Vinaro Bhagyamu Vishnu Katha
-
ఏడాది పూర్తి చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో హిట్ మూవీ!
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం గతేడాది ఏకంగా మూడు సినిమాలతో అలరించాడు. వినరో భాగ్యము విష్ణుకథ మూవీతో సూపర్ హిట్ కొట్టాడు. ఈ చిత్రంలో కాశ్మీరా పరదేశి హీరోయిన్గా నటించింది. చిత్రంలో కాశ్మీరా పరదేశి హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత వచ్చిన రూల్స్ రంజన్, మీటర్ చిత్రాలతో ఫర్వాలేదనిపించాడు. గతేడాది ఫిబ్రవరి 18న విడుదలైన వినరో భాగ్యము విష్ణుకథ మొదటి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు. నూతన దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం అద్భుతమైన నటనతో మెప్పించారు. సకుటుంబంగా ప్రేక్షకులు చూసే మంచి కథా కథనాలతో అందరినీ ఆకట్టుకుందీ సినిమా. మీడియా నుంచి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకున్న వినరో భాగ్యము విష్ణు కథ మల్టీ జానర్ మూవీగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంది. కిరణ్ అబ్బవరం ఇలాంటి తరహా చిత్రాలు మరిన్ని చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన దిల్ రూబా అనే సినిమాతో పాటు సొంత ప్రొడక్షన్లో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. -
ఓటీటీలో కిరణ్ అబ్బవరం 'వినరో భాగ్యము విష్ణుకథ'
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న హీరో కిరణ్ అబ్బవరం. ఆయన నటించిన తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణుకథ. ఈ చిత్రంలో కాశ్మీర పరదేశి హీరోయిన్గా నటించింది.అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాతో మురళీ కిషోర్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా ఈనెల 18న విడుదలై మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. వినరో భాగ్యము విష్ణుకథ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. వచ్చేనెలలో ఉగాది సందర్భంగా ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. -
మా టీమ్ సక్సెస్ సీక్రెట్ అదే
‘‘వినరో భాగ్యము విష్ణు కథ’ విషయంలో కొత్తవారి మీద చాలా ఎక్కువగా ఖర్చు పెట్టారా? అని కొందరు అడుగుతున్నారు. అల్లు అరవింద్‌గారి క్రమశిక్షణ వల్ల మా ఖర్చు హద్దుల్లో ఉంటుంది. అదే మా టీమ్ సక్సెస్ సీక్రెట్’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. కిరణ్ అబ్బవరం, కాశ్మీర జంటగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ– ‘‘నేను తీసిన అన్ని సినిమాల్లోకెల్లా త్వరగా బ్రేక్ ఈవెన్ అయిన చిత్రమిది. ఇప్పుడిప్పుడే ‘కేజీఎఫ్, విక్రమ్’ వంటి సినిమాల ఫార్మాట్లకు ప్రేక్షకులు అలవాటుపడుతున్నారు. కొత్త దర్శకులకు ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో మా అందరికీ గౌరవం వచ్చింది.. ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’ అన్నారు కిరణ్ అబ్బవరం. ‘‘మా చిత్రం కేవలం నంబర్ నైబర్ కాన్సెప్ట్ కోసం తీసింది కాదు. అమ్మ సెంటిమెంట్ కూడా ఉంది’’ అన్నారు మురళీ కిషోర్ అబ్బూరు. నిర్మాత ఎస్కేఎన్, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మాట్లాడారు. -
నన్ను కిందకు లాగుతున్నారు, ఇలాగైతే ఎలా?.. ట్రోలింగ్‌పై హీరో ఫైర్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా నటించిన చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. మురళీ కిషోర్ అబ్బురు దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఫిబ్రవరి 18న విడుదలైన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మంగళవారం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఈ సినిమాకు ప్రతిఒక్కరూ బాగా సపోర్ట్ చేశారు. కానీ కొన్ని బ్యాచులు తయారవుతున్నాయి. ట్విటర్లో నాపై కావాలని విషం చిమ్ముతున్నారు. ఇంతకుముందు చేసిన ఒకటీరెండు సినిమాలు బాలేవు, నన్ను విమర్శించారు. ఈ సారి ఎలాంటి విమర్శ రాకూడదని పకడ్బందీగా ప్లాన్ చేసి మంచి మంచి సీన్లు పెట్టాం. అయినా కూడా కొంతమంది సినిమా బాలేదంటున్నారు బ్రో అని మావాళ్లు కొన్ని మెసేజ్‌లను నాకు చూపిస్తున్నారు. అసలు ఎవరంటున్నారు? ఎందుకు బాలేదంటున్నారు అని వివరాలు ఆరా తీస్తే వాళ్లసలు ఇక్కడివాళ్లే కాదు. ఎవరో కొందరు ఎవడికో రూ.50,000 ఇస్తే బాలేదని వరుస కామెంట్లు చేస్తున్నారు. ఇలాగైతే మాలాంటి యంగ్ హీరోలు ఎలా ఎదుగుతారు? మీరు నన్ను ఇంటికి పంపించేయాలనుకున్నా నేను వెళ్లను. ఇదే ఇండస్ట్రీలో ఉంటా. రూ.70,000 ఉద్యోగం వదిలేసి ఇక్కడిదాకా వచ్చా. నన్ను కిందకు లాగినా నాకేం పోదు. ట్విటర్ ఉంది కదా అని పొద్దున లేచినప్పటి నుంచి బూతు పురాణం ఎందుకు మొదలుపెడుతున్నారు? పక్కవాళ్ల మీద పడి ఏడవడం మానేయండి' అని ఓరకంగా వార్నింగ్ ఇచ్చాడు కిరణ్. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం -
వారికి ధైర్యాన్ని ఇవ్వాలనే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ తీశా : బన్ని వాసు
‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా కథను దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తీర్చిదిద్దిన విధానం చూసి ముచ్చటేసింది. నేను ఎప్పటి నుంచో అనుకున్న సీన్లను అద్భుతంగా తీశారు. ఆర్ఆర్లో విష్ణుతత్త్వాన్ని చెబుతూ వచ్చారు. ఈ సినిమాలోని ట్విస్టులు, కథ, నిడివి విషయంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ నేను మాత్రం సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాను.ఇప్పుడే అదే కరెక్ట్ అయింది. కొత్తగా డైరెక్షన్ చేయాలని వచ్చే వారికి ధైర్యాన్ని ఇవ్వాలనే ఈ సినిమాను తీశాను’అని నిర్మాత బన్ని వాసు అన్నారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కాశ్మీర జంటగా తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 18న విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ సందర్భంగా తాజాగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. బన్నీ వాసు మాట్లాడుతూ.. నిర్మాతగా నేను ఈ సినిమా పట్ల హ్యాపీగా ఉంది. నేను తీసిన అన్ని సినిమాల్లోకెల్లా త్వరగా బ్రేక్ ఈవెన్ అయింది. కిరణ్ అబ్బవరం మాకు ఎంతో సహకరించారు. కశ్మీర చాలా బిజీగా ఉన్నా కూడా మాకు ఎంతో టైం ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు’ అన్నారు. ‘ప్రతీ అరగంటకు జానర్ మార్చుకుంటూ సినిమా తీయడం మామూలు విషయం కాదు. మా డైరెక్టర్ ఈ సినిమాను అద్భుతంగా తీశారు. మా హీరోయిన్ కశ్మీర మున్ముందు మంచి విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాను. కిరణ్ అబ్బవరం వల్లే ఈ సినిమా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది’అని నిర్మాత ఎస్.కె.ఎన్ అన్నారు. ‘ఈ సినిమాతో మా అందరికీ గౌరవం వచ్చింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు నందు అన్న, నిర్మాత వాసు అన్నకు థాంక్స్. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’అని కిరణ్ అబ్బవరం అన్నారు. ఇంత మంచి చిత్రంలో భాగం అయినందుకు ఆనందంగా ఉందని హీరోయిన్ కశ్మీర పరదేశీ అన్నారు. 'ఇది కేవలం నంబర్ నైబర్ కాన్సెప్ట్ కోసం తీసింది కాదు. అమ్మ సెంటిమెంట్ ఉంటుంది. ఆడపిల్ల కంట్లో నీళ్లు వస్తే విష్ణు ఏం చేస్తారో చెప్పే కథ ఇది’ అని దర్శకుడు మురళీ కిషోర్ అన్నారు. -
వినరో భాగ్యము విష్ణు కథ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా నటించిన చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. నర్తనశాల తర్వాత కశ్మీర చేస్తున్న రెండవ సినిమా ఇది. తిరుపతి నేపథ్యంగా సాగే ఈ చిత్రంతో మురళీ కిషోర్ అబ్బురు దర్శకుడిగా పరిచయమయ్యారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18న థియేటర్లలోకి వచ్చిందీ చిత్రం. ఈ సినిమా మొదటిరోజే రూ.2.75 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ స్పెషల్ పోస్టర్‌తో వెల్లడించింది. సినిమాకు పాజిటివ్ స్పందన లభిస్తోందని, సినిమా కమర్షియల్ హిట్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది చిత్రయూనిట్. ఇక ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. #VinaroBhagyamuVishnuKatha grosses over 𝟐.𝟕𝟓 𝐂𝐑 worldwide on DAY 1 🔥 Thank you all for the blockbuster response 🫶🏻❤️#VBVK in cinemas near you! 🤩 🎫 - https://t.co/CO9hpOhbzQ #AlluAravind #BunnyVas @Kiran_Abbavaram @kashmira_9 @KishoreAbburu @chaitanmusic @GA2Official pic.twitter.com/0ohLFkmhsp — GA2 Pictures (@GA2Official) February 19, 2023 Team #VBVK visited Nexus Mall, Kukatpally last night! 🤩 Love from the audience keeps pouring in for #VinaroBhagyamuVishnuKatha ❤️#VBVK in cinemas now! 🤩 🎫 - https://t.co/CO9hpOhbzQ #BunnyVas @Kiran_Abbavaram @kashmira_9 @KishoreAbburu @chaitanmusic @GA2Official pic.twitter.com/LQ3mA7koFz — GA2 Pictures (@GA2Official) February 19, 2023 చదవండి: మాట తప్పని కౌశల్.. తండ్రికి ఊహించని సర్ప్రైజ్ -
వినరో భాగ్యము విష్ణు కథ మూవీ టీం స్పెషల్ ఇంటర్వ్యూ
-
ఎస్ఆర్ కళ్యాణ మండపం నచ్చడంతో ఈ అవకాశం.. ఇది నా అదృష్టం
