trolled
-
భర్తతో విడాకులు.. ట్రోల్స్ చేయడం దారుణమన్న సింగర్!
నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్, సింగర్ సైంధవి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. తామిద్దర పరస్పరం అంగీకారంతోనే విడిపోతున్నట్లు జీవీ ప్రకాశ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తమ నిర్ణయాన్ని గౌరవించాలని.. ప్రైవసీకి భంగం కలిగించొద్దని సోషల్ మీడియా వేదికగా కోరారు. అయినప్పటికీ ఈ జంటపై ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ విమర్శిస్తున్నారు.తాజాగా తమపై వస్తున్న ట్రోల్స్‌పై సింగర్ సైంధవి స్పందించింది. తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా యూట్యూబ్‌లో కొందరు వీడియోలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నేను.. ప్రకాశ్ ఆలోంచించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. అందరూ మా నిర్ణయాన్ని గౌరవించాలని అభ్యర్థించారు. ఇలా ఒకరిపై ఆరోపణలు చేయడం దారుణమని వాపోయారు. మేమిద్దరం 24 ఏళ్లుగా మంచి స్నేహితుల్లా ఉన్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ తమ స్నేహా బంధాన్ని కొనసాగిస్తామని సైంధవి పేర్కొన్నారు. కాగా.. అంతకుముందే ట్రోల్స్ పట్ల జీవీ ప్రకాశ్ సైతం స్పందించారు. దయచేసి తమ పట్ల ట్రోల్స్ చేయడం సరైంది కాదని హితవు పలికారు. -
బాబర్ ఆజం పెళ్లి చేసుకోవాలని కోరితే.. నా ఆన్సర్ ఇదే అన్నందుకు ట్రోలింగ్! (ఫొటోలు)
-
ఇది ఒక సైకాలం..! ఆన్లైన్ రాక్షసులు..!!
"ఇంటర్నెట్ రాకతో ప్రపంచం కుగ్రామంగా మారింది. సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఏ మూలనున్న వారితోనైనా స్నేహించే, సంభాషించే అవకాశం దొరుకుతోంది. మరోవైపు ముక్కూమొహం తెలియని వారిపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి, బాధపెట్టి ఆనందించే ట్రోల్స్ అనే ప్రత్యేక జాతిని సృష్టించింది. చక్కగా అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లిష్ మాట్లాడిన బెండపూడి విద్యార్థులను, పిల్లలని కూడా చూడకుండా విపరీతంగా ట్రోల్ చేశారు. ప్రభుత్వం నుంచి ఇంటి స్థలాన్ని పొందిన వివాహితను అసభ్య పదజాలంతో ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యారు. సినీ తారలు, రాజకీయ నాయకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్.. వారని వీరని లేదు, అందరూ ట్రోలింగ్ బారిన పడ్డవారే!" అదోరకమైన శాడిజం.. జీవితంలో ఎలాంటి గుర్తింపులేని, ఎవరూ పట్టించుకోని వ్యక్తులకు ఆన్లైన్లో ఐడెంటిటీ బయటపడకుండా మాట్లాడగలగటం ధైర్యాన్నిస్తుంది. తమను ఎవరూ పట్టుకోలేరనే ధైర్యంతోనే నోటికొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడుతుంటారు. నిజానికి వీరిలో లోతైన అభద్రత ఉంటుంది. దాన్నుంచి బయట పడేందుకు, ఇతరుల అటెన్షన్‌ను పొందేందుకు ట్రోలింగ్‌ను ఒక సాధనంగా చేసుకుంటారు. ఎమోషనల్ కంట్రోల్ లేనివారు కూడా ట్రోలింగ్‌ను ఎంచుకుంటారు. ట్రోల్స్‌లో నార్సిసిజం, మాకియవెల్లియనిజం, శాడిజం ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి. నార్సిసిజం అంటే విపరీతమైన స్వీయప్రేమ. వీరికి విపరీతమైన అటెన్షన్ కావాలి. దానికోసం ఇతరులను ట్రోల్ చేస్తుంటారు. మన రియాక్షన్ నుంచి వారికి కావాల్సిన అటెన్షన్ పొందుతారు. మాకియ వెల్లియన్ ట్రోల్స్ మానిప్యులేట్ చేయడానికి అబద్ధాలు, మోసం ఉపయోగిస్తారు. వారిలో ఎలాంటి పశ్చాత్తాపం ఉండదు. ఇతరులు బాధపడుతుంటే లేదా బాధపెట్టి ఆనందించడమే శాడిజం. శాడిస్ట్ ట్రోల్స్ సంబంధంలేని అంశాలలో కూడా చేరి బాధపెట్టి ఆనందిస్తుంటారు. బలమైన కోటను నిర్మించుకోవాలి.. పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా ట్రోలింగ్ తప్పలేదని, మీరు ఒంటరి కాదని గుర్తించండి. ట్రోలింగ్ ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారా, మీ చుట్టూ బలమైన కోటను నిర్మించుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మీరు సున్నిత మనస్కులైతే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ ఉన్నా, ట్రోలింగ్ జరుగుతున్నంతకాలం డియాక్టివేట్ చేసుకోవాలి. ట్రోల్‌కు ప్రతిస్పందించడమంటే మృగానికి ఆహారం అందివ్వడమే. వారు కోరుకునే గుర్తింపు వారికి అందివ్వడమే. అందువల్ల కష్టమైనప్పటికీ ట్రోల్స్‌ను విస్మరించడమే వారి నుంచి తప్పించుకునే మార్గం. అప్పుడే వారు నిరాయుధులవుతారు, ఆకలితో అలమటిస్తారు. ట్రోల్స్‌ను నిరోధించడానికి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అందించిన రిపోర్టింగ్ మెకానిజాన్ని ఉపయోగించండి. వారిని బ్లాక్ చేయండి, రిపోర్ట్ చేయండి, వారి అకౌంట్ డిలీట్ అయ్యేలా రిపోర్ట్ చేయండి. ట్రోలింగ్ మీ కంటే ట్రోల్ గురించి ఎక్కువగా వెల్లడిస్తుంది. వారి నీచ మనస్తత్వం అందరికీ తెలిసేలా చేస్తుంది. అందువల్ల ట్రోల్స్ గురించి బాధపడకండి. మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉంచుకోకండి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆన్లైన్ గ్రూపుల మద్దతు తీసుకోండి. మీ విలువను మీకు గుర్తు చేయగల, మీకు సహాయం చేయగల వ్యక్తులతో ఎక్కువ సమయం గడపండి. ట్రోలింగ్ వల్ల ఆందోళన, నిరాశ, దిగులు, ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజిస్టును సంప్రదించండి. ట్రోల్స్ 2 రకాలు.. ట్రోలింగ్ చేసేవారిని ట్రోల్ అంటారు. వీరు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటారు. వ్యక్తిగతంగా ఇతరులను ట్రోల్ చేసి ఆనందించేవారు. వీరివల్ల కాస్తంత బాధే తప్ప ప్రమాదం ఉండదు. కానీ ఒక సంస్థ కోసమో, రాజకీయ పార్టీ కోసమో వ్యవస్థీకృతంగా ట్రోల్ చేసేవారు ప్రమాదకరంగా ఉంటారు. ఎందుకంటే వారిలో ఒకరు ట్రోలింగ్ మొదలుపెడితే వందల్లో, వేలల్లో, లక్షల్లో ట్రోల్ చేస్తారు. వారికి ఆయా సంస్థ లేదా పార్టీల మద్దతు కూడా ఉండటంతో విపరీతంగా రెచ్చిపోతారు. ఇవి కొన్నిసార్లు ఆన్లైన్ యుద్ధాలుగా మారవచ్చు. ట్రోలింగ్ సంకేతాలను గుర్తించాలి.. ట్రోల్స్ నుంచి తప్పించుకోవాలంటే ముందు వారి లక్షణాలను, ప్రవర్తనను గుర్తించాలి. అప్పుడే వారికి దూరంగా ఉండవచ్చు. అందుకే వాటిని గుర్తించడం అవసరం. మీతో గొడవపడటం, మిమ్మల్ని రెచ్చగొట్టి, బాధపడేలా చేయడమే ట్రోల్స్ లక్ష్యం. అందుకోసం అవమానకమైన భాష ఉపయోగిస్తారు వాస్తవాలను వక్రీకకరిస్తారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తారు. వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టించి, సామాజిక ఉద్రిక్తతలను సృష్టించాలని ప్రయత్నిస్తుంటారు. చర్చను వాదనగా మారుస్తారు. మీ రూపం, విలువలు, విశ్వాసాలను కించపరుస్తూ మాట్లాడతారు. కొందరు మరింత దిగజారి బూతులు కూడా తిడతారు. — సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com) ఇవి చదవండి: Usha Mehta: వెండి తెర మీద రహస్య రేడియో -
శివాజీ ఎమోషనల్ వీడియో.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్!
తెలుగువారి రియాటిటీ షో బిగ్‌బాస్ సీజన్-7 ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే ఈ షో 54 రోజులు పూర్తి చేసుకుని విజయవంతంగా కొనసాగుతోంది. అయితే అందరూ పెద్దన్నగా అడుగుపెట్టిన శివాజీ అదే పాత్రను హౌస్‌లో చక్కగా పోషిస్తున్నారు. ఇప్పటివరకు పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్‌కు మద్దతుగా నిలుస్తున్నాడని నెటిజన్స్ కూడా చాలాసార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే ఈ షో మొదలై ఏడు వారాలు పూర్తి కాగ.. ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. ఈ వారంలో మరొక కంటెస్టెంట్ ఇంటిదారి పట్టేందుకు రెడీగా ఉన్నారు. (ఇది చదవండి: టైగర్-3 ట్రైలర్.. ఆ ఒక్క ఫైట్ సీన్‌కు అన్ని రోజులు పట్టిందా?) శివాజీ చేతికి గాయం అయితే గతంలో శివాజీ చేతికి గాయం కావడంతో చికిత్స అందించారు. కొన్ని రోజుల చికిత్స తర్వాత మళ్లీ హౌస్‌లో అడుగుపెట్టారు. అయితే ఆ సమయంలో శివాజీ మాట్లాడిన ఓ వీడియోను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తన అధికారిక ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో శివాజీ మాట్లాడుతూ ఫుల్ ఎమోషనలయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో శివాజీ మాట్లాడుతూ.. 'ఎవరు లేకపోతే నేనే ఏడుస్తున్నా. ఎవరైనా ఉంటే నవ్వుతూ లోపల ఏడుస్తున్నా. వాళ్లందరి ముందు నేను ఏడవలేకపోతున్నా. ఎందుకంటే అది నాకు చాలా బరువుగా ఉంది.' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఇదంతా చూసిన నెటిజన్స్ కొందరు ఆయనకు మద్దతుగా కామెంట్స్ పెడితే.. మరికొందరేమో చాలా దారుణంగా ట్రోల్ చేశారు. ఓ నెటిజన్ రాస్తూ.. శివాజీ పెద్ద కన్నింగ్ ఫెలో అంటూ పోస్ట్ చేశారు. నిజంగానే శివాజీ అన్న పెద్ద యాక్టర్ అంటూ కామెంట్ చేశాడు. బయట జరుగుతున్నవి తెలిస్తే శివాజీ అన్న ఏమైపోతాడో అని మరో నెటిజన్ రాసుకొచ్చారు. సింపథీ స్టార్, కన్నింగ్ ఫెలో అని ఒకరంటే.. చాలు చాలు.. ఇక ఓవరాక్షన్ ఆపు అంటూ చాలా దారుణంగా ట్రోల్స్ చేశారు. కాగా.. ఈ వారంలో హౌస్‌లో నామినేట్ అయినవారిలో శివాజీ కూడా ఉన్నారు. అయితే తక్కువ ఓట్లు వచ్చిన శోభాశెట్టి, సందీప్ చివరి రెండుస్థానాల్లో నిలిచారు. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాల్సిందే. (ఇది చదవండి: ప్రశాంత్, శివాజీ ముందే ప్లాన్.. సంచలన వ్యాఖ్యలు చేసిన నటరాజ్) View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel) -
బిగ్ బాస్ బ్యూటీపై నెటిజన్స్ దారుణ కామెంట్స్.. అడల్ట్ స్టార్ అంటూ!
బాలీవుడ్ భామ, బిగ్ బాస్ కంటెస్టెంట్ బీటౌన్‌తో పాటు టాలీవుడ్‌కు సుపరిచితమే. చీకటి గదిలో చితక్కోట్టుడు అనే టాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కాంచన-3 చిత్రం ద్వారా కోలీవుడ్‌లోనూ ప్రవేశించింది. ఆ తర్వాత టాలీవుడ్లో తిప్పరా మీసం, అంటే సుందరానికి అనే చిత్రాల్లో కనిపించింది. హిందీ బాగ్‌బాస్-14 సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. కొన్నిసార్లు ఏకంగా మరింత హాట్ వీడియోస్‌తో రచ్చ చేస్తూ ఉంటోంది బాలీవుడ్ భామ. (ఇది చదవండి: స్టార్ హీరో ఉపేంద్రకు తాత్కాలిక ఊరట! ) తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఆమెపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా పోర్న్ స్టార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తనపై ట్రోల్స్‌పై స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నిక్కీ సోషల్ మీడియాలో ట్రోల్స్ తనకేమీ కొత్త కాదని చెబుతోంది భామ. సోషల్ మీడియాలో తనపై వస్తున్న కామెంట్లను ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. నిక్కీ తంబోలి మాట్లాడుతూ.. 'మీరు నన్ను ఏలాగైనా పిలవండి. కానీ అవీ ఏ విధంగానూ నా స్థిరత్వ భావనను దెబ్బ తీయలేవు. సోషల్ మీడియాలో ట్రోల్ కోసమే సమయాన్ని వెచ్చించడమే పనిగా పెట్టుకున్న వ్యక్తుల ధ్రువీకరణ కోసం నేను ఇక్కడికి రాలేదు. నాతో పాటు మరెవరినైనా అడల్ట్ ఫిల్మ్ స్టార్‌తో పోల్చడమంటే మహిళలను అవమానించడమే కదా. కారణం లేకుండా మరో స్త్రీని కించపరచడం ఎందుకు? ఇలాంటి చిత్రాలను కేవలం కామం కళ్లతో ఆస్వాదించే భయంకరమైన వ్యక్తులంతా మీరే కదా? అడల్ట్ ఫిల్మ్ స్టార్ అయినప్పటికీ మానవతా విషయానికొస్తే గౌరవానికి అర్హులే కదా. మనం ఎంత స్పందిస్తే..మనపై ఇంకా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారు. అందుకే వాటిని పట్టించుకోను. ఏదో ఒకరోజు వారే విసుగు చెంది కామెంట్స్ చేయడం మానేస్తారు. అంతే తప్ప అవీ నా జీవితాన్ని ఎలాంటి ప్రభావితం చేయలేవు.' అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్నప్పుడు కూడా ట్రోలింగ్‌కు గురయ్యారు. కాగా.. నిక్కీ తంబోలి బిగ్ బాస్‌తో పాటు.. ఖత్రోన్ కే ఖిలాడి -11 సీజన్లో పాల్గొంది. అంతే కాకుండా అనేక మ్యూజిక్ వీడియోలు చేసింది. (ఇది చదవండి: 'లాక్ డౌన్ నైట్స్'.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్! ) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) -
బేబీబంప్‌తో నటి పోజులు.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్!
బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ ఈ ఏడాది ప్రారంభంలో సమాజ్‌వాది పార్టీ నేత ఫహద్ అహ్మద్‌ను సీక్రెట్‌గా పెళ్లాడిన సంగతి తెలిసిందే. మొదట రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట ఆ తర్వాత బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. ఇటీవలే స్వర భాస్కర్ ట్విటర్ వేదికగా ప్రెగ్నెన్సీని వెల్లడించింది. తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. (ఇది చదవండి: మద్యానికి బానసయ్యా.. తాగుబోతు అని తిట్టేవారు: నటి) అయితే తాజాగా స్వర భాస్కర్ ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. బేబీబంప్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది. గర్భం ధరించాక తొలిసారిగా బయట కనిపించింది. తన భర్తకు వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన నటి.. బేబీ బంప్‌తో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే కొందరు నెటిజన్స్ మాత్రం ఆమెపై దారుణమైన ట్రోల్స్ చేశారు. స్వర భాస్కర్ పెళ్లికి ముందే గర్భవతి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ రాస్తూ..' ఇంత తొందరగానా' అంటూ రాశాడు. మరో నెటిజన్ రాస్తూ..'పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ?' అంటూ కామెంట్ చేశాడు. మరొకరు రాస్తూ పెళ్లి సమయంలోనే ఆమె గర్భవతి అంటూ ట్రోల్ చేశాడు. ఇంతకుముందే ఆమెను టార్గెట్ చేస్తూ చాలాసార్లు దారుణంగా ట్రోల్స్ చేశారు. కాగా..స్వర భాస్కర్ చివరిసారిగా బడ్డీ కామెడీ చిత్రం జహాన్ చార్ యార్ (2022)లో కనిపించారు. ఆమె 2009లో డ్రామా 'మధోలాల్ కీప్ వాకింగ్'లో సహాయ పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె 'తను వెడ్స్ మను', 'రాంఝనా', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో', 'నిల్ బట్టే సన్నత', 'అనార్కలి ఆఫ్ ఆరా', 'వీరే ది వెడ్డింగ్', 'షీర్ ఖోర్మా' చిత్రాల్లో నటించింది. (ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ ప్రభంజనం.. కలెక్షన్స్ ఎంతంటే?) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఐఐటీయన్‌గా హీరోయిన్.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్!
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా బీ టౌన్‌తో పాటు టాలీవుడ్‌కు కూడా సుపరిచితమే. మెగాస్టార్ మూవీ వాల్తేరు వీరయ్యలో స్పెషల్ సాంగ్‌లో అదరగొట్టింది. వేర్ ఈజ్ ది పార్టీ టాలీవుడ్ సినీ ప్రేక్షకులను అలరించింది. ఇటీవలే విడుదలైన అఖిల్ మూవీ ఏజెంట్‌లోనూ స్పెషల్ సాంగ్ వైల్ట్ సాలా అంటూ అభిమానులను ఊర్రూతలుగించింది. అయితే గతంలో టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్‌తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఘనంగా బుల్లితెర నటి సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!) సినీ తారలపై ట్రోల్స్ ఏ స్థాయిలో ఉంటాయో మనందరికీ తెలిసిందే. తాజాగా ఊర్వశి రౌతేలా మరోసారి ట్రోల్స్‌కు గురైంది. ఎందుకంటే తన సోషల్ మీడియా ఖాతాలో ఐఐటీయన్ అని పేర్కొనడంపై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఆమెకు కొత్త కారు, కొత్త ఇల్లు ఉండొచ్చు.. కానీ ఆమె ఐఐటీయన్ అని చెప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇదంతా ఆమె గతంలో తన ఇన్స్టాగ్రామ్ ఖాతా బయోలో ఐఐటీయన్‌గా పేర్కొంది. ఇది చూసిన కొందరేమో ఆమె అప్పట్లో ఐఐటీలో చేరాలనుకున్నది అంటూ పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఐఐటీయన్ అన్న ట్యాగ్‌ను సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించింది. కానీ ఆమె అధికారిక వెబ్సైట్లో మాత్రం ఇప్పటికీ ఐఐటీయన్గానే చూపిస్తోంది. కాగా.. గతంలో ఊర్వశి ఓ ఈవెంట్లో మాట్లాడుతూ తాను సైన్స్ గ్రాడ్యుయేట్ అని తెలిపింది. అంతే కాకుండా ఐఐటీ ఎంట్రన్స్‌ను క్లియర్ చేశానని చెప్పింది. ఆ తర్వాత తాను ఐఏఎస్ కోసం కూడా సిద్ధమైనట్లు వివరించింది. చివరికీ ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలనుకుంది.. కానీ ఆమె మోడలింగ్ వైపు అడుగులు వేసింది. మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొంది. ఆ తర్వాత సన్నీ డియోల్, అమృతా రావుతో కలిసి సింగ్ సాబ్ ది గ్రేట్‌తో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. (ఇది చదవండి: సుశాంత్ ఆత్మహత్యపై కంగనా సంచలన ఆరోపణలు..!) -
ప్రముఖ నటుడి కుమార్తెపై ట్రోలింగ్.. గట్టిగానే ఇచ్చి పడేసింది!
సోషల్ మీడియా వచ్చాక నెటిజన్స్ కామెంట్లకు అడ్డులేకుండా పోయింది. ముఖ్యంగా సినీ కారలు, వారి కుటుంబసభ్యులు తరచూగా కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అయితే ఓ తాజాగా ఓ ప్రముఖ నటుడి కుమార్తె ట్రోలింగ్ గురయ్యారు. ఆమెను బాడీ షేమింగ్ చేస్తూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అసలేం జరిగిందంటే.. మలయాళ నటుడు సురేశ్ గోపీ కుమార్తె భాగ్య ఇటీవలే కెనడాలోని ఓ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె పట్టా అందుకున్న ఫోటోలను తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ఆమె ఈ ఫోటోల్లో సంప్రదాయ దుస్తులైన చీరలో కనిపించింది. (ఇది చదవండి: ఎన్టీఆర్ కోసం ఎవరూ ఊహించని హీరోయిన్!) అయితే ఇది చూసిన ఓ నెటిజన్.. 'కంగ్రాట్స్.. మీరు చీరలు పక్కనపెట్టి వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకోండి. ఎందుకంటే లావుగా ఉన్న వాళ్లకు శారీ సెట్ కాదు. ఫ్యాషన్ దుస్తుల్లోనే మీరు చాలా స్మార్ట్‌గా ఉంటారు.' అంటూ కామెంట్ చేశాడు. ముందు నీ పని చూసుకో అయితే ఇది చూసిన భాగ్య అతనికి కాస్తా గట్టిగానే రిప్లై ఇచ్చింది. మీరిచ్చిన ఉచిత సలహాకు థ్యాంక్స్.. నా బరువుతో మీకేం పనిలేదు. మీరు అనవసరంగా ఆందోళన పడొద్దు. నాకు నచ్చిన దుస్తులు వేసుకుంటా. పట్టా అందుకున్నప్పుడు సంప్రదాయ దుస్తులే ధరించా. అందరిలాగా పాశ్చాత్య సంస్కృతిని ఫాలో అయ్యే వ్యక్తిని కాదు. నా గురించి కామెంట్ చేయడం మాని.. ముందు మీ పనిపై దృష్టి పెట్టండి.' ఘాటూగానే బదులిచ్చింది. కాగా.. మలయాళ నటుడు సురేశ్ గోపీ తెలుగువారికి సుపరిచితులే. ఆయన పోలీస్ పాత్రలో నటించిన పలు మలయాళీ చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న కస్టడీ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?) View this post on Instagram A post shared by Bhagya (@bhagya_suresh) -
రెండో పెళ్లిపై దారుణ ట్రోల్స్.. స్పందించిన ఆశిష్ విద్యార్థి
మహేశ్ బాబు పోకిరీ చిత్రంతో ఫేమ్ తెచ్చుకున్న ఆశిష్ విద్యార్థి టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే రెండో పెళ్లి చేసుకుని ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అస్సాం రాష్ట్రానికి వ్యాపారవేత్త రూపాలీ బరువాను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇప్పటికే మొదటి భార్య పిలూ విద్యార్థితో విడాకులు తీసుకున్నారు. (ఇది చదవండి: భోళా శంకర్: మెగాస్టార్, నందమూరి ఫ్యాన్స్ కోసం భలే స్కెచ్!) అయితే 57 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడంతో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆశిష్ విద్యార్థి తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందించారు. రెండో పెళ్లి చేసుకున్నాక తనను కించపరిచేలా ట్రోల్స్ చేశారని అన్నారు. చాలా దారుణమైన పదాలు ఉపయోగించారని ఆయన అన్నారు. ఇది తన వ్యక్తిగత విషయమని.. ఇలాంటి విషయాల్లో మద్దతుగా నిలవాలని సూచించారు. ఆశిష్ విద్యార్థి మాట్లాడుతూ.. 'తనపై బుడా(ముసలి), ఖుసత్ (సభ్యత , సంస్కారం లేని) లాంటి అవమానకరమైన పదాలతో ఉపయోగించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే మనలో ప్రతి ఒక్కరూ వయసులో పెద్దవాళ్లమనే భయాన్ని మనలోనే ఉంచుకుంటాం. అదే విషయాన్ని ఇతరులకు కూడా చెబుతున్నాం. కానీ ప్రస్తుతం జనరేషన్ మారింది. వయసు మీద పడినంత మాత్రాన ఎలాంటి పనులు చేయకూడదని మనకు మనమే చెప్పుకుంటున్నాం కదా. కానీ మన జీవితాన్ని సంతోషంగా ముగించాలకున్నప్పుడు.. ఎవరైనా సరే తోడు కావాలని ఎందుకు కోరుకోకూడదు?' అని అన్నారు. (ఇది చదవండి: నాలుగున్నరేళ్లుగా నటుడితో సహజీవనం.. మీరిక పెళ్లి చేసుకోరా?) తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని.. ప్రతి విషయాన్ని చట్టబద్ధంగా వ్యవహరిస్తానని తెలిపారు. పన్నులు చెల్లిస్తున్నానని, కష్టపడి పనిచేస్తున్నానని అన్నారు. కుటుంబాన్ని కలిగి ఉండాలనే ఆసక్తితోనే చట్టబద్ధంగా వివాహం చేసుకున్నట్లు వివరించారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. ప్రజలు ఒకరిని నిందించకుండా.చ. ఒకరికొకరు మద్దతుగా ఉండాలని ఆశిష్ అన్నారు. -
కేన్స్ ఫెస్టివల్లో ఐశ్వర్య రాయ్, ఊర్వశి.. నెటిజన్స్ ట్రోల్స్!
బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ఆమె ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసింది. ఈ వేడుకల్లో సినీతారలు ప్రత్యేక దుస్తుల్లో తళుక్కున్న మెరిశారు. ఐశ్వర్యారాయ్‌తో పాటు మరో నటి ఊర్వశి రౌతేలా సైతం రెడ్ కార్పెట్‌లో డిఫరెంట్ లుక్‌లో కనిపించింది. అయితే ఈ వేడుకల్లో ఐశ్వర్య రాయ్ ధరించిన డ్రెస్‌పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ.. సోషల్ మీడియాలో వైరల్) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా ఈ మాజీ ప్రపంచ సుందరి వెండి గౌన్‌లో తళుక్కున మెరిసింది. ఆమె ధరించిన ఈ వెండి డ్రెస్‌పై కొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మీరు డిజైనర్‌ను మార్చండి అంటూ కొందరు కామెంట్స్ చేయగా.. వెండి హుడీ ఏంటి విడ్డూరంగా అంటూ మరొకరు అభిప్రాయపడ్డారు. అయితే మరికొందరు మాత్రం ఫ్యాషన్‌ను మరోస్థాయికి తీసుకెళ్లారంటూ ఐశ్వర్యారాయ్‌ను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ ఫొటోలు వైరలవుతున్నాయి. (ఇది చదవండి: బాలీవుడ్ హీరో ఇంట్లో తీవ్ర విషాదం..!) ఇక మరోవైపు నిన్న ఊర్వశి రౌతేలా ధరించిన నెక్లెస్‌పై కూడా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పింక్ కలర్ డ్రెస్‌లో బార్బీ బొమ్మలా వచ్చిన ఊర్వశి.. మెడలో మాత్రం మొసలి డిజైన్‌తో తయారు చేసిన నెక్లెస్‌ను ధరించింది. చెవి రింగులు కూడా అలాంటివే పెట్టుకోవడంతో నెటిజన్లు ట్రోల్ చేశారు. ‘ఆ నెక్లెస్ కిందపడితే నిజంగా మొసలి అనుకొని భయపడతారేమో జాగ్రత్త అని కామెంట్స్ చేశారు. బ్లూ కలర్ లిప్‌స్టిక్ వేసుకున్న ఊర్వశి వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
అద్దంలో చూసుకోకుండానే బయటకొచ్చారా?.. నటిపై నెటిజన్స్ ఫైర్!
ఈషా గుప్తా బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈషా 2007లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించింది. 2012లో క్రైమ్ థ్రిల్లర్ జన్నత్- 2లో ఆమె తొలిసారి నటించింది. ఆ చిత్రానికి ఉత్తమ డెబ్యూ ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ అయింది. ఆ తర్వాత చక్రవ్యూహ్, హంషాకల్స్, రాజ్ 3D, క్రైమ్ డ్రామా రుస్తోమ్, బాద్షాహో లాంటి సినిమాల్లో కనిపించింది. అయితే ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటున్న ఇషా తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో మరీ బోల్డ్ పిక్స్ షేర్ చేస్తూ అలరిస్తుంటారు. (ఇది చదవండి: విజయ్ దేవరకొండ, అఖిల్ కెరీర్‌ని దెబ్బ తీసిన ‘బామ్మర్ది’!) తాజాగా ముంబయిలో అడుగుపెట్టిన భామకు ఫోటోలకు ఫోజులిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్స్ దారుణ కామెంట్స్ చేశారు. ఆమె టాప్‌లెస్ డ్రెస్ ధరించగా.. మీరు మరింత బోల్డ్‌గా కనిపిస్తున్నారంటూ పోస్టులు పెట్టారు. 'ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓ సారి అద్దంలో చూసుకోలేదా' అని కొందరు నెటిజన్స్ ప్రశ్నించారు. మరికొందరైతే అలా బయటకు రావడానికి మీకు సిగ్గులేదా అని నిలదీశారు. మరొకరు రాస్తూ 'ఫ్యాషన్ పేరుతో ఉర్ఫీ జావెద్‌ను మీరు మించిపోయారు' అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: జియా డిప్రెషన్లో ఉందని ఆమె తల్లికి చెప్తే పట్టించుకోలేదు: నటుడు) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
నా కూతురిపై దారుణమైన కామెంట్స్ చేశారు: స్టార్ నటుడు
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి గురించి బీటౌన్‌లో పరిచయం అక్కర్లేదు. 1992 నుంచి సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సునీల్ శెట్టి ప్రస్తుతం అక్షయ్ కుమార్, పరేష్ రావల్‌తో కలిసి హేరా ఫేరి- 3లో నటిస్తున్నారు. తాజాగా ది రణవీర్ షోకు హాజరైన ఆయన సోషల్ మీడియాపై సంచలన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాతో సెలబ్రిటీల జీవితాలు నాశనం అవుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంటర్నెట్లో కొంతమంది తన కుటుంబం గురించి చేసిన కామెంట్స్ చూసి చాలా బాధపడ్డానని తెలిపారు. నటీనటులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ విపరీతంగా పెరిగిపోయాయని సునీల్ శెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా సెలబ్రిటీల జీవితాన్ని నాశనం చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కాలంలో వ్యక్తిగత గోప్యత లేదని ఆయన అన్నారు. సెలబ్రిటీల జీవితాలను నాశనం చేస్తున్న సోషల్ మీడియాలో ఉండటం అసాధ్యమని సునీల్ శెట్టి వెల్లడించారు. సునీల్ శెట్టి మాట్లాడుతూ..' నాకు సోషల్ మీడియా అంటే భయం. అందుకే మాట్లాడటానికి భయపడుతున్నా. సోషల్ మీడియాలో నా కుమార్తె, తల్లిపై అసభ్యంగా కామెంట్స్ చేశారు. అలాంటి ట్రోల్స్‌తో చాలా బాధపడ్డా. ఇలాంటి చర్యలు దేనికి దారితీస్తాయో కూడా వారికి తెలియదు. తెర వెనుక ఉన్న వ్యక్తులు నా కుటుంబం గురించి అసభ్యంగా మాట్లాడటం బాధ కలిగించింది. ఇలాంటి వాటిపై తాను నిశ్శబ్దంగా ఉండనని' అని తేల్చి చెప్పారు. కాగా.. సునీల్ శెట్టి గారాల కూతురు అతియా శెట్టికి క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో ఈ ఏడాది వివాహామైన సంగతి తెలిసిందే. సునీల్ శెట్టి చివరిసారిగా అమెజాన్ మిని టీవీ కొత్త వెబ్ సిరీస్ హంటర్లో కనిపించాడు. ధారవి బ్యాంక్‌తో తర్వాత రెండోసారి వెబ్ సిరీస్‌లో నటించారు. -
ఇప్పుడు డిలీట్ చేసి ఏం లాభం..ఆల్రెడీ డౌన్లోడ్ చేశాం.. బిగ్‌బాస్ నటికి షాక్!
బుల్లితెర నటి ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి పనిలేదు. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక బిగ్‌బాస్ సీజన్-5లో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్‌లో 13 వారాలు ఉండి మెప్పించింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌లో టాప్-7లో నిలిచింది. ఈ షోతో తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు అభిమానులు విపరీతంగా పెరిగిపోయారు. ప్రియాంకా సింగ్ జబర్దస్త్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించింది. కామెడీ షోలో లేడీ గెటప్స్‌తో ప్రేక్షకులను అలరించింది. కొన్నాళ్లకు బిగ్ బాస్ ద్వారా ఆమెకు ఒక మంచి అవకాశం దొరికింది. ఆ షో తర్వాత కచ్చితంగా అవకాశాలు వస్తాయని భావించింది. కానీ అలా జరగలేదు. ప్రస్తుతం పింకీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫొటోలు, రీల్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే తాజాగా పింకీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ప్రియాంక షేర్ చేసిన ఫోటోలు మరీ బోల్డ్‌గా ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వాటిలో ఒక ఫోటోను వెంటనే డిలీట్ చేసిందామె. అయినప్పటికీ ఆమె ఫోటోను డౌన్లోడ్ చేశామంటూ ప్రియాంక సింగ్‌కు షాకిచ్చారు నెటిజన్స్. పోస్ట్ చేసేముందుకు కాస్తా ఆలోచించాల్సింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు డిలీట్ చేసి ఏ లాభం.. మేము ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నాం.' అంటూ పోస్ట్ చేస్తున్నారు. ప్రియాంక తన్ ఇన్‌స్టాలో రాస్తూ..'నేను యాటిట్యూడ్‌తో పుట్టలేదు.. కానీ నా జీవితంలో ఎదగడానికి మంచి దృక్పథం ఉంది. కొన్నిసార్లు నా కళ్లు కూడా అలా మాట్లాడతాయి. ఇది నా జీవిత గమనాన్ని చెబుతుంది.' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ ఆమెపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఇంత దారుణమైన ఫోటోలు పెట్టాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాటితో నీకిచ్చే విలువ కూడా తగ్గిపోయిందంటూ ఫైర్ అవుతున్నారు. అయితే మరి కొందరేమో ప్రియాంక సింగ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) -
డ్రెస్‌తో జాన్వీ కపూర్ తిప్పలు.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్!
బాలీవుడ్ భామ జాన్వీకపూర్ పెద్దగా పరిచయం అక్కర్లేదు. శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. బాలీవుడ్లో సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది. 2018లో దఢక్ సినిమా ద్వారా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. గతేడాది మిలి చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమైంది జాన్వీ కపూర్. తాజాగా ముంబయిలో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో మెరిసింది భామ. జాన్వీ స్టైలిష్ లుక్‌తో అదరగొట్టింది. ఈ ఫంక్షన్లో వెరైటీ డ్రెస్‌లో కనిపిస్తూ సందడి చేసింది. అయితే ఆ డ్రెస్సులో వేదికపై నడిచేందుకు చాలా ఇబ్బంది పడింది. జాన్వీ పసుపు రంగు కటౌట్ గౌను ధరించిన వేదికపై ఫోటోలకు ఫోజులివ్వగా.. ఆ దుస్తుల్లో చాలా అసౌకర్యంగా కనిపించింది. దీంతో నెటిజన్స్ జాన్వీ కపూర్ డ్రెస్‌పై దారుణంగా ట్రోల్స్ చేశారు. మీరు ఎందుకు వెస్టర్న్ కల్చర్‌ను కాపీ కొడుతున్నారు అని ప్రశ్నించారు. మరొ నెటిజన్ కామెంట్ చేస్తూ.. మీరంతా ఉర్ఫీ జావెద్‌ను అంటారు.. మళ్లీ బాలీవుడ్ మొత్తం ఆమెనే ఫాలో అవుతారు అంటూ కామెంట్ చేశారు. జాన్వీ డ్రెస్ టెంట్ వేసుకునే పరదాలా ఉందని ఫన్నీ కామెంట్ చేశాడు. (ఇది చదవండి: పండంటి పాపకు జన్మనిచ్చిన 'చిన్నారి పెళ్లికూతురు' నటి) కాగా.. జాన్వీ తదుపరి చిత్రం వరుణ్ ధావన్‌తో కలిసి బవాల్‌లో కనిపించనుంది. ఇటీవలే పోలాండ్‌లో తమ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ కోసం శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించింది. జాన్వీ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అదిరిపోయే లుక్‌తో కాజోల్.. నెటిజన్స్ దారుణమైన ట్రోల్స్
బాలీవుడ్ నటి కాజోల్ పరిచయం అక్కర్లేని పేరు. తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో మూడు దశాబ్దాలుగా తనదైన నటనతో అలరించింది. ఆమె అందానికి దాసోహం కానివారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. కానీ గత కొన్ని రోజులుగా ఆమెపై కొంతమంది నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. కాజోల్ తాజాగా ముంబయిలో తన భర్త నటించిన చిత్రం 'భోలా' ప్రీమియర్ షోకు హాజరైంది. (ఇది చదవండి: కాజోల్ అందంపై ట్రోలింగ్.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్) ప్రీమియర్ షో చూసేందుకు వచ్చిన కాజోల్ తెల్లటి కోటుతో పాటు డిఫరెంట్ లుక్‌లో కనిపించింది. ఆమె వెంట కొడుకు యుగ్, తల్లి తనూజ, భర్త అజయ్ దేవగన్ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ కాజోల్ డ్రెస్‌పై కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన కొందరైతే కాజోల్ మరింత అందంగా కనిపిస్తోందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. చాలామంది ఆమె లుక్, నడకపై ట్రోల్స్ చేశారు. ఆమె దుస్తులతో పాటు నడక మరింత విచిత్రంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. కొందరు ఫ్యాన్స్ అయితే ఏకంగా కాజోల్ ప్రస్తుతం గర్భవతినా? అంటూ కామెంట్స్ చేశారు. అయితే గతంలోనూ కాజోల్ ముఖానికి సర్జరీ చేయించుకున్నారని ట్రోలింగ్స్ ఎదురయ్యాయి. #Kajol ♥️#jdreturnz pic.twitter.com/2vzI0SzcX8 — JDReturnz (@JdReturnz) March 30, 2023 -
యంగ్ నటిపై దారుణమైన ట్రోల్స్.. చివరికి ఏం చేసిందంటే?
బాలీవుడ్ టెలివిజన్ స్టార్ శ్వేత తివారీ ముద్దుల కూతురు పాలక్ తివారి. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది ముద్దుగుమ్మ. అయితే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఆమె తన ఇన్‌స్టాలో కొన్ని హాట్ ఫోటోలను పంచుకున్నారు. అవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ ఆమెపై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. పాలక్ తివారీ తాజాగా ఇన్‌స్టాలో కాస్తా బోల్డ్ ఫోటోలు షేర్ చేసింది. ఇవీ చూసిన కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. కొందరేమో మీరు చాలా అందంగా ఉన్నారంటూ పోస్ట్ చేయగా.. మరికొందరు మాత్రం చాలా దారుణంగా కామెంట్స్ పెట్టారు. దీంతో నెటిజన్స్ చేసిన పనికి పాలక్ తివారీ కొపమొచ్చింది. వెంటనే కామెంట్స్‌ను ఆఫ్ చేసేసింది. విషయమేమిటంటే పాలక్ తివారీ తాజాగా తన ఇన్‌స్టాలో కొన్ని హాట్ ఫొటోలు పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు వైరలయ్యాయి. వాటిని చూసిన కొందరు యూజర్లు అందంగా ఉన్నావంటూ పొగడగా.. మరికొందరు మాత్రం దారుణంగా నెగెటివ్ కామెంట్స్ పెట్టారు. దీంతో ఆమె కొంతసేపటికే కామెంట్స్‌ను ఆఫ్ చేసింది. ఇక ఈ విషయంపై నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దీనిపై కూడా ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. కాగా.. బిజ్లీ బిజ్లీ మ్యూజిక్ వీడియోతో ఫేమ్ సంపాదించకుంది పాలక్ తివారీ. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ కనిపించనుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్, జగపతిబాబు, పూజా హెగ్డే, షెహ్నాజ్ గిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) -
నాపై దారుణమైన ట్రోల్స్ చేశారు: స్టార్ హీరోయిన్
నటీనటులకు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం సర్వ సాధారణమైపోయింది. ఇటీవల పలువురు స్టార్ హీరోయిన్లపై దారుణమైన ట్రోల్స్ చేయడం మీరు చూసే ఉంటారు. అలాగే తాజాగా తనకు అలాంటి అనుభవాలు ఎదురైనట్లు నటి వెల్లడించింది. ఆమె పేరే రితిక సింగ్. తెలుగు పెద్దగా పరిచయం లేని పేరు. 2017 సంవత్సరంలో వెంకటేశ్ సరసన గురు సినిమాలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది భామ. ఆ తర్వాత నీవెవరో, శివలింగ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన ట్రోల్స్ తనను ఎంతో బాధించాయని తెలిపింది. వాటితో చాలా ఇబ్బందులు ఎదురైనట్లు వాపోయింది నటి. ముంబయిలో జన్మించిన రితిక సింగ్ క్రీడాకారిణి కూడా. ఆమె మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సంపాదించారు. 2009లో భారత్ తరపున ఆసియా గేమ్స్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత 2012 లో ఇరుదు చుట్రు అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ 2016లో మాధవన్‌తో సాల కడూస్ సినిమాకు మంచి పేరు సంపాదించింది. తాజాగా ఆమె నటించిన కార్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై స్పందించింది. నా ఫోటోలు దారుణంగా ఎడిట్ చేశారు రితిక సింగ్ మాట్లాడుతూ..' సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ఎంతగానో బాధించాయి. డబుల్ మీనింగ్ డైలాగ్‌లు నన్ను ఇబ్బంది పెట్టాయి. వాటితో నా గుండె పగిలినంత పనైంది. నాకు కుటుంబం ఉంది. ఇవి చూస్తే వాళ్లు చాలా బాధపడతారు. నేను కోరుకునేది ఒక్కటే ఆడవారిని అందరూ గౌరవించాలి. మిడిల్ క్లాస్ అయినా.. సెలబ్రిటీ అయినా సమానంగా చూడాలి. అమ్మాయిలకు కచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి. స్కూల్స్‌లో వారానికి కనీసం ఒక్కసారైనా సెల్ఫ్ డిఫెన్సివ్ క్లాసులు నిర్వహించాలి. నేను చిన్నప్పుడే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. తర్వాత జనరేషన్ పిల్లలకు చాలా త్వరగా సమాజం పట్ల అవగాహన కల్పించాలి.' అంటూ తన బాధను వెల్లడించింది. -
అనసూయ వాలంటైన్స్ డే స్పెషల్ పోస్ట్.. ఇన్‌స్టాగ్రామ్‌లో వాగ్వాదం!
ప్రేమికుల రోజున నటి అనసూయకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. వాలంటైన్స్ డే సందర్భంగా అనసూయ చేసిన స్పెషల్ పోస్ట్‌పై సోషల్ మీడియాలో రకరకాలు రెస్పాన్స్ వస్తోంది. పలువురు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ప్రేమికుల రోజును పురస్కరించుకుని భర్తతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది అనసూయ. ‘నీతో లైఫ్ చాలా క్రేజీగా ఉంటుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘అదేం లేదు అక్క.. వాడి దగ్గర డబ్బు చాలా ఉంది అందుకే’ అంటూ కామెంట్ చేశాడు. ఇక అతడి కామెంట్‌పై అనసూయ అసహనం వ్యక్తం చేసింది. దీనిపై స్పందిస్తూ సదరు నెటిజన్ను చెప్పుతో కొడతానంటూ చెప్పకనే చెప్పి కౌంటర్ ఇచ్చింది. ‘అదేంట్రా తమ్ముడు అలా అనేశావు. ఎంతుందేంటి డబ్బు? చెప్పు.. నాకు లేదా మనీ మరి? నీకు అన్ని తెలుసు కదా.. అయినా ఆయన డబ్బు, నా డబ్బు అనేది కూడా ఉందా? రేయ్ చెప్పరా బాబూ.. అయినా బావ గారిని వాడు, వీడు అనొచ్చా? ఇదేం పెంపకంరా నీది. చెంపలేసుకో. లేకపోతే నేను వేస్తా చెప్పులతో.. సారి అదే చెంపలేస్తానంటున్నా’ అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఇక అనసూయ రెస్పాన్స్ రికౌంటర్ సదరు నెటిజన్ మరో కామెంట్ చేశాడు. ‘మిమ్మల్ని మీరు సమర్థించుకోకండి. రియాలిటీని అర్థం చేసుకోండి. మీరు ఎన్ని చెప్పినా నిజమ నిజమే’ అని అన్నాడు. దీనిపై కూడా అనసూయ రిప్లై ఇచ్చింది. ‘నీ బొందరా నీ బొంద.. ముందు మాట్లాడటం నేర్చుకో. అంతర్యామిలా అన్నీ తెలిసినట్లు బిల్డప్ ఒకటి. నా రియాలిటీ నీకేం తెలుసురా.. పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. నీ బుద్ధి మనీ ఒకటే కాబట్టి.. అందరిదీ అదే అనిపిస్తుంది. వీలైతే నీ బుద్ధి మార్చుకో.. గెట్ వెల్ సూన్.. తమ్ముడివి కదా మంచి, చెడు చెప్తున్నా.. ఏమనుకోకయ్యా’ అని అంటూ కామెంట్స్ చేసింది. ఒకరి కామెంట్‌పై ఒకరు స్పందిస్తూ వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం అనసూయ ఇన్స్టాగ్రామ్ పోస్ట్, కామెంట్స్ నెట్టింట హాట్‌టాపిక్‌గా నిలిచాయి. కాగా గతంలోనూ ఇలానే అనసూయ నెటిజన్లతో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ట్విటర్లో తనని ట్రోల్ చేసిన వారినిక సమాధానం ఇస్తూ ఇలా రెండు, మూడు రోజుల పాటు అనసూయ గొడవ పడింది. అప్పట్లో ఇది చర్చనీయాంశమైంది. అంతేకాదు దనని ట్రోల్ చేసిన వారిపై అనసూయ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి, స్వయంగా వెల్లడించిన స్వీటీ చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని చెప్పా: జగపతి బాబు షాకింగ్ కామెంట్స్ -
మేము మనుషులమే.. ట్రోల్స్‌పై ‘సీతారామం’ బ్యూటీ ఆవేదన
‘సీతారామం’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈ చిత్రంలో తన నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఆమె తెలుగులో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. అదే క్రేజ్‌తో తాజాగా నాని 30వ చిత్రంలో చాన్స్ కొట్టేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బ్యూటీ తన కామెంట్స్‌తో నెట్టింట ట్రోల్స్‌కు గురైంది. కాబోయే భర్తపై రెండు విధాలుగా స్పందించి నెటిజన్లు నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. చదవండి: ఓటీటీకి వచ్చేస్తోన్న సుడిగాలి సుధీర్ ‘గాలోడు’.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ అసలు ఏం జరిగిందంటే.. గతంలో ఓ ఇంటర్య్వూలో మృణాల్ కాబోయే భర్త ఎలా ఉండాలో చెబుతూ.. మంచివాడు అయితే చాలని, అందం అసలు విషయమే కాదని చెప్పింది. ఇక రీసెంట్గా ప్రముఖ కామెడీ షో కపిల్ శర్మ టాక్ షోలో పాల్గొన్న ఆమెకు మరోసారి కాబోయే భర్తపై ప్రశ్న ఎదురైంది. ఇక దీనికి స్పందిస్తూ.. తనకు కాబోయే భర్త అందగాడై ఉండాలని సమాధానం ఇచ్చింది. దీంతో ఒకే ప్రశ్నకు రెండు విధాలుగా స్పందించిన ఆము కామెంట్స్‌ని జత చేస్తూ ఓ నెటిజన్ కపటత్వానికి మారు పేరు మృణాల్ అంటూ పోస్ట్ చేశాడు. దీనిపై మృణాల్ అసహనం వ్యక్తం చేసింది. చదవండి: ఆమిర్ ఖాన్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన! ఆయనకు ఏమైంది? అతడు చేసిన కామెంట్స్‌పై స్పందిస్తూ.. ‘నాకు కాబోయే భర్త ఎలా ఉండాలనే విషయంలో ప్రస్తుతం, గతంలో నాకు ఉన్న అభిప్రాయాన్ని నేను ధైర్యంగా చెప్పగలిగాను’’ అని బదులిచ్చింది. దీంతో ఆమె రిప్లైపై కొందరు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఇక ఆ కామెంట్స్‌కి విసుగిపోయిన మృణాల్.. ‘సెలబ్రెటీలు కూడా మనుషులే అన్న విషయాన్ని వీరు మర్చిపోతున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆమెకు పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. ‘ఇలాంటి వాటికి స్పందించకండి.. మీరు అమేజింగ్ పర్సన్’ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. -
ఆ కామెంట్ నన్ను తీవ్రంగా బాధిస్తోంది: జాన్వీ కపూర్ ఆవేదన
అతిలోకి సుందరి, దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. స్టార్ కిడ్ అయినప్పుటికీ తరచూ విమర్శలు, ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నా జాన్వీ తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో జాన్వీ మాట్లాడుతూ.. తనపై వచ్చే ట్రోల్స్ చూసి విసిగిపోయానంది. ఎంత కష్టపడినా అందులో తప్పులు వెతుకుతూ విమర్శిస్తూనే ఉంటారని వాపోయింది. ‘మనం ఏం చేసిన, ఎంత కష్టపడినా కొందరు అందులో తప్పులు వెతుకుతూ ఉంటారు. ఎప్పుడు సూటిపోటి మాటలతో బాధపెడుతుంటారు. చదవండి: సరిగమప విన్నర్ యశస్వి కొండెపూడి మోసం.. స్పందించిన స్వచ్చంద సంస్థ మనల్ని ఎంతగా ట్రోల్ చేస్తే వారికి అంత సంతోషం. విమర్శించడంలో వారు ఆనందం పొందుతారు. దాంతో వారు మనపై చేసే కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తారు. ఇది నిరంతరం కొనసాగతూనే ఉంటుంది. కానీ ఇలాంటి వార్తలు చదివి, చదివి కొంతకాలానికి ప్రజలు విసిగిపోతారు. దురదృష్టం ఏంటంటే మనపై వచ్చే ట్రోల్స్ కూడా ప్రజలను విసిగిపోయేలా చేస్తాయి’ అంటూ జాన్వీ చెప్పుకొచ్చింది. అయితే ‘నేను సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాను. నెపోకిడ్ అంటూ కొందరు నన్ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. చదవండి: హైటెక్ సిటీ ఆఫీసులో మహేశ్ బాబు .. వీడియో వైరల్ నా సినిమా రిలీజైనప్పుడల్లా ‘నెపోకిడ్.. నటన రానప్పుడు ఎందుకు సినిమాలు చేస్తున్నావు?’ అని కామెంట్స్ చేస్తున్నారు. వాటిని చూసి నేనెంతో బాధపడ్డా. అయితే, ఇప్పుడు సోషల్‌మీడియాలో వచ్చే ట్రోల్స్ చూసి నవ్వుకుంటున్నా. నా బలాలు, బలహీనతలు, నేను ఎలా నటిస్తున్నానో నాకు తెలుసు. కాబట్టి, వాళ్ల వ్యాఖ్యలు పట్టించుకోకూడదని అర్థమైంది. అలాగే ఇటీవల నేను చేసిన చిత్రాలతో నటిగా నన్ను నేను నిరుపించుకున్నాను అనుకుంటున్నా. నాకు కూడా అవకాశాలు వస్తాయని అనిపిస్తొంది’ అని పేర్కొంది. -
కోటి రూపాయల పోర్షే లగ్జరీ స్పోర్ట్స్ కారు రూ. 14 లక్షలకే! కంపెనీ పరుగులు
న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్‌మేకర్ పోర్షే భలే చిక్కుల్లో పడింది. కంపెనీ అతిపెద్ద మార్కెట్ చైనాలో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అదేంటంటే అక్కడి చైనా డీలర్ ఒకరు 148,000 డాలర్ల(రూ. 1.21 కోట్లు) విలువ చేసే స్పోర్ట్స్ కారును కేవలం 18 వేల డాలర్లు (రూ. 14 లక్షల కంటే కొంచెం ఎక్కువ) అంటూ తప్పుగా లిస్ట్ చేశారు. వాస్తవ ధరలో ఎనిమిదో వంతు తగ్గేసరికి లగ్జరీ కార్ లవర్స్ ముందస్తు బుకింగ్‌కు ఎగబడ్డారు. చివరికి విషయం తెలిసి ..ఇదెక్కడి చోద్యం రా మామా అంటూ ఉసూరుమన్నారట.! బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం ప్రముఖ 2023 పనామెరా మోడల్ విక్రయంలో ఉత్తర చైనా పట్టణంలోని యిన్చువాన్లోని పోర్షే డీలర్ ఇచ్చిన ఆన్లైన్ ప్రకటన కంపెనీని పరుగులు పెట్టించింది. అతి తక్కువ ధరకే తమ ఫ్యావరెట్ కారు అనేసరికి ఊరుకుంటారా? వందలాది మంది ఔత్సాహిక కొనుగోలుదారులు 911 యువాన్లను ముందుగానే చెల్లింపుతో కారును బుక్ చేసేశారు. ఈ బుకింగ్‌లు చూసి ఆశర్చర్యపోయిన కంపెనీ ఏం జరిగిందా? అని ఆరా తీస్తే అసలు విషయం బైటపడింది. దీంతో "లిస్టెడ్ రిటైల్ ధరలో తీవ్రమైన పొరపాటు జరిగింది" అని పోర్షే ప్రకటించాల్సి వచ్చింది. బుకింగ్‌లు చేసి, అడ్వాన్స్‌ను చెల్లించిన మిగతా వారందరికీ కంపెనీ క్షమాపణలు చెప్పింది. 48 గంటల్లోగా రీఫండ్ ఇస్తామని పేర్కొంది. దీంతో భంగపడిన కస్టమర్లు, ఇతర వినియోగదారులు చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీబోలో పోర్షేను విపరీతంగా ట్రోల్ చేశారు. కాగా పోర్షే 2022 మొదటి అర్ధ భాగంలోనే చైనాలో 6.2 బిలియన్ డార్లు విలువైన సేల్స్ సాధించింది. 46,664 వాహనాలను విక్రయించింది. ప్రీమియం కార్ బ్రాండ్ పోర్షే ప్రపంచ విక్రయాలలో 30 శాతమట. -
ట్రోల్స్‌పై స్పందించిన గోపీచంద్ మలినేని
తనపై వస్తున్న ట్రోల్స్‌పై డైరెక్టర్ మలినేని గోపిచంద్ స్పందించారు. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి. నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. అయితే ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో గోపిచంద్ మలినేని స్టేజ్ మాట్లాడుతూ శృతి హాసన్‌కు ఐ లవ్ యూ అని చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ రూమర్స్: బన్నీపై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు! ఆ తర్వాత స్టేజ్‌పై మాట్లాడిన శృతి తెలుగు ఇండస్ట్రీలో తనకు ఓ అన్నయ్య ఉన్నారంటూ గోపీచంద్ గురించి చెప్పింది. వీర సింహారెడ్డి సక్సెస్ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు గోపిచంద్ మలినేని. ఈ సందర్భంగా శృతి హాసన్‌కు ఐ లవ్ యూ చెప్పడం, ఆ తర్వాత ట్రోల్స్ రావడంపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. ‘శృతితో నాకు ఇది మూడో సినిమా. బలుపు, క్రాక్ తర్వాత వీరసింహారెడ్డి చేశాను. నాకు చాలా ఇష్టమైన హీరోయిన్ ఆమె. తను నాకు ఓ ఫ్యామిలీలో ఒక మనిషి లాగా. బ్రదర్ – సిస్టర్ లాంటి బాండింగ్ మాది. చదవండి: రెండు రోజుల్లో మనోజ్ నుంచి స్పెషల్ న్యూస్, ఆసక్తి పెంచుతున్న ట్వీట్! నా వైఫ్‌తో కూడా తను చాలా క్లోజ్. నా కొడుకు సాత్విక్ అంటే శృతికి చాలా ఇష్టం. వాడికి తరచూ చాక్లెట్స్, గిప్ట్స్ తీసుకువస్తుంది. అందుకే ఆమె స్టేజ్‌పై నాకు అన్నయ్య అని చెప్పంది. ఆ తర్వాత నేను మాట్లడినప్పుడు తను చెప్పిన దానికి నా కన్సన్ చూపించాను. ఈ నేపథ్యంలో ఐ లవ్ యూ అని చెప్పాను. కానీ దాన్ని సోషల్ మీడియాలో అబ్బాయి-అమ్మాయి లవ్‌గా మార్చి వైరల్ చేశారు. అవన్నీ చూసి బాగా నవ్వుకున్నాను’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గోపీచంద్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
నన్ను ఇండస్ట్రీ నుంచి పంపించేయాలనే ఇలా చేస్తున్నారు: కిరణ్ అబ్బవరం
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ‘రాజావారు రాణిగారు, ఎస్.ఆర్ కల్యాణమండపం, నేను మీకు బాగా కావాల్సినవాడిని’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. నటుడుగానే కాదు రైటర్‌గా కూడా మెప్పిస్తున్నాడు. తన రెండవ చిత్రం ఎస్ఆర్ కల్యాణమండపంకి తానే కథని అందించాడు. ఇక ఈ సినిమా యూత్‌లో సంపాదించుకుంది. ఇప్పుడు తాజాగా వినరో భాగ్యము విష్ణుకథ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చదవండి: హైవోల్టేజ్ యాక్షన్స్‌తో‘ పఠాన్’.. ట్రైలర్ అదిరిపోయింది! ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఆయనకు నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్‌పై ప్రశ్న ఎదురైంది. తనని కావాలనే టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఇంకా స్టార్ హీరోని కాలేదు. ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నా. ఈ నెగిటివిటీని ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. నేను స్పందించకపోవడం వల్లే ఇలా జరుగుతుంది’ అన్నాడు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఇదంత కావాలనే చేస్తున్నారు. నన్ను ఇండస్ట్రీ నుంచి పంపించేద్దాం అనుకుంటున్నారామో. ఒక సినిమాలో నేను వేసుకోకపోయినా పవర్ స్టార్ అనే ట్యాగ్ ఎడిట్ చేసి మిమర్స్ వేశారు. చదవండి: విడుదల ఇంకా కొన్ని రోజులే.. వారసుడు స్టోరీ లీక్! అది నేను పెట్టుకున్నాను అనుకుని కొందరు నన్ను దారుణంగా ట్రోల్ చేశారు అందుకోసం మరి ఇంత దారుణంగా చేయాలా? దానిని కూడా చాలా మంది నమ్మేస్తున్నారు. ఏంటి ఇలా ఎందుకు చేస్తున్నావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు’ అంటూ కిరణ్ చెప్పుకొచ్చాడు. కాగా కిరణ్ అబ్బవరం గత చిత్రం నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ సమయంలో అతడి ఇంట్రడక్షన్ సీన్లో కిరణ్ అబ్బవరం అనే టైటిల్ కార్డుపై పవర్ స్టార్ అని ఎడిట్ చేసి సోషల్ మీడియా షేర్ చేశారు. ఇక దానికి చూసి కొందరు నెటిజన్లు నిజం అనుకుని సోషల్ మీడియా వేదికగా అతడిని దారుణంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. -
అవకాశం వస్తే పాకిస్తాన్ సినిమాల్లోనూ నటిస్తా: రణ్‌బీర్ కపూర్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం దారుణమైన ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నాడు. ఓ ఈవెంట్లో తన మనసులో మాట బయట పెట్టి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. ఇటీవల ‘బ్రహ్మాస్త్ర’ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న రణ్‌బీర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ అవార్డ్ ఫంక్షన్లో పాల్గొన్న రణ్‌బీర్ అవకాశం వస్తే పాకిస్తాన్ సినిమాల్లోనూ నటించేందుకే రెడీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చదవండి: జపాన్‌లో ఆర్ఆర్ఆర్ దూకుడు.. రజనీకాంత్ రికార్డు బ్రేక్ వివరాలు.. రీసెంట్గా సౌదీ అరేబియాలో జరిగిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రణ్‌బీర్ ఆహ్వానం అందుకున్నాడు. ఈ ఫెస్టివల్లో అతడు ‘వెరైటీ ఇంటర్నేషనల్ వాన్ గార్డ్ యాక్టర్’ అవార్డును అందుకున్నాడు. అనంతరం రణ్‌బీర్ అక్కడి మీడియాతో ముచ్చటించాడు. ఈ నేపథ్యంలో ఓ రిపోర్డర్ రణ్‌బీర్‌ను పాకిస్థాన్ సినిమాల్లో నటిస్తారా? అని ప్రశ్నించాడు. దీనికి రణ్‌బీర్ స్పందిస్తూ ఆసక్తికరంగాసమాధానం ఇచ్చాడు. ‘తప్పకుండ... నా దృష్టిలో కళాకాలరుకు సరిహద్దులు లేవు. ముఖ్యంగా వారి ఆర్ట్ విషయంలో. ప్రస్తుతం నేను సౌదీ అరేబియాలో ఉన్నాను. చదవండి: ‘కాంతార’ లాంటి చిత్రాలు ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయి: స్టార్ డైరెక్టర్ నాకు ఇక్కడి పరిశ్రమతో పని చేయాలని ఉంది. కుదరితే ఇదే స్టేజ్‌పై ఓ సినిమాకు సైన్ చేసేందుకు కూడా రెడీ. అలాగే అవకాశం వస్తే పాకిస్తాన్ సినిమాల్లో సైతం నటించేందుకు నేనే సిద్ధంగానే ఉన్నాను’ అని చెప్పుకొచ్చాడు. దీంతో రణ్‌బీర్‌పై ఇండియన్ నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆలియా-రణ్‌బీర్‌లు శాశ్వతంగా పాకిస్తాన్‌కు వెళ్లిపోండి. అక్కడ ప్రశాంతంగా బీఫ్ తింటూ పాకిస్తాన్ సినీ పరిశ్రమలో పని చేసుకోండి’, ‘శాశ్వతంగా భారత పౌరసత్వాన్ని వదులుకోని పాకిస్తాన్లో సెటిలైపోండి.. అందుకు మా పూర్తి మద్దతు మీకు ఉంటుంది’ అంటూ రణ్‌బీర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. Ranbir Kapoor says he would love to work in Pakistani films. And I loved him once upon a time.🥲 — khushi (@love_liv_laf) December 12, 2022 Both Alia & Ranbir Kapoor should shift to Pakistan. Wahan aaram se beef khana aur Pakistan Movies mein kaam karna — Sanjay Goyal (@SanjuG68) December 12, 2022 Ranbir Kapoor says he would love to act in a Pakistani film, claims ‘artists have no boundaries’https://t.co/TlyqHtoZcb — OpIndia.com (@OpIndia_com) December 12, 2022 -
అషు కాలును ముద్దాడటంపై ఆర్జీవీ క్లారిటీ, ట్రోలర్స్‌కు వర్మ గట్టి కౌంటర్
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ డేంజరస్. డిసెంబర్ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఆర్జీవీ, అషురెడ్డితో కలిసి ఓ బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ఇంటర్య్వూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఆర్జీవీ, అషు కాళ్లను ముద్దాడటం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వ్యూస్ కోసం, పబ్లిసిటీ కోసం ఇంత దిగజారాలా? అంటూ ఆర్జీవీని, అషును నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. అంతేకాదు ఆర్జీవీకి పిచ్చి పట్టిందని, మతి పోయిందంటూ వర్మను ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న నెగిటివిటీపై తాజాగా వర్మ స్పందించాడు. చదవండి: ఘనంగా సీరియల్ నటి శ్రీవాణి కొత్త ఇంటి గృహప్రవేశం, ఫొటోలు వైరల్ ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశాడు. ఈ సందర్భంగా అషురెడ్డి కాలును ముద్దాడటంపై క్లారిటీ ఇచ్చాడు. ‘ఈ వీడియో నేను ఎవరినీ ఉద్దేశించి చేయడం లేదు. ఇంటర్వ్యూలో నేను అషురెడ్డి ఆమె కాలిని ముద్దు పెట్టుకోవడం వెనక కారణం, అలా ఎందుకు చేశాను అనే నా ఉద్దేశాన్ని మాత్రమే చెప్పడానికి ఈ వీడియో చేశాను. ఇంకేవరిక కోసం కాదు, ఒకరికి వివరణ ఇచ్చుకోవడానికి అసలే కాదు. టీనేజ్ వయసు దాటాక ఓ వ్యక్తికి తనకంటూ వ్యక్తిగత జీవితం, ఇండివిజువాలిటీ ఉంటుంది. ఈ ఇంటర్య్వూలో మేం మాట్లాడింది, చేసింది అంతా మా ఇద్దరికి ఒకరిఒకరికి అభ్యంతరం లేకుండా చేసిందే. అది మా వ్యక్తిగతం. దాన్ని మిగతా వాళ్లు చూడొచ్చు.. చూడకపోవచ్చు. ఇంకా ఏమైన అనుకోవచ్చు’ అన్నాడు. అనంతరం ‘‘ప్రతి ఒక్కరు బతకడానికి కష్టపడతారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ అనేది అవసరం. ఆ ఎంటర్టైన్మెంట్ కోసం కొందరు స్పోర్ట్స్ ఆడతారు, ఇంకొందరు పేకాట ఆడుతారు. ఇంకా సినిమా చూడటం.. ఇలా వాళ్ళ టేస్ట్‌కి తగ్గట్టుగా ఒక్కొక్కటీ ఎంచుకుంటారు. నేను ఓ అందమైన అమ్మాయితో ఇలాంటి కాన్వర్జేషన్ చేయడం. నేను కోరుకునే ఎంటర్టైమెంట్లో ఇదొకటి. ఇందులో నన్ను జడ్జి చేసే రైట్స్ ఎవరికి లేదు. చదవండి: మహేశ్ బాబు భార్య నమ్రత కొత్త రెస్టారెంట్, రేట్స్ ఎలా ఉన్నాయంటే..! మీకు నచ్చకపోతే చూడకండి. మీకు వేరే పనులు లేవా? ప్రతిరోజు మీకు నచ్చని ఎన్నో సంఘటనలు ఉంటాయి. వాటిని వదిలేయడం లేదా? ఇలాకే ఈ విషయాన్ని వదలేయండి. ఇది చూసి వాడి మతి పోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ టైంలో నేను ఏం ఫీల్ అయ్యానో అదే చేశానే. ఎప్పుడైన సరే నేనేం ఫీల్ అవుతానో అదే మాట్లాడతాను. అషురెడ్డి కాళ్లను ముద్దాడటం కూడా అంతే’’ అంటూ ఆర్జీవీ చేప్పుకొచ్చాడు. ఇక చివరికి నేను చెప్పే ఫిలాసఫీ ఏంటంటే ‘నా చావు నేను చస్తా.. మీ చావు మీరు చావండి’ అంటూ ట్రోలర్స్‌కి గట్టి కౌంటర్ ఇచ్చాడు. -
ట్రోల్ల్స్ చేస్తున్న వారిపై మంచులక్ష్మీ ఫైర్
-
దసరా విషెస్ చెప్పిన షమీ ..దారుణంగా ట్రోల్స్ చేసిన నెటిజన్స్
-
లోదుస్తులు కంపల్సరీ.. పాక్ ఎయిర్‌లైన్స్ పరువుపాయే!
ఇస్లామాబాద్: సొంత దేశంలోనే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ పరువు పోయింది. విమాన సిబ్బందికి డ్రెస్ కోడ్‌లో భాగంగా లోదుస్తులు తప్పనిసరి అంటూ ఆదేశాలు ఇవ్వడమే అందుకు కారణం. ఈ తరుణంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తగా.. ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంది ఎయిర్‌లైన్స్. గురువారం పీఐఏ.. క్యాబిన్ సిబ్బంది కోసం ఒక ఆదేశం జారీ చేసింది. యూనిఫాం కింద లోదుస్తులు ధరించడం తప్పనిసరి అని అందులో పేర్కొంది. అంతేకాదు.. అలా వేసుకోకపోవడం వల్ల ఎయిర్‌లైన్స్ సేవలపై పేలవమైన ముద్ర పడిపోతుందని, తద్వారా గడ్డుపరిస్థితి ఎదురుకావొచ్చని ఎయిర్‌లైన్స్ ఆ ఆదేశాల్లో అభిప్రాయపడింది. లోదుస్తులు వేసుకుంటేనే డిగ్నిటీగా ఉంటుందని పేర్కొంది. ఇంకేం.. అక్కడి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఎయిర్‌లైన్స్ ఇచ్చింది అసలు అవసరం లేని ఆదేశాలన్నారు చాలామంది. ఎయిర్‌లైన్స్‌పై సొంత దేశంలోనే ట్రోలింగ్ కూడా జరిగింది. దీంతో ఆ ఆదేశాలను వెనక్కి తీసేసుకుంది ఎయిర్‌లైన్స్. అయితే ఆ విమర్శలు మామూలుగా రాలేదు. అందుకే ఆ ఆదేశాలపై కచ్చితంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది పీఐఏ. How do undergarments potray positive image of PIA (Pakistan International Airlines)?#Pakistan #PIA #Undergarments pic.twitter.com/gPEmyDc2O9 — lyfmail.com (@lyfmailcom) September 30, 2022 @nailainayat @Arzookazmi30 Its Very important news coming from Pakistan. This decison by #PIA will be helpful in revenue generation. 🤣🤣🤣🤣🤣 Kuch Bhi, kya akal andhe baithe hai bhai #PIA me 🤣🤣 — मौलाना काण्डकारी अल हरामी مولانا کندکاری الحرامی۔ (@Maulanakandkari) September 30, 2022 డ్రెస్ కోడ్‌కు సంబంధించిన ఆదేశాల్లో చిన్న తప్పిదం జరిగిందని, అనవసరమైన పదాల చేరికతోనే ఇలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని పీఐఏ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ రాతపూర్వక వివరణ ఇచ్చుకున్నారు. ఇక.. జరిగిన ఘటనకు వ్యక్తిగతంగా పశ్చాత్తాపం తెలియజేశారాయన. పీఐఏ పాక్‌లో అతిపెద్ద ఎయిర్‌లైన్. రోజూ వందకు పైగా విమానాలు నడిపిస్తోంది. అందులో 18 దేశీయ సర్వీసులు కాగా, 25 అంతర్జాతీయ సర్వీసులు ఉన్నాయి. ఇదీ చదవండి: రూ. 8 కోట్ల కారు.. నీటిపాలు -
మాంసాహారులతో శృంగారం వద్దు!: పెటా
వైరల్: ముక్క తినే మగవాళ్లకు ముద్దూముచ్చటలను దూరం చేయాలన్న పెటా ప్రయత్నం బెడిసి కొట్టింది. నాన్-వెజ్ తినే మగవాళ్లతో శృంగారంలో పాల్గొనకూడదంటూ మహిళాలోకానికి పిలుపు ఇచ్చింది మూగజీవాల హక్కుల పరిరక్షక సంస్థ. అయితే.. ఈ పిలుపుపై సెటైర్లు పేలుతున్నాయి ఇప్పుడు. సెప్టెంబర్ 22వ తేదీన పెటా తన బ్లాగు పోస్టులో ఇలా రాసుకొచ్చింది. ‘‘చేతిలో బీరు బాటిళ్లు.. ముక్కతో మగవాళ్లు ఎంజాయ్ చేస్తుంటారు. కానీ, అది మూగజీవులకు మాత్రమే హాని కాదు.. ఈ భూమికి కూడా. పర్యావరణ సమతుల్యం దెబ్బతినడానికి మహిళల కంటే పురుషులే ఎక్కువ కారణం. ముఖ్యంగా మాంసం తినే మగవాళ్లు పర్యావరణ కాలుష్యానికి 41 శాతం కారణం అవుతున్నారు అంటూ పెటా ఓ పోస్ట్ ఉంచింది. ఈ కారణంతో.. సె* స్ట్రైక్ చేయాలని, తద్వారా వాళ్లను శాఖాహారులుగా మార్చాలంటూ పెటా పిలుపు ఇచ్చింది. అయితే.. సోషల్ మీడియా ఈ పిలుపునకు ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదు. పైగా పెటా ప్రచారంలో ఏమాత్రం వాస్తవికత లేదని పేర్కొంటూ సెటైర్లు పేలుస్తున్నారు. Hold men accountable! This may be the only solution to the climate catastrophe 😉 pic.twitter.com/qqU5g52yq9 — PETA (@peta) September 23, 2022 PETA has asked WOMEN to stop having SEX with MEAT eating MEN. Calling for a sex strike, PETA wrote, “Men need to take accountability for their actions. PETA’s proposing a strike on sex with meat-eating men to persuade them to go vegan." But what about the MEAT-EATING WOMEN 😁 — Barkha Trehan 🇮🇳 / बरखा त्रेहन (@barkhatrehan16) September 27, 2022 me, a woman who eats mainly meat and is thus free from peta's stupid complaints https://t.co/SXLeaZGMU8 pic.twitter.com/ibKaBBSJwX — sef🏳️⚧️ (@Karmatekc) September 27, 2022 Lol, this has to be a troll! lol https://t.co/Y0xNGV3XUy — Lakel The VA (@CartoonCritic12) September 27, 2022 "Men have a 40 percent higher carbon footprint because they're eating more meat than woman." Women in Germany are being told to stop having sex with their husbands and boyfriends until they stop eating red meat. Dr Carys Bennett from PETA explains on #TimesRadio. pic.twitter.com/6B9jlFn1Pl — Times Radio (@TimesRadio) September 22, 2022 ఇదీ చదవండి: దొంగలను భలేగా పట్టేసిన సెక్యూరిటీ గార్డు -
‘సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు, ఆ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నా’
స్టార్ కిడ్ అయిన దుల్కర్ సల్మాన్ సైతం ట్రోల్స్ బారిన పడ్డాడట. తనని వ్యక్తిగతం టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శించారని, వాటికి సంబంధించిన స్క్రిన్‌షాట్స్ కూడా ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు. సీతారామంతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దుల్కర్ తాజాగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’. సెప్టెంబర్ 23న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూవీ ప్రమోషన్లో భాగంగా దుల్కర్ మీడియాతో మాట్లాడుతూ పలు వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్‌పై స్పందించాడు. చదవండి: Sudheer Babu: అందుకే ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఆఫర్ వదులుకున్నా ఈ మేరకు దుల్కర్ మాట్లాడుతూ.. ‘గతంలో అభిషేక్ బచ్చన్ గురించి ఓ వార్త విన్నాను. ఆయనను విమర్శిస్తు రాసిన ఆర్టికల్‌కు సంబంధించిన పేపర్ కట్టింగ్స్‌ను అద్దంపై అతికించుకుంటారట. వాటిని రోజు చదువుతారని విన్నాను. నా విషయానికి వస్తే నేను కూడా అలాగే చేస్తాను. నా ఫోన్ గ్యాలరీ చూస్తే మీకు అన్ని స్క్రీన్షాట్స్యే కనిపిస్తాయి. సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తూ చేసిన విమర్శల తాలుకు స్క్రిన్‌షాట్స్ అవి. ట్విటర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా అన్నింటి స్క్రీన్ షాట్స్ సేవ్ చేసి పెట్టుకుంటాను. వాటిని అప్పుడప్పుడు చూస్తుంటా. అందులో నన్ను పర్సనల్‌గా అటాక్ చేసిన ఐడీలు కూడా నాకు బాగా గుర్తున్నాయి’ అని చెప్పాడు. -
మళ్లీ బుక్కైన తమన్.. ‘ఏంటమ్మా.. ఇది’ అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్‌ఫాదర్ నుంచి నిన్న విడుదలైన ఫస్ట్ సింగిల్ ప్రోమోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ప్రోమో చిరుతో కలిసి సల్మాన్ స్టెప్పులేశాడు. టార్ మార్ టక్కర్ మార్ అంటూ ఫాస్ట్ బీట్తో ప్రొమో అదిరిపోయిందంటూ కామెంట్స్ వచ్చాయి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రొమో సాంగ్ విన్న కొందరు తమన్‌ను సోషల్ మీడియా వేదికగా ఆటాడేసుకుంటున్నారు. మళ్లీ దొరికిపోయాడంటూ అతడిని ట్రోల్ చేస్తున్నారు. ఇంతకి అసలు సంగతేంటంటే.. తమన్ కంపోజ్ చేసిన ఈ ‘తార్ మార్ టక్కర్ మార్’ పాట అచ్చం రవితేజ క్రాక్ చిత్రంలోని ‘డండనకర నకర.. నకర’ పాటలాగే ఉందని అంటున్నారు. చదవండి: రణ్వీర్ చెంప చెల్లుమనిపించిన బాడిగార్డ్! అసలేం జరిగిందంటే.. అయితే ఈ పాటను కంపోజ్ చేసింది కూడా తమనే. దీంతో ‘ఏంటి.. తమన్ నువ్వు ఇక మరావా?.. రెండు పాటలకు ఒకే బీట్ వాడావంటూ’ అతడిని ట్రోల్ చేస్తున్నారు. ‘మెగాస్టార్ లాంటి పెద్ద హీరో చిత్రానికి పని చేస్తున్నప్పుడు కొంచం డిఫరేంట్ ఉండాలి కదా’ అని తమన్‌పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక ఈ రెండు పాటలను పోలుస్తూ నెటిజన్లు ‘ఏంటమ్మా.. తమన్ ఇది చూసుకోవాలి కదా’ అంటూ అతడిని ఏకిపారేస్తున్నారు. కాగా ఇలా కాపీ కొట్టి దొరికపోవడం తమన్‌కు ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా పలు పాటలకు కాపీ కొట్టి తమన్ దొరికిపోవడం.. అతడిని నెటిజన్లు ట్రోల్ చేయడం సాధారణమైంది. చదవండి: నేను సినిమాలు మానేయాలని కోరుకున్నారు, అది బాధించింది: దుల్కర్ -
నెట్టింట దుమారం రేపుతున్న అనసూయ ట్వీట్.. ఉలిక్కిపడ్డ యాంకరమ్మ
యాంకర్ అనసూయ చేసిన తాజా ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో తన ట్వీట్స్‌ను రాజకీయం చేయొద్దంటూ అనసూయ నెటిజన్లను వేడుకుంది. ఈ మేరకు ఆమె వరుస ట్వీట్స్ చేసింది. అసలేం ఏం జరిగిందంటే.. తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌ను అనసూయ రీట్విట్ చేయడంతో చర్చనీయాంశమైంది. గుజరాత్ బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచార కేసులో దోషులుగా ఉన్న ఖైదీలను ఇటీవల జైలు నుంచి విడుదల చేశారు. వారిని ఓ సంస్థ సన్మానం చేసింది. చదవండి: కరీనాకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ కౌంటర్, వేడి కాఫీలో ముంచేస్తారు ఈ విషయంపై మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించేవారు గుజరాత్లో ఏం జరుగుతుందో కూడా చూడాలంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇదే ట్వీట్‌ను అనసూయ రీట్వీట్ చేసింది. వెంటనే నెటిజన్లు ఆమెపై ట్రోల్ చేస్తూ విరుచుకుపడ్డారు. ‘ఇది దారుణం. మనం స్వేచ్ఛను పునర్నిర్వచిస్తున్నట్లు అనిపిస్తోంది. అంటే రేపిస్టులను విడిచిపెట్టి. మహిళలను ఇంటికే పరిమితం చేసేలా ఉన్నాం’ అంటూ ఆమె రాసుకొచ్చింది. దీంతో అనసూయ ట్వీట్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో మైనర్‌పై అత్యాచారం జరిగినప్పుడు దానిపై ఎందుకు స్పందించలేదని ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇక సోషల్ మీడియా తనపై జరుగుతున్న దాడికి అనసూయ ఉలిక్కిపడింది. దీంతో ఆమె స్పందిస్తూ.. ‘నేను చేసిన ట్వీట్‌ను రాజకీయం చేస్తున్నారు. నేను నా సొంత అభిప్రాయాన్ని చెప్పాను. దీనికి ఎవరితో సంబంధం లేదు. ముఖ్యంగా ఎవరినో ప్రమోట్ చేసేందుకు, డబ్బులు తీసుకుని ఈ ట్వీట్ చేయలేదు’ అని స్పష్టం చేసింది. చదవండి: ఇప్పటికీ నాతో వారు నటించేందుకు సంకోచిస్తున్నారు: నటి ఆవేదన Outrageous! Looks like we are redefining freedom .. if it means letting the Rapists free and shutting the women behind the doors.. well then! #HappyIndependenceDay Speak up India 🇮🇳 https://t.co/v5NgnJsSXN — Anasuya Bharadwaj (@anusuyakhasba) August 18, 2022 ఇక మరో ట్వీట్లో ‘అక్కడ ఏం జరిగిందో తెలుసుకుని పూర్తి అవగాహనేతోనే మాట్లాడుతున్నాను. అయినా నా కామెంట్స్‌ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అందువల్లే నేను ఓ సొంత నిర్ణయానికి రాలేకపోతున్నాను. దయ చేసిన నా ట్వీట్స్‌ను రాజకీయం చేయకండి’ అంటూ అనసూయ నెటిజన్లను విజ్ఞప్తి చేసింది. ఇక వివరణపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘అలాంటప్పుడు మీరు రాజకీయ అంశాలకు దూరంగా ఉండండి. మీరు ఒక నటి అనే విషయం గుర్తు పెట్టుకొండి. నటిలా వ్యవహరించండి’ అంటూ సూచించాడు. C. I am a working woman/mother and there are many a times I end up not knowing the truth on few things which you expect me to speak up..by the time I get the time to speak up, the issue gets so diluted that it gets very difficult for me to have an opinion of my own(2/2) — Anasuya Bharadwaj (@anusuyakhasba) August 19, 2022 -
డ్రెస్సింగ్‌పై ట్రోల్.. తనదైన స్టైల్లో నెటిజన్ నోరుమూయించిన బిందు
సోషల్ మీడియాలో తనపై నెగిటివ్ కామెంట్ చేసిన ఓ నెటిజన్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది బిగ్‌బాస్ శివంగి బిందు మాధవి. అవకాయా బిర్యానీ, బంపర్ ఆఫర్ వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు పొందింది బిందు. తెలుగు అమ్మాయి అయిన బిందు ఇక్కడ అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంది. అక్కడ వరుస ఆఫర్లు అందుకుంటూ సౌత్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో తెలుగు బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఓటీటీ కంటెస్టెంట్‌గా దర్శనం ఇచ్చింది. హౌజ్‌లో తనదైన ఆట, యాటిటూడ్, మాటలతో గట్టి పోటి ఇస్తూ చివరికి బిగ్‌బాస్ నాన్‌స్టాప్ టైటిల్ గెలిచింది. చదవండి: నందమూరి ఫ్యామిలీకి కలిసిరాని ఆగస్టు, విషాదాలన్నీ ఈ నెలలోనే.. అంతేకాదు సంప్రాదాయమైన దుస్తులనే ధరించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న బిందుమాధవి తన తాజా పోస్ట్‌లో కాస్తా ట్రెండి డ్రెస్‌లో కనిపించింది. ఈ ఫొటోను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేయగా ఓ నెటిజన్ తన డ్రెస్సింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. బిగ్‌బాస్‌లో హౌజ్‌లో అందరు శరీరం కరిపించేలా డ్రెస్స్‌లు వేసుకుంటే.. తను మాత్రం కేవలం సంప్రదాయమైన అలంకరణకే ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో బిందు మాధవి అంటే రెస్పాక్ట్ పెరిగింది. కానీ ఇప్పుడు అది పోయింది. అందరి దగ్గర మార్కులు కొట్టాలనే ఉద్దేశంతోనే తను హౌజ్‌లో అలా ఉంది’ అంటూ విమర్శించారు. చదవండి: ‘కార్తీకేయ 2’ ప్రమోషన్స్‌కి అనుపమ డుమ్మా.. నిఖిల్ షాకింగ్ కామెంట్స్! Why this narrow minded people judge a women by her dressing they like a women by her clothes and not by her character. In telugu der is a saying "ఆడదానికీ ఆడదే శత్రువు" this is apt 4 dis girl🤨 Bindu gave slipper shot answer 👏 you go girl more power to you 🔥#BinduMadhavi pic.twitter.com/78NhUznHO3 — SiriKota (@SiriKota_04) August 2, 2022 దీంతో సదరు నెటిజన్ కామెంట్స్ బిందు స్పందించి తనదైన స్టైల్లో గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘హో.. మనం ధరించే దుస్తులను బట్టే వ్యక్తికి గౌరవం ఇస్తారంటే.. అలాంటి గౌరవం నాకు వద్దు’ అంటూ నెటిజన్ నోరు మూయించింది ఈ ఆడపులి. ప్రస్తుతం బిందు మాధవి సమాధానం నెట్టింట చర్చనీయాంశమైంది. బిందు ఇచ్చిన రిప్లైకు ఓ నెటిజన్ ఫిదా అయ్యాడు. ఈ కామెంట్సకు సంబంధించిన స్క్రీన్ షాట్ తీసి ట్విటర్లో పోస్ట్ చేస్తూ బిందుకు మద్దుతు తెలిపాడు. -
హీరోయిన్‌కు సడెన్‌గా ముద్దు పెట్టిన హీరో.. వీడియో వైరల్
Varun Dhawan Kisses Kiara Advani And KRK Trolls: తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్. వరుసగా ప్రేమ కథా, కుటుంబ కథా చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల వరుణ్ ధావన్ నటించిన చిత్రం 'జుగ్ జుగ్ జీయో'. జూన్ 24న విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అనిల్ కపూర్, నీతూ కపూర్ సైతం కలిసి యాక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పటికే రూ. 100 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించినట్లు సమాచారం. అయితే ఈ మూవీలో వరుణ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటించింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఒక మేగజైన్ కవర్ ఫొటో కోసం ఫోజులిచ్చారు. ఈ ఫొటో షూట్లో వరుణ్, కియారా ఇద్దరు కౌగిలించుకుని స్టిల్స్ ఇస్తున్నారు. ఇదే సమయంలో హఠాత్తుగా కియారా బుగ్గపై వరుణ్ ధావన్ ముద్దు పెడతాడు. ఈ అనుకోని పరిణామానికి షాక్ అయి వరుణ్‌ను పక్కకు నెడుతుంది కియారా. ఈ ఫొటో షూట్ వీడియోను బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్‌గా చెప్పుకునే కమాల్ ఆర్ ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోకు 'షూటింగ్ సమయంలో కంట్రోల్ చేసుకోకపోతే ఇలాంటివే జరుగుతాయి' అని రాసుకొచ్చాడు కూడా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవగా.. 'ఇలా అయితే కష్టం గురూ' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చదవండి: భార్యతో అబద్ధాలు చెప్పకపోతే ఇన్ని కాపురాలు ఉంటాయా: డైరెక్టర్ నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన బికినీ దుస్తుల్లో వేదిక రచ్చ.. సినిమా అవకాశాల కోసమేనా? Jab Aadmi shoot Karte Huwe Mood Main Aa Jata Hai Toh Kuch Aisa Ho Jata Hai. pic.twitter.com/3SzXU6M5WR — KRKBOXOFFICE (@KRKBoxOffice) August 1, 2022 -
లెక్క తప్పిన జాన్వీ కపూర్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు
Janhvi Kapoor Comments On Maths: అందాల తార, దివంగత శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ మొదటి సినిమా 'ధడక్'తోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. తన నటనతో, అందచందాలతో కోట్లాదిమంది మనసులు కొల్లగొట్టింది. అంతేకాకుండా యూత్‌లో యమ క్రేజ్ సంపాదించుకుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ.. పలు కామెంట్స్‌తో ట్రోలింగ్ కూడా ఎదుర్కొంది. తాజాగా మరోసారి ట్రోలింగ్ బారిన పడింది బ్యూటిఫుల్ జాన్వీ కపూర్. జాన్వీ కపూర్ నటించిన లేటేస్ట్ మూవీ 'గుడ్ లక్ జెర్రీ'. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో మాథ్స్‌పై కామెంట్స్ చేసి ట్రోలింగ్‌కు గురైంది. స్కూల్లో చదివేటప్పుడు నాకు చరిత్ర, లిటరేచర్ అంటే చాలా ఇష్టం. మ్యాథ్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. అయినా నాకో విషయం అర్థం కాదు. అదేంటంటే.. కాలిక్యులేటర్ కనిపెట్టిన తర్వాత లెక్కలు చేయడం చాలా సులభమైంది. ఇంకా కష్టపడి ఆల్జీబ్రాను నేర్చుకోవడంలో ఉపయోగమేంటీ? గణితం కోసం ఎందుకు అంతలా తలలు బద్దలు కొట్టుకుంటారో అర్థం కాదు. అయితే చరిత్ర, సాహిత్యం ప్రజల్ని సంస్కారవంతమైన మనుషులుగా తీర్చిదిద్దుతాయి. మాథ్స్ మిమ్మల్ని నెమ్మదించేలా చేస్తుంది. అని మాట్లాడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ట్రోలింగ్‌తో జాన్వీని ఆడేసుకుంటున్నారు. 'లక్షల ఫీజు కట్టి ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివిన వారి నాలెడ్జ్ ఎలా ఉంటుదనే దానికి ఇదే ఫ్రూఫ్', 'మీరు ఉన్న దయనీయ స్థితికి మ్యాథ్స్‌ను ఎందుకు నిందిస్తారు', 'కాలిక్యులేటర్‌తో ఆల్జీబ్రాని చేసేందుకు జాన్వీ కపూర్ ప్రయత్నిస్తోంది. ఇక్కడే లాజిక్ చచ్చిపోయింది. ఇక ముందుకు సాగండి. ఇంకా ఇలాంటివి చాలా చూడాలి' అంటూ ట్రోల్ చేస్తున్నారు. Who is this? pic.twitter.com/ow8hvWdToh — Abhijit Majumder (@abhijitmajumder) July 17, 2022 -
గోల్డ్ డిగ్గర్ అంటూ కామెంట్స్.. ట్రోలర్స్‌కి గట్టి కౌంటరిచ్చిన నటి
ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ, మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ డేటింగ్ ప్రస్తుతం బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇటీవల సుష్మితాను తన భాగస్వామిగా పేర్కొంటూ లలిత్ మోదీ ఫొటోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిని త్రీవస్థాయిలో ట్రోల్ చేయడం ప్రారంభించారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో ఇప్పటికే తమపై వస్తున్న ట్రోల్స్‌పై లలిత్ మోదీ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చాడు. మనమింకా మధ్య యుగం కాలంలోనే నివసిస్తున్నామా? ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా ఉండకూడదా? ఒకవేళ వారి మధ్య కెమిస్ట్రీ కుదిరి కాలం కలిసి వస్తే.. అద్భుతం జరుగుతుంది కదా!.. నాదొక సలహా మీరు సంతోషంగా జీవించండి’’ అంటూ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నిత్యా మీనన్? ‘గోల్డ్ డిగ్గర్’(డబ్బు కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి) అంటూ సుష్మితను సైతం ట్రోల్ చేస్తున్నారు కొందరు. ఈ క్రమంలో తనపై వస్తున్న ట్రోల్స్‌పై తాజాగా సుష్మితా సేన్ స్పందించింది. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘ప్రస్తుతం నా జీవితం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. నేను ఏం చేస్తున్నాననేది నా వ్యక్తిగతం. తాత్కాలిక ప్రశంసల కోసం నేను బతకడం లేదు. చూట్టు ఉన్న ప్రపంచం దయనీయకంగా మారుతోంది. అది చూస్తుంటే నాకు జాలేస్తోంది. నేను ఎప్పుడు కలవని, అసలు పరిచయమే లేని మిత్రులు, కొంతమంది మేధావులు నా జీవితంపై హక్కు ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. నేనే ఏం చేయాలి ఎలా ఉండాలో కూడా చెబుతున్నారు. నేను ఓ గోల్డ్ డిగ్గర్ అంటూ నాపై కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. కానీ నేను బంగారం కంటే డైమంట్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. అయితే వాటిని నేను సొంతంగా కొనుక్కోగలను కూడా. ఇప్పటికైనా మీకు అర్థమైందనుకుంటున్నా. ఇక మీ అందరు ఒక విషయం తెలుసుకోండి. మీ సుష్ బాగానే ఉందని తెలుసుకోండి. తాత్కాలిక ప్రశంసల కోసం నేను బతకడం లేదు. అయితే ఇన్ని విమర్శలు వస్తున్నా కూడా నాకు సపోర్ట్‌గా నిలిచిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు’ అంటూ సుష్మితా ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది. కాగా లలిత్ మోదీతో సుష్మితా డేటింగ్ చేస్తున్న విషయం చెప్పినప్పటి నుంచి ఆమెపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. డబ్బు కోసమే ఆయన సుష్మితా డేటింగ్ చేస్తుందంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరూ ఆమె గత ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్‌లో చర్చిస్తున్నారు. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) -
నాగబాబు ప్రొడక్షన్స్ వారి అట్టర్ ఫ్లాప్ షో
సాక్షి, తూర్పు గోదావరి: సినీ నిర్మాతగానే కాదు.. రాజకీయాల్లోనూ కొణిదెల నాగబాబు చేదు అనుభవాల్నే చవిచూస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ హోదాలో ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించబోయి.. చేసిన ఓ ఫ్లాప్ షో చివరకు ఆయన్ను నవ్వులపాలు చేసింది. రాజమహేంద్రవరంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ ఆయన శనివారం ఉదయం హడావుడి చేశారు. గోతులు పడిన ఓ రోడ్డు వద్ద ‘గుడ్‌మార్నింగ్ సీఎం సార్’ అంటూ ఫొటోకు పోజు ఇచ్చారు. అయితే.. వాస్తవానికి ఆ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది కాదు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని రైల్వే శాఖ పరిధిలోని బొగ్గు డంపింగ్ యార్డుకు వెళ్లే దారి. రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎలాగైనా అభాసుపాలు చేసేందుకు చేసిన ప్రయత్నం చివరకు ఆయనకే బెడిసి కొట్టింది. సోషల్ మీడియాలో నాగబాబు ఫ్లాప్‌షో వైరల్ అవుతోంది. -
ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?.. హీరోయిన్ స్ట్రాంగ్ రిప్లై
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు తరచుగా ట్రోలింగ్‌కు గురవతున్నారు. కొందరు విచిత్రమైన చేష్టలతో అభాసుపాలైతే మరికొందరు ఏం చేయకుండానే ట్రోలింగ్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా ప్రముఖ నటి నీనా గుప్తా కుమార్తె, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా ట్రోలింగ్ బారిన పడింది. అయితే ఆమె ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చి నోరు మూయించింది. మసాబా గుప్తా ఇటీవల తన పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన ఓ నెటిజన్ 'నువ్ అంత అందంగా లేవు. ఘోరంగా ఉన్నావ్. ఈ ఫ్యాషన్, ఎంటర్టైన్మెంట్ (సినిమా) రంగంలో నువ్ ఎలా ఉన్నావ్' అంటూ వ్యంగంగా కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ షేర్ చేస్తూ ''ఇది అందమైనది. కేవలం ప్రతిభ వల్లే ఏ పరిశ్రమలోనైనా నిలదొక్కుకోగలరనే విషయాన్ని నీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. అమితమైన హార్డ్ వర్క్, భయంకరమైన క్రమశిక్షణ వల్లే అది సాధ్యం. ఇక నా ముఖం విషయానికొస్తే అది నాకొక బోనస్. (నా మైండ్, మనస్సు ఒక పదునైనా కత్తిలాంటింది. నువ్ ఎంత ప్రయత్నించినా నీ చెత్త మాటలు అందులోకి వెళ్లలేవు)'' అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది మసాబా గుప్తా. చదవండి: 'అవును, ఆ రూమర్ నిజమే' అంటున్న రష్మిక.. అతడితో.. ఒక్క ఎపిసోడ్‌కు రూ. 5 కోట్లు.. హీరోయిన్ పారితోషికంపై చర్చ ! మసాబా గుప్తా ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'మోడ్రన్ లవ్ ముంబై'లో నటించింది. అలాగే ఆమె తల్లి నీనా గుప్తాతో కలిసి నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'మసాబా మసాబా'లో కూడా యాక్ట్ చేసింది. ఈ సిరీస్‌ను మసాబా గుప్తా, ఆమె తల్లి, నటి నీనా గుప్తా జీవితాల నుంచి స్ఫూర్తిగా తీసుకుని సెమీ ఫిక్షన్‌గా తెరకెక్కించారు. త్వరలో ఈ సిరీస్‌కు రెండో సీజన్ కూడా రానుంది. 'ఎమ్‌టీవీ సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్' రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించింది మసాబా గుప్తా. కాగా మసాబా గుప్తా.. నీనా గుప్తా, క్రికెటర్ వివ్ రిచర్డ్‌ల సంతానం. తర్వాత నీనా గుప్తా చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ మెహ్రాను వివాహం చేసుకుంది. చదవండి: నితిన్ పాటకు మహేశ్ బాబు స్టెప్పులు !.. వీడియో వైరల్ -
ఏ దేశపు మహారాణి.. గొడుగు కొనుక్కోడానికి డబ్బులు లేవా ?
Nora Fatehi Gets Trolled: బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహీ తనదైన హావాభావాలతో, డ్యాన్స్ మూమెంట్స్‌తో కట్టిపడేస్తుంది. 'టెంపర్' సినిమాలో 'ఇట్టాగే రెచ్చిపోదాం' అనే ఐటమ్ సాంగ్‌తో టాలీవుడ్లో ఎంటరైన ఈ భామ 'బాహుబలి' చిత్రంలో 'మనోహారి' పాటతో పాపులారిటీ దక్కించుకుంది. హిందీలో 'దిల్బర్' సాంగ్‌తో ఒక ఊపు ఊపేసింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ ట్రోలర్స్ చేతికి చిక్కింది. తాజాగా ఆమె చేసిన ఓ పని నెటిజన్స్ విరుచుకుపడేలా చేసింది. డ్యాన్స్ రియాలిటీ షో అయిన 'డ్యాన్స్ దీవానే జూనియర్స్'కు నోరా ఫతేహీ జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ షోలో పాల్గొనేందుకు నోరా చీరలో వచ్చింది. ఆ సమయంలో అక్కడ వర్షం కురుస్తుంది. వర్షంలో కారు దిగబోతుండగా అక్కడ నీటిలో చీర తడిసిపోతుందని భావించి సెక్యూరిటీ గార్డు సహాయం తీసుకుంది. సెక్యూరిటీ గార్డు ఆమె చీరను పట్టుకోగా నోరా ఫతేహీ కార్‌వ్యాన్‌లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నోరాను నెటిజన్స్ ఒక ఆట ఆడేసుకుంటున్నారు. (చదవండి: 72 ఏళ్ల వయసులో NTR పైనుంచి దూకారు చిరంజీవి పేరు మార్చుకున్నారా ? అసలు కారణం ఇదే !) 'ఆమె ఏ దేశపు యువరాణి', 'ఈ శతాబ్దంలో ఇలాంటి బానిసత్వాన్ని అంగీకరించలేం', 'ఆమె మహారాణి అయినప్పటికీ సెక్యూరిటీ గార్డ్‌పై కొంచెం కూడా దయలేదా. చీరను కాపాడేందుకు అతను వర్షంలో తడిసేలా చేసింది', 'ఒక గొడుగును కొనుక్కునేందుకు ఆమె దగ్గర డబ్బులు లేవా ?' అంటూ నెటిజన్స్ ట్రోలింగ్‌కు దిగారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు..
R Madhavan Gets Trolled For Claiming ISRO Used Hindu Calendar For Mars Mission: దక్షిణాది భాషల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మాధవన్. ఆయన తాజాగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం రాకెట్రీ. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కింది ఈ చిత్రం. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, స్టార్ హీరో సూర్య కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్లో భాగంగా చిత్రబృందం మీడియా సమావేశాలకు హాజరవుతోంది. ఈ క్రమంలోనే మాధవన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ట్రోల్స్ ఎదుర్కొంటున్నాయి. ఓ ప్రెస్ మీట్లో అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించినప్పుడు, అది అంగారక కక్ష్యలోకి చేరేందుకు ఇస్రోకు పంచాగం ఉపయోగపడిందని మాధవన్ అన్నాడు. 'ఇస్రోవాళ్లు పంచాంగం చూసి పెట్టిన ముహుర్త బలం వల్లే భారత మార్స్ మిషన్ అవాంతరాలను అధిగమించి కక్ష్యలోకి చేరింది. గ్రహాల స్థితిగతులన్నీ పంచాంగాల్లో నిక్షిప్తమై ఉంటాయి.' అని మాధవన్ వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కాగా నెటిజన్స్ ట్రోలింగ్‌తో ఏకిపారేస్తున్నారు. (చదవండి: చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట ?) When panjakam plays a important role in Mars mission #Madhavan #MarsMission #science #technology #sciencefiction pic.twitter.com/tnZOqYfaiN — கல்கி (@kalkyraj) June 23, 2022 'సైన్స్ అందరికీ అర్థమయ్యే విషయం కాదు. అలా అని సైన్స్ తెలియకపోవడం కూడా పెద్ద సమస్య కాదు. కానీ అసలు విషయం తెలుసుకోకుండా ఇలా మాట్లాడే బదులు సైలెంట్‌గా ఉండటం మంచిది', 'మీరు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా ?', 'ఇవేం పిచ్చి మాటలు' అంటూ వరుస కామెంట్లతో నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. అయితే ఈ ట్రోలింగ్‌పై తాజాగా మాధవన్ స్పందించాడు. 'పంచాంగాన్ని తమిళంలో పంచాంగ్ అని అనడం నా తప్పే. ఈ విమర్శలకు నేను అర్హుడినే. నేను అజ్ఞానినే. అయితే ఈ మాటల వల్ల మనం కేవలం 2 ఇంజిన్ల సహాయంతో మార్స్ మిషన్‌లో విజయం సాధించామనే నిజం కాకుండా పోదు. ఇది ఒక రికార్డు. వికాస్ ఇంజిన్ ఒక రాక్‌స్టార్.' అని ట్వీట్ మాధవన్ ట్వీట్ చేశాడు. (చదవండి: 'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు) 🙏🙏I deserve this for calling the Almanac the “Panchang” in tamil. Very ignorant of me.🙈🙈🙈🤗🚀❤️Though this cannot take away for the fact that what was achieved with just 2 engines by us in the Mars Mission.A record by itself. @NambiNOfficial Vikas engine is a rockstar. 🚀❤️ https://t.co/CsLloHPOwN — Ranganathan Madhavan (@ActorMadhavan) June 26, 2022 (చదవండి: 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్..) -
వరుణ్, కియారాలపై నెటిజన్ల ఫైర్.. ‘వారిపై చర్యలు తీసుకోండి’
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ కియారా అద్వానీపై నెటిజన్లు మండిపడుతున్నారు. మెట్రో రైలులో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వీరి తీరుపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా వరుణ్-కియార జంటగా నటించిన తాజా చిత్రం 'జగ్ జగ్ జీయో'. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిగ్గజ నటులు అనిల్ కపూర్, నీతూ కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లో భాగంగా మూవీ టీం ముంబై మెట్రో రైలులో సందడి చేశారు. ఈ నేపథ్యంలో వరుణ్, కియారా మెట్రో రైల్లో వడ పావ్ తింటూ కనిపించారు. చదవండి: చాలా మందికి అప్పు ఇచ్చా.. తిరిగి ఇవ్వలేదు : గోపీచంద్ ఈ వీడియోను ప్రముఖ మీడియా పర్సన్ వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇక మెట్రోలో నిబంధనలకు విరుద్ధం ప్రవర్తించిన కియార, వరుణ్‌లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మెట్రోలో ఆహార పదార్థాలు అనుమతి లేదనే విషయం కూడా తెలియదా?’, ‘వీరిపై మెట్రో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీరితో పాటు సీనియర్ నటుడు అనిల్ కపూర్, మూవీ యూనిట్ కూడా ఉన్నారు. కాగా కియారలో తెలుగులో రామ్ చరణ్ ఆర్సీ 15 మూవీతో పాటు ఇటీవల కోలీవుడ్‌లో ఓ సినిమాకు సంతకం చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
సోషల్ మీడియాలో అశ్లీల కామెంట్స్, పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్
మాజీ ఎంపీ, హీరోయిన్ రమ్య తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. కన్నడ నటి అయిన రమ్య అభిమన్యు మూవీతో టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. కన్నడ, తమిళంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా చురుకుగా ఉండే రమ్య.. బీజేపీ అధికారంలోకి రావడంతో రాజీనామ చేసింది. చదవండి: అల్లు అర్జున్‌పై కేసు, తప్పుదోవ పట్టించారంటూ పోలీసులకు ఫిర్యాదు ప్రస్తుతం సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమె సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉంటోంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు ఫొటోలను తరచూ అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో రమ్యకు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తనని తరచూ ట్రోల్ చేస్తున్నాడని, అసభ్యకర కామెంట్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది. అతడిని అరెస్టు చేయాలని ఆమె బెంగళూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చదవండి: కడపలో ‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా సందడి కాగా కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన చార్లీ 777 మూవీ నేడు(జూన్ 10) విడుదలైంది. నిన్న ప్రివ్యూ చూసిన రమ్య సినిమా బాగుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీనికి ప్రీతమ్ ప్రిన్స్ అనే నెటిజన్ అశ్లీలమైన కామెంట్ చేశాడు. దీంతో రమ్య ప్రీతమ్ ప్రీన్స్ తరచూ తనని ట్రోల్ చేస్తున్నాడని, అతడి అరెస్టు చేయాలని కోరుతూ గురువారం బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రీతమ్ ప్రిన్స్ వ్యక్తి ఎవరనేది తెలుసుకునే దిశగా విచారిస్తున్నారు. #Charlie777 is an emotional film that teaches us humans so caught up in our grand position in the chain of being the importance of love & the joie de vivre we need to embrace. Thank you @rakshitshetty @Kiranraj61 for this warm-hearted tearjerker. https://t.co/wzygIxkMFx — Divya Spandana/Ramya (@divyaspandana) June 7, 2022 -
అర్జున్ కపూర్ బాడీ షేప్‌పై ట్రోల్స్, ఘాటుగా స్పందించిన లవ్‌బర్డ్స్
Malaika Arora Reacts Trolls On Arjun Kapoor Body Shape: బాలీవుడ్ లవ్ బర్డ్స్ అర్జున్ కపూర్-మలైకా ఆరోరాలను తరచూ ట్రోలర్స్ టార్గెట్ చేస్తూనే ఉంటారు. ఇద్దరి మధ్య 12 ఏళ్ల వయసు వ్యత్యాసం, మలైకా పెళ్లయి విడాకులు కావడంతో వీరిద్దరిపై ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఈ లవ్బర్డ్స్పై విమర్శలు చేశారు ట్రోలర్స్. అయితే ప్రతిసారి మలైకాను టార్గెట్ చేసే నెటిజన్లు ఈ సారి అర్జున్ కపూర్‌పై విమర్శల దాడి చేశారు. ఈ మధ్య కాస్తా బరువెక్కిన అర్జున్ ప్రతిరోజు జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల షేర్ చేసిన తన వర్కౌట్ వీడియో ఓ ఆకతాయి నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు. తన కామెంట్లో అర్జున్ ఫిట్నెస్ ట్రైనర్ డ్రూ నీల్‌ను ట్యాగ్ చేశాడు. చదవండి: భారీ భద్రత నడుమ హైదరాబాద్‌లో ల్యాండయిన సల్మాన్ ‘ఇలాంటి క్లయింట్ ఉండటం మీ అదృష్టం. ఎందుకంటే నిత్యం మీకు డబ్బలు వస్తూనే ఉంటాయి. తరచూ అతను వర్కౌట్స్ చేస్తూనే ఉంటాడు. కానీ ఎప్పటికీ సరైన షేప్‌ను పొందలేడు’ అంటూ ఓ నెటిజన్ అర్జున్‌పై కౌంటర్ వేశాడు. ఇది చూసిన అర్జున్ ఆ కామెంట్‌ను స్క్రీన్ షాట్ తీసి అతడికి రీకౌంటర్ ఇచ్చాడు. ‘ప్రస్తుతం మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఫిట్నెస్ అంటే బాడీ మీద కట్స్ కనిపించడం, సిక్స్ ప్యాక్‌తో కూడిన షేప్ ఉండటం అనుకుంటున్నారు. ఎలా అంటే ఫేస్ లేని బాడీ డీపీలా. కానీ నా దృష్టిలో ఫిట్‌నెస్‌కు అసలు అర్థమేంటంటే ఏ వ్యక్తి అయితే ఎలాంటి చింతలు లేకుండా ప్రతి రోజు సాధారణ ఆరోగ్యకరమైన.. ప్రశాంతమైన జీవితాన్ని జీవించడం. చదవండి: ‘విక్రమ్’ భారీ విజయం, దర్శకుడికి కమల్ లగ్జరీ కారు బహుమతి సైలెంట్‌గా తన జీవితం తాను గడిపేవాడు. తన గురించి తాను మాత్రమే శ్రద్ధ తీసుకునేవాడే ఫిట్‌గా ఉన్నట్లు. అంతేకాని మోహం చాటేసిన డీపీలా ఉండటం కాదు’ అంటూ ఘాటూ రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన అర్జున్ ప్రియురాలు, నటి మలైకా అతడికి మద్దతుగా నిలిచింది. అర్జున్ ఇన్‌స్టా స్టోరీని స్క్రిన్ షాట్ తీసి ‘బాగా చెప్పావ్ అర్జున్. ఇలాంటి విమర్శలు, ట్రోల్స్ నీ కాంతిని దూరం చేయకూడదు. నీ ఈ ప్రయాణంలో నీకు మరింత ధైర్యం, శక్తి రావాలని కోరుకుంటున్నా’ అని పేర్కొంది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈ మధ్య మలైకా-అర్జున్‌ల పెళ్లి వార్తలు బి-టౌన్లో హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నాయి. త్వరలో ఈ జంట వివాహ బంధంతో ఒకటి కానుందని కోద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Arjun Kapoor (@arjunkapoor) -
ఆంటీ అవసరమా.. కూతురు పెళ్లయ్యేదాకా ఇవి తగ్గించుకో.. సురేఖ వాణిపై ట్రోలింగ్
Surekha Vani Trolled By Netizens For Instagram Video: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాందించుకుంది సురేఖ వాణి. ఎన్నో సినిమాల్లో నటించిన సురేఖ వాణి ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ కూతురు సుప్రితతో కలిసి చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసిన వివిధ రకాల వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా సురేఖ వాణి చేసిన ఓ వీడియోపై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఆంటీ మీకు ఇది అవసరమా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అల్లు అర్జున్ నటించి సరైనోడు చిత్రంలోని 'తెలుసా తెలుసా' సాంగ్‌కు లిప్ సింక్ చేస్తూ ఉయ్యాల ఊగుతూ వయ్యారంగా వీడియో చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోకు నెటిజన్స్ కొంచెం ఘాటుగానే స్పందిస్తున్నారు. 'ఆంటీ అవసరమా ఈ సాంగ్స్ మీకు', 'ఈ ఏజ్‌లో మీకు ఆ సాంగ్ అవసరమా సురేఖ గారు', 'సురేఖ మేడమ్ మీ అమ్మాయి పెళ్లయ్యేదాకా కొంచెం ఇటువంటివి తగ్గించండి. లేదంటే మీ అమ్మాయిని చూసుకోడానికి వచ్చేవాడు మిమ్మల్ని చూస్తే మిమ్మల్నే చేసుకుంటాడు. మీరు అంటే నాకు చాలా ఇష్టం మేడమ్.' అంటూ కామెంట్స్ చేయగా మరికొందరు బ్యూటిఫుల్, నైస్, సూపర్ అంటూ అభిమానం కురిపిస్తున్నారు. చదవండి: అతడెవరని అడిగిన నెటిజన్‌కి సుప్రిత స్ట్రాంగ్ కౌంటర్ View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) -
మనసులో మాట చెప్పమన్న అషూ, ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు
అషూ రెడ్డి.. బుల్లితెర ప్రేక్షకులకు, సోషల్ మీడియా యూజర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే అషూ తరచూ తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ కనువిందు చేస్తోంది. టిక్‌టాక్ వీడియోస్‌తో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఆమె అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ 3 ఆఫర్ కొట్టేసింది. దీంతో మరింత పాపులర్ అయిన అషూ రీసెంట్గా బిగ్‌బాస్ ఓటీటీలోను అడుగుపెట్టింది. చదవండి: ‘సమంత అలా ఒంటరిగా చనిపోవాలి’ కామెంట్‌పై సామ్ ఏమన్నదంటే.. ఫినాలేకు అతి దగ్గర్లో ఉండగా అనూహ్యాంగా హౌజ్ నుంచి బయటకు వచ్చింది అషూ. అప్పటి నుంచి హాట్‌హాట్ ఫొటోలకు ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె బిగ్‌బాస్ నాన్‌స్టాప్ సహా కంటెస్టెంట్ అజయ్‌తో కలిసి మిర్చి మూవీలోని అనుష్క డైలాగ్పై రీల్ చేసింది అషూ. ‘కాలం మారిపోయి పద్దతులు మారాయి కానీ నాకే కనుక స్వయంవరం పెడితే ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చెవారో తెలుసా?’ అని చెబుతుంది. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ చూసిన హాలీవుడ్ మూవీ రైటర్, జక్కన్నపై ఆసక్తికర వ్యాఖ్యలు ఈ డైలాగ్ విని పక్కనే ఉన్న అజయ్ అషూ తలపై ఒకట్టిస్తాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ‘మీ మనసులోని మాటను కామెంట్ చేయండి’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో రెచ్చిపోయిన నెటిజన్లు రకరకాలుగా వారి మనసులో మాటను బయటపెడుతూ అషూను దారుణంగగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘ముందు మేకప్ తీసి రీల్ చేయ్ గుర్రాలు కాదు కదా.. కనీసం గాడిదలను వేసుకుని కూడా రారు’, ‘ముందు స్నానం చేయమ్మా.. కంపు కొడుతోంది.. ఆ తర్వాత రీల్ చేయ్’, ‘నీ ప్లాస్టిక్ సర్జరీ, మేకప్ ఫేస్‌కి అంత సీన్ లేదులే’ అంటూ దారుణంగా నెటిజన్లు దారుణంగా ల్రోల్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) -
జస్ట్ రూ.కోటి కారు కొనగలనంతే.. హీరోపై ట్రోలింగ్
Harsh Vardhan Kapoor Gets Trolled For His Sad Reality: బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్, ఆయన కుమారుడు హర్షవర్ధన్ కపూర్ కలిసి నటించిన తాజా చిత్రం థార్. ఈ మూవీ మే 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అనిల్ కపూర్ తనయుడు హర్షవర్ధన్ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తన జీవితంలోని విషాదకరమైన వాస్తవాన్ని పంచుకున్నాడు. కానీ అదికాస్త రివర్స్ అయింది. హర్షవర్ధన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ ట్రోలింగ్‌కు దిగారు. ఈ ట్రోలింగ్‌తో నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాడు హర్షవర్ధన్ కపూర్. ఇంటర్వ్యూలో 'ప్రేక్షకులకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నాకు వస్తువులు కొనేందుకు నా తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టముండదు. నాకు కావాల్సిన వాటిని నా సొంత డబ్బుతో కొనుక్కుంటాను. అందుకే నేను రూ. 3 కోట్ల ఖరీదుగల కారుకు బదులు కోటి రూపాయల లంబోర్గిని కారు కొనాల్సి వస్తుంది. నా దగ్గర ఉన్నదానికంటే పది రెట్లు ఎక్కువ ఉంటుందని మీరు అనుకుంటారు. నా దగ్గర 5 కార్లు, 30 గడియారాలు ఉంటాయని మీరు అనుకోవచ్చు. కానీ అది నిజం కాదు. ఇదే నా జీవితంలోని విషాదకరమైన వాస్తవం.' అని హర్షవర్ధన్ తెలిపాడు. చదవండి: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారంలో విడుదలైన చిత్రాలు.. ఈ ఇంటర్వ్యూ చూసిన నెటిజన్స్ హర్షవర్ధన్‌ను ఆడేసుకుంటున్నారు. 'నాకు కూడా అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్ధన్ కపూర్ల విచారంగా ఉండాలని ఉంది' అని ఒక యూజర్ ట్వీట్ చేశారు. మరొకరు అతనికున్న షూ వార్డ్రోబ్ చూపిస్తూ 'ఈ షూలన్ని వేసుకుని డ్రైవ్ చేయడానికి అతనికి లంబోర్గిని కారు లేదు. అదే నిజమైన బాధ.' 'ఇది చూసి ఆడిషన్స్‌కు 125సీసీ బైక్స్‌పై ఎవరు వెళ్తారు.' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: సమంత పాటంటే ఇష్టం: బాలీవుడ్ హీరో and this guy has room filled of shoes..... pic.twitter.com/IPKVFosGZP — pretty P (@sassymocha_) May 10, 2022 Strugglers who go to auditions on 125cc bikes reading this pic.twitter.com/hiyVUvCcjk — Sagar (@sagarcasm) May 10, 2022 Siddhant Chaturvedi is a legend 🔥🔥 pic.twitter.com/8bf8IhzEVx — Rahul D / राहुल / راہول (@rdalwale) May 10, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అందులో తప్పేముంది, అది నా ఇష్టం: ట్రోల్స్‌పై మలైకా ఫైర్
Malaika Arora Slams Trolling On Dating With Arjun Kapoor: బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ బి-టౌన్లో టాక్ కూడా వినిపిస్తోంది. అర్జున్ వయసు 36 కాగా, మలైకాకు 48 ఏళ్లు. వీళ్లిద్దరి మధ్య 12 ఏళ్ల వ్యత్యాసం ఉంది. దీంతో వీరిద్దరి రిలేషన్ విషయంలో తరచూ ట్రోల్స్ ఎదుర్కొంటోంది ఈ జంట. అయినా ఆ రూమార్లను అవాయిడ్ చేస్తు వారి పని వారు చేసుకుంటుపోతున్నారు. అలాగే వీరిద్దరూ మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి వారి రిలేషన్, ఏజ్ రిఫరెన్స్‌పై ప్రశ్నలు ఎదురువుతూనే ఉన్నాయి. చదవండి: అభిమాని ఓవరాక్షన్.. చితక్కొట్టిన మైక్ టైసన్, వీడియో వైరల్ ఆ సమయంలో వాటిని దాటేయకుండ ధీటూగా సమాధానం ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న మలైకాకు మరోసారి దీనిపై ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన ఆమె అసహనానికి లోనైంది. ఎందుకు అందరు ఈ విషయాన్ని పెద్దదిగా చూస్తున్నారంటూ ట్రోలర్స్‌పై మండిపడింది. ‘మన సమాజంలో వయసులో చిన్న వాడితో డేటింగ్ చేయడాన్ని తప్పుగా ఎందుకు భావిస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ నేను వాటిని పట్టించుకోను. ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి’ అంటూ సమాధానం ఇచ్చింది. చదవండి: సమంత ఫేక్ ఫొటో షేర్ చేసిన విజయ్, పడిపడి నవ్విన సామ్ అలాగే ‘ధైర్యంగా ఎలా జీవించాలో నేను మా అమ్మ నుంచి ప్రేరణ పొందాను. నాకు నచ్చిన జీవితం జీవించమని నాకేప్పుడు మా అమ్మ చెబుతూ ఉంటుంది. నేను ఒక ఇండిపెండెట్ ఉమెన్‌ని. నా జీవితాన్ని ఎలా జీవించాలనేది నా వ్యక్తిగతం. విడాకులు అనంతరం ప్రతి స్త్రీ లైఫ్‌లో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. వాటన్నింటిని అధిమించి మహిళలు ధైర్యంగా జీవించాలి’ అని మలైకా సూచించింది. కాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా ఇటీవలె రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ముంబై – పూణే ఎక్స్ ప్రెస్ హైవే మీద పన్వేల్ సమీపంలో ఈ నెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1521341774.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఛీ.. ఇదా మీరిచ్చే గౌరవం.. శిల్పా శెట్టి, బాద్షాపై నెటిజన్ల ఫైర్
Shilpa Shetty Badshah Gets Trolled Showing Attitude To Harnaaz Sandhu: హర్నాజ్ కౌర్ సంధు 'మిస్ యూనివర్స్ 2021' కిరీటాన్ని గెలిచి భారదేశం గర్వించేలా చేసింది. బాలీవుడ్ బ్యూటీ లారా దత్తా తర్వాత ఈ కిరీటాన్ని సాధించిన మూడో భారతీయురాలిగా హర్నాజ్ పేరు పొందింది. ఈ టైటిల్ సొంతం చేసుకున్నప్పటి నుంచి హర్నాజ్ సంధు అనేక వేడుకలకు హాజరవుతోంది. ఇటీవల లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై నడిచి ఆకట్టుకుంది. తాజాగా మోస్ట్ పాపులర్ అయిన బాలీవుడ్ షో 'ఇండియాస్ గాట్ టాలెంట్ 9'కు అతిథిగా హాజరైంది. ఈ రియాలిటీ షోలో శిల్పా శెట్టి, బాద్షా, మనోజ్ ముంతాషీర్, కిరణ్ ఖేర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో నుంచి హర్నాజ్ సంధు అతిథిగా హాజరైన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వైరల్ వీడియోలో హర్నాజ్ సంధు న్యాయనిర్ణేతలను పలకరించేందుకు వచ్చినప్పుడు శిల్పా శెట్టి పట్టించుకోకుండా కనిపించింది. మిగతా జడ్జ్‌లతో హర్నాజ్ షేక్‌హ్యాండ్ ఇస్తూ మాట్లాడుతుంటే శిల్పా శెట్టి మాత్రం తన చెల్లెలు షమితా శెట్టితో ఉంది. తర్వాత చివర్లో హర్నాజ్ను పలకరించింది శిల్పా శెట్టి. ఇది చూసిన నెటిజన్లు శిల్పా శెట్టి, బాద్షాపై మండిపడుతున్నారు. కనీసం అతిథులుగా గౌరవం ఇచ్చే సంస్కారం లేదని దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే శిల్పా శెట్టి, బాద్షాలు పలకరించిన తీరు ఫేక్ అంటూ కామెంట్ పెడుతున్నారు. హర్నాజ్ షేక్‌హ్యాండ్ ఇస్తున్నప్పుడు శిల్పా ఇచ్చి ఎక్స్ప్రెషన్ నెటిజన్లకు మింగుడుపడటం లేదు. View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) 'ఈ జడ్జ్‌లకు కనీస గౌరవమర్యాదలు తెలియవు. అంతా నకిలీ, కొంచెం కూడా ఇష్టం లేనట్టుంది. హర్నాజ్ సంధు ఎంత మంచి అమ్మాయి. దేశానికి ఎంత పేరు తీసుకొచ్చింది. కొంచెం కూడా గౌరవం లేదు. సిగ్గుచేటు.' అంటూ ఒకరు కామెంట్ పెట్టారు. మరొకరు 'వారి ముఖాలకు ఏమైంది ? ఫేక్ ఎక్స్ప్రెషన్స్', 'అసలు వాళ్లకైమైంది. వాళ్లదంతా నటన అని చాలా సులభంగా తెలిసిపోతుంది', 'ఈ అమ్మాయి దేశం కోసం చాలా చేసింది. 21 సంవత్సరాల తర్వాత కిరీటాన్ని తీసుకొచ్చింది. అందుకు జడ్జ్‌ల తీరు చూడండి. అదంతా ఫేక్. ఆమెను కలవడం వాళ్లకు బొత్తిగా ఇష్టం లేనట్టుంది', 'వారికి హర్నాజ్ నచ్చలేదని ఇప్పటిదాకా నేను మాత్రమే అనుకున్నాను' అని శిల్పా శెట్టి, బాద్షా తీరుపై మండిపడుతున్నారు నెటిజన్స్. View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) -
ఇదేం ఎక్స్పోజింగ్.. హీరోయిన్ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్ 2’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన ఈ బ్యూటీ లైగర్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం కానుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్‌కి జోడీగా అనన్య నటిస్తుంది. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే రీసెంట్గా ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా పార్టీకి హాజరైన అనన్య ప్రస్తుతం ట్రోలింగ్ బారిన పడింది. చదవండి: పార్టీలో హీరోయిన్‌తో విజయ్ ముచ్చట్లు.. వీడియో తీసిన చార్మీ ముంబైలో గ్రాండ్‌గా నిర్వహించిన ఈ బర్త్‌డే పార్టీకి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్, అనన్య, చార్మీ, పూరి జగన్నాథ్‌లు కూడా పార్టీలో తళుక్కున మెరిశారు. అయితే అనన్య వేసుకున్న డ్రెస్‌ను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరాను కాపీ కొడుతున్నావా ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: స్టార్ హీరో తమ్ముడితో లైగర్ భామ డేటింగ్, కన్ఫర్మ్ చేసిన తల్లి! View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఐదేళ్లుగా సినీ ఇండస్ట్రీ ఐసీయూ బెడ్‌పై ఉంది.. ఈ సినిమాతోనే ఆక్సిజన్ దొరికింది
Swara Bhasker Brutally Trolled For Allegedly Dig At Vivek Agnihotri: బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. సినిమాలో విభిన్నమైన పాత్రలు చేసే స్వరా వాస్తవ జీవితంలో కూడా విభిన్నంగా ఉంటుంది. సినిమాలపై స్పందన నుంచి సమాజంలో చోటు చేసుకుంటున్న ప్రతి అంశంపై తనదైన శైలిలో స్పందిస్తుంది స్వరా భాస్కర్. అయితే ఆమె ఎక్కువగా నెటిజన్ల మనోభావాలు దెబ్బతినే పోస్టులు, ట్వీట్లు పెట్టి ట్రోలింగ్‌కు గురవుతూ ఉంటుంది. తాజాగా మరొసారి ఇదే పరిస్థితి ఎదుర్కొంది స్వరా భాస్కర్. 'మీ కష్టంతో వచ్చిన విజయాన్ని చూసి మిమ్మల్ని ఎవరైనా అభినందించాలని అనుకుంటే.. గత ఐదేళ్లుగా తలలో చెత్త పెట్టుకుని గడపరనుకుంటా.' అని ట్వీట్ చేసింది ఈ కాంట్రవర్సీ బ్యూటీ. అయితే ఈ ట్వీట్ 'ది కశ్మీర్ ఫైల్స్' మూవీ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రిని ఉద్దేశించి చేసిందని నెటిజన్స్ స్వరాపై మండిపడుతున్నారు. ట్వీట్లతో దుమ్మెత్తిపోస్తున్నారు. వరుసగా ట్రోలింగ్ చేస్తున్నారు. 'మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని అనుకుంటా స్వరా. ప్రజలు అడుగుతున్నారు.. తాము ఆదరిస్తున్న సినిమాను ఎందుకు ప్రముఖ బాలీవుడ్ తారలు మెచ్చుకునేలా ఒక్క పదం కూడా మాట్లాడట్లేదని. అంటే కేవలం ప్రముఖమైన వారు మాత్రమే. మీరు చిల్ అవ్వండి.' అని నెటిజన్ కామెంట్ చేశాడు. మరో యూజర్ 'స్వరా చాలా తెలివైనది. ఒకరి కష్టంపై పేరు సంపాందించుకోవడం ఎలానో తనకు చాలా బాగా తెలుసు. కానీ జనం పిచ్చోళ్లు కాదు. నిన్ను నమ్మడానికి. ఇది నీ కెరీర్‌కు సహాయపడదు.' అని రాసుకొచ్చాడు. If you want someone to congratulate you for the ‘success’ of your efforts.. maybe don’t spend the last five years shitting on their heads.. 💁🏾♀️ #justsaying — Swara Bhasker (@ReallySwara) March 13, 2022 మరొకరైతే 'అతను అభినందించడానికి అర్హుడు స్వరా. ఐదేళ్ల నుంచి బాలీవుడ్ దాదాపు ఐసీయూ బెడ్‌పై ఉంది. ఈరోజు బాలీవుడ్‌కు అతనే ఆక్సిజన్ అందించాడు. ప్రజలు మర్చిపోయిన మిమ్మల్ని అతనే గుర్తు చేశాడు.' అని రాశారు. కాగా మార్చి 11న విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే బాలీవుడ్ తారలు కంగనా రనౌత్, అక్షయ్ కుమార్, యామీ గౌతమ్, హన్సల్ మెహతా, ఆదిత్య ధర్ తదితరులు ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం మెచ్చిన ఈ చిత్రానికి హర్యాణా, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, గోవా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు వినోదపు పన్ను రాయితీని కల్పించాయి. He deserve to be Congratulated @ReallySwara Since 5 years Bollywood has almost in ICU Bed, Today he gave Oxygen for Bollywood.. You were deleted from people brain, he reminded.. If you not support him by thinking he's not Terrorists gang, then read comments@vivekagnihotri https://t.co/EOSyiB3jc3 — RaMesh Chauhan #BJP_Only (@RameshChauhanM) March 14, 2022 People are talking about big Bollywood stars .. U can chill..Nobody is expecting anything from you.. #TheKashmiriFiles https://t.co/WtX3whFLjn — Upadhya Dr 🇮🇳 (@LonelyStranger_) March 14, 2022 -
ఛీఛీ ఇలాంటి చెత్త వీడియోలో నటించడమేంటి, కాస్తా చూసుకో: కీర్తిపై దారుణమైన ట్రోల్స్
Mahesh Babu Sarkaru Vaari Paata Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ మూవీలో మహేశ్ ఫ్యాన్ష్ ఎన్నో అంచాలను పెట్టుకున్నారు. అయితే ఇందులో మహేశ్‌కు జోడిగా కీర్తి సురేశ్‌ను ప్రకటించినప్పటి నుంచి మహేశ్ ఫ్యాన్స్ నిరాశ భావం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాటలో హీరోయిన్గా కీర్తి ఉత్తమమైన ఎంపిక కాదని, మహేశ్‌కు ఆమె సరైనా జోడి కాదంటూ నెటిజన్లు మొదటి నుంచి వ్యతిరేకత చూపుతున్న సంగతి తెలిసిందే. ఇక మహేశ్ సినిమాను మేలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఈ వాదనలు మరింత ఎక్కువయ్యాయి. మే నెల మహేశ్‌కు కలిసి రాకపోవడం, పైగా కీర్తి సురేశ్ హీరోయిన్ కావడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఎందుకుంటే ఇప్పటి వరకు ఆమె చేసిన చిత్రాల్లో నేను.. శైలజా, మహానటి తప్పా మరే సినిమాలు సక్సెస్ కాలేదు. ఇటీవల ఆమె నటించిన పెద్దన్న, గుడ్‌లక్ సఖీ, మిస్ ఇండియా బాక్సాఫీసు వద్ద భారీ పరాజయం పొందాయి. దీంతో కీర్తికి ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు. ఇదే సర్కారు వారి పాటకు కొనసాగుతుందేనేమోనని భయపడుతున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే ఆమె నటించిన గాంధారి మ్యూజిక్ వీడియో రీసెంట్గా విడుదలైంది. ఈ మ్యూజిక్ వీడియోలో కీర్తి నటించడంపై మహేశ్ ఫ్యాన్స్, నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి కళాకారులు సైతం మంచి విజువల్స్‌తో ఆకట్టుకునే మ్యూజిక్ వీడియోలు చేస్తున్న తరుణంలో కీర్తి ఇలాంటి చెత్త మ్యూజిక్ వీడియోలో నటించిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మ్యూజిక్ వీడియో సహజంగా లేదని, పేలవంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఆమె కాస్ట్యూమ్, వీడియో విజువల్స్ పేలవంగా ఉన్నాయని, ఈ సాంగ్ కాపీ కొట్టినట్లు ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘మహేశ్ బాబు వంటి స్టార్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న క్రమంలో ఆమె ఎంపికల అదే స్దాయిలో ఉండాలని, కానీ ఆమె ఇలాంటి సెకండ్ గ్రేడ్‌లో మ్యూజిక్‌లో నటించి తెలివి తక్కువగా వ్యవహరించింది’ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇకనైన ఆమె ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని, కనీసం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటించే వరకు ఇలాంటి మ్యూజిక్ చేయద్దని ఆమెకు సూచిస్తున్నారు. ఇక గాంధారీ మ్యూజిక్ వీడియోతో ఆమెపై వస్తున్న నెగిటివిటిని చూసి ‘సర్కారు వారి పాట’ మూవీ టీం సైతం కీర్తిపై అప్సెట్ అయినట్లు సినీవర్గాల నుంచి సమాచారం. మరి ఈ ట్రోల్స్‌పై కీర్తి ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. -
పప్పులో కాలేసి బుక్కైన దేత్తడి హారిక, చూసుకోమ్మా ఇంగ్లీష్ పాప అంటూ ట్రోల్స్..
