Kiran Abbavaram Reacts On Trolls Over Power Star Tag In Latest Interview - Sakshi
Sakshi News home page

Kiran Abbavaram: నన్ను ఇండస్ట్రీ నుంచి పంపించేయాలనే ఇలా చేస్తున్నారు: యంగ్‌ హీరో

Published Tue, Jan 10 2023 1:22 PM | Last Updated on Tue, Jan 10 2023 4:34 PM

Kiran Abbavaram Reacts on Trolls Over Power Star Tag in latest interview - Sakshi

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం. ‘రాజావారు రాణిగారు, ఎస్.ఆర్ కల్యాణమండపం, నేను మీకు బాగా కావాల్సినవాడిని’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. నటుడుగానే కాదు రైటర్‌గా కూడా  మెప్పిస్తున్నాడు. తన రెండవ చిత్రం ఎస్‌ఆర్ కల్యాణమండపంకి తానే కథని అందించాడు. ఇక ఈ సినిమా యూత్‌లో సంపాదించుకుంది. ఇప్పుడు తాజాగా వినరో భాగ్యము విష్ణుకథ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

చదవండి: హైవోల్టేజ్‌ యాక్షన్స్‌తో‘ పఠాన్‌’.. ట్రైలర్‌ అదిరిపోయింది!

ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఆయనకు నెగిటివ్‌ కామెంట్స్‌, ట్రోల్స్‌పై ప్రశ్న ఎదురైంది. తనని కావాలనే టార్గెట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో దాడి చేస్తున్నారన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఇంకా స్టార్‌ హీరోని కాలేదు. ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నా. ఈ నెగిటివిటీని ఎందుకు స్ప్రెడ్‌ చేస్తు‍న్నారో అర్థం కావడం లేదు. నేను స్పందించకపోవడం వల్లే ఇలా జరుగుతుంది’ అన్నాడు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఇదంత కావాలనే చేస్తున్నారు. నన్ను ఇండస్ట్రీ నుంచి పంపించేద్దాం అనుకుంటున్నారామో. ఒక సినిమాలో నేను వేసుకోకపోయినా పవర్ స్టార్ అనే ట్యాగ్ ఎడిట్ చేసి మిమర్స్ వేశారు.

చదవండి: విడుదల ఇంకా కొన్ని రోజులే.. వారసుడు స్టోరీ లీక్‌!

అది నేను పెట్టుకున్నాను అనుకుని కొందరు నన్ను దారుణంగా ట్రోల్‌ చేశారు  అందుకోసం మరి ఇంత దారుణంగా చేయాలా? దానిని కూడా చాలా మంది నమ్మేస్తున్నారు. ఏంటి ఇలా ఎందుకు చేస్తున్నావ్‌ అంటూ ప్రశ్నిస్తున్నారు’ అంటూ కిరణ్‌ చెప్పుకొచ్చాడు. కాగా కిరణ్‌ అబ్బవరం గత చిత్రం నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ సమయంలో అతడి ఇంట్రడక్షన్‌ సీన్‌లో కిరణ్‌ అబ్బవరం అనే టైటిల్‌ కార్డుపై పవర్‌ స్టార్‌ అని ఎడిట్‌ చేసి సోషల్‌ మీడియా షేర్‌ చేశారు. ఇక దానికి చూసి కొందరు నెటిజన్లు నిజం అనుకుని సోషల్‌ మీడియా వేదికగా అతడిని దారుణంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement