణం.. ఆఖరికి పుష్కరాలను కూడా చంద్రబాబు రాజకీయానికి వాడుకుంటున్నారని పార్థసారథి ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘పండుగలు, పుష్కరాలు ప్రతిసారీ వస్తాయి. సంప్రదాయానికనుగుణంగా చేసుకుంటాం. చంద్రబాబు పిలిచినా, పిలవకపోయినా పుష్కరాల్లో స్నానాలు చేస్తాం. కానీ అదేదో సొంత వ్యవహారమన్నట్టు ప్రవర్తించడం దారుణం’’ అని విమర్శించారు. -
పుష్కర వాహిని..మనసా స్మరామి
-
పుష్కరాలకు రూ.860 కోట్లు
మునగమాన్‌దిన్నె ఘాట్ : కష్ణా పుష్కరాలకు ప్రభుత్వం రూ.860 కోట్లు కేటాయించిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ నిధులతో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని పుష్కర ఘాట్లలో అన్ని వసతులు కల్పించామన్నారు. శుక్రవారం పుష్కరాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మునగమాన్‌దిన్నె ఘాట్‌ను సందర్శించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తదుపరి ప్రజలు మొదటిసారి పుష్కరాల్లో సంతోషంగా పాల్గొంటున్నారన్నారు. సుమారు 500మంది ఉద్యోగులను ఇక్కడ నియమించి ప్రజలకు ఎలాంటి లోటులేకుండా చూస్తున్నామన్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాల్లో వ్యవసాయ పనులు సాగుతున్నందున రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో పెబ్బేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు గోవిందునాయుడు, పీఎసీఎస్ అధ్యక్షుడు కోదండరామిరెడ్డి, వనపర్తి కౌన్సిలర్ వాకిటి శ్రీధర్, టీఆర్ఎస్ నాయకుడు బీచుపల్లియాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరాలకు ఇద్దరు ట్రైనీ ఐఏఎస్‌లు
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : కష్ణా పుష్కరాల్లో భక్తులకు క్షేత్రస్థాయిలో సేవలు అందించేందుకుగాను ఇద్దరు ట్రైనీ ఐఏఎస్‌లను జిల్లాకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2015 బ్యాచ్‌కు చెందిన మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా ట్రైనీ కలెక్టర్లు గౌతం పొట్రు, పామెల సత్పతిలను నియమించింది. శుక్రవారం విధుల్లో చేరిన వారు పుష్కరాలు ముగిసే వరకు ఆయా ఘాట్ల వద్ద సేవలు అందిస్తారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు, వద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటారు. -
తొలిరోజు 4లక్షల మంది పుష్కర స్నానాలు
విజయవాడ: పుష్కరాల ప్రారంభ రోజైన శుక్రవారం విజయవాడలో ఏర్పాటుచేసిన ఘాట్ల వద్ద 4లక్షల మంది పుష్కర స్నానమాచరించినట్లు పుష్కరాల ప్రత్యేకాధికారి రాజశేఖర్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ... శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్బంగా భక్తుల రద్దీ తక్కువగా ఉందని, రేపటి నుంచి మూడు రోజులపాటు సెలవులు ఉండడంతో భక్తల రద్దీ పెరుగుతుందనుకుంటున్నామని ఆయన తెలిపారు. -
పుష్కర సంరంభం
'తల్లి కృష్ణానదీ! భవత్తటమునందె/మ్రోసెనాంధ్ర పతాక ముమ్మొదటి దెగసి/ తెలుగునావలు నీ దీవనలు గడించి/ఎత్తె తెరచాప దీవుల నెల్లనొత్తె’ అంటూ కృష్ణమ్మకూ, తెలుగు నేలకూ ఉన్న అవినాభావ అనుబంధాన్ని తెనుగులెంక తుమ్మల సీతారామమూర్తి కమనీయంగా చెప్పారు. ఆది మానవుడిని మానవుడిగా తీర్చిదిద్దడంలో... సంస్కృతినీ, సంస్కారాన్నీ అద్దడంలో.. సహజీవన సౌందర్యాన్ని గుర్తెరిగించడంలో ఎక్కడైనా నదుల పాత్ర వెలలేనిది. అందుకే నదిని అమ్మగా తలిచి కొలిచే సంప్రదాయం అనాదిగా వస్తున్నది. నేటి ఉదయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఘనంగా ప్రారంభమై పన్నెండురోజులపాటు కొనసాగే పుష్కరాలు ఆ సంప్రదాయంలో భాగమే. ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం 5.45కు, తెలంగాణలో ఉదయం 5.58 నిమిషాలకు ఈ పన్నెండు రోజుల సంరంభం ప్రారం భమవుతుంది. దేవతల గురువు బృహస్పతి కన్యారాశిలోకి ప్రవేశించే క్షణాలను గణించి ఈ ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. పన్నెండళ్లకొక్కసారి వచ్చే ఈ పుష్కరాలకు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎంతో ఉంటుంది. పుష్కరకాలంలో నదుల్లో త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలూ, సప్తరుషులు, పితృదేవతలూ నివసిస్తారని... మూడున్నర కోట్ల తీర్థాలు అందులో కలుస్తాయని విశ్వసిస్తారు. అందుకే ఈ కాలంలో పుష్కర స్నానం, పితృ కర్మలు అనంత పుణ్యప్రదమని చెబుతారు. ఆధునికత పెరుగుతున్న కొద్దీ, రవాణా సదుపాయాలు విస్తరిస్తున్నకొద్దీ ఈ విశ్వాసాలు మరింత చిక్కనవు తున్నాయి. ఇందుకు 1921నాటి ఒక వాణిజ్య ప్రకటనే రుజువు. ఆ ఏడాది ఆగస్టు 15-సెప్టెంబర్ 7 మధ్య జరిగిన కృష్ణా పుష్కరాల సందర్భంగా మద్రాస్ అండ్ సదరన్ మరాఠా రైల్వే కంపెనీ లిమిటెడ్ పేరిట వెలువడిన ఈ ప్రకటన తమ కంపెనీవారు ‘కావలసినంత ప్రయాణికులు ఉన్న పక్షమునందు ఎన్ని తడవలైనను స్పెషలుబండ్లు పోవుటకు తగిన ఏర్పాట్లు చేసెదరు’ అని యాత్రికులకు తెలిపింది. ‘చాలినంతమంది రెండవ తరగతి ప్రయాణికులున్నప్పుడు రెండవ తరగతి పెట్టె కూడా చేర్చబడును’ అని ఆ ప్రకటన ముక్తాయించింది. దేశంలో మూడో పెద్ద నదిగా, దక్షిణాదిన గోదావరి తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించే కృష్ణానది పడమటి కనుమల్లోని మహాబలేశ్వర్ సమీపాన ఒక చిన్నధారగా ప్రారంభమవుతుందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ముందుకు సాగు తున్నకొద్దీ అది అనేక ఉప నదులను సంగమించుకుంటూ, తాను ఒరుసుకు ప్రవహించే నేలతల్లిని సశ్యశ్యామలం చేసుకుంటూ సుమారు 1,240 కిలోమీటర్లు ప్రయాణించి ఆంధ్రప్రదేశ్‌లోని హంసలదీవి వద్ద బంగాళాఖాతాన్ని చేరుతుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 29 నదులు కృష్ణమ్మలో లీనమవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1,188 మీటర్ల వెడల్పుతో దీని విశ్వ రూపం కనబడుతుంది. ఈసారి పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో మూడున్నర కోట్లమంది... తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మరో మూడున్నర కోట్లమంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేశామని, రద్దీని తట్టుకు నేందుకు అవసరమైన బస్సులు, రైళ్లు సమకూర్చామని చెబుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగే పుష్కర స్నానాల్లో అధికభాగం... దాదాపు 80 శాతం విజయ వాడలోనే ఉంటాయి. ఆర్భాటపు ప్రకటనల సంగతలా ఉంచి రెండు రాష్ట్రాల్లోనూ పనులు నత్తనడకనే సాగాయని, నాసిరకంగానే ఉన్నాయని ఆరోపణలు వెల్లు వెత్తాయి. పుష్కరాల ముహూర్తం సమీపిస్తున్న సమయానికి కూడా పనులింకా కొనసాగుతూనే ఉన్నాయి. విజయవాడలో పుష్కర ఘాట్లకు చేరువలో ఉన్న ఖాళీ స్థలాలను వదిలిపెట్టి కిలోమీటర్ దూరంలో ఎక్కడో యాత్రికుల కోసం పుష్కర నగర్లు నిర్మించారు. కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాక తలదాచుకునేందుకు భక్తులు అంత దూరం వెళ్లవలసిన అవసరమేమిటో అర్ధంకాదు. పుష్కరాల పనుల సాకుతో ప్రార్థనా మందిరాల కూల్చివేతలు, విగ్రహ విధ్వంసాలు అందరినీ నివ్వెరపరి చాయి. మిత్రపక్షంగా ఉన్నా బీజేపీది అరణ్యరోదనే అయింది. ఆ పార్టీలో బలహీనంగానైనా తమ స్వరం వినిపించడానికి ప్రయత్నించినవారిని... టీడీపీ కార్య కర్తలను వెంటేసుకెళ్లిన నేతలు పరాభవించాలని చూశారు. ఆధ్యా త్మికవేత్తలు అడగబోతే ‘మేం మీకంటే గొప్ప భక్తులం...’ అంటూ మొరటుగా జవాబిచ్చారు. ప్రధాన రహదార్లపై అక్కడక్కడ ప్రైవేటు భవనాలపై పెట్టుకున్న ప్రతిపక్షం ఫ్లెక్సీలు కూడా తొలగించి ప్రభుత్వం తన విద్వేషపూరిత మనస్తత్వాన్ని చాటుకుంది. పనుల వరకూ చూస్తే తెలంగాణలోనూ పెద్ద తేడా ఏం లేదు. జూలై 15 కల్లా పనులన్నీ పూర్తికావాలని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరుగులు పెట్టిం చినా కదలిక లేదు. దీన్ని ఆగస్టు 5కు పెంచినా ఫలితం లేదు. చివరకు 8వ తేదీకి దాన్ని సాగదీసినా ఉపయోగం లేదు. పుష్కరాలు మొదలుకావడానికి ముందు రోజు కూడా అక్కడక్కడ పనులు నడుస్తూనే ఉన్నాయి. ఒకటి రెండు చోట్లయితే పుష్కరఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన రక్షణ కడ్డీలు విరిగిపోయాయి. నిర్మించిన మట్టిరోడ్లు వర్షాలకు జాడలేకుండా పోయాయి. పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమ వుతాయో చాలా ముందే తెలుస్తుంది. అయినా నెల, నెలన్నర ముందు తప్ప చేయాల్సిన పనులకు సంబంధించి స్పష్టత రాకపోవడం, నిధులు విడుదల చేయకపోవడం ఆశ్చర్యం గొలుపుతుంది. పాలనా వ్యవహారాల్లో ఆరితేరినవారే రెండు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులుగా ఉన్నా... గత అనుభవాలు పుష్కలంగా ఉన్నా ఈ విషయంలో వైఫల్యం చెందడం విచిత్రం. చంద్రబాబుకైతే నిరుడు గోదావరి పుష్కరాల్లో ఎదురైన చేదు అనుభవాలు ఉండనే ఉన్నాయి. పన్నెండేళ్ల కొకసారి వచ్చే పుష్కర సంరంభం లక్షలాదిమంది భక్తులను ఒకచోట చేర్చే సందర్భం. నదీ స్నానానికి వచ్చే భక్తకోటిని తిరిగి ఇళ్లకు వెళ్లేవరకూ సురక్షితంగా చూసుకోవాల్సిన బాధ్యత పాలనా యంత్రాంగానిది. ఆ బాధ్యతనైనా సక్ర మంగా, చిత్తశుద్ధితో నిర్వర్తించాలని అందరం కోరుకుందాం. -
కృష్ణమ్మకు హారతులతో పుష్కరుడికి స్వాగతం
* లక్ష ఒత్తుల హారతిచ్చిన చంద్రబాబు * బోయపాటి శ్రీను బృందం లేజర్ షో సాక్షి, విజయవాడ: బృహస్పతి కన్యారాశిలోకి ప్రవేశించే సమయంలో కృష్ణానదికి పుష్కరాలు వస్తాయని పండితులు చెబుతారు. గురువారం రాత్రి 9.30 గంటల శుభముహూర్తంలో పవిత్ర కృష్ణానదిలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై నుంచి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అర్చకులు నవహారతులు ఇవ్వడంతో పాటు కృష్ణమ్మను పూజించి పుష్కరుడ్ని ఆహ్వానించారు. అంతకు ముందు తొమ్మిది గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరితో కలసి కృష్ణా-గోదావరి సంగమ ప్రదేశానికి వచ్చారు. అక్కడే ఏర్పాటు చేసిన నమూనా దేవాలయాల్లోని శ్రీ దుర్గమ్మవారితో పాటు ఇతర దేవతామూర్తులు దర్శించుకుని పూజించారు. అక్కడ నుంచి కృష్ణానదీ తీరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశానికి వచ్చి కృష్ణమ్మకు లక్షఒత్తుల హారతిని ఇచ్చారు. గోదావరి-కృష్ణా సంగమాన్ని సినీదర్శకుడు బోయపాటి శ్రీను బృందం రంగురంగుల బాణసంచాతో, విద్యుత్ దీపాలతో సందర్శకుల్ని ఆకట్టుకునేలా వివరించారు. చంద్రబాబు లక్షఒత్తుల హారతి ఇవ్వగానే ఆకాశంలో మిరమిట్లుగొలిపేలా, రంగురంగుల విద్యుత్ కాంతులతో, అనేక రకాల శబ్దాలతోబాణసంచాను కాల్చారు. కృష్ణానదిపై లేజర్ షోను ప్రదర్శించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు తనయుడు లోకేష్, మంత్రులు పి.మాణిక్యాలరావు, అచ్చెన్నాయుడు, నారాయణ, దేవినేని ఉమా, కొల్లురవీంద్ర, ఎంపీ కేశినేని శ్రీనివాస్, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ పాల్గొన్నారు. మొదలైన కృష్ణా పుష్కరాలు సాక్షి, అమరావతి: పుష్కరుడు కృష్ణా నదిలోకి ప్రవేశించాడు. పుణ్యస్నానాలకు కృష్ణవేణి సిద్ధమైంది. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా -గోదావరి సంగమం ప్రాంతంలో గురువారం రాత్రి కృష్ణా హారతి ఆరంభంతో పుష్కర వేడుకలకు ప్రభుత్వం నాంది పలికింది. పిండ ప్రదానం పూజ ధర రూ. 300 కృష్ణా పుష్కరాల సందర్భంగా పిండ ప్రదానం పూజకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 300 ధరను నిర్ణయించింది. పిండ ప్రదానంతో పాటు పుష్కర స్నాన ఘాట్ల వద్ద జరిగే వివి ద రకాల పూజలకు రాష్ట్ర ప్రభుత్వం ధరలను నిర్ణయించింది. ఘాట్ల వద్ద పూజల నిర్వహణకు దేవాదాయ శాఖ ప్రత్యేకంగా పాస్‌లు జారీ చేయడంతోపాటు భక్తుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. పూజను బట్టి మహా సంకల్పం, సరిగంగ స్నానం, ప్రాయశ్చితం, గౌరీ పూజ, గంగ పూజ- రూ.150 చొప్పున ధర నిర్ణయించారు. స్వయంపాకం/పోతారు- మూ సివాయనం పూజకు రూ. 200 ధరగా నిర్ణయించారు. పూజా సామగ్రి కిట్లను ఘాట్ల వద్దే చౌక ధరలకు విక్రయించేందుకు ప్రత్యేకంగా డ్వాక్రా బజార్లను ఏర్పాటు చేశారు. -
పుష్కరాలకు భారీ బందోబస్తు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: పుష్కరాల్లో బందోబస్తు చర్యలు పుష్కలం. పోలీసులు పటిష్టమైన భద్రతాచర్యలు చేపట్టారు. నిఘాను కట్టుదిట్టం చేశారు. ఈ నెల 12(శుక్రవారం) నుంచి జరిగే కృష్ణా పుష్కరాలకు తరలి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో దాదాపు 13,474 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ఘాట్ల వద్ద 8 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను నియమించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మేజర్, మైనర్, లోకల్ ఘాట్లు 57 వరకు ఉన్నాయి. వీటి వద్ద భద్రత కోసం 6,754 మంది పోలీసులను కేటాయించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని బాగా రద్దీ ఉండే అవకాశమున్నా బీచుపల్లి ఘాట్‌కు శాంతిభద్రతల అదనపు డీజీ అంజనీకుమార్, హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్‌ను ఇన్చార్జిలుగా నియమించినట్లు తెలిపారు. అలంపూర్ పుష్కర ఘాట్‌కు ఐజీ కె.శ్రీనివాస్‌రెడ్డి, ఈగలపెంట వద్దనున్న ఘాట్‌కు సెక్యూరిటీ వింగ్ జాయింట్ సీపీ మహేందర్ కుమార్ రాథోడ్, కృష్ణా గ్రామం వద్దనున్న ఘాట్‌కు సీఐడీ ఎస్పీ ఎం.శ్రీనివాసులుకు భద్రతా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. నల్లగొండ జిల్లాలోని 28 పుష్కరఘాట్ల భద్రత కోసం 6,720 మంది పోలీసులను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. జిల్లాలో రద్దీగా ఉండే వాడపల్లి ఘాట్‌కు నార్త్‌జోన్ ఐజీ వై నాగిరెడ్డి, సాగర్ ఘాట్‌కు డీఐజీ ఎంకే సింగ్, మఠంపల్లి ఘాట్‌కు గ్రేహౌండ్స్ ఎస్పీ తరుణ్జోషిని కేటాయించినట్లు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు పుష్కర భక్తులకు ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు డీజీపీ అనురాగ్‌శర్మ పేర్కొన్నారు. ట్రాఫిక్‌ను అంచనా వేసి అదుపు చేసేందుకు రెండు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. నల్లగొండ జిల్లాలో 55, మహబూబ్‌నగర్ జిల్లాలో 33 ట్రాఫిక్ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. రహదారి వెంబడి ఎక్కడికక్కడ ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులను నెలకొల్పిన్లు తెలిపారు. మహిళలపై వేధింపులు జరగకుండా చూసేందుకు 27 ‘షీ’ టీమ్‌లను, సంఘవిద్రోహ చర్యలు చోటు చేసుకోకుండా ఉండేందుకు 80 చెక్ టీమ్‌లను నియమించామని పేర్కొన్నారు. అన్ని పుష్కరఘాట్ల వద్ద దాదాపు 555 సీసీ కెమెరాలతో ఎల్లవేళలా గస్తీ నిర్వహిస్తామని వివరించారు. రెండు జిల్లాల ఎస్పీలు భక్తుల సౌకర్యార్థం కోసం మొబైల్ యాప్‌లను ఏర్పాటు చేశారన్నారు. -
కలిసొచ్చిన సెలవులు..!
సాక్షి, సిటీబ్యూరో: ఈ వారంలో వరుసగా సెలవులు కలిసిసొచ్చాయి. ఆగస్టు 12న కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానుండగా, 13వ తేదీన రెండో శనివారం, 14న ఆదివారం, 15న స్వాతంత్య్ర దినోత్సవం. వరుసగా మూడురోజులు సెలవులు వచ్చాయి. 18వ తేదీ శ్రావణపూర్ణిమ రక్షాబంధన్ ఐచ్ఛిక సెలవుదినం కాగా, 21వ తేదీ ఆదివారం. మధ్యలో 16,17,19,20 తేదీలు మాత్రమే పనిదినాలు. దీంతో ఆయా రోజుల్లో పుష్కరాలకు భక్తులు రద్దీ పెరిగే సూచనలున్నాయి. -
పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
భద్రాచలం : ఈ నెల 12 నుంచి 23 వరకు జరుగనున్న పుష్కరాలకు కృష్ణ నది ఉన్న అన్ని ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపబడునని భద్రాచలం డిపో మేనేజర్ ఎన్. నర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ కృష్ణా పుష్కరాలకు వెళ్లే ప్రయాణికుల కొరకు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందన్నారు. విజయవాడ కృష్ణా పుష్కరాలకు వెళ్లే బస్సులు ఇబ్రహీంపట్నం వరకు వెళ్తాయని, అక్కడ నుంచి 4పి, 4బి, 4ఎస్ నంబర్ల గల ఉచిత బస్సులు కృష్ణా పుష్కర ఘాట్ల వద్దకు ఉచితంగా భక్తులను చేర్చుతాయన్నారు. ప్రయాణికులు ఈ బస్సు సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9959225987 నంబరును సంప్రదించాలన్నారు. -
పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
భద్రాచలం : ఈ నెల 12 నుంచి 23 వరకు జరుగనున్న పుష్కరాలకు కృష్ణ నది ఉన్న అన్ని ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపబడునని భద్రాచలం డిపో మేనేజర్ ఎన్. నర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ కృష్ణా పుష్కరాలకు వెళ్లే ప్రయాణికుల కొరకు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందన్నారు. విజయవాడ కృష్ణా పుష్కరాలకు వెళ్లే బస్సులు ఇబ్రహీంపట్నం వరకు వెళ్తాయని, అక్కడ నుంచి 4పి, 4బి, 4ఎస్ నంబర్ల గల ఉచిత బస్సులు కృష్ణా పుష్కర ఘాట్ల వద్దకు ఉచితంగా భక్తులను చేర్చుతాయన్నారు. ప్రయాణికులు ఈ బస్సు సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9959225987 నంబరును సంప్రదించాలన్నారు. -
పుష్కరాలకు సర్వం సిద్ధం : ఎస్పీ
-
పుష్కర పూజలపై అవగాహన
షాద్‌నగర్‌రూరల్: ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల సమయంలో గహంలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? ఎయే కార్యక్రమాలు చేయకూడదనే సందేహాలు ఉండటం సహజం. కష్ణా పుష్కరాలు రేపటి నుంచి ప్రారంభంకానున్న సందర్భంగా ప్రజలకు ఉన్న అపోహలౖపై పూర్తి సమాచారాన్ని ఇవ్వడానికి షాద్‌నగర్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ముందుకు వచ్చింది. పుష్కర సమయంలో ఎలాంటి పనులు చే యాలి? ఎలాంటి పనులు చేయకూడదనే విషయాన్ని బ్రాహ్మణసేవా సమాఖ్య పట్టణ ప్రధాన కార్యదర్శి చిలుకూరి రామసత్యనారాయణ శర్మ బుధవారం వివరంగా తెలిపారు. పుష్కరకాలం అనేది ఎంతో పవిత్రమైనదని ఈ సమయంలో దాన ధర్మాలు, పిండ ప్రధానాలు, వ్రతాలు , నోములు వంటి కార్యక్రమాలు యధావిధిగా చేసుకోవచ్చని తెలిపారు. వ్రతాలకు పుష్కర కాలం చాలా మంచిదని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే పుష్కర నదీ పరివాహక ప్రాంతం చుట్టూ 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలు పుష్కరాల సమయంలో వివాహాలు, గహప్రవేశాలు. భూమిపూజలు చేయరాదన్నారు. -
పుష్కరాలకు విపత్తుల నిర్వహణ బందం
కావలిఅర్బన్ : ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కష్ణా పుష్కరాలకు కావలి నుంచి విపత్తుల నిర్వహణ బందం తరలివెళ్లింది. స్థానిక రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో అంబులెన్స్‌తో పాటు 5 మంది సభ్యులతో కూడిన బందం బుధవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుంచి బయలుదేరింది. ఈ వాహనాన్ని ఆర్డీఓ లక్ష్మీనరసింహం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ అధ్యక్షుడు, ఆర్డీఓ మాట్లాడుతూ ఈ బందం సభ్యులు ప్రాథమిక చికిత్స, విపత్తుల నిర్వహణలో శిక్షణ పొందినవారని తెలిపారు. వీరు రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో సేవలు అందిస్తున్నారన్నారు. బందంలో బీద లక్ష్మీనంద, మొగళ్లపల్లి సాయిగుప్త, డి.నబికేత్, కాకుమాని ప్రీతమ్‌శెట్టి, డాకారపు పుశ్యమిత్రలున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ కార్యదర్శి డి.రవిప్రకాష్, సెంట్రల్ బ్యాంకు డైరెక్టర్ డి.సుధీర్‌నాయుడు పాల్గొన్నారు. -
పుష్కరాలపై ఆబ్కారీశాఖ దృష్టి
మహబూబ్‌నగర్ క్రైం: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాబోతున్న కృష్ణా పుష్కరాలలో ఎలాంటి ఇబ్బందికరమైన సంఘటనలకు తావివ్వకుండా జిల్లా అబ్కారీ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనిలో భాగంగానే జిల్లాలో అతి ప్రధానమైన ఘాట్లలలో ఎక్సైజ్ సిబ్బంది నిఘా ఉంచనున్నారు. జిల్లాలో బీచుపల్లి, రంగాపూర్, గొందిమళ్ల, సోమశిల, కృష్ణ, పసుపుల, అలంపూర్ ఇతర ప్రధాన ఘాట్లలలో ఈ శాఖ నుంచి ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు. ఇప్పటికే ప్రధాన ఘాట్ల వద్ద ఇద్దరు ఎస్ఐలతో పాటు ముగ్గురు మగ, ఇద్దరు ఆడ కానిస్టేబుల్స్‌కు విధులు కేటాయించారు. జిల్లాలో పుష్కర ఘాట్ల వద్ద మద్యం, కల్లు, సారా అమ్మకాలు పూర్తిగా అరికట్టాడానికి అధికారులు భావిస్తున్నారు. దీంతో పాటు పుష్కర ఘాట్లకు దాదాపు 500నుంచి 600మీటర్ల సమీపంలో ఉండే మద్యం దుకాణాలు పుష్కర రోజుల సమయంలో పూర్తిగా మూసి వేయడానికి ప్రణాళిక చేస్తున్నారు. దాంతో పాటు ఘాట్ల దగ్గర, జాతీయ రహదారిపై ఎలాంటి మద్యం అమ్మకాలు లేకుండా చేయడానికి ఆ శాఖ చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా పుష్కర ఘాట్లకు వచ్చే భక్తులు ఎవరు కూడా మద్యం, కల్లు, సారా సేవించకుండా ఉండటానికి ఆ శాఖ నుంచి అవగాహన కార్యక్రమాలు చేయాలని చూస్తున్నారు. -
11 నుంచి దేవరపల్లి వద్ద ట్రాఫిక్ మళ్లింపు
దేవరపల్లి : కృష్ణా పుష్కరాలు ప్రారంభం సందర్భంగా ఈ నెల 11 నుంచి కొవ్వూరు–గుండుగొలను రోడ్డులో భారీ వాహనాలు, లారీల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నట్టు కొవ్వూరు రూరల్ సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు. పుష్కరాల సందర్భంగా దేవరపల్లి మూడు రోడ్లు జంక్షన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఈనెల 11 నుంచి విశాఖపట్నం వైపు నుంచి చెన్నై, హైదరాబాద్ వెళ్లే వాహనాలను దేవరపల్లిలో గోపాలపురం, కొయ్యలగూడెం. జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట మీదుగా మళ్లిస్తున్నట్టు ఆయన తెలిపారు. కార్లు, బస్సులు, మోటారు సైకిళ్లను మాత్రమే విజయవాడకు అనుమతించడం జరుగుతుంన్నారు. ఈనెల 25 వరకు ట్రాఫిక్ మళ్లించడం జరుగుతుందని, కంట్రోల్ రూమ్ కూడా పనిచేస్తుందని ఆయన తెలిపారు. ట్రాఫిక్ మల్లింపునకు సిబ్బందిని నియమించినట్టు ఆయన తెలిపారు. పుష్కరయాత్రికులకు అసౌకర్యం కలగకుండా వాహనదారులు -
కిక్కిరిసి విజయవాడ బస్టాండ్, రైల్వేస్టేషన్
-
గజ ఈతగాళ్లకు అవగాహన
ఆత్మకూర్ : కష్ణాపుష్కరాల సందర్భంగా మండల పరిధిలోని జూరాల పుష్కరఘాట్ వద్ద మత్స్యశాఖ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆ శాఖ ఏడీ ఖాజా మాట్లాడుతూ ప్రభుత్వం పుష్కరాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ఒక్క భక్తుడికి కూడా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత గజ ఈతగాళ్లదే అన్నారు. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, పుష్కరస్నానం ఆచరించే భక్తులకు భరోసా ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా తమకు పుట్టీలు ఏర్పాటు చేయాలని మత్స్యకారులు కోరగా ఆ పుట్టీలను వారే సమకూర్చుకోవాలన్నారు. ప్రతి మత్స్యకారుడికి రోజుకు రూ.350 గౌరవ వేతనం అందజేస్తామన్నారు. జూరాల పుష్కరఘాట్ వద్ద 12మంది గజ ఈతగాళ్లను నియమిస్తున్నామని, అదేవిధంగా జిల్లాలోని అన్ని ఘాట్ల వద్ద 12మంది గజ ఈతగాళ్లను నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మత్స్యకారులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పుష్కల స్నానం
–పుష్కరఘాట్లకు జలకళ –నిండుకుండలా జూరాల జలాశయం –నారాయణపూర్ నుంచి భారీగా వరద –జిల్లాలో ప్రధాన జలాశయాలకు జలకళ –14గేట్ల ద్వారా శ్రీశైలం రిజర్వాయర్‌కు నీటివిడుదల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ బిరబిరా పరుగులు తీస్తోంది. ఆల్మటి, నారాయణపూర్, జూరాలను దాటి శ్రీశైలం వైపునకు ఉరకలేస్తోంది. నిన్నమొన్నటి వరకు బోసిపోయిన పుష్కరఘాట్లు జలకళను సంతరించుకున్నాయి. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : వరుణుడు కరుణ కురిపించాడు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రప్రథమంగా ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు కొత్త శోభ తీసుకొచ్చాడు.. జిల్లాలో ఈనెల 12 నుంచి ప్రారంభంకానున్న కృష్ణా పుష్కరాలకు వారంరోజుల ముందే జిల్లాకు పుష్కరశోభ సంతరించుకుంది. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఘాట్లకు చాలినన్ని నీళ్లురాకపోతే స్నానాలకు ఇబ్బంది కలుగుతుందేమోనని భావించారు. అయితే మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తుండడంతో వరదనీరు పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఉన్న ప్రధాన ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో జిల్లాలోని జూరాల ప్రాజెక్టుతో పాటు దాని అనుబంధ జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. ఇక పుష్కరస్నానాలకు ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జూరాల జలాశయంలో 8.377టీఎంసీల నీరు నిల్వ ఉంది. 14గేట్ల ద్వార 2.63 లక్షల క్కూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. దిగువకు వరద ఉధృతి జూరాలకు ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి దాదాపు లక్షన్నర క్యూసెక్కుల నీటిని గురువారం జూరాలకు విడుదల చేశారు. శుక్రవారం నారాయణపూర్ ఎగువ ప్రాంతంలో భారీ వరదలు వస్తుండడంతో జూరాలకు మరో లక్ష క్యూసెక్కుల నీటి వదిలిపెట్టారు. దీనికి అనుగుణంగానే నీటిపారుదల శాఖ అధికారులు జూరాల ప్రాజెక్టు సామర్థ్యానికి మించి నీరు నిల్వ ఉండకుండా శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. దీంతో జిల్లాలోని 52పుష్కరఘాట్లలో కొన్ని మినహా అన్నికూడా పూర్తిస్థాయి నీటిమట్టంతో భక్తులు పుష్కరస్నానాలు ఆచరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదిలాఉండగా, సీఎం కేసీఆర్ పుష్కరాలను ప్రారంభించి పుణ్యస్నానం ఆచరించే అలంపూర్ మండలం గొందిమళ్ల వీఐపీ పుష్కరఘాట్‌లో నీళ్లు ఇంకా పూర్తిస్థాయికి చేరుకోలేదు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి ఈ ప్రాంతానికి నీళ్లు మళ్లాల్సి ఉండడంతో ఈనెల 10వ తేదీ వరకు గొందిమళ్ల ఘాట్‌కు నీళ్లొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. పుష్కరఘాట్లకు జలకళ ఇప్పటికే మక్తల్, గద్వాల, వనపర్తి నియోజకరవర్గాల్లోని అన్ని ఘాట్లు, బీచుపల్లి ప్రధాన పుష్కరఘాట్‌లోకి పూర్తిస్థాయికి నీళ్లు చేరుతున్నాయి. మరో ఒకటి రెండు రోజుల్లో మరికొన్ని ఘాట్లకు కృష్ణమ్మ వరద రానుందని అధికారులు చెబుతున్నారు. ఇక జిల్లాలో మరో వీఐపీ ఘాట్ సోమశిలకు శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి నీళ్లు రావాల్సి ఉంది. సామర్థ్యానికి అనుగుణంగా జలాశయం నిండకపోవడంతో ఈ ప్రాంతానికి నీళ్లు రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కృష్ణా పుష్కరాలకు జిల్లాలో రూ.250కోట్లతో అన్ని ఏర్పాట్లుచేసిన అధికారులు పుష్కర స్నానానికి నీటికొరత తీర్చడం ఎలాగని కొంత ఆందోళనకు గురయ్యారు. కృష్ణానదికి పుష్కలంగా నీళ్లు రావడంతో సంతోషం వ్యక్తంచేస్తున్నారు. -
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
పాతాళగంగ (మన్ననూర్) : కృష్ణా పుష్కరాల్లో ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని పుష్కరాల నిర్వహణ ప్రత్యేక అధికారులు మధుసూదన్‌నాయక్, డాక్టర్ వెంకటయ్య ఆదేశించారు. శుక్రవారం పాతాళగంగ వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో సిబ్బందితో వారు మాట్లాడారు. 12రోజులపాటు నిర్వహించే పుష్కరాల్లో క్షేత్రస్థాయిలోనే ఉండాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కృష్ణవేణి, వనమయూరి, మన్ననూర్లోని వనమాలికలో వీఐపీల కోసం ప్రత్యేక వసతి ఏర్పాటు చేశామన్నారు. మీడియా పాయింట్ వద్ద రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోని, ఉపసర్పంచ్ ప్రసాద్, నాగర్‌కర్నూల్ డీఎస్పీ ప్రవీణ్‌కుమార్, అచ్చంపేట ఆర్టీసీ డీఎం నారాయణ, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ రఘునందన్, సీఐ శ్రీనివాస్, ఆర్ఐ కృష్ణాజీ తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ నిఘాలో కృష్ణా పుష్కరాలు
– 7సహాయక కేంద్రాలు – ఎస్పీ రెమా రాజేశ్వరి మహబూబ్‌నగర్ క్రైం : కృష్ణా పుష్కరాలు పోలీస్ నిఘాలో కొనసాగుతాయని, ప్రతి ఘాట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ రెమా రాజేశ్వరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్ అధికారులు తీసుకుంటున్న భద్రత చర్యలకు అందరూ సహకరించాలని కోరారు. ముఖ్యంగా పుష్కరాలకు వాహనాల్లో వచ్చే భక్తులకు షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్గేట్ దగ్గర ఉచిత పార్కింగ్‌కోసం గుర్తింపు పాస్‌లు అందజేస్తామన్నారు. ఈ పాస్ ఉన్న వాహనాలకు జిల్లాలోని వివిధ ఘాట్లలో ఉచిత పార్కింగ్‌తోపాటు పుష్కరాల సమాచారం లభిస్తుందన్నారు. అలాగే భక్తులకు అవసరమైన సమాచారం అందించేందుకుగాను తిమ్మాపూర్, రాయికల్, జడ్చర్ల, భూత్పూర్, అడ్డాకుల, కడుకుంట్ల, పెబ్బేర్‌లో పోలీస్ శాఖ తరఫున సహాయక కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. పుష్కర ఘాట్లకు దారులు చూపే యాప్‌ను ఆవిష్కరించామన్నారు. ప్రస్తుతం పోలీస్ శాఖ వినూత్నంగా చేపడుతున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. జోగుళాంబ ఘాట్ సందర్శన అలంపూర్: మండలంలోని గొందిమల్లలో నిర్మిస్తున్న జోగుళాంబ ఘాట్‌ను ఎస్పీ రెమా రాజేశ్వరి శుక్రవారం సందర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా పుష్కరాలకు రానుండటంతో భద్రత, పుష్కర ఘాట్‌లో నీటి స్థాయిని ఆమె పరిశీలించారు. సీఎం ఇక్కడే బస చేయనుండటంతో అందుకు తగ్గ ఏర్పాట్ల కోసం అలంపూర్ పట్టణంలోని టూరిజం హోటల్, సమీపంలోని పాఠశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ బాలకోటి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ పర్వతాలు పాల్గొన్నారు. -
150 పాఠశాలలకు పుష్కర సెలవులు
డీఈవో శ్రీనివాసులురెడ్డి వెల్లడి గుంటూరు ఎడ్యుకేషన్ : కృష్ణా పుష్కరాలు జరిగే రోజుల్లో జిల్లాలోని 150 ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసులురెడ్డి చెప్పారు. పుష్కర నగర్, ఘాట్లకు సమీపంలో ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపామని తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల 12న ప్రారంభం కానున్న పుష్కరాల విధుల్లో నిమగ్నమైన రెవెన్యూ, పోలీస్, ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది బస చేసేందుకు ఈ పాఠశాలలను కేటాయించనున్నట్లు చెప్పారు. పుష్కరాలు జరిగే 12 రోజులూ ఆయా పాఠశాలలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయన్నారు. సిబ్బంది అవసరాల నిమిత్తం 12వ తేదీకి ముందే వాటిని స్వాధీనం చేసుకునే అవకాశముందని చెప్పారు. పుష్కరాల సందర్భంగా పని దినాలు నష్టపోయిన పాఠశాలలను ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 12న, తిరిగి 24న సెలవులుగా పరిగణించే విషయమై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవులు ప్రకటిస్తామని చెప్పారు. పుష్కరాలు జరిగే రోజుల్లో ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని ఎంఈవోలను ఆదేశించారు. -
150 పాఠశాలలకు పుష్కర సెలవులు
డీఈవో శ్రీనివాసులురెడ్డి వెల్లడి గుంటూరు ఎడ్యుకేషన్ : కృష్ణా పుష్కరాలు జరిగే రోజుల్లో జిల్లాలోని 150 ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసులురెడ్డి చెప్పారు. పుష్కర నగర్, ఘాట్లకు సమీపంలో ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపామని తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల 12న ప్రారంభం కానున్న పుష్కరాల విధుల్లో నిమగ్నమైన రెవెన్యూ, పోలీస్, ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది బస చేసేందుకు ఈ పాఠశాలలను కేటాయించనున్నట్లు చెప్పారు. పుష్కరాలు జరిగే 12 రోజులూ ఆయా పాఠశాలలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయన్నారు. సిబ్బంది అవసరాల నిమిత్తం 12వ తేదీకి ముందే వాటిని స్వాధీనం చేసుకునే అవకాశముందని చెప్పారు. పుష్కరాల సందర్భంగా పని దినాలు నష్టపోయిన పాఠశాలలను ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 12న, తిరిగి 24న సెలవులుగా పరిగణించే విషయమై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవులు ప్రకటిస్తామని చెప్పారు. పుష్కరాలు జరిగే రోజుల్లో ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని ఎంఈవోలను ఆదేశించారు. -
పుష్కర రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమేరాలతో నిఘా
