యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కశ్మీర జంటగా నటించిన చిత్రం "వినరో భాగ్యము విష్ణు కథ". ఈ చిత్రం ద్వారా మురళీ కిషోర్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 18న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ కశ్మీర తాజాగా మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న విశేషాలు ఎలా ఉన్నాయి.
⇔ మాది మహారాష్ట్ర. రాజ్‌పుత్ వంశానికి చెందిన నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. నటనపై ఉన్న ఇష్టంతో థియేటర్ ఆర్టిస్ట్‌గా చేశాను. అ క్రమంలోనే 2018లో నాకు నాగశౌర్య నర్తనశాల సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా తర్వాత డ్యాన్స్ పరంగా యాక్టింగ్ పరంగా ఇలా అన్ని రకాలుగా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్నాను.
⇔ నర్తనశాల సినిమా తర్వాత నేను చేస్తున్న రెండవ సినిమా ఇది. తిరుపతి నేపథ్యంలో ఉన్న ఈ సినిమా కథ వినగానే నాకు నచ్చి ఓకే చెప్పాను. ఎందుకంటే నాకు తిరుపతితో ఎక్కువ అనుబంధం ఉంది. ఈ సినిమా చెయ్యడం వలన నాకు పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం ఒక ఎత్తయితే గీతా ఆర్ట్స్ వంటి పెద్ద బ్యానర్లో సినిమా చేయడం మరోక ఎత్తు. గీతా ఆర్ట్స్ లో చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది.
⇔ ఈ సినిమాలో నేను దర్శనగా మంచి స్కోప్ ఉన్న పాత్రలో నటించాను. నెంబర్ నైబరింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులందరినీ కచ్చితంగా అలరిస్తుందనే నమ్మకం ఉంది. అలాగే ఈ సినిమా కొరకు షూటింగ్ మధ్యలో, షూటింగ్ తర్వాత కూడా మూవీ ప్రమోషన్ లో భాగంగా మురళీ శర్మ లాంటి సీనియర్ యాక్టర్‌తో రీల్స్ చేయడం జరిగింది. దీనివల్ల చాలా ఎంజాయ్ చేశాను
⇔ నేను మరాఠి అయినా నాకు తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తెలుగు సినిమాలు మంచి కంటెంట్‌తో పాటు కమర్షియల్ యాక్సెప్ట్‌లోకి వెళ్లి ప్రేక్షకులందరినీ అలరిస్తాయి. ఇలా చేయడం చాలా రిస్క్ అయినా ఛాలెంజింగ్‌గా తీసుకొని చాలా చక్కగా తెరకెక్కిస్తారు. అయితే మరాఠీ సినిమాలు ఇందుకు భిన్నంగా ఉంటాయి. అక్కడ సినిమాలు కమర్షియల్‌గా కాకుండా ఎక్కువ రియలిస్టిక్‌ను బేస్ చేసుకొని తీస్తారు. ఈ సినిమా తర్వాత తెలుగులో ఒక సినిమా కథ చర్చలు నడుస్తున్నాయి. అలాగే తమిళంలో ఓ సినిమా, హిందీలో ఓ సినిమా చేస్తున్నాను అని ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment