
న్యూఢిల్లీ: ‘ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా(Maha Kumbh Mela) నుంచి ఐక్యత అనే అమృతం ఉద్భవించింది. దేశంలోని ప్రతి ప్రాంతం నుంచి జనం ఈ కార్యక్రమానికి ఐక్యంగా తరలివచ్చారు’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(మంగళవారం) లోక్‌సభలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహా కుంభ్‌ను ప్రజలను ఐక్యపరిచిన కార్యక్రమంగా అభివర్ణించారు. మహా కుంభ్ జరిగిన తీరుపై ప్రధాని మోదీ లోక్ సభలో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
మహా కుంభ్‌లో జాతీయ చైతన్యానికి గల భారీ రూపాన్ని మనం చూశామని అన్నారు. ప్రధాని తన ప్రసంగంలో ప్రతిపక్షాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. మహా కుంభమేళాను విజయవంతంగా నిర్వహించడం ద్వారా మన సామర్థ్యాలపై కొంతమందికి ఉన్న సందేహాలకు తగిన సమాధానం లభించిందని మోదీ పేర్కొన్నారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్(SP chief Akhilesh Yadav) గతంలో మహా కుంభమేళాపై గతంలో పలు ప్రశ్నలు లేవనెత్తారు.
ప్రధానమంత్రి మోదీ మహా కుంభ్‌ను భారతదేశ చరిత్ర(History of India)లోని మైలురాయితో పోల్చారు. ఇటువంటివి రాబోయే తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. మహా కుంభ్ పై ప్రశ్నలు లేవనెత్తే వారికి విజయవంతమైన ఈ మహా కుంభ్ తగిన సమాధానం అని ప్రధాని మోదీ అన్నారు. మహా కుంభమేళాలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ పాల్గొన్నారని అన్నారు. ఈ మహాకుంభమేళాలో ఐక్యత అనేది ఒక ముఖ్యమైన ఘట్టమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కుంభమేళా కారణంగా యువత సంప్రదాయం, సంస్కృతిని అలవర్చుకుంటున్నారని అన్నారు.
గత ఏడాది అయోధ్యలో జరిగిన రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో రాబోయే వెయ్యి సంవత్సరాలకు దేశం ఎలా సిద్ధమవుతుందో మనమందరం గ్రహించాం. ఇప్పుడు ఒక సంవత్సరం తరువాత నిర్వహించిన ఈ మహా కుంభమేళా మనందరి ఆలోచనలను మరింత బలోపేతం చేసింది. దేశంలోని ఈ సామూహిక చైతన్యం దేశానికున్న బలాన్ని ప్రతిబింబిస్తుంది. భక్తి ఉద్యమ సమయంలో దేశంలోని ప్రతి మూలలోనూ ఆధ్యాత్మిక స్పృహ ఉద్భవించిందని అన్నారు. శతాబ్దం క్రితం చికాగోలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం భారతదేశ ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రపంచానికి చాటిందని, ఇది భారతీయుల ఆత్మగౌరవాన్ని మేల్కొల్పిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: అంతరిక్షంలో 9 నెలలున్నాక.. ఎదురయ్యే సమస్యలివే..
Comments
Please login to add a commentAdd a comment