‘‘గీతా ఆర్ట్స్‌లాంటి మంచి, పెద్ద బ్యానర్లో నటించా లని అందరూ అనుకుంటారు. నా కెరీర్‌ప్రారంభంలోనే ఆ బ్యానర్లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి మంచి సినిమా చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కాశ్మీర జంటగా తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘నేను చేసిన ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ సినిమా నచ్చడంతో అల్లు అరవింద్, వాసుగార్లు ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చేసే అవకాశం ఇచ్చారు. ప్రేమ, వినోదం, థ్రిల్.. ఇలా కుటుంబ సమేతంగా చూడదగ్గ అన్ని అంశాలతో మురళి తెరకెక్కించారు. నా కెరీర్లో ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ మంచి కమర్షియల్ హిట్. ఆ సినిమాని మించిన కమర్షియల్ హిట్‌ని ‘వినరో..’ సాధిస్తుంది. ‘కిరణ్ ఎలాంటి పాత్రలైనా చేయగలడు’ అని ప్రేక్షకులతో అనిపించుకోవా లన్నదే నా లక్ష్యం. ప్రస్తుతం నేను నటిస్తున్న ‘మీటర్’ షూటింగ్ పూర్తయింది. ‘రూల్స్ రంజన్’ 80 శాతం చిత్రీకరణ పూర్తయింది’’ అన్నారు. -
‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీ రివ్యూ
టైటిల్: వినరో భాగ్యము విష్ణు కథ నటీనటులు: కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశ, మురళీ శర్మ,ప్రవీణ్ తదితరులు నిర్మాణ సంస్థ: జీఏ2 పిక్చర్స్ నిర్మాత: బన్నీ వాసు సమర్పణ: అల్లు అరవింద్ దర్శకత్వం: మురళీ కిశోర్ అబ్బూరు సంగీతం: చైతన్ భరద్వాజ్ ఎడిటర్: మార్తండ్ కె వెంకటేశ్ విడుదల తేది: ఫిబ్రవరి 18, 2023 యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ మధ్యే ‘మీకు బాగా కావాల్సిన వాడిని’అంటూ ప్రేక్షకులను పలకరించిన కిరణ్.. ఇప్పుడు వినరో భాగ్యము విష్ణు కథ అంటూ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేశాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ని కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘వినరో..’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచాల మధ్య మహా శివరాత్రి సందర్భంగా శనివారం (ఫిబ్రవరి 18) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. తిరుపతికి చెందిన విష్ణు(కిరణ్ అబ్బవరం)ఓ లైబ్రేరియన్. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడంతో తాత(శుభలేఖ సుధాకర్) పెంపకంలో పెరుగుతాడు.పొరుగు వాళ్లకు చేతనైనంత సహాయం చేసే విష్ణు జీవితంలోకి నైబర్ నంబర్ అనే కాన్సెప్ట్‌తో దర్శన (కాశ్మీర పరదేశి) ప్రవేశిస్తుంది. ఆమె ఒక యూట్యూబర్. ట్రెండింగ్ వీడియోలు చేసి సెలెబ్రిటీ అయిపోవాలనుకుంటుంది. అందులో భాగంగా నైబర్ నంబర కాన్సెప్ట్‌తో వీడియో చేయాలనుకుంటుంది. తన ముబైల్ నంబర్లోని చివరి అంకెకు అటు, ఇటు ఉండే నంబర్లతో ఫోన్ చేయగా..ఒకవైపు విష్ణు, మరోవైపు శర్మ(మురళీ శర్మ) పరిచయం అవుతారు. వీరిద్దరితో కలిసి వీడియోలు చేసే క్రమంలో విష్ణు, దర్శన ప్రేమలో పడతారు. కట్ చేస్తే.. ఒక రోజు శర్మను తుపాకీతో కాల్చి చంపుతుంది దర్శన.అసలు శర్మను దర్శన ఎందుకు చంపింది? నిజంగానే అతను మరణించాడా? శర్మ నేపథ్యం ఏంటి? మంత్రి పదవి కోసం కుట్రలు చేస్తున్న ఓ ఎమ్మెల్యే('కె.జి.యఫ్' లక్కీ)కి, శర్మకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి జైలుకు వెళితే విష్ణు ఏం చేశాడు? నిందితులను పట్టుకోవడానికి నైబర్ నంబర్ కాస్పెప్ట్ ఎలా ఉపయోగపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మన మొబైల్ నంబర్ నుంచి పక్క నంబర్‌కి కాల్ చేస్తే ఎలా ఉంటుంది? వారెవరు..ఎక్కడ ఉంటారో..ఎం చేస్తారో తెలియదు. కానీ ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి ఫ్రెండ్షిప్ చేస్తే.. వినడానికే కొత్తగా, గమ్మత్తుగా ఉంది కదా. ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. దర్శకుడు మురళీ కిశోర్ చాలా కొత్త పాయింట్‌ని ఎంచుకొని అంతే కొత్తగా తెరపై చూపించాడు. కొన్ని సీన్లు సినిమాటిక్‌గా ఉన్నా.. ఫ్లోలో ఓకే అనిపిస్తాయి. ఎన్ఐఏ అధికారులు ఓ టెర్రరిస్టు గ్రూప్‌ని పట్టుకోవడం కోసం ప్రయత్నించడం..వారు పారిపోయి ఒకచోట దాక్కోవడం..వారి దగ్గరకు హీరో వెళ్లడం..ఇలా సినిమా ప్రారంభమే సీరియస్‌గా ఉంటుంది. ఆ తర్వాత కాసేపటికీ సినిమా అంతా లవ్‌స్టోరీగా మారిపోతుంది. నైబర్ నెంబర్ కాన్సెప్ట్‌తో హీరో హీరోయిన్లు కలిసిన తర్వాత వచ్చే కామెడీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మురళీ శర్మ హీరోయిన్‌తో కలిసి వేసే స్టెప్పులు..వారిద్దరి రిలేషన్‌పై హీరో వేసే పంచులు నవ్వులు పూయిస్తాయి. ఇలా ఒకవైపు సినిమాను సరదాగా నడిపిస్తూ..మరోవైపు శర్మను హత్య చేయడానికి ఎమ్మెల్యే మనుషులు ప్రయత్నించడం..హీరోయిన్ పాత్రపై అనుమానం కలిగిస్తూ ప్రేక్షకులు అయోమయానికి గురైయ్యేలా చేశాడు దర్శకుడు. అసలు శర్మ ఎవరు? అతన్ని ఎమ్మెల్యే మనుషులు ఎందుకు చంపాలనుకుంటున్నారు? అనేది చివరి వరకు చెప్పకుండా క్యూరియాసిటీని పెంచేశాడు. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. సెకండాఫ్‌లో కథనం రొటీన్‌గా, కాస్త సిల్లీగా సాగుతుంది. నైబర్ కాన్సెప్ట్ విదేశాల వరకు చేరి అక్కడ నిందితుడిని పట్టుకోవడం..అనేది కాస్త సినిమాటిక్ అనిపించినా..చివర్లో దానికి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమా ప్రారంభం కూడా ఓవర్‌గా అనిపించినా..క్లైమాక్స్‌లో వచ్చే టిస్ట్తో అది కూడా ఓకే అనిపిస్తుంది.‘వినరో భాగ్యము విష్ణు కథ’ స్టోరీ టైటిల్ అంత పెద్దది కాకపోయినా..ప్రేక్షకులను మాత్రం అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. లైబ్రేరియన్ విష్ణు పాత్రకి కిరణ్ అబ్బవరం న్యాయం చేశాడు. పక్కింటి మంచి కుర్రాడిలా చక్కగా నటించాడు.అయితే కిరణ్ ఈ తరహా పాత్ర చేయడం కొత్తేమి కాదు.గత సినిమాలలో మాదిరిదే ఇందులో కూడా సాదాసీదాగా కనిపిస్తాడు.ఎమోషనల్ సీన్స్ బాగానే చేశాడు. డ్యాన్స్, ఫైట్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుంటుందేమో. దర్శనగా కాశ్మీర పరదేశీ మెప్పించింది. తెరపై అందంగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో మురళీ శర్మ పాత్ర అందరికి గుర్తిండిపోతుంది. గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఆయన పాత్ర ఉంటుంది. ఆయన నటన..వేసిన స్టెప్పులు ప్రతీది నవ్విస్తుంది. హీరో తాతగా శుభలేక సుధాకర్, హీరోయిన్ తల్లిదండ్రులుగా దేవీ ప్రసాద్, ఆమని.. టెర్రరిస్ట్ రాజన్‌గా శరత్ లోహితన్యతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం చైతన్ భరద్వాజ్ సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. కొన్ని చోట్ల కథ కంటే నేపథ్య సంగీతమే గుర్తుండిపోతాయి. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ల పనితీరు బాగుంది.డైలాగ్స్ చప్పట్లు కొట్టిస్తాయి. కానీ కంటెంట్‌తో సంబంధం లేకుండా అవసరానికి మించిన డైలాగ్స్ హీరో చేత చెప్పించారనే ఫీలింగ్ కలుగుతుంది. జీఏ2 పిక్చర్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
కిరణ్‌లాంటి వ్యక్తులు తక్కువ.. రెండు సీన్లకే థ్రిల్లయ్యా: అఖిల్
‘‘గీతా ఆర్ట్స్ ఈవెంట్‌కు నేను ఓ కుటుంబసభ్యుడిలా వచ్చాను. కొత్తదనం కోసం అరవింద్‌గారు ఎప్పుడూ తాపత్రయపడుతుంటారు. కష్టం ఎప్పుడూ వృథా కాదు. కిరణ్ ఎంతో కష్టపడుతున్నాడు. తనకు ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు అక్కినేని అఖిల్. కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి జంటగా మురళీ కిషోర్ (నందు) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన అఖిల్ మాట్లాడుతూ– ‘‘వినరో..’లోని రెండు సీన్లు చూసి, థ్రిల్ అయ్యాను. ట్విస్ట్స్ అండ్ టర్న్స్‌తో ఈ సినిమా వస్తోంది ’’ అని అన్నారు. ‘‘జెన్యూన్‌గా ఉండే కిరణ్‌లాంటి వ్యక్తులు తక్కువ. బన్నీ వాసుతో పాటు కిరణ్ అబ్బవరంనూ ఓ నిర్మాతగా ఫీలవుతున్నాను. ఈ సినిమాకు అతను అలా వర్క్ చేశాడు’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘‘అఖిల్గారి సినిమాలో నేను ఓ కీ రోల్ చేయాల్సింది. కుదర్లేదు. ఏయన్నార్‌గారు చేసిన ‘మనం’ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఓ ఎమోషన్. స్క్రీన్‌పై గీతా ఆర్ట్స్ అని చూసిన మాలాంటి వారు కూడా అదే బ్యానర్లో సినిమాలు చేయొచ్చు అంటూ చాన్స్ ఇచ్చిన అల్లు అరవింద్‌గారికి ధన్యవాదాలు. నాలా సినిమాపై ప్యాషన్‌తో వచ్చేవారి తరపున అల్లు అరవింద్‌గారికి ధన్యవాదాలు చెబుతున్నాను. ‘వినరో. ..’ సినిమా బాగా రావడానికి ఎంతో కారణమైన బన్నీ వాసుగారి దగ్గర్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ మూవీతో నందు అన్నకు మంచి పేరు వస్తుంది. యూట్యూబ్‌లో షార్ట్‌ఫిల్మ్ ‘గచ్చిబౌలి’ నుంచి నేను ఇక్కడి వచ్చేంతవరకు నన్ను ప్రోత్సహించిన, ఇంకా సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. ‘వినరో..’ పెద్ద హిట్టవుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు కిరణ్ అబ్బవరం. ‘‘నేను దర్శకుడిని అయ్యానని మా నాన్నకు నేను హ్యాపీగా చెప్పుకునేలా చేసిన కిరణ్ అబ్బవరంకు, నిర్మాతలు అరవింద్, బన్నీ వాసుగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు మురళీ కిషోర్. ‘‘గీతా ఆర్ట్స్ తర్వాత నాగచైతన్య, అఖిల్ నాకు ఆప్తులు. నా మనసుకు కనెక్ట్ అయిన సినిమా ఇది. ఈ సినిమా చూశాక ఆడియన్స్ కొన్ని అంశాలను వెంట తీసుకెళ్తారు. కిరణ్, కిశోర్, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్‌లకు మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అన్నారు బన్నీ వాసు. -
'వినరో భాగ్యము విష్ణు కథ' ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అందుకే తెలుగు సినిమాలంటే ఇష్టం
‘‘మంచి కంటెంట్‌కు కమర్షియల్ అంశాలు జోడించి, తెలుగు సినిమాలు తీస్తుంటారు. అందుకే తెలుగు సినిమాలంటే నాకు ఇష్టం. ఇలాంటి తరహా సినిమాలు తీయడం రిస్క్ అయినప్పటికీ చాలెంజింగ్‌గా తీసుకుని ఇక్కడ తెరకెక్కిస్తారు. అయితే మా (మరాఠీ) సినిమాలు కమర్షియల్‌గా కాకుండా ఎక్కువగా రియలిస్టిక్‌గా ఉంటాయి’’ అని అన్నారు కశ్మీరా పరదేశి. కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి జంటగా మురళీ కిషోర్ దర్శకత్వంలో రూపొం దిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో కశ్మీరా మాట్లాడుతూ– ‘‘తిరుపతి నేపథ్యంలో వస్తున్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. తిరుపతిలో షూటింగ్ చేయడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగాయి. ఈ చిత్రంలో నటనకు స్కోప్ ఉన్న దర్శన పాత్ర చేశాను. గీతా ఆర్ట్స్ వంటి బ్యానర్లో సినిమా చేయడం కంఫర్ట్‌గా అనిపించింది. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా, హిందీలో ఓ సినిమా చేస్తున్నాను. తెలుగులో చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
‘వినరో భాగ్యము విష్ణు కథ’ హీరోయిన్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీర జంటగా నటించిన చిత్రం "వినరో భాగ్యము విష్ణు కథ". ఈ చిత్రం ద్వారా మురళీ కిషోర్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 18న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ కశ్మీర తాజాగా మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న విశేషాలు ఎలా ఉన్నాయి. ⇔ మాది మహారాష్ట్ర. రాజ్‌పుత్ వంశానికి చెందిన నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. నటనపై ఉన్న ఇష్టంతో థియేటర్ ఆర్టిస్ట్‌గా చేశాను. అ క్రమంలోనే 2018లో నాకు నాగశౌర్య నర్తనశాల సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా తర్వాత డ్యాన్స్ పరంగా యాక్టింగ్ పరంగా ఇలా అన్ని రకాలుగా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. ⇔ నర్తనశాల సినిమా తర్వాత నేను చేస్తున్న రెండవ సినిమా ఇది. తిరుపతి నేపథ్యంలో ఉన్న ఈ సినిమా కథ వినగానే నాకు నచ్చి ఓకే చెప్పాను. ఎందుకంటే నాకు తిరుపతితో ఎక్కువ అనుబంధం ఉంది. ఈ సినిమా చెయ్యడం వలన నాకు పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం ఒక ఎత్తయితే గీతా ఆర్ట్స్ వంటి పెద్ద బ్యానర్లో సినిమా చేయడం మరోక ఎత్తు. గీతా ఆర్ట్స్ లో చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ⇔ ఈ సినిమాలో నేను దర్శనగా మంచి స్కోప్ ఉన్న పాత్రలో నటించాను. నెంబర్ నైబరింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులందరినీ కచ్చితంగా అలరిస్తుందనే నమ్మకం ఉంది. అలాగే ఈ సినిమా కొరకు షూటింగ్ మధ్యలో, షూటింగ్ తర్వాత కూడా మూవీ ప్రమోషన్ లో భాగంగా మురళీ శర్మ లాంటి సీనియర్ యాక్టర్‌తో రీల్స్ చేయడం జరిగింది. దీనివల్ల చాలా ఎంజాయ్ చేశాను ⇔ నేను మరాఠి అయినా నాకు తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తెలుగు సినిమాలు మంచి కంటెంట్‌తో పాటు కమర్షియల్ యాక్సెప్ట్లోకి వెళ్లి ప్రేక్షకులందరినీ అలరిస్తాయి. ఇలా చేయడం చాలా రిస్క్ అయినా ఛాలెంజింగ్‌గా తీసుకొని చాలా చక్కగా తెరకెక్కిస్తారు. అయితే మరాఠీ సినిమాలు ఇందుకు భిన్నంగా ఉంటాయి. అక్కడ సినిమాలు కమర్షియల్‌గా కాకుండా ఎక్కువ రియలిస్టిక్ను బేస్ చేసుకొని తీస్తారు. ఈ సినిమా తర్వాత తెలుగులో ఒక సినిమా కథ చర్చలు నడుస్తున్నాయి. అలాగే తమిళంలో ఓ సినిమా, హిందీలో ఓ సినిమా చేస్తున్నాను అని ముగించారు. -
అందువల్లే ఆ హీరోలు క్లిక్ అవుతున్నారు – నిర్మాత బన్నీ వాసు
‘‘ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా లేకున్నా కష్టపడాలి. అల్లు అర్జున్, నాని, కిరణ్ అబ్బవరం, నిఖిల్‌లకు సినిమా అంటే తపన.. అందువల్లే వారు క్లిక్ అవుతున్నారు. సినిమా కోసం నిద్రపోకుండా బాగా కష్టపడతారు’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. కిరణ్ అబ్బవరం, కశ్మీర జంటగా మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ– ‘‘వినరో భాగ్యము విష్ణు కథ’లో వినోదం, ప్రేమ, థ్రిల్లింగ్.. ఇలా అన్ని వాణిజ్య అంశాలున్నాయి. ఈ చిత్రంలో సిగరెట్, మందు తాగే సీన్లు లేవు.. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ఈ చిత్రంతో కిరణ్ అబ్బవరం కెరీర్ మరో మెట్టు పైకి ఎక్కుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా రషెస్ చూశాక అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే మా నమ్మకం రెట్టింపు అయ్యింది. నా కెరీర్లో గుర్తు పెట్టుకునే చిత్రం అవుతుంది’’ అన్నారు కిరణ్ అబ్బవరం. -
వాలంటైన్స్ డే స్పెషల్: వినరో భాగ్యము విష్ణు కథ నుంచి లవ్ ట్రాక్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీర జంటగా నటించిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఈ చిత్రం ద్వారా మురళీ కిషోర్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఇవాళ(ఫిబ్రవరి 14న)'వాలెంటైన్స్ డే' సందర్భంగా ఈ సినిమా నుంచి లవ్‌ట్రాక్‌ను రిలీజ్ చేసింది చిత్రం బృందం. 'ఓ బంగారం నీ చెయ్యే తాకగానే ఉప్పొంగిపోయిందే..’ అంటూ సాగే ఈ పాటకు సాగుతోంది. హీరోయిన్ వెంట పడుతూ హీరో పాడే పాట ఇది. చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. కాగా ఈ చిత్రంలో మురళీశర్మ, శుభలేఖ సుధాకర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. -
ఈ ఏడాది సరికొత్త ప్రేమకథా చిత్రాలు ఇవే..!
సినిమాల్లో ప్రేమకథలకు ఉన్న క్రేజే వేరు. లవ్ స్టోరీలను సినీ ప్రేమికులు ఎక్కువగా ఇష్టపడతారు. భాష ఏదైనా ప్రేమకథా చిత్రాలకు ఆదరణ ఉంటుంది. గతేడాదిలో పలు ప్రేమ కథాంశంగా తెరకెక్కిన చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా కూడా నిలిచాయి. అందులో సీతారామం మూవీ ఒకటి. మరీ ఈ ఏడాది కూడా ప్రేక్షకులను అలరించేందుకు మరిన్ని చిత్రాలు సిద్ధమయ్యాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా సరికొత్త ప్రేమకథలను పరిచయం చేసేందుకు టాలీవుడ్లో సిద్ధమవుతున్న చిత్రాలేవో చూసేద్దాం. ప్రేమకావ్యం.. శాకుంతలం కాళిదాసు రచించిన ప్రేమకావ్యం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా రూపొందిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్, శకుంతలగా సమంత నటించారు. మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్, గౌతమి, మధుబాల కీలక పాత్రలుపో షించారు. కాగా ఏప్రిల్ 14న ‘శాకుంతలం’ని విడుదల చేయనున్నట్లు శుక్రవారం కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. వినరో భాగ్యము విష్ణుకథ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి నటిస్తున్న చిత్రం 'వినరో భాగ్యము విష్ణుకథ'. సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫోన్ నంబర్ ప్రధాన అంశంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. మన ఫోన్ నెంబర్ తర్వాత నెంబర్ వారితో పరిచయం ప్రేమగా మారితే ఎలా ఉంటుందన్నదే ప్రధాన కథాంశం. ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని- కీర్తి సురేశ్ 'దసరా' నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది. యాక్షన్ చిత్రంగా తెరకెస్తున్నప్పటికీ ఓ మంచి ప్రేమకథ ఉందని పోస్టర్లు చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేస్తున్నాయి.ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. సింగరేణి బొగ్గు గనుల సమీపంలోని వీర్లపల్లి గ్రామ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ధరణిగా నాని, వెన్నెలగా కీర్తిసురేశ్ నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ - సమంత 'ఖుషి' పవన్ కల్యాణ్, భూమిక జంటగా నటించిన ఖుషి ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే పేరుతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. మజిలీ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ కూడా పూర్తయ్యింది. దాదాపు 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. -
శివరాత్రి స్పెషల్: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే
ఫిబ్రవరి మొదటి రెండు వారాలు ఆసక్తికర కంటెంట్‌తో వచ్చిన హంట్, అమిగోస్ చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక మహాశిరాత్రి సందర్భంగా ఈ వారం పలు కొత్త చిత్రాలు థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. సమంత శాకుంతలం విడుదల వాయిదా పడటంతో తమిళ స్టార్ హీరో ధనుష్ ద్విభాష చిత్రం సార్‌తో పాటు మరిన్ని చిన్న సినిమాలు థియేటర్లో అలరించబోతున్నాయి. మరోవైపు ఓటీటీలోకి కూడా పెద్ద సినిమాలు రాబోతున్నాయి. మరి ఈ వారం థియేటర్, ఓటీటీలోకి రాబోయే సినిమాలేవో ఇక్కడ ఓ లుక్కేయండి! తమిళ స్టార్ హీరో-తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కిన ద్విభాష చిత్రం సార్(తమిళంలో వాతి). సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 17న థియేటర్లో విడుదల కాబోతోంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీర జంటగా నటించిన చిత్రం "వినరో భాగ్యము విష్ణు కథ". ఈ చిత్రం ద్వారా మురళీ కిషోర్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా జనవరి 18న థియేటర్లలోకి రాబోతోంది. తెలుగు బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అల వైకుంఠపురం’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీలో ‘షెహ్జాదా’ పేరుతో రూపొందించారు. కార్తిక్ ఆర్యన్ హీరోగా రోహిత్ ధావన్ ఈ చిత్రాన్ని రీమేక్ చేశాడు. కృతి సనన్ కథానాయిక. తెలుగులో విశేషంగా అలరించిన ఈ సినిమాను హిందీ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మార్పులు చేసి, విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 17న ఈ చిత్రం హిందీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వారం ఓటీటీలోకి రాబోయే చిత్రాలివే ఆహా కళ్యాణం కమనీయం (తెలుగు) ఫిబ్రవరి 17 డిస్నీ+హాట్‌స్టార్ మాలికాపురం (తెలుగు) ఫిబ్రవరి 15 సదా నన్ను నడిపే (తెలుగు) ఫిబ్రవరి 16 జె-హోప్ ఇన్ ది బాక్స్(కొరియన్ సిరీస్) ఫిబ్రవరి 17 ద నైట్ మేనేజర్ (హిందీ సిరీస్) ఫిబ్రవరి 17 నెట్‌ఫ్లిక్స్ స్క్వేర్డ్ లవ్ ఆల్ ఓవర్ ఎగైన్ (హాలీవుడ్) ఫిబ్రవరి 13 ఏ సండే ఎఫైర్ (హాలీవుడ్) ఫిబ్రవరి 14 పర్ఫెక్ట్ మ్యాచ్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 14 ది రొమాంటిక్స్ (హిందీ సిరీస్) ఫిబ్రవరి 14 ఆఫ్రికన్ క్వీన్స్: జింగా (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 15 ఫుల్ స్వింగ్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 15 రెడ్ రోజ్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 15 సర్కస్ (హిందీ) ఫిబ్రవరి 17 గ్యాంగ్‌లాండ్స్ (వెబ్‌సిరిస్) ఫిబ్రవరి 17 అమెజాన్ ప్రైమ్ వీడియో కార్నివల్ రో (వెబ్‌సిరీస్2) ఫిబ్రవరి 15 లయన్స్‌గేట్ ప్లే మైనస్ వన్ (హిందీ సిరీస్-2) ఫిబ్రవరి 14 లవ్ ఆన్ ది రాక్ (హాలీవుడ్) ఫిబ్రవరి 17 -
మహా శివరాత్రికి వస్తున్న 'వినరో భాగ్యము విష్ణుకథ'
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీర జంటగా నటించిన చిత్రం "వినరో భాగ్యము విష్ణు కథ". ఈ చిత్రం ద్వారా మురళీ కిషోర్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది.నెంబర్ నైబరింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సినిమాలో మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కాగా.. మొదట ఈ చిత్రాన్ని ఈనెల 17న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. శనివారం ~ మహాశివరాత్రి ~ "వినరో భాగ్యము విష్ణు కథ" విడుదల✨ Worldwide release on 𝐅𝐄𝐁 𝟏𝟖 ~ #VinaroBhagyamuVishnuKatha #VBVK #VBVKon18th pic.twitter.com/5ZkdAfloIY — Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 11, 2023 -
'ఇద్దరి ఇష్టాలు ఒకటే అయితే'.. ఆసక్తిగా వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్
కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ'. ఈ చిత్రానికి మురళి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా విడుదల కానుంది. ట్రైలర్ చూస్తే లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఖాయంగా కనిపిస్తోంది. కిరణ్ అబ్బవరం యాక్షన్, రొమాన్స్, కామెడీ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. 'ఎస్ఆర్ కల్యాణ మండపం' సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత సమ్మతమే చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ ప్రారంభించారు. ఈ యాక్షన్ డ్రామాకి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు కిరణ్. -
ఆసక్తిగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ప్రమోషన్స్, వరంగల్‌లో మూవీ టీం బ్రేకప్ పార్టీ
కిరణ్ అబ్బవరం, కశ్మీర పర్ధేశీ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్నఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, చిత్ర టీజర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈమూవీ ఫిబ్రవరి 17న రిలీజ్ కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ టీం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ను కాస్తా ఆసక్తికరంగా నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. గతంలో వీవీఐటీ గుంటూరు కాలేజ్ క్రికెట్ టీమ్‌తో ఒక క్రికెట్ మ్యాచ్ ఆడిన మూవీ టీం ఇందులో గెలిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పోందుకున్న ప్లేయర్‌తో ఆ సినిమాలోని సెకండ్ సింగిల్‌ను లాంచ్ చేయించారు. ఇప్పుడు మరో సరికొత్త ఈవెంట్‌కు ప్లాన్ చేశారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరంగల్‌లోని కే స్ట్రీట్‌లో ఈ మూవీ టీం ఒక బ్రేకప్ పార్టీని సెలెబ్రేట్ చేయనుంది. జనవరి 29న నిర్వహించే ఈ బ్రేకప్ పార్టీకి నిర్మాత బన్నీ వాసు, హీరో కిరణ్ అబ్బవరం హాజరు కానున్నారు. ఏదేమైనా ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకెళ్లడానికి విభిన్న తరహాలో ప్రొమోషన్స్ నిర్వహిస్తూ చిత్రం బృందం మూవీ హైప్ క్రియేట్ చేస్తోంది. -
బన్నీ వాసు బంపరాఫర్.. పుష్ప 2 షూటింగ్ చూసే ఛాన్స్!
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. కిరణ్ సరసన కశ్మీర పర్ధేశీ నటిస్తోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి "వాసవసుహాస" పాటకు, చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాతో మురళి కిషోర్ అబ్బురు దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేయడంలో భాగంగా ఈ చిత్ర బృందం Vvit గుంటూరు కాలేజ్ క్రికెట్ టీమ్‌తో మ్యాచ్ నిర్వహించింది. ఆ మ్యాచ్‌లో మ్యాన్ అఫ్ ది మ్యాచ్ ప్లేయర్ సైదులుతో "ఓ బంగారం నీ చెయ్యి తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం" సాంగ్ రిలీజ్ చేయించింది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. 'మా ప్రొడ్యూసర్ వాసు గారు ఈ సినిమాను మీకు దగ్గర చెయ్యాలని చెప్పి నెల ముందు నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్. భాస్కరభట్ల గారు మంచి లిరిక్స్ ఇచ్చారు' అని చెప్పుకొచ్చాడు. బన్నీ వాసు మాట్లాడుతూ.. 'ఈ సాంగ్‌ను రీల్‌గా చేసి గీతా ఆర్ట్స్‌ను ట్యాగ్ చేయండి. సెలెక్ట్ అయిన 10 మందికి, వాళ్ళ ఫ్యామిలీకి ఈ సినిమాను చూపించడమే కాకుండా వాళ్ళను పుష్ప షూటింగ్‌కు కూడా తీసుకెళ్తాం' అని ప్రకటించారు. వినరో భాగ్యము విష్ణు కథ విషయానికి వస్తే మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా బాబు వ్యవహరిస్తున్నారు. సత్యగమిడి, శరత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాతలు ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది. చదవండి: పెళ్లిపీటలెక్కిన హీరోయిన్, ఫోటోలు వైరల్ -
'అబ్బాయి టచ్ చేస్తే ఇట్టే తెలిసిపోతుంది'.. సాంగ్ ప్రోమో రిలీజ్
