‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్.. తగ్గేదే లే’ అంటూ ఇండియన్ బాక్సాఫీస్‌పై దాడి చేసి కోట్ల రూపాయలను కొల్లగొట్టేశాడు ‘పుష్పరాజ్’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఈ చిత్రం రిలీజై దాదాపు ఏడాది కావొస్తున్నా పుష్ప రాజ్ సృష్టించిన ఇంపాక్ట్ ఇప్పటకి అలానే ఉంది.
ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు రష్యాలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. డిసెంబర్ 8న రష్యాలో గ్రాండ్ గా పుష్ప చిత్రం విడుదల కాబోతుంది. ప్రమోషన్‌లో భాగంగా మంగళవారం పుష్ప రష్యన్ ట్రైలర్‌ని కూడా విడుదల చేశారు మేకర్స్.
విడుదలకు ఇంకా వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ రష్యా వెళ్లారు. అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది. డిసెంబర్ 1న మాస్కోలో, 3న సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రీమియర్ షోస్ ప్లాన్ చేశారు. మాస్కోలో జరిగే ప్రీమియర్ షోలో అల్లు అర్జున్, రష్మికతో పాటు దర్శకుడు సుకుమార్, నిర్మాత రవిశంకర్ పాల్గొని అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవనున్నారు. ఇక రష్యాలో ఈ సినిమా ఏ స్థాయిలో రికార్డ్ సృష్టించబోతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment