ఖమ్మం(భద్రాచలం): భద్రాచలంలో పుష్కర స్నానాలకు భక్తులు పొటెత్తారు. సోమవారం తెల్లవారు జామునుంచి ఘాట్‌ల వద్ద భక్తులు బారులు తీరారు. భద్రాచలం, మోతే, పర్ణశాల వద్ద భక్తులు కిటకిట లాడుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో అధికారులు ట్రాఫిక్‌ను ఎక్కడికక్కడ మళ్లిస్తున్నారు. కాగా, నేడు గవర్నర్ నరసింహన్ భద్రాచలంలో పుణ్య స్నానాలు ఆచరించినున్నారు.