
పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే.. అంటూ ఒక్క డైలాగ్‌తో అరాచకం సృష్టించాడు అల్లు అర్జున్. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లతో రికార్డులు తిరగరాసిన ఇతడు తాజాగా ఎవరూ ఊహించని అవార్డు అందుకున్నాడు. 69 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కొల్లగొట్టాడు. తెలుగు సినీచరిత్రలోనే బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న తొలి హీరోగా చరిత్ర సృష్టించాడు.
దీంతో బన్నీ ఇంట పండగ వాతావరణం నెలకొంది. పుష్ప సినిమాకుగానూ బన్నీకి అవార్డు వరించిన క్రమంలో డైరెక్టర్ సుకుమార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. అల్లు అర్జున్‌ను హత్తుకుని ఆనందంతో ఏడ్చేశాడు. కొద్ది క్షణాలపాటు బన్నీని పట్టుకుని ఎమోషనలయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు.. అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్ ఇదే!
Comments
Please login to add a commentAdd a comment