వరంగల్ జిల్లాలోని మంగంపేట రామన్నగూడెం పుష్కరఘాట్‌లో చివరిరోజు 5లక్షల మంది భక్తులు పుష్కరస్నానం చేశారు.
మంగంపేట (వరంగల్ జిల్లా) : వరంగల్ జిల్లాలోని మంగంపేట రామన్నగూడెం పుష్కరఘాట్‌లో చివరిరోజు 5లక్షల మంది భక్తులు పుష్కరస్నానం చేశారు. మంగంపేట, రామన్నగూడెం, మళ్లకట్ట పుష్కరఘాట్లలో భక్తులు శనివారం తెల్లవారుజాము నుంచే పుష్కరస్నానం ఆచరించారు.
కాగా జిల్లాలోని మూడు పుష్కరఘాట్లలో 12 రోజుల్లో 25లక్షల మంది పుష్కరాల్లో పాల్గొన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎంపీ కవిత పుష్కరఘాట్లను సందర్శించారు.