shivarathri festival
-
అమరావతిలో గంట గంటకూ పెరుగుతున్న భక్తుల రద్దీ
-
హన్మకొండలో మహా రుద్రాభిషేకం
-
సింహాచలంలో శివరాత్రి ప్రత్యేక పూజలు
-
ఎమ్మెల్యే కేపీ నాగార్జున శివరాత్రి ప్రత్యేక పూజలు
-
శివరాత్రి ఓ పండుగ మాత్రమే కాదు
-
కన్నప్ప ధ్వజారోహణం.. ప్రారంభమైన శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాలు (ఫోటోలు)
-
మహా శివరాత్రికి వస్తున్న 'వినరో భాగ్యము విష్ణుకథ'
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీర జంటగా నటించిన చిత్రం "వినరో భాగ్యము విష్ణు కథ". ఈ చిత్రం ద్వారా మురళీ కిషోర్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది.నెంబర్ నైబరింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సినిమాలో మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కాగా.. మొదట ఈ చిత్రాన్ని ఈనెల 17న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. శనివారం ~ మహాశివరాత్రి ~ "వినరో భాగ్యము విష్ణు కథ" విడుదల✨ Worldwide release on 𝐅𝐄𝐁 𝟏𝟖 ~ #VinaroBhagyamuVishnuKatha #VBVK #VBVKon18th pic.twitter.com/5ZkdAfloIY — Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 11, 2023 -
శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం
-
పురాణపండ శ్రీనివాస్‌కు ఆర్కే రోజా ప్రశంసలు
శ్రీకాళహస్తి: శ్రీశైలం దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘శివోహమ్’ గ్రంథాన్ని మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరునికి బహూకరించారు. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చేతుల మీదుగా ‘శివోహామ్’ గ్రంథం స్వామివారికి సమర్పించడం పట్ల శ్రీకాళహస్తి పండిత అధికార బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఆలయ పండితులు ఈ గ్రంథాన్ని రచించిన పురాణపుండ శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు. తొలి ప్రతిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఆర్కె రోజా అందజేశారు. అనంతరం రోజా మాట్లాడుతూ.. శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధానంలో దివ్య మంగళకరమైన గ్రంథాన్ని ఆవిష్కరించి, భక్తులకు అందజేయడం తన పురాకృత జన్మసుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఈ గ్రంథాన్ని రచించిన పురాణపండ శ్రీనివాస్‌కు ఆర్కే రోజా ప్రశంసలు తెలిపారు. శివరాత్రి శుభవేళని పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో ‘శివోహమ్’ గ్రంధాలను అర్చక, వేదపండిత, భక్తులకు ఉచితంగా వితరణ చేశారు. రాజకీయాలలోనే కాకుండా భక్తి కార్యక్రమాల్లో కూడా ఎంతో శ్రద్ధగా ఎమ్మెల్యే రోజా పాల్గొనడం తమకు ఆనందం కలిగించిందని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి ఆమెను అభినందించారు. ‘శివోహమ్’ గ్రంథాలు రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ, విశాఖపట్నం, నగరి, రాజమహేంద్రవరం, కాకినాడ ప్రాంతాలలో కూడా వేలకొలది భక్తులకు గ్రంథ రచయిత పురాణపుండ శ్రీనివాస్ పంపిణీ చేశారు. -
శంభో శివ శంభో
-
మహాశివరాత్రికి ముస్తాబవుతున్న ఆలయాలు
శివరాత్రికి విద్యుదీపాలంకరణలో ముస్తాబు కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరాలయంలో ఈ నెల 20 నుంచి 22 వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కాళేశ్వరాలయం విద్యుత్‌దీపాలతో జిగేల్‌మంటోంది. మంగళవారం రాత్రి ఆలయంలోని ప్రధాన గర్భగుడిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంగు రంగుల విద్యుత్ దీపాలతో కాళేశ్వరాలయం ముస్తాబు కావడంతో శివరాత్రి శోభను సంతరించుకుంది. శివకేశవుల నిలయం పాలకుర్తి పుణ్యక్షేత్రం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో(క్షీరగిరి)పై వెలసిన శ్రీ సోమేశ్వర లక్ష్మీ నర్సింహస్వామి లింగము స్వయంభువు. ఆలయ గుహల నుంచి∙ఓంకార ప్రణవనాదం వినిపిస్తుందని భక్తుల విశ్వాసం. అదృశ్య రూపంలో ఉన్న సిద్ద పురుషులు అర్ధ రాత్రి వేళల్లో స్వామి వారిని అర్చించడానికి వస్తారని ప్రతీతి. ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారికి లక్ష రెట్లు అధిక ఫలితంతో పాటు మోక్షం లభిస్తుందని నమ్మిక. పక్కనే మరొక గుహలో శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి వెలసి శివ కేశవులకు భేదం లేదని ప్రభోదిస్తున్నాడు. ఈ శివ పంచాయతన క్షేత్రంలో శివుడు శ్రీ సోమేశ్వరుడిగా, విష్ణువు లక్ష్మీనర్సింహుడిగా వేర్వేరు గుహల్లో స్వయంభువులుగా వెలసి ఉన్నారు. పూర్వ కాలంలో సూర్యభగవానుని ఆల యం ఉండగా.. ఇప్పుడు కూడా ఆనవాళ్లు కనిపిస్తాయి. స్వామిపై విశ్వాసం సడలినా, కొండకు పరిశుద్దులై రాకపోయినా స్వామి రక్షక భటులైన తేనేటీగలు వెంటపడి కొండను దిగేలా చేస్తాయి. ఇక్కడ శైవాగం, వైదికాగం ప్రకారంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. గిరిజనులు సంప్రదాయ బద్ధంగా నృత్యాలు చేస్తూ కోలాటాలతో ఎడ్ల బండ్లతో ప్రదర్శనగా రావడం జాతర ప్రత్యేకత. గ్రామంలో పంచగుళ్ల వద్ద ఉన్న కోనేరులో స్నానం చేసిన భక్తులు పంచగుళ్లు దర్శించుకుని సోమేశ్వర ఆలయానికి రావడానికి ఏర్పాట్లుచేశారు. పాలకుర్తి టౌన్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన పాలకుర్తిలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హరిహరులు స్వయంభువులుగా ఒకే గుట్టపై వెలసిన దివ్య క్షేత్రంగా పాలకుర్తి వెలుగొందుతుంది. ఏటా మహా శివరాత్రి సందర్బంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈనెల 20 నుంచి 24 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు ఇతర జిల్లాల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుండి భక్తులు తరలి రానున్నారు. 21న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి వారి కల్యాణం నిర్వహించనుండగా.. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల కొంగుబంగారం కురవి వీరన్న కురవి: భక్తుల కల్పతరువుగా, నమ్మిన వారి కొంగు బంగారంగా కురవిలోని వీరభద్రస్వామి విలసిల్లుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన శైవ పుణ్యక్షేత్రమైన భద్రకాళి సమేత శ్రీవీరభద్రస్వామి ఆలయంలో కల్యాణ బ్రహోత్సవాలు ఈనెల 20న గురువారం అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. ఈనెల 21వ తేదీన(శుక్రవారం) మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని కల్యాణమహోత్సవం కన్నుల పండువగా జరగనుంది. ఈనెల 20వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు శ్రీ స్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయచరిత్ర... క్రీ.శ. 850 ప్రాంతంలో వేంగి రాజధానిగా పాలించు చాళుక్యుల సామంతులైన రాష్ట్రకూట రాజు భీమరాజు కురవిని రాజధానిగా చేసుకుని పాలించేవాడు. అప్పుడే వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అనంతరం కాకతీయ తొలి స్వతంత్ర రాజు ఒకటో బేతరాజు ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. రెండో బేతరాజు కురవి పక్కనే పెద్ద తటాకం(చెరువు)ను తవ్వించినట్లు చెబుతారు. కాకతీయ రాణి రుద్రమదేవి ఆలయాన్ని సందర్శించి ఏకశిల రాతి స్తంభ దీపాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇప్పటికి ఆ స్తంభం దర్శనమిస్తుంది. రాజగోపురం దాటి లోనికి వెళ్లగానే ఏకశిలపై నందీశ్వరుడు దర్శనమిస్తాడు. స్వామివారి ప్రాశస్త్యం సకల క్తిమూర్తివరాల ప్రదాత అయిన వీరభద్రస్వామి పడమటముఖుడై దశహస్తుడై, త్రినేత్రుడై రౌద్రపరాక్రమములతో విలసిల్లుతున్నాడు. భక్తులను ఆదుకునే పరమభోళామూర్తిగా దర్శనమిస్తున్నాడు. క్షుద్రగణాలకు వీరభద్రుడంటే భయం. అందుకే ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకునే భక్తులకు ఆయురారోగ్యాలు, సిరిసంపదలను అందుతాయని భక్తుల నమ్మిక. స్వామివారికి ఎడమవైపు చతుర్భుజములు కలిగి ఉండి శ్రీ భద్రకాళీ అమ్మవారు వెలసి ఉన్నారు. స్వామి వారికి ఇరువైపులా శివుడు(లింగాకారంలో) దర్శనమిస్తాడు. ఆలయానికి దక్షిణ దిశలో భద్రకాళి అమ్మవారు స్వయంశక్తిమూర్తిగా వెలిసి పూజలందుకుంటోంది. ఉత్సవాల్లో ముఖ్యఘట్టాలు.. జాతర ఉత్సవాల్లో భాగంగా ఈనెల 20న ఉదయం 9గంటలకు పసుపు, కుంకుమలు అర్చకులు ఆలయానికి తీసుకొస్తారు. సాయంత్రం 7గంటలకు అంకురార్పణ, అఖండకలశస్థాపన, ధ్వజారోహనం, రాత్రి 10గంటలకు బసవ ముద్ద కార్యక్రమం ఉంటుంది. 21న మహాశివరాత్రి రోజున స్వామి వారి ఆలయంలో సేవలు, రాత్రి 1.20గంటలకు(తెల్లవారితే శనివారం) స్వామి వారి కల్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇక 26వ తేదీన రథోత్సవం, 27వ తేదీన బండ్లు తిరుగుట, మార్చి 5వ తేదీన శ్రీ పార్వతీరామలింగేశ్వరస్వామి కల్యాణం, 6వ తేదిన పదహారు రోజుల పండుగతో ఉత్సవాలు ముగుస్తాయి. ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు కురవిలోని భద్రకాళీ సమేత శ్రీవీరభద్రస్వామి కల్యాణ మహోత్సవ జాతరకు ఆలయ అధికారులు, వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. బుధవారం నాటికి ఏర్పాట్లు పూర్తికానున్నాయి. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు ఏర్పాటుచేయగా... స్వామి కల్యాణ మహోత్సవం జరిగే నాగేంద్రస్వామి ఆలయ ఆవరణలో బారికేడ్లను ఆర్అండ్బీ అధికారులు నిర్మిస్తున్నారు. స్నాన ఘట్టాల వద్ద షవర్లు, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కావొస్తున్నాయి. మొత్తంగా జాతర ఏర్పాట్లు 95శాతం పూర్తి అయ్యాయి. ఈ మేరకు ఏర్పాట్లను మహబూబాబాద్ డీఎస్పీ నరేష్కుమార్ మంగళవారం పరిశీలించి పలు సూచనలు చేశారు. జాతర పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లపై కురవి ఎస్సై జక్కుల శంకర్రావుతో చర్చించారు. మహిమాన్వితుడు.. అగస్తీశ్వర స్వామి మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం శివారు కొండపై స్వయంభూగా వెలసిన అగస్తీశ్వర స్వామి మహిమాన్వితుడిగా భక్తులతో పూజలు అందుకుంటున్నాడు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 21, 22, 23వ తేదీల్లో నిర్వహించే మహాజాతర మహోత్సవానికి మూడు జిల్లాల నుంచి భక్తులు హాజరుకానుండగా.. నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు.. సిద్ధేశ్వరా నమోనమః! బచ్చన్నపేట: ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన జనగామ జిల్ల బచ్చన్నపేట మండలంలోని కొడ్వటూరు గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వర ఆలయం మహా శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు గంగపూజ, ఋత్వికరణం, అవాహన దేవత పూజ, 20న ఏకదశరుద్రాభిషేకం, రుద్రహోమం, శతరుద్రాభిషేకం, 21వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన శ్రీ భద్రకాశి వీరభద్రేశ్వరస్వామి ఆహ్వానం, రాత్రి శివపార్వతుల కల్యాణం, లింగోద్భవ పూజ ఉంటాయి. 22న ఉదయం అగ్నిగుండ ప్రవేశం, గెలుపు ఆశీర్వాదంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. స్వామి కల్యాణానికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. -
పోదాం కీసర..
కీసర: ప్రముఖ శైవక్షేత్రమైన కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయంలో బుధవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నేటి నుంచి 24 వరకు ఆరు రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించనున్నారు. టీటీడీ వేదపాఠశాల ప్రిన్సిపాల్ మల్లిఖార్జున అవధాని పర్యవేక్షణలో, కీసరగుట్ట ఆలయ పూజారులు బలరాంశర్మ, రవిశర్మ, ఆచార్య గణపతిశర్మ నేతృత్వంలో వైదిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఉదయం 11గంటలకు ఆలయ ఛైర్మన్ తటాకం శ్రీనివాస్‌శర్మ దంపతులు విఘ్నేశ్వరపూజ, పుణ్యహవాచనము, రుత్విక్ పరణము, యాగశాల ప్రవేశము, అఖండజ్యోతి ప్రతిష్టాపన, తదితర కార్యక్రమాలతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. సాయంత్రం అగ్నిప్రతిష్టాపన, బేరిపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతి రాగాలాపన, హారతి, రాత్రి 7 గం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం జరుగుతాయి. రాత్రి 8 గంటలకు శ్రీ స్వామివారికి నందివాహనసేవ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి స్వామివారిని ఊరేగింపుగా తీసుకువస్తారు. భక్తుల సంఖ్యకుతగినట్లు ఏర్పాట్లు మహాశివరాత్రి బ్రహోత్సవాల సందర్భంగా 4 నుంచి 5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చునని అధికారులు, ఆలయ సిబ్బంది అంచనా వేస్తున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 20 కమిటీలు ఏర్పాటు చేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు, శానిటేషన్, విషన్భగీరథ , వైద్య, విద్యుత్ తదితర శాఖల అధికారులు షిఫ్టుల వారీగా విధుల్లో పాల్గొంటారు. నేడు జిల్లా స్థాయి క్రీడోత్సవాలు: బ్రహోత్సవాలను పురస్కరించుకుని ఏటా నిర్వహించే జిల్లా స్థాయి క్రీడోత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది జాతర సందర్బంగా ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో వివిధ ప్రభుత్వ శాఖల స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఆయా శాఖలకు సంబందించిన ప్రగతిపై ఫొటోలను ఏర్పాటు చేయనున్నారు. మంత్రి మల్లారెడ్డి , జిల్లాకలెక్టర్ వాసం.వెంకటేశ్వర్లు క్రీడోత్సవాలు, స్టాల్స్‌ను ప్రారంభిస్తారు. పకడ్బందీ ఏర్పాట్లు :బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామి దర్శనానికి వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఛైర్మన్ తటాకం శ్రీనివాస్‌శర్మ తెలిపారు. మంత్రి, జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సహకారంతో జాతరను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించే విషయమై ప్రధానంగా దృష్టి సారిస్తామన్నారు. ఇప్పటికే లక్ష లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశామని, భక్తుల రద్దీ దృష్ట్యా అవసరమైతే ప్రసాదాల తయారీని పెంచుతామన్నారు.– ఆలయ ఛైర్మన్ తటాకంశ్రీనివాస్శర్మ పూజా కార్యక్రమాల వివరాలివీ.. మొదటిరోజు: 19 వ తేదీ (బుధవారం) ఉదయం 11గంటలకు విఘ్నేశ్వరపూజతో బ్రహోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. అనంతరం పుణ్యావాహచనం, రుత్విక్వరణం, యాగశాల ప్రవేశం, అఖండజ్యోతి ప్రతిష్టాపనం, అగ్నిప్రతిష్టాపన, బేరీపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతి రాగాలాపన, మంత్రపుష్పం, రాత్రి 8 గంటలకు శ్రీస్వామివారు కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి విచ్చేస్తారు. 2వ రోజు: 20 తేదీ(గురువారం) ఉదయం 9గంటల నుంచి రుద్రస్వాహాకార హోమం, సాయంత్రం 4 గంటల నుంచి బిల్వార్చన, రాత్రి 7గంటలకు ప్రదోషకాల పూజ, హారతి, మంత్రపుష్పం, రాత్రి 8గంటల నుంచి శ్రీస్వామివారు కీసర గ్రామం నుంచి కీసరగుట్టకు వస్తారు. రాత్రి 10 గంటలకు శ్రీభవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వరస్వామివార్ల కళ్యాణ మహోత్సవం. 3వ రోజు: 21వ తేదీ (శుక్రవారం) మహాశివరాత్రి పర్వదినం రోజు తెల్లవారుజామున 4గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, కళ్యాణమండపంలో సామూహిక అభిషేకాలు, రుద్రస్వాహాకారహోమం, రాత్రి 8గంటలకు నందివాహన సేవ, భజనలు, రాత్రి 12 గంటల నుంచి లింగోద్బవ కాలంంలో శ్రీరామలింగేశ్వరస్వామికి సంతతధారాభిషేకం. 4వ రోజు: 22 వ తేదీ (శని వారం) ఉదయం 5.30 గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 6 గంటల నుంచి కళ్యాణ మండపంలో సామూహిక అభిషేకాలు, ఉదయం 8 గంటలకు అన్నాభిషేకం, 9 గంటలకు రుద్రస్వాహాకారహోమం, రాత్రి 7గంటల నుంచిì ప్రదోశకాల పూజ, మంత్రపుష్పం, రాత్రి 7గంటలకు స్వామివారి విమానరథోత్సవం. 5వ రోజు: 23వ తేదీ( ఆదివారం )5.30 కు మహాన్యాసపూర్వకరుద్రాభిషేకం,సాముహికఅభిషేకాలు, రాత్రి 7కు ప్రదోష కాలపూజ, హారతి, మంత్రపుష్పము, రాత్రి+ 8 గంటలకు వసంతోత్సవం, పుష్పయాగం. 6వ రోజు: 24వ తేదీ(సోమవారం) మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సాముహిక అభిషేకాలు, ఉదయం10 గంటలకు క్షేత్ర దిగ్బలి, అనంతరం పూర్ణాహుతితో ఉత్సవాల పరిసమాప్తి, పండిత సన్మానంతో ఉత్సవాలు ముగుస్తాయి. -
మహా శివరాత్రి రోజున అద్భుతం!
సాక్షి, పెనుకొండ : అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలో శివరాత్రి పర్వదినం రోజున మహా అద్భుతం చోటు చేసుకుంది. శివుని మెడలో నిత్యం నాగుపాము ఉండడం పరిపాటి. గోధుమ వర్ణం కలిగి ఉన్న అలాంటి నాగుపాము పాత జైన దేవాలయం వద్ద సోమవారం ఉదయం నుంచి నాలుగు గంటలపాటు పడగ విప్పి అటు ఇటు తిరగడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ దృశ్యాన్ని తిలకించిన పలువురు సెల్ఫోన్లలో ఫొటో తీసి వాట్సప్, ఫేస్‌బుక్‌లలో షేర్ చేశారు. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకుని నాగుపామును దర్శించారు. పలువురు మహిళలు ప్లేటులో పాలు తీసుకొచ్చి పాము వద్ద ఉంచారు. మహాశివరాత్రి పర్వదినాన ఇటువంటి అద్భుతం చోటు చేసుకోవడం నిజంగా శివుని మహిమేనని ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. -
శివరాత్రికి సిద్ధమవుతున్న శ్రీగిరి
కర్నూలు, శ్రీశైలం: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ నెల 25 నుంచి మార్చి 6 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాదిమహాశివరాత్రి పర్వదినం శివునికి అత్యంతప్రీతికరమైనసోమవారం (మార్చి 4) రావడంతో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా రూ.2.50 కోట్ల నుంచి రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, మంచినీటి వసతి తదితర వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఇప్పటికే శాశ్వత ప్రాతిపదికన క్షేత్రవ్యాప్తంగా 300 వరకు మరుగుదొడ్లు నిర్మించారు. వీటికి అదనంగా 200 టాయిలెట్లను తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. నాగలూటి, దోర్నాలలో సైతం 20 చొప్పున తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఈఈ రామిరెడ్డి తెలిపారు. అలాగే క్షేత్రవ్యాప్తంగా 500 మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ ప్రదేశాలు, ఉద్యాన వనాలు, యాత్రికులు సేదతీరే ప్రదేశాల వద్ద నిరంతరం మంచినీటి సరఫరా కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు సౌకర్యవంతంగా క్యూలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులందరికీ మల్లన్న దర్శనభాగ్యం కల్పించడానికి వీలుగా ఉచిత, అతిశీఘ్ర దర్శన క్యూలతో పాటు శివదీక్షా స్వాముల కోసం ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేస్తున్నారు. శివస్వాముల కోసం చంద్రవతి కల్యామండపం నుంచి శివాజీగోపురం ఎదురుగా ఉన్న భ్రామరి ఉద్యానవన క్యూ ద్వారా ఆలయ ప్రధాన రాజగోపురం నుంచి ప్రవేశం కల్పిస్తున్నారు. క్యూలలో ఉచితంగా పాలు, మంచినీరు, అల్పాహారం మొదలైన వాటిని అందజేయడానికి దాతల సహకారాన్ని తీసుకుంటున్నారు. పాతాళగంగ మొదలుకొని క్షేత్రవ్యాప్తంగా పారిశుద్ధ్య లోటు రాకుండా దేవస్థానం శానిటేషన్ విభాగంతో పాటూ జిల్లా పంచాయతీ రాజ్ శాఖ నుంచి ప్రత్యేక సిబ్బందిని నియమించనున్నారు. అవుటర్ రింగ్‌రోడ్డు ఏర్పాటు అవడం వల్ల ఈ సారి పార్కింగ్ ప్రదేశాల సంఖ్య పెరిగింది. యజ్ఞవాటిక వద్ద గతంలో ఉండే బస్ పార్కింగ్ బదులు కారు పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి పై భాగంలో చదును చేసి బస్సు పార్కింగ్‌కు కేటాయించనున్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద కూడా మరొక బస్ పార్కింగ్‌కు సిద్ధం చేస్తున్నారు. ఏటా రాత్రి పూట విద్యుత్ వెలుగుల కోసం అత్యధికంగా టవర్లైట్లను వినియోగించేవారు. ఈసారి అవుటర్‌రింగ్ రోడ్డు మొత్తం లైటింగ్ వ్యవస్థ ఉన్నందున వాటి సంఖ్య తగ్గించి అవసరమైన 10 ప్రదేశాలలో మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రం ప్రసాద పథకం కింద అదనపు ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం శ్రీశైల దేవస్థానానికి ప్రసాద పథకం కింద పర్యాటక శాఖ ద్వారా నిధులు మంజూరు చేసింది. దీంతో ఈ ఏడాది శిఖరేశ్వరం, కర్ణాటక సత్రం వద్ద భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న పనులు శివరాత్రిలోగా పూర్తయ్యేలా ప్రయత్నిస్తున్నారు. పాతాళగంగ వద్ద దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్ల నిర్మాణం కూడా ఈ పథకం ద్వారా చేపట్టారు. గర్భిణులు, చంటిపిల్లల తల్లులకు, వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం విడతల వారీగా జరిగేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. వివిధ ప్రదేశాలలో వైద్యశిబిరాలను నిర్వహించనున్నారు. ఇప్పుడున్న 108 వాహనానికి ఆదనంగా మరికొన్ని అందుబాటులో ఉంచనున్నారు. ఘాటు రోడ్డులో వాహనాలు అగిపోతే ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు క్రేన్లను శ్రీశైలం–దోర్నాల, అలాగే మున్ననూరు నుంచి శ్రీశైలం వరకు అందుబాటులో ఉంచనున్నారు. లడ్డూ ప్రసాదానికి లోటు రానివ్వం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో 10 లక్షలకు పైగా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకుంటారు. వారికి మల్లన్న లడ్డూప్రసాదం కొరత రాకుండా ఈ ఏడాది 40 లక్షల లడ్డూలను తయారు చేయించనున్నాం. గత ఏడాది 30 లక్షలకు పైగా తయారు చేసి,భక్తులకు అందించాం. ఈ ఏడాది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 10 లక్షల లడ్డూలను చేయిస్తున్నాం. లడ్డూ విక్రయాలకు మొత్తం 16 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. – శ్రీరామచంద్రమూర్తి, ఈఓ -
అమ్మో.. ఎండలు
కర్నూలు(అగ్రికల్చర్) : చలికాలం ఇంకా ముగియలేదు. శివరాత్రి పండుగను మంగళవారం జరుపుకున్నారు. ఎండాకాలం ప్రారంభం కానేలేదు. అయినా సూర్యుడు భగ్గుమంటున్నాడు. ఫిబ్రవరి మూడవ వారంలోనే ఎండలు మండుతున్నాయి. అబ్బో.. ఎండలు ఇప్పుడే ఇంత తీవ్రంగా ఉన్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఇంకెలా ఉంటాయోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరి ఇదే సమయంతో పోలిస్తే పగటి ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు పైగా పెరిగాయి. గత ఏడాది ఫిబ్రవరి నెల 18వ తేదీన 33.3 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి 18న ఉష్ణోగ్రత 37.3 డిగ్రీలకు పెరిగింది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడాన్ని చూస్తే ఏప్రిల్, మే నెలల్లో 50 డిగ్రీలకు చేరే ప్రమాదం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇటీవల వరకు పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేవి. ఇందువల్ల రాత్రిళ్లు చలి వాతావరణం ఉండేది. కొద్ది రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండల తీవ్రత పెరగడం వల్ల శీతల పానీయాలకు, కొబ్బరి బోండాంలకు, నీళ్ల ప్యాకెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. జనవరి నెలతో పోలిస్తే శీతల పానీయాల అమ్మకాలు 50 శాతంపైగా పెరిగాయి. 2014లో జిల్లాలో తీవ్ర అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. చెరువులు, కుంటల్లో చుక్క నీరు లేదు. భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. ఇందువల్ల గాలిలో తేమ శాతం తగ్గిపోతోంది. ఇందువల్ల ఎండల తీవ్రత పెరుగుతోంది. గత ఏడాది ఫిబ్రవరి నెల 14 నుంచి 18వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు కేవలం 31 నుంచి 33.3 డిగ్రీల వరకే ఉన్నాయి. ఈనెల 14 నుంచి 18 వరకు 35.6 డిగ్రీల నుంచి 37.3 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎండల తీవ్రత వల్ల శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు వెళ్లినవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా ఉష్ణోగ్రతలు పెరిగితే స్వైన్‌ఫ్లూ అదుపులోకి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.