
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో కొనసాగుతున్న మహాకుంభమేళా చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి 26న కుంభమేళాలో చివరి పుణ్యస్నానాలు జరగనున్నాయి. ఆరోజు మహాశివరాత్రి కావడంతో భక్తులు తండోపతండాలుగా తరలివస్తారనే అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో అధికారులు భక్తుల రద్దీని నియంత్రించేందుకు, వారికి గట్టి భద్రత కల్పించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
మహాకుంభమేళాలో ఇప్పటివరకూ 63 కోట్ల మందికిపైగా జనం పుణ్యస్నానాలు ఆచరించారని గణాంకాలు చెబుతున్నాయి. మహాకుంభమేళాకు వస్తున్న భక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. శివరాత్రి(Shivaratri) రోజున త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించాలని చాలామంది భక్తులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపధ్యంలో జిల్లా యంత్రాంగం పలు ఏర్పాట్లు చేస్తోంది.
మహాశివరాత్రి పుణ్య స్నానాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు డీఎం రవీంద్ర కుమార్ మందర్ తెలిపారు. ఈ రోజు(మంగళవారం) మహా కుంభమేళాలో 44వ రోజు. ఇప్పటివరకు 63 కోట్లకు పైగా భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలు చేశారు. చివరి మహా కుంభ స్నానం ఫిబ్రవరి 26న జరగనుంది. సగటున ప్రతిరోజూ కోట్లాది మంది పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో భారీగా ట్రాఫిక్ జామ్(Traffic jam) నెలకొంది. దానిని క్లియర్ చేసేందుకు సంబంధిత అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ప్రత్యేక రోజుల్లో..
పుష్య పూర్ణిమ రూ. 1.70 కోట్ల మంది పవిత్ర స్నానం చేశారు. మకర సంక్రాంతి నాడు 3.50 కోట్ల మంది, మౌని అమావాస్య నాడు 7.64 కోట్ల మంది, వసంత పంచమి నాడు 2.57 కోట్ల మంది, మాఘ పౌర్ణమి వేళ రెండు కోట్లమంది పుణ్యస్నానాలు ఆచరించారు.
ఇది కూడా చదవండి: Mahashivratri: నేపాల్‌కు 10 లక్షలమంది భారతీయులు