ఎస్పీ విజయకుమార్ వెల్లడి అవనిగడ్డ: పుష్కరాలను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెంచనున్నట్లు ఎస్పీ జీ విజయకుమార్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయ ఆవరణలో నిర్మించిన పోలీస్ కంట్రోల్ రూమ్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఒంగోలు–విశాఖపట్నం మధ్య వెళ్లే వాహనాలు దివిసీమ మీదుగా దారి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. భారీ వాహనాలను ఒంగోలు, అద్దంకి, మిర్యాలగూడ, నార్కెట్‌పల్లి, సూర్యాపేట, సత్తుపల్లి, ఖమ్మం, రాజమండ్రి మీదుగా విశాఖ, ఇతర వాహనాలను ఒంగోలు, చీరాల, బాపట్ల, రేపల్లె, పులిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి మీదుగా పామర్రు వైపు ఒక మార్గం, మచిలీపట్నం నుంచి పెడన వైపు మరో మార్గాన మళ్లించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి గ్రామాల సూచీ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి నాలుగు కిలోమీటర్లకు ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు ఉంటాయని తెలిపారు. కోడూరు మండలం సాగర ‡సంగమం పాయింట్ వద్ద నది కోత ఎక్కువగా ఉన్నందున స్నానాలకు అనుమతి లేదన్నారు. ఇక్కడ జల్లు స్నానాలకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భారీ కేడ్లు, ఐరన్ మెస్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సాగర సంగమం, హంసలదీవి, మోపిదేవి ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఉంటాయన్నారు. ఆయన వెంట డీఎస్పీ ఖాదర్‌బాషా ఉన్నారు. -
భక్తుల సురక్షితమే లక్ష్యం
-కష్ణా పుష్కరాల కోసం 434ప్రత్యేక బస్సులు - ప్రతి ఘాట్ వద్ద ‘మై హెల్ప్ యూ డెస్క్’ ఏర్పాటు - ప్రతి రైల్వేస్టేçÙన్ నుంచి ప్రత్యేక బస్సులు - ఆర్టీసీ ఆర్ఎం వినోద్‌కుమార్ మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో ఈనెల 12నుంచి 23వ తేదీ వరకు జరిగే కష్ణ పుష్కరాలకు జిల్లా ఆర్టీసీ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్ఎం వినోద్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుష్కరాలకు సంబంధించిన బస్సుల వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లాలో జరిగే కష్ణ పుష్కరాలకు దాదాపు 2కోట్ల మంది భక్తులు రావచ్చని అంచనా వేశామని, ఇందులో 60శాతం భక్తులు బస్సులను ఆశ్రయించే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న ప్రధాన బస్టాండ్ల నుంచి ప్రతి 40నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. పుష్కరస్నానం కోసం వివిధ ప్రాంతాల నుంచి రైలుమార్గంలో వచ్చేభక్తుల కోసం జిల్లాలో ఉన్న పలు రైల్వేస్టేçÙన్ల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని స్పష్టం చేశారు. దీంట్లో ప్రధానంగా మహబూబ్‌నగర్, గద్వాల, అలంపూర్, శ్రీరాంనగర్, మదనాపురం తదితర ప్రాంతాల నుంచి నడుపుతున్నట్లు వెల్లడించారు. పార్కింగ్ స్థలాల నుంచి బస్సులు పుష్కరాల కోసం ప్రత్యేకంగా జిల్లా రీజియన్ నుంచి 294బస్సులు, ఇతర రీజియన్ల నుంచి 140బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని దష్టిలో పెట్టుకుని పుష్కరాల సమయంలో మరిన్ని అదనపు బస్సులు నడపడానికి ఆర్టీసీ సిద్ధంగా ఉందని చెప్పారు. రంగాపూ ర్, అచ్చంపేట, కష్ణఘాట్ల వద్ద ఆర్టీసీ బస్సుల పార్కింగ్ స్థలానికి, స్నానఘట్టాలకు మధ్య దూరం ఎక్కువ ఉన్న నేపథ్యంలో పార్కింగ్ స్థలం నుంచి ఘాట్ వరకు షెటిల్ సర్వీస్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఘాట్‌లో ప్రత్యేక బస్సుల వివరాలతో పాటు ఆర్టీసీ నుంచి ‘మై హెల్ప్ యు డెస్క్’ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొత్తకోట, బీచుపల్లి, రంగాపూర్, ఆత్మకూర్‌లో రిలీఫ్ వ్యాన్స్ ఏర్పాటు చేశామని, అలాగే పెబ్బేర్‌లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రధానంగా జడ్చర్ల, పెబ్బే రు జాతీయ రహదారిపై రెండు మొబైల్ వాహనాలను ఏర్పాటు చేస్తామని, వీటి ద్వారా భక్తులకు బస్సుల సమాచారం ఎప్పటికప్పుడు చేరవేస్తామని చెప్పారు. పుష్కరాల కోసం ఆర్టీసీ నుంచి మంచి సర్వీస్ అందించడం కోసం ఇద్దరు ఆర్ఎంలు, ఆరుగురు డివిజన్‌స్థాయి అధికారులు, 12మంది డిపో మేనేజర్స్థాయి అధికారులతో పాటు 102మంది అదనపు సిబ్బందిని నియమించి నట్లు చెప్పారు. అలాగే ఆర్టీసీ హోంగార్డులు, ఆర్టీసీ కానిస్టేబుళ్లు ఇందులో పాల్గొంటారని తెలిపారు. ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ నుంచి రంగాపూర్ ఘాట్‌కు 50ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సీటీఎం రాజేంద్ర ప్రసాద్, సీఎంఈ మహేశ్‌కుమార్, డిపో మేనేజర్ భాస్కర్, సత్తయ్య, రామయ్య, రాజగోపాల్రావు, రాజీవ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు కోట్ల మందికి ఏర్పాట్లు
కలెక్టర్ కాంతీలాల్ దండే సాక్షి, అమరావతి : కృష్ణా పుష్కరాలను చరిత్రలో నిలిచిపోయేలా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. పుష్కరాలకు సంబంధించి గుంటూరు జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు, వ్యాపార సంఘాలు, అధికారులతో గురువారం రాత్రి జెడ్పీ సమావేశ మందిరంలో ఓపెన్ ఫోరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నాలుగు కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు చేసేందుకు వీలుగా రూ.1600 కోట్లతో అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా.. జిల్లాలో ఘాట్ల నిర్మాణాలు, పుష్కర నగర్లు, పుష్కర భక్తులకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 3.856 కిలోమీటర్ల మేర 80 ఘాట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 25 ప్రధాన ఘాట్లలో 29 పిండి ప్రదాన షెడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 14 పుష్కరనగర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పుష్కర నగర్లో రోజుకు 15 వేల మందికి భోజన ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వైద్య సేవలు పుష్కరాలకు జిల్లాలో ఆరు చోట్ల పది పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సత్తెనపల్లి, మాచర్ల, గురజాల, అమరావతి, రేపల్లె, గుంటూరులలో వీటిని తాత్కాలికంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ 905 బస్సులు, 112 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పుష్కరాలు జరిగే 12 రోజులపాటు గుంటూరు కార్పొరేషన్‌తో పాటు, పుష్కరాలు జరిగే మున్సిపాలిటీల్లో సైతం ప్రైవేటు పోస్టర్లు అనుమతించవద్దని కమిషనర్లను ఆదేశించారు. పుష్కరాల నిర్వహణపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అతుకూరు ఆంజనేయులు, ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ ముంగా వెంకటేశ్వరరావు, కమిషనర్ నాగలక్ష్మి, అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, రూరల్ ఎస్పీ నారాయణనాయక్, డీఆర్వో నాగబాబు, జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. -
పుష్కరాలకు భారీ బందోబస్తు
మట్టపల్లి (మఠంపల్లి): మండలంలోని మట్టపల్లి వద్ద జరిగే పుష్కరాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు సూర్యాపేట డీఎస్పీ సునీతా మోహన్ తెలిపారు. గురువారం ఆమె మట్టపల్లిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి నూతనంగా నిర్మించిన మట్టి రోడ్డును, చెన్నైకి చెందిన ముక్కూరు స్వామి ఆశ్రమాన్ని, గోశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుష్కరాల పనులు పూర్తి అవుతున్నందున పోలీస్, అగ్ని మాపక కేంద్రాల ఏర్పాటుకు పరిశీలన చేస్తున్నామన్నారు. దేవస్థానం సమీపంలోకి కేవలం వీఐపీ, వీవీఐపీల వాహనాలు మాత్రమే అనుమతిస్తామన్నారు. మిగిలిన వాహనాలన్నీ ఎన్సీఎల్ సమీపంలో ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలోనే నిలిపివేస్తామన్నారు. ఆమె వెంట సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఉన్నారు. -
పుష్కరం.. పాపాహరణం
–పుష్కర స్నానంతో సకల పాపాలు మటుమాయం –మహాపుణ్య ఫలం.. –ఇప్పటి వరకు మూడు పుష్కరాలు చూశా –2004లో పుష్కరాలకు భక్తులు పోటెత్తారు –‘సాక్షి’తో శివాలయం ప్రధాన అర్చకుడు జూనోతుల సుధాకరశాస్త్రి కోట్లాది ప్రజలు భక్తితో వేచి చూస్తున్న కృష్ణా పుష్కరాలకు సమయం ఆసన్నమైనది. మహిమాన్వితమైన కృష్ణా నదిలో పుష్కర స్నానం ఆచరిస్తే మహా పుణ్యఫలం దక్కుతుంది. దీర్ఘకాలిక రోగాలు మటుమాయమవుతాయి. కోటి జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. నదీతీరంలో తపుస్సు, కురుక్షేత్రంలో దానం, కాశి క్షేత్రంలో మరణం పొందినంత ఫలితం ఉంటుంది’ అంటున్నారు నాగార్జునసాగర్ కృష్ణా నదితీరంలోని శివాలయం ప్రధాన అర్చకుడు జూనొతుల సుధాకరశాస్త్రి. మరో పది రోజుల్లో కృష్ణా పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన పుష్కర అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే.. –నాగార్జునసాగర్ పుష్కరమంత్రం : ‘పిప్పలాదా త్సముత్పనే– కృత్త్యేలోకే భయంకరే మృత్తికాంతే మయాదత్త మహారార్ద ప్రకల్పయ అస్యాం మహానద్యాం సమస్త పాపాక్షయార్దం కన్యాగతే దేవగురౌ సార్ధ త్రికోటి తీర్థ సహిత,తీర్థ రాజ సమాగ మాఖ్య మహాపర్వణి పుణ్యకాలే కృష్ణానదీ స్నానమహం కరిష్యే! అని మూడుసార్లు తూర్పుగా తిరిగి మూడుమునకలు వేయాలి (అంటే నదీ స్నానమును ఎల్లప్పుడూ గోచి పెట్టుకోని చేయాలి. మలమూత్ర విసర్జనములు నీటిలో చేయరాదు. ఉమ్మి వేయకూడదు) 1980లో వేళ్లమీద లెక్కపెట్టే భక్తులు సాగర్‌లోని కృష్ణా నది తీరంలో శివాలయ నిర్మాణం జరిగినప్పటి నుంచి ప్రధాన అర్చకులుగా పని చేస్తున్నాను. ఇప్పటి వరకు మూడు పుష్కరాలు చూశాను. 1980 పుష్కరాల సమయంలో వేళ్లమీద లెక్కపెట్టే స్థాయిలో భక్తులు వచ్చారు. 1992లో సౌకర్యాలు సరిగా లేకున్నా భక్తులు భారీగానే వచ్చారు. కృష్ణలో స్నానాలు చేసి స్వర్గస్తులైన వంశ కుటుంబ సభ్యులకు పిండప్రధానాలు చేసి ముక్తి పొందారు. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సాగర్‌లో నాలుగు పుష్కరఘాట్లు నిర్మాణం చేయించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించారు. దీంతో పుష్కరస్నానంపై ప్రజలకు అవగాహన వచ్చింది. సాగర్‌కు లక్షల సంఖ్యలో భకుల్తు పోటెత్తారు. మెుదట ఘాట్లలో నీరు లేనప్పటికీ పుష్కరాలు పూర్తయ్యేలోపు నదిలోకి నీటి విడుదల జరిగింది. దేవతలతో పాటు భక్తుల పుణ్యస్నానం ఆగస్టు 12వ తేదీ సూర్యోదయం మొదలుతో పుష్కరం ప్రారంభం అవుతుంది. అదే నెల 23న సూర్యాస్తమయం వరకు భక్తులు పుష్కర స్నానం ఆచరించవచ్చు. గురువు(బృహస్పతి) కన్యారాశిలో ప్రవేశించినప్పుడు పుష్కర సమయం ప్రారంభమవుతుంది. పుష్కర సమయం ప్రారంభంలో ముక్కోటి దేవతలు నదిలో స్నానాలు ఆచరిస్తారు. పుష్కరాలు జరిగే 12 రోజులు ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజుల్లో ముక్కోటి దేవతామూర్తులు స్నానమాచరించే సమయంలో భక్తులు సైతం పుష్కర స్నానాలు చేయడం ద్వారా ఎంతో పుణ్యం లభిస్తుంది. చేయాల్సిన దానాలు నదిలో స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు పుష్కరాలు జరిగే 12రోజుల పాటు దానధర్మాలు చేస్తే పుణ్యఫలం దక్కుతుంది. 1వ రోజు : బంగారం, వెండి, ధాన్యం, భూమి అన్నదానం చేయాలి 2వ రోజు : ఆవు, రత్నాలు, ఉప్పు 3వరోజు : పండ్లు, కూరలు, బెల్లం, వెండితో చేసిన గుర్రం బొమ్మ 4వ రోజు : నెయ్యి, నూనె, తేనే, పాలు, చెక్కెర 5వ రోజు : ధాన్యం, పండ్లు, గేదెలు, నాగలి 6వ రోజు : మంచి గంధపు చెక్క, కర్పూరం, కస్తూరి, ఔషధాలు 7వ రోజు : ఇల్లు, వాహనం, కూర్చునే ఆసనం 8వ రోజు : పూలు, అల్లం, గంధపు చెక్క 9వ రోజు : కన్నాదానం, పిండప్రదానం 10వ రోజు : హరిహరపూజ, లక్ష్మీపూజ, గౌరిపూజ, నదిపూజ 11వ రోజు : వాహనం, పుస్తకాలు, తాంబూలం 12వ రోజు : నువ్వులు, మేకలను పేదవారికి దానం చేస్తే పుణ్యం కలుగుతుంది. -
పార్కింగ్ స్థల పరిశీలన
చింతపల్లి : కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తుల వాహనాలను నిలిపేందుకు మండల పరిధిలోని వింజమూరు సమీపంలో ఏర్పాటు చేస్తున్న పార్కింగ్ స్థలాన్ని మంగళవారం ఆర్డీఓ గంగాధర్, డీఎస్పీ చంద్రమోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాగార్జునసాగర్, అజ్మాపురం, పెద్దమునిగల్, కాచరాజుపల్లి పుష్కర ఘాట్ల వద్ద భక్తుల రద్దీ ఎక్కువైతే హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను వింజమూరు వద్ద నిలిపివేసేందుకు సుమారు 70 ఎకరాల స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్కింగ్ వద్ద భక్తుల కోసం మూత్రశాలలు, మరుగుదొడ్లు, రోడ్డు, విద్యుత్,తాగునీటి వసతి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. పుష్కరాలను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్ ఏఈ జీవన్‌సింగ్, డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్ఐ మల్లారెడ్డి, వీఆర్వోలు మల్లయ్య, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
పుష్కర స్నానాలు
-
భక్తిభావంతో..సాగంగా..
-
అంత్యపుష్కరాలు ఆరంభం
భరత భూమి వేద భూమి, కర్మ భూమి. ఇక్కడ జనం సృష్టికర్తపై విశ్వాసముంచుతారు. పాపపుణాలను పరిగణలోకి తీసుకుంటారు. ప్రతీ పన్నెండేళ్లకొకసారి వచ్చే పుష్కరాలలో స్నానమాచరించి పునీతులవుతారు. పుష్కరాలు పూర్తి అయిన ఏడాదికి అంత్య పుష్కరాలు వస్తాయి. పుష్కరాలలో భక్తులు పవిత్ర గోదావరిలో మునిగి, పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. వారి ఆత్మల శాంతి కోసం ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. వేద పండితులు గోదారమ్మకు మంగళహారతులు ఇస్తారు. రైతు పొలంలో జీవమై నిలచే జలం... సామాన్యుడి దాహం తీర్చే ‘అమృతం’ వరం జలం... పురాణాల్లో, ఇతిహాసాల్లో నదులను దేవతలుగా కీర్తించారు. దేశవ్యాప్తంగా గోదావరి, కృష్ణా నదులకు పుష్కరాలు నిర్వహిస్తారు. ఈ పుష్కరాల్లో కోట్లాది భక్త జనం భక్తిప్రపత్తులతో పాల్గొంటారు. చెన్నూర్‌లో గోదావరి అంత్య పుష్కరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కాశీ అంతటి ప్రాశస్త్యం గల పంచకోశ ఉత్తర వాహిని గోదావరి నదిలో భక్తులు భక్తి భావంతో స్నానమాచరించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వచ్చారు. నియోజకవర్గంలోని మండలాలైన కోటపల్లి, జైపూర్, మందమర్రి పట్టణాల నుంచి భక్తులు వచ్చారు. ఉదయం 5 గంటల నుంచే నదీతీరానికి చేరుకొని పూజలు చేశారు. పుష్కరఘాట్ వద్ద అధికారులు ఏర్పాట్లను చేశారు. తొలి రోజు వేలాది భక్తులు పుణ్య స్నానాలు చేశారు. పూజారులు భక్తులచే వారి పూర్వీకులకు పిండప్రదానం చేయించారు. మొదటి రోజు పలువురు ప్రజాప్రతినిధులు సైతం పుష్కర స్నానం ఆచరించారు. – చెన్నూర్ -
అంత్యా సిద్ధం
నేటి నుంచి 12 రోజుల పాటు అంత్య పుష్కరాలు శోభాయమానంగా భద్రాద్రి ఘాట్ భద్రాచలం : గోదావరి అంత్య పుష్కరాలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం నుంచి పన్నెండు రోజుల పాటు పుష్కరాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రాచలం, పర్ణశాల ఘాట్లలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీర్చిదిద్దారు. ఆదివారం ఉదయం 6గం.లనుంచి 7.30గం.ల వరకూ గోదావరి తీరాన శాస్త్రోక్తంగా అంత్య పుష్కరాల ప్రారంభ వేడుక నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు అన్నీ సిద్ధం చేశారు. ఉదయం స్వామి వారి ప్రచార మూర్తులను, చక్ర పెరుమాళ్లు, శ్రీపాదుకలతో గోదావరి తీరానికి ఊరేగింపుగా వెళ్లి, స్వామి వారికి పూజలు నిర్వహించిన తర్వాత సామూహిక పుష్కర స్నానం చేస్తారు. ఆదివారం నుంచి ఆగస్టు 11 వరకు రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రతీ రోజూ స్వామి వారికి సహస్ర నామార్చన, క్షేత్రమహాత్యం, ప్రవచనం, నిత్య కల్యాణోత్సవం, ప్రభుత్వ సేవ నిర్వహించనున్నారు. పూజాది కార్యక్రమాల్లో భక్తులు కూడా పాల్గొని స్వామి వారికి సేవలు చేసుకోవచ్చని దేవస్థానం అధికారులు తెలిపారు. భద్రాద్రి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని ఈఓ రమేష్‌బాబు తెలిపారు. పుష్కర స్నానం ఆనంతరం భక్తులు శ్రీసీతారామచంద్రస్వామి వారిని దర్శించుకునేందుకు వీలుగా ఆలయంలో తగిన ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దర్శనం సకాలంలో అయ్యేలా చూడటంతో పాటు, భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా క్యూలైన్ ఏర్పాటు చేశారు. గోదావరి తీరంలో పుష్కర స్నానాలు ఆచరించే సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకున్నారు. గోదావరి నదీ వైపు ఇనుప కంచెను ఏర్పాటు చేయడంతో పాటు, అత్యవసర సమయంలో భక్తులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు గజ ఈతగాళ్లను కూడా సిద్ధంగా ఉంచారు. శోభాయమానంగా పుష్కర ఘాట్ అంత్య పుష్కరాలతో గోదావరి స్నానఘట్టాల రేవు శోభాయమానంగా కనిపిస్తోంది. గోదావరి తీరంలో ఉన్న ఆలయాలకు రంగులు వేసి, విద్యుత్ దీపాలు అమర్చారు. అదే విధంగా గోదావరి తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. గత ఏడాది ఆది పుష్కరాల సమయంలో గోదావరి నదిలో ఆశించిన స్థాయిలో నీరు లేదు. కానీ ప్రస్తుతం భద్రాచలం వద్ద శనివారం సాయంత్రం 22.5 అడుగుల నీటి మట్టంతో గోదావరి నిండుగా ప్రవహిస్తుంది. దీంతో భక్తులు ఎటువంటి ఇబ్బందులు పుణ్యస్నానాలు చేయవచ్చు. ఇటీవల వరదలకు ఘాట్లపై పేరుకుపోయిన బురదను పంచాయతీ అధికారులు ఫైర్ ఇంజిన్ సహకారంతో యుద్ధ ప్రాతిపదికన తొలగించి శుభ్రం చేశారు. ఈ పన్నెండు రోజుల పాటు భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా ప్రతీ రోజు సాయంత్రం 6 నుంచి 6.15 గంటల వరకూ గోదావరికి నదీ హారతులు ఇస్తారు. దీని కోసం నది ఒడ్డున ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పుష్కరాలకు తరలిస్తున్న భక్తులు అంత్య పుష్కరాల సమయంలో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భద్రాచలం తర లివస్తున్నారు. పుష్కరాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు, హైకోర్టు జడ్జిలు, ఇతర ఉన్నతాధికారులు హాజరవుతారని దేవస్థానం అధికారులకు సమాచారం అందింది. దీంతో భక్తులతో పాటు, వీఐపీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని భద్రాచలం పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తామని సీఐ శ్రీనివాసులు తెలిపారు. భద్రాచలం పుష్కర ఘాట్