
తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బురు దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "వినరో భాగ్యము విష్ణు కథ". కిరణ్ సరసన కశ్మీర పర్ధేశీ నటిస్తోంది. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బురు దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి "వాసవ సుహాస" ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఇదివరకే ఈ చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కళా తపస్వి కే విశ్వనాథ్ "వాసవసుహాస" అనే పాటను రిలీజ్ చేస్తూ "నాకు నా పాత రోజులు గుర్తొస్తున్నాయి, ఎలా ఒప్పుకున్నారా ప్రొడ్యూసర్స్ అనిపిస్తుంది. ఇలాంటి పాటను చేయడం సంతోషం" అంటూ కితాబిచ్చారు. కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని రచించిన ఈ పాటను కారుణ్య ఆలపించారు.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా "వినరో భాగ్యము విష్ణు కథ". విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నాడు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుంది.
ఈ పాట లిరిక్స్ అర్థం తెలియాలంటే కింది ఫోటో చూసేయండి
చదవండి: ఇరవై ఏళ్లకే నటి ఆత్మహత్య