
Rashmika Mandanna 'Breaks Hearts', Brutally Trolled: సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. 'ఛలో' సినిమాతో తెలుగులో తెరంగ్రేటం చేసి 'గీత గోవిందం'తో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో 2019 సంవత్సరంలో 'ఇండియన్ నేషనల్ క్రష్'గా అరుదైన గుర్తింపును కూడా పొందింది. ఇటీవల విడుదలైన ఐకానిక్ స్టార్ సరసన నటించిన 'పుష్ప' సినిమాలో శ్రీవల్లిగా బాలీవుడ్‌లోనూ ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. సినిమాలతో బిజీగా ఉండే రష్మిక ఫిట్నెస్ వీడియోలు, క్యూట్ ఎక్స్ప్రెషన్ ఫొటోస్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది ఈ అమ్మడు.
అయితే ఈ కన్నడ సుందరి తాను చేసే పనులతో ట్రోలింగ్ బారిన పడుతోంది. ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో రష్మిక డ్రెస్సింగ్ స్టైల్‌పై నెటిజన్స్ ఓ ఆట ఆడేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ముంబైలో ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్లిన రష్మిక మళ్లీ ట్రోలింగ్ బారిన పడింది. ముంబైలో ఓ హోటల్ నుంచి బయటకొచ్చిన రష్మికను ఓ చిన్నారి ఆకలిగా ఉందంటూ డబ్బులు అడగడం స్టార్ట్ చేసింది. అప్పటికే ఆ చిన్నారిని సెక్యూరిటీ గార్డులు పక్కకు తోయడం వంటివి చేసిన ఆ పాప రష్మిక వద్దకు వచ్చి ప్రాధేయపడుతూ ఉంది. అది చూసి 'తన వద్ద డబ్బులు లేవు' అని చెప్తూ నవ్వుకుంటూ వెళ్లిపోయింది. వేరే ఎవరితో కూడా సాయం అందించడం వంటిది చేయలేదు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రష్మికను ఏకిపారేస్తున్నారు. 'చిన్న పాప అలా నిన్ను అడుక్కుంటుంటే నీకు నవ్వు ఎలా వస్తుంది' అని ప్రశ్నిస్తున్నారు. 'అసలేంటీ నీ యాటిట్యూడ్' అని విరుచుకుపడుతున్నారు. 'ఈరోజు నుంచి నీ సినిమాలు చూడం' అని కామెంట్స్ పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment