Watch: Allu Arjun Pushpa 2 Movie Russian Version Trailer Out, Video Viral - Sakshi

Pushpa Russian Trailer: ‘పుష్ప’ రష్యన్ ట్రైలర్.. పుష్పరాజ్ డైలాగ్స్‌ అదుర్స్‌

Published Tue, Nov 29 2022 2:12 PM | Last Updated on Tue, Nov 29 2022 4:09 PM

Pushpa The Rise Russian Trailer Out - Sakshi

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బన్ని కెరియర్ కి ఆర్య లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అందించిన సుకుమార్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందించాడు. ఈ చిత్రం రిలీజై దాదాపు సంవత్సరం కావొస్తున్నా పుష్ప రాజ్ సృష్టించిన ఇంపాక్ట్ ఇప్పటకి అలానే ఉంది. 

ప్రస్తుతం పుష్ప చిత్రం రష్యా లో డిసెంబర్ 8న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుందనే విషయం తెలిసిందే. విడుదలకి ఇంకో వారం మాత్రమే సమయం ఉండడంతో మేకర్స్ ‘పుష్ప’ ట్రైలర్ ని రష్యన్ భాషలో డబ్ చేసి రిలీజ్ చేశారు. రష్యా భాషలోని ట్రైలర్ చూస్తుంటే మనకు భాష అర్ధంకాకపోయిన  క్యారెక్టర్స్ ఏం మాట్లాడుతున్నారో మనకు అర్ధమవుతుంది. ష్ప డబ్బింగ్ విషయంలో గట్టిగానే శ్రద్ధ తీసుకున్నారు. ఆయా పాత్రల మేనరిజమ్స్ రష్యన్ భాషలోను బాగానే వర్కౌట్ అయ్యాయి. 

పుష్ప ది రైజ్ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ రష్యా వెళ్లనున్నారు. డిసెంబర్ 1న మాస్కోలో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్బర్గ్ లో మీడియాతో ఇంటరాక్ట్ అవ్వనున్నారు. పుష్ప పార్ట్ 1కి వరల్డ్ వైడ్ గుర్తింపు వస్తే, అది పార్ట్ 2కి ఉపయోగ పడుతుంది. ఇక రష్యాలో ఈ సినిమా ఏ స్థాయిలో రికార్డ్ సృష్టించబోతుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement