
Netizens Trolls Sukumar For Copying Pushpa Movie From Web Series: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. డిసెంబర్ 17న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పుష్ప కథ కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. కాపీ కథతో ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించాడని, ఓ వెబ్ సిరీస్‌ను పుష్పగా తీశాడంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ప్రముఖ వెబ్ సిరీస్ ‘నార్కోస్’ కథ ఆధారంగా ‘పుష్ప’ను రూపొందించాడంటూ తమదైన శైలిలో ట్రోల్ చేస్తున్నారు.
చదవండి: Pushpa Movie: అల్లు అర్జున్‌పై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
‘నార్కోస్’లో డ్రగ్స్ మాఫియా ఉంటే... ‘పుష్ప’లో ఎర్రచందనం స్మగ్లింగ్ చూపించారని అంటున్నారు. వెబ్ సిరీస్ హీరో పాత్ర ఆధారంగా పుష్పలో అల్లు అర్జున్ పాత్ర తీర్చిదిద్దాడని, అలాగే కొండారెడ్డి బ్రదర్స్ పాత్రలు కూడా వెబ్ సిరీస్ ఆధారంగానే సుకుమార్ రాసుకున్నారని అంటున్నారు. అల్లు అర్జున్‌తో తీసిన తొలి పాన్ ఇండియా చిత్రాన్ని కాపీ కథతో తెరకెక్కించడం ఎంత వరకు కరెక్ట్ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి పుష్ప పార్ట్ 2 షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో దీనిపై సుక్కు ఎలా స్పందిస్తాడో చూడాలి.
చదవండి: ఆ నటుడితో స్టార్ హీరో మాజీ భార్య లవ్ ఎఫైర్!, ఇదిగో ఫ్రూఫ్