కిరణ్ అబ్బవరం, కశ్మీర జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా బాబు వ్యవహరిస్తున్నారు. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్నఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బురు దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం సెకెండ్ సింగిల్ ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం.ఈ పూర్తి పాటను జనవరి 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ, చైతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. -
నన్ను ఇండస్ట్రీ నుంచి పంపించేయాలనే ఇలా చేస్తున్నారు: కిరణ్ అబ్బవరం
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ‘రాజావారు రాణిగారు, ఎస్.ఆర్ కల్యాణమండపం, నేను మీకు బాగా కావాల్సినవాడిని’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. నటుడుగానే కాదు రైటర్‌గా కూడా మెప్పిస్తున్నాడు. తన రెండవ చిత్రం ఎస్ఆర్ కల్యాణమండపంకి తానే కథని అందించాడు. ఇక ఈ సినిమా యూత్‌లో సంపాదించుకుంది. ఇప్పుడు తాజాగా వినరో భాగ్యము విష్ణుకథ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చదవండి: హైవోల్టేజ్ యాక్షన్స్‌తో‘ పఠాన్’.. ట్రైలర్ అదిరిపోయింది! ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఆయనకు నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్‌పై ప్రశ్న ఎదురైంది. తనని కావాలనే టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఇంకా స్టార్ హీరోని కాలేదు. ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నా. ఈ నెగిటివిటీని ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. నేను స్పందించకపోవడం వల్లే ఇలా జరుగుతుంది’ అన్నాడు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఇదంత కావాలనే చేస్తున్నారు. నన్ను ఇండస్ట్రీ నుంచి పంపించేద్దాం అనుకుంటున్నారామో. ఒక సినిమాలో నేను వేసుకోకపోయినా పవర్ స్టార్ అనే ట్యాగ్ ఎడిట్ చేసి మిమర్స్ వేశారు. చదవండి: విడుదల ఇంకా కొన్ని రోజులే.. వారసుడు స్టోరీ లీక్! అది నేను పెట్టుకున్నాను అనుకుని కొందరు నన్ను దారుణంగా ట్రోల్ చేశారు అందుకోసం మరి ఇంత దారుణంగా చేయాలా? దానిని కూడా చాలా మంది నమ్మేస్తున్నారు. ఏంటి ఇలా ఎందుకు చేస్తున్నావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు’ అంటూ కిరణ్ చెప్పుకొచ్చాడు. కాగా కిరణ్ అబ్బవరం గత చిత్రం నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ సమయంలో అతడి ఇంట్రడక్షన్ సీన్లో కిరణ్ అబ్బవరం అనే టైటిల్ కార్డుపై పవర్ స్టార్ అని ఎడిట్ చేసి సోషల్ మీడియా షేర్ చేశారు. ఇక దానికి చూసి కొందరు నెటిజన్లు నిజం అనుకుని సోషల్ మీడియా వేదికగా అతడిని దారుణంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. -
ఇంకొన్ని రోజుల్లో మీరందరూ చూడబోయేదే నా కథ.. కిరణ్ కొత్త సినిమా టీజర్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రంతో మురళి కిషోర్ అబ్బురు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. కశ్మీర పర్ధేశీ హీరోయిన్. తాజాగా చిత్రం టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్. 'నా పేరు విష్ణు! మా జీవితాలు అన్నీ ఏడు కొండల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇంకొన్ని రోజుల్లో మీరందరూ చూడబోయేదే నా కథ’అని కిరణ్ చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభం అవుతోంది. టీజర్ మొదటి నుంచి చివరివరకు ఆసక్తికరంగా మలిచారు. లవ్, కామెడీ , థ్రిల్లర్ అన్ని సమపాళ్లలో ఉన్నట్లు టీజర్ చూస్తే అర్థమతుంది. ముఖ్యంగా విష్ణు పాత్రలో కిరణ్ అబ్బవరం తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించనున్నాడు.‘ఈ రోజుల్లో లవ్ లేకుండా ఏ స్టోరీ ఉంది సార్?’, ‘కాన్సెప్ట్ తో మొదలై లవ్వు కామెడీ మిక్సయి క్రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అనుకోవచ్చు" అని కిరణ్ చెప్పిన డైలాగ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయింది ఈ టీజర్. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కాబోతుంది. -
వినరో భాగ్యము విష్ణు కథ.. ఫ్యాన్స్‌కు బంపరాఫర్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకు గతేడాది పెద్దగా కలిసి రాలేదు. తను నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస దగ్గర పత్తా లేకుండా పోయాయి. ప్రస్తుతం నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన వాసవ సుహాస సాంగ్ ఎంతో ప్రత్యేకంగా ఉండటంతో పాటు సినిమాకు మంచి హైప్నిచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ముఖ్యమైన అప్డేట్ రిలీజ్ చేసింది గీతా ఆర్ట్స్ బ్యానర్. వినరో భాగ్యము విష్ణు కథ టీజర్‌ను జనవరి 9న ఉదయం 10.15 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే ఈ చిత్రం ఏ జానర్‌కు చెందిందో కరెక్ట్‌గా గెస్ చేస్తే వారితోనే టీజర్ రిలీజ్ చేయిస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. మరింకే.. మీరూ మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నాడు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుంది. Guess the genre, & you will be releasing the official teaser ✨ Drop your comments on below link 👇https://t.co/pmKEMeROM9#VBVKTeaser on Jan 9th @ 10:15 AM#VinaroBhagyamuVishnuKatha ✨ #AlluAravind #BunnyVas @Kiran_Abbavaram A @chaitanmusic @kashmira_9 @KishoreAbburu pic.twitter.com/B1CBrfp1CY — GA2 Pictures (@GA2Official) January 5, 2023 చదవండి: