యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీర జంటగా నటించిన చిత్రం "వినరో భాగ్యము విష్ణు కథ". ఈ చిత్రం ద్వారా మురళీ కిషోర్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 18న థియేటర్లలో సందడి చేయనుంది.
ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది.నెంబర్ నైబరింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సినిమాలో మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కాగా.. మొదట ఈ చిత్రాన్ని ఈనెల 17న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
శనివారం ~ మహాశివరాత్రి ~ "వినరో భాగ్యము విష్ణు కథ" విడుదల✨
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 11, 2023
Worldwide release on 𝐅𝐄𝐁 𝟏𝟖 ~ #VinaroBhagyamuVishnuKatha #VBVK #VBVKon18th pic.twitter.com/5ZkdAfloIY
Comments
Please login to add a commentAdd a comment