బిగ్‌బాస్ ఫేం, యూట్యూబ్ స్టార్ దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వీపరితమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది. వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్‌తో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఆమె అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ 4 సీజన్లో పాల్గొనే చాన్స్ కొట్టేసింది. తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. బిగ్‌బాస్ తర్వాత ఆమెకు స్టార్డమ్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఖాళీ సమయంలో సోషల్ మీడియాలో వరస వీడియోలు, రీల్స్‌తో పాటు హాట్‌హాట్ ఫొటోషూట్లు షేర్ చేస్తోంది. చదవండి: ఘనంగా అనిల్ అంబానీ కుమారుడి వివాహం, బచ్చన్ ఫ్యామిలీ సందడి ఈ క్రమంలో ఆమెకు అభిమానుల సంఖ్యతో పాటు ట్రోలర్స్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఆమె షేర్ చేసిన వీడియోలు, ఫొటోలపై ఓవరాక్స్ ఎక్కువైందంటూ విమర్శించడమే కాకుండా బుడ్డది, పొట్టిది అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రీసెంట్గా ఆ ట్రోల్స్ స్పందించిన హారిక ‘ఎవడు పడితే వాడు బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా.. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమాని అయి ఉండాలి’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్‌తో ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి ట్రోలర్స్‌కు అవకాశం ఇస్తూ ఓ వీడియో షేర్ చేసింది. తన నటన ప్రతిభను చూపిస్తూ వింత వింత ఎక్స్‌ప్రెషన్స్‌తో ఓ వీడియోను ఫేస్బుక్లో షేర్ చేస్తూ.. దానికి ఎక్స్ప్రెషన్ క్వీన్ (Expresstion Queen) అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఇక్కడే పప్పులో కాలేసింది హారిక. Expression బదులుగా Expresstion అని స్పెల్లింగ్ మిస్టేక్ పెట్టింది. దీంతో అది చూసిన ట్రోలర్స్ హరీకను ఆడేసుకుంటున్నారు. ‘బిగ్‌బాస్ హౌజ్‌లో మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతూ ఇంగ్లీష్ పాపల బిల్డప్ ఇచ్చావు.. కాస్తా స్పెల్లింగ్ చూసుకోమ్మా’ అని ‘ఎక్స్ప్రెషన్ ఇవ్వడం ఎలాగూ రాదు.. కనీసం స్పెల్లింగ్ అయినా సరిగా రాయడం నేర్చుకోమ్మా ఇంగ్లీష్ పాప’ అంటూ సటైరికల్‌గా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే తనన ఇలా ట్రోల్ చేయడానికి కారణం లేకపోలేదు. చదవండి: భీమ్లా నాయక్ ట్రైలర్‌పై వర్మ షాకింగ్ కామెంట్స్, పవన్‌పై వరస సటైరికల్ ట్వీట్స్ ఇంత చిన్ని విషయానికే ఆమెకు నెటిజన్ల ఎందుకు టార్గేట్ చేశారంటే.. బిగ్‌బాస్ హౌజ్‌లో తరచూ ఇంగ్లీష్ మాట్లాడుతూ బిగ్‌బాస్‌కు హారిక కోపం తెప్పించిన సంగతి తెలిసిందే. తెలుగులోనే ఎక్కువగా మాట్లాడాలని ఎన్నిసార్లు చెప్పిన హారిక మాత్రం ఇంగ్లీష్ ఎక్కువగా.. తెలుగు తక్కువగా మాట్లాడేది. బెసిగ్గా ఆమె తెలుగు అమ్మాయే అయినప్పటికీ ఇంగ్లీష్ మాట్లాడానికి ఆమె ఇష్టపడటంతో ప్రేక్షకుల అసహనానికి గురైంది. అంతేకాదు హోస్ట్ నాగార్జున సైతం ప్రతివారం తెలుగులోనే మాట్లాడు హారిక అంటూ నొక్కి మరి చెప్పేవారు. ఇక ఇంగ్లీష్ మాట్లాడితే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని బిగ్‌బాస్ హెచ్చరించిన హారిక తన తీరును మాత్రం మార్చుకోలేదు. -
అవి డిలీట్ చేయండి.. లేదంటే రూ.10 కోట్ల దావా: మంచు ఫ్యామిలీ వార్నింగ్
మూవీ అర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల అనంతరం మంచు కుటుంబంపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి. మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి ఈ ట్రోల్స్ మరింత శృతి మించాయి. సోషల్ మీడియాల్లో ఎక్కడ చూసిన విష్ణు మంచు, లక్ష్మి ప్రసన్నలపై ట్రోల్స్, మీమ్స్ దర్శనమిస్తున్నాయి. ఇక తాజాగా మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా మూవీపై ట్రోల్స్ పుట్టుకొస్తున్నాయి. చదవండి: భీమ్లా నాయక్‌కు ఓటీటీల పోటీ, భారీ డీల్‌కు సొంతం చేసుకున్న దిగ్గజ సంస్థలు! నిన్న(ఫిబ్రవరి 18) విడుదలైన సన్నాఫ్ ఇండియా మూవీపై ట్రోలర్స్ రెచ్చిపోయారు. ఈ సినిమాలోని మోహన్ బాబు నటన, డైలాగ్స్‌పై మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. మరోవైపు మంచు విష్ణు, లక్ష్మి ప్రసన్నలతో పాటు మంచు ఫ్యామిలీ మెంబర్స్‌ను కూడా వదలడం లేదు. ఇప్పటికే మోహన్ బాబు ట్రోల్స్‌పై స్పందించి గట్టి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయిన ట్రోల్స్ ఆగకపోవడం తాజాగా మంచు ఫ్యామిలీ స్పందించింది. చదవండి: పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ టాలీవుడ్ రైటర్ ఇకనైన ట్రోల్స్ ఆపకుంటే తీవ్ర పరిణమాలు ఎదుర్కొవాల్సి వస్తుందంటూ మంచు ఫ్యామిలీ హెచ్చరించింది. ఈ మేరకు మంచు ఫ్యామిలీ టీం తరపున శేషు కుమార్ అనే వ్యక్తి లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా.. తక్షణమే టోల్స్‌కు సంబంధించిన వీడియోలు, మీమ్స్ పోస్ట్‌లు డిలిట్ చేయాలని, లేదంటే క్రిమినల్ కేసులు పెట్టి 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. -
ట్రోల్స్‌పై స్పందించిన మోహన్ బాబు, ఆ హీరోలే ఇలా చేయిస్తున్నారంటూ సీరియస్
టాలీవుడ్ చెందిన ఓ ఇద్దరు హీరోలకు డైలాగ్ కింగ్, విలక్షణ నటుడు మోహన్ బాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కావాలనే ఆ ఇద్దరు హీరోలు తనని, తన కుటుంబంపై ట్రోల్స్ చేయిస్తున్నారంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా నటించిన చిత్రం సన్నాఫ్ ఇండియా. డైమండ్ రత్నబాబు దర్శకత్వంతో మంచు విష్ణు తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో ఈ వ్యాఖ్యలు చేశారు. చదవండి: అతడే నా భర్త, ఇంట్లో చెప్పే పెళ్లి చేసుకుంటాను: రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు ‘మా’ ఎలక్షన్స్ సమయంలో, పలు సందర్భాల్లో మంచు విష్ణు, మోహన్ బాబు మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో వారి మాటలపై మీమ్స్ క్రియేట్ చేయడం, వీడియోలతో ట్రోల్ చేయడంతో అవి వీపరీతంగా వైరల్ అయ్యాయి. తాజాగా మోహన్ బాబు ఈ ట్రోల్స్‌పై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ట్రోల్స్, మీమ్స్ అనేవి సరదాగా నవ్వుకునేలా ఉండాలి. కానీ ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. సాధారణంగా నేను ట్రోలింగ్స్, మీమ్స్‌ను పట్టించుకోను. ఎవరైనా నాకు పంపినప్పుడే చూస్తాను. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. ‘ఏం మాయ చేశావే’ నటుడు కన్నుమూత అయినా వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇటీవల ఇవి హద్దులు మీరుతున్నాయి. ఇలాంటి వాటిని చూసినప్పుడు బాధగా ఉంటుంది. ఎదుటి వారిని ట్రోలింగ్ చేయొచ్చేమో నాకు తెలియదు.. కానీ వ్యగ్యంగా ట్రోల్ చేయడం అనేది బాధాకరంగా ఉంటుంది” అని అన్నారు. అంతేగాక తనపై ఇద్దరు హీరోలు ట్రోలింగ్ చేస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స చేశారు. ‘నా మీద ఇద్దరు హీరోలు ట్రోలింగ్ చేయిస్తున్నారు. ఇద్దరు హీరోలు యాబై నుంచి వంద మందిని ప్రత్యేకంగా నియమించుకుని నన్ను ట్రోల్ చేయిస్తున్నారు. వాళ్లెవరో కూడా తెలుసు. వారిని ప్రకృతి గమనిస్తోంది. ఇప్పుడు వారికి బాగానే ఉంటుంది. కానీ ఏదో ఒక రోజు శిక్ష అనుభవిస్తారు. అప్పుడు వారి వెనుక ఎవరూ ఉండరు’ అంటూ హెచ్చరించారు. -
నా ప్రియుడు ఇతడేనంటూ హీరోయిన్ వీడియో, ఆమె తీరుపై ఫ్యాన్స్ అసహనం
సౌత్ స్టార్ హీరోయిన్ మళవిక మోహన్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇతడితోనే ప్రేమలో ఉన్నానంటూ వాలంటైన్స్ డేకు ఆమె షేర్ చేసిన వీడియోపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాయ్‌ఫ్రెండ్ పరిచయం చేస్తానని చెప్పి నువ్వు చేసేది ఇదా అంటూ నెటిజన్లు ఆమెను వీపరితంగా ట్రోల్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటేజ.. సోమవారం ప్రేమికుల రోజు సందర్భంగా మాళవిక ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో ఆమె ఎమోషనల్ వర్డ్స్‌తో తన ప్రేమను పరిచయం చేస్తున్నట్లు బాగా ఓవరాక్షన్ ఇచ్చింది. తీరా చూస్తే అది తను చేసిన కమర్షియల్ యాడ్. స్కోడా స్లావియా కారును ప్రమోట్ చేస్తూ ఈ వీడియోను షేర్ చేసింది. చదవండి: ఇండస్ట్రీ పెద్దన్న, మా అందరి అన్న ఆయనే: నటుడు నరేష్ నిజంగానే తన ప్రియుడిని చూపిస్తుందని ఎంతో ఆసక్తిగా ఎదురు చేసిన ఫ్యాన్స్, ఫాలోవర్స్ కంగుతినెలా ఉంది ఈ వీడియో. దీంతో దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ మాళవికపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమోషన్స్ ఆడుకోకు, వావ్ ఈ బాయ్ ఫ్రెండ్ సూపర్, మోస్టియెంట్ హ్యాండ్స్‌మ్ అంటూ ఆమె పోస్ట్‌పై వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. కాగా ఇటీవల మళవిక.. త్వరలోనే తన బాయ్‌ఫ్రెండ్ ఎవరో చెప్పాస్తానంటూ ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తన బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్పాలంటే ఖచ్చితంగా తన వీడియోకు మిలియన్ వ్యూస్ రావాలని ఆమె కండిషన్ పెట్టింది. చదవండి: బర్త్‌డే స్పెషల్: నటి మీరా జాస్మిన్ ఇప్పుడేం చేస్తుంది.. ఎక్కడుందో తెలుసా? View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) -
హీరోయిన్ బాడీపై అసభ్య కామెంట్, నందిత దిమ్మతిరిగే సమాధానం
సోషల్ మీడియాలో సెలబ్రెటీలు ట్రోల్స్ బారిన పడటం సాధారణ విషయమే. మరి ఎక్కువగా నటీమణులు, హీరోయిన్లు తరచూ విమర్శలు ఎదుర్కొంటుంటారు. వారిని నెటిజన్లు ట్రోల్స్ చేస్తుండగా.... మరికొందరు హద్దులు దాటి వారి శరీరాకృతిపై కామెంట్స్ చేస్తూ బాడీ షేమింగ్‌కు దిగుతుంటారు. అయితే నటీమణుల్లో కొందరు వీటిని చూసి చూడనంటూ వదిలేస్తే.. మరికొందరూ ఘాటుగా స్పందిస్తూ ట్రోలర్స్‌కు చురకలు అట్టిస్తారు. తాజాగా నటి నందిత శ్వేతాకు ఇదే తరహాలో చేదు అనుభవం ఎదురైంది. ఆమె షేర్ చేసిన ఓ ఫొటోపై నెటిజన్ బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్ చేయడంతో అతడిపై మండిపడింది. స్లీవ్‌లెస్ గ్రే కలర్ టీ షర్ట్, ష్కర్ట్ ధరించి గొడకు వాలి నవ్వుతూ పైకి చూస్తున్న తన సైడ్ యాంగిల్ లుక్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇక దీనిపై ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేయగా ఓ ఆకతాయి తన శరీరాకృతిపై అసభ్యంగా స్పందించాడు. ప్లీజ్ మీరు శరీరంపై శ్రద్ధ పెట్టండి. మీ షేప్స్ చూసుకొండి ఓసారి. ఆంటీలా అవుతున్నావ్. కాస్తా వర్కౌట్స్ చేయ్’ అంటూ కామెంట్ చేశాడు. ఇది చూసిన నందిత అతడిపై మండిపడింది. ఆ కామెంట్‌ను స్క్రిన్ షాట్ చేసి ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘ఇలాంటి వాళ్లతో నరకం. మనుషులు ఇలా కూడా ఉంటారా?. నేను దేవతను కాదు.. నేను కూడా ఓ సామాన్య మనిషిని. అందరిలానే నాకు కూడా బాధలు ఉంటాయి.. ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారు.. నా శరీరాన్ని నేను ప్రేమిస్తాను.. ఇప్పుడు నేను ఉన్న స్థితిని, కనిపించే విధానాన్ని కూడా ఇష్టపడుతున్నాను’ అంటూ అతడికి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది. కాగా నందిత ఎక్కడికి పోతావు చిన్నవాడా? మూవీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రేమ కథా చిత్రం 2 మూవీ, అక్షర వంటి చిత్రాలతో పాటు తమిళంలోను పలు సినిమాల్లో నటించింది. ఇటీవల ఆమె ఐపీసీ 376 అనే సినిమాలో చేసింది. వీటితో పాటు పలు టీవీ షోలకు జడ్జీగా కూడా వ్యవహరిస్తోంది. View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) -
ట్రోల్స్‌పై ప్రియమణి స్పందన, వారికి మాత్రమే సమాధానంగా ఉంటాను..
సౌత్ స్టార్ హీరోయిన్స్‌లో ప్రియమణి ఒకరు. యమదొంగ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి తొలి చిత్రంతో సూపర్ హిట్ కొట్టింది. కానీ ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు పెద్ద గుర్తింపు పొందలేదు. ఈ క్రమంలో ఆడపదడపా చిత్రాలు చేసుకుంటునే వ్యాపారవేత్త ముస్తాఫా రాజును పెళ్లాడింది. పెళ్లి అనంతరం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ 2తో రీఎంట్రీ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్‌లో తన నటనకు జాతీయ అవార్డును కూడ అందుకుంది. అప్పటీ నుంచి వరస సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా ప్రియమణి ఫుల్ బిజీ అయిపోయింది. చదవండి: వరుణ్ తేజ్‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య, ఏం చెప్పిందంటే.. ఆమె తాజాగా ‘భామాకలాపం’ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. త్వరలో ఇది ఆహాలో విడుదల కానుంది. ఇలా సైలెంట్‌గా తన పని తను చూసుకుంటూ, సినిమాలు చేసుకుంటున్న ప్రియమణిని తరచూ ట్రోలర్స్ టార్గెట్ చేస్తుంటారు. ఆంటీ అంటూ విమరించడమే కాక ఒకనోక సమంలో తనని బాడీ షేమింగ్ కూడా చేశారు. వీటికి ఆమె గతంలో ఘాటూగానే సమాధానం ఇచ్చింది. అయినప్పటికీ ట్రోల్స్ తగ్గడం లేదు. ఈ క్రమంలో తాజాగా ‘భామాకలాపం’ ప్రమోషన్లో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రోల్స్‌పై స్పందించింది ప్రియమణి. ఆమె మాట్లాడుతూ.. ‘పెళ్లి అయిన తర్వాత కెరీయర్ పరంగా ఇప్పుడు బిజీ అయ్యాను. ఇప్పుడు చాలా సంతృప్తిగా అనిపిస్తోంది. వెబ్ సిరీస్, సినిమాలు వరుసగా చేస్తున్నాను. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: మోడల్ ఆత్మహత్యాయత్నం కేసులో బయటకొచ్చిన షాకింగ్ నిజాలు.. 2006 నుంచి 2012 వరకు చాలా బిజీగా ఉన్నాను. అంతేకాదు ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా ముఖ్యం. అందుకని పని తగ్గించుకుని ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తున్నాను. అప్పుడు టీవీ షోస్ చేస్తూ వెళ్లాను. సినిమాల్లో అవకాశాలు తగ్గడం వల్లనే టీవీ షోలు చేస్తుందని కొంతమంది కామెంట్ చేసి ఉండొచ్చు. కానీ నేను ఎప్పుడూ కూడా యూట్యూబ్ చూడను .. కామెంట్లు చదవను .. వాటి గురించి అసలు పట్టించుకోను. ఎందుకంటే ప్రతి కామెంట్‌కు రియాక్ట్ కాలేము కదా? అంటూ చెప్పకొచ్చింది. అంతేకాదు తనకు ఫ్యామిలీ సపోర్ట్ ఉందని, ఏదైన ఉంటే నా ఫ్యామిలీ, భర్తకు సమాధానం చెప్పుకుంటాని, వేరే వాళ్లకు నేను వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ ట్రోలర్స్ ఘాటుగా సమాధానం ఇచ్చింది. -
రణ్వీర్ సింగ్ డ్రెస్ వేసుకొచ్చావా.. దీపికాపై ట్రోలింగ్
Deepika Padukone Trolled On Her Dress: సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చేసే పనులు, చేష్టలు, డ్రెస్సింగ్ విధానాల వల్ల ప్రశంసల జల్లులు కురిస్తే ఒక్కోసారి అభాసుపాలవుతారు. నెటిజన్ల ట్రోలింగ్ బారిన పడిన అనేక మంది సెలబ్రిటీలు ఉన్నారు. తాజాగా బీటౌన్ డింపుల్ సుందరి, రణ్వీర్ సింగ్ భార్య దీపికా పదుకొణె ట్రోలింగ్‌కు గురైంది. ఇటీవల శకున్ బాత్ర తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా 'గెహ్రైయాన్' చిత్రంలో అలీషాగా ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లో బిజీగా ఉంది దీపికా. అయితే ఇటీవల జరిగిన ప్రమోషన్లో దీపికా డ్రెస్సింగ్ స్టైల్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. దీపికా పదుకొణె జీబ్రా ప్రింట్ బ్లేజర్‌ను ధరించి ఈ సినిమా మిగతా టీమ్ అయిన అనన్య పాండే, సిద్ధాంత్ చతుర్వేది, డైరెక్టర్ శకున్ బాత్రాతో కనువిందు చేసింది. దీపికా ఆ వేర్లో అందంగా కనిపించినప్పటికీ నెటిజన్లు ట్రోల్ చేశారు. 'రణ్వీర్ డ్రెస్ వేసుకున్న దీపికా' అని ఒకరు కామెంట్ చేయగా మరొకరు 'దీపికాకు కొత్త స్టైలిస్ట్, మేకప్ ఆర్టిస్ట్ కావాలి' అని సూచించారు. ఇంకొకకరైతే 'నేను నిజంగా దీపిక, రణ్వీర్ సింగ్‌ల డిజైనర్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను. దీపికా ఒకప్పుడు చాలా అందంగా స్టైలిష్‌గా ఉండేది. కానీ ఇప్పుడు..' అంటూ కామెంట్ పెట్టారు. దీపికా అభిమానులైతే లవ్ సింబల్స్‌తో తమ ప్రేమను తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
రిపబ్లిక్ డే వివాదంలో అనసూయ.. ఫైనల్‌గా
Anasuya Trolled On Republic Day For Singing National Song: బుల్లితెర యాంకర్‌గా తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో పాపులర్ అయింది అనసూయ భరద్వాజ్. ఓ పక్క గ్లామరస్ యాంకర్‌గా రాణిస్తూనే మరోపక్క వెండితెరపై తళుక్కుమంటుంది. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలో దాక్షాయణిగా అలరించి మరింత పాపులర్ అయింది. అలాగే అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్‌తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అప్పుడుప్పుడు పలు వివాదాలు కూడా అనసూయను పలకరిస్తూ ఉంటాయి. నెటిజన్లు ట్రోల్ చేయడం, వారికి స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇవ్వడం పరిపాటే. అయితే తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా అనసూయ చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. క్లారిటీ ఇద్దామనుకున్న ట్రోలింగ్ ఆగట్లేదు. ఇంతకీ అనసూయ చేసిన పని ఏంటంటే.. అనసూయ జాతీయ గేయాన్ని నిలుచుని పాడకుండా కుర్చీలో కూర్చొని పాడింది. జాతీయ గీతం, జాతీయ గేయం ఏదైనా సరే మనం గౌరవిస్తూ ఆ రెండు పాడే సమయాల్లో లేచి నిల్చుంటాం. అనసూయ అలా చేయకుండా కూర్చొని పాడేసరికి నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అలాగే అనసూయ వేసుకున్న టీషర్ట్ మీద గాంధీ బొమ్మ ఉండటంతో గాంధీ బొమ్మ ఎందుకు వేసుకున్నావ్.. ఈరోజు అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగానికి గాంధీకి సంబంధం ఏంటని కామెంట్ పెట్టారు. ఈ కామెంట్లకు విసిగిన అనసూయ క్లారిటీ ఇచ్చింది. ఒక యూజర్ కామెంట్‌కు 'లేదు.. నేనే సారీ చెబుతున్నా. ఇదంతా చూస్తుంటే నేను నిల్చోకుండా పాడినందుకు చాలా మంది హర్ట్ అయినట్టున్నారు.' అలాగే టీ షర్ట్‌పై గాంధీ బొమ్మపై వచ్చిన కామెంట్లకు 'అరే ఏందిరా బై మీ లొల్లి.. నేషనల్ ఆంథమ్ అంటారు. గాంధీకి రాజ్యాంగానికి సంబంధం ఏంటని అంటారు. మరి జనగణమణ ఏంది.. ఆగస్ట్ 15, 1947 తర్వాతే జనవరి 26, 1950 అయింది. కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకోనన్నా మాట్లాడండి. హ్యాపీ రిపబ్లిక్ డే' అని చెప్పింది అనసూయ. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
చిన్నారిని పట్టించుకోని రష్మిక.. 'నీ సినిమాలు చూసేదేలే' అని కామెంట్లు
Rashmika Mandanna 'Breaks Hearts', Brutally Trolled: సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. 'ఛలో' సినిమాతో తెలుగులో తెరంగ్రేటం చేసి 'గీత గోవిందం'తో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో 2019 సంవత్సరంలో 'ఇండియన్ నేషనల్ క్రష్'గా అరుదైన గుర్తింపును కూడా పొందింది. ఇటీవల విడుదలైన ఐకానిక్ స్టార్ సరసన నటించిన 'పుష్ప' సినిమాలో శ్రీవల్లిగా బాలీవుడ్‌లోనూ ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. సినిమాలతో బిజీగా ఉండే రష్మిక ఫిట్నెస్ వీడియోలు, క్యూట్ ఎక్స్ప్రెషన్ ఫొటోస్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది ఈ అమ్మడు. అయితే ఈ కన్నడ సుందరి తాను చేసే పనులతో ట్రోలింగ్ బారిన పడుతోంది. ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో రష్మిక డ్రెస్సింగ్ స్టైల్‌పై నెటిజన్స్ ఓ ఆట ఆడేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ముంబైలో ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్లిన రష్మిక మళ్లీ ట్రోలింగ్ బారిన పడింది. ముంబైలో ఓ హోటల్ నుంచి బయటకొచ్చిన రష్మికను ఓ చిన్నారి ఆకలిగా ఉందంటూ డబ్బులు అడగడం స్టార్ట్ చేసింది. అప్పటికే ఆ చిన్నారిని సెక్యూరిటీ గార్డులు పక్కకు తోయడం వంటివి చేసిన ఆ పాప రష్మిక వద్దకు వచ్చి ప్రాధేయపడుతూ ఉంది. అది చూసి 'తన వద్ద డబ్బులు లేవు' అని చెప్తూ నవ్వుకుంటూ వెళ్లిపోయింది. వేరే ఎవరితో కూడా సాయం అందించడం వంటిది చేయలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రష్మికను ఏకిపారేస్తున్నారు. 'చిన్న పాప అలా నిన్ను అడుక్కుంటుంటే నీకు నవ్వు ఎలా వస్తుంది' అని ప్రశ్నిస్తున్నారు. 'అసలేంటీ నీ యాటిట్యూడ్' అని విరుచుకుపడుతున్నారు. 'ఈరోజు నుంచి నీ సినిమాలు చూడం' అని కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by F I L M Y G Y A N (@filmygyan) -
సుకేష్ కన్నా ఆమె బాడీగార్డే బెటర్.. వీడియోపై ట్రోలింగ్
Jacqueline Fernandez Trolls Old Video Her Bodyguard Better Than Sukesh: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గతేడాది నుంచి తరచుగా వార్తల్లో నిలుస్తోంది. సుకేష్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ఇటీవల తన వ్యక్తిగత ఫొటోలు ప్రసారం చేయొద్దని విన్నవించుకున్న సంగతి తెలిసిందే. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసు విచారణ మధ్యలో సుకేష్‌తో జాక్వెలిన్ ప్రైవేట్ ఫొటోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. దీంతో మీడియా మొత్తం జాక్వెలిన్‌పై దృష్టి సారించింది. అయితే తాజాగా ఈ శ్రీలంక భామ పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. 'సుకేష్ ఎక్కడా ఉన్నాడు. అస్సలు కనపడట్లేదుగా' అని ఒక యూజర్ రాస్తే సుకేష్ కన్నా ఆమె బాడీగార్డే బాగున్నాడు అని మరొకరు స్పందించారు. 'ఇంకా పీఆర్ వాళ్ల కష్టం బాగా తెలుస్తోంది', 'ఇదంతా డ్యామెజ్ కంట్రోల్ కోసం', 'జాక్వెలిన్‌ను ఇలా చూసే సుకేష్ ఫిదా అయింటాడు' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ త్రోబ్యాక్ వీడియోలో ఎరుపు రంగు సాటిన్ దుస్తులు ధరించి ప్రతి ఒక్క ఫొటోగ్రాఫర్ ఫొటోలకు ఫోజులిచ్చింది జాక్వెలిన్. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) ఇదీ చదవండి: మీడియాకు జాక్వెలిన్ అభ్యర్థన.. అవి ప్రసారం చేయొద్దని -
హీరోయిన్‌కు కరోనా, మీ చావు కబురు కోసం ఎదురుచూస్తుంటామంటూ..
సినీ పరిశ్రమలో కరోనా కలకలం సృష్టిస్తోంది. వరసగా సినీ తారలు కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు కరోనా పాజిటివ్‌గా పరీక్షించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. ‘నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలి' అని సూచించింది. చదవండి: క్లైమాక్స్ లేకుండా రిలీజైన రానా మూవీ, ప్రేక్షకుల అసహనం.. డబుల్ మాస్క్ దరించి సురక్షితంగా ఉండాలని, ఇప్పటికే డబుల్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నందున త్వరలోనే నెగిటివ్ వస్తుందని ఆశిస్తున్నా’ అని పేర్కొంది. దీంతో అది చూసిన నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. తనకు కరోనా అంటూ చేసిన పోస్ట్‌పై తమదైన శైలీలో స్పందిస్తున్నారు. ‘గుడ్‌న్యూస్ చెప్పావు. ‘2022లో బెస్ట్ న్యూస్ ఇదే, కరోనా వచ్చిందా? అయిదే చచ్చిపో.. నీ మరణవార్త కోసం ఎదురు చూస్తుంటాం’ అంటూ ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు స్పందించిన పోస్ట్స్ నెట్టంట చర్చనీయాంశమైంది. చదవండి: ‘మణిరత్నంను ఇంతవరకు కలవలేదు, ఆయనతో నాకు చేదు అనుభవం ఉంది’ View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara) -
పగలబడి నవ్విన అలియా.. ఇక ట్రోలింగ్ చూడండయ్యా
Alia Bhatt Trolled For Her Laugh Video Goes Viral: సోషల్ మీడియాలో నెటిజన్లు చాలా అలర్ట్‌గా ఉంటారు. సెలబ్రిటీల రెగ్యూలర్ యాక్టివిటీస్‌పై ఓ కన్ను వేసి ఉంచుతారు. హెయిర్ స్టైల్ నుంచి నడక వరకు ప్రతిదీ ఒ కంట కనపెడుతూ ఉంటారు. సెలబ్రిటీలు చేసింది ఏదైనా నచ్చితే ఆకాశానికెత్తేస్తారు. లేదా తారల వైఖరీ నెటిజన్స్‌కు కొంచెం తేడా కొట్టిన ట్రోలింగ్‌తో ఏకిపారేస్తారు. బాలీవుడ్లో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది క్యూట్ బ్యూటీ అలియా భట్. ప్రస్తుతం తెలుగులో రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు సీతగా దగ్గర కానుంది. అయితే ఈ సీతను ప్రస్తుతం నెటిజన్స్ ట్రోలింగ్‌తో ఆడేసుకుంటున్నారు. ఇటీవల ఒక ఈవెంట్లో అలియా భట్ కెమెరాలకు ఫోజులిస్తూ నవ్వుతుంది. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఈ వీడియో వెంటనే వైరల్‌గా మారింది. ఇందులో అలియా రకరకాల ఫోజులిస్తూ కొంచెం పగలబడి నవ్వుతూ కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు ఆమెది ఫేక్ నవ్వని ట్రోలింగ్ చేస్తున్నారు. 'బలవంతపు నవ్వు', 'ఆమె చిరునవ్వు చిందించడానికి ఎందుకు అంత బాధపడుతుందో తెలియట్లేదు' అని కామెంట్ల్ పెడుతున్నారు. ఇంతకుముందు దీపికా పదుకొణెది ఫేక్ నవ్వు అని అలియా కామెంట్ చేసిందని మరొక యూజర్ గుర్తు చేశాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) ఇదీ చదవండి: ప్రముఖ హీరోను చూసి కన్నీళ్లు పెట్టుకున్న రణ్వీర్ సింగ్ -
ఢిల్లీ సీఎంకు కరణ్ జోహార్ ట్వీట్, నిర్మాతపై నెటిజన్ల మండిపాటు
Karan Johar Trolled By Netizens For His Tweet to Delhi CM Over Theatres Re-Open: సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు ట్రోల్స్ సెగ తగలడం కొత్తేమి కాదు. పలువురు సినీ సెలబ్రెటీలు వారి తీరుతో సోషల్ మీడియాలో చేదు అనుభవాన్ని చవిచూస్తుంటారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌కు ట్రోల్స్ సెగ తగిలింది. అయితే సోషల్ మీడియాలో నెగిటివిటి తెచ్చుకోవడం కరణ్‌కు ఇదేం కొత్త కాదు. తరచూ ఆయన సోషల్ మీడియాల్లో ట్రోల్స్ బారిన పడుతుంటాడు. తాజా కరోనా నేపథ్యంలో మూసి వేసిన థియేటర్లను తెరవాలంటూ ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. దీంతో కరణ్‌పై నెటిజన్లు ధ్వజమెతున్నారు. చదవండి: దుబాయ్‌లో హీరోయిన్‌తో హీరో విక్రమ్ తనయుడు డేటింగ్, ఫొటోలు వైరల్ అయితే ప్రస్తుతం దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రెటీలు వరసగా కరోనా బారిన పడుతున్నారు. దీనికి కరణ్ ఇచ్చిన ఓ విందు పార్టీయే వేదిక అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో దేశ రాజధానిలో మరోసారి థియేటర్లు మూత పడ్డాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అక్కడి థియేటర్లు మూసీవేయాలంటూ ఆదేశం ఇచ్చారు. దీంతో సీఎం నిర్ణయంపై స్పందిస్తూ కరణ్ జోహార్ ఇలా ట్వీట్ చేశాడు. ‘మిగతా చాల చోట్లతో పోలిస్తే సినిమా థియేటర్లో కరోనా వ్యాపించే అవకాశాలు తక్కువ. చదవండి: విషాదం: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ మృతి కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, సొషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ బాక్సాఫీస్ నడపవచ్చు. అందుచేత తిరిగి థియేటర్లు ఒపెన్ చేయడానికి అనుమతి అవ్వండి’ అని కోరుతూ ఆయన ట్వీట్ చేశాడు. అది చూసిన నెటిజన్లు కరణ్‌పై విరుచుపడుతున్నారు. మీ ట్వీట్ ఉద్దేశం ఏంటి.. మమ్మల్ని డబ్బులు సంపాదించుకోనివ్వండి. సామాన్యులు యాతన పడనివ్వండి అనేగా అంటూ కరణ్‌కు నెటిజన్లు క్లాస్ పీకుతున్నారు. కరణ్ చెబుతోన్న లాజిక్ ‘బాలీవుడ్ వర్సెస్ సైన్స్’ అంటూ వెక్కిరించారు. మరికొందరు ‘సినిమాల్ని ఓటీటీలో చూసుకోవచ్చు. థియేటర్స్ తెరిచి జనం ప్రాణాలతో ఆటలాడకండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. We urge the Delhi Government to allow cinemas to operate. Cinemas are equipped with better ability to ensure a hygienic environment while maintaining social distancing norms as compared to other out-of-home settings. @LtGovDelhi @ArvindKejriwal @OfficeOfDyCM #cinemasaresafe — Karan Johar (@karanjohar) December 30, 2021 -
అలియా భట్‌పై నెటిజన్లు ఫైర్.. బాధ్యత ఉండక్కర్లేదా అని ట్రోలింగ్
Alia Bhatt Gets Trolled For Not Wearing Mask In Public Place: కరోనా సృష్టించిన కల్లోలాన్ని మరిచిపోకముందే ఒమిక్రాన్ నేనున్నాను అంటూ రెచ్చిపోతుంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరగడం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తేనే మనుగడ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. అయినా పలువురు నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. సామాన్యులు అయితే వారంతే అని ఎదో ఊరుకుంటారు. కానీ సినీ సెలబ్రిటీలు సైతం ఇలానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారి అభిమానులకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారో తెలియట్లేదు. ఇటీవల లోక నాయకుడు కరోనా నుంచి కోలుకున్న వెంటనే బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా వెళ్లి ప్రభుత్వంతో మొట్టి కాయలు వేయించుకున్నాడు. తాజాగా కరోనా నిబంధనలను అతిక్రమించినందుకు ఆర్ఆర్ఆర్ సీత అలియా భట్‌పై ట్రోలింగ్‌కు దిగారు నెటిజన్స్. అందమైన ప్రేమ జంటల్లో ఒకటి బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్. వారి ఒకరిమీద ఒకరికి ఉన్న ప్రేమను ఎప్పుడూ ఏదో ఒక రూపంలో తెలియజేస్తారు. అయితే గురువారం (డిసెంబర్ 23) నాడు సాయంత్రం అలియా, రణ్‌బీర్ ముంబై జుహూలోని ఒక రెస్టారెంట్లో డిన్నర్ చేయడం కెమెరాలకు చిక్కారు. వీరితోపాటు అలియా భట్ సోదరి షాహీన్ భట్, తన స్నేహితులు అనుష్క రంజన్, ఆకాంక్ష రంజన్, నూతన వధూవరులు మేఘనా గోయల్ కూడా ఉన్నారు. డిన్నర్ తర్వాత రెస్టారెంట్ నుంచి బయటకువెళ్లే సమయంలో అభిమానులు వారిని చుట్టుముట్టారు. అప్పుడు అలియాను సురక్షితంగా కారు దాకా తీసుకెళ్లాడు రణ్‌బీర్. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయాని. అదికాస్త వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రణ్‌బీర్ బ్లాక్ టీ షర్ట్, మ్యాచింగ్ జాకెట్, బ్లూ జీన్స్‌తో డాషింగ్ కనపించగా పసుపు రంగు డ్రెస్‌లో అలియా చూడముచ్చటగా కనిపించారు. అయితే తను వెంటనే వెళ్లాలన్న ఆరాటంలోనో ఏమో అలియా ఒక తప్పు చేసింది. తను మాస్క్ ధరించకుండా దర్శనమిచ్చింది. ఇది చూసిన నెటిజన్లు అలియాపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. 'బహిరంగ ప్రదేశాల్లో కూడా మాస్క్ పెట్టుకోలేదు' అని ఒక యూజర్ రాయగా, 'మేడమ్ జీ మీ మాస్క్ ఎక్కడా' అని ప్రశ్నించాడు. బాలీవుడ్‌కు కరోనా సోకదనుకుంటా అని మరొక నెటిజన్ సెటైర్ వేశాడు. ఇంకొకరైతే 'వ్యాక్సిన్ వేసుకోవడం, ఆర్టీపీసీఆర్లో నెగెటివ్ వచ్చినంత మాత్రానా మాస్క్ పెట్టుకోవద్దని కాదు' అని విమర్శించాడు. 'మాస్కు పెట్టుకోలేదు. బీ సేఫ్ అలియా' అని ఒక అభిమాని కామెంట్ చేశాడు. ఇదిలా ఉంటే ఈ వీడియోలో రణ్‌బీర్ మాస్క్ ధరించి ఉండటం గమనార్హం. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) ఇదీ చదవండి: అలియా భట్ సీతగా ఎలా మారిందో చూశారా ?.. మేకింగ్ వీడియో వైరల్ -
సుకుమార్‌పై నెటిజన్ల ఫైర్.. ఆ వెబ్ సిరీస్‌ను కాపీ కొట్టాడా?
Netizens Trolls Sukumar For Copying Pushpa Movie From Web Series: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. డిసెంబర్ 17న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పుష్ప కథ కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. కాపీ కథతో ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించాడని, ఓ వెబ్ సిరీస్‌ను పుష్పగా తీశాడంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ప్రముఖ వెబ్ సిరీస్ ‘నార్కోస్’ కథ ఆధారంగా ‘పుష్ప’ను రూపొందించాడంటూ తమదైన శైలిలో ట్రోల్ చేస్తున్నారు. చదవండి: Pushpa Movie: అల్లు అర్జున్‌పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు ‘నార్కోస్’లో డ్రగ్స్ మాఫియా ఉంటే... ‘పుష్ప’లో ఎర్రచందనం స్మగ్లింగ్ చూపించారని అంటున్నారు. వెబ్ సిరీస్ హీరో పాత్ర ఆధారంగా పుష్పలో అల్లు అర్జున్ పాత్ర తీర్చిదిద్దాడని, అలాగే కొండారెడ్డి బ్రదర్స్ పాత్రలు కూడా వెబ్ సిరీస్ ఆధారంగానే సుకుమార్ రాసుకున్నారని అంటున్నారు. అల్లు అర్జున్‌తో తీసిన తొలి పాన్ ఇండియా చిత్రాన్ని కాపీ కథతో తెరకెక్కించడం ఎంత వరకు కరెక్ట్ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి పుష్ప పార్ట్ 2 షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో దీనిపై సుక్కు ఎలా స్పందిస్తాడో చూడాలి. చదవండి: ఆ నటుడితో స్టార్ హీరో మాజీ భార్య లవ్ ఎఫైర్!, ఇదిగో ఫ్రూఫ్ -
నైటీపైనే బయటకొచ్చిన హీరోయిన్, ట్రోల్ చేస్తూ ఆడేసుకుంటున్న నెటిజన్లు
Netizens Trolls Kareena Kapoor Over Her Dressing: సెలబ్రిటీలు ఏం చేసిన అది వార్తల్లో నిలుస్తోంది. ఇక తారలు వారి తీరు, వస్త్రధారణపై సోషల్ మీడియాలో తరచూ ట్రోల్స్‌కు గురవుతారు. ఏ సందర్భంలో అయినా హీరోయిన్లు వస్త్రధారణ కాస్తా భిన్నంగా కనిపిస్తే చాలు ఇక వారిని ఆడేసుకుంటారు నెటిజన్లు. ఇప్పటికే జాన్వి కపూర్ తన యాటిటూడ్తో విమర్శలు ఎదుర్కొగా తాజాగా మరో స్టార్ హీరోయిన్ నెటజన్ల ట్రోల్స్‌కు బలైంది. ఎప్పుడూ ట్రెండీ లుక్‌తో అందరిని ఆకర్శించే కరీనా తాజాగా భర్త సైఫ్ అలీ ఖాన్‌తో బయటకు వచ్చిన ఆమె ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ దర్శనమిచ్చింది. బ్లాక్ జీన్స్, నెక్లెస్ ఓపెన్ టాప్‌తో ఇలా కరీనాను చూసిన మీడియా తమ కెమెరాలకు పని చెప్పారు. చదవండి: ట్రైలర్ విడుదలపై క్లారిటీ ఇచ్చిన జక్కన్న, విడుదల తేదీ ప్రకటన ఇక ఫొటోలు బయటకు కావడంతో నెటిజన్లు కరీనాపై విమర్శలు గుప్పిస్తున్నారు. కొంతమంది ‘ఏంటి కరీనా నైటీతో బయటకి వచ్చావు’ అని, కొంతమంది ‘ఈ స్టార్స్ అంతా బాగా డబ్బున్న వాళ్ళు కానీ వారికి బట్టలు ఉండవు. ఇలా నైటీలు వేసుకొస్తారు’ అని, కొంతమంది ‘ఇంట్లో నైటీలు వేసుకోవట్లేదా ఇలా బయటకు నైటీలు వేసుకొచ్చావు’ అని కరీనాని ట్రోల్ చేస్తున్నారు. నైటీ వేసుకుని బయటకు వచ్చింది. ఈ దుస్తులతో ఆమెకు ఉన్న స్టైలిష్ బ్రాండ్ అనే ఇమేజ్ మొత్తం పోయింది. హే భగవాన్ ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండిష: అత్యంత డేంజర్ లుక్‌లో అనసూయ.. భర్తనే చంపేస్తుందట, ఇదిగో ప్రూఫ్ View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
బాడీ లాంగ్వేజ్‌పై విమర్శలు.. మాస్టర్ పాత ఇంటర్వ్యూ వైరల్
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 1948 డిసెంబర్ 7న చెన్నైలో జన్మించిన మాస్టర్ చిన్న వయసులోనే ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొన్నారు. ఏడాది వయసులో ఓ ప్రమాదంలో వెనుముక తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ సంకల్ప బలంతో డ్యాన్స్ అవ్వాలనుకున్నారు. పట్టుదలతో డ్యాన్స్ నేర్చుకుని నృత్య దర్శకుడు అయ్యారు. చదవండి: Shiva Shankar Master: శివ శంకర్ మాస్టర్ చివరి కోరిక ఏంటో తెలుసా? ‘కురువి కూడు’ (1980) అనే తమిళ చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్‌గా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత శివ శంకర్ మాస్టర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తమిళం, తెలుగులో ఎన్నో చిత్రాలకు నృత్య దర్శకుడిగా పని చేశారు. ఈ క్రమంలో ఆయన జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. తన డ్యాన్స్‌తోనే ఎన్నో హావభావలను పలికించే మాస్టర్ 800లకు పైగా చిత్రాలకు పని చేశారు. అలాంటి మాస్టర్‌కు విమర్శలు తప్పలేదు. ఆయన బాడీ లాంగ్వేజ్‌పై ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో గతంలో ఓ ఇంటర్య్వూలో ఆయనపై వచ్చే విమర్శలకు ఓ ఇంటర్వ్యూలో మాస్టర్ తనదైన శైలి సమాధానం ఇచ్చి ట్రోలర్స్‌కు ఘాటుగా సమాధానం ఇచ్చారు. చదవండి: రాజ్ తరుణ్ అంటే అసలు నచ్చదు.. అరియానా షాకింగ్ కామెంట్స్ ఓ ఇంటర్య్వూలో యాంకర్ తన బాడీ లాంగ్వేజ్‌పై వచ్చి కామెంట్స్‌కు మీ సమాధానం ఏంటని అడగ్గా.. అవన్ని నేను పట్టించుకోనని, వారు అన్నంత మాత్రాన నేను అది అయిపోయిను కదా. నాకంటే ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉంది’ అంటూ సమాధానం ఇచ్చారు. అంతేగాక ఎవరూ నవ్వితే వారి పళ్లు బయట పడతాయి, ఓ డ్యాన్స్ మాస్టర్‌గా నేను ఇలాగే ఉంటాను. ఫైట్ మాస్టర్‌గా కూలింగ్ గ్లాస్ పెట్టుకని రఫ్‌గా ఉండను. నాలో కళానైపుణ్యం ఉంది. దానికి తగ్గట్టుగానే నేను ఉంటాను. ఎవరు ఏమని కామెంట్ చేసిన నేను పట్టించుకోను’ అంటూ చెప్పుకొచ్చారు. చదవండి: Shiva Shankar Master: వెన్నుముక గాయంతో 8 ఏళ్లు మంచానికే, డ్యాన్స్ మాస్టర్ ఎలా అయ్యారంటే.. ఇక తన ముఖంలో రౌద్రం, వినయం, భావోద్యేగం వంటి భావాలను తన ముఖంలో చూపిస్తూ ఇందులో నా ఆర్ట్ కనిపించిందా?, ఆడంగి తనం కనిపించిందా? అని తిరిగి యాంకర్‌ను ప్రశ్నించారాయన. ఇక మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేసిన టీవీయే మీపై ఇలాంటి విమర్శలకు కారణమైందని ఎప్పుడైనా బాధపడ్డారా అనే ప్రశ్నకు.. ఆయన ప్రతి విషయానికి బాధపడుకుంటూ పోతే మనం జీవించలేమన్నారు. ‘నా మనసు మంచిదా? నేను మంచివాడినా? నాలో ఆర్ట్ ఉందా? ధన్యుడనా కాదా అనేదానిపైనే నా దృష్టి ఉంటుంది. నేను ఎటూ చూసిన, ఏం చేసిన, ఏడు నడిచినా అది నా కళ కోసమే, ఈ దారిలో నాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అంతగా పట్టించుకోను’ అంటూ తనదైన శైలిలో శివ శంకర్ మాస్టర్ సమాధానం ఇచ్చి విమర్శకుల నోరు మూయించారు. -
‘సర్జరీతో అసహ్యంగా మారిన మరో హీరోయిన్’
సినిమా తారలు మరింత అందంగా కనిపించేందుకు శరీరంలో మార్పులు చేయించుకుంటారు. ఇందుకోసం చాలా మంది సర్జరీలు చేయించుకుని వారి అందానికి మెరుగులు దిద్దుకుంటారు. అయితే ఇవి అందరికి కలిసిరాకపోవచ్చు. సర్జరీ వికటించి ఉన్న అందాన్ని పాడు చేసుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఆ మధ్య అయేషా టాకీయా పేదవులకు సర్జరీ చేసుకోగా అది వికటించిన సంగతి తెలిసిందే. చదవండి: ఎట్టకేలకు విడాకులపై స్పందించిన ప్రియాంక-నిక్ జోనస్ ఇక ఈ మధ్య రకుల్ ప్రీత్ సింగ్ కూడా సర్జరీ చేయించుకుందని, దాంతో ఆమె ముఖం మరింత అసహ్యంగా మారిందంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ బ్యూటీ దిశ పటానీ కూడా ఇవే విమర్శలు ఎదుర్కొంటోంది. బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం అంతిమ్ స్పెషల్ స్క్రీనింగ్ నిన్న(శుక్రవారం) జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హజరైన దిశ ఎల్లో టాప్, డెనిమ్ జీన్స్‌తో దర్శనమిచ్చింది. అయితే ఇక్కడ దిశ లుక్‌లో ఎదో తేడాను గమనించారు నెటిజన్లు. ఇంకేముందు దిశ వీడియోను షేర్ చేస్తూ ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. చదవండి: పార్టీలో డ్యాన్స్‌తో హీరోయిన్ అక్క రచ్చ, ఛీఛీ.. కొంచం పద్దతిగా ఉండండి.. ఈ వీడియోలో దిశ లుక్ సాధారణంగా లేదని, తేడాగా ఉందంటూ కామెంట్స్ చేస్తుండగా.. మరి కొందరూ ఇంకేముందు తన ముక్కు, పెదాలకు సర్జరీ చేసుకుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఓ నెటిజన్ ‘సర్జరీతో ముఖాన్ని పాడు చేసుకున్న మరో హీరోయిన్’ అంటూ కామెంట్ చేసి #waxstaue అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించాడు. అలాగే ‘సర్జరీతో ఏమొచ్చింది.. అందంగా ఉన్న ముఖాన్ని అసహ్యంగా చేసుకున్నావ్’ నెటిజన్లు దిశను ఆటాడేసుకుంటున్నారు. ఇది నిజమో కాదో తెలియాలంటే ఈ రూమర్లపై దిశ స్పందించే వరకు వేచి చూడాలి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
పెంపుడు కుక్కకు హెయిర్ డై, లక్షలు ఖర్చు చేసిన మోడల్
సోషల్ మీడియాను సెలబ్రెటీలు బాగా ఉపయోగించుకుంటున్నారు. వారి సంబంధించిన ప్రతి యాక్టివిటీని, వ్యక్తిగత విషయానలు ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేసుకుంటుంటారు. అందుకే నెటిజన్లు ఎక్కువ సమయం సామాజిక మాధ్యమాలకు కెటాయిస్తారు. వారి ప్రతి అడుగును గమనిస్తూ వారిని నిత్యం ఫాలో అవుతుంటారు. అలా వారు పెట్టిన పోస్టులను వైరల్ చేస్తుంటారు. అయితే కొన్ని సార్లు వారు చేసే పోస్ట్స్ నచ్చితే నెటిజన్లు వారిని ఆకాశానికి ఎత్తేస్తారు.. అదే పోస్టులు బెడిసికొట్టితే మాత్రం ట్రోల్స్ చేస్తూ ఆడేసుకుంటారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి చెదు అనుభవాలను సెలబ్రెటీలు చాలానే ఎందుర్కొంటున్నారు. చదవండి: ఆ నటుడితో పీకల్లోతు ప్రేమలో బిగ్‌బి మనవరాలు! తాజాగా రష్యన్ మోడల్‌కు ఇలాంటి సంఘటనే ఎదురైంది. తాను చేసిన పనికి గర్వపడుతూ సోషల్ మీడియాలో షేర్ చేసి చేదు అనుభవాన్ని ఎదుర్కొంది రష్యన్ మోడల్ అన్నా స్టూపక్. అయితే సెలబ్రెటీలకు ఎక్కువగా పెట్స్‌ని ఇష్టపడతారనేది తెలిసిన విషయమే. వాటికి కాస్తా సమయం ఎక్కువగా కేటాయిస్తుంటారు. ఖాళీ సమయంలో వాటితో ఆడుకుంటూ రిలాక్స్ అవుతుంటారు. ఇంకా కొంతమంది అయితే ఎక్కడికి వెళ్లిన పెట్స్‌ని తమ వెంట తీసుకేళ్తారు. వాటిపై ప్రత్యేకంగా శ్రద్ధా పెడుతుంటారు. చెప్పాంటే సొంత మనిషిలా చూసుకుంటారు. ఈ క్రమంలో ఓ మోడల్ తన పెంపుడు కుక్కపై ఇంకాస్తా ఎక్కువ శ్రద్ద పెట్టింది. చదవండి: ముంబై వెళ్లి సల్మాన్‌ను ప్రత్యేకంగా కలిసిన జక్కన్న, అందుకేనా? అదే విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పంచుకుంది. అది కాస్తా బెడిసి కొట్టడంతో నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మీకు తెలిసిందే. నెటిజన్లకు కోపం వస్తే ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అవును ఎప్పటి లాగే ఆమెను సోషల్ మీడియాలో ఆడేసుకున్నారు. ఇంతకి నెటిజన్లకు కోపం తెప్పించిన విషయకం ఏంటంటే కాస్తా కుక్క హేర్‌కు డై చేయించింది. నియాన్ ఆరెంజ్‌తో పూర్తిగా కుక్కకు కలర్ డై చేయించిందట. దీని కోసం ఆమె ఏకంగా రూ. 5వేల యూరోలు(భారత కరెన్సీలో 5 లక్షల రూపాయలు). ఈ విషయాన్ని స్వయంగా సదరు మోడల్ చెప్పుకొచ్చింది. ఇంకేముంది మోడల్ చేసిన పనికి నెటిజన్లు ఆమెపై మండిపుడుతున్నారు. మీ సరద కోసం మూగ జీవిని హింసించడం ఏంటంటూ తమదైన శైలిలో ఆమెను తిట్టిపోస్తున్నారు. దీంతో అన్నా స్టూపక్ వార్తల్లోకి ఎక్కింది. View this post on Instagram A post shared by Anna Stupak (@anna3.0.5) -
ఈషా టాప్‌లెస్ ఫొటోపై ట్రోల్స్, నెటిజన్లకు హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్
ఇటీవల కాలంలో హీరోయిన్లు, మోడల్స్ శృతిమించిన అందాల విందుతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్నారు. ఎంత అందంగా కనిపిస్తే అంత ఎక్కువ అవకాశాలు, పాపులారిటీ సొంతం చేసుకోవచ్చనే అభిప్రాయంతో తెగ హాట్స్ లుక్స్‌తో దర్శనమిస్తున్నారు. ఇంకా వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెట్టింటా కావాల్సినంత క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. ఈ కోవకే చెందుతుంది బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా. చదవండి: కుమారుడిని చూసేందుకు తొలిసారి జైలుకు వచ్చిన షారుక్ హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్ సాంగ్స్‌లోనూ అభిమానులను అలరిస్తున్న ఈ బోల్డ్ బ్యూటీ ఇటీవల కాస్తా శృతిమించింది. సన్‌బాత్ అంటూ టాప్లేస్ ఫొటోలు షేర్ చేసి నెటిజన్ల మతి పోగోట్టింది. దీంతో కొందరూ ఆమె ఫొటోలకు పాజిటివ్‌గా రెస్పాండ్ కాగా..మరికొందరూ ఆమెపై విరుచుకుపడ్డారు. ఆమెను ట్రోల్ చేస్తూ తన పోస్ట్‌పై ఆసభ్యకరంగా కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందిస్తూ నెటిజన్లకు చురకలు అట్టించింది. ‘‘ఇప్పటి వరకు సోషల్ మీడియాలో నాపై వచ్చే ట్రోల్స్ చూసి బాధపడేదాన్ని. కానీ ప్రస్తుతం అలాంటి ట్రోల్స్‌ను పట్టించుకోవడం మానేశాను. వాటికి అసలు స్పందించకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. కానీ నేను ఏం చేసినా కొందరు అదే పనిగా నన్ను వేలెత్తి చూపుతున్నారు. ఇటీవల నేను పంచుకున్న ఫొటోలకు అసభ్యకర రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు నేను స్పందించక తప్పడం లేదు. చాలా మంది మేల్ యాక్టర్స్ షర్ట్ లేకుండా ఫొటోలు షేర్ చేస్తే ‘మీ బాడీ సూపర్బ్‌గా ఉంది’ అంటూ సానుకూలంగా కామెంట్ చేస్తారు. మరి వారిని ఎందుకు పూర్తి దుస్తులు ధరించమని చెప్పరు?’’ అని ప్రశ్నించింది. చదవండి: అవును..నిజమే..ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్నా: నటి ‘‘ఎందుకంటే నెటిజన్లలో కొందరు లింగ వివక్ష చూపెడుతున్నారు. చీర ధరించి ఫొటో షేర్ చేస్తే ‘ఈరోజు మీరు పూర్తి దుస్తులు ధరించారు’ అని వెటకారం చేస్తారు. మేకప్ ధరించిన ఫొటోలను పంచుకుంటే ‘ప్లాస్టిక్ బ్యూటీ’ అని కామెంట్లు పెడతారు. మేకప్ లేని ఫొటోలను షేర్ చేస్తే ‘నువ్వు అందంగా లేవు. ముఖానికి మేకప్ వేసుకో’ అని సలహాలు ఇస్తారు. ఇలా ఇండియాలోనే కాదు ప్రపంచంలోని నలుమూలలా ఆడవాళ్లపై వివక్ష కొనసాగుతోంది. మహిళలలకు సంబంధించి మన ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇక నా విషయానికొస్తే.. నేను మానసికంగా ఎంతో బలవంతురాలిని. ఎవరైనా ఒకసారి నా చెంపమీద కొడితే నేను రెండుసార్లు వారి చెంపలు వాయిస్తాను’’ అంటూ ఈషా నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చదవండి: ‘మోదీ జీ.. ప్రతిసారి నా కృత్రిమ కాలు తొలగించమంటున్నారు’ -
ఇదేం స్టైల్ బై..! ‘గబ్బర్‌సింగ్’ బ్యూటీని ట్రోల్ చేసిన నెటిజన్లు
మలైకా అరోరా బాలీవుడ్లో ఫేమ్ ఉన్న నటీమణుల్లో ఒకరు. నటనతోనే కాకుండా ఫ్యాషన్, ఫిట్నెస్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ. అందుకే 47 ఏళ్ల ఈ మోడల్ని టిన్సెల్ టౌన్ ‘యమ్మీ మమ్మీ’ అని పిలుచుకుంటుంటారు ఫ్యాన్స్. జిమ్ చేయడం నుంచి బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్‌తో బయటికి వెళ్లిన విషయాన్ని సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది. అయితే ఇటీవల యోగా క్లాసెస్‌కి వెళ్లిన సమయంలో వాకింగ్ స్టైల్ గురించి ఈ భామని విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్లు. మలైకా క్రమం తప్పకుండా యోగా క్లాసెస్‌కి వెళుతుంటుంది. తాజాగా ముంబైలోని ఓ యోగా సెంటర్‌కి అలా వెళ్లిన క్రమంలో ఆమె నడిచిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇదేం స్టైల్ బై..’ అని ఒక నెటిజన్ అనగా, మరొకరు ఈ భామ ‘ఇండియాస్ నెక్స్ట్ సూపర్ మోడల్’ షోకి జడ్డిగా చేయనుంది అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. కొందరు ఈ బ్యూటీ నడకను బాతు నడకతో పొల్చుతుండగా, మరికొందరు విచిత్రంగా నడుస్తోందంటూ విమర్శిస్తున్నారు. చదవండి: ప్రియుడికి మలైక స్పెషల్ బర్త్‌డే విషెస్ పవన్ కల్యాణ్ హీరోగా చేసిన ‘గబ్బర్‌సింగ్’ సినిమాలో స్పెషల్ సాంగ్ ‘కెవ్వు కేక’తో మలైకా అరోరా తెలుగు ప్రేక్షకులకి సువరిచితురాలే. కాగా ప్రస్తుతం మిలింద్ సోమన్, అనూష దండేకర్‌తో కలిసి ఎమ్టీవీలో వచ్చే ‘సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ సీజన్ 2’కి జడ్డిగా వ్యవహరిస్తోంది. స్టార్ వర్సెస్ ఫుడ్, ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ వంటి రియాలిటీ షోలతో పాటు నెట్‌ఫ్లిక్స్ షో, ది ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. View this post on Instagram A post shared by fit l model l reel l curvy gym (@gymwali_girl) -
రైల్లో లోదుస్తులతో ఎమ్మెల్యే చక్కర్లు.. నెటిజన్ల ట్రోలింగ్
పాట్నా: బిహార్ జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. దీనికి ఆయన లోదుస్తులు ధరించి రైలులో తిరగమే కారణం. ఈ ఘటన గురువారం పాట్నా నుంచి ఢిల్లీ వెళ్తున్న తేజాస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో చోటుచేసకుంది. అసలేం జరిగిందంటే.. జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఏసీ బోగిలో ప్రయాణించారు. అయితే ఈ రైలు ఉత్తర ప్రదేశ్‌లోని దిల్‌నగర్ స్టేషన్ దాటుతున్న సమయంలో ఎమ్మెల్యే తన దుస్తులు తీసేసి కేవలం లోదుస్తులు(బనియన్,అండర్వేర్)తో వాష్‌రూమ్‌కు వెళ్లారు. అయితే అదే కంపార్ట్మెంట్లో బిహార్‌కు చెందిన ప్రహ్లద్ పాశ్వాన్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్నారు. ఎమ్మెల్యే అవతారం చూసిన ఆ వ్యక్తి మండల్ వేషాధారణపై అ్యభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో మండల్ ఆ వ్యక్తితో వాదనకు దిగాడు. అక్కడితో ఆగకుండా ఇతర ప్రయాణికులను సైతం దూషించాడు. కాగా మండల్ ప్రయాణికులను కొట్టేందుకు ప్రయత్నించాడని, వారు ఎమ్మెల్యే ప్రవర్తనపై మండిపడటంతో కాల్చి వేస్తామని కూడా బెదిరించాడని పాశ్వాన్ ఆరోపించారు. అయితే అతను బిహార్ ఎమ్మెల్యే అని తనకు తెలీయదని పేర్కొన్నారు. చదవండి: ఆస్తులు అమ్మితే ఆటకట్టిస్తాం: ఎంకే స్టాలిన్ ఇదంతా జరిగిన తర్వాత ప్రయాణికులు ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు మండల్‌ను రైలులోని మరో కోచ్‌కు మార్చారు. అయితే చివరికి గోపాల్ మండల్ తన చర్యలను సమర్థించుకున్నారు. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తన కడుపు నొప్పి ఉందని అందులే కేవలం లోదుస్తులు ధరించినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఎమ్మెల్యే లోదుస్తులు ధరించిన ఫోటోలు, వివరణ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వెంటనే అతన్ని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ‘అండర్ వేర్లో తిరుగుతుంటే కడుపు నొప్పి తగ్గుతుందని మాకు తెలియదే’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. గోపాల్ మండల్ స్నేహితుడు కునాల్ సింగ్ మాట్లాడుతూ.. మండల్ డయాబెటిస్ పేషెంట్ అని, ఏదో "అత్యవసర పని మీదసం ఢిల్లీ వెళ్తున్నాడని పేర్కొన్నాడు. మండల్ అధిక బరువు కారణంగా బట్టలతో వాష్‌రూమ్‌కు వెళ్లలేకపోయాడని అందుకే లుంగీ మీద వాష్‌రూమ్ ఉపయోగించాలనుకున్నట్లు తెలిపాడు. ‘రైలు ఎక్కిన తర్వాత, గోపాల్ వాష్‌రూమ్‌కు వెళ్లాలనుకున్నాడు. తొందరపాటులో తన లోదుస్తుల్లో వెళ్లాడు. అప్పుడే ఓ ప్యాసింజర్ మండల్‌తో మాట్లాడాడు. దీనికి మండల్ బదులేమి ఇవ్వకుండా వాష్‌రూమ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్యాసింజర్‌తో మాట్లాడారు "అని కునాల్ సింగ్ చెప్పారు. #WATCH I was only wearing the undergarments as my stomach was upset during the journey: Gopal Mandal, JDU MLA, who was seen in undergarments while travelling from Patna to New Delhi on Tejas Rajdhani Express train yesterday pic.twitter.com/VBOKMtkNTq — ANI (@ANI) September 3, 2021 -
నల్లగా ఆంటీలా ఉన్నావంటూ ట్రోల్ చేశారు: ప్రియమణి
ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్ల నుంచి సాధారణ నటీమణుల వరకు చాలా మంది ట్రోల్స్ బారిన పడుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత సైతం ట్రోల్స్‌ను ఎదుర్కొన్నానని, అవి చూసి నిద్రలేని రాత్రలు గడిపానంటూ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో నటి ప్రియమణి కూడా చేరారు. ఇటీవల ఆమె నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్’ సూపర్ సక్సెస్‌ను అందుకుంది. ప్రస్తుతం ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్న ప్రియమణి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో తను ట్రోల్స్ బారిన పడినట్లు చెప్పారు. ఆమె మాట్లాడుతూ.. నల్లగా ఆంటీలా ఉన్నావంటూ కొంతమంది ఘోరమైన కామెంట్స్ చేశారని తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ‘ఒకసారి నేను మేకప్ లేకుండా ఒక పోస్టు పెట్టాను. అది చూసి కొంతమంది నువ్వు మేకప్‌తోనే చూడటానికి బాగుంటావని, లేదంటే ఆంటీలా కనబడుతున్నావు అన్నారు. మరికొందరేమో నల్లగా ఉన్నానని, వయసైయిపోయింది అంటు కామెంట్స్ చేశారు’ అని చెప్పుకొచ్చారు. ఇక ఆ ట్రోల్స్‌పై స్పందిస్తూ.. ‘నేను నల్లగా ఉంటే ఏంటి అది నాకు ప్రాబ్లం కాదు. మేకప్ నాకు ఎప్పుడు వేసుకోవాలనిపిస్తే అప్పుడు వేసుకుంటాను. కేవలం షూటింగ్ కోసం మాత్రమే మేకప్ వాడతారు. మిగతా సమయంలో అసలు వాడను. ఎందుకు మేకప్ వేసుకోవాలి? ఇది నేను నాలా ఉంటాను అదే నాకు సౌక్యర్యం’ అంటూ ట్రోల్స్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. అలాగే ‘లావు అయ్యానని, ఆంటీలా కనిపిస్తున్నాను అన్నారు. ఎవరికైనా వయసైపోతుంది. రేపు మీకు కూడా. నేను నమ్మేది ఒకటే వయసురిత్యా వచ్చే మార్పులను ప్రతి ఒక్కరు అంగీకరించాల్సిందే’ అంటూ ఆమె చురకలు అంటించారు. ఇక తన భర్త ముస్తఫా రాజ్ కూడా తనని ఎప్పుడు మేకప్ వేసుకోవాలని, మంచిగా కనిపించాలని, ప్లజంట్‌గా ఉండాలని చెబుతూంటాడని, కొన్ని సార్లు ఇది సరైనదే అనిపించిన మరికొన్ని సార్లు ఇతరుల కోసం మన వ్యక్తిత్వాన్ని ఎందుకు మార్చుకోవాలి అనుకుంటానని ఆమె చెప్పారు. -
బాడీషేమింగ్: నెటిజన్లపై ‘జెర్సీ’ నటి ఫైర్
బాలనటిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం నటిగా గుర్తింపు పొందింది మలయాళి భామ సనూష. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘బంగారం’ మూవీతో తెలుగు తెరకు పరిచమైన సనూష ఆ తర్వాత ‘రేణిగుంట’, ‘జీనియస్’ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా కాస్తా బొద్దుగా ముద్దుగా ఉండే సనూష ఈ మధ్య ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టి నాజుగ్గా తయారైంది. ఈ నేపథ్యంలో తన ఫొటోషూట్‌లో భాగంగా ఫోజులిచ్చిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియా షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమె శరీరాకృతిపై విమర్శలు చేస్తూ..అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. అవి చూసిన సనూష నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకరిని అనే ముందు మీరేంటో తెలుసుకొండని, మీరేం అంత పర్ఫెక్ట్ కాదంటూ తనపై నెగిటివ్ కామెంట్స్ చేసిన నెటిజన్లకు చురకలు అట్టించింది. ‘నా శరీర బరువు గురించి నాకంటే ఎక్కువగా బాధపడుతున్న వారందరికి నేను చెప్పేది ఒకటే. ఎదుటి వాళ వైపు వేలెత్తి చూపిస్తే మిగిలిన వేళ్లు మిమ్మల్ని చూపిస్తాయని గుర్తు పెట్టుకొండి. కాబట్టి ఎదుటి వాళ్లను అనే ముందు ఒక్కసారి మీరెంత పర్ఫెక్ట్గా ఉన్నారో ఆలోచించుకోండి’ అంటూ విమర్శకులకు ఘాటుగా సమాధానం ఇచ్చింది. కాగా సనూష హీరో నాని జర్సీ మూవీలో జర్నలిస్టు పాత్రలో కనిపించింది. -
ఇండియన్ ఐడల్ 12: హోస్ట్ ఆదిత్య నారాయణ తీరుపై నెటిజన్లు ఫైర్
ఇండియల్ ఐడల్ 12 షోలో గత వారం సింగర్, టీవీ హోస్ట్ ఆదిత్య నారాయణ తీరుపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆదిత్య ఇండియన్ ఐడల్ 12కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎపిసోడ్లో అతడు సింగర్ కుమార్ సనుతో చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆదిత్యను ట్రోల్ చేస్తున్నారు. గత వారం జరిగిన ఎపిసోడ్లో ఇటీవల మృతి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రవన్ రాథోడ్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సన్నిహితులు, ప్రముఖ గాయకులు కుమార్ సను, అనురాధ పౌడ్వాల్, రూప్ కుమార్ రాథోడ్ ఈ షోకు అతిథులుగా హజరయ్యారు. ఈ నేపథ్యంలో హోస్ట్ ఆదిత్య, కుమార్ సనుతో నిజంగానే మీరు కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ నచ్చి వారిని ప్రశంసించారా, లేక షో మేకర్స్ చెప్తే చేశారా అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. వెంటనే ఆదిత్య సింగర్ సను ‘వాళ్లు నిజంగానే మంచి గాయకులు. కంటెస్టెంట్స్ అంత అద్భుతమైన పాటగాళ్లు. ఒక రీయాలిటి షోలో ఇంతమంది ప్రతిభవంతులైన సింగర్స్‌ను ఇంతవరకు నేనేప్పుడు చూడలేదు. ఇప్పటికిప్పుడు వీరంత ప్లేబ్యాక్ సింగర్స్ కావోచ్చు. ఒక్కొక్కరు ఒక్క రత్నం’ అంటూ ఆయన కంటెస్టెంట్స్‌ను కొనియాడారు. అనంతరం ఆదిత్య వ్యాఖ్యలను తప్పు బడుతూ ‘ఎంతో మంది గెస్టులను ఈ షోకు ఆహ్వానించిన ఆదిత్య తీరు బాధాకరం, ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు గాయకులు అర్జీత్ సింగ్, ఆర్మాన్ మాలిక్‌లు ఈ స్టేజ్ ద్వారానే ప్రపంచానికి పరిచయమయ్యారనే విషయం అతడు గుర్తుపెట్టుకోవాలి’ అంటూ సోని వారు ఈ వీడియోను షేర్ చేశారు. అది చూసిన నెటిజన్లు ఆదిత్యను ‘షో నుంచి తీసేయండి’, ‘అతడు లెజండరీ సింగర్స్‌ను అవమానించాడు’, ఆదిత్య అమిత్ కుమార్ వ్యాఖలతో ఇలా వ్యవహరించడం సరికాదు’ అంటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా గత ఎపిసోడ్లో కిషోర్ కుమార్, ఆయన తనయుడు అమిత్ కుమార్ అతిథులగా వచ్చారు.ఈ షో చివరలో సింగర్ అమిత్ కుమార్ మాట్లాడుతూ.. తనకు కంటెస్టంట్స్ పర్ఫామెన్స్ నచ్చిన నచ్చకపోయిన వారిని ప్రశంసించమని షో నిర్వహకులు కోరారని, వారి పాటలు నచ్చకపోతే ఎలా పాజిటివ్ కామెంట్స్ ఇస్తామని ఆయన మండిపడిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
Bandla Ganesh: మళ్లీ తప్పులో కాలేసిన బండ్ల గణేష్, నెటిజన్ల కౌంటర్
బండ్ల గణేష్.. ప్రస్తుతం ఈ పేరు సినిమాల్లో కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. స్టేజ్ ఎక్కితే చాలు ఆపకుండా తన వాక్ చాతుర్యం ప్రదర్శించే గణేష్ తరచూ సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన పడుతుంటాడు. ట్విటర్లో క్లారిటి లేని పోస్టులు పెట్టి తప్పులో కాలేస్తుంటాడు. అలా నెటిజన్లకు దొరికిపోవడంతో ఈ పోస్టులను డిలీట్ చేస్తుంటాడు. తాజాగా మరోసారి బండ్ల గణేష్ తప్పులో కాలేసి నెటిజన్లకు దొరికిపోయాడు. తాను ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెడుతున్నట్టు ఆయన ప్రకటించాడు. తాను ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇస్తున్నానని ఇన్‌స్టా ఐడీ ఇదేనంటూ ట్వీట్ చేశాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ఆయన ఇన్‌స్టా ప్రొఫైల్‌కు సంబంధించిన లింక్ మాత్రం షేర్ చేయడం మరిచిపోయాడు. అది గమనించి ఆయన ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి మళ్లీ పోస్టు చేశాడు. రెండోసారి కూడా లింక్ షేర్ చేయడం మరచిపోయి మళ్లీ ఆ ట్వీట్ చేశాడు. ఇక మూడోసారి కూడా అదే తప్పు చేసి నెటిజన్లకు దొరికిపోయాడు. దీంతో నెటిజన్లు బండ్ల గణేశ్‌ను తమదైన శైలిలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘ఏం చేస్తున్నావ్ అన్నా? ఇన్స్టాగ్రామ్ లింక్ ఏది.. ఎందుకు ట్వీట్స్ డిలీట్ చేస్తున్నావ్.. మళ్లీ ఎందుకు ట్వీట్లు పెడుతున్నావ్’ అంటూ కామెంట్లు పెడుతు కౌంటర్లు వేస్తున్నారు. -
నాపై అలాంటి కామెంట్స్ చేశారు: విద్యుల్లేఖ ఎమోషనల్
టాలీవుడ్ పరిశ్రమలో లేడీ కమెడియన్స్ పేర్లు చెప్పమనగానే వెంటనే గుర్తోచ్చే పేరు విద్యుల్లేఖ రామన్. సినిమాల్లో హీరోయిన్లకు స్నేహితురాలిగా పాత్ర పోషిస్తూ, కామెడీ పండిస్తూ నటిగా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ బొద్దుగుమ్మ. అయితే ఇటీవల కాలంలో విద్యుల్లేఖ సినిమాలు తగ్గించినప్పటికి ఆమె తరచూ వార్తల్లో నిలుస్తోంది. సినిమాలు గ్యాప్ ఇచ్చిన ఆమె ఇటీవల ఓ ఫొటో షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. ముద్దుగా, బొద్దుగా ఉండే విద్యుల్లేఖ ఈ ఫొటోలో బక్కచిక్కనట్లు కనిపించింది. దీంతో ఆమె ఫొటోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. కొందరూ ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభిస్తే మరికొందరి తన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఆమె సంపూర్ణేశ్ బాబుతో ‘పుడింగ్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఇటీవల సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన లావు తగ్గడంపై నెటిజన్లు చేసిన ట్రోల్స్‌పై స్పందించింది. ‘ఏంటీ సన్నబడుతున్నావ్.. ఇక కమెడియన్‌గా చేయవా? హీరోయిన్‌గానే చేస్తావా?’ అంటూ తనపై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ ట్రోల్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే నేను లీడ్ రోల్ చేస్తూ కామెడీ చేయాలని అనుకున్నాను. అలా నేను కలలు కంటున్న సమయంలోనూ కలలాగా ఈ మూవీ ఆఫర్ వచ్చిందంటూ విద్యుల్లేఖ చెప్పుకొచ్చింది. ఇది సంపూర్ణేశ్ బాబు పక్కన.. ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ అని ఆమె పేర్కొంది. ఇక తను అధిక బరువు ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చాయని, అందుకే తన వ్యాయమం, వర్కవుట్స్ చేసి సన్నబడినట్లు తెలిపింది. చదవండి: పెళ్లి పీటలెక్కనున్న లేడీ కమెడియన్ పోలింగ్ బూత్‌లోకి శృతి.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, ఆ వార్తల్లో నిజం లేదు -
సింహం పిల్లను తెచ్చుకుని మరీ వెడ్డింగ్ ఫొటోషూట్
ఇస్లామాబాద్: ఇటీవల కాలంలో వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ భిన్నంగా జరుపుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం ప్రముఖ వెడ్డింగ్ స్టూడియోలకు కాంట్రాక్ట్ ఇచ్చి ఫొటోషూట్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇలా రకరకాల ప్రయోగాలు చేసి కొంతమంది అందరి చేత జౌరా అనిపించుకుంటుంటే మరి కొందరూ విమర్శల పాలవుతున్నారు. తాజాగా పాకిస్తాన్‌కు చెందిన ఓ జంట కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురైంది. సింహం పిల్లను అద్దెకు తెచ్చుకుని ఫొటోషూట్ జరుపుకుంది. చివరకు అది బెడిసి కొట్టడంతో నెటిజన్లు, జంతు ప్రేమికుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది ఈ కొత్త జంట. వివరాలు.. పాకిస్తాన్‌కు చెందిన ఓ జంట ఇటీవల వివాహం జరుపుకుంది. తమ వెడ్డింగ్ ఫొటోలను ప్రత్యేకంగా ఉండేందుకు పాకిస్తాన్‌లోనే పేరొందిన ప్రముఖ వెడ్డింగ్ ఫొటోస్టూడియోను సంప్రదించింది. దీంతో ఆ స్టూడియో ఆధినంలో ఉన్న సింహం పిల్లకు మత్తు ఇచ్చి నూతన వధువరుల మధ్య ఉంచి ఫొటోషూట్ నిర్వహించారు. అనంతరం ఈ ఫొటోలు, వీడియోలను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా షేర్ చేశారు. అది చూసి పాకిస్తాన్‌కు చెందిన సెవ్ ది వైల్డ్ అనే ఎన్జీవో సంస్థ కొత్త జంట, స్టూడియో నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫొటోషూట్ కోసం సింహం పిల్లకు మత్తు ఇచ్చి దానిని హింసించడం సరైనది కాదని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పంజాబ్ వన్యప్రాణుల సంరక్షణ శాఖకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి వేడుకులకు సింహం పిల్లను ఎలా అద్దెకు ఇస్తారని ప్రశ్నిస్తూ స్టూడియో ఆధ్వర్యంలో ఉన్న దానిని రక్షించాల్సిందిగా కోరింది. అంతేగాక నెటిజన్ల నుంచి కూడా విపరీతమైన ట్రోల్స్ రావడంతో సదరు ఫొటో స్టూడియో ఈ ఫొటోలను తమ ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి తొలిగించింది. @PunjabWildlife does your permit allow for a lion cub to be rented out for ceremonies?Look at this poor cub sedated and being used as a prop.This studio is in Lahore where this cub is being kept.Rescue him please pic.twitter.com/fMcqZnoRMd — save the wild (@wildpakistan) March 7, 2021 చదవండి: కోవిడ్ టీకా: పడిపడి నవ్విన పోలీసు అధికారి నిద్రపోతున్న మహిళను చనిపోయిందనుకుని.. -
ట్రోల్స్: మగాడిలా ఉన్నానని కామెంట్ చేశారు
ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్స్ నుంచి సాధారణ నటీమణుల వరకు సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురవుతున్నారు. ఇందులో బాలీవుడ్ నటీనటులే ఎక్కువగా ఉంటున్నారు. ఇటీవల హీరోయిన్ సోనాక్షి సిన్హా, దీపికా పదుకునేతో పాటు మరికొందరూ నటీమణులు ట్రోలర్స్ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కూడా ఈ జాబితాలో చేరింది. సోషల్ మీడియాలో తను బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నట్లు ఇటీవల ఓ ఇంటర్య్వూలో వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. ‘గతంలో నేను చాలాసార్లు ట్రోల్స్ బారిన పడ్డాను. వారు నా శరీరాన్ని అబ్బాయిల శరీరంతో పోలుస్తూ బాడి షేమింగ్ చేసేవారు. అది నన్ను తీవ్రంగా బాధించేది’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేగాక ‘అప్పుడప్పుడే నేను హీరోయిన్గా సినిమాల్లోకి ఏంట్రీ ఇచ్చాను. అదే సమయంలో నేను బక్క పలుచగా, ప్లాట్‌గా కనిపిస్తున్నానని, అచ్చం అబ్బాయిల శరీరాకృతిలా నా శరీరం కనిపిస్తుంది అంటూ విమర్శించేవారు. అవి నన్ను వీపరితంగా బాధించేవి. ఎందుకంటే కేరీర్లో ఆత్మవిశ్వాసంతో ముందుకేళ్లాల్సిన సమయంలో ఈ ట్రోల్స్ నన్ను కుంగదీసేవి. దీంతో నేను మరింత బలహీనురాలిగా అయిపోయేదాన్ని’ అంటూ చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇక ఆ తర్వాత ఈ ట్రోల్స్‌ను సాధారణంగా చూడటం మొదలు పెట్టానని. మొదట్లో అవి బాధించిన ఆ తర్వాత వాటిని ఎంజాయ్ చేయడం నేర్చుకున్నాను అన్నారు. ఎందుకంటే తనని తాను ప్రేమించుకోవడం మొదలు పెట్టానన్నారు. అలాంటప్పుడే ఇలాంటి విమర్శలు ఎప్పటికి తనను బాధించవంటూ ఆమె చెప్పకొచ్చారు. కాగా అనన్య 2019లో షారుఖ్ ఖాన్ కూతురు సుహానే ఖాన్, సంజయ్ కపూర్ కూతురు షనయా కపూర్లతో కలిసి సో పాజిటివ్ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోషల్ మీడియా వచ్చే బెదిరింపులను, విమర్శలను అరికట్టాలంటూ ఆమె అభిమానులను కోరారు. ఈ క్రమంలో ఆమె ‘చార్లీస్ ఎంజెల్స్ ’ పేరు చేసిన ట్వీట్లో ఎంజెల్స్ స్పెల్లింగ్‌ను తప్పుగా రాసి పోస్టు చేసింది. దీంతో నెటిజన్లు ఆమెను వీపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభిచడంతో అది డిలీట్ చే సి తిరిగి మళ్లీ పోస్టు చేసింది. Charlie’s Angels 🖤 #FamilyPortrait 📸 @iamsrk pic.twitter.com/dNkZ3I3PHC — Ananya Panday (@ananyapandayy) July 10, 2019 చదవండి: పవన్ కల్యాణ్ న్యూలుక్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్ తెలుగు తెరపై బాలీవుడ్ భామల గ్రాండ్ ఎంట